విధితో ఆటలు.. భయపెడుతున్న మమ్మట్టి 'భ్రమయుగం' తెలుగు ట్రైలర్‌ | Mammootty Bramayugam Movie Telugu Trailer Out Now, Watch Video Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Bramayugam Movie Trailer: విధితో ఆటలు.. భయపెడుతున్న మమ్మట్టి 'భ్రమయుగం' తెలుగు ట్రైలర్‌

Feb 11 2024 11:55 AM | Updated on Feb 11 2024 1:48 PM

Mammootty Bramayugam Telugu Trailer Out Now - Sakshi

మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న మలయాళ చిత్రం 'భ్రమయుగం'. రాహుల్‌ సదాశివన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. చక్రవర్తి రామచంద్ర, ఎస్‌. శశికాంత్‌ నిర్మిస్తున్న ఈ సినిమా థియేటర్స్‌కి వచ్చే రోజు ఖరారైంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తెలుగు టీజర్‌తో పాటు ట్రైలర్‌ను కూడా చిత్ర యూనిట్‌ విడుదల చేసింది.

భిన్నమైన హారర్‌ థ్రిల్లర్‌ కథతో రూపొందిన ఈ చిత్రంలో అర్జున్ అశోకన్, సిద్దార్థ్‌, భరతన్, అమల్దా లిజ్‌ నటించారు. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఫిబ్రవరి 15న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ‘‘హారర్‌–థ్రిల్లర్‌ జానర్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రమిది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరామెన్‌గా షెహనాద్‌ జలాల్ ఉంటే సంగీతం క్రిస్టో జేవియర్‌ అందించారు.

సౌత్‌ ఇండియాలో విభిన్నమైన నటుడిగా మమ్ముట్టికి ప్రత్యేకమైన స్థానం ఉంది. అందుకే ఆయనకు గతంలో జాతీయ అవార్డు కూడా దక్కింది. యాత్ర, యాత్ర-2 చిత్రాలతో ఆయన తెలుగువారికి మరింత చేరువయ్యారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారి పాత్రలో మమ్ముట్టి అద్భుతంగా ఒదిగిపోయారని ఆయన్ను తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు అభినందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement