లోక్‌సభ ఎన్నికలు 2024: ముగిసిన ఐదో విడత పోలింగ్‌ | Lok Sabha Elections 2024 Fifth Phase Polling Live Updates And Highlights In Telugu | Sakshi
Sakshi News home page

Lok Sabha Elections 5th Phase Updates: ఐదో విడత పోలింగ్‌

Published Mon, May 20 2024 6:46 AM | Last Updated on Mon, May 20 2024 8:27 PM

Lok Sabha Elections 2024: Fifth Phase Polling Updates In Telugu

Updates

సాయంత్రం  7 గంటలవరకు నమోదయిన సగటు పోలింగ్ శాతం 57.38

  • బీహార్ - 52.35%
  • జమ్మూ-కాశ్మీర్ - 54.21%
  • జార్ఖండ్ - 61.90%
  • లఢఖ్ - 67.15%
  • మహారాష్ట్ర - 48.66%
  • ఒడిస్సా- 60.55%
  • ఉత్తరప్రదేశ్ - 55.80%
  • పశ్చిమబెంగాల్ - 73%

మధ్యాహ్నం 3 గంటల వరకు 47.53 శాతం పోలింగ్‌..

  • లోక్‌సభ  ఎన్నికల ఐదో విడత పోలింగ్‌ కొనసాగుతోంది
  • ప్రజలు తమ ఓటు హక్కు వినియోంగిచుకోవడానికి తరలి వస్తున్నారు.
  • మధ్యాహ్నం 3 గంటల వరకు సగటున 47.53 శాతం పోలింగ్ నమోదు
  • బీహార్ 45.33 శాతం
  • జమ్మూ అండ్ కాశ్మీర్ 44.90 శాతం
  • ఝార్ఖండ్ 53.90 శాతం
  • లడఖ్ 61.26 శాతం
  • మహారాష్ట్ర 38.77 శాతం
  • ఒడిశా 48.95శాతం
  • ఉత్తర ప్రదేశ్ 47.55 శాతం
  • వెస్ట్ బెంగాల్ 62.72 శాతం

మధ్యాహ్నం 1 గంట వరకు మొత్తం 36.73 శాతం పోలింగ్‌ నమోదైంది.

  • బీహార్ 34.62%
  • జమ్మూ కశ్మీర్ 34.79%
  • జార్ఖండ్ 41.89%
  • లడఖ్ 52.02%
  • మహారాష్ట్ర 27.78%
  • ఒడిశా 35.31%
  • ఉత్తరప్రదేశ్ 39.55%
  • పశ్చిమ బెంగాల్ 48.41%

     

మహారాష్ట్ర

  • బాలీవుడ్‌ హీరో హృతిక్‌ రోషన్‌ ఆయన తల్లిదండ్రులు రాకేష్‌ రోషన్‌, పింకీ రోషన్‌, సోదరి సునైనా రోషన్‌తో కలసి ఓటు వేశారు.
  • ముంబైలోని  ఓ పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

 

మహారాష్ట్ర

  • శివసేన (యూబీటీ) చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే, ఆయన భార్య రష్మీ, కుమారుడు ఆదిత్య ఠాక్రే ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • ముంబైలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.

     
     

మహారాష్ట్ర
నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

 

మహారాష్ట్ర

  • క్రికెటర్‌ అజింక్య రహానే దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • ముంబైలోని ఓ  పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.


     

 

 

 

 

ఢిల్లీ:

  • ఐదో దశ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది
  • ఉదయం 11 గంటల వరకు 23.66 శాతం ఓటింగ్ నమోదైంది.
  • బీహార్- 21.11%
  • జమ్మూ కశ్మీర్-  21.37%
  • జార్ఖండ్- 26.18%
  • లడఖ్- 27.87%
  • మహారాష్ట్ర- 15.93%
  • ఒడిశా- 21.07%
  • ఉత్తరప్రదేశ్- 27.76%
  • పశ్చిమ బెంగాల్- 32.70%

 

 

మహారాష్ట్ర

  • మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • థానేలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.

 

మహారాష్ట్ర:

  • బాలీవుడ్‌ దిగ్గజ నటుడు ధర్మేంద్ర ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • ముంబైలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.

 

మహారాష్ట్ర: 

  • ఎంపీ హేమా మాలిని, ఆమె కూమార్తె  ఇషా డియోల్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • ముంబైలోని  ఓ పోలింగ్‌ బూత్‌లో ఓటు వేశారు.

 

 

ఉత్తర ప్రదేశ్‌:

  • కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • లక్నోలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.
  • అనంతరం మీడియాతో మాట్లాడారు. 
  • అందరూ కుటుంబసభ్యులతో వచ్చిన ఓటు వేయాలని కోరుతున్నా.

 

 

ఉత్తర ప్రదేశ్‌: 

  • అమేథీ బీజేపీ ఎంపీ అభ్యర్థి స్మృతి ఇరానీ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • అమేథీలోని  ఓ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.

     

 

 

 

 

 మహారాష్ట్ర: 

  • బాలీవుడ్ నటుడు పరేష్‌ రావల్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • ముంబైలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.

     
     

 

ఢిల్లీ: 

  • ఐదో విడత పోలింగ్‌ కొనసాగుతోంది
  • ప్రజలు ఓటు వేయడానికి తరలి వస్తున్నారు.
  • ఉదయం 9 గంటల వరకు 49 లోక్ సభ నియోజక వర్గాల పరిధిలో నమోదైన పోలింగ్ శాతం 10.28 శాతం
  •  బీహార్ - 8.86% 
  • జమ్మూ-కాశ్మీర్ - 7.63% 
  • జార్ఖండ్ - 11.68% 
  • లఢఖ్ - 10.61% 
  • మహారాష్ట్ర - 6.33%
  •  ఒడిస్సా- 6.87% 
  • ఉత్తరప్రదేశ్ - 12.89% 
  • పశ్చిమబెంగాల్ - 15.35% 

 

 మహారాష్ట్ర: 

  • బాలీవుడ్ హీరోయిన్లు జాన్వీ కపూర్‌, సాన్య మల్హోత్రా  ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • ముంబైలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.

మహారాష్ట్ర: 

  • కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 
  • ముంబై పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.  
  • అనంతరం మీడియాలో మాట్లాడారు.
  • ఈ ఎన్నికల నాకు  గొప్ప అవకాశం ఇచ్చాయి.  
  • ప్రజలను కలిసి..  ఆశీస్సులు తీసుకున్నా.

 

 

మహారాష్ట్ర: 

  • బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • ముంబై పోలింగ్‌ కేంద్రంలో  ఓటు వేశారు.
  • అనంతరం మీడియాతో మాట్లాడారు.
  • భారత్‌ అభివృద్ధి చెందాలి
  • దానిని దృష్టితో పెట్టుకొని ఓటు వేశాను
  • ప్రజలు ఓటు వేయడానికి భారీ సంఖ్యలో వస్తున్నారు.


     

 

 

మహారాష్ట్ర: 

  • బాలీవుడ్‌ హీరో ఫర్హాన్‌ అక్తర్‌, డైరెక్టర్‌ జోయా అక్తర్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

     

  • ముంబైలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.

 

 

 

రికార్డు సంఖ్యలో ఓటు వేయండి: ప్రధాని మోదీ

 

మహారాష్ట్ర: 

  • వ్యాపారవేత్త అనిల్‌ అంబాని ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • ముంబైలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.

ఉత్తర ప్రదేశ్‌:

  • మాజీ సీఎం,  బీఎస్పీ చీఫ్‌ మాయావతి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • లక్నోలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.
  • అనంతరం మీడియాతో మాట్లాడారు. 
  • ప్రజలంతా పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు వేయాలని కోరారు. 
  • ఐదో విడత పోలింగ్‌ కొనసాగుతోంది.
  • ప్రజలు ఓటు  వేయడానికి క్యూలైన్‌లో నిల్చుంటున్నారు.


     

బిహార్‌

  • బిహార్‌లోని ముజఫర్‌ నగర్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద భారీ సంఖ్యలో ఓటు వేయడానికి మహిళలు క్యూలైన్‌లో నిల్చున్నారు. 

 

  • ఐదో విడత పోలింగ్‌ ప్రారంభమైంది

     

 

 

  • లోక్‌సభ ఎన్నికల్లో ఐదో దశ పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది. 

  • ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 49 స్థానాలకు ఈరోజు పోలింగ్‌ జరగనుంది. 

  • కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, స్మృతి ఇరానీ, జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా, తదితర కీలక నేతలు పోటీచేస్తున్న నియోజకవర్గాల్లోనూ ఈరోజే పోలింగ్‌ చేపడుతున్నారు.  

  • ఏడు దశలను చూస్తే ఈ ఐదో దశలోనే అత్యంత తక్కువ(49) స్థానాల్లో పోలింగ్‌ జరుగుతోంది. 

  • ఈ 49 స్థానాల్లో 2019 ఎన్నికల్లో బీజేపీ 40కిపైగా చోట్ల విజయం సాధించడం విశేషం. 

  • దీంతో ఈ దశ బీజేపీకి ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. 

  • ఈసారైనా మెరుగైన ఓటింగ్‌ సాధించేలా ఓటర్లు పోలింగ్‌ ప్రక్రియలో భారీగా పాలుపంచుకోవాలని ముంబై, థానె, లక్నో నగర ఓటర్లకు ఈసీ ఆదివారం విజ్ఞప్తి చేసింది. 

    బరిలో కీలక నేతలు
    కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌(లక్నో), పియూశ్‌ గోయల్‌( నార్త్‌ ముంబై), కౌశల్‌ కిశోర్‌(మోహన్‌లాల్‌గంజ్‌), సాధ్వి నిరంజన్‌ జ్యోతి(ఫతేపూర్‌), శంతను ఠాకూర్‌ (పశ్చిమబెంగాల్‌లోని బంగావ్‌), ఎల్‌జేపీ(రాంవిలాస్‌) నేత చిరాగ్‌ పాశ్వాన్‌ (బిహార్‌లోని హాజీపూర్‌), శివసేన శ్రీకాంత్‌ షిండే(మహారాష్ట్రలోని కళ్యాణ్‌), బీజేపీ నేత రాజీవ్‌ ప్రతాప్‌ రూఢీ, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమార్తె రోహిణి ఆచార్య( బిహార్‌లోని సరణ్‌), ప్రముఖ న్యాయవాది ఉజ్వల్‌ నికమ్‌(ముంబై నార్త్‌ సెంట్రల్‌)ల భవితవ్యం సోమవారమే ఈవీఎంలలో నిక్షిప్తం కాబోతోంది. 

  • విపక్షాలు అధికారంలోకి వస్తే అయోధ్య బాలరామాలయం పైకి బుల్డోజర్లను పంపిస్తారని మోదీ తీవ్ర విమర్శలు, ఎన్‌డీఏ 400 చోట్ల గెలిస్తే రాజ్యాంగాన్ని ఇష్టమొచ్చినట్లు మారుస్తుందని, రిజర్వేషన్లు తీసేస్తుందని కాంగ్రెస్‌ విమర్శలతో ఐదో దశ ప్రచారపర్వంలో కాస్తంత వేడి పుట్టించింది. 

  • ఒడిశాలో ఐదు లోక్‌సభ స్థానాలతోపాటు అసెంబ్లీ ఎన్నికల్లో రెండో దశ కింద 35 ఎమ్మెల్యే స్థానాల్లోనూ సోమవారం పోలింగ్‌ జరగనుంది.

  •  బిజూ జనతాదళ్‌ అధ్యక్షుడు నవీన్‌ పట్నాయక్‌ పోటీచేస్తున్న హింజీలీ అసెంబ్లీ స్థానంలో ఈరోజే పోలింగ్‌ ఉంది. 

  • లోక్‌సభ ఎన్నికల్లో నాలుగోదశ ముగిశాక 543 స్థానాలకుగాను 23 రాష్ట్రాలు,యూటీల్లో ఇప్పటిదాకా 379 స్థానాల్లో పోలింగ్‌ పూర్తయింది.

  • ఆరో దశ పోలింగ్‌ మే 25న, ఏడో దశ జూన్‌ ఒకటిన జరగనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement