![Nivetha Thomas Childhood Pic With Her Father Goes Viral - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/18/nivedha.jpg.webp?itok=Nq47p4zX)
బాల్యంలోనే సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి.. నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంది. సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ నటించింది. టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఆమె వరుస సినిమాలతో అదరగొట్టింది. ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. పై ఫోటోలో తన తండ్రి చేతిలో క్యూట్‌గా కనిపిస్తోన్న ఆ చిన్నారి తెలుగులో స్టార్ హీరోయిన్. ఇంతకీ ఎవరో మీరు గుర్తు పట్టారా?
(ఇది చదవండి: డబ్బుల కోసం పెళ్లి చేసుకుంటే ఇలానే ఉంటుంది: కంగనా కౌంటర్)
ఆ ఫోటోలోని క్యూట్ చిన్నారి ఎవరంటే.. మలయాళీ ముద్దుగుమ్మ నివేదా థామస్. నేచురల్ స్టార్ నాని జెంటిల్‌మెన్ మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భామ.. ఆ తర్వాత నిన్నుకోరి, జై లవ కుశ, 118, బ్రోచేవారెవరురా, వి, జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్, వకీల్ సాబ్ చిత్రాల్లో నటించింది. అంతేకాకుండా శాకిని డాకిని లాంటి లేడీ ఓరియంటెడ్ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించింది. అంతకుముందే ఓరుతే వేరు భార్య చిత్రంలో మలయాళ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి.. తమిళంలోనూ చాలా సినిమాల్లో నటించింది.
(ఇది చదవండి: అవతార్-2ను మించిన టికెట్ ధరలు.. ఆ సినిమాకు ఎందుకంత క్రేజ్!)
కాగా.. ఈ ఏడాది ‘ఎంతడా సాజి’ అనే మలయాళ మూవీలో కనిపించిన భామ.. ప్రస్తుతం ఎలాంటి సినిమాలో నటించడం లేదు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది.
Comments
Please login to add a commentAdd a comment