లక్నో: పాకిస్తాన్ మాజీ మంత్రి చౌదరి ఫవాద్ హుస్సేన్ ప్రశంసల అంశంపై స్పందిసస్తూ.. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. మంగళవారం ఓ ర్యాలీలో పాల్గొన్న స్మృతి ఇరానీ మాట్లాడుతూ.. అమెథీలో ప్రస్తుతం ఏకే 203 రైఫిల్స్ ఫ్యాక్టరీ ఉందని అన్నారు. వాటిని ఉపయోంగించి దేశ సరిహద్దుల వద్ద పాకిస్తాన్ ఉగ్రవాదలను అంతం చేస్తామని తెలిపారు.
‘‘పాక్ మాజీ మంత్రి ఆయన దేశం గురించి ఆందోళన పడాలి కానీ, అమేథీ కోసం కాదు. లోక్‌సభ ఎన్నికల్లో నేను కాంగ్రెస్ నేతతో పోటీ పడుతుంటే.. పాకిస్తాన్ నేత మాత్రం నన్ను ఓడించాలంటున్నారు. పాకిస్తాన్‌ను పాలించటం చేతకాని వాళ్లు.. అమేథీ గురించి ఆందోళన పడుతున్నారు.
నా మాటలు పాక్ మంత్రికి చేరితే.. నేను ఒక్కటి చెప్పదల్చుకున్నా. అమేథీలో ప్రధాని మోదీ ఏకే 203 రైఫిల్స్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు. వాటితో హరిహద్దుల్లో పాక్ ఉగ్రవాదులను అంతం చేస్తాం’’ అని స్మృతి ఇరానీ అన్నారు. పాకిస్తాన్ మాజీ మంత్రి వ్యాఖ్యల రాహుల్ గాంధీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. పాకిస్తాన్‌తో రాహుల్ గాంధీకి ఉన్న సంబంధం ఏంటని నిలిదీశారు.
భారత్‌లో ఎన్నికలు జరుగుతుంటే కాంగ్రెస్ నేతలు పొరుగు దేశాల మద్దతు కోరుతున్నారని విమర్శించారు. అమేథీలో స్మృతి ఇరానీకి పోటీగా కాంగ్రెస్ పార్టీ కిషోరి లాల్ సింగ్‌ను బరిలోకి దించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment