Rajnath Singh
-
పార్లమెంట్లో ఆసక్తికర పరిణామం.. రాజ్‌నాథ్‌తో రాహుల్ గాంధీ
ఢిల్లీ: పార్లమెంట్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సభ వెలుపల కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేతికి కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ గులాబీ పూలు, జాతీయ పతకాన్ని అందించారు. ఆ ఘటన సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అదానీ అంశం ఉభయ సభల్ని కుదిపేస్తుంది. అదానీపై అమెరికా చేసిన ఆరోపణలపై సభలో చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఉభయ సభల్లో ఆందోళనలను కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో బుధవారం సమావేశాలకు హాజరయ్యేందుకు పార్లమెంట్‌కు వస్తున్న రాజ్‌నాథ్ సింగ్‌కు కూటమి నేతలు గులాబీ పూలు, జాతీయ జెండాలు చేతికి ఇచ్చి తమ నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో రాహుల్ రాహుల్ స్వయంగా వెళ్లి ఇవ్వడంతో వాటిని రాజ్‌నాథ్ స్వీకరించారు.#WATCH | Delhi | In a unique protest in Parliament premises, Congress MP and LoP Lok Sabha, Rahul Gandhi gives a Rose flower and Tiranga to Defence Minister Rajnath Singh pic.twitter.com/9GlGIvh3Yz— ANI (@ANI) December 11, 2024 నవంబర్ 20న నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభల ప్రారంభం నుంచి ఏదో ఒక సమస్యపై నిరంతరం వాయిదా పడుతూనే ఉన్నాయి. అదానీ సమస్యపై చర్చ జరగాలని కాంగ్రెస్ డిమాండ్ చేయగా, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి,. జార్జ్ సోరోస్ ఫౌండేషన్ ఫండింగ్ చేసే ఒక సంస్థతో సంబంధాలు ఉన్నాయని బీజేపీ ఆరోపించింది. దీనిపై చర్చ జరపాలని పట్టుబట్టింది. దీంతో ఉభయ సభల్లో వాయిదా పర్వం కొనసాగుతుంది.పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. నిన్న వాయిదా పడిన ఉభయ సభలు ఇవాళ తిరిగి ప్రారంభమయ్యాయి. లోక్‌సభ, రాజ్యసభ కార్యకలాపాలు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. అయితే సభ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే లోక్‌సభ, రాజ్యసభ వాయిదా పడ్డాయి. -
చైనాకు చెక్.. పుతిన్‌తో భారత్ భారీ ఒప్పందం
ఢిల్లీ: భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రష్యా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో రాజ్‌నాథ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, రక్షణ సహాకారంపై చర్చించారు. రష్యా స్నేహితులకు భారత్ అన్నివేళలా అండగా నిలుస్తుందని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో రష్యాతో భారత ప్రభుత్వం భారీ రక్షణ ఒప్పందం కుదుర్చుకుంది.రష్యా పర్యటనలో రాజ్‌నాథ్ సింగ్ కీలక ఒప్పందంపై చర్చించారు. రాడార్ వ్యవస్థకు సంబంధించిన భారీ రక్షణ ఒప్పందాన్ని రష్యాతో భారత్ కుదుర్చుకుంది. సుమారు నాలుగు బిలియన్ డాలర్ల ఖరీదైన ఒప్పందం తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. లాంగ్ రేంజ్ వార్నింగ్ రాడార్ వ్యవస్థ వోరోనెజ్ రాడార్(Radar Voronezh)ను రష్యా నుంచి భారత్ కొనుగోలు చేయనున్నది. ఆ ఒప్పందానికి చెందిన సంప్రదింపులు తుది దశలో ఉన్నట్లు భారత ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.దేశ రక్షణ విషయంలో కేంద్రం టెక్నాలజీని పెంచే ఉద్దేశంతో ముందడుగు వేసింది. మిస్సైల్ బెదిరింపుల్ని గుర్తించి, ట్రాక్ చేసేందుకు సామర్థ్యాన్ని పెంచుకోవాలని భారత్ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే రాడార్ వ్యవస్థ కొత్త టెక్నాలజీపై ఫోకస్ పెట్టింది. అయితే, అల్మాజ్-ఆంటే కార్పొరేషన్ కంపెనీ వోరోనేజ్ రేడార్లను ఉత్పత్తి చేస్తున్నది. ఏరోస్పేస్ ఎక్విప్మెంట్, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిస్సైల్ సిస్టమ్స్, రేడార్ల ఉత్పత్తిలో ఆ సంస్థ అగ్రస్థానంలో ఉన్నది.Russia is talks to sell gigantic radar to india.Almaz-Antey’s Voronezh radar detects missiles, aircraft, and threats up to 6,000–8,000 km, supporting Russia’s missile defence network. pic.twitter.com/AmCWaX01Rs— Abhimanyu Manjhi (@AbhimanyuManjh5) December 10, 2024ఈ నేపథ్యంలోనే సుదీర్ఘ దూరం నుంచి క్షిపణుల కదలికల్ని రాడార్లతో పసికట్టేందుకు ఈ కొనుగోలు చేపట్టనున్నారు. అధునాతన రాడార్ వ్యవస్థ చైనా, దక్షిణ, మధ్య ఆసియా, హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఎక్కడి నుంచి అయినా ముప్పును గుర్తించగలదు. దాదాపు 8 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలిస్టిక్ క్షిపణులు, విమానాలను వోరోనేజ్ రాడార్ వ్యవస్థ గుర్తిస్తుందని అధికారులు అంటున్నారు. కొన్ని దేశాల వద్దే ఉన్న ఇలాంటి టెక్నాలజీని ఇప్పుడు భారత్ కూడా సొంతం చేసుకోనున్నట్లు రష్యా చెబుతోంది.ఇక, ఇటీవల అల్మేజ్-ఆంటే బృందం భారత్‌లో పర్యటించింది. మేకిన్ ఇండియాలో భాగంగా సుమారు 60 శాతం రాడార్ వ్యవస్థను భారతీయ కంపెనీల ఉత్పత్తులతోనే నిర్మించనున్నారు. కర్నాటకలోని చిత్రదుర్గలో దీన్ని ఇన్స్టాల్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇక్కడ అడ్వాన్స్డ్ డిఫెన్స్ , ఏరోస్పేస్ సౌకర్యాలు ఉన్నాయి. -
బాపూఘాట్ అభివృద్ధికి.. 222.27 ఎకరాలు ఇవ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో బాపూఘాట్ అభివృద్ధి కోసం ఆ ప్రాంతంలో ఉన్న 222.27 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ మంగళవారం సాయంత్రం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ను కలిశారు. మహాత్మాగాంధీ చితాభస్మాన్ని కలిపిన ఈసా, మూసీ నదుల సంగమ స్థలంలో ఏర్పాటు చేయనున్న బాపూఘాట్‌ను ప్రపంచ స్థాయిలో గాంధీ తాతి్వకతను చాటే కేంద్రంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. బాపూఘాట్ వద్ద గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసే నాలెడ్జ్ హబ్, మెడిటేషన్ విలేజ్, చేనేత ప్రచార కేంద్రం, ప్రజావినోద స్థలాలు, ల్యాండ్ స్కేప్ ఘాట్లు, శాంతి విగ్రహం (స్టాట్యూ ఆఫ్ పీస్), మ్యూజియంలతో గాంధీ సరోవర్ ప్రాజెక్టును చేపట్టనున్నామని కేంద్ర మంత్రికి తెలిపారు. ఇందుకోసం రక్షణ శాఖ భూమిని బదిలీ చేయాలని కోరారు. కొత్త విమానాశ్రయాలకు అనుమతివ్వండి తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధి, ప్రజలకు రవాణా వసతులను మెరుగుపర్చడంలో భాగంగా కొత్త విమానాశ్రయాలకు అనుమతి ఇవ్వాలని పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడుకు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిశారు. తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్‌లో విమానాశ్రయ ఏర్పాటుకు అవసరమైన ఎన్వోసీని రాష్ట్ర ప్రభుత్వం జీఎంఆర్ నుంచి పొందిందని వివరించారు. 253 ఎకరాల భూసేకరణకు అవసరమైన రూ.205 కోట్లను భారత విమానయాన సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం అందజేసిందని..ఈ మేరకు విమానాశ్రయ పనులకు, విమానాలు నడిపేందుకు అవసరమైన అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరారు. ఇక కొత్తగూడెం జిల్లా పాల్వంచ, పెద్దపల్లి జిల్లా అంతర్గాం, ఆదిలాబాద్‌లలోనూ విమానాశ్రయాలను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రులతో భేటీల్లో సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్, ఎంపీలు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, రఘువీర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్, ఆర్.రఘురామిరెడ్డి, కడియం కావ్య తదితరులు ఉన్నారు. -
హైపర్ సోనిక్ పరీక్ష సక్సెస్
న్యూఢిల్లీ: భారత సైనిక దళాల్లో మరో కీలక అస్త్రం చేరింది. ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం దీవిలో దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్షిపణిని విజయంతంగా పరీక్షించారు. గగనతల రక్షణ వ్యవస్థలకు చిక్కకుండా అత్యధిక వేగంతో దూసుకెళ్లి, శత్రువుల స్థావరాలను ధ్వంసం చేయడం ఈ క్షిపణి ప్రత్యేకత. ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా మిస్సైల్ కలిగి ఉన్న అతికొద్ది దేశాల జాబితాలో భారత్ చేరింది.ఈ పరీక్షను చరిత్రాత్మక ఘట్టంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభివర్ణించారు. క్రిటికల్, అడ్వాన్స్డ్ మిలటకీ టెక్నాలజీ కలిగిన దేశాల సరసన చేరామంటూ ßæర్షం వ్యక్తంచేశారు. అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుకునే విషయంలో కీలక మైలురాయిని అధిగమించామని పేర్కొంటూ ఆయన ‘ఎక్స్’లో పోస్టుచేశారు. అద్భుతమైన ఘనత సాధించామని ఉద్ఘాటించారు. డీఆర్డీఓతోపాటు సైనిక దళాలకు ఆయన అభినందనలు తెలియజేశారు.ప్రత్యేకతలేమిటి? ⇒ దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్షిపణిని హైదరాబాద్‌లోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్‌లో దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ)తోపాటు పలు ప్రభుత్వం, ప్రైవేట్ రంగ సంస్థలు సహకారం అందించాయి. ఇది వివిధ రకాల పేలోడ్స్‌ను 1,500 కిలోమీటర్లకు పైగా దూరానికి మోసుకెళ్లగలదు. ప్రయాణం మధ్యలో దిశను మార్చుకోగలదు. ⇒ సాధారణంగా హైపర్‌సానిక్ మిస్సైల్స్ పేలుడు పదార్థాలు లేదా అణు వార్హెడ్లను మోసుకెళ్తాయి. ధ్వని వేగం కంటే ఐదు రెట్లు అధిక వేగంతో దూసుకెళ్తాయి. అంటే గంటకు 1,220 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ⇒ కొన్ని అడ్వాన్స్డ్ హైపర్సోనిక్ మిస్సైల్స్ ధ్వని వేగం కంటే 15 రెట్లు వేగంతో ప్రయాణిస్తాయి. ⇒ ప్రస్తుతం రష్యా, చైనా దేశాలు హైపర్సోనిక్ క్షిపణుల అభివృద్ధిలో ముందంజలో ఉన్నాయి. ఫ్రా న్స్, జర్మనీ, ఆ్రస్టేలియా, జపాన్, ఇరాన్, ఇజ్రా యెల్ తదితర దేశాలు సైతం ఈ తరహా క్షిప ణుల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. ⇒ చెనా సరిహద్దుల్లో తరచూ ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో అత్యాధునిక సైనిక శక్తిని బలోపేతం చేసుకోవాలని ఇండియా నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా మొట్టమొదటి దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్షిపణిని పరీక్షించింది. ⇒ తదుపరి తరం ఆయుధ వ్యవస్థలు, డ్రోన్లు, కృత్రిమ మేధ(ఏఐ)తో పని చేసే ఆయుధాలు, పరికరాల అభివృద్ధికి భారత్ ప్రాధాన్యం ఇస్తోంది. ⇒ పృథీ్వ, ఆకాశ్, అగ్ని తదితర క్షిపణులను డీఆర్డీఓ గతంలో అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. -
జార్ఖండ్‌లో కూటమి పార్టీలు ఆరిపోయిన టపాసులు: కేంద్ర మంత్రి
రాంచీ: జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) నేతృత్వంలోని హేమంత్ సోరెన్ ప్రభుత్వంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. జేఎంఎం నేతృత్వంలోని పార్టీలు ఆరిపోయిన టపాసులని, బీజేపీ.. రాష్ట్రాన్ని అభివృద్ధి శిఖరాలకు తీసుకెళ్లే శక్తివంతమైన రాకెట్ అని అభివర్ణించారు. ఆయన రాష్ట్ర రాజధాని రాంచీలోని హతియాలో మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు.‘‘రాష్ట్రంలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో స్పష్టంగా తెలుస్తోంది. దీపావళి పండుగ ఇప్పుడే ముగిసిపోయింది. జేఎంఎం, కాంగ్రెస్ , ఆర్జేడీ పార్టీలు ఇప్పుడు దీపావళి క్రాకర్స్‌తో కలిసిపోయాయి. కానీ, బీజేపీ మాత్రమే జార్ఖండ్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లే శక్తిమంతమైన రాకెట్. జేఎంఎం ఆదివాసీల రక్తాన్ని పీల్చుకుంది. వారి ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేస్తోంది. జార్ఖండ్‌కు చొరబాటుదారులు ఎందుకు వస్తున్నారని నేను హేమంత్ సోరెన్‌ను అడుగుతున్నా. రాష్ట్రంలోని గిరిజన జనాభా 28 శాతానికి ఎందుకు తగ్గిపోయింది?. బీజేపీకి రెండు పర్యాయాలు అవకాశం ఇవ్వండి. అభివృద్ధి చెందిన రాష్ట్రాల వరుసలో జార్ఖండ్ నిలబెడతాం. మేం జార్ఖండ్‌లో ప్రభుత్వాన్ని మార్చడమే కాకుండా వ్యవస్థను కూడా మారుస్తాం’’అని అన్నారు.మరోవైపు.. సోమవారం జార్ఖండ్‌లోని గర్వాలో ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ.. జేఎంఎం కూటమిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బంగ్లాదేశ్ చొరబాటుదారులకు మద్దతుగా ఉన్నందుకు జేఎంఎం నేతృత్వంలోని కూటమిని ‘చొరబాటుదారుల కూటమి’గా అభివర్ణించారు. ‘‘జార్ఖండ్‌లో బుజ్జగింపు రాజకీయాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం బంగ్లాదేశ్ చొరబాటుదారులకు మద్దతు ఇవ్వడంలో బిజీగా ఉంది. ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో గిరిజనుల సంఖ్య తగ్గిపోతుంది. ఇది గిరిజన సమాజానికి, దేశానికి పెనుముప్పు. ఈ సంకీర్ణ కూటమి.. చొరబాటుదారుల కూటమి’’ అని మోదీ అన్నారు. ఇక.. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి. ఫలితాలు నవంబర్ 23న వెల్లడికానున్నాయి. -
సైనికుల మధ్య రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీపావళి వేడుకలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. ఈ నేపధ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అస్సాంలోని తేజ్‌పూర్‌లో సైనికులతో కలిసి దీపావళి వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంబడి కొన్ని ప్రాంతాలలో వివాదాలను పరిష్కరించడానికి భారత్- చైనాలు దౌత్య, సైనిక చర్చలు జరుపుతున్నాయని అన్నారు.ఇరు దేశాల నిరంతర ప్రయత్నాల తర్వాత ఏకాభిప్రాయం కుదిరింది. సైనిక బలగాల క్రమశిక్షణ, ధైర్యం వల్లే ఈ విజయం సాధించాం. ఏకాభిప్రాయ ప్రాతిపదికన శాంతి పునరుద్ధరణ ప్రక్రియను కొనసాగిస్తామని అన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న సైనికుల దృఢమైన నిబద్ధత, అద్భుతమైన ధైర్యాన్ని ఆయన ప్రశంసించారు.యువతకు నిజమైన స్పూర్తిదాయకంగా ఉంటూ, అంకితభావంతో మాతృభూమికి సేవ చేస్తున్న సైనికులకు దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. వైమానిక యోధులు సవాళ్లను ఎదుర్కోవడానికి నిత్యం సిద్ధంగా ఉండాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. వైమానిక దళ సిబ్బంది అంకితభావాన్ని ఆయన ప్రశంసించారు. ఇది కూడా చదవండి: స్టార్మర్ దీపావళి వేడుకలు -
దేశ రక్షణలో రాజీలేదు: రాజ్‌నాథ్
సాక్షి, హైదరాబాద్: దేశ రక్షణ విషయంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా రాజీపడేది లేదని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. అత్యాధునిక పరికరాలు, ఆధునిక సాంకేతికతను సమకూర్చడం ద్వారా రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. యుద్ధ రంగానికి సంబంధించిన సవాళ్లలో మార్పుల నేపథ్యంలో కచ్చితమైన, అత్యంత వేగవంతమైన సమాచార వ్యవస్థ ఎంతో కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. యుద్ధంలో బలగాలకు సరైన సమయానికి అందే సమాచారమే గెలుపు, ఓటములను నిర్ణయిస్తుందని అన్నారు. యుద్ధ క్షేత్రంలోని వారికి సరైన సమయంలో కచ్చితమైన సమాచారాన్ని చేరవేస్తేనే శత్రువును దెబ్బకొట్టగలుగుతారన్నారు. అందుకు వెరీ లో ఫ్రీక్వెన్సీ (వీఎల్ఎఫ్) రాడార్ కేంద్రాలు అత్యంత కీలకమని పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం రిజర్వ్ ఫారెస్ట్‌లోని 2,900 ఎకరాల్లో రూ.3,200 కోట్ల నిధులతో భారత నావికాదళం నిర్మిస్తున్న వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్‌కు మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కలిసి రాజ్‌నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. సమాచారం, సాంకేతికత కీలకం ‘దేశ భద్రతలో అత్యంత కీలకమైన వీఎల్ఎఫ్ రాడార్ కేంద్రం తెలంగాణలో ఏర్పాటు కానుండటంతో సంతోషంగా ఉంది. మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం జరగడం కూడా ఆనందించాల్సిన విషయం. భారత రక్షణ రంగంలో డాక్టర్ కలాం అందించిన సేవలు చిరకాలం గుర్తుండిపోతాయి. భారత్‌కు కొత్త సైనిక సాంకేతికతను అందించడంతో పాటు, ఒక తరం శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు ఆయన స్ఫూర్తినిచ్చారు. కొత్తగా నిర్మించనున్న రాడార్ స్టేషన్‌తో భారత నౌకాదళ సమాచార వ్యవస్థ మరింత బలోపేతం కావడంతో పాటు సుదూర ప్రాంతాలకు విశ్వసనీయమైన, సురక్షితమైన సమాచారాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. విద్య, వైద్య రంగాల్లో సాంకేతికత కీలక భూమిక పోషిస్తుంది. కరోనా సమయంలోనూ అత్యవసర సేవలు సాఫీగా నడవడంలో సమాచారం, సాంకేతికత ఎంతో కీలకంగా వ్యవహరించాయి. భారతదేశం తన వాణిజ్య, భద్రతా ప్రయోజనాలను కాపాడుకోవాలంటే, బలమైన సముద్ర దళంగా ఉండాలంటే పటిష్టమైన సమాచార వ్యవస్థను కలిగి ఉండటం అవసరం..’ అని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. భవిష్యత్తు కోసం నిర్ణయాలు ఉండాలి ‘పర్యావరణంపై ప్రాజెక్ట్ ప్రభావం లేకుండా చూస్తాం. పర్యావరణానికి హాని కలుగకుండా అన్ని జాగ్రత్తలు పాటిస్తాం. దేశ రక్షణ, అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావు ఉండొద్దు. దేశ భద్రతే ప్రధానం. ఏ పార్టీ ప్రభుత్వమైనా, ఐదేళ్లే అధికారంలో ఉన్నా..భవిష్యత్తు కోసమే నిర్ణయాలు తీసుకోవాలి. వీఎల్ఎఫ్ సెంటర్ ఏర్పాటులో సంపూర్ణ సహకారం అందించిన సీఎం రేవంత్‌రెడ్డికి, తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. దేశం రక్షణ విషయానికి వస్తే అంతా ఏకమవుతామని ఈ రాడార్ కేంద్ర శంకుస్థాపనతో నిరూపితమైంది..’ అని రక్షణ మంత్రి అన్నారు. దేశాభివృద్ధిలో తెలంగాణ పాత్ర కీలకం ‘కొత్త రాష్ట్రమైనా తెలంగాణకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. వ్యవసాయంలో అధునిక పద్ధతులు, అభివృద్ధితో దేశంలో తెలంగాణ కీలక భూమిక పోషిస్తోంది. దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించిన కీలక సంస్థలతో పాటు రక్షణరంగ పరికరాల తయారీలో హైదరాబాద్‌కు గొప్ప పేరుంది. తాజాగా వీఎల్ఎఫ్ స్టేషన్ ప్రారంభమైతే స్థానిక ప్రజలకు పుష్కలంగా ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడుతుంది..’ అని రాజ్‌నాథ్ వివరించారు. అభివృద్ధి తప్ప ప్రకృతి అనర్ధాలు లేవు: సీఎం దేశ రక్షణ విషయంలో రాజకీయాలు చేయవద్దని ప్రతిపక్షాలకు సీఎం రేవంత్‌రెడ్డి హితవు పలికారు. వీఎల్ఎఫ్ సెంటర్ ఏర్పాటును కొందరు వివాదంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని విమర్శించారు. ఈ రాడార్ కేంద్రం ఏర్పాటుతో దేశ రక్షణలో తెలంగాణ రాష్ట్రం మరో కీలక అడుగు ముందుకు వేయబోతోందని చెప్పారు. ఇప్పటికే అనేక రక్షణ రంగ సంస్థలతో హైదరాబాద్ వ్యూహాత్మక ప్రదేశంగా ఉందని గుర్తుచేశారు. తమిళనాడులోనూ 1990లో ఇలాంటిదే ప్రారంభించారు. అక్కడి ప్రజలకు ఎలాంటి నష్టం జరగలేదు. రెండో వీఎల్ఎఫ్ రాడార్ కేంద్రం మన ప్రాంతంలో రావడం గర్వకారణం. ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను తెలంగాణ సమాజం గుర్తించాలి. వివాదాలకు తెరలేపుతున్నవారు దేశ రక్షణ గురించి ఆలోచన చేయాలి. దీనికి భూ బదలాయింపు, నిధుల కేటాయింపు లాంటి నిర్ణయాలన్నీ 2017లో గత ప్రభుత్వ హయాంలోనే జరిగాయి. దేశ భద్రతకు సంబంధించిన ప్రాజెక్టును వివాదాస్పదం చేయడం సమంజసం కాదు. ఇక్కడ రామలింగేశ్వరస్వామి దర్శనానికి దారి వదలండి. విద్యా సంస్థల్లో స్థానికులకు అవకాశం కల్పించండి. వీఎల్ఎఫ్ కేంద్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మా ప్రభుత్వం పూర్తి మద్దతుగా ఉంటుందని రక్షణశాఖ మంత్రికి నేను మాట ఇస్తున్నా..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. నౌకాదళ ముఖ్య అధికారి అడ్మిరల్ దినేష్ కె.త్రిపాఠి మాట్లాడుతూ.. భారత నావికాదళ కమ్యూనికేషన్ సామర్థ్యాలలో కొత్త అధ్యాయానికి ఈ రాడార్ స్టేషన్ ఏర్పాటు నాంది పలుకుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండి సంజయ్, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, డీకే అరుణ, మండలిలో చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, కాలే యాదయ్య, మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజ్‌నాథ్‌కు సీఎం, కేంద్రమంత్రుల స్వాగతం వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బేగంపేటకు వచ్చిన రాజ్‌నాథ్‌సింగ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తదితరులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి శంకుస్థాపనకు హెలికాప్టర్లో వెళ్లాల్సి ఉండగా, వాతావరణం అనుకూలించకపోవడంతో అంతా రోడ్డు మార్గాన బయలుదేరి వెళ్లారు. కార్యక్రమం ముగిసిన తర్వాత రాజ్‌నాథ్ సాయంత్రం 4.01 గంటలకు హెలికాప్టర్లో బేగంపేటకు చేరుకుని 4.18 గంటలకు విమానంలో ఢిల్లీ బయలుదేరివెళ్లారు. -
దామగుండం రాడార్ కేంద్రానికి శంకుస్థాపన చేసిన రాజ్‌నాథ్ (ఫొటోలు)
-
రాడార్ ప్రాజెక్ట్ పై అపోహలు వద్దు ఏదైనా ప్రమాదం ఉంటే..
-
రాడార్ స్టేషన్‌పై అపోహలొద్దు : రాజ్‌నాథ్ సింగ్
సాక్షి,దామగుండం : తెలంగాణలోని వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అడవిలో ఇండియన్ నేవీ రాడార్ స్టేషన్ (వీఎల్ఎఫ్) ఏర్పాటుపై అపోహలు వద్దని అన్నారు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. మంగళవారం (అక్టోబర్ 15) రాజ్ నాథ్ సింగ్ నేవీ రాడర్ స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. రాజకీయాలు వేరు.. దేశ భద్రతవేరు. పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని అపోహపడుతున్నారు. పర్యావరణ సంరక్షణలో కేంద్రం దృఢనిశ్చయంతో ఉంది. స్థానికులపై ప్రభావం పడుతుందంటే పునరావాసం’ కల్పిస్తామని హామీ ఇచ్చారు.స్థానికులపై వెరీ లో ఫ్రీక్వెన్సీ (వీఎల్ఎఫ్)నుంచి ఎలాంటి చెడు ప్రభావం ఉండదు. స్థానికుల ఆర్థిక ప్రగతికి వీఎల్ఎఫ్ దోహదపడుతుంది. స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయిని రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. -
‘రాడార్’కు అనుమతులిచ్చింది వారే : సీఎం రేవంత్
సాక్షి,హైదరాబాద్: దేశ రక్షణలో తెలంగాణ కీలక అడుగు వేస్తోందని, డిఫెన్స్, ఆర్మీ విభాగాల్లో హైదరాబాద్ వ్యూహాత్మక స్థానంలో ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ముఖ్య అతిథిగా హాజరై వికారాబాద్ జిల్లా దామగుండంలో నేవీ ఏర్పాటు చేయనున్న వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్‌కు మంగళవారం(అక్టోబర్15) శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ‘వీఎల్ఎఫ్ స్టేషన్ పై కొందరు అపోహాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. తమిళనాడులో ఇలాంటి స్టేషన్ ఏర్పాటు చేసి 34 ఏళ్లు అవుతున్నా ఎలాంటి ఇబ్బందులూ తలెత్తలేదు. వివాదం చేసే వాళ్ళు దేశ రక్షణ కోసం ఆలోచన చేయాలి. అసలు బీఆర్ఎస్ హయాంలోనే రాడార్ స్టేషన్‌కు అనుమతులిచ్చారు. దేశ రక్షణపై వివాదాలు సృష్టించే వారికి కనువిప్పు కలగాలి. నేను, స్పీకర్ ఈ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నాం. దేశ రక్షణ కోసం రాజకీయాలను వదిలి కేంద్రానికి సహకరిస్తున్నాను. కేంద్ర రక్షణ మంత్రి వేరే పార్టీ అయినా... నేను వేరే పార్టీ అయినా దేశ రక్షణ కోసం అందరం ఒకటే. వీఎల్ఎఫ్ స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుంది’అని రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండిసంజయ్ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ తదితరులు పాల్గొన్నారు.ఇదీ చదవండి: ఓ వైపు మరణశాసనం..మరోవైపు సుందరీకరణ ఎలా: కేటీఆర్ -
కంటోన్మెంట్లో కారుణ్య నియామకాలు చేపట్టండి
సాక్షి, న్యూఢిల్లీ: సికింద్రాబాద్ కంటోన్మెంట్లో చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలు చేపట్టాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. కరోనా మహ మ్మారి వేళ కంటోన్మెంట్లో పనిచేసిన మున్సి పల్ కార్మికులు సుమారు వంద మందికి పైగా మృతి చెందారు.ఐదు శాతం కంటే ఎక్కువ మందికి కారుణ్య నియామకాలు చేపట్టవద్దని రక్షణ శాఖ నిబంధన ఉందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంలో ఉదారంగా వ్యవహరించి కరోనా సమయంలో మృతి చెందిన మున్సిపల్ కార్మికుల కుటుంబాలందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. సాధ్యాసాధ్యాలు పరిశీలించి న్యాయం జరిగేలా చూస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు ఈటల రాజేందర్ తెలిపారు.జేసీఓపీ చైర్మన్‌గా బాధ్యతల స్వీకారం18వ లోక్‌సభ ‘జాయింట్ కమిటీ ఆన్ ఆఫీసెస్ ఆఫ్ ప్రాఫిట్’ చైర్మన్‌గా సోమవారం ఢిల్లీలోని కార్యాలయంలో ఎంపీ ఈటల రాజేందర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా.. ఆయనకు బీజేపీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కమిటీకి ఈటల చైర్మన్ కాగా.. తొమ్మిదిమంది లోక్‌సభ ఎంపీలు, ఐదుగురు రాజ్యసభ ఎంపీలు సభ్యులుగా ఉంటారు. -
కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ఈటల భేటీ
ఢిల్లీ: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ఎంపీ ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. కంటోన్మెంట్ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులకు కారుణ్య నియామకాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.కరోనా సమయంలో పనిచేస్తూ దాదాపు 100 మందికి పైన పారిశుద్ధ్య కార్మికులు చనిపోయారు. చనిపోయిన కార్మికుల అంశాన్ని ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకొని కారుణ్య నియామకాలు చేపట్టాని కోరారు.కారుణ్య నియామకాలు ఐదు శాతం మించకూడదన్న నిబంధనను సడలించి , ఈ కార్మికుల కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. -
దామగుండం.. రాడార్ గండం!
సాక్షి, హైదరాబాద్: దామగుండం.. అడవుల్లో నేవీ రాడార్ నిర్మాణం ప్రతిపాదనతో ఈ ప్రాంతం వార్తలకెక్కింది. తమ ఉనికికి ముప్పు వాటిల్లుతుందని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో చర్చనీయాంశంగా మారింది. జీవ వైవిధ్యానికి ముప్పు పొంచి ఉందని, అడవుల విధ్వంసానికి పాల్పడితే భవిష్యత్తు తరాలకు అన్యాయం చేసిన వాళ్లమవుతామని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 15వ తేదీనే దామగుండంలో రాడార్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిసింది. ఈ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీఎం రేవంత్‌రెడ్డి హాజరవుతారని సమాచారం. ఔషధ మొక్కలకు నిలయం.. వందల ఏళ్ల ఆలయం వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని దామగుండం రిజర్వ్ ఫారెస్టు పచ్చని చెట్లతో జీవవైవిధ్యానికి మారుపేరుగా ఉంటుంది. వందల ఏళ్లుగా ప్రజలకు జీవనాధారంగా, జంతు జాతులు, పక్షులకు ఆలవాలంగా ఉంది. దాదాపు 206 రకాల జాతుల పక్షులకు ఈ అడవులు నెలవుగా ఉన్నాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి. ఎన్నో ఔషధ గుణాలున్న మొక్కలకు ఈ అడవి నిలయం. ఈ అడవుల మధ్యలోనే 400 ఏళ్ల నాటి రామలింగేశ్వర ఆలయం కూడా ఉంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తమ ఇలవేల్పుగా రామలింగేశ్వరుని కొలుస్తున్నారు. అడవి మధ్యలో దేవాలయానికి సంబంధించిన భూములు కూడా ఉన్నాయి. కాగా రాడార్ నిర్మాణం కోసం.. ఈ అడవుల్లోని 2,900 ఎకరాల భూమిని నావికాదళం అధికారులు స్వా«దీనం చేసుకోనున్నారు. అయితే ఈ క్రమంలో 12 లక్షల చెట్లను నరికివేస్తారంటూ ప్రచారం జరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. చుట్టుపక్కల గ్రామాలతో పాటు సమీపంలో ఉన్న హైదరాబాద్‌కూ తీవ్ర నష్టం వాటిల్లుతుందని పర్యావరణవేత్తలు అంటున్నారు. పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని, పశు పక్షాదులకు నిలువ నీడ లేకుండా పోతుందని చెబుతున్నారు. ఇక రాడార్ చుట్టూ కంచె వేస్తే తాము ఆలయానికి వెళ్లి పూజలు చేసుకోవడానికి కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుందని గ్రామస్తులు అంటున్నారు. తమ అడవిలో తాము పరాయివారిగా మారుతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలేమిటీ నేవీ రాడార్? నౌకలు, జలాంతర్గాముల (సబ్మెరైన్ల)తో సమాచార మార్పిడిని (కమ్యూనికేషన్) మెరుగుపరుచుకునేందుకు నావికాదళం వెరీ లోఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్లను నిర్మిస్తుంది. దామగుండం సముద్రమట్టానికి 460 మీటర్ల ఎత్తులో ఉన్నందున శత్రు దేశాల కళ్లు కప్పి సమాచార మార్పిడి చేసుకునే అవకాశం ఉంటుందని, వ్యూహాత్మకంగా ఈ ప్రాంతం ఎంతో అనుకూలమైనదని నేవీ అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు దేశంలో తమిళనాడులోని తిరునల్వేలిలో కట్ట»ొమ్మన్ రాడార్ స్టేషన్ మాత్రమే ఉంది. దీన్ని 1990లో నిర్మించారు. వాస్తవానికి దామగుండంలో రెండో స్టేషన్ నిర్మించాలని ఏళ్ల క్రితమే నిర్ణయించినా ముందుకుసాగలేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడమే కాకుండా ఇందుకోసం తూర్పు నావికాదళానికి కావాల్సిన 2,900 ఎకరాల భూమిని బదలాయించేందుకు అంగీకరించింది. ఈ స్టేషన్‌ను 2027 నాటికి పూర్తి చేయాలని నేవీ భావిస్తోంది. రాడార్ నిర్మాణంతో పాటు ఇక్కడ దాదాపు 3 వేల మంది నివాసం ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నారు. రేడియేషన్ ముప్పు ఉండదంటున్న శాస్త్రవేత్తలు సాధారణంగా రాడార్ వ్యవస్థ చాలా తక్కువ (3– 30 కిలోహెడ్జ్) రేడియో ఫ్రీక్వెన్సీతో పనిచేస్తుంది. పైగా ఇక్కడ దాదాపు 450 మీటర్ల ఎత్తు టవర్లు ఉంటాయని, వీటివల్ల చుట్టుపక్కల ఉండే ఏ వస్తువుకు కానీ, వ్యక్తికి కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదని రక్షణ శాఖ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సముద్ర జలాల గుండా చొచ్చుకుపోయే ఫ్రీక్వెన్సీ తరంగాల ఆధారంగా సబ్ మెరైన్లలోని సిబ్బందితో సమాచార మార్పిడి జరుగుతుందని పేర్కొంటున్నారు. 12 లక్షల చెట్లు తొలగింపు అవాస్తవం! ప్రాజెక్టు ఏర్పాటులో భాగంగా 12 లక్షల చెట్లను తొలగిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఆటవీ శాఖ అధికారులు మాత్రం ఇది అవాస్తవం అంటున్నారు. నేవీకి అప్పగించే భూమిలో చాలావరకు చిన్న పొదలు, ఖాళీ ప్రదేశం మాత్రమే ఉందని, దట్టమైన అటవీ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టబోరని చెబుతున్నారు. కేవలం 1.5 లక్షల చెట్లు తొలగించే అవకాశం ఉన్నట్లు ఫారెస్టు శాఖ అంచనా వేస్తోంది. రాడార్ స్టేషన్ ఏర్పాటు చేసే ప్రాంతం, ఇతర నిర్మాణాలు చేపట్టే ప్రదేశాల్లో మాత్రమే చెట్లను తొలగిస్తారు. అయితే ఈ నష్టాన్ని పూడ్చేందుకు వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఏకంగా 17.5 లక్షల మొక్కలు నాటేందుకు ఆటవీ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. అరుదైన జాతులు కనుమరుగు దామగుండం రాడార్ స్టేషన్ నిర్మాణంతో అడవుల్లో పచ్చదనం పోతుంది. అరుదైన జంతు జాతులు కనుమరుగవుతాయి. పర్యావరణానికి తీవ్రమైన ముప్పు వాటిల్లుతుంది. చెట్లను కాపాడుకోవాల్సిన పరిస్థితుల్లో లక్షలాది చెట్లను నరికేయడం చాలా దారుణం. సమీపంలోని హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వాతావరణం కూడా ప్రభావితం అవుతుంది. ఈ ప్రాజెక్టును వేరే ప్రాంతానికి తరలించాలి. – రుచిత్ ఆశ కమల్, క్లైమేట్ ఫ్రంట్ ఇండియా ఏం చేయలేని స్థితిలో ఉన్నాం రాడార్ స్టేషన్ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాం. మాకెవరూ సహకరించడం లేదు. అసలు రాడార్ స్టేషన్‌తో ఎలాంటి పరిణామాలు ఉంటాయో సరిగ్గా అవగాహన కల్పించే వాళ్లు కూడా లేరు. దీంతో అది నిర్మించిన తర్వాత నిజంగా ఏం జరుగుతుందో తెలియట్లేదు. – పి.వెంకట్‌రెడ్డి, పూడూరు గ్రామవాసి -
పాక్ మనతో స్నేహంగా ఉంటే..
పొరుగుదేశం పాకిస్తాన్ ఆర్థిక ఇబ్బందులపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాక్ మనతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తే అది ఐఎంఎఫ్‌ను కోరుతున్న సాయానికి మించిన బెయిలౌట్ ప్యాకేజీ ఇచ్చి ఉండేవాళ్లమని పేర్కొన్నారు. కశీ్మర్లోని బందిపొర జిల్లా గురెజ్‌లో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. ‘జమ్మూకశీ్మర్ ఆర్థికాభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోదీ 2014–15లో ప్రకటించిన ప్యాకేజీ ఇప్పుడు రూ.90 వేల కోట్లకు చేరింది. ఇది ఐఎంఎఫ్‌ను పాక్ కోరుతున్న బెయిలౌట్ ప్యాకేజీ కంటే ఎంతో ఎక్కువ’’ అన్నారు. ‘‘పాక్ మిత్రులారా! ఇరుగుపొరుగు దేశాలైన మన మధ్య విభేదాలెందుకు? మన మధ్య సత్సంబంధాలుంటే మీకు ఐఎంఎఫ్ కంటే ఎక్కువే ఇచ్చి ఉండే వాళ్లం’’ అని మంత్రి రాజ్‌నాథ్ వ్యాఖ్యానించారు. ‘‘అంతర్జాతీయ సంస్థలు, ఇతర దేశాల నుంచి తెచ్చుకున్న అప్పులను పాక్ దురి్వనియోగం చేస్తోంది. ఉగ్రవాద ఫ్యాక్టరీని నడపటానికి వాడుతోంది. వారిని మనపైకి పంపుతోంది. అందుకే అంతర్జాతీయ వేదికలపై పాక్ ఒంటరైంది. మిత్ర దేశాలు సైతం దాన్ని దూరంగా పెట్టాయి’’ అని విమర్శించారు. – శ్రీనగర్ -
హేమంత్ అవినీతి సీఎం: రాజ్‌నాథ్
ఇట్ఖోరి (జార్ఖండ్): జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను అత్యంత అవినీతిపరుడైన సీఎంగా రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభివర్ణించారు. ఉన్నతమైన ప్రజాస్వామ్య సంప్రదాయాలతో ఆడుకున్నారని విమర్శించారు. సోరెన్‌ను గద్దెదింపే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. జార్ఖండ్‌లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ చేపట్టిన పరివర్తన్ యాత్రను ఇట్ఖోరిలో శనివారం రాజ్‌నాథ్ ప్రారంభించారు. హేమంత్ సోరెన్ అవినీతికి పాల్పడ్డాడని ఆరోపించారు. అవినీతి మరకలున్న వారిని భారత్ ఎప్పటికీ ఆమోదించబోదన్నారు. బీజేపీ సీఎంలు బాబూలాల్ మరాండి, అర్జున్ ముండా, రఘుబర్ దాస్‌లు ఎలాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొనలేదన్నారు. అధికారిక కూటమిలోని జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీలను జార్ఖండ్ ప్రగతిని అడ్డుకుంటున్న స్పీడ్‌బ్రేకర్లుగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బంగ్లాదేశ్, రొహింగ్యా చొరబాటుదారులకు కొమ్ముకాస్తోందని రాజ్‌నాథ్ ఆరోపించారు. -
అఫ్జల్ గురుకు పూల మాల వేయాలా?: రాజనాథ్ సింగ్
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఉగ్రవాదుల పట్ల సానుభూతి చూపుతోందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మండిపడ్డారు. జమ్ము కశ్మీర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఆదివారం ఓ ర్యాలీలో పాల్గొని మాట్లాడారు.‘నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఉగ్రవాదుల పట్ల సానూభూతి ప్రదర్శిస్తోంది. ఇటీవల పార్టీకి చెందిన నేత ఒమర్ అబ్దుల్లా పార్లమెంట్ మీద దాడి చేసిన దోషి అఫ్జల్ గురుకు మరణశిక్ష విధించటం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. నేను ఒమర్ అబ్దులా అడుగుతున్నా.. అఫ్జల్ గురుకు ఉరిశిక్ష బదులుగా పూలమాల వేయమంటారా?. ఆ పార్టీ జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్‌న పునరుద్ధరిస్తామని చెబుతోంది. ...కానీ, గత ఐదేళ్లలో రాష్ట్రంలో 40వేల ఉద్యోగాలు కల్పించాం. జమ్ము కశ్మీర్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ప్రజలు భారత్‌లో భాగం కోరుకునే స్థాయిలో మేము కశ్మీర్‌ను అభివృద్ధి చేస్తాం. పీవోకేలోని ప్రజలను పాకిస్తాన్ విదేశీలుగా చూస్తే.. భారత్ తమ సొంతవారిగా చూస్తుంది’ అని అన్నారు. ఇక.. జమ్ము కశ్మీర్లో సెప్టెంబర్18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, అక్టోబర్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. జమ్ము కశ్మీర్లో 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.చదవండి: అఫ్జల్ గురు ఉరిశిక్ష వల్ల ప్రయోజనం లేదు: ఒమర్ అబ్దుల్లా -
మోదీ సారథ్యంలో కశ్మీర్లో బీజేపీ ప్రచారం
జమ్మూ: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే స్టార్ క్యాంపెయినర్ల జాబితాను బీజేపీ సోమవారం విడుదల చేసింది. ప్రధాని మోదీ సారథ్యంలో చేపట్టే మొదటి విడత ఎన్నికల ప్రచారంలో హోం మంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి తదితర 40 మంది కీలక నేతలు పాల్గొననున్నారు. ఈ జాబితాను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రధాన కార్యాలయం ఇన్చార్జి అరుణ్ సింగ్ ఎన్నికల కమిషన్‌కు అందజేశారు. నిర్ణీత గడువులోగా సవరించిన మరో జాబితా అందజేస్తే తప్ప, మూడు దశలకు కూడా స్టార్ క్యాంపెయినర్ల జాబితా ఇదే ఉంటుందని ఆయన ఈసీకి వివరించారు. జమ్మూకశ్మీర్‌లో సెప్టెంబర్ 18, 25వ తేదీలతోపాటు నవంబర్ ఒకటో తేదీన మూడు విడతలుగా ఎన్నికలు జరుగనుండటం తెలిసిందే. -
23 నుంచి రాజ్‌నాథ్ సింగ్ అమెరికా పర్యటన
భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆగస్టు 23 నుంచి అమెరికాలో పర్యటించనున్నారు. అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఆహ్వానం మేరకు ఆయన అమెరికా పయనమవుతున్నారు. రాజ్‌నాథ్ సింగ్ ఆగస్టు 26 వరకు అమెరికాలోనే ఉండనున్నారు.ఈ పర్యటనలో రాజ్‌నాథ్ సింగ్ అమెరికా రక్షణ మంత్రితో సమావేశం కానున్నారు. అమెరికా అధ్యక్షుని జాతీయ భద్రతా వ్యవహారాల సహాయకుడు జేక్ సుల్విన్తో కూడా రక్షణ మంత్రి భేటీ కానున్నారు. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తృతం చేస్తుందని భావిస్తున్నారు. అమెరికా రక్షణ పరిశ్రమతో రక్షణ మంత్రి రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా నిర్వహించనున్నారు. Defence Minister Rajnath Singh will be undertaking an official visit to the United States from August 23 to 26, on the invitation of the US Secretary of Defence Lloyd Austin. During the visit, the Raksha Mantri will hold a bilateral meeting with his US counterpart Secretary… pic.twitter.com/YV3vzUQrTw— ANI (@ANI) August 21, 2024 -
కరుణానిధి స్మారక రూ.100 నాణెం విడుదల
సాక్షి, చెన్నై: డీఎంకే దివంగత నేత, తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి శత జయంతి స్మారక రూ.100 నాణేన్ని ఆదివారం చెన్నైలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విడుదల చేశారు. మొదటి నాణేన్ని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అందుకున్నారు. డీఎంకే ప్రభుత్వం ఏడాది పొడవునా కరుణానిధి శత జయంతి ఉత్సవాలను జరిపింది. ఆయన ముఖచిత్రంతో కూడిన రూ.100 నాణేన్ని కేంద్రం విడుదల చేసింది. ఆదివారం చెన్నై కలైవానర్ అరంగంలో జరిగిన వేడుకలో ఈ నాణేన్ని విడుదల చేశారు. కరుణ జీవిత ప్రస్థానంతో రూపొందించిన 7డీ టెక్నాలజీ లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. -
రక్షణ కట్టుదిట్టం..
న్యూఢిల్లీ: చైనా కవ్వింపులు, పాక్ ముష్కరుల చొరబాట్లతో సరిహద్దుల వెంట అప్రమత్తంగా ఉండే సైన్యంతోపాటు భూతల, గగనతల రక్షణ వ్యవస్థల మరింత పటిష్టతే లక్ష్యంగా మోదీ సర్కార్ మరోమారు రక్షణ రంగానికి పెద్దపీట వేసింది. 2024–25 ఆర్థికసంవత్సరంలో రక్షణ రంగానికి రూ.6,21,940.85 కోట్లు కేటాయించింది. అత్యాధునిక డ్రోన్లు, యుద్ధవిమా నాలు, నౌకలు, ఆయుధాలు, ఇతర సైనిక ఉపకరణాల కొనుగోలు కోసం ఏకంగా రూ.1,72,000 కోట్లను కేటాయించారు. తాజా కేంద్ర బడ్జెట్లో రక్షణరంగ వాటా 12.9 శాతానికి పెరగడం విశేషం. గత ఆర్థికసంవత్సరంతో పోలిస్తే ఈసారి రక్షణరంగానికి కేటాయింపులు 4.79 శాతం పెంచారు. రక్షణ రంగంలో స్వావలంబనే లక్ష్యంగా సైనిక ఉపకరణాల స్థానిక తయారీని మరింత ప్రోత్సహించేందుకు మోదీ సర్కార్ నడుం బిగించింది. అందుకే స్థానిక ఉపకరణాల సేకరణ కోసం రూ.1,05,518.43 కోట్లను కేటాయించింది. దీంతో బీజేపీ సర్కార్ లక్షిత రక్షణరంగంలో ఆత్మనిర్భరత మరింతగా సాకారంకానుంది. లక్షల కోట్ల బడ్జెట్‌ను రక్షణరంగానికి కేటాయించిన విత్తమంత్రి నిర్మలకు కృతజ్ఞతలు అంటూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ‘ఎక్స్’లో ట్వీట్‌చేశారు. ‘‘ ఆధునిక ఆయుధ సంపత్తి సమీకరణతో త్రివిధ బలగాల శక్తిసామర్థ్యాలు మరింత ద్విగుణీకృతం కానున్నాయి. దేశీయ సంస్థలు తయారుచేసిన సైనిక ఉపకరణాలు, ఆయుధాలతో దేశం రక్షణరంగంలోనూ ఆత్మనిర్భరతను వేగంగా సాధించనుంది’’ అని రాజ్‌నాథ్ అన్నారు.అగ్నిపథ్ పథకం కోసం రూ.5,980 కోట్లుగత బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి సరహద్దుల వెంట రహదారుల నిర్మాణానికి కేటాయింపులు 30 శాతం పెరగడం విశేషం. బీఆర్వోకు కేటాయించిన రూ.6,500 కోట్ల నిధులతో సరిహద్దుల వెంట మౌలికవసతుల కల్పన మెరుగుపడనుంది. రక్షణరంగ పరిశ్రమల్లో అంకుర సంస్థలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఐడెక్స్ పథకానికి రూ.518 కోట్లు కేటాయించారు. అంకుర సంస్థలు, సూక్ష్మచిన్నమధ్యతరహా పరిశ్రమలు, ఆవిష్కర్తలు ఇచ్చే కొత్త ఐడియాలను ఆచరణలో పెట్టేందుకు ఈ నిధులను వినియోగించనున్నారు.కోస్ట్‌గార్డ్ ఆర్గనైజేషన్‌కు రూ.7,651 కోట్లు కేటాయించారు. తేజస్ వంటి తేలికపాటి యుద్ధవిమానాలను తయారుచేస్తూ నూతన విమానాల డిజైన్, రూపకల్పన, తయారీ కోసం కృషిచేసే హిందుస్తాన్ ఏరోనాటిక్స్‌కు రూ.1,600 కోట్లు కేటాయించారు. రాష్ట్రీయ రైఫిల్స్ విభాగం కోసం రూ.10,535 కోట్లు కేటాయించారు. ఎన్సీసీ కోసం రూ.2,726 కోట్లు, త్రివిధ దళాల్లో అగ్నిపథ్ పథకం నిర్వహణ కోసం రూ.5,980 కోట్లు కేటాయించారు. -
ఎయిమ్స్‌లో రాజ్‌నాథ్‌సింగ్
సాక్షి,ఢిల్లీ: రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్(73) ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఎయిమ్స్ ఆస్పత్రి ఒక ప్రకటనలో తెలిపింది. గురువారం(జులై11) ఉదయం రాజ్‌నాథ్ వెన్నునొప్పితో ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రి ప్రైవేట్ వార్డులో ఆయనకు వెన్నునొప్పి సంబంధిత పరీక్షలు చేశారు. -
Rajnath Singh Birthday: ఫిజిక్స్ లెక్చరర్ నుంచి రక్షణ మంత్రి వరకూ..
ఆయన చదువుకునే రోజుల్లో తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నారు. అదే సమయంలో ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. అనంతరం ఫిజిక్స్ లెక్చరర్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. నేడు దేశ రక్షణమంత్రిగా ఉన్నత బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనే రాజ్‌నాథ్ సింగ్.దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పుట్టినరోజు నేడు. ఆయన 1951 జూలై 10న యూపీలోని చందౌలీలోని చకియాలో జన్మించారు. బీజేపీకి చెందిన సీనియర్ నేతలలో ఒకనిగా గుర్తింపు పొందారు. అయితే రాజ్‌నాథ్ సింగ్ అధ్యాపకునిగా తన కెరీర్ ప్రారంభించారనే సంగతి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. రాజ్‌నాథ్ సింగ్ రైతు కుటుంబంలో జన్మించారు. అతని తండ్రి పేరు రాంబదన్ సింగ్. తల్లి పేరు గుజరాతీ దేవి. రాజ్‌నాథ్ తన ప్రారంభ విద్యను గ్రామంలోనే అభ్యసించారు. అనంతరం గోరఖ్‌పూర్ విశ్వవిద్యాలయం నుండి భౌతికశాస్త్రంలో ఎంఎస్సీ పూర్తి చేశారు.రాజ్‌నాథ్ సింగ్ తొలుత యూపీలోని మీర్జాపూర్‌లోని కేబీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజీలో ఫిజిక్స్‌లో లెక్చరర్‌గా చేరారు. మొదటి నుండి చాలా తెలివైన విద్యార్థిగా పేరొందిన ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యనిర్వాహకునిగానూ పనిచేశారు. 1974లో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 1977లో యూపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1988లో ఉత్తరప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు ఎమ్మెల్సీగా ఎన్నికై 1991లో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. యూపీలో విద్యా మంత్రిగా ఉన్న సమయంలో ఆయన కాపీయింగ్ నిరోధక చట్టాన్ని, వేద గణితాన్ని ప్రవేశపెట్టారు.రాజ్‌నాథ్ సింగ్ 1994లో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. 1999, నవంబరు 22న కేంద్ర ఉపరితల రవాణా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2000, అక్టోబర్ 28న యూపీ ముఖ్యమంత్రి అయ్యారు. 2003, మే 24న కేంద్ర కేంద్ర వ్యవసాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ విభాగాన్ని కూడా పర్యవేక్షించారు.2005 డిసెంబర్ 31న రాజ్‌నాథ్ సింగ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడయ్యారు. 2009 డిసెంబర్ 19 వరకు ఈ పదవిలో కొనసాగారు. 2009లో ఘజియాబాద్ నార్త్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2014, మే 26న ఆయన కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2019 మే 30 వరకు కేంద్ర హోం మంత్రిగా పనిచేశారు. అనంతరం రక్షణ మంత్రిగా నియమితులయ్యారు. 2024 ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించడంతో ఆయన మరోమారు రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. -
2.70 లక్షల ఇళ్లు ఇవ్వండి: సీఎం రేవంత్ విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25)లో తెలంగాణకు బీఎల్సీ మోడల్లో 2.70 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. నిరుపేదలకు వారి సొంత స్థలాల్లో 25 లక్షల ఇళ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర మంత్రికి వివరించారు. సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రి ఖట్టర్ నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. తెలంగాణలో రాష్ట్ర సర్కారు నిర్మించ తలపెట్టిన 25 లక్షల ఇళ్లలో 15 లక్షల ఇళ్లు పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోకి వస్తాయని కేంద్ర మంత్రికి తెలిపారు. వాటిని లబ్ధిదారు ఆధ్వర్యంలో వ్యక్తిగత ఇళ్ల నిర్మాణం (బీఎల్సీ) విధానంలో నిర్మించనున్నామని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పట్టణ)– పీఎంఏవై (యూ) పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద మంజూరు చేసే ఇంటి నిర్మాణ వ్యయం నిధులు పెంచాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో తాము నిర్మించే ఇళ్లను పీఎంఏవై (యూ) మార్గదర్శకాల ప్రకారం నిర్మిస్తామని వివరించారు. పీఎంఏవై (యూ) కింద ఇప్పటివరకు తెలంగాణకు 1,59,372 ఇళ్లు మంజూరు చేసి, రూ.2,390.58 కోట్లు గ్రాంటుగా ప్రకటించారని గుర్తు చేశారు. ఇందులో ఇప్పటివరకు రూ.1,605.70 కోట్లే ఇచ్చారని, మిగతా నిధులు విడుదల చేయాలని కోరారు. స్మార్ట్‌సిటీ మిషన్ కాలపరిమితి పొడిగించండి స్మార్ట్‌సిటీ మిషన్ కింద చేపట్టిన పనులు పూర్తికానందున మిషన్ కాలపరిమితిని 2025 జూన్ వరకు పొడిగించాలని కేంద్ర మంత్రి ఖట్టర్‌కు సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. స్మార్ట్ సిటీ మిషన్ కింద తెలంగాణలోని వరంగల్, కరీంనగర్ నగరాల్లో పనులు చేపట్టినట్టు తెలిపారు. వరంగల్‌లో 45 పనులు పూర్తయ్యాయని, రూ.518 కోట్ల వ్యయంతో చేపట్టిన మరో 66 పనులు కొనసాగుతున్నాయని.. కరీంనగర్లో 25 పనులు పూర్తయ్యాయని, రూ.287 కోట్ల వ్యయంతో చేపట్టిన 22 పనులు కొనసాగుతున్నాయని వివరించారు. స్మార్ట్ సిటీ మిషన్ కాలపరిమితి ఈ ఏడాది జూన్ 30తో ముగుస్తోందని.. ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పనులు ముగిసేందుకు వీలుగా మరో ఏడాది పొడిగించాలని కోరారు. రక్షణ శాఖ భూములు రాష్ట్రానికి బదలాయించండి హైదరాబాద్‌లో రహదారుల విస్తరణ, ఇతర అవసరాల కోసం 2,500 ఎకరాల రక్షణశాఖ భూములను తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. సోమవారం ఢిల్లీలో రాజ్‌నాథ్‌సింగ్‌ను రేవంత్ కలిశారు. ర్యావిరాల గ్రామంలో తెలంగాణ ప్రభుత్వానికి చెందిన 2,462 ఎకరాల భూములను ఇమారత్ పరిశోధన కేంద్రం ఉపయోగించుకుంటున్న విషయాన్ని రక్షణ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్ నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో రహదారుల విస్తరణ, ఫ్లైఓవర్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు రక్షణ శాఖ భూములు కీలకమని చెప్పారు. ఆర్సీఐ రాష్ట్ర ప్రభుత్వ భూములను వినియోగించుకుంటున్నందున.. బదులుగా రక్షణ శాఖ భూములను రాష్ట్రానికి అప్పగించాలని కోరారు. భూముల పరస్పర బదిలీకి అంగీకరించాలని విజప్తి చేశారు. వరంగల్ సైనిక్ స్కూల్ ఇవ్వండి.. వరంగల్ నగరానికి కేంద్రం సైనిక్ స్కూల్ మంజూరు చేసినా.. గత రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణపరంగా ఎటువంటి చర్యలు తీసుకోలేదని రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం తెలిపారు. ఆ సైనిక్ స్కూల్ అనుమతుల గడువు ముగిశాయని.. ఆ అనుమతులను పునరుద్ధరించాలని లేదా తాజాగా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాల్లో సీఎం వెంట ఎంపీలు మల్లు రవి, రామసహాయం రఘురాంరెడ్డి, బలరాం నాయక్, సురేశ్ షెట్కార్, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, కుందూరు రఘువీర్‌రెడ్డి, కడియం కావ్య, గడ్డం వంశీ, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్ తదితరులు ఉన్నారు. నీట్‌పై జ్యుడీషియల్ విచారణ జరిపించాలి: రేవంత్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించామని సీఎం రేవంత్ తెలిపారు. రక్షణ భూముల బదలాయింపు, మూసీ రివర్ ఫ్రంట్, మెట్రో రైలు, పీఎంఏవై ఇళ్ల విషయంలో విజ్ఞప్తులు అందజేశామని చెప్పారు. కేంద్ర మంత్రులను కలసిన తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాం«దీలతో భేటీ రేవంత్ భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. డిఫెన్స్ శాఖ పరిధిలో ఉన్న భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని కోరామన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరామని.. సానుకూలంగా పరిశీలిస్తామని కేంద్ర మంత్రులు హామీ ఇచ్చారని చెప్పారు. యూపీలో మూడు, ఏపీలో రెండు సైనిక్ స్కూళ్లు ఉన్నాయని.. కానీ తెలంగాణలో ఒక్కటి కూడా లేదని కేంద్ర మంత్రికి వివరించామన్నారు. ఈ విషయాన్ని కేసీఆర్ పదేళ్ల పాటు అడగలేదని, ప్రధాని మోదీ ఇవ్వలేదని విమర్శించారు. నీట్ పరీక్ష నిర్వహణలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని.. ఈ కేసును సీబీఐతో కాకుండా జ్యుడీషియల్ విచారణ జరిపించాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు. ఆ కేసును ఖతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ‘నీట్ పరీక్ష నిర్వహణలో మోదీ గ్యారంటీ ఏదీ? యువతకు మోదీ భరోసా ఏది?’అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌తోనే నా రాజకీయ జన్మ ప్రారంభమైంది: పోచారం శ్రీనివాసరెడ్డి తన రాజకీయ జన్మ కాంగ్రెస్ పార్టీతోనే ప్రారంభమైందని, చివరికి ముగిసేది కూడా కాంగ్రెస్‌లోనే అని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఆయన సోమవారం సీఎం రేవంత్‌రెడ్డితోపాటు వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డికి ఖర్గే కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తర్వాత పోచారం మీడియాతో మాట్లాడారు. ఒకప్పుడు ఎన్టీఆర్ పిలుపుతో తాను టీడీపీలో చేరానని, కేసీఆర్ నాయకత్వంలో పదేళ్లు పనిచేశానని చెప్పారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌లో చేరడం సంతోషంగా ఉందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు సమర్థ పాలన అందిస్తున్నారని.. రైతులకు మంచి జరగాలనే ఆయన నాయకత్వాన్ని బలపరుస్తున్నానని చెప్పారు. -
రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సీఎం రేవంత్ భేటీ
సాక్షి,ఢిల్లీ: ఢిల్లీ పర్యటనకు వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అటు పార్టీ, ఇటు ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. వివిధ శాఖలకు సంబంధించిన పనులపై వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. సోమవారం(జూన్24) సాయంత్రం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. సికింద్రాబాద్‌లో ఫ్లైఓవర్ల నిర్మాణాలకు కంటోన్మెంట్ భూముల అప్పగింత, సైనిక్ స్కూల్ తదితర అంశాలపై చర్చ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌తో రేవంత్ చర్చించారు. ఈ సమావేశంలో సీఎం వెంట ఎంపీలు మల్లు రవి,రఘురామరెడ్డి,బలరాం నాయక్,సురేష్ షెట్కార్,కిరణ్ కుమార్ రెడ్డి,రఘువీర్ రెడ్డి,కడియం కావ్య,గడ్డం వంశీ,రాజ్యసభ ఎంపీ అనిల్ కమార్ యాదవ్ మాజీమంత్రి కడియం శ్రీహరి,ఉన్నతాధికారులు పాల్గొన్నారు.