నేడు పార్లమెంట్ లో పోలవరం ఆర్డినెన్స్ బిల్లు!
న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించిన ఆర్డినెన్స్ బిల్లును కేంద్ర హోంశాఖామంత్రి రాజ్ నాథ్ సింగ్ సోమవారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. పోలవరం ప్రాజెక్టు రిజర్వాయర్ వల్ల ఖమ్మం జిల్లాలో మునిగిపోయే మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆర్డినెన్స్ ను మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.
పోలవరం ప్రాజెక్ట్ పై ఆర్డినెన్స్ ను ఎందుకు ప్రవేశపెట్టాల్సి వచ్చిందనే అంశాన్ని పార్లమెంట్ కు రాజ్‌నాథ్ వివరించనున్నారు. ముంపు మండలాలను కేంద్రప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుని ఆంధ్రాలో కలపడం అన్యాయమని తెలంగాణలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.