Ordinance
-
యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుకు ఆర్డినెన్స్?
సాక్షి, యాదాద్రి: యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు (వైటీడీబీ) ఏర్పాటుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ తేనుంది. గత నెల సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన జరిగిన సమావేశంలో వైటీడీబీ ఏర్పాటుపై చర్చించారు. ఈ నెల 12వ తేదీలోగా వైటీడీబీని ఏర్పాటు చేస్తూ ప్రభు త్వం ఆర్డినెన్స్ తేవాల్సి ఉండగా, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ (Election Code) అమలులోకి వచ్చింది. దీంతో కోడ్ ముగిసిన తర్వాత ఆర్డినెన్స్‌ను ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆర్డినెన్స్‌ను ఆరు నెలల్లోపు ఆమోదించాల్సి ఉంటుంది కాబట్టి ఈ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో చట్టబద్ధత కల్పించే అవకాశం ఉంది.చైర్మన్, పాలకవర్గం నియామకం యాదగిరిగుట్ట (yadagirigutta) దేవస్థానం బోర్డుకు చైర్మన్‌తోపాటు పాలకవర్గం సభ్యులు 11 మందిని నామినేట్ చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. వీరికి తోడు ఆరుగురు ఎక్స్అఫీషియో సభ్యులను నియమిస్తారు. ప్రస్తుతం ఉన్న వంశపారంపర్య ధర్మకర్త దేవస్థానం పాలకవర్గంలో సభ్యుడిగా ఉంటారు. కాగా, సీఎం చైర్మన్‌గా గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ(వైటీడీఏ) మొత్తం నూతనంగా వచ్చే వైటీడీబీ పరిధిలోకి రానుంది. దేవస్థానం పరిపాలన వ్యవహారాలు, ఉద్యోగుల బదిలీలు, భక్తుల వసతులు, దేవస్థానం అభివృద్ధి పనులను వైటీడీబీ పర్యవేక్షణలోకి తేనున్నారు. స్వాగత తోరణానికి రంగులు యాదగిరిగుట్ట దేవస్థానం స్వాగత తోరణానికి రంగులు వేయాలని సీఎం రేవంత్‌రెడ్డి దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. కొండపైన భక్తులకు స్వాగతం పలికే తోరణాన్ని సిమెంట్‌తో నిర్మించారు. నవంబర్‌లో సీఎం యాదగిరిగుట్టకు వచ్చిన సమయంలో తోరణం నిర్మాణ శైలి వివరాలను తెలుసుకున్నారు. గత నెలలో జరిగిన సమీక్షా సమావేశంలో స్వాగత తోరణానికి ఆకర్షణీయమైన రంగులు వేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధికారులు పనులు ప్రారంభించారు.చదవండి: అయ్యో దేవుడా.. ఎందుకు ఇలా చేశావ్? యాగశాల ఏర్పాటుకు మార్కింగ్యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 23న నిర్వహించనున్న మహాకుంభ సంప్రోక్షణకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా యాగశాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. సోమవారం ఆలయ ఉత్తర మాడ వీధిలో మార్కింగ్ చేశారు. 32 ఫీట్ల వెడల్పు, 32 ఫీట్ల పొడవుతో యాగశాలను నిర్మాణం చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. -
‘హైడ్రా’కు చట్టబద్ధత.. ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపిన తెలంగాణ గవర్నర్
-
హైడ్రా ఆర్డినెన్స్ అధికారిక ఉత్తర్వులు జారీ
-
హైడ్రా ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోద ముద్ర
-
ఇప్పటికైతే ప్రత్యేకంగా లేదు!
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో జలవనరులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కోసం ప్రత్యేక చట్టం అమలులోకి రావడానికి మరికొంత సమయం పడుతుందని తెలుస్తోంది. శాసనసభ శీతాకాల సమావేశాలలోపు దానికి రూపం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈలోపు హైడ్రాకు పూర్తి చట్టబద్ధత కల్పిస్తూ, మరింత బలోపేతం చేయడానికి ఆరు శాఖలకు చెందిన చట్టాలను సవరిస్తున్నారు. దీనికి శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశం కూడా ఆమోదముద్ర వేయడంతో త్వరలో ఆర్డినెన్స్ వెలువడనుంది. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి అధికార విభాగాలు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాయి. రెవెన్యూ, నీటిపారుదల, పురపాలక, జీహెచ్ఎంసీ, బీపాస్, వాల్టా, ఫైర్ సర్విసెస్ చట్టాల్లోని కీలకాంశాలను సవరించనున్నారు. వీటి కింద నోటీసులు జారీ సహా వివిధ అధికారాలను సైతం హైడ్రాకు అప్పగించనున్నారు. జీహెచ్ఎంసీ చట్టం–1955 ప్రకారం ఆక్రమణలను పరిశీలించడం, నోటీసులు ఇవ్వడం, ప్రభుత్వ స్థలాల్లో అక్రమ కట్టడాలను తొలగించడం, అనధికార హోర్డింగ్స్‌పై చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే జరిమానాలు విధించడం తదితర అధికారాలు ఇప్పటి వరకు జీహెచ్ఎంసీకి మాత్రమే ఉన్నాయి. కొత్త కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఏర్పాటైన తర్వాత అమలులోకి వచ్చిన తెలంగాణ పురపాలక చట్టం–2021 ప్రకారం ఆయా పురపాలికలకూ ఇవి దఖలయ్యాయి. బీపాస్ చట్టం–2020 ప్రకారం జోనల్ కమిషనర్ల నేతృత్వంలోని జోనల్ టాస్‌్కఫోర్స్, జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా టాస్క్‌ఫోర్స్‌లకు ఇలాంటి అక్రమ కట్టడాలు, కబ్జాలపై చర్యలకు అధికారాలు వచ్చాయి. హెచ్ఎండీఏ చట్టం–2008లో 8, 23 ఏ సెక్షన్ల కింద ఆ విభాగం కమిషనర్‌కు కూడా విశేషాధికారాలు ఉన్నాయి. తెలంగాణ భూ ఆదాయ చట్టంలోని 1317ఎఫ్ సెక్షన్ ప్రకారం అక్రమ కట్టడాల తొలగింపు, ప్రభుత్వ ఆస్తుల సంరక్షణకు సంబంధించి రెవెన్యూ డివిజనల్ అధికారితో పాటు కలెక్టర్‌కు అధికారం ఉంటుంది. తెలంగాణ ఇరిగేషన్ యాక్ట్ 1357ఎఫ్ ప్రకారం నీటిపారుదల శాఖ అధికారి, జిల్లా కలెక్టర్‌కు జలవనరులైన చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణకు ప్రత్యేక అధికారాలు ఉంటాయి. జీవోఎంఎస్ నం.67 ద్వారా 2002లో యూడీఏలతో పాటు ఎగ్జిక్యూటివ్ అధికారులకు, తెలంగాణ భూ ఆక్రమణల చట్టం–1905లోని 3, 6, 7, 7ఏ సెక్షన్ల కింద జిల్లా కలెక్టర్, తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్లకూ చర్యలు తీసుకునే అధికారం ఇచ్చారు. ఈ యాక్ట్‌లతో పాటు వాల్టా చట్టం–2002, జీవోఎంఎస్–168 ప్రకారం తెలంగాణ బిల్డింగ్ రూల్స్, తెలంగాణ ఫైర్ సరీ్వసెస్ యాక్ట్–1999లకూ సవరణ చేసి హైడ్రాకు అవసరమైన అధికారాలు ఇస్తున్నారు. న్యాయ విభాగం సిఫార్సుల ప్రకారం హైడ్రా గవరి్నంగ్ బాడీలో చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మిని్రస్టేషన్కు (సీసీఎల్ఏ) స్థానం కల్పించనున్నారు. ఈ మార్పుచేర్పులతో పాటు మరిన్ని కీలకాంశాలను హైడ్రా యాక్ట్‌లో పొందుపరచనున్నారని తెలిసింది. -
దారికొచ్చిన ఎన్డీయే సర్కారు!
అలవాటైన పద్ధతిలో వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లును గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఎన్డీయే ప్రభుత్వానికి కాసేపటికే తత్వం బోధపడినట్టుంది. విపక్షాల నుంచి ప్రతిఘటన ఎదురుకావటంతో దాన్ని సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపటానికి అంగీకరించింది. కారణమేదైనా అభ్యంతరాలు వ్యక్తమైనప్పుడు జేపీసీకి లేదా సెలెక్ట్ కమిటీకి పంపటం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఒక సంప్రదాయం. కానీ ఎన్డీయే అధికారంలోకి వచ్చాక కేవలం రెండు సంద ర్భాల్లో మాత్రమే పాటించింది. పదేళ్లనాడు గద్దెనెక్కగానే అంతకు కొన్ని నెలలముందు అమల్లోకొచ్చిన భూసేకరణ చట్టం పీకనొక్కుతూ ఆదరా బాదరాగా ఆర్డినెన్స్ తీసుకురావటం ఎవరూ మరిచిపోరు. విపక్షాలు అభ్యంతరం చెబుతున్నా ఆనాడు చెవికెక్కలేదు. ఆర్డినెన్స్ మురిగి పోయిన రెండుసార్లూ దానికి ప్రాణప్రతిష్ఠ చేస్తూ తిరిగి ఆర్డినెన్సులు తీసుకొచ్చారు. రాజ్యసభలోగండం గడిచేలా లేదని గ్రహించాక ఇక దాని జోలికి పోరాదని నిర్ణయించుకున్నారు. అటుపై సాగు చట్టాల విషయంలోనూ రైతులనుంచి ఇలాంటి పరాభవమే ఎదురయ్యాక వాటినీ ఉపసంహరించుకున్నారు. ఐపీసీ, సాక్ష్యాధారాల చట్టం, సీఆర్పీసీ స్థానంలో వచ్చిన కొత్త చట్టాల తాలూకు బిల్లులపై కూడా సంబంధిత వర్గాలను సరిగా సంప్రదించలేదు. ఎన్డీయే ఏలుబడి మొదలయ్యాక చోటుచేసుకున్న వేర్వేరు ఉదంతాల పర్యవసానంగా ముస్లిం సమాజంలో ఒక రకమైన అభద్రతాభావం ఏర్పడిన నేపథ్యంలో ఈ వివాదాస్పద చర్యకు కేంద్రం ఎందుకు సిద్ధపడిందో తెలియదు. బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని ఎన్డీయే భాగస్వామ్య పక్షం జేడీ(యూ) నేత, కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అంటున్నారు. ఇది పారదర్శకత తీసుకొస్తుందని కూడా ఆయన సెలవిచ్చారు. మంచిదే. మరి ఆ వర్గంతో సంప్రదింపులు జరిగిందెక్కడ? ముస్లిం సమాజానికున్న అభ్యంతరాల సంగతలా వుంచి రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలకు సైతం ఇది ఎసరు పెడుతోంది. రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్ ప్రకారం భూమి రాష్ట్రాల జాబితాలోనిది.వక్ఫ్ ఆస్తిపై కేంద్ర పెత్తనాన్ని అనుమతించటంద్వారా దాన్ని కాస్తా తాజా బిల్లు నీరుగారుస్తోంది. కనుక ముస్లిం సమాజంతో మాత్రమేకాదు...రాష్ట్రాలతో కూడా సంప్రదించాల్సిన అవసరం లేదా? హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీలకు జరగబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఈ బిల్లు తెచ్చారని లోక్‌సభలో విపక్షాలు చేసిన విమర్శలు కాదని చెప్పటానికి ప్రభుత్వం దగ్గర జవాబు లేదు. తన చర్య వెనక సదుద్దేశం ఉందనుకున్నప్పుడూ, బిల్లుపై ఉన్నవన్నీ అపోహలే అని భావించి నప్పుడూ తగిన సమయం తీసుకుని సంబంధిత వర్గాలతో చర్చించటానికేమైంది? ఒకవేళ వచ్చే అసెంబ్లీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకునే హడావిడిగా బిల్లు తీసుకొచ్చి వుంటే అంతకన్నా తెలివి తక్కువతనం ఉండదు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఆ మాదిరి ఎత్తుగడలను జనం ఏవగించు కున్నారని బీజేపీకి అర్థమయ్యే వుండాలి.సవరణ బిల్లు ద్వారా తీసుకొచ్చిన 44 సవరణల పర్యవసానంగా వక్ఫ్ బోర్డుల అధికారాలకు కత్తెరపడుతుందని, ప్రభుత్వ నియంత్రణ పెరుగుతుందని కనబడుతూనేవుంది. అరుదైన సంద ర్భాల్లో తప్ప కలెక్టర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటారని ఎవరూ అనుకోరు. ఫలానా ప్రార్థనాస్థలం శతాబ్దాలక్రితం తమదేనంటూ ఆందోళనలు చేయటం, దానికి ప్రభుత్వాలు వత్తాసు పలుకుతుండటం అక్కడక్కడ కనబడుతూనేవుంది. ఇంతకాలం వక్ఫ్ ట్రిబ్యున ళ్లకు ఉండే అధికారం కాస్తా కలెక్టర్లకు ఇవ్వాలని బిల్లు ప్రతిపాదిస్తోంది.బోర్డుల్లో ముస్లిమేతరులను సభ్యులుగా నియమించటం, ఆస్తిని విరాళంగా ఇవ్వటంపై ఆంక్షలు సంశయం కలిగించేవే. మతపరమైన, ధార్మికపరమైన కార్యకలాపాల నిర్వహణ కోసం వచ్చిన ఆస్తుల్ని పర్యవేక్షించటానికి ఏర్పడిన బోర్డుల్లో వేరే మత విశ్వాసాలున్నవారిని నియమించటం ఏరకంగా చూసినా సరికాదన్న ఇంగిత జ్ఞానం ఉండొద్దా? అసలు ఒకసారి బోర్డు దేన్నయినా వక్ఫ్ ఆస్తిగా ప్రకటిస్తే దాన్ని మార్చటం అసాధ్యమన్న ప్రచారం కూడా తప్పు. ఫలానా ఆస్తి బోర్డుదనుకుంటే సంబంధిత వర్గాలకు నోటీసులిచ్చి వారి వాదనలు పరిశీలించాకే నిర్ణయం తీసుకోవాలని ప్రస్తుత చట్టంలోని సెక్షన్40 చెబుతోంది. అటు తర్వాత వక్ఫ్ ట్రిబ్యునల్‌దే తుది నిర్ణయం. పైగా విరాళమిచ్చిన దాత కచ్చితంగా ఇస్లాంను పాటించే వ్యక్తే అయివుండాలని, దానంగా వచ్చే ఆస్తి కుటుంబవారసత్వ ఆస్తి కాకూడదని చట్టం నిర్దేశిస్తోంది. ఇప్పటికే ఇన్ని కట్టుదిట్టమైన నిబంధనలుండగా అందుకు భిన్నంగా ప్రచారం చేయటం సబబేనా? ఈ పరిస్థితుల్లో బిల్లు చట్టమైతే వక్ఫ్ ఆస్తుల చుట్టూ వివాదాలు ముసురుకుంటాయనుకునే అవకాశం లేదా? సంకీర్ణంలోని జేడీ(యూ), ఎల్జేపీలు బిల్లుకు మద్దతు పలకగా సభలో టీడీపీ సంకటస్థితిలో పడిన వైనం స్పష్టంగా కనబడింది. ఆ బిల్లుకు మద్దతిస్తుందట...కానీ జేపీసీకి ‘పంపితే’ వ్యతిరే కించబోదట! ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో పుట్టుకొచ్చిన బాబు రెండు కళ్ల సిద్ధాంతం ఇంకా సజీవంగా ఉందన్నమాట! టీడీపీది చిత్రమైన వాదన. అలా పంపనట్టయితే వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదించబోమని చెప్పడానికి నోరెందుకు రాలేదు? ఒకపక్క బిల్లు చట్టమైతే పారదర్శకత ఏర్పడుతుందన్న ప్రభుత్వ వాదనను సమర్థిస్తూనే తమ సెక్యులర్ వేషానికి భంగం కలగకుండా ఆడిన ఈ డ్రామా రక్తి కట్టలేదు. జాతీయ మీడియా దీన్ని గమనించింది. మొత్తానికి సవరణ బిల్లు జేపీసీకి వెళ్లటం శుభ పరిణామం. ఎన్డీయే సర్కారు ఈ సంప్రదాయాన్ని మున్ముందు కూడా పాటించటం ఉత్తమం. -
AP: ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆర్డినెన్స్ జారీ
సాక్షి, విజయవాడ: ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్సు జారీ చేసింది. రూ.1.29 లక్షల కోట్ల ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఏపీ గవర్నర్ ఆమోదం తెలిపారు. 4 నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ గవర్నర్ అబ్దుల్ నజీర్ జారీ చేశారు. నవంబర్ 30వ తేదీ వరకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రభుత్వం తీసుకొచ్చింది.కాగా, ఎన్నికల ముందు సూపర్ సిక్స్, సూపర్ టెన్ అంటూ ప్రజలకిచ్చిన హామీల అమలును ఎగ్గొట్టేందుకే ఈ నాలుగు నెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు చంద్రబాబు ప్రభుత్వం సంకల్పించింది. అంతకుముందు.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టి నాలుగు నెలల వ్యయానికి సభ అనుమతి తీసుకుంది. ఈ గడువు నేటితో (జూలై 31తో) ముగిసింది.సాధారణంగా అయితే.. ఎన్నికల ఫలితాలు అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వాలు తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడతాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఈనెల 23న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. చంద్రబాబు ప్రభుత్వం ఈనెల 22 నుంచి 26 వరకు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించినప్పటికీ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. -
నాలుగు నెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు నేడు ఆర్డినెన్స్!
సాక్షి, అమరావతి: నాలుగు నెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు చంద్రబాబు ప్రభుత్వం బుధవారం ఆర్డినెన్స్ జారీచేయనుంది. మంత్రుల ఆమోదం కోసం మంగళవారం వారికి సర్క్యులేషన్లో పంపగా వారు ఆన్లైన్లో దానికి ఆమోదం తెలిపారు. దీంతో.. దీనిని గవర్నర్‌కు పంపారు. ఆయన ఆమోదించాక రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఆర్డినెన్స్‌ను జారీచేస్తుంది. ఇక ఈ నాలుగు నెలల అత్యవసర వ్యయానికే ఆర్డినెన్స్ జారీచేస్తున్నట్లు సమాచారం.హామీలు ఎగ్గొట్టేందుకే..ఎన్నికల ముందు సూపర్ సిక్స్, సూపర్ టెన్ అంటూ ప్రజలకిచ్చిన హామీల అమలును ఎగ్గొట్టేందుకే ఈ నాలుగు నెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు చంద్రబాబు ప్రభుత్వం సంకల్పించింది. అంతకుముందు.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టి నాలుగు నెలల వ్యయానికి సభ అనుమతి తీసుకుంది. ఈ గడువు ఈ నెలాఖరుతో (జూలై 31తో) ముగియనుంది. సాధారణంగా అయితే.. ఎన్నికల ఫలితాలు అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వాలు తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడతాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఈనెల 23న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. చంద్రబాబు ప్రభుత్వం ఈనెల 22 నుంచి 26 వరకు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించినప్పటికీ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. పైగా.. శ్వేతపత్రాల పేరుతో ఆత్మస్తుతి పరనిందలతో గత ప్రభుత్వంపై ఆరోపణలకే అసెంబ్లీ సమావేశాలను ఉపయోగించుకుంది. గవర్నర్ ప్రసంగం ద్వారా అప్పులపై అవాస్తవాలను చెప్పించడంతో పాటు హామీలను తక్షణం అమలుచేయలేమని కూడా గవర్నర్‌తో చెప్పించింది. అంటే.. చంద్రబాబు నిజస్వరూపం ఇక్కడే బట్టబయలైంది. హామీలివ్వడమే తప్ప అమలుచేసే తత్వం తనది కాదని ఆయన రుజువు చేసుకున్నారు. అప్పులపై వాస్తవాలు బయటపడతాయనేవాస్తవానికి.. గవర్నర్ ప్రసంగం ఎన్నికల హామీలు అమలు అంశాలతో సాగడం రివాజు. కానీ, అందుకు పూర్తి భిన్నంగా చంద్రబాబు ప్రభుత్వం గవర్నర్ ప్రసంగాన్ని గత ప్రభుత్వంపై నిందలకే పరిమితం చేశారు. పూర్తిస్థాయి బడ్జెట్ పెడితే గత ప్రభుత్వం చేసిన అప్పుల వాస్తవాలను బడ్జెట్ డాక్యుమెంట్లో స్పష్టంచేయాల్సి వస్తుంది. అలాగే, ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు బడ్జెట్ కేటాయింపులు చేయాల్సి వస్తుంది. దీంతో శ్వేతపత్రాల ముసుగు లో అవాస్తవ ఆరోపణలతో కాలయాపన చేశారు. అసలు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున మరో నాలుగు నెలల వ్యయానికి ఓటాన్ బడ్జెట్‌కు సభ ఆమోదం తీసుకోవచ్చు. అలా చేయకుండా అసెంబ్లీ, మండలి సమావేశాలను ముగించేశారు. అసెంబ్లీ, ‘మండలి’ని మంగళవారం ప్రొరోగ్ చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. దీంతో.. బుధవారం నాలుగు నెలల వ్యయానికి ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్‌ను జారీచేయనుంది. ఇది అసెంబ్లీని అవమానించడమే..అసెంబ్లీ సమావేశాలను ముగించేసి, ఆర్డినెన్స్ ఇవ్వడం అంటే శాసనసభను అవమానించడమే అవుతుందని సీనియర్ రాజకీయవేత్తలు అంటున్నారు. పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టలేనంత అసాధారణ పరిస్థితులేవీ రాష్ట్రంలో లేవని.. కేంద్ర, రాష్ట్ర ఆదాయాలు ఎంత వస్తాయో స్పష్టంగా ఉన్నాయని, అయినాసరే చంద్రబాబు పూర్తి బడ్జెట్ పెట్టకుండా ఆర్డినెన్స్ ఎత్తుగడ వేశారంటే హామీలకు ఎగనామం పెట్టడానికేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం వంద రోజుల ప్రాధాన్యతల్లో సూపర్ సిక్స్ హామీలకు చోటులేదు. నాణ్యమైన లిక్కర్ బ్రాండ్స్, చెత్త తొలగింపు, నూతన ఇసుక విధానాలకే చోటుండటం గమనార్హం. -
అది విద్వేష ప్రసంగమే.. ప్రధానిపై చర్య తీసుకోండి: కాంగ్రెస్
న్యూఢిల్లీ: రాజస్తాన్‌లోని బర్మేర్‌లో బుధవారం ఎన్నికల ప్రచారంలో విద్వేష పూరిత ప్రసంగం చేసిన ప్రధాని మోదీపై చర్య తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘం(ఈసీ)ని కోరింది. కాంగ్రెస్‌కు మరణ శాసనం లిఖించేందుకు కమలం బటన్‌పై నొక్కాలంటూ ఓటర్లకు పిలుపునిచ్చారని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ తెలిపారు. ప్రధాని అహంకారానికి ప్రజలు తగు గుణపాఠం చెబుతారన్నారు. ‘కాంగ్రెస్ నేతలను మోదీ ఎంతగా ద్వేషిస్తున్నారో ఆయన ప్రసంగాన్ని చూస్తేనే తెలుస్తుంది. ప్రధానమంత్రి వంటి బాధ్యతాయుత పదవిలో ఉన్న వ్యక్తి ఇటువంటివి మాట్లాడొచ్చా? ఆయన ప్రజాస్వామ్యం గొంతు పిసికేస్తున్నారు. ఇది కచ్చితంగా విద్వేష ప్రసంగమే’అని జైరాం రమేశ్ గురువారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ప్రధానిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. బీజేపీ ఎన్నికల గుర్తు కమలం అన్న విషయం తెలిసిందే. -
నేడు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సీసీపీటీ వాహనాల విడుదల
సాక్షి, హైదరాబాద్: భారత రక్షణశాఖ అమ్ములపొదిలో మరో కీలక అస్త్రం చేరనుంది. మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తయారు చేసిన సీసీపీటీ(క్యారియర్ కమాండ్ పోస్ట్ ట్రాక్డ్) వాహనాలను సోమవారం సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో విడుదల చేయనున్నారు. మేకిన్ ఇండియాలో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో అనేక రక్షణ ఉత్పత్తులను ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉత్పత్తి చేస్తోంది. ఆర్మ్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్(ఏవీఎన్ఎల్) ఐదు ఉత్పత్తి యూనిట్లలో మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఒకటి. ఏవీఎన్ఎల్ ప్రధానంగా ఆర్మ్డ్ ఫైటింగ్ వెహికల్స్(మెయిన్ బ్యాటిల్ ట్యాంకులు), మైన్ ప్రొటెక్టెడ్ వెహికల్స్‌ని భారత సైన్యంలోని వివిధ విభాగాల కోసం తయారు చేస్తుంది. ఇప్పటికే టీ–90 ట్యాంక్, టీ–72 ట్యాంక్, బీఎంపీ–2(శరత్ ట్యాంక్), ఎంబీటీ అర్జున్ ఉండగా, యుద్ధక్షేత్రంలో మారుతున్న అవసరాలకు అనుగుణంగా తాజాగా ఈ క్యారియర్ కమాండ్ పోస్ట్ ట్రాక్డ్(సీసీపీటీ) వాహనాన్ని రూపొందించారు. సీసీపీటీ ప్రత్యేకతలు ఇవీ.. సీసీపీటీని డీఆర్డీవోలోని కంబాట్ వెహికల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్(సీవీఆర్డీఈ) రూపొందించింది. అన్ని వ్యూహాత్మక, సాంకేతిక అగ్ని నియంత్రణ విధుల కోసం దీనిని ప్రత్యేకంగా రూపొందించారు. ఆర్టిలరీ గన్ల అన్ని వెర్షన్ల ఫైర్ కంట్రోల్ ఫంక్షన్లను సాధించడం కోసం తయారు చేశారు. సీసీపీటీ అనేది అన్ని భారతీయ ఆర్టిలరీ గన్ కమాండ్ పోస్ట్ ఫంక్షన్లకు ఒక సాధారణ వేదికగా పనిచేస్తుంది. తొలుత 2018లో 43 వాహనాల సరఫరా కోసం మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి ఇండెంట్ ఇచ్చారు. వివిధ దశల్లో రూపొందించిన అనంతరం 2021లో మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ రెండు సీసీపీటీ వాహనాలు ఉత్పత్తి చేసి, ట్రయల్స్ కోసం భారత సైన్యానికి అప్పగించింది. వివిధ భూభాగాలు, వాతావరణ పరిస్థితులలో ప్రభావవంతంగా పని చేయగలదని ట్రయల్స్‌లో సీసీపీటీ వాహనాలు నిరూపించాయి. దీంతో వాటిని పూర్తిస్థాయిలో సైన్యంలో ప్రవేశపెట్టేవిధంగా సోమవారం వాటిని విడుదల చేయనున్నట్టు అధికారులు తెలిపారు. -
అసైన్డ్ భూములపై లబ్దిదారులకు యాజమాన్య హక్కులు.. ఆర్డినెన్స్ జారీ
సాక్షి, అమరావతి: అసైన్డ్ భూముల రైతుల తలరాతను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సమూలంగా మార్చేసింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా అసైన్డ్ భూములు పొందిన పేదలకు వాటిపై సంపూర్ణ హక్కులు కల్పి స్తూ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చింది. అసైన్డ్ భూములు కేటాయించి (అసైన్ చేసి) 20 ఏళ్లు పూర్తయితే వాటిని పొందిన వారికి ఆయా భూములపై యాజమాన్య హక్కులను కల్పించింది. ఈమేరకు 1977 ఏపీ అసైన్డ్ భూముల చట్టం (ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్) సవరణను ఆమోదిస్తూ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆర్డినెన్స్ జారీ చేశారు. మంత్రివర్గ కమిటీ సిఫారసు మేరకు భూమి లేని నిరుపేదలు వ్యవసాయం చేసుకుని దానిపై వచ్చే ఆదాయంతో జీవించేందుకు ప్రభుత్వాలు భూమిని కేటాయిస్తాయి. స్వాతం్రత్యానికి ముందు, ఆ తర్వాత రాష్ట్రంలో ఇలా లక్షల ఎకరాలను పేదలకు ఇచ్చారు. వాటికి చట్టపరంగా రక్షణ కల్పించేందుకు 1977లో అసైన్డ్ భూముల చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. దీని ప్రకారం ప్రభుత్వం అసైన్ చేసిన భూములపై అమ్మకాలు, కొనుగోళ్లు జరిపే అవకాశం లేకుండా నిషేధం విధించారు. దీంతో అత్యవసర సమయాల్లో భూమిని విక్రయించుకునేందుకు నిరుపేదలకు అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో భూములపై తమకు యాజమాన్య హక్కులు కల్పించాలంటూ నిరుపేద అసైన్డ్ రైతుల నుంచి ప్రభుత్వానికి చాలాసార్లు వినతులు వచ్చాయి. ఈ క్రమంలో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో నలుగురు మంత్రులు, ఎమ్మెల్యేలతో గతేడాది సెపె్టంబర్ 30న కమిటీని నియమించిన రాష్ట్ర ప్రభుత్వం దీనిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీనిపై విస్తృతంగా అధ్యయనం చేసిన కమిటీ అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించిన తమిళనాడు, కర్నాటకలో పర్యటించి అక్కడి విధానాలను పరిశీలించింది. అసైన్డ్ భూములపై హక్కులు కల్పించిన కేరళలో కూడా అధ్యయనం చేసింది. వాటన్నింటినీ పరిశీలించడంతోపాటు రాష్ట్రంలో పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వానికి నివేదిక సమరి్పంచింది. కేటాయించి 20 ఏళ్లు పూర్తయితే సంబంధిత రైతులకు అసైన్డ్ భూములపై పూర్తి యాజమాన్య హక్కులు కల్పించాలని కమిటీ సిఫారసు చేసింది. ప్రభుత్వం ఎవరికి భూమి కేటాయించిందో వారికే యాజమాన్య హక్కులు ఇవ్వాలని స్పష్టం చేసింది. జిల్లాలవారీగా జాబితాలు.. కమిటీ సిఫారసులను ఆమోదించిన మంత్రివర్గం అందుకు అనుగుణంగా అసైన్డ్ భూముల చట్టాన్ని సవరించాలని తీర్మానించింది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు లేనందున వెంటనే చట్ట సవరణ కోసం ఆర్డినెన్స్ జారీ చేసింది. ప్రభుత్వం అసైన్ చేసిన వ్యవసాయ భూములతోపాటు పేదలకిచ్చిన ఇళ్ల పట్టాలకు సైతం ఇది వర్తిస్తుందని సవరణ చట్టంలో స్పష్టం చేశారు. కేటాయించి పదేళ్లు దాటితే ఆయా ఇళ్ల స్థలాలపై లబ్దిదారులకు యాజమాన్య హక్కులు లభిస్తాయి. దీనిపై 2021లోనే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా ఇప్పుడు చట్టంలోనూ అందుకు వీలు కల్పించింది. వ్యవసాయ భూములైతే కేటాయించిన 20 ఏళ్లకు, ఇళ్ల స్థలాలైతే కేటాయించి పదేళ్లు పూర్తయిన వెంటనే వాటిపై సంబంధిత రైతులు, పేదలు, వారి వారసులకు యాజమాన్య హక్కులు లభిస్తాయి. వ్యవసాయేతర భూములను ఆనుకుని ఏవైనా అసైన్డ్ భూములు ఉంటే వాటిని అమ్ముకున్నప్పుడు ప్రస్తుత బేసిక్ మార్కెట్ విలువ చెల్లించాల్సి ఉంటుంది. చట్టం అమలుకు సంబంధించి ప్రభుత్వం విధి విధానాలను విడుదల చేయనుంది. వాటి ప్రకారం జిల్లాలవారీగా 20 ఏళ్లు పూర్తయిన అసైన్డ్ భూముల జాబితాను రూపొందిస్తారు. 1954 నుంచి 2014 వరకు రాష్ట్రంలో 33.29 లక్షల ఎకరాలను పేదలకు అసైన్ చేశారు. తాజా చట్ట సవరణ ప్రకారం 2003కి ముందు ఇచ్చిన భూములన్నింటిపైనా యాజమాన్య హక్కులు లభిస్తాయి. 1954 నుంచి 2003 వరకు 28 లక్షల ఎకరాలకుపైగా భూములను పేదలకివ్వగా వారంతా ఇప్పుడు లబ్ధి పొందనున్నారు. -
మణిపూర్ వ్యవహారం.. ఉభయ సభలు రేపటికి వాయిదా
Live Updates: ► పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో సోమవారం(జులై 31).. మణిపూర్ వ్యవహారంపై స్వల్పకాలిక చర్చకు ఇటు లోక్‌సభ స్పీకర్, అటు రాజ్యసభ చైర్మన్ అంగీకరించినా.. విపక్షాలు మాత్రం ప్రధాని మోదీ సమక్షంలో దీర్ఘకాలిక చర్చ జరగాలని పట్టుబడుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ కూడా నినాదాలతో తమ ఆందోళన కొనసాగించాయి. సభలు ముందుకు సాగకపోవంతో పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. తిరిగి మంగళవారం ఉదయం 11 గంటలకు ఉభయ సభలు మొదలుకానున్నాయి. ► పార్లమెంట్‌ను 9 రోజుల పాటు నినాదాలు చేసి సభలు జరగనివ్వకుండా పాడు చేశారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విపక్షాలపై మండిపడ్డారు. అయితే.. సినిమాటోగ్రాఫ్ (సవరణ) బిల్లు, 2023 మాత్రం ఇవాళ ఆమోదం పొందగలిగింది. తొలుత రాజ్యసభలో ఆమోదం పొందిన తర్వాత లోక్‌సభలో ఆమోదించబడింది. ► రాజ్యసభలో మణిపూర్ హింసపై స్వల్పకాలిక చర్చ ప్రారంభమైంది. ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళన చేస్తున్నాయి. ►పార్లమెంటులో మణిపూర్ మంటలు ఆరడం లేదు. గత పదిరోజులుగా ఉభయ సభల్ని మణిపూర్ అంశం కుదిపేస్తోంది. మధ్యాతర్వాత రాజ్యసభలో మణిపూర్‌పై చర్చకు సిద్ధమని తెలిపిన ప్రభుత్వం తెలిపింది. అయితే అవిశ్వాసంపై వెంటనే చర్చించాలంటూ లోక్‌సభలో విపక్షాలు పట్టుబట్టాయి. ►మణిపూర్ హింసాకాండపై ప్రతిపక్ష ఎంపీల నిరసనలు, నినాదాల మధ్య రాజ్యసభ కూడా మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. ►లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. మణిపూర్ ఘటనపై విపక్ష ఎంపీలో నినాదాలతో హోరెత్తించడంతో ప్రారంభమైన కొన్ని నిమిషాలకే లోక్‌సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. #WATCH | Leader of the House in Rajya Sabha, Piyush Goyal says "We want discussions on Manipur to take place in Parliament today at 2 pm. They (Opposition) are trying to misuse the liberty given to the members. The govt is ready to discuss Manipur, but they (Opposition) have… pic.twitter.com/Bs37pxMbD8 — ANI (@ANI) July 31, 2023 ► సభా నాయకుడు పీయూష్ గోయల్ మాట్లాడుతూ,నేటి మధ్యాహ్నం 2 గంటలకు పార్లమెంటులో మణిపూర్‌పై చర్చలు జరపాలని తాము కోరుకుంటున్నట్లు రాజ్యసభలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ప్రతిపక్షాక్ష సభ్యులు తమకు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం మణిపూర్‌పై చర్చకు సిద్ధంగా ఉందని చెబుతున్నా.. విపక్షాలు ఇప్పటికే 9 రోజులగా సభలను అడ్డుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు ►పార్లమెంట్లో కేంద్ర మంత్రులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. మణిపూర్‌పై చర్చ జరగకుండా ప్రతిపక్షాలను ఎవరు ఆపుతున్నారు అని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు. పార్లమెంటు లోపలికి వచ్చి చర్చల్లో పాల్గొనాలని మేము మొదటి రోజు నుంచి కోరుతున్నామని.. చర్చలు జరపకుండా వారిని ఆపేది ఏంటని నిలదీశారు. చర్చలో పాల్గొనకుండా పారిపోతారని విమర్శించారు. రాజకీయాల కోసం మణిపూర్ అంశాన్ని వాడుకుంటున్నట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. #WATCH | Delhi: Union Minister Anurag Thakur says, "I request them to come inside Parliament and participate in discussions. We want discussions from day 1. What is stopping them (Opposition) from holding talks?... They only run away from discussions rather than taking part in… pic.twitter.com/LJ6kMxmT7T — ANI (@ANI) July 31, 2023 విపక్షాల భేటీ ఇటీవల మణిపూర్‌లో పర్యటించిన ఎంపీలతో ప్రతిపక్ష ఇండియా కూటమి భేటీ అయింది. పార్లమెంట్ హౌజ్ భవనంలోని కాంగ్రెస్ పార్టమెంటరీ పార్టీ(సీపీపీ) కార్యాలయంలో సమావేశమయ్యాయి. రెండు రోజుల పర్యటన వివరాలను ఎంపీల బృందం విపక్ష నేతలకు వివరిస్తున్నాయి. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. కాగా విపక్షపార్టీలకు చెందిన 21 మంది ఎంపీలు రెండు రోజులపాటు మణిపూర్ రాష్ట్రంలో పర్యటించిన విషయం తెలిసిందే. #WATCH | Meeting of I.N.D.I.A party alliance floor leaders with MPs who visited Manipur recently is underway at the Congress Parliamentary Party CPP office in Room no 53 at the Parliament House building to discuss the strategy for the floor of the House. Congress parliamentary… pic.twitter.com/UY5r2m3MW5 — ANI (@ANI) July 31, 2023 మణిపూర్ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది: అధిర్ రంజన్ పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ.. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగాలనేది తమ డిమాండ్‌గా పేర్కొన్నారు. మణిపూర్‌లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది.. దేశాన్ని రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ, మిత్రపక్షాలు కూడా మణిపూర్‌లో పర్యటించాలని, అక్కడి పరిస్థితిని అందరూ విశ్లేషించుకోవాలని సూచించారు. చదవండి: మణిపూర్ హింస.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన బాధిత మహిళలు #WATCH | Delhi: West Bengal Congress president Adhir Ranjan Chowdhary says, "Our demand is only that there is a discussion on no-confidence motion...The situation in Manipur is very serious...The country needs to be saved...BJP and its alliances should also tour Manipur, they… pic.twitter.com/dcTWjBDipr — ANI (@ANI) July 31, 2023 న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు తిరిగి సోమవారం ప్రారంభమయ్యాయి. ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంలోని అధికారుల నియామకాలు, బదిలీకి సంబంధించిన ఆర్డినెన్స్ బిల్లును కేంద్రం నేడు (జూలై 31) పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. లోక్‌సభలో కేంద్రమంత్రి అమిత్‌షా ఈ బిల్లును ప్రవేశ పెట్టనుననారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయి. దీంతో సభలో మరింత గందరగోళం నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఢిల్లీలో అధికారుల నియమకాలు, బదిలీలను తన అధీనంలోకి తీసుకుంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ కేంద్రం, ఢిల్లీలో కేజ్రివాల్ ప్రభుత్వం మధ్య కొత్త వివాదాన్ని రేపిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ బిల్లుకు మోదీ మంత్రివర్గం ఇప్పటికే ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం మణిపూర్ హింసపై పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు మూకుమ్మడిగా డిమాండ్ చేస్తున్నాయి. కేంద్రానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమి పార్లమెంటులో అవిశ్వాస తీర్మానాన్ని కూడా సమర్పించింది. దానిపై ఇంకా చర్చించలేదు. ఓటింగ్ జరగలేదు. లోక్‌సభలో రగడ ఈ క్రమంలో లోక్‌సభలో నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ గవర్నమెంట్(సవరణ) బిల్లు తీసుకురావడంపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇండియా కూటమిలో భాగమైన కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కాంగ్రెస్‌తోపాటు ఇతర పార్టీలు కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తుండటంతో.. పార్లమెంట్ వేదికగా దీనిని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. దీంతో సోమవారం లోక్‌సభలో రగడ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ ఆర్డినెన్స్ తీసుకురావడానికి ముందు ఢిల్లీలో బదిలీలు, నియామకాలకు సంబంధించిన విషయాల్లో నిర్ణయాధికారాలను ఢిల్లీ ప్రభుత్వానికి ఇస్తున్నట్లు సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. దీనికి లెక్కచేయకుండా అధికార యంత్రాంగంపై ఢిల్లీ ప్రభుత్వానికి ఉన్న అధికారాలను తగ్గిస్తూ కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. అయితే ఇది చట్టవిరుద్దమంటూ, ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ ఇప్పటికే ఆప్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. VIDEO | "This is the most undemocratic, illegal legislative exercise that is being done by the BJP in the history of India's parliamentary democracy. This bill is an assault on two crore people of Delhi," says AAP leader @raghav_chadha on Delhi services bill which the government… pic.twitter.com/62WNGg0nHG — Press Trust of India (@PTI_News) July 31, 2023 -
అవిశ్వాసం సరికాదు
సాక్షి, న్యూఢిల్లీ :ఈశాన్య ప్రాంత చిన్న రాష్ట్రమైన, దేశ సరిహద్దులో ఉన్న మణిపూర్‌లోని వివాదాస్పద అంశంపై విపక్షాలు కేంద్రానికి మద్దతుగా కలిసి రావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వి.విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. సరిహద్దు దేశాల కుట్రల దృష్ట్యా అందరూ సమష్టిగా ఉండాల్సిన అవసరం ఉందని, కేంద్రంపై ప్రవేశపెట్టిన అవిశ్వాసాన్ని తిప్పికొట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు. శుక్రవారం రాత్రి ఓ జాతీయ మీడియా చర్చలో ఢిల్లీ ఆర్డినెన్స్, విపక్షాలు కేంద్రంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఆయన మాట్లాడారు. ఢిల్లీ ఆర్డినెన్స్‌కు సంబంధించి విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ఢిల్లీ పూర్తిస్థాయి రాష్ట్రం కాదన్న విషయం గుర్తు చేశారు. కేంద్రం తీసుకొచ్చిన ఢిల్లీ ఆర్డినెన్స్ సమాఖ్య స్ఫూర్తిని ఏమాత్రం దెబ్బ తీయట్లేదని స్పష్టం చేశారు. ఢిల్లీ ఆర్డినెన్స్ సుప్రీంకోర్టు తీర్పును ఏమాత్రం ఉల్లంఘించడం లేదన్నారు. అందువల్లే ఈ రెండు అంశాలపై వైఎస్సార్సీపీ కేంద్రానికి మద్దతు ఇస్తోందన్నారు. -
ఢిల్లీ ప్రభుత్వం, గవర్నర్ తీరుపై సుప్రీంకోర్టు విచారం
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్పర్సన్ నియామకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ విఫలమయ్యారని సుప్రీంకోర్టు పేర్కొంది. ఢిల్లీ ప్రభుత్వం, ఎల్జీ ఏకాభిప్రాయంతో డీఈఆర్సీ చైర్‌పర్సన్‌గా ఒకరి పేరును సూచించలేరా? అని ప్రశ్నించింది. సంస్థను ఎవరూ పట్టించుకోకపోవడం విచారణకరమని పేర్కొంటూ.. చైర్మన్‌ను తామే ఎంపిక చేస్తామని స్పష్టం చేసింది. ఢిల్లీ పాలనాధికారాలపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌తోపాటు డీఈఆర్సీ చైర్మన్ ఎంపికపై దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి డీవీ చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ పీఎస్ నరసింహా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఢిల్లీ గవర్నర్ తరపున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదిస్తూ.. డీఈఆర్సీ చైర్‌పర్సన్‌ను రాష్ట్రపతి నియమించారని తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం తరపున అడ్వకేట్ అభిషేక్ మను సంఘ్వీ మాట్లాడుతూ.. డీఈఆర్సీ చైర్మన్ నియామకం కేంద్ర ఆర్డినెన్స్ ప్రకారం జారీ చేశారని, దీనిని ఢిల్లీ ప్రభుత్వం కోర్టులో సవాలు చేసిందని సర్వోన్నత న్యాయస్థానానికి విన్నవించారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం.. ఆర్డినెన్స్ విచారణ రాజ్యాంగ ధర్మాసానానికి వెళుతుందని తెలిపింది. ఈ ప్రక్రియకు రెండు, మూడు నెలలు పడుతుందని అప్పటి వరకు డీఈఆర్సీ పని చేయకుండా ఉంటుందా? అని ప్రశ్నించింది. అయితే డీఈఆర్సీ సంస్థ అధిపతి లేకుండా ఉండలేదని, సుప్రీంకోర్టే దీనికి చైర్‌పర్సన్‌ను నియమించవచ్చని హరీష్ సాల్వే సూచించారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. డీసీఆర్సీ చైర్మన్ ఎంపికపై తామే ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఇందుకు కొంత సమయం వేచి ఉండాలని ఇరు వర్గాలకు చెందిన లాయర్లకు సూచించింది. తాత్కాలిక ప్రాతిపదికన కొంతకాలంపాటు మాజీ న్యాయమూర్తిని నియమించడానికి కొంతమంది న్యాయమూర్తులను పేర్లను పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతానికి తమ వద్ద ఎలాంటి జాబితా లేదని, ముగ్గురు లేదా అయిదుగురు ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తుల పేర్లను అందించాలని.. వారిలో నుంచి ఒకరిని తామే నియమిస్తామని పేర్కొంది. తదుపరి విచారణను ఆగస్టు 4కు వాయిదా వేసింది. ఇదిలా ఉండగా ఆర్డినెన్స్‌పై ప్రతిష్ఠంభన నేపథ్యంలో ఢిల్లీ విద్యుత్ నియంత్రణ మండలి పదవుల్లో నియామకాలు ఆగిపోవడంతో ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సేనా, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరూ రాజకీయాలను పక్కనబెట్టి కూర్చొని మాట్లాడుకోవాలని సుప్రీంకోర్టు జూలై 17న సూచించింది. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ తరఫు న్యాయవాది అందుకు సరేనన్నారు. ఢిల్లీ ప్రభుత్వం స్పందించలేదు. చదవండి: చీతాల మరణాలపై సుప్రీంకోర్టు ఆందోళన.. కేంద్రానికి ప్రశ్నల వర్షం రాజ్యాంగ ధర్మాసనానికి ఆర్డినెన్స్ ఢిల్లీలో పాలనాధికారాలపై నియంత్రణ కొరకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ ఢిల్లీ సర్కారు దాఖలు చేసిన పిటిషన్‌ను ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి సుప్రీంకోర్టు బదిలీ చేసింది. ఇంతకుముందుకు విచారణ జరిపిన రెండు రాజ్యాంగ బెంచ్‌లు పరిశీలించని న్యాయపరమైన అంశాలు ఈ పిటిషన్లో ఉన్నాయని.. అందుకే దీనిని విస్తృత ధర్మాసనానికి బదిలీచేస్తున్నట్టు తెలిపింది. -
కేంద్ర ఆర్డినెన్స్‌పై స్టే ఇవ్వండి
న్యూఢిల్లీ: ఢిల్లీ పరిపాలన సర్వీసులపై నియంత్రణ కోసం కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను ఆప్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని, సుప్రీంకోర్టు ఉత్తర్వులను పక్కనబెట్టే ప్రయత్నమని ఆరోపించింది. ఆర్డినెన్స్‌ను కొట్టివేయడంతోపాటు అమ లుపై మధ్యంతర స్టే విధించాలని కోరుతూ శుక్రవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. పోలీసు, శాంతిభద్రతలు, భూమి మినహా మిగతా సరీ్వసులపై ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వానికే పెత్తనం ఉండాలని, ఇందుకోసం ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేయాలంటూ మే 11న సుప్రీంకోర్టు ఆదేశాలిచి్చంది. అయితే, ఢిల్లీ ప్రభుత్వంలో పనిచేసే గ్రూప్–ఏ స్థాయి అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లపై పెత్తనం కొనసాగేలా ప్రత్యేక ఆర్డినెన్స్‌ను మే 19న కేంద్ర ప్రభుత్వం జారీ చేయడం గమనార్హం. -
ఆక్రమణల నుంచి దేవుడి భూములకు విముక్తి
సాక్షి, అమరావతి : దేవుడి భూముల ఆక్రమణలకు అడ్డుకట్ట వేసేలా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం బుధవారం పకడ్బందీ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. ఆక్రమణలపై కోర్టు ప్రక్రియ ద్వారా కాలయాపన లేకుండా ఆక్రమణదారునికి కేవలం ఒక నోటీసు ఇచ్చి వారం తర్వాత ఆ భూమిని స్వాధీనం చేసుకునే అధికారాన్ని దేవదాయ శాఖ అధికారులకు కల్పించింది. ఈ మేరకు 1987, 2007 దేవదాయ శాఖ చట్టాల్లోని 83, 84, 85, 86, 93, 94 సెక్షన్లలో పలు మార్పులు చేస్తూ, కొన్నింటిని తొలగిస్తూ ప్రభుత్వం కొత్త ఆర్డినెన్స్‌ను రూపొందించింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదంతో న్యాయ శాఖ ఈ ఆర్డినెన్స్‌ను విడుదల చేసింది. తక్షణమే ఆర్డినె¯Œ్స అమలులోకి వస్తుందని అందులో పేర్కొన్నారు. ఇప్పటివరకు జరుగుతున్నదిదీ.. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం దేవుడి భూములను ఎవరైనా ఆక్రమిస్తే దేవదాయ శాఖ అధికారులు ముందు ఎండోమెంట్ ట్రిబ్యునల్‌లో పిటీషన్ వేయాల్సి వచ్చేది. ట్రిబ్యునల్‌లో ఆక్రమణదారులు లాయర్ల ద్వారా వారి వాదనలు వినిపించుకోవచ్చు. ట్రిబ్యునల్ ఆ భూములు దేవదాయ శాఖవని తేల్చే వరకు వాటిని అనుభవించే వెసులుబాట ఆక్రమణదారులకే ఉంటుంది. ఒకవేళ ట్రిబ్యునల్ దేవదాయ శాఖకు అనుకూలంగా తీర్పు ఇస్తే, దానిపై కింద నుంచి పై కోర్టుల వరకు వెళ్లి, కాలయాపన చేసే వెసులుబాటు ఆక్రమణదారులకే ఉంది. దీంతో భూముల వివాదం ఏళ్ల తరబడి ఎండోమెంట్ ట్రిబున్యల్, కోర్టులలో కొనసాగుతోంది. అత్యధిక కేసుల్లో పదేళ్లకు పైనే సాగుతోందని, అంత కాలం ఆ భూములు ఆక్రమణదారులే అనుభవిస్తున్నారని అధికారులు వెల్లడించారు. ఫలితంగా వేలాది ఎకరాల దేవుడి భూములు ఆక్రమణదారుల చేతిలోనే ఉన్నాయి. ఇప్పుడు జరగబోయేది ఇదీ.. తాజా ఆర్డినెన్స్ ప్రకారం.. ఆక్రమణదారు నుంచి భూముల స్వాధీనం చేసుకోవడానికి దేవదాయ శాఖ అధికారులు ఆ భూమి దేవుడిదని పేర్కొంటూ ఒక నోటీసు ఇస్తారు. ఆక్రమణదారు జవాబు చెప్పుకోవడానికి ఓ వారం వ్యవధి ఇస్తారు. వారం దాటిన వెంటనే పోలీసు, రెవిన్యూ అధికారుల çసహాయంతో ఆ భూములను స్వాధీనం చేసుకోవచ్చు. ఈమేరకు తాజా ఆర్డినెన్స్ ద్వారా దేవదాయ శాఖ అధికారులకు అన్ని అధికారాలు దఖలు పడతాయి. న్యాయపరమైన చిక్కులు, ఆలస్యం లేకుండా దేవుడి భూములు దేవదాయ శాఖ చేతుల్లోకి వస్తాయి. ఈ స్వాధీన ప్రక్రియపై అభ్యంతరాలు ఉంటే ఆక్రమణదారుడే కోర్టులకు వెళ్లి, అవి తమ భూములని నిరూపించుకోవాల్సి ఉంటుందని దేవదాయశాఖ అధికారులు తెలిపారు. -
ఇక రాత్రిళ్లు బాదుడే.. విద్యుత్ వినియోగదారులకు కేంద్రం షాక్
ఢిల్లీ: విద్యుత్ వినియోగదారులకు కేంద్రం షాక్ ఇచ్చింది. విద్యుత్ ఛార్జీల నిబంధనల్లో కేంద్రం భారీ మార్పులు చేసింది. పగలు, రాత్రి వేళ్లలో వేర్వేరు విద్యుత్ ఛార్జీల వసూలుకు ఆర్డినెన్స్ జారీ చేసింది. రాత్రి వేళల్లో విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉంటే 20 శాతం ఛార్జీలు, పగటివేళల్లో తక్కువ ఛార్జీలు వసూలు చేయనుంది. కొత్తగా టైమ్ ఆఫ్ డే టారిఫ్ వ్యవస్థ పేరుతో పగటి వేళ వాడే కరెంట్‌పై వినియోగదారులకు 20 శాతం మేర భారం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో డిమాండ్ అధికంగా ఉండే రాత్రి వేళ వాడే కరెంట్ ఛార్జీల భారం ఇప్పటికంటే 10-20 శాతం ఎక్కువగా ఉంటుందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ అన్నారు. కొత్త నిబంధన 10 కిలో వాట్ లేదా అంతకంటే ఎక్కువ వినియోగం ఉన్న వాణిజ్య, పారిశ్రామిక సంస్థలకు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. వ్యవసాయ వినియోగదారులను మినహాయించి ఇతర వినియోగదారులకు 2025, ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఉదయం వేళ సోలార్ పవర్ అందుబాటులో ఉండటంతో దాని ధర తక్కువగా ఉంటుందని, అందుకే ఉదయం వేళలను సోలార్ అవర్స్‌గా పేర్కొంటూ.. ఆ సమయంలో వినియోగదారులకు లబ్ధి చేకూర్చేలా విద్యుత్ ఛార్జీలు తక్కువ చేశామని మంత్రి అన్నారు. చదవండి: ఒడిషా రైలు ప్రమాదం.. రైల్వే బోర్డు సంచలన నిర్ణయం -
కేసీఆర్ దారిలో కేజ్రీవాల్?.. ఇది కాంగ్రెస్‌కు రిక్వెస్ట్ కాదు అల్టిమేటం!
న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. ఇందులో భాగంగా శుక్రవారం బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీశ్‌కుమార్ నివాసంలో కాంగ్రెస్‌తోపాటు వివిధ ప్రతిపక్షాలు హాజరు అయ్యారు. గతంలోనే ఈ భేటీలో ప్రధాని అభ్యర్థిపై ఎలాంటి చర్చ జరగదని ఈ పార్టీలు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఈ తరుణంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రతి పక్షాలకు సడన్‌గా షాక్ ఇచ్చారు. కాంగ్రెస్‌కు కేజ్రీవాల్ అల్టిమేటం శుక్రవారం విపక్షాల సమావేశం నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్‌కు అల్టిమేటం ఇచ్చారు. ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్‌ను కాంగ్రెస్ వ్యతిరేకించాలని, లేనిపక్షంలో తాను భవిష్యత్తులో ప్రతిపక్ష పార్టీల ఐక్యతకు సంబంధించిన అన్ని సమావేశాలకు దూరంగా ఉండనున్నట్లు తెలిపారు. ఆర్డినెన్స్‌పై కాంగ్రెస్ తన వైఖరిని వెల్లడించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా ఈ సమావేశానికి సీఎం కేజ్రీవాల్ కూడా హాజరయ్యారు. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ప్రతి పక్షాలన్నీ సమావేశమైన ఈ సమయంలో రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఆప్ పార్టీ విషయంలో కాంగ్రెస్ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. కాగా ఇప్పటికే కేంద్రం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు అరవింద్ కేజ్రీవాల్ పలువురు ఆప్ నేతలను కలిశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీని కూడా కలిసేందుకు ప్రయత్నించాగా.. అది కుదరలేదు. కాంగ్రెస్ మద్దతు ఇవ్వకపోతే.. కేసీఆర్ దారిలో కేజ్రీవాల్? ఒక వేళ ఆర్డినెన్స్ విషయంలో కాంగ్రెస్ ఆప్‌కు మద్దతు తెలపకపోతే.. కేజ్రీవాల్ కూడా సీఎం కేసీఆర్ దారిలో నడిచే అవకాశం ఉంది. ఇటీవల టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి జాతీయ పార్టీగా ప్రకటించిన కేసీఆర్.. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ రెండింటిపై దాడి చేస్తూ వివిధ రాష్ట్రాల్లో తన సంస్థాగత బలాన్ని చాటుకుంటూ రానున్న ఎన్నికల కోసం సిద్ధం అవుతున్నారన్న సంగతి తెలిసిందే. చదవండి: 'భేటీకి హాజరైన ప్రతిపక్ష నాయకుల ట్రాక్ రికార్డ్ ఎలాంటిదో..?' -
జూన్ 11న ఆప్ మహా ర్యాలీ
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో పరిపాలనా సర్వీసులపై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ను నిరసిస్తూ జూన్ 11న మహార్యాలీ నిర్వహించనున్నట్లు ఆప్ సోమవారం ప్రకటించింది. అందులో ఢిల్లీ ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చింది. ఢిల్లీలో అధికారుల బదిలీలు, వారిపై ఆరోపణలు వస్తే చర్యల కోసం కొత్తగా ‘నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీ’ని ఏర్పాటు చేస్తూ కేంద్రం ఈ నెల 19న ఆర్డినెన్స్ తేవడం తెలిసిందే. దీనిపై ఆప్ పోరాటానికి కాంగ్రెస్ కూడా మద్దతు ప్రకటించింది. విపక్షాలకు ఇదొక అగ్ని పరీక్ష: సంజయ్ కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ను బీజేపీయేతర పార్టీలన్నీ వ్యతిరేకించాలని ఆప్ రాజ్యసభ సభ్యుడు, జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ సింగ్ విజ్ఞప్తి చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం లేదని, ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు కొనసాగుతున్నాయని విమర్శించారు. కేంద్ర ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ రాజ్యసభలో తాము ప్రవేశపెట్టే బిల్లుకు మద్దతు ఇవ్వాలని విపక్షాలను సంజయ్ సింగ్ కోరారు. ప్రతిపక్షాలకు ఇదొక అగ్ని పరీక్ష అని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి రావాలని విన్నవించారు. -
ఢిల్లీ సీఎం అధికారాలపై కేంద్రం ఆర్డినెన్స్
ఢిల్లీ సీఎం అధికారాలపై కేంద్రం ఆర్డినెన్స్ -
నరేంద్ర మోదీ పాత ట్వీట్‌ను జత చేసి.. విరుచుకుపడ్డ కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీలో పాలనాధికారాలకు సంబంధించి కొన్ని రోజుల క్రితం సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్చునిచ్చింది. ఎన్నికైన ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారి అని, నిజమైన అధికారాలు అసెంబ్లీకే ఉంటాయని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఆఖరికి అధికారుల నియామకం సహా ఢిల్లీ ప్రభుత్వానికే అన్ని అధికారాలు ఉంటాయని పేర్కొంది సుప్రీం కోర్టు. కాగా, ఈ వ్యవహారానికి సంబంధించి కేంద్రం కొత్త ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్‌తో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది. 2013లో మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా, ఒక సమస్యపై కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ మీద ఫైర్ అవుతూ ఒక ట్వీట్ చేశారు. అందులో “పార్లమెంట్ ఏమైనప్పటికీ సమావేశమవుతుంది. కేంద్రం పార్లమెంటును ఎందుకు విశ్వాసంలోకి తీసుకుని మంచి బిల్లు ఇవ్వలేకపోయింది? ఆర్డినెన్స్ ఎందుకు? అని నరేంద్ర మోదీ ప్రశ్నించారు. ప్రస్తుతం కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ని ఉద్దేశించి ఆర్డినెన్స్ ఎందుకు సార్ అని మోదీ పాత ట్వీట్‌ని జత చేశారు ఢిల్లీ సీఎం . ‘సేవల’పై ఢిల్లీ ప్రభుత్వానికి నియంత్రణ కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పును నేరుగా సవాల్ చేసే విధంగా ఉన్న ఆర్డినెన్స్‌ను కేంద్రం తీసుకొచ్చిన నేపథ్యంలో ఢిల్లీ సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఢిల్లీ ప్రభుత్వం తన అధికారులపై నియంత్రణ కలిగి ఉండాలని తెలిపింది. తాజా తీర్పు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వానిదే పైచేయి తప్ప ఎల్జీది కాదని తేల్చింది. ఎన్నికైన ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారి అని, నిజమైన అధికారాలు అసెంబ్లీకే ఉంటాయని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఆఖరికి అధికారుల నియామకం సహా ఢిల్లీ ప్రభుత్వానికే అన్ని అధికారాలు ఉంటాయని పేర్కొంది సుప్రీం కోర్టు. మూడు అంశాలు మినహా ఇతర విషయాల్లో ఢిల్లీ సర్కారుకు వేరే రాష్ట్రాలతో సమానంగా అధికారాలుంటాయని ఈ తీర్పు స్పష్టం చేసింది. ఢిల్లీ పరిపాలన, అధికారుల బదిలీలపై సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన 10 రోజుల్లోనే.. తాజాగా, శుక్రవారం కేంద్ర ప్రభుత్వం బదిలీ, విజిలెన్స్ వంటి అంశాల్లో ఆర్డినెన్స్ జారీ చేసి చట్ట సవరణ చేసింది. అయితే తాజాగా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కేంద్రం ఈ ఆర్డినెన్స్ తీసుకురావడంతో ఈ వివాదం ఎప్పటికి ముగుస్తుందో వేచి చూడాల్సిందే. Why ordinance Sir? https://t.co/C9otuhtY4X — Arvind Kejriwal (@ArvindKejriwal) May 21, 2023 -
కేరళ గవర్నర్‌కు బిగ్ షాక్.. ఛాన్సలర్‌గా తప్పిస్తూ ఆర్డినెన్స్?
తిరువనంతపురం: కేరళ గవర్నర్, ప్రభుత్వం మధ్య వివాదం మరింత ముదురుతోంది. యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ పదవి నుంచి తప్పుకోవాలని ఆదేశించటంతో ఈ వివాదం తారస్థాయికి చేరింది. ఈ క్రమంలో గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్‌ను యూనివర్సిటీల ఛాన్సలర్‌గా తప్పించేందుకు సిద్ధమవుతోంది ఎల్డీఎఫ్ నేతృత్వంలోని కేరళ సర్కార్. గవర్నర్‌ను తప్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలో బుధవారం సమావేశమైన కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆర్డినెన్స్ ముసాయిదాపై మంత్రివర్గంలో చర్చించినట్లు పేర్కొన్నాయి. యూనివర్సిటీల ఛాన్సలర్‌గా గవర్నర్‌ను తొలగించి.. ఆయన స్థానంలో నైపుణ్యం గల వ్యక్తిని తీసుకురావాలని భావిస్తున్నట్లు ఎల్డీఎఫ్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొద్ది రోజుల క్రితం కేరళలోని 9 వర్సిటీల వైస్ ఛాన్సలర్‌గా రాజీనామా చేయాలంటూ ఆదేశించారు గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్. దీంతో వివాదం మొదలైంది. గవర్నర్ అధికారాలపై ప్రభుత్వం ప్రశ్నించగా.. వివాదం ముదిరింది. రాష్ట్రవ్యాప్తంగా గవర్నర్‌కు వ్యతిరేకంగా ఎల్డీఎఫ్ శ్రేణులు నిరసనలు తెలిపే కార్యక్రమానికి పిలుపునిచ్చారు. మరోవైపు.. వైస్ ఛాన్సలర్ల అంశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కేరళ హైకోర్టు సైతం సూచించినట్లు సమాచారం. ఇదీ చదవండి: గవర్నర్ వైఖరిపై ఎల్డీఎఫ్ విస్తృతస్థాయి నిరసన -
అప్పు దొరక్క ఆస్తులు అమ్ముకుంటున్న పాకిస్థాన్!
ఇస్లామాబాద్: ఆర్థికంగా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన పాకిస్థాన్‌లో దుర్భర పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో దేశాన్ని సమస్యల నుంచి బయటపడేసేందుకు విదేశాలకు ఆస్తులు అమ్ముకుంటోంది. ఆస్తులు విక్రయించేందుకు ఉన్న అడ్డంకులను తొలగిస్తూ అత్యవసరంగా ఓ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం. అన్ని ప్రక్రియలను పక్కనపెట్టి.. రెగ్యులేటరీ తనిఖీలను సైతం తొలగించింది. ఎగవేతదారు అనే ముద్ర పడకుండా ఉండేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. ‘ఇంటర్ గవర్నమెంటల్ కమర్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆర్డినెన్స్-2022’ను గురువారం ఫెడరల్ క్యాబినెట్ ఆమోదించింది. దేశంలోని ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ సంస్థల షేర్లను విదేశాలకు విక్రయించటంపై దాఖలయ్యే పిటిషన్లు విచారించకుండా కోర్టులకు సైతం అవకాశం లేదని ద ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ న్యూస్‌పేపర్ వెల్లడించింది. 2.5 బిలియన్ డాలర్ల సమీకరణ.. చమురు, గ్యాస్ కంపెనీలు, ప్రభుత్వ అధీనంలోని విద్యుత్తు కేంద్రాల్లో వాటాను యూఏఈకి విక్రయించేందుకు ఈ అత్యవసర ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. సుమారు 2 బిలియన్ల నుంచి 2.5 బిలియన్ల డాలర్లు వీటి ద్వారా పొందాలని భావిస్తోంది పాకిస్థాన్ ప్రభుత్వం. ఈ ఆర్డినెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక సూచనలు చేసింది. అయితే.. ఈ ఆర్డినెన్స్‌పై పాకిస్థాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ఇంకా సంతకం చేయకపోవటం గమనార్హం. గతంలోనూ రుణాలు చెల్లించే స్థితిలో పాకిస్థాన్ లేకపోవటం వల్ల కొత్త రుణాలు ఇచ్చేందుకు ఈ ఏడాది మే నెలలో తిరస్కరించింది యూఏఈ. అయితే.. తమ కంపెనీలు పాక్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించాలని పేర్కొంది. మరోవైపు.. దేశంలోని ఏదైన సంస్థను ప్రైవేటీకరణ చేసేందుకు సుమారు 471 రోజుల సమయం పడుతుందని పాకిస్థాన్ ఆర్థిక మంత్రి మిఫ్తాహ్ ఇస్మాయిల్ ఇటీవల పేర్కొనటం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. నిధుల సేకరణకు ప్రభుత్వం రోజుల వ్యవధిలోనే ఒప్పందాలు పూర్తి చేయాలని సూచించారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్) నుంచి 1.17 బిలియన్ డాలర్ల రుణాలు పొందటంలో విఫలమైంది. ఆర్థిక అంతరాన్ని తగ్గించేందుకు మిత్ర దేశాల నుంచి 4 బిలియన్ డాలర్లు సేకరించాలని ఐఎంఎఫ్ సూచించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆస్తులను విక్రయించి నిధులు సమీకరించేందుకు ప్రయత్నిస్తోంది పాకిస్థాన్. ఇదీ చూడండి: Pakistan: ‘మహిళలు పర్యాటక ప్రదేశాల్లోకి రావొద్దు’ -
రేపిస్టులకు ఇక చుక్కలే.. కఠిన శిక్ష అమలుకు పార్లమెంట్ ఆమోదం
ఇస్లామాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఆడవారిపై అఘాయిత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దేశాలతో సంబంధం లేకుండా ప్రతి చోటా మహిళలు అత్యాచారానికి గురవుతున్నారు. మనదేశంలో నిర్భయ వంటి కఠిన చట్టాలు తెచ్చినప్పటికి లాభం లేకుండా పోతుంది. ఈ క్రమంలో మృగాళ్లను ఎన్కౌంటర్ చేయడం.. లేదా వారికి అంతకు మించి కఠిన శిక్షలు విధించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ పార్లమెంటు కొత్త చట్టాన్ని ఆమోదించింది. తరచుగా అత్యాచారాలకు పాల్పడే నిందితులను కఠినమైన కెమికల్ కాస్ట్రేషన్‌కు గురి చేసే చట్టాన్ని ఆమోదించింది. అత్యాచార నేరాలకు సంబంధించిన కేసులను త్వరితగతిన విచారించడం.. నేరస్థులకు కఠిన శిక్షలు విధించేందుకుగాను పాక్ ఈ చట్టాన్ని ఆమోదించినట్లు తెలిపింది. (చదవండి: కులభూషణ్ జాదవ్‌కు ఊరట.. ఐసీజే దెబ్బకు వెనక్కు తగ్గిన పాక్) గత కొంత కాలంగా పాకిస్తాన్లో మహిళలు, చిన్నారులపై అకృత్యాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితులపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తడంతో ఈ కొత్త చట్టానికి ఆమోదం తెలిపినట్లు పాక్ ప్రకటించింది. విమర్శకులు ప్రకారం దేశ వ్యాప్తంగా నమోదవుతున్న అత్యాచార కేసుల్లో కేవలం 4 శాతం కేసుల్లో మాత్రమే శిక్ష పడుతున్నట్లు ఆరోపించారు. దాదాపు ఏడాది క్రితం పాకిస్తాన్ మంత్రివర్గం ఆమోదించిన అత్యాచార నిరోధక ఆర్డినెన్స్‌ను పాక్ ప్రెసిడెంట్ ఆరిఫ్ అల్వీ ఆమోదించాడు. అత్యాచార నిందుతలకు కెమికల్ కాస్ట్రేషన్ విధించాలని ఆర్డినెన్స్‌లో పొందుపరిచారు. కొత్త క్రిమినల్ లా (సవరణ) బిల్లు 2021 బిల్లుతో పాటు 33 ఇతర బిల్లులను బుధవారం పాక్ పార్లమెంటు ఉమ్మడి సెషన్ ఆమోదించింది. ఇది పాకిస్తాన్ శిక్షాస్మృతి, 1860, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, 1898లను సవరించాలని కోరుతున్నట్లు డాన్ వార్తాపత్రిక నివేదించింది. (చదవండి: కరాచీలో అంతుపట్టని వైరల్ జ్వరాలు!!) ‘‘కెమికల్ కాస్ట్రేషన్ అనేది ప్రధాన మంత్రి రూపొందించిన నియమాల ద్వారా సక్రమంగా తెలియజేయబడిన ప్రక్రియ. ఈ శిక్ష అనుభవించిన వ్యక్తి ఇక తన జీవితాంతం లైంగిక చర్యలో పాల్గొనలేడు. ఇక ఈ శిక్ష అమలు కోర్టు పర్యవేక్షణలో మెడికల్ బోర్డు ఆమోదించిన ఔషధాల ద్వారా నిర్వహించబడుతుందని’’ బిల్లులో పేర్కొన్నారు. (చదవండి: మహిళా ఉద్యోగికి ఏఈ లైంగిక వేధింపులు.. బుద్ధి చెప్పిన కుటుంబ సభ్యులు ) జమాత్-ఇ-ఇస్లామీ సెనేటర్ ముస్తాక్ అహ్మద్ ఈ బిల్లుపై నిరసన వ్యక్తం చేశారు. ఇది ఇస్లాం విరుద్ధమని.. షరియాకు వ్యతిరేకమని పేర్కొన్నారు. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని బహిరంగంగా ఉరితీయాలని, అయితే షరియాలో కాస్ట్రేషన్ ప్రస్తావన లేదని ఆయన అన్నారు. కెమికల్ కాస్ట్రేషన్.... కెమికల్ కాస్ట్రేషన్ అంటే లైంగిక కార్యకలాపాలను తగ్గించడానికి మందులు వాడే ప్రక్రియ. మీడియా నివేదికల ప్రకారం, దక్షిణ కొరియా, పోలాండ్, చెక్ రిపబ్లిక్, అమెరికాలోని కొన్ని రాష్ట్రాలతో సహా దేశాల్లో ఇది ఒక చట్టపరమైన శిక్ష. చదవండి: ‘అత్యాచారం చేసి.. పెళ్లి చేసుకుంటే కేసు కొట్టేయాలా?’ -
Kulbhushan Jadhav Case : కీలక పరిణామం
ఇస్లామాబాద్: భారతీయ నౌకాదళ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్(51) కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పాక్ తాజా చర్యతో ఆయనకు భారీ ఊరట లభించింది. తన శిక్షపై అప్పీల్ చేసుకునే హక్కు ఆయనకు ఇప్పుడు లభించింది. అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) తీర్పు మేరకు పాక్ జాతీయ అసెంబ్లీలోని దిగువ సభ, ఐసీజే (రివ్యూ అండ్ రీ కన్సిడరేషన్) బిల్లు–2020ను గురువారం ఆమోదించింది. జాదవ్‌ని గూఢచర్యం, ఉగ్రవాదం ఆరోపణలపై 2017 ఏప్రిల్‌లో పాక్ మిలటరీ కోర్టు మరణ శిక్ష విధించింది. జాదవ్‌కు ఎలాంటి దౌత్యసాయం కల్పించకుండా, న్యాయవాదులు కలవడానికి వీల్లేకుండాచేసి, ఆయన వాదనలు వినకుండా ఉరికంబం ఎక్కించాలని పాక్ కుట్ర పన్నింది. భారత్ పంపిన దౌత్యాధికారులను జాదవ్‌ను కలవనివ్వకుండా పాక్ ప్రభుత్వం అడ్డుకుంది. దీంతో భారత్ అంతర్జాతీయ న్యాయస్థానంలో జాదవ్ మరణ శిక్షపై సవాల్ చేసింది. ఐసీజే చొరవతో.. వాదోపవాదాలు విన్న ఐసీజే జాదవ్ మరణశిక్షపై పాకిస్తాన్ పునఃపరిశీలన చేయాలని, ఏ మాత్రం జాప్యం లేకుండా ఆయనకు న్యాయవాదుల్ని నియమించుకునే అవకాశం ఇవ్వాలంటూ ఆదేశాలిచ్చింది. దీంతో పాక్ ప్రభుత్వం ఇప్పుడు ఈ బిల్లుకు ఆమోదముద్ర వేసింది. దీనికి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఆర్డినెన్స్ 2020 అని పేరు పెట్టింది. సంవత్సరం సాగదీత తర్వాత గురువారం విపక్ష పార్టీల గందరగోళం, సభ నుంచి వాకౌట్ల నడుమ పాక్ ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. దీంతో తనకు విధించిన మరణ శిక్షపై జాదవ్ ఏ హైకోర్టులోనైనా అప్పీలు చేసుకోవచ్చు. ఈ చర్య ద్వారా తాము ఎంత బాధ్యతాయుతంగా ఉంటామో ప్రపంచ దేశాలకు తెలిసిందని పాక్ న్యాయశాఖ మంత్రి ఫరోగ్ నసీమ్ వ్యాఖ్యానించారు. ఇక ఇరుదేశాలకు ఆమోదయోగ్యమైన లాయర్లతో జాదవ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకునే వీలు కల్పించింది. అయితే భారత్ మాత్రం ఇక్కడి లాయర్‌ను నియమించాలని ప్రయత్నిస్తోంది. కాగా, గూఢచర్యం ఆరోపణలతో జాదవ్‌ను బలూచిస్థాన్‌లో పాక్ అరెస్ట్ చేసిందని ప్రకటించుకోగా.. కాదు జాదవ్‌ను ఇరాన్‌లోని చబాహర్ పోర్టులో అరెస్ట్ చేశారని భారత్ పేర్కొంది. నిజానికి ఐసీజే ఈ ఆదేశాలిచ్చి ఏడాదికి పైనే గడుస్తున్నా.. పాక్ వక్రబుద్ధి ప్రదర్శిస్తూ ఆలస్యం చేస్తూ వచ్చింది. తన కొడుకు విషయంలో ఇది ఊరట కలిగించే విషయమని, పాక్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు జాదవ్ తండ్రి సుధీర్ పేర్కొన్నాడు. ఇది మన దౌత్య విభాగం సాధించిన విజయమని జాదవ్ స్నేహితుడు అరవింద్ మీడియాకు తెలిపాడు. చదవండి: పాక్ కొత్త కుట్ర -
ఏపీ: బడ్జెట్ ఆర్డినెన్స్‌ను ఆమోదించిన గవర్నర్
సాక్షి, అమరావతి: బడ్జెట్ ఆర్డినెన్స్‌ను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించారు. మూడు నెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆర్డినెన్స్ జారీ అయ్యింది. గవర్నర్ ఆమోదంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2021 ఏడాది బడ్జెట్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌కు రాష్ట్ర కేబినెట్ శుక్రవారం ఆమోదం తెలిపిన సంగతి విదితమే. మూడు నెలల కాలానికి గాను కేబినెట్ దీనిని ఆమోదించింది. అనంతరం ఈ ఆర్డినెన్స్‌ను గవర్నర్‌కు పంపించడంతో ఆయన ఆమోద ముద్ర వేశారు. చదవండి: శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి షాక్.. సీఎం ముఖ్య సలహాదారు పదవికి సాహ్ని రాజీనామా -
ఆర్డినెన్న్సును గవర్నర్ కి పంపిన ఏపీ ప్రభుత్వం
-
డిప్యూటీ మేయర్లపై సీఎం జగన్ కీలక నిర్ణయం
తాడేపల్లి: డిప్యూటీ మేయర్లపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ఇద్దరు డిప్యూటీ మేయర్లు, ఇద్దరు వైస్ ఛైర్మన్ల నియామకాన్ని చేపట్టనున్నారు. ఇందుకోసం మున్సిపల్ చట్టాన్ని సవరించనుంది. ఆర్డినెన్స్ తెచ్చిన తర్వాత ఈ నెల 18న యథాతథంగా మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరగనున్నాయి. ఇక పురపాలక ఎన్నికల్లో ఇదివరకెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో వైఎస్సార్సీపీ మొత్తం కార్పొరేషన్లను క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. 75 పురపాలక సంఘాలు, 11 కార్పోరేషన్లను గెలుచుకొని అఖండ విజయం సాధించింది.ఏపీ చరిత్రలో ఇంతవరకు ఒకే పార్టీకి ప్రజలు పట్టం కట్టడం ఇదే తొలిసారి. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ప్రజలు జై కొట్టడంతో.. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ.. ఇలా మూడు ప్రాంతాల్లోనూ వైఎస్సార్ సీపీ ఆధిక్యం కొనసాగడం విశేషం. దీంతో మూడు రాజధానులకు ప్రజలు మద్దతిచ్చినట్లు స్పష్టమవుతోంది. ఇక నగర పాలక సంస్థల్లో తుడిచి పెట్టుకుపోయిన టీడీపీ.. మున్సిపాలిటీలల్లోనూ బోర్లా పడింది. కనీసం ఒక్కటి కూడా గెలుచుకోలేకపోయింది. ఇక జనసేన, బీజేపీ, వామపక్ష పార్టీలు అసలు పత్తా లేకుండా పోయాయి. చదవండి : (మున్సిపల్ ఎన్నికల చరిత్రలో 'ఫ్యాన్' తుపాన్) (AP Municipal Elections Results: వైఎస్సార్ సీపీ సరికొత్త రికార్డు) -
యోగికి షాకిచ్చిన ఐఏఎస్ అధికారులు
లక్నో: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద లవ్ జిహాద్ ఆర్డినెన్స్ పట్ల రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలో సదరు ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా 104 మంది మాజీ ఐఏఎస్ అధికారులు సంతకం చేసిన లేఖను మంగళవారం విడుదల చేశారు. లవ్ జిహాద్ వ్యతిరేక ఆర్డినెన్స్ తీసుకువచ్చిన తర్వాత రాష్ట్రం "ద్వేషం, విభజన, మతోన్మాద రాజకీయాలకు కేంద్రంగా" మారిందని వారు లేఖలో పేర్కొన్నారు. ఇక దీనిలో సంతకం చేసిన వారిలో మాజీ జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్, మాజీ విదేశాంగ కార్యదర్శి నిరుపమ రావు, ప్రధానమంత్రి మాజీ సలహాదారు టీకేఏ నాయర్ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. "చట్టవిరుద్ధమైన ఆర్డినెన్స్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని" వారు లేఖలో డిమాండ్ చేశారు. అంతేకాక ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో సహా ఇతర రాజకీయ నాయకులందరూ "మీరు ... పాటిస్తామని ప్రమాణం చేసిన రాజ్యాంగాన్ని మరోసారి తిరిగి చదవాల్సిన అవసరం ఏర్పడింది" అని పేర్కొన్నారు. "ఒకప్పుడు గంగా-జమునా నాగరికతకు కేంద్రంగా బాసిల్లిన యూపీ.. ఇప్పుడు ద్వేషం, విభజన, మూర్ఖత్వ రాజకీయాలకు కేంద్రంగా మారింది. పాలనా సంస్థలు ఇప్పుడు మతపరమైన విషంలో మునిగిపోయాయి" అని వారు లేఖలో తెలిపారు. "స్వేచ్ఛగా బతకాలనుకునే భారతీయు పౌరులు హక్కుకు వ్యతిరేంగా యూపీలోని ప్రభుత్వ యంత్రాంగం యువకులపై దారుణాలకు పాల్పడుతుంది’’ అని లేఖలో పేర్కొన్నారు. అంతేకాక ఆర్డినెన్స్‌ని అడ్డుపెట్టుకుని మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని పాల్పడిన దారుణాల గురించి లేఖలో ప్రస్తావించారు. వీటిలో ముఖ్యమైనది ఈ నెల ప్రాంరభంలో రాష్ట్రంలోని మొరాదాబాద్‌లో జరిగిన సంఘటన. దీనిలో బజరంగ్ దళ్ కార్యకర్తలు ఇద్దరు వ్యక్తులను దారుణంగా కొట్టారు. బాధితుల్లో ఓ వ్యక్తి పెళ్లి పేరుతో బలవంతంగా ఓ హిందూ యువతిని మతం మారేలా చేశాడని ఆరోపించారు. పోలీసులు సదరు వ్యక్తుల మీద ఈ ఆర్డినెన్స్ కింద కేసు నమోదు చేశారని ఐఏఎస్ అధికారులు లేఖలో తెలిపారు. అలానే మరి కొన్ని ఘటనల్లో బజరంగ్ దళ్ కార్యకర్తలు అమాయకపు జంటలను వేధింపులకు గురి చేశారని.. ఆ సమయంలో పోలీసులు స్పందించలేదని.. వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని లేఖలో పేర్కొన్నారు. మరో ఘటనలో దంపతులను వేధించగా.. గర్భవతిగా ఉన్న యువతికి అబార్షన్ అయ్యిందంటూ ఓ ఆంగ్ల న్యూస్ పేపర్లో వచ్చిన ఉదంతాన్ని ఐఏఎస్ అధికారులు లేఖలో ప్రస్తావించారు. అలానే గత వారం బిజ్నోర్‌లో జరిగిన మరో సంఘటనను కూడా ప్రస్తావించారు. ఇక సదరు ఆర్డినెన్స్ భారతీయ ముస్లిం యువకులు హక్కులను కాలరాస్తుందని పేర్కొన్నారు. ఇక యూపీ తీసుకొచ్చిన లవ్ జిహాద్ ఆర్డినెన్స్‌ను అలహాబాద్ కోర్టు కూడా వ్యతిరేకించిందని లేఖలో పేర్కొన్నారు. ఇక యూపీ తీసుకువచ్చిన సదరు యాంటీ లవ్ జిహాద్ ఆర్డినెన్స్‌ను నలుగురు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తులు కూడా వ్యతిరేకించారు. వీరిలో జస్టిస్ మదన్ బీ లోకూర్ సదరు ఆర్డినెన్స్‌ని రాజ్యాంగ విరుద్ధం అని పేర్కొన్నారు. -
తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు వేతనాలు, పింఛన్లలో కోత విధిస్తూ తెచ్చిన ఆర్డినెన్స్‌పై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ విశ్రాంత డీఎఫ్‌వో రామన్‌గౌడ్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధంగా ఉందని న్యాయస్థానానికి పిటిషనర్ వాదనలు వినిపించారు. పిటిషనర్ వాదనలు విన్న హైకోర్టు.. మూడు వారాల్లో ఆర్డినెన్స్‌పై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పరీక్షల వాయిదా నిరాకరించిన హైకోర్టు.. పీజీ మెడికల్, దంత పరీక్షల వాయిదాకు హైకోర్టు నిరాకరించింది. రేపటి నుంచి యథాతథంగా పరీక్షలు నిర్వహించేందుకు హైకోర్టు అనుమతించింది. పరీక్షలు రాయలేని విద్యార్థులు సప్లిమెంటరీలో ఉత్తీర్ణులయినా రెగ్యులర్‌గా గుర్తిస్తామని హైకోర్టుకు కాళోజీ యూనివర్శిటీ తెలిపింది. కరోనా నేపథ్యంలో పరీక్షల నిర్వహణలో అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది. -
కోతలపై ఆర్డినెన్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో విపత్తులు, ప్రజారోగ్యపరంగా అత్యయిక పరిస్థితులు ఉత్పన్నమైన సందర్భాల్లో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన జీతభత్యాలు, పెన్షన్ల చెల్లింపులో గరిష్టంగా 50 శాతం వరకు కోత (వాయిదా)కు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అనుమతితో మంగళవారం ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. అత్యవసర ఉత్తర్వులను జారీ చేసింది. కరోనా నేపథ్యంలో పెన్షన్లలో కోత విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టడంతో పాటు ఏ చట్టం ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారని ఇటీవల రాష్ట్ర హైకోర్టు నిలదీసింది. దీనిపై హైకోర్టులో బుధవారం విచారణ జరగాల్సి ఉండగా, ప్రభుత్వం ఒక రోజు ముందు అంటే మంగళవారం ఆగమేఘాల మీద తెలంగాణ విపత్తులు, ప్రజారోగ్య అత్యయిక పరిస్థితుల ఆర్డినెన్స్–2020 పేరిట ఆర్డినెన్స్ విడుదల చేసింది. 2020 మార్చి 24 నుంచి రాష్ట్రంలో ఈ ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చిందని, యావత్ రాష్ట్రానికి వర్తిస్తుందని స్పష్టం చేసింది. జీతాలు, పెన్షన్ల చెల్లింపుల్లో కొంత భాగాన్ని వాయిదా వేసేందుకు ప్రత్యేక నిబంధనలు రూపొందించడం అత్యవసరంగా మారిందని, ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరగకపోవడంతో ఈ మేరకు చట్టాన్ని తీసుకురావడం సాధ్యం కాక ఈ అత్యవసర ఆర్డినెన్స్ జారీ చేస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. నేపథ్యం ఇదీ..: కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో గత మార్చి 24న రాష్ట్రంలో లాక్డౌన్ విధించడంతో ప్రభుత్వ ఆదాయం దారుణంగా పడిపోయింది. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ల చైర్మన్ల వేతనాల్లో 75 శాతం, అఖిల భారత సర్వీసుల ఉద్యోగుల జీతాల్లో 60 శాతం, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల జీతాల్లో 50 శాతం, రిటైర్డు ఉద్యోగుల పెన్షన్లు 25 శాతం, నాలుగో తరగతి, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోత విధిస్తూ గత మార్చి 30న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఈ కోతలు అమల్లో ఉంటాయని ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్, మే, జూన్ నెలల జీతాలు, పెన్షన్లలో ఈ మేరకు ప్రభుత్వం కోతలను అమలుపరచగా, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కుదుటపడే వరకు కోతలను కొనసాగించే అవకాశాలున్నాయి. తిరిగి చెల్లింపుపై 6 నెలల్లో స్పష్టత.. జీతాలు, వేతనాలు, పెన్షన్లలో కోత (వాయిదా) వేసిన భాగాన్ని సదరు వ్యక్తులు, ఉద్యోగులు,పెన్షనర్లకు, సంస్థలకు తిరిగి చెల్లించే విధానంపై స్పష్టతనిస్తూ, కోతలను అమల్లోకి తెచ్చిన తేదీ నుంచి ఆరు నెలల్లోగా ప్రకటన జారీ చేస్తారు. విపత్తు, అత్యయిక పరిస్థితుల్లోనే ఏదైనా విపత్తు, ప్రజారోగ్య అత్యయిక పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు వ్యక్తికి, సంస్థకు, చెల్లించాల్సిన చెల్లింపులు, బకాయిల్లో కొంత భాగాన్ని గరిష్టంగా 50 శాతానికి మించకుండా వాయిదా లేదా కోత విధించేందుకు చట్టబద్ధంగా ప్రభుత్వానికి అధికారం ఉందని ఆర్డినెన్స్‌లో ప్రభుత్వం తెలిపింది. విపత్తులు, అత్యయిక ప్రజారోగ్య పరిస్థితులు నెలకొని ఉన్నంత కాలం వాటిని సమర్థంగా నిర్వహించడానికి ప్రభుత్వానికి ఈ వెసులుబాటు ఉంటుందని స్పష్టం చేసింది. ఏదైనా చట్టం, ఉత్తర్వులు, నిబంధనలు, నియమావళి, ఏదైనా కోర్టు/ట్రిబ్యునల్ ఉత్తర్వులు, తీర్పులతో సంబంధం లేకుండా ఉద్యోగులు, పెన్షనర్లు, ఇతర ఏదైనా వ్యక్తులకు నెలవారీగా చెల్లించాల్సిన చెల్లింపుల్లో గరిష్టంగా 50 శాతానికి మించకుండా వాయిదా వేసే అధికారం ప్రభుత్వానికి ఉందని తెలిపింది. ఉద్యోగి, పెన్షనర్, ఇతర ఎవరైనా వ్యక్తి, ఏదైనా ప్రభుత్వ యాజ మాన్య/ నియంత్రిత/ ఎయిడెడ్ సంస్థ, ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలల ఉపాధ్యాయులు, స్థానిక సంస్థలు, చట్టబద్ధ సంస్థ, విశ్వవిద్యాలయాలు, కార్పొరేషన్లు, ఎయిడెడ్ విద్యా సంస్థలు తదితర సంస్థలకు ఈ ఆర్డినెన్స్ వర్తించనుంది. -
‘జాతీయ జంతువుగా గోవు’
గువహటి : గోవధ నియంత్రణపై యూపీ ప్రభుత్వం ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపిన క్రమంలో గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ఏఐఎంఐఎం నేత సయ్యద్ అసీం వకార్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గోమాతను కాపాడేలా బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు ఓ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని కోరారు. పాలివ్వని ఆవులను అమ్మేవారిని కూడా కఠినంగా శిక్షించి రూ 20 లక్షల జరిమానా విధించాలని అన్నారు. ఆవులపై సరైన వ్యూహం అమలుచేయడంలో కేంద్ర ప్రభుత్వం, యూపీ ప్రభుత్వం విఫలమయ్యాయని విమర్శించారు. విక్రేతల నుంచి మంచి ధరలకు గోవులను కొనుగోలు చేసి వాటిని షెల్టర్ హోంలలో ఉంచేలా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ చూపాలని వకార్ సూచించారు. ఆవులు వీధుల వెంట తిరుగుతూ ప్లాస్టిక్ పదార్ధాలను తింటూ, డ్రైన్ల నుంచి నీటిని తాగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాగా గో రక్షణ, గోవధ నియంత్రణ కోసం యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం మంగళవారం ఆర్డినెన్స్‌ను ఆమోదించింది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం గోవథకు పాల్పడితే పదేళ్ల జైలు శిక్ష, రూ 5 లక్షల వరకూ జరిమానా విధిస్తారు. చదవండి : గాడ్సే వారసులు నన్ను హతమారుస్తారేమో? -
పాజిటివ్ కేసులు 21వేలు, మృతుల సంఖ్య 681
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 21 వేలు దాటిపోయాయి. ఇప్పటివరకు 21,393 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి కారణంగా 681 మంది మృతి చెందగా.. 4,257 మంది కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే అత్యధిక పాజిటివ్ కేసులతో మహారాష్ట్ర ముందు వరుసలో ఉంది. ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,710 చేరింది. కరోనా బారిన పడి ఇప్పటివరకూ 269మంది చనిపోయారు. గత 24 గంటల్లో 18 మంది వైరస్ బారినపడి మరణించగా, వారిలో పదిమంది ముంబైకి చెందినవారే ఉన్నారు. అలాగే 789మంది కోలుకున్నారు. ఇక కరోనా కేసులతో గుజరాత్ రెండు, ఢిల్లీ మూడో స్థానంలో నిలిచాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా 26లక్షల మంది కరోనా మహమ్మారి బారిన పడగా, లక్షా, ఎనభైమూడు లక్షల మంది మృత్యువాత పడ్డారు. (27న సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్) ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోద ముద్ర కరోనాపై పోరాడుతున్న వైద్యులు, ఇతర సిబ్బంది రక్షణ నిమిత్తం కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిపై దాడులు చేస్తే ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 5 లక్షల వరకు జరిమానా విధించేందుకు వీలు కల్పించే ఆర్డినెన్స్‌కు కేంద్ర కేబినెట్ నిన్న (బుధవారం) ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఆ ఆర్డినెన్స్‌ను కేంద్రం రాష్ట్రపతికి పంపగా, ఆయన వెంటనే ఆర్డినెన్స్‌కు ఆమోద ముద్రవేసి, గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో ఈ ఆర్డినెన్స్ తక్షణమే అమల్లోకి వచ్చింది. ఈ కొత్త చట్టం ప్రకారం.. మామూలు దాడులకు మూడు నెలల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షల వరకు జరిమానా ఉంటుంది. ఒకవేళ దాడి తీవ్రస్థాయిలో జరిగి, బాధిత వైద్య సిబ్బందికి గాయాలు తీవ్రంగా ఉంటే.. ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 5 లక్షల వరకు జరిమానా ఉంటుంది. (కరోనా: నోట్లను ముట్టుకుంటే ఒట్టు) -
మాపై దాడులా.. సిగ్గుచేటు
న్యూఢిల్లీ: వైద్య సిబ్బందిపై దాడులకు అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వైద్యులు స్వాగతించారు. కరోనా మహమ్మారిపై పోరులో ముందంజలో ఉండి సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందిపై దాడికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకునేలా ఆర్డినెన్స్ తీసుకురానున్నట్టు కేంద్రం బుధవారం ప్రకటించింది. ఈ సందర్భంగా పలువురు వైద్యులు తమ అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. ‘ఇటీవల కాలంలో వైద్య సిబ్బందిపై జరిగిన దాడులు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయి. డాక్టర్లకు ప్రత్యేక రక్షణ కల్పిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ కాస్త ఊరట కలిగించే విషయమ’ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి డాక్టర్ రవి మాలిక్ అన్నారు. అయితే దాడులకు భయపడబోమని, కరోనా సంక్షోభం నేపథ్యంలో తమ సేవలు కొనసాగిస్తామని ప్రభుత్వానికి విన్నవించారు. ఢిల్లీ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ బీబీ వాద్వా కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘దాడులతో మేము కలత చెందాం. ఎన్ని దాడులు జరుగుతున్నా వైద్యులు తమ సేవలను మాత్రం ఆపలేదు. ఇటువంటి దాడులను నివారించేందుకు చట్టం కావాలని కోరుకున్నాం. ఎల్లప్పుడూ భయపడుతూ సేవలు అందించలేం కదా’ అని వాద్వా అన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు. మొరదాబాద్‌లో వైద్య సిబ్బందిపై దాడులకు పాల్పడిన 17 మందిపై జాతీయ భద్రత చట్టం కింద కేసులు పెట్టారని, మిగతా రాష్ట్రాల్లోనూ ఇటువంటి చర్యలు తీసుకోవాలన్నారు. (డాక్టర్లను కొట్టారు.. కరోనా సోకింది) కరోనా విజృంభణ నేపథ్యంలో తమ సేవలను ప్రధాని మోదీ గుర్తించడం పట్ల ఢిల్లీ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ హరీశ్ గుప్తా హర్షం వ్యక్తం చేశారు. వరుస దాడులు వైద్య సిబ్బంది నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వెలుగులోకి వచ్చినప్పటి నుంచి వైద్య సిబ్బంది అహర్నిశలు సేవలు అందిస్తున్నారని గుర్తు చేశారు. దేశం తమ వెంటనే కరోనాపై విజయం సాధించి తీరుతామని ఆయన అన్నారు. తమకు చట్టబద్దమైన రక్షణ కావాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు హెం మంత్రి అమిత్ షా భరోసా ఇవ్వడంతో వైద్యులు గురువారం తలపెట్టిన ఆందోళన విరమించారు. ఐఎంఏ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన అమిత్ షా.. వైద్యులకు రక్షణ కల్పిస్తామని హామీయిచ్చారు. ఈ నేపథ్యంలో వైద్యులపై దాడులను నిరోధించేందుకు ఆర్డినెన్స్ తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్రం కీలక నిర్ణయం.. వైద్యుల రక్షణకు ఆర్డినెన్స్ -
రాజ్యాంగమిచ్చిన అధికారం మేరకే ఆర్డినెన్స్
సాక్షి, అమరావతి: రాజ్యాంగంలోని అధికరణ 213 ప్రకారం సంక్రమించిన న్యాయమైన అధికారాన్ని అనుసరించే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని, సర్వీసు నిబంధనలను సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. ఈ ఆర్డినెన్స్‌కు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా జస్టిస్ వి.కనగరాజ్ బాధ్యతలు కూడా స్వీకరించారని వివరించింది. అధికరణ 243(కె), ఏపీ పంచాయతీరాజ్ చట్టం 1994లోని నిబంధనలను అనుసరించే ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చామని తెలిపింది. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను తప్పించేందుకే ఈ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చామన్న వాదనలో ఏ మాత్రం వాస్తవంలేదని స్పష్టంచేసింది. అధికరణ 243(కె)(2) ప్రకారం సర్వీసు నిబంధనల్లో పదవీ కాలం భాగం కాదని పేర్కొంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మేళనం ఎలా ఉండాలన్నది అధికరణ 243(కె) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమని వివరించింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో సంస్కరణల కొనసాగింపు ఫలితమే ప్రస్తుత ఆర్డినెన్స్ అని.. ఈ ఆర్డినెన్స్ నేపథ్యంలో పిటిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం ముగిసిందని కోర్టు కు నివేదించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని నియమించాలన్నది ప్రభుత్వ విధానప రమైన నిర్ణయమని, ఈ విషయంలో ప్రభుత్వానికి ఉద్దేశాలు అంటగట్టడం సరికాదంది. తమ ఈ కౌం టర్ను పరిగణనలోకి తీసుకుని నిమ్మగడ్డ రమేష్‌కుమార్ దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాలను కొట్టేయాలని రాష్ట్ర ప్రభు త్వం హైకోర్టును అభ్యర్థించింది. ఎస్ఈసీ పదవీ కాలం, సర్వీసు నిబంధనలను సవరిస్తూ తీసుకొచ్చిన ఆర్డి నెన్స్, తదనుగుణ జీఓలను, కమిషనర్‌గా జస్టిస్ వి.కనగరాజ్ నియామకాన్ని సవాలు చేస్తూ నిమ్మగడ్డ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలి సిందే. ఈ వ్యాజ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ద్వివేది కౌంటర్ దాఖలు చేశారు. సంస్కరణల్లో భాగమే ఈ ఆర్డినెన్స్ ‘ఎన్నికలు నిష్పాక్షికంగా, ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అవసరమైన సంస్కరణలు తేవాలని నిర్ణయించి, ఈ విషయాన్ని మార్చిలోనే కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశాం. ఈ సంస్కరణలపై పలు సమావేశాల్లో చర్చించాకే ఈ ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చాం. అందువల్ల దీనిని హడావుడిగా జారీచేశామన్న పిటిషనర్ ఆరోపణల్లో వాస్తవంలేదు. ఎన్నికల కమిషనర్‌గా తనను కొనసాగించాలని ఒత్తిడి చేసే ప్రాథమిక హక్కూ పిటిషనర్‌కు లేదు. విధానపరమైన నిర్ణయాల్లో భాగంగా చట్ట సవరణలు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది’ అని ద్వివేది వివరించారు. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయం ‘రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమాత్రం సంప్రదించకుండా ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వానికి పంపడానికి కన్నా ముందు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకే తెలియజేశారు. ఎన్నికల వాయిదా విషయంలో కమిషనర్‌ది ఏకపక్ష నిర్ణయం. అలాగే వైద్య శాఖ నుంచి ఎటువంటి నివేదిక కోరలేదు.’ అని ఆయన విన్నవించారు. అంతేకాక.. ‘కేంద్ర హోంశాఖకు రాసిన లేఖ గురించి నిమ్మగడ్డ ఆ పిటిషన్లో ప్రస్తావించలేదు. ఇందులో ఆయన ఆరోపణలను తోసిపుచ్చుతూ రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ కేంద్రానికి రెండు లేఖలు రాశారు. ఎన్నికలు కేంద్ర ఎన్నికల సంఘం లేదా బహుళ అధికారుల బృందం మార్గదర్శకంలో జరిగే అవకాశాలను చూడాలని కేంద్రాన్ని కోరే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్న విషయాన్ని కేంద్రానికి తెలియజేశాం’ అని ద్వివేది తన కౌంటర్లో పేర్కొన్నారు. -
‘ఆ ఆర్డినెన్స్‌తో వర్సిటీల మూసివేత’
లక్నో : ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను నియంత్రిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలన్న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ నిర్ణయాన్ని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తప్పుపట్టారు. ఈ ఆర్డినెన్స్‌లో రాష్ట్రంలో ప్రైవేట్ వర్సిటీలు మూతపడతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు తమ క్యాంపస్‌లో దేశ వ్యతిరేక కార్యకలాపాలను అనుమతించమని స్పష్టం చేస్తూ హామీ ఇవ్వాలని, దేశ లౌకిక, ప్రజాస్వామ్య స్ఫూర్తికి వర్సిటీలు కట్టుబడి ఉండాలని యూపీ క్యాబినెట్ ఆమోదించిన ఆర్డినెన్స్ ముసాయిదాలో పొందుపరిచారు. కాగా ఈ ఆర్డినెన్స్ ద్వారా ప్రైవేట్ వర్సిటీలను నెలకొల్పేందుకు ముందుకొచ్చే వారిపై నియంత్రణలు విధించేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. యోగి ఆదిత్యానాథ్ ఓవైపు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరుతూనే మరోవైపు పెట్టుబడిదారులను ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నాలు చేయడం సరైంది కాదని హితవు పలికారు. నూతన విశ్వవిద్యాలయాలు నెలకొల్పడం పట్ల యూపీ ప్రభుత్వానికి శ్రద్ధ లేదని, రాష్ట్రంలో అన్ని ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు మూతపడాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమని అఖిలేష్ అన్నారు. మరోవైపు యూపీ ప్రభుత్వం భావ ప్రకటనా స్వేచ్ఛను హరిస్తోందని కాంగ్రెస్ పార్టీ సైతం తాజా ఆర్డినెన్స్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. -
‘నిబంధనలకు అనుగుణంగానే పంచాయతీరాజ్ ఆర్డినెన్స్’
సాక్షి, న్యూఢిల్లీ : పంచాయతీ రాజ్ చట్టాన్ని మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. తెలంగాణ పంచాయతీ ఎన్నికల ముందు పంచాయతీరాజ్ చట్టాన్ని మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. రిజర్వేషన్లను కుదిస్తూ జారీ చేసిన ఈ ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలంటూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతానికి తగ్గిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని కృష్ణయ్య తన పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం రిజర్వేషన్లు 50 శాతం నిబంధనను దాటలేదు కదా అని కృష్ణయ్య తరపు న్యాయవాదిని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. నిబంధనలకు అనుగుణంగానే ఆర్డినెన్స్ ఉన్నందున జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
మందిర నిర్మాణానికి ఆర్డినెన్స్ అప్పుడే..
-
మందిర నిర్మాణానికి ఆర్డినెన్స్ అప్పుడే..
న్యూఢిల్లీ : అయోధ్యలో రామమందిర నిర్మాణంపై న్యాయ ప్రక్రియ పూర్తయిన అనంతరమే ఎన్డీఏ ప్రభుత్వం ఈ దిశగా ఆర్డినెన్స్ తీసుకువస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. నూతన సంవత్సరం తొలిరోజున ప్రధాని ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను ప్రస్తావించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణ వ్యవహారంపై న్యాయ ప్రక్రియ నెమ్మదించేలా కాంగ్రెస్ పార్టీ అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. రాజ్యాంగ పరిధిలో ఈ అంశానికి పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశాన్ని నాలుగు తరాల పాటు ఏలిన కాంగ్రెస్ పార్టీ పలు కుంభకోణాల్లో కూరుకుపోయిందని ధ్వజమెత్తారు. ఆర్థిక అవకతవకలతో బెయిల్ మీద ఆ పార్టీ అగ్రనేతలున్నారని ఎద్దేవా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే ఊర్జిత్ నిష్ర్కమణ ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశారని చెప్పారు. గత ఆరేడు నెలలుగా ఆయన తనను రిలీవ్ చేయాలని కోరుతున్నారని, చివరికి లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేసుకున్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఊర్జిత్ రాజీనామా వ్యవహారంలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని, ఆర్బీఐ గవర్నర్‌గా ఆయన తన విధులను సమర్ధంగా నిర్వహించారని ప్రశంసించారు. కూటమి వర్సెస్ ప్రజలు 2019 సార్వత్రిక ఎన్నికల్లో దేశ ప్రజలు తమకే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికలు మహాకూటమికి, ప్రజలకు మధ్య జరుగుతున్న పోరుగా మోదీ అభివర్ణించారు. ప్రజల ప్రేమ, ఆశీర్వాదాలే తనకు కొండంత అండగా నిలుస్తాయన్నారు. మెరుపు దాడులపై ఉత్తర్వులు.. పాక్ భూభాగంలో ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసేందుకు నిర్వహించిన మెరుపు దాడులకు తాను స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశానని చెప్పుకొచ్చారు. దాడులు చేపట్టే క్రమంలో మీరు విజయవంతమైనా, విఫలమైనా దాని గురించి ఆలోచించకుండా సూర్యోదయం అయ్యే సమయానికి తిరిగి చేరుకోవాలని సైన్యానికి సూచించానన్నారు. ఆపరేషన్‌ను అతితక్కువ సమయంలో పూర్తిచేయాలని, దాన్ని ఎక్కువసేపు కొనసాగించరాదని చెప్పానన్నారు. ఈ ఆపరేషన్ గురించి వివరించే క్రమంలో మోదీ కొంత భావోద్వేగానికి లోనైనట్టు కనిపించారు. ట్రిపుల్ తలాక్‌పై నిషేధం ఎందుకంటే.. సుప్రీం కోర్టు తీర్పు అనంతరం ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్‌ను తమ ప్రభుత్వం తీసుకువచ్చిందని, రాజ్యాంగ పరిధిలో ఈ సమస్య పరిష్కారానికి చొరవ చూపుతామని బీజేపీ మేనిఫెస్టోలో పొందుపరిచామని ప్రధాని పేర్కొన్నారు. ట్రిపుల్ తలాక్‌ను పెద్దసంఖ్యలో ముస్లిం దేశాలు నిషేధించాయని చెప్పారు. పాకిస్తాన్లో సైతం ట్రిపుల్ తలాక్‌ను నిషేధించారన్నారు. ఇది ఎలాంటి మతానికి, విశ్వాసానికి సంబంధించిన అంశం కాదని, కేవలం లింగ సమానత్వం, సామాజిక న్యాయంతో ముడిపడిన వ్యవహారమని చెప్పారు. శబరిమలపై విస్తృత చర్చ.. దేశంలో ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాలన్నది భారత్ అభిమతం..దేశంలో కొన్ని దేవాలయాలకు ప్రత్యేక సంప్రదాయాలున్నాయని శబరిమల ఉదంతాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని పేర్కొన్నారు. కొన్ని ఆలయాల్లో పురుషులకు ప్రవేశం లేదని గుర్తుచేశారు. శబరిమల విషయంలో సుప్రీం కోర్టులో మహిళా న్యాయమూర్తి కొన్ని వ్యాఖ్యలు చేశారని చెబుతూ, ఆయా అభిప్రాయాలను వ్యక్తం చేసే వారికి రాజకీయ కోణాలతో ముడిపెట్టరాదన్నారు. ఓ మహిళగా ఆమె చేసిన సూచనలపైనా చర్చ జరగాలన్నారు. -
రామ మందిరంపై ఒవైసీ సవాలు..
న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిరం నిర్మాణంపై బీజేపీ ప్రభుత్వానికి ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సవాలు విసిరారు. అయోధ్యలోని రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదస్పద ప్రాంతంపై అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. అలాగే దీనిపై విచారణను వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసింది. అత్యున్నత ధర్మాసనం ఆదేశాలను స్వాగతించిన ఒవైసీ.. బీజేపీ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. రామ మందిరం నిర్మాణంపై బీజేపీ ఎందుకు ఆర్డినెన్స్ తీసుకురాలేదని సూటిగా ప్రశ్నించారు. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించారు. ప్రధాని మంత్రి గిరిరాజ్ సింగ్‌ను అటార్నీ జనరల్‌గా నియమించి.. ఆయన ద్వారా సుప్రీంలో ప్రభుత్వ వాదనలు వినిపించాలని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా ప్రతిసారి, ప్రతి సందర్భంలో బీజేపీ, ఆరెస్సెస్, వీహెచ్‌పీ నాయకులు రామ మందిరం నిర్మాణం ఆర్డినెన్స్ తీసుకొస్తామని బెదిరింపులకు పాల్పడతారని.. కానీ వారు ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. అధికారంలో ఉన్న బీజేపీ రామ మందిరంపై ఆర్డినెన్స్ తీసుకురావాలని సవాలు విసిరారు. సుప్రీం కోర్టు తీర్పుకు ముందు రామ మందిరం నిర్మాణంపై గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ.. రామ మందిరం నిర్మాణంపై ప్రభుత్వం చట్టాన్ని తీసుకురావాలి లేదా కోర్టు తీర్పును వెలువరించాలి అని కోరారు. లేకపోతే హిందూవులు సహనాన్ని కొల్పోయే అవకాశం ఉందని అన్నారు. దేశంలో ఏదైనా జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. కాంగ్రెస్‌కు రామ మందిర నిర్మాణం ఇష్టం లేదని ఈ వివాదం ఇలాగే కొనసాగాలని కోరుకుంటుందని ఆరోపించారు. -
కేంద్రానికి వీహెచ్‌పీ డెడ్‌లైన్
న్యూఢిల్లీ/అహ్మదాబాద్: అయోధ్యలో రామమందిరం నిర్మాణం అంశంలో విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) గళం పెంచింది. కేంద్ర ప్రభుత్వానికి గడువు విధించింది. ఈ ఏడాది చివరిలోగా రామమందిర నిర్మాణంపై ఆర్డినెన్స్ తేకుంటే తమకు వేరే ప్రత్యామ్నాయాలున్నాయంటూ హెచ్చరికలు చేసింది. శుక్రవారం ఇక్కడ భేటీ అయిన వీహెచ్‌పీ ఉన్నత స్థాయి కమిటీ రామ్ జన్మభూమి న్యాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహంత్ నృత్య గోపాల్ దాస్ ఆధ్వర్యంలో చర్చలు జరిపింది. అనంతరం వీహెచ్‌పీ ప్రముఖులంతా రాష్ట్రపతి కోవింద్‌కు∙తీర్మాన ప్రతిని ఇచ్చారు. వీహెచ్‌పీ అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ మాట్లాడారు. ‘ప్రభుత్వం స్పందించకుంటే వేరే ప్రత్యామ్నాయాలున్నాయి. వచ్చే ఏడాది మహాకుంభమేళా సందర్భంగా సాధువులతో జరిగే ధరమ్ సన్సద్ సమావేశంలో నిర్ణయిస్తాం’ అని తెలిపారు. ‘ఈ మధ్య జంధ్యం ధరించిన కొందరు నేతలు ఆలయాలను దర్శించుకుంటున్నారు. వారూ మాకు మద్దతివ్వాలని రాహుల్‌గాంధీనుద్దేశించి అన్నారు. కేసు సుప్రీంకోర్టులో ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ..‘ఇప్పటికే చాలా ఏళ్లపాటు ఎదురు చూశాం. ఇప్పుడిక వేచి చూడలేం’ అని‡ అన్నారు. ఢిల్లీలో సమావేశంలో పాల్గొన్న వీహెచ్‌పీ నేతలు -
‘ఈ ఆర్డినెన్స్‌తో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు’
సాక్షి, హైదరాబాద్ : ‘ట్రిపుల్ తలాక్’ను నేరంగా పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకరావడం పట్ల ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఆర్డినెన్స్‌ను సవాలు చేస్తూ కోర్టుకు వెళ్తామంటూ గురువారం ప్రకటించింది. పార్లమెంటు ఆమోదం పొందకుండానే ఆర్డినెన్స్ తీసుకువచ్చి కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని వ్యాఖ్యానించింది. చట్టసభలను గౌరవించకుండా కేంద్రం నిరంకుశంగా వ్యవహరించిందంటూ లా బోర్డు విమర్శించింది. దొడ్డిదారిన ఎందుకు తెచ్చారు? ఆల్ ఇండియా ముస్లిం లా బోర్డు జనరల్ సెక్రటరీ మౌలానా ఖలీద్ సైఫ్ ఉల్లా రహ్మానీ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం దొడ్డి దారిన ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్ తీసుకువచ్చిందని ఆరోపించారు. అసలు ముస్లిం వర్గాల అభిప్రాయం తీసుకోకుండా ఏకపక్షంగా ఎలా వ్యవహరిస్తారంటూ ప్రశ్నించారు. ముస్లిం మహిళలకు హాని కలిగించే విధంగా ఉన్న ఆర్డినెన్స్‌ను సుప్రీం కోర్టులో సవాలు చేసే అంశంపై తమ లీగల్ కమిటీ చర్చిస్తోందని తెలిపారు. వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే : అసదుద్దీన్ ఒవైసీ ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్ ఓ నాటకమని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. రఫెల్ డీల్, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ ఉదంతాలు, పెరుగుతున్న ఇంధన ధరల గురించి ప్రజలకు సమాధానం చెప్పాల్సి వస్తుందనే భయంతో బీజేపీ ఇటువంటి నాటకాలు ఆడుతోందని విమర్శించారు. కాగా ‘ట్రిపుల్ తలాక్’ను నేరంగా పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వం గత బుధవారం ఆర్డినెన్స్ తీసుకు వచ్చింది. ఈ ఆర్డినెన్స్‌ను ఆమోదిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతకం చేశారు. ఏకాభిప్రాయం కుదరని కారణంగానే ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్ తీసుకువచ్చామని న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వివరించారు. లోక్‌సభలో ఆమోదం పొందినప్పటికీ రాజ్యసభలో మాత్రం ఈ బిల్లు ఆమోదం పొందలేదు. -
హడావుడి ఆర్డినెన్స్!
తక్షణ తలాక్ విధానం ద్వారా విడాకులివ్వడాన్ని నిషేధిస్తూ, దాన్ని నేరపూరిత చర్యగా పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆర్డినెన్స్ జారీ చేసింది. తక్షణ తలాక్ రాజ్యాంగ విరుద్ధమంటూ నిరుడు ఆగస్టులో సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించాక కేంద్రం ఈ విషయంలో పట్టుదలగా వ్యవహరిస్తోంది. నిరుడు డిసెంబర్లో కేంద్ర మంత్రివర్గం దీనికి సంబంధించిన బిల్లును ఆమోదించింది. అనంతరం ఆ బిల్లుకు లోక్‌సభ ఆమోదాన్ని పొందింది. ప్రతిపక్షాల ఆధిక్యత ఉన్న రాజ్యసభలో దీనికి అవాంతరాలు ఎదురయ్యాయి. అక్కడా, వెలుపలా వ్యక్తమైన అభిప్రాయాల్లో కొన్నిటికి చోటిచ్చి తాజా ఆర్డినెన్స్ రూపొందించారు. దానికి బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెల్పడం, ఆ వెంటనే రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడం చకచకా పూర్తయ్యాయి. ఈ దురాచారం ముస్లింలలో ప్రబలంగా లేదు. దాన్ని ఆచరించేవారి సంఖ్య స్వల్పం. అయితే బాధి తుల సంఖ్యతో నిమిత్తం లేకుండా అన్యాయం జరుగుతున్నదనుకుంటే దాన్ని చక్కదిద్దవలసిందే. ఆ విషయంలో రెండో మాటకు తావులేదు. పార్లమెంటు శీతాకాల సమావేశాల తేదీలు ఇంకా ఖరారు కాకపోయినా అవి డిసెంబర్లో ఉండే అవకాశం ఉంది. ఆ సమావేశాల వరకూ ఆగి బిల్లు ప్రవేశపెడితే... దాని ఆమోదానికి, ఆ తర్వాత చట్టంగా రూపొందడానికి మరో అయిదారు మాసాలు పడుతుంది. కనుక ఆర్డినెన్స్ తప్పనిసరైందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర ప్రసాద్ చెబుతున్నారు. దానికి మద్దతుగా కొన్ని గణాంకాలు కూడా ఆయన ఏకరువు పెట్టారు. నిరుడు జనవరి మొదలుకొని ఈ నెల వరకూ దేశవ్యాప్తంగా 430 తక్షణ తలాక్ ఉదంతాలు చోటు చేసుకున్నాయని ఆయన వివరించారు. ఇందులో సర్వోన్నత న్యాయస్థానం తీర్పునివ్వకముందు 229, ఇచ్చాక 201 జరిగాయి. తక్షణ తలాక్ ఆచరణ మన దేశంలో ఎంత స్వల్పమో ఈ లెక్కలే చెబు తున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో ముస్లింలు 14.23 శాతం. అంటే దాదాపు 17 కోట్ల 23 లక్షలు. అయితే గతంలో రాజ్యసభలో ఈ బిల్లుకు ఎదురైన అవాంతరాలకు గల కారణాలనుగానీ, ముస్లిం వర్గాల నుంచి వ్యక్తమవుతున్న అభ్యంతరాలనుగానీ తాజా ఆర్డినెన్స్ పరిగణనలోకి తీసు కున్నట్టు కనబడదు. కనీసం ఆర్డినెన్స్ తీసుకొచ్చే ముందైనా ఆయా వర్గాలతో, మరీ ముఖ్యంగా ముస్లిం మహిళలతో కేంద్రం మరోసారి మాట్లాడితే బాగుండేది. ఎందుకంటే తక్షణ తలాక్ విధానం పోవాలని కోరుకునేవారు సైతం కొన్ని నిబంధనల విషయంలో అభ్యంతరం చెబుతున్నారు. లోక్‌సభ ఆమోదం పొందిన బిల్లు తక్షణ తలాక్ చెప్పటం దానికదే శిక్షార్హమైన నేరంగా పరిగణించి అందుకు మూడేళ్ల వరకూ జైలుశిక్ష, జరిమానా విధించవచ్చునని ప్రతిపాదించింది. ఇప్పుడు ఆ నిబంధనను స్వల్పంగా సవరించి భార్య లేదా ఆమె తరఫు రక్త సంబంధీకులు, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని నిర్దేశించారు. దీన్ని రాజీకి వీలైన నేరంగా కూడా మార్చారు. అంటే ఇరుపక్షాలూ ఏకాభిప్రాయానికొచ్చి కేసును ఉపసంహరించుకోవచ్చు. అలాగే ఇది నాన్‌బెయిలబుల్ కేసు అయినా, విచారణ సమయంలో బెయిల్ పొందేందుకు వీలు కల్పించారు. గతంతో పోలిస్తే ఇవి మెరుగైన మార్పులే. అయితే లోగడ బిల్లును వ్యతిరేకించినవారు కోరింది ఇవి మాత్రమే కాదు. అసలు తక్షణ తలాక్ చెప్పడాన్ని నేరంగా పరిగణించే విధానమే రద్దు కావాలని వారు డిమాండ్ చేశారు. ఇందులో అహేతుకత ఏమీ లేదు. తక్షణ తలాక్ చెల్లదని సర్వోన్నత న్యాయస్థానం ఇప్పటికే చెప్పింది గనుక లేని హక్కును చలాయించటం భర్తకు అసాధ్యం. ఒకవేళ గెంటేస్తే దాంపత్య హక్కుల్ని పరిరక్షించుకోవటానికి ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించొచ్చు. తలాక్ చట్టవిరుద్ధం గనుక ఆ పెళ్లి రద్దు కాలేదని న్యాయ స్థానం స్పష్టం చేస్తుంది. ఈ విషయంలో భర్త ఆమె హక్కులు కాలరాయాలని చూస్తే గృహహింస చట్టం కింద ఆమె కేసు పెట్టొచ్చు. సుప్రీంకోర్టు సైతం తక్షణ తలాక్ చెల్లదని చెప్పింది తప్ప, దాన్ని శిక్షార్హమైన నేరంగా పేర్కొనలేదు. భార్యాభర్తల మధ్య పొరపొచ్చాలు వచ్చినప్పుడు, అవి తీవ్రరూపం ధరించినప్పుడు విడాకుల వరకూ వెళ్తుంది. అయితే ఇతర మతస్తుల విషయంలో దాన్ని నేరపూరిత చర్యగా పరిగణించనప్పుడు ముస్లింలకు వేరే విధమైన నిబంధన ఎందుకు? ఇది తమ పట్ల చూపిస్తున్న వివక్షలో భాగమని వారనుకునే అవకాశం లేదా? ఆవేశం అవధులు దాటినప్పుడు భార్య లేదా ఆమె తరఫు బంధువులు కేసు పెట్టి తక్షణ తలాక్ చెప్పిన వ్యక్తిని అరెస్టు చేయిస్తే రాజీకి దారులు మూసుకుపోయే ప్రమాదం ఉంటుంది. భర్త నుంచి విడిపోయిన మహిళకు వెనువెంటనే కావాల్సింది భరణం. ఆమె, ఆమెతో ఉండే సంతానం జీవించడానికి అవసరమైన జీవనభృతి జైలు పాలైన భర్త సమకూర్చగలుగుతాడా? అలాంటి సందర్భాల్లో ఆమె మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించవచ్చునని ఆర్డినెన్స్ చెబుతోంది. కానీ ఆ జీవనభృతి ఇచ్చేదెవరో, ఎలా లెక్కేస్తారో ఈ ఆర్డినెన్స్‌లో లేదు. మారే కాలానికి అనుగుణంగా ఎవరైనా మారక తప్పదు. పౌర హక్కుల భావన లేనికాలంలో మహిళలకు అన్యాయం చేసే పలు సంప్రదాయాలు, విధానాలు అమల్లోకి వచ్చాయి. ప్రపం చంలోని అన్ని మతాల్లోనూ ఈ ధోరణులు కనిపిస్తాయి. ప్రతి మతం లోని పెద్దలూ ఎప్పటికప్పుడు ఈ అంశాలపై దృష్టి పెట్టి కాలం చెల్లిన విధానాలకు స్వస్తి పలకటం అవసరం. అదే సమయంలో ముస్లింల విషయంలో ఏకపక్షంగా, వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శ రాకుండా చూసుకోవటం ప్రభుత్వం బాధ్యత. డిసెంబర్‌లోగా జరగబోయే నాలుగు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఆదరా బాదరాగా ఆర్డినెన్స్ తెచ్చిందని ఇప్పటికే కాంగ్రెస్ తదితర పక్షాలు ఆరోపించాయి. ఎవరినీ సంప్రదించకుండా, ఇప్పటికే వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకోకుండానే ఆర్డినెన్స్ జారీ చేసి ఆ విమర్శలను కేంద్రం నిజం చేసింది. -
‘ట్రిపుల్ తలాక్‌పై ఖేదం, మోదం
సాక్షి, న్యూఢిల్లీ : ‘ట్రిపుల్ తలాక్’ను నేరంగా పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం నాడు ఆర్డినెన్స్‌ను తీసుకరావడం పట్ల ముస్లింలు, మహిళా హక్కుల కార్యకర్తల్లో కొందరు ఆనందాన్ని వ్యక్తం చేయగా, కొందర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓ ముస్లిం వ్యక్తి ఏ రకంగానైనా భార్యకు మూడు సార్లు తలాక్ చెప్పి విడాకులు ఇచ్చేందుకు ప్రయత్నించినట్లయితే అతనికి మూడేళ్ల వరకు శిక్ష విధించేలా కేంద్రం ఈ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. 2017, డిసెంబర్లో లోక్‌సభ ఆమోదించిన ‘ముస్లిం మహిళల పెళ్లి హక్కుల పరిరక్షణ బిల్లు’ స్థానంలో ఈ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చారు. లోక్‌సభ ఆమోదించిన ఈ బిల్లులో పలు మార్పులు, చేర్పులు చేయాలని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు పట్టు పట్టడంతో నాడు రాజ్యసభలో సంపూర్త బలంలేని బీజేపీ ప్రభుత్వం ఆ సభలో బిల్లును ప్రవేశపెట్టలేక పోయింది. చివరకు కేంద్ర కేబినెట్ ప్రతిపక్షాలతోపాటు, పలు ముస్లిం సంస్థలు చేసిన సూచనలను పరిగణలోకి తీసుకొని ఆగస్టు 9వ తేదీన బిల్లులోని కొన్ని సవరణలను తీసుకొచ్చింది. ఆ మరుసటి రోజే ఆ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ప్రతిపక్షాలు బిల్లులో చేసిన సవరణలను పరిగణలోకి తీసుకోకుండా గుడ్డిగా సభా కార్యక్రమాలను స్తంభింపచేయడంతో బిల్లును శీతాకాల పార్లమెంట్ సమావేశాల వరకు వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో బిల్లు స్థానంలో కేంద్ర కేబినెట్ ట్రిపుల్ తలాక్‌పై ఆర్డినెన్స్‌ను తీసుకరావాల్సి వచ్చింది. ఈ ఆర్డినెన్స్ పట్ల ముస్లింలో ఓ వర్గం హర్షం వ్యక్తం చేస్తుండగా, మరో వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ట్రిపుల్ తలాక్‌ను శిక్షార్హమైన నేరంగా పరిగణించరాదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వర్గం వాదిస్తోంది. ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని 2017, అక్టోబర్ నెలలో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కొన్ని దశాబ్దాలుగా దీనిపై వివాదం కొనసాగుతోంది. ట్రిపుల్ తలాక్‌లు చెల్లవని కోర్టులు తీర్పులు ఇచ్చిన సందర్భాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. షమీమ్ ఆరా వర్సెస్ ఉత్తర ప్రభుత్వం మధ్య కొనసాగిన కేసులో ట్రిపుల్ తలాక్ చెల్లదని 2002లోనే సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. 2017, ఫిబ్రవరి నెలలో ట్రిపుల్ తలాక్, బహు భార్యత్వం, నిఖా హలాలా (భర్త నుంచి విడిపోయి మళ్లి కలుసుకోవాలంటో మరో వ్యక్తినిపెళ్లి చేసుకొని విడాకులు తీసుకోవడం)ను వ్యతిరేకిస్తూ ట్రిపుల్ తలాక్ బాధితురాలు షయారా బానో, పలువురు ముస్లిం మహిళలు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేయడంతో వ్యవహారం ఇంతవరకు వచ్చింది. ట్రిపుల్ తలాక్‌ను శిక్షార్హమైన నాన్‌బెయిలబుల్ నేరంగా పరిగణిస్తూ, మూడేళ్ల వరకు జైలు, జరిమానా విధించేలా తొలుత బీజేపీ ప్రభుత్వం బిల్లును తీసుకొచ్చింది. ఫలానా వ్యక్తి ట్రిపుల్ తలాక్ చెప్పాడంటూ ఎవరైన పోలీసు ఫిర్యాదు ఇచ్చేలా ఆ బిల్లును రూపొందించారు. ఈ బిల్లు వల్ల ముస్లిం మహిళలు నష్టపోయే అవకాశం ఉందంటూ ప్రతిపక్షాలు, పలు సంస్థలు గొడవ చేయడంతో కేంద్రం భార్య, లేదా అమె సమీప బంధువలు మాత్రమే ట్రిపుల్ తలాక్‌పై ఫిర్యాదు ఇచ్చేలా సవరణ తీసుకొచ్చింది. ట్రిపుల్ తలాక్ కేసుల్లో భార్యను విచారించి హేతుబద్ధంగా భర్తకు మేజిస్ట్రేట్ బెయిల్ ఇచ్చేలా మరో మార్పు చేయడంతోపాటు, భార్యా భర్తలు అవసరమైతే రాజీకి వచ్చేందుకు కూడా వీలు కల్పిస్తూ ముఖ్యమన సవరణకు చేర్చారు. ఆర్డినెన్స్‌ను భారతీయ ముస్లిం మైనారిటీ ఆందోళన్ సంస్థ పూర్తిగా సమర్థించింది. సవరణలను కూడా స్వాగతించింది. ఆర్దినెన్స్ పట్ల అసంతృప్తి ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్ పట్ల ప్రతిపక్ష పార్టీలతోపాటు కొన్ని మానవ హక్కుల సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ‘ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించడానికి, అది శిక్షార్హమైన నేరంగా పరిగణించడానికి ఎంతో తేడా ఉంది. ముస్లిం మహిళల పేరిట ముస్లిం పురుషులను వేధించేందుకు ఈ ఆర్డినెన్స్ ఉపయోగపడుతుంది’ అని ‘బెబాక్ కలెక్టివ్’ అనే మానవ హక్కుల సంఘం వ్యవస్థాపకులు హసీనా ఖాన్ వ్యాఖ్యానించారు. ట్రిపుల్ తలాక్‌కు మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించడానికి బదులుగా గృహ హింస నేరంగా పరిగణించి గృహ హింస చట్టం కింద విచారించేలా ఉంటే బాగుంటుందని మానవ హక్కుల కార్యకర్త జావెద్ ఆనంద్ అభిప్రాయపడ్డారు. ట్రిపుల్ తలాక్ ఇస్తే భర్త నుంచి భరణం కోరే హక్కును కూడా కల్పించారుగానీ, జైల్లో ఉండే భర్త ఎలా భార్యకు భరణం చెల్లించగలరని ఆయన ప్రశ్నించారు. మెజారిటీ ముస్లింలలో మగవాళ్లు పనిచేస్తేగానీ కుటుంబం గడవదన్న విషయం తెల్సిందే. -
‘తలాక్’ను నిషేధిస్తూ ఆర్డినెన్స్
న్యూఢిల్లీ: ముస్లింలు తక్షణం విడాకులు ఇచ్చేందుకు వీలు కల్పించే ట్రిపుల్ తలాక్ పద్ధతిని నేరంగా పరిగణించే ఆర్డినెన్స్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ట్రిపుల్ తలాక్ చెప్పడం నిషిద్ధం, చట్ట విరుద్ధం, శిక్షార్హం అవుతుంది. ఈ నేరానికి పాల్పడే భర్తకు మూడేళ్ల వరకు జైలు శిక్షను ప్రతిపాదిస్తూ నిబంధనలు చేర్చారు. ఈ ఆర్డినెన్స్‌కు బుధవారం కేంద్ర మంత్రిమండలి పచ్చజెండా ఊపిన తరువాత న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ట్రిపుల్ తలాక్‌ను సుప్రీంకోర్టు కొట్టేసిన తరువాత కూడా ఆ కేసులు నమోదవుతున్నాయని, తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చామని తెలిపారు. ప్రతిపాదిత చట్టం దుర్వినియోగం కాకుండా..విచారణకు ముందే నిందితులకు బెయిల్ మంజూరుచేసే వెసులుబాటు కల్పించినట్లు వెల్లడించారు. నిందితులకు కొన్ని రక్షణలు చేకూరుస్తూ బిల్లులో చేసిన సవరణలకు కేబినెట్ ఆగస్టు 29నే ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం కేంద్రం ప్రవేశపెట్టిన ట్రిపుల్ తలాక్ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొంది నా, రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మద్దతు తెలపకపోవడం వల్లే బిల్లు అపరిష్కృతంగా ఉందని రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. వచ్చే సమావేశాల్లోనైనా బిల్లుకు మద్దతివ్వాలని యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ, తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీ, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతికి విజ్ఞప్తి చేశారు. కాగా, తలాక్‌పై రూపొందించిన ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సాయంత్రం సంతకం చేశారు. సోనియా మౌనం సరికాదు.. ‘గతేడాది సుప్రీంకోర్టు తక్షణ ట్రిపుల్ తలాక్‌ను నిషేధిస్తూ తీర్పు చెప్పినా కూడా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. అత్యవసర, తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆర్డినెన్స్ తీసుకొస్తున్నాం. ఈ విషయంలో సోనియా గాంధీ మౌనం వహించడం సరికాదు. ఇది రాజకీయాలతో ముడిపడి ఉన్న వ్యవహారం కాదు. లింగ సమానత్వం, మహిళల గౌరవానికి సంబంధించినది’ అని ప్రసాద్ అన్నారు. ఓటుబ్యాంక్ రాజకీయాల ఒత్తిడితోనే కాంగ్రెస్ రాజ్యసభలో బిల్లుకు మద్దతివ్వడంలేదని ఆరోపించారు. కాంగ్రెస్ సహకారం కోరేందుకు ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఆనంద్ శర్మను 5–6 సార్లు కలిశానని, అయినా ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. 2017 జనవరి నుంచి 2018 సెప్టెంబర్ మధ్య కాలంలో 430 ట్రిపుల్ తలాక్ కేసులు మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి వచ్చినట్లు తెలిపారు. అందులో 229 కేసులు సుప్రీంకోర్టు తీర్పు వెలువడక ముందు, 201 కేసులు ఆ తరువాత వెలుగులోకి వచ్చినట్లు చెప్పారు. సాధికారత దిశగా ముందడుగు: బీజేపీ మహిళా సాధికారత దిశగా ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్ గొప్ప ముందడుగు అని అధికార బీజేపీ అభివర్ణించింది. కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబల్ సుప్రీం కోర్టులో ఈ సంప్రదాయానికి మద్దతుగా వాదించారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఆరోపించారు. ఎన్డీయే ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ వ్యవహారాన్ని ముస్లిం మహిళలకు న్యాయం చేసే అంశంగా కాకుండా రాజకీయ కోణంలో చూస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. బాధిత మహిళకు పరిహారం చెల్లించని భర్త ఆస్తులను జప్తుచేయాలన్న తమ డిమాండ్‌కు బీజేపీ అంగీకరించలేదని ఆ పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా పేర్కొన్నారు. భార్యలను వదిలిపెడుతున్న హిందూ భర్తలను కూడా శిక్షించేలా చట్టాలు ఎందుకు చేయడంలేదని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. ఆర్డినెన్స్ ముస్లిం మహిళలకు వ్యతిరేకమని, అది వారికి మరింత అన్యాయం చేస్తుందన్నారు. ముస్లిం మహిళలకు ఎదురయ్యే అసలు సమస్యలను ఆర్డినెన్స్ విస్మరించిందని కొందరు మహిళా కార్యకర్తలు ఆరోపించగా, ఈ విషయంలో సమగ్ర చట్టం అవసరమని మరికొందరు అభిప్రాయపడ్డారు. పొరుగు దేశాల్లోనూ నిషిద్ధం తక్షణ ట్రిపుల్ తలాక్‌ను భారత్ సహా 22 దేశాలు నిషేధించాయి. ఈ జాబితాలో మన పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గానిస్తాన్ కూడా ఉన్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో భార్యకు విడాకులు ఇవ్వాలనుకుంటున్న వ్యక్తి.. మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న కోర్టుకు, భార్యకు నోటీసులు పంపాలి. 1961లో చేసిన చట్టం ద్వారా పాకిస్తాన్లో తక్షణ ట్రిపుల్ తలాక్‌ను నిషేధించారు. ముస్లిం ప్రాబల్య దేశాలైన ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, టర్కీ, ఈజిప్టు, సైప్రస్, ట్యూనీషియా, అల్జీరియా, మలేసియా, జోర్డాన్‌లలోనూ నిషేధించారు. ఆర్డినెన్స్‌లో ఏముందంటే.. ► తక్షణ ట్రిపుల్ తలాక్‌కే ఇది వర్తిస్తుంది. ► తనకు, తన మైనర్ పిల్లలకు జీవన భృతి కోరు తూ బాధిత మహిళ మెజిస్ట్రేట్‌ను ఆశ్రయించొచ్చు. ► పిల్లల సంరక్షణ తనకే అప్పగించాలని భార్య కోర చ్చు. మెజిస్ట్రేట్‌దే తుది నిర్ణయం. ► బాధితురాలు, ఆమె రక్త సంబంధీకులు ఫిర్యాదు చేస్తేనే పోలీసులు కేసు నమోదుచేయాలి. ► ట్రిపుల్ తలాక్‌ను నాన్‌బెయిలబుల్ నేరంగా పేర్కొంటున్నా, నిందితుడు విచారణకు ముందే బెయిల్ కోరుతూ మెజిస్ట్రేట్‌ను ఆశ్రయించొచ్చు. ► భార్య వాదనలు విన్న తరువాత మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేయొచ్చు. ► బిల్లు నిబంధనల ప్రకారం భార్యకు పరిహారం చెల్లించేందుకు అంగీకరించిన తరువాతే భర్తకు మెజిస్ట్రేట్ బెయిల్ ఇస్తారు. ► చెల్లించాల్సిన పరిహారం ఎంతో మెజిస్ట్రేట్ నిర్ణయిస్తారు. ► మెజిస్ట్రేట్ తన అధికారాలు ఉపయోగించి భార్యాభర్తల మధ్య వివాదాన్ని పరిష్కరించొచ్చు. ► ట్రిపుల్ తలాక్ కాంపౌండబుల్ నేరం..అంటే, కేసును ఉపసంహరించుకునే స్వేచ్ఛ ఇరు వర్గాలకు ఉంటుంది. మార్పులు ఇలా.. ముమ్మారు తలాక్ లేదా.. అప్పటికప్పుడు ఈ–మెయిల్, వాట్సాప్ సందేశాలు, ఫోన్, లేఖల ద్వారా ఇచ్చే విడాకులు (ఇన్స్టంట్ తలాక్) రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు గతేడాది ఆగస్టులో తీర్పునిచ్చాక ఈ అంశం వేగం పుంజుకుంది. దీనిపై చోటుచేసుకున్న మార్పులను ఓసారి పరిశీలిస్తే.. ► 2015 అక్టోబర్ 16: విడాకుల కేసుల్లో ముస్లిం మహిళలు లింగవివక్షకు గురవుతున్నారా? అని పరిశీలించేందుకు బెంచ్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా సీజేఐని కోరిన సుప్రీంకోర్టు. ► 2016 జూన్ 29: రాజ్యాంగ పరిధిలోనే పరిశీలించాల్సి ఉందన్న అత్యున్నత న్యాయస్థానం ► డిసెంబర్ 9: ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమన్న అలహాబాద్ హైకోర్టు. ► 2017 ఫిబ్రవరి 16: ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా, బహుభార్యత్వాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణకు ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు. ► ఏప్రిల్ 16: ముస్లిం మహిళలకు ఈ సమస్య నుంచి విముక్తి కలగాలని మోదీ ప్రకటన. ► మే 15: ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటిస్తే.. ముస్లిం వివాహాల క్రమబద్ధీకరణకు చట్టాన్ని తెచ్చేందుకు సిద్ధమని కోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం. ► ఆగస్టు 15: ఎర్రకోట ప్రసంగంలో ముస్లిం మహిళలకు మోదీ అభినందన ► ఆగస్టు 22: ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటన ► డిసెంబర్ 28: లోక్‌సభలో ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఆమోదం ► 2018 సెప్టెంబర్ 19: ట్రిపుల్ తలాక్ శిక్షార్హమైన నేరంగా పేర్కొంటూ ఆర్డినెన్సు జారీ. -
అది రాజ్యాంగ విరుద్ధం : ఓవైసీ
సాక్షి, హైదరాబాద్ : ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రత్యేక ఆర్డినెన్స్‌పై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా మండిపడ్డారు. తలాక్‌పై కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్దమని, కేవలం ముస్లిం మహిళలకు వర్తించే విధంగా ఆర్డినెన్స్ తీసుకురాడం ప్రాథమిక హక్కులకు విరుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘ఇస్లాంలో వివాహం అనేది పూర్తిగా సివిల్ కాంట్రాక్టు. దానిలో శిక్షా నిబంధనలు పెట్టడం ఇస్లాంకు వ్యతిరేకం. దీని ద్వారా ముస్లిం మహిళలకు న్యాయం జరగదు. దీనిపై ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం’’ అని ఓవైసీ పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రతీష్టాత్మకంగా తీసుకున్న ట్రిపుల్ తలాక్ బిల్లు లోకసభలో ఆమోదం పొంది.. రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణిస్తూ ప్రత్యేక ఆర్డినెన్స్‌కు కేంద్ర కెబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసేందే. సుప్రీంకోర్టు ఉత్తర్వులు తరువాత కోర్టులో 430కిపైగా తలాక్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని.. వాటిని పరిష్కరించేందుకే అత్యవస అర్డినెన్స్ను తీసుకువచ్చామని ప్రభుత్వం వివరించింది. -
ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్‌కు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘ట్రిపుల్ తలాక్’పై నరేంద్ర మోదీ సర్కార్ మరో అడుగు ముందుకేసింది. రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందకపోవడంతో ప్రత్యేకంగా ఆర్డినెన్స్ తీసుకరావాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రి వర్గం ‘ట్రిపుల్ తలాక్’పై ఆర్డినెన్స్‌తో పాటు పలు కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంత్రి వర్గ నిర్ణయాలను న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియాకు తెలిపారు. పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకనే ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్ తీసుకువచ్చామని వివరించారు. తలాక్ చెప్పిన వారికి మూడేళ్ల జైలు, భార్యకు భరణం ఇచ్చేలా ఆర్డినెన్స్ రూపొందించామన్నారు. ఆర్డినెన్స్ కింద అరెస్టయిన వ్యక్తికి మెజిస్ట్రేట్ వద్ద బెయిల్ పొందే అవకాశం ఉందని పేర్కొన్నారు. భార్య, రక్తసంబంధీకులు, స్నేహితులు మాత్రమే ఫిర్యాదు చేసే అవకాశం ఉందని, భార్య వాదనలు విన్న తర్వాతే బెయిల్‌పై మెజిస్ట్రేట్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. 430 ట్రిపుల్ తలాక్ కేసులు సుప్రీం కోర్టు ఉత్తర్వుల తర్వాత 430 ట్రిపుల్ తలాక్ కేసులు నమోదయ్యాయని, రాజ్యాంగపరంగా అత్యవసరం కాబట్టే ఆర్డినెన్స్ తెచ్చామని వివరించారు. బిల్లు కోసం కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరేందుకు ప్రయత్నించామని పేర్కొన్నారు. ముస్లిం మహిళలకు అన్యాయం జరుగుతున్నా ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం కాంగ్రెస్ ట్రిపుల్ తలాక్ బిల్లుకు మద్దతివ్వడంలేదని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా ఈ కేసులు నమోదయ్యాయన్నారు. మహిళలకు న్యాయం చేసేందుకే, వారి గౌరవం కోసమే ఈ బిల్లు తెచ్చామని అన్నారు. సోనియా, మాయావతి, మమతా బెనర్జీలు ఓటు బ్యాంక్ రాజకీయాలు వీడి ఈ బిల్లుకు మద్దతివ్వాలని రవిశంకర్ ప్రసాద్ కోరారు. అంగన్ వాడీ, ఆశా వర్కర్ల జీతాల పెంపు అంగన్ వాడీ వర్కర్లు, సహాయక సిబ్బంది, ఆశా వర్కర్ల గౌరవ వేతనం రూ.3000 నుంచి రూ.4500కు పెంచేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. రాఫెల్ ఒప్పందంపై జెపిసి, సీఏజీ విచరణ అవసరం లేదని స్సష్టం చేశారు. రాఫెల్ విమానాల కొనుగోలుపై ఏ నిర్ణయం తీసుకోకుండా పదేళ్లు నానబెట్టారని గత కాంగ్రెస్ పాలకులపై మండిపడ్డారు. -
అట్రాసిటీ చట్ట పరిరక్షణకు ఆర్డినెన్స్: అథవాలే
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పరిరక్షించేందుకు త్వరలోనే ఆర్డినెన్స్ తీసుకొస్తామని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి రాందాస్ అథవాలే స్పష్టం చేశారు. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పురోగతిపై శనివారం ఆయన ఇక్కడ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించే అంశంపై త్వరలో ప్రధాని మోదీతో మాట్లాడతానన్నారు. ఓబీసీ వర్గీకరణపై అధ్యయనం జరుగుతోందని, ఎన్నికల్లోపు ఈ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలన్నీ ఏకమైనా వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ ఘనవిజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తొందరపడి ఎన్డీఏ నుంచి తప్పుకున్నారని వ్యాఖ్యానించారు. ఆయన ఎన్డీయేలోనే కొనసాగి ఉంటే ప్రత్యేక హోదా అంశంపై మోదీ సానుకూలంగా స్పందించే వారని పేర్కొన్నారు. పార్టీని రక్షించుకోలేని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాజ్యాంగాన్ని రక్షిస్తానని చెప్పటం హాస్యాస్పదమని రాందాస్ ఎద్దేవా చేశారు. -
కొత్త ఆర్డినెన్స్ : విజయ్ మాల్యాకు సమన్లు
సాక్షి, ముంబై: ప్రభుత్వ బ్యాంకులకు భారీ రుణ ఎగవేత దారుడు, పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది. ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు తాజాగా మాల్యాకు సమన్లు జారీ చేసింది. భారీగా రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేసిన ఆర్థిక నేరస్తులపై కొరడా ఝుళిపించేందుకు కొత్తగా ప్రకటించిన ఆర్డినెన్స్ కింద ఆగష్టు 27న, లేదా అంతకుముందు కోర్టు ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. లేదంటే ‘పరారీలో ఉన్న నేరస్థుడి’గా ప్రకటించడంతోపాటు మాల్యాకు చెందిన రూ. 12,500కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేస్తుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. పెండింగ్‌లో ఉన్నబ్యాంకు బకాయిలు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాననీ, ఇందుకు బ్యాంక్ ఆఫ్ కన్సార్షియంతో చర్చలు జరపడానికి ప్రయత్నిస్తున్నట్లు మాల్యా సంసిద్ధత వ్యక్తం చేసిన సందర్భంలో సమన్లు జారీ చేయడం విశేషం. ఈ ఏడాది ప్రారంభంలో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్యుజిటివ్ ఎకనామిక్ నేరస్థుల ఆర్డినెన్స్ ప్రకారం రుణదాతల "అన్ని లింక్డ్ ఆస్తులను" స్వాధీనం చేసుకోవడానికి అనుమతి లభిస్తుంది. దేశంలో ఈ ఆర్డినెన్స్ తరువాత ఈడీ తీసుకున్న మొదటి కేసు.. మొదటి చర్య మాల్యాపైనే. ఈ క్రమంలో బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద కుంభకోణంగా నిలిచిన పీఎన్బీ స్కాంలో ప్రధాన నిందితులు, వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీ, గీతాంజలి జెమ్స్ అధిపతి మెహుల్ చోక్సీ పై చర్యలకు ఈడీ సిద్ధం కానుంది. మరోవైపు మాల్యా బేరానికి దిగొచ్చారన్న వార్తలపై మాల్యా నేడు(శనివారం) స్పందించారు. తనది బేరమైతే..ఈడీ అధికారులు కూడా అదే సిద్ధాంతాన్ని అనుసరించాలంటూ సెటైర్ వేశారు. ఈ సందర్భంగా ట్విటర్లో ఈడీ ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. తాను బేరసారాలకు ప్రయత్నిస్తున్నానని చెప్పిన ఈడీ అధికారులు ముందు ఈడీ ఛార్జ్‌షీట్ చదవాలని సలహా యిచ్చారు. అదే నిజమైతే ఈడీ అధికారులుకూడా ఇదే సిద్ధాంతాన్ని అనుసరించి.. ఎక్కడైతే తనఆస్తులు ఉన్నాయో ఆ కోర్టుల్లో ఇలాంటి బేరసారాల ఒప్పందానికి రావాలని ఆహ్వానిస్తున్నానంటూ మాల్యా ట్వీట్ చేశారు. -
‘పారిపోయిన నేరస్తుడి’గా మాల్యా
ముంబై/న్యూఢిల్లీ: ఆర్థిక నేరగాళ్లను కఠినంగా శిక్షించేందుకు ఉద్దేశించిన కొత్త ఆర్డినెన్స్ కింద వ్యాపారవేత్త విజయ్ మాల్యాను ’పారిపోయిన నేరగాడి’గా ప్రకటించాలని ముంబైలోని స్పెషల్ కోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పిటిషన్ వేసింది. తద్వారా రూ.12,500 కోట్ల విలువ చేసే ఆయన ఆస్తులను జప్తు చేసేందుకు అనుమతించాలని కోరింది. ఇలాంటి నేరాలకు సంబంధించి ప్రస్తుతం అమల్లో ఉన్న మనీల్యాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ట్రయల్ పూర్తయి, ఆస్తుల జప్తుకు అనేక సంవత్సరాలు పట్టేస్తోంది. ఈ నేపథ్యంలోనే కొత్తగా అమల్లోకి వచ్చిన పలాయన ఆర్థిక నేరగాళ్ల పట్టివేత ఆర్డినెన్స్ కింద ఈడీ తాజా పిటిషన్ వేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ పేరిట ఐడీబీఐ బ్యాంకు, ఎస్బీఐ సారథ్యంలోని కన్సార్షియం నుంచి తీసుకున్న రూ. 9,000 కోట్లకు పైగా రుణాలు మాల్యా ఎగవేసిన కేసుకు సంబంధించి ఈడీ ఈ పిటిషన్ వేసింది. ‘బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాలనే ఉద్దేశం మాల్యాకు ముందు నుంచే లేదు. మాల్యాకు, ఆయనకు చెందిన యూబీహెచ్ఎల్ (యునైటెడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్) వద్ద రుణాలను తిరిగి చెల్లించేందుకు తగిన వనరులు ఉన్నప్పటికీ, బ్యాంకుల నుంచి ఉద్దేశపూర్వకంగానే ఆ వివరాలను దాచిపెట్టి ఉంచారు‘ అని ఈడీ ఆరోపించింది. ఇప్పటికే మనీల్యాండరింగ్ నిరోధక చట్టం కింద మాల్యాతో పాటు ఇతర నిందితులపైనా దాఖలు చేసిన రెండు చార్జిషీట్లను దీనికి జతపర్చింది. ఆయనపై నాన్–బెయిలబుల్ వారంట్లు జారీ అయిన సంగతి కూడా తెలియజేసింది. త్వరలో నీరవ్ మోదీపై కూడా.. పలాయన నేరగాళ్లను శిక్షించేందుకు ఉద్దేశించిన కొత్త ఆర్డినెన్స్ కింద ఈడీ వేసిన మొదటి పిటిషన్ ఇదే. పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) స్కామ్ నిందితులు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలపై కూడా దీన్ని ప్రయోగించనున్నట్లు అధికారులు తెలిపారు. క్రిమినల్ చర్యలు ఎదుర్కొనాల్సి వస్తుందనే భయంతో పలువురు ఆర్థిక నేరస్తులు దేశం విడిచి పారిపోతున్న ఉదంతాల నేపథ్యంలో కేంద్రం ఈ ఆర్డినెన్స్‌ను అమల్లోకి తెచ్చింది. -
ఆర్డినెన్స్‌తో చిత్తశుద్ధి చాటుకున్నాం
మాండ్లా (మధ్యప్రదేశ్): అత్యాచారాలపై ఆర్డినెన్స్ తీసుకురావడం ద్వారా ఆ అంశం పట్ల తమ ప్రభుత్వానికున్న చిత్తశుద్ధిని చాటి చెప్పామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ ప్రజలు తమ కుమార్తెలను గౌరవించాలని, భద్రతతో కూడిన వాతావరణం కోసం వారి కుమారుల్ని మరింత బాధ్యతాయుతంగా తీర్చిదిద్దాలని సూచించారు. మహిళలు, బాలికల భద్రతకు హామీనిచ్చేలా సామాజిక ఉద్యమానికి పిలుపునిచ్చారు. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని రామ్‌నగర్‌లో మంగళవారం నిర్వహించిన బహిరంగ సభలో గిరిజనులు, గ్రామ పంచాయతీ ప్రతినిధుల్ని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ‘ఢిల్లీలోని మా ప్రభుత్వం మీ అభిప్రాయాల్ని వినడమే కాకుండా తదనుగుణంగా నిర్ణయాలు కూడా తీసుకుంటుంది. అందుకే అత్యాచారాలకు మరణశిక్ష విధించేలా నిబంధనల్ని తెచ్చాం’ అని చెప్పారు. అంతకుముందు మోదీ పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్టం చేయడం కోసం రూపొందించిన ‘రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్’ పథకాన్ని ప్రారంభించారు. కేంద్రం అమలుచేసే ఈ పథకంలో భాగంగా స్థానిక సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడంతో పాటు.. వాటి స్వయం సమృద్ధి, ఆర్థిక స్థిరత్వానికి కృషిచేస్తారు. జల సంరక్షణకు ఉపాధి నిధులు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల్ని వేసవికాలం మూడు నెలలు జల సంరక్షణ పనులకు వినియోగించాలని,దీంతో గ్రామాల్లో నీటి కొరతను అధిగమించడంతో పాటు, రైతులకు సహాయకారిగా ఉంటుందని మోదీ అన్నారు. ‘ప్రతీ వర్షపు చుక్కను సంరక్షించడం ద్వారా ధనాన్ని పొదుపు చేయడమే కాకుండా.. నీటికొరత నుంచి గ్రామాల్ని కాపాడవచ్చు. 2022లో మనం 75వ స్వాతంత్య్ర వేడుకల్ని జరుపుకోనే నాటికి గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యాన్ని నిజం చేయాలి’ అని పిలుపునిచ్చారు. గ్రామాల అభివృద్ధి కోసం గ్రామీణ ప్రాంత ప్రజలు జన్ ధన్, వన్ ధన్, గో ధన్ (మానవ వనరుల, అటవీ సంపద, గో సంపద)పై దృష్టిపెట్టాలని సూచించారు. పల్లెలు కేంద్రంగా అభివృద్ధి జరగాలన్న మహాత్మా గాంధీ కల సాకారం కోసం గ్రామీణ ప్రాంతా ల్లోని మానవ శక్తిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. దేశంలో వనరుల కొరత లేదని, ప్రాధమ్యాలు, అభివృద్ధి పథకాలు పారదర్శకంగా అమలు చేయడంలోనే సమస్యలున్నాయని.. వాటిని అధిగమించేందుకు ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలన్నారు. సమర యోధుల కోసం... గాంధీ – నెహ్రూ కుటుంబంపై పరోక్ష వ్యాఖ్యలు చేస్తూ.. దేశ స్వాతంత్య్ర పోరాట చరిత్ర కేవలం కొద్ది మంది, కొన్ని కుటుంబాల చుట్టే తిరగడం దురదృష్టకరమని మోదీ అన్నారు. గిరిజనులు, ఇతర వర్గాల్లో గుర్తింపు పొందని స్వాతంత్య్ర పోరాట యోధుల కోసం మ్యూజియంలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ‘1857 నుంచి జరిగిన స్వాతంత్య్ర సమరంలో ప్రధాన పాత్ర పోషించిన వారికి తగిన గుర్తింపు దక్కేలా ప్రతి రాష్ట్రంలో మ్యూజియం ఏర్పాటు చేస్తాం. భావితరాలకు వారి త్యాగాలను తెలియచెప్పేందుకు ఈ మ్యూజియంలు ఉపయోగపడతాయి’ అని మోదీ చెప్పారు. -
ఉరి వల్ల రేప్‌లు ఆగుతాయా?
న్యూఢిల్లీ: బాలికలపై అత్యాచారానికి పాల్పడే కీచకులకు మరణదండన విధించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్(పోక్సో చట్టంలో సవరణ)పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవున్నాయి. పలు రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు కేంద్ర నిర్ణయాన్ని బాహాటంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘ఉరిశిక్షలు వేస్తే అత్యాచారాలు ఆగుతాయా? ఆర్డినెన్స్ జారీ చేయడానికి ముందు కేంద్రం శాస్త్రీయ అధ్యయనం చేసిందా? అత్యాచారానికి, హత్యకు శిక్ష ఒకటే అయినప్పుడు.. రేప్ చేసిన నిందితుడు బాధితురాలిని బతకనిస్తాడా?’’ అని జస్టిస్ గీతా మిట్టల్, జస్టిస్ హరిశంకర్‌లతో కూడిన ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘అత్యాచార ఉదంతాలకు సంబంధించి గతంలో చేసిన ఐపీసీ చట్టసవరణ దుర్వినియోగం అవుతోందం’టూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. నిర్భయ చట్టం తర్వాత ఏంజరిగింది?: కథువాలో ఎనిమిదేళ్ల చిన్నారిపై అకృత్యం, ఉన్నావ్‌లో మైనర్ బాలికపై అత్యాచారం, బాధితురాలి తండ్రి హత్య ఘటనలపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికిన దరిమిలా కేంద్రం పోక్సో చట్టానికి సవరణలు చేసింది. 12 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారం జరిపితే ఖచ్చితంగా మరణశిక్ష విధించాలన్నది ఆ సవరణ ఉద్దేశం. కాగా, గతంలో నిర్భయ ఉదంతం తర్వాత కూడా ఇదే మాదిరిగా కఠిన చట్టాలను రూపొందించడం, వాటి వల్ల నేరాలు అదుపులోకి రానివిషయాన్ని సామాజిక, న్యాయ నిపుణులు గుర్తుచేస్తున్నారు. నిర్భయ చట్టం తర్వాత లైంగిక నేరాలు అదుపులోకొస్తాయని జాతి యావత్తూ విశ్వసించినా, వాస్తవంలో అందుకు విరుద్ధంగా జరిగింది. 2016 నాటి జాతీయ క్రైం రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక ప్రకారం మహిళలపై అత్యాచారాలు, ఇతర లైంగిక నేరాలు అంతక్రితం కంటే 2.9 శాతం పెరిగాయి. బాలికలపై లైంగిక నేరాలు సైతం గణనీయంగా పెరిగినట్టు ఆ నివేదిక తెల్పింది. 2015తో పోలిస్తే 2016లో ఈ తరహా నేరాలు 82 శాతం ఎక్కువయ్యాయని వివరించింది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడుల్లో ఈ కేసులు అత్యధికంగా జరిగాయని పేర్కొంది. మెట్రో నగరాల్లో ఈ బెడద ఎక్కువని తెలిపింది. మరోపక్క పోక్సో కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలున్నా అవి నత్తనడకన సాగుతున్నాయని తేల్చింది. పోర్న్ సైట్లను నిషేధించండి: బీజేపీ మంత్రి దేశంలో లైంగికనేరాల పెరుగుదలకు పోర్న్ వెబ్సైట్లే ప్రధాన కారణమని మధ్యప్రదేశ్ హోం మంత్రి భూపేంద్ర సింగ్ అన్నారు. యువతపై అశ్లీల సైట్ల ప్రభావం అధికంగా ఉందని, కాబట్టి వెంటనే వాటిపై పూర్తిస్థాయిలో నిషేధం విధించాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖరాశారు. (చదవండి: కఠిన చట్టాలే పరిష్కారమా?) -
ఆర్డినెన్స్‌లకు రాష్ట్రపతి ఆమోదం
న్యూఢిల్లీ: అత్యాచార దోషులకు కఠిన శిక్షలతోపాటు, రుణ ఎగవేత దారుల ఆస్తుల జప్తు, శిక్షల విధింపునకు సంబంధించి కేంద్రం ప్రతిపాదించిన ఆర్డినెన్స్‌లపై రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ ఆదివారం ఆమోద ముద్ర వేశారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరగడం లేనందున, ఈ ఆర్డినెన్స్‌లను అత్యవసరమైనవిగా భావించి.. రాజ్యాంగంలోని 123 ఆర్టికల్ ప్రకారం వీటికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారని గెజిట్ నోటిఫికేషన్ తెలిపింది. ఇవి తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఈ ఆర్డినెన్స్‌లను కేంద్ర కేబినెట్ శనివారం ఆమోదించిన రాష్ట్రపతికి పంపిన విషయం తెలిసిందే. ఆర్డినెన్స్ ప్రకారం.. 12 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడే రేపిస్టులకు గరిష్టంగా మరణశిక్ష విధిస్తారు. అలాగే పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల ఆస్తుల జప్తునకు మరో ఆర్డినెన్స్ వీలు కల్పిస్తుంది. -
కథువాలో మరో కీలక పరిణామం
కథువా : దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన కథువా ఉదంతంపై మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎనిమిదేళ్ల చిన్నారి అపహరణ, అత్యాచారం, హత్య కేసుపై విచారణ ప్రారంభమైన కొన్ని రోజుల్లోనే కథువా ఎస్పీని మార్చేశారు. కథువా సూపరిటెండెంట్ ఆఫ్ పోలీసు(ఎస్పీ)గా ఉన్న సులేమాన్ చౌదరి స్థానంలో శ్రీధర్ పాటిల్ నియమించారు. దీంతో కొత్త కథువా ఎస్పీగా శ్రీధర్ పాటిల్ బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. కథువాలో జరిగిన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్న సంగతి తెలిసిందే. చిన్నారులపై అత్యాచారం ఒడిగట్టిన వారికి మరణ శిక్ష విధించేందుకు ఆమోదిస్తూ కేంద్రం ఆర్డినెన్స్‌ను సైతం తీసుకొచ్చింది. ఈ ఘటనలో స్థానిక పోలీసులదే కీలక పాత్ర కావడంతో, ఈ కేసును స్థానిక పోలీసులు విచారణ చేపట్టడాన్ని ఆందోళనకారులు వ్యతిరేకించారు. దీంతో ఈ కేసును జమ్ముకశ్మీర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల మొదట్లో జమ్మూకశ్మీర్ క్రైమ్ బ్రాంచు పోలీసులు ఈ కేసుపై ఛార్జ్‌షీటు కూడా దాఖలు చేశారు. ఈ ఛార్జ్షీటులో మొత్తం ఎనిమిది మందిని నిందితులుగా గుర్తించారు. బక్వారా ముస్లింలను గ్రామం నుంచి వెళ్లగొట్టడమే లక్ష్యంగా కుట్రలు చేసి, పాపపై అకృత్యం జరగడానికి అసలు సూత్రధారి, రిటైర్డ్ ఉద్యోగి సాంజీ రామ్‌ను ఏ1గా పేర్కొన్నారు. సాంజీరామ్ మేనల్లుడు( మైనర్), మైనర్ నేరస్తుడి స్నేహితుడు పర్వేశ్ కుమార్, సాంజీరామ్ కొడుకు విశాల్, మీరట్ స్పెషల్ పోలీసులు దీపక్ ఖజూరియా, సురేంద్ర వర్మలు కూడా బాలికపై అత్యాచారం జరిపారన్న ఆధారాలు లభించడంతో వీరిని ప్రధాన నిందితుల జాబితాలో చేర్చారు. అయితే ప్రస్తుతం కథువా కేసు విచారణ ప్రారంభమైన కొన్ని రోజుల్లోనే కొత్త ఎస్పీని నియమించడంపై చర్చనీయాంశంగా మారింది. -
లక్షలాది ఎకరాల అసైన్డ్ భూముల రీ అసైన్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో పరాధీనంలో ఉన్న అసైన్డ్ భూములను రీ అసైన్ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మార్చిలో మొదలయ్యే బడ్జెట్ సమావేశాల్లోగా ఈ మేరకు ఆర్డినెన్స్ తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. దీంతోపాటు అన్ని విద్యా సంస్థల్లో ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలుగును తప్పనిసరి చేసేందుకు మరో ఆర్డినెన్స్ తీసుకు రానుంది. ప్రస్తుతం ఈ రెండు ప్రతిపాదనలు న్యాయ శాఖ పరిశీలనలో ఉన్నాయి. అసైన్డ్ భూములు అసలు లబ్ధిదారులకు బదులుగా ఇతరుల చేతిలో ఉంటే వాటిని స్వాధీనం చేసుకోవాలని, ఒకవేళ నిరుపేద వర్గాల చేతుల్లో ఉంటే క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో మొత్తం 22.63 లక్షల ఎకరాల అసైన్డ్ భూములున్నాయి. ప్రతి గ్రామంలో దాదాపు 60 శాతానికి పైగా అసైన్డ్ భూములు ఆక్రమణలకు గురైనట్లు ఇటీవల చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అంచనాకు వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 84,706 మంది ఆక్రమణదారుల జాబితాలను సిద్ధం చేసింది. ఇప్పటివరకు ఉన్న నిబంధన ప్రకారం 2007 జనవరి 29 నాటికి ఆక్రమణలో ఉన్నవారికే ప్రయోజనం చేకూరుతుంది. తాజాగా ఈ కటాఫ్ తేదీని పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2014 జూన్ 2 నాటికి అసైన్డ్ భూములు ఎవరి పేరిట ఉన్నాయో గుర్తించి.. వారి పేరిట రీ అసైన్ చేస్తారు. అందుకు అనుగుణంగా తెలంగాణ అసైన్డ్ ల్యాండ్స్(ప్రొహిబిష¯Œన్ ఆఫ్ ట్రాన్స్ఫర్) యాక్ట్– 977లో పలు నిబంధనల్ని సవరించటం తప్పనిసరి. అందుకే అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణకు ఆర్డినెన్స్ జారీ చేయాల్సి ఉంటుందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. మార్చి 12కల్లా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇప్పటికే అధికారులను ఆదేశించారు. దీంతో ఆర్డినెన్స్‌కు అధికార యంత్రాంగం రూపకల్పన చేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ చేపట్టి పేద వర్గాలకు రీ అసైన్డ్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగుపై వచ్చే వారమే ఆర్డినెన్స్! అన్ని పాఠశాలలు, విద్యా సంస్థల్లో తెలుగు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురానుంది. రాష్ట్రంలో ఉన్న సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఇంటర్నేషనల్ స్కూళ్లన్నింటా తెలుగును తప్పనిసరి చేసేలా ఈ ఆర్డినెన్స్ ఉంటుంది. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే దీనికి చట్టరూపం కల్పించాలని సీఎం భావిస్తున్నారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా సీఎం హామీ ఇచ్చిన మేరకు ఆర్డినెన్స్‌ను అధికారులు తయారు చేశారు. ప్రస్తుతం ఆర్డినెన్స్ ముసాయిదా న్యాయ శాఖ పరిశీలనలో ఉంది. గవర్నర్ ఆమోదంతో వచ్చే వారంలో ఆర్డినెన్స్‌ను జారీ చేసే అవకాశమున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. -
పోలీసు చట్టం అర్డినెన్స్ను తప్పుబట్టిన IYR
-
ఆస్తుల కొనుగోలుకు వారికి అర్హత లేదు
న్యూఢిల్లీ: బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను ఉద్దేశపూర్వకంగా ఎగవేసిన వారు, బ్యాంకులకు బకాయి పడిన ఖాతాదారులు (ఎన్పీఏ) దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా... వేలానికి వచ్చే ఆస్తులకు బిడ్డింగ్ వేయకుండా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఇందుకు సంబంధించి ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) సవరణల ఆర్డినెన్స్‌కు గురువారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాజ ముద్రపడింది. ఈ ఆర్డినెన్స్‌ను బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదించి రాష్ట్రపతికి పంపిన విషయం తెలిసిం దే. ఐబీసీ చట్టంలో నిబంధనలను దుర్వినియోగం చేయకుండా మోసపూరిత వ్యక్తులను అడ్డుకోవడమే ఆర్డినెన్స్ ఉద్దేశమని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఐబీసీలో చేసిన మార్పులకు వచ్చే నెల 15 నుంచి జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆమోదం పొందాల్సి ఉంటుంది. అప్పటి వరకు ఈ ఆర్డినెన్స్ చెల్లుబాటు అవుతుంది. తొలి దశలో బ్యాంకులకు రూ.5,000 కోట్లకుపైగా బకాయిలు పడిన 12 భారీ ఎన్పీఏ కేసుల్లో దివాలా పరిష్కార చర్యలు ఇప్పటికే ఐబీసీ కింద మొదలయ్యాయి. వీటిలో పలు ఖాతాల కు సంబంధించిన ఆస్తులను కొనుగోలు చేసేందుకు ఆయా కంపెనీల ప్రమోటర్లు బిడ్డర్లుగా ఉండడం గమనార్హం. ఈ విధమైన అనైతిక చర్యలను నిరోధించేందుకు ఆర్డినెన్స్‌లో కేంద్రం మార్పులు చేసింది. ఆరు సెక్షన్లలో మార్పులు ఎన్పీఏ ఖాతాలుగా వర్గీకరించి ఏడాది, అంతకుమించినా, లేదా దివాలా పరిష్కారం కింద నమోదు చేసేలోపు వడ్డీ సహా బకాయిలను చెల్లించ లేకపోయిన వారిపై అనర్హత అమలవుతుంది. వీరు ఆస్తుల వేలంలో పాల్గొనేందుకు అవకాశం ఉండదని ఆర్డినెన్స్ స్పష్టం చేస్తోంది. దీంతో ఐబీసీ కింద దివాలా పరిష్కారానికి నివేదించిన ఖాతాల తాలూకూ కార్పొరేట్లు, ప్రమోటర్లు హోల్డింగ్ కంపెనీలు లేదా సంబంధిత పార్టీలు మొండి బకాయిల ఆస్తుల బిడ్డింగ్‌లో పాల్గొనలేరు. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ బోర్డు (ఐబీబీఐ)కు అదనపు అధికారాలు కల్పించారు. ఐబీసీ నిబంధనలు ఉల్లంఘించిన పార్టీలపై రూ.2 కోట్ల వరకు జరిమానా విధించొచ్చు. మొత్తం మీద ఐబీసీ కోడ్‌లో ఆరు సెక్షన్లలో సవరణలు చేయగా, కొత్తగా రెండు సెక్షన్లు జోడించారు. ఆస్తుల విలువపై ప్రభావం ఉండదు: ఎస్బీఐ దివాలా పరిష్కార చర్యలు ఎదుర్కొంటున్న ఎన్పీఏ ఆస్తుల విలువపై తాజా ఆర్డినెన్స్ ప్రభావం చూపించకపోవచ్చని ఎస్బీఐ చైర్మన్ రజనీష్‌కుమార్ అభిప్రాయపడ్డారు. ‘‘చట్టంలో మార్పులతో ఆ ఆస్తుల విలువ పడిపోదు. ఎందుకంటే వీటి కొనుగోలుకు ఎంతో ఆసక్తి ఉంది. ప్రస్తుత ప్రమోటర్లను బిడ్డింగ్‌కు అనుమతించకపోయినా, అనుమతించినా విలువలో మార్పుండదు. సరసమైన ధర ప్రకారమే వేలం ఉంటుంది’’ అని రజనీష్‌కుమార్ చెప్పారు. -
ఆ కార్లు ఇక కొనలేరు...
సాక్షి, న్యూఢిల్లీ : లగ్జరీ, ఎస్యూవీ కార్లు ఇక భారం కానున్నాయి. వీటిపై ఇప్పుడు విధిస్తున్న 15 శాతం సెస్‌ను జీఎస్టీ కింద 25 శాతానికి పెంచనున్నారు. సెస్‌ను పెంచేందుకు ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ అంగీకరిచడంతో పెంపు ఆర్డినెన్స్‌కు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోద ముద్ర వేయనుంది.ఈ దిశగా ఇటీవల పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ సవరణను చేపట్టకపోవడంతో ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా చట్టంలో మార్పులకు మొగ్గుచూపింది. జీఎస్టీ అమలుతో నష్టపోయే రాష్ట్రాలకు పరిహారం చెల్లించేలా లగ్జరీ వస్తువులపై సెస్ విధించేందుకు కేంద్రం జీఎస్టీ (ఆదాయ నష్టం జరిగే రాష్ట్రాలకు పరిహారం) ప్రత్యేక బిల్లును తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే సెస్ పెంపుపై ఆటోమొబైల్ కంపెనీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. సెస్ పెంచితే తాము వాహనాల ధరలను పెంచాల్సివస్తుందని ఇది కస్టమర్లపై భారం మోపినట్టవుతుందని వాపోతున్నాయి. సెస్ పెరిగితే లగ్జరీ వాహనాల ధరలు పెరిగి అమ్మకాలు తగ్గుతాయని కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. -
మిర్చి విత్తన చట్టం ముసాయిదాకు తుది రూపు!
► వ్యవసాయ మంత్రి పోచారంతో న్యాయ శాఖ కార్యదర్శి భేటీ ► త్వరలో కేబినెట్ ముందుకు ముసాయిదా.. ► గవర్నర్ ఆమోదం అనంతరం అసెంబ్లీకి బిల్లు సాక్షి, హైదరాబాద్: మిర్చీ విత్తన చట్టం–2017 ముసాయిదాకు వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తుది రూపు తీసుకొచ్చారు. వచ్చే కేబినెట్ సమావేశంలో ఈ ముసాయిదాను ప్రవేశపెడతామని, గవర్నర్ ఆమోదంతో ఆర్డి నెన్స్ తీసుకొస్తామని తెలిపారు. తదుపరి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. బుధవారం ఈ మేరకు మంత్రి పోచారంతో న్యాయశాఖ కార్యదర్శి సంతోశ్‌రెడ్డి, వ్యవసాయ కార్యదర్శి పార్థసారథి, విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కేశవులు సమావేశమయ్యారు. మిర్చీ నకిలీ విత్తనాల విక్రయదారులపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించే విధంగా చట్టంలో కఠిన అంశాలను పాందుపరిచామని తెలిపారు. అయితే ఖరీఫ్ కంటే ముందే ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రభుత్వం భావించినా అది ఆలస్యమైంది. అన్ని విత్తనాలకు అన్నారు కానీ... 2007లో ఉమ్మడి రాష్ట్రంలో పత్తి పంటకు నష్టం జరిగితే కంపెనీల నుంచి పరిహారం ఇప్పించే ఏపీ కాటన్ సీడ్స్ యాక్ట్–2007ను తీసుకొచ్చారు. అందులో పత్తికి తప్ప మిగతా పంటలకు సంబంధించి నకిలీ విత్తనాలతో నష్టం జరిగితే పరిహారం ఇప్పించే అంశం లేదు. దీంతో ఇతర పంటలకు సంబంధించిన విత్తనాల్లో కల్తీ జరిగితే పరిహారం ఇప్పించేందుకు కొత్త చట్టం అవసరమైంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇతర పంటలకు చట్టం అవస రమని భావించింది. పత్తి తర్వాత అత్యధికంగా రైతు లు నకిలీ విత్తనాలతో నష్టపోయేది మిర్చితోనేనని భావించిన ప్రభుత్వం ఆ ఒక్కదానికే పరిమితమైంది. దీంతో ఇతర నకిలీ విత్తనాలు విక్రయించే కంపెనీలపై ఎలాంటి చర్యలు తీసుకునే పరిస్థితి ఉండదు. కలెక్టర్ చైర్మన్‌గా కమిటీ తాజా విత్తన ముసాయిదాలో పేర్కొన్న ప్రకారం జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా కమిటీని ఏర్పాటు చేస్తారు. అందులో జిల్లా వ్యవసా యాధికారి సభ్య కన్వీనర్‌గా ఉంటారు. జిల్లా ఉద్యానాధికారి, సంబంధిత పంటకు సంబం ధించిన వ్యవసాయ, ఉద్యాన వర్సిటీల శాస్త్రవేత్తలు, రైతు ప్రతినిధులు, విత్తన ఉత్పత్తి దారులు సభ్యులుగా ఉంటారు. నకిలీ విత్తనా ల కారణంగా మిర్చి పంటకు నష్టం వాటిల్లితే జిల్లా కమిటీనే పరిహారం ఇప్పిస్తుంది. నకిలీ విత్తనాలతో పంట నష్టం జరిగిన రైతు వ్యవసాయ క్షేత్రాల్లో కమిటీ పర్యటించి నష్టం విలువను అంచనా వేస్తుంది. ఆ ప్రకారం కంపెనీలను పిలిపించి పరిహారం ఇప్పిస్తుంది. అవసరమైన శిక్షలను ఖరారు చేస్తుంది. జిల్లాస్థాయి కమిటీలో రైతు తనకు న్యాయం జరగలేదని భావిస్తే రాష్ట్రస్థాయి కమిటీకి ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఆర్డినెన్స్ జారీ చేశాక నకిలీ విత్తనాలు విక్రయించే కంపెనీలు, డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటారు. కంపెనీలు ఎంత నష్టపరి హారం చెల్లించాలి, వాటి యాజమాన్యాలకు ఎలాంటి శిక్షలు అమలు చేయాలి, పరి హారం, జైలు శిక్ష రెండూ ఉండేలా ప్రత్యేకంగా నిబంధనలు తయారు చేస్తారు. ముసాయిదా బిల్లులోని ఇతర ముఖ్యాంశాలు ♦ నకిలీ విత్తనాల వల్ల నష్టం వాటిల్లిందని రైతు లేదా రైతు బృందం జిల్లా కమిటీకి లిఖిత పూర్వక ఫిర్యాదు ఇవ్వొచ్చు. ♦ రైతుకు నష్టం కలిగించేలా వ్యవహరించిన అధికారి, ఉద్యోగి, ఏజెన్సీ, డీలరు ఇలా ఎవరిపైనైనా కఠిన చర్యలు తీసుకోవచ్చు. ♦ మిర్చి విత్తన కంపెనీల రిజిస్ట్రేషన్ ఇక ఇష్టారాజ్యంగా చేయడానికి కుదరదు. అందుకోసం సరైన నిబంధనలు రూపొందిస్తారు. -
మొండి బకాయిలపై ఆర్బీఐ అస్త్రం
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం సవరణ ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదం ► ఎగవేత కంపెనీలపై బ్యాంకులకు నియంత్రణ ► ఎన్పీఏల పరిష్కారంలో కీలక అడుగు ► ఎగవేతదారులపై విస్తృత చర్యలు చేపట్టే అధికారం న్యూఢిల్లీ: మొండి బకాయిల (ఎన్పీఏల) సమస్య పరిష్కారం దిశగా ఆర్బీఐకి మరిన్ని చట్టబద్ధమైన అధికారాలను కేంద్రం కట్టబెట్టింది. ఎన్పీఏల వసూలుకు సంబంధించి బ్యాంకులను ఆర్బీఐ ఇక నేరుగా ఆదేశించగలదు. ఇందుకు సంబంధించి బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949లోని సెక్షన్ 35కి సవరణలు ప్రతిపాదిస్తూ కేంద్రం రూపొందించిన ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గురువారం రాత్రి ఆమోద ముద్ర వేశారు. కేంద్ర కేబినెట్ బుధవారం ఈ ఆర్డినెన్స్‌ను ఆమోదించి రాష్ట్రపతికి పంపిన విషయం తెలిసిందే. బ్యాంకింగ్ రంగాన్ని భారీగా ప్రక్షాళన చేసేందుకు తాజా ఆదేశాలు దోహదపడతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజా ఆర్డినెన్స్‌తో ‘‘రుణ ఎగవేత దారుల విషయంలో ‘ఇన్సాల్వెన్సీ అండ్ బాంక్రప్టసీ కోడ్ 2016’ నిబంధనల కింద దివాలా పరిష్కార చర్యలు చేపట్టాలని ఏ బ్యాంకునైనా ఆర్బీఐ ఆదేశించగలదు’’ అని శుక్రవారం కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ పేర్కొంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎన్పీఏలు అసాధారణంగా రూ.6 లక్షల కోట్లకుపైగా పెరిగిపోయిన నేపథ్యంలో కేంద్రం తాజా చర్యలను చేపట్టడం గమనార్హం. మొత్తం దేశీయ బ్యాంకింగ్ రంగంలో 2016 డిసెంబర్ నాటికి ఎన్పీఏలు రూ.7లక్షల కోట్లను దాటాయి. విద్యుత్తు, స్టీల్, మౌలిక సదుపాయాలు, టెక్స్టైల్స్ రంగాలకు ఇచ్చిన రుణాలు ఎక్కువగా ఎన్పీఏలుగా మారాయి. ఎన్పీఏల సమస్య పరిష్కారానికి బ్యాంకులకు సూచనలు ఇచ్చేందుకు ఒకటికి మించిన యంత్రాంగాలను ఏర్పాటు చేసే అధికారం ఆర్బీఐకి ఇచ్చినట్టు ప్రభుత్వం తెలిపింది. ఎన్పీఏలు అసాధారణ స్థాయికి చేరాయని, సమస్య పరిష్కరానికి సత్వర చర్యలు అవసరమని పేర్కొంది. ఈ ఆర్డినెన్స్ స్థానంలో చట్టంలో సవరణలకు సంబంధించిన బిల్లును పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టనుంది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949లో కొత్తగా సెక్షన్ 35ఏఏ, 35ఏబీలను చోటు కల్పించనుంది. చట్ట సవరణ ఉద్దేశాలు ♦ భారీ రుణ ఎగవేతదారుల విషయంలో ఆర్బీఐ మరిన్ని చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు తాజా రుణాలు ఇక లభించడం కష్టమే. వారిపై నిషేధం విధించాలని బ్యాంకులను ఆర్బీఐ కోరవచ్చు. అంతేకాదు, రుణ ఎగవేతదారులను కంపెనీల బోర్డుల్లో డైరెక్టర్లుగా నియమించుకోవడం కూడా ఇకపై కుదరదు. ♦ రంగాల వారీగా పర్యవేక్షణ కమిటీలను నియమించే అధికారం ఆర్బీఐకి ఇచ్చారు. ఒత్తిడిలో ఉన్న రుణాల వసూలుకు పరిష్కారాలు సూచించేందుకు కమిటీలు లేదా అధికారులను కూడా నియమించగలదు. ♦ మొండి బకాయిల సమస్య పరిష్కారానికి బ్యాం కర్లు తీసుకునే నిర్ణయాల విషయంలో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సీబీఐ, కాగ్, ఈడీ తదితర దర్యాప్తు సంస్థల నుంచి బ్యాంకర్లకు కొత్త చట్టం రక్షణ కల్పి స్తోంది. దర్యాప్తు సంస్థల విచారణ భయాలతో బ్యాంకర్లు.. ఎన్పీఏల పరిష్కారానికి చొరవ చూపించడం లేదు. తాజా ఆర్డినెన్స్‌తో ఆ భయాలు తొలగుతాయి. ♦ ఒత్తిడిలో ఉన్న రుణాల విషయమై పరిష్కారానికి గాను ఆర్బీఐ సమయానుకూలంగా మార్గదర్శకాలు జారీ చేయగలదు. దివాలా పరిష్కార చర్యలు చేపట్టాలని బ్యాంకులను ఆదేశించగలదు. ♦ మొండి బకాయిల ఖాతాల విషయంలో పరిష్కార చర్యలు చేపట్టేందుకు బ్యాంకులకు మరింత నియంత్రణ లభిస్తుంది. ♦ హెయిర్ కట్ (ఇచ్చిన రుణంలో బ్యాంకు నష్టపోయేందుకు అంగీకరించే మొత్తం) విషయంలో కేసును బట్టి పరిష్కారం సూచించే అధికారం ఆర్బీఐకి లభించింది. అవసరమైతే మార్గదర్శకాల్లోనూ వెసులుబాటు ఇవ్వగలదు. ♦ కొత్త చట్టంతో రుణ ఎగవేతదారులను కంపెనీల యాజమాన్యం, ఓటింగ్ హక్కుల నుంచి తప్పుకోవాలని బ్యాంకులు ఆదేశించగలవు. వారి స్థానంలో కొత్త యాజమాన్యాన్ని ఏర్పాటు చేసి నిర్దేశిత కాలంలోగా పునరుద్ధరణ బాట పట్టించే చర్యలు చేపట్టొచ్చు. ♦ తాజా చట్టానికి అనుగుణంగా రెండు వారాల్లో ఆర్బీఐ ఎన్పీఏలకు సంబంధించి తగిన చర్యల్ని నోటిఫై చేసే అవకాశం ఉంది. ఆర్బీఐ తొలుత 50 భారీ రుణ ఎగవేత కేసులను ఈ ఏడాది డిసెంబర్‌లోపు పరిష్కరించడంపై దృష్టి సారించనున్నట్టు సమాచారం. ప్రస్తుత స్థితి ఇక ఎంత మాత్రం కొనసాగరాదు: జైట్లీ బ్యాంకింగ్ నియంత్రణ చట్టానికి చేసిన సవరణలతో బ్యాంకులు వేగంగా నిర్ణయాలు తీసుకోగలవని, దాంతో ఒత్తిడిలో ఉన్న రుణాల విషయంలో త్వరగా పరిష్కారాలు లభించగలవని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఢిల్లీలో మీడియాతో అన్నారు. ‘‘ఈ చట్టం యొక్క లక్ష్యం ప్రస్తుతమున్న యాథాతథ స్థితి (ఎన్పీఏలకు సంబంధించి) కొనసాగకూడదన్నదే. స్వతంత్ర ప్రతిపత్తి పేరుతో అచేతనం చేయడమన్నది ఆర్థిక రంగానికి హానికరం. కనుక దాన్ని తొలగించాల్సిన అవసరం ఉంది’’ అని జైట్లీ పేర్కొన్నారు. ఎన్పీఏలుగా మారిన రుణాలను గుర్తించి సత్వర పరిష్కారాలను కనుగొనేందుకు ఆర్బీఐకి అధికారాలు కల్పించినట్టు జైట్లీ చెప్పారు. ఒత్తిడిలో ఉన్న రుణాల జాబితా ఇప్పటికే ఆర్బీఐ ముందుకు చేరింద ని, దాన్ని పరిశీలించి చర్యలు చేపడుతుందన్నారు. ఆస్తులను విక్రయించడం, లాభసాటిగా లేని బ్యాంకు శాఖలను మూసివేయడం, వ్యాపార పునర్వవ్యస్థీకరణ చర్యలు చేపట్టడం వంటివి కూడా పరిష్కారాల్లో భాగంగా ఉంటాయని స్పష్టం చేశారు. మంచి చర్యే: బ్యాంకర్లు ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం బ్యాంకింగ్ నియంత్రణ చట్టానికి సవరణలు... దివాళా బాంక్రప్టసీ కోడ్, సర్ఫేసీ, రుణ రికవరీ ట్రిబ్యునల్ చట్టాలకు సవరణలు ఇవన్నీ కూడా ఎన్‌పీల సమస్య పరిష్కారం విషయంలో ప్రభుత్వ బలమైన నిబద్ధతను తెలియజేస్తున్నాయి. ఆర్బీఐకి అధికారాలు ఇవ్వడం సమస్యకు ప్రభావవంతమైన పరిష్కారాన్ని ఇస్తుంది. బ్యాంకులు సత్వరమే ఈ నిబంధనల ఆసరాతో ప్రయోజనాలను అందుకోవాలి. – అరుంధతీ భట్టాచార్య, ఎస్బీఐ చీఫ్ పూర్తి పరిష్కారానికి సమయం ఎన్పీఏలకు పరిష్కారానికి కేంద్రం తీసుకొచ్చిన చట్టం పెద్ద అడుగు. పరిష్కార ప్రక్రియకు వెంటనే మొదలయ్యేలా చేస్తుంది. పూర్తి స్థాయిలో సమస్య పరిష్కారానికి సమయం తీసుకుంటుంది. అయితే, పరిష్కారం కోసం ఓ నిర్మాణాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆ మార్గంలో సాగిపోతే పురోగతి ఉంటుంది. – చందాకొచర్, ఐసీఐసీఐ బ్యాంకు చీఫ్ ఆర్బీఐ మరింత జోక్యం ఎందుకు: రేటింగ్ ఏజెన్సీలు ఎన్పీఏల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌తో క్షేత్ర స్థాయిలో ఫలితం చూపించడానికి సమయం పడుతుందని రేటింగ్ ఏజెన్సీలు అభిప్రాయపడ్డాయి. వాణిజ్య బ్యాంకులు ఎదుర్కొంటున్న సమస్య విషయంలో మరింత సునిశిత పరిశీలనకు ఆర్బీఐను అనుమతించడాన్ని ప్రశ్నించాయి. ఎన్పీఏల పరిష్కారం విషయంలో ఇప్పటి వరకూ నెలకొన్న ఉదాసీనతను తాజా ఆర్డినెన్స్ పరిష్కరించాల్సి ఉందని ఇండియా రేటింగ్ ఏజెన్సీ పేర్కొంది. వాణిజ్య రుణాల జారీ విషయంలో నియంత్రణ సంస్థ జోక్యానికి అవకాశం కల్పించడాన్ని వాటి సమర్థ నిర్వహణ విషయంలో ప్రశ్నలకు అవకాశం కల్పిస్తోందని తెలిపింది. క్రిసిల్ మాత్రం సానుకూలమని వ్యాఖ్యానించింది. -
మొండి బకాయిలపై ఆర్బీఐ అస్త్రం
-
ప్రభుత్వ సంస్థలకు ‘మొండి’ ప్రాజెక్టులు
► వ్యూహరచనలో కేంద్రం ► ఎన్పీఏల సమస్య పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యం న్యూఢిల్లీ: ఒత్తిడిలో ఉన్న ప్రాజెక్టులను ప్రభుత్వ రంగ సంస్థలకు (పీఎస్‌యూ)అప్పగించే కీలక వ్యూహంలో ప్రభుత్వం ఉన్నట్లు అత్యున్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. మొండిబకాయిల (ఎన్పీఏ) సమస్య పరిష్కారం దిశలో బుధవారం బ్యాంకింగ్ యాక్ట్ సవరణకు ఆర్డినెన్స్ జారీకి ఆమోదం తెలిపిన కేంద్రం, ఇదే క్రమంలో మరింత ముందుకు వెళ్లడానికి కసరత్తు చేస్తున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. పీఎస్‌యూలకు ఒత్తిడిలో ఉన్న ప్రాజెక్టులను అప్పగించడానికి తగిన నిబంధనల సవరణపై కేంద్రం దృష్టి పెట్టినట్లు సమాచారం. ఈ విషయంలో కేబినెట్ సెక్రటేరియట్ వివిధ ప్రభుత్వ మంత్రిత్వశాఖలు, బ్యాంకుల మధ్య సమన్వయం చేస్తుంది. ప్రధాని కీలక సమీక్ష సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం, ఈ విషయంలో ప్రధాని నరేంద్రమోదీ గత వారం ఒక అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, క్యాబినెట్ సెక్రటరీ పీకే సిన్హా, ఫైనాన్షియల్ సేవల కార్యదర్శి అంజులీ చిబ్ దుగ్గల్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఒక నిర్ధిష్ట రంగం ప్రాజెక్టులను సంబంధిత మంత్రిత్వశాఖకు అప్పగించే వ్యూహంపై కేంద్రం ప్రత్యేకించి దృష్టి పెట్టింది. వివిధ రంగాలకు సంబంధించి భారీ ఎన్పీఏలను గుర్తించాలని, ఆయా రంగాల వివరాలను సంబంధిత మంత్రిత్వశాఖలకు తెలియజేయాలని ఇప్పటికే బ్యాంకింగ్‌కు కూడా సంకేతాలు అందాయి. అలాగే ఆయా అంశాలకు సంబంధించి వ్యూహాలను రూపొందించే పనిలో ప్రభుత్వ రంగ సంస్థలు కూడా బిజీగా ఉన్నాయి. పరస్పర ప్రయోజనం లక్ష్యం... తక్కువ స్థాయి ధర వద్ద... ఒత్తిడిలో ఉన్న ప్రాజెక్టుల కొనుగోలు ప్రభుత్వ రంగ సంస్థలకు లాభదాయక అంశమయితే, ఎన్పీఏల భారం తగ్గడం బ్యాంకులకు సానుకూల అంశమని అధికార వర్గాలు వివరిస్తున్నాయి. ఈ పరస్పర ప్రయోజన లక్ష్యంగా సమస్య ఎన్పీఏల పరిష్కార ప్రణాళికలు రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వరంగ బ్యాంకు ఎన్పీఏలు 2015 మార్చిలో రూ.2.67 లక్షల కోట్లు ఉంటే,, 2016 మార్చి నాటికి ఈ మొత్తం రూ.5.02 లక్షలకోట్లకు పెరగడంతో దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. ఎన్పీఏల పరిష్కారం దిశలో ఆర్బీఐకి కీలక అధికారాలను అప్పగించే నిర్ణయాలను బుధవారం కేంద్ర క్యాబినెట్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాలు ప్రత్యేకించి బ్యాంకింగ్ చట్ట సవరణలు ఎన్పీఏల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తాయని ఫైనాన్స్ కార్యదర్శి అశోక్ లవాసా గురువారం ఇక్కడ విలేకరులతో అన్నారు. -
కల్తీ చేస్తే.. కటకటాలే!
విత్తనాలు, ఎరువుల్లో కల్తీకి పాల్పడేవారిపై ఉక్కుపాదం ► అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం ► కఠిన చట్టం తెచ్చి త్వరలోనే ఆర్డినెన్స్ జారీ చేస్తాం ► ఆహార పదార్థాలు కల్తీ చేసేవారిపైనా కఠిన చర్యలు ► పండించిన కూరగాయలు, పండ్లను రైతులే అమ్మాలి ► ఈ నెల 10 నుంచి ఏఈవోలు గ్రామాల్లో పర్యటించాలి సాక్షి, హైదరాబాద్: రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందాలని, నకిలీ, కల్తీకి అవకాశం లేకుండా చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. నకిలీ, కల్తీకి పాల్పడే వ్యక్తులపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపేలా కఠిన చట్టం రూపొందించాలని స్పష్టంచేశారు. ఇందుకు సంబంధించి త్వరలోనే ఆర్డినెన్స్ జారీ చేయనున్నట్లు వెల్లడించారు. ఆహార పదార్థాలను కల్తీ చేసే వారిపైనా ఉక్కుపాదం మోపేలా విధానం రూపొందించాలని ఆదేశించారు. కూరగాయలు, పండ్లు మన రైతులే పండించి అమ్మేలా తగిన సహకారం అందించాలని సూచించారు. పండించిన పంటను కూడా రైతులతోనే ఆహార పదార్థంగా ప్రాసెసింగ్ చేయించాలని పేర్కొన్నారు. రైతులకు పెట్టుబడి వ్యయాన్ని అందించే విధానంతోపాటు ఎరువులు, విత్తనాల సరఫరా, రైతు సంఘాల ఏర్పాటు తదితర అంశాలపై సోమవారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పెట్టుబడి నుంచి గిట్టుబాటు ధర కల్పించే వరకు వ్యవసాయానికి సంబంధించిన ప్రతీ ప్రక్రియలో రైతుకు వెన్నుదన్నుగా ఉండాలని అధికారులకు సూచించారు. ఈ వానాకాలం పంటలకు సరిపడా ఎరువులు అందించాలని కేంద్ర ఎరువులు, రసాయన శాఖ మంత్రి అనంత్ కుమార్‌ను కోరారు. ఈ భేటీలో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, ముఖ్య కార్యదర్శులు నర్సింగరావు, పార్థసారథి, ఎంపీ కె.కేశవరావు, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు, వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ప్రవీణ్ రావు, ఉద్యానశాఖ కమిషనర్ వెంకట్రామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎరువులు ఇప్పుడే నిల్వ చేయండి వర్షాకాలానికి అవసరమయ్యే ఎరువులన్నీ వేసవిలోనే సేకరించి నిల్వ పెట్టుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో 16 లక్షల టన్నుల ఎరువులు అవసరమని, ఇప్పటికే 8 లక్షల టన్నులు సిద్ధంగా ఉన్నాయని అధికారులు సీఎంకు చెప్పారు. కొంత ఎరువు స్థానికంగానే లభ్యమవుతుందన్నారు. 2 లక్షల టన్నుల యూరియా, 50 వేల టన్నుల డీఏపీ, 2 లక్షల టన్నుల ఎన్పీకే సేకరించి పెట్టుకుంటే వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు. ఇందుకు స్పందించిన సీఎం వెంటనే కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి అనంతకుమార్‌కు ఫోన్ చేసి ఎరువులుS సరఫరా చేయాలని కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. మంగళవారం వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి ఢిల్లీ వెళ్లి ప్రతిపాదనలు అందించనున్నారు. ‘‘రాష్ట్రంలో కేవలం వరి ధాన్యం విషయంలో మాత్రమే స్వయం సమృద్ధి సాధించాం. ఇతర ఆహార ధాన్యాలు, కూరగాయలు, పండ్లు ఇంకా దిగుమతి చేసుకుంటున్నాం. తెలంగాణ అవసరాలు ఏమిటి? కూరగాయలు ఎన్ని కావాలి? పండ్లు ఎన్ని కావాలి? ఏది ఎంత కావాలో నిర్ధారించి అంత మేరకు ఉత్పత్తి చేసుకోవాలి. దీని ద్వారా ప్రజల అవసరాలు తీరుతాయి. మన అవసరాలు పోను మిగతా సరుకును ఎగుమతి చేస్తే రైతులు బాగుపడతారు. ఇందుకు అధికారులు ఏ పంట వేయాలనే విషయంలో రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం, సూచనలు అందించాలి. ఏ పంటకు డిమాండ్ ఉందో గుర్తించి మార్కెట్ అవసరాలకు తగ్గట్టు ఉత్పత్తి చేయాలి’’ అని సీఎం చెప్పారు. గ్రామాల్లో రైతు సంఘాలు ఏర్పాటు చేయాలని, వారికి సరైన శిక్షణ ఇవ్వాలని సూచించారు. గ్రామంలో రైతులంతా ఒకే పంట కాకుండా వేర్వేరు పంటలు వేసేలా ప్రోత్సహించాలన్నారు. మిర్చి వేసిన రైతులే కారం పట్టి అమ్మేలా, పసుపు కొమ్ములను పసుపుగా మార్చేలా రైతులకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. తెలంగాణ అవసరాలకు తగినట్లుగా వ్యవసాయ శాఖ కూడా స్వరూపం మార్చుకోవాలని, అసవరమైన సిబ్బందిని నియమించుకోవాలని, ఏ ఉద్యోగి ఏ పని చేయాలనే విషయంలో జాబ్ చార్ట్ రూపొందించాలని ఆదేశించారు. భూముల లెక్కలు తీయండి వ్యవసాయ విస్తరణాధికారులు(ఏఈవో) ఈ నెల 10 నుంచి జూన్ 10 వరకు గ్రామాల్లో పర్యటించి, భూముల వివరాలు సేకరించా లని సీఎం ఆదేశించారు. ‘‘ఏ రైతు దగ్గర ఎంత భూమి ఉంది? అందులో ఏ పంట సాగుచేస్తున్నారు? నీటి వసతి ఉందా? వానా కాలంలో ఏం పండిస్తారు? యాసం గిలో ఏం పండిస్తారు? సూక్ష్మ సేద్యం చేస్తు న్నారా? యంత్రాలు వాడుతున్నారా? భూ సార పరీక్ష చేయించారా? చేయిస్తే ఎలాంటి రకం నేల అని తేలింది? తదితర వివరాలన్నీ సేకరించాలి. ఇలా సేకరించిన వివరాల ఆధారంగానే రైతుకు పెట్టుబడి అందించ డంతో పాటు భవిష్యత్తులో రైతుకు సంబం ధించిన ఇతర కార్యక్రమాలు అమలు చే స్తాం. కాబట్టి వివరాలు కచ్చితంగా ఉండాలి. వాస్తవాలే ఉండాలి. తప్పుడు వివరాలు సేక రించినా.. తప్పుడు సమాచా రం అందిం చినా ప్రభుత్వం కఠినంగా వ్యవ హరిస్తుంది. వ్యవసాయాధికా రులు ప్రతీ రైతు దగ్గరికి వస్తారు. రైతులు పూర్తి సమాచారం ఇచ్చి సహకరించాలి’’ అని పేర్కొన్నారు. -
తప్పనిసరి సబ్జెక్టుగా మలయాళం
తిరువనంతపురం: కేరళలో మాతృభాష మలయాళాన్ని అన్ని స్కూళ్లలో తప్పనిసరి సబ్జెక్టుగా చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఆర్డినెన్స్ ప్రకారం రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో (ప్రభుత్వ, ఎయిడెడ్, అన్ఎయిడెడ్, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ అనుబంధమున్న స్కూళ్లు, సెల్ఫ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్) పదో తరగతి వరకు మలయాళంను తప్పనిసరిగా బోధించాలి. ఈ నిర్ణయం రానున్న విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి రానున్నట్లు ముఖ్యమంత్రి విజయన్ మీడియాకు తెలిపారు. మలయాళం బోధించని పాఠశాలలను రద్దు చేస్తామని ప్రకటించారు. ఈ కొత్త నియమాన్ని పాటించని పాఠశాల ప్రధానోపాధ్యాయులపై రూ. 5 వేల జరిమానా విధిస్తామని చెప్పారు. కానీ ఈ విషయంలో ఇతర రాష్ట్ర విద్యార్థులు, విదేశీ విద్యార్థులకు మినహాయింపునిచ్చారు. ఈ ఆర్డినెన్స్‌కు ఆ రాష్ట్ర గవర్నర్ పి.సదాశివం ఆమోదం తెలిపారు. -
ఆమోదం
► జల్లికట్టు ఆర్డినెన్స్ పై రాష్ట్రపతి ఆమోదముద్ర ► జల్లికట్టు అభిమానుల ఆనందహేల ► ‘అల్లరి’ పోలీసులపై వేటు ► అల్లర్ల వెనుక కుట్ర : విపక్షాల ఆగ్రహం తమిళనాడు ప్రజలకు దేశ రాజధాని నుంచి సోమవారం శుభవార్త అందింది. ఈ శుభవార్త చెవిన పడగానే రాష్ట్ర ప్రజలు ఆనంద డోలికల్లో తేలిపోతున్నారు. జల్లికట్టును అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సోమవారం ఆమోదముద్ర వేయడమే ప్రజల ఆనందానికి కారణం. సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళుల ప్రాచీన సంప్రదాయ క్రీడ జల్లికట్టుపై కొన్నేళ్ల క్రితం విధింపబడిన నిషేధం రాష్ట్ర ప్రజలను తీరని ఆవేదనకు గురిచేసింది. ఆవేదన ఆగ్రహంగా మారి ఆం దోళనలకు దారితీసింది. మూడేళ్లుగా పొంగల్ పండుగ సమయాల్లో జల్లికట్టు ఆందోళనలు సాగుతూ చల్లారిపోతున్నాయి. అయితే ఈ ఏడాది జల్లికట్టు ఉద్యమంలోకి క్రీడాకారులు, అభిమానులేగాక విద్యార్థినీవిద్యార్థులు సైతం రంగప్రవేశం చేశారు. దీంతో చెన్నై మెరీనా బీచ్ తీరమే వేదికగా చేసుకుని సాగించిన ఆందోళనలు ఆకాశాన్ని అంటాయి. తమ డిమాండ్‌ను సాధించేవరకు ఉద్యమాన్ని విరమించేది లేదని జల్లికట్టుపై పట్టుపట్టారు. భార్యా పిల్లలతో కుటుంబాలు సైతం మెరీనాతీరానికి తరలిరాగా ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. సీఎం పన్నీర్‌సెల్వం స్వయంగా ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని కలిశారు. జల్లికట్టు ఉద్యమంపై అడ్డంకులను తొలగిస్తూ ఈ నెల 22వ తేదీన ఆర్డినెన్స్ తీసుకువచ్చారు. అయితే ఆర్డినెన్స్ ను రాష్ట్రపతి ఆమోదించేవరకు ఆందోళన విరమించబోమని ఉద్యమకారులు స్పష్టం చేశారు. అదే రోజు రాత్రి విద్యార్థి సంఘాల నేతలతో మంత్రులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఆందోళనను విరమింపజేసేందుకు 23వ తేదీ తెల్లవారుజామున పోలీసు ఉన్నతాధికారులు తమవంతు ప్రయత్నం చేశారు. అయితే దురదృష్టవశాత్తూ పోలీసులు, ఉద్యమకారుల మధ్య చర్చలు బెడిసికొట్టాయి. పోలీసులపై రాళ్లు రువ్వడంతో ప్రారంభమై లాఠీచార్జీ, భాష్పవాయి ప్రయోగాలు, గాలిలోకి కాల్పులు, పోలీస్‌స్టేషన్, ప్రభుత్వ, ప్రయివేటు వాహనాల దగ్ధం తదితర అవాంఛనీయ సంఘటనలవైపు ఉద్యమం మళ్లింది. చెన్నై మెరీనాతీరంలోని కొందరు ఉద్యమకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లర్లకు కారణమైన మరికొందరిని జైళ్లలోకి నెట్టారు. ఉద్యమంపై పోలీసులు ఉక్కుపాదం మోపగా జల్లికట్టు ఉద్యమకారులు ఇంటి బాట పట్టారు. అల్లర్ల సమయంలోనే జల్లికట్టు ఆర్డినెన్స్ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు ద్వారా రాష్ట్రపతికి చేరుకుంది. అలాగే ఆర్డినెన్స్ తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. అసెంబ్లీ తీర్మానం కాపీని సైతం రాష్ట్రపతికి పంపారు. దీంతో జల్లికట్టు ఉద్యమానికి మార్గం సుగమం చేస్తూ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సోమవారం ఆమోదముద్ర వేయడంతో కథ సుఖాంతమైంది. ‘అల్లరి’ పోలీసులపై త్వరలో వేటు జల్లికట్టు అల్లర్లను అవకాశంగా తీసుకుని అక్రమాలకు పాల్పడిన పోలీసులపై సస్పెన్షన్ వేటు పడనున్నట్లు సమాచారం. ఈ నెల 23వ తేదీన చెన్నై నగరంలో పలు విధ్వంసక చర్యలు చోటుచేసుకోగా వీటిల్లోని 35 సంఘటనలను కొందరు సెల్‌ఫోన్ ద్వారా వీడియోలో చిత్రీకరించి వాట్సాప్‌లో పెట్టారు. రోడ్డు వారగా నిలిపి ఉన్న ఆటోకు ఒక మహిళా కానిస్టేబుల్ నిప్పుపెట్టడం, మరికొందరు పోలీసులు రోడ్లపై నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేయడం వంటి సన్నివేశాలు వాట్సాప్‌ల ద్వారా ప్రసారం కావడం పోలీసు శాఖను అప్రతిష్టపాలు చేసింది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు నష్టనివారణ చర్యలు ప్రారంభించారు. వాట్సాప్ దృశ్యాల ద్వారా పోలీసులను గుర్తించారు. వీరందరినీ రహస్య ప్రదేశంలో ఉంచి విచారణ చేస్తున్నారు. నిలిచి ఉన్న ఒక ఆటోకు నిప్పుపెట్టిన మహిళా కానిస్టేబుల్, ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేసినవారిపై త్వరలో సస్పెన్షన్ వేటు పడనున్నట్లు తెలిసింది. రెండు వారాలు వాయిదా చెన్నై మెరీనాతీరంలో అల్లర్ల ఆరోపణలపై అరెస్టయిన వారికి బెయిల్ మంజూరుకు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ మరో రెండు వారాలు వాయిదా పడింది. జల్లికట్టు ఉద్యమాన్ని విరమించాల్సిందిగా కోరుతూ ఈ నెల 23వ తేదీన పోలీసులు జరిపిన చర్చలకు సమ్మతించని ఉద్యమకారులు అల్లర్లకు దిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అల్లర్ల సమయంలో ప్రాణనష్టం జరగకపోయినా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. సుమారు 280 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయి రిమాండ్ ఖైదీలుగా ఉన్నవారు దరఖాస్తు చేసుకున్న బెయిల్ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చింది. బదులు పిటిషన్ దాఖలు చేసేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా పోలీస్‌శాఖ చేసిన విజ్ఞప్తిని మన్నించిన న్యాయమూర్తి మహాదేవన్ కేసు విచారణను రెండు వారాలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. విపక్షాల ఆగ్రహం ప్రశాంతంగా సాగుతున్న జల్లికట్టు ఉద్యమంలో ఉద్రిక్తతలు సృష్టిం చి కుట్రపూరితంగా అణచి వేశారని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జల్లికట్టు ఉద్యమంలో ఉద్దేశ పూర్వకంగా పోలీసులే అల్లర్లు సృష్టించారని టీఎన్ సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ సోమవారం ఆరోపించారు. వారం రోజులపాటూ శాంతియుత వాతావరణంలో ఉద్యమం చేస్తున్న వారిని చెదరగొట్టే ఉద్దేశంతోనే పోలీసులు రంగ ప్రవేశం చేశారని ఆయన అన్నారు. పోలీసుల జోక్యానికి నిరసనగా ఉద్యమకారులు సముద్రతీరంలోకి వెళ్లగా వారికి రక్షణగా నిలిచిన మత్స్యకారులను సైతం అరెస్ట్ చేయడం అన్యాయమని చెప్పారు. 23వ తేదీ జరిగిన అల్లర్లపై న్యాయ విచారణ జరపాలని ఆయన కోరారు. జల్లికట్టు ఉద్యమం ఉద్రిక్త పరిస్థితులకు దారితీయడంపై పార్లమెంటులో గళం విప్పుతానని రాజ్యసభ సభ్యురాలు (డీఎంకే) కనిమొళి సోమవారం తెలిపారు. -
కేంద్రంవల్లే జల్లికట్టు
► రాష్ట్రంపై నిర్లక్ష్యం లేదు ► కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ప్రజల జల్లికట్టు కోర్కెను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సంపూర్ణ సహకారం ఇచ్చిందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆర్డినెన్స్ సలహా, రాష్ట్రపతి ఆమోదానికి కేంద్రం తోడ్పాటు వల్లనే జల్లికట్టులోని అడ్డంకులు తొలగిపోయాయని ఆమె తెలిపారు. అలాగే వర్దా తుపాను సహాయం, జల్లికట్టు సాదనలో కేంద్రానికి ఎంతమాత్రం వివక్ష లేదని ఆమె అన్నారు. చెన్నైలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ జల్లికట్టు ఉద్యమం సాగుతున్న తరుణంలో సీఎం పన్నీర్‌సెల్వం ఢిల్లీకి వచ్చినపుడు ప్రధాని మోదీ ఆయన్ను కలుసుకున్నారని, అలాగే పార్లమెంటు ఉపసభాపతి తంబిదురైతో జల్లికట్టు అంశంపై తాను సైతం అనేకసార్లు మాట్లాడానని తెలిపారు. కేవలం ఒకే ఒక్కసారి తంబిదురై సహా అన్నాడీఎంకే పార్లమెంటు బృందం ప్రధానిని కలవలేకపోవడాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రాన్ని కేంద్రం దూరంగా పెట్టిందని ఆరోపించడం సబబు కాదని అన్నారు. జల్లికట్టుకై ఆర్డినెన్స్ ను తీసుకురండి, తాము సహకరిస్తామని సలహా సీఎంకు ఇచ్చింది కూడా మోదీనేనని ఆమె చెప్పారు. సలహాతో సరిపెట్టక రాష్ట్రపతి వద్ద ఆర్డినెన్స్ ఆమోదానికి కూడా మోదీ చొరవచూపారని ఆమె తెలిపారు. జల్లికట్టుపై నిషేధం విధించి రెండేళ్లు కావస్తుండగా తమిళనాడు ప్రభుత్వం ఏనాడో నిర్ణయం తీసుకుని ఉండొచ్చుకదా, జాప్యానికి కేంద్రం కారణమా అని ఆమె ప్రశ్నించారు. జల్లికట్టు ఆర్డినెన్స్ కు సహకరించిన ప్రధాని మోదీపై తంబిదురై విమర్శలు చేయడం దురదృష్టకరమని ఆమె చెప్పారు. జల్లికట్టు ఉద్యమం చివరి రోజుల్లో సంఘ విద్రోహశక్తులు ప్రవేశించాయనడంలో ఎలాంటి సందేహం లేదని తెలిపారు. జాతీయ పతాకాన్ని దగ్ధం చేయడం, మోదీ దిష్టిబొమ్మ దహనాలు ఎవరిపని అని ఆమె ప్రశ్నించారు. అల్లర్లకు కారణమైన వారిని గుర్తించేందుకు జరుగుతున్న విచారణలో వాస్తవాలు వెలుగుచూడగలవని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. పోలీసులు తప్పు చేసి ఉంటే చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆమె హెచ్చరించారు. వర్దా తుపాను సహాయక చర్యల్లో సైతం కేంద్రం రాష్ట్రాన్ని పక్కన పెట్టిందని విమర్శలు సత్యదూరమని పేర్కొన్నారు. స్పష్టమైన ఆరోపణలు చేస్తే జవాబు చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే ప్రగతిశీల భారత్ సాధ్యమని అన్నారు. జల్లికట్టుకు తాము ఆమోదం తెలిపామని తమిళ కాంగ్రెస్ చెప్పడం శోచనీయమని అన్నారు. నిషే«ధానికి కారణమైన కాంగ్రెస్ అనుమతి ఎలా ఇవ్వగలదని ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. అద్దాల భవనంలో కూర్చుని ఎదుటి వారిపై రాళ్లు విసరడం క్షేమం కాదని ఆమె హితవు పలికారు. -
రంకెలేసిన తంబి
► ఓ పక్క నిరసన..మరోపక్క రంకెలేసిన బసవన్న ► తెరుచుకున్న వాడి వాసల్ ► తిరుచ్చి, పుదుకోట్టైలలో జల్లికట్టు జోరు ► పుదుకోట్టైలో ఇద్దరి బలి ► అలంగానల్లూరులో సీఎంకు వ్యతిరేకత ► పోటెత్తిన మెరీనా తీరం నిషేధపు కట్లు తెంచుకున్నా, శాశ్వత పరిష్కారం లక్ష్యంగా జల్లికట్టు విషయంలో తమిళ తంబీలు పట్టు వీడడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగాయి. శాశ్వత పరిష్కార నినాదం మిన్నంటింది. అత్యవసర ఆర్డినెన్స్ తో ఆదివారం కొన్నిచోట్ల బసవన్నలు రంకెలే శాయి. మరెన్నో చోట్ల వ్యతిరేకత తప్పలేదు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన అలంగానల్లూరులో జల్లికట్టుకు సాగిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. సీఎం పన్నీరు సెల్వం వెనుదిరగాల్సి వచ్చింది. పుదుకోట్టైలో నిర్వహించిన సాహసక్రీడలో రంకెలేసిన ఎద్దుల దాడిలోఇద్దరు క్రీడాకారులు బలి అయ్యారు. సాక్షి, చెన్నై : తమిళుల సాహస, సంప్రదాయ క్రీడ జల్లికట్టుకు పట్టు బడుతూ సాగుతున్న నిరసనల గురించి తెలిసిందే. మూడేళ్ల నిషేధపు కట్లు తెంచుతూ శనివారం అత్యవసరంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చినా తమిళ తంబీలు పట్టు వీడడం లేదు. కంటి తుడుపుచర్యతో మాకేంటి, శాశ్వత పరిష్కారం లక్ష్యం అంటూ జల్లికట్టు మద్దతు ఉద్యమాన్ని కొనసాగిస్తుండడం ఉత్కంఠ రేపుతోంది. సెలవు రోజున రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు హోరెత్తినా, ఎక్కడికక్కడ బలగాల్ని మోహరింప చేస్తుండడం గమనార్హం. ఎన్ని అడ్డంకులు వచ్చినా, శాశ్వత పరిష్కారం లక్ష్యంగా ముందుకు సాగి తీరుతామని మద్దతుదారులు ప్రకటించడం విశేషం. ఇక, ఆర్డినెన్స్ తో ఆదివారం జల్లికట్టుకు శ్రీకారం చుట్టి తీరుతానంటూ ముందుకు సాగిన సీఎం పన్నీరు సెల్వంతో పాటు పలువురు మంత్రులకు వ్య తిరేకత తప్పలేదు. అలంగానల్లూరులో సీఎం పన్నీరు సెల్వం పాచికలు పారలేదు. అన్ని చో ట్ల వాడి వాసల్ తెరచుకున్నా, కొన్ని చోట్ల మా త్రమే బసవన్నలు రంకెలేస్తూ దూసుకొచ్చాయి. అటు ఆట : నిషేధపు కట్లు తెంచుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో దక్షిణాదిలోని జల్లికట్టుకు పేరు గడించిన తిరుచ్చి, మదురై, దిండుగల్, శివగంగై జిల్లాల్లో, డెల్టా పరిధిలోని తంజావూరు, పుదుకోట్టై జిల్లాల్లో జల్లికట్టుకు, పశ్చిమ తమిళనాడులోని కోయంబత్తూరు, ఈరోడ్, తిరుప్పూర్, నామక్కల్‌లలో రెక్లాతో ఎడ్ల పందేలకు చర్యలు తీసుకున్నారు. ఆటకు తగ్గ అన్ని ఏర్పాట్లతో ముందుకు సాగినా, వ్యతిరేకత మాత్రం తప్పలేదు. తిరుచ్చి మనప్పారైలో మూడు, నాలుగు రోజులుగా నిషేధాజ్ఞల్ని ఉల్లంఘించి జల్లికట్టు సాగుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఇక, కట్లు తెంచుకోవడంతో ఆదివారం మరింత ఉత్సాహంతో జల్లికట్టులో ఎద్దులతో కలిసి క్రీడాకారులు రంకెలు వేస్తూ తమ సత్తాను చాటుకున్నారు. విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులను నిర్వాహకులు అందజేశారు. పుదుకోట్టైలోని ఇలుపురు సమీపంలోని రాపూసల్ గ్రామంలో జల్లికట్టును మంత్రులు విజయభాస్కర్, పాండియరాజన్ ప్రారంభించారు. వాడివాసల్ నుంచి ఎద్దులు దూసుకొచ్చాయి. ఉత్సాహంగా, ఆనందోత్సాహాలతో జల్లికట్టు సాగింది. అయితే, ఎద్దుల్ని పట్టుకునే క్రమంలో లక్ష్మణ పట్టికిచెందిన మోహన్, ఉడుక్కురుకు చెదిన రాజా అనే క్రీడాకారులు తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. ఇదే ప్రాంతంలో మరో యాభై మంది స్వల్పం గా గాయపడ్డారు. ఆగమేఘాలపై ఏర్పాట్లు చేయడంతోనే భద్రత కరువైందని, పాలకుల తీరుతో ఇద్దరి ప్రాణాలు బలి అయ్యాయని సహచర క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. ఇక, రామనాథపురంలో నామ్ తమిళర్ కట్చి నేతృత్వంలో రెండు రోజులుగా జల్లికట్టు సాగినా, ఆదివారం ఎలాంటి అడ్డంకులు లేకుండా ఎద్దులు దూసుకొచ్చాయి. ఇక, కోయంబత్తూరు కొడీస్సియా మైదానంలో రెక్లా పోటీలను మంత్రి ఎస్పీ వేలుమణి జెండా ఊపి ప్రారంభించారు. తిరుప్పూర్ జిల్లా ఉడుమలైలో రెక్లా పోటీలను మంత్రి ఉడుమలై రాధాకృష్ణన్ జెండా ఊపి ప్రారంభించారు. రెక్లా పోటీలకు వచ్చిన మంత్రులకు జల్లికట్టు మద్దతు దారుల సెగ తగిలింది. వారిని బుజ్జగించి బయట పడేలోపు మంత్రులకు ముచ్చెమటలు తప్పలేదు. ఇటు పట్టు : జల్లికట్టుకు ప్రసిద్ది గాంచిన అలంగానల్లూరులో ‘ఆట’కు శ్రీకారం చుట్టేందుకు తీవ్ర ప్రయత్నాలే సాగాయి. శాశ్వత పరిష్కారం నినాదంతో వాడివాసల్ వైపుగా ఏ ఒక్కర్నీ యువత, గ్రామస్తులు, మద్దతుదారులు వెళ్లనివ్వ లేదు. జల్లికట్టుకు జెండా ఊపుతానంటూ మదురైకు రాత్రికి రాత్రే పరుగులు తీసిన సీఎం పన్నీరుసెల్వం నిరాశతో వెనుదిరగక తప్పలేదు. జోరు వాన కురిసినా మద్దతుదారులు ఏ మాత్రం వెనక్కు తగ్గని దృష్ట్యా, ఆగమేఘాలపై జల్లికట్టు నిర్వాహకుల్ని పిలిపించి బుజ్జగించేందుకు తీవ్రంగానే ప్రయత్నాలు జరిగాయి. అయితే, ఫలితం శూన్యం. వాడివాసల్ తెరిచే ఉందని, ప్రజలు ఎప్పుడు కోరితే, అప్పుడు జల్లికట్టుకు సిద్ధమని మదురై జిల్లా కలెక్టర్ వీరరాఘవులు ప్రకటించారు. దిండుగల్ జిల్లా నత్తం, సాత్తూరు, సేలం ఆత్తూరు, తంజావూరులో జల్లికట్టుకు ఏర్పాట్లు సాగినా, వ్యతిరేకతతో రద్దు చేసుకోక తప్పలేదు. ఇక, జల్లికట్టుకు మద్దతుగా చెన్నై మెరీనా తీరంలో కొనసాగుతున్న ఉద్యమానికి మద్దతుగా సెలవు రోజు పెద్ద ఎత్తున జన సమూహం తోడు కావడం విశేషం. ఈరోడ్‌లోని వీరప్పన్ పాళయంలో బీజేపీ నేతృత్వంలో జల్లికట్టుకు సాగిన ప్రయత్నాలు ఉద్రిక్తతకు దారితీ శాయి. యువత తిరగ బడడంతో, ఓ సందర్భంలో రాళ్లు రువ్వడంతో అక్కడికి వచ్చిన అధికారులు, బీజేపీ వర్గాలు పరుగులు తీశారు. మదురై మేలూరులో వర్షంలోనూ నిరసన కొనసాగగా, రాష్ట్ర వ్యాప్తంగా జల్లికట్టు మద్దతు ఉద్యమంలో శాశ్వత పరిష్కారం నినాదం మిన్నంటింది. జల్లికట్టుకు వ్యతిరేకంగా స్పం దించిన జంతు సంరక్షకుడు రాధా రాజన్ ఇరకాటంలో పడ్డారు. బీసెంట్‌నగర్‌లోని ఆయన ఇంటిని డీఎండీకే వర్గాలు ముట్టడించాయి. ఇదే శాశ్వతం : అలంగానల్లూరులో జల్లికట్టుకు జెండా ఊపేందుకు వెళ్లి నిరాశతో చెన్నైకు చేరుకున్న సీఎం పన్నీరు సెల్వం విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. తాజాగా రూపొందించిన ఆర్డినెన్స్ శాశ్వతం అని, ఇది తాత్కాళికం మాత్రం కాదు అని స్పష్టం చేశారు. అన్ని చోట్ల వాడివాసల్ తెరచుకుందని, జల్లికట్టుకు అనుమతుల్ని కలెక్టర్లు ఇస్తున్నారని, జిల్లాల ఎస్పీలు భద్రతను కల్పిస్తున్నారని వివరించారు. ప్రభుత్వం చట్ట, నిబంధనలమేరకు ముందుకు సాగుతోందని, ఆర్డినెన్స్ కు అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించి , రాష్ట్రపతి ఆమోదం పొంది తీరుతామని స్పష్టం చేశారు. అత్యవసరంగా తీసుకొచ్చిన చట్టానికి చట్టబద్ధత కల్పించేందుకు తగ్గ నియమ నిబంధనలు సిద్ధం అయ్యాయని, ప్రభుత్వ గెజిట్‌లో అన్ని వివరాలను ప్రకటించామన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో జల్లికట్టు మద్దతుదారులు ఎందుకు ఏకీభవించడం లేదన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ› ఆ కారణం ఏమిటో మీకే తెలుసు అంటూ పన్నీరు ముందుకు సాగారు. ఇక, ఆర్డినెన్స్ కు ఎలాంటి ఆటంకాలు ఎదురుకాని రీతిలో సుప్రీంకోర్టులో కేవియేట్ పిటిషన్ ను రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసి ఉండడం ఆహ్వానించ దగ్గ విషయం. సరైన వివరణ ఇవ్వండి : జల్లికట్టు కోసం ప్రత్యేకంగా అత్యవసర ఆర్డినెన్స్ తీసుకు రావడాన్ని ఆహ్వానిస్తున్నట్టు ప్రధాన ప్రతిపక్ష నేత, డీఎంకే నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. ఈ పని ముందే చేసి ఉంటే, ఇంత పెద్ద ఉద్యమం చేయాల్సి వచ్చి ఉండేది కాదన్నారు. అయితే, ఇదే శాశ్వతం అని ప్రకటనలు చేయడం కాదు అని, ఆర్డినెన్స్ కు చట్టబద్ధత కల్పించేందుకు తగ్గ పూర్తి వివరణను సీఎం పన్నీరుసెల్వం జల్లికట్టు మద్దతు దారులుకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. స్వయంగా మద్దతుదారుల వద్దకు సీఎం వెళ్లాలని సూచించారు. గతంలో జల్లికట్టు విషయంగా సాగిన నాటకీయ నిర్ణయాలతోనే ప్రస్తుతం, ప్రభుత్వ నిర్ణయంతో జల్లికట్టుమద్దతు దారులు ఏకీభవించడం లేదన్న విషయాన్ని సీఎం గుర్తెరగాలని హితవు పలికారు. జల్లికట్టుకు శాశ్వత పరిష్కారం లక్ష్యంగా నినాదం మిన్నంటింది. ఆదివారం ఎక్కడిక్కడ ఆందోళనలు సాగాయి. చెన్నై మెరీనా తీరంలో జన సందోహం పోటెత్తింది. యువత, విద్యార్ధులు ఆందోళనల బాటలో ఉదృ్ధతంగా దూసుకెళ్తుండడంతో సోమవారం నుంచి కళాశాలలు, పాఠశాలలు తెరచుకోనున్నడం గమనార్హం. దేశ సౌభ్రాతృత్వానికి భంగం కలిగించేలా వ్యవహరించొద్దు రాష్ట్ర ప్రభుత్వ చర్యలు నమ్మకాన్ని కలిగించేలా ఉన్నాయి. మార్చి 31వరకు సంయమనం పాటిద్దాం. అంతవరకు ఉద్యమాన్ని వాయిదా వేద్దామంటూ ఆదివారం రాత్రి 10గంటల సమయంలో జల్లికట్టు ఉద్యమానికి ప్రాతినిధ్యం వహించిన నిర్వాహకులు చేసిన ప్రకటన తీవ్ర గందరగోళానికి దారితీసింది. ఈ నిర్వాహకులు చెన్నై ప్రెస్‌క్లబ్ వేదికగా ఈ ప్రకటన చేయడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వెనకేసుకొచ్చే రీతిలో ఉండడం గమనార్హం. అదే సమయంలో వీరి చర్యలను తప్పుబట్టేవారు తెరమీదకు వస్తున్నారు. దీంతో జల్లికట్టు ఉద్యమం సోమవారం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచిచూడాల్సిందే. కొందరు విద్యార్థులయితే ఉద్యమాన్ని ముందుకు తీసుకెళతామని మెరీనాతీరంలో బైఠాయించారు. -
జల్లికట్టుకు బ్రేక్.. ఆపింది తమిళ తంబీలే
-
జల్లికట్టుకు బ్రేక్.. ఆపింది తమిళ తంబీలే
చెన్నై: తమిళుల సంప్రదాయ క్రీడ జల్లికట్టుకు మళ్లీ బ్రేక్ పడింది. మూడేళ్ల నిషేధపు కట్టు తెంచుకొని పూర్వవైభవంతో సందడి మొదలవుతుందనుకున్న వేళ మరోసారి అంతరాయం ఏర్పడింది. అయితే, ఈసారి అడ్డుకుంది మాత్రం తమిళ తంబీలే. జల్లికట్టు తమిళుల సంప్రదాయ క్రీడ అనే విషయం తెలిసిందే. మూగజీవాలను ఈ ఆట పేరుతో వేధిస్తున్నారని పెటా కోర్టుకు ఇంకొన్ని స్వచ్ఛంద సంస్థలు కోర్టుకు వెళ్లడంతో గత మూడేళ్లుగా ఈ క్రీడపై నిషేధం కొనసాగుతోంది. దీంతో ఈసారి తమిళులలంతా ఒక్కటై తమ సంప్రదాయ క్రీడకు అడ్డుచెప్పొద్దని నినదిస్తూ గత నాలుగు రోజులుగా రాష్ట్రమంతటా ఆందోళనలు చేస్తున్నారు. దీనికి అనూహ్య మద్దతులభించడంతోపాటు ఆందోళన ఉదృతం అయింది. ఈ నేపథ్యంలో ఈ ఆట నిర్వహణకు ఉన్న అడ్డంకులు తొలగిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురాగా దానిని గవర్నర్ విద్యాసాగర్ శనివారం ఆమోదించారు. జల్లికట్టు కోసం ప్రజలు భారీ ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఆర్డినెన్స్ సరైన చర్యేనని, నిరసనకారులు ఇక ఇళ్లకు వెళ్లాలని ఆయన కోరినట్లు రాజ్‌భవన్ తెలిపింది. ఆర్డినెన్స్ రాకతో ఆదివారం రాష్ట్రంలో జల్లికట్టు అట్టహాసంగా తిరిగి ప్రారంభమైంది. ఆటకు ప్రసిద్ధిగాంచిన మదురైజిల్లా అలంగానల్లూరులో సీఎం పన్నీర్ సెల్వం ఉదయం జెండా ఊపి క్రీడను ప్రారంభించేందుకు రాగా జల్లికట్టుపై శాశ్వత పరిష్కారం వచ్చే వరకు క్రీడను ప్రారంభించవద్దంటూ నిరసన వ్యక్తం చేశారు. కొంతమంది విద్యార్థులు తీవ్రంగా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఈ క్రీడను ప్రారంభించకుండానే ముఖ్యమంత్రి సెల్వం అలంగానల్లూరు నుంచి వెనుదిరిగారు. విద్యార్థులతో ఆయన మధ్యాహ్నం భేటీ అవనున్నారు. మరోపక్క, మంత్రులు కూడా ఉదయం 11గంటల ప్రాంతంలో తమ జిల్లాలో ఈ క్రీడను ప్రారంభించాల్సి ఉండగా అక్కడ కూడా నిలిచిపోయాయి. -
లంఘించిన బసవన్నలు.. జల్లికట్టూ షురూ
-
కట్టు తెంచుకున్న జల్లికట్టు
-
కట్టు తెంచుకున్న జల్లికట్టు
• తమిళనాడు ఆర్డినెన్స్‌కు గవర్నర్ విద్యాసాగర్‌రావు ఆమోదం • నేడు ఆటను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం • సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలంటున్న నిరసనకారులు • అప్పటి వరకు మెరీనా బీచ్ నుంచి కదలబోమని స్పష్టీకరణ సాక్షి ప్రతినిధి, చెన్నై/న్యూఢిల్లీ: తమిళుల సంప్రదాయ క్రీడ జల్లికట్టు మూడేళ్ల నిషేధపు కట్లు తెంచుకుని తిరిగి పూర్వవైభవంతో సందడి చేయనుంది. ఆట నిర్వహణకు అడ్డంకులు తొలగిస్తూ తమిళనాడు ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ను గవర్నర్ విద్యాసాగర్ శనివారం ఆమోదించారు. జల్లికట్టు కోసం ప్రజలు భారీ ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఆర్డినెన్స్ సరైన చర్యేనని, నిరసనకారులు ఇక ఇళ్లకు వెళ్లాలని ఆయన కోరినట్లు రాజ్‌భవన్ తెలిపింది. ఆర్డినెన్స్ రాకతో ఆదివారం రాష్ట్రంలో జల్లికట్టు అట్టహాసంగా తిరిగి ప్రారంభం కానుంది. ఆటకు ప్రసిద్ధిగాంచిన మదురైజిల్లా అలంగానల్లూరులో సీఎం పన్నీర్ సెల్వం ఉదయం జెండా ఊపి క్రీడను ప్రారంభిస్తారు. ఆట కోసం 350 ఎద్దులను సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ చెప్పారు. జల్లికట్టు కోసం అన్ని వర్గాల ప్రజలు ఉద్యమించడం, బంద్‌తో రాష్ట్రం స్తంభించడంతో.. తమిళనాడు ప్రభుత్వ ముసాయిదా ఆర్డినెన్స్‌ను కేంద్రం శుక్రవారం ఆమోదించడం తెలిసిందే. మెరీనా బీచ్‌లో నిరసనలో ప్లకార్డు చేతపట్టుకున్న చిన్నారి జంతుహింస నిరోధక చట్టం–1960లోని ప్రదర్శన జంతువుల(పెర్ఫామింగ్ యానిమల్స్) జాబితా నుంచి ఎద్దులను తొలగించేందుకు సవరణ కోసం ఈ ఆర్డినెన్స్ తెచ్చారు. దీనికి రాష్ట్రపతి తెలిపిన ఆమోదం శుక్రవారం రాత్రి తమకు చేరిందని, ఆటపై నిషేధం తొలగినట్లేనని సీఎం తెలిపారు. జల్లికట్టు నిర్వహణకు ఆర్డినెన్స్ శాశ్వత పరిష్కారమని, దీని స్థానంలో బిల్లును, జంతుహింస నిరోధక చట్టానికి సవరణను అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెడతామన్నారు. ఆట విషయంలో మద్దతిచ్చిన ప్రధాని మోదీకి రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాశారు. ఫోన్లోనూ కృతజ్ఞతలు తెలిపారు. ఆగని నిరసనలు ఆర్డినెన్స్‌పై జల్లికట్టు మద్దతుదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. శాశ్వత పరిష్కారం కావాలని, అంతవరకు పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. చెన్నై మెరీనా బీచ్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. శాశ్వత పరిష్కారం లభించేంతవరకు బీచ్ నుంచి కదలబోమని అక్కడున్న 2 లక్షల మంది ఉద్యమకారులు చెప్పారు. జల్లికట్టుకు మద్దతుగా వళ్లువర్‌కోట్టంలో డీఎంకే నేత ఎంకే స్టాలిన్ నిరాహార దీక్ష చేశారు. అన్ని యత్నాలూ చేస్తున్నాం: మోదీ తమిళ ప్రజల సాంస్కృతిక ఆకాంక్షలను నెరవేర్చేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని ప్రధాని మోదీ శనివారం ట్వీట్ చేశారు. సుసంప్ననమైన తమిళనాడు సంస్కృతిని చూసి గర్వపడుతున్నామని, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. పెటాకు సూర్య నోటీసులు జల్లికట్టుకు తాను మద్ధతు ఇవ్వడంపై జంతు సంరక్షణ సంస్థ (పెటా) నిర్వాహకులు చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు సూర్య స్పందించారు. జల్లికట్టు పోరాటానికి సూర్య వంత పాడటం ఆశ్చర్యంగా ఉందని, తన సినిమా ప్రచారానికి దీన్ని వాడుకుంటున్నారని సంస్థ నిర్వాహకులు విమర్శించారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన సూర్య తన న్యాయవాది ద్వారా ఆ సంస్థకు నోటీసులు పంపారు. -
తమిళనాడులో జల్లికట్టు ఆందోళనలు
తక్షణ ఆర్డినెన్స్‌కు స్టాలిన్ డిమాండ్ సాక్షి ప్రతినిధి, చెన్నై: జల్లికట్టుపై నిషేధాన్ని ఉల్లంఘిస్తూ మదురై సమీపంలోని ఓ గ్రామంలో శుక్రవారం జల్లికట్టు నిర్వహించారు. జల్టికట్టు కోసం చేస్తున్న నిరసన ప్రదర్శనల్లో భాగంగా కొందరు యువకులు ఐదు ఎద్దుల్ని మైదానంలోకి వదిలారని స్థానిక పోలీసులు చెప్పారు. జల్లికట్టుపై నిషేధం ఎత్తేయాలంటూ చెన్నైలో జరిగిన ఆందోళనలో డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానిపై స్టాలిన్ ధ్వజమెత్తింది. సినీ నటులు, ఇతరులను కలిసేందుకు ఆయనకు సమయం ఉంటుంది కానీ ఏఐఏడీఎంకే ఎంపీలకు మాత్రం సమయం కేటాయించలేదని స్టాలిన్ విమర్శించారు. జల్లికట్టు నిర్వహణకు వీలుగా కేంద్రం ఆర్డినెన్సు జారీ చేయాలని డిమాండ్ చేశారు. -
ఇప్పటికైనా ఆలోచిస్తారా?
సామాన్యులకు రంగుల ప్రపంచాన్ని వాగ్దానం చేసి, ఆశల్ని కల్పించి అందల మెక్కుతున్నవారు క్రియకొచ్చేసరికి వారిని దగా చేస్తున్న దాఖలాలు దేశంలో చాలాచోట్ల కనిపిస్తున్నాయి. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు అధికారంలోకొచ్చి ఆర్నెల్లు దాటకుండానే 2013 నాటి భూసేకరణ చట్టం పీకనొక్కుతూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. అది మురిగిపోయిన ప్రతిసారీ ప్రాణప్రతిష్ట చేస్తూ మూడుసార్లు సరికొత్త ఆర్డినెన్స్‌లు పుట్టించింది. చివరకు బిహార్ ఎన్నికలు ముంగిట్లోకొచ్చాక, ప్రజానీకంనుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యాక అయిష్టంగానే ఆ వ్యవహారానికి స్వస్తి చెప్పింది. ఆ చట్టం సరిగా లేదనుకుంటే రాష్ట్రాలే మార్పులు చేసుకోవచ్చు నంటూ 2015 జూలైలో జరిగిన నీతిఆయోగ్ పాలక మండలి సమావేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చెప్పాక చాలా రాష్ట్రాలు ఆ పనిలోబడ్డాయి. ఇందులో ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు గుజరాత్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లు అందరి కన్నా ముందున్నాయి. ఉమ్మడి హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వుల ద్వారా నిలుపుదల చేసిన జీవో 123 అలా పుట్టుకొచ్చిందే. తెలంగాణ సర్కారు 2015 జూలైలో తీసుకొచ్చిన ఈ జీవో అయినా... ఈమధ్యే శాసనసభ ఆమోదం పొందిన తెలంగాణ రాష్ట్ర భూసేకరణ (సవరణ) బిల్లు–2016 అయినా మురిగిపోయిన కేంద్ర ఆర్డినెన్స్‌కు దగ్గరవే. ఇలాంటి బిల్లునే గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదింపజేసుకుని మొన్న ఆగస్టులో చట్టంగా మార్చుకుంది. అటు ఆంధ్రప్రదేశ్ సర్కారు మాయ చేయడంలో అందరినీ మించిపోయింది. భూసమీ కరణ పేరుతో రైతులు స్వచ్ఛందంగా భూములిస్తున్నట్టు ప్రచారం చేసుకుని ఇప్పటికే 34,000 ఎకరాలు తన ఖాతాలో వేసుకుంది. రానున్న కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మరో పది లక్షల ఎకరాల భూమిని ఒడిసి పట్టి ‘ల్యాండ్ బ్యాంక్’ను ఏర్పాటు చేయాలన్న కృతనిశ్చయంతో ఉంది. ఈ తంతు ఎలా సాగబోతున్నదో అమరావతి ప్రాంత రైతుల దీనావస్థను చూసినా... తూర్పుగోదావరి జిల్లాలో దివీస్ సంస్థ కోసం 500 ఎకరాలు స్వాధీనం చేసుకునేందుకు జారీ చేసిన జీవోను గమనించినా, పశ్చిమగోదావరిలో గోదావరి ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణాన్ని వ్యతిరే కిస్తున్న పల్లెలపై అమలవుతున్న నిర్బంధాన్ని చూసినా అర్ధమవుతుంది. ప్రజా ప్రయోజనం పేరిట ఈ దేశ పౌరులపై దాదాపు ఏడు దశాబ్దాలుగా స్వారీ చేసిన 1894 నాటి భూసేకరణ చట్టం కోట్లాదిమందిని నిర్వాసితులుగా మార్చింది. ఒకసారి ప్రభుత్వం దేనికైనా ‘ప్రజా ప్రయోజనం’ ముద్రేస్తే ఆ ముసు గులో విలువైన పంట భూముల్ని, జనపదాల్ని, అరణ్యాలను, కొండప్రాంతాలను స్వాధీనం చేసుకోవడానికి ఆ చట్టం లైసెన్స్నిచ్చేది. పర్యవసానంగా ఆయా ప్రాంతాల వనరులను వినియోగించుకునే, వాటి ఆధారంగా ఉపాధి పొందే లక్ష లాదిమంది జీవితాలు అల్లకల్లోలమయ్యాయి. ఇందులో అధిక శాతంమంది ఆది వాసీలు, దళితులు, నిరుపేద గ్రామీణులు, బక్క రైతులే. తమ చర్యల కారణంగా సర్వస్వం కోల్పోతున్నవారిని ఆదుకోవాలన్న స్పృహ కూడా ప్రభుత్వాలకు లేక పోయింది. ఒక అంచనా ప్రకారం స్వాతంత్య్రానంతరం ఆ చట్టం వల్ల నిర్వాసి తులైనవారి సంఖ్య 6 కోట్లపైమాటే! వారిలో కనీసం 20 శాతంమందికి కూడా ఇప్పటివరకూ పునరావాసం దక్కలేదు. అంతక్రితం మాటేమోగానీ నర్మదా బచావో, పోస్కో ఉద్యమాలు ఈ నిలువుదోపిడీని నిలదీశాయి. నేలతల్లితో తమ పేగుబంధాన్ని తెంచుతున్న దుష్ట పోకడలపై సింగూరు, నందిగ్రామ్, భట్టాపర్సాల్ వంటి చోట్ల బడుగు జీవులు, బక్క రైతులు తిరగబడ్డారు. తమ ప్రాణాలొడ్డి ప్రతిఘ టించారు. ఈ పరిణామాలన్నిటి తర్వాత ఆ చట్టం మార్చాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. అయినా ఆరేళ్ల సుదీర్ఘ జాప్యం తర్వాత 2013లోగానీ కొత్త భూసేకరణ చట్టం అమల్లోకి రాలేదు. ఈ చరిత్రంతా గమనిస్తే 2013 చట్టం పాలకుల భిక్ష కాదని, అది అసహా యులైన ప్రజానీకం సుదీర్ఘకాలం పోరాడి సాధించుకున్న హక్కని అర్ధమవుతుంది. నిజానికి యూపీఏ ప్రభుత్వం ఈ చట్టంపై మొదట్లో తానిచ్చిన హామీల నుంచి వెనక్కు తగ్గింది. బిల్లు రూపకల్పన దశలో ఉన్న కొన్ని మంచి అంశాలు పార్లమెం టులో ప్రతిపాదించేనాటికి మాయమయ్యాయి. మరికొన్ని నీరుగారాయి. పరిశ్రమ ఏర్పాటయ్యే ప్రాంతంలోని ప్రజల్లో 80 శాతంమంది ఆమోదిస్తేనే భూసేకరణ ఉంటుందన్న నిబంధన కాస్తా భూమిని కోల్పోయేవారిలో 80 శాతంమంది ఆమోదం సరిపోతుందని మారింది. ఒక పరిశ్రమ ఏర్పాటైనప్పుడు నేరుగా నష్టపో యేది భూ యజమానులే అయినా ఆ ప్రాంతంలో నివసించేవారు, అక్కడ జీవించే వారి పరిస్థితేమిటన్నది 2013 చట్టం పట్టించుకోలేదు. ఇక ప్రభుత్వం 5 కేటగిరీల కింద, ‘ఇతర ప్రజా ప్రయోజనాల’కింద స్వాధీనం చేసుకుంటే ఇవేమీ వర్తించవు. ఆ చట్టమే పూర్తిస్థాయిలో సంతృప్తికరంగా లేదనుకుంటుంటే...దాని స్థానంలో వివిధ రాష్ట్రాలు తీసుకొచ్చిన చట్టాలైనా, బిల్లులైనా అందులోని మంచి అంశాలను సైతం మింగేస్తున్నాయి. సామాజిక ప్రభావ మదింపు (ఎస్ఐఏ), రెండు లేదా అంతకుమించి పంటలు పండే భూముల సేకరణపై ఉన్న ఆంక్షలను బేఖాతరు చేస్తున్నాయి. గుజరాత్ చట్టం చూసినా, తెలంగాణ సర్కారు తీసుకొచ్చిన బిల్లు చూసినా వాటి మూలాలు ఎన్డీఏ సర్కారు తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌లో కనబడ తాయి. గుజరాత్ తెచ్చిందని, కర్ణాటక తీసుకురాబోతున్నదని వాదిస్తూ తమ చర్యకు సహేతుకత కోసం సాగునీటి మంత్రి హరీశ్‌రావు చేస్తున్న ప్రయత్నాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. అలా చెప్పి ఆయా పార్టీల వారిని నోరుమూయించ వచ్చునే మోగానీ జనం నోళ్లెలా మూయిస్తారు? అలా వాదించడానికి ముందు ఈ మాదిరి అంశాలే ఉన్న కేంద్ర ఆర్డినెన్స్‌పై దేశవ్యాప్తంగా నిరసనలు ఎందుకు వ్యక్తమ య్యాయో, చివరికది చట్టంగా ఎందుకు రూపుదిద్దుకోలేదో తెలుసుకుంటే మంచిది. ఉమ్మడి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో చెప్పిన అంశాలను గమనించాకైనా తెలంగాణ ప్రభుత్వం తన చర్యలను పునఃసమీక్షించుకోవాలి. రైతులు, కూలీలు, గ్రామీణ ప్రజానీకం చేస్తున్న ఆందోళనలను సానుభూతితో అర్ధం చేసుకోవాలి. -
రెండోసారి ఆర్డినెన్స్ అన్యాయం
సుప్రీం కోర్టు మండిపాటు న్యూఢిల్లీ: ఒక ఆర్డినెన్స్‌ను తిరిగి ప్రకటించడం రాజ్యాంగాన్ని దగా చేయడం, ప్రజాస్వామిక శాసస ప్రక్రియను నాశనం చేయడమేనని సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఆర్డినెన్స్ ప్రకటనకు రాష్ట్రపతి లేదా గవర్నర్ తెలిపే సంతృప్తికి న్యాయసమీక్ష నుంచి రక్షణ లేదని స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల బెంచ్ సోమవారం 6:1 మెజారిటీతో ఈ మేరకు తీర్పు చెప్పింది. ‘ఆర్డినెన్స్‌కు కూడా చట్టసభ చేసే చట్టానికి ఉన్నంత శక్తి ఉంటుంది. పార్లమెంటు లేదా రాష్ట్ర చట్టసభల ముందు ఆర్డినెన్స్‌ను ఉంచడం తప్పనిసరి. అలా చేయకపోవడం రాజ్యాంగ ఉల్లంఘన’ అని మెజారిటీ జడ్జీల తరఫున జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. బిహార్ సర్కార్ ఒక ఆర్డినెన్స్‌ను 4సార్లు ప్రకటించిన కేసును కోర్టు విచారిస్తోంది. -
పాత నోట్లు : జరిమానాకు రాష్ట్రపతి ఓకే
న్యూఢిల్లీ: మార్చి 31 తర్వాత రద్దయిన 500, 1000 రూపాయల నోట్లు భారీ ఎత్తున కలిగి ఉన్నవారిపై జరిమానా విధించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. రద్దయిన పెద్ద నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవడానికి డిసెంబర్ 30 శుక్రవారం నాటితో ముగిసింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రిమండలి సమావేశం ఈ ఆర్డినెన్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రద్దయిన నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవడానికి గడువు ముగియడం, శీతాకాల విడిది కోసం గత పది రోజులుగా హైదరాబాద్ లో విడిది చేసిన రాష్ట్రపతి శుక్రవారం సాయంత్రం తిరిగి ఢిల్లీ చేరుకోవడం, ఆ వెంటనే కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు ఆయన ఆమోదం తెలపడం వెనువెంటనే జరిగిపోయాయి. తాజా ఆర్డినెన్స్ ప్రకారం రద్దయిన రూ.500, రూ.1,000 నోట్లు రూ.పది వేలు లేదా అంతకంటే ఎక్కువ కలిగి ఉన్నా.. వాటిని బదిలీ చేసినా.. స్వీకరించినా జరిమానా విధించనున్నారు. ఒక వ్యక్తి వద్ద గరిష్టంగా పది రద్దయిన నోట్లను మాత్రమే అనుమతిస్తారు. (చదవండి : పాత నోట్లుంటే ఇక జైలుశిక్షే!) గత నవంబర్ 8 నుంచి పెద్ద నోట్లను రద్దు చేయగా, అప్పటి నుంచి వాటిని డిపాజిట్ చేసే గడువు పూర్తయ్యే వరకు విదేశాల్లో ఉండిపోయిన వారికి మాత్రం మరో అవకాశం కల్పించారు. అలాంటి వాళ్లు వచ్చే మార్చి 31 వరకు తమ పాత నోట్లను డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పించారు. అయితే విదేశాల్లో ఉన్న భారతీయ కరెన్సీ తెచ్చుకోవాలంటే అందుకు ప్రభుత్వం కొన్ని నిబంధనలను కూడా విధించింది. ఒక్కో వ్యక్తి 25 వేల రూపాయలకు మించి తెచ్చుకోవడానికి వీలులేదు. పైగా ఎయిర్ పోర్టుల్లో వాటిని విధిగా డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఎవరైనా తప్పుగా నమోదు చేస్తే మాత్రం 50 వేల రూపాయల జరిమానా లేదా దానికి అయిదింతల మేరకు జరిమానా ఉంటుంది. నేపాల్, భూటాన్ దేశాల నుంచి తీసుకురావాలనుకుంటే వారికి ఫెమా చట్టం పరిధికి లోబడి మాత్రమే అనుమతిస్తారు. -
పాత నోట్లుంటే జైలే!
‘ఆర్డినెన్స్’కు కేంద్ర కేబినెట్ ఆమోదం ♦ పెద్ద మొత్తంలో పాత నోట్లు కలిగి ఉంటే నాలుగేళ్ల జైలు? ♦ పదికి మించి పాత నోట్లు ఉంటే రూ.పది వేలు లేదా దొరికిన మొత్తానికి ఐదింతలు.. ఏది ఎక్కువైతే అది జరిమానా ♦ జనవరి 1–మార్చి 31 తేదీల మధ్య తప్పుడుసమాచారంతో నగదు డిపాజిట్ చేస్తే రూ.5 వేలు లేదా ఆ డిపాజిట్ మొత్తానికి ఐదింతల జరిమానా ♦ రాష్ట్రపతి ఆమోదముద్ర తర్వాత అమలులోకి.. ఆ నోట్లుంటే నేరం.. మార్చి 31 తర్వాత రద్దయిన పాత నోట్లు కలిగి ఉండడం క్రిమినల్ నేరం రద్దయిన రూ.500, రూ.1,000 నోట్లు రూ.పది వేలు అంతకంటే ఎక్కువ కలిగి ఉన్నా.. వాటిని బదిలీ చేసినా.. స్వీకరించినా శిక్షార్హం. ఒక వ్యక్తి వద్ద గరిష్టంగా పది రద్దయిన నోట్లకే అనుమతి జరిమానా.. ఈ నేరానికి పాల్పడిన వారికి రూ.10 వేలు లేదా దొరికిన మొత్తానికి ఐదింతలు ఏది ఎక్కువైతే అది జరిమానాగా విధిస్తారు. జైలు శిక్ష కూడా.. మార్చి 31 తర్వాత రద్దయిన పెద్ద నోట్లను పెద్ద మొత్తంలో కలిగి ఉన్న వారికి నాలుగేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం? జనవరి 1 – మార్చి 31 వరకు పాత నోట్లను డిపాజిట్ చేసే సమయంలో తప్పుడు సమాచారాన్ని సమర్పించిన వారికి రూ.5 వేలు లేదా సదరు మొత్తానికి ఐదు రెట్లు జరిమానా నోట్ల డిపాజిట్ల లెక్క రూ.15.4 లక్షల కోట్ల రద్దు చేసిన నోట్లలో ఇప్పటి వరకు బ్యాంకులు, పోస్టాఫీసులకు చేరింది.. రూ. 14 లక్షల కోట్లు న్యూఢిల్లీ: పాత రూ.500, రూ.1,000 నోట్లను డిపాజిట్ చేసేందుకు మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్ల రద్దు ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. మార్చి 31 తర్వాత రద్దయిన నోట్లు కలిగి ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు రూపొందించిన ఈ ఆర్డినెన్స్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశమైంది. రద్దయిన రూ.500, రూ.1,000 నోట్లు రూ.పది వేలు అంతకంటే ఎక్కువ కలిగి ఉన్నా.. వాటిని బదిలీ చేసినా.. స్వీకరించినా శిక్ష విధించదగ్గ నేరంగా పరిగణిస్తారు. ఒక వ్యక్తి వద్ద గరిష్టంగా పది రద్దయిన నోట్లను మాత్రమే అనుమతిస్తారు. పెద్ద నోట్లు ఉంటే భారీగా జరిమానా.. మార్చి 31 తర్వాత రద్దయిన పాత రూ.500, రూ.1,000 నోట్లు పెద్ద మొత్తంలో కలిగి ఉండటాన్ని క్రిమినల్ నేరంగా పరిగణిస్తారు. ఈ నేరానికి పాల్పడిన వారికి రూ.10 వేలు లేదా దొరికిన మొత్తానికి ఐదింతలు ఏది ఎక్కువైతే అది జరిమానాగా విధిస్తారు. అలాగే జనవరి 1 నుంచి మార్చి 31 మధ్య పాత నోట్లను డిపాజిట్ చేసే సమయంలో తప్పుడు సమాచారాన్ని సమర్పించిన వారికి రూ.5 వేలు లేదా సంబంధిత మొత్తానికి ఐదు రెట్లు జరిమానా విధిస్తారు. అయితే పెద్ద నోట్లను కలిగి ఉండటం నేరంగా పరిగణించడం డిసెంబర్ 30 తర్వాతా లేదా మార్చి 31 తర్వాతా అనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. పెద్దనోట్లను డిపాజిట్ చేసేందుకు డిసెంబర్ 30 వరకు గడువు విధించిన సంగతి తెలిసిందే. అలాగే కొన్ని నిర్దిష్ట రిజర్వ్‌బ్యాంకు కార్యాలయాల్లో నిర్దేశిత పత్రాలను సమర్పిం చి మార్చి 31 వరకు నగదు డిపాజిట్ చేసేం దుకు అవకాశం ఇచ్చిన విషయం విదితమే. విదేశాల్లో ఉన్న వారికి.. మారు మూల ప్రాంతాల్లో పనిచేసే భద్రతా బలగాల్లో పని చేసే వారికి.. సరైన కారణం చూపించే ఇతరు లకు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తోంది. నాలుగేళ్ల జైలు శిక్ష!: మార్చి 31 తర్వాత పెద్ద మొత్తంలో రద్దయిన పెద్ద నోట్లను కలిగి ఉన్న వారికి నాలుగేళ్ల జైలు శిక్ష విధించే ప్రతిపాదన కేబినెట్ ముందుకొచ్చిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే దీనికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసిందా? లేదా? అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. బ్యాంకులకు తిరిగి చేరని రద్దయిన నోట్లను రప్పించడానికి చట్టబద్ధమైన మద్దతును అందించేందుకు ఆర్బీఐ చట్టానికి సవరణలు చేయడానికి తాజా ఆర్డినెన్స్ ఉపకరించనుంది. అలాగే నోట్ల రద్దుకు సంబంధించి నవంబర్ 8న జారీ చేసిన నోటిఫికేషన్ సరిపోదని, ఆర్బీఐకి జవాబుదారీతనం కల్పించేందుకు.. భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులను తొలగించేందుకు ఈ ఆర్డినెన్స్ సహకరించనుంది. ఈ ఆర్డినెన్స్‌ను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతికి పంపనుంది. ఆయన ఆమోదం లభించిన తర్వాత ఇది అమలులోకి వస్తుంది. ఆర్డినెన్స్‌కు ఆమోదం లభించిన తర్వాత ఆరు నెలల కాలంలో పార్లమెంట్ దీనిని చట్టంగా ఆమోదించాల్సి ఉంటుంది. 1978లో అప్పటి మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని ప్రభుత్వం రూ.1,000, రూ.5,000/10,000 నోట్లను రద్దు చేసినప్పు డు కూడా ఇలాంటి ఆర్డినెన్స్‌నే తెచ్చారు. తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల్లో ‘ప్రధాన మంత్రి గ్రామీణ రోడ్ల పథకం’కింద రూ.11,724.53 కోట్ల వ్యయంతో 5,400 కి.మీ రోడ్లు, 126 చిన్న వంతెనల నిర్మాణానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ రోడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ వాటాగా రూ.7034.72 కోట్లను గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు ఆర్థిక శాఖ కేటాయిస్తుంది. రుణాల చెల్లింపునకు మరో 30 రోజుల గడువు ముంబై: పెద్ద నోట్ల ఉపసంహరణ నేపథ్యంలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారికి రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) మరికొంత వెసులుబాటు ఇచ్చింది. రుణాలు తిరిగి చెల్లించేం దుకు ఇప్పటికే 60 రోజుల అదనపు గడువు ఇచ్చిన ఆర్బీఐ తాజాగా దానిని మరో 30 రోజులు పొడిగించి 90 రోజులు చేసింది. రూ.కోటి లోపు విలువైన, నవంబరు 1 నుంచి డిసెంబరు 31 మధ్యన తిరిగి చెల్లించాల్సి ఉన్న పంట, గృహ, వాహన తదితర రుణాలకు ఇది వర్తిస్తుంది. నోట్ల రద్దు వల్ల అనేక మంది వ్యాపారులు, ప్రజలు తమకు రావాల్సిన నగదును పొందలేకపోయారు. బ్యాంకు ఉద్యోగులకు పని ఒత్తిడి పెరిగిపోవడంతో చెక్కులు, డిమాండ్ డ్రాఫ్ట్‌ల వంటి లావాదేవీలు కూడా పూర్తిస్థాయిలో జరగలేదు. దీంతో అదనపు గడువిచ్చారు. -
రద్దైన పాత నోట్లుంటే ఇక జైలుశిక్షే !
-
పాత నోట్లుంటే ఇక జైలుశిక్షే!
పాత నోట్లపై కేంద్రం కొత్త నిర్ణయం తీసుకుంది. 2017 మార్చి 31 తర్వాత పాత నోట్లను కలిగి ఉంటే నాలుగేళ్ల జైలు శిక్ష విధించేలా కేంద్రం కొత్త ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది.. ఈ మేరకు ఆర్డినెన్స్‌ను కేంద్రం నేడు జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదించింది. డిసెంబర్ 30 తర్వాత పాతనోట్లతో లావాదేవీలు జరిపినా రూ.5వేల వరకు జరిమానా విధించేలా ఈ ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం రూపొందించింది. దీంతో పాత నోట్లు కలిగి ఉన్నవారికి గట్టి హెచ్చరికలనే ప్రభుత్వం పంపినట్టు తెలిసింది. డిసెంబర్ 30 తర్వాత కూడా పాత నోట్లు రూ.500, రూ.1000 బ్యాంకుల్లో డిపాజిట్ చేయకుండా ఉంచుకున్నవారిపై లీగల్‌గా చర్యలు తీసుకునేలా ఈ ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం రూపొందించింది. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా చట్టాన్ని సవరించాలని భావించిన ప్రభుత్వం, గడువు ముగిసిన వెంటనే పార్లమెంట్ సమావేశాలు నిర్వర్తించలేకపోవడంతో ఈ ఆర్డినెన్స్ మార్గాన్ని ఎంచుకుంది. పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన ప్రధాని మోదీ, వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునేందుకు డిసెంబర్ 30వరకు గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. గడువు దగ్గరపడుతుండటంతో పాత నోట్లు కలిగి ఉన్నవారిపై చర్యలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. రద్దయిన నోట్లు కలిగి ఉన్నవారిపై జరిమానాలు విధించేందుకు ఆర్డినెన్స్‌ను తీసుకురావాలని అంతకముందే కేంద్రం నిర్ణయించినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ఈ మేరకు బుధవారం కేబినెట్ సమావేశమై, ఆర్డినెన్స్ ను ఆమోదించింది. -
10 వేల కంటే ఎక్కువ ఉంటే జరిమానా!