తప్పనిసరి సబ్జెక్టుగా మలయాళం | Malayalam as a compulsory subject | Sakshi
Sakshi News home page

తప్పనిసరి సబ్జెక్టుగా మలయాళం

Published Wed, Apr 12 2017 1:45 AM | Last Updated on Tue, Sep 5 2017 8:32 AM

తప్పనిసరి సబ్జెక్టుగా మలయాళం

తప్పనిసరి సబ్జెక్టుగా మలయాళం

తిరువనంతపురం: కేరళలో మాతృభాష మలయాళాన్ని అన్ని స్కూళ్లలో తప్పనిసరి సబ్జెక్టుగా చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. ఆర్డినెన్స్‌ ప్రకారం రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో (ప్రభుత్వ, ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ అనుబంధమున్న స్కూళ్లు, సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌) పదో తరగతి వరకు మలయాళంను తప్పనిసరిగా బోధించాలి.

ఈ నిర్ణయం రానున్న విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి రానున్నట్లు ముఖ్యమంత్రి విజయన్‌ మీడియాకు తెలిపారు. మలయాళం బోధించని పాఠశాలలను రద్దు చేస్తామని ప్రకటించారు. ఈ కొత్త నియమాన్ని పాటించని పాఠశాల ప్రధానోపాధ్యాయులపై రూ. 5 వేల జరిమానా విధిస్తామని చెప్పారు. కానీ ఈ విషయంలో ఇతర రాష్ట్ర విద్యార్థులు, విదేశీ విద్యార్థులకు మినహాయింపునిచ్చారు. ఈ ఆర్డినెన్స్‌కు ఆ రాష్ట్ర గవర్నర్‌ పి.సదాశివం ఆమోదం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement