
ఐపీఎల్-2022 మెగా వేలంలో రాజస్తాన్ రాయల్స్ తమ జట్టును బలమైన జట్టుగా సిద్దం చేసుకుంది. ఈ సారి వేలంలో రాజస్తాన్ స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసింది. కాగా వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో అద్భుతంగా రాణించిన భారత బౌలర్ ప్రసిధ్ద్ కృష్ణను రూ.10 కోట్లకు రాజస్తాన్ కొనుగోలు చేసింది.
అదే విధంగా వెస్టిండీస్ బ్యాటర్ హెట్‌మైర్‌ను రూ. 8.50 కోట్లకు, ట్రెంట్ బౌల్ట్‌ను రూ.8 కోట్లకు, దేవ్‌దత్త్ పడిక్కల్‌ను రూ. 7.75 కోట్లకు కొనుగోలు చేసింది. రాజస్తాన్ జట్టు మొత్తం 24 మంది ఆటగాళ్లు కాగా.. అందులో 16 మంది భారత క్రికెటర్లు కాగా, ఎనమిది మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. వీరి కోసం రాజస్తాన్ రూ. 89.5 కోట్లు ఖర్చు చేసింది. ఇక రాజస్తాన్ రాయల్స్ ఆటగాళ్లను ఒకసారి పరిశీలిద్దాం.
రాజస్తాన్ రాయల్స్ జట్టు:
సంజూ సామ్సన్: రూ. 14 కోట్లు
ప్రసిధ్ కృష్ణ: రూ. 10 కోట్లు
జోస్ బట్లర్: రూ. 10 కోట్లు
హెట్‌మైర్: రూ. 8 కోట్ల 50 లక్షలు
ట్రెంట్ బౌల్ట్: రూ. 8 కోట్లు
దేవ్‌దత్ పడిక్కల్: రూ. 7 కోట్ల 75 లక్షలు
యజువేంద్ర చహల్: రూ. 6 కోట్ల 50 లక్షలు
అశ్విన్: రూ. 5 కోట్లు
యశస్వీ జైస్వాల్: రూ. 4 కోట్లు
రియాన్ పరాగ్: రూ. 3 కోట్ల 80 లక్షలు
నవ్‌దీప్ సైనీ: రూ. 2 కోట్ల 60 లక్షలు
కూల్టర్‌నీల్: రూ. 2 కోట్లు
జిమ్మీ నీషమ్: రూ. 1 కోటి 50 లక్షలు
కరుణ్ నాయర్: రూ. 1 కోటి 40 లక్షలు
వాన్‌డెర్ డసెన్: రూ. 1 కోటి
డారిల్ మిచెల్: రూ. 75 లక్షలు
ఒబెడ్ మెకాయ్: రూ. 75 లక్షలు
కరియప్ప: రూ. 30 లక్షలు
తేజస్ బరోకా: రూ. 20 లక్షలు
అనునయ్ సింగ్: రూ. 20 లక్షలు
కుల్దీప్ సేన్: రూ. 20 లక్షలు
ధ్రువ్ జురెల్: రూ. 20 లక్షలు
కుల్దీప్ : రూ. 20 లక్షలు
శుభమ్ గార్హ్‌వాల్: రూ. 20 లక్షలు
Comments
Please login to add a commentAdd a comment