
పత్తనంతిట్ట(కేరళ): 2019 లోక్‌సభ ఎన్నికల్లో అమేథీ నుంచి ఓటమి పాలైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఈ దఫా మళ్లీ అక్కడి నుంచి పోటీ చేసే ధైర్యం లేదని బీజేపీ నేత రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.
యూపీలోని అమేథీలో పరాజయం పాలైన రాహుల్ అక్కడ్నుంచి కేరళలోని వయనాడ్‌కు వలసవచ్చారని ఎద్దేవా చేశారు. అయితే, మరోసారి ఆయన్ను ఎంపీగా చేయరాదని ఇప్పటికే వయనాడ్ ప్రజలు నిర్ణయించుకున్నట్లు తెలిసిందన్నారు. కేరళలోని పత్తనంతిట్ట లోక్‌సభ నియోజకవర్గంలో గురువారం జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో రాజ్‌నాథ్ ప్రసంగించారు.