Malayalam
-
హీరోయిన్ బీచ్ ఫోటోషూట్.. యూట్యూబ్ ఛానెల్‌కు నటి స్ట్రాంగ్ వార్నింగ్!
ప్రముఖ మలయాళ నటి పార్వతి ఆర్ కృష్ణ అలాంటి వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. సామాజిక మాధ్యమాల్లో తన ఫోటోలను దుర్వినియోగం చేయడానికి ప్రయత్నించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది. ఇటీవల తన ఫోటో షూట్‌కు సంబంధించిన ఫోటోలను కొందరు యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకులు మిస్యూజ్ చేయడంపై ఆమె స్పందించింది. తనకు సంబంధించిన గ్లామరస్ ఫోటోషూట్ చిత్రాలను అసభ్యకరమైన రీతిలో ప్రదర్శిస్తే చర్యలు తప్పవని వెల్లడించింది. ఈ విషయంపై ఇన్‌స్టా వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేసింది.వీడియోలో పార్వతి ఆ కృష్ణ మాట్లాడుతూ.. 'నాపై వచ్చిన ఒక తీవ్రమైన సమస్యపై మాట్లాడేందుకుందుకే ఈ రోజు నేను ఈ వీడియో చేస్తున్నా. నా వృత్తిలో భాగంగా నేను తరచుగా ఫోటోషూట్లలో పాల్గొంటాను. ఎక్కడైనా కానీ నా అందాన్ని ప్రదర్శించడంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. నా బీచ్ ఫోటోషూట్ సమయంలోనూ ఎక్కడ కూడా హద్దులు మీరి అందాలను ప్రదర్శించలేదు. కానీ యూట్యూబ్ ఛానెల్ వాళ్లు మాత్రం నా ఫోటోలను వారికిష్టమొచ్చినట్లు ఎడిట్ చేసి పోస్ట్ చేశారు. నా అనుమతి లేకుండా నా వీడియోలు, చిత్రాలను అసభ్యంగా చూపిస్తే మీ ఛానెల్ మూసేవరకు పోరాటం చేస్తా. ఇలాంటి సమస్యలపై ఇతరులు ఎందుకు స్పందించలేదో నాకు అర్థం కావడం లేదు. నా ఫోటోలను దుర్వినియోగం చేసేవారు నా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే. నా వ్యక్తిగత జీవితంలోకి మీరు అడుగుపెడితే ఎలా ఉంటుందో రాబోయే రోజుల్లో చూస్తారు' అంటూ హెచ్చరించింది నటి. కాగా.. పార్వతి ఆర్ కృష్ణ పలు మలయాళ సినిమాల్లో హీరోయిన్గా నటించింది. View this post on Instagram A post shared by PARVATHY KRISHNA (@parvathy_r_krishna) -
ఓటీటీకి మోస్ట్ వయొలెంట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
గతేడాది రిలీజైన మోస్ట్ వయలెంట్ చిత్రం మార్కో(Marco). ఉన్ని ముకుందన్(Unni Mukundan) హీరోగా నటించిన ఈ చిత్రం మలయాళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కేవలం రూ. 30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం.. మలయాళంలోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. దీంతో బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు సృష్టించింది.అంతేకాకుండా మలయాళంతో(Malayalam Movie) పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమా అంచనాలకు మించి వసూళ్లు రాబట్టింది. దీంతో ఈ చిత్రం ఓటీటీ(OTT) విడుదల కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ రివీల్ చేశారు. వచ్చేనెల 14న లవర్స్ డే సందర్భంగా స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని మార్కో ఓటీటీ రైట్స్ దక్కించుకున్న సోనీ లివ్(Sony Liv) సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.మార్కో కథేంటంటే..?జార్జ్ (సిద్దిఖ్ఖీ) గోల్డ్ బిజినెస్ చేస్తుంటాడు. ఈ వ్యాపారంలో తనకు మించినవాళ్లు ఉండరు. సిండికేట్ ఏర్పాటు చేసి.. దాని లీడర్‌గా వ్యవహరిస్తుంటారు. అతని తమ్ముడు విక్టర్(ఇషాన్ షౌకాత్) అంధుడు. కానీ చాలా టాలెంటెడ్. విక్టర్ స్నేహితుడు వసీమ్‌ను ఓ ముఠా చంపేస్తుంది. దానికి సాక్షి ఉన్నాడని విక్టర్‌ను కూడా ఆ ముఠా దారుణంగా హత్య చేస్తుంది. విదేశాలకు వెళ్లిన జార్జ్ మరో తమ్ముడు(జార్జ్ వాళ్ల నాన్న పెంచిన వ్యక్తి) మార్కో(ఉన్ని ముకుందన్)కు ఈ హత్య విషయం తెలిసి వెంటనే వచ్చేస్తాడు. తను ప్రాణంగా ఇష్టపడే సోదరుడు విక్టర్ హత్యకు కారణమైనవారిని వదిలిపెట్టనని చర్చిలోనే ప్రమాణం చేస్తాడు. అసలు విక్టర్ని హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? చివరకు మార్క్ వారిని ఎలా మట్టుపెట్టాడు?అనేదే మిగతా కథ. View this post on Instagram A post shared by Sony LIV (@sonylivindia) -
మోహన్ లాల్ డ్రీమ్ ప్రాజెక్ట్.. 3డీ ట్రైలర్ చూశారా?
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తోన్న చిత్రం 'బరోజ్: గార్డియన్ ఆఫ్ ట్రెజర్స్'. ఈ మూవీని తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తున్నారు. తన సొంత నిర్మాణ సంస్థ ఆశీర్వాద్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ మూవీని ఆయన నిర్మిస్తున్నారు. ఆంటోనీ పెరుంబావూర్ నిర్మాతగా ఉన్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి హిందీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే మలయాళంలో ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే.మైథలాజికల్ థ్రిల్లర్‌గా జీజో పున్నూసే రచించిన నవల ఆధారంగా బరోజ్ చిత్రాన్ని తెరకెక్కించారు. వాస్కోడిగామాలో దాగి ఉన్న నిధిని 400 ఏళ్లుగా కాపాడే జినీగా మోహన్ లాల్ కనిపించనున్నాడు. అయితే ఆ సంపదను ఆయన ఎందుకు రక్షిస్తున్నాడు. చివరగా దానిని ఎవరికి అందించాలని ఆయన ప్రయత్నం చేస్తాడనేది ఈ చిత్ర కథగా తెలుస్తోంది. ఈ మూవీని తొలిసారిగా 3డీ వర్షన్లో తెరకెక్కించారు. భారీ వీఎఫ్ఎక్స్తో నిర్మించిన ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో క్రిస్మస్ కానుకగా ఈ డిసెంబరు 25న విడుదల కానుంది. అయితే హిందీ వర్షన్ మాత్రం డిసెంబర్ 27న రిలీజ్ చేయనున్నట్లు మోహన్ లాల్ ట్వీట్ చేశారు. బాలీవుడ్లో పెన్ స్టూడియోస్ సహకారంతో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. కానీ వాస్తవంగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 3న విడుదల చేయాలని ఇది వరకే ప్రకటించారు. కానీ, నిర్మాణంతర పనులు పెండింగ్ ఉండటం వల్ల విడుదల ఆలస్యమైంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, ఈ మూవీ రిలీజ్ కానుంది.The #Barroz3D Hindi trailer is here! Thrilled to present this magical adventure in Hindi, brought to you in collaboration with #Penstudios. The Hindi version hits theatres on December 27. https://t.co/3pgb0ku861#Barroz— Mohanlal (@Mohanlal) December 11, 2024 -
స్టార్ నుంచి స్టోరీ వైపు..
భారీ తారాగణం, వందల కోట్ల బడ్జెట్‌తో స్క్రీన్‌ను కమ్మేయకుండా మన జీవితాలకు రంగుల ఫ్రేమ్‌ను సెట్ చేస్తే? మనిల్లు లాంటి ఇల్లు.. మన ఫ్యామిలీ లాంటి ఫ్యామిలీ.. మన ఇరుగు పొరుగు అంతా కథలో పాత్రలయితే.. థియేటర్ దాటినా ఆ అనుభూతి వెంటాడుతుంది.. ఆత్మీయులందరినీ కూర్చోబెట్టి టైటిల్ కార్డ్స్ నుంచి ఎండ్ కార్డ్ దాకా సీన్ టు సీన్ చెప్పాలనిపిస్తుంది! ఎన్నేళ్లయింది ఇలాంటిది అనుభవంలోకి రాక..? ఈ మాట విన్నదేమో మన తెలుగు కథ.. వెండి తెరకు బలమై.. మంచి సినిమాలా వెలుగుతోంది!ఆ మలయాళం సినిమా చూశారా..? సహజత్వం.. కథా గమనం..! ఎంత అద్భుతంగా ఉందో కదా..! భారీ బడ్జెట్ లేకున్నా పెద్ద సక్సెస్ సినిమాలు ఇలా కూడా తీస్తారా..! అవును నిజమే.. ఫీల్ గుడ్ మూవీస్‌కు కేరాఫ్ మలయాళం చిన్న కథలు.. మెస్మరైజ్ చేసే టేకింగ్ నిజ జీవితాలకు దగ్గరగా ఉండే పాత్రలు సరే.. మాలీవుడ్ మూవీస్ గొప్పగానే ఉండొచ్చు మరి టాలీవుడ్ సినిమా సంగతేంటి ?పొరుగు సినిమాలు విపరీతంగా చూసి మన దగ్గర అసలు విషయం ఏమాత్రం లేదనుకుంటాం గానీ.. మల్లు సినిమాలను మించి అద్భుతమైన కథ, కథనాలతో ఈ మధ్య కాలంలో విడుదలైన తెలుగు చిత్రాలు సైలెంట్‌గా సక్సెస్ సాధిస్తున్నాయి. స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్స్ సినిమాలను పక్కన పెడితే.. రొటీన్ ఫార్ములాలకు భిన్నంగా మనసుకు హత్తుకునే సినిమాలతో తెలుగుతెర పులకించిపోతోంది. వందల కోట్ల బడ్జెట్,భారీ తారాగణం, పెద్దపెద్ద సెట్టింగులు.. ఇవి ఉంటేనే సినిమా అనే రోజులు పోయాయి. మూస సినిమాలు చూసి బోరుకొట్టిన తెలుగు ప్రేక్షకులకు ఈ ఏడాది చిన్న సినిమాలు విందు భోజనమే పెట్టాయి. కుటుంబ కథా చిత్రాల నుంచి సస్పెన్స్ థ్రిల్లర్ వరకు ఈ తరహా సినిమాలు సిల్వర్ స్క్రీన్‌తో పాటు ఓటీటీలోనూ మంచి పేరు తెచ్చుకుంటున్నాయి. గొప్పగొప్ప సినిమాలన్నీ తమిళ, మలయాళం వాళ్లే తీస్తారు.. తెలుగు వాళ్ల దగ్గర అంత క్రియేటివిటీ లేదు అన్న విమర్శలకు చిన్న సినిమాలు తమ సక్సెస్‌తో సమాధానం చెబుతున్నాయి. పెద్ద సినిమాల కంటే చిన్న బడ్జెట్ సినిమాలే ఎక్కువగా ఫిల్మ్ ఇండస్ట్రీని డామినేట్ చేస్తున్నాయిఏడాదంతా చిన్న సినిమాల పండగే2024ను చిన్న సినిమాల నామ సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ఆరంభం, పేకమేడలు, కమిటీ కుర్రోళ్లు, ఆయ్, వీరాంజనేయులు విహార యాత్ర, 35 చిన్న కథ కాదు, మత్తు వదలరా 2, సోపతులు, జనక అయితే గనక.. ఇవన్నీ ఈ ఏడాది మూవీ లవర్స్‌తో శభాష్ అనిపించుకున్న చిన్న సినిమాలే. ఐఎమ్బీ (ఐMఆ) రేటింగ్స్‌లో ఈ మూవీస్ అన్నీ టాప్ లిస్టులో ఉన్నవే. తెరపై కనిపించే నటీనటుల నుంచి తెర వెనుక పనిచేసే సాంకేతిక నిపుణుల వరకు అందరూ కలిసి ఈ చిన్న సినిమాలకు ప్రాణం పోశారు. ఊహాజనితమైన కథలు, పాత్రలకు భిన్నంగా నేటివిటీకి చాలా దగ్గరగా ఈ చిత్రాలు కనిపిస్తాయి. సామాన్య జన జీవితాలే ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ఈ చిత్రాలు మాలీవుడ్ సినిమాలను మైమరపిస్తున్నాయి. స్టార్ హీరోలు ఉన్న సినిమాలు మాత్రమే బాక్సాఫీస్‌ను డామినేట్ చేస్తాయన్న అభిప్రాయాన్ని చిన్న బడ్జెట్ సినిమాలు బ్రేక్ చేశాయి. ప్రేక్షకులను థియేటర్ల వైపు నడిపించడంలో చిన్న సినిమా దర్శకులు విజయం సాధిస్తున్నారు.కటౌట్ కాదు కంటెంట్ ముఖ్యంఒక సినిమా విజయానికి కలెక్షన్ల సునామీ ఒక్కటే గీటురాయి కాదు. కమర్షియల్‌గా నిర్మాతలకు కోట్లు కుమ్మరించలేకపోయినా కొన్ని సినిమాలు ప్రేక్షకుల గుండెలను తాకుతాయి. ఫీల్ గుడ్ మూవీస్‌గా నిలిచిపోతాయి. ఇలాంటి సినిమాల్లో ఉండేది కంటెంట్ మాత్రమే. హీరో హీరోయిన్లు, దర్శక నిర్మాతలు, చిత్ర తారాగణం వీటన్నింటికంటే కథ.. ఆ కథను దర్శకుడు నడిపించిన తీరే చిన్న సినిమాల సక్సెస్‌కు అసలు కారణం. హీరోల ఇమేజ్, దర్శకుల పాపులారిటీ కారణంగా పెద్ద సినిమాలు ఒక వేవ్ క్రియేట్ చేస్తాయి. ఇలాంటి సినిమాలు అభిమానులతో పాటు కొన్ని వర్గాలను మాత్రమే మెప్పిస్తాయి. ఈ తరహా సినిమాలు ప్రేక్షకులను ఎంతగా ఎంటర్టైన్ చేసినా చిన్న సినిమాలు మాత్రం మనసుకు హత్తుకుని మళ్లీ మళ్లీ చూసేలా చేస్తున్నాయి. కేవలం సినిమా కోసమే కథలు.. హీరోలను ఎలివేట్ చేయడం కోసమే పాత్రలు, పాటల కోసమే హీరోయిన్లు.. ఇలా దారి తప్పిన సినిమాను యువతరం దర్శకులు తమ సృజనాత్మకతను జోడించి గాడిన పెడుతున్నట్టుగా అనిపిస్తోంది. 2024లో విడుదలై సత్తా చాటిన చిన్న సినిమాలే ఇందుకు నిదర్శనం.మీకో కథ చెబుతా చూస్తారా..ఇన్నోవేటివ్ స్టోరీ టెల్లింగ్.. యువ దర్శకులకు బాగా తెలిసిన విద్య. సినిమాను అతుకుల బొంతలా కాకుండా ప్రేక్షకుడి మనసును తాకేలా కథలను రాసుకుని అంతే వినూత్నంగా తెరపై ప్రజెంట్ చేస్తున్నారు. ఈ ఏడాది సక్సెస్ రుచి చూసిన సినిమాలన్నింటిలోనూ ఇది కనిపిస్తోంది. నిజ జీవితాలకు దగ్గరగా, నేటివిటీ ఉండేలా ముఖ్యంగా ప్రేక్షకులు సినిమాలో లీనమైపోయేలా చిన్న సినిమాలు ఉంటున్నాయి. కథలో కొత్తదనం.. ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యే పాత్రలు సినిమా సక్సెస్‌ను నిర్ణయిస్తున్నాయి. పెద్ద బడ్జెట్ చిత్రాలన్నీ స్టార్ పవర్ పైనా, హీరోల ఇమేజ్ పైనా ఆధారపడుతుంటే.. చిన్న చిత్రాలు మాత్రం మంచి కథలను మాత్రమే నమ్ముకుంటున్నాయి. సక్సెస్ఫుల్ డైరెక్టర్లుగా పేరున్న వారు కూడా ఈ మధ్య ఆడియన్స్‌ను మెప్పించడంలో తడబడుతుంటే యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్స్ తమ ఇన్నోవేటివ్ స్టోరీ టెల్లింగ్‌తో వెండితెరపై భావోద్వేగాలను పండిస్తున్నారు. పల్లెటూరి స్నేహాలు వాటి చుట్టూ అల్లుకున్న జీవితాలు, కుల పట్టింపులు, స్థానిక రాజకీయాలు వీటన్నింటి మధ్య ఎమోషన్స్ ను చూపించిన ‘కమిటీ కుర్రోళ్లు’ మంచి సక్సెస్ సాధించింది. చిన్ననాటి స్నేహాన్ని, అమాయకత్వాన్ని, మమకారాన్ని హృద్యంగా చూపించిన సోపతులు ఫీల్ గుడ్ మూవీగా నిలిచిపోయింది. నివేదా థామస్, విశ్వదేవ్, ప్రియదర్శి నటించిన ‘35 చిన్న కథ కాదు’ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులతో మంచి మార్కులు వేయించుకుంది. కండోమ్ కంపెనీపై యుద్ధం ప్రకటించే వ్యక్తిగా సుహాస్ నటించిన ‘జనక అయితే గనక’ సినిమా మంచి రేటింగ్‌తో థియేటర్లతో పాటు ఓటీటీలోనూ పెద్ద చర్చనే రేపింది.ఓటీటీ మెచ్చితే అదే పెద్ద విజయంఓటీటీలు వచ్చిన తర్వాత ఎంటర్టైన్మెంట్ ముఖచిత్రమే మారిపోయింది. వివిధ భాషా చిత్రాలు అందుబాటులో ఉండటంతో కంటెంట్ వినియోగం కూడా పెరిగిపోయింది. భిన్న అభిరుచి గల ప్రేక్షకులు తమకు నచ్చిన కంటెంట్‌ను వీక్షించడం అలవాటు చేసుకున్నారు. అందుకే థియేటర్ రిలీజ్ కాకుండా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ద్వారా చిన్న సినిమాలకు పెద్ద ఎత్తున వ్యూయర్షిప్ వస్తోంది. మంచి కథలతో వస్తున్న తెలుగు చిన్న సినిమాలు ఓటీటీ వేదికలపై సత్తా చాటుతున్నాయి. థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత ఓటీటీలోకి ఆ సినిమా ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూసే రోజులు వచ్చాయి. మౌత్ టాక్‌తో పాటు సోషల్ మీడియా ప్రమోషన్స్ చిన్న సినిమాలను ఓటీటీల ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువ చేస్తున్నాయి. దీంతో చిన్న చిత్రాలు పెద్ద సక్సెస్‌ను నమోదు చేసుకుంటున్నాయి.వైవిధ్యం.. విజయ రహస్యంకథలో వైవిధ్యం, కథనంలో కొత్తదనం.. మలయాళ సినిమా విజయ రహస్యం ఇక్కడే ఉంది. అందుకే దేశమంతా మాలీవుడ్ చిత్రాల గురించి గొప్పగా చెప్పుకుంటారు. టాలెంట్, క్రియేటివిటీ ఈ రెండూ సరిహద్దులు లేనివి. ప్రేక్షకులను మెప్పించే స్థాయిలో మంచి కథలు రాసే దర్శకులు, వాటిని అందంగా చిత్రీకరించే సాంకేతిక నిపుణులు అన్ని సినీ పరిశ్రమల్లోనూ ఉంటారు. సరైన అవకాశాలు, అభిరుచి ఉన్న నిర్మాతలు దొరికినప్పుడు ఆ కథలు మంచి చిత్రాలుగా ప్రేక్షకులకు చేరతాయి. టాలీవుడ్ సినిమాలను కంటెంట్ మాత్రమే శాసించడం మొదలుపెట్టి చాలా కాలమైంది. చదవండి: పెళ్లిలో మెరిసిన అల్లు అర్జున్, మెగాస్టార్.. ఫోటోలు వైరల్!చిన్న సినిమాల సక్సెస్ కూడా ఈ ఏడాదికి మాత్రమే పరిమితమైంది కాదు. పెద్ద సినిమాలు, హీరోల ఆధిపత్యాలు చలామణి అవుతున్న రోజుల్లో కూడా మంచి కథలతో వచ్చిన సినిమాలను ప్రేక్షకులు గుండెలకత్తుకున్నారు. ఈ నగరానికేమైంది, c/o కంచరపాలెం, మిడిల్ క్లాస్ మెమరీస్, బలగం, కలర్‌ఫోటో ఇలా భిన్న కథాంశాలతో కూడిన చిత్రాలెన్నో విజయం సాధించి చిన్న సినిమాను నిలబెట్టాయి. ఆ ట్రెండ్‌ను కొనసాగిస్తూ నేటి యువ దర్శకులు, సాంకేతిక నిపుణులు లోబడ్జెట్ సినిమాను తెలుగులో ట్రెండ్‌గా మార్చేశారు. అందుకే 2024 సినీ ప్రేమికులకు మంచి అనుభూతులను మిగిల్చింది.చిన్న సినిమాల వెనుక పెద్ద నిర్మాతలుస్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు, వందల కోట్ల వసూళ్లు ఈ రొటీన్ సినిమాటిక్ ఫార్ములా నుంచి నిర్మాతలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. మంచి కథలతో ముందుకొచ్చే కొత్త దర్శకులను ప్రోత్సహిస్తున్నారు. ఈ మధ్య సక్సెస్ చూసిన చిన్న సినిమాల వెనుక పెద్ద ప్రొడ్యూసర్స్ ఉండటం విశేషం. ‘35 చిన్న కథ కాదు’ చిత్రానికి సురేష్ ప్రొడక్షన్స్ నుంచి నటుడు రానా ప్రమోట్ చేశారు. యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తున్న అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ 2 బేనర్‌పై ఆయ్ చిత్రాన్ని నిర్మించారు. అంజి కె మణిపుత్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా పెద్ద చిత్రాలతో పోటీపడి మరీ మంచి సక్సెస్ సాధించింది. మెగా ఫ్యామిలీకి చెందిన నిహారిక కొణిదెల ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ బ్యానర్‌పై ‘కమిటీ కుర్రోళ్లు’ నిర్మించి బిగ్ సక్సెస్ సాధించారు. తెలుగులో పెద్ద సినీ నిర్మాణ సంస్థగా ఉన్న మైత్రీ మూవీ మేకర్స్‌కు చిన్న సినిమా ‘మత్తు వదలరా 2’ సక్సెస్ మంచి కిక్ ఇచ్చింది. ఒకప్పుడు కొత్త దర్శకులు కథలు పట్టుకుని నిర్మాతల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు కంటెంట్ ఉన్న దర్శకులను నిర్మాతలు వెతుక్కుంటూ వెళ్తున్నారు. మాస్ ఎంటర్టైన్ మెంట్ సినిమాలకు, స్టార్ హీరోల చిత్రాలకు మార్కెట్లో ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. అయితే ఈ సినిమాలపై ప్రేక్షకులకు విపరీతమైన అంచనాలు ఉంటాయి. అంచనాలు తలకిందులైతే సీన్ మారిపోతుంది. అభిమానులు కూడా పెదవి విరిచే పరిస్థితి తలెత్తుతుంది. చిన్న సినిమాలతో ఈ సమస్య లేదనే చెప్పాలి. తక్కువ బడ్జెట్‌తో కొత్త సాంకేతిక నిపుణులతో తెరకెక్కే చిన్న చిత్రాలకు మినిమమ్ గ్యారెంటీ ఉంటోంది.ఇదొక గుడ్ సైన్‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ లాంటి చిన్న సినిమాను గీతా ఆర్ట్స్ పెద్ద ఎత్తున రిలీజ్ చేసింది. దీన్ని చిన్న సినిమాకు దక్కిన గౌరవంగా భావిస్తాను. ఒకప్పుడు చిన్న సినిమాను చిన్న ప్రొడ్యూసర్స్, కొత్త ప్రొడ్యూసర్సే తీయాలి అని ఉండేది. కాని ఇప్పుడు చిన్న సినిమాలను తీయడానికి, డిస్ట్రిబ్యూట్ చేయడానికి పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ ముందుకొస్తున్నాయి. కొత్త కథకులను, కొత్త డైరెక్టర్స్‌ను ఎంకరేజ్ చేస్తున్నాయి. మంచి కథలకు డెఫినెట్‌గా ఇదొక గుడ్ సైన్!∙ దుష్యంత్, దర్శకుడురెస్పెక్ట్ దొరికింది‘వీరాంజనేయులు విహార యాత్ర’తో నాకొక రెస్పెక్ట్ దొరికింది. కుటుంబమంతా కలిసి చూడగలిగే హెల్దీ హ్యూమర్‌తో హెల్దీ ఫిల్మ్ తీయడం వల్లేమో మరి! ఇంకో మంచి విషయం ఏంటంటే.. ఇలాంటి సినిమా కథలను ప్రొడక్షన్ హౌస్‌లు వెదుక్కోవడం. ఇదివరకైతే స్క్రిప్ట్ పట్టుకుని ప్రొడక్షన్ హౌస్‌ల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్లే కథాబలమున్న స్క్రిప్ట్‌లను వెదుక్కుంటున్నాయి. వైవిధ్యమైన కథలు, ఆ కథల మీద గట్టి నమ్మకం, రాజీపడని తత్వం ఉంటే తప్పకుండా మంచి సినిమాలు వస్తాయని అర్థమైంది.అనురాగ్, దర్శకుడుతప్పకుండా ఆదరిస్తారుఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంటర్టైన్మెంట్ స్క్రిప్ట్‌లు తక్కువగా వస్తున్నాయి. అందులోకి గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో మన నేటివిటీని బేస్ చేసుకుని వినోదాన్ని పంచే స్క్రిప్ట్‌లు వంశీ, జంధ్యాల వంటి దర్శకుల తర్వాత పెద్దగా రావట్లేదని చెప్పొచ్చు. అందుకే మన నేటివిటీని యూజ్ చేసుకుని ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలిగితే సినిమా హిట్ అవుతుందనిపించి.. ‘ఆయ్’ సినిమా తీశాను. ఫస్ట్ సినిమాకే పెద్ద బ్యానర్ దొరకడం, అది హిట్ అవడం నిజంగా అదృష్టం. ఇండస్ట్రీలో పది పన్నెండేళ్ల నా స్ట్రగుల్ మంచి రిజల్ట్‌నే ఇచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. మన నేటివిటీ, నిజ జీవితంలో కనిపించే పాత్రలతో కథను పండించగలిగితే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ప్రూవ్ అయింది. అంజి కె మణిపుత్ర, దర్శకుడుప్రయత్నాన్ని నమ్మారు..‘కమిటీ కుర్రోళ్లు’ వల్ల గనుక నిర్మాతలు నష్టపోతే ఇక భవిష్యత్తులో ఎవరూ చిన్న సినిమా మీద డబ్బు పెట్టడానికి ముందుకురారు అనే భయం ఉండింది. కథాబలంతో చిన్న సినిమా ఉనికి చాటాలనేదే నా ప్రయత్నం. నా ప్రయత్నంలోని నిజాయితీని నిర్మాతలు, ప్రేక్షకులు నమ్మారు. చిన్న సినిమాలకు ఆదరణ ఉంటుందని నిరూపించారు. యదు వంశీ, దర్శకుడుఫణికుమార్ అనంతోజు -
ప్రియుడితో ప్రముఖ సింగర్ రెండో పెళ్లి.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్!
ప్రముఖ మలయాళ సింగర్ అంజు జోసెఫ్ వివాహబంధంలోకి అడుగుపెట్టింది. అయితే తన పెళ్లి చాలా సింపుల్‌గా చేసుకుంది. తన ప్రియుడు ఆదిత్య పరమేశ్వరన్‌ను ఆమె పెళ్లాడింది. సింగర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అంజు జోసెఫ్ అలప్పుజా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పెళ్లి చేసుకున్నారు.శుక్రవారం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న అంజు.. ఆ తర్వాత శనివారం అతిథుల కోసం వివాహా రిసెప్షన్ వేడుక నిర్వహించింది. ఈ వేడుకలో పలువురు సినీతారలు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి కూడా ఈ రిసెప్షన్‌కు హాజరయ్యారు.కాగా.. అంజు జోసెఫ్ డాక్టర్ లవ్ చిత్రంలోని చిల్లానే పాటతో సింగర్‌గా మాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమె పలు మలయాళ సినిమాలో పదికి పైగా పాటలు పాడింది. తనదైన టాలెంట్‌తో అభిమానులను సంపాదించుకుంది. ఆమె తొలిసారిగా అర్చన 31 నాటౌట్ అనే చిత్రంలోనూ నటించింది. అయితే గతంలో అంజు స్టార్ స్టార్ మ్యాజిక్ సీరియల్ డైరెక్టర్ అనూప్ జాన్‌ను వివాహం చేసుకున్నారు. కానీ ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. View this post on Instagram A post shared by Anju Joseph (@anjujosephofficial) -
కొచ్చిలో పుష్ప-2 ఫీవర్.. అల్లు అర్జున్ కొత్త పేరేంటో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం పుష్ప-2 ది రూల్. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. మరో వారం రోజుల్లో థియేటర్లను షేక్ చేయనున్నాడు పుష్పరాజ్. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీ అయిపోయారు. ఇటీవల చెన్నైలో కిస్సిక్ సాంగ్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.ఇక ఐకాన్ స్టార్‌కు తెలుగులో మాత్రమే కాదు.. మలయాళంలో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అల్లు అర్జున్ పుష్ప చిత్రానికి మలయాళంలో భారీ కలెక్షన్స్ రాబట్టిన సంగతి తెలిసిందే. పుష్ప-2 ప్రమోషన్లలో భాగంగా ఇవాళ కేరళలోని కొచ్చిలో భారీ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. లివా మాల్లోని గ్రాండ్ హయత్‌లో ఈవెంట్ జరగనుంది.ఈ భారీ ఈవెంట్‌కు హాజరయ్యేందుకు ఐకాన్ స్టార్ కేరళకు వస్తున్న సందర్భంగా కొచ్చి అంతటా భారీ హోర్డింగ్స్ మెరిశాయి. పుష్ప-2 పోస్టర్లతో నగరమంతా నింపేశారు. అంతేకాదు ఎయిర్పోర్ట్ వద్ద ఐకాన్ స్టార్ కోసం ఫ్యాన్స్ ఎంతోమంది పోస్టర్లతో దర్శనమిచ్చారు. అయితే పచ్చని పొలాల్లో ఏర్పాటు చేసిన పుష్ప-2 వెల్కమ్ పోస్టర్ మాత్రం బన్నీ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. అల్లు అర్జున్ పేరును ముద్దుగా మల్లు అర్జున్ అంటూ ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.కాగా.. సుకుమార్- బన్నీ కాంబోలో వస్తోన్న పుష్ప-2 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. పుష్పలో మెప్పించిన శ్రీవల్లిగా మరోసారి రష్మిక ఫ్యాన్స్‌ను అలరించనుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, కిస్సిక్ సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నారు. ఓవర్సీస్లో టికెట్ బుకింగ్ ఓపెన్ కాగా.. రికార్డ్ స్థాయిలో టికెట్స్ అమ్ముడయ్యాయి. Kerala Allu Arjun fans waiting at kochi airport since afternoon 💥Expecting @alluarjun arrival in 15mins #PushpaRulesKeralam KOCHI WELCOMES ALLUARJUN pic.twitter.com/eNwfBwQ3k5— Allu Arjun Devotees 🐉 (@SSAADevotees) November 27, 2024 KERALA WELCOMES MALLU ARJUN 🔥🔥#PushpaRulesKeralam ❤️🔥❤️🔥#Pushpa2TheRule #Pushpa2TheRuleOnDec5th pic.twitter.com/NPj9CqPQBz— Pushpa (@PushpaMovie) November 27, 2024 -
తెలుగులో సూపర్ హిట్ మూవీ.. ఆ భాషలోనూ గ్రాండ్ రిలీజ్!
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం 'క' మూవీతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. సుజిత్- సందీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా థియేటర్లలో సందడి చేసింది. లక్కీ భాస్కర్, అమరన్ చిత్రాలతో పోటీపడి బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో క టీమ్ సక్సెస్ మీట్ కూడా నిర్వహించింది.తెలుగులో సూపర్‌హిట్‌గా నిలిచిన క మూవీని తాజాగా మలయాళంలోనూ విడుదల చేయనున్నారు. ఈ మేరకు హీరో కిరణ్ అబ్బవరం పోస్టర్‌ను షేర్ చేశారు. మాలీవుడ్‌లో హీరో దుల్కర్ సల్మాన్ ప్రొడక్షన్ హౌస్ ద్వారా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. దుల్కర్‌కు చెందిన వేఫేరర్ ఫిల్మ్స్ క మూవీ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈ నెల 22న మలయాళంలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. కాగా.. దుల్కర్ సల్మాన్ తెలుగులో లక్కీ భాస్కర్‌తో సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.Nov 22nd ❤️@DQsWayfarerFilm #KA pic.twitter.com/bifoaytvs9— Kiran Abbavaram (@Kiran_Abbavaram) November 13, 2024 -
మొన్న బెయిల్‌పై వచ్చిన నటుడు.. ఇంతలోనే మూడో పెళ్లితో వైరల్
మలయాళ నటుడు బాల (బాలకుమార్) మూడో పెళ్లి చేసుకున్నాడు. పదిరోజుల క్రితం తన మాజీ భార్య అమృత సురేశ్ ఫిర్యాదు చేయడంతో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తనతో పాటు కూతురు అవంతికను వేదించాడని ఆమె ఫిర్యాదు చేయడంతో ఆయన్ను అరెస్ట్ చేశారు. అయితే, ఈ కేసులో అరెస్ట్ అయిన 24గంటల్లో ఆయనకు బెయిల్ లభించింది. ఈ క్రమంలో తాజాగా మూడో పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చాడు.'బాల' మలయాళ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. 'కంగువ' సినిమా దర్శకుడు శివకు స్వయాన తమ్ముడు అవుతాడు. కొద్దిరోజుల క్రితమే బెయిల్ మీద బయటకొచ్చిన బాల.. మూడో పెళ్లి చేసుకుని తన భార్యతో కేరళలోని కలూర్ పావకులం ఆలయానికి వచ్చాడు. తమిళనాడుకు చెందిన తన బంధువు కోకిలను ఆయన వివాహం చేసుకున్నాడు. అయితే, ఇరుకుటుంబాల మధ్య మాత్రమే ఈ కార్యక్రమం జరిగింది. పెళ్లి గురించి బాల ఇలా చెప్పుకొచ్చాడు. కోకిల తన మామయ్య కూతురని వెళ్లడించాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఆమెకు చిరకాల కోరిక ఉండేదని అన్నాడు. ఇలా ఆమె కోరిక నెరవేరిందని బాల చెప్పాడు. 'కష్ట సమయంలో కోకిల మాత్రమే నాకు మద్దతుగా నిలిచింది. నేను మళ్లీ పూర్తి ఆరోగ్యంగా తిరిగి రావడానికి ఆమె కారణం.' అని చెప్పాడు.బాల గతంలో రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. అతని మొదటి వివాహం 2010లో గాయని అమృత సురేష్‌తో జరిగింది. ఈ జంటకు అవంతిక అనే కుమార్తె ఉంది. వారు 2019లో విడాకులు తీసుకున్నారు. వృత్తిరీత్యా డాక్టర్ అయిన ఎలిజబెత్ ఉదయన్‌ను 2021లో రెండోసారి వివాహం చేసుకున్నాడు. 2023లో వారిద్దరూ విడివిడిగా జీవించడం ప్రారంభించారు. విడాకులు ఇచ్చి కూడా తనను వేదిస్తున్నాడని కేసు పెట్టిన మొదటి భార్య కోర్టులో న్యాయపోరాటం చేస్తుంది. కూతురు అవంతికతో పాటు తనను కూడా సోషల్‌మీడియాలో దారుణంగా తిడుతున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, ఈ కేసు విచారణలో ఉంది. -
మోహన్‌లాల్ అంత తెలివితక్కువవాడు కాదు: పృథ్వీరాజ్ అమ్మ
మలయాళ చిత్రపరిశ్రమపై 'జస్టిస్ హేమ కమిటీ' ఇచ్చిన రిపోర్ట్‌తో దేశవ్యాప్తంగా అలజడి రేగింది. మలయాళ చిత్రపరిశ్రమలో పనిచేస్తున్న మహిళల పట్ల లైంగిక దాడులు జరుగుతున్నాయని ఆ రిపోర్ట్‌లో ఉంది. దీంతో చాలామంది ఈ అంశం గురించి తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ క్రమంలో తాజాగా నటి మల్లికా సుకుమారన్ రియాక్ట్ అయ్యారు. ఆపై మోహన్లాప్పై కూడా ఆమె పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.నటి మల్లికా.. మలయాళ ప్రముఖ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌కు అమ్మ అని తెలిసిందే.. సుమారు ఆమె 60కి పైగా సినిమాల్లో రాణించారు. కతర్ దేశంలో ఆమెకు ఆరు రెస్టారెంట్స్ ఉన్నాయి. ప్రస్తుతం పరిశ్రమకు దూరంగా వ్యాపారవేత్తగా ఆమె ఉన్నారు. అయితే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ఇలా మాట్లాడారు. 'అమ్మ(అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్)లో విని మౌనంగా ఉండే వారు మాత్రమే ఇక్కడ ఇమడగలరు. నిరుపేద నటీనటులకు ఆర్థిక సహాయం అందించే చేయూత పథకంలో చాలా లోపాలు ఉన్నాయి. ఇదే విషయం ఒకసారి మా అబ్బాయితో కూడా చెప్పాను.పథకాలకు అర్హులైనవారు, వెనుకబడినవారు చాలామంది ఉన్నారు. నెలలో 15 రోజుల పాటు విదేశాలకు వెళ్తున్నవారికి చేయూత పథకాలు అందుతున్నాయి. ఇదీ ముమ్మాటికి నిజం. మందులు కొనుక్కోవడానికి డబ్బు లేని నటులు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. వారికి ఆపన్న హస్తం అందించాలి. మోహన్‌లాల్ అంత తెలివితక్కువవాడు కాదు. సంస్థలో కొన్ని తప్పులు దొర్లాయని అమ్మ మాజీ అధ్యక్షుడు మోహన్ లాల్‌కు కూడా బాగా తెలుసు. ఇక్కడ చాలా మంది తమ స్వంత ఇష్టాలకు నిర్ణయాలు తీసుకున్నారు. అమ్మ తొలినాళ్లలో కూడా చాలా తప్పులు జరిగాయి. దాన్ని అప్పట్లో నటుడు సుకుమారన్ (ఆమె భర్త) ఎత్తి చూపారు. చట్టబద్ధంగా ప్రతి విషయాన్ని సరిదిద్దుతామని చెప్పారు. ఇది కొందరికి ఈగోల గొడవతో ముగిసింది. సుకుమారన్ చనిపోయిన తర్వాతే వారికి అది అర్థమైంది.హేమ కమిటీ నివేదిక కుండబద్దలు కొట్టిన భూతంలా ఉందని మల్లికా అన్నారు. చిత్రపరిశ్రమకు చెందిన ఒక నటిపై దాడి కేసు విషయంలో ఈ ప్రభుత్వం ఏమేరకు న్యాయం చేసిందో చెప్పాలని ఆమె కోరారు. ఇండస్ట్రీలో అప్పుడప్పుడే నిలదొక్కుకుంటున్న ఆ హీరోయిన్ మీద హింస జరిగిన మాట వాస్తవమే అని అందరికీ తెలుసు. కానీ, ఒక్కరు నోరెత్తరని ఆమె అన్నారు. ఆ ఘటన జరిగి ఏడేళ్లు కావస్తుందని, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలని ఆమె కోరారు. అన్యాయం జరిగిన వెంటనే చర్యలు తీసుకుంటే మళ్లీ జరగవు కదా అని మల్లిక ప్రశ్నించారు. -
భార్య, కూతురిపై నటుడి టార్చర్.. అరెస్టైన కొన్ని గంటల్లోనే బెయిల్
మలయాళ నటుడు బాల (బాలకుమార్) అరెస్ట్ అయిన కొన్ని గంటల్లోనే బెయిల్‌పై బయటకొచ్చారు. మాజీ భార్య అమృత సురేశ్ ఫిర్యాదు చేయడంతో బాలను సోమవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. విడాకుల తర్వాత బాలా తనతో పాటు కుమార్తెను కూడా వేధించాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కొచ్చిలోని కడవంతర పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని అనంతరం కోర్టులో హజరుపరిచారు. వారిద్దరి వాదనలు విన్న తర్వాత పలు హెచ్చరికలతో బాలకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.బాలా అరెస్టు తర్వాత మాజీ భార్య అమృత కోర్టు విచారణలో భాగంగా తన కష్టాలను వివరించింది. తాను చెప్పలేని శారీరక, మానసిక హింసను ఎదుర్కొన్నానని నటుడు బాలపై ఆమె తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. '2019లో తన నుంచి విడాకులు తీసుకుని నేను దూరంగా ఉంటున్నాను. కూతురు అవంతికతో ప్రశాంతంగా జీవిస్తున్న నాకు అతని వేధింపులు మాత్రం తగ్గలేదు. నాతో పాటు అవంతికను కూడా ఇబ్బంది పెడుతున్నాడు. మా ఇద్దరి గురించి సోషల్‌మీడియాలో తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు. కనీసం సొంత కూతురని కూడా చూడకండా తప్పుడు మాటలతో దూషిస్తున్నాడు. తను ఇప్పుడు స్కూల్‌కు కూడా వెళ్లడం ఇబ్బందిగా మారింది.హెచ్చరికతో పాటు బెయిల్జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద అరెస్టు అయిన కొన్ని గంటల తర్వాత స్థానిక కోర్టు బాలకు బెయిల్ మంజూరు చేసింది. సోమవారం ఎర్నాకులం జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ అతనికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అతని మాజీ భార్య అమృత సురేష్, వారి కుమార్తెపై సోషల్ మీడియాలో ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని అతన్ని కోర్టు హెచ్చరించింది. భవిష్యత్‌లో విచారణాధికారులు పిలిచినప్పుడల్లా తదుపరి విచారణ కోసం బాలా తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని కోర్టు తెలిపింది.'కంగువ' సినిమా నిర్మాతకు తమ్ముడుబాల తమిళ-మలయాళ సినిమాలు చేసే నటుడు. 'కంగువ' దర్శకుడు శివ ఇతడికి అన్నయ్య అవుతాడు. 2006 నుంచి బాల.. నటుడిగా కొనసాగుతున్నాడు. 2010లో సింగర్ అమృత సురేశ్‌ని పెళ్లి చేసుకున్నాడు. 2012లో వీళ్లకు పాప కూడా పుట్టింది. ఆ తర్వాత వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. 2019లో విడాకులు తీసుకున్నారు. బాల మరో పెళ్లి చేసుకుని ఆమెకు కూడా విడాకులు ఇచ్చేశాడు. -
ఛాన్సులిస్తే చాలు.. ఎలాంటి పాత్రకైనా నేను రెడీ: ఆరాధ్య దేవి
టాలీవుడ్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న 'శారీ' సినిమాతో ఆరాధ్య దేవి టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తుంది. ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది. కేరళకు చెందిన 23 ఏళ్ల ఈ బ్యూటీ అసలు పేరు శ్రీలక్ష్మీ సతీష్. మలయాళీ మోడల్. చీరకట్టులో ఉన్న ఈ బ్యూటీ ఫోటోలను సోషల్ మీడియాలో చూసిన ఆర్జీవీ ఫిదా అయ్యాడు. అలా ఆమెకు ఏకంగా తన సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చాడు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ కూడా పూర్తి చేసుకుంది. త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. మొదట్లో చీరలో మాత్రమే కనిపించే ఆరాధ్య దేవి ఇప్పుడు గ్లామర్ ఫోటోలతో షేక్ చేస్తుంది. ఈ విషయంపై ఆమె తాజాగా ఇలా రియాక్ట్ అయింది.మొదట్ల ఛాన్సులు వచ్చినప్పటికీ గ్లామర్ పాత్రలు చేయకూడదని నిర్ణయించుకున్నానని, అయితే ఇప్పుడు తన అభిప్రాయాలు మారిపోయాయని సోషల్‌మీడియా ద్వారా ఆరాధ్యాదేవి చెప్పింది. గ్లామరస్తో పాటు ఎలాంటి పాత్రలకైనా తాను సిద్ధమేనని ప్రకటించింది. అలాంటి చిత్రాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆరాధ్య తెలిపింది. 'కాలం మారుతున్న కొద్దీ మన అభిప్రాయాలు మారుతాయంటూనే.. జీవిత అనుభవాలే మన నిర్ణయాలను మారుస్తాయని చెప్పుకొచ్చింది. గ్లామర్ అనేది చాలా వ్యక్తిగతమైనది. నాకు, అది వృత్తిలో భాగం. నటిగా వైవిధ్యంగా ఉండటం చాలా కీలకం. గ్లామరస్‌గా ఉన్నా, లేకపోయినా ఎలాంటి పాత్రకైనా నేను సిద్ధమే. ఉత్తమ పాత్రల కోసం ఎదురు చూస్తున్నాను. గ్లామర్ పాత్రలు చేయకూడదని గతంలో నిర్ణయించుకున్నాను. కానీ, 22 ఏళ్ల వయసులో నేను తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు మార్చుకుంటున్నా.' అని ఆరాధ్య పేర్కొంది. -
నిశ్చితార్థం ఒకరితో-పెళ్లి మరొకరితో.. మలయాళ నటి వివాహం (ఫొటోలు)
-
Onam Festival: మలయాళ సెలబ్రిటీలు ఎంత బాగా ముస్తాబయ్యారో! (ఫోటోలు)
-
నేనూ ఆ బాధితురాలినే.. జస్టిస్ హేమ కమిటీపై సిమ్రాన్
మలయాళ చిత్రపరిశ్రమలో జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్‌తో దేశవ్యాప్తంగా అలజడి రేగింది. ఈ కమిటీ ఇచ్చిన నివేదక తర్వాత ఒక్కోక్కరుగా బయటకు వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి తెలుపుతున్నారు. దీంతో అదే తరహా కమిటీని తమ పరిశ్రమలోనూ ఏర్పాటు చేయాలని ఇప్పటికే తమిళ, కన్నడ, తెలుగు చిత్రపరిశ్రమలకు చెందిన సినీ నటీనటులు కోరుతున్నారు. ఇలాంటి సమయంలో ఒకప్పటి టాప్ హీరోయిన్ సిమ్రాన్ రియాక్ట్ అయ్యారు.పలువురు నటీమణులు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ఇప్పుడు ఏకరువు పెడుతున్నారు. దీనికి అంతం ఎప్పుడో అనే ప్రశ్న తలెత్తుతోంది. తాజాగా నటి సిమ్రాన్ కూడా తానూ వేధింపుల బాధితురాలినేనని పేర్కొన్నారు. ఈ ఉత్తరాది భామ కోలీవుడ్, టాలీవుడ్‌లలో ఒకప్పుడు టాప్ హీరోయిన్గా రాణించారు. యువత కలల రాణిగా వెలుగొందిన సిమ్రాన్ వివాహానంతరం నటనకు దూరం అయినా, తాజాగా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలా ఈమె ఆ మధ్య పేట చిత్రంలో రజనీకాంత్ సరసన నటించి రీ ఎంట్రీకి మార్గం వేసుకున్నారు.తాజాగా ఒక భేటీలో సిమ్రాన్ మాట్లాడుతూ.. ఇప్పుడు నటీమణుల వేధింపుల వ్యవహారం పెద్ద చర్చకే దారి తీస్తోందన్నారు. కాగా తానూ అలాంటి బాధితురాలినేనని చెప్పారు. ఒక యువతిపై లైంగిక వేధింపుల దాడి జరిగితే వెంటనే ఎందుకు చెప్పలేదని ప్రశ్నించడం దారుణమన్నారు. ఆ సంఘటన గురించి వెంటనే ఎలా చెప్పగలరు ? మన చుట్టూ ఎం జరుగుతుందో తెలుసుకోవడానికే చాలా సమయం పడుతుందన్నారు. సహనం పాటించి ఆలోచించి ఆ తరువాతనే రియాక్ట్ అవ్వగలం అని, అందుకు సమయం తప్పనిసరిగా అవసరం అన్నారు. చిన్న తనంలో ఇలాంటి సమస్యలను చాలాసార్లు ఎదుర్కొన్నానని, అయితే వాటి గురించి ఇప్పుడు చెప్పలేనని పేర్కొన్నారు. -
కోల్‌కతా నుంచి కేరళ వరకు...
కేరళతో మొదలుపెట్టి కోల్‌కతా దాకా... దేశంలో ఎక్కడ చూసినా మహిళలపై దాష్టీ కపు వార్తలే. ఇవన్నీ దేశంలో మహిళల స్థితిని ఎత్తిచూపుతున్నాయి. అదే సమయంలో రాజకీయాల నిర్లిప్తత, వ్యవస్థల వైఫల్యమూ కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి.మలయాళ చిత్ర పరిశ్రమ చీకటి కోణాలు కాస్తా హేమ కమిటీ రిపోర్టుతో బట్టబయలయ్యాయి. నటులు, దర్శకులు, సినీ రంగంలోని అన్ని వర్గాల ప్రతినిధులపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వార్తలను చూస్తే, ‘అయ్యో’ అనిపి స్తోంది. అధ్వాన్నమైన విషయం ఇంకోటి ఉంది. మహిళకు సమానత్వం, మర్యాద, స్వేచ్ఛ, భద్రత అన్న సిద్ధాంతాన్ని నమ్మిన ఒక్క రాజకీయ పార్టీ లేకపోవడం! ఇదే విషయం మిత్రుడైన ఓ రాజకీయ నేతతో చెబితే... ‘‘మహిళలపై దౌర్జన్యం విషయాల్లో వాళ్లు, వీళ్లు అని ఏమీ లేదు. సొంత ప్రయోజనాలే వారికి పరమావధి’’ అని సమాధానమిచ్చాడు. నిత్యంకించపరిచే వ్యాఖ్యలు వింటూండే మహిళ రాజకీయ నేతలు కూడా పార్టీ అగ్రనేతల హుకుంలకు కట్టుబడ్డారేమో తెలియదు కానీ... గట్టిగా మాట్లాడతారని ఆశించినవాళ్లు కూడా నోళ్లు మెదపలేని స్థితిలో ఉన్నారు. బాధితు లకు రక్షణగా ఉండటం కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని అనిపించిందేమో వారికి!కోల్‌కతా ‘అభయ’కు న్యాయం దక్కుతుందని నాకైతే అనిపించడం లేదు. ఇలా చెప్పేందుకూ నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ కేసులో అక్కడి ఘోరకలి సమగ్రంగా ప్రపంచానికి తెలుస్తుందన్న నమ్మకమూ సన్న గిల్లుతోంది. కాలేజీ అధికారులు బాధితురాలి తల్లిదండ్రులకు చేసిన మూడు ఫోన్ కాల్స్ వివరాలు మీడియాలో విస్తృతంగా ప్రచారమయ్యాయి. దీన్నిబట్టే ఈ కేసు వివరాలపై గోప్యత ఎంతన్నది స్పష్టమైంది.ఆర్జి కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా సందీప్ ఘోష్ చలాయించిన అధికారాన్ని అర్థం చేసుకుంటే.. ఒళ్లు గగుర్పొడుస్తోంది. ఈయన వేధింపులు తట్టుకోలేక ఇద్దరు కాలేజీ ఇంటర్న్లు ఆత్మ హత్య చేసుకుందామని అనుకున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు. కాలేజీ మాజీ అధికారి అఖ్తర్ అలీ ఆరోపణల ప్రకారం సందీప్ ఘోష్ మృత దేహాలతో వ్యాపారం చేసేవాడు. అవయవాల రాకెట్‌నూ నడిపేవాడు. ఈ నేపథ్యంలో బెంగాల్ ప్రభుత్వాన్ని అడగాల్సిన ప్రశ్న ఒకటి ఉంది. ఒక వ్యక్తిని కాపాడేందుకు ఇన్ని పనులు ఎందుకు చేస్తున్నారు? సందీప్ ఘోష్ తరఫున వాదించేందుకు ప్రభుత్వం న్యాయ వాదిని నియమించడం ఏమిటి?ఈ ఘటనను రాజకీయంగా వాడుకోలేదా? అందరూ వాడుకున్నారు. రాళ్లు రువ్వడంతో దేబాశీష్ చక్రవర్తి లాంటి పోలీసు కనుచూపు కోల్పోయే పరిస్థితి వచ్చింది. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య మాటా మాటా నడుస్తోంది. ఇందు కేనేమో... ఆందోళన చేస్తున్న వైద్యులు ఈ రెండు పార్టీల వారు ఎవరూ తమ పరిసరాల్లో లేకుండా జాగ్రత్త పడ్డారు. ‘అభయ’లాంటి ఘటన జరిగిన తరువాత చేసిన వ్యాఖ్యలు తప్పేనని తృణమూల్ పార్టీ హుందాగా తమ తప్పు ఒప్పుకుని ఉండాల్సింది. కొద్ది రోజులపాటు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండి... ఆ తరువాత ఒక్క పళంగా విరుచుకుపడింది. ఒకరి ద్దరు పార్టీ ప్రతినిధులు నోటికి ఏదొస్తే అది మాట్లా డేశారు. ఈ క్రమంలోనే ఓ ఎంపీని నా కార్యక్రమం నుంచి వెళ్లిపొమ్మని అడగాల్సి వచ్చింది. ముప్ఫై ఏళ్ల నా వృత్తి జీవితంలో నేను ఇలా ఎన్నడూ చేయలేదు. పశ్చిమ బెంగాల్ ఘటనకు బాధ్యత టీఎంసీదైతే... హేమ కమిటీ నివేదిక పుణ్యమా అని కేరళ సినీ రంగం లేవనెత్తుతున్న ప్రశ్నలకు అక్కడి లెఫ్ట్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. జస్టిస్ కె.హేమ కమిటీ తన నివేదికను సిద్ధం చేసేందుకు ఏకంగా ఐదేళ్ల సమయం పట్టింది. ఈ నివేదిక బయటపడటంతో చాలామంది మహిళా ఆర్టిస్టులు ఇప్పుడు పోలీసులకూ, టాస్క్ఫోర్స్కూ ఫిర్యాదు చేయడం మొదలుపెట్టారు. ఈ మలయాళ ‘మీ టూ’ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న నటీమణులు రేవతి, పార్వతి చెప్పిన దాని ప్రకారం... ఈ కేసులో అటు రాజకీయ నేతలు, ఇటు సినిమా శక్తులు వాస్తవాలను తొక్కి పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ రెండు వర్గాలూ కలిసిపోయే అవకాశమూ లేకపోలేదని వాళ్లు అంటున్నారు. హేమా కమిటీ నివేదికలోని 11 పేరాలను ప్రభుత్వం ఎందుకు తొలగించిందో ఇప్పటివరకూ ఎలాంటి వివరణ లేదు. గుజరాత్ ప్రభుత్వ పుణ్యమా అని బిల్కిస్ బానో రేపిస్టులు మెడలో పూలదండలతో జైల్లోంచి బయట కొచ్చారు. అభయ విషయంలో మమత ప్రభుత్వం మితిమీరిన అహంకారంతో వ్యవహరించింది. 2012 నాటి నిర్భయ ఘటనలో కాంగ్రెస్వాళ్లూ నానా చెత్తా మాట్లాడారు. ఇవన్నీ మనకు చెబుతున్నది ఏమిటి? రాజకీయ నేతలు పట్టించుకోవాలంటే, మహిళలు ఒక ఓటుబ్యాంకుగా సంఘటితం కావాలి.బర్ఖా దత్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
చిత్రపరిశ్రమలో వేధింపులు.. మీడియాపై సురేష్ గోపి ఆగ్రహం
మలయాళ చిత్రపరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అంశంపై జస్టిస్ హేమ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇపుడు అక్కడ ప్రకంపనలు రేపుతుంది. అనేక బాధిత నటీమణులు ముందుకు వచ్చి పలువురు హీరోలు, దర్శకనిర్మాతలపై లైంగిక ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి, నటుడు సురేష్ గోపి మీడియాపై తీవ్ర ఆరోపణలు చేశారు.మలయాళం సినిమా ఇండస్ట్రీలో మీ టూ ఆరోపణలపై మంత్రి స్పందిస్తూ... కోర్టే సమాధానం ఇస్తుందన్నారు. చిత్ర పరిశ్రమలో ఆరోపణలు మీడియాకు ఆహారంగా మారిందని అన్నారు. ‘మీరు ఆ వార్తలతో డబ్బులు సంపాదించవచ్చుకానీ ఓ పెద్ద వ్యవస్థను నేలకూలుస్తున్నారు. మేకలు కొట్టుకునేలా చేసి, ఆ తర్వాత మీలాంటి వాళ్లు వాటి రక్తాన్ని తాగుతారు. ప్రజల మెదళ్లను మీడియా తప్పుదోవ పట్టిస్తోంది’ అని సురేశ్ గోపి మండిపడ్డారు.తాను ప్రైవేట్ పర్యటనలో ఉన్నానని, మలయాళం మూవీ ఆర్టిస్టుల సంఘానికి(అమ్మ) చెందిన ప్రశ్నలు కేవలం ఆ ఆఫీసును విజిట్ చేసినప్పుడు మాత్రమే అడగాలని ఆయన పేర్కొన్నారు. ఇది ఉండగా మలయాళ సినీ పరిశ్రమలో నటీమణులతో పాటు ఇతర మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు కేరళ ప్రభుత్వం 2019లో జస్టిస్ హేమ కమిటీ ఏర్పాటయ్యింది. ఈ కమిషన్ కేరళ సీఎం పినరయి విజయన్‌కు ఎప్పుడో నివేదిక సమర్పించగా.. తాజాగా ఇందులోని అంశాలు వెలుగుచూశాయి. మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఉన్నట్లు హేమ కమిషన్ తెలిపింది. -
హేమ కమిటీ రిపోర్ట్.. ఆశ్చర్యం కలగలేదన్న సలార్ నటుడు!
హేమ కమిటీ ఇచ్చిన నివేదిక మలయాళ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఇప్పటికే పలువురు నటీమణులు బహిరంగంగా తమకెదురైన వేధింపులను బయటపెడుతున్నారు. దీంతో మలయాళ మూవీ ఆర్టిస్ట్‌ల సంఘం(అమ్మా)పై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. తాజాగా సలార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ నివేదికపై స్పందించారు. ఈ విషయంలో అమ్మా పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సినీ పరిశ్రమలోని సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. ఇండస్ట్రీని ప్రక్షాళన చేసి దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అవసరముందని డిమాండ్ చేశారు.పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ.. "హేమ కమిటీతో మాట్లాడిన మొదటి వ్యక్తిని నేను. సినిమా పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. వారికి సురక్షితమైన పనివాతావరణం సృష్టించే మార్గాలను కనిపెట్టడమే ఈ నివేదిక లక్ష్యం. హేమ కమిటీ నివేదిక తనకు ఎలాంటి ఆశ్చర్యం కలగలేదు. ఆ ఆరోపణలు నిజమని రుజువైతే ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలని అందరిలాగే నేను కూడా ఆసక్తిగా ఉన్నా. నివేదికలో పేర్కొన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది. దోషులను కఠినంగా శిక్షించాలి. అదే విధంగా ఆరోపణలు తప్పు అని రుజువైతే తప్పుడు ఫిర్యాదులు చేసిన వారిని కూడా శిక్షించాల్సిందేనంటూ' సలార్ నటుడు కోరారు. ఈ విషయంలో నిందితుల పేర్లను విడుదల చేయాలనే నిర్ణయం కమిటీ సభ్యులదేనని స్పష్టం చేశారు.కాగా.. ఈ ఏడాది ఆడుజీవితం (ది గోట్ లైఫ్) మూవీతో సూపర్‌హిట్‌ను సొంతం చేసుకున్నారు. దుబాయ్ నేపథ్యంలో ఓ యధార్థం కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అంతకుముందు సలార్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ తనదైన నటనతో అభిమానులను మెప్పించారు. ప్రస్తుతం బరోజ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. -
ఓటీటీకి సర్వైవల్ కామెడీ ఎంటర్టైనర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కుంచకో బోబన్, సూరజ్ వెంజరమూడు, శృతిరామచంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ సర్వైవల్ కామెడీ చిత్రం గర్. ఈ సినిమాను జయ్ కె డైరెక్షన్లో తెరకెక్కించారు. జూన్ 14న థియేటర్లలో కేవలం మలయాళంలో మాత్రమే విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.తాజాగా ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వెల్లడించింది. ఈ నెల 20 నుంచి మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. ఓ జూలో సింహాం ఉన్న డెన్లోకి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు ఎలా బయటపడ్డారనే కథాంశంతోనే ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో రాజేశ్ మాధవన్, మంజుపిళ్లై, శోభితిలకన్, సెంథిల్ కృష్ణ కీలక పాత్రలు పోషించారు. -
ఒకప్పుడు కేవలం అలాంటి సినిమాలే: మలయాళ ఇండస్ట్రీపై ఆర్జీవీ కామెంట్స్!
టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఇటీవల కల్కి చిత్రంలో అతిథిపాత్రలో మెరిశారు. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అయితే తాజాగా ఆర్జీవీ మలయాళ సినిమా ఇండస్ట్రీపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. గతంలో మలయాళ చిత్రాలు కేవలం అడల్ట్, రొమాంటిక్ కంటెంట్‌తో మాత్రమే వచ్చేవని అన్నారు.రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ..'ఒకప్పుడు మలయాళం సినిమా అంటే కేవలం అడల్ట్ కంటెంట్ మాత్రమేనని మనందరికీ తెలుసు. నేను విజయవాడలో ఇంజినీరింగ్ చేస్తున్న రోజుల్లో మలయాళ సినిమాలు చూడలేదు. ఎందుకంటే ఇతర సినిమాలతో పోలిస్తే ఎక్కువ అడల్ట్ కంటెంట్‌తో మాత్రమే వచ్చేవి. కానీ ఇప్పుడు మాత్రం మలయాళం నుంచి ఉత్తమ చిత్రాలు వస్తున్నాయి. అయితే ఆ సమయంలో మంచి సినిమాలు లేవని కాదు. బహుశా అప్పట్లో డిస్ట్రిబ్యూటర్లు ఏదైనా కారణాలతో అలాంటి సినిమాలు తీసుకొచ్చి ఉంటారేమో. వారిని ప్రభావితం చేసిన అనేక అంశాలు ఉండొచ్చు.' అని అన్నారు,ది కేరళ స్టోరీపై ప్రశంసలు..ది కశ్మీర్ ఫైల్స్, యానిమల్ లాంటి వివాదాస్పద చిత్రాలపై ఆర్జీవీ ప్రశంసలు కురిపించారు. తాను చూసిన ఉత్తమ చిత్రాలలో ది కేరళ స్టోరీ ఒకటని ఆయన తెలిపారు. అలాగే ప్రశాంత్ వర్మ చిత్రం హను-మాన్, నాగ్ అశ్విన్ తాజా బ్లాక్‌బస్టర్ కల్కి 2898 AD సినిమాలు అధ్బుతమని కొనియాడారు. శివ మూవీతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన ఆర్జీవీ టాలీవుడ్‌కు పలు సూపర్ హిట్ చిత్రాలను అందించారు. -
స్టార్ హీరో తనయుడు.. ఒక్క సినిమాతో తెగ నచ్చేశాడు! (ఫోటోలు)
-
చీరకట్టులో హులా హూపింగ్..అథ్లెటిక్ సామర్థ్యాలతో..!
ఇటీవల చాలామంది చీర కట్టులో స్విమ్మింగ్, స్కేటింట్ వంటివి చేసి ఆశ్చర్యపరుస్తున్నారు. మన భారతీయ వస్త్రధారణ మనకు నచ్చిన అభిరుచికి అనుకూలంగా మలుచుకోవచ్చని చేసి చూపిస్తున్నారు. అందుకోసమని పాశ్చాత్య బట్టలను ధరించాల్సిన పనిలేదని చాటి చెబుతున్నారు. మన భారత సంప్రదాయ వస్త్రాధారణకు ఉన్న ప్రాముఖ్యతను తెలయజెప్పుతున్నారు కూడా. అలానే ఈ మలయాళ కుట్టి చీరకట్టులో కేలరీల బర్న్ చేసే క్రీడలాంటి హులా హూప్స్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. సోషల్‌మీడియ ఇన్ఫ్లుయెన్సర్ అయిన ఎష్నా కుట్టి మూసపద్ధతలను సవాలు చేస్తూ సాంప్రదాయ భారతీయ చీరకట్టులో చాకచక్యంగా హులా హూపింగ్ చేసి చూపించింది. ఎష్నా చీర ధరించి కూడా చాలా సునాయాసంగా, వేగవంతంగా హులా హూపింగ్ చేసింది. అధునిక అథ్లెటిజంని భారత సాంప్రదాయ చీరతో మిళితం చేసింది. పైగా భారతీయ మహిళలు సాధించలేనిది ఏదీ లేదని చాటి చెప్పింది. ఇక ఎష్నా ఇలా చీరకట్టులో హులా హూప్స్ చేయడానికి ప్రధాన కారణం శారీరక ఫిట్నెస్ కోసం చేసే ఈ క్రీడను మన సాంస్కృతికి వారసత్వానికి చిహ్నమైన చీరలో కూడా చెయ్యొచ్చు అని చెప్పేందుకేనని అంటోంది. ఆమె ఢిల్లీలో పెరిగినప్పటికీ..పుట్టుకతో ఆమె మళయాళీ. కానీ ఆమెకు మళయాళం రాదు. ఆమె తల్లి చిత్ర నారాయణ పాత్రికేయురాలు, తండ్రి విజయన్ కుట్టి డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్. తాను ఈ హులాహూపింగ్ని పదేళ్ల ప్రాయం నుంచే నేర్చుకున్నట్లు తెలిపింది. ఇది తనకు ఎంతో ఇష్టమైన అభిరుచి అని చెప్పుకొచ్చింది. తన స్నేహితులు, తల్లిదండ్రలు మద్దతుతో హులా హూపింగ్స్ ట్రైనర్‌గా మారింది. అంతేగాదు పారిస్‌లో జరగనున్న ఒలింపిక్స్ 2024లో కూడా అథ్లెట్లకు మద్దతిస్తు పాల్గొనడం విశేషం. ఇక హులా హూప్స్ అనేది ఒక క్రీడా ఈవెంట్‌గా గుర్తించబడింది, దీనికి నిర్దిష్ట రూపం అవసరం. ముఖ్యంగా ఫిట్నెస్కి సంబంధించి కేలరీలను బర్న్ చేసే గొప్ప సాధనంగా చెప్పొచ్చు. కాగా, ఎష్నా జర్నీ భారతీయ యువతులకు స్ఫూర్తిదాయకం. మన సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవిస్తూనే..అథ్లెటిక్స్ ఆసక్తిన కొనసాగించాలనుకునేవారికి ఓ కొత్త మార్గాన్ని చూపించింది. రాబోయే తరాలు ఎష్నాని ఆదర్శంగా తీసుకుని తాము రాణిస్తున్న రంగంలో భారతీయ సంప్రదాయ వస్త్రధారణకు పెద్దపీట వేసేలా మార్గం సుగమం చేసింది. (చదవండి: కఠినమైన డైట్, జిమ్ చెయ్యలేదు..కేవలం పరాఠాలతో బరువు తగ్గడమా..?) -
కాస్మెటిక్ సర్జరీ చేయించుకున్న నిమిషా సజయన్.. నిజమేనా?
నిమిషా సజయన్.. మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ఈ నల్లకలువ తెలుగు వారందరికి కూడా పరిచయమే. చామనఛాయ, కుదురైన ఆకృతి, నటన తెలిసిన కళ్లు ఆమె ప్రత్యేకత. ముంబైలో పుట్టిపెరిగినా తన మూలాలు మాత్రం మలయాళంలోనే ఉన్నాయి. తన టాలెంట్‌తో సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లోనూ నటిస్తుంది. 2017లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తక్కువ సమయంలోనే గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్గా జిగర్తాండ డబుల్ ఎక్స్, చిన్నా, నాయట్టు (కోట బొమ్మాళి పీఎస్) వంటి చిత్రాలతో టాలీవుడ్ వారికి బాగా దగ్గరైంది.తాజాగా ఈ బ్యూటీ కాస్మెటిక్ సర్జరీ చేపించుకున్నారని ప్రచారం జరుగుతుంది. నటి నిమిషా సజయన్ ప్రస్తుతం కాస్మెటిక్ సర్జరీ చర్చల అంశం మలయాళ పరిశ్రమలో చర్చ జరుగుతుంది. కెరీర్ ప్రారంభంలో ఆమెను చూసిన క్షణం నుంచి ప్రస్తుతం ఆమె ముఖం కొద్దిగా మారిపోయిందని వారు అంటున్నారు. దీనిపై కాస్మోటాలజిస్టుల అభిప్రాయం అందరినీ ఆకర్షిస్తోంది. ఇటీవల సోషల్ మీడియా ద్వారా దృష్టిని ఆకర్షించిన డాక్టర్ శిఖా, తాను కాస్మెటిక్ సర్జరీలు చేయించుకోలేదని చెప్పింది. నిమిషా ముఖంలో వచ్చిన మార్పులకు కారణాన్ని కూడా పంచుకున్నారు.నిమిషా సజయన్ మునుపటి కంటే ఇప్పుడు ఎక్కువ బరువు తగ్గిందని ఆమె తెలిపింది. రింగులుగా ఉన్న ఆమె జుట్టు స్ట్రెయిట్ చేయబడింది. ఆమె పెదవిలోనూ ఏమీ మార్పులేదు. తన మొహంలో కూడా ఎలాంటి మార్పూ లేదని తాను అనుకుంటున్నట్లు డాక్టర్ శిఖా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తన అందానికి ఫిదా అయిన చాలామంది నిమిషా సోషల్‌మీడియా ఖాతా కామెంట్ బాక్స్‌లో ప్రశంసిస్తున్నారు. సహజ సౌందర్యం ఉన్న గొప్ప నటి నిమిషా అని పలువురు వ్యాఖ్యానించారు. గత కొన్ని రోజులుగా నిమిషాపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సైబర్ ఎటాక్ జరుగుతోంది.మలయాళ ప్రముఖ నటుడు సురేష్ గోపి త్రిసూర్ ఎన్నికల్లో గెలవలేరని ఆమె పబ్లిక్ ఫోరంలోనే కామెంట్ చేసింది. అయితే, తాజాగా సురేష్ గోపీ విజయం సాధించారు. దీంతో పాత ప్రస్తావన పేరుతో ఆమెపై ట్రోల్స్ వచ్చాయి. దీంతో ఆమె సోషల్ మీడియా కామెంట్ బాక్స్‌ను ఆఫ్ చేసింది. View this post on Instagram A post shared by NIMISHA BINDU SAJAYAN (@nimisha_sajayan) -
త్రీ సాంగ్మం
ఒక భాషలో మొదలైన పాట ఆ భాషలోనే ఆగిపోతుంది. అయితే ఈ పాట విషయంలో అలా జరగలేదు. మలయాళంలో మొదలైన పాట హిందీలోకి వచ్చింది. ఆ తరువాత బెంగాలీలోకి వచ్చి ఎండ్ అయింది.ఎక్కడా కృత్రిమత్వం అనిపించదు. హాయిగా వినాలనిపిస్తుంది. మ్యాటర్‌లోకి వస్తే... స్మితాదేవ్ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ ‘ఎడక్కడ్ బెటాలియన్’ అనే మలయాళ సినిమాలోని ‘ఎన్ జీవనే’ పాటను మూడు భాషల్లో చక్కగా పాడింది. స్మిత గొంతుకకు, ఆమె మల్టీ లింగ్వల్ టాలెంట్‌కు నెటిజనులు జేజేలు పలికారు.హిందీ సంగతి సరే, మలయాళీ పాటను సహజంగా పాడడం అనేది గొప్ప విషయం. అచ్చం మలయాళీ సింగర్ పాడినట్లుగా ఉంది’ అని ఒక నెటిజన్ స్పందించాడు. ‘ఈ పాట పుణ్యమా అని మళయాళం, బెంగాలీ భాషల ధ్వనిలోని కొన్ని అద్భుతమైన సారూప్యతలను గమనించే వీలు కలిగింది’ అంటూ స్పందించాడు ఒక విశ్లేషకుడు. ‘మీ పాట మ్యూజిక్ స్ట్రీమింగ్ ΄్లాట్ఫామ్లలో ఉండేలా చూడండి’ అని ఒక ఇన్స్టాగ్రామ్ యూజర్ అడిగాడు. -
సరికొత్త టైటిల్‌తో సినిమా ప్రకటించిన అనుపమ పరమేశ్వరన్
టాలీవుడ్లో ఇప్పుడ అనుపమ పరమేశ్వరన్ ట్రెండ్ కనిపిస్తుంది. వరుస సినిమాలతో తన జోరు కొనసాగిస్తుంది. ఇప్పటికే 'టిల్లు స్క్వేర్'తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన ఈ బ్యూటీ ఇప్పుడు మరొక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు 'పరదా' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. 'సినిమా బండి' దర్శకుడు ప్రవీణ్ కండ్రేగులతో చేస్తున్న సినిమా నుంచి తాజాగా4 టైటిల్ టీజర్ విడుదలైంది.ఆనంద మీడియా బ్యానర్‌పై విజయ్ డొంకాడ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా సరికొత్తగా అనిపిస్తుందని అనుపమ చెబుతుంది. ఇప్పటి వరకు ఎక్కడా చూడని కథతో వస్తున్నామని ఆమె చెప్పింది. మలయాళ నటి దర్శన రాజేంద్రన్‌తో పాటు సంగీత, రాగ్ మయూర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వాస్తవంగా ఈ ప్రాజెక్ట్‌లో సమంత నటించాల్సింది. కానీ ఆమె ఆరోగ్యం సహకరించకపోవడంతో అనుపమకు ఈ ఛాన్స్ దక్కింది. -
'మంజుమ్మల్ బాయ్స్' నిర్మాతల మోసం.. చీటింగ్ కేసు నమోదు
ఈ మధ్య కాలంలో సౌత్ ఇండియాలో బాగా వినిపించిన మలయాళం సినిమాల్లో 'మంజుమ్మల్ బాయ్స్' ఒకటి. రూ.20కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఏకంగా రూ.250 కోట్ల పైచిలుకు వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. తెలుగులో కూడా ఇదే పేరుతో మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేశారు.ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమా భారీ విజయం సాధించింది. అయితే, తాజాగా ఈ చిత్ర నిర్మాతలపై కేసు నమోదైంది. ఎర్నాకుళం కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం 'మంజుమ్మల్ బాయ్స్' నిర్మాతలైన సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోనీ, బాబు షాహిర్‌ల మీద చీటింగ్ కేసు నమోదు చేశారు. కొద్దిరోజుల క్రితం ఆ నిర్మాతలు తనని మోసం చేశారంటూ సిరాజ్ వలియతార న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. 'మంజుమ్మల్ బాయ్స్' సినిమా కోసం తాను రూ.7 కోట్లు పెట్టుబడిగా పెట్టానని సిరాజ్ ఫిర్యాదులో పేర్కొన్నాడు.సినిమా విడుదలయ్యాక వచ్చే లాభాల్లో 40 శాతం వాటా తనకు ఇస్తామని చెప్పడంతోనే పెట్టుబడి పెట్టినట్లు సిరాజ్ చెబుతున్నాడు. సినిమా భారీ విజయం అందుకున్న తర్వాత తనకు టచ్‌లో లేకుండా పోయారని ఆయన వాపోయాడు. లాభాల సంగతి పక్కనపెడితే తాను పెట్టిన రూ. 7 కోట్ల మొత్తాన్ని కూడా తిరిగి ఇవ్వలేదని ఆయన తెలిపాడు. పూర్తి విచారణ తర్వాత 'మంజుమ్మల్ బాయ్స్' నిర్మాతలపై కేసు నమోదు చేయాలని ఎర్నాకుళం కోర్టు ఆదేశించింది.2006లో జరిగిన వాస్తవ సంఘటనలను బేస్ చేసుకుని 'మంజుమ్మల్ బాయ్స్' చిత్రాన్ని చిదంబరం తెరకెక్కించారు. సౌబిన్ షాహిర్,శ్రీనాథ్ భాసి, గణపతి, ఖలీద్ రెహమాన్, జార్జ్ మరియన్ తదితరులు నటించిన ఈ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా ఫిబ్రవరి 22న ప్రేక్షకుల ముందుకొచ్చింది. -
ప్రముఖ దర్శకుడి ఇంట్లో దొంగతనం చేసిన సర్పంచ్ భర్త
మలయాళంలో ప్రముఖ దర్శకుడిగా జోషికి మంచి గుర్తింపు ఉంది. ఇప్పటి వరకు ఆయన సుమారు 80కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన కుమారుడు అభిలాష్ కూడా దుల్కర్ సల్మాన్ నటించిన కింగ్ ఆఫ్ కొత్త సినిమా ద్వారా డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా ఆయన నివాసంలో సుమారు కోటి రూపాయలు విలువ చేసే ఆభరణాలు చోరీ చేశారు. ఈ కేసులో నిందితుడు మహ్మద్ ఇర్ఫాన్‌ను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. దర్శకుడి ఇంట్లో భారీ చోరీకి పాల్పడిన ఇర్ఫాన్ గురించి పలు ఆసక్తికర విషయాలను పోలీసులు వెళ్లడించారు. బిహార్‌కు చెందిన ఇర్ఫాన్ ఒక గ్రామ సర్పంచ్ భర్త అని పోలీసులు తెలిపారు. సీసీ టీవీ దృశ్యాల ద్వారా నిందితుడిని గుర్తించగా పరారీలో ఉన్న అతడిని కర్ణాటక పోలీసుల సాయంతో ఉడిపి జిల్లాలో అరెస్ట్ చేశారు. సీసీ టీవీలో రికార్డ్ అయిన వీడియోలో ఇర్ఫాన్ ఉపయోగించిన కారు నంబర్ క్లియర్‌గా కనిపించడంతో అతన్ని పట్టుకోవడం సులభం అయిందని కొచ్చి నగర పోలీసు కమిషనర్ శ్యామ్ సుందర్ తెలిపారు. ఆ కారు వెనుక భాగంలో గ్రామ సర్పంచ్ అనే బోర్డు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు ఇర్ఫాన్ పక్కా ప్లాన్‌తో ఇతర రాష్ట్రాల్లో తిరుగుతూ ధనవంతుల నివాసాలే టార్గెట్ చేస్తున్నాడు. దొంగతనంలో భాగంగా డబ్బులు, నగలు దొంగిలించి బిహార్‌లోని పేద ప్రజలకు పంచుతున్నాడని సమాచారం.. ఈ విషయం నిజమేనా అని ఓ విలేకరి పోలీసులను ప్రశ్నించగా.. అందుకు సరైన సమాధానం వారి నుంచి రాలేదు. తమ దృష్టిలో ఇర్ఫాన్ ఓ నిందితుడంటూ పోలీసులు పేర్కొన్నారు. ఇర్ఫాన్‌పై ఆరు రాష్ట్రాల్లో 19 కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గతనెలలోనే జైలు నుంచి ఆయన విడుదలయ్యారని వారు తెలిపారు. ప్రస్తుతం ఇర్ఫాన్ నుంచి రూ. కోటీ 20 లక్షల రూపాయల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం నిందితుడు ఏప్రిల్ 20న కొచ్చికి వచ్చాడని తెలిపారు. నగరంలో విలాసవంతంగా ఉండే ప్రాంతాల గురించి ఆరా తీసి ప్లాన్ వేసినట్లు చెప్పారు. అయితే ఈ దొంగతనం జరిగినప్పుడు జోషీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇంట్లోనే ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఈ దొంగతనం తెల్లవారుజామున జరగడంతో వారు నిద్రలో ఉన్నట్లు సమాచారం. -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ మలయాళ నిర్మాత గాంధీమతి బాలన్ (66) కన్నుమూశారు. 1980ల్లో అగ్ర నిర్మాతల్లో ఒకరైన ఆయన గాంధీమతి పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించారు. అనారోగ్యంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న మలయాళ సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. మలయాళంలో 'సుఖమో దేవి', 'పంచవడి పాలం' 'తూవనతుంబికల్', మూన్నం పక్కం, నంబరతి పూవు, సుఖమో దేవి, ఇదిరి నేరమ్ ఒతిరి కార్యం వంటి హిట్ చిత్రాలు నిర్మించారు. బాలన్ కేవలం ఇరవై ఏళ్ళ వయసులో నిర్మాతగా మలయాళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించాడు. మలయాళంలో నిర్మాతగా దాదాపు 33 చిత్రాలు నిర్మించారు. కొన్నేళ్ల క్రితం బాలన్ తన కుమార్తెతో కలిసి సైబర్-ఫోరెన్సిక్ స్టార్టప్ కంపెనీని ప్రారంభించారు. -
జానకిగా వచ్చేస్తున్న 'అనుపమ పరమేశ్వరన్'
'టిల్లు స్క్వేర్'తో హిట్ కొట్టిన అనుపమ పరమేశ్వరన్ నుంచి మరో కొత్త సినిమా రానుంది. మలయాళం సినిమా 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' పేరుతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కోర్ట్ రూమ్ డ్రామాగా రూపొందుతోన్న ఈ మూవీ ద్వారా దాదాపు రెండేళ్ల విరామం అనంతరం మలయాళంలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నది అనుపమ పరమేశ్వరన్. ‘టిల్లు స్క్వేర్’లో గ్లామర్ పాత్రలో అదరగొట్టిన అనుపమ ఇప్పుడు కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే పాత్రలో కనిపించనుంది. ఇందులో జానకిగా అనుపమ ప్రేక్షకుల ముందుకు రానుంది. లాయర్‌గా మలయాళ సీనియర్ నటుడు సురేశ్ గోపి నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పనులు పూర్తి చేసుకున్న అనుపమ దర్శకుడితో ఉన్న ఫొటోను తాజాగా తన ఇన్‌స్టాలో పంచుకుంది. 'నా తదుపరి చిత్రానికి డబ్బింగ్ పూర్తైంది' అంటూ అందులో రాసుకొచ్చింది. కేరళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయం కోసం పోరాడే జానకి అనే యువతిగా అనుపమ పరమేశ్వరన్ కనిపించనుండగా.. ఆమె తరఫున కేసును వాదించే లాయర్ పాత్రలో సురేష్ గోపి నటిస్తున్నాడు. మలయాళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాతో సురేష్ గోపి కుమారుడు మాధవ్ సురేష్ ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
సింగర్ సుజాత మోహన్ బర్త్‌డే స్పెషల్ ఫోటోలు
-
మరో క్రేజీ ప్రాజెక్ట్ ప్రకటించిన సూపర్ హిట్ డైరెక్టర్!
అంజలి మీనన్ మహిళా దర్శకురాలిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. గతంలో బెంగళూరు డేస్, మంచాడి గురు, ఉస్తాద్ హోటల్ వంటి వైవిధ్య భరిత కథా చిత్రాలను తెరకెక్కించారు. ఇటీవలే ఆమె దర్శకత్వం వహించిన వండర్ ఉమెన్ చిత్రం విడుదలై విమర్శకుల ప్రశంసలను అందుకుంది. తాజాగా అంజలి మీనన్ మరో చిత్రానికి సిద్ధమవుతున్నారు. ఈసారి తమిళ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. కేఆర్జీ సంస్థ ఈ మూవీని నిర్మించనుంది. ఈ సంస్థ తొలిసారిగా తమిళంలో చిత్ర నిర్మాణాన్ని ప్రారంభించింది. అంజలిమీనన్ సహా ప్రతిభావంతులైన పలువురు నవ దర్శకులను ప్రోత్సహించే విధంగా తమ సంస్థ పనిచేస్తుందని తెలిపింది. మంచి కథ అందించడమే లక్ష్యంగా తమ సంస్థ పనిచేస్తుందని మేకర్స్ పేర్కొన్నారు. ఆలోచింప జేసే కథ, కథనాలతో పాటు ప్రేక్షకులకు మంచి ఎంటర్టెయిన్మెంట్ ఇచ్చే కథా చిత్రాలను అందిస్తామని చెప్పారు. దర్శకురాలు అంజలిమీనన్ మట్లాడుతూ ప్రేక్షకులకు ఆసక్తిని కలిగించే మన సంస్కృతికి అద్దం పట్టే విధంగా ప్రపంచ స్థాయి కథా చిత్రాలను రూపొందిస్తామని చెప్పారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. Happy to share news about the next film and our exciting association with @KRG_Studios @Karthik1423 @vjsub @yogigraj It’s a first step for me with தமிழ் and with all the blessings, I hope we can bring together a memorable movie. 🙏❤️ https://t.co/rkfsUzleeM — Anjali Menon (@AnjaliMenonFilm) February 20, 2024 -
తెలుగులోనూ బ్లాక్ అండ్ వైట్ హారర్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే?
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన తాజా చిత్రం భ్రమయుగం. మలయాళంలో తెరకెక్కించిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీని రాహుల్ సదాశివన్ దర్శకత్వం తెరకెక్కించారు. సరికొత్త పీరియాడిక్ హారర్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. మలయాళంలో సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. బ్లాక్ అండ్ వైట్‌లో రూపొందించిన ఈ మూవీపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. దీంతో తెలుగు వర్షన్ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీని తెలుగులోనూ రిలీజ్‌కు అంతా సిద్ధమైంది. ఫిబ్రవరి 23న సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన తెలుగులో టీజర్, ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో తెలుగు వర్షన్ విడుదల కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీని త్వరలోనే కన్నడ, తమిళ, హిందీ భాషల్లోను విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ చిత్రంలో అర్జున్ అశోకన్, సిద్దార్థ్, భరతన్, అమల్దా లిజ్ నటించారు. ఈ చిత్రానికి క్రిస్టో జేవియర్ సంగీతం అందించారు. -
మెగా డాటర్ రీ ఎంట్రీ.. షూటింగ్ ప్రారంభం!
మలయాళ హీరో షాన్ నిగమ్, కలైయరసన్, నిహారిక, ఐశ్వర్య దత్తా ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న తాజా చిత్రం మెడ్రాస్ కారన్. చాలా ఏళ్ల తర్వాత మెగా డాటర్ నిహారిక ఈ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రానికి వాలిమోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర షూటింగ్ పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ నిహారిక కొణిదెల కూడా హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు పాన్రామ్ మాట్లాడుతూ దర్శకుడు వాలిమోహన్ దాస్ మంచి మిత్రుడు అని పేర్కొన్నారు. తాము ప్రతి చిత్ర షూటింగ్‌కు ముందు స్క్రీన్‌పై గురించి చర్చించుకుంటామని చెప్పారు. ఆయన మంచి ప్రతిభావంతుడని అన్నారు. ఈయన ఎదుగుదల తనకు చాలా ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. షాన్ నిగమ్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. నటుడు కలైయరసన్ తనకు మంచి స్నేహితుడని అన్నారు. ఈ టీమ్ కలిసి చిత్రం చేయడం సంతోషంగా ఉందన్నారు. మెడ్రాస్ కారన్ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని దర్శకుడు పొన్రామ్ అన్నారు. మెడ్రాస్ కారన్ మంచి యాక్షన్, డ్రామా కథా చిత్రంగా ఉంటుందని చిత్ర దర్శకుడు వాలిమోహన్దాస్ పే ర్కొన్నారు. చిత్ర షూటింగ్ చైన్నె, మదురై, కొచ్చి ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు దర్శకుడు చెప్పారు. -
బికినీలోనే కాదు అవసరమైతే అంటూ.. బోల్డ్ కామెంట్ చేసిన హీరోయిన్
మలయాళ నటి శ్వేతామీనన్ అందరికీ గుర్తే.. 2011లో ఘన విజయం సాధించిన శృంగార ప్రేమ కథా చిత్రం'రతి నిర్వేదం' ద్వారా ఆమె తెలుగులో కూడా పాపులారిటీ సంపాదించుకుంది. శ్వేతామీనన్ కీలక పాత్ర పోషించగా మలయాళంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులోనూ ట్రెండ్ సెట్ చేసింది. శ్రీజిత్ విజయ్ కథానాయకుడిగా టి.కె.రాజీవ్‌కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. యధార్థ సంఘటనలతో పి.పద్మరాజన్ రచించిన నవల 'రతినిర్వేదం' 1978లో సినిమాగా తెరకెక్కి సూపర్ హిట్ అయింది. అదే టైటిల్‌తో 2011లో ఆ సినిమాను శ్వేతామీనన్‌తో రీమేక్ చేశారు. శృంగార సన్నివేశాలతో నిండిపోయిన ఈ చిత్రంలో హాట్‌హాట్ అందాలతో శ్వేత అలరించింది. 1991లో మలయాళ చిత్రంలో అడుగు అడుగు పెట్టిన ఆమె గతంలో కొన్ని రొమాన్స్ సీన్స్‌తో పాటు బికినీలో కూడా కనిపించింది. ఈ అంశంపై ఆమెకు తాజాగా పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇలాంటి పాత్రలలో మళ్లీ నటిస్తారా అని ఆమెకు ప్రశ్న ఎదురైంది. అందుకు ఆమె ధీటుగానే సమాధానం ఇచ్చింది. 'నేను ఏ పాత్రలో నటిస్తున్నానో తెలుసుకున్న తర్వాతే గ్రీన్ సిగ్నల్ ఇస్తాను. సినిమాకు అవసరం అనిపిస్తే బికినీలో నటించాల్సి వచ్చినా నేను నటిస్తాను. కథాంశం కోసం అవసరమైతే మరోక అడుగు ముందుకేసి నగ్నంగా నటించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను.' అని శ్వేతా మీనన్ 50 ఏళ్ల వయసులో ధీటుగా చెప్పింది. -
విధితో ఆటలు.. భయపెడుతున్న మమ్మట్టి 'భ్రమయుగం' తెలుగు ట్రైలర్
మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న మలయాళ చిత్రం 'భ్రమయుగం'. రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహిస్తున్నారు. చక్రవర్తి రామచంద్ర, ఎస్. శశికాంత్ నిర్మిస్తున్న ఈ సినిమా థియేటర్స్‌కి వచ్చే రోజు ఖరారైంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తెలుగు టీజర్‌తో పాటు ట్రైలర్‌ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. భిన్నమైన హారర్ థ్రిల్లర్ కథతో రూపొందిన ఈ చిత్రంలో అర్జున్ అశోకన్, సిద్దార్థ్, భరతన్, అమల్దా లిజ్ నటించారు. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఫిబ్రవరి 15న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ‘‘హారర్–థ్రిల్లర్ జానర్లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రమిది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరామెన్‌గా షెహనాద్ జలాల్ ఉంటే సంగీతం క్రిస్టో జేవియర్ అందించారు. సౌత్ ఇండియాలో విభిన్నమైన నటుడిగా మమ్ముట్టికి ప్రత్యేకమైన స్థానం ఉంది. అందుకే ఆయనకు గతంలో జాతీయ అవార్డు కూడా దక్కింది. యాత్ర, యాత్ర-2 చిత్రాలతో ఆయన తెలుగువారికి మరింత చేరువయ్యారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి గారి పాత్రలో మమ్ముట్టి అద్భుతంగా ఒదిగిపోయారని ఆయన్ను తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు అభినందిస్తున్నారు. -
భర్త చేతిలో మోసపోయిన బిగ్‌బాస్ కంటెస్టెంట్.. చివరికీ!
మలయాళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో ఆర్య ఒకరు. బుల్లితెర నటిగా కెరీర్ ప్రారంభించిన ఆమె మలయాళంలో చాలా సినిమాల్లో నటించింది. అంతే కాకుండా మలయాళ బిగ్‌బాస్ సీజన్-2లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. వీటితో పాటు బడాయి బంగ్లా, స్టార్ మ్యూజిక్ లాంటి రియాలిటీ షోలలో కనిపించింది. అయితే తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తన జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు, ముఖ్యంగా తన భర్త రాహుల్ సుశీలన్తో విడిపోవడానికి గల కారణాలను వెల్లడించింది. ఐదేళ్ల తర్వాత తొలిసారి తన విడాకులపై స్పందించింది. బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఆర్య మాట్లాడుతూ.. 'ఇప్పుడు నేను దాని గురించి ఆలోచిస్తున్నా. వదిలించుకోవడానికే అతను నన్ను బిగ్ బాస్‌కి పంపాడా అనే అనుమానం ఉంది. ముఖ్యంగా షోలో వెళ్లడానికి నాకు మద్దతు ఇచ్చిన వ్యక్తి. నాకు ఓ కుమార్తె ఉంది. మా నాన్న చనిపోయి చాలా కాలం కూడా కాలేదు. బిగ్‌బాస్ వెళ్లమని ఆయనే నాకు సపోర్టు చేసి మరీ ఎయిర్‌పోర్టులో దింపారు. నాకు అక్కడ బిగ్‌బాస్‌లో ఉన్నన్ని రోజులు ఎవరితోనూ పరిచయం లేదు. నేను హౌస్ నుంచి వచ్చేలోగా నాకు దూరం కావాలనేది అతని ప్లాన్ అని తెలీదు. కానీ ఇది ఒక అవకాశం అని నేను భావిస్తున్నా' అని తెలిపింది. కొవిడ్ వల్ల నేను బిగ్ బాస్ నుంచి తిరిగి వచ్చి నా భర్తకు చాలాసార్లు కాల్ చేశా. కానీ లిఫ్ట్ చేయలేదు. దీంతో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. నాకు తెలిసిన ఏకైక నంబర్ అతనిదే. అతను ఫోన్ తీయకపోవడంతో.. నేను అతని సోదరికి ఫోన్ చేశా. ఆమె జరిగిన విషయమంతా నాకు చెప్పింది. అతని మరో మహిళ వివాహేతర సంబంధంలో ఉన్నాడని నాకు అప్పుడే తెలిసింది. దీంతో అతన్ని కాల్చి చంపాలన్నా కోపం వచ్చింది. కానీ ఇప్పుడైతే అలాంటి కోపం లేదు. కానీ అతనికి ఏదైనా చెడు జరిగిందని తెలిస్తే మాత్రం సంతోషిస్తా.' అంటూ తన కోపాన్ని బయటపెట్టింది. ఆ సమయంలో అతను దుబాయ్‌లో ఉన్నందున.. కొవిడ్ వల్ల అతన్ని కలిసేందుకు వీలు కాలేదని ఆర్య తెలిపింది. కాగా.. ఆర్య చివరిగా మలయాళ కామెడీ చిత్రం క్వీన్ ఎలిజబెత్‌లో నటించారు. ఈ చిత్రాన్ని ఎం పద్మకుమార్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో శ్వేతా మీనన్, నరేన్, జానీ ఆంటోనీ, మీరా జాస్మిన్, నీనా కురుప్ ప్రముఖ పాత్రలు పోషించారు. View this post on Instagram A post shared by Arya Babu (@arya.badai) -
హారర్ థ్రిల్లర్ కథతో 'భ్రమయుగం'.. టీజర్‌తో మెప్పించిన స్టార్ హీరో
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్న తాజా చిత్రం 'భ్రమయుగం'.. డైరెక్టర్ రాహుల్ సదాశివన్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిస్తున్నాడు. మమ్ముట్టి ఇటీవల నటించిన ప్రయోగాత్మక సినిమా 'కాదల్: ది కోర్'తో మెప్పించాడు. ఇందులో మమ్ముట్టి స్వలింగ సంపర్కుడి(గే)గా కనిపిస్తాడు. ఇలా విభన్నమైన అంశాలతో సినిమాలు తీసి సూపర్ హిట్లు కొడుతున్న ఆయన త్వరలో 'భ్రమయుగం' చిత్రం ద్వారా తెరపైకి రానున్నాడు. తాజాగా విడుదలైన భ్రమయుగం టీజర్ పూర్తిగా బ్లాక్ అండ్ వైట్‌లో ఉంది. ఈ సినిమా నుంచి వచ్చిన మొదటి పోస్టర్‌తో పాటు అన్నీ అంశాలు చాలా ప్రత్యేకంగానే ఉన్నాయి. భిన్నమైన హారర్ థ్రిల్లర్ కథతో రూపొందిన ఈ చిత్రంలో అర్జున్ అశోకన్, సిద్దార్థ్, భరతన్, అమల్దా లిజ్ నటించారు. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఇదే ఏడాదిలో ఈ సినిమా విడుదల కానుంది. కానీ ప్రస్తుతం మాత్రం మలయాళ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. -
బిగ్ బాస్ జంట విడాకులు.. వీడియో రిలీజ్ చేసిన నటి!
మలయాళ బిగ్ బాస్ మూడో సీజన్లో ఫేమ్ తెచ్చుకున్న జంట ఫిరోజ్ ఖాన్, సజ్నా ఫిరోజ్. ప్రస్తుతం ఈ జంట విడాకులు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. విడిపోవడానికి కేవలం తన వ్యక్తిగత కారణాలేనని సజ్నా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ విషయాన్ని తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా తెలిపింది. విడాకుల గురించి తెలిసి.. తన అభిమానులు తన పట్ల పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించింది. (ఇది చదవండి: యానిమల్ సక్సెస్.. క్రేజీ ట్యాగ్ కోల్పోయిన రష్మిక!) సజ్నా వీడియోలో మాట్లాడుతూ..'ఈ విషయం చెప్పాలంటే నాకు చాలా బాధగా ఉంది. మాతో సన్నిహితులు కూడా ఇది ఊహించి ఉండరు. కానీ ఫిరోజ్, నేను విడాకులకు సిద్ధమవుతున్నాం. ఈ విషయాన్ని పరస్పరం అంగీకరించాం. అయితే ఇది పూర్తిగా మా వ్యక్తిగత నిర్ణయమే. ఈ విషయం తెలిసిన కొందరు నాతో అనుచితంగా ప్రవర్తించారు. నా తమ్ముడిగా భావించే వ్యక్తి నుంచే చేదు అనుభవం ఎదురైంది' అని తెలిపింది. అయితే విడిపోయినప్పటికీ మా పిల్లల కోసం మాట్లాడతామని పేర్కొంది. ప్రస్తుతం పిల్లలు మా అమ్మ వద్ద ఉన్నారని.. మేం విడిపోయామన్న విషయం వారికి తెలియదని చెప్పుకొచ్చింది. విడిపోయిన తర్వాత వచ్చిన మార్పులను సజ్నా వివరించింది. ప్రస్తుతం నా జీవితంలో ఒంటరిగా ప్రయాణిస్తున్నానని సజ్నా తెలిపింది. అయితే ఒకసారి నేను విడాకుల కోసం దాఖలు చేసిన తర్వాత దుబాయ్‌లో ఓ ఈవెంట్‌కి వెళ్లానని వెల్లడించింది. అక్కడ ఉన్న నా కుటుంబానికి చెందిన సోదరుడి లాంటి వ్యక్తి నాతో చెడుగా ప్రవర్తించాడని చెప్పింది. వాడు నా వీపు మీద చెయ్యి వేసి అసభ్యంగా వ్యవహరించాడు. అతనికి చెడు ఉద్దేశాలు ఉంటే నేను అర్థం చేసుకోలేకపోయానని.. దీంతో ఏడుస్తూ కూర్చున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. ఫిరోజ్, సజ్నాలకు ఇది రెండో వివాహం కాగా.. ఈ జంట మలయాళంలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌గా అడుగుపెట్టారు. ఈ జంట షో మధ్యలోనే ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం సజ్నా టీవీ సీరియల్స్‌లో యాక్టివ్‌గా ఉంది. (ఇది చదవండి: ఈ విషయం చెప్పేందుకు సిగ్గుతో తలదించుకుంటున్నా: విశాల్) View this post on Instagram A post shared by SAJNANOOR (@itssajnanoor) View this post on Instagram A post shared by SAJNANOOR (@itssajnanoor) -
ఆ టైంలో కూడా గుండె సమస్యలు వస్తాయా?
మలయాళ బుల్లి తెర నటి డాక్టర్ ప్రియా గుండెపోటుతో కుప్పకూలి చనిపోయిన సంగతి తెలిసింది. నిండు గర్భిణి అయిన ఆమె సాధారణ చెకప్ కోసం ఆస్పత్రికి వచ్చినప్పుడే ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. దీంతో వైద్యులు ఆపరేషన్ చేసి ఆమె కడుపులో ఉన్న శిశువుని బయటకు తీసి ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. నెలల నిండక మునుపే పుట్టడంతో వైద్యులు ఆ చిన్నారిని అబ్జర్వేషన్లో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. గర్భంతో ఉన్నప్పుడు మహిళలకు గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయా? ఎందువల్ల ఇలా జరుగుతుంది తదితరాల గురించే ఈ కథనం!. అధిక రక్తపోటు, ధూమపానం తదితరాలే గుండె జబ్బులకు ప్రధాన ప్రమాద కారకాలు. కానీ నిపుణల అభిప్రాయం ప్రకారం గుండె సంబంధ సమస్యలకు మరో ప్రధాన కారకం ఉంది. అదే గర్భధారణ సమయంలో వచ్చే ప్రీక్లాంప్సియా. ఈ ప్రీక్లాంప్సియా అనేది ప్రమాదకరమైన తీవ్ర రక్తపోటు పరిస్థితి. ఇది మహిళలకు గర్భం దాల్చిన 20 వారం నుంచి మొదలవుతుంది. ఈ ప్రీక్లాంప్సియా చరిత్ర ఉన్న స్త్రీలు గుండెపోటు లేదా స్ట్రోక్‌తో చనిపోయే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. గర్భస్రావమైన లేదా నెలలు నిండకుండానే ప్రసవించిన మహిళలకు ఈ ప్రమాదం మరింత ఎక్కువుగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే డెలివరీలలో 8% వరకు క్లిష్టతరం కావడానికి ప్రధానం కారణం ఈ ప్రీక్లాంప్సియానే అని వైద్యలు చెబుతున్నారు. యూఎస్‌లో 15% అకాల ప్రసవాలకు ఈ పరిస్థితి వల్లేనని తెలిపారు వైద్యులు. ప్రీక్లాంప్సియా లక్షణాలు ఎలా ఉంటాయంటే.. తలనొప్పి మబ్బు మబ్బుగా కనిపించడం కంటిలో నల్లటి మచ్చలు కడుపులో కుడివైపు నొప్పి చేతులు, ముఖం వాచి ఉండటం ఊపిరి ఆడకపోవడం గర్భధారణ సమయంలో గుండె పదిలంగా ఉండాలంటే.. రక్తపోటును క్రమం తప్పకుండా చెక్ చేయించుకోవాలి ఆరోగ్యకరమైన, కాలానుగుణ ఆహారాన్ని తినడం వ్యాయామం చేయడం. ఇందులో మోస్తరు నుండి అధిక-తీవ్రత వర్కౌట్లు లేదా యోగా ఉంటాయి అధిక బరువు పెరగకుండా ఉండండి ఒత్తిడికి దూరంగా ఉండండి శరీరంలో సరైన రక్త ప్రసరణ ఉండేలా చూసుకోవడం తదితరాలను పాటిస్తే గర్భధారణ సమస్యలో ఈ గుండె సంబంధిత సమస్యల ఎదురవ్వవు. (చదవండి: తక్కువ వ్యాయామమే మంచి ఫలితాలిస్తుంది!పరిశోధనల్లో షాకింగ్ విషయాలు) -
ఇస్రో చైర్మన్ ఆత్మకథ
తిరువనంతపురం: ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ ఆత్మకథ రాశారు. ‘నిలవు కుడిచ సింహగల్ (వెన్నెల గ్రోలిన సింహాలు)’ పేరిట మలయాళంలో రాసిన ఈ ఆత్మకథ త్వరలో రానుంది. యువతరానికి తన జీవితం స్ఫూర్తిగా నిలవాలనే ఈ ఆత్మకథ రాసినట్లు ఆయన వెల్లడించారు. అత్యంత నిరుపేద గ్రామీణ కుటుంబంలో పుట్టిన ఆయన ఇస్రో చైర్మన్ స్థాయికి ఎదిగిన తీరు, ఆ క్రమంలో ఎదురైన కష్టాలను ఆయన ఇందులో హృద్యంగా వివరించారు. చంద్రయాన్ మిషన్ విజయం తనను ఆత్మకథ రచనకు పురిగొల్పిందని చెప్పారాయన. ఇంజనీరింగ్ కాలేజీకి పాత డొక్కు సైకిల్ మీద వెళ్లిన వైనం తదితరాలను పుస్తకంలో పొందుపరిచారు. -
మీడియా దిగ్గజం, ప్రముఖ నిర్మాత పీవీజీ కన్నుమూత
ప్రముఖ మలయాళ సినీ నిర్మాత, మీడియా దిగ్గజం, వ్యాపారవేత్త KTC గ్రూప్ ఆఫ్ కంపెనీల వ్యవస్థాపకుడు పీవీ గంగాధరన్ (80) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో కేరళలోని కోజికోడ్‌లోని ఆసుపత్రిలో గత వారం రోజులుగా చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మరణించారు. కోజికోడ్‌లోని ఆయన ఇంటి వద్ద ప్రజలకు అంతిమ నివాళులు అర్పించేందుకు గంగాధరన్ భౌతికకాయాన్ని KTC గ్రూప్ కార్యాలయంలో, ఆ తరువాత టౌన్ హాల్లో ఉంచుతారు. రేపు (శనివారం అక్టోబర్ 14న) ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఐదు దశాబ్దాలకు పైగా సినీ రంగానికి విశేష సేవలందించిన గంగాధరన్ అస్తమయంపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు సినీ నటులు, ఇతర ప్రముఖులు సంతాపం ప్రకటించారు. పీవీ గంగాధరన్ మలయాళ మీడియా సంస్థ మాతృభూమికి హోల్ టైమ్ డైరెక్టర్‌గా ఉన్నారు. గృహలక్ష్మి ఫిలింస్ బ్యానర్‌పై పలు పాపులర్, అవార్డు విన్నింగ్ చిత్రాలను నిర్మించారు. 1977లో సుజాతతో ప్రారంభించి, మలయాళంలో 22 చిత్రాలను నిర్మించారు. 'మనసా వాచా కర్మణా,' 'అంగడి,' 'అహింస,' 'చిరియో చిరి,' 'కట్టాతే కిలిక్కూడు,' 'వార్త,' 'ఒరు వడక్కన్ వీరగాథ,' 'అధ్వాత్యం,' లాంటివి వున్నాయి. ఎక్కువ భాగం విమర్శకుల ప్రశంసలతోపాటు ప్రజాదరణ పొందాయి. ఆయన చివరి చిత్రం జానకి జానే, తన కుమార్తెల నిర్మాణ సంస్థ SCube ఫిల్మ్స్‌తో కలిసి దీన్ని నిర్మించారు. యాసిడ్ దాడి నుండి బయటపడినవారిపై పార్వతి నటించిన ఉయారే చిత్రాన్నికూడా పీవీజీనే నిర్మించడం విశేషం. Saddened by the demise of Shri P.V Gangadharan ji, a pioneer among Malayalam filmmakers. In a career spanning more than 5 decades he was honoured with multiple national and state awards, which stand as a testimony to his outstanding contribution to filmmaking. His works will… pic.twitter.com/m1UL3U0sEL — Anurag Thakur (@ianuragthakur) October 13, 2023 > పీవీజీ అని పిలుచుకునే గంగాధరన్ సినీ, రాజకీయ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా కూడా ఉన్నారు. జాతీయ , రాష్ట్ర చలనచిత్ర అవార్డులతో పాటు, వర్త, తూవల్ కొట్టారం వంటి చిత్రాలకు ఫిల్మ్‌ఫేర్ నుండి ప్రశంసలు అందుకున్నారు. కనక్కినవ్ మూవీ 1997లో జాతీయ సమగ్రతపై ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌గా ప్రతిష్టాత్మక నర్గీస్ దత్ అవార్డును అందుకుంది.. 2000లో 'సంతాం' చిత్రానికి ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు లభించింది. వీండుం చిల వీట్టుకార్యంగల్, అచ్చువింటే అమ్మ, నోట్‌బుక్ కూడా రాష్ట్ర చలనచిత్ర అవార్డులను అందుకున్నాయి. 2009లో ఆసియానెట్ నుండి లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును వీపీజీ గెలుచుకున్నారు. కాగా 1943లో మాధవి సామి , పీవీ సామి దంపతులకు జన్మించిన గంగాధరన్‌కు భార్య షెరిన్ , ముగ్గురు కుమార్తెలు షెనుగ, షెగ్నా, షెర్గా ఉన్నారు. వీరు 2016లో SCubeని ప్రారంభించారు. Over the years I have only had people and family members rejecting my talents. PVG Sir is the only person who took me under his wings and supported my talents and accepted my skills. He is the reason I am connected to the Malayalam movie industry. RIP#obligation #gratitude pic.twitter.com/yB2tasXApq — Devas Chronicles (@Devas_Group) October 13, 2023 -
మూడు దశాబ్దాల పాటు సినిమాలు.. ఇప్పుడేమో అత్యంత దీన స్థితిలో !
ఒకప్పుడు తన సినిమాలతో అభిమానులను అలరించిన నటి కనకలత. ఆమె సినిమాలతో పాటు సీరియల్స్‌లోనూ తనదైన నటనతో మెప్పించింది. మలయాళ చిత్రాలైన ప్రియం, అధ్యతే కన్మణి చిత్రాలతో ఆమెకు గుర్తింపు లభించింది. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా మలయాళం, తమిళంలో ఇండస్ట్రీలో కొనసాగారు. (ఇది చదవండి: యాత్ర 2.. ఫస్ట్ లుక్ పోస్టర్ అవుట్.. ఒక్కటి గుర్తుపెట్టుకోండి!) అయితే ప్రస్తుతం కనకలత పరిస్థితి అత్యంత దయనీయ స్థితిలో ఉంది. ఆమెకు అల్జీమర్స్‌తో పాటు పార్కిన్సన్స్ వ్యాధి సోకింది. తాజాగా కనకలత అనారోగ్యం గురించి ఆమె సోదరి విజయమ్మ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆగస్టు 2021లో ఆమె అనారోగ్యం బారిన పడినట్లు తెలిపింది. ప్రస్తుతం రోజుల తరబడి ఐసీయూలోనే చికిత్స పొందుతున్నారని పేర్కొంది. ప్రస్తుతం ఆమె ఆహారం తీసుకునే పరిస్థితిలోనే లేరని సోదరి చెబుతోంది. కేవలం లిక్విడ్ ఫుడ్తోనే కాలం వెళ్లదీస్తున్నట్లు తెలిపింది. ఆమె తన రోజువారీ కాలకృత్యాలు సైతం మరచిపోతోందని.. డైపర్లు ఉపయోగించాల్సి వస్తోందని వివరించింది. తన పేరు కూడా గుర్తు లేదని ఆమె సోదరి వాపోయింది. ప్రస్తుతం విజయమ్మ, ఆమె మేనల్లుడు కనకలత వద్దే ఉంటున్నారు. కాగా.. 22 ఏళ్లకే పెళ్లి చేసుకున్న నటి 16 ఏళ్ల తర్వాత భర్త నుంచి విడిపోయింది. అయితే ఆమెకు ఎలాంటి సంతానం కలగలేదు. (ఇది చదవండి: షారుక్ ఖాన్‌కు బెదిరింపులు.. మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు!) ప్రస్తుతం ఆమెకు అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ) నుంచి నెలకు రూ. 5000 అందుతోంది. ఆమెకు సంస్థ బీమా కూడా ఉంది. ఆమె అసోసియేషన్ ఆఫ్ టెలివిజన్ మీడియా ఆర్టిస్ట్స్ (ATMA), ఫిల్మ్ అకాడమీ ద్వారా ఆర్థిక సహాయం కూడా అందుకుంటోంది. కనకలత తన కెరీర్లో 360కి పైగా సినిమాల్లో నటించారు. ఆమె చివరిసారిగా పూక్కలం అనే చిత్రంలో కనిపించింది. నాటకాల ద్వారా తన సినీ జీవితాన్ని ప్రారంభించింది -
ఆ ఫోటోలోని క్యూట్ బేబీ టాలీవుడ్లో స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా?
బాల్యంలోనే సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి.. నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంది. సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ నటించింది. టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఆమె వరుస సినిమాలతో అదరగొట్టింది. ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. పై ఫోటోలో తన తండ్రి చేతిలో క్యూట్‌గా కనిపిస్తోన్న ఆ చిన్నారి తెలుగులో స్టార్ హీరోయిన్. ఇంతకీ ఎవరో మీరు గుర్తు పట్టారా? (ఇది చదవండి: డబ్బుల కోసం పెళ్లి చేసుకుంటే ఇలానే ఉంటుంది: కంగనా కౌంటర్) ఆ ఫోటోలోని క్యూట్ చిన్నారి ఎవరంటే.. మలయాళీ ముద్దుగుమ్మ నివేదా థామస్. నేచురల్ స్టార్ నాని జెంటిల్మెన్ మూవీతో హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భామ.. ఆ తర్వాత నిన్నుకోరి, జై లవ కుశ, 118, బ్రోచేవారెవరురా, వి, జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్, వకీల్ సాబ్ చిత్రాల్లో నటించింది. అంతేకాకుండా శాకిని డాకిని లాంటి లేడీ ఓరియంటెడ్ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించింది. అంతకుముందే ఓరుతే వేరు భార్య చిత్రంలో మలయాళ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి.. తమిళంలోనూ చాలా సినిమాల్లో నటించింది. (ఇది చదవండి: అవతార్-2ను మించిన టికెట్ ధరలు.. ఆ సినిమాకు ఎందుకంత క్రేజ్!) కాగా.. ఈ ఏడాది ‘ఎంతడా సాజి’ అనే మలయాళ మూవీలో కనిపించిన భామ.. ప్రస్తుతం ఎలాంటి సినిమాలో నటించడం లేదు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) -
'సైతాన్' వెబ్ సిరీస్.. ఆ బోల్డ్ సీన్స్ చేసిన నటి ఎవరో తెలుసా?
ఇటీవలే మహీ వీ రాఘవ దర్శకత్వంలో వచ్చిన వెబ్ సరీస్ సైతాన్. అయితే ఈ సిరీస్‌లో అంతా బోల్డ్ కంటెంట్‌తో సరికొత్త సంచలనం సృష్టించింది. గతంలో బోల్డ్ కంటెంట్ అనగానే చాలామందికి 'మీర్జాపుర్' గుర్తొస్తుందేమో. కానీ ఇప్పుడు దాన్ని తలదన్నే రీతిలో 'సైతాన్' తెరకెక్కించారు. ఎందుకంటే ఈ సిరీస్ లో బూతులు, అడల్ట్ సీన్స్ లెక్కకు మించి ఉన్నప్పటికీ.. ఎమోషన్ కూడా అదే స్థాయిలో వర్కౌట్ అయింది. దీంతో సిరీస్ సూపర్ హిట్ అయింది. అయితే ఈ సిరీస్‌లో బోల్డ్ సీన్లలో నటించిన నటి ఎవరో తెలుసా? ఇంతకు ముందు ఆమె ఎన్ని సినిమాలు చేసింది? అసలు ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటనే దానిపై ఇప్పుడు నెట్టింట చర్చ నడుస్తోంది. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం పదండి. (ఇది చదవండి: 'సైతాన్' దర్శకుడి వెంటపడుతున్న ఓటీటీలు!) మహీ వి రాఘవ వెబ్ సిరీస్ సైతాన్లో హీరో తల్లిగా సావిత్రి పాత్రలో నటించింది. ఆమె అసలు పేరు షెల్లీ నబుకుమార్ అలియాస్ షెల్లీ కిశోర్. ఆమె 1983 ఆగస్టు 18న దుబాయ్‌లో జన్మించింది. మలయాళంలో సీరియల్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. ఆమె కుంకుమపువ్వు సీరియల్‌తో ఫేమ్ తెచ్చుకుంది. మిన్నల్ మురళి, తంగ మీన్కల్ లాంటి మలయాళ చిత్రాల్లోనూ నటించింది. ఆమెకు 2006లో ఉత్తమ నటిగా అవార్డును కూడా అందుకుంది. ఇటీవల తెలుగులో వచ్చిన వెబ్ సిరీస్ సైతాన్లో ఆమె నటించింది. ఇందులో ముగ్గురు పిల్లలకు తల్లిగా ఆమె నటించింది. ఈ సిరీస్‌లో ఆమె నటన మరింత బోల్డ్‌గా కనిపించడంతో ఫ్యాన్స్ ఆమె గురించి ఆరా తీస్తున్నారు. ఈ సిరీస్‌తో ఒక్కసారిగా తెలుగులోనూ పాపులర్ అయిన షెల్లీ కిశోర్ ప్రస్తుతం మలయాళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. (ఇది చదవండి: అక్కడ ప్లేట్స్ కడిగిన స్టార్ హీరోయిన్.. కారణం అదే!) View this post on Instagram A post shared by Shelly.n.kumar (@shelly.n.kumar) -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత!
సినీ ఇండస్ట్రీలో ఇటీవల వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మలయాళ నటుడు, కమెడియన్ మముక్కోయ(77) కన్నుమూశారు. కేరళలోని కోజికోడ్‌లో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సోమవారం రాత్రి మలప్పురం జిల్లాలోని ఫుట్‌బాల్ టోర్నమెంట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత ఆయనను ఆసుపత్రికి తరలించగా కోలుకోలేక ఇవాళ మృతి చెందారు. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ శ్రీధర్ పిళ్లై ట్వీట్ చేశారు. (ఇది చదవండి: సమంత డై హార్డ్ ఫ్యాన్.. ఏకంగా ఇంట్లోనే గుడి కట్టేస్తున్నాడు!) మలయాళ చిత్రసీమలో అత్యుత్తమ హాస్య నటులలో ఒకరిగా పేరు మాముక్కోయ సంపాదించారు. 1979లో థియేటర్లో తన నటనా వృత్తిని ప్రారంభించిన ఆయన 450కి పైగా మలయాళ చిత్రాలలో నటించారు. మాముకోయ నటనకు రెండు రాష్ట్ర అవార్డులను కూడా గెలుచుకున్నారు. ఆయన ఎక్కువగా కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో నటించారు. తెలుగులో డబ్ అయిన దుల్కర్ సల్మాన్ నటించిన జనతా హోటల్, మోహన్ లాల్ నటించిన కనుపాప చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. #Mamukkoya (77), one of the finest comedy actors ever in Malayalam cinema passed away. Who can forget this Kozhikode man, the epicentre of laughter in so many films?#RIP pic.twitter.com/jrHlmXpv1m — Sreedhar Pillai (@sri50) April 26, 2023 -
ఎడారి బతుకును తెరపై చూపే చిత్రం.. ట్రైలర్ చూశారా?
జాతీయ అవార్డ్ గ్రహీత బ్లెస్సీ దర్శకత్వంలో పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం 'ఆడు జీవితం'. ఈ సినిమాలో పృథ్విరాజ్ సుకుమారన్ హీరోగా నటించారు. మలయాళంలో ఈ పాన్ ఇండియా మూవీ తెరకెక్కించారు.ఈ చిత్రాన్ని ఇంగ్లీష్‌లో గోట్ లైఫ్ అనే పేరుతో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ చూస్తే మారుమూల గ్రామం నుంచి అరబ్ దేశానికి వెళ్లి ఇబ్బందులు పడే ఓ యువకుడి కష్టాలను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. బానిస బతుకు అనుభవిస్తున్న వలస కూలీగా పృథ్విరాజ్ జీవించాడు. చిరంజీవి నటించిన ‘సైరా’లో ఓ పాత్ర కోసం పృథ్వీరాజ్‌ను సంప్రదించగా.. ఈ సినిమా కోసం విదేశాల్లో ఉండటంతో ఆ అవకాశాన్ని వదులుకున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో అమలాపాల్ కథానాయికగా నటిస్తోంది. జాతీయ అవార్డు గ్రహీత బ్లెస్సీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం థ్రిల్లింగ్ సర్వైవల్ అడ్వెంచర్‌గా కనిపిస్తోంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. బెన్ని డానియల్ రాసిన నవల ‘ఆడు జీవితం’ ఆధారంగానే బ్లెస్సీ ఈ సినిమాను తీర్చిదిద్దారు. -
ఓటీటీకి ‘యాంగర్ టేల్స్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ప్రస్తుతం టాలీవుడ్లో ఓటీటీ సినిమాల సందడి కనిపిస్తోంది. తాజాగా మరో వెబ్ సిరీస్ అందుబాటులోకి రానుంది. దర్శకుడు వెంకటేశ్ మహా, సుహాస్, బిందు మాధవి, మడోనా సెబాస్టియన్, రవీంద్ర విజయ్, ఫణి ఆచార్య కీలక పాత్రల్లో నటిస్తున్న వెబ్‌సిరీస్ ‘యాంగర్ టేల్స్’. ప్రభల తిలక్ దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ మార్చి 9వ తేదీ నుంచి డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. ఎన్నో ఆశలతో ఉన్న నలుగురు వారికి నచ్చని జీవితం ఎదురైతే వారి మానసిక సంఘర్షణ ఏంటి? దాని వల్ల వారి జీవితాల్లో చోటు చేసుకున్న పరిణామాలేంటి? అన్న ఆసక్తికర అంశాలతో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. నటుడు సుహాస్ ఈ సిరీస్‌ను నిర్మిస్తుండటం విశేషం. -
మరో సూపర్‌స్టార్‌తో విజయ్ సేతుపతి
ఇతర కథానాయకులకు భిన్నమైన నటుడు విజయ్ సేతుపతి. ఈయనకు హీరోగా స్టార్ డమ్ ఉన్నా దాని పక్కన పెట్టి ఇమేజ్ అనే చట్రంలో ఇరుక్కోకుండా నచ్చిన, వచ్చిన అవకాశాలను వదలుకోకుండా నటిస్తుంటారు. ప్రస్తుతం విజయ్‌సేతుపతి గాంధీ టాకీస్, మేరీ క్రిస్మస్ చిత్రాల్లో హీరోగా నటిస్తున్నారు. అలాగే మైఖేల్, విడుదలై, జవాన వంటి చిత్రాల్లో ఇతర హీరోలతో కలిసి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇకపోతే తెలుగు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రంలో కీలక పాత్రలోనూ, తమిళంలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు విలన్‌గా పేట చిత్రంలో, కమలహాసన్‌కు విలన్‌గా విక్రమ్ చిత్రంలో, విజయ్‌కు ప్రతినాయకుడిగా మాస్టర్ చిత్రంలోనూ పోటీ పడి నటించి మెప్పించారు. కాగా తాజాగా మలయాళం సూపర్‌స్టార్ మమ్ముట్టితో కలిసి నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి మణికంఠన్ దర్శకత్వం వహించనున్న విషయం తెలిసిందే. ఇందులోనూ విజయ్ సేతుపతి విలన్‌గానే కనిపిస్తారని సమాచారం. ఈ రేర్ కాంబినేషన్లో రూపొందనున్న చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
Allu Sneha Reddy: సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న అల్లు అర్జున్ భార్య?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డికి సోషల్‌మీడియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కూతురు, కొడుకుతో కలిసి బన్ని చేసే అల్లరి ఫొటోలు, వీడియోలను స్నేహా రెడ్డి తరుచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఇక ఈ మధ్య కాలంలో ఫోటోషూట్స్‌తో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది స్నేహ. హీరోయిన్‌కి ఏ మాత్రం తగ్గని అందం, గ్లామర్‌తో నెటిజన్ల మనసు దోచుకుంటున్న ఈ అల్లువారి కోడలికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ కూడా ఎక్కువే. ఈ క్రమలో సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ దక్కించుకున్న స్నేహకు రీసెంట్గా సినిమాల్లో నటించే అవకాశం వచ్చిందట. మలయాళ ఇండస్ట్రీ నుంచి ఆమెకు ఓ ఆఫర్ వచ్చినట్లు ఫిల్మీ దునియాలో టాక్ వినిపిస్తుంది. అంతేకాకుండా ఇందులో మలయాళ స్టార్ హీరో నటించనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందన్నది తెలియాల్సి ఉంది. ఒకేవళ ఆమెకు సినిమాల్లో నటించే ఇంట్రెస్ట్ ఉంటే టాలీవుడ్ కాకుండా మాలీవుడ్‌ను ఎంచుకుంటుందా అనేదానిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. చదవండి: బరువు పెరగడం ఓ సవాల్‌గా అనిపించింది: హీరోయిన్ -
గాడ్‌ఫాదర్ హిట్.. కానీ ఆ చిత్రం కంటే వెనుకంజలో ఉందా?
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్‌ఫాదర్' థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే ఈ సినిమా మలయాళంలో వచ్చిన లూసిఫర్‌కు రీమేక్‌గా వచ్చిన విషయం తెలిసిందే. దసరా కానుకగా ఈనెల 5న ప్రపంచవ్యాప్తంగా బిగ్ స్క్రీన్‌పై విడుదలైంది. మోహన్ రాజా తెరకెక్కించిన ఈ చిత్రంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రత్యేక పాత్రలో నటించారు. మొదటి వారంలోనే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. సౌత్ భాషలతో పాటు హిందీలో కూడా రిలీజైన గాడ్ ఫాదర్ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్ల విషయంలో మాత్రం కాస్త వెనకబడినట్లే కనిపించింది. మలయాళంలో విడుదలైన లూసిఫర్‌తో పోల్చితే చాలా వ్యత్యాసం కనిపించింది. (చదవండి: గాడ్‌ఫాదర్ ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే) కేవలం మలయాళంలో మాత్రమే విడుదలైన లూసిఫర్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.160 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. అయితే మెగాస్టార్ నటించిన గాడ్‌ఫాదర్ మూవీ అన్ని భాషల్లో చూసినా రూ.100 కోట్లు మాత్రమే దాటింది. అంటే లూసిఫర్‌తో పోలిస్తే కలెక్షన్ల పరంగా వెనుకంజలో ఉంది. గాడ్‌ఫాదర్ రిలీజైనప్పటి నుంచి మోహన్ లాల్ ఫ్యాన్స్ ట్రోల్స్ చేశారు. దానికి కారణం సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న మెగాస్టార్ లూసిఫర్‌లో కొన్ని సీన్లు సరిచేస్తూ గాడ్ ఫాదర్ తీశామని మాట్లాడారు. అన్నట్లు గానే ఈ చిత్రానికి హిట్ టాక్ వచ్చినా కలెక్షన్లలో మాత్రం లూసిఫర్‌ను దాటలేకపోయింది. ఈ సినిమాలో సత్యదేవ్, స్టార్ హీరోయిన్ నయనతార, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించారు. ఈ చిత్రాన్ని ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి ఎస్ఎస్ తమన్ సంగీతమందించారు. -
మాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి
మాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ప్రముఖ మలయాళ దర్శకుడు అశోకన్(60) అనారోగ్యంతో కన్నుమూశారు. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న ఆయన కోచిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణాన్ని కేరళ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ ధృవీకరించింది. ఆయన అసలు పేరు రామన్ అశోక్ కుమార్. కామెడీ చిత్రాల ద్వారా మాలీవుడ్‌లో మంచిపేరు సంపాదించారు. (చదవండి: వందల ఎకరాలు, రాజభవనం.. కృష్ణంరాజు ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా!) మలయాళంలో వచ్చిన సైకలాజికల్ డ్రామా వర్ణం సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. 1980ల్లో శశికుమార్ దగ్గర అసిస్టెంట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన అశోకన్.. అతని రెండో చిత్రం 'ఆచార్యన్' క్రేజ్ తీసుకొచ్చింది. మలయాళం కైరాలి టీవీలో ప్రసారమైన 'కనప్పురమున్' 2003లో ఉత్తమ టెలిఫిల్మ్‌గా రాష్ట్ర ప్రభుత్వ అవార్డును గెలుచుకుంది. అశోకన్ సింగపూర్‌కు మారడానికి ముందు ఇదే చివరి చిత్రం. అ తర్వాత వ్యాపారరంగంలోకి ప్రవేశించారు. ఆయనకు గల్ఫ్, కొచ్చిలో ఐటీ కంపెనీలు ఉన్నాయి. అశోకన్‌కు భార్య, కుమార్తె ఉన్నారు. -
Tamannaah Bhatia: మాలీవుడ్‌కు మిల్కీ బ్యూటీ
తమన్నా భాటియా మాలీవుడ్ ఎంట్రీ షురూ అయింది. బాలీవుడ్లో కథానాయికగా పరిచయం అయిన ఈ ఉత్తరాది భామకు అక్కడ ఆశించిన అవకాశాలు రాకపోవడంతో కోలీవుడ్‌పై దృష్టి సారించింది. ఇక్కడ కేడీ చిత్రంతో రంగప్రవేశం చేసింది. ఆ చిత్రం కూడా తమన్నాను నిరాశపరిచింది. అలాంటి సమయంలో తెలుగులో హ్యాపీడేస్ చిత్రంలో నటించే అవకాశం ఈ అమ్మడిని వరించింది. ఆ సినిమా సక్సెస్ ఆమె దశను మార్చేసింది. అదే సమయంలో తమిళ్లో సైతం కల్లూరి చిత్రం మంచి పేరును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత కన్నడ చిత్ర పరిశ్రమలోనూ ప్రవేశించింది. ఇలా నాలుగు భాషల్లో కథానాయకగా నటిస్తూ అదే సమయంలో ఐటమ్ సాంగ్లోను ఇరగదీస్తూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. 17 ఏళ్ల సినీ కెరియర్లో తమన్నా ఇన్నాళ్లకి మాలీవుడ్ రంగ ప్రవేశం చేయడానికి సిద్ధమవుతోంది. దీని గురించి ఆమె ఒక భేటీలో పేర్కొంటూ మలయాళంలో తొలిసారిగా అరుణ్ గోపి దర్శకత్వంలో దిలీప్ జంటగా నటించబోతున్నట్లు పేర్కొంది. నటనకు అవకాశం ఉన్న పాత్ర ద్వారా పరిచయం కావడం సంతోషంగా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ చిత్రం ద్వారా మలయాళ సినీ ప్రేక్షకుల అభినందనలు పొందే ప్రయత్నం చేస్తానని తమన్నా పేర్కొంది. కాగా ప్రస్తుతం తెలుగులో గుర్తుందా శీతాకాలం, చిరంజీవితో భోళాశంకర్, హిందీలో బబ్లీ బౌన్సర్ చిత్రాల్లో నటిస్తోంది. వీటితోపాటు వెబ్ సిరీస్‌లోనూ నటిస్తున్న తమన్న తాజాగా తమిళంలో రజినీకాంత్ కథానాయకుడుగా నటిస్తున్న జైలర్ చిత్రంలో కీలకపాత్రలో నటిస్తోంది.సిద్ధమవుతోంది. చదవండి: (గ్యాంగ్‌స్టర్‌గా విజయ్.. ఆమెతో ముచ్చటగా మూడోసారి?) -
ఆకట్టుకుంటున్న ‘జల్లికట్టు’
తమిళసినిమా: 2019లో విడుదలై కేరళ రాష్ట్ర ప్రభుత్వ అవార్డుతో పాటు జాతీయ అవార్డును గెలుచుకుని, ఆస్కార్ నామినేషన్ వరకు వెళ్లిన మలయాళ చిత్రం జల్లికట్టు. ఇది ఇప్పుడు కోలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తోంది. లిజో జోస్ బెల్లిసేరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆంటోని వర్గీస్, సెంపన్ వినోద్ జోస్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. గిరీష్ గంగాధరన్ చాయాగ్రహణను, దీపు జోసెఫ్ సంగీతాన్ని అందించారు. దీనిని ఏఆర్ ఎంటర్టైన్మెంట్ పతాకం ద్వారా అమిత్‌కుమార్ అగర్వాల్ తమిళంలోకి అనువదించారు. ఈ చిత్రం అమేజాన్ ప్రైమ్ టైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ఒక గేదె ఇతివృత్తంతో రూపొందించిన చిత్రం అని నిర్మాత తెలిపారు. ఒక కుగ్రామంలో కసాయిశాలకు అమ్మడానికి తీసుకొచ్చిన గేదె కట్లు తెంచుకుని పారిపోతుంది. దానిని పట్టుకోవడానికి ఆ గ్రామ ప్రజలంతా చేసే ప్రయత్నమే ఈ చిత్రం అని తెలిపారు. పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోందన్నారు. -
అవధుల్లేని కళ
గోవిందుని అరవిందన్ సినిమాల్లోకి రాకముందు కార్టూనిస్టుగా పనిచేశారు. ఆయన కార్టూన్ స్ట్రిప్ ‘చెరియ మనుష్యారుమ్ వలియ లోకవుమ్’ (చిన్న మనుషులు పెద్ద ప్రపంచం) దశాబ్దానికి పైగా మలయాళ వారపత్రిక మాతభూమిలో వచ్చింది. దీన్ని ఆధారం చేసుకొనే తన మొదటి సినిమా ‘ఉత్తరాయణం’కు(1974) శ్రీకారం చుట్టారు. అప్పటికే నాటకరంగంలో కూడా చేస్తున్న కషి ఆయన్ని చిత్రసీమలోకి అడుగుపెట్టేలా పురిగొల్పింది. స్వాతంత్య్ర సమర కాలంలో ఒక సాధారణ యువకుడి ద్వైదీ భావాలనూ, వేర్వేరు పోరాట మార్గాలనూ, కొందరు మనుషుల అవకాశవాదాన్నీ అతిసహజంగా చిత్రించిన ఈ సినిమా మలయాళ పరిశ్రమలో కొత్తగాలిలా వీచింది. అప్పుడప్పుడే మలయాళ పరిశ్రమ ఉత్తరాదిన వీస్తున్న సమాంతర సినిమా పవనాలకు పరిచయం అవుతోంది. మున్ముందు జి.అరవిందన్‌గా సుప్రసిద్ధం కాబోతున్న గోవిందుని అరవిందన్(1935–1991) తర్వాతి సినిమాగా ‘కాంచనసీత’ ప్రారంభించారు. 1977లో వచ్చిన ఈ సినిమా చూస్తే గుప్పెడు మందితో, ఏ ఆర్భాటమూ హడావుడీ లేకుండా కూడా రామాయణాన్ని తెరకెక్కించవచ్చా అన్న సంభ్రమాశ్చర్యం కలుగుతుంది. తక్కువ మాటలు, శక్తిమంతమైన ప్రతీకలు, దశ్యబలంతో ఉత్తర రామాయణాన్ని ఒక వ్యక్తిగత కవితా అభివ్యక్తిగా మలిచారు. ఇంకా దీని విశేషం ఏమిటంటే– తారలనూ, అలవాటుగా చూస్తున్న నునుపైన తెలుపు శరీరాలనూ పక్కనపెట్టి రాముడితో దగ్గరి సంబంధం ఉందని చెప్పుకొనే ‘రామచెంచు’ తెగవాళ్లతోనే ప్రధాన పాత్రలను పోషింపజేయడం! దీనివల్ల ఛాందసవాదుల నుంచి దైవదూషణ స్థాయి వ్యతిరేకతనూ ఎదుర్కొన్నారు. కానీ వెనక్కి తగ్గ లేదు. సినిమా పట్ల ఆయన దక్పథం అంత బలమైనది. అందువల్లే మలయాళంలో సమాంతర సినిమాకు దారిచూపిన మొదటి వరుస చిత్రంగా కాంచనసీత చరిత్ర కెక్కింది. ఈ సినిమా షూటింగ్ అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో జరగడంతో తెలుగువారికి కూడా దీంతో మరింత సంబంధం ఏర్పడింది. అరవిందన్ తర్వాతి సినిమా 1978లో వచ్చిన ‘థంపు’. అంటే సర్కస్ డేరా. దీన్ని బ్లాక్ అండ్ వైట్‌లో తీయాలని పూనుకోవడానికి బహుశా జీవితపు నలుపూ తెలుపుల్నీ అత్యంత గాఢంగా చూపాలని కావొచ్చు. ఒక ఊరికి సర్కస్ వాళ్లు రావడంతో మొదలై, కొన్ని రోజులు చుట్టుపక్కల వాళ్లని ఊరించి, ఊగించి, తిరిగి ఏ ఆదరణా లేని దశకు చేరుకుని కొత్త ఊరిని వెతుక్కుంటూ పోయేదాకా కథ సాగుతుంది. ఏ కళకైనా అవధులు ఉన్నాయనీ, ఆకర్షణ ఎల్లవేళలా నిలిచేది కాదనీ చాటినట్టుగా ఉంటుంది. ఒక గొప్ప కళాకారుడు మాత్రమే కళకు పరిమితులు ఉన్నాయని గుర్తించగలడు. జీవిత రంగం నుంచి అందరమూ ఎప్పుడో ఒకప్పుడు నిష్క్రమించాల్సిన వాళ్లమేనన్న కఠోర సత్యాన్ని కూడా ఇది గుర్తు చేయొచ్చు. దాదాపుగా డాక్యుమెంటరీలా సాగే ఈ సినిమా సర్కస్ చూస్తున్న ప్రతి ఒక్కరి, ప్రతి ఒక్క హావభావాలను పట్టుకుంటుంది. మనుషుల మీద ఎంతో ప్రేమ ఉన్నవాళ్లు మాత్రమే ఇలాంటి సినిమాలు తీయగలరు. ఒక మనిషి మానసికంగా కుప్పగూలే పరిస్థితులు ఎలా వస్తాయన్నది చూపిన చిత్రం ‘పోక్కు వెయిల్’(సాయంసంధ్య–1981). చాలా నెమ్మదైన కథనం. కానీ ‘తీవ్రమైన నెమ్మదితనం’ అది. అందులోంచే ఉద్వేగాన్ని ఉచ్చస్థాయికి తీసుకెళ్తారు. సినిమా అనేది గిమ్మిక్కు కాదంటారు అరవిందన్. దీనితో ఏకీభావం ఉన్నవాళ్లకు ఇది గొప్ప అనుభవాన్ని ఇవ్వగలుగుతుంది. స్త్రీ పురుష సంబంధాలూ, ఆకర్షణల్లోని సంక్లిష్టతనూ, తదుపరి పర్యవసనాలూ, పశ్చాత్తాపాలనూ ఎంతో సున్నితంగా ఆవిష్కరించిన ‘చిదంబరం’(1985) ఆయన మాస్టర్‌పీస్. మొదటి సినిమా మినహా ఈ అన్నింటికీ మున్ముందు మలయాళంలో మరో ప్రసిద్ధ దర్శకుడిగా అవతరించనున్న షాజీ ఎన్.కరుణ్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయడం గమనార్హం. 56 ఏళ్ల వయసులోనే అర్ధాంతరంగా కన్నుమూసిన అరవిందన్ ఉన్ని, కుమ్మట్టి, ఎస్తప్పన్, వస్తుహార లాంటి సినిమాలు తీయడంతోపాటు ఆరో ఓరల్, పిరవి లాంటి చిత్రాలకు సంగీత దర్శకత్వమూ వహించారు. ప్రతి సినిమాకూ ఎప్పటికప్పుడు నెరేటివ్ శైలిని మార్చుకుంటూ ప్రతిదాన్నీ ఒక కొత్త ప్రయోగంగా చేయడం ఆయన ప్రత్యేకత. ‘పాన్ ఇండియా’, ‘పాన్ వరల్డ్’ లాంటి మాటలు కేవలం వ్యాపార లెక్కలు. నిలిచిపోయే సినిమాలకు అవి కొలమానం కాకపోవచ్చు. కానీ ఇప్పుడు దేశంలో సినిమా ప్రేమికులు అత్యంత ఆసక్తి ప్రదర్శిస్తున్న సినీ పరిశ్రమ ఏదైనా ఉందంటే, అది మలయాళ చిత్రసీమే. ఒక నిబద్ధతతో వచ్చిన చిత్రాల ఒరవడిని అద్దుకున్న జీవితపు వాస్తవికతా, కథను చూడబుద్ధేసేట్టుగా చెప్పడంలో కమర్షియల్ సినిమా సాధించిన ఒక వేగపు లయా... ఈ రెండింటినీ మేళవించుకొని ఇండియా మొత్తాన్నీ తమవైపు తిప్పుకొంటోంది. దాని వెనక అరవిందన్ లాంటి వారి స్ఫూర్తి విస్మరించలేనిది. ప్రతి ఏడాదీ ప్రపంచ సినిమా జీవులు ఎంతో ఆసక్తి కనబరిచే ప్రతిష్ఠాత్మక కాన్ ఫిలిం ఫెస్టివల్ ఫ్రాన్స్‌లో ముగిసింది. మే 17 నుంచి 28 వరకు జరిగిన 2022 సంవత్సరపు ఈ ఉత్సవం మిరుమిట్లు గొలిపే తారల మధ్య ఎంతో వైభవోపేతంగా జరిగింది. భారతదేశం తరఫున క్లాసిక్ విభాగంలో అక్కడ ప్రదర్శనకు నోచుకున్న సినిమాలు రెండే రెండు. ఒకటి, సత్యజిత్ రే ‘ప్రతిద్వంది’ కాగా, రెండవది జి. అరవిందన్ ‘థంప్’. (కొత్త వెర్షన్లో థంపును థంప్‌గా మార్చారు.) రెండు నిరాడంబర సినిమాలు ఆ ఆర్భాటపు పండుగలో ప్రదర్శన జరగడం విరోధాభాసే కావొచ్చుగానీ అదే జీవితపు తమాషా కూడా! -
అందుకే.. జీవితంలో ఏం జరిగినా పెద్దగా చలించను: నటి
ఈమె పేరు.. శైలీ క్రిష్ణ్. 2011లో సంతోష్ శివన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఉరుమి’ అనే సినిమాలో చిన్న పాత్రలో మెరిసింది. కానీ పెద్ద గుర్తింపేమీ రాలేదు. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ ‘ది లాస్ట్ అవర్’ తో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది. రూపంలో శైలీ.. 1985లో నేషనల్ జాగ్రఫిక్ మ్యాగజైన్ కవర్ మీద అచ్చయిన అఫ్గానిస్తాన్ రెఫ్యూజీ అమ్మాయి ‘షర్బత్ గులా’ను పోలి ఉంది అని సినీ, వెబ్ సిరీస్ విమర్శకులు కితాబూ ఇచ్చారు. ► శైలీ తల్లిదండ్రుల స్వస్థలం అనంత్‌నాగ్. అక్కడి నుంచి జమ్మూకశ్మీర్ రెఫ్యూజీ క్యాంప్‌కి తరలి రావాల్సి వచ్చింది. ఆ రెఫ్యూజీ క్యాంప్‌లోనే శైలీ పుట్టింది. ఆమెకు ఎనిమిదేళ్లు వచ్చే వరకూ రెఫ్యూజీ క్యాంపుల్లోనే పెరిగింది. తర్వాత శైలీ తండ్రికి బ్యాంక్‌లో ఉద్యోగం రావడంతో క్యాంపుల నుంచి ఓ ఇంటికి మకాం మార్చారు. అలా అద్దం ముందు నుంచి వెండి తెర మీదకు వచ్చేసింది మలయాళం సినిమా ‘ఉరుమి’తో. ► శైలీ మోడలింగ్ చేస్తున్న సమయంలో రవి వర్మన్ అనే సినిమాటోగ్రాఫర్‌కు ఆమె నచ్చి.. ఫొటో షూట్ చేశాడు. ఆ ఫొటోలను దర్శకుడు సంతోష్ శివన్‌కు చూపించాడు. అప్పుడు సంతోష్ శివన్ తాను తీస్తున్న ‘ఉరుమి’లో స్క్రీన్ టెస్ట్‌గా శైలీకి చిన్న భూమికనిచ్చాడు. ► శైలీకి చిన్నప్పటి నుంచీ సినిమాలు అంటే ఇష్టం. రెఫ్యూజీ క్యాంపుల్లో ఉన్నప్పుడు రేడియోలో వచ్చే పాటలు వింటూ .. దూరదర్శన్‌లో ప్రతి ఆదివారం ప్రసారం అయ్యే సినిమాలు చూస్తూ నటన మీద ఆసక్తి పెంచుకుంది. ఆ ప్రభావంతో అద్దం ముందు నిలబడి తనే పాటలు పాడుకుంటూ.. డైలాగులు చెప్పుకుంటూ తనకు తోచినట్టు అభినయించేదట. ► ఆ తర్వాత సంతోష్ శివనే తీసిన ‘మోహ’లోనూ నటించింది. 2021లో బెర్ముడా, జాక్ అండ్ జిల్ అనే మరో రెండు మలయాళ సినిమాల్లోనూ హీరోయిన్గా చేసింది. ► తాజాగా ‘ది లాస్ట్ అవర్’తో వెబ్ దునియాలోకీ అడుగుపెట్టింది. ఆ సిరీస్‌లో శైలీది ప్రధాన భూమిక. అందులో ఆమె అందానికీ, అభినయానికీ ముగ్ధులవుతున్నారు వెబ్ వీక్షకులు. ► రెఫ్యూజీ క్యాంపుల్లో జీవితాలు ఎలా ఉంటాయో నాకు అనుభవం. అందుకే జీవితంలో ఏం జరిగినా పెద్దగా చలించను. జయాపజయాలను మనసు మీదకు తీసుకోను. – శైలీ క్రిష్ణ్ -
స్టార్ హీరోయిన్ను వేధింపులకు గురి చేసిన డైరెక్టర్ అరెస్ట్
మలయాళ స్టార్ హీరోయిన్ మంజు వారియర్‌ను వేధింపులకు గురి చేసిన కేసులో డైరెక్టర్ సనల్ కుమార్ శశిధరన్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరువనంతపురంలో మే5న ఆయన్ను కేరళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివకాల్లోకి వెళితే.. సనల్ కుమార్ దర్శకత్వంలో మంజు వారియర్ కయాట్టం అనే సినిమాలో నటించింది. అయితే సినిమా అయిపోయిన తర్వాత కూడా సనల్ కుమార్ అదే పనిగా తనకు మెసేజ్‌లు పంపిస్తూ వేధింపులకు గురిచేరాడని హీరోయిన్ ఆరోపించింది. పలుమార్లు వార్నింగ్ ఇచ్చినా తీరు మార్చికోకుండా వేధింపులు గురి చేస్తున్నాడంటూ మంజు వారియర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో తిరువనంతపురంలో ఉన్న సనల్ కుమార్ ఇంటికి మఫ్టీలో వెళ్లిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కొచ్చికి తరలించారు. ప్రస్తుతం ఈ వార్త మలయాళ చిత్ర పరిశ్రమలో సంచలనంగా మారింది. కాగా కేరళ ప్రభుత్వం నుంచి సనల్ కుమార్ అనేక అవార్డులను సొంతం చేసుకున్నాడు. అలాంటి డైరెక్టర్ ఇలాంటి నీచమైన పనులు చేయడం ఏంటని నెటిజన్లు సనల్‌కుమార్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. -
రష్మిక అసలు హీరోయినే కాదు : డైరెక్టర్ కామెంట్స్
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇటీవలె ఈ ముద్దుగుమ్మ 'సీతారామం' అనే ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను జయంతి మూవీస్ బ్యానర్ లో స్వప్న దత్ నిర్మిస్తుంది. ఈ సినిమాలో రష్మిక అఫ్రీన్ అనే కశ్మీరీ ముస్లీం అమ్మాయి పాత్రలో నటిస్తుండటంతో ఇక హీరోయిన్ రష్మికే అన్న కథనాలు వెలువడ్డాయి. తాజాగా ఇదే అంశంపై డైరెక్టర్ హను క్లారిటీ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ కాదు.. హీరో అనే చెప్పాలి అంటూ కామెంట్స్ చేశారు. పాత్రకు తగ్గట్లు రష్మిక ఎంతో కష్టపడిందని, ఆమె నటన చూసి ఆశ్చర్యపోయానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. -
పథకాలకు ప్రాచుర్యంలో... మీడియాది కీలకపాత్ర
కోజికోడ్: రాజకీయాలకు అతీతంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించడంలో మీడియాది కీలకపాత్ర అని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. దేశ 75వ స్వాతంత్య్ర వేడుకలు జరుగుతున్న సందర్భంగా స్వాతంత్య్ర సమరంలో ఇప్పటిదాకా పెద్దగా వెలుగులోకి రాని ఘట్టాలను, స్ఫూర్తిదాయకమైన స్వాతంత్య్ర యోధుల జీవిత విశేషాలను ప్రచురించాలని మీడియాకు సూచించారు. ప్రముఖ మలయాళ పత్రిక మాతృభూమి శతాబ్ది ఉత్సవాలను మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే మంచి పథకాల రూపకల్పనతో పాటు వాటి గురించి సమాజంలోని అన్ని వర్గాలకు తెలిసేలా చేయడం చాలా ముఖ్యమని ఈ సందర్భంగా అన్నారు. ఈ పాత్రను మీడియా అత్యంత సమర్థంగా పోషించిందన్నారు. ‘‘స్వాతంత్య్ర సమరంలో చిన్న గ్రామాలు, పట్టణాలూ పాల్గొన్నాయి. వాటి గురించి అందరికీ తెలిసేలా కథనాలు ప్రచురించి దేశ ప్రజలంతా ఆ గ్రామాలకు వెళ్లేలా చేయాలి’’ అని మీడియా సంస్థలకు ప్రధాని సూచించారు. హోలీ శుభాకాంక్షలు న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మోదీ దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రజల జీవితాల్లో ఆనందాల్ని నింపాలని ఆకాంక్షిస్తున్నానని ట్విట్టర్లో మోదీ అన్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తదితరులు కూడా శుభాకాంక్షలు తెలిపారు. -
ఒక్కరోజులోనే మీరా జాస్మిన్‌కు లక్షమంది ఫాలోవర్లు
Meera Jasmine Re Entry To Films Debuts On Instagram: ‘అమ్మాయే బాగుంది’చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన మలయాళీ బ్యూటీ మీరా జాస్మిన్. 'గుడుంబా శంకర్', 'భద్ర' వంటి చిత్రాలతో తెలుగులో పాపులర్ అయిన ఈ బ్యూటీ ‘పందెం కోడి’ ‘గోరింటాకు’, ‘ఆకాశ రామన్న’ సహా పలు మలయాళ చిత్రాల్లో నటించింది. కానీ ఆశించిన స్థాయిలో విజయాలు లభించలేదు. దీంతో కొన్నాళ్లకి దుబాయ్‌కి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనిల్ జాన్ టైటాన్‌ని 2014లో పెళ్లి చేసుకుంది. అయితే మనస్పర్థల కారణంగా కొన్నాళ్లకు భర్త నుంచి విడిపోయిన మీరా జాస్మిన్.. మళ్లీ ఇన్నాళ్లకు తిరిగి సినిమాలు చేసేందుకు సిద్ధమైంది. ఇటీవలె సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే మకల్ అనే ఓ మలయాళ చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్‌లోనూ రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లోకి కూడా అడుగుపెట్టింది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉండాలని భావిస్తుందట. అలా ఇన్‌స్టాలో ఆమె ఎంట్రీ ఇచ్చిందో లేదో ఆమెకు ఫాలోవర్ల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఒక్క రోజులోనే సుమారు లక్షమంది ఆమెను ఫాలో అయ్యారు. -
వెరైటీ వెడ్డింగ్ ఇన్విటేషన్.. క్రియేటివిటీతో పిచ్చెక్కించారు
Minnal Murali Wedding Invitation: మన జీవితంలో ప్రతి ఒక్కరికీ ముఖ్యమైన రోజులు కొన్ని ఉంటాయి. ఇక ఆ రోజులని ఎప్పటికీ గుర్తుండి పోవాలని ఏవేవో చేస్తుంటాం .అలాంటి రోజుల్లో ఒకటే పెళ్లి రోజు. ఇటీవల వివాహ వేడుకలను చూస్తే.. వధూవరులు తమ వివాహ వేడుక సంథింగ్ స్పెషల్ గా జీవితాంతం గుర్తుండిపోయేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్స్, వెరైటీ ఇన్విటేషన్, సంగీత్ ఇలా ఒక్కటేమిటి అన్నిట్లో ప్రత్యేకతని కోరుకుంటున్నారు. తాజాగా ఓ సినిమా క్యారెక్టర్ లోని పాత్రో పెళ్ళికొడుకు ఉండి.. పెళ్లి కూతురితో కలిసి చేసిన వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇటీవల మలయాళంలో విడుదలైన 'మిన్నాళ్ మురళి' చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. అంతే గాక ఇది మలయాళంలో ప్రేక్షకులతో పాటు ఇతర భాషలోనీ సినీ ప్రేమికులకు కూడా విపరీతంగా నచ్చేసింది. ఈ సినిమా గురించి చెప్పాలంటే మిన్నాళ్ మురళి.. ఇండియన్ సూపర్ మ్యాన్. ఈ వీడియోలో.. మిన్నాళ్ మురళీ క్యారెక్టర్‌ను అమితంగా ఇష్టపడిన ఓ వ్యక్తి తన వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియోలో తానే మిన్నాళ్ మురళిగా గెటప్ వేసు కొని తనకు కాబోయే భార్యను రౌడీల నుండి రక్షించి, తన దరికి ప్రమాదం రానివ్వకుండా ఎప్పుడు తన వెంటే ఉండి తనను కాపాడుకుంటూ ప్రేమలో పడేస్తాడు. ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వీడియో కాన్సెప్ట్ రూపొందించిన వాడిని క్రియేటివిటీకి ఫిదా అవుతున్నారు. వాట్ ఏ క్రియేటివిటీ అంటూ కితాబుల వర్షం కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by Athreya jibin (@photography_athreya) -
ఓ సౌత్ ఇండియా సినిమా మూడు విదేశీ భాషల్లోకి..
ఓ భాషలో హిట్ అయిన కథలను మరో భాషలో రీమేక్ చేయడం సినీ పరిశ్రమల్లో మాములుగా జరిగేదే. కానీ ఓ భారతీయ సినిమా విదేశీ భాషల్లో రీమేక్ అవడం మాత్రం అరుదనే చెప్పాలి. అది ఓ సౌత్ ఇండియన్ మూవీ అవడం చాలా తక్కువ. ఇప్పుడు మాలయాళం సూపర్ హిట్ సినిమా ‘దృశ్యం’ త్వరలో ఇండోనేషియా లాంగ్వేజ్‌లోకి వెళ్లనుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘మోహన్‌లాల్ హీరోగా, జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన ‘దృశ్యం’ ఇప్పటి వరకు 4 భారతీయ భాషలు, 2 విదేశీ భాషల్లో రీమేకైంది. ఇండియన్ లాంగ్వేజేస్‌తోపాటు చైనీస్, శ్రీలంకన్ భాషల్లో విడుదలై మంచి స్పందన సొంతం చేసుకుంది. ఇప్పుడు ఇండోనేషియా భాషలో నిర్మితం కానుంది. ఇలా మా సినిమా సరిహద్దులను చెరిపేస్తూ దూసుకుపోవడం ఎంతో సంతోషాన్నిస్తోంది’ అని ఆంటోని తెలిపాడు. ఈ చిత్రాన్ని ఇండోనేషియాలో జకార్తాలోని పీటీ ఫాల్కన్ అనే సంస్థ నిర్మించనుంది. చైనీస్‌లో రీమేక్ అయిన మొదటి మలయాళ చిత్రం ఇదే కావడం విశేషం. చదవండి: ‘దృశ్యం 2’ అరుదైన రికార్డు, ఇండియన్ సినిమాల్లో అత్యధిక రేటింగ్ కాగా, ఈ సినిమాకి సీక్వెల్‌గా వచ్చిన ‘దృశ్యం 2’ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన అమెజాన్‌లో ఈ ఫిబ్రవరి విడుదలై ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఈ చిత్రం కూడా తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో రీమేక్‌లు అవుతోంది. View this post on Instagram A post shared by Antony Perumbavoor (@antonyperumbavoor) -
వందల సినిమాల్లో నటించిన ఈ ‘ఎమోషనల్ యాక్ట్రెస్’ గుర్తుందా?
సినిమా అంటే జనాలకు మాత్రమే రంగుల ప్రపంచమే కాదు.. అవతల నటించే వాళ్లకు కూడా. ‘ఎంత బలవంతులనైనా ఏదో ఒక టైంలో మానసికంగా కుంగుబాటుకు కచ్ఛితంగా గురిచేసేదే సినిమా’ అంటూ స్పీల్‌బర్గ్‌లాంటి దిగ్గజాలు చెప్పడం చూస్తుంటాం. అలా ఎన్నో కలలతో సినిమాల్లోకి అడుగుపెట్టిన సీనియర్ నటి శ్రీవిద్య జీవితం..విషాదంగా ముగియడం మీలో ఎంత మందికి గుర్తుంది?. ఇవాళ ఆమె జయంతి.. మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ.. ఇలా సుమారు 800కు పైగా సినిమాల్లో నటించారు శ్రీవిద్య. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్గా.. అటుపై సపోర్టింగ్ రోల్స్, అక్కా-చెల్లి, అమ్మ, అత్త క్యారెక్టర్లతో అలరించారు. ముఖ్యంగా ఆమె పండించే భావోద్వేగాలు ఇప్పటికీ జనాలకు గురుతు. అందుకే ఎమోషనల్ యాక్ట్రెస్‌గా ఆమెకు ఓ పేరు ముద్రపడింది. కేవలం నటనతోనే కాదు.. తన మధుర గాత్రంతో ఎన్నో పాటలు, డబ్బింగ్‌తోనూ దక్షిణాది ప్రేక్షకుల్ని రంజింపచేశారామె. ‘నటన’ కుటుంబంలో జననం 1953, జులై 24న మద్రాస్‌లో పుట్టారామె. తండ్రి కృష్ణమూర్తి సినిమాల్లో కమెడియన్‌గా స్థిరపడగా, తల్లి వసంతకుమారి కర్ణాటక క్లాసిక్ సింగర్(ఎంఎస్ సుబ్బలక్క్క్ష్మి, డీకే పట్టమ్మస్ సమకాలికురాలు). అయితే శ్రీవిద్య పుట్టిన కొన్నాళ్లకే తండ్రి పక్షవాతం బారినపడడంతో కుటుంబానికి ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. దీంతో వసంతకుమారి నానాకష్టాలు పడి సంపాదించింది. ఒకానొక టైంలో తనకు పాలు ఇచ్చే సమయం ఉండేది కాదన్న తల్లి మాటల్ని శ్రీవిద్య పలు ఇంటర్వ్యూలో సైతం గుర్తు చేసుకునేవాళ్లు. ‘బొటాబొటీ’ చదువు కొనసాగించిన శ్రీవిద్య అందగత్తె కావడంతో అమెరికా నుంచి ఓ సైంటిస్ట్ సంబంధం వెతుక్కుంటూ వచ్చింది. అయితే డబ్బు లేదన్న కారణంతో ఆ సంబంధం అంతే స్పీడ్‌గా వెనక్కి వెళ్లిపోయింది. దీంతో కుటుంబానికి భారం కాకూడదన్న ఉద్దేశంతో తండ్రి పరిచయాలతో ఆమె నటనలోకి అడుగుపెట్టారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మొదలై.. 1967 తమిళ సినిమా శివాజీ గణేషన్ హీరోగా ‘తిరువరుల్చెల్వర్’లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించారామె. ఆ తర్వాత మలయాళ సినిమా ‘కుమార సంభవం’తో, తెలుగులో దాసరి ‘తాతా మనవడు’తో అరంగ్రేటం చేసింది శ్రీవిద్య. దర్శకదిగ్గజం కే బాలచందర్ డైరెక్షన్లో వచ్చిన ‘నూట్రుక్కు నూరు’(1971) నటిగా ఆమెకంటూ ఓ గుర్తింపు తెచ్చిపెట్టింది. హీరోయిన్గా ‘ఢిల్లీ టు మద్రాస్’(1972) ఆమె మొదటి సినిమా. ఆ తర్వాత బాలచందర్ డైరెక్షన్లో వచ్చిన సినిమాల ద్వారా ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ వచ్చారామె. మల్టీటాలెంటెడ్ అల్లరి క్యారెక్టర్లతో అలరించినా.. మెచ్యూర్డ్రోల్స్ చేసినా.. ఆ క్యారెక్టర్‌తో ఎమోషనల్‌గా ట్రావెల్ కావడం ఆమెకు ఉన్న నైజం. అందుకే హీరోయిన్గా ఫేడ్అవుట్ అయ్యాక ఆమెకు హుందా పాత్రలెన్నో వచ్చాయి. నటిగానే కాదు.. ప్లేబ్యాక్ సింగర్‌గానూ ఆమె అలరించారు. స్వతహాగా క్లాసికల్ సింగర్ కావడంతో ఆమె గాత్రం పాటలకు మరింత అందాన్ని తెచ్చిపెట్టేవి. అంతేకాదు పదుల సంఖ్యలో సినిమాలకు ఆమె డబ్బింగ్ కూడా చెప్పారు. ‘ప్రేమ’ మోసం కెరీర్ తొలినాళ్లలో కమల్ హాసన్‌తో ఆమె నటించింది. ఆ టైంలో ఇద్దరి మధ్య ఎటాచ్మెంట్ ఎక్కువగా ఉండేది. ఒకానొక టైంలో కమల్‌తో పీకలలోతు ప్రేమలో కూరుకుపోయిందామె. అయితే అప్పటికే కమల్ వాణీ గణపతితో ప్రేమలో ఉండడంతో ఆమె పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కొంతకాలానికి మలయాళంలో అసిస్టెంట్ డైరెక్టర్ అయిన జార్జ్ థామస్‌తో ప్రేమలో పడి.. తల్లిదండ్రుల మాట వినకుండా వివాహం చేసుకుంది. మతం మార్చుకుని నటనకు దూరమైంది. డబ్బు కోసం తిరిగి నటించాలన్న భర్త ఒత్తిడితో తిరిగి మేకప్ వేసుకుంది. ఆపై భర్త తీరును అర్థం చేసుకుని.. విడాకులిచ్చేసింది. నటన కొనసాగిస్తున్న టైంలో మలయాళ దర్శకుడు భరతన్‌తో కొన్నాళ్లపాటు ప్రేమాయణం కొనసాగించింది. అయితే భరతన్ మరొకరిని వివాహం చేసుకున్నాడు. దీంతో భరతన్ తన ఆస్తులు లాగేసుకుని తనను మోసం చేశాడంటూ శ్రీవిద్య కోర్టుకెక్కింది. చివరికి సుప్రీం కోర్టు తీర్పుతో విజయం సాధించి తన ఆస్తుల్ని దక్కించుకున్న ఆమె.. చెన్నై నుంచి తిరువంతపురానికి మకాం మార్చేసింది. అపూర్వ రాగంగల్-అపూర్వ సగోదరర్గల్ చనిపోయే ముందు దాకా.. 2003లో అనారోగ్యం పాలైన ఆమెకు.. క్యాన్సర్ అని తేలింది. ఆటైంలో మూడేళ్లపాటు ఆమె చికిత్స తీసుకుంది. ఆ టైంలోనూ ఆమెను వదల్లేదు. అంతేకాదు ఫోర్త్ స్టేజ్‌లో ఉన్న తాను బతకడం కష్టమనే విషయం అర్థమైయ్యింది ఆమెకు. అందుకే తన పేరు మీద ఒక్క పైసా కూడా ఉండొద్దన్నది నిర్ణయించుకుంది. మొత్తం ఆస్తిని సేవాకార్యక్రమాలకు ఇచ్చేయాలని నిర్ణయించుకుంది. అప్పటికే కేరళ ప్రభుత్వం స్కాలర్షిప్ ఆపేయడంతో పేద సంగీత, నృత్య కళాకారులైన విద్యార్థులు కష్టాలు పడుతున్నారు. అందుకని మలయాళ నటుడుని రిజిస్టర్‌గా నియమిస్తూ.. తన ఆస్తులను అప్పజెప్పింది. తద్వారా ఓ ఛారిటబుల్ సొసైటీ ఏర్పాటు చేయించి అర్హులైనవాళ్లకు స్కాలర్షిప్ అందించే ఏర్పాటు చేయించింది. మిగిలిన ఆస్తిని బంధువుల పేరిట రాసేసింది. తన అన్నల పిల్లలకు ఒక్కొక్కరి ఐదు లక్షలు, చివరికి తన ఇంట్లో పని వాళ్లు.. వాళ్ల ఇంటి సభ్యులకు ఒక్కొక్కరికి లక్ష చొప్పున జమ చేయించింది. మరికొంత ఆస్తిని సొంత వూరికి, ఇంకొంత సొమ్మును రెండో ఇల్లు తిరువనంతపురానికి దానం చేసింది. ఆ తర్వాత కీమో థెరపీకి వెళ్లిన ఆమె.. ఆ ట్రీట్మెంట్ టైంలోనే 2006, ఆగస్టు 17న యాభై మూడేళ్ల వయసులో ఆమె కన్నుమూసింది. ఆమె సేవానీరతికి గుర్తుగా తిరువనంతపురం ప్రజలు లాంఛనంగా ఆమె అంత్యక్రియల్ని ఘనంగా జరిపించారు. తల్లిగా ప్రత్యేకం నలభై ఏళ్లపాటు మలయాళం, తమిళంలో వందలకొద్దీ, తెలుగులో నలభై దాకా, కన్నడలో డజను, హిందీలో రెండు.. మొత్తం 800 దాకా సినిమాల్లో నటించారామె. ఇక సౌత్ సూపర్‌స్టార్ రజినీకాంత్ తొలి హీరోయిన్ శ్రీవిద్యే. ఆయన మొదటి సినిమా అపూర్వ రాగంగల్(1975) రజినీ జోడిగా. అయితే రజినీతో హీరోయిన్‌గానే కాదు.. అక్కగా, చెల్లిగా, తల్లిగా, అత్తగా.. ఇలా దాదాపు అన్ని క్యారెక్టర్లలో ఆమె నటించడం విశేషం. తల్లి క్యారెక్టర్లో శ్రీవిద్య అద్భుతమైన నటన కనబరిచేవారామె. ముగ్గురు మొనగాళ్లు, గాండీవం, చిన్నబ్బాయ్, వెంకటేష్‌కు తల్లిగా ‘బ్రహ్మపుత్రుడు’, ‘ధర్మచక్రం’ ఆమె మరిచిపోలేని నటనను అందించారు. సుమంత్ హీరోగా వచ్చిన ‘విజయ్ ఐపీఎస్’ తెలుగులో శ్రీవిద్య నటించిన చిట్టచివరి చిత్రం. -సాక్షి వెబ్‌డెస్క్ -
ప్రముఖ రచయిత మృతి.. సీఎం సంతాపం
తిరువనంతపురం : ప్రముఖ మలయాళ గేయ రచయిత పూవచల్ ఖాదర్ (72) కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడ్డ ఆయన చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పూవచల్‌లోని జూమా మసీదులో ఖాదర్ అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు. 1973లో విజయనిర్మల దర్శకత్వం వహించిన కవిత అనే చిత్రంతో రచయితగా ప్రస్థానం మొదలుపెట్టిన ఖాదర్.. నాలుగు దశాబ్దాల కెరీర్లో 350కి పైగా సినిమాలకు పాటలు రాశారు. నాధ నీ వరుమ్ కలోచ (చమరం), పండోరు కట్టిలోరన్ సింహామ్ (సందర్భం), పొన్వీన్ (తలవట్టం) మరియు ఎంటె జన్మమ్ నీయేదుత్తు (అత్తక్కలసం) వంటి పాటలు ఆయన కలంలో వచ్చినవే. మలయాళ పరిశ్రమలో ఇప్పటివరకు ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలకు ఆయన పాటలు రాశారు. ముఖ్యంగా 70-80వ దశకంలో ఖాదర్ రాసిన దాదాపు అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. కెవి మహాదేవన్, ఇలయరాజా, శంకర్ గణేష్ వంటి ఎందరో ప్రముఖుల వద్ద పనిచేసిన ఖాదర్ ఎన్నో సినిమాలకు పాటలు రాశారు. ఖాదర్ మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం తెలిపారు. మలయాళంలో అత్యధిక సినిమా పాటలు రాసి రికార్డు నెలకొల్పిన ఖాదర్ మృతి సినీ రంగానికి తీరని లోటని ఆయన పేర్కొన్నారు. చదవండి : MAA Elections: ప్రకాశ్‌రాజ్ వర్సెస్ మంచు విష్ణు! అభిమానికి బెల్లంకొండ ఫ్యామిలీ సర్ప్రైజ్ -
భాష వివాదంపై మంత్రి కేటీఆర్ స్పందన
హైదరాబాద్ : కేరళా నర్సుల వివాదంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. రాజ్యాంగం తెలుగు, తమిళ్, మళయాళం ఇలా మొత్తం 22 భాషాలను అధికారిక భాషలుగా గుర్తించదని చెప్పారు. తమకు సౌకర్యంగా ఉన్న భాషలో మాట్లాడుకోవడం భారతీయుల హక్కని ఆయన అన్నారు. ఫలానా భాషలోనే మాట్లాడాలని ఒత్తిడి చేయడం సరికాదన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఇదీ వివాదం ఢిల్లీలోని జిప్మర్లో పనిచేసే మలయాళీ నర్సులు తమ మాతృభాషలో మాట్లాడకూడదంటూ జూన్ 5న జిప్మర్ యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసింది. కేరళా నర్సులు ఇకపై ఇంగ్లీష్ లేదా హిందీలో మాత్రమే సంభాషించాలంటూ ఆ సర్య్కులర్‌లో పేర్కొంది. దీనిపై మళయాళీ నర్సులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలా చేయడం తమ మాతృభాషను అవమానించడమే అవుతుందన్నారు. జిప్మర్ యాజమాన్యం జారీ చేసిన సర్క్యులర్ని తీవ్రమైన చర్యగా అభివర్ణిస్తూ లిఖితపూర్వక క్షమాపణ చెప్పాలంటూ వారు డిమాండ్ చేశారు. ఇక్కడ చదవండి: 'మా భాషను అవమానించారు.. క్షమాపణ చెప్పాల్సిందే' వెహికల్ ఇంజన్లకు ఇథనాల్ టెన్షన్ This directive reeks of language chauvinism 👇 India has 22 official languages & Malayalam, Telugu, Tamil, Hindi etc are included Every Indian should have the right to converse in a language of their choice & no one should infringe on that basic right pic.twitter.com/noIVoCZtBQ — KTR (@KTRTRS) June 6, 2021 -
'మా భాషను అవమానించారు.. క్షమాపణ చెప్పాల్సిందే'
ఢిల్లీ: ఢిల్లీలోని గోవింద్ బల్లబ్ పంత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(జిప్మర్) వ్యవహరించిన తీరుపై ఢిల్లీ మలయాళీ నర్సుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. జిప్మర్లో పనిచేసే మలయాళీ నర్సులు మలయాళం మాట్లాడకూడదని.. కేవలం ఇంగ్లీష్ లేదా హిందీలో మాత్రమే సంభాషించాలంటూ సర్య్కులర్ జారీ చేసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన నర్సుల సంఘం ఇలా చేయడం మా భాషను అవమానించడం అవుతుందని.. ఇది తీవ్రమైన చర్యగా అభివర్ణిస్తూ వెంటనే లిఖితపూర్వక క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఇక జూన్ 5న(శనివారం)జిప్మర్ ఆసుపత్రి ఈ సర్క్యులర్ జారీ చేసినట్లు తెలిసింది. మలయాళం మాట్లాడేందుకు వీల్లేదని.. కేవలం హిందీ, ఇంగ్లీష్‌లో మాత్రమే మాట్లాడాలని సర్య్కులర్‌లో పేర్కొన్నారు. అయితే జిప్మర్ అడ్మినిస్ట్రేషన్‌తో పాటు ఢిల్లీ ప్రభుత్వానికి ముందస్తు సూచన ఇవ్వకుండానే సర్య్కులర్ బయటికి వచ్చిందని అధికారులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే ఆ సర్క్యులర్‌ను విత్ డ్రా చేశామని వివరించారు. ఇదే విషయమై ఢిల్లీ యాక్షన్ కమిటీ ఆఫ్ మలయాళీ నర్సర్ ప్రతినిధి సీకే ఫమీర్ స్పందించాడు. " ఈ విషయం మమ్మల్ని షాక్‌కు గురిచేసింది. జిప్మర్ జారీ చేసిన సర్క్యులర్ చూస్తుంటే మా భాషా స్వేచ్ఛకు ముప్పు ఉన్నట్లు భావిస్తున్నాము. వారు భాషను కించపరిచి మా రాష్ట్రాన్ని అవమానించారు. వెంటనే సర్క్యులర్ జారీ చేసిన సంబంధిత వ్యక్తి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉంది . అయితే జిప్మర్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ఈ విషయం మాకు తెలియడం అనేది విషయాన్ని మరింత సీరయస్‌గా తయారు చేసింది. అధికారులకు కనీస సూచనలు లేదా వారి అనుమతి లేకుండానే సర్క్యులర్ జారీ చేసిన వ్యక్తిపై సీరియస్ యాక్షన్ తీసుకునే వరకు తాము ధర్నాను కొనసాగిస్తాం.'' అని చెప్పుకొచ్చారు. కాగా నర్సుల యూనియన్ ఆందోళనపై స్పందించిన జిప్మర్ మెడికల్ డైరెక్టర్ అనిల్ అగర్వాల్ మాట్లాడుతూ.. '' మాకు తెలియకుండా ఇచ్చిన సర్య్కులర్‌ను విత్‌డ్రా చేసుకున్నాం. ఆ సర్క్యులర్ జారీ చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటాం. మీ ఆందోళనను విరమించి విధుల్లో చేరాలని కోరుతున్నాం'' అంటూ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. చదవండి: Mumbai: తెలుగువారి కోసం కరోనా టీకా -
ముందు మీ లాంగ్వేజ్ మార్చండి, నర్స్‌లకు వార్నింగ్
న్యూఢిల్లీ : నర్స్‌లు ట్రీట్మెంట్ తరువాత సంగతి ముందు మీరు మాట్లాడే లాంగ్వేజ్‌ను మార్చండి. మాట వినకపోతే మీపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అంటూ సర్క్యులర్ జారీ చేయడం కలకలం రేపుతోంది. ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన గోవింద్ బల్లాబ్ పంత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్మెర్)కు చెందిన నర్స్ లలో ఎక్కువ శాతం మంది మలయాళం భాష మాట్లాడుతున్నారు. దీనిపై పలువురు పేషెంట్లు ఆరోగ్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. పేషెంట్ల ఫిర్యాదుతో జీబీ పంత్ నర్స్ యూనియన్ అధ్యక్షుడు లిలాధర్ రామ్ చందాని నర్స్ లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇచ్చే సమయంలో నర్స్ లు మలయాళంలో మాట్లాడుకుంటున్నారు. సిస్టర్లు ఏం మాట్లాడుకుంటున్నారో అర్ధం కాక పేషెంట్లు ఇబ్బంది పడుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాబట్టి నర్స్ లు ఇకపై హింది, ఇంగ్లీష్ భాషలు మాత్రమే మాట్లాడాలి. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా లిలాధర్ మాట్లాడుతూ.. పేషెంట్ల ఫిర్యాదుల కారణంగా చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. అంతర్గతంగా, నర్సులు మరియు పరిపాలనలో ఎటువంటి సమస్య లేదు" అని అన్నారు. అయితే ఈ సర్క్యులర్ తో ఇతర నర్సింగ్ యూనియన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాగా,మనదేశంలో వివిధ ఆసుపత్రులలో చాలా మంది నర్సులు కేరళకు చెందినవారు. వారి మాతృభాష మలయాళం. తమ మాతృభాష. మలయాళమని, మలయాళంలో మాట్లాడితే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. చదవండి : ‘గూగుల్ చేసిన పనికి క్షమాపణ చెప్పాల్సిందే’ -
ప్రముఖ నటుడు రాజన్ పి దేవ్ కొడుకు అరెస్ట్
తిరువనంతపురం: దక్షిణాది నటుడు, దివంగత రాజన్ పి దేవ్ కొడుకు ఉన్ని రాజన్ అరెస్టయ్యాడు. భార్యను హింసించి, ఆత్మహత్యకు ఉసిగొల్పిన ఆరోపణల కింద ఉన్నిని నెడుమంగడ్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నిజానికి అతన్ని చాలారోజుల క్రితమే అరెస్ట్ చేయాల్సి ఉంది. అయితే కరోనా పాజిటివ్ రావడంతో నెగెటివ్ రిపోర్ట్ వచ్చేదాకా పోలీసులు ఎదురు చూశారు. కాగా, ఉన్నిరాజన్ కూడా నటుడే. కమెడియన్‌గా, విలన్‌గా దాదాపు ముప్ఫైదాకా మలయాళ చిత్రాల్లో నటించాడు. 2019లో ఉన్నికి ప్రియాంకకు వివాహం జరిగింది. ఆమె ఓ స్కూల్లో టీచర్‌గా పని చేస్తోంది. పెళ్లయిన కొన్నాళ్లకే అదనపు కట్నంతో పాటు గొంతెమ్మ కోర్కెలు కోరుతూ ప్రియాంకను భర్త ఉన్ని ప్రతీరోజూ హింసించేవాడని ప్రియాంక తల్లి ఆరోపిస్తోంది. అంతేకాదు ఓరోజు గొడవలో అడ్డువెళ్ళినందుకు తనపై కూడా దాడి చేశాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, ఆత్మహత్యకు ముందు ప్రియాంక కూడా పోలీసులకు కంప్లయింట్ చేసినట్లు తెలుస్తోంది. మే పదకొండున ఉన్ని ఇంట్లో గొడవ జరిగిందని, వెంటనే పుట్టింటికి ప్రియాంక ఇంటికి వచ్చేసింది. ఆ మరుసటిరోజే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మలయాళ నటుడు రాజన్ పి దేవ్.. ఆది, దిల్, ఒక్కడు, ఖుషి, గుడుంబా శంకర్ లాంటి సినిమాలతో తెలుగు వారికి సుపరిచితుడే. 200 సినిమాలకు పైనే నటించిన రాజన్ పి దేవ్.. 2009లో లివర్ సంబంధిత అనారోగ్యంతో చనిపోయారు. తండ్రి చనిపోయాక జల్సాలకు అలవాటు పడ్డ ఉన్ని, కుటుంబ సభ్యులతో కలిసి డబ్బు కోసమే ప్రియాంకను వేధించినట్లు తెలుస్తోంది. -
సీక్రెట్‌గా బిగ్‌బాస్ షూటింగ్: అడ్డుకున్న పోలీసులు
చెన్నై: కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమాలు, టీవీ షూటింగ్‌లు నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో బుల్లితెర షో బిగ్‌బాస్ కూడా పలుచోట్ల వాయిదా పడింది. అయితే సూపర్ స్టార్ మోహన్‌లాల్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న మలయాళం బిగ్‌బాస్ మూడో సీజన్ ఇదివరకే ప్రారంభమైంది. దీంతో దీన్ని మధ్యలో ఆపేయకుండా షూటింగ్ కొనసాగిస్తున్నారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి మరీ షో నిర్వహిస్తున్నారు. అయితే ఈ షోలో పని చేసే 8 మంది సిబ్బంది కరోనా బారిన పడినప్పటికీ షో వాయిదా వేయకుండా షూటింగ్ జరుపుతున్నారు. ఈ వ్యవహారం కాస్తా పోలీసుల దృష్టికి రావడంతో వారు చెన్నైలోని ఈవీపీ ఫిల్మ్‌సిటీలో బిగ్‌బాస్ సెట్‌కు వెళ్లి చిత్రీకరణను నిలిపివేశారు. హౌస్‌మేట్స్‌ను అక్కడ నుంచి హోటల్‌కు పంపించారు. బిగ్‌బాస్ సెట్‌ను మూసివేశారు. కాగా మలయాళ బిగ్‌బాస్ మూడో సీజన్ 14 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైంది. ఫిబ్రవరి నుంచి ఈ షో ప్రసారమవుతుండగా హౌస్‌లో ఇప్పటికే 95 రోజులు ముగిశాయి. ఇక ఇటీవలే ఈ షోను మరో రెండువారాల పాటు పొడిగించినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా షూటింగ్ యధావిధిగా నిర్వహించడంతో తిరువళ్లూరు ఆర్డీవో ప్రీతి పర్కావి బుధవారం పోలీసులతో అక్కడికి వెళ్లి చిత్రీకరణను అడ్డుకున్నారు. కంటెస్టెంట్లతో సహా కెమెరామెన్లు, టెక్నీషియన్లు, ఇతర సిబ్బందిని పంపించి వేశారు. అనంతరం సెట్‌ను సీల్ చేసిట్లు అధికారులు తెలిపారు. తమిళనాడు ప్రభుత్వం షూటింగ్‌లపై నిషేధం విధించినప్పటికీ గుట్టుచప్పుడు కాకుండా చిత్రీకరణ జరిపిన నిర్వాహకులపై కేసు నమోదైనట్లు పేర్కొన్నారు. అయితే ఇంత జరిగినా బిగ్‌బాస్ కొనసాగుతుందని, జూన్ 4న గ్రాండ్ ఫినాలే జరగడం తథ్యం అని నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం! చదవండి: కొత్త ఇంటికి మారిన బిగ్‌బాస్ భామ అరియానా -
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. మలయాళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేసిన డెన్నిస్ జోసెఫ్ కన్నుమూశారు. గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని జోసెఫ్ కుటుంబసభ్యులు దృవీకరించారు. 1985లో ఈరన్ సంధ్య సినిమాతో సినీ ప్రస్థానం మొదలు పెటఇన జోసెఫ్ మమ్ముట్టి, మోహన్‌లాల్ వంటి స్టార్ హీరోలతో పనిచేశారు. జెసెఫ్ అందించిన కథలతో సినిమాలు రికార్డు స్థాయి విజయాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. `మను అంకుల్ ' సినిమాతో బెస్ట్ స్క్రిప్ట్ రైటర్‌గా నేషనల్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. ఆయన కెరియర్లో ఇప్పటివరకు సుమారు 45 చిత్రాలకు కథలందించారు. అదే విధంగా ఐదు చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. జోసెఫ్ మృతితో మలయాళ చిత్ర పరిశ్రమ దిగ్ర్భాంతికి లోనైంది. ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటని మమ్ముట్టి, మోహన్‌లాల్ సహా పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. చదవండి : కరోనా రక్కసికి బలైన టీఎన్ఆర్ -
ప్రముఖ మలయాళ గాయకుడు మృతి
తిరువనంతపురం: ప్రముఖ మలయాళ గాయకుడు ఎంఎస్ నసీమ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు(బుధవారం)తుదిశ్వాస వదిలారు. దూరదర్శన్, ఆకాశవాణి, ఇతర స్టేజ్ ప్రోగ్రామ్‌లలో మొత్తం వెయ్యికి పైగా పాటలు పాడి తన శ్రావ్యమైన గొంతుతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేవారు.పలు స్టేజ్ షోలతో పాటు టెలివిజన్ షోలు కూడా నిర్వహించేవారు. రెండు సినిమాల్లో నసీమ్ పాడిన పాటలు ఎంతో ప్రజాధరణ పొందాయి. (మెరిల్ స్ట్రీవ్, గాల్ గాడోట్‌లతో పోల్చుకున్న కంగనా..) 1992,93,95,1997లో నసీమ్ ఉత్తమ గాయకుడిగా కేరళ సంగీత అకాడమీ అవార్డును అందుకున్నారు. అంతేకాకుండా వరుసగా ఉత్తమ మినీ స్క్రీన్ సింగర్ అవార్డును సంపాదించుకున్నారు. అయితే నసీమ్‌కు 16 ఏళ్లు ఉన్నప్పుడే మొదటిసారి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని, అప్పటినుంచి చికిత్స తీసుకుంటున్నారని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. నసీమ్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కేరళలో నసీమ్ గాత్రానికి చాలామంది అభిమానులు ఉన్నారు. కాగా నసీమ్ మృతి పట్ల కేరళ సీఎం పినరయి విజయన్ సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తంచేశారు. (సుశాంత్ సింగ్ కజిన్ మంత్రి అయ్యాడు) -
‘మాతృభూమి’ వీరేంద్రకుమార్ మృతి
కోజికోడ్/వయనాడ్: రాజ్యసభ సభ్యుడు, మలయాళ దిన పత్రిక ‘మాతృభూమి’మేనేజింగ్ డైరెక్టర్ ఎం.పి. వీరేంద్ర కుమార్(83) గురువారం రాత్రి కన్నుమూశారు. ఆయన మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తదితర ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయనకు భార్య ఉష, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వయనాడ్ జిల్లా కల్పెట్టలో శుక్రవారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా(పీటీఐ)కు మూడు పర్యాయాలు చైర్మన్‌గా పనిచేసిన వీరేంద్రకుమార్ ప్రస్తుతం పీటీఐ బోర్డు డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. 2003–2004 కాలంలో ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీకి ప్రెసిడెంట్‌గా కూడా ఆయన వ్యవహరించారు. కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డుకు ఎంపికైన ‘హైమవతభువిల్’వంటి 15కు పైగా పుస్తకాలను వీరేంద్ర రచించారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేసిన ఆయన 1987లో ఈకే నయనార్ మంత్రి వర్గంలో విద్యుత్ మంత్రిగా ఉన్నారు. రాష్ట్రంలోని అడవుల్లో చెట్ల నరికివేతపై నిషేధం విధిస్తూ తొలి ఉత్తర్వులు జారీ చేశారు. అవి వివాదమవడంతో రాజీనామా చేశారు. కోజికోడ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎన్నికై ఐకే గుజ్రాల్, హెచ్డీ దేవెగౌడ కేబినెట్లలో బాధ్యతలు నిర్వహించారు. -
జీన్స్ వేసుకుంటే ట్రాన్స్జెండర్లు పుడతారు
ఎన్నో విమర్శలను, ఆటుపోట్లను ఎదుర్కొన్న మలయాళ బిగ్‌బాస్ రియాలిటీ షో సంచలనాలను క్రియేట్ చేసింది. తొలి సీజన్ విజయవంతం కావడంతో బిగ్‌బాస్ నిర్వాహకులు రెండో సీజన్‌ను పట్టాలెక్కించారు. ప్రముఖ నటుడు మోహన్ లాల్ వ్యాఖ్యాతగా రెండో సీజన్ ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఇందులో పాల్గొననున్న సెలబ్రిటీలను నెటిజన్లు అప్పుడే ఫాలో అవడం మొదలుపెట్టారు. అయితే మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అప్రతిష్టను మూటగట్టుకున్న రంజిత్ కుమార్‌ను బిగ్‌బాస్ యాజమాన్యం సెలక్ట్ చేయడంపై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆయనెవరు? ఎందుకు రంజిత్ కుమార్‌పై వ్యతిరేకత ఉందో తెలుసుకుందాం.. జీన్స్ వేసుకుంటే ట్రాన్స్జెండర్లు పుడతారు.. కాలేజీ ప్రొఫెసర్‌గా పని చేసిన రంజిత్ కుమార్ ఓసారి కళాశాల ప్రాంగణంలో మాట్లాడుతూ... అమ్మాయిలు జీన్స్ ధరించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. జీన్స్ వేసుకుంటే ట్రాన్స్జెండర్లు పుడతారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో అక్కడి విద్యార్థులు నిరసనగా సభా ప్రాంగణం నుంచి వెళ్లిపోయారు. ఇలా తొలిసారిగా 2013లో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత రంజిత్ కుమార్ ఓ టీవీ షోలో అర్థరహిత వ్యాఖ్యలు చేశారు. కొంతమంది తల్లిదండ్రులకు మానసిక సమస్యలతో ఉన్న పిల్లలు జన్మించడానికి ప్రధాన కారణం పెద్దల డ్రెస్సింగ్ సెన్స్ అంటూ వ్యాఖ్యానించారు. మహిళలు గెంతులు వేయకూడదు.. ఇక మరోసారి రంజిత్ మరీ విడ్డూరమైన వ్యాఖ్యలు చేశారు. మహిళలు అస్సలు గెంతకూడదని హితవు పలికారు. పొరపాటుగా అయినా మహిళలు గెంతులు వేస్తే వారి గర్భాశయం ఉన్నచోట నుంచి జారిపోతుందని చెప్పుకొచ్చారు. ఇలా విపరీత వ్యాఖ్యలు చేసే రంజిత్ వైఖరిని కేరళ ప్రభుత్వం అప్పట్లో తీవ్రంగా ఖండించింది. అయితే ఈ వివాదాస్పద వక్త ప్రాంతీయ భాషలో పలు పుస్తకాలను కూడా రచించారు. ఏదైతేనేం.. టీవీ షో కు ప్రాణవాయువు టీఆర్పీ. బిగ్‌బాస్ వంటి కార్యక్రమాలకు టీఆర్పీ రావాలంటే వినోదం ఒక్కటే సరిపోదు. వివాదాలు, గొడవలు.. అన్నీ కలగలసి ఉండాలి. అందుకనే బిగ్‌బాస్ యాజమాన్యం రంజిత్ కుమార్‌ను ఏరికోరి తీసుకుందని స్పష్టమవుతోంది. మరి బిగ్‌బాస్ హౌస్ లోపలికి వెళ్లాక సంయమనం పాటిస్తాడో లేదా మళ్లీ నోరుజారుతారో చూడాలి! చదవండి: బిగ్‌బాస్ భామ పెళ్లికూతురాయెనే.. -
టీవీ యాంకర్ అనుమానాస్పద మృతి
తిరువనంతపురం : ప్రముఖ మలయాళ టీవీ యాంకర్, సెలబ్రిటీ చెఫ్ జాగీ జాన్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. కురవాన్ కోణంలోని తన నివాసంలో ఆమె శవమై కనిపించారు. సోమవారం జాగీ ఇంటికి వచ్చిన ఆమె స్నేహితులు ఈ విషయాన్ని పోలీసులు తెలిపారు. దీంతో ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. జాగీ మృతదేహాంపై ఎటువంటి గాయాలు లేవని తెలిపిన పోలీసులు.. అనమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నట్టు వెల్లడించారు. ‘జాగీ తన తల్లితో కలిసి నివాసం ఉంటున్నారు. జాగీ మృతిచెందిన సమయంలో ఆమె తల్లి ఇంట్లోనే ఉన్నారు. అయితే ఆమె తల్లి మానసిక పరిస్థితి బాగా లేకపోవడంతో.. జాగీ ఎలా మృతి చెందారనే అంశంపై సరైన సమాచారం రాబట్టలేకపోయామ’ని పోలీసులు తెలిపారు. కాగా, 38 ఏళ్ల జాగీ ఓ టీవీ చానల్లో వంటల పోగ్రామ్ నిర్వహిస్తున్నారు. బ్యూటీ షోలకు ఆమె జడ్జిగా వ్యవహరిస్తున్నారు. అలాగే ఆమె గాయనిగా, మంచి వక్తగా గుర్తింపు పొందారు. -
మలయాళ కవి అక్కితమ్‌కు జ్ఞానపీఠ్
న్యూఢిల్లీ: ప్రముఖ మలయాళ కవి అక్కితమ్ అచ్యుతన్ నంబూద్రి ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ్ అవార్డుకు ఎంపికయ్యారు. అక్కితమ్‌ను 55వ జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపిక చేస్తున్నట్లు ఎంపిక కమిటీ శుక్రవారం ప్రకటించింది. ‘అక్కితమ్ అరుదైన సాహితీవేత్త. కలకాలం నిలిచిపోయే ఎన్నో రచనలు చేశారు. ఆయన కవిత్వం అపారమైన కరుణను ప్రతిబింబిస్తుంది. భారతీయ తాత్వికత, నైతిక విలువలకు, సంప్రదాయం, ఆధునికతకు వారధిగా ఆయన కవిత్వం నిలుస్తుంది. వేగంగా మారుతున్న సమాజంలో మానవ భావోద్వేగాలకు ఆయన కవిత్వం అద్దంపడుతుంది’ అని జ్ఞానపీఠ్ ఎంపిక బోర్డు చైర్మన్ ప్రతిభా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మలయాళ సాహితీవేత్తల్లో ప్రముఖుడైన అక్కితమ్ కేరళలో 1926లో జన్మించారు. అక్కితమ్ కవితలతోపాటు నాటకాలు, విమర్శనాత్మక వ్యాసాలు, పిల్లల సాహిత్యం, కథలు, అనువాదాల్లోనూ తనదైన ముద్ర వేశారు. అక్కితమ్ ఇప్పటి వరకు 55 పుస్తకాలు రాశారు. సాహిత్య అకాడమీ అవార్డు, కేరళ సాహిత్య అకాడమీ అవార్డు, కబీర్ సమ్మాన్ వంటి పురస్కారాలు అందుకున్నారు. -
సూఫీ సుజాత
అదితీరావ్ హైదరీ తన యాక్టింగ్ కెరీర్‌ను మలయాళం సినిమాతోనే మొదలుపెట్టారు. ఆ తర్వాత హిందీ సినిమాల్లో నటిస్తూ పాపులారిటీ సంపాదించారు. ముఖ్యంగా ‘పద్మావత్’ ఆమెకు బ్రేక్ తెచ్చిందని చెప్పాలి. అలాగే మణిరత్నం దర్శకత్వంలో చేసిన ‘చెలియా’, ‘నవాబ్’ చిత్రాలూ మంచి పేరు తెచ్చాయి. ఒకవైపు హిందీ సినిమాల్లో నటిస్తూనే తెలుగు, తమిళ సినిమాలూ చేస్తున్నారు. పదమూడేళ్ల తర్వాత ఓ మలయాళ సినిమాలో నటించబోతున్నారు అదితీ. 2006లో మమ్ముట్టి హీరోగా వచ్చిన ‘ప్రజాపతి’ సినిమా ద్వారా మలయాళ తెరకు హీరోయిన్గా పరిచయమయ్యారు అదితీ. మళ్లీ 13 ఏళ్లకు నరానిపుళ షానవాస్ తెరకెక్కించబోయే ‘సూఫియుమ్ సుజాతయుమ్’ సినిమాలో అదితీరావ్ హీరోయిన్గా నటించబోతున్నారు. సంగీత ప్రధానంగా సాగే సినిమా ఇది. సుజాత పేరు అదితీ రావ్ పాత్రది అని ఊహించవచ్చు. -
మళ్లీ మలయాళంలో..
కెరీర్ ఆరంభించిన పదహారేళ్లకు త్రిష మలయాళంలో గత ఏడాది తొలి సినిమా (హే జ్యూడ్) చేశారు. ఈ ఏడాది మళ్లీ కేరళ ప్రేక్షకులను పలకరించనున్నారని సమాచారం. మోహన్‌లాల్ సరసన ఓ సినిమా చేయడానికి అంగీకరించారట. దాదాపు ఆరేళ్ల క్రితం మోహన్‌లాల్ హీరోగా ‘దృశ్యం’ వంటి సూపర్ హిట్ మూవీ అందించిన జీతూ జోసెఫ్ ఈ చిత్రానికి దర్శకుడు. ‘దృశ్యం’ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రీమేక్ అయిన విషయం తెలిసిందే. జీతు జోసెఫ్ తెరకెక్కించే కథలు అలా అన్ని భాషలకూ సరిపోతుంటాయి. తాజా చిత్రాన్ని మలయాళ, తమిళ భాషల్లో రూపొందించనున్నారట. నవంబరులో చిత్రీకరణ మొదలుపెట్టనున్నారని తెలిసింది. ఈ సినిమాకి సంబంధించిన ఎక్కువ శాతం షూటింగ్ ఫారిన్లో జరుగుతుందట. ఈజిప్ట్, యూకె, కెనడా లొకేషన్స్‌లో చిత్రీకరణ ప్లాన్ చేశారని మాలీవుడ్ టాక్. -
కార్తీక దీప
ప్రేమి విశ్వనాథ్ అంటే మనవాళ్లకు అంతగా తెలియకపోవచ్చు. కానీ, ‘కార్తీకదీపం’ సీరియల్ ‘దీప’ అనగానే ఇట్టే గుర్తుపట్టేస్తారు. నల్లటి రూపంతో చిన్నితెర మీద ప్రముఖ నటిగా వెలుగొందుతున్న ప్రేమి విశ్వనాథ్ పుట్టినిల్లు కేరళలోని ఎర్నాకులం. మలయాళం టెలివిజన్‌లో ‘కరతముత్తు’ (తెలుగు కార్తీక దీపం) అనే సీరియల్ ద్వారా ప్రేమి అక్కడివాళ్లకు కార్తీకగా పరిచమయ్యింది. బ్లాక్బ్యూటీగా మనవారిచేత అభినందనలు అందుకుంటున్న దీప ఆఫ్‌స్క్రీన్‌లో ఫెయిర్‌గా ఉంటుంది. అంతే ఫెయిర్‌గా తన మనసులోని విషయాలను పంచుకుంటుంది. సీరియల్లో ఈ పాత్రను మీరెలా ఒప్పుకున్నారు? సినిమానే కాదు టెలివిజన్ పరిశ్రమ కూడా గ్లామర్‌నే చూపిస్తుంది. ఫెయిర్‌గా ఉండే హీరోయిన్సే ఆన్ స్క్రీన్ మీద కనిపిస్తారు. అయితే, ఈ సీరియల్లోని ప్రధాన పాత్ర ఒంటి రంగు నలుపుగా ఉండటం ఇందులోని కాన్సెప్ట్. దాన్నే సవాల్‌గా తీసుకున్నాను. తెలుగు సీరియల్లో డాక్టర్ కార్తీక్ (నిరుపమ్ పరిటాల) భార్యగా నటించాను. మీ గురించి తెలుసుకోవచ్చా? మా అమ్మనాన్నలు విశ్వనాథ్, కాంచన. భర్త డా.టి.ఎస్.వినీత్ భట్. అతను ప్రముఖ ఆస్ట్రాలజర్. నేను లా చేశాను. కొచ్చిలో ఒక ప్రైవేటు సంస్థలో లీగల్ అడ్వైజర్‌గా పనిచేసేదాన్ని. మా అన్నయ్య శివప్రసాద్ ఫొటోగ్రాఫర్, ఆర్టిస్ట్ కూడా. ఆ విధంగా నాకూ ఫొటోగ్రఫీ అబ్బింది. పెళ్లిళ్లకు ఫొటోలు తీసేదాన్ని. ఫొటోగ్రఫీ అంటే నాకు పిచ్చి. ముఖ్యంగా ప్రకృతి సౌందర్యాన్ని కెమెరాలో బంధించడం చాలా ఇష్టం. నేనో ట్రావెల్ ఏజెన్సీని కూడా నడుపుతున్నాను. ‘కరతముత్తు’ (మలయాళం సీరియల్) లో కెమెరా ముందు నటించడానికి మా స్టూడియోలో కెమెరా ముందు చేసిన మోడలింగ్ బాగా ఉపయోగపడింది. ‘దీప’ గురించి చెప్పండి.. ‘కరతముత్తు’ సీరియల్ 2013లో మలయాళం టెలివిజన్‌లో మొదలయ్యింది. ఆ తర్వాత తెలుగులో 2017లో రీమేక్ అయ్యింది. ‘కరతముత్తు’లో నా పాత్రకు ఎంత మంచి పేరు వచ్చిందో తెలుగులో దీప (కార్తీకదీపం) క్యారెక్టర్‌కి అంతే మంచి పేరొచ్చింది. ఈ సీరియల్ కోసం మేకప్‌కి, క్యాస్టూమ్స్కి కనీసం రెండు గంటలు పడుతుంది. నా కుటుంబం, స్నేహితులకు నేను తెలిసినప్పటికీ నాకు ఇంతగా గుర్తింపు వచ్చింది మాత్రం సీరియల్ ద్వారానే. ఈ సీరియల్ ద్వారా ఏషియానెట్ టెలివిజన్ అవార్డ్, స్టార్ మా పరివార్ అవార్డ్స్ అందుకోవడం మర్చిపోలేని అనుభూతి. ఫ్యూచర్ గురించి ఫుల్ టైమ్ యాక్టర్‌గానే ఉంటాను. ఈ సీరియల్ ఉన్నంతవరకు ఇందులోనే కొనసాగుతాను. సీరియల్ రేటింగ్ పెరగడానికి స్టోరీ లైన్లో మార్పుల కోసం నేనూ చర్చలో పాల్గొంటుంటాను. కొత్త విషయాల గురించి తెలుసుకుంటుంటాను. ఆ తర్వాత అంటారా.. ఏదైనా వ్యాపారం కొనసాగిస్తాను. సినిమాల్లో యాక్ట్ చేయచ్చు. నేను డ్యాన్సర్‌ని కూడా. స్టేజ్ షోల మీద నృత్యప్రదర్శనలు కూడా ఇచ్చాను. -
ఇక మాలీవుడ్‌లోనూ!
విజయ్ దేవరకొండ, షాలినీ పాండే జంటగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ‘అర్జున్‌రెడ్డి’ సినిమా టాలీవుడ్లో ఎంత ఘనవిజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆల్రెడీ తమిళంలో ‘వర్మ’ అనే టైటిల్‌తో బాల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. విక్రమ్ తనయుడు ధృవ్ హీరో. అలాగే షాహిద్ కపూర్ హీరోగా హిందీ ‘అర్జున్ రెడ్డి’ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఒరిజినల్ డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగానే ఈ చిత్రానికి దర్శకుడు. ఇప్పుడు తెలుగు ‘అర్జున్‌రెడ్డి’ సినిమా మలయాళంలో కూడా రీమేక్ కాబోతుందని వార్తలు వస్తున్నాయి. కానీ అధికారిక సమాచారం అందాల్సి ఉంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే.. మల్లూ అర్జున్‌రెడ్డి ఎవరు? అనే విషయం పై మాలీవుడ్‌లో చర్చ జరగడం ఖాయం. -
అమ్మతో పెట్టుకుంటే అంతే సంగతులా?
ఈ ప్రపంచంలో ఎవరు మన మేలు కోరుకున్నా కోరుకోకపోయినా మనం బాగుండాలని కోరుకునే ఏకైక వ్యక్తి ‘అమ్మ’. తప్పు చేసినా క్షమించే గుణం అమ్మకి ఉంటుంది. మరి.. అమ్మతో పెట్టుకుంటే అంతే సంగతులా? అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే.. ఈ ‘అమ్మ’ వేరు. ‘అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్’ (అమ్మ). కేరళ నటీనటుల సంఘం అన్నమాట. కథానాయిక భావనపై జరిగిన లైంగిక దాడిలో జోక్యం ఉందనే కారణంగా నటుడు దిలీప్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే. దీనివల్ల ‘అమ్మ’లో దిలీప్ సభ్యత్వం రద్దయింది. బెయిల్ మీద బయటికొచ్చిన దిలీప్ని మళ్లీ అసోసియేషన్‌లో చేర్చుకోవాలని ‘అమ్మ’ అధ్యక్షుడు మోహన్‌లాల్, ఇతర సభ్యులు నిర్ణయం తీసుకోవడంపట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన నటీమణుల్లో రమ్యా నంబీసన్ ఒకరు. బాధిత నటికి అండగా ఉండటం కోసం ‘అమ్మ’కు ఆమె రాజీనామా చేసిన వెంటనే రమ్యా నంబీసన్, రీమా కల్లింగల్ వంటి తారలు తామూ రాజీనామా చేశారు. ఆ తర్వాత అవకాశాలు తగ్గుటున్నట్లు అనిపించిందని ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న రమ్యా నంబీసన్ పేర్కొన్నారు. ‘‘అమ్మ’ నుంచి బయటికొచ్చాక అభద్రతాభావం ఏర్పడింది. అవకాశాలు తగ్గుతున్నాయని గ్రహించాను. అది మాత్రమే కాదు.. నేను షూటింగ్స్‌కి సరిగ్గా రానని, నిర్మాతలను ఇబ్బంది పెడతానని, అందుకని నన్ను తీసుకోకూడదనీ ప్రచారం చేస్తున్నారు. కానీ నేనెప్పుడూ ఎవర్నీ ఇబ్బందిపెట్టలేదు. ‘అమ్మ’ తీసుకున్న నిర్ణయాన్ని తోటి నటీమణులతో కలసి వ్యతిరేకించాను కానీ నేను ఏం మాట్లాడినా అది మొత్తం మగవాళ్లందర్నీ వ్యతిరేకిస్తున్నట్లు కాదు కదా. ఒక సమస్య ఉంది.. పరిష్కరించండి అన్నాం. అది తప్పా’’ అని రమ్యా నంబీసన్ అన్నారు. నిజమే కదా. నిర్భయంగా మాట్లాడితే లేనిపోని నిందలు వేయడం న్యాయమా? -
‘నేనూ కాస్టింగ్ కౌచ్ బాధితుడినే’...!
నటీమణుల కాస్టింగ్ కౌచ్ ఉదంతాలు దాదాపు అన్ని భాషల ఇండస్ట్రీల్లో వెలుగు చూస్తున్నాయి. అయితే కేవలం హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టుల విషయంలోనే కాదని, మేల్ ఆర్టిస్టులకు కూడా వేధింపులు తప్పటం లేదని ఓ యువనటుడు ఆరోపిస్తున్నాడు. మాలీవుడ్‌కు చెందిన నవజీత్ నారాయణ్ అనే టాలెంటెడ్ హీరో తనకు ఎదురైన అనుభవాన్ని వివరిస్తూ ఫేస్బుక్లో ఓ పోస్టు పెట్టాడు. ఓ చిత్రం సందర్భంగా దర్శకుడు తనతో అసభ్యంగా ప్రవర్తించిన తీరును అతను వివరిస్తూ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘కెరీర్ ప్రారంభంలో అవకాశాల కోసం స్ట్రగుల్ అవుతున్న రోజులవి. ఒకరోజు సినిమా ఛాన్స్ ఇప్పిస్తానని ఓ దర్శకుడు ఆఫీస్‌కు రమ్మన్నాడు. తీరా అక్కడికెళ్లాక గదిలోకి రమ్మని తేడాగా ప్రవర్తించాడు. నా తొడలపై చెయ్యేసి, ప్యాంట్ లోపలికి చెయ్యి పోనిచ్చాడు. నాకు చిర్రెత్తుకొచ్చి అతని మీద అరిచా. లాగి గూబ మీద ఒక్కటి పీకా. ఆపై ఆ దర్శకుడికి వార్నింగ్ కూడా ఇచ్చి అక్కడి నుంచి వచ్చేశా. తర్వాతే తెలిసింది అతనో హోమో సెక్సువల్ అని.. ఇండస్ట్రీలో మహిళలకే కాదు.. మేల్ ఆర్టిస్టులకు కూడా రక్షణ లేదు’ అంటూ పోస్ట్ చేశాడు. అయితే ఆ దర్శకుడు ఎవరన్న విషయం చెప్పేందుకు అతను నిరాకరించాడు. మరోవైపు భోజ్‌పురి స్టార్ హీరో, పలు తెలుగు చిత్రాల్లో నటించిన రవికిషన్ కూడా గతంలో ఓ ఇంటర్వ్యూలో ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అయితే పురుషుల నుంచి కాకుండా మహిళల నుంచే మేల్ ఆర్టిస్టులకు వేధింపులు జరుగుతున్నాయని ఆయన చెప్పటం గమనార్హం. -
విలేకరిపై కేసును ఖండించిన ఐఎన్ఎస్
న్యూఢిల్లీ: మలయాళ టీవీ చానల్ ‘మాతృభూమి న్యూస్’కు చెందిన ప్రముఖ యాంకర్‌పై మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని కేరళ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేయడాన్ని ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ(ఐఎన్ఎస్) ఖండించింది. ఇలాంటి చర్యలతో కేరళ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని విమర్శించింది. ప్రజాస్వామ్య దేశంలో మీడియాపై ఇలాంటి దాడులు పత్రికా స్వేచ్ఛకు, స్వతంత్రంగా ఆలోచించి, మాట్లాడే సంస్కృతికి గొడ్డలిపెట్టుగా మారతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఎఫ్ఐఆర్ను రద్దుచేయాలని ప్రభుత్వానికి ఐఎన్ఎస్ విజ్ఞప్తి చేసింది.