23 నుంచి రాజ్‌నాథ్‌ సింగ్‌ అమెరికా పర్యటన | Minister Rajnath Singh to Visit America | Sakshi
Sakshi News home page

23 నుంచి రాజ్‌నాథ్‌ సింగ్‌ అమెరికా పర్యటన

Aug 21 2024 12:33 PM | Updated on Aug 21 2024 1:29 PM

Minister Rajnath Singh to Visit America

భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆగస్టు 23 నుంచి అమెరికాలో పర్యటించనున్నారు. అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఆహ్వానం మేరకు ఆయన అమెరికా పయనమవుతున్నారు. రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆగస్టు 26 వరకు అమెరికాలోనే ఉండనున్నారు.

ఈ పర్యటనలో రాజ్‌నాథ్‌ సింగ్‌ అమెరికా రక్షణ మంత్రితో సమావేశం కానున్నారు. అమెరికా అధ్యక్షుని జాతీయ భద్రతా వ్యవహారాల సహాయకుడు జేక్ సుల్విన్‌తో కూడా రక్షణ మంత్రి భేటీ కానున్నారు. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తృతం చేస్తుందని భావిస్తున్నారు. అమెరికా రక్షణ పరిశ్రమతో రక్షణ మంత్రి రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా నిర్వహించనున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement