కాంగ్రెస్ కంచుకోట అమేథీ నుంచి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. 2024 ఎన్నికల్లో ప్రతిష్టాత్మక పోరుగా భావిస్తున్న అమేధీ నుంచి ఆమె వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమిదిశగా పయనిస్తున్నారు.. కి కాంగ్రెస్ అభ్యర్థి, గాంధీ కుటుంబ విధేయుడు కేఎల్ శర్మ 28వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. నువ్వే నేనా అన్నట్టుగా సాగుతున్న ఈ పోరులో విజయం ఎవరిని వరిస్తుందో ఉత్కంఠగా మారింది.
శర్మకు గత 40 సంవత్సరాలుగా అమేథీతో అనుబంధం ఉంది. అమేథీలో ప్రియాంక గాంధీ వాద్రా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అమేథీకి మూడు పర్యాయాలు ఎంపీగా గెలిచిన రాహుల్ 2019లో ఇరానీ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే.
అటు దేశవ్యాప్తంగా కూడా బీజేపీకి ఫలితాలు ఆశాజనకంగా లేవు. ఇండియా కూటమి దాదాపు226పైగా సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. అటు 2019లో భారీ మెజార్జీసాధించిన బీజేపీ గతంతో పోలిస్తే 61 సీట్లతో నష్టంతో కేవలం 291 సీట్లలో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారం పీఠం ఎవరికి దక్కనుంది అనేదానిపై తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అమేథీ చరిత్ర ఇదీ
1980లో సంజయ్ గాంధీ విజయంతో వారసత్వం ప్రారంభమైంది. అతని ఆకస్మిక మరణం తరువాత, అతని సోదరుడు రాజీవ్ గాంధీ 1981 ఉప ఎన్నికలలో విజయం సాధించారు మరియు 1984, 1989 , 1991లో విజయం సాధించారు. రాజీవ్ హత్య తర్వాత, కుటుంబ విధేయుడైన సతీష్ శర్మ 1991 ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. 1999లో సోనియాగాంధీ, 2004, 2009, 2014లో రాహుల్‌గాంధీ అమేథీ ఎంపీ స్థానాన్ని గెలుచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment