లక్నో: లోక్‌సభ ఎన్నికల్లో తన ప్రత్యర్థి కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వాద్రా అని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అన్నారు. తనకు చిన్న పిల్లల వలే రాజకీయాలు చేయటం ఇష్టం లేదని తెలిపారు. స్మృతి ఇరానీ మీడియాతో మాట్లాడుతూ.. ప్రియాంకా గాంధీపై విమర్శలు చేశారు.
‘ఈ ఎన్నికల్లో అమేథీలో నా ప్రత్యర్థి.. ప్రియాంకా గాంధీ వాద్రా. నాపై ఆమె తెర వెనక నుంచి పోరాటం చేస్తున్నారు. కనీసం ఆమె సోదరుడు రాహుల్ గాంధీ నయం. ఆయన ప్రత్యక్షంగా పోటీలో ఉన్నారు. 2014లో రాహుల్ 1.07 లక్షల మెజార్టీతో గెలుపొందారు’ అని ప్రియాంకా గాంధీని ఎద్దేవా చేశారు.
ఇక.. కాంగ్రెస్ పార్టీ అమేథీ పార్లమెంట్ స్థానంలో గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన కిషోరి లాల్ శర్మను బరిలో నిలిపిన విషయం తెలిసిందే. అదేవిధంగా కాంగ్రెస్ కంచుకోట స్థానమైన రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ కేరళలోని వాయ్‌నాడ్‌లో సైతం పోటీ చేసిన విషయం తెలిసిందే.
ఇక.. అమేథీ, రాయ్ బరేలీ స్థానాలు ప్రియాంకా గాంధీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ రెండు స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఆమె కృషి చేస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాలో అన్ని తానై నేతలు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రచారంలో దుసూకువెళ్తున్నారు.
అమేథీ, రాయ్‌బరేలీ సెగ్మెంట్లలో ఐదో విడత మే 20న పోలింగ్ జరగనుంది. ఇక.. గతంలో రాయ్‌బరేలీలో సోనియా గాంధీ చేతీలో ఓడిపోయిన దినేష్ ప్రతాప్ సింగ్‌ను మళ్లీ బీజేపీ బరిలోకి దించింది.
Comments
Please login to add a commentAdd a comment