Yatra 2 Movie
-
మరో ఓటీటీలోకి వచ్చేసిన 'యాత్ర 2' సినిమా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా తీసిన సినిమా 'యాత్ర 2'. ఫిబ్రవరిలో థియేటర్లలో రిలీజైంది. దాదాపు రెండు నెలల తర్వాత అంటే ఏప్రిల్ 12న ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పుడు మరో ఓటీటీలో అందుబాటులోకి తీసుకొచ్చి, అభిమానులకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఇంతకీ ఇప్పుడు ఏ ఓటీటీలోకి వచ్చిందనేది చూద్దాం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు.. అవి ఏంటంటే?)వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా మహి వి రాఘవ తీసిన సినిమా 'యాత్ర'. మలయాళ నటుడు మమ్ముట్టి టైటిల్ రోల్ చేశారు. 2019లో రిలీజైన ఈ చిత్రం అద్భుతమైన సక్సెస్ అందుకుంది. దీనికి కొనసాగింపుగా ఇదే డైరెక్టర్ తీసిన మూవీ 'యాత్ర 2'. వైఎస్ఆర్ మరణం తర్వాత జగన్ మోహన్ రెడ్డి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనే అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్.. ముఖ్యమంత్రి కావాలని ఎమ్మెల్యేలు సంతకాలు చేసినా పార్టీ అధిష్టానం పట్టించుకోదు. ఈ క్రమంలోనేరాజశేఖర్ రెడ్డి మరణం తట్టుకోలేక కన్నుమూసిన కార్యర్తల కుటుంబాలను పరామర్శించేందుకు.. వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర చేస్తారు. దీన్ని ప్రొగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది. దాంతో ప్రొగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జగన్ వైఎస్ఆర్ పార్టీని ఏర్పాటుచేసి ఎలా ప్రజల అభిమానాన్ని పొందాడు? అన్ని అడ్డంకుల్ని ఎదుర్కొని ఏ విధంగా సీఏం అయ్యారనేది 'యాత్ర 2'లో చూపించాడు. ఇదివరకే అమెజాన్ ప్రైమ్‌లో ఉండగా, ఇప్పుడు ఆహా ఓటీటీలోకి కూడా వచ్చేసింది.(ఇదీ చదవండి: ప్రభాస్ ఇంటి ఫుడ్‌ని మర్చిపోలేకపోతున్న హీరోయిన్.. ఐదేళ్లయినా సరే)మేం ఉన్నాం, మేం విన్నాం..♟️యాత్ర 2 మీకోసం తీసుకొస్తున్నాం!🎥👉 ▶️https://t.co/4VTAeZeSe6@JiivaOfficial @mammukka #Yatra2 pic.twitter.com/c7D4BuOb6L— ahavideoin (@ahavideoIN) June 3, 2024 -
Yatra 2 In OTT: 'యాత్ర 2' ఓటీటీ డీటైల్స్ ఇవిగో
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా తీసిన 'యాత్ర 2' సడన్ గా ఓటీటీలో వచ్చేసిందని అన్నారు. కానీ ఈ విషయంలో చిన్నపాటి కన్ఫ్యూజన్ ఏర్పడింది. తొలుత అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయిపోయిందనేసరికి సినీ ప్రేమికులు అలెర్ట్ అయిపోయారు. ఈ వీకెండ్ మూవీని చూసేందుకు ప్లాన్ ఫిక్స్ చేసుకున్నారు. కానీ అనుకోని విధంగా ప్రేక్షకులకు సినిమా కనిపించలేదు. (ఇదీ చదవండి:ఓటీటీలోకి వచ్చేసిన రెండు హిట్ సినిమాలు.. స్ట్రీమింగ్ అందులోనే) దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తీసిన 'యాత్ర' మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీనికి సీక్వెల్ గా 'యాత్ర 2' తీశారు. ఈ ఏడాది ఫిబ్రవరి తొలివారంలో రిలీజ్ చేశారు. ఇప్పుడు దాదాపు రెండు నెలల తర్వాత అమెజాన్ ప్రైమ్ లోకి ఎలాంటి హడావుడి లేకుండా వచ్చేసిందని సోషల్ మీడియాలో పోస్టులు కనిపించాయి. కానీ ఎందుకో సదరు ఓటీటీలో సెర్చ్ చేస్తుంటే కనిపించట్లేదు. బహుశా దీన్ని సరిచేస్తే ఈ రోజే స్ట్రీమింగ్ లోకి వచ్చేయొచ్చు. లేదంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. వైఎస్ఆర్ మరణం దగ్గర మొదలయ్యే 'యాత్ర 2' కథ.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేవరకు ఉంటుంది. ఈ మధ్య ఏమేం జరిగింది? అనే విషయాల్ని సినిమాలో చూపించారు. ఇకపోతే వైఎస్ఆర్ తనయుడు జగన్ పాత్రలో నటించిన జీవా.. అద్భుతమైన ఆహార్యంతో ఆకట్టుకోవడం విశేషం. (ఇదీ చదవండి: నిద్ర కరువైంది.. మళ్లీ నటిస్తానని అనుకోలేదు: యంగ్ హీరోయిన్) -
మాపై ఇలాంటి వ్యాఖ్యలా అంటూ.. కన్నీరు పెట్టుకున్న శుభలేఖ సుధాకర్
'శుభలేఖ' సుధాకర్, ఆ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఇండస్ట్రీలో ఆయన రాటు తేలిన కేరెక్టర్ యాక్టర్! తన దరికి చేరిన పాత్రల్లోకి ఇట్టే పరకాయ ప్రవేశం చేసి మార్కులు కొట్టేస్తూ ఉంటారు. అవి నచ్చినవారు ఆయనను పట్టేసి తమ సినిమాల్లో పెట్టేసుకుంటారు. సుధాకర్ కూడా శక్తివంచన లేకుండా నటించేసి, జనాన్ని మెప్పిస్తుంటారు. మధురగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు ఎస్పీ శైలజకు ‘శుభలేఖ’ సుధాకర్ భర్త అనే విషయం తెలిసిందే. ఆయన నటుడిగానే కాకుండా డబ్బింగ్‌తోనూ ప్రేక్షకులను అలరించడం విశేషం. తాజాగా యాత్ర -2 చిత్రంలో రెడ్డి పాత్రలో ఆయన నటనకు వంద మార్కులు పడ్డాయి. సినిమా చూసిన ప్రేక్షకులు ఆయన పాత్రను మరిచిపోవడం కష్టం.. అంతలా ప్రేక్షకులను మెప్పించారని చెప్పవచ్చు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పలు యూట్యూబ్ ఛానల్స్ తన పట్ల వ్యవహిరిస్తున్న తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తప్పుడు థంబ్‌నైల్స్ పెట్టి పలు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఎమోషనల్ అయ్యారు. 'సుధాకర్‌కు అపాయింట్మెంట్ ఇవ్వని చిరంజీవి' శైలజతో విడాకులు తీసుకున్న సుధాకర్ ఇలా తప్పుడు రాతలు ఎందుకు రాస్తారంటూ ఆయన ఆవేదన చెందారు. 'చిరంజీవితో నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అనారోగ్యంతో ఉన్నప్పుడు 54రోజుల పాటు ఆయన నిత్యం ఫోన్ కాల్ చేస్తూనే ఉన్నారు. ఆయన ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకునే వారు. మెగాస్టార్ నా మొదటి హీరో.. ఈ యూట్యూబ్ వాళ్లు చాలా ఏళ్లుగా తప్పుగానే నా గురించి చూపిస్తూ వస్తున్నారు. నేను, శైలజ విడిపోయామని పలు వీడియోలు కూడా పెట్టారు.. అందులో నిజం లేదని ఇప్పటికే మేము ఇద్దరం కలిసి చెప్పాం. ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు మా అమ్మ గారు శైలజను ఒకరోజు ప్రశ్నించారు. ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా..? అని అప్పుడు నేను కలుగచేసుకుని అలాంటివి ఏమీ లేవని చెప్పాను. తర్వాత మళ్లీ రోజు నిద్రలోనే ఆమె మరణించారు. ఇలాంటి సమయంలో నేను ఏం అనుకోవాలి..? ఇలాంటి వీడియోలతో యూట్యూబ్ ఛానల్స్ వారికి ఏమి కలిసి వస్తుంది..? ఈ ప్రపంచంలో అత తక్కువ వృత్తి అంటే ఒక స్త్రీ తన శరీరాన్ని అమ్ముకుని సంపాదించడమే అని నేను అనుకుంటాను. వాళ్లకు కూడా మంచి ఎథిక్స్ ఉంటాయి. కానీ వీళ్లకు మాత్రం అలాంటివి ఏమీ లేవు అంటూ సుధాకర్ కన్నీరు పెట్టుకున్నారు. ఒక్కోసారి శుభలేఖ సుధాకర్ చనిపోయారని వీడియో పెడతారు.. నన్ను చంపేస్తే వాళ్లకు ఏం కలిసి వస్తుంది. అలాంటి వారికి నేను ఏం ద్రోహం చేశాను. కనీసం నేను ఎవరినీ కూడా ఇబ్బంది పెట్టను. మీ పొట్ట నింపుకోవాడానికి మరోకరిని ఇలా చంపడం ఎందుకు..? అలా సంపాదించిన డబ్బుతో తిన్న ఆహారం ఒంటికి పడుతుందా..? ఇలాంటి వీడియోలు చేసేవారు నూటికి వెయ్యి శాతం అనుభవిస్తారు.' అని ఆయన క్షోభించారు. -
ఇలా చూడు మహీ.. ఎర్ర డైరీలో పేరు రాసుకోమంటావా?
ప్రియమైన రాఘవా.! రెండు సినిమాలు తీసినావో లేదో... రాజకీయాలన్నీ ఒంటబట్టేశాయని అనుకోబాకు సామి. కొంచెం టైమిస్తేనే అన్నీ అర్థమవుతాయి! ఇలా చూడు మహీ... ముందు మేము రామరావులో దేవుడిని చూపించాం... వాటాల్లో తేడాలొచ్చాయో లేదో... అదే పెద్దమడిసిని కామారావును చేసేశాం.. డ్రామారావునూ చూపించి.. చెప్పులేయించి మరీ కుర్చీ లాగేశాం. ఈ వ్యవహారాన్ని కాస్తా... మావోళ్లు అదేనబ్బీ ఆనాటోళ్లు ఉన్నారు కదా.. ఆళ్ల సాయంతో లోకకళ్యాణంగానూ జనాలకు చూపించేశాము. దీందేముందిగానీ.. దీనికంటే ముందు.. మన బెజవాడలోనే కదూ... ఆ నేతను లేపేసింది? కొంటా పెడతా ఉంటే అదేదో నేస్తమంటారు.. మాదీ అంతే.. ఉంటే మాతో ఉండాలి.. లేదంటే అస్సలు ఉండకూడదు! అదీ లెక్క! కాదూ కూడదని ఎవరైనా కాలరేగరేశారా? కాలంలో కలిసిపోయారు. ఏ రావయినా.. ఏ రెడ్డయినా.., ఇంకెవరయినా.. ఇప్పుడు నువ్వయినా సరే... మా దారికి రావాల్సిందే.. లేదంటావా? నీ ఇష్టం. చూసుకో మరి! నిత్యం ఉషోదయంతో ఉదయించేది మేమనుకున్న సత్యమే! తిమ్మిని బమ్మి అంటాం. నమ్మితే సరేసరి.. కాదంటే అంతే సంగతి! సినిమాలైనా... మీడియా అయినా సరే.. అందరూ మా పాటే పాడాలి. మేం చెప్పినట్లే ఆడాలి. కాదు కూడదంటే....అను‘కుల’ పత్రికలతో కాటేయిస్తాం. అప్పుడెప్పుడో ఓ దర్శకరత్నం ఎగిరెగిరి పడ్డాడు... ‘ఉదయం’తో మొదలైన హడావుడి సాయంత్రానికే సద్దుమణిగేలా చేశాం. ఇంకొకాయన... సమాజం సమాజం... న్యాయం న్యాయం అంటూ గొంతు చించుకున్నాడు. చివరికి ఏమైంది? రాజకీయానికి బ్రేక్ పడింది. సినిమా మాత్రమే దిక్కయింది! అంచేత ఏతావాతా మేము సెప్పొచ్చేదేటంటే... మాకు రాజకీయ ప్రత్యర్ధులైతే చాలు.. సొంతోళ్లనూ వదలం.. ఇతరులనూ వదలం. విషం కక్కడం మా నైజం కదా... సదా కక్కుతూనే ఉంటాం. మా ఫిలాసఫీ నీకు నచ్చేస్తే.. చేతులు కలిపేయి! కళాపోషణ ఎలాగూ చేసుకోవచ్చు. అదనంగా మా భ్రమరావతిలో ఓ కాలనీ పడేస్తాం! కాదూ కూడదంటావా? మా పెన్నుల్లో ఇంకు వాడకం ఎలా ఉంటుందో రుచి చూపిస్తాం. రాజకీయ పార్టీలు పెట్టినా, విద్యా సంస్దలు నడిపినా, ఆసుపత్రులు నడిపినా, జనం భూములు లాక్కుని ఫిల్మ్ సిటీలు కట్టినా, మా విష ప్రచారం కోసం పత్రికలు నడిపినా , చిట్ ఫండ్ కంపెనీలు పెట్టి చట్టాలు ఉల్లంఘించినా, పచ్చళ్లు , పాల యాపారాలు ...ఇలా ఏది చేసినా మా వాడే చెయ్యాలి. ఇది మేము పెట్టుకున్న రూలు. కాదంటే..! తెలుసు కదా.. స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందో.? ఉదాహరణకు .... మా కులపోడు బికినీ ఉత్సవాలు నిర్వహించాలని చూస్తే... అబ్బో బ్రహ్మాండం , భజగోవిందమని జాకీలెట్టి లేపుతాం. వేరేవాడు పోర్టులు , హార్బర్లు , మెడికల్ కాలేజీలు కడితే.... అమ్మో రాష్ట్రం దివాళా తీస్తుందని , సర్వనాశనమైపోతుందని విషం కక్కుతాం, అదే నిజమని నమ్మేలా ప్రచారం చేస్తాం. అనకాపల్లి నుంచి అమెరికా దాకా, నంద్యాల నుంచి న్యూజిలాండ్ దాకా దానికి సపోర్టుగా ట్వీట్లు వేస్తాం. ఇప్పటికైనా అర్ధమయ్యిందా ? లేక ఎర్ర డైరీలో పేరు రాసుకోమంటావా? -మీ డ్రామోజీ నాయుడు -
Australia : యాత్ర 2 కార్ ర్యాలీ.. YSRCP సిద్ధం
‘‘యాత్ర 2” సినిమా విజయవంతమైన సందర్భంగా వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా కన్వీనర్ సూర్యనారాయణ రెడ్డి నేతృత్వంలో “టీమ్ మెల్బోర్న్ - వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా’’ ఆధ్వర్యంలో కార్ ర్యాలీ నిర్వహించారు. దివంగత నేత వైఎస్సార్ జీవితంలోని కీలక ఘటనలను, అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి, YSRCP అధ్యక్షడు వైఎస్ జగన్ రాజకీయ ప్రారంభ దశలోని ముఖ్యమైన అంశాలను ఆధారంగా సినిమాని తెరకెక్కించడంలో దర్శకుడు మహి రాఘవ సక్సెస్ అయ్యాడని ప్రశంసించారు. ప్రజల మనసులను గెలిచిన మారాజు డా.వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి జీవన వృత్తాంతాన్ని చక్కగా సినిమాగా రూపొందించారని ప్రశంసించారు. ఈ ర్యాలీని మెల్బోర్న్ టీమ్ సభ్యులు కృష్ణారెడ్డి, భరత్, రామాంజి, నాగార్జున, మణిదీప్, సతీష్‌లు చక్కగా సమన్వయం చేశారు. సిద్ధం పోస్టర్‌ను ఆవిష్కరించడంతో పాటు, వైఎస్సార్సీపీ పోరాటానికి తిరుగులేని మద్దతునిస్తూ “జై జగన్”, “జోహార్ వైఎస్ఆర్”, “ఎన్నికల సమరానికి మేము సిద్ధం” నినాదాలతో.. వేదిక వద్ద వాతావరణం మారుమోగింది. ఉత్సాహభరితమైన ర్యాలీ తరువాత, వైఎస్సార్సీపీ మద్దతుదారులు "యాత్ర 2" చిత్రం ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేసారు. 2024లో జరగబోయే ఏపీ 175 అసెంబ్లీ ఎన్నికలకు, అలాగే లోక్‌సభ 25 స్థానాల ఎన్నికలకు YSRCP సిద్ధంగా ఉందని, సీఎం జగన్ నినాదం వైనాట్ 175ని నిజం చేసేందుకు ప్రతీ ఒక్క ప్రవాసాంధ్రుడు కృషి చేస్తారని తెలిపారు. గడచిన ఐదేళ్లలో రాష్ట్రానికి జరిగిన ప్రయోజనలు, విద్యా, వైద్య, పారిశ్రామిక, మౌలిక సదుపాయాల్లో జరిగిన అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రతీ ఒక్క ఎన్నారై స్టార్ క్యాంపెయినర్‌గా మారి ప్రచారం చేస్తారని తెలిపారు. -
వైఎస్సార్సీపీకి మద్దతుగా మెల్బోర్న్లో భారీ కార్ ర్యాలీ
-
Yatra 2 @ London : లండన్‌లో యాత్ర 2 సక్సెస్ మీట్
యాత్ర 2 సినిమా కొత్త ఒరవడి సృష్టిస్తోంది. విదేశాల్లో ఉంటోన్న ప్రవాసాంధ్రులను, ముఖ్యంగా వైఎస్సార్ అభిమానులను విశేషంగా ఆకర్షిస్తోంది. యూకే & యూరప్ YSRCP వింగ్ ఆధ్వర్యంలో లండన్ మహానగరంలోని హౌన్సలో ప్రాంతంలో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైస్సార్సీపీ అభిమానులు పాల్గొని విజయవంతం చేశారు. మనం చూసే ప్రతి సినిమా మనలో ఒకరి జీవన ప్రతిబింబం. కొందరి జీవితాలు స్ఫూర్తిదాయకం, ఆదర్శప్రాయం. దివంగత నేత వైఎస్సార్ జీవితంలోని అటువంటి సంఘటనలను ఆధారంగా చేసుకొని వినోదాత్మకంగా మరియు సందేశాత్మకంగా సినిమాని మలచడంలో దర్శకుడు మహి రాఘవ సక్సెస్ అయ్యాడని ప్రశంసించారు లండన్‌లోని YSRCP వింగ్ నాయకులు. ప్రజల మనసులను గెలిచిన మారాజు డా.వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి జీవన వృత్తాంతాన్ని చక్కగా సినిమాగా రూపొందించారని ప్రశంసించారు. యాత్ర2 సినిమా చూసిన తరువాత ఇది అద్భుతం అని అనకుండా వుండలేమన్నారు. ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి గారి జీవితాన్ని హృద్యంగా చిత్రీకరించిన సన్నివేశాలతో మహీ రాఘవ ప్రేక్షకులను కట్టిపడేశాడని కొనియాడారు. అలాగే నిజజీవితంతో పెనవేసుకున్న ఎమోషనల్ డ్రామాను చాలా రియలిస్టిక్ గా చిత్రీకరించారని మెచ్చుకున్నారు. ముఖ్యంగా ఆఖర్లో రియల్ సీన్లను కలిపి చేసిన జగన్ గారి ప్రమాణస్వీకార సన్నివేశం రోమాలు నిక్కపొడుచుకునేలా తీశారని వ్యాఖ్యానించారు. తెలుగు సినిమా చరిత్రలో చెరగని పేజీగా యాత్ర 2 నిలిచిపోతుందన్నారు. భవిష్యత్తులో యాత్ర 3 సినిమా కూడా వస్తే మరింత బాగుంటుందన్నారు. నటులు మమ్ముట్టి, జీవా పాత్రలకు ప్రాణం పోశారని కొనియాడారు. -
స్టూడియోకి స్థలం కేటాయింపు.. మహి వి.రాఘవ్ స్ట్రాంగ్ కౌంటర్!
టాలీవుడ్ డైరెక్టర్ మహి వి.రాఘవ్ ఇటీవలే యాత్ర-2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈనెల 8న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన మహి వి.రాఘవ్ తనపై వస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించారు. రాయలసీమకు సినీ ఇండస్ట్రీ ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. నా ప్రాంతం కోసమే నా వంతుగా ఏదో ఒకటి చేయాలనే ఆశయంతో కేవలం రెండు ఎకరాల భూమిలోనే మిని స్టూడియో నిర్మించాలనుకుంటున్నట్లు మహి తెలిపారు. సినీ పరిశ్రమలో రాయలసీమ అంటే షూటింగ్స్ చేయటానికి ఎవరూ ఆసక్తి చూపించరని అన్నారు. ఓ వర్గం మీడియా దీని గురించి కనీసం ఆలోచన కూడా చేయడం లేదని విమర్శించారు. వాళ్ల ప్రభుత్వంలో వాళ్లకు నచ్చినవారికి ఎవరెవరికో ఎక్కడెక్కడో భూములు ఇచ్చిందని.. వాటి గురించి ఎవరూ మాట్లాడరని ఆయన మండిపడ్డారు. నా ప్రాంతం కోసం కేవలం రెండు ఎకరాల్లో మినీ స్టూడియో కట్టాలనుకుంటే దీనిపై పనిగట్టుకుని రాద్ధాంతం చేస్తున్నారని మహి వి.రాఘవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నా ప్రాంతానికి ఏదో చేయాలనే ఆశయం లేకపోతే.. నేను హైదరాబాద్‌లోనో.. వైజాగ్‌లోనో స్టూడియో కట్టుకోవటానికి స్థలం కావాలని అడుగేవాణ్ని కదా అని మహి ప్రశ్నించారు. వెనుకబడిన ప్రాంతంగా చూసే మదనపల్లిలోనే ఎందుకు స్టూడియో కట్టాలనుకుంటానని వివరించారు. నేను రాయలసీమ ప్రాంతంలోని మదనపల్లిలోనే పుట్టి పెరిగా.. అక్కడే చదువుకున్నా.. అందుకే నా ప్రాంతం కోసం ఏదో ఒకటి చేయాలన్న ఆశయంతోనే ముందుకెళ్తునన్నారు. రచయిత, నిర్మాత, దర్శకుడిగా సినీ పరిశ్రమలో 16 ఏళ్లుగా ఉంటున్నానని.. మూన్ వాటర్ పిక్చర్స్, 3 ఆటమ్ లీవ్స్ అనే రెండు నిర్మాణ సంస్థలను స్థాపించినట్లు తెలిపారు. నా సినిమాలు పాఠశాల, యాత్ర 2, సిద్ధా లోకమెలా ఉంది, సైతాన్ వెబ్ సిరీస్ రాయలసీమలోనే చిత్రీకరించినట్లు పేర్కొన్నారు. మహి వి.రాఘవ్ మాట్లాడుతూ..'సినీ ఇండస్ట్రీ రాయలసీమ కోసం ఏం చేసింది? నా ప్రాంత అభివృద్ధి కోసమే మినీ స్టూడియో కట్టాలనుకుంటున్నా. రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా సినీ పరిశ్రమలో 16 ఏళ్లుగా ఉంటున్నా. సొంతంగా రెండు నిర్మాణ సంస్థలను స్థాపించా. సినీ పరిశ్రమలో రాయలసీమ అంటే షూటింగ్స్ చేయటానికి ఎవరూ ఇష్టపడరు. నా ప్రాజెక్ట్స్ రాయలసీమలోనే చిత్రీకరించా. ఈ రెండేళ్లలో సైతాన్, యాత్ర 2, సిద్ధా లోకమెలా ఉంది అనే మూడు ప్రాజెక్ట్స్‌ను మదనపల్లి, కడప ప్రాంతాల్లో రూపొందించాం. వాటి కోసం దాదాపు రూ.20 నుంచి 25 కోట్ల రూపాయల ఖర్చు చేశా' అని తెలిపారు. నా ప్రాంతం కోసమే నా తపన.. అనంతరం మాట్లాడుతూ.. 'నేను పుట్టి పెరిగిన ప్రాంతానికి నా వంతుగా ఏదో చేయాలనే ఉద్దేశమే తప్ప మరొకటి లేదన్నారు. మదనపల్లిలో సినిమాలు చేయటం వల్ల స్థానిక హోటల్స్, లాడ్జీలు, భోజనాలు, జూనియర్స్‌కు ఉపయోగపడుతుందని భావించా. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రాయలసీమలో మినీ స్టూడియో నిర్మించాలనుకున్నా. బుద్ధి ఉన్నోడెవడైనా దీని గురించి ఆలోచించాలి. నా స్టూడియో నిర్మాణం కోసం యాభై, వంద ఎకరాలు అడగలేదు. కేవలం రెండు ఎకరాల్లో మాత్రమే మినీ స్టూడియో నిర్మించాలనుకున్నా. రాయలసీమకు ఎవరైనా ఏమైనా చేశారా! మీరు చేయరు... చేసేవాడిని చెయ్యనియ్యరు. ఓ వర్గం మీడియా దీని గురించి కాస్త కూడా ఆలోచించలేదు. వాళ్ల ప్రియమైన ప్రభుత్వం ఎవరెవరికీ భూములను ఎక్కడెక్కడో ఇచ్చింది. వీటి గురించి ఎవరూ మాట్లాడరు. నా ప్రాంతంలో కేవలం రెండు ఎకరాల్లో మినీ స్టూడియో కట్టాలని అనుకుంటే మాత్రం రాద్ధాంతం చేస్తున్నారు' అని మహి వి.రాఘవ్ మండిపడ్డారు. -
యాత్ర- 2 నుంచి సాంగ్.. సీఎం జగన్ పాదయాత్రను మరోసారి చూసేయండి
ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన సినిమా యాత్ర. 2019లో వచ్చిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన యాత్ర 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహి వి రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా కొనసాగుతుంది. స్టార్ హీరోకు ఉన్నంత క్రేజ్ ఒక పొలిటికల్ బయోపిక్కు రావడం అంత సులభం కాదు. ముఖ్యంగా ఈ సినిమాలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి పాత్రలు కనిపించడంతో అందరూ థియేటర్లకు వెళ్తున్నారు. తమ కళ్ల ముందు జరిగిన సంఘటనలను ఉన్నది ఉన్నట్లుగా తీశారని ప్రేక్షకులు తెలుపుతున్నారు. యాత్ర 2లో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు, 2009-2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ సినిమాను రియల్స్టిక్గా డైరెక్టర్ తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా నుంచి 'భగ భగ మండే సూర్యుడు రా..' అనే సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. గతంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 10 ఏళ్ల పాటు ప్రజల్లో తిరిగారు. ఆయన కొనసాగించిన పాదయాత్రలో లక్షలాదిమంది ప్రజలు భాగం అయ్యారు. వాటిలోని కొన్ని విజువల్స్ ఈ పాటలో కనిపిస్తాయి. మరోకసారి వాటిని చూసిన అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు. -
మాహానేత వైఎస్ఆర్, వైఎస్ జగన్ పై రూపొందిన బయోపిక్
-
గన్ షాట్..యాత్ర 2 మూవీ ఒక సంచలనం..నడుస్తున్న చరిత్ర
-
విధితో ఆటలు.. భయపెడుతున్న మమ్మట్టి 'భ్రమయుగం' తెలుగు ట్రైలర్
మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న మలయాళ చిత్రం 'భ్రమయుగం'. రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహిస్తున్నారు. చక్రవర్తి రామచంద్ర, ఎస్. శశికాంత్ నిర్మిస్తున్న ఈ సినిమా థియేటర్స్‌కి వచ్చే రోజు ఖరారైంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తెలుగు టీజర్‌తో పాటు ట్రైలర్‌ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. భిన్నమైన హారర్ థ్రిల్లర్ కథతో రూపొందిన ఈ చిత్రంలో అర్జున్ అశోకన్, సిద్దార్థ్, భరతన్, అమల్దా లిజ్ నటించారు. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఫిబ్రవరి 15న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ‘‘హారర్–థ్రిల్లర్ జానర్లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రమిది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరామెన్‌గా షెహనాద్ జలాల్ ఉంటే సంగీతం క్రిస్టో జేవియర్ అందించారు. సౌత్ ఇండియాలో విభిన్నమైన నటుడిగా మమ్ముట్టికి ప్రత్యేకమైన స్థానం ఉంది. అందుకే ఆయనకు గతంలో జాతీయ అవార్డు కూడా దక్కింది. యాత్ర, యాత్ర-2 చిత్రాలతో ఆయన తెలుగువారికి మరింత చేరువయ్యారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి గారి పాత్రలో మమ్ముట్టి అద్భుతంగా ఒదిగిపోయారని ఆయన్ను తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు అభినందిస్తున్నారు. -
Delhi: ఏపీ భవన్లో యాత్ర 2 సినిమా ప్రదర్శన
సాక్షి,ఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలోని ఏపీ భవన్లో శనివారం యాత్ర-2 సినిమా ప్రదర్శించారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ గురు మూర్తి, వైఎస్ఆర్ అభిమానులు, ప్రేక్షకులు సినిమాను వీక్షించారు. సినిమా ఆసాంతం ప్రేక్షకులు భావోద్వేగానికి లోనయ్యారు. అభిమానులు జై జగన్ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ ప్రజల కోసం సీఎం జగన్ సంక్షేమ యాత్ర ఇలాగే కొనసాగుతుందన్నారు. ఆయన పాదయాత్రలో నడిచే అవకాశం రావడం నా అదృష్టం అని చెప్పారు. జ్వరంతో బాధపడుతున్నా యాత్ర ఆపకుండా నడిచిన నాయకుడని కొనియాడారు. నవరత్నాల పాలనతో ప్రజలకు మేలు చేస్తున్న వైఎస్ జగన్‌ను ప్రజలు మళ్లీ ఆశీర్వదిస్తారన్నారు. ఇదీ చదవండి.. గంగ పుత్రులపై పెద్ద మనసు చాటుకున్న సీఎం జగన్ -
ఆస్ట్రేలియాలో సీఎం జగన్ క్రేజ్ చూస్తే బిత్తరపోతారు
-
ఆస్ట్రేలియాలో సిద్ధం : ఘనంగా యాత్ర ర్యాలీ!
ఆస్ట్రేలియాలో యాత్ర 2 విజయోత్సవ ర్యాలీ ఘనంగా జరిగింది. రాబోయే రాజకీయ యుద్ధానికి మేం సిద్ధమంటూ పలువురు ప్రవాసాంధ్రులు నినదించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ జీవన ప్రయాణాన్ని దర్శకుడు మహి వి రాఘవ రూపొందించిన యాత్ర 2 సినిమా విడుదల సందర్భంగా.. ఆస్ట్రేలియా భారీ కారు ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా ప్రవాసాంధ్రులు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేయటానికి వైఎస్సార్సీపీ సిద్ధం అని తెలియచేసారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియాలోని అన్ని ప్రధాన నగరాల్లో అభిమానులు కేకులు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం ఆస్ట్రేలియాలోని వివిధ నగరాల్లో భారీ కార్ల ర్యాలీలు నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో జగన్ గారికి తమవంతు సహాయ సహకారాలు అందించటానికి వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా టీం రెడీగా ఉందని తెలియచేసారు. | -
ఆస్ట్రేలియాలో యాత్ర 2 భారీ ర్యాలీ
-
యాత్ర 2 రియల్ వ్యూ ఎవరి రేటింగ్ ఎంత..?
-
సీఎం జగన్ త్వరలో సినిమా చూస్తారు - మహి
-
సీయాటెల్ సిద్ధం ఫర్ ‘యాత్ర 2’ ఈవెంట్
అమెరికాలోని సీయాటెల్లో యాత్ర2 మెగా ప్రీమియర్ షో రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. YSRCP USA, సోషల్ మీడియా, జగనన్న కనెక్ట్స్ ఆధ్వర్యంలో 'సీయాటెల్ సిద్ధం ఫర్ యాత్ర2 ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నట్టు APNRTS రీజినల్ కో ఆర్డినేటర్ దుష్యంత్ రెడ్డి తెలిపారు. మూవీని అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు మహి రాఘవ్, నిర్మాత శివ మేక, చిత్ర యూనిట్ కి ధన్యవాదాలు తెలిపారు. సీయాటెల్ నలుమూలల నుంచి వైఎస్సార్, సీఎం జగన్ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి యాత్ర 2 సెలబ్రేషన్ లో పాలు పంచుకున్నారు. YSRCP USA , సోషల్ మీడియా కమిటీ సభ్యులు.. చిన్నారులతో కలిసి భారీ కేక్ కట్ చేశారు. అనంతరం వైఎస్సార్ పాలనని గుర్తు చేసుకున్నారు. వైస్సార్ అడుగు జాడల్లో నవరత్నాలతో పాటు విన్నూతన మైన పథకాలు AP ప్రజలకి అందించిన CM YS జగన్ పరిపాలన ని గుర్తు చేస్తూ , రాబోయే ఎలక్షన్ లో 140 పై చిలుకు స్థానాల లో విజయ దుందుభి మోగించడం ఖాయమని ఈ సందర్భం గా తెలియ జేశారు. ఈ ఈవెంట్ లో YSRCP USA సభ్యులు మునీశ్వర్ రెడ్డి నాగిరెడ్డి , వినయ్ రెడ్డి, అనిల్ బెల్లపు , JC రెడ్డి , వెంకట్ సుబ్బా రెడ్డి, ప్రకాష్ కొండూరు ,శంకర్ తిప్పల ,ప్రకాష్ మామిడి,జితేందర్ రెడ్డి ,శ్రీనివాస రెడ్డి మల్లంపాటి ,భాస్కర్ రెడ్డి , వినోద్ ,సునీల్ బలభద్ర ,నరేన్ రెడ్డి ,వెంకట్ రెడ్డి,రాజ శేఖర్ రెడ్డి ,ప్రదీప్, బాల ,కరుణాకార్ రెడ్డి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని సహాయ సహకారాలు అందజేశారు. కమ్యూనిటీ లీడర్స్ మనోజ్ చింతి రెడ్డి , సాయిరెడ్డి కంచరకుంట్ల ,సువీన్ రెడ్డి ఉప్పల ,నవీన్ గోలి ప్రసంగించి యాత్ర 2 మూవీ కి ధన్యవాదాలు తెలియజేశారు. -
యాత్ర 2 ఒక అద్భుతమైన ఘట్టం
-
యాత్ర 2.. ప్రేక్షకులు మెచ్చారు: దర్శకుడు
ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన సినిమా యాత్ర. 2019లో వచ్చిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన యాత్ర 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహి వి రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు పాజిటివ్ స్పందన లభిస్తోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు, 2009-2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. అందరికీ కృతజ్ఞతలు శుక్రవారం నాడు హైదరాబాద్‌లో యాత్ర 2 సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మహి వి రాఘవ్ మాట్లాడుతూ.. ఈ మూవీ నచ్చిన వాళ్లకు, నచ్చని వాళ్లకు.. అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. ఎవరి అభిప్రాయాలు వారివని, తనకు అనిపించింది చెప్పానన్నాడు. ప్రేక్షకుల ఫీడ్‌బ్యాక్ మాత్రం బాగుందన్నాడు. యాత్ర 2 కమర్షియల్ ఫిలిం కాదని మరోసారి నొక్కి చెప్పాడు. (యాత్ర 2 సినిమా రివ్యూ) అప్పుడే అనుకున్నా ఈ చిత్రం కోసం పని చేసిన టెక్నీషియన్లకు కృతజ్ఞతలు తెలియాజేశాడు. నిజానికి ఈ మూవీ చేయాలని 2019లోనే అనుకోగా.. ఇన్నాళ్లకు అది కార్యరూపం దాల్చిందన్నాడు. ప్రస్తుతానికైతే యాత్ర 3 గురించి ఇంకా ఏమీ ఆలోచించలేదని తెలిపాడు. కాగా యాత్ర 2లో వైఎస్ రాజశేఖరరెడ్డి పాత్రలో మమ్ముట్టి, వైఎస్ జగన్మోహన్రెడ్డి పాత్రలో జీవా నటించారు. వైఎస్ భారతిగా కేతకి నారాయణ్ పాత్రలో ఒదిగిపోయారు. చదవండి: 'హనుమాన్' రెమ్యునరేషన్ విషయంలో గొడవలు.. ప్రశాంత్ వర్మ పోస్ట్ వైరల్ -
పవన్ కళ్యాణ్ కు ఇచ్చి పడేసిన మహిళ.. యాత్ర 2 అదరగొట్టింది
-
దిగ్విజయంగా దూసుకుపోతున్న యాత్ర 2
-
యాత్ర 2 ఒక అద్భుతమైన ఘట్టం
-
యాత్ర 2 సినిమాపై అంబటి కామెంట్స్