Prasidh Krishna
-
ఇంగ్లండ్‌తో సిరీస్.. దేశీ టోర్నీలో టీమిండియా స్టార్లు! అతడికి రెస్ట్!
ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా అనుకున్న ఫలితాన్ని రాబట్టలేకపోయింది. దాదాపు పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)ని ఆతిథ్య జట్టుకు కోల్పోయింది. ఇందుకు ప్రధాన కారణంగా భారత బ్యాటర్ల వైఫల్యమే అని చెప్పవచ్చు. ఇక ఆటలో గెలుపోటములు సహజం కాబట్టి.. టీమిండియా తదుపరి ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లపై దృష్టి సారించనుంది.ఇప్పటికే ఆస్ట్రేలియాను వీడిన టీమిండియా స్టార్లలో కొందరు.. స్వదేశంలో అడుగుపెట్టగానే దేశీ టోర్నీలో పాల్గొనేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ప్రసిద్ కృష్ణ, దేవ్‌దత్ పడిక్కల్, వాషింగ్టన్ సుందర్ దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ నాకౌట్ మ్యాచ్‌లలో భాగం కానున్నట్లు సమాచారం. కేఎల్ రాహుల్‌కు విశ్రాంతిఅయితే, కేఎల్ రాహుల్‌ను కూడా ఈ టోర్నీలో ఆడాలని యాజమాన్యం సూచించగా.. అతడు తనకు విశ్రాంతి కావాలని అభ్యర్థించినట్లు తెలుస్తోంది. కాగా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా.. దేవ్‌దత్ పడిక్కల్ పెర్త్ మ్యాచ్ తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. నిరాశపరిచిన పడిక్కల్అయితే, తొలి ఇన్నింగ్స్‌లో డకౌటై పూర్తిగా నిరాశపరిచిన ఈ కర్ణాటక బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్‌లో 25 పరుగులు చేయగలిగాడు. ఆ తర్వాత మళ్లీ అతడు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో స్థానం సంపాదించలేకపోయాడు.వాషీకే పెద్దపీటఇక స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు మాత్రం ఈ సిరీస్‌లో ప్రాధాన్యం దక్కింది. రవిచంద్రన్ అశ్విన్‌ను కాదని మరీ.. టీమిండియా మేనేజ్మెంట్ వాషీ వైపు మొగ్గుచూపింది. అందుకు తగ్గట్లుగానే వాషీ రాణించాడు. అవసరమైన వేళ బ్యాట్ ఝులిపించడంతో పాటు వికెట్లు తీయడంలోనూ తన వంతు పాత్ర పోషించాడు ఈ చెన్నై చిన్నోడు.ప్రసిద్ హిట్అయితే, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లతో పాటు పేస్ దళంలో ఆకాశ్ దీప్తో పోటీలో వెనుకబడ్డ ప్రసిద్ కృష్ణకు ఆఖరి టెస్టులో అవకాశం వచ్చింది. సిడ్నీ టెస్టుకు ముందు ఆకాశ్ దీప్ గాయపడిన కారణంగా.. ప్రసిద్‌కు తుదిజట్టులో చోటు దక్కింది. ఈ మ్యాచ్‌లో మొత్తంగా ఆరు వికెట్లు తీసి.. వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు ఈ కర్ణాటక యువ పేసర్.నాకౌట్ మ్యాచ్‌ల బరిలోఇక పడిక్కల్, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ కృష్ణ తదుపరి ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లపై కూడా కన్నేశారు. సీనియర్లు విశ్రాంతి పేరిట దూరమయ్యే పరిస్థితుల నేపథ్యంలో అవకాశాన్ని ఒడిసిపట్టాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో విజయ్ హజారే ట్రోఫీ నాకౌట్ మ్యాచ్‌లలో ఆడేందుకు వీరు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.కాగా గురువారం (జనవరి 9) నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రి క్వార్టర్ పైనల్ మ్యాచ్‌లు ఆరంభం కానున్నాయి. తమిళనాడు, రాజస్తాన్, హర్యానా, బెంగాల్ ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధించాయి. మరోవైపు.. అద్భుత ప్రదర్శనతో టాప్-6లో నిలిచిన గుజరాత్, విదర్భ, కర్ణాటక, బరోడా, మహారాష్ట్ర, పంజాబ్ నేరుగా క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టాయి. ఇంగ్లండ్‌తో ఐదు టీ20లు, మూడు వన్డేలుఈ నేపథ్యంలో తమిళనాడు తరఫున వాషీ, కర్ణాటక తరఫున ప్రసిద్ కృష్ణ, దేవ్‌దత్ పడిక్కల్ బరిలో దిగనున్నారు. ఇదిలా ఉంటే.. జనవరి 22 నుంచి భారత్- ఇంగ్లండ్ మధ్య సిరీస్ ఆరంభం కానుంది. తొలుత ఐదు టీ20లు.. అనంతరం మూడు వన్డేల సిరీస్‌లు జరుగుతాయి.చదవండి: ‘బవుమా అలాంటి వాడు కాదు.. డబ్ల్యూటీసీ ఫైనల్లో విజయం మాదే’ -
నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ కష్టం
సిడ్నీ: ఆస్ట్రేలియాతో చివరి టెస్టులో టీమిండియాకు భారీ ఆధిక్యం దక్కకపోయినా... ఈ పిచ్‌పై నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం ఎవరికైనా కష్టమే అని భారత పేసర్ ప్రసిధ్ కృష్ణ అన్నాడు. సిడ్నీ వికెట్ అనూహ్యంగా స్పందిస్తోందని... భారీ స్కోరు చేయడం అంత సులువు కాదని అతడు పేర్కొన్నాడు. శనివారం ఆట ముగిసిన అనంతరం ప్రసిధ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ‘బంతి అనూహ్యంగా స్పందిస్తోంది. ముఖ్యంగా కొన్ని భాగాల్లో పిచ్‌ను తాకిన తర్వాత తక్కువ ఎత్తులో వస్తోంది. మరికొన్ని చోట్ల బాగా బౌన్స్ అవుతోంది. ఇలాంటి చోట ఎంత లక్ష్యం సురక్షితం అని చెప్పలేం. వీలైనన్ని ఎక్కువ పరుగులు చేసేందుకు ప్రయతి్నస్తాం. ఈ మ్యాచ్‌కు ముందు భారత్ ‘ఎ’ తరఫున ఇక్కడ పర్యటించడం మంచి ఫలితాన్నిచ్చింది.దానివల్లే సులువుగా బౌలింగ్ చేశా. మొదట్లో కాస్త ఒత్తిడికి గురైనా... ఆ వెంటనే పరిస్థితులను అర్థం చేసుకొని ముందుకు సాగా. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ సూచనలు ఫలితాన్నిచ్చాయి. ప్రాథమిక సూత్రానికి కట్టుబడే బంతులు విసిరా. దాంతోనే ఫలితం రాబట్టగలిగా. ఇక ముందు కూడా ఇదే కొనసాగిస్తా. రెండో ఇన్నింగ్స్‌లోనూ కంగారూలను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తాం’ అని వివరించాడు. ‘బోర్డర్–గావస్కర్’ ట్రోఫీ ఆఖరి టెస్టులో ప్రస్తుతం భారత జట్టు ఓవరాల్‌గా 145 పరుగుల ఆధిక్యంలో ఉంది. -
మొదట్లో అతడిని పక్కనపెట్టి తప్పు చేశారు: భారత మాజీ క్రికెటర్
యువ పేసర్ ప్రసిద్ కృష్ణ సేవలను ఉపయోగించుకోవడంలో టీమిండియా యాజమాన్యం విఫలమైందని భారత మాజీ క్రికెటర్ దొడ్డ గణేశ్ అన్నాడు. ఫామ్‌లో ఉన్న బౌలర్‌కు అవకాశం ఇవ్వకపోవడాన్ని మూర్ఖపు చర్యగా అభివర్ణించాడు. వేరొకరిని తుదిజట్టులో ఆడించడం కోసం ప్రసిద్‌ను పక్కనపెట్టడం సరికాదని పేర్కొన్నాడు. కాగా 2023లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు 28 ఏళ్ల ప్రసిద్(Prasidh Krishna).షమీ లేకపోవడంతోకర్ణాటకకు చెందిన ఈ రైటార్మ్ ఫాస్ట్‌బౌలర్ సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా ఎంట్రీ ఇచ్చి.. రెండు మ్యాచ్‌లలో కలిపి ఐదు వికెట్లు తీశాడు. అయితే, ఆ తర్వాత మళ్లీ టెస్టు జట్టులో స్థానం సంపాదించలేకపోయాడు. అయితే, బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)కి సీనియర్ పేసర్ మహ్మద్ షమీ దూరమైన కారణంగా ప్రసిద్‌కు మరోసారి టెస్టు జట్టులో చోటు దక్కింది.పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌తో పాటు యువ ఆటగాళ్లు హర్షిత్ రాణా, ఆకాశ్ దీప్‌లతో కలిసి ఫాస్ట్ బౌలర్ల విభాగంలో ప్రసిద్ స్థానం సంపాదించాడు. అయితే, బుమ్రా, సిరాజ్‌లతో పాటు హర్షిత్ రాణాకు మేనేజ్మెంట్ ప్రాధాన్యం ఇచ్చింది. పెర్త్ వేదికగా అతడికి అరంగేట్రం చేసే అవకాశం ఇచ్చింది. ఫలితంగా ప్రసిద్ కృష్ణకు మొండిచేయి ఎదురైంది.ఆకాశ్ దీప్ గాయం కారణంగాఇక ఆసీస్‌తో తొలి టెస్టులో నాలుగు వికెట్లతో చెలరేగిన హర్షిత్ రాణా.. అడిలైడ్‌లో జరిగిన పింక్ బాల్ టెస్టులో మాత్రం తేలిపోయాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈ క్రమంలో హర్షిత్‌పై వేటు వేసిన యాజమాన్యం.. తర్వాతి రెండు టెస్టుల్లో ఆకాశ్ దీప్‌ను ఆడించింది. దీంతో మరోసారి ప్రసిద్ బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది.అయితే, కీలకమైన ఐదో టెస్టుకు ముందు ఆకాశ్ గాయపడటంతో ప్రసిద్ కృష్ణకు ఎట్టకేలకు తుదిజట్టులో చోటు దక్కింది. సిడ్నీ వేదికగా జరుగుతున్న ఈ ఆఖరి టెస్టులో ప్రసిద్ మెరుగ్గా రాణించాడు. స్టీవ్ స్మిత్(33), అలెక్స్ క్యారీ(21), బ్యూ వెబ్‌స్టర్(57) రూపంలో మూడు కీలక వికెట్లు తీసి ఆసీస్‌ను దెబ్బకొట్టాడు.అనధికారిక సిరీస్‌లోనూ సత్తా చాటిమొత్తంగా 15 ఓవర్ల బౌలింగ్‌లో కేవలం 42 పరుగులే ఇచ్చి ఇలా విలువైన వికెట్లు తీసి.. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను 181 పరుగులకే ఆలౌట్ చేయడంలో ప్రసిద్ తన వంతు పాత్ర పోషించాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని.. తన సత్తా ఏమిటో చాటుకోగలిగాడు. అంతేకాదు.. అంతకు ముందు భారత్-‘ఎ’ తరఫున ఆస్ట్రేలియా- ‘ఎ’ జట్టుతో అనధికారిక సిరీస్‌లోనూ ప్రసిద్ కృష్ణ పది వికెట్లతో మెరిశాడు.తప్పు చేశారుఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కర్ణాటకకు చెందిన దొడ్డ గణేశ్ స్పందిస్తూ.. ‘‘టెస్టు సిరీస్ మొదలుకావడానికి ముందు భారత్-‘ఎ’ తరఫున అతడి ప్రదర్శన ఎలా ఉందో చూసిన తర్వాత కూడా.. ప్రసిద్‌ను కాదని హర్షిత్ రాణాను ఎంపిక చేయడం బుర్రలేని పని. ప్రసిద్ మంచి రిథమ్‌లో ఉన్నాడు. అయినా సరే.. సిరీస్ ఆరంభం నుంచి అతడిని తుదిజట్టులోకి తీసుకోకుండా మేనేజ్మెంట్ తప్పుచేసింది’’ అని పేర్కొన్నాడు.కాగా సిడ్నీ వేదికగా శుక్రవారం మొదలైన ఐదో టెస్టులో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లొ 185 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం ఆసీస్‌ను 181 పరుగులకే కుప్పకూల్చి నాలుగు పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించింది. అనంతరం శనివారం నాటి రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి 32 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి బారత్ 141 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌తో కలుపుకొని ఆసీస్ కంటే 145 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.చదవండి: IND vs AUS: పంత్ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా రికార్డు -
సిడ్నీ టెస్టుకు భారత తుదిజట్టు ఇదే! అతడి ఎంట్రీ ఫిక్స్!
ఆస్ట్రేలియాతో ఐదో టెస్టు నేపథ్యంలో భారత తుదిజట్టులో రెండు మార్పులు చేటుచేసుకున్నట్లు సమాచారం. కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) విశ్రాంతి పేరిట ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండాలని భావించగా.. శుబ్‌మన్ గిల్‌కు మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. ఆకాశ్ దీప్ స్థానంలో యువ పేసర్మరోవైపు.. ఆకాశ్ దీప్ గాయం కారణంగా జట్టుకు దూరం కాగా.. ఓ యువ పేసర్ ఏడాది కాలం తర్వాత పునరాగమనం చేయనున్నట్లు సమాచారం. అదే విధంగా రోహిత్ శర్మ గైర్హాజరీలో ప్రధాన పేసర్, వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి సారథ్య బాధ్యతలు నిర్వర్తించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత నాలుగు పర్యాయాలుగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీని కైవసం చేసుకున్న భారత జట్టు.. ఈసారి మాత్రం అనుకున్న ఫలితాలు రాబట్టలేకపోతోంది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) విఫలం కావడం తీవ్ర ప్రభావం చూపుతోంది. కోహ్లి, రోహిత్ విఫలంఆసీస్తో ఐదు టెస్టుల్లో భాగంగా ఇప్పటికి నాలుగు పూర్తి కాగా.. తొలి మ్యాచ్‌లో శతకం సాధించడం మినహా కోహ్లి పెద్దగా రాణించలేకపోతున్నాడు. ముఖ్యంగా ఆఫ్ సైడ్ బంతుల్ని ఎదుర్కొనే క్రమంలో పదే పదే తప్పుల్ని పునరావృతం చేస్తూ వికెట్ పారేసుకుంటున్నాడు.మరోవైపు.. రోహిత్ సారథిగా, బ్యాటర్‌గా విఫలమవుతున్నాడు. అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్టుతో జట్టులోకి వచ్చిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఐదు ఇన్నింగ్స్‌లో కలిపి మరీ దారుణంగా31 పరుగులే చేశాడు. ఇక అతడి సారథ్యంలో రెండో టెస్టులో ఓడిన భారత్, బ్రిస్బేన్ టెస్టును డ్రాగా ముగించగలిగింది. అయితే, మెల్బోర్న్లో జరిగిన నాలుగో టెస్టులో మాత్రం 184 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది.సిడ్నీ టెస్టు నుంచి వైదొలిగిన రోహిత్!ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించే సమయం ఆసన్నమైందని.. అతడు వెంటనే తప్పుకొని యువకులకు అవకాశం ఇవ్వాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఆసీస్‌తో ఆఖరి టెస్టు ముగిసిన తర్వాత రోహిత్ తన నిర్ణయాన్ని వెల్లడిస్తాడనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో తనకు తానుగా సిడ్నీ టెస్టు నుంచి వైదొలగాలని అతడు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో యశస్వి జైస్వాల్‌తో ఓపెనింగ్ జోడీగా కేఎల్ రాహుల్ మరోసారి బరిలోకి దిగనుండగా.. శుబ్‌మన్ గిల్(Shubhman Gill) మూడో స్థానంలో ఆడనున్నట్లు సమాచారం. అదే విధంగా గాయపడిన పేసర్ ఆకాశ్ దీప్ స్థానంలో ప్రసిద్ కృష్ణ తుదిజట్టుకు ఎంపికైనట్లు తెలుస్తోంది. రెండే మార్పులుఈ రెండు మార్పులు మినహా.. పాత జట్టుతోనే భారత్ సిడ్నీ టెస్టుకు సన్నద్ధమైనట్లు సమాచారం. కాగా శుక్రవారం నుంచి మంగళవారం(జనవరి 3-7) వరకు ఆసీస్- భారత్ మధ్య ఐదో టెస్టుకు షెడ్యూల్ ఖరారైంది. ఇందులో గెలిస్తేనే టీమిండియా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకోగలుగుతుంది. అదే విధంగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025 అవకాశాలు కూడా సజీవంగా ఉంటాయి.ఆస్ట్రేలియాతో సిడ్నీ టెస్టుకు భారత తుదిజట్టు(అంచనా)యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్), మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.చదవండి: కెప్టెన్ కంటే బెటర్.. అతడిని మాత్రం తప్పించకండి: భారత మాజీ క్రికెటర్ -
చెప్పి మరీ.. అతడిపై వేటు వేయండి: టీమిండియా దిగ్గజం
టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్(Mohammed Siraj)ను ఉద్దేశించి భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ ఘాటు విమర్శలు చేశాడు. అతడిపై నిర్దాక్షిణ్యంగా వేటు వేయాలని యాజమాన్యానికి సూచించాడు. విశ్రాంతి పేరిట పక్కన పెడుతున్నామని చెబితే సరిపోదని.. జట్టు నుంచి తప్పిస్తున్నామని స్పష్టంగా చెప్పాలంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు.ఆసీస్‌తో 1-1తో సమంగా టీమిండియాబోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy) ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లిన భారత జట్టు.. పెర్త్‌లో గెలుపొంది శుభారంభం చేసింది. అయితే, అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్టులో ఓటమి చెందిన రోహిత్ సేన.. బ్రిస్బేన్‌లో మూడో టెస్టును డ్రా చేసుకుంది. దీంతో ప్రస్తుతం ఆసీస్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో 1-1తో సమంగా ఉంది.బుమ్రాపై అదనపు భారం మోపుతున్న సిరాజ్? అయితే, ఈ సిరీస్‌లో భారత పేసర్ సిరాజ్ ఇప్పటి వరకు ఏడు ఇన్నింగ్స్‌లో కలిపి పదమూడు వికెట్లు తీశాడు. కానీ కొత్త బంతితో మ్యాజిక్ చేయలేకపోతున్న ఈ హైదరాబాదీ బౌలర్.. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై అదనపు భారం మోపుతున్నాడనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కీలక సమయంలో సిరాజ్ వికెట్లు తీయకపోవడంతో బుమ్రాపై పనిభారం ఎక్కువవుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.వేటు వేస్తున్నామని స్పష్టంగా చెప్పండిఈ నేపథ్యంలో కామెంటేటర్ సునిల్ గావస్కర్(Sunil Gavaskar Comments) మాట్లాడుతూ.. ‘‘సిరాజ్‌కు బ్రేక్ ఇవ్వాలి. నా ఉద్దేశం.. విశ్రాంతి పేరిట పక్కన పెట్టాలని కాదు. ‘నీ ఆట తీరు బాగాలేదు. కాబట్టి నిన్ను జట్టు నుంచి తప్పిస్తున్నాం’ అని స్పష్టంగా అతడికి చెప్పాలి.కొన్నిసార్లు ఆటగాళ్ల పట్ల కాస్త పరుషంగా వ్యవహరించడంలో తప్పులేదు. ఎందుకంటే.. విశ్రాంతినిస్తున్నామని చెబితే.. వాళ్లు మరోలా ఊహించుకుంటారు. కాబట్టి వేటు వేస్తున్నామని వారికి తెలిసేలా చేయాలి.సిరాజ్ స్థానంలో వారిని తీసుకోండి అప్పుడే వారిలో కసి పెరుగుతుంది. కచ్చితంగా ఆట తీరును మెరుగుపరచుకుంటారు’’ అని పేర్కొన్నాడు. జట్టులో మార్పులు చేయాలనుకుంటే.. సిరాజ్‌ను తప్పించి ప్రసిద్ కృష్ణ లేదంటే హర్షిత్ రాణాను పిలిపించాలని గావస్కర్ ఈ సందర్భగా సూచించాడు. బుమ్రాకు వారు సపోర్టుగా ఉంటారని పేర్కొన్నాడు. బాక్సింగ్ డే టెస్టులో రెండో రోజూ ఆసీస్దేకాగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య గురువారం బాక్సింగ్ డే టెస్టు మొదలైంది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసే సరికి ఆసీస్ పటిష్ట స్థితిలోనే ఉంది.తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగుల మేర భారీ స్కోరు సాధించిన కంగారూ జట్టు.. శుక్రవారం నాటి ఆట పూర్తయ్యేసరికి సగం వికెట్లు తీసి భారత్‌ను దెబ్బకొట్టింది. ఆసీస్ బౌలర్లలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్, మరో పేసర్ స్కాట్ బోలాండ్ చెరో రెండు వికెట్లు తీయగా.. 46 ఓవర్లలో టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(82) రనౌట్ కావడంతో భారత్‌కు గట్టి షాక్ తగిలింది.చదవండి: కోహ్లికి అవమానం.. ఇంత నీచంగా ప్రవర్తిసారా?.. తగ్గేదేలే అంటూ దూసుకొచ్చిన కింగ్ -
నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. 223 పరుగులకు ఆసీస్ ఆలౌట్
మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా-ఎ జట్టుతో జరుగుతున్న రెండో అనాధికారిక టెస్టులో భారత్-ఎ జట్టు బౌలర్లు అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 223 పరుగులకు ఆలౌటైంది. 52/3 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ అదనంగా 171 పరుగులు చేసి తమ తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. దీంతో కంగారులకు మొదటి ఇన్నింగ్స్‌లో 62 పరుగుల ఆధిక్యం లభించింది. ఆసీస్ బ్యాటర్లలో మార్కస్ హ్యారీస్(74) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కోరీ రోకిసియోలి(35),పీర్సన్(30) పరుగులతో రాణించారు. ఇక భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ 4 వికెట్లు పడగొట్టగా, ముఖేష్ కుమార్ మూడు, ఖాలీల్ ఆహ్మద్ రెండు వికెట్లు సాధించారు.ధ్రువ్ జురెల్ ఒంటరి పోరాటం..అంతకుముందు భారత్-ఎ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 161 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్(80) మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో నీసర్ 4 వికెట్లు పడగొట్టగా, వెబ్‌స్టెర్ మూడు వికెట్లు సాధించాడు.చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. -
Aus A vs Ind A: ముకేశ్ దెబ్బకు.. ‘జూనియర్ రికీ పాంటింగ్’ డకౌట్.. కానీ
ఆస్ట్రేలియా పర్యటనలో భారత్-‘ఎ’ జట్టుకు శుభారంభం లభించలేదు. ఆసీస్‌తో గురువారం మొదలైన అనధికారిక టెస్టు తొలి రోజు ఆటలోనే రుతురాజ్ సేనకు గట్టి షాక్ తగిలింది. కంగారూ బౌలర్ల విజృంభణ నేపథ్యంలో భారత బ్యాటర్లు పెవిలియన్‌కు వరుస కట్టారు.బ్యాటర్లు విఫలంఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్(7), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(0) సహా బాబా ఇంద్రజిత్(9), వికెట్ కీపర్ ఇషాన్ కిషన్(4), నితీశ్ కుమార్ రెడ్డి(0), టెయిలెండర్లు మానవ్ సుతార్(1), ప్రసిద్ కృష్ణ(0) పూర్తిగా విఫలమయ్యారు.ఇక వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్(21)తో పాటు దేవ్‌దత్ పడిక్కల్(36), టెయిలెండర్ నవదీప్ సైనీ(23) ఓ మోస్తరుగా రాణించడంతో భారత్ వంద పరుగులు దాటగలిగింది. 47.4 ఓవర్లలో 107 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లలో బ్రెండన్ డాగెట్ ఆరు వికెట్లతో సత్తా చాటగా.. మరో పేసర్ ఫెర్గూస్ ఒ నీల్, స్పిన్నర్ టాడ్ మర్ఫీ తలా ఒక వికెట్ పడగొట్టారు. Buckingham's got two! Watch #AUSAvINDA live: https://t.co/XcQLyyTDJ5 pic.twitter.com/RccWM8CX5R— cricket.com.au (@cricketcomau) October 31, 2024 ఆసీస్‌కూ ఆదిలోనే షాక్.. ‘జూనియర్ రికీ పాంటింగ్’ డకౌట్ఈ క్రమంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా-ఎ జట్టుకు భారత పేసర్ ముకేశ్ కుమార్ ఆదిలోనే షాకిచ్చాడు. తన అద్భుత ఆట తీరుతో ‘జూనియర్ రికీ పాంటింగ్’గా పేరొందిన ఓపెనర్ స్యామ్ కన్‌స్టాస్(Sam Konstas)ను డకౌట్ చేశాడు. Mukesh gets Konstas in the first over! #AUSAvINDA pic.twitter.com/8E61yX0zTM— cricket.com.au (@cricketcomau) October 31, 2024మొత్తంగా మూడు బంతులు ఎదుర్కొన్న స్యామ్ ముకేశ్ బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు ప్రయత్నించి వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చాడు. పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు.టీమిండియాతో టెస్టుకు ఆసీస్ ఓపెనర్ల పోటీలో కాగా 19 ఏళ్ల స్యామ్ ఇప్పటి వరకు ఆరు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి రెండు శతకాలు బాదడం సహా సగటు 45.70గా నమోదు చేశాడు. భారత్-ఎ జట్టుతో మ్యాచ్‌లో గనుక రాణిస్తే తదుపరి టీమిండియాతో బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో అతడు ఆస్ట్రేలియా ఓపెనర్‌గా బరిలో దిగే ఛాన్స్ లేకపోలేదు. అయితే, తొలి ఇన్నింగ్స్‌లో మాత్రం ముకేశ్ రూపంలో స్యామ్‌కు గట్టి షాక్ తగిలింది.పాతుకుపోయిన కెప్టెన్ఇదిలా ఉంటే.. ప్రసిద్ కృష్ణ సైతం అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. తొలుత కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌ను డకౌట్ చేసిన ప్రసిద్.. తర్వాత ఆసీస్-ఎ మరో ఓపెనర్ మార్కస్ హ్యారిస్(17) వికెట్ పడగొట్టాడు. ఇలా టాపార్డర్‌ను భారత బౌలర్లు కుదేలు చేసినా.. మిడిలార్డర్లో వచ్చిన కెప్టెన్ నాథన్ మెక్‌స్వీనీ క్రీజులో పాతుకుపోయి ఇబ్బంది పెట్టాడు.అతడికి తోడుగా బ్యూ వెబ్‌స్టర్(33) రాణించాడు. అయితే, ముకేశ్ కుమార్ ఈ జోడీని విడదీయగా.. నాథన్‌కు జతైన కూపర్ కానొలీ సైతం పట్టుదలగా నిలబడ్డాడు. ఈ క్రమంలో తొలి రోజు ఆట పూర్తయ్యే సరికి ఆసీస్ 39 ఓవర్ల ఆటలో నాలుగు వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసి.. పటిష్ట స్థితిలో నిలిచింది. గురువారం ఆట ముగిసే సరికి నాథన్ 29, కూపర్ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు.ఆస్ట్రేలియా- ‘ఎ’ వర్సెస్ భారత్- ‘ఎ’ అనధికారిక తొలి టెస్టు(డే-1)👉వేదిక: గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఎరీనా, మెక్కే👉టాస్: ఆస్ట్రేలియా-ఎ.. తొలుత బౌలింగ్👉భారత్ స్కోరు: 107👉ఆసీస్ స్కోరు: 99/4 (39).. తొలి ఇన్నింగ్స్‌లో తొలిరోజు భారత్ కంటే ఎనిమిది పరుగుల వెనుకంజతుదిజట్లుఆస్ట్రేలియా-ఎస్యామ్ కన్‌స్టాస్, మార్కస్ హారిస్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్, నాథన్ మెక్‌స్వీనీ (కెప్టెన్), బ్యూ వెబ్‌స్టర్, కూపర్ కానొలీ, జోష్ ఫిలిప్ (వికెట్ కీపర్), ఫెర్గూస్ ఓ నీల్, టాడ్ మర్ఫీ, బ్రెండన్ డోగెట్, జోర్డాన్ బకింగ్‌హామ్.భారత్- ఎరుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్, బాబా ఇంద్రజిత్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, మానవ్ సుతార్, నవదీప్ సైనీ, ప్రసిద్ కృష్ణ, ముకేశ్ కుమార్.చదవండి: IPL 2025: షాకింగ్.. అతడి కోసం జడ్డూను వదులుకున్న సీఎస్కే! -
ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్ న్యూస్.. రిషబ్ పంత్‌కు గ్రీన్ సిగ్నల్
ఢిల్లీ క్యాపిటల్స్‌కు శుభవార్త అందింది. ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్‌కు ఐపీఎల్ ఆడేందుకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2022 చరమాంకంలో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్ 14 నెలల రీహ్యాబ్ అనంతరం పూర్తి ఫిట్నెస్ సాధించాడని బీసీసీఐ సర్టిఫై చేసింది. పంత్ బ్యాటర్‌గానే కాకుండా వికెట్‌కీపర్‌గానూ ఫిట్‌గా ఉన్నాడని బీసీసీఐ ధృవీకరించింది. ఈ మేరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది. BCCI update on Rishabh Pant. pic.twitter.com/LnprCkgJ0v — CricTracker (@Cricketracker) March 12, 2024 బీసీసీఐ ఇచ్చిన సర్టిఫికెట్తో పంత్‌కు రానున్న ఐపీఎల్ సీజన్ ఆడేందుకు మార్గం సుగమం అయ్యింది. పంత్ బ్యాటర్‌గానే కాకుండా వికెట్‌కీపింగ్ కూడా చేయగలడిన బీసీసీఐ సర్టిఫికెట్ ఇవ్వడంతో ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానుల ఆనందానికి అవథుల్లేకుండా పోతున్నాయి. పంత్ ఐపీఎల్ 2024లో ఆడతాడని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నా, వికెట్‌కీపింగ్ చేస్తాడా లేదా అన్న విషయమై సందిగ్దత నెలకొని ఉండింది. బీసీసీఐ తాజా ప్రకటనతో అభిమానుల అనుమానాలన్నీ తొలగిపోయాయి. రీఎంట్రీలో పంత్ మునపటిలా చెలరేగుతాడో లేదో వేచి చూడాలి. 🚨NEWS🚨 Rajasthan Royals pacer Prasidh Krishna underwent surgery on his left proximal quadriceps tendon and will miss IPL 2024. Mohammed Shami had surgery for his right heel problem and will take no part in IPL 2024 📸: BCCI#IPL2024 pic.twitter.com/0WBQsma9jI — CricTracker (@Cricketracker) March 12, 2024 పంత్ గురించి అప్డేట్ ఇచ్చే సందర్భంగానే బీసీసీఐ మరో ఇద్దరు ఆటగాళ్ల గురించి కూడా ప్రకటన విడుదల చేసింది. ఇటీవలే సర్జరీ చేయించుకున్న రాజస్థాన్ రాయల్స్ బౌలర్ ప్రసిద్ద్ కృష్ణ ఐపీఎల్ 2024 సీజన్ మొత్తానికి దూరంగా ఉండనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. అలాగే చీలిమండ సర్జరీ చేయించుకున్న గుజరాత్ టైటాన్స్ పేసర్ మొహమ్మద్ షమీ కూడా సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండడని అధికారికంగా కన్ఫర్మ్ చేసింది. కాగా, ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. -
టీమిండియా యువ పేసర్‌కు గాయం.. ఆటకు దూరం
టీమిండియా ఆటగాళ్లను గాయాలు వేధిస్తున్నాయి. ఇప్పటికే ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, టీ20 నంబర్ వన్ బ్యాటర్ సూర్యకుమార్, ఓపెనింగ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ ఆటకు దూరంగా ఉన్నారు. వీళ్లంతా అఫ్గనిస్తాన్‌తో స్వదేశంలో జరుగుతున్న టీ20 సిరీస్‌కు దూరమయ్యారు. మరోవైపు... వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత.. చీలమండ నొప్పితో జట్టుకు దూరమైన సీనియర్ పేసర్ మహ్మద్ షమీ కూడా ఇంకా అందుబాటులోకి రాలేదు. దీంతో ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై జరుగనున్న తొలి రెండు టెస్టులకు ఎంపిక చేసిన జట్టులో అతడికి స్థానం దక్కలేదు. ఈ క్రమంలో తాజాగా టీమిండియా మరో బౌలర్ గాయపడ్డాడు. యువ పేసర్ ప్రసిద్ కృష్ణ తొడ కండరాల నొప్పితో ఆటకు దూరం కావడం గమనార్హం. కాగా సౌతాఫ్రికా పర్యటన సందర్భంగా టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈ కర్ణాటక బౌలర్.. రెండు మ్యాచ్‌లు ఆడి ధారాళంగా పరుగులు ఇచ్చుకుని కేవలం రెండు వికెట్లు మాత్రమే తీశాడు. సఫారీ గడ్డపై నిరాశాజనక ప్రదర్శన నేపథ్యంలో తిరిగి దేశవాళీ క్రికెట్‌పై దృష్టి సారించిన ప్రసిద్ కృష్ణ.. రంజీ ట్రోఫీ-2024లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగా కర్ణాటక- గుజరాత్ మధ్య శుక్రవారం మొదలైన టెస్టులో అతడు బరిలోకి దిగాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో 14.5 ఓవర్లు బౌల్ చేసిన ప్రసిద్ రెండు వికెట్లు తీశాడు. అయితే, పదిహేనో ఓవర్ ఆఖరి బంతి వేసేపుడు తొడ కండరాల నొప్పితో విలవిల్లాడిన ఈ రైటార్మ్ పేసర్ మైదానాన్ని వీడాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతడు కోలుకోవడానికి సుమారు నాలుగు నుంచి ఆరు వారాల సమయం పట్టనుంది. దీంతో ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్‌కు అతడు అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఇక ఇంగ్లండ్‌తో సిరీస్‌లో భాగంగా ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌లకు బీసీసీఐ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. పేస్ దళంలో జస్ప్రీత్ బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్ చోటు దక్కించుకున్నారు. ఇక ప్రసిద్ కృష్ణ మాత్రం గాయం కారణంగా మిగిలిన మూడు మ్యాచ్‌లలో ఆడకపోవచ్చు. చదవండి: Ind vs Eng: తండ్రి కార్గిల్ యుద్ధంలో.. తల్లి త్యాగం! టీమిండియాలో ఎంట్రీ.. -
సౌతాఫ్రికాతో రెండో టెస్టు: మార్పులు సూచించిన ఇర్ఫాన్ పఠాన్
South Africa vs India, 2nd Test: సౌతాఫ్రికాతో రెండో టెస్టు నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పుపై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్థానాన్ని ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో భర్తీ చేయాలని సూచించాడు. జడ్డూ గనుక ఫిట్‌గా ఉంటే కేప్‌టౌన్ మ్యాచ్‌లో అతడిని తప్పక ఆడించాలని మేనేజ్మెంట్కు విజ్ఞప్తి చేశాడు. అదే విధంగా యువ పేసర్ ప్రసిద్ కృష్ణ విషయంలో పునరాలోచన చేయాలని పఠాన్ సూచించాడు. కాగా సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా దారుణ పరాజయం మూటగట్టుకున్న విషయం తెలిసిందే. బాక్సింగ్ డే టెస్టులో ఆతిథ్య సౌతాఫ్రికా చేతిలో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో సిరీస్‌ను డ్రా చేసుకోవాలంటే రెండో మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన స్థితిలో నిలిచింది. ఒకవేళ ఈ మ్యాచ్‌లోనూ గనుక ఓడితే.. మరోసారి సఫారీ గడ్డపై టీమిండియాకు భంగపాటు తప్పదు. అందుకే.. గత మ్యాచ్ తాలుకు తప్పిదాలు పునరావృతం కాకుండా.. లోపాలు సరిచేసుకుని బరిలోకి దిగేందుకు రోహిత్ సేన సిద్ధమవుతోంది. జడ్డూ వస్తే ప్రయోజనకరంగా ఉంటుంది ఈ నేపథ్యంలో జట్టు కూర్పు గురించి భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘రవీంద్ర జడేజా ఫిట్నెస్ సాధిస్తే అతడిని కచ్చితంగా తుదిజట్టులోకి తీసుకోవాలి. గత మ్యాచ్‌లో అశ్విన్ బాగానే బౌలింగ్ చేశాడు. కానీ.. బ్యాటింగ్ ఆర్డర్లో ఏడో స్థానంలో రాణించగల జడేజా సేవలను ఇండియా కోల్పోయింది. కాబట్టి అతడు జట్టులోకి వస్తే ఉపయోగకరంగా ఉంటుంది. ఇక బౌలింగ్ దళం విషయంలో రోహిత్ శర్మ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగితే బాగానే ఉంటుంది. ఒకవేళ ఏదైనా మార్పు చేయాలనుకుంటే ప్రసిద్ కృష్ణ స్థానంలో ముకేశ్ కుమార్‌ను తీసుకురావాల్సి ఉంటుంది. ప్రసిద్ కృష్ణను ఆడిస్తే.. అయితే, నెట్స్‌లో ప్రసిద్ కృష్ణ బౌలింగ్ బాగానే అనిపిస్తే.. అతడి విషయంలో ధీమా ఉంటే రెండో టెస్టులోనూ ఆడించవచ్చు’’ అని ఇర్ఫాన్ పఠాన్ ఇండియా టుడేతో పేర్కొన్నాడు. కాగా టీమిండియా- సౌతాఫ్రికా మధ్య బుధవారం నుంచి కేప్‌టౌన్ వేదికగా రెండో టెస్టు ఆరంభం కానుంది. ఇదిలా ఉంటే.. సెంచూరియన్ టెస్టు ద్వారా అరంగేట్రం చేసిన ప్రసిద్ కృష్ణ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఇరవై ఓవర్ల బౌలింగ్‌లో మొత్తంగా 93 పరుగులు ఇచ్చి కేవలం ఒక వికెట్ తీయగలిగాడు. చదవండి: IND vs SA: సౌతాఫ్రికాతో రెండో టెస్టు.. టీమిండియాను భయపెడుతున్న రికార్డులు! -
IND vs SA: ప్రసిద్ కృష్ణ అరంగేట్రం.. జడేజా అవుట్.. తుదిజట్లు ఇవే
టీమిండియాతో తొలి టెస్టులో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. రోహిత్ సేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. సెంచూరియన్‌లో వర్షం కారణంగా టాస్ అరంగటకు పైగా ఆలస్యమైంది. ఇక ఈ మ్యాచ్‌తో భారత యువ పేసర్ ప్రసిద్ కృష్ణ అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. మరోవైపు.. స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వెన్నునొప్పి కారణంగా జట్టుకు దూరమయ్యాడు. దీంతో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ విషయాలను భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ సందర్భంగా వెల్లడించాడు. జస్ప్రీత్ బుమ్రా నాయకత్వంలోని పేస్ దళంలో శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్‌లతో పాటు ప్రసిద్‌కు చోటిచ్చినట్లు వెల్లడించాడు. కాగా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ గాయం కారణంగా సౌతాఫ్రికా పర్యటను దూరమైన విషయం తెలిసిందే. దీంతో అతడి స్థానంలో ప్రసిద్ కృష్ణకు మార్గం సుగమమైంది. వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా చేతుల మీదుగా అతడు టెస్టు క్యాప్ అందుకున్నాడు. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా గడ్డపై టీమిండియా ఇంత వరకు ఒక్కసారి కూడా టెస్టు సిరీస్ గెలవలేదు. సౌతాఫ్రికా- టీమిండియా తొలి టెస్టు.. తుదిజట్లు ఇవే: టీమిండియా రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ. సౌతాఫ్రికా డీన్ ఎల్గర్, ఐడెన్ మార్క్రమ్, టోనీ డి జోర్జీ, తెంబా బవుమా (కెప్టెన్), కీగన్ పీటర్సన్, డేవిడ్ బెడింగ్హామ్, కైల్ వెరెన్నె(వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, కగిసో రబాడ, నాండ్రే బర్గర్. -
Ind vs SA: వాళ్లిద్దరిలో ఒక్కరికే ఛాన్స్.. షమీ స్థానంలో అతడే!
Gautam Gambhir's XI for 1st Test Against South Africa: ప్రపంచ నంబర్ వన్ టీమిండియా సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు సన్నద్ధమైంది. సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్లో ఎదురైన పరాభవాన్ని మరిపించేలా చరిత్రాత్మక విజయం అందుకోవాలని పట్టుదలగా ఉంది. కాగా పేస్‌కు అనుకూలించే విదేశీ గడ్డపై ముఖ్యంగా SENA దేశాల(సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా)పై టెస్టు సిరీస్ గెలిస్తే ఆ మజానే వేరు! ‘సఫారీ’లో సాధ్యం కాలేదు అయితే, టీమిండియా ఈ నాలుగు దేశాల్లోని మూడు ఆతిథ్య జట్లను మాత్రమే టెస్టు సిరీస్‌లో ఓడించగలిగింది. సౌతాఫ్రికాలో మాత్రం ఇంతవరకు భారత జట్టుకు ఈ ఫీట్ సాధ్యం కాలేదు. ఈసారైనా ఆ అపవాదును చెరిపివేయాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది. ఒక్క స్పిన్నర్ చాలు ఈ నేపథ్యంలో సఫారీ టీమ్‌తో తలపడే తుదిజట్టు కూర్పు ఎలా ఉంటే బాగుంటుందన్న అంశంపై భారత మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగా గౌతం గంభీర్ తన అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకున్నాడు. బౌన్సీ పిచ్‌లు ఉన్న సౌతాఫ్రికాలో టీమిండియా ఒక్క స్పిన్నర్‌తో బరిలోకి దిగితే చాలని ఈ సందర్భంగా గౌతీ అభిప్రాయపడ్డాడు. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లలో ఒకరిని మాత్రమే ఆడించాలని సూచించాడు. షమీ స్థానంలో అతడే అదే విధంగా జస్ప్రీత్ బుమ్రా నాయకత్వంలోని పేస్ దళంలో శార్దూల్ ఠాకూర్‌కు చోటిచ్చిన గంభీర్.. మహ్మద్ షమీ స్థానంలో ప్రసిద్ కృష్ణను ఆడిస్తే బాగుంటుందని సూచించాడు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా యశస్వి జైశ్వాల్‌ను ఎంచుకున్న ఈ మాజీ ఓపెనర్.. శుబ్‌మన్ గిల్ వన్‌డౌన్‌లో వస్తే ప్రయోజనకరంగా ఉంటుందన్నాడు. ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ షోలో గంభీర్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. మరోవైపు.. టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ మాత్రం.. సఫారీలతో టెస్టుకు భారత్ ఇద్దరు స్పిన్నర్లు జడేజా, అశ్విన్‌లతో బరిలోకి దిగాలని సూచించడం గమనార్హం. అదే విధంగా పేస్ దళంలో ప్రసిద్‌కు కాదని ముకేశ్ కుమార్‌కు చోటిచ్చాడు గావస్కర్. మరి మీ ప్లేయింగ్ ఎలెవన్ ఏదో కామెంట్లలో తెలియజేయండి. సౌతాఫ్రికాతో తొలి టెస్టుకు గంభీర్ ఎంచుకున్న భారత తుదిజట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా/ రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్. చదవండి: WFI: మంచో చెడో.. రిటైర్ అయ్యా.. నాకేం సంబంధం లేదు! డబ్ల్యూఎఫ్ఐ మంచికి నాంది -
IND Tour Of SA: నిప్పులు చెరిగిన ప్రసిద్ద్ కృష్ణ.. హ్యాట్రిక్‌తో పాటు..!
దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా పేస్ బౌలర్ ప్రసిద్ద్ కృష్ణ హ్యాట్రిక్ వికెట్లతో అదరగొట్టాడు. సౌతాఫ్రికా-ఏతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్ట్‌లో భారత్-ఏ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ప్రసిద్ద్.. హ్యాట్రిక్‌తో పాటు ఐదు వికెట్ల ఘనతతో (5/43) చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్ తొలి భాగంలో నామమాత్రపు ప్రదర్శన చేసిన ప్రసిద్ద్.. రెండో భాగంలో రెచ్చిపోయి, హ్యాట్రిక్ సహా చివరి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ప్రసిద్ద్‌తో పాటు స్పిన్నర్ సౌరభ్‌కుమార్ (3/83) కూడా రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా-ఏ 319 పరుగులకు ఆలౌటైంది. శార్దూల్ ఠాకూర్, విధ్వత్ కావేరప్ప తలో వికెట్ పడగొట్టారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో జీన్ డుప్లెసిస్ సెంచరీతో (106) కదంతొక్కగా.. రూబిన్ హెర్మన్ (95) తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత-ఏ జట్టు.. 33 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (14), దేవ్‌దత్ పడిక్కల్ (30) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. ప్రదోష్ పాల్ (63), సర్ఫరాజ్ ఖాన్ (50) అజేయ అర్ధసెంచరీలు సాధించి ఇన్నింగ్స్‌లు కొనసాగిస్తున్నారు. ఈ నాలుగు రోజుల మ్యాచ్‌లో వర్షం కారణంగా తొలి రోజు ఆట పూర్తిగా సాధ్యపడకపోగా.. ప్రస్తుతం మూడో రోజు రెండో సెషన్ కొనసాగుతుంది. ఇదిలా ఉంటే, టీమిండియాతో పాటు భారత-ఏ జట్టు కూడా ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పర్యటిస్తుంది. ఓ పక్క టీమిండియా సౌతాఫ్రికా నేషనల్ టీమ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌తో పాటు టెస్ట్ సిరీస్ ఆడనుండగా.. భారత ఏ జట్టు సౌతాఫ్రికా ఏ టీమ్‌తో మూడు నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతుంది. తొలి అనధికారిక టెస్ట్‌లో 5 వికెట్ల ప్రదర్శనతో చెలరేగిపోయిన ప్రసిద్ద్.. భారత ఏ జట్టుతో పాటు రెగ్యులర్ టెస్ట్ జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. ఈ అనధికారిక సిరీస్ అయ్యాక ప్రసిద్ద్ టీమిండియాతో జతకట్టనున్నాడు. ఈ ప్రదర్శనతో ప్రసిద్ద్ సౌతాఫ్రికాతో తొలి టెస్ట్‌లో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ప్రసిద్ధ్ కృష్ణ. టెస్ట్ సిరీస్.. డిసెంబర్ 26 నుంచి 30: తొలి టెస్ట్ (సెంచూరియన్) 2024 జనవరి 3 నుంచి 7: రెండో టెస్ట్ (కేప్‌టౌన్) -
ఆసీస్‌తో నాలుగో టీ20.. తిలక్, ప్రసిద్ద్ ఔట్.. వారి స్థానాల్లో..?
రాయ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో ఇవాళ (డిసెంబర్ 1) జరిగే నాలుగో టీ20లో టీమిండియా రెండు మార్పులు చేయడం ఖాయంగా కనిపిస్తుంది. వరల్డ్‌కప్ అనంతరం విరామం తీసుకున్న శ్రేయస్, ఇటీవలే పెళ్లిపీటలెక్కిన ముకేశ్ కుమార్ తిరిగి జట్టులో చేరనున్నారని సమాచారం. ఈ సిరీస్ మొత్తంలో ఆశించిన మేర రాణించలేకపోయిన తిలక్ వర్మ, మూడో టీ20లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న ప్రసిద్ద్ కృష్ణ స్థానాల్లో శ్రేయస్, ముకేశ్ జట్టులో చేరతారని ప్రచారం జరుగుతుంది. శ్రేయస్ జట్టులోకి వస్తే సూర్యకుమార్ ఓ మెట్టు దిగి ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయాల్సి వస్తుంది. ఓపెనర్లుగా యశస్వి, రుతురాజ్.. వన్‌డౌన్‌లో ఇషాన్ కిషన్, నాలుగో స్థానంలో శ్రేయస్, ఆతర్వాత సూర్యకుమార్, రింకూ సింగ్ బ్యాటింగ్‌కు దిగే అవకాశం ఉంది. బౌలర్లుగా అక్షర్, రవి భిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ఆవేశ్ ఖాన్ కొనసాగవచ్చు. మరోవైపు ఆస్ట్రేలియా జట్టులోని అగ్రశ్రేణి ఆటగాళ్లంతా స్వదేశానికి పయనమయ్యారు. కొత్త ముఖాలతో ఆసీస్ బరిలోకి దిగనుంది. హెడ్, వేడ్ మినహా అన్ని పెద్ద పరిచయం లేని ముఖాలే. కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన టీమిండియా.. మూడో టీ20లో పరాజయంపాలైంది. సూర్య నాయకత్వంలోని భారత జట్టు ఈ మ్యాచ్‌లో ఎలాగైనా నెగ్గి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. తుది జట్లు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్ ), యశస్వి, రుతురాజ్, ఇషాన్ కిషన్, అయ్యర్, రింకూ సింగ్, అక్షర్, బిష్ణోయ్, అర్షదీప్, అవేశ్, ముకేశ్. ఆస్ట్రేలియా: వేడ్ (కెప్టెన్ ), హార్డీ, హెడ్, షార్ట్, మెక్‌డెర్మాట్, డేవిడ్, క్రిస్ గ్రీన్, డ్వార్షుయిస్, ఎలిస్, బెహ్రన్‌డార్ఫ్, సంఘా. -
ఆస్ట్రేలియాతో నాలుగో టీ20.. భారత స్టార్ బౌలర్‌పై వేటు!
ఆస్ట్రేలియాతో వరుసగా రెండు విజయాలు సాధించిన టీమిండియా.. మూడో వన్డేలో మాత్రం ఓటమి చవిచూసింది. బ్యాటర్లు అద్బుతంగా రాణించినప్పటికి బౌలర్లు విఫలమకావడంతో 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. దీంతో ఈ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడానికి టీమిండియా సిద్దమైంది. శుక్రవారం(డిసెంబర్ 1)న రాయ్‌పూర్ వేదికగా ఆసీస్‌తో నాలుగో టీ20లో తలపడేందుకు భారత జట్టు సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భారత జట్టు వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో నాలుగో టీ20లో భారత జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగననున్నట్లు తెలుస్తోంది. మూడో టీ20కు దూరమైన ముఖేష్ కుమార్ నాలుగో మ్యాచ్‌కు అందుబాటులో రానున్నాడు. అతడితో పాటు సిరీస్ మధ్యలో ఎంట్రీ ఇచ్చిన మరో పేసర్ దీపక్ చాహర్‌కు నాలుగో టీ20 తుది జట్టులో చోటు దక్కనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మూడో టీ20లో విఫలమైన ప్రసిద్ద్ కృష్ణ, అవేష్ ఖాన్‌ను బెంచ్‌కే పరిమితం చేయాలని జట్టు మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఆస్ట్రేలియా జట్టులో కూడా పలు మార్పులు చోటు చేసుకున్నాయి. విధ్వంసకర ఆటగాడు గ్లెన్ మాక్స్వెల్, స్టోయినిష్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లీష్ స్వదేశానికి పయనమయ్యారు. వారి స్ధానంలో జోష్ ఫిలిఫ్స్, బెన్ మెక్డార్మెట్, క్రిస్ గ్రీన్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. భారత తుది జట్టు(అంచనా) భారత్: యశస్వీ జైశ్వాల్, రుత్‌రాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, ముఖేష్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, దీపక్ చాహర్ -
'సూర్యకుమార్ బ్యాటింగే కాదు.. కెప్టెన్సీ కూడా అలానే ఉంది'
భారత జట్టు సారథిగా తొలిసారి వ్యవహరిస్తున్న సూర్యకుమార్ యాదవ్.. తన కెప్టెన్సీ స్కిల్స్‌తో అందరని అకట్టుకుంటున్నాడు. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా వంటి సీనియర్ల గైర్హజరీలో యవ భారత జట్టుకు సూర్య సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం తిరువనంతపురం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండు టీ20లో 44 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 అధిక్యంలోకి భారత్ దూసుకెళ్లింది. అంతకుముందు విశాఖపట్నం వేదికగా జరిగిన తొలి టీ20లో 2 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. ఈ రెండు విజయాల్లోనూ నాయకుడిగానే కాకుండా బ్యాటర్‌గా కూడా సూర్యకుమార్ కీలక పాత్ర పోషించాడు. తొలి మ్యాచ్‌లో 80 పరుగులతో సత్తాచాటిన సూర్య... రెండో టీ20లో కీలకమైన 19 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో రెండో టీ20 ముగిసిన తర్వాత సూర్యకుమార్ యాదవ్‌పై భారత పేసర్ ప్రసిధ్ కృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కృష్ణ మాట్లాడుతూ.. "సూర్యకుమార్ బ్యాటింగ్ చేసే విధానం చాలా భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు అది అతడి కెప్టెన్సీలో కన్పిస్తోంది. సూర్య జట్టులోని ఆటగాళ్లను నమ్ముతాడు. మా ప్రణాళికలను అమలు చేసేందుకు ప్రతీ ఒక్కరికి పూర్తి స్వేచ్చను ఇస్తాడు. పొరపాటున ఏదైనా తప్పు జరిగినా సరే తను సపోర్ట్‌గా ఉంటాడు. ఒక నాయకుడిగా ఉండాల్సిన క్వాలిటీస్ అన్ని సూర్యలో ఉన్నాడు. ఇక వరల్డ్‌కప్‌లో జట్టులో భాగంగా ఉండటం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నాను చెప్పుకొచ్చాడు. చదవండి: రోహిత్, కోహ్లి ఓపెన్‌గా మాట్లాడితేనే: టీమిండియా మాజీ బౌలర్ -
ఈ నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నా.. కష్టంగా ఉంది: హార్దిక్ భావోద్వేగం
Cricket World Cup 2023- Hardik Pandya Emotional Note: ‘‘వరల్డ్‌కప్ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరమవుతున్నాననే నిజాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది. జట్టుకు దూరంగా ఉన్నా నా మనసంతా అక్కడే ఉంటుంది. ప్రతి మ్యాచ్.. ప్రతి బాల్.. ప్రతిచోటా జట్టును చీర్ చేస్తూ అక్కడే తిరుగుతూ ఉంటుంది. కష్టకాలంలో నాపై ప్రేమ కురిపించి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’’ అంటూ టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా భావోద్వేగానికి లోనయ్యాడు. వన్డే వరల్డ్‌కప్-2023 నుంచి ఇలా అర్ధంతరంగా నిష్క్రమించడం బాధగా ఉందని ఉద్వేగానికి గురయ్యాడు. సెమీస్ నాటికి కోలుకుంటాడని భావిస్తే కాగా పుణెలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా పాండ్యా చీలమండకు గాయమైన విషయం తెలిసిందే. అయితే, జాతీయ క్రికెట్ అకాడమీలో బీసీసీఐ వైద్యుల నిరంతర పర్యవేక్షణలో ఉన్న ఈ పేస్ ఆల్‌రౌండర్.. సెమీస్ నాటికి కోలుకుంటాడని అంతా భావించారు. పాండ్యా స్థానంలో ప్రసిద్ కృష్ణ కానీ దురదృష్టవశాత్తూ.. గాయం తీవ్రంగా ఉండటంతో టోర్నీ మధ్యలోనే అతడు వైదొలగాల్సి వచ్చింది. ఈ క్రమంలో పాండ్యా స్థానంలో కర్ణాటక బౌలర్, టీమిండియా యువ పేసర్ ప్రసిద్ కృష్ణ వరల్డ్‌కప్ జట్టులోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా సోషల్ మీడియా వేదికగా భావోద్వేగపూరిత నోట్ షేర్ చేశాడు. సొంతగడ్డపై జరుగుతున్న ఐసీసీ టోర్నీకి ఇలా దూరం కావడం జీర్ణించుకోలేకపోతున్నానని పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93) అయితే, ప్రస్తుత భారత జట్టు ఎంతో ప్రత్యేకమైనదని.. ప్రతి ఒక్కరిని గర్వపడేలా చేస్తుందని తనకు పూర్తి నమ్మకం ఉందంటూ సహచరులను కొనియాడాడు. స్వదేశంలో టీమిండియా మరోసారి ట్రోఫీ గెలవడం ఖాయమని హార్దిక్ పాండ్యా ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశాడు. అజేయంగా నిలిచి సెమీస్‌లో వన్డే ప్రపంచకప్ పదమూడవ ఎడిషన్‌లో రోహిత్ సేన ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్‌లలో ఏడూ గెలిచింది. చివరగా ముంబైలోని చారిత్రాత్మక వాంఖడే స్టేడియంలో శ్రీలంకను 302 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి సెమీస్ చేరింది. లీగ్ దశలో తదుపరి సౌతాఫ్రికా, నెదర్లాండ్స్‌తో టీమిండియా మ్యాచ్‌లు ఆడనుంది. View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2023: టీమిండియాకు భారీ షాక్! ఐసీసీ ప్రకటన విడుదల
ICC WC 2023- Hardik Pandya Ruled Out: వన్డే వరల్డ్‌కప్-2023లో సెమీస్ చేరిన సంతోషంలో ఉన్న టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ! స్టార్ ఆల్‌రౌండర్, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ప్రకటన విడుదల చేసిన ఐసీసీ చీలమండ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో మెగా ఈవెంట్ నుంచి నిష్క్రమించాడు. ఈ నేపథ్యంలో పాండ్యా స్థానాన్ని బీసీసీఐ యువ పేసర్ ప్రసిద్ కృష్ణతో భర్తీ చేసినట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి వెల్లడించింది. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేసింది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో గాయపడ్డ హార్దిక్ పాండ్యా పట్టుతప్పి పడిపోయి కాగా ప్రపంచకప్-2023 లీగ్ దశలో భాగంగా పుణెలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా హార్దిక్ పాండ్యా గాయపడిన విషయం తెలిసిందే. తన బౌలింగ్‌లో బంగ్లా బ్యాటర్ బాదిన షాట్‌ను అడ్డుకునే క్రమంలో పట్టుతప్పి కింద పడిన పాండ్యా కాలికి గాయమైంది. దీంతో అతడు ఓవర్ పూర్తి చేయకుండానే క్రీజును వీడగా.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(రైట్ఆర్మ్ పేసర్) పాండ్యా స్థానంలో బరిలోకి దిగాడు. అయితే, గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాండ్యా మళ్లీ బ్యాటింగ్‌కు కూడా రాలేదు. సెమీస్ వరకు ఒకే.. కానీ కీలక సమయంలో ఇలా ఈ నేపథ్యంలో స్కానింగ్‌కు వెళ్లిన పాండ్యా గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మరుసటి రెండు మ్యాచ్‌లకు అతడు దూరమైనట్లు బీసీసీఐ వెల్లడించింది. జాతీయ క్రికెట్ అకాడమీలో బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. కానీ.. పూర్తిగా కోలుకోని కారణంగా సెమీస్ చేరాలంటే కీలకమైన శ్రీలంకతో మ్యాచ్‌కూ దూరమయ్యాడు. అయితే, టీమిండియా అద్బుత ప్రదర్శనతో 302 పరుగుల భారీ విజయంతో సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. View this post on Instagram A post shared by ICC (@icc) #Prasidh Krishna- కర్ణాటక పేసర్‌కు లక్కీ ఛాన్స్ తదుపరి.. లీగ్ దశలో టీమిండియా రెండు నామమాత్రపు మ్యాచ్‌లు మాత్రమే ఆడాల్సి ఉంది. అయితే, సెమీస్‌లో మాత్రం హార్దిక్ పాండ్యా లాంటి కీలక ఆల్‌రౌండర్ సేవలు కోల్పోవడం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో కీలక సమయంలో రోహిత్ సేనకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఇదిలా ఉంటే.. హార్దిక్ పాండ్యా గాయం కారణంగా ఊహించని రీతిలో కర్ణాటక పేసర్ ప్రసిద్ కృష్ణను అదృష్టం వరించింది. సొంతగడ్డ మీద తొలిసారి వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో భాగమయ్యే అవకాశం దక్కింది. చదవండి: డేగ కళ్లు’! ఒకటి నిజమని తేలింది.. ఇంకోటి వేస్ట్.. ఇకపై వాళ్లే బాధ్యులు: రోహిత్ శర్మ -
టీమిండియాకు షాక్.. ఉమ్రాన్‌కు లక్కీ ఛాన్స్! రేసులో అతడు కూడా!
Asian Games 2023- Umran Malik: ఆసియా క్రీడలు- 2023 ఆరంభానికి ముందే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. చైనాకు వెళ్లనన్ను భారత ద్వితీయ శ్రేణి క్రికెట్ జట్టులో భాగమైన పేసర్ శివం మావి మెగా ఈవెంట్‌కు దూరం కానున్నట్లు సమాచారం. కొంతకాలం క్రితం గాయపడిన మావి ఇంకా కోలుకోలేదని తెలుస్తోంది. భారత జట్టుకు గాయాల బెడద ఈ క్రమంలో శివం మావి స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలన్న అంశంపై బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో స్టాండ్ బైగా ఉన్న యశ్ ఠాకూర్‌ను ప్రధాన జట్టులోకి ప్రమోట్ చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఉమ్రాన్‌తో పాటు అతడి పేరు పరిశీలనలో అయితే, ఈ విదర్భ పేసర్ సైతం ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నందున అతడిని కూడా పక్కనపెట్టిన సెలక్టర్లు.. కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ లేదా కర్ణాటక పేసర్ ప్రసిద్ కృష్ణలలో ఒకరిని ఎంపిక చేయనున్నారట. ఈ మేరకు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తన కథనంలో పేర్కొంది. కాగా ఉమ్రాన్ మాలిక్ ఈ ఏడాది జూలైలో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ సందర్భంగా చివరిసారిగా టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. తొలిసారి భారత క్రికెట్ జట్లు చైనాలోని హాంగ్జూ వేదికగా సెప్టెంబరు 23- అక్టోబరు 8 వరకు ఆసియా క్రీడల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఈ క్రమంలో భారత పురుష, మహిళా క్రికెట్ జట్లను తొలిసారిగా ఈ టోర్నీకి పంపేందుకు అంగీకరించిన బీసీసీఐ ఇప్పటికే జట్లను ప్రకటించింది. శిక్షణా శిబిరం అక్టోబరు 5 నుంచి మెన్స్ వన్డే వరల్డ్‌కప్-2023 మొదలుకానున్న నేపథ్యంలో రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో ద్వితీయ శ్రేణి పురుషుల జట్టును పంపేందుకు సిద్ధమైంది. ఇదిలా ఉంటే.. ఆసియా గేమ్స్ విలేజ్‌కు వెళ్లే ముందు భారత క్రికెటర్లు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో రెండు వారాల పాటు శిక్షణా శిబిరంలో పాల్గొనున్నారు. ఇక భారత పురుషుల జట్టుకు వీవీఎస్ లక్ష్మణ్ హెడ్‌కోచ్‌గా వ్యవహరించనుండగా.. సాయిరాజ్ బహుతులే బౌలింగ్, మునీశ్ బాలి ఫీల్డింగ్ కోచ్‌లుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కాగా ఆసియా క్రీడల్లో టీ20 ఫార్మాట్లో క్రికెట్ జట్లు పోటీపడనున్నాయి. ఆసియా క్రీడలకు భారత పురుషుల జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైశ్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, శివమ్ మావి, శివం దూబే, ప్రభ్‌షిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్). స్టాండ్‌బై ప్లేయర్లు: యశ్ ఠాకూర్, సాయి కిషోర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్. మహిళా క్రికెట్ జట్టు హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమన్‌జోత్ కౌర్, దేవికా వైద్య, అంజలి శ్రావణి, టిటాస్ సాధు, రాజేశ్వరి గైక్వాడ్, మిన్ను మణి, కనికా అహుజా, ఉమా చెత్రి (వికెట్ కీపర్), అనూష బారెడ్డి స్టాండ్‌బై ప్లేయర్లు: హర్లీన్ డియోల్, కష్వీ గౌతమ్, స్నేహ్ రాణా, సైకా ఇషాక్, పూజా వస్త్రాకర్. చదవండి: Ind vs SL: టీమిండియా బ్యాటర్ల విషయంలో సందేహం లేదు.. కానీ బౌలర్లే! 5 వికెట్లు మాత్రమే కాదు.. సిక్సర్లు, సెంచరీ హీరో కూడా! ఎవరీ దునిత్ వెల్లలగే? -
ఆసియా కప్‌కు నేడు భారత జట్టు ఎంపిక.. వారిద్దరిలో ఎవరికీ ఛాన్స్?
న్యూఢిల్లీ: ఇంకొన్ని రోజుల్లోనే స్వదేశంలో వన్డే వరల్డ్‌కప్ జరగనుంది. దీనికంటే ముందు పూర్తిస్థాయి సన్నద్ధత కోసం ఆసియా కప్ వన్డే ఫార్మాట్లో జరుగనుంది. అంటే ఆసియా కప్‌కు ఎంపికయ్యే జట్టే దాదాపు వన్డే ప్రపంచకప్‌లో ఆడుతుందన్నది సుస్పష్టం. ఈ నేపథ్యంలో నేడు ఆసియా కప్‌లో పాల్గొనే జట్టు కోసం సీనియర్ సెలక్షన్ కమిటీ కీలక సమావేశం జరుగనుంది. ఇందులో కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పాల్గొంటారని బోర్డు వర్గాలు తెలిపాయి. గాయాల నుంచి కోలుకున్న స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ల ఫిట్నెస్, అదనపు పేసర్‌గా శార్దుల్ ఠాకూర్ లేదంటే ప్రసిధ్ కృష్ణలలో ఎవరికి అవకాశమివ్వాలనే అంశాలపై అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ చర్చించనుంది. సోమవారం ప్రకటించే భారత జట్టే ప్రపంచకప్‌కు ప్రొవిజనల్ జట్టుగా దాదాపు ఖాయమయ్యే అవకాశముంది. చదవండి: IND vs IRE: రుతురాజ్, సామ్సన్ మెరుపులు.. సిరీస్ మనదే -
వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టు.. ఎవరూ ఊహించని ఆటగాడు ఎంట్రీ!
టీమిండియా స్పీడ్ స్టార్ ప్రసిద్ధ్ కృష్ణ అంతర్జాతీయ టీ20ల్లో కూడా తన అరంగేట్రాన్ని ఘనంగా చాటుకున్నాడు. ఇప్పటికే వన్డేల్లో ఎంట్రీ ఇచ్చిన ఈ కర్ణాటక పేసర్... ఐర్లాండ్‌తో తొలి టీ20తో పొట్టి క్రికెట్లో డెబ్యూ చేశాడు. తన తొలి మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టి అందరని ప్రసిద్ధ్ అకట్టుకున్నాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన ప్రసిద్ధ్.. 32 పరుగులిచ్చి 2 వికెట్లు సాధించాడు. తన తొలి ఓవర్లో టెక్టర్‌ను ఔట్ చేసిన ప్రసిద్ద్, రెండో ఓవర్లో డాక్రెల్ను పెవిలియన్‌కు పంపాడు. కాగా గత కాలంగా వెన్ను గాయంతో ప్రసిద్ధ్ కృష్ణ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌కు కూడా దూరమయ్యాడు. అతడు ఈ మ్యాచ్‌కు దాదాపు ఏడాది పాటు జాతీయ జట్టుకు కూడా దూరంగా ఉన్నాడు. ఇక గాయం నుంచి కోలుకుని వచ్చిన వెంటనే అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ప్రసిద్ధ్ కృష్ణపై మాజీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ ఏడాది జరగనున్న ఆసియాకప్, వన్డే ప్రపంచకప్‌లకు బుమ్రా, సిరాజ్, షమీలతో పాటు అదనపు పేసర్‌గా ప్రసిద్ధ్ కృష్ణను కూడా ఎంపిక చేయాలని చాలా మంది సూచిస్తున్నారు. కాగా 27 ఏళ్ల ప్రసిద్ద్‌కు వన్డేల్లో మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు భారత తరపున 14 మ్యాచ్‌లు ఆడిన కృష్ణ.. 5.32 ఏకానమీతో 25 వికెట్టు పడగొట్టాడు. ఈ క్రమంలోనే అతడిని ఈ మెగా టోర్నీలకు ఎంపిక చేయాలని అభిప్రాయపడుతున్నారు. అదే విధంగా మరోస్టార్ పేసర్ సిరాజ్ ప్రస్తుతం కాలి మడమ గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. విండీస్ పర్యటనకు వెళ్లిన సిరాజ్ మధ్యలోనే అక్కడ నుంచి స్వదేశానికి వచ్చాడు. అతడి ఫిట్‌నెస్‌పై ఇప్పటివరకు అయితే ఎటువంటి అప్డేట్ లేదు. సిరాజ్‌కు ప్రత్నమ్నాయంగా ప్రసిద్ధ్‌ను తీసుకునే ఛాన్స్ ఉంది. చదవండి: చాలా సంతోషంగా ఉంది.. క్రెడిట్ మొత్తం వాళ్లకే! ఇంకా మెరుగవ్వాలి: భారత కెప్టెన్ -
IND VS IRE 1st T20: వర్షం అంతరాయం.. ఐర్లాండ్‌పై టీమిండియా విజయం
ఐర్లాండ్‌తో 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో టీమ్ ఇండియా డక్‌వర్త్ లూయిస్ ప్రకారం రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఐర్లాండ్‌తో ఇవాళ (ఆగస్ట్ 18) జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు మూకుమ్మడిగా రాణించారు. ఫలితంగా ఐర్లాండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139 పరుగులకు పరిమతమైంది. భారత బౌలర్లలో బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. అర్షదీప్ సింగ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఐర్లాండ్ బ్యాటర్లలో (51 నాటౌట్), కర్టిస్ క్యాంఫర్ (39)రాణించగా.. మిగతావారంతా విఫలమయ్యారు. ఆండ్రూ బల్బిర్నీ (4), పాల్ స్టిర్లింగ్ (11), లోక్కాన్ టక్కర్ (0), హ్యారీ టెక్టార్ (9), జార్జ్ డాక్రెల్ (1), మార్క్ అదైర్ (16) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు. ఆఖర్లో, ముఖ్యంగా అర్షదీప్ వేసిన చివరి ఓవర్లో మెక్‌కార్తీ చెలరేగి ఆడాడు. అ ఓవర్లో అతను ఏకంగా 22 పరుగులు పిండుకున్నాడు. ఇందులో 2 సిక్సర్లు, ఓ బౌండరీ ఉంది. ఆఖరి బంతికి సిక్సర్ బాదిన మెక్‌కార్తీ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో అతను ఓ రికార్డు కూడా సాధించాడు. బ్యాటింగ్ ఆర్డర్లో 8 లేదా అంతకంటే కింది స్థానాల్లో వచ్చి అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. గతంలో ఈ స్థానంలో వచ్చి కేశవ్ మహారాజ్ చేసిన 41 పరుగులే అత్యధికంగా ఉండేది. కాగా, దాదాపుగా ఏడాది తర్వాత బంతి పట్టిన బుమ్రా.. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే రెండు వికెట్లు పడగొట్టినప్పటికీ, ఆతర్వాత ప్రభావం చూపించలేకపోయాడు. -
IND VS IRE 1st T20: బుమ్రా రీఎంట్రీ.. తొలి బంతికే ఫోర్.. అదే ఓవర్లో 2 వికెట్లు
Ireland vs India, 1st T20I- Two wickets in the first over for India in a T20I: దాదాపుగా ఏడాది తర్వాత క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా.. వచ్చీ రాగానే తనదైన మార్కు చూపించాడు. ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో మునుపటి కంటి అధికమైన జోష్‌తో తొలి బంతిని సంధించిన బుమ్రా.. ఆ బంతికి బౌండరీని సమర్పించుకున్నాడు. రెండో బంతిని తొలి బంతి కంటే వేగంగా సంధించిన బుమ్రా ఈసారి సక్సెస్ సాధించి, వికెట్ తీసుకున్నాడు. బుమ్రా బౌలింగ్‌లో తొలి బంతికి ఫోర్ కొట్టిన ఆండ్రూ బల్బిర్నీ ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకుని క్లీన్ బౌల్డయ్యాడు. అదే ఓవర్లో బుమ్రా మరో వికెట్ కూడా తీసుకున్నాడు. ఐదో బంతికి టక్కర్.. వికెట్ల వెనుక సంజూ శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. తొలి ఓవర్లోనే 2 వికెట్లు పడగొట్టిన క్రమంలో బుమ్రా ఓ రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన నాలుగో భారత బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 2016లో శ్రీలంకపై అశ్విన్ తొలిసారి తొలి ఓవర్లో 2 వికెట్లు పడగొట్టగా.. 2022లో ఆఫ్ఘానిస్తాన్‌పై భువనేశ్వర్ కుమార్, ఇదే ఏడాది వెస్టిండీస్‌పై హార్ధక్ పాండ్యా, తాజాగా బుమ్రా ఈ ఘనత సాధించారు. కాగా, ఈ మ్యాచ్‌లో బుమ్రా తొలి ఓవర్లోనే 2 వికెట్లు పడగొట్టిన అనంతరం డెబ్యూ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ కూడా తన తొలి ఓవర్లోనే (5వ ఓవర్) ఓ వికెట్ పడగొట్టాడు. ఐదో ఓవర్ ఆఖరి బంతికి ప్రసిద్ధ్ టెక్టార్‌కు ఔట్ చేశాడు. ఆ మరుసటి ఓవర్లోనే భారత్‌కు మరో వికెట్ దక్కింది. రవి బిష్ణోయ్.. ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. 7వ ఓవర్లో ప్రసిద్ద్ మరో వికెట్ పడగొట్టాడు. ఈ ఓవర్ మూడో బంతికి గైక్వాడ్‌కు క్యాచ్ ఇచ్చి డాక్రెల్ ఔటయ్యాడు. 7 ఓవర్ల తర్వాత ఐర్లాండ్ స్కోర్ 35/5గా ఉంది. మార్క్ అదైర్ (4), కర్టిస్ క్యాంఫర్ (2) క్రీజ్‌లో ఉండగా.. భారత బౌలర్లలో బుమ్రా, ప్రసిద్ధ్ తలో 2 వికెట్లు, బిష్ణోయ్ ఓ వికెట్ పడగొట్టారు. What a start from the #TeamIndia captain 🤩 Bumrah back to what he does best 💥#IREvIND #JioCinema #Sports18 pic.twitter.com/IryoviTKGo — JioCinema (@JioCinema) August 18, 2023 -
Ind Vs Ire: వాళ్లిద్దరి అరంగేట్రం.. జితేశ్ శర్మకు మొండిచేయి..
Ireland vs India, 1st T20I: అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాలన్న భారత యువ బ్యాటర్ రింకూ సింగ్ కల ఎట్టకేలకు నెరవేరింది. ఐర్లాండ్‌తో తొలి టీ20 సందర్భంగా అతడు టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఐరిష్ జట్టుతో టీ20 సిరీస్‌లో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా చేతుల మీదుగా క్యాప్ అందుకున్నాడు. పేద కుటుంబం నుంచి వచ్చి కాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన రింకూ సింగ్‌ది పేద కుటుంబం. అయితే, చిన్ననాటి నుంచే క్రికెట్‌పై మక్కువ పెంచుకున్న అతడు.. ఇంటింటికి గ్యాస్ బండలు మోస్తూనే ఆటపై దృష్టి సారించాడు. దేశవాళీ క్రికెట్లో తన ప్రతిభను నిరూపించుకుని ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ రింకూను కొనడంతో అతడి రాత మారింది. ఆరంభంలో బెంచ్‌కే పరిమితమవ్వాల్సి వచ్చినా.. రింకూ ఓపికగా ఎదురుచూశాడు. ఈ క్రమంలో 25 ఏళ్ల లెఫ్టాండ్ బ్యాటర్ ఐపీఎల్-2023లో వచ్చిన అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. ఐపీఎల్-2023లో సత్తా చాటి మొత్తంగా 14 ఇన్నింగ్స్‌లో 149.53 స్ట్రైక్‌రేటుతో 474 పరుగులు చేశాడు. ఈ క్రమంలో టీమిండియా సెలక్టర్ల దృష్టిలో పడిన రింకూ సింగ్ తొలుత ఆసియా క్రీడలు-2023 జట్టుకు ఎంపికయ్యాడు. ఆ తర్వాత టీ20 సిరీస్ నిమిత్తం ఐర్లాండ్‌లో పర్యటించే భారత జట్టులో చోటు దక్కడంతో శుక్రవారం అరంగేట్రం చేశాడు. జితేశ్‌కు మొండిచేయి ఇక రింకూ సంగతి ఇలా ఉంటే.. ఈ మ్యాచ్‌తో కచ్చితంగా టీమిండియా క్యాప్ అందుకుంటాడనుకున్న మరో బ్యాటర్ జితేశ్ శర్మకు నిరాశే మిగిలింది. వెస్టిండీస్ పర్యటనలో మెరుగ్గా రాణించకపోయినప్పటికీ సీనియర్ వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్‌కు తుది జట్టులో చోటు దక్కింది. దీంతో వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ ఇంకొన్నాళ్లు వేచిచూడకతప్పదు. డబ్లిన్‌లో మూడు మ్యాచ్‌లు ఇదిలా ఉంటే.. ఐర్లాండ్‌తో తొలి టీ20 సందర్భంగా కర్ణాటక బౌలర్ ప్రసిద్ కృష్ణ అంతర్జాతీయ టీ20లలో ఎంట్రీ ఇచ్చాడు. ప్రసిద్‌కు కూడా బుమ్రా టీమిండియా క్యాప్ అందించాడు. రింకూ, ప్రసిద్ల అరంగేట్రానికి సంబంధించిన ఫొటోలను బీసీసీఐ షేర్ చేయగా.. నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక డబ్లిన్ వేదికగా టీమిండియా- ఐర్లాండ్ల మధ్య ఆగష్టు 18, 20, 23 తేదీల్లో మూడు టీ20లు జరుగనున్నాయి. మొదటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా: జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), యశస్వి జైశ్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్ , ప్రసిద్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్. చదవండి: బౌలింగ్‌లోనూ 'కింగే'.. చెక్కుచెదరని బౌలింగ్ రికార్డు విరాట్ సొంతం Moments like these! ☺️ All set for their debuts in international cricket and T20I cricket respectively 👍 👍 Congratulations Rinku Singh and Prasidh Krishna as they receive their caps from captain Jasprit Bumrah 👏 👏#TeamIndia | #IREvIND pic.twitter.com/JjZIoo8B8H — BCCI (@BCCI) August 18, 2023 -
భారత బౌలర్ల విజృంభణ.. అతడు ఆదుకున్నాడు!
Ireland vs India, 1st T20I: టీమిండియాతో తొలి టీ20లో ఆరంభంలో తడబడ్డా ఐర్లాండ్ మెరుగైన స్కోరు చేయగలిగింది. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన బ్యారీ మెకార్తీ అజేయ అర్ధ శతకం(51 పరుగులు)తో జట్టును ఆదుకున్నాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి ఐరిష్ జట్టు 139 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బుమ్రా రెండు, ప్రసిద్ కృష్ణ రెండు, రవి బిష్ణోయి రెండు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్‌నకు ఒక వికెట్ దక్కింది. భారత బౌలర్ల దెబ్బ తొలి టీ20లో భారత బౌలర్ల ధాటికి ఐర్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్ కకావికలమవుతోంది. 35 పరుగులకే ఐర్లాండ్ ఏకంగా 5 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ బుమ్రా తొలి ఓవర్లోనే 2 వికెట్లు పడగొట్టి టీమిండియాకు శుభారంభం అందించాడు. అనంతరం టీ20 అరంగేట్ర బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ కూడా తన తొలి ఓవర్లోనే (5వ ఓవర్) వికెట్ తీశాడు. టెక్టార్ను పెవిలియన్‌కు పంపాడు. ఇక ఆ మరుసటి ఓవర్లోనే టీమిండియాకు రవి బిష్ణోయ్ మరో వికెట్ అందించాడు. ఐరిష్ జట్టు సారథి పాల్ స్టిర్లింగ్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఇక 7వ ఓవర్లో ప్రసిద్ద్ మరో వికెట్ పడగొట్టాడు. ఈ ఓవర్ మూడో బంతికి గైక్వాడ్‌కు క్యాచ్ ఇచ్చి డాక్రెల్ ఔటయ్యాడు. దీంతో ఏడు ఓవర్లలోనే ఐర్లాండ్ 5 వికెట్లు కోల్పోయింది. టాస్ గెలిచిన టీమిండియా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఐర్లాండ్‌లో పర్యటిస్తున్న టీమిండియా డబ్లిన్‌లోని ద విలేజ్ మైదానం వేదికగా ఇవాళ (ఆగస్ట్ 18) తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి భారత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఐపీఎల్-2023 స్టార్, సిక్సర్ల వీరుడు రింకూ సింగ్ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేయనున్నాడు. రింకూతో పాటు ప్రసిద్ధ్ కృష్ణ కూడా ఈ మ్యాచ్‌తో టీ20ల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. టీమిండియా: జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్ (వికెట్‌కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్ , ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్ ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), ఆండ్రూ బల్బిర్నీ, మార్క్ అడైర్, కర్టిస్ క్యాంఫర్, జార్జ్ డాక్రెల్, జోష్ లిటిల్, బ్యారీ మెక్‌కార్తీ, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్, బెన్ వైట్, క్రెయిగ్ యంగ్ -
ఆ మ్యాచ్ నాటికి బుమ్రా, ప్రసిద్ జట్టులోకి!: హింట్ ఇచ్చిన అశ్విన్..
WC 2023 Ind Vs Pak: టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా జట్టుకు దూరమై నెలలు గడుస్తున్నాయి. వెన్ను నొప్పి తిరగబెట్టడంతో గతేడాది సెప్టెంబరు నుంచి బుమ్రాకు విశ్రాంతి అనివార్యమైంది. శస్త్ర చికిత్స అనంతరం కోలుకుంటున్న అతడు.. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్నట్లు సమాచారం. ఇక ఆగష్టు 31 నుంచి ఆసియాకప్-2023, అక్టోబరు 5 నుంచి వన్డే ప్రపంచకప్-2023 టోర్నీలు ఆరంభం కానున్న నేపథ్యంలో బుమ్రా పునరాగమనంపై చర్చలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 7 నుంచి 9 ఓవర్లు బౌలింగ్ చేయగలుగుతున్న బుమ్రా.. ఆసియా కప్ నాటికి తిరిగివస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. హింట్ ఇచ్చిన అశ్విన్ అయితే, తాజాగా బుమ్రా రీఎంట్రీపై టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు అభిమానులను గందరగోళంలోకి నెట్టేశాయి. ఇంతకీ అశూ ఏమన్నాడంటే.. ‘‘ఐసీసీ ఈవెంట్లలో ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్‌లు అంటే విపరీతమైన ఆసక్తి. గతంలోనూ ఎన్నో అద్భుతమైన, ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లను చూశాం. ఈసారి కూడా ఇరు జట్ల మధ్య పోరు బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందనుకుంటున్నా. హోరాహోరీ తప్పదు రెండు జట్లలోనూ నాణ్యమైన సీమర్లు ఉన్నారు. కాబట్టి మరోసారి హోరహోరీ పోటీ తప్పకపోవచ్చు. పాక్‌తో మ్యాచ్ నాటికి బుమ్రా, ప్రసిద్ పూర్తిస్తాయి ఫిట్నెస్ సాధించే అవకాశం ఉంది. ఇక జట్టు కూర్పు ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం గానీ.. మ్యాచ్ మాత్రం రసవత్తరంగా ఉంటుందని చెప్పగలను’’ అని అశ్విన్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఈ మేరకు వ్యాఖ్యానించాడు. కాగా అక్టోబరు 5- నవంబరు 19 వరకు ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2023 జరుగనుంది. ఇక ఈ మెగా టోర్నీలో భాగంగా టీమిండియా- పాకిస్తాన్ అక్టోబరు 15న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తలపడనున్నాయి. లక్షకు పైగా సీట్ల సామర్థ్యం ఉన్న ఈ స్టేడియం ఈ హైవోల్టేజ్ మ్యాచ్ సందర్భంగా కిక్కిరిసిపోవడం ఖాయం. చదవండి: ఆర్నెళ్లుగా జట్టుకు దూరం.. ఏకంగా టీమిండియా కెప్టెన్‌గా రీఎంట్రీ! -
కోహ్లికి ముచ్చెమటలు పట్టించాడు.. ఇప్పుడు రాజస్తాన్ జట్టులో చోటు కొట్టేశాడు!
ఐపీఎల్-16 సీజన్‌కు రాజస్తాన్ రాయల్స్ స్టార్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. దీంతో ప్రసిద్ధ్ కృష్ణ స్థానాన్ని టీమిండియా పేసర్ సందీప్ శర్మతో రాజస్తాన్ భర్తీ చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా రాజస్తాన్ వెల్లడించింది. అతడిని కనీస ధర రూ. 50 లక్షలకు సొంతం చేసుకున్నట్లు రాజస్తాన్ తెలిపింది. కాగా సందీప్ శర్మఐపీఎల్లో అద్భుతమైన ట్రాక్ రికార్డు కలిగి ఉన్నాడు. ఐపీఎల్ పవర్ ప్లేల్లో అత్యధిక వికెట్లు (92 ఇన్నింగ్స్‌ల్లో 53 వికెట్లు) తీసిన రికార్డు ఇప్పటికీ సందీప్ పేరిటే ఉంది. ఐపీఎల్లో ఇప్పటి వరకు 108 మ్యాచ్‌లు ఆడిన సందీప్ 114 వికెట్లు పడగొట్టాడు. 2018 నుంచి నాలుగు సీజన్ల పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సందీప్ ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్-2022 మెగా వేలంకు ముందు ఎస్ఆర్హెచ్ అతడిని విడిచిపెట్టింది. ఈ క్రమంలో వేలంలోకి వచ్చిన అతడిని పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. ఆ సీజన్లో 5 మ్యాచ్‌లు ఆడిన సందీప్ కేవలం 2 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. దీంతో అతడిని ఐపీఎల్-2023 మినీ వేలంకు ముందు పంజాబ్ కూడా అతడిని విడిచిపెట్టింది. అయితే వేలంలోకి వచ్చిన అతడిని కొనుగోలు చేయలేదు. కాగా ప్రసిద్ధ్ కృష్ణ గాయం కావడంతో మరోసారి ఐపీఎల్లో భాగమయ్యే అవకాశం సందీప్ శర్మకు లభించింది. ఇక టీమిండియా స్టార్ ఆటగాడు, ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిపై సందీప్ శర్మ అద్భుతమైన రికార్డు కలిగిఉన్నాడు. ఇప్పటి వరకు ఐపీఎల్లో కోహ్లిని 7 సార్లు ఔట్ చేశాడు. ఐపీఎల్లో ఏ బౌలర్ కూడా కోహ్లిని ఇన్ని పర్యాయాలు ఔట్ చేయలేదు. ఇక ఐపీఎల్-16వ సీజన్ మార్చి 31నుంచి ప్రారంభం కానుంది. చదవండి: AFG vs PAK: పాకిస్తాన్ బౌలర్ రాకాసి బౌన్సర్.. దెబ్బకు రక్తం వచ్చేసింది! వీడియో వైరల్ -
IPL 2023: రాజస్తాన్ రాయల్స్‌కు భారీ షాక్.. టీమిండియా బౌలర్ దూరం
IPL 2023- Prasidh Krishna: టీమిండియా పేసర్ ప్రసిద్ కృష్ణ ఐపీఎల్-2023 సీజన్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని అతడు ప్రాతినిథ్యం వహిస్తున్న రాజస్తాన్ రాయల్స్ ధ్రువీకరించింది. గాయం కారణంగా ప్రసిద్ ఈసారి ఐపీఎల్ ఆడబోవడం లేదని తెలిపింది. త్వరగా కోలుకోవాలి ‘‘ప్రసిద్ గాయం నుంచి కోలుకోవడానికి కావాల్సిన ఏ సాయం చేసేందుకైనా సిద్ధంగా ఉన్నాం. కానీ.. అతడు ఇంకా పూర్తిగా కోలుకోలేదని వైద్య బృందం తెలిపింది. దురదృష్టవశాత్తూ ప్రసిద్ ఐపీఎల్-2023 మొత్తానికి దూరమయ్యాడు’’ అని రాజస్తాన్ యాజమాన్యం శుక్రవారం నాటి ప్రకటనలో పేర్కొంది. ప్రసిద్ కృష్ణ స్థానాన్ని భర్తీ చేయగల పేసర్ కోసం తాము అన్వేషిస్తున్నామన్న మేనేజ్మెంట్.. త్వరలోనే ఈ యువ బౌలర్ కోలుకోవాలని ఆకాంక్షించింది. కాగా గత సీజన్లో ప్రసిద్ కృష్ణ రాజస్తాన్ రాయల్స్ తరఫున మొత్తంగా 19 వికెట్లు( 8.28 ఎకానమీ) పడగొట్టి సత్తా చాటాడు. జట్టు ఫైనల్ చేరడంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, గాయం కారణంగా ప్రస్తుత సీజన్‌కు అతడు దూరం కావడంతో రాజస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. అదే ఆఖరు జింబాబ్వేతో 2022లో హరారేలో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆఖరిసారిగా ప్రసిద్ టీమిండియా తరఫున బరిలోకి దిగాడు. ఆ తర్వాత వెన్నునొప్పి కారణంగా జట్టుకు దూరమయ్యాడు. జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్న ఈ రైట్ ఆర్మ్ పేసర్ ఇంకా కోలుకోలేదు. ఇక టీమిండియా తరఫున ఇప్పటి వరకు 14 వన్డేలు ఆడిన ఈ కర్ణాటక బౌలర్.. 25 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ కెరీర్లో 51 మ్యాచ్‌లలో మొత్తంగా 49 వికెట్లు కూల్చాడు. చదవండి: Tom Blundell: కివీస్ బ్యాటర్ టామ్ బ్లండెల్ ప్రపంచ రికార్డు.. ఇంతవరకు ఎవరికీ సాధ్యం కాలేదు! BGT 2023: గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో రాహుల్ అద్భుత క్యాచ్.. బిత్తరపోయిన ఖవాజా.. వీడియో వైరల్ -
టీమిండియాకు షాక్.. న్యూజిలాండ్ సిరీస్ నుంచి స్టార్ పేసర్ ఔట్
స్వదేశంలో న్యూజిలాండ్-ఏతో జరుగుతున్న నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ నుంచి భారత-ఏ జట్టు స్టార్ బౌలర్ ఔటయ్యాడు. వెన్నునొప్పి కారణంగా బెంగళూరు వేదికగా ఇవాల్టి (సెప్టెంబర్ 1) నుంచి ప్రారంభమైన తొలి టెస్ట్ మ్యాచ్ నుంచి ప్రసిద్ధ్ కృష్ణ తప్పుకున్నాడు. ఆఖరి నిమిషంలో ప్రసిద్ధ్ కృష్ణ తప్పుకోవడంతో టీమిండియా అనుభవలేమి పేస్ దళంతో బరిలోకి దిగింది. గత కొంతకాలంగా తరుచూ వెన్ను సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ప్రసిద్ధ్.. ఈ మ్యాచ్‌తో పాటు మొత్తం సిరీస్‌కే అందుబాటులో ఉండడని బీసీసీఐ ప్రతినిధి వెల్లడించారు. కాగా, కివీస్-ఏతో 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ప్రియాంక్ పంచల్ నేతృత్వంలో బరిలోకి దిగిన టీమిండియా తొలి టెస్ట్‌లో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసింది. ప్రసిద్ధ్ తప్పుకోవడంతో భారత-ఏ జట్టు నలుగురు స్పెషలిస్ట్ బౌలర్లతోనే బరిలోకి దిగింది. ముకేశ్ కుమార్, యశ్ దయాల్, అర్జన్ నగ్వస్వల్లా, కుల్దీప్ యాదవ్‌లు బౌలింగ్ భారం మొత్తాని మోయగా.. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ పార్ట్ టైమ్ బౌలర్‌గా సేవలందించాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్-ఏ టీమ్ 61 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. చదవండి: మళ్లీ బ్యాట్ పట్టనున్న సెహ్వగ్.. గుజరాత్ కెప్టెన్‌గా ఎంపిక -
McGrath: ఆ ఇద్దరు టీమిండియాకు ఆడుతుంటే గర్వంగా ఉంది..!
ఆసీస్ పేస్ దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్ టీమిండియా యువ పేసర్లు ప్రసిధ్ కృష్ణ, అవేశ్ ఖాన్‌లపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ ఇద్దరు టీమిండియాకు ఆడుతుంటే గర్వంగా ఉందని అన్నాడు. ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ చీఫ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టి పదేళ్లు పూర్తైన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యానించాడు. ప్రసిధ్ కృష్ణ, అవేశ్ ఖాన్లు చెన్నైలోని ఎంఆర్ఎఫ్ ఫౌండేషన్‌లో శిక్షణ తీసుకున్న నేపథ్యంలో మెక్‌గ్రాత్ ఈ వ్యాఖ్యలు చేశాడు. వీరిద్దరితో పాటు మరో 27 మంది ఎంఆర్ఎఫ్ ఫౌండేషన్‌లో మెళకువలు నేర్చుకున్న బౌలర్లు ఇటీవల ముగిసిన ఐపీఎల్లో వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహించారు. ఇదే సందర్భంగా వన్డే క్రికెట్ మనుగడపై ప్రస్తుతం నడుస్తున్న చర్చపై కూడా మెక్‌గ్రాత్ స్పందించాడు. బ్యాటర్లు పరుగులు చేస్తున్నంత కాలం వన్డే ఫార్మాట్‌కు ఢోకా లేదని అభిప్రాయపడ్డాడు. డబ్బు, శారీరక ఒత్తిడి కారణంగా ఆటగాళ్లు వన్డేలపై అనాసక్తి ప్రదర్శిస్తున్నారని అనుకోవట్లేదని అన్నాడు. తన మట్టుకు సంప్రదాయ టెస్ట్ క్రికెటే అత్యుత్తమమని చెప్పుకొచ్చాడు. టెస్ట్‌ల తర్వాత ఆటగాళ్ల సత్తా బయటపడేది వన్డే క్రికెట్లోనేనని తెలిపాడు. సుదీర్ఘ ఫార్మాట్లోనే ఆటగాళ్లకు సరైన పరీక్ష ఎదురవుతుందని అన్నాడు. చదవండి: ఆసియా కప్ షెడ్యూల్ విడుదల.. ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడంటే..? -
ప్రసిధ్ కృష్ణ ఔట్.. ఆవేశ్ ఖాన్‌కు ఛాన్స్..!
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ట్రినిడాడ్ వేదికగా విండీస్‌తో రేపు (జులై 24) జరుగబోయే రెండో వన్డే కోసం టీమిండియా సిద్ధమవుతోంది. తొలి మ్యాచ్‌లో ఆతిధ్య జట్టును 3 పరుగుల తేడాతో ఓడించిన ధవన్ సేన.. రెండో వన్డేలోనూ విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఇందుకోసం టీమిండియా తుది జట్టులో ఓ మార్పు చేసే అవకాశం ఉంది. తొలి వన్డేలో వికెట్ లేకుండా ధారాళంగా పరుగులు సమర్పించుకున్న ప్రసిధ్ కృష్ణ స్థానంలో మరో పేసర్ ఆవేశ్ ఖాన్‌కు ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఒక్క మార్పు మినహా తొలి వన్డేలో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించే ఛాన్స్ ఉంది. ఓపెనర్లుగా ధవన్, గిల్, వన్‌డౌన్‌లో శ్రేయస్ అయ్యర్, మిడిలార్డర్లో సూర్యకుమార్, దీపక్ హుడా, సంజూ శాంసన్, ఆల్‌రౌండర్ల కోటాలో అక్షర్ పటేల్, శార్ధూల్ ఠాకూర్, ఏకైక స్పిన్నర్‌గా చహల్, పేసర్లుగా ఆవేశ్ ఖాన్, సిరాజ్‌లను తుది జట్టులో ఆడించే అవకాశం ఉంది. మరోవైపు తొలి వన్డేలో దాదాపు విజయపు అంచుల వరకు వచ్చిన విండీస్ సైతం ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలుపొంది సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని పట్టుదలగా ఉంది. భారత తుది జట్టు (అంచనా).. శిఖర్ ధవన్(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, మహ్మద్ సిరాజ్, ఆవేశ్ ఖాన్ చదవండి: అసలు అతడికి ఇక్కడ ఏం పని? ధావన్‌పై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు! -
IPL 2022 RR Vs RCB: వాళ్లిద్దరు అద్భుతం చేశారు: సచిన్ ప్రశంసల జల్లు
IPL 2022 Qualifier 2 RR Vs RCB: రాజస్తాన్ రాయల్స్ బౌలర్లు ప్రసిద్ కృష్ణ, ఒబెడ్ మెకాయ్లను టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ ప్రశంసించాడు. తమ అద్భుత బౌలింగ్ నైపుణ్యాలతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఆటగాళ్లను ఒత్తిడికి గురిచేసి వారిని తక్కువ స్కోరుకే పరిమితం చేశారని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2022 క్వాలిఫైయర్-2లో రాజస్తాన్ ఆర్సీబీని ఓడించిన సంగతి తెలిసిందే. బౌలర్ల కృషికి తోడు జోస్ బట్లర్ వీరోచిత ఇన్నింగ్స్‌తో ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది ఫైనల్లో ప్రవేశించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ ఆర్సీబీని తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో రాజస్తాన్ బౌలర్లు ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించారు. ముఖ్యంగా ప్రసిద్ కృష్ణ కీలక వికెట్లు పడగొట్టాడు. ఆర్సీబీ ఓపెనర్ విరాట్ కోహ్లి, ఫినిషర్ దినేశ్ కార్తిక్, ఆల్‌రౌండర్ వనిందు హసరంగ వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా 4 ఓవర్ల బౌలింగ్‌లో కేవలం 22 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇక ఒబెడ్ మెకాయ్ సైతం అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. డుప్లెసిస్, మాక్స్వెల్ వంటి డేంజరస్ బ్యాటర్లను పెవిలియన్‌కు పంపాడు. ఇలా వీరిద్దరు ఆర్సీబీని 157 పరుగులకు కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో సచిన్ టెండుల్కర్ యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ...‘‘ప్రసిద్ కృష్ణతో పాటు మెకాయ్ రాజస్తాన్‌కు కీలకంగా మారాడు. వీరిద్దరూ కలిసి బెంగళూరు బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టారు. లోయర్ ఆర్డర్లో అద్భుత స్ట్రైక్‌రేటుతో దూసుకుపోతున్న దినేశ్ కార్తిక్‌ను ప్రసిత్ అవుట్ చేశాడు. హసరంగను బోల్తా కొట్టించాడు. నిజానికి ఇలాంటి పిచ్‌పై 157 స్కోరు ఏమాత్రం చెప్పుకోదగింది కాదు’’ అని పేర్కొన్నాడు. ఆర్సీబీని ఇలా కట్టడి చేసిన ఘనత ప్రసిద్, మెకాయ్‌కే చెందుతున్నాడు. ఇదిలా మిగతా రాజస్తాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ ఒకటి, అశ్విన్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. చదవండి 👇 Jos Buttler: అంచనాలు లేకుండా బరిలోకి.. వార్న్ గర్వపడుతూ ఉంటాడు: బట్లర్ భావోద్వేగం Mathew Wade: 'మా జట్టు ఫైనల్ చేరింది.. అయినా సరే టోర్నమెంట్ చికాకు కలిగిస్తుంది' Moments we'll never forget. 😍 #RRvRCB pic.twitter.com/yhVLY254vq — Rajasthan Royals (@rajasthanroyals) May 28, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); Chaar chaand lag gaye. 💗🧿 pic.twitter.com/9lEy7B2RMW — Rajasthan Royals (@rajasthanroyals) May 27, 2022 -
ఏంటి ప్రసిద్ధ్.. త్రో చేయాల్సింది బౌల్ట్‌కు కాదు.. వికెట్లకు..!
ఐపీఎల్-2022లో భాగంగా కేకేఆర్, రాజస్తాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. రాజస్తాన్ ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో.. కేకేఆర్ బ్యాటర్ బాబా ఇంద్రజిత్ మిడాన్ దిశగా ఆడాడు. ఈ క్రమంలో ఇంద్రజిత్, ఫించ్ సింగిల్ కోసం ప్రయత్నించారు. అయితే మిడాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ప్రసిద్ధ్ కృష్ణ వెంటనే బంతిని అందుకుని వికెట్ కీపర్ వైపు త్రో చేశాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రసిద్ధ్ కృష్ణ త్రో చేసిన బంతి నేరుగా ట్రెంట్ బౌల్ట్ బూట్‌కు తగిలింది. దీంతో దెబ్బకు బౌల్ట్ బ్యాలెన్స్ కోల్పోయి కింద పడపోయాడు. కాగా ప్రసిద్ధ్ చేసిన పనికి బౌల్ట్‌తో పాటు సహచర ఆటగాళ్లు కాసేపు నవ్వుకున్నారు. దీనికి సంబంధిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌పై 7 వికెట్ల తేడాతో రాజస్తాన్ ఘన విజయం సాధించింది. స్కోర్లు రాజస్తాన్ రాయల్స్: 152/5 కోల్‌కతా నైట్‌రైడర్స్: 158/3 చదవండి: Arun Lal : 66 ఏళ్ల వయస్సులో భారత మాజీ క్రికెటర్ రెండో పెళ్లి.. ఫొటోలు వైరల్..! pic.twitter.com/g7AXar3c0h — Eden Watson (@EdenWatson17) May 2, 2022 -
IPL 2022 SRH Vs RR: వెయ్యిసార్లు చూసినా అదే నిజం.. చెత్త అంపైరింగ్!
IPL 2022- Kane Williamson: ఐపీఎల్-2022లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ వికెట్ చర్చకు దారి తీసింది. ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో బంతి ఎడ్జ్ తీసుకొని కీపర్ సామ్సన్ వైపు వెళ్లింది. అతడు దానిని వదిలేయగా, బంతి గాల్లోకి లేవడంతో మొదటి స్లిప్‌లోనే ఉన్న పడిక్కల్ దానిని అందుకున్నాడు. అయితే పడిక్కల్ క్యాచ్ తీసుకునే ముందు బంతి నేలను తాకిందనే అనుమానంతో విలియమ్సన్ క్రీజ్ నుంచి కదల్లేదు. టీవీ అంపైర్ పదే పదే రీప్లేలు చూసినా దానిపై స్పష్టత రాలేదు. కొన్ని యాంగిల్స్‌లో మాత్రం అది నేలను తాకిన తర్వాత పడిక్కల్ చేతుల్లో పడినట్లు కనిపించింది. చివరకు అంపైర్ ‘అవుట్’గా ప్రకటించడంతో నిరాశగా హైదరాబాద్ కెప్టెన్ వెనుదిరిగాడు. దీనిపై నెట్టింట ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ‘‘వెయ్యిసార్లు చూసినా అదే కనిపించేది అదే. అదే నిజం కూడా.. చెత్త అంపైరింగ్! పాపం కేన్ మామ! అనవసరంగా బలయ్యాడు’’ అంటూ ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. What is this🙄🤔 Wrong decision by Umpire. Kane Williamson was Not Out👇👇 #RRvSRH #SRHvRR #KaneWilliamson #IPL2022 #Umpire pic.twitter.com/51GNpFnVQp — Cricket Countdown (@Cric8Countdown) March 29, 2022 See it 1000 times, that would still be not out...Just poor umpiring. Feeling sad for Kane Williamson 😞#IPL2022 #SRHvRR pic.twitter.com/0FjWS2DnZf — Cricket Fanatic🏏 (@cric8fanatic) March 29, 2022 Kane Williamson clearly not out.The ball was stepping on the ground.This is absolutely ridiculous.#TATAIPL2022 #SRHvRR pic.twitter.com/71yPsHpVAk — Dipankar Das Gibbs🇮🇳 (@DipankarGibbs) March 29, 2022 Match 5. Rajasthan Royals Won by 61 Run(s) https://t.co/GaOK5ulUqE #SRHvRR #TATAIPL #IPL2022 — IndianPremierLeague (@IPL) March 29, 2022 -
బౌలింగ్‌లో దుమ్మురేపాడు.. రాజస్తాన్ రాయల్స్ పంట పండినట్లే
Ranji Trophy: రంజీ ట్రోఫీ 2022 సీజన్లో జమ్మూ కశ్మీర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కర్ణాటక బౌలర్ ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో దుమ్మురేపాడు. ఎలైట్ గ్రూఫ్-సిలో భాగంగా జమ్మూ కశ్మీర్‌తో మ్యాచ్‌లో ప్రసిధ్ 12 ఓవర్లలో 35 పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. అతని ధాటికి జమ్ము కశ్మీర్ తొలి ఇన్నింగ్స్‌లో 93 పరుగలుకే కుప్పకూలింది. కాగా ఇటీవలి కాలంలో ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. వెస్టిండీస్‌తో ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో తొమ్మిది వికెట్లు తీసి సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అంతేకాదు విండీస్తోరెండో వన్డేలో 9 ఓవర్లలో 12 పరుగులిచ్చి మూడు మెయిడెన్ల సహా నాలుగు వికెట్లు తీసి కెరీర్ బెస్ట్ సాధించాడు. కాగా ఐపీఎల్ మెగావేలంలో ప్రసిధ్ కృష్ణను రాజస్తాన్ రాయల్స్ రూ. 10 కోట్లకు దక్కించుకుంది. ప్రసిధ్ కృష్ణ ఫామ్‌ను చూస్తుంటే ఈసారి లీగ్‌లో రాజస్తాన్ రాయల్స్ పంట పండినట్లేనని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. కాగా కర్ణాటకకు తొలి ఇన్నింగ్స్‌లో 209 పరుగుల ఆధిక్యం లభించడంతో పటిష్టస్థితిలో నిలిచింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన కర్ణాటక 2 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. కరుణ్ నాయర్ 37, కృష్ణమూర్తి సిద్ధార్థ్ 53 పరుగులతో ఆడుతున్నారు. కాగా కర్ణాటక ఇప్పటివరకు తొలి ఇన్నింగ్స్ కలుపుకొని 417 పరుగుల ఆధిక్యంలో ఉంది. చదవండి: PSL 2022: రెండుసార్లు బచాయించినా గెలిపించలేకపోయారు 1⃣2⃣-1⃣-3⃣5⃣-6⃣! 👌 👌@prasidh43 put on a superb show with the ball as Karnataka secured a first-innings lead against Jammu and Kashmir. 👍 👍 #KARvJK | #RanjiTrophy | @Paytm Watch that 6⃣-wicket haul 🎥 🔽 pic.twitter.com/Yn9JRIWzOf — BCCI Domestic (@BCCIdomestic) February 25, 2022 -
రూ.10 కోట్లకు ప్రసిధ్ద్ కృష్ణ.. రాజస్తాన్ రాయల్స్ జట్టు ఇదే
ఐపీఎల్-2022 మెగా వేలంలో రాజస్తాన్ రాయల్స్ తమ జట్టును బలమైన జట్టుగా సిద్దం చేసుకుంది. ఈ సారి వేలంలో రాజస్తాన్ స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసింది. కాగా వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో అద్భుతంగా రాణించిన భారత బౌలర్ ప్రసిధ్ద్ కృష్ణను రూ.10 కోట్లకు రాజస్తాన్ కొనుగోలు చేసింది. అదే విధంగా వెస్టిండీస్ బ్యాటర్ హెట్మైర్ను రూ. 8.50 కోట్లకు, ట్రెంట్ బౌల్ట్‌ను రూ.8 కోట్లకు, దేవ్‌దత్త్ పడిక్కల్‌ను రూ. 7.75 కోట్లకు కొనుగోలు చేసింది. రాజస్తాన్ జట్టు మొత్తం 24 మంది ఆటగాళ్లు కాగా.. అందులో 16 మంది భారత క్రికెటర్లు కాగా, ఎనమిది మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. వీరి కోసం రాజస్తాన్ రూ. 89.5 కోట్లు ఖర్చు చేసింది. ఇక రాజస్తాన్ రాయల్స్ ఆటగాళ్లను ఒకసారి పరిశీలిద్దాం. రాజస్తాన్ రాయల్స్ జట్టు: సంజూ సామ్సన్: రూ. 14 కోట్లు ప్రసిధ్ కృష్ణ: రూ. 10 కోట్లు జోస్ బట్లర్: రూ. 10 కోట్లు హెట్‌మైర్: రూ. 8 కోట్ల 50 లక్షలు ట్రెంట్ బౌల్ట్: రూ. 8 కోట్లు దేవ్‌దత్ పడిక్కల్: రూ. 7 కోట్ల 75 లక్షలు యజువేంద్ర చహల్: రూ. 6 కోట్ల 50 లక్షలు అశ్విన్: రూ. 5 కోట్లు యశస్వీ జైస్వాల్: రూ. 4 కోట్లు రియాన్ పరాగ్: రూ. 3 కోట్ల 80 లక్షలు నవ్‌దీప్ సైనీ: రూ. 2 కోట్ల 60 లక్షలు కూల్టర్‌నీల్: రూ. 2 కోట్లు జిమ్మీ నీషమ్: రూ. 1 కోటి 50 లక్షలు కరుణ్ నాయర్: రూ. 1 కోటి 40 లక్షలు వాన్‌డెర్ డసెన్: రూ. 1 కోటి డారిల్ మిచెల్: రూ. 75 లక్షలు ఒబెడ్ మెకాయ్: రూ. 75 లక్షలు కరియప్ప: రూ. 30 లక్షలు తేజస్ బరోకా: రూ. 20 లక్షలు అనునయ్ సింగ్: రూ. 20 లక్షలు కుల్దీప్ సేన్: రూ. 20 లక్షలు ధ్రువ్ జురెల్: రూ. 20 లక్షలు కుల్దీప్ : రూ. 20 లక్షలు శుభమ్ గార్హ్వాల్: రూ. 20 లక్షలు -
కెప్టెన్ అయ్యేదెవరు.. ఆర్సీబీ జట్టు ఇదే
ఐపీఎల్ మెగావేలంలో ఆర్సీబీ రెండురోజుల పాటు ఉత్సాహంగా పాల్గొంది. తొలిరోజు వేలంలోనే ఆర్సీబీ దాదాపు ప్రధాన ఆటగాళ్లపై మొగ్గు చూపి వేలంలో దక్కించుకుంది. గతేడాది టాప్ వికెట్ టేకర్ హర్షల్‌పటేల్‌ను రూ .10. 75 కోట్లకు సొంతం చేసుకున్న ఆర్సీబీ.. శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగాను కూడా అదే ధర వద్ద దక్కించుకోవడం విశేషం. ఆ తర్వాత హాజిల్‌వుడ్, డుప్లెసిస్‌ను మంచి ధర దక్కింది. ఇక దినేశ్ కార్తిక్‌ను రూ. 5.50 కోట్లు పెట్టి కొనుగోలు చేయడం కాస్త ఆశ్చర్యపరిచింది. చదవండి: IPL 2022 Mega Auction: శార్దుల్ ఠాకూర్‌కి రూ. 10.75 కోట్లు.. ఢిల్లీ జట్టు ఇదే రిటైన్ జాబితాలో విరాట్ కోహ్లి, మ్యాక్స్‌వెల్‌తో పాటు సిరాజ్ ఉన్నారు. అయితే గత సీజన్లో కెప్టెన్‌గా కోహ్లి పక్కకు తప్పుకోవడంతో ఈ సీజన్లో కెప్టెన్ ఎవరవుతారనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఆర్సీబీ మొత్తం ఆటగాళ్ల సంఖ్య 22 మంది కాగా.. అందులో 14 మంది భారత క్రికెటర్లు కాగా.. మిగతా 8 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. రిటైన్ జాబితా మినహాయించి వేలంలో ఆటగాళ్లను దక్కించుకోవడం కోసం రూ.88 కోట్ల 45 లక్షలు ఖర్చు చేసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ): విరాట్ కోహ్లి: రూ. 15 కోట్లు మ్యాక్స్‌వెల్: రూ. 11 కోట్లు హర్షల్ పటేల్: రూ. 10 కోట్ల 75 లక్షలు హసరంగ: రూ. 10 కోట్ల 75 లక్షలు హాజెల్‌వుడ్: రూ. 7 కోట్ల 75 లక్షలు సిరాజ్ : రూ. 7 కోట్లు డు ప్లెసిస్: రూ. 7 కోట్లు దినేశ్ కార్తీక్: రూ. 5 కోట్ల 50 లక్షలు అనూజ్ రావత్: రూ. 3 కోట్ల 40 లక్షలు షాబాజ్ అహ్మద్: రూ. 2 కోట్ల 40 లక్షలు రూథర్‌ఫొర్డ్: రూ. 1 కోటి మహిపాల్ లామ్రోర్: రూ. 95 లక్షలు ఫిన్ అలెన్: రూ. 80 లక్షలు బెహ్రెండార్ఫ్: రూ.75 లక్షలు కరణ్ శర్మ: రూ. 50 లక్షలు సుయశ్ ప్రభుదేశాయ్: రూ.30 లక్షలు సీవీ మిలింద్: రూ. 25 లక్షలు ఆకాశ్‌దీప్: రూ. 20 లక్షలు అనీశ్వర్ గౌతమ్ : రూ. 20 లక్షలు -
IPL 2022 Auction: ప్రసిధ్ కృష్ణకు జాక్‌పాట్.. రాజస్తాన్ రాయల్స్‌కు వెళ్లిన ఆటగాళ్లు
ఐపీఎల్ మెగావేలం తొలిరోజు రాజస్తాన్ రాయల్స్ 8 మందిని కొనుగోలు చేసింది.యంగ్ బౌలర్ ప్రసిధ్ కృష్ణకు అత్యధికంగా రూ. 10 కోట్లు ఖర్చు చేసింది. విండీస్ హిట్టర్ హెట్‌మైర్‌కు రూ 8.5 కోట్లు.. బౌల్ట్‌కు రూ.8 కోట్లు పెట్టింది. మొత్తం 62 కోట్ల పర్సులో రాజస్తాన్ రాయల్స్ తొలిరోజు 49.5 కోట్లు ఖర్చు చేసింది. ఇక రాజస్తాన్ పర్సులో రూ. 12.5 కోట్లు ఉండగా.. 13 మంది ఆటగాళ్లను కొనే చాన్స్ ఉంది. విదేశీ కోటాలో మరో ఐదుగురికి అవకాశం ఉంది. రాజస్తాన్ రాయల్స్ రిటైన్ జాబితాలో సంజూ శాంసన్(రూ. 14 కోట్లు), జాస్ బట్లర్(రూ.10 కోట్లు), యశస్వి జైశ్వాల్(రూ. 4 కోట్లు) ఉన్నారు. రాజస్తాన్ రాయల్స్ ప్రసిధ్ కృష్ణ: రూ. 10 కోట్లు హెట్‌మైర్: రూ. 8 కోట్ల 50 లక్షలు బౌల్ట్: రూ. 8 కోట్లు దేవదత్ పడిక్కల్: రూ. 7 కోట్ల 75 లక్షలు చహల్: రూ. 6 కోట్ల 50 లక్షలు అశ్విన్: రూ. 5 కోట్లు పరాగ్: రూ. 3 కోట్ల 80 లక్షలు కరియప్ప: రూ. 30 లక్షలు -
IPL Auction Day 1: చహర్ 14 కోట్లు... అదరగొట్టిన శార్దుల్, ప్రసిధ్ కృష్ణ, హసరంగ..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలం మరోసారి అంచనాలను దాటి రికార్డులను కొల్లగొట్టింది. తొలి రోజు ఏకంగా 10 మంది ఆటగాళ్లు కనీసం రూ. 10 కోట్లకంటే ఎక్కువ విలువ పలకగా, పెద్ద సంఖ్యలో ప్లేయర్లు మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటారు. గతంతో పోలిస్తే ఈసారి వేలంలో భారత క్రికెటర్ల హవా కొనసాగింది. టాప్–10లో ఏడుగురు భారత ఆటగాళ్లు ఉండగా... ఆ పది మందిలో ఏడుగురు బౌలర్లే ఉండటం లీగ్‌లో బౌలింగ్ విలువను కూడా చూపించింది. వేలంలో ఎప్పటిలాగే కొన్ని అనూహ్య, అసాధారణ అంకెలు ఆశ్చర్యపరచగా... అత్యుత్సాహం ప్రదర్శించకుండా ఫ్రాంచైజీలు ఆచితూచి వేసిన అడుగుల ముద్ర కూడా కనిపించింది. 23 ఏళ్ల ఇషాన్ కిషన్ అందరికంటే ఎక్కువగా రూ.15 కోట్ల 25 లక్షలతో శిఖరాన నిలిచాడు. ఐపీఎల్ వేలం చరిత్రలో యువరాజ్ సింగ్ (రూ. 16 కోట్లు; 2015లో ఢిల్లీ డేర్‌డెవిల్స్) తర్వాత రెండో ఖరీదైన భారతీయ ప్లేయర్‌గా ఇషాన్ కిషన్ గుర్తింపు పొందాడు. టాప్–10 (కనీసం రూ. 10 కోట్లు) ఇషాన్ కిషన్ - ముంబై ఇండియన్స్ ఎడమచేతి వాటం విధ్వంసక బ్యాటర్, వికెట్ కీపర్. 23 ఏళ్ల వయసు, ఏ స్థానంలోనైనా ఆడగల సత్తా ఈ జార్ఖండ్ ప్లేయర్ సొంతం. గత రెండేళ్లు ముంబైకి విజయాలు అందించడంలో కీలక పాత్ర. అందుకే ప్రతీ జట్టు అతని కోసం పోటీ పడ్డాయి. అంబానీ టీమ్ కూడా అతడిని వదలదల్చుకోలేదు. అందుకే అందరికంటే ఇషాన్‌కు ఎక్కువ విలువ. రూ. 15 కోట్ల 25 లక్షలు దీపక్ చహర్ - చెన్నై సూపర్ కింగ్స్- రూ. 14 కోట్లు పవర్‌ప్లే స్పెషలిస్ట్ బౌలర్. స్వింగ్ అతని బలం. చెన్నైకి ఆడిన గత నాలుగు సీజన్లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్. గత రెండేళ్లుగా బ్యాటింగ్‌లోనూ బాగా మెరుగయ్యాడు. అందుకే రాజస్తాన్‌కు చెందిన దీపక్ చహర్‌ను చెన్నై మళ్లీ తీసుకుంది. శ్రేయస్ అయ్యర్ -కోల్‌కతా నైట్‌రైడర్స్ - రూ. 12 కోట్ల 25 లక్షలు ప్రతిభావంతుడైన బ్యాటర్. పరిస్థితికి తగినట్లుగా తన ఆటను మార్చుకోగలడు. ముంబై రంజీ జట్టు నుంచి వచ్చిన సహజ నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. కెప్టెన్ అవసరం ఉన్న కోల్‌కతా అందుకే ఎంచుకుంది. శార్దుల్ ఠాకూర్ - ఢిల్లీ క్యాపిటల్స్ - రూ. 10 కోట్ల 75 లక్షలు ప్రస్తుతం టీమిండియాలో రెగ్యులర్‌గా మారిన బౌలింగ్ ఆల్‌రౌండర్. ఇటీవలి అతని ప్రదర్శనలు అందరి దృష్టినీ ఆకర్షించేలా చేశాయి. కీలక సమయాల్లో వికెట్లు తీసే బౌలింగ్ నేర్పుతో పాటు చివర్లో ధాటిగా బ్యాటింగ్ చేయగల నైపుణ్యం ఈ ముంబైకర్ సొంతం. హర్షల్ పటేల్ - బెంగళూరు - రూ. 10 కోట్ల 75 లక్షలు 2021 ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్. పవర్‌ప్లేలో, డెత్ ఓవర్లలో సమర్థంగా బౌలింగ్ చేయగలడు. అందుకే భారీ మొత్తానికి ఈ హరియాణా బౌలర్‌ను బెంగళూరు మళ్లీ తీసుకుంది. వనిందు హసరంగ- బెంగళూరు -రూ. 10 కోట్ల 75 లక్షలు ప్రపంచ వ్యాప్తంగా లీగ్‌లలో ఆకట్టుకుంటున్న ఈ శ్రీలంక స్పిన్నర్ టి20 ప్రపంచకప్‌లో, 2021లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్. అయినా ఒక భారతీయేతర స్పిన్నర్ ఇంత విలువ పలకడం అనూహ్యం. అయితే లెగ్‌స్పిన్నర్‌గా అతనిది ప్రత్యేక శైలి. ‘గుగ్లీ’ పదునైన ఆయుధం. నికోలస్ పూరన్- సన్‌రైజర్స్ హైదరాబాద్- రూ. 10 కోట్ల 75 లక్షలు ఇటీవలి ఫామ్‌ను బట్టి చూస్తే అసాధారణ విలువ. ఈ వెస్టిండీస్ వికెట్ కీపర్‌కు హిట్టర్‌గా పేరు ఉన్నా గతంలో పంజాబ్ జట్టుకు ఉపయోగపడలేదు. హైదరాబాద్ అనూహ్య మొత్తాన్ని వెచ్చించింది. లోకీ ఫెర్గూసన్ - గుజరాత్ టైటాన్స్ - రూ. 10 కోట్లు న్యూజిలాండ్‌కు చెందిన సూపర్ ఫాస్ట్ బౌలర్. కోల్‌కతా తరఫున మూడు సీజన్లలో అక్కడక్కడ రాణించాడు. అతని స్థాయికి, అంతర్జాతీయ గుర్తింపునకు ఇది చాలా పెద్ద మొత్తం. అవేశ్ ఖాన్ - లక్నో సూపర్ జెయింట్స్ - రూ. 10 కోట్లు చాలా రోజులుగా భారత క్రికెట్లో అందరి దృష్టీ ఉంది. 2016 అండర్–19 ప్రపంచకప్‌లో ఆడిన ఈ మధ్యప్రదేశ్ క్రికెటర్ భారత యువ పేస్ బౌలర్లలో చక్కటి ప్రతిభావంతుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. గత ఏడాది కూడా ఆకట్టుకోవడంతో ఫ్రాంచైజీలు ఇతని కోసం పోటీ పడ్డాయి. ప్రసిధ్ కృష్ణ - రాజస్తాన్ రాయల్స్ - రూ. 10 కోట్లు ఐపీఎల్లో గొప్ప రికార్డు లేకపోయినా (9.26 ఎకానమీ) ఇటీవలి వన్డే ప్రదర్శన ప్రసిధ్ కృష్ణకు భారీ మొత్తం అందించింది. తాజా ఫామ్‌లో ఈ కర్ణాటక బౌలర్ ప్రత్యరి్థని కట్టడి చేయగలడని ఫ్రాంచైజీలు నమ్మాయి. చదవండి: IPL 2022 Auction: వయసు 37.. ధర 7 కోట్లు.. ఆర్సీబీ సొంతం.. మంచి డీల్.. మా గుండె పగిలింది! -
వన్డే చరిత్రలో ప్రసిధ్ కృష్ణ కొత్త రికార్డు
టీమిండియా యువ పేసర్ ప్రసిధ్ కృష్ణ కొత్త చరిత్ర సృష్టించాడు. టీమిండియా తరపున మొదటి ఏడు వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా ప్రసిధ్ కృష్ణ రికార్డు సాధించాడు. ఇప్పటివరకు అతను ఆడిన ఏడు వన్డేలు కలిపి 18 వికెట్లు తీశాడు. అంతకముందు అజిత్ అగార్కర్, బుమ్రాలు తొలి ఏడు వన్డేల్లో 16 వికెట్లు తీసి రెండో స్థానంలో ఉన్నారు. మూడో స్థానంలో 15 వికెట్లతో టీమిండియా మాజీ ఆటగాడు ప్రవీణ్ కుమార్ ఉన్నాడు. ఇక నాలుగో స్థానంలో 14 వికెట్లతో నరేంద్ర హిర్వాణి, జహీర్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్‌లు సంయుక్తంగా ఉన్నారు. అంతేకాదు సిరీస్‌లో బౌలింగ్‌లో విశేషంగా రాణించి మూడు వన్డేల్లో తొమ్మిది వికెట్లు తీసిన ప్రసిధ్ కృష్ణ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలవడం విశేషం. ఇక మూడో వన్డేలో టీమిండియా 96 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 265 పరుగులకు ఆలౌటైంది. శ్రేయాస్ అయ్యర్ 80 పరుగులతో రాణించగా.. పంత్ 56 పరుగులతో మెరిశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 37.1 ఓవర్లలో 169 పరుగులుకే కుప్పకూలింది. -
"అతడు అద్భుతమైన బౌలర్.. ఇప్పటి వరకు ఇలాంటి బౌలింగ్ స్పెల్ చూడలేదు"
అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో 44 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ నాలుగు వికెట్ల పడగొట్టి అద్భుతంగా రాణించాడు. ఈ నేపథ్యంలో ప్రసిద్ధ్ కృష్ణపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కరిపించాడు. "ఈ సిరీస్ గెలవడం మాకు మంచి అనుభూతిని కలిగించింది. మాకు ఈ మ్యాచ్‌లో కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి. రాహుల్, సూర్య కూమార్ యాదవ్ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివరికి గౌరవప్రదమైన స్కోర్‌ను నమోదు చేశాం. మేము ఆ స్కోర్‌ను డిఫెండ్ చేయగలమని భావించాం. మా బౌలర్లు అదే చేసి చూపించారు. ఈ మ్యాచ్‌లో బౌలర్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతమైన పేస్‌తో విండీస్ బ్యాటర్లు ముప్పు తిప్పలు పెట్టాడు. నేను ఇప్పటి వరకు భారత పిచ్‌లపై ఇలాంటి స్పెల్ చూడలేదు. ఇక సూర్య కూమార్ యాదవ్ గురించి మాట్లాడూతూ.. సూర్య మరి కొంత సమయం వెచ్చించవలసి ఉంటుంది. అతను జట్టు నుంచి ఏమి కోరుకుంటుందో అర్థం చేసుకోవాలి. ఆదే విధంగా మిడిల్ ఆర్డర్లో సూర్య అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు" అని రోహిత్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: 10 ఓవర్లు..12 పరుగులు.. నాలుగు వికెట్లు.. వేలం భారీ ధర పక్కా!