సిడ్నీ పిచ్‌పై ప్రసిధ్ కృష్ణ వ్యాఖ్య
సిడ్నీ: ఆస్ట్రేలియాతో చివరి టెస్టులో టీమిండియాకు భారీ ఆధిక్యం దక్కకపోయినా... ఈ పిచ్‌పై నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం ఎవరికైనా కష్టమే అని భారత పేసర్ ప్రసిధ్ కృష్ణ అన్నాడు. సిడ్నీ వికెట్ అనూహ్యంగా స్పందిస్తోందని... భారీ స్కోరు చేయడం అంత సులువు కాదని అతడు పేర్కొన్నాడు.
శనివారం ఆట ముగిసిన అనంతరం ప్రసిధ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ‘బంతి అనూహ్యంగా స్పందిస్తోంది. ముఖ్యంగా కొన్ని భాగాల్లో పిచ్‌ను తాకిన తర్వాత తక్కువ ఎత్తులో వస్తోంది. మరికొన్ని చోట్ల బాగా బౌన్స్ అవుతోంది. ఇలాంటి చోట ఎంత లక్ష్యం సురక్షితం అని చెప్పలేం. వీలైనన్ని ఎక్కువ పరుగులు చేసేందుకు ప్రయతి్నస్తాం. ఈ మ్యాచ్‌కు ముందు భారత్ ‘ఎ’ తరఫున ఇక్కడ పర్యటించడం మంచి ఫలితాన్నిచ్చింది.
దానివల్లే సులువుగా బౌలింగ్ చేశా. మొదట్లో కాస్త ఒత్తిడికి గురైనా... ఆ వెంటనే పరిస్థితులను అర్థం చేసుకొని ముందుకు సాగా. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ సూచనలు ఫలితాన్నిచ్చాయి. ప్రాథమిక సూత్రానికి కట్టుబడే బంతులు విసిరా. దాంతోనే ఫలితం రాబట్టగలిగా.
ఇక ముందు కూడా ఇదే కొనసాగిస్తా. రెండో ఇన్నింగ్స్‌లోనూ కంగారూలను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తాం’ అని వివరించాడు. ‘బోర్డర్–గావస్కర్’ ట్రోఫీ ఆఖరి టెస్టులో ప్రస్తుతం భారత జట్టు ఓవరాల్‌గా 145 పరుగుల ఆధిక్యంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment