
సాక్షి, హైదరాబాద్: భారత్‌తో విద్య, వ్యవసాయం, ఐటీ శిక్షణ తదితర రంగాల్లో సహకారానికి ఆస్ట్రేలియా సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎస్.కె.జోషి అన్నారు. ఈ మేరకు బుధవారం సీఎస్‌ను ఆస్ట్రేలియా బృందం కలిసింది. ఈ సందర్భంగా జోషి మాట్లాడుతూ ఆస్ట్రేలియా, భారత్ సహకారంతో రాష్ట్రాల మధ్య విద్య, ఉపాధి రంగాల్లో సహకారానికి విస్తృత అవకాశాలున్నాయని, ఆయా రంగాల్లో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి కార్యాచరణను రూపొందించాల్సిన అవసరం ఉందని అన్నారు. కాగా, విపత్తు నిర్వహణ, విద్య, వ్యవసాయం తదితర రంగాల్లో సహకారం అందించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఆస్ట్రేలియా నార్తర్న్ టెరిటరీ విద్యా మంత్రి సెలెనా యూఈబో అన్నారు.