Yatra 2 మూవీ : అమెరికాలో రోడ్‌షో | Yatra 2 Movie Pre Release Event In Dallas, Roadshow Held By YSRCP Fans At America Video Goes Viral - Sakshi
Sakshi News home page

Yatra 2 Movie: అమెరికాలో రోడ్‌షో

Published Thu, Feb 8 2024 12:47 PM | Last Updated on Thu, Feb 8 2024 1:37 PM

Yatra 2 movie roadshow held by YSRCP fans at america  - Sakshi

అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘యాత్ర 2’ మూవీ ఫిబ్రవరి 8న  వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో వినూత్నంగా ప్రమోషన్స్ చేపట్టింది మూవీ టీమ్. అమెరికాలో ఈ మూవీ రిలీజ్‌కు ముందే యాత్ర జెండా రెపరెపలాడింది. అమెరికాలో నివసిస్తున్న వైఎస్సార్‌, సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. కొన్ని వందల కార్లు, బైకులతో యాత్ర పోస్టర్స్‌ పట్టుకుని రోడ్‌ షో నిర్వహించారు.  

ముందుగా కార్టర్ బ్లడ్‌కేర్‌లో బ్లడ్ డ్రైవ్‌ చేపట్టారు. వైస్సార్‌సీపీ మద్దతుదారులు, సినీ అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ రక్తదానంలో పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారు. బ్లడ్ డ్రైవ్‌లో పాల్గొన్న అభిమానులు, యాత్ర టీమ్‌ని పలువురు కొనియాడారు.  ఈ మూవీ ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.  

అనంతరం ఇర్వింగ్‌లోని థామస్ జెఫెర్సన్ పార్క్ నుంచి గాంధీ మెమోరియల్ ప్లాజా వరకు భారీ కారు ర్యాలీ చేపట్టారు. డల్లాస్‌లోని YSRCP అభిమానుల మద్దతుతో యాత్ర టీమ్ ఈ కార్యక్రమం చేపట్టింది. డజన్ల కొద్దీ ఎస్కార్ట్‌లు, 5 వందలకు పైగా కార్ల కాన్వాయ్‌తో ర్యాలీ  అద్భుతంగా జరిగింది. ఇక మూడు హెలికాప్టర్‌లతో నిర్వహించిన ఎయిర్ ‌షో విపరీతంగా ఆకట్టుకుంది. 

అలాగే యాత్ర 2  ప్రీ-రిలీజ్ ఈవెంట్ వేడుక కూడా గ్రాండ్‌గా జరిగింది. వెయ్యి మందికి పైగా హాజరై ఈ  ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ని విజయవంతం చేశారు. ఇది డల్లాస్ చరిత్రలో ఒక అపూర్వమైన సంఘటన నిలిచింది.  నిర్మాత శివ మేకతో పాటు మూవీ టీమ్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మమ్ముట్టి, జీవా, కేతకి వంటి ప్రముఖ నటులతో, సంతోష్ నారాయణ్, మధి వంటి గొప్ప సాంకేతిక బృందంతో  దర్శకుడు మహి వి రాఘవ్ ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారని కొనియాడారు. USAలోని నిర్వాణ డిస్ట్రిబ్యూటర్స్‌తో పాటు సహాయ సహాకారాలు అందించిన ప్రతిఒక్కరికీ మూవీ టీమ్ ధన్యవాదాలు తెలిపింది. వైస్సార్‌సీపీ మద్దతుదారులు, నాటతో పాటు పలు తెలుగు సంఘాల నాయకులు, సినీ అభిమానులు ఈ వేడుకల్లో పాల్గొని.. అభినందనలు తెలిపారు. 

ఇచ్చిన మాట కోసం నిలబడ్డ తండ్రికి తగ్గ తనయుడి కథగా 'యాత్ర 2'  తెరకెక్కించారు. 2009 నుంచి 2019 వరకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన రాజకీయ ఘటనల ఆధారంగా 'యాత్ర 2' సినిమాని రూపొందించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, టైలర్‌కు భారీ రెస్పాన్స్‌  వచ్చిన సంగతి తెలిసిందే.   మరోవైపు బుధవారం రిలీజైన  ఈ మూవీ హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement