సిడ్నీ: ‘బోర్డర్–గావస్కర్’ సిరీస్ విజేతకు ట్రోఫీ అందజేసే సమయంలో తనను ఆహ్వానించకపోవడంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. 1996–97 నుంచి భారత్, ఆ్రస్టేలియా మధ్య ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ నిర్వహిస్తుండగా... తాజాగా జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆ్రస్టేలియా జట్టు 3–1తో విజయం సాధించింది.
ఆదివారం ఆఖరి టెస్టు ముగిసిన అనంతరం విజేతగా నిలిచిన ఆ్రస్టేలియా జట్టుకు ఆ్రస్టేలియా దిగ్గజం అలెన్ బోర్డర్ ట్రోఫీ బహుకరించాడు. దీనిపై గావస్కర్ స్పందిస్తూ... ‘ట్రోఫీ ఇచ్చే సమయంలో అక్కడ ఉండటాన్ని ఇష్టపడేవాడిని. భారత్, ఆస్ట్రేలియా మధ్య అదీ బోర్డర్–గావస్కర్ సిరీస్ కదా. ఆ సమయంలో నేను మైదానంలోనే ఉన్నా. మెరుగైన ప్రదర్శన చేయడం వల్లే ఆ్రస్టేలియా గెలిచింది.
నా స్నేహితుడు బోర్డర్‌తో కలిసి ట్రోఫీ అందించి ఉంటే ఇంకా ఆనందించేవాడిని’ అని అన్నాడు. మరోవైపు క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) స్పందన దీనికి భిన్నంగా ఉంది. సిరీస్‌లో ఆ్రస్టేలియా విజేతగా నిలిస్తే అలెన్ బోర్డర్... భారత్ గెలిస్తే సునీల్ గావస్కర్ ట్రోఫీ అందించాలని నిర్ణయించినట్లు సీఏ తెలిపింది. ఈ విషయాన్ని వారిదద్దరికీ గతంలోనే చెప్పినట్లు ఒక ప్రకటనలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment