cooperation
-
ప్రధాని మోదీతో ఢిల్లీ సీఎం అతిశి భేటీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశి సోమవారం భేటీ అయ్యారు. తమ ప్రభుత్వానికి కేంద్రం నుంచి సహకారం లభిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఈ రోజు గౌరవ ప్రధాని నరేంద్రమోదీ గారిని కలిశాను. మన రాజధాని సంక్షేమం, అభివృద్ధి గురించి ఢిల్లీ ప్రభుత్వానికి కేంద్రం నుంచి పూర్తి సహకారం కోసం ఎదురు చూస్తున్నాను’’ అని ఆమె ఎక్స్‌లో పోస్టు చేశారు. గత నెలలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆమె మొదటిసారి ప్రధానిని కలిశారు. ఈ సమావేశం గురించి ప్రధాన మంత్రి కార్యాలయం కూడా ఎక్స్‌లో పోస్ట్ చేసింది. -
23 నుంచి రాజ్‌నాథ్ సింగ్ అమెరికా పర్యటన
భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆగస్టు 23 నుంచి అమెరికాలో పర్యటించనున్నారు. అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఆహ్వానం మేరకు ఆయన అమెరికా పయనమవుతున్నారు. రాజ్‌నాథ్ సింగ్ ఆగస్టు 26 వరకు అమెరికాలోనే ఉండనున్నారు.ఈ పర్యటనలో రాజ్‌నాథ్ సింగ్ అమెరికా రక్షణ మంత్రితో సమావేశం కానున్నారు. అమెరికా అధ్యక్షుని జాతీయ భద్రతా వ్యవహారాల సహాయకుడు జేక్ సుల్విన్తో కూడా రక్షణ మంత్రి భేటీ కానున్నారు. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తృతం చేస్తుందని భావిస్తున్నారు. అమెరికా రక్షణ పరిశ్రమతో రక్షణ మంత్రి రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా నిర్వహించనున్నారు. Defence Minister Rajnath Singh will be undertaking an official visit to the United States from August 23 to 26, on the invitation of the US Secretary of Defence Lloyd Austin. During the visit, the Raksha Mantri will hold a bilateral meeting with his US counterpart Secretary… pic.twitter.com/YV3vzUQrTw— ANI (@ANI) August 21, 2024 -
సమ్మిళిత అభివృద్ధికి సహకార నమూనా!
‘సమాజంలో ప్రతి ఒక్కరి కోసం మెరుగైన ప్రపంచాన్ని సహకార సంఘాలు నిర్మిస్తాయి...’ ఇదీ ఈ ఏడాది అంతర్జాతీయ సహకార దినోత్సవ నినాదం! జూలై మొదటి శనివారం నాడు సహకార దినోత్సవం జరుపుకోవటం ఆనవాయితీ. ఈ జూలై 6న సహకార దినోత్సవ సంబురం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కోట్లాది సహకారులు రకరకాల కార్యక్రమాల ద్వారా సరికొత్త ఆశలతో సహకార స్ఫూర్తిని మరోసారి చాటడానికి సమాయత్తమవుతున్నారు.మూడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సహకార శాఖను ఏర్పాటు చేసి అనేక సంస్కరణలు చేపట్టిన తర్వాత మన దేశంలో సహకార వ్యవస్థలో కొత్త కదలిక మొదలైంది. అంతకుముందు నుంచే రాష్ట్రాల్లో ప్రత్యేకంగా సహకార శాఖలు ఉన్నప్పటికీ కేంద్రం స్థాయిలో వ్యవసాయ శాఖలో ఒక విభాగంగానే సహకార పాలన ఉంటూ వచ్చింది.అనాదిగా రైతులకు రుణాలు ఇచ్చే సొసైటీలుగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలు (పీఏసీఎస్‌లు) రైతుల ఆర్థిక సేవలకే పరిమితం కాకుండా ఇతర ప్రజల అవసరాలను కూడా తీర్చే వ్యాపార సంస్థగా ఉండాలని భావించి కేంద్ర సహకార శాఖ పీఏసీఎస్ లకు సరికొత్త బైలాస్‌ను నిర్దేశించటం ఒక కీలక పరిణామం. ఈ సేవలన్నీ పారదర్శకంగా అందించటం కోసం పీఏసీఎస్ లన్నిటినీ కంప్యూటరీకరించే పని జరుగుతోంది.పీఏసీఎస్‌ల తర్వాత సంఖ్యాపరంగా పాడి రైతుల సొసైటీలు, మహిళా సహకార సంఘాలు (ఉదా: లిజ్జత్ పాపడ్‌ను ఉత్పత్తి చేసే మహిళా సొసైటీ), చేనేత కార్మికుల సొసైటీలు, మత్స్యకారుల సొసైటీలు, గృహనిర్మాణ సొసైటీలు, ఉద్యోగుల సొసైటీలు, ప్రత్యేకించి కార్మికుల సొసైటీలు (ఉదా: కేరళలో ప్రసిద్ధమైన ఉరులుంగల్ నిర్మాణ కార్మికుల సొసైటీ) సైతం గతంలోనే ఏర్పాటు కావటం మనకు తెలిసిందే.గుజరాత్లో ఏర్పడిన చిన్న పిల్లల పొదుపు సహకార సంఘం పెద్ద హిట్ అయ్యింది. ఆధునిక కాలానికి అనుగుణంగా సరికొత్త వర్గాలు విలక్షణమైన సహకార సంఘాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. అర్బన్ ప్రాంతాల్లో చిన్నపాటి ఎలక్ట్రానిక్ వస్తువులకు రిపేర్లు చేసే పనివారి సహకార సంఘం కూడా ఏర్పాటైంది. ఈ–కామర్స్ సంస్థల్లో వస్తువులు పంపిణీ చేసే గిగ్‌వర్కర్ల సహకార సంస్థలు సైతం ఏర్పాటవుతున్నాయి.ఆయుర్దాయం పెరుగుతున్న కొద్దీ గ్రామాల్లో, పట్టణాల్లో వయోవృద్ధుల జనాభా పెరుగుతోంది. పిల్లలు చదువులు/ ఉద్యోగాలు/ వ్యాపారాల కోసం దేశ విదేశాలకు వెళ్లిపోవటంతో గ్రామాలు/ పట్టణాలు/ నగరాల్లో వృద్ధులే మిగిలిపోతున్నారు. కొందరు వృద్ధాశ్రమాల్లో చేరుతున్నా ఇళ్లు వదిలి వెళ్లలేక, అక్కడే ఉండలేక పండుటాకులు నానా అగచాట్లు పడుతున్నారు.వీరి ప్రత్యేక ఆహార, వైద్య, సామాజిక అవసరాలు తీర్చే ప్రత్యేక సహకార సంఘాలు ఇప్పటికే కేరళ వంటి రాష్ట్రాల్లో విశేష సేవలు అందిస్తున్నాయి. ప్రత్యేకంగా కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేసుకొని ఉమ్మడిగా భోజన ఏర్పాట్లు చేసుకోవటం దగ్గరి నుంచి.. ప్రత్యేక ఆసుపత్రులు ఏర్పాటు చేసుకునే వరకు సభ్యులైన వృద్ధులకు అనేక సేవలు అందిస్తున్నాయి ఈ సొసైటీలు. తెలుగు రాష్ట్రాల్లోనూ వృద్ధుల సహకార సంఘాల అవసరం ఎంతో ఉంది.గుజరాత్లో సహకార వ్యవస్థతో గట్టి సంబంధం ఉన్న అమిత్ షా కేంద్ర సహకార మంత్రిగా ఇటీవలే రెండోసారి బాధ్యతలు చేపట్టారు. సహకార వ్యాపారాన్ని దేశ విదేశాల్లో కొత్త పుంతలు తొక్కించాలన్నది తమ లక్ష్యమని మోదీ, అమిత్‌షా చెబుతున్నారు. సహకార రంగంలో ఢిల్లీ నుంచి తేదలచిన మార్పులన్నిటినీ క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సింది రాష్ట్ర సహకార శాఖలు. రాష్ట్రస్థాయిలో సహకార వ్యవస్థ చురుగ్గా పనిచేయాలంటే సలహా మండళ్లు కీలకం. వాటి జాడ లేకుండా పోయింది.సాచివేత ధోరణి, అవినీతి, మితిమీరిన రాజకీయ జోక్యం, జవాబుదారీతనం లోపించటం వంటి జాడ్యాలతో కునారిల్లుతున్న సహకార శాఖల్లో కొత్తగా సహకార స్ఫూర్తి వెల్లివిరియాలంటే రాష్ట్ర స్థాయిలోనూ సంస్కరణలు తేవాలి. అప్పుడే ‘సహకార నమూనా’ మేలైన సమ్మిళిత అభివృద్ధి మార్గంగా నిలుస్తుంది. వాతావరణ మార్పుల గడ్డు కాలంలో సహకార అభివృద్ధి నమూనా కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. – పంతంగి రాంబాబు, సీనియర్ జర్నలిస్ట్ -
సహకార ‘భారత్ ఆర్గానిక్స్’!
సహకార రంగంలో పాల ఉత్పత్తులకు కొండగుర్తుగా మారిన ‘అమూల్’ బ్రాండ్ మాదిరిగానే ప్రకృతి/సేంద్రియ ఆహారోత్పత్తుల విక్రయానికి ‘భారత్ ఆర్గానిక్స్’ బ్రాండ్‌ను కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ ఇటీవల ఆవిష్కరించింది. ప్రకృతి /సేంద్రియ వ్యవసాయదారులు దేశవ్యాప్తంగా పండిస్తున్న ఆరోగ్యదాయక ఆహారోత్పత్తులకు ‘భారత్ ఆర్గానిక్స్’ బ్రాండ్ ఇక చిరునామాగా మారనుంది. ఇందుకోసం రూ. 500 కోట్ల అధీకృత మూలధనంతో ‘నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ (ఎన్‌సిఓఎల్)’ పేరిట ఓ మెగా మల్టీస్టేట్ కోఆపరేటివ్ ఏర్పాటైంది. సేంద్రియ/ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల సహకార సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్పిఓల) నుంచి పంట దిగుబడులను ఎన్‌సిఓఎల్ కొనుగోలు చేస్తుంది. వాటిని శుద్ధి చేసి, విలువను జోడిస్తుంది. ఆ సేంద్రియ ఆహారోత్పత్తులను ‘భారత్ ఆర్గానిక్స్’ పేరిట దేశవిదేశాల్లో విక్రయిస్తుంది. ప్రస్తుతం బియ్యం, కందిపప్పు, పెసరపప్పు, బెల్లం, రాజ్మా అమూల్ నెట్వర్క్ ద్వారా విక్రయాలు ప్రారంభమయ్యాయి. 2024 జనవరి నుంచి మరో 14 రకాలు కూడా అమ్ముతారు. లాభాల్లో 50%ను రైతులకు తిరిగి చెల్లించనున్న ఈ మెగా ఆర్గానిక్ మార్కెటింగ్ కోఆపరేటివ్ గురించి కథనం.. సేంద్రియ / ప్రకృతి సేద్యంలో పండించిన రసాయనిక అవశేషాల్లేని ఆరోగ్యదాయక ఆహారోత్పత్తుల ప్రాధాన్యాన్ని ప్రపంచం అర్థం చేసుకుంటోంది. 27 లక్షల హెక్టార్లలో సేంద్రియ/ప్రకృతి సాగుతో ప్రపంచంలో మన దేశం నాలుగో స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా 34 లక్షల మంది సేంద్రియ/ప్రకృతి వ్యవసాయదారులలో 16 లక్షల మంది మన దేశీయులే. అయినప్పటికీ, విశ్వ విపణిలో మన సేంద్రియ ఉత్పత్తుల వాటా మాత్రం 2.7% మాత్రమే. సేంద్రియ ఉత్పత్తులు పండించే రైతులు, సహకార సంఘాలు, ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్పిఓ) నుంచి ఉత్పత్తుల నాణ్యతను పరీక్షించి, కొనుగోలు చేసి, ప్రాసెస్ చేసి, మార్కెట్ చేయడానికి దేశంలో తగినన్ని ప్రభుత్వ /సహకార రంగంలో సదుపాయాలు లేకపోవటం ఇందుకు ఒక కారణంగా చెప్పొచ్చు. రసాయనిక అవశేషాల్లేని పంటలు పండించే రైతుల్లో చాలా మందికి ఆ పంట దిగుబడులను మంచి ధరకు అమ్ముకోవటం సమస్యగా మారింది. అదేమాదిరిగా, పూర్తిగా నమ్మదగిన సేంద్రియ/ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించిన ఆహారోత్పత్తులను ప్రజలకు నేరుగా విక్రయించే దేశవ్యాప్త వ్యవస్థ కూడా ఇన్నాళ్లూ కొరవడింది. ఇప్పుడు ఆ కొరత తీరనుంది. రూ.500 కోట్ల అథీకృత మూలధనం ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించేందుకు మూడు అతిపెద్ద మల్టీస్టేట్ కోఆపరేటివ్‌లను కేంద్ర సహకార శాఖ ఇటీవల నెలకొల్పింది. సర్టిఫైడ్ విత్తనాలు/దేశీ వంగడాల పరిరక్షణ, సరఫరా కోసం ఒకటి.. సహకార కళాకృతులు, ఇతర ఉత్పత్తుల మార్కెటింగ్‌కు మరొకటి.. ఈ కోవలోనిదే ‘నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ (ఎన్‌సిఓఎల్)’ కూడా. రూ.500 కోట్ల అథీకృత మూలధనంతో ఎన్‌సిఓఎల్ ఏర్పాటైంది. మల్టీ–స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 2002 కింద నమైదైంది. దేశంలోని 5 ప్రధాన సహకార సంఘాలు, సంస్థలు సేంద్రియ/ప్రకృతి రైతులకు సౌలభ్యకరమైన, ఆధారపడదగిన, శక్తివంతమైన, సహకార మార్కెటింగ్ వ్యవస్థను అందించటంతో పాటు.. దేశంలోనే కాదు విదేశాల్లోని వినియోగదారులకు విశ్వసనీయతతో కూడిన సేంద్రియ సహకార ఆహారోత్పత్తులను ‘భారత్ ఆర్గానిక్స్’ బ్రాండ్ ద్వారా అందుబాటులోకి తేవటమే ఎన్‌సిఓఎల్ లక్ష్యంగా పెట్టుకుంది. సేంద్రీయ రైతు ఉత్పత్తి సంస్థలకు మార్కెట్లోకి ప్రత్యక్ష ప్రవేశం కల్పించడం ద్వారా ఉత్పత్తులపై రాబడిని పెంచడం ఎన్‌సిఓఎల్ లక్ష్యం. బలమైన బ్రాండ్‌తో జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లోకి ప్రవేశించటం ద్వారా సహకార సంఘాల్లో సభ్యులైన రైతులు తమ సేంద్రియ ఉత్పత్తులకు మెరుగైన రాబడిని పొందుతారు. సంబంధిత మంత్రిత్వ శాఖల సహకారంతో దేశవ్యాప్తంగా వివిధ సహకార సంఘాలు, సంబంధిత సంస్థలు ఉత్పత్తి చేసే సేంద్రియ ఉత్పత్తుల మొత్తం సరఫరా గొలుసును నిర్వహించడం ద్వారా ఎన్‌సిఓఎల్ ఒక గొడుగు సంస్థగా పనిచేస్తుంది. దక్షిణాది తొలి సభ్యత్వం ఏదైనా సహకార సంఘం లేదా వ్యక్తుల సంఘం (సెంట్రల్ రిజిస్ట్రార్ అనుమతించిన విధంగా) ఎన్‌సిఓఎల్‌లో సభ్యత్వం పొందవచ్చు. దాదాపు 2,000 సహకార సంఘాలు ఇప్పటికే ఎన్‌సిఓఎల్‌లో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎన్‌సిఓఎల్‌లో తొలి సభ్యత్వాన్ని పొందిన ఘనత ఎఎస్ఆర్ జిల్లాకు చెందిన ‘ఎం.నిట్టపుట్టు గిరిజన రైతు సేవా మరియు ఉత్పత్తిదారుల మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ’కి దక్కింది. ఎన్‌సిఓఎల్ మెంబర్షిప్ సర్టిఫికెట్‌ను అమిత్‌షా నుంచి సొసైటీ సీఈవో పి. గంగరాజు అందుకున్నారు. సభ్యత్వ ధృవీకరణ అందుకున్న తొలి ఐదుగురిలో ఈయన ఒకరు కావటం విశేషం. అతిపెద్ద బ్రాండ్ కానున్న ‘భారత్ ఆర్గానిక్స్’ రానున్న పదేళ్లలో ప్రపంచంలో అతిపెద్ద ఆర్గానిక్ ఫుడ్ బ్రాండ్‌గా ‘భారత్ ఆర్గానిక్స్’ రూపుదాల్చుతుందని ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ఎన్‌సిఓఎల్ ఆవిర్భావ సభలో కేంద్ర సహకార మంత్రి అమిత్‌షా ఆశాభావం వ్యక్తం చేశారు. భూసారం, సేంద్రియ ఆహారోత్పత్తుల పరీక్షల కోసం ప్రతి జిల్లా, తహసీల్‌లో నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్(ఎన్‌పిఓపి) గుర్తింపు పొందిన లేబరేటరీలు ఏర్పాటు కానుండటం విశేషం. ప్రకృతి సేద్యానికి మరింత ప్రోత్సాహం నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ (ఎన్‌సిఓఎల్) ఆవిర్భావంతో సర్టిఫైడ్ ఆర్గానిక్ ఆహారోత్పత్తుల మార్కెటింగ్ వ్యవస్థ జాతీయ స్థాయిలో వ్యవస్థీకృతం అవుతుండటం ఆనందదాయకం. మార్కెటింగ్ సదుపాయం పెరిగితే ప్రకృతి సేద్య విస్తీర్ణం మరింత పెరగటానికి వీలవుతుంది. ఎన్‌సిఓఎల్ కార్యకలాపాలకు ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఏపీ రైతు సాధికార సంస్థ నోడల్ ఏజన్సీగా పనిచేస్తోంది. ఎన్‌సిఓఎల్‌లో వ్యక్తిగతంగా రైతులు సభ్యులుగా చేరలేరు. 1964 సహకార చట్టం, 1995 మాక్స్ చట్టం కింద రిజిస్టరైన ప్రకృతి వ్యవసాయదారుల సహకార సంఘాలు, ఎఫ్పిఓలు (కంపెనీ చట్టం కింద నమోదైన ఎఫ్పిఓలు అర్హులు కాదు), మండల మహిళా సమాఖ్యలు ఎన్‌సిఓఎల్‌లో సభ్యులుగా చేరొచ్చు. కనీస మద్దతు ధర లేదా మార్కెట్ ధరలో ఏది ఎక్కువ ఉంటే దాని మీద అదనంగా 10–15 శాతం ప్రీమియం చెల్లించి ఎన్‌సిఓఎల్ కొనుగోలు చేస్తుంది. లాభాల్లో 50% సభ్యులకు తిరిగి చెల్లిస్తుంది. ఏపీలో ప్రతి జిల్లాకు రెండు చొప్పున ఎఫ్పిఓలు /సహకార సంఘాలు /మండల సమాఖ్యలను సభ్యులుగా చేర్చుతున్నాం. ప్రస్తుతానికి ప్రాసెసింగ్ చేసిన బియ్యం, బెల్లం, కందిపప్పు, పెసరపప్పు,శనగపప్పు, రాజ్మా గింజలను ఎన్‌సిఓఎల్ కొనుగోలు చేస్తున్నది. వచ్చే జనవరి నుంచి 20 రకాల సేంద్రియ ఆహారోత్పత్తుల్ని కొనుగోలు చేస్తుంది. చిత్తూరు జిల్లాలోని అమూల్ సంస్థ ఆవరణలో ప్రాసెసింగ్ యూనిట్‌ను ఎన్‌సిఓఎల్ నెలకొల్పనుంది. అమూల్ ఆర్గానిక్స్ బ్రాండ్‌తో ఈ ఉత్పత్తులు ఇప్పటికే మార్కెట్లోకి వచ్చాయి. భారత్ ఆర్గానిక్స్ బ్రాండ్ ఉత్పత్తులు త్వరలోనే అందుబాటులోకి వస్తాయి. ఉత్తరాదిలో సఫల్, మదర్ డెయిరీ, అమూల్ రిటైల్ ఔట్లెట్లలో సేంద్రియ ఆహారోత్పత్తుల విక్రయం ప్రారంభమైంది. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ఎన్‌సిఓఎల్ ఆవిర్భావ సభలో ఏపీ ఆర్‌వైఎస్‌ఎస్ నుంచి వచ్చిన 55 మంది ప్రతినిధులం పాల్గొన్నాం. ప్రతి జిల్లాకు రెండు చొప్పున ఎఫ్పిఓలు, సహకార సంఘాలు, మాక్స్ చట్టం కింద నమోదైన మండల సమాఖ్యలను సభ్యులుగా చేర్పిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయం విస్తారంగా జరుగుతున్న ఏపీ నుంచే ఎక్కువ సభ్యులు చేరే అవకాశం ఉంది. ఏపీ నుంచి ఎన్‌సిఓఎల్‌లో చేరదలచిన సంస్థలు మమ్మల్ని సంప్రదించవచ్చు. – బొడ్డు ప్రభాకర్ (97714 63539), మార్కెటింగ్ హెడ్, రైతు సాధికార సంస్థ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. prabhakar@ryss.ap.gov. త్వరలో ఆన్లైన్ విక్రయాలు ప్రకృతి/సేంద్రియ వ్యవసాయోత్పత్తులను సహకార సంఘాలు, ఎఫ్పిఓల నుంచి కనీస మద్దతు ధరకన్నా కొంత అధిక ధర చెల్లించి కొనుగోలు చేస్తాం. మరో ముఖ్య విషయం ఏమిటంటే.. ఎన్‌సిఓఎల్ పొందే నికర లాభాల్లో 50 శాతం మొత్తాన్ని రైతులకు తిరిగి చెల్లిస్తాం. ప్రకృతి/సేంద్రియ ఆహారోత్పత్తులను ‘భారత్ ఆర్గానిక్స్’ బ్రాండ్‌తో ప్రజలకు రిటైల్‌గా ఆన్లైన్లో విక్రయించే సదుపాయాన్ని త్వరలో అందుబాటులోకి తెస్తాం. ప్రస్తుతం ఈ ప్రయత్నాలు చివరి దశలో ఉన్నాయి. ఎన్‌సిఓఎల్‌లో సభ్యులుగా చేరదలచిన సహకార సంఘాలు, ఎఫ్పిఓలు, మండల సమాఖ్యలు ఏ రాష్ట్రం వారైనప్పటికీ ఈ కింది మెయిల్ ఐడి ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు. – కోదండపాణి, మేనేజింగ్ డైరెక్టర్, నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ (ఎన్‌సిఓఎల్), న్యూఢిల్లీ. cooporganics@gmail.com వినియోగదారుల సందేహాలకు తావుండదు సేంద్రియ, ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఆహారోత్పత్తులను కొనేటప్పుడు వినియోగదారులు వీటిని ఎవరు, ఎక్కడ పండించారు? నిజంగా ఆర్గానిక్గానే పండించారా అనే సందేహాలు వస్తుంటాయి. ఎన్‌సిఓఎల్ ద్వారా ‘భారత్ ఆర్గానిక్స్’ సేంద్రియ ఆహారోత్పత్తులు మార్కెట్లో అందుబాటులోకి వస్తే ప్రజలకు ఈ సందేహాలు తీరిపోతాయి. మా గిరిజన సహకార సంఘం దక్షిణాది నుంచి ఎన్‌సిఓఎల్‌లో తొలి సభ్యత్వం పొందటం ఆనందంగా ఉంది. గతంలో ఉన్న మార్కెటింగ్ సమస్యలు తీరిపోతాయి. ఎఎస్ఆర్ లల్లా జి. మాడుగుల మండలంలో 3683 మంది గిరిజన రైతులు మా సొసైటీలో సభ్యులుగా ఉన్నారు. ఇందులో 2012 మంది సర్టిఫైడ్ ఆర్గానిక్ రైతులు. కాఫీ, మిరియాలు, పిప్పళ్లు, పసుపు, అల్లం, రాజ్మా ఎగుమతుల కోసం విక్రయిస్తున్నాం. ఇతర పంట దిగుబడులను స్థానిక మార్కెట్లలో అమ్ముతున్నాం. ప్రభుత్వ ధరకన్నా ఎక్కువ ధరనే రైతులకు చెల్లిస్తున్నాం. గత ఏడాది రూ. 4 కోట్ల కాఫీ, మిరియాలు విక్రయించాం. ఏపీ ఆర్‌వైఎస్‌ఎస్, ఉద్యానశాఖ తోడ్పాటుతో 10 టన్నుల గోదాములు నిర్మించాం. ప్రకృతి వ్యవసాయంలో ఆరితేరిన మా రైతులు 20 మంది మేఘాలయ వెళ్లి అక్కడి రైతులకు ప్రకృతి సేద్యం నేర్పిస్తున్నారు. గత ఏడాది మా సొసైటీకి జాతీయ జైవిక్ ఇండియా పురస్కారం కూడా లభించింది. ఎన్‌సిఓఎల్ ద్వారా రైతులకు, ప్రజలకు మేలు జరుగుతుంది. – పి. గంగరాజు (63018 76177), సీఈఓ, ఎం.నిట్టపుట్టు గిరిజన రైతుల సొసైటీ, అరకు, ఎఎస్ఆర్ జిల్లా – పంతంగి రాంబాబు, సీనియర్ జర్నలిస్టు (చదవండి: వరి ఆకారపు మిల్లెట్లు! మిల్లెట్లు తినేవారిగా మార్చేలా) -
అది స్నేహం, సహకారం, శాంతి యాత్ర: చైనా
బీజింగ్: రష్యాలో చైనా అధినేత షీ జిన్‌పింగ్ పర్యటన బుధవారం ముగిసింది. ఈ పర్యటనను స్నేహం, సహకారం, శాంతి యాత్రగా చైనా అభివర్ణించింది. ఉక్రెయిన్‌కు అమెరికా ఆయుధ, ఆర్థిక సాయం అందిస్తుండడాన్ని డ్రాగన్ దేశం తప్పుపట్టింది. ఉక్రెయిన్–రష్యా మధ్య ఉద్రిక్తతలను ఇంకా రెచ్చగొట్టడానికి అమెరికా కుట్రలు పన్నుతోందని ఆరోపించింది. ఉక్రెయిన్–రష్యా యుద్ధం విషయంలో తాము తటస్థంగానే వ్యవహరిస్తామని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ బుధవారం స్పష్టం చేశారు. ఉక్రెయిన్ విషయంలో తమకు ఎలాంటి స్వార్థపూరిత ప్రయోజనాలు లేవన్నారు. ఈ యుద్ధాన్ని లాభం కోసం వాడుకోవాలన్న ఆలోచన ఎంతమాత్రం లేదని తేల్చిచెప్పారు. జిన్‌పింగ్ రష్యా పర్యటనపై ప్రపంచవ్యాప్తంగా పూర్తి సానుకూల స్పందన వ్యక్తమైందని వెన్బిన్ హర్షం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్–రష్యా దేశాల నడుమ శాంతి చర్చల కోసం తాము చొరవ చూపుతున్నామని వివరించారు. ఇదిలా ఉండగా, జిన్‌పింగ్ రష్యా పర్యటన వల్ల తక్షణ ఫలితమేమీ కనిపించలేదు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా వెనక్కి తగ్గడం లేదు. శాంతి ప్రణాళికతో రష్యాకు వచ్చానని జిన్‌పింగ్ చెప్పిన సంగతి తెలిసిందే. -
Russia-Ukraine war: ఉక్రెయిన్‌కు మరింత సాయం
వాషింగ్టన్: రష్యాతో యుద్ధంలో విజయం సాధించాలన్న ఉక్రెయిన్ లక్ష్యసాధనకు పూర్తిగా సహకారం అందిస్తామని అమెరికా పునరుద్ఘాటించింది. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, రక్షణ మంత్రి లాయిడ్ అస్టిన్ ఆదివారం ఉక్రెయిన్‌లో పర్యటించారు. అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమై సంఘీభావం ప్రకటించారు. ఫారిన్ మిలిటరీ ఫైనాన్సింగ్ కింద ఉక్రెయిన్‌కు మరో 32.2 కోట్ల డాలర్లు అందజేస్తామని తెలిపారు. 16.5 కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలు విక్రయిస్తామని వెల్లడించారు. వారికి జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపారు. వారితో భేటీ చాలా బాగా జరిగిందంటూ వీడియో సందేశం విడుదల చేశారు. తిరుగు ప్రయాణంలో లాయిడ్, బ్లింకెన్ సోమవారం పోలండ్‌లో మీడియాతో మాట్లాడారు. డోన్బాస్‌పై రష్యా దృష్టి పెట్టడంతో ఉక్రెయిన్ సైనిక అవసరాలూ మారాయన్నారు. ‘‘సరైన ఆయుధ సామగ్రి, మద్దతుంటే ఉక్రెయిన్ నెగ్గడం సులభమే. అందుకు చేయాల్సిందంతా చేస్తాం’’ అని హామీ ఇచ్చారు. రష్యాకు పరాభవం తప్పదని, ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయాలన్న లక్ష్యం నెరవేరదని అన్నారు. త్వరలో ఉక్రెయిన్ ఎంబసీ పునరుద్ధరణ ఉక్రెయిన్‌లో తమ రాయబార కార్యాలయాన్ని త్వరలో పునఃప్రారంభిస్తామని అమెరికా ప్రకటించింది. తొలుత లివీవ్‌లో రాయబార కార్యకలాపాలు మొదలు పెడతామని పేర్కొంది. ఉక్రెయిన్‌లో అమెరికా రాయబారిగా బ్రిడ్గెట్ బ్రింక్‌ను అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేశారు. -
భారత్ – మధ్య ఆసియా దేశాల సహకారమే కీలకం!
న్యూఢిల్లీ: మధ్యఆసియా దేశాలు, భారత్ మధ్య సహకారం ప్రాంతీయ భద్రతకు ఎంతో కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా అఫ్గాన్‌లో పరిణామాల దృష్ట్యా ఈ ప్రాంతానికి భారత్‌కు మధ్య బంధం మరింత బలపడాలని కోరారు. ఈ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలకు 30 ఏళ్లైన సందర్భంగా గురువారం ఆయన ఐదు మధ్య ఆసియా దేశాలతో తొలి ఉమ్మడి సదస్సును ప్రారంభించారు. సుస్థిరమైన ఇరుగుపొరుగు ఉండాలనే భారత ఆలోచనకు మధ్య ఆసియా ప్రాంతం కీలకమని ఆయన చెప్పారు. వచ్చే 30 ఏళ్లకు కావాల్సిన సమీకృత విధానాన్ని ఇరు పక్షాలు రూపొందించుకోవాలని ఆయన సూచించారు. సదస్సులో కజకిస్తాన్ అధ్యక్షుడు కాసెమ్ జోమార్ట్ టొకయేవ్, ఉజ్బెకిస్తాన్ అధిపతి షావక్త్ మిర్జియోయేవ్, తజ్బకిస్తాన్ నేత ఇమోమాలి రహమన్, టర్కెమెనిస్తాన్ అధ్యక్షుడు గుర్బంగ్లీ బెర్డిముహమెదోవ్, కిర్గిజ్ రిపబ్లిక్ అధ్యక్షుడు సడేర్ జపరోవ్ పాల్గొన్నారు. అఫ్గాన్ భూభాగాన్ని ఎలాంటి ఉగ్ర కార్యక్రమాలకు అనుమతించకూడదన్న తమ అభిప్రాయాన్ని ప్రధాని మోదీ మరోమారు వెల్లడించారు. ఇరు పక్షాల మధ్య సహకారం పెంపొందించడం, ఇందుకు తగిన విధానాలు రూపొందించడం సదస్సు లక్ష్యమన్నారు. ఇంధన భద్రతలో కజ్బెకిస్తాన్ ఇండియాకు ముఖ్యమైన భాగస్వామి అని చెప్పారు. ఉజ్బకిస్తాన్తో గుజరాత్ సహా పలు రాష్ట్రాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయన్నారు. ఉన్నత చదువుల కోసం పలువురు భారతీయులు కిర్గిజ్‌కు వెళ్తుంటారని చెప్పారు. రక్షణ విషయంలో తజ్బెక్తో మరింత బలమైన బంధం ఏర్పడాలని ఆకాంక్షించారు. ప్రాంతీయ కనెక్టివిటీలో టర్కెమెనిస్తాన్ది కీలకపాత్రన్నారు. సదస్సు ఏర్పాటుపై ఐదుగురు అధ్యక్షులు ప్రధానిని ప్రశంసించారు. 2015లో మోదీ ఈ దేశాల్లో పర్యటించారు. -
ఆస్ట్రేలియా సహకరించాలి: సీఎస్
సాక్షి, హైదరాబాద్: భారత్‌తో విద్య, వ్యవసాయం, ఐటీ శిక్షణ తదితర రంగాల్లో సహకారానికి ఆస్ట్రేలియా సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎస్.కె.జోషి అన్నారు. ఈ మేరకు బుధవారం సీఎస్‌ను ఆస్ట్రేలియా బృందం కలిసింది. ఈ సందర్భంగా జోషి మాట్లాడుతూ ఆస్ట్రేలియా, భారత్ సహకారంతో రాష్ట్రాల మధ్య విద్య, ఉపాధి రంగాల్లో సహకారానికి విస్తృత అవకాశాలున్నాయని, ఆయా రంగాల్లో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి కార్యాచరణను రూపొందించాల్సిన అవసరం ఉందని అన్నారు. కాగా, విపత్తు నిర్వహణ, విద్య, వ్యవసాయం తదితర రంగాల్లో సహకారం అందించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఆస్ట్రేలియా నార్తర్న్ టెరిటరీ విద్యా మంత్రి సెలెనా యూఈబో అన్నారు. -
చేయిచేయి కలుపుదాం..!
సాక్షి, న్యూఢిల్లీ : భారత్- ఫ్రాన్స్ మధ్య సైనిక బంధాన్ని మరింత ధృఢతరం చేసుకునే దిశగా కదులుతున్నాయి. అందులో భాగంగా సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించేందుకు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. అంతేకాక నేవీ సెక్యూరిటీని బలోపేతం చేసుకోవడంతో పాటూ.. ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించుకునే దిశగా ఇరు దేశాలు ముందుకు కదులుతున్నాయి. డిసెంబర్ నెల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యువల్ మ్యాక్రాన్ భారత్ పర్యటనకు రానున్న నేపథ్యంలో.. ఆదేశ రక్షణ శాఖమంత్రి ఫ్లోరెన్స్ పార్లే, భారత రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలోనే మేకిన్ ఇండియాలో భాగంగా డిఫెన్స్ టెక్నాలజీని భారత్‌లో అభివృద్ధి చేసేందుకు ఫ్రాన్స్ సూచన ప్రాయంగా అంగీకారం తెలిపారు. ఇప్పటికే ఫ్రాన్స్ నుంచి రూ. 59 వేల కోట్లతో 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు భారత్ ఒప్పందాలు చేసుకుంది. తాజాగా మరో 36 రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలుకు భారత్ ప్రతిపాదనలు పంపంది. ఇదిలా ఉండగా మేకిన్ ఇండియాలో భాగంగా ఫ్రాన్స్‌కు చెందిన నేవెల్ గ్రూప్-డీసీఎన్ఎస్ భారత్‌లో ఆరు అడ్వాన్స్డ్ సబ్ మెరైన్స్ రూపొందిస్తోంది. ఈ ప్రాజెక్టు విలువ మొత్తం రూ. 70 వేల కోట్లు. ఇప్పటికే ఫ్రాన్స్‌కు చెందిన ఆయుధ తయారీ సంస్థ ఒకటి ముంబైలో 23 వేల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఆరు స్కార్పియన్ సబ్ మెరైన్ల నిర్మాణంలో భాగస్వామిగా మారింది. వచ్చే ఏడాది ఫ్రాన్స్-భారత్ దేశాలు ’వరుణ‘ పేరుతో నేవీ విన్యాసాలు నిర్వహించేందుకు అంగీకారం కుదిరినట్లు తెలిసింది. -
సహకారం.. నగదు రహితం
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా సహకార కేంద్రబ్యాంకుతో సహా అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో నగదు రహిత సేవలు అందించడానికి చర్యలు ఊపందుకున్నాయి. బుధవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో నగదు రహిత సేవలు అందించేందుకు వీలుగా ఎంపాస్ మిషన్లను మంత్రుల చేతుల మీదుగా కేడీసీసీబీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి, సీఇఓ రామాంజనేయులు అందకున్నారు. త్వరలోనే జిల్లాలోని 95 సహకార సంఘాలకు ఎంపాస్ మిషన్లను పంపిణీ చేయనున్నారు. అదే విధంగా డీసీసీబీ బ్రాంచీల్లోను నగదు రహిత సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు చైర్మన్ మల్లికార్జునరెడ్డి తెలిపారు -
చైనాకు చెక్ పెట్టేందుకు..!
హనోయ్: శత్రువుకి శత్రువు మనకు మిత్రుడు అన్న సూత్రాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనుసరిస్తున్నట్లు ఆయన వియత్నాం పర్యటనను గమనిస్తే అర్థమౌతోంది. చైనా దూకుడుకు కళ్లెం వేసే దిశగా ప్రధాని మోదీ హనోయ్ పర్యటన కొనసాగుతోంది. వియత్నాంకు భారీ ఎత్తున రక్షణ సహకారం, నిధులను అందించేందుకు మోదీ అంగీకరించారు. దీంతో ఆగ్నేయ ఆసియాలో భారత ప్రమేయాన్ని పెంపొందించే దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. వియత్నాంతో సంబంధం వ్యూహాత్మక భాగస్వామ్యం నుంచి 'సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం'గా మారిందని శనివారం మోదీ ప్రకటించారు. ఆ దేశ ప్రధాని యువాన్ ఫుసితో కలిసి సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడిన మోదీ.. ఇరుదేశాల మధ్య వాణిజ్యపరమైన సంబంధాలు బలోపేతమయ్యేలా ఒప్పందాలు చేసుకున్నామన్నారు. రక్షణ రంగంలో సహకారాన్ని పెంపొందించుకుంటున్నామని, వియత్నాం రక్షణరంగానికి మరో 500 మిలియన్ డాలర్ల రుణాన్ని భారత్ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. పెట్రోల్ బోట్స్, సైబర్ సెక్యురిటీ లాంటి పలు అంశాల్లో ఇరుదేశాల మధ్య ఒప్పందాలు కుదిరాయి. గత 15 ఏళ్లలో భారత ప్రధాని వియత్నాంలో పర్యటించడం ఇదే తొలిసారి. -
చింపాజీలకు మనకు పెద్ద తేడా ఏమీలేదు
న్యూయార్క్: ఏదైనా పనిని సమష్టిగా చేయడం లేదా చేసే పనిలో పరస్పరం సహకరించుకోవడం కేవలం మానవుల లక్షణమని, ఈ లక్షణమే జంతువుల నుంచి మానవులను వేరు చేస్తుందని ఇంతకాలం శాస్త్రవేత్తలు నమ్ముతూ వచ్చారు. కానీ ఆ అభిప్రాయం తప్పని, పరస్పరం సహకరించుకునే లక్షణం లేదా గుణం జంతువుల్లో కూడా ఉందని వారు పరిణామక్రమంలో మానవుడికి దూరబంధువులైన చింపాజీల ప్రవర్తనపై జరిపిన అధ్యయనం ద్వారా తేల్చారు. శాస్త్రవేత్తలు తమ అధ్యయన వివరాలను అమెరికా నుంచి వెలువడుతున్న ‘ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సెన్సైస్’ జర్నల్‌లో ప్రచురించారు. గతంలో వారు ల్యాబ్ కండీషన్ లో చింపాజీల ప్రవర్తనపై అధ్యయనం జరపగా, అప్పుడు అవి పరస్పర సహకారానికి బదులుగా పోటీకి, సంఘర్షణకే దిగాయి. దీంతో పరస్సరం సహకరించుకునే లక్షణం విలక్షణంగా మానవులకే ఉందని శాస్త్రవేత్తలు భావిస్తూ వచ్చారు. కానీ వారు ఇటీవల 11 చింపాజీలను 96 గంటలపాటు సహజ వాతావరణంలో వదిలేసి వాటి ప్రవర్తనపై అధ్యయనం జరిపారు. యెర్క్స్ నేషనల్ ప్రిమేట్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అధ్యయనంలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. చింపాజీలు తమకు అవసరమైన షెల్టర్‌ను నిర్మించుకోవడానికిగానీ, ఆహారాన్ని సేకరించుకోవడానికిగానీ ముందుగా పోటీ పడ్డాయి. పరస్పరం గొడవలకు దిగాయి. ఆ తర్వాత పరస్పర సహకారంతోనే ఎక్కువ ప్రయోజనం ఉందనే విషయాన్ని అవి గ్రహించాయి. రెండు, మూడు లేదు నాలుగు బృందాలుగా విడిపోయి పరస్పరం సహకరించుకున్నాయి. అవి 96 గంటల కాలంలో 3,656 సార్లు పరస్పర సహకార చర్యలకు దిగగా, కేవలం 600 సార్లు మాత్రమే పోటీకి, గొడవకు దిగాయి. ఇలా పోటీకి దిగడం, పరస్పరం సహకరించుకుంటూ జీవనం గడపడం మానవుల్లో ఉండే లక్షణమే. పెద్దరికం చెలాయిస్తూ తోటి చింపాజీలతో ఉచితంగా పనిచేయించుకునేందుకు కొన్ని చింపాజీలు ప్రయత్నించడం, వాటి ఆదేశాలను మిగతా చింపాజీలు పాటించేందుకు నిరాకరించడమూ అధ్యయనంలో కనిపించింది. ఈ లక్షణం కూడా మానవుల్లో సహజంగా ఉండేదేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తమ అధ్యయనం ఫలితాలు చింపాజీల నుంచి మానవుల పూర్వికులు ఆవిర్భవించారనే పరిణామ సిద్ధాంతానికి మరింత ఊతమిస్తున్నాయని వారన్నారు. అంతేకాకుండా చీమల నుంచి తిమింగలాల వరకు పరస్పర సహకారానికి ప్రాధాన్యం ఇస్తాయన్న విషయం తేలిందని వారంటున్నారు. అనవసరమైన పోటీలకు దిగి గొడవలు పడడం, ఉచితంగా తోటి వారి సాయం పొందాలని ఆశించడం కన్నా పరస్పర సహకారానిదే అంతిమ విజయమని తమ అధ్యయనం నిరూపించిందని వారు చెప్పారు. -
సహాయ నిరాకరణం
♦ వైవీయూలో కొనసాగుతున్న సమ్మె ♦ వీసీ కారు డ్రైవర్ సహా అందరూ సమ్మెలోకి.. ♦ మంగళవారం విధులకు గైర్హాజరు ♦ బోధనేతర సిబ్బంది సమస్యలపై కమిటీ ఏర్పాటు వైవీయూ: యోగివేమన విశ్వవిద్యాలయంలో బోధనేతర సిబ్బంది సహాయ నిరాకరణలో భాగంగా మంగళవారం విధులకు గైర్హాజరయ్యారు. స్నాతకోత్సవ పనులకు సైతం వీరంతా దూరంగా ఉండిపోయారు. విశ్వవిద్యాలయంలో బోధనేతర సిబ్బంది సమ్మెబాట పట్టడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. నీటిసమస్య తలెత్తడంతో అధికారులు బయటి నుంచి మినరల్ వాటర్ తెప్పించుకుని పనులు కానించారు. దీంతో పాటు వైస్ చాన్స్‌లర్ వాహన డ్రైవర్ సైతం సమ్మెలోకి వెళ్లడంతో ఆయన ప్రైవేట్ డ్రైవర్‌ను పిలిపించుకుని విధులకు హాజరయ్యారు. సమస్య పరిష్కారానికి సబ్ కమిటీ...! గత నాలుగురోజులుగా బోధనేతర సిబ్బంది సమ్మెబాట పట్టడంతో వైవీయూలో కార్యక్రమాలు స్తంభించిపోయాయి. కాగా బోధనేతర సిబ్బంది పట్టువిడుపులు లేకుండా మొండిగా వ్యవహరిస్తున్నారని అధికారులు అంటుండగా... తమ సమస్యలను పట్టించుకోనట్లు అధికారులు వ్యవహరిస్తున్నారని బోధనేతర సిబ్బంది వాదిస్తున్నారు. దీనికి తోడు స్నాతకోత్సవం, ఈనెల 30 నుంచి వైవీయూ ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో సమ్మె మరింతకాలం కొనసాగితే ఇబ్బందులు తప్పవని భావించిన అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. సమ్మెను విరమించేందుకు పలు ప్రతిపాదనలతో సబ్‌కమిటీ వేసినట్లు సమాచారం. వైవీయూ రెక్టార్, పాలకమండలి సభ్యుడు అయిన ఆచార్య ఎం. ధనుంజయనాయుడు అధ్యక్షతన పలువురు పాలకమండలి సభ్యులతో పాలకమండలి సబ్‌కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిసింది. అయితే దీనికి సంబంధించి ఇంకా ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. -
ఆన్లైన్ వద్దు...అడ్డదారే ముద్దు
రవాణా శాఖ ఉద్యోగుల యత్నం అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి సిటీబ్యూరో: రవాణా శాఖలో ఆన్లైన్ వ్యవస్థకు ఆదిలోనే కొందరు అధికారులు, సిబ్బంది మోకాలడ్డుతున్నారు. పారదర్శక, స్మార్ట్ సేవలను అందించేందుకు ఆన్లైన్ బాట పట్టిన రవాణా శాఖకు సిబ్బంది సహాయ నిరాకరణ శాపంగా పరిణమించింది. ఒక వైపు అన్ని ప్రభుత్వ విభాగాలు తమ సేవలను మొబైల్ అప్లికేషన్లు... ఆన్లైన్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తుంటే... రవాణా శాఖలో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. బ్రోకర్లు, మధ్యవర్తుల ద్వారా తమ అక్రమార్జనకు గండి పడుతుండడంతో ఏకంగా ఆన్లైన్ వ్యవస్థనే ఎత్తి వేయాలనే లక్ష్యంతో కొద్ది రోజులుగా ఆ శాఖ ఉన్నతాధికారులపై ఒత్తిడిని తీవ్రతరం చేస్తున్నట్లు తెలిసింది. ‘ఆన్లైన్ తొల గింపు’ అంశాన్ని నేరుగా ప్రస్తావించకుండా దరఖాస్తుల స్వీకరణలో ఇబ్బందులు ఉన్నాయని... పని భారం పెరిగింద ని... వినియోగదారులు సరైన డాక్యుమెంట్లు అందజేయడం లేదని సాకులు చెబుతున్నారు. దీన్ని అడ్డుకోవాలనే లక్ష్యంతో కొందరు పెద్దలను రంగంలోకి దించినట్లు తెలిసింది. ‘అడ్డదారి’కే పెద్దపీట రవాణాశాఖ అందజేసే డ్రైవింగ్ లెసైన్స్ రె న్యూవల్, డూప్లికేట్ లెసైన్స్, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లెసైన్స్, డైవింగ్ లెసైన్స్‌లో చిరునామా మార్పు వంటి 15 రకాల పౌర సేవల కోసం ఇంటి నుంచే నేరుగా దరఖాస్తు చేసుకొనేలా గత ఏడాది నవంబర్‌లో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి ప్రారంభించారు. వినియోగదారులు ఈ సేవా కేంద్రాలు, ఇంటర్నెట్ సెంటర్ల నుంచి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సదుపాయానికి ఇప్పుడిప్పుడే ఆదరణ లభిస్తున్న తరుణం లో నీరుగార్చడం ద్వారా ‘అడ్డదారి’ కే పెద్దపీట వేస్తున్నారు. ప్రధాన కార్యాలయమైన ఖైరతాబాద్ మినహా మిగతా చోట్ల ఆన్లైన్ నిరాదరణకు గురవుతోంది. దీనిపై గత ఫిబ్రవరిలో ‘ఆన్లైన్ కాదు... అదే ‘లైన్’,... ఆర్టీఏ అడ్డదారి’ శీర్షికన ‘సాక్షి’లో వార్తా కథనం వెలువరించిన సంగతి తెలిసిందే. దీనితో ఆన్లైన్ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, వెబ్ కెమెరాల ద్వారా నిఘాను పటిష్టం చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. కానీ వివిధ కేడర్లలోని ఉద్యోగులు, సిబ్బంది నుంచి సహాయ నిరాకరణ మొదలు కావడం, దీని తొలగింపునకు అధికారులపై ఒత్తిళ్లు ప్రారంభం కావడం గమనార్హం. ఏజెంట్ల ద్వారా వస్తే ఓకే.... ఆర్టీఏలో ఏజెంట్ల కార్యకలాపాలను 2002లోనే నిషేధించి నప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఉన్నతాధికారుల స్వీయ పర్యవేక్షణ ఉండే ఖైరతాబాద్, అత్తాపూర్ వంటి కొన్ని కార్యాలయాలు మినహా అనేకచోట్ల వినియోగదారులకు సముచితసేవలు లభించడంలేదు. ఇబ్రహీం పట్నం, కూకట్పల్లి, టోలీచౌకీ వంటి నగర శివారు ఆర్టీఏ కేంద్రాల్లో ఏజెంట్ల ద్వారా వచ్చే దరఖాస్తులకు తప్ప సామాన్యులకు పౌరసేవలు లభించడంలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వినియోగదారుల చిరునామాకు స్పీడ్ పోస్టు ద్వారా అందజేయవలసిన స్మార్ట్‌కార్డులను సైతం రూ.200 నుంచి రూ.300 చొప్పున నేరుగా విక్రయిస్తున్నారు. -
ఫైబర్ ఆప్టిక్ పథకానికి సహకారం
► దావోస్‌లో సీఎంకు సిస్కో హామీ ► దావోస్ నుంచి సింగ్‌పూర్‌కు వెళ్లిన చంద్రబాబు సాక్షి, హైదరాబాద్: ప్రపంచ ఆర్థిక సదస్సు చివరిరోజున దావోస్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. సిస్కో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జాన్ చాంబర్స్ సీఎం చంద్రబాబుతో సమావేశమైనపుడు రాష్ర్ట ప్రభుత్వం ఇంటింటికీ ఫైబర్ ఆప్టిక్ సదుపాయం కల్పించే పథకానికి సహకారం అందిస్తామని చెప్పారని రాష్ట్ర ప్రభుత్వ సమాచార సలహాదారు కార్యాలయం శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇక కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీతో సీఎం భేటీ అయినపుడు వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో ఈసారి ఏపీ కేంద్ర బిందువైందని చెప్పారు. భారత దేశం అంటే ఏపీ అన్నట్లు ఉందని ప్రశంసించారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అమరావతి నిర్మాణానికి ప్రైవేటు రంగంతో పాటు ప్రపంచ ఆర్థిక సంస్థల నుంచి నిధుల సేకరణకు కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్న మెకన్సీ గ్లోబల్ కంపెనీ సీఈవో డొమినిక్ బార్టన్తో చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో 500 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇండోరమ సింథటిక్ కంపెనీ సీఈవో శ్రీ ప్రకాష్ లోహియా.. సీఎంకు చెప్పారు. సంస్థ ఏర్పాటుపై అధ్యయనానికి మార్చిలో బృందాన్ని పంపనున్నట్లు తెలిపారు. వైద్య ఆరోగ్య పరికరాల ఉత్పత్తి సంస్థ మెడ్ ట్రానిక్ సీఈవో మైఖెల్ కోయిల్‌తో చంద్రబాబు భేటీ అయిన సందర్భంగా.. పేదలకు గుండె జబ్బుల వైద్యం అందుబాటులోకి తేవాలని కోరారు. సన్‌గ్రూప్ చైర్మన్ శివ్ఖేమ్కా, ఫోర్టిస్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల చైర్మన్ మల్వీందర్ సింగ్, సేల్స్ ఫోర్స్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ వివేక్ కుంద్రా, జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఏజెన్సీ (జైకా) అధ్యక్షుడు షిన్షి కిటావొకాలతో కూడా చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సమావేశాల్లో మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. కాగా దావోస్ పర్యటన ముగించుకుని చంద్రబాబు సింగపూర్ వెళ్లారు. అక్కడ ఆయన రాజధాని నిర్మాణం తదితర అంశాలపై ఆ దేశ మంత్రి ఈశ్వరన్ తదితరులతో చర్చించనున్నారు. -
బంగారు తెలంగాణకు సహకరించాలి
స్పీకర్ మధుసూదనాచారి గణపురం : బంగారు తెలంగాణ సాధనకు అందరి సహకారం అవసరమని స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. చెల్పూరు శివారులోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రంలోని ఇంజనీర్ల కాలనీలో నూతనంగా నిర్మించిన క్వార్టర్లను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త భవనాలను చూసి మురిసిపోవద్దని, పనిలో కూడా అదే జోరు చూపించాలన్నారు. లక్ష్యంలో 600 మెగావాట్ల ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించినప్పుడే ఇంజనీర్ల అంకితభావం తెలిసిపోతుందని అన్నారు. కేటీపీపీ దేశంలోనే విద్యుత్ ఉత్పత్తి చేసే సంస్థల్లో రెండో స్థానంలో ఉండటం గర్వకారణమని అన్నారు. గ్రామాల్లో బస్ షెల్టర్లు, బస్టాండ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని అన్నారు. 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. అనంతరం కేటీపీపీ ఉద్యోగులు స్పీకర్‌ను గజమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జెన్కో డెరైక్టర్ రాధాకృష్ణ, సీఈ శివకుమార్, జెడ్పీ టీడీపీ ఫ్లోర్ లీడర్ మోటపోతుల శివశంకర్‌గౌడ్, ఎంపీపీ పోతారపు శారద, సర్పంచ్ కొత్త పద్మ వెంకటేశ్వర్లు, ఎంపీటీసీలు భైరగాని సరిత, దాసరి రవీందర్, ఎస్ఈలు, ఈఈలు, ఏడీఈలు తదితరులు పాల్గొన్నారు. జెడ్పీ టీడీపీ ఫ్లోర్ లీడర్ నిరసన క్వార్టర్ల ప్రారంభోత్సవానికి ఏర్పాటుచేసిన శిలాఫలకంపై జె డ్పీ టీడీపీ ఫ్లోర్ లీడర్, ఎంపీపీ, సర్పంచ్, ఎంపీటీసీల పేర్లు లేకపోవడంతో వారు నిరసన వ్యక్తం చేశారు. దీంతో కేటీపీపీ సీఈ శివకుమార్‌ను ఫ్లోర్ లీడర్ శివశంకర్‌గౌడ్ నిలదీశారు. విషయూన్నికలెక్ట ర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. కాగా జెన్కో డెరైక్టర్ పేరు కూడాచేర్చకపోవడంపట్ల కొం దరు కేటీపీపీ అధికారుల్లో నిరసన వ్యక్తమైంది. -
వక్ఫ్‌బోర్డు విభజనకు చర్యలు
కేంద్ర మంత్రి నజ్మా హెప్తుల్లా వెల్లడి ఎంఎస్‌డీపీ కింద రూ. 38 కోట్లు ఇచ్చేందుకు అంగీకారం కేంద్ర మంత్రితో డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ భేటీ పడో పర్దేశ్, ఉడాన్ పథకాలను మంజూరు చేయాలని విజ్ఞప్తి హైదరాబాద్: తెలంగాణలో అమలవుతున్న మైనారిటీ సంక్షేమ, అభివృద్ధి పథకాలకు పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి నజ్మా హెప్తు ల్లా హామీ ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మంగళవారం ఢిల్లీలో ఆమెను కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను కేంద్రమంత్రికి వివరించారు. ఎంఎస్‌డీపీ కింద రాష్ట్రానికి రూ. 38 కోట్లు మంజూరు చేసేందుకు ఈ సందర్భంగా హెప్తుల్లా అంగీకరించారు. ఏపీ వక్ఫ్‌బోర్డును తక్షణమే రెండుగా విభజించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చా రు. దీనిపై 18వ తేదీన హైదరాబాద్‌లో ఇరురాష్ట్రాల ఉన్నతాధికారులతో సమావేశం కావాల్సిందిగా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శికి సూచిస్తానన్నారు. సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఆఫ్ మైనార్టీస్ (సీఈడీఎం) పథకం కింద శిక్షణ కార్యక్రమాలకు నిధులు మంజూరు చేస్తామన్నారు. కేంద్రం నుంచి అందుతున్న ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లను యథావిధిగా కొనసాగించాలని నజ్మాను మహమూద్ అలీ కోరారు. కేంద్ర మార్గదర్శకాల మేరకు తెలంగాణ రాష్ర్టంలో స్కాలర్‌షిప్‌లకు ఆధార్‌కార్డుల అనుసంధాన ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన ‘పడో పర్దేశ్’, ‘ఉడాన్’, ‘ఉస్తాద్ హమారీ దారోహర్’ పథకాలను రాష్ట్రానికి మంజూరు చేయాలని కోరారు. టీఆర్ఎస్ ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్, విశ్వేశ్వర్‌రెడ్డి, సీతారాం నాయక్, బాల్కసుమన్, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఉమర్ జలీల్, డెరైక్టర్ మహ్మద్ జలాలుద్దీన్ అక్బర్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ షుకూర్ తదితరులు డిప్యూ టీ సీఎంతో పాటు ఉన్నారు. -
పచ్చ కుట్ర!
సాక్షి ప్రతినిధి, కడప : తెలుగుదేశం పార్టీ నాయకులు రాజకీయ కక్షసాధింపునకు తెగబడుతున్నారు. ఇందుకు పోలీసు యంత్రాంగం సంపూర్ణ సహకారం అందిస్తోంది. జిల్లా స్థాయి పోలీసు అధికారులు నిబంధనల మేరకు పనిచేయాలని ప్రయత్నిస్తున్నా.. ఉన్నతాధికారుల ఆదేశాలను ఏకపక్షంగా అమలు చేయాల్సి వస్తోంది. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం. ఎమ్మెల్యే తనయులే టార్గెట్! అధికార పార్టీకి విపక్ష ఎమ్మెల్యేల తనయులే టార్గెట్ అయ్యారు. అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీ తాజాగా ఓ ఎమ్మెల్యే తనయునిపై రౌడీషీట్ ఓపెన్ చేయాల్సిందిగా జిల్లా యంత్రాంగంపై ఒత్తిడి పెంచినట్లు తెలుస్తోంది. అయితే నిబంధనల మేరకు అది సాధ్యం కాదని ఇక్కడి యంత్రాంగం తెలిపినట్లు సమాచారం. ఇటు కాకపోతే.. అటు నుంచి నరుక్కు వస్తాం అన్నట్లు ఆ శాఖ ఉన్నతాధికారులపై ఒత్తిడిపెంచి వారి ద్వారా ఆదేశాలు ఇప్పించినట్లు తెలుస్తోంది. ‘దేశం’ నేతల ఒత్తిడితో డీజీపీ ఆదేశం ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తనయుడు సుధీర్‌రెడ్డిపై రౌడీషీట్ ఓపెన్ చేయాల్సిందిగా డీజీపీ ఆదేశించడంతోనే కేసు నమోదు చేసినట్లు ఏఎస్పీ వెంకట అప్పలనాయుడు ‘సాక్షి’కి తెలిపారు. పనిలో పనిగా దేవగుడి గ్రామంలో ఏకంగా 35 మందిపై రౌడీషీట్ తెరిచారు. ఆ సంస్కృతి జమ్మలమడుగు నుంచి ఇప్పుడు మైదుకూరుకు పాకింది. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తనయుడు నాగిరెడ్డితోపాటు మరో అయిదుగురిపై రౌడీషీట్ తెరవాలని ఓ టీడీపీ నేత నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిడి ఉన్నట్లు సమాచారం. జిల్లా యంత్రాంగం నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతో రాష్ట్ర మంత్రి ద్వారా ఉన్నతాధికారులకు సిఫారసులు చేస్తున్నట్లు వినికిడి. భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా.. కుట్రపూరిత ఆలోచనలతో అడుగులు వేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా... ఓ వ్యక్తిపై ఏడాదిలో రెండు కేసులు నమోదై ఉంటే రౌడీషీట్ ఓపెన్ చేయాలని పోలీసు మాన్యువల్ సూచిస్తోంది. శాంతిభద్రతలకు ఆటంకం కలిగించిన నేరాలు, భౌతిక దాడులు, బెదిరింపులు, మత విద్వేషాలు రెచ్చగొట్టడం లాంటి కేసుల్లో కనీసం ఏడాదిలోపు రెండు వాటిల్లో ఉండాలి. అయితే ఎమ్మెల్యేల ఇద్దరి తనయులపైనా అలాంటి కేసులేవీ లేవు. అయినా రౌడీషీట్లు తెరుస్తున్నారు. ఎన్నికల్లో వివాదాస్పద అంశాన్ని పరిగణలోకి తీసుకొని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తనయుడు సుధీర్‌రెడ్డితోపాటు 35 మందిపై రౌడీషీట్ తెరిచారు. ప్రస్తుతం మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తనయుడు నాగిరెడ్డితోపాటు మరో ఐదు మందిపై నమోదు చేసేందుకు సన్నద్ధమైనట్లు సమాచారం. గిరిజనులపై దాడులు చేస్తున్నా... ఓవైపు విపక్ష పార్టీ నేతలపై రౌడీషీట్లు తెరుస్తున్న పోలీసు యంత్రాంగం ఇంకోవైపు గిరిజనులపై దాడులు చేస్తుంటే మాత్రం కళ్లుమూసుకుంటోంది. అందుకు కారణం అక్కడి పాత్రధారులు కూడాతెలుగుదేశం పార్టీ మద్దతుదారులు కావడమేనని విమర్శలు వినిపిస్తున్నాయి. పులివెందులలో గిరిజనులకు చెందిన వారి ఇళ్లపై దాడులు జరిగి పది రోజులు గడుస్తున్నా ఎలాంటి కేసూ నమోదు కాలేదు. పోలీసు యంత్రాంగం ఇలా అధికార బలం ఉన్నవాడికి ఒకలా.. లేనివాడికి మరోలా చూడడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
అందరి సహకారంతో అభివృద్ధి
లక్సెట్టిపేట : అందరి సహకారంతో జిల్లాను అభివృద్ధి చేస్తానని జెడ్పీ చైర్పర్సన్ శోభారాణి అన్నారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో చాలా సమస్యలు ఉన్నాయని, అన్నింటిపై దృష్టిసారించి అభివృద్ధి చేస్తానని తెలిపారు. వెనకబడిన జిల్లాగా కాకుండా అన్ని విధాలా సౌకర్యాలు కల్పిస్తానని చెప్పారు. అనంతరం ఆమెను ఎంపీటీసీ సభ్యులు శాలువాలతో సన్మానించారు. సమస్యలపై అధికారుల నిలదీత తలమలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని ఎంపీ పీ కట్ల చంద్రయ్య కోరగా, విద్యుత్ శాఖ అధికారుల తీరుపై ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. విద్యుత్ సరిగా ఉండడం లేదని, రాత్రిళ్లు విఫరీతంగా కోత విధిస్తున్నారని పేర్కొన్నారు. పలు చోట్ల షాక్ వసుందని తిమ్మాపూర్ ఎంపీటీసీ సభ్యురాలు గడుసు స్వప్న, ఊత్కూరు సర్పంచ్ రాజలింగయ్య అధికారుల దృష్టికి తెచ్చారు. బ్యాంకు రుణాలు మాఫీ చేయాలని కోరారు. అలాగే మీ సేవ సర్టిఫికెట్లకు అధికారులు డబ్బులు తీసుకుంటున్నారని, డబ్బులు ఇవ్వనిదే తహశీల్దార్ కార్యాలయంలో ఏపని కావడం లేదని కొత్తూరు సర్పంచ్ గుండ శ్రీనివాస్ ధ్వజమెత్తారు. దీంతో ఎమ్మెల్యే దివాకర్‌రావు కల్పించుకొని తహశీల్దార్ ఆనంద్‌బాబును వివరణ కోరారు. కార్యాలయ సిబ్బంది అవినీతికి పాల్పడకుండా ప్రజలకు సేవలు అందించాలని ఆదేశించారు. సమావేశం ఎజెండాలో జనరల్ ఫండ్‌కు సంబంధించిన లెక్కలు ప్రచురించలేదని, దీనికి ఎంపీడీవో రాంప్రసాద్ సమాధానం ఇవ్వాలని లక్సెట్టిపేట రెండో వార్డు ఎంపీటీసీ షాహెద్ అలీ నిలదీశారు. ఎమ్మెల్యే దివాకర్‌రావు మాట్లాడుతూ మండలంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించేలా అధికారులను ఆదేశిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో జెడ్పీటీసీ చుంచు చిన్నయ్య, తహశీల్దార్ ఆనంద్‌బాబు, ఎంపీడీవో రాంప్రసాద్, డీసీఎంఎస్ చెర్మైన్ శ్రీనివాస రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆలస్యంగా సమావేశం సమావేశం చాలా ఆలస్యంగా ప్రారంభమైంది. ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా సాయంత్రం నాలుగింటికి ప్రారంభించి 5.30ముగించారు. జెడ్పీ చైర్పర్సన్ శోభారాణి పట్టణంలోని పాఠశాల భవనం ప్రారంబోత్సవానికి వస్తున్నారని తెలిసి అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. ఒకే రోజు అన్ని కార్యక్రమాలు ఉండడంతో ప్రజాప్రతినిధులకు అధికారులకు చాలా ఇబ్బందికరంగా మారింది.మండల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసే సమావేశంలో 25 అంశాలపై చర్చించాల్సి ఉండగా కొన్నింటిపైనే చర్చించి తూతూ మంత్రంగా ముగించారు. ఇందులో మైక్ సెట్ మొరాయించడంతో మాట్లాడేది వినపడక అధికారులు, ప్రజాప్రతినిధులు ఇబ్బందులకు గురయ్యారు. -
బండారుకు పూర్తి సహకారం
మంత్రి గంటా పరవాడ: పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తికి తన సహాయ సహకారాలు ఎల్లవేళలు ఉంటాయని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. వెన్నలపాలెం గ్రామంలో ఎమ్మెల్యే బండా రు స్వగృహంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మంత్రి గంటా మాట్లాడారు. ఎమ్మెల్యే బండారుకు మంత్రి పద వి రాలేదని నియోజక వర్గ నాయకులు, కార్యకర్తలు నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎమ్మెల్యే బండారు మాట్లాడు తూ కష్టపడి పనిచేసిన తన లాంటి వారిని అధిష్టానం గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల నుంచి తన కుటుంబం రాజకీయాల నుంచి విరమిం చుకుంటుందని చెప్పారు. మంత్రి గంటా అండదండలతో నియోజక వర్గ సమస్యలను పరిష్కరిస్తానన్నారు. అంతకు ముం దు బండారుతో గంటా చర్చలు జరిపారు. -
అందరి సహకారంతోనే ‘లోక్ అదాలత్’ విజయవంతం
నిజామాబాద్ లీగల్, న్యూస్‌లైన్: ఈ నెల 23న నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్‌లో అధిక సంఖ్యలో కేసులు పరిష్కరించి నిజామాబాద్ జిల్లాను రాష్ట్రస్థాయిలోనే ప్రథమస్థానంలో నిలిచేందుకు న్యాయశాఖ ఉద్యోగులు, పోలీసులు కీలకపాత్ర పోషించారని జిల్లా జడ్జి, జిల్లా లీగల్‌సెల్ అథారిటీ అధ్యక్షుడు డాక్టర్ షమీం అక్తర్ అన్నారు. బుధవారం జిల్లా లీగల్‌సెల్ అథారిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన న్యాయశాఖ ఉద్యోగులు, పోలీసుల స్నేహ సమ్మేళనంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పోలీసులు, న్యాయశాఖ సిబ్బంది సేవలను ప్రశంసించారు. నిజామాబాద్ ఉద్యోగులు అంకితభావంతో విధులు నిర్వహించే తత్వం కలవారని ఈ మెగా అదాలత్‌తో నిరూపించారన్నారు. మొత్తం 13,287 కేసులను ఒక్కరోజే పరిష్కరించినట్లు జిల్లా లీగల్‌సెల్ అథారిటీ కార్యదర్శి బాందే అలీ తెలిపారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు, పోలీసులు తనదైన శైలిలో సహకారాన్ని అందించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు జగ్జీవన్‌కుమార్, రవీందర్‌సింగ్, రమేష్‌బాబు, రాధాకృష్ణ చౌహాన్, కుమార్‌వివేక్, పి.లక్ష్మీకుమారి, అమరావతి, జిల్లా కోర్టు పరిపాలన అధికారి మేడి స్వామి, లీగల్‌సెల్ అథారిటీ సూపరింటెండెంట్ శ్రీధర్, న్యాయశాఖ ఉద్యోగ సంఘాల నాయకులు రాజశేఖర్‌రెడ్డి, ఎం.రాంగోపాల్, న్యాయశాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. -
సభ సజావుగా జరిగేలా చూడండి:ప్రధాని
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సాఫీగా జరిగేందుకు సహకరించాల్సిందిగా ప్రధాని మన్మోహన్సింగ్ సోమవారం విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. అన్ని అంశాలపైనా చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. గత రెండు మూడు సమావేశాల్లో ఎంతో సమయం వృథా అయిందని, దాన్ని ఈసారి పునరావృతం కానీయొద్దని ఉదయం పార్లమెంటు ఆవరణలో విలేకరులతో ఆయనన్నారు. కానీ తర్వాత కాసేపటికే ఆయన సొంత పార్టీ ఎంపీలే ఉభయ సభలనూ పదేపదే స్తంభింపజేయడం విశేషం!