IPL 2022 Auction
-
ఐపీఎల్ వేలం: నమ్మకద్రోహం, మోసం.. చాలా బాధపడ్డాను!
IPL 2022 RCB Player Harshal Patel: హర్షల్ పటేల్.. ఐపీఎల్-2012లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) తరఫున అరంగేట్రం చేశాడు. 2015 సీజన్లో 17 వికెట్లు పడగొట్టి వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత 2018-2020 మధ్య ఢిల్లీ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. అనంతరం మళ్లీ ఆర్సీబీకి ఆడే అవకాశం దక్కించుకున్న హర్షల్ 2021 ఎడిషన్‌లో 32 వికెట్లు కూల్చి పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు. జట్టును ప్లే ఆఫ్స్ చేర్చడంలో తన వంతు పాత్ర పోషించాడు. అంతేగాక టీమిండియా తరఫున అరంగేట్రం చేసే అవకాశం దక్కించుకున్నాడు. అయితే రిటెన్షన్ సమయంలో ఆర్సీబీ అనూహ్యంగా హర్షల్‌ను వదిలేసింది. దీంతో అతడు మెగా వేలం-2022లోకి రాగా ఇతర ఫ్రాంఛైజీలతో పోటీ పడి 10.75 కోట్ల భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసింది. ఈ విషయం గురించి హర్షల్ తాజాగా బ్రేక్‌ఫాస్ట్ విత్ చాంపియన్స్ షోలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2018 వేలం సమయంలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి పంచుకున్నాడు. ఈ మేరకు అతడు మాట్లాడుతూ.. ‘‘2018 వేలం జరుగుతున్న సమయంలో.. నా కోసం ఎవరో ఒకరు బోర్డు ఎత్తుతారని ఆశగా ఎదురు చూశాను.. నిజానికి అప్పుడు నేను డబ్బు గురించి ఏమాత్రం ఆలోచించలేదు. కేవలం ఆడే అవకాశం దక్కితే చాలనుకున్నా. అంతకుముందే వేర్వేరు ఫ్రాంఛైజీలకు చెందిన ఓ ముగ్గురు నలుగురు ఆటగాళ్లు నన్ను తమ జట్టు కోసం కొనుగోలు చేసే అవకాశం ఉందని చెప్పారు. కానీ ఎవరూ ఆ పని చేయలేదు. ఆ సమయంలో నాకు ఎదురైన అనుభవం చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. నమ్మకద్రోహానికి గురైనట్లు, మోసానికి గురయ్యానన్న భావన మనసును మెలిపెట్టింది. కొన్ని రోజుల పాటు దాని గురించే ఆలోచించాను. చాలా బాధపడ్డాను. కానీ ఆ తర్వాత ఆటపై మాత్రమే దృష్టి సారించి ముందుకు సాగాను’’ అని చెప్పుకొచ్చాడు. ఇక ఐపీఎల్ మెగా వేలం-2022లో ఆర్సీబీ తనను భారీ ధరకు కొనుగోలు చేసిన తర్వాత విరాట్ కోహ్లి సంతోషంగా తనకు మెసేజ్ చేశాడన్న హర్షల్ పటేల్.. తనకు నిజంగానే లాటరీ తగిలిందని అతడితో చెప్పినట్లు పేర్కొన్నాడు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4301451426.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి👉🏾RCB Vs RR: మొన్న 68 పరుగులకే ఆలౌట్.. అక్కడేమో అత్యల్ప స్కోరు 73..! -
10 కోట్లకు అమ్ముడుపోతాడనుకున్నా! లక్నోది సరైన నిర్ణయం
ఐపీఎల్-2022లో అదరగొడుతోన్న లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్ క్వింటన్ డికాక్‌పై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసల వర్షం కురిపించాడు. ఐపీఎల్-2022 మెగా వేలంలో అతడిని దక్కించుకోవడానికి లక్నోతో ఏ జట్టు పోటీపడకపోవడం, అతడికి భారీ ధర దక్కకపోవడం తనకు ఆశ్చర్యం కలిగించిందని ఆకాశ్ చోప్రా తెలిపాడు. గురువారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డికాక్ అద్భుతమైన ఇన్నింగ్స్‌ను ఆడాడు. 52 బంతుల్లో 80 పరుగులు సాధించి లక్నో విజయంలో డికాక్ కీలక పాత్ర పోషించాడు. "ఐపీఎల్ మెగా వేలంలో క్వింటన్ డి కాక్‌ను కొనుగోలు చేసి లక్నో సూపర్ జెయింట్స్ సరైన నిర్ణయం తీసుకుంది. వేలంలో డికాక్ మార్క్యూ(ప్రధాన) జాబితాలో ఉన్నాడు. అయినప్పటికీ అతడి కోసం జట్లు ఎందుకు పోటీ పడలేదో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. అతడు వేలంలో 10 కోట్లకు అమ్ముడుపోతాడని నేను భావించాను. కానీ అతడిని కేవలం 6.75 కోట్లకే లక్నో కొనుగోలు చేసింది. అతడిని అంత తక్కువ ధరకు కొనుగోలు చేస్తారని అని నేను అనుకోలేదు. కానీ లక్నో మాత్రం అతడిని దక్కించుకుని సరైన నిర్ణయం తీసుకుంది. అతడు బ్యాట్‌తో పాటు కీపర్‌గా అద్భుతంగా రాణిస్తాడు. అదే విధంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా డికాక్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. నోర్జే లాంటి స్టార్ పేసర్‌కు చుక్కలు చూపించాడు. తన ఇన్నింగ్స్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు" అని ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. చదవండి: IPL 2022 LSG Vs DC: రిషభ్ పంత్‌కు భారీ షాక్! అసలే వరుస ఓటములు.. ఇప్పుడిలా! -
IPL 2022: వేలంలో పాల్గొనలేకపోయా.. మ్యాచ్‌లు చూస్తుంటే చిరాగ్గా ఉంది!
IPL 2022: వెన్ను నొప్పి కారణంగా ఐపీఎల్-2021 సీజన్ మధ్యలోనే టోర్నీ నుంచి నిష్క్రమించాడు ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్. గత సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన సామ్.. అక్టోబరులో జరిగిన రెండో అంచె సందర్భంగా గాయపడ్డాడు. ఆ తర్వాత నొప్పి తీవ్రతరం కావడంతో ఐసీసీ మెగా ఈవెంట్ టీ20 ప్రపంచకప్-2021తో పాటు ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ 2021-22కు కూడా దూరమయ్యాడు. అయితే, గాయం నుంచి కాస్త ఉపశమనం కలగడంతో ఐపీఎల్ మెగా వేలం-2022లో తన పేరును నమోదు చేసుకోవాలనుకున్నాడు సామ్ కరన్. కానీ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వైద్య సిబ్బంది మాత్రం మరికొన్ని రోజులు విశ్రాంతి అవసరమని, ఈ ప్రయత్నాన్ని మానుకోవాలని సూచించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ క్రమంలో క్యాష్ రిచ్ లీగ్‌కు సామ్ కరన్ దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఈఎస్‌పీఎన్‌క్రిక్ ఇన్ఫోతో మాట్లాడిన సామ్ కరన్ ఐపీఎల్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ మేరకు అతడు మాట్లాడుతూ.. ‘‘అక్కడికి(భారత్) వెళ్లలేకపోయిన కారణంగా నిరాశకు లోనయ్యాను. ఇంట్లో కూర్చుని మ్యాచ్‌లు చూస్తుంటే విసుగు పుడుతోంది. వేలంలో పాల్గొనాలని ఎంతగానో ప్రయత్నించాను. కానీ... చివర్లో మనసు మార్చుకున్నా. నిజానికి అది చాలా మంచి నిర్ణయం’’అని పేర్కొన్నాడు. అదే విధంగా.. ‘‘అవకాశం వస్తే తప్పక అక్కడికి తిరిగి వెళ్తాను. ఎందుకంటే ఐపీఎల్ లాంటి టోర్నీల్లో ఆడితే మన ప్రతిభ మరింత వెలుగులోకి వస్తుంది. అక్కడే క్రికెట్‌నే శ్వాస, ధ్యాస. బ్రేక్‌ఫాస్ట్‌కు వెళ్లిన సమయంలో సూపర్స్టార్లతో కూర్చుని ఆట గురించే మాట్లాడతాం. అందుకే అక్కడికి వెళ్లడాన్ని ఇష్టపడతా’’ అని సామ్ కరన్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు నెట్స్‌లో ప్రాక్టీసు చేస్తున్నానని, త్వరలోనే మైదానంలో అడుగుపెడతానని ఆశాభావం వ్యక్తం చేశాడు. చదవండి: IPL 2022- RCB: ఆర్సీబీకి గుడ్‌న్యూస్.. స్టార్ ఆల్‌రౌండర్ వచ్చేస్తున్నాడు! -
IPL 2022: సీఎస్కే తదుపరి కెప్టెన్ అంబటి రాయుడు.. లేదంటే: రైనా
IPL 2022- Suresh Raina: ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరొందింది చెన్నై సూపర్ కింగ్స్. నాలుగుసార్లు టైటిల్ గెలిచి సత్తా చాటింది. 2010, 2011, 2018, 2021 సీజన్లలో విన్నర్‌గా నిలిచింది. సీఎస్కే ప్రయాణం ఇంత సక్సెస్‌ఫుల్‌గా సాగడంలో కెప్టెన్ ఎంఎస్ ధోని పాత్ర మరువలేనిది. తలా లేని చెన్నై జట్టును ఊహించడం కష్టం. అంతగా తనదైన ముద్ర వేశాడు ధోని. మరి ధోని క్యాష్ రిచ్ లీగ్‌కు గుడ్ బై చెబితే అతడి స్థానాన్ని భర్తీ చేయగల సారథి ఎవరా అంటూ చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన సురేశ్ రైనాకు ఈ విషయం గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు స్పందించిన రైనా.. ‘‘రవీంద్ర జడేజా, అంబటి రాయుడు, రాబిన్ ఊతప్ప, డ్వేన్ బ్రావో.. వీరికి చెన్నై సూపర్ కింగ్స్‌కు సారథ్యం వహించ గల సత్తా ఉంది. ఎంఎస్ ధోని వారసుడిగా జట్టును ముందుకు నడిపే శక్తిసామర్థ్యాలు వారికి ఉన్నాయి. ఆటపై వారికున్న అవగాహన ఇందుకు దోహదం చేస్తుంది. ఇక ఐపీఎల్లో కామెంటేటర్‌గా అవతారం ఎత్తడం గురించి రైనా చెబుతూ.. ‘‘నేను ఇందుకు సిద్ధంగా ఉన్నాను. ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్, పీయూశ్ చావ్లా.. ఇలా నా స్నేహితుల్లో చాలా మంది ఇప్పటికే కామెంటేటర్లుగా ఉన్నారు. రవి భాయ్(రవి శాస్త్రి) కూడా ఈ సీజన్‌తో ఐపీఎల్లో ఎంట్రీ ఇస్తున్నారు. వీళ్లంతా ఉన్నారు కాబట్టి నాకు ఈ టాస్క్ మరింత సులువు అవుతుందనే అనుకుంటున్నా’’ అని పేర్కొన్నాడు. కాగా గతంలో చెన్నైకి ప్రాతినిథ్యం వహించిన రైనా మెగా వేలం- 2022లో అమ్ముడుపోకుండా మిగిలి పోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వ్యాఖ్యాతగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. చదవండి: IPL 2022- Virat Kohli: చిన్న బ్రేక్ మాత్రమే.. 2023లో మళ్లీ ఆర్సీబీ కెప్టెన్‌గా కోహ్లి! ఎందుకంటే... Unveiling with Yellove! 💛 Here’s a 👀 at our new threads in partnership with @TVSEurogrip! 🥳#TATAIPL #WhistlePodu 🦁 pic.twitter.com/pWioHTJ1vd — Chennai Super Kings (@ChennaiIPL) March 23, 2022 -
IPL 2022: ఢిల్లీ క్యాపిటల్స్ చేసిన తప్పిదం ఇదే! వాళ్లను వదిలేసి.. ఇప్పుడిలా
ఐపీఎల్ సంగ్రామానికి మరి కొద్ది రోజుల్లో తెరలేవనుంది. మార్చి 26 నుంచి ఐపీఎల్-2022 ప్రారంభం కానుంది. ఇది ఇలా ఉంటే.. ఐపీఎల్ మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ చాలా మంది స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అయితే వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అనుసరించిన వ్యూహం సరిగా లేదని భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా వారి విదేశీ ఆటగాళ్లను ఎంచుకోవడంలో ఢిల్లీ విఫలమైందని అతడు పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2022లో ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం ఏడుగురు విదేశీ ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అయితే వీరిలో దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్ గాయం ఈ ఏడాది సీజన్‌కు కారణంగా దూరం కాగా, ఆస్ట్రేలియా ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నారు. ఈ నేపథ్యంలో వసీం జాఫర్ మాట్లాడుతూ.. "ఐపీఎల్-2022 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ తప్పుడు వ్యూహాన్ని అనుసరించింది. వారు ఆటగాళ్లను అంతర్జాతీయ సిరీస్‌లను దృష్టిలో పెట్టుకుని కొనుగోలు చేయాల్సింది. వేలంలో గరిష్టంగా 8 మంది విదేశీ క్రికెటర్లను చేసుకోనే అవకాశం ఉన్నప్పుడు.. ఢిల్లీ ఏడుగురు విదేశీ ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేసుకుంది’’ అని పేర్కొన్నాడు. ఇక ఈ సీజన్లో ఢిల్లీ అనుసరించబోయే వ్యూహం గురించి మాట్లాడుతూ.. ‘‘మన్దీప్ సింగ్ లేదా యశ్ ధూల్ ఢిల్లీ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. ఫస్ట్ డౌన్లో సర్ఫరాజ్ ఖాన్‌కు బ్యాటింగ్‌కు వస్తాడు. అయితే శ్రేయాస్ అయ్యర్ స్ధానాన్ని అతడు భర్తీ చేయలేడు. ఇక కుల్దీప్ యాదవ్‌ను జట్టులోకి తీసుకున్నారు. కానీ స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను విడుదల చేశారు. ఇంతకు ముందు జట్టులో అమిత్ మిశ్రా ఉన్నాడు. ఇప్పుడు ప్రవీణ్ దూబే,లలిత్ యాదవ్ వంటి యువ స్పిన్నర్లు మాత్రమే ఉన్నారు. అయితే ధావన్, అయ్యర్, అశ్విన్ వంటి ఆటగాళ్లను వదిలి ఢిల్లీ తప్పు చేసింది" అని జాఫర్ పేర్కొన్నాడు. చదవండి: BAN vs SA: ఒకవైపు ఐపీఎల్.. జట్టును ప్రకటించిన దక్షిణాఫ్రికా.. స్టార్ ఆటగాళ్లు లేకుండానే! -
IPL 2022: ముంబై ఇండియన్స్ చేసిన అతి పెద్ద తప్పు ఇదే! అతడిని వదులుకుని..
IPL 2022- Mumbai Indians: ఐపీఎల్ మెగా వేలం-2022 నేపథ్యంలో ముంబై ఇండియన్స్ నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. కెప్టెన్ రోహిత్ శర్మ, హిట్టర్ కీరన్ పొలార్డ్(వెస్టిండీస్), స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, కీలక బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌లను అట్టిపెట్టుకుంది. ఈ క్రమంలో నిబంధనలకు అనుగుణంగా న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్‌ను వదిలేయాల్సి వచ్చింది. ఇక బెంగళూరు వేదికగా జరిగిన మెగా వేలంలో అతడిని సొంతం చేసుకునేందుకు ముంబై పోటీ పడినా నిరాశ తప్పలేదు. రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ 8 కోట్లు ఖర్చుచేసి బౌల్ట్‌ను దక్కించుకుంది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ మాట్లాడుతూ.. అనువభవజ్ఞుడైన బౌల్ట్‌ను వదులుకుని ముంబై పెద్ద పొరపాటే చేసిందని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు ఆయన ఖేల్‌నీతి పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘‘ముంబై లెక్క తప్పింది. ట్రెంట్ బౌల్ట్ సేవలను వాళ్లు కచ్చితంగా మిస్సవుతారు. బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా కలిసి ఎన్నో మ్యాచ్‌లు గెలిపించారు. అలాంటి పేసర్(బౌల్ట్)ను ఎందుకు వదిలేసిందో అర్థం కావడం లేదు. ఇప్పుడు అతడి గైర్హాజరీలో వాళ్లు ఉనద్కట్ వైపు చూస్తారేమో! ఇటీవల అతడు సౌరాష్ట్ర తరఫున మంచి ప్రదర్శన ఇచ్చాడు. తన అనుభవం ముంబైకి పనికివస్తుంది. ఇక మరో ఇద్దరు లెఫ్టార్మ్ బౌలర్లను కూడా ముంబై కొనుగోలు చేసింది. కానీ బౌల్ట్ లేని లోటు వారు తీరుస్తారా అన్నదే ప్రశ్న’’ అని పేర్కొన్నాడు. కాగా జయదేవ్ ఉనద్కట్‌తో పాటు డానియల్ సామ్స్, టైమల్ మిల్స్‌ను ముంబై కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఐపీఎల్-2022 సీజన్లో భాగంగా మార్చి 27న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై ఇండియన్స్ తమ మొదటి మ్యాచ్ ఆడనుంది. చదవండి: IPL 2022: మీకంత సీన్ లేదు.. అసలు ఆ పోలికేంటి? 16 కోట్లు పెట్టి ఆటగాడిని కొనేవాళ్లు ఉన్నారా? Drills, catching skills & birthday celebrations - MI Daily is now 𝗟𝗜𝗩𝗘 📹💙 Ab se roz 9 ka alarm laga lo Paltan. Ye ab daily hone waala hai! 😎#OneFamily #MumbaiIndians MI TV pic.twitter.com/mq0hclfJyE — Mumbai Indians (@mipaltan) March 17, 2022 -
IPL 2022: గుజరాత్ టైటాన్స్‌కు గుడ్‌న్యూస్.. అతడు వచ్చేస్తున్నాడు!
IPL 2022- Gujarat Titans: ఐపీఎల్ కొత్త ఫ్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్‌కు గుడ్‌న్యూస్! సుదీర్ఘ కాలంగా వరుస గాయాలతో బాధపడుతూ వచ్చిన టీమిండియా ఆల్‌రౌండర్, టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించాడు. ఈ విషయాన్ని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) ప్రకటించింది. అంతేకాదు.. ఎక్కువ సమయం పాటు బౌలింగ్ కూడా చేసిన హార్దిక్ నిర్ణీత స్కోరు సాధించి యో–యో టెస్టులో కూడా ఉత్తీర్ణుడవడం విశేషం. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు మాట్లాడుతూ.. ‘‘ఎన్సీఏలో అతడు బౌలింగ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ.. అతడు పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించి.. గంటకు 135 కిలోమీటర్ల వేగంతో బంతిని విసరగలిగాడు. 17 ప్లస్ స్కోరు చేశాడు. నిజానికి నిర్ణీత స్కోరు కన్నా ఇది చాలా ఎక్కువ’’ అని పేర్కొన్నారు. దీంతో అతడు పూర్తిస్తాయిలో ఐపీఎల్-2022 సీజన్‌కు అందుబాటులో ఉండనున్నాడు. కాగా ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడిగా గుర్తింపు పొందిన హార్దిక్ పాండ్యాను రిటెన్షన్ సమయంలో వదిలేసిన సంగతి తెలిసిందే. గత సీజన్లో బౌలింగ్ చేయలేకపోవడం, టీ20 ప్రపంచకప్-2021లో విఫలం కావడం పాండ్యా కొంపముంచింది. వరుస గాయాలు అతడి కెరీర్‌ను ప్రశ్నార్థకం చేశాయి. ఈ క్రమంలో ఎన్సీఏలో సుదీర్ఘకాలం పాటు చికిత్స తీసుకున్నాడు. ఫలితంగా పూర్తి ఫిట్నెస్ సాధించి యో-యో టెస్టులో పాసయ్యాడు. ఇక హార్దిక్ ఆటతీరుపై నమ్మకం ఉంచిన గుజరాత్ యాజమన్యాం మెగా వేలానికి ముందే 15 కోట్లు చెల్లించి అతడిని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. హార్దిక్‌ను తమ కెప్టెన్‌గా నియమించింది కూడా. ఇక సీజన్ ఆరంభ సమయం ఆసన్నమవుతున్న వేళ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. చదవండి: IPL 2022- Suresh Raina: రైనా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఎట్టకేలకు ఐపీఎల్లో ఎంట్రీ! అయితే.. Nehraji, the OG! 🔥#SeasonOfFirsts #GujaratTitans pic.twitter.com/YuZSYeAZKF — Gujarat Titans (@gujarat_titans) March 16, 2022 -
IPL 2022: రైనా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఎట్టకేలకు ఐపీఎల్లో ఎంట్రీ!
IPL 2022- Suresh Raina: టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఎట్టకేలకు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తిరిగి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈసారి ఆటగాడిగా కాకుండా కామెంటేటర్‌గా కొత్త అవతారంలో దర్శనమివ్వనున్నట్లు సమాచారం. కాగా ఐపీఎల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో ఒకడైన రైనా.. గతేడాది చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. అయితే, సీఎస్కే అతడిని రిటైన్ చేసుకోలేదు. దీంతో ఐపీఎల్-2022లో రూ.2 కోట్ల కనీస ధరతో పేరు నమోదు చేసుకున్నాడు. కానీ ఏ జట్టు కూడా రైనా పట్ల ఆసక్తి చూపలేదు. దీంతో అతడు అమ్ముడుపోకుండానే మిగిలిపోయాడు. కనీసం వివిధ కారణాల వల్ల జట్లకు దూరమైన ఆటగాళ్ల స్థానంలోనైనా ఎంట్రీ ఇస్తాడనుకుంటే ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. ఈ నేపథ్యంలో క్రికెట్ కామెంటేటర్‌గా అవతారం ఎత్తేందుకు రైనా సిద్దమైనట్లు ఐపీఎల్ వర్గాల సమాచారం. ఇక రైనాతో పాటు టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి సైతం వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు.. ‘‘ఈసారి రైనా ఐపీఎల్లో భాగం కావడం లేదని అందరికీ తెలుసు. అయితే, మేము అతడిని తిరిగి లీగ్‌లో చూడాలనుకుంటున్నాం. రైనాకు అభిమానులు ఎక్కువ. ముద్దుగా తనని మిస్టర్ ఐపీఎల్ అని పిలుచుకుంటారు. అతడు తిరిగి వస్తే బాగుంటుంది. ఇక శాస్త్రి ఒకప్పుడు స్టార్ స్పోర్ట్స్ ఇంగ్లింష్ కామెంటరీ టీమ్‌లో ఉన్నాడు. వీరిద్దరు ఐపీఎల్ వ్యాఖ్యాతలుగా ఉంటే బాగుంటుందనుకుంటున్నాం’’ అని ఐపీఎల్ వర్గాలు తెలిపినట్లు జాగరన్ మీడియా పేర్కొంది. కాగా రైనా, రవిశాస్త్రి ఐపీఎల్ హిందీ కామెంటేటర్లుగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. కాగా సురేశ్ రైనా గతంలో గుజరాత్ లయన్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. చదవండి: Ruturaj Gaikwad - IPL 2022: సీఎస్కేకు బిగ్‌షాక్.. ఆరంభ మ్యాచ్‌లకు స్టార్ ఆటగాడు దూరం! View this post on Instagram A post shared by Chennai Super Kings (@chennaiipl) -
హార్దిక్‌కు ఫిట్నెస్ టెస్ట్.. ఐపీఎల్‌కు దూరం కానున్నాడా!
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గత కొంత కాలంగా ఫిట్నెస్ సమస్యలతో జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే అతడు బ్యాటింగ్, ఫీల్డింగ్ చేయడానికి ఫిట్‌గా ఉన్నప్పటికీ.. బౌలింగ్ ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం హార్దిక్ పాండ్యా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్నాడు. అక్కడ హార్దిక్ ఫిట్నెస్ పరీక్షలో పాల్గొనున్నాడు. ఇక ఐపీఎల్ కొత్త జట్టు అవతరించిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా బాధ్యతలు నిర్వహించనున్న విషయం విధితమే. అయితే ఫిట్నెస్ పరీక్షలను క్లియర్ చేయడంలో హార్దిక్ విఫలమైతే ఐపీఎల్లో ఆడడానికి బీసీసీఐ అనుమతించదు." హార్దిక్ రెండు రోజులు పాటు నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉంటాడు. వివిధ ఫిట్నెస్ పరీక్షలలో పాల్గొంటాడు. అతను సెంట్రల్ కాంట్రాక్ట్ క్రికెటర్, అతడు టీ20 ప్రపంచకప్ నుంచి ఎటువంటి క్రికెట్ ఆడలేదు. గత కొంతకాలంగా ఫిట్నెస్ పరీక్ష తప్పనిసరి అయినందున అతను తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. గత ఏడాది, శ్రేయాస్ అయ్యర్ కూడా ఐపీఎల్ ఆడటానికి ముందు ఫిట్నెస్ టెస్ట్ హాజరయ్యాడు" అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఇక గుజరాత్ టైటాన్స్ జట్టు మార్చి 28న లక్నో సూపర్‌జెయింట్స్‌తో తమ తొలి మ్యాచ్‌ను ఆడనుంది. అదే విధంగా ఐపీఎల్-2022 మార్చి 26నుంచి ఫ్రారంభం కానుంది. గుజరాత్ టైటాన్స్: హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్, మహ్మద్ షమీ, లాకీ ఫెర్గూసన్, అభినవ్ సదరంగాని, డేవిడ్ మిల్లర్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, వరుణ్ ఆరోన్, బి సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, నూర్ అహ్మద్, సాయి కిషోర్, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, డొమినిక్ డ్రేక్స్, దర్శన్ నల్కండే, యశ్రీ జోసెఫ్ దయాల్, ప్రదీప్ జోసెఫ్ దయాల్. చదవండి: IPL 2022 Gujarat Titans Jersey: గుజరాత్ టైటాన్స్ జెర్సీ ఆవిష్కరణ.. సర్ప్రైజ్కు సిద్ధంగా ఉండాలన్న కెప్టెన్ హార్దిక్ పాండ్యా -
అప్పుడు సీఎస్కేకు చుక్కలు చూపించారు.. కట్ చేస్తే.. ఇప్పుడేమో ఏకంగా
ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ తిరగులేని జట్టుగా నిలిచిన జట్టుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 12 సీజన్లలో 11 సార్లు ప్లేఆఫ్స్‌కు చేరి చెన్నై రికార్డును సృష్టించింది. ఎంస్ ధోని సారథ్యంలోని సీఎస్కే డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఐపీఎల్-2022 బరిలోకి దిగనుంది. ఇక ఐపీఎల్-2022 మెగా వేలంలో యువ ఆటగాళ్లను చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. అయితే ఐపీఎల్-2021 సీజన్లో తమపై బాగా ఆడిన ముగ్గురు ఆటగాళ్లను చెన్నై కొనుగోలు చేయడం విశేషం. ఇక మార్చి 26 న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. శివమ్ దూబే మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ రూ. 4 కోట్లకు శివమ్ దూబేను కొనుగోలు చేసింది. దూబే దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తోన్నాడు. కాగా గత ఏడాది సీజన్లో రాజస్తాన్ తరుపున ఆడిన దుబే అద్భుతంగా రాణించాడు. ఐపీఎల్-2021లో కేవలం 42 బంతుల్లోనే 64 పరుగులు చేసి దూబే తన కెరీర్లో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు. ఆడమ్ మిల్నే మెగా వేలంలో ఆడమ్ మిల్నే ను రూ.1.9 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. ఈ కివీ స్పీడ్‌స్టర్ గత ఏడాది ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు. యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ సెకెండ్ ఫేజ్‌లో చెన్నైపై అద్భుతమైన బౌలింగ్ చేశాడు. క్రిస్ జోర్డాన్ మెగా వేలంలో జోర్డాన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ 3.6 కోట్లకు కొనుగోలు చేసింది. గత ఏడాది సీజన్లో జోర్డాన్ పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. సీఎస్కేతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో అద్భుతంగా జోర్డాన్ రాణించాడు. 4 ఓవర్లు వేసిన జోర్డాన్ 20 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. చదవండి: IPL 2022: ఐపీఎల్ ఫ్రాంచైజీలకు భారీ షాక్.. 26 మంది స్టార్ ఆటగాళ్లు దూరం! ఇక ఐపీఎల్-2022 నేపథ్యంలో సీఎస్కే ఇప్పటికే సూరత్‌లో ప్రాక్టీసు మొదలెట్టిన సంగతి తెలిసిందే. Meeting in the Middle! 🦁 in Practice! 📹👉 https://t.co/jcD4NsNQ2t#WhistlePodu 💛 pic.twitter.com/QvrHYDiLi4 — Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) March 12, 2022 -
IPL 2022: ఈసారి ట్రోఫీ గెలుస్తాం: సన్‌రైజర్స్ యువ ఆటగాడు
IPL 2022: Sunrisers Hyderabad: ఐపీఎల్-2022 కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ సన్నద్ధమవుతోంది. ఇప్పటికే నటరాజన్, విష్ణు వినోద్, సౌరభ్ దూబే, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, ప్రియమ్ గార్గ్ తదితర ఆటగాళ్లు జట్టుతో చేరారు. ఈ నేపథ్యంలో ఎస్ఆర్హెచ్తో అనుబంధం గురించి క్రికెటర్లు మాట్లాడిన వీడియోలను ట్విటర్లో షేర్ చేసింది ఫ్రాంఛైజీ. ఈ సందర్భంగా 21 ఏళ్ల ప్రియమ్ గార్గ్ మాట్లాడుతూ.. జట్టులోకి తిరిగిరావడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. ‘‘గతంలో రెండేళ్లపాటు ఈ జట్టులో ఉన్నాను. మళ్లీ ఇప్పుడు ఇలా! కొత్త సీజన్.. కొత్త ఆటగాళ్లంతా ఒక్కచోట చేరారు. ఈసారి మేము ట్రోఫీ గెలుస్తామనే భావిస్తున్నా’’ అని విశ్వాసం వ్యక్తం చేశాడు. అదే విధంగా.. ఇప్పటివరకు సన్‌రైజర్స్‌కు మద్దతుగా నిలిచిన అభిమానులు ఇక ముందు కూడా ఇలాగే సపోర్టు చేయాలని విజ్ఞప్తి చేశాడు. మీ అండ మాకెంతో ముఖ్యమని పేర్కొన్నాడు. కాగా 2020లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ సందర్భంగా భారత క్రికెటర్ ప్రియమ్ గార్గ్ సన్‌రైజర్స్ తరఫున ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఐపీఎల్-2022 మెగా వేలంలో భాగంగా ఎస్ఆర్హెచ్ ప్రియమ్‌ను 20 లక్షలు చెల్లించి కొనుగోలు చేసింది. ఇక ఈ సీజన్లో భాగంగా మార్చి 29న రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌తో హైదరాబాద్ తమ ప్రయాణాన్ని ఆరంభించనుంది. ఇక గత సీజన్లో హైదరాబాద్ ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. ఐపీఎల్-2022: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇదే: కేన్ విలియమ్సన్(14 కోట్లు- కెప్టెన్), అబ్దుల్ సమద్(4 కోట్లు) ,ఉమ్రాన్ మాలిక్(4 కోట్లు), నికోలస్ పూరన్(10.75 కోట్లు), వాషింగ్టన్ సుందర్(8.75 కోట్లు), రాహుల్ త్రిపాఠి(8.5 కోట్లు), రొమారియో షెపర్డ్(7.7 కోట్లు), అభిషేక్ శర్మ(6.5 కోట్లు), భువనేశ్వర్ కుమార్(4.2 కోట్లు), మార్కో జన్సెన్(4.2 కోట్లు), టి నటరాజన్(4 కోట్లు), కార్తీక్ త్యాగి(4 కోట్లు), ఎయిడెన్ మార్క్రమ్(2.6 కోట్లు), సీన్ అబాట్(2.4 కోట్లు), గ్లెన్ ఫిలిప్(1.5 కోట్లు), శ్రేయస్ గోపాల్(75 లక్షలు), విష్ణు వినోద్(50 లక్షలు), ఫజల్ హక్ ఫారుఖి(50 లక్షలు), జె సుచిత్(20 లక్షలు), ప్రియమ్ గార్గ్(20 లక్షలు), ఆర్ సమర్థ్(20 లక్షలు), శశాంక్ సింగ్(20 లక్షలు), సౌరభ్ దూబే(20 లక్షలు). చదవండి: Kapil Dev: కొత్తతరం క్రికెటర్లలో అతడి ఆట అంటే నాకిష్టం.. ఎందుకంటే: కపిల్ దేవ్ Listen to our young colt @priyamg03149099 talk about what his third year with us means to him, and his expectations from this season. 🗣️🧡#TATAIPL #OrangeArmy #ReadyToRise pic.twitter.com/r4drmDxRQf — SunRisers Hyderabad (@SunRisers) March 13, 2022 Listen in to what @ABDULSAMAD___1 had to say on his arrival at the #Risers camp 🗣🧡#OrangeArmy #ReadyToRise #TATAIPL pic.twitter.com/ShoX99B74P — SunRisers Hyderabad (@SunRisers) March 14, 2022 “It’s always been a privilege playing for #SRH” 🗣 And it’s a privilege to have you back with us, @IamAbhiSharma4 🧡#OrangeArmy #ReadyToRise #TATAIPL pic.twitter.com/N4Om0BTeSJ — SunRisers Hyderabad (@SunRisers) March 14, 2022 -
ఆర్సీబీకి కొత్త కెప్టెన్ వచ్చేశాడు.. బెంగళూరు అధికారిక ప్రకటన
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కొత్త కెప్టెన్ వచ్చేశాడు. అంతా ఊహించినట్లుగానే దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఫఫ్ డుప్లెసిస్‌కు ఆర్సీబీ సారథ్య బాధ్యతలు అప్పజెప్పింది. ఈ మేరకు బెంగళూరులో నిర్వహించిన "ఆర్సీబీ ఆన్‌బాక్స్" ఈవెంట్‌లోఈ విషయాన్ని బెంగళూరు ఫ్రాంచైజీ వెల్లడించింది. ఇక ఐపీఎల్-2021 తర్వాత ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మళ్లీ కోహ్లి సారథ్య బాధ్యతలు చేపట్టున్నాడని వార్తలు వినిపించాయి. ఆర్సీబీ తాజా ప్రకటనతో ఆ వార్తలకు బ్రేక్ పడింది. కాగా ఐపీఎల్-2022 మెగా వేలంలో భాగంగా ఫఫ్ డు ప్లెసిస్‌ను ఆర్సీబీ రూ. 7కోట్లకు కొనుగోలు చేసింది. ఇక గతంలో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడిన డు ప్లెసిస్ అద్భుతంగా రాణించాడు. ఐపీఎల్-2021 సీజన్లో 633 పరుగులు చేసి టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా డు ప్లెసిస్ నిలిచాడు. గత ఏడాది చెన్నై టైటిల్ గెలవడంలో డు ప్లెసిస్ కీలక పాత్ర పోషించాడు. ఇక ప్రొటీస్ జట్టు తరఫున 37 టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించి.. 23 మ్యాచ్‌లలో విజయాలు అందుకున్నాడు. చదవండి: Ind Vs Sl 2nd Test: అప్పుడు సెహ్వాగ్ .. ఇప్పుడు మయాంక్ అగర్వాల్.. తొమ్మిదేళ్ల తర్వాత! The Leader of the Pride is here! Captain of RCB, @faf1307! 🔥#PlayBold #RCBCaptain #RCBUnbox #ForOur12thMan #UnboxTheBold pic.twitter.com/UfmrHBrZcb — Royal Challengers Bangalore (@RCBTweets) March 12, 2022 -
ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్న ఆస్ట్రేలియా స్టార్ బౌలర్!
ఐపీఎల్-2022కు గాయం కారణంగా ఢిల్లీ క్యాపిటిల్స్ స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జే దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు ఢిల్లీ క్యాపిటిల్స్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. అయితే నోర్జే స్ధానంలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ఆండ్రూ టైను తీసుకోవాలని ఢిల్లీ క్యాపిటిల్స్ యాజమాన్యం భావిస్తోన్నట్లు సమాచారం. అతడితో పాటు ఆస్ట్రేలియా పేసర్ కేన్ రిచర్డ్సన్, భారత పేసర్ ఇషాంత్ శర్మ పేర్లు పరిశీలనలో ఉన్నప్పటకీ డిసీ యాజమాన్యం మాత్రం టై వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఐపీఎల్-2022 మెగా వేలంలో కోటి రూపాయల కనీస ధరతో పేరు నమోదు చేసుకున్నాడు. కానీ అతడి పట్ల ఏ ఫ్రాంఛైజీ కూడా ఆసక్తి చూపకపోవడంతో అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. కాగా ఇప్పటి వరకు ఐపీఎల్లో 27 మ్యాచ్‌లు ఆడిన టై.. 40 వికెట్ల పడగొట్టాడు. ఇక బిగ్‌బాష్ లీగ్‌లో కూడా టై అద్భుతంగా రాణించాడు. కాగా టై బాల్తోనే కాకుండా బ్యాట్‌తో కూడా రాణించగలడు. ఇక ఐపీల్-2022 మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. వాంఖడే వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనుంది. ఢిల్లీ క్యాపిటిల్స్ జట్టు: రిషబ్ పంత్, అక్షర్ పటేల్, పృథ్వీ షా, అన్రిచ్ నార్ట్జే, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, శార్దూల్ ఠాకూర్, ముస్తాఫిజుర్ రెహమాన్, కుల్దీప్ యాదవ్, అశ్విన్ హెబ్బార్, అభిషేక్ శర్మ, కమలేష్ నాగర్కోటి, కేఎస్ భరత్, మన్దీప్ సింగ్, ఖలీల్ సద్కావ్, చేతన్ యాడ్కావ్, చేతన్ యాహ్మద్ , రిపాల్ పటేల్, యష్ ధుల్, రోవ్‌మన్ పావెల్, ప్రవీణ్ దూబే, లుంగి ఎన్గిడి, విక్కీ ఓస్త్వాల్, సర్ఫరాజ్ ఖాన్ చదవండి: తన చివరి మ్యాచ్ గురించి ముందే చెప్పినా పట్టించుకున్న పాపాన పోలేదు.. శ్రీశాంత్ ఆవేదన -
'ధోని, కోహ్లి, రోహిత్ లాగే.. అతడొక అద్భుతమైన కెప్టెన్ అవుతాడు'
టీమిండియా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా తొలి సారి కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించబోతున్నాడు. ఐపీఎల్-2022లో కొత్త జట్టుగా అవతరించిన గుజరాత్ టైటాన్స్‌కు సారథిగా హార్ధిక్ పాండ్యా ఎంపికైన సంగతి తెలిసిందే. ఐపీఎల్ మెగా వేలానికి ముందు గుజరాత్ టైటాన్స్ రూ. 15 కోట్లకు పాండ్యాను కొనుగోలు చేసింది. పాండ్యాపై గుజరాత్ టైటాన్స్ క్రికెట్ డైరెక్టర్ విక్రమ్ సోలంకి ప్రశంసల వర్షం కురిపించాడు. విజయవంతమైన కెప్టెన్‌గా ఎదగడానికి అవసరమైన అన్ని లక్షణాలు పాండ్యాలో ఉన్నాయని సోలంకి అభిప్రాయపడ్డాడు. ఎంస్ ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి స్టార్ ఆటగాళ్లతో కలిసి ఆడిన అనుభవం పాండ్యాకు కలిసిస్తోందని అతడు తెలిపాడు. "హార్దిక్‌లో అతడిని విజయవంతమైన, అత్యుత్తమ కెప్టెన్‌గా మార్చగల లక్షణాలు మాకు సృష్టంగా కన్పిస్తున్నాయి. ఐపీఎల్ టైటిల్‌ను గెలవడానికి అతని ట్రాక్ రికార్డ్ గురించి మేము చాలా సార్లు మాట్లాడుకున్నాము. అతడు మా లీడర్ షిప్ గ్రూప్‌లో భాగమయ్యాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, ఎంస్ ధోని వంటి కెప్టెన్ల నుంచి అతడు చాలా నేర్చుకున్నాడు. ఆ ఆనుభవం అతడు కెప్టెన్‌గా ఎదగడంలో సహాయపడుతోంది" అని సోలంకి పేర్కొన్నాడు. ఇక గుజరాత్ టైటాన్స్ తమ తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్‌తో తలపడనుంది. ఐపీఎల్-2022 మార్చి 26న వాంఖడే వేదికగా ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనుంది. చదవండి: Shane Warne: చనిపోవడానికి 8 గంటల ముందు గిల్‌క్రిస్ట్‌కు మెసేజ్ చేసిన వార్న్.. ఏం చెప్పాడంటే -
ప్రేయసిని పెళ్లాడిన టీమిండియా యువ బౌలర్.. కాబోయే భార్యతో సందడి చేసిన చహర్
టీమిండియా లెగ్ స్పిన్నర్ రాహుల్ చహర్ వివాహ బంధంలో అడుగుపెట్టాడు. తన చిరకాల ప్రేయసి ఇషాని జోహార్‌ను పెళ్లాడాడు. గోవాలో బుధవారం వీరి పెళ్లి ఘనంగా జరిగింది. రాహుల్ కజిన్, టీమిండియా ఆటగాడు దీపక్ చహర్ కాబోయే భార్యతో కలిసి రాగా.. శివమ్ మావి వంటి ఇతర కొద్ది మంది సన్నిహితులు ఈ వేడుకకు హాజరయ్యారు. కాగా బెంగళూరుకు చెందిన ఇషాని ఫ్యాషన్ డిజైనర్. గత కొన్నేళ్లుగా ఆమెతో ప్రేమలో ఉన్న 22 ఏళ్ల రాహుల్ చహర్.. 2019లో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఎంగేజ్మెంట్ తర్వాత దాదాపు మూడేళ్లకు వీరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇక శనివారం ఈ జంట రిసెప్షన్ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. రాహుల్- ఇషాని మెహందీ, హల్దీ, పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక పెళ్లైన అనంతరం.. ‘‘ఎల్లప్పుడూ ఇలాగే సంతోషంగా’’ అంటూ మనసిచ్చిన నిచ్చెలిని భార్యగా చేసుకున్న రాహుల్ ఆమె చేతిని పట్టుకుని ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. కాగా రాజస్తాన్‌లో జన్మించిన రాహుల్ చహర్ 2021 టీమిండియా శ్రీలంక పర్యటన నేపథ్యంలో జట్టుకు ఎంపికై వన్డేల్లో అరంగేట్రంలో చేశాడు. ఆ సమయంలో ఆడిన ఏకైక వన్డేలో మూడు వికెట్లు పడగొట్టి తనను తాను నిరూపించుకున్నాడు. ఇక ఇప్పటి వరకు భారత్ తరఫున తరఫున 6 టీ20లు, ఓ వన్డే ఆడిన చహర్ మొత్తంగా 7 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలా ఉండగా... ఐపీఎల్లో పుణే, ముంబై జట్లకు అతడు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్ మెగా వేలం-2022లో భాగంగా పంజాబ్ కింగ్స్ జట్టు రాహుల్‌ను రూ. 5.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక పెళ్లి సందర్భంగా రాహుల్ దంపతులకు ఫ్రాంఛైజీ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేసింది. చదవండి: IPL 2022- CSK: సీఎస్కే అభిమానులకు గుడ్‌న్యూస్.. అతడు వచ్చేస్తున్నాడు! View this post on Instagram A post shared by Rahul Chahar (@rdchahar1) View this post on Instagram A post shared by Rahul Chahar (@rdchahar1) -
తొమ్మిదేళ్ల తర్వాత తొలి వికెట్ పడగొట్టాడు
-
దీపక్ చహర్ స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాళ్లు వీళ్లే!
-
IPL 2022: దీపక్ చహర్ స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాళ్లు వీళ్లే!
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బౌలర్ దీపక్ చహర్ గాయం కారణంగా జట్టుకు దూరం కానున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఐపీఎల్ మెగా వేలం-2022లో భాగంగా 14 కోట్ల రూపాయలు ఖర్చు చేసి చహర్‌ను సొంతం చేసుకున్న ఫ్రాంఛైజీకి భారీ షాక్ తగిలినట్లయింది. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న చహర్ సగం మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడన్న కథనాల నేపథ్యంలో సీఎస్కే ఫ్యాన్స్ సైతం ఉసూరుమంటున్నారు. తనదైన రోజున మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించగల స్టార్ దూరం అయితే పరిస్థితి ఏమిటని చర్చించుకుంటున్నారు. మరి చహర్ స్థానాన్ని భర్తీ చేయగల సత్తా ఉన్న ఆటగాళ్లు ఎవరో ఓ లుక్కేద్దామా! తుషార్ దేశ్‌పాండే ఐపీఎల్- 2020 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున క్యాష్ రిచ్‌లీగ్‌లో అడుగుపెట్టాడు ఈ ముంబై పేసర్. గత సీజన్లో సీఎస్కేకు నెట్ బౌలర్‌గా వ్యవహరించాడు. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బంతిని విసరగలడు. దేశవాళీ టోర్నీల్లో బ్యాటర్లకు చుక్కలు చూపించిన తుషార్.. డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. ఐపీఎల్లో ఇప్పటి వరకు మొత్తంగా ఐదు మ్యాచ్‌లు ఆడి 3 వికెట్లు పడగొట్టాడు. ఇక దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2021లో ముంబై తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా 26 ఏళ్ల తుషార్ నిలిచాడు. రాజ్వర్ధన్ హంగర్కర్ అండర్ 19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు రాజ్వర్ధన్ హంగర్కర్. మెగా వేలంలో భాగంగా చెన్నై 1.5 కోట్లు చెల్లించి అతడిని సొంతం చేసుకుంది. ఈ యువ ఫాస్ట్ బౌలర్ గంటకు 140 కి.మీ. వేగంతో బంతిని విసరగలడు. అంతేకాదు దీపక్ చహర్లాగే జట్టుకు అవసరమైన సమయంలో బ్యాట్ ఝులిపించగలడు కూడా! వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో మూడు వరుస సిక్సర్లు బాది సత్తా చాటాడు. కేఎమ్ ఆసిఫ్ 2018 నుంచి సీఎస్కే జట్టులో ఉన్నాడు ఆసిఫ్. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడాడు. కేరళకు చెందిన ఈ ఫాస్ట్ బౌలర్ తొలుత దుబాయ్‌లో జీవించేవాడు. ఓ షాప్‌లో స్టోర్‌కీపర్‌గా పనిచేశాడు. యూఏఈ జట్టులో స్థానం సంపాదించేందుకు చాలా కష్టపడ్డాడు. కానీ ఫలితం దక్కలేదు. 2018లో సీఎస్కే కొనుగోలు చేయడంతో ఐపీఎల్లో అడుగుపెట్టాడు. అదే ఏడాది ఢిల్లీతో మ్యాచ్‌కు దీపక్ చహర్ గాయం కారణంగా దూరం కావడంతో ఆసిఫ్ అతడి స్థానంలో తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. 2019-20 విజయ్ హజారే ట్రోఫీ టోర్నీలో ఏడు మ్యాచ్‌లలో 14 వికెట్లు పడగొట్టాడు. చదవండి: IPL 2022: ఐపీఎల్‌కు ముందు ఫ్రాంచైజీలకు ఊహించని షాకిచ్చిన బీసీసీఐ -
Ranji Trophy: 3.80 కోట్లు పలికిన ఆటగాడు 5 వికెట్లతో అదరగొట్టాడు.. కానీ అంతలోనే!
రంజీ ట్రోఫీలో భాగంగా విదర్భతో జరుగుతున్న మ్యాచ్‌లో అసోం ఆటగాడు రియాన్ పరాగ్ అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. 48 పరుగులతో రాణించడం సహా 5 వికెట్లు కూల్చి ఆల్‌రౌండ్ ప్రతిభతో అదరగొట్టాడు. వరుస విరామాల్లో వికెట్లు కూల్చి ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాడు. 25 ఓవర్లు బౌలింగ్ వేసిన అతడు 68 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. కొరకరాని కొయ్యగా తయారైన విదర్భ ఓపెనర్, కెప్టెన్ ఫాజల్(86)ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపిన రియాన్.. ఆ తర్వాత అథర్వ తైడే, సతీశ్, అక్షయ్‌ను వరుసగా పెవిలియన్‌కు చేర్చాడు. ఆదిత్య వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. రియాన్ దెబ్బతో విలవిల్లాడిన విదర్భ 85 ఓవర్లలో 271 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది. అంతకు ముందు టాస్ గెలిచిన విదర్భ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన అసోం 316 పరుగులకు ఆలౌట్ అయింది. అసోం బ్యాటర్లలో స్వరూప్ 113 పరుగులతో రాణించాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లో మాత్రం అసోంను కోలుకోలేని దెబ్బ కొట్టారు విదర్భ బౌలర్లు. రజనీశ్ 4, లలిత్ యాదవ్ 5 వికెట్లు కూల్చి సత్తా చాటారు. దీంతో 110 పరుగులకే అసోం జట్టు చాపచుట్టేసింది. ప్రస్తుతం ఓవరాల్‌గా 155 ఆధిక్యంలో ఉంది. కాగా ఐపీఎల్ మెగా వేలం-2022లో భాగంగా రియాన్ పరాగ్‌ను రాజస్తాన్ రాయల్స్ 3.80 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఎలైట్ గ్రూప్ జీ విదర్భ వర్సెస్ అసోం అసోం- తొలి ఇన్నింగ్స్ : 316-10 (92.1 ఓవర్లు) రెండో ఇన్నింగ్స్ : 110-10 (37.4 ఓవర్లు) విదర్భ- తొలి ఇన్నింగ్స్ : 271-10 (85 ఓవర్లు) చదవండి: IND vs SL: 35 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన జడేజా.. తొలి భారత ఆటగాడిగా! 2⃣5⃣-3⃣-6⃣8⃣-5⃣! 👌 👌 Sit back & relive @ParagRiyan's five-wicket haul for Assam against Vidarbha 🎥 🔽 #RanjiTrophy | #VIDvASM | @Paytm pic.twitter.com/PUR2uNAAPm — BCCI Domestic (@BCCIdomestic) March 5, 2022 -
చెన్నై సూపర్ కింగ్స్‌లోకి శ్రీశాంత్...!
ఐపీఎల్-2022కు గాయం కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బౌలర్ దీపక్ చాహర్ దూరమైన సంగతి తెలిసిందే. ఈక్రమంలో చాహర్ స్ధానాన్ని భర్తీ చేసేందుకు సీఎస్కే ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో సీఎస్కేకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. టీమిండియా వెటరన్ పేసర్ శ్రీశాంత్‌తో చాహర్ స్థానాన్ని భర్తీ చేయాలని చెన్నై భావిస్తోంది అన్నది ఆ వార్త సారాంశం. కాగా రూ.50 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో అమ్ముడుపోని ఆటగాడిగా శ్రీశాంత్ మిగిలిపోయాడు. ఇక 2013లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన శ్రీశాంత్‌పై స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. దీంతో బీసీసీఐ అతడిపై జీవిత కాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిషేధాన్ని సవాల్ చేస్తూ శ్రీశాంత్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సుప్రీంకోర్టు స్పందిస్తూ.. శిక్ష కాలాన్ని తగ్గించమని బీసీసీఐను ఆదేశించింది. దీంతో బీసీసీఐ అతడిపై నిషేధాన్ని ఏడు ఏళ్లకు కుదించింది. దీంతో 13 సెప్టెంబర్ 2020 నుంచి అతడిపై నిషేధం ఎత్తివేయబడింది. అనంతరం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయహాజారే టోర్నీ, రంజీ ట్రోఫీల్లో కేరళ తరపున శ్రీశాంత్ ఆడుతున్నాడు. రంజీట్రోఫీలో భాగంగా మేఘాలయతో జరిగిన మ్యాచ్‌లో 40 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు సాధించాడు. అంతే కాకుండా తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను ఇబ్బంది పెట్టే స్కిల్స్ శ్రీశాంత్‌కు ఉన్నాయి. అదే విధంగా పవర్‌ప్లేలో కూడా బౌలింగ్ చేసే సత్తా శ్రీశాంత్‌కు ఉంది. ఈ కారణాలతోనే చెన్నై శ్రీశాంత్‌పై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. చదవండి: IND vs SL: విరాట్ కోహ్లి అరుదైన రికార్డు.. ప్రపంచంలో రెండో ఆటగాడిగా! -
తొమ్మిదేళ్ల తర్వాత తొలి వికెట్ పడగొట్టాడు.. ఒక్కసారిగా ఏం చేశాడంటే..!
టీమిండియా వెటరన్ పేసర్ శ్రీశాంత్ తొమ్మిదేళ్ల తర్వాత రంజీ ట్రోఫీలో తన తొలి వికెట్‌ను సాధించాడు. రంజీట్రోఫీలో కేరళ జట్టుకు శ్రీశాంత్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. రంజీట్రోఫీలో భాగంగా కేరళ తమ తొలి మ్యాచ్‌లో మేఘాలయతో తలపడింది. ఈ మ్యాచ్‌లో మేఘాలయ ఇన్నింగ్స్ 40వ వేసిన శ్రీశాంత్ బౌలింగ్‌లో.. ఆర్యన్ బోరా వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆర్యన్ బోరా ఔట్ చేసిన శ్రీశాంత్ తన తొలి వికెట్ సాధించాడు. ఈ నేపథ్యంలో ఉద్వేగానికి లోనైనా శ్రీశాంత్.. పిచ్‌పై ఒక్క సారిగా సాష్టాంగ ప్రణామం చేశాడు. ఈ వీడియోను శ్రీశాంత్ ట్విటర్లో షేర్ చేశాడు. "తొమ్మిదేళ్ల తర్వాత నా తొలి వికెట్ సాధించాను. దేవుడు దయ వల్ల నేను ఇది సాధించగలిగాను" అని ట్విటర్లో శ్రీశాంత్ పేర్కొన్నాడు. కాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో తన 12 ఓవర్ల స్పెల్‌లో 40 పరుగులు ఇచ్చి 2 వికెట్లు సాధించాడు.రెండవ ఇన్నింగ్స్‌లో వికెట్లు ఏమీ పడగొట్టలేదు. ఇక 2013లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన శ్రీశాంత్‌పై స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. దీంతో బీసీసీఐ అతడిపై జీవిత కాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిషేధాన్ని సవాల్ చేస్తూ శ్రీశాంత్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సుప్రీంకోర్టు స్పందిస్తూ.. శిక్ష కాలాన్ని తగ్గించమని బీసీసీఐను ఆదేశించింది. దీంతో బీసీసీఐ అతడిపై నిషేధాన్ని ఏడు ఏళ్లకు కుదించింది. దీంతో 13 సెప్టెంబర్ 2020 నుంచి అతడిపై నిషేధం ఎత్తివేయబడింది. అయితే ఐపీఎల్-2022 మెగా వేలంలో తన పేరును రిజిస్టర్ చేసుకున్న శ్రీశాంత్‌ను ఏ ఫ్రాంచైజీ కూడాకొనుగొలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. చదవండి: 'ప్రపంచకప్ టైటిల్‌తో నా కెరీర్‌ను ముగించాలి అనుకుంటున్నా' Now that’s my 1st wicket after 9 long years..gods grace I was just over joyed and giving my Pranaam to the wicket ..❤️❤️❤️❤️❤️❤️❤️ #grateful #cricket #ketalacricket #bcci #india #Priceless pic.twitter.com/53JkZVUhoG — Sreesanth (@sreesanth36) March 2, 2022 -
'ధావన్‌తో ఓపెనింగ్ చేసే అవకాశం రావడం నా అదృష్టం'
ఐపీఎల్-2022 సీజన్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా మయాంక్ అగర్వాల్ ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ క్యాచ్ రిచ్ లీగ్ ఆరంభానికి ముందు అగర్వాల్ తన మనసులోని మాటను బయట పెట్టాడు. ఈ సీజన్లో శిఖర్ ధావన్‌తో కలిసి ఓపెనింగ్ చేయడానికి ఉత్సాహంగా ఉన్నానని మయాంక్ తెలిపాడు. ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు అగర్వాల్‌ను పంజాబ్ రీటైన్ చేసుకోగా.. ధావన్‌ను వేలంలో రూ. 8.2 కోట్లకు కొనుగోలు చేసింది. "పంజాబ్ జట్టులో చాలా మంది స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. ముఖ్యంగా శిఖర్ ధావన్ లాంటి అద్భుతమైన ఆటగాడితో ఓపెనింగ్ చేసే అవకాశం రావడం నా ఆదృష్టం. ఇక ఈ సీజన్లో అండర్-19 ప్రపంచకప్ హీరో రాజ్ బావాను సొంతం చేసుకున్నాము. అతడికి ఇది తొలి సీజన్ కావడంతో చాలా ఉత్సాహంగా ఉన్నాడు. అదే విధంగా అతడితో ఆడటానికి నేను ఎదురు చూస్తున్నాను. ఈ ఇద్దరే కాదు.. అందరి ఆటగాళ్లతో ఆడటానికి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను" అని ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మయాంక్ పేర్కొన్నాడు. ఇక ఐపీఎల్ మెగా వేలానికి ముందు మయాంక్‌ను రూ.12 కోట్లకు పంజాబ్ రీటైన్ చేసుకుంది. ఐపీఎల్లో 100 మ్యాచ్‌లు ఆడిన అగర్వాల్ 2135 పరుగులు సాధించాడు. ఇక గతేడాది సీజన్లో కూడా మయాంక్ అద్భుతంగా రాణించాడు. గత సీజన్లో 12 మ్యాచ్‌లు ఆడిన అతడు 441 పరుగులు చేశాడు. ఐపీఎల్-2022 మార్చి 26న ప్రారంభం కానుంది. చదవండి: Icc women's world cup 2022: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.. అదరగొట్టిన మంధాన -
IPL 2022- Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్సీ వదులుకోవడానికి అసలు కారణమిదే: కోహ్లి
-
IPL 2022: విజయవంతమైన వేలం.. సగం పని పూర్తైంది.. ఇక టైటిల్ గెలవడమే లక్ష్యం!
IPL 2022 Mega Auction- Punjab Kings: ఐపీఎల్ ఫ్రాంఛైజీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. పంజాబ్ కింగ్స్‌గా మారింది.. కెప్టెన్లను కూడా మార్చింది. పేరు మార్చినా.. కెప్టెన్లను మార్చినా రాతను మాత్రం మార్చుకోలేకపోయింది. కీలక మ్యాచ్‌లలో ఆఖరిదాకా పోరాడటం.. తీరా సమయానికి చేతులెత్తేయడం.. వెరసి ఇంత వరకు ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవలేదన్న లోటు అలాగే ఉండిపోయింది. అయితే, ఈసారి ఆ బెంగ తీరిపోతుందని పంజాబ్ కింగ్స్ సహ యజమాని నెస్ వాడియా ఆశాభావం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ మెగా వేలం- 2022లో సరైన ఆటగాళ్లను ఎంపిక చేసుకుని సగం పని పూర్తిచేశామని పేర్కొన్నాడు. కాగా బెంగళూరు వేదికగా జరిగిన మెగా వేలంలో భాగంగా పంజాబ్.. ఇంగ్లండ్ ఆల్ రౌండర్ లియామ్ లివింగ్ స్టోన్‌ను అత్యధిక ధర(రూ. 11.50 కోట్లు)కు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా రబడ, శిఖర్ ధావన్‌ను వంటి స్టార్ ఆటగాళ్లను సొంతం చేసుకుంది. ప్రస్తుతం జట్టులో మొత్తంగా 25 మంది ప్లేయర్లు ఉన్నారు. వీరిలో భారత క్రికెటర్లు 18 మంది కాగా, విదేశీ ఆటగాళ్లు ఏడుగురు. వీరి కోసం ఫ్రాంఛైజీ తమ పర్సు నుంచి రూ. 86 కోట్ల 55 లక్షలు ఖర్చు చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో నెస్ వాడియా జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ట్రోఫీ సాధించాలంటే సరైన ఆటగాళ్లను ఎంపిక చేసుకోవడం అవసరం. మంచి జట్టు దొరికితే సగం గెలిచినట్లే. మేము చేసింది అదే! ఇప్పుడు భారమంతా ఆటగాళ్లు, కోచ్‌లు అనిల్ కుంబ్లే, జాంటీ రోడ్స్, డెమిన్ మీదనే ఉంది. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న టైటిల్ అందిస్తారని భావిస్తున్నాం. లేదంటే కనీసం టాప్-4లోనైనా నిలబెట్టాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే గత నాలుగైదేళ్లుగా మా ప్రదర్శన అస్సలు బాగాలేదు. దానిని అధిగమించాలనుకుంటున్నాం. ఇప్పుడు మా జట్టు సమతుల్యంగా ఉంది. మంచి బ్యాటర్లు, బౌలర్లను ఎంచుకున్నాం. నాకు తెలిసి 2008 తర్వాత మేము ఎదుర్కొన్న అత్యంత కఠినమైన, విజయవంతమైన ఐపీఎల్ వేలం ఇదే’’ అని నెస్ వాడియా చెప్పుకొచ్చాడు. కాగా కేఎల్ రాహుల్ జట్టును వీడటంతో పంజాబ్ ఇప్పుడు కెప్టెన్ ఎంపిక అంశంలో బిజీగా ఉంది. సీనియర్ శిఖర్ ధావన్ లేదంటే, మయాంక్ అగర్వాల్‌కు సారథ్య బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉందని తెలుస్తోంది. పంజాబ్ కింగ్స్ జట్టు మయాంక్ అగర్వాల్, లివింగ్‌స్టోన్, రబడ, షారుఖ్ ఖాన్, ధావన్, బెయిర్‌స్టో, ఒడియన్ స్మిత్, రాహుల్ చహర్, అర్శ్‌దీప్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, రాజ్ బావా, వైభవ్ అరోరా, నాథన్ ఎలిస్, ప్రభ్‌సిమ్రన్, రిషి ధావన్, భనుక రాజపక్స, సందీప్ శర్మ, బెన్ని హోవెల్, ఇషాన్ పొరెల్, ప్రేరక్ మన్కడ్, జితేశ్ శర్మ, బల్తేజ్ సింగ్, రితిక్ ఛటర్జీ, అథర్వ తైడ్, అన్శ్ పటేల్. చదవండి: IPL 2022- MS Dhoni: ఆ మ్యాచ్‌లు అన్నీ మహారాష్ట్రలోనే... ధోని మాస్టర్ ప్లాన్.. ముంబైని కొట్టాలిగా మరి! -
IPL 2022: ఆ మ్యాచ్‌లు అన్నీ మహారాష్ట్రలోనే.. ధోని మాస్టర్ ప్లాన్.. మామూలుగా లేదు!
IPL 2022- CSK- MS Dhoni: టీమిండియా అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడైన ఎంఎస్ ధోనికి ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ బెస్ట్ రికార్డు ఉందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాను సారథ్యం వహిస్తున్న చెన్నై సూపర్‌కింగ్స్‌ను ఇప్పటికే నాలుగుసార్లు విజేతగా నిలిపిన ఘనత అతడిది. డాడీస్ గ్యాంగ్ యువకులతో పోటీ పడగలదా అంటూ హేళన చేసిన వాళ్లకు విజయాలతోనే సమాధానమిచ్చాడు ఈ జార్ఖండ్ డైనమైట్. వేలం మొదలు, ఆటగాళ్ల ఎంపిక, జట్టు కూర్పు.. ఇలా ప్రతి అంశంలోనూ కీలకంగా వ్యవహరించే ధోని తన మాస్టర్ మైండ్‌తో చెన్నైని మేటి జట్టుగా నిలిపాడు. కాగా ఐపీఎల్-2022 మెగా వేలంలోనూ ధోని తన మార్కు చూపించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. మార్చి 26 నుంచి ఐపీఎల్ 15వ ఎడిషన్ ఆరంభం కానున్న వేళ బీసీసీఐ వేదికలను ఖరారు చేసింది. మహారాష్ట్రలోనే ఎక్కువ మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఇక టైటిల్స్ పరంగా చెన్నై కంటే ఒక అడుగు ముందున్న ముంబై ఇండియన్స్ జట్టుకు అన్ని మ్యాచ్‌లు ‘సొంత రాష్ట్రం’లోనే ఆడటం కలిసి వస్తుందనే భావన ఉంది. ఈ నేపథ్యంలో ధోని వ్యూహాత్మకంగా పావులు కదిపిన తీరు విశ్లేషకులను, అభిమానులను ఆకట్టుకుంటోంది. సీజన్ ఆరంభానికి ముందు చెన్నై జట్టు 20 రోజుల పాటు ట్రెయినింగ్ నిమిత్తం క్యాంపునకు వెళ్లనుంది. సాధారణంగా చెన్నైలోని ఈ శిక్షణ ఉండాల్సింది. అయితే, మ్యాచ్‌లన్నీ మహారాష్ట్రలో జరుగనున్న వేళ్ల శిబిరాన్ని సూరత్‌కు తరలించిందట చెన్నై ఫ్రాంఛైజీ. ధోని సలహాతో జట్టు మొత్తం గుజరాత్‌లోని సూరత్‌కు చేరుకోనున్నారట. సూరత్‌కే ఎందుకు? సూరత్‌లోని లాల్‌భాయి కాంట్రాక్టర్ స్టేడియంను ఇటీవలే నిర్మించారు. ఇక్కడి పిచ్‌ల ముంబై మాదిరి పిచ్‌లనే పోలి ఉంటాయట. ఈ విషయం తెలుసుకున్న ధోని, సీఎస్కే వెంటనే తమ క్యాంపును సూరత్‌కు తరలించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సూరత్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి నైనేశ్ దేశాయి టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ... ‘‘ఎంఎస్ ధోని, డ్వేన్‌బ్రావో, రవీంద్ర జడేజా వంటి జాతీయ, అంతర్జాతీయ క్రికెట్ స్టార్లు ప్రాక్టీసు కోసం సూరత్‌కు రానున్నారు. ఇక్కడి మట్టి ముంబై మట్టిని పోలి ఉంటుంది. అందుకే దీనిని వాళ్లు సెలక్ట్ చేసుకున్నారు’’ అని తెలిపారు. కాగా మార్చి 2 నుంచి సీఎస్కే ప్రాక్టీసు మొదలు కానుంది. గత సీజన్లో చాంపియన్‌గా నిలిచిన ధోని సేన టైటిల్‌ను నిలబెట్టుకునే వ్యూహాలతో ముందుకు సాగుతోంది. ఐపీఎల్-2022- చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు ఇదే! రవీంద్ర జడేజా : రూ. 16 కోట్లు దీపక్ చహర్: రూ. 14 కోట్లు ధోని : రూ. 12 కోట్లు మొయిన్ అలీ : రూ. 8 కోట్లు అంబటి రాయుడు: రూ. 6 కోట్ల 75 లక్షలు రుతురాజ్ గైక్వాడ్ : రూ. 6 కోట్లు బ్రేవో: రూ. 4 కోట్ల 40 లక్షలు శివమ్ దూబే : రూ. 4 కోట్లు క్రిస్ జోర్డాన్ : రూ. 3 కోట్ల 60 లక్షలు రాబిన్ ఉతప్ప : రూ. 2 కోట్లు ఆడమ్ మిల్నే: రూ. 1 కోటి 90 లక్షలు సాన్‌ట్నర్ : రూ. 1 కోటి 90 లక్షలు రాజ్వర్ధన్ హంగార్గెకర్: రూ. 1 కోటి 50 లక్షలు ప్రశాంత్ సోలంకి : రూ. 1 కోటి 20 లక్షలు డెవాన్ కాన్వే : రూ. 1 కోటి మహీశ్ తీక్షన : రూ. 70 లక్షలు డ్వేన్ ప్రిటోరియస్ : రూ. 50 లక్షలు భగత్ వర్మ : రూ. 20 లక్షలు ఆసిఫ్: రూ. 20 లక్షలు తుషార్ దేశ్‌పాండే: రూ. 20 లక్షలు జగదీశన్ : రూ. 20 లక్షలు హరి నిశాంత్ : రూ. 20 లక్షలు సుభ్రాన్షు సేనాపతి : రూ. 20 లక్షలు ముఖేశ్ చౌదరి: రూ. 20 లక్షలు సిమర్జీత్ సింగ్ : రూ. 20 లక్షలు చదవండి: బౌలింగ్‌లో దుమ్మురేపాడు.. రాజస్తాన్ రాయల్స్ పంట పండినట్లే Ruturaj Gaikwad: యువ క్రికెటర్‌ను వెంటాడిన దురదృష్టం.. లంకతో టి20 సిరీస్‌కు దూరం -
IPL 2022: ఆర్సీబీ కెప్టెన్సీ వదులుకోవడానికి అసలు కారణమిదే: కోహ్లి
IPL 2022 Auction- Virat Kohli: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు... ఫ్యాన్ బేస్.. బ్రాండ్ వాల్యూ ఎక్కువే. కానీ ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదన్న లోటు మాత్రం అలాగే ఉండిపోయింది. టీమిండియా విజయవంతమైన కెప్టెన్‌గా పేరున్న విరాట్ కోహ్లి సారథిగా ఉన్నా ఒక్కసారి కప్ సాధించలేకపోయింది. ఇక ఐపీఎల్-2021 సీజన్‌తో కోహ్లి ఆర్సీబీ సారథ్యానికి గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇందుకు గల కారణాలను ఆర్సీబీ పాడ్‌కాస్ట్‌లో మరోసారి ప్రస్తావించాడు కోహ్లి. ఈ మేరకు అతడు మాట్లాడుతూ... ‘‘నేను చేయగలిగిన దానికంటే ఎక్కువే చేయగలనని తెలిసినా కొన్నిసార్లు నేను బాధ్యతను తలకెత్తుకోను. ఒకవేళ చేయాల్సి వచ్చినా మనస్ఫూర్తిగా చేయలేను. మనం కొన్ని నిర్ణయాలు తీసుకున్నపుడు షాక్‌కు గురయ్యాం అని అంటూ ఉంటారు కొంతమంది! అయితే, మన స్థానంలో ఉండి ఆలోచించినపుడే వాళ్లకు అసలు విషయం అర్థమవుతుంది. అది తెలుసుకోలేక కొంతమంది.. ‘‘అయ్యో ఇదెలా జరిగింది? మేము ఆశ్చర్యపోయాం’’అని అంటూ ఉంటారు. నిజానికి అందులో షాకవ్వాల్సింది ఏమీ లేదు. నాకు కొంచెం విశ్రాంతి కావాలి. వర్క్‌లోడ్ తగ్గించుకునే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నా. అదే విషయాన్ని అందరికీ తెలిసేలా ప్రకటన చేశాను’’ అని పునరుద్ఘాటించాడు. క్వాంటిటీతో పాటు తనకు క్వాలిటీ కూడా ముఖ్యమని స్పష్టం చేశాడు. అందుకే ఏదో ఒక బాధ్యతనైనా సక్రమంగా నెరవేర్చాలనుకుంటున్నానని కోహ్లి పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్ మెగా వేలం-2022లో భాగంగా 7 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన దక్షిణాఫ్రికా స్టార్ ఫాఫ్ డుప్లెసిస్ ఆర్సీబీ కొత్త కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చదవండి: IPL 2022: ఐపీఎల్‌కు దూరం కానున్న స్టార్ ఆల్‌రౌండర్.. రూ. 14 కోట్లు వ్యర్థమేనా! IPL 2022 Auction: డబ్బు లేదు.. విరిగిన బ్యాట్‌కు టేప్ వేసి ఆడేవాడిని.. అందుకే బోరున ఏడ్చేశారు: తిలక్ వర్మ కాగా ఆర్సీబీ పాడ్‌కాస్ట్‌లో గ్లెన్ మాక్స్వెల్, మాజీ ప్లేయర్ ఏబీ డివిల్లియర్స్ వంటి ఇతర స్టార్లు కూడా మాట్లాడారు. Maxi tells us stories about starting off as a medium pace bowler, the Big Show tag, and many more anecdotes on The #RCBPodcast powered by @KotakBankLtd. Catch the full episodes on @spotifyindia, @gaana, @ApplePodcasts and @AmazonMusicINhttps://t.co/bixXHIUKAq#PlayBold pic.twitter.com/7ppLgTrcpH — Royal Challengers Bangalore (@RCBTweets) February 24, 2022 -
IPL 2022: డబ్బు లేదు.. విరిగిన బ్యాట్‌కు టేప్ వేసి ఆడేవాడిని.. ఇప్పుడు 1.7 కోట్లు!
IPL 2022 Auction- Tilak Varma: ఐపీఎల్ మెగా వేలం-2022లో ముంబై ఇండియన్స్ జట్టు తనను కొనుగోలు చేసిందని తెలియగానే తన కోచ్ సంతోషంతో ఉప్పొంగిపోయారని హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ అన్నాడు. ఆనందం పట్టలేక ఒక్కసారిగా బోరున ఏడ్చేశారని ఆనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. ఇక తన తల్లిదండ్రులైతే ఫోన్లో ఎక్కువ సేపు మాట్లాడలేకపోయారన్నాడు. కాగా సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన తిలక్ వర్మ తండ్రి నాగరాజు, కోచ్ సాలమ్ బయాష్ ప్రోత్సాహంతో క్రికెటర్‌గా ఎదిగాడు. యువ భారత జట్టులో 19 ఏళ్ల సభ్యుడైన అతడు.. ఇటీవల ముగిసిన దేశవాళీ వన్డే టోర్నీలో విజయ్ హజారే ట్రోఫీలో 180 పరుగులు చేశాడు. అదే విధంగా.. టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 215 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో ఐపీఎల్ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించాడు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరులో జరిగిన మెగా వేలంలో భాగంగా ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ తిలక్ వర్మ కోసం పోటీపడింది. ఆఖరికి కోటీ డెబ్బై లక్షలకు అతడిని కొనుగోలు చేయడంతో తిలక్ వర్మకు జాక్‌పాట్ దక్కింది. ఇక ఐపీఎల్-2022 సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రమోషన్లలో భాగంగా తిలక్ వర్మ ఫ్రాంఛైజీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోచ్‌తో తన అనుబంధం గురించి చెప్పుకొచ్చాడు. ‘‘వేలం జరుగుతున్నపుడు నేను మా కోచ్‌తో వీడియో కాల్ మాట్లాడుతున్నాను. నన్ను ముంబై 1.7 కోట్లకు కొనుగోలు చేసిందని తెలియగానే.. మా కోచ్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆయన తన స్నేహితులతో కలిసి ఓ గదిలో ఉన్నారు. వారితో మాట్లాడుతూ ఒక్కసారిగా ఏడ్చేశారు. మేము పడ్డ కష్టం గుర్తుకు వచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. ఆ తర్వాత నేను మా అమ్మానాన్నకు ఫోన్ చేశాను. వాళ్లు ఆనందంతో మాట్లాడలేకపోయారు. వారి కళ్ల వెంట నీళ్లు దుమికాయి. నా కష్టానికి ప్రతిఫలం దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. నిజానికి టెన్నిస్ బాల్‌తో నా క్రికెట్ ఆట మొదలైంది. ఆ సమయంలో నన్ను చూసిన మా కోచ్.. ఈ పిల్లాడు బంతిని భలే బాదుతున్నాడే అంటూ ముచ్చటపడ్డారు. నాకు కోచ్ అయ్యారు. ఎంతో జాగ్రత్తగా చూసుకునేవారు. నాకు శిక్షణనిస్తే మంచి క్రికెటర్‌గా ఎదుగుతానని ఆయన నమ్మారు. మా తల్లిదండ్రులతో మాట్లాడారు. నన్ను కోచింగ్ సెంటర్లో జాయిన్ చేయమని కోరారు. అందుకు మా అమ్మానాన్న అంగీకరించారు. కానీ ఆర్థిక కష్టాలు వెంటాడాయి. బ్యాట్లు, ప్యాడ్స్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు. అప్పుడు మా కోచ్ ఆయన స్నేహితుడి సాయంతో బ్యాట్ కొనిచ్చారు. అండర్ 14 క్రికెట్ ఆడుతున్నపుడు ఒకే ఒక్క బ్యాట్ ఉండేది. అది మెల్లగా విరిగిపోవడం మొదలైంది. అప్పుడు టేప్‌తో అతికించి దానిని వాడుకునేవాడిని. నాకోసం నా కోచ్ ఎంతో చేశారు’’ అంటూ కష్టాల్లో అండగా నిలబడ్డ గురువు పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. "When I was sold to MI, my coach had tears in his eyes!" 🥺 📽️ : The young gun Tilak Varma expresses how emotional his coach and parents were after the Auction! 🙌 Read his exclusive interview 👉 https://t.co/FQ5AfsWdTw #OneFamily #MumbaiIndians pic.twitter.com/hytPLZGKfU — Mumbai Indians (@mipaltan) February 24, 2022 -
Ishan Kishan: అప్పుడు నా గుండె జారినంత పనైంది.. కానీ ఆఖరికి...
IPL 2022 Auction: ఐపీఎల్-2022 మెగా వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా ఇషాన్ కిషన్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. రిటెన్షన్‌లో భాగంగా ఇషాన్‌ను వదిలేసిన ముంబై ఇండియన్స్ వేలంలో మాత్రం ఏకంగా 15.25 కోట్లు ఖర్చు చేసి అతడిని సొంతం చేసుకుంది. మిగతా జట్లతో పోటీ పడి మరీ ఇషాన్‌ను దక్కించుకుంది. ఈ క్రమంలో క్యాష్ రిచ్ లీగ్ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన రెండో భారత ఆటగాడియా అతడు రికార్డు నెలకొల్పాడు. ఈ విషయం గురించి ఇషాన్ కిషన్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. వేలం జరుగుతున్న వేళ తన మనసులో చెలరేగిన అలజడి గురించి చెప్పుకొచ్చాడు. ‘‘ముంబై కచ్చితంగా నన్ను కొనుగోలు చేస్తుందని తెలుసు. ఆ విషయంలో నాకు అస్సలు సందేహం లేదు. అయితే, ధర పెరుగుతున్న కొద్దీ నాలో ఆందోళన మొదలైంది. మంచి జట్టును తీర్చిదిద్దుకోవాలంటే ముంబై డబ్బు వృథా చేయకుండా ఉండాలి. కానీ నా కోసం ఇతర జట్లు పోటీ పడటంతో ఒక్కసారిగా ధర పెరిగిపోయింది. ఆ సమయంలో నా గుండె జారినంత పనైంది’’ అని పేర్కొన్నాడు. ఇక ముంబై తనను కొనుగోలు చేయడం వెనుక కారణం గురించి చెబుతూ... ‘‘వాళ్లకు నా గురించి, నా ఆట గురించి తెలుసు. నా ఫ్రాంఛైజీ ఎలా పనిచేస్తుందో నాకు తెలుసు. ఎందుకంటే నేనూ ఆ కుటుంబంలో ఓ సభ్యుడినే. నాకు బయటకు వెళ్లడం ఏమాత్రం ఇష్టం లేదు. నాలుగేళ్లుగా ఈ జట్టులోని సభ్యులతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. మేము ట్రోఫీలు గెలిచాం. ఒకరికోసం ఒకరం నిలబడ్డాం. అందుకే వేరే జట్టుకు వెళ్లాలంటే నా మనసు అంగీకరించదు. అదృష్టవశాత్తూ నా జట్టులోకి తిరిగి వచ్చేశాను’’ అని ఇషాన్ కిషన్ ఆనందం వ్యక్తం చేశాడు. చదవండి: IPL 2022 Auction: ముంబై ఇండియన్స్ జట్టును చూసేద్దాం.. IPL 2022: బీసీసీఐకి స్పెషల్ రిక్వెస్ట్ పెట్టుకున్న సురేశ్ రైనా 𝐓𝐡𝐞 𝐏𝐨𝐜𝐤𝐞𝐭 𝐃𝐲𝐧𝐚𝐦𝐨 shares a message for the Paltan after coming ℍ𝕆𝕄𝔼 💙#AalaRe #MumbaiIndians #AalaRe #IPLAuction @ishankishan51 pic.twitter.com/Q9QcTQ34gL — Mumbai Indians (@mipaltan) February 12, 2022 -
IPL 2022: వేలంలో ఎవరూ కొనలేదు.. కనీసం విదేశీ లీగ్‌లు ఆడే అనుమతైనా ఇవ్వండి..!
Suresh Raina: ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2022 మెగా వేలంలో టీమిండియా మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్ సురేశ్ రైనాను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి కనబర్చని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు ఓ స్పెషల్ రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. ఐపీఎల్లో ఆడే అవకాశం దక్కని భారత ఆటగాళ్లకు ఇతర దేశాల క్రికెట్ లీగ్స్‌లో ఆడే అనుమతి ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశాడు. Please @ImRo45 consider #SureshRaina for #MumbaiIndians team.🙏🇮🇳💙💙#Boycott_ChennaiSuperKings pic.twitter.com/yiCiZX0gbc — Jyoti Suman (@Jas23478675) February 15, 2022 బీసీసీఐ నిబంధనల ప్రకారం బోర్డు కాంట్రాక్టు కలిగిన పురుష క్రికెటర్లు బిగ్ బాష్ లీగ్(బీబీఎల్), కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) వంటి వీదేశీ లీగ్స్ ఆడేందుకు అనుమతి లేదు. భారత్‌లో అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్లకు గుడ్ బై చెబితేనే ఇతర దేశాల లీగ్‌లు ఆడే అనుమతి వారికి లభిస్తుంది. టీమిండియా మాజీ కెప్టెన్ ధోనితో పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రైనా.. ఐపీఎల్‌తో పాటు దేశవాళీ టోర్నీలు ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే అతనికి విదేశీ లీగ్‌లు ఆడే అవకాశం లేకుండా పోయింది. గతంలోనూ రైనా ఇదే తరహా వాదన వినిపించినప్పటికీ బీసీసీఐ అతని వాదనను కొట్టిపారేసింది. తాజాగా, భారత క్రికెటర్లు విదేశీ లీగ్‌లు ఆడే అనుమతివ్వాలంటూ రైనా మరోసారి గళం విప్పాడు. రైనా.. విదేశీ లీగ్‌ల్లో ఆడేందుకు బీసీసీఐని అభ్యర్ధిస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. ఇదిలా ఉంటే, రూ.2 కోట్ల కనీస ధరతో ఐపీఎల్ 2022 మెగా వేలం బరిలో నిలిచిన రైనాను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయకపోవడంతో అమ్మడుపోని ఆటగాడిగా మిగిలిపోయాడు. మిస్టర్ ఐపీఎల్‌గా పేరొందిన రైనా తన ఐపీఎల్ కెరీర్లో 205 మ్యాచ్‌లు ఆడి 30కి పైగా సగటుతో 5528 పరుగులు చేశాడు. చదవండి: IPL 2022 Auction: రైనా.. ధోని నమ్మకాన్ని కోల్పోయాడు, అందుకే ఈ పరిస్థితి..! -
ఐపీఎల్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ఎప్పటి నుంచి అంటే!
ఐపీఎల్-2022 మెగా వేలం పక్రియ ఇప్పటికే పూర్తి అయింది. మొత్తం 10 ఫ్రాంచైజీలు ఆటగాళ్లను కోట్లు వెచ్చించి కొనుగోలు చేశాయి. మరో వైపు ఈ లక్నో, అహ్మదాబాద్ రూపంలో కొత్త జట్లు రావడంతో ఈ ఏడాది సీజన్ మరింత రసవత్తరంగా జరగనుంది. ఇక ఐపీఎల్-2022 షెడ్యూల్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదరు చూస్తున్నారు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మార్చి 27 నుంచి ప్రారంభం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ త్వరలోనే విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ ఏడాది అన్ని ఐపీఎల్ మ్యాచ్‌లు అహ్మదాబాద్, ముంబై, పూణేలోని 6 స్టేడియాల్లో జరిగే అవకాశం ఉంది. మ్యాచ్‌లు మహరాష్ట్రలోని వాంఖడే, బ్రబౌర్న్, డాక్టర్ డివై పాటిల్, రిలయన్స్ జియో స్టేడియాల్లో జరిగే ఛాన్స్ ఉంది. కాగా ఇప్పటికే ఈ స్టేడియాలను ముంబై క్రికెట్ ఆసోసియేషన్ సిద్దం చేసినట్లు వినికిడి. అదే విధంగా ఒక వేళ మార్చి 26న టోర్నీ ప్రారంభమైతే.. ప్రసారం చేయడానికి బ్రాడ్‌కాస్టర్ డిస్నీ స్టార్ సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: Yash Dhull: చరిత్ర సృష్టించిన యష్ ధుల్... 8 ఏళ్లలో ఒకే ఒక్కడు! -
సన్‌రైజర్స్‌కు కొత్త కోచ్ వచ్చేశాడు.. ఎవరీ హెల్మోట్!
ఐపీఎల్-2022 సీజన్ ఆరంభానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ అసిస్టెంట్ కోచ్ బాధ్యతలనుంచి సైమన్ కటిచ్ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కటిచ్ స్ధానంలో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు సైమన్ హెల్మోట్ను ఆ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా సన్ రైజర్స్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. సైమన్ హెల్మోట్ సన్‌రైజర్స్ హైదరాబాద్ అసిస్టెంట్ కోచ్‌గా ఎంపిక అయినట్లు సమాచారం. కాగా 2012 నుంచి 2019 వరకు సన్‌రైజర్స్ కోచింగ్ స్టాప్‌లో సైమన్ హెల్మోట్ బాగమై ఉన్నాడు. అదే విధంగా బిగ్ బాష్ లీగ్‌లో మెల్బోర్న్ రెనెగేడ్స్ జట్టుకు కోచ్‌గా కూడా హెల్మోట్ పనిచేశాడు. ఐపీఎల్-2022లో సన్‌రైజర్స్ హెడ్ కోచ్ టామ్ మూడీతో కలిసి హెల్మోట్ పని చేయనున్నాడు. ఈ సీజన్లో సన్‌రైజర్స్ జట్టుకు హెడ్‌కోచ్‌గా టామ్ మూడీ, ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా డేల్ స్టెయిన్, స్పిన్ బౌలింగ్ కోచ్‌గా ముత్తయ్య మురళీధరన్, ఫీల్డింగ్ కోచ్, స్కౌట్‌గా హేమంగ్ బదాని వ్యవహరించనున్నారు. కాగా ఐపీఎల్ మెగా వేలం-2022లో హైదరాబాద్ ఫ్రాంఛైజీ అనుసరించిన వ్యూహాలు నచ్చకే సైమన్ కటిచ్ రాజీనామా చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: ఇక భారత జట్టులోకి కష్టమే.. తీరు మారని పుజారా! -
IPL 2022 Auction: వేలంలో 1.5 కోట్లు.. సీఎస్కే యువ ఆటగాడిపై సంచలన ఆరోపణలు
U 19 WC Star CSK Young Player Accused Of Age Fraud: అండర్ 19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రాజ్వర్ధన్ హంగర్కర్పై సంచలన ఆరోపణలు వచ్చాయి. వయసును తక్కువగా చూపించి అతడు మోసానికి పాల్పడ్డాంటూ మహారాష్ట్ర క్రీడా, యువజన విభాగం కమిషనర్ ఓం ప్రకాశ్ బకోరియా ఆరోపించారు. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలికి లేఖ రాసినట్లు స్థానిక సామ్నా పత్రిక కథనం వెలువరించింది. కాగా ఇటీవల వెస్టిండీస్ వేదికగా జరిగిన అండర్ 19 వరల్డ్‌కప్‌ను యశ్ ధుల్ సారథ్యంలోని భారత జట్టు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో రాజ్వర్ధన్ హంగర్కర్ సభ్యుడిగా ఉన్నాడు. ఇక ప్రపంచకప్ టోర్నీలో మెరుగ్గా రాణించిన నేపథ్యంలో పలువురు అండర్ 19 ఆటగాళ్లు ఐపీఎల్ మెగా వేలం-2022లో మంచి ధర పలికిన సంగతి తెలిసిందే. ఆక్షన్‌లో భాగంగా మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని నేతృత్వంలోని చెన్నై ఫ్రాంఛైజీ 1.5 కోట్లు వెచ్చించి రాజ్‌వర్ధన్‌ను కొనుగోలు చేసింది. గంటకు 140 కి.మీ. వేగంతో బంతిని విసరగల ఈ యువ ఫాస్ట్ బౌలర్‌ను తమ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఓం ప్రకాశ్ రాజ్వర్ధన్పై చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. ‘‘ధారాశివ్ సీఈఓ రాహుల్ గుప్తా రాజవర్ధన్ హంగర్కర్ పుట్టిన తేదీ వివరాల గురించి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ధారాశివ్ పబ్లిక్ స్కూల్లో ఉన్న వివరాల ప్రకారం అతడు 2001 జనవరి 10న జన్మించినట్లు రాశారు. అయితే, అతడు ఎనిమిదో తరగతి చదువుతున్నపుడు దీనిని 2002 నవంబరు 10గా మార్చినట్లు ఉంది’’ అని ఓం ప్రకాశ్ తన లేఖలో బీసీసీఐకి వివరించారు. ఈ విషయంపై స్పందించిన బీసీసీఐ వర్గాలు ఇన్‌సైడ్‌స్పోర్ట్‌తో మాట్లాడుతూ... ‘‘అవును... మహారాష్ట్ర నుంచి మాకు లేఖ అందింది. ఆ ఆటగాడిపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై మేము దృష్టి సారించాం. అయితే, ఇప్పుడే ఒక అంచనాకు రాలేం. వ్యవస్థల మీద మాకు నమ్మకం ఉంది. లోతుగా దర్యాప్తు చేస్తాం’’ అని పేర్కొన్నారు. చదవండి: తొలి మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ.. ప్రపంచంలోనే మొదటి ఆటగాడిగా! Some Cricketers are playing Cricket with fabricated Date of Birth Certificate. Cricketers who Indulge in a fraud in DOB not only violate core values of Crocket but also put genuine Cricketers in a disadvantages position. It’s against the integrity of sports.@bcci @SGanguly99 — Om Prakash Bakoria (@ombakoria) February 14, 2022 -
IPL 2022 Auction: అప్పుడు ఆర్యన్‌తో కలిసి.. ఇప్పుడు ఇలా: జూహీ చావ్లా భావోద్వేగం
ఐపీఎల్ ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్ సహ యజమాని, బాలీవుడ్ నటి జూహీ చావ్లా పుత్రికోత్సాహంతో పొంగిపోతున్నారు. తన కుమార్తె జాహ్నవి మెహతా తమ ఫ్రాంఛైజీ వ్యవహారాల్లో మమేకం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఐపీఎల్ మెగా వేలం-2022 జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో పలు ఫ్రాంఛైజీలకు చెందిన కొత్త తరం నాయకులు పాల్గొన్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున సీఈఓ కావ్య మారన్ సహా కేకేఆర్ యువ రక్తం జాహ్నవి, బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ వారసులు ఆర్యన్ ఖాన్, సుహానా ఖాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్యంగా జాహ్నవి వ్యవహరించిన తీరు నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో ఆమె ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో జూహీ చావ్లా కూతురును ఉద్దేశించి భావోద్వేగ పోస్టు చేశారు. ఆమె చిన్ననాటి జ్ఞాపకాలతో కూడిన వీడియోను ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. ‘‘చిన్నపిల్లగా ఉన్నప్పటి నుంచే ఐపీఎల్‌తో పాటు ఇతర క్రికెట్ ఈవెంట్లు చూడటం కూడా అలవాటుగా మార్చుకుంది. కామెంటేటర్ల వ్యాఖ్యలు శ్రద్ధగా వినేది. తనకు 12 ఏళ్ల వయసు ఉన్నపుడు అనుకుంటా.. మేం సెలవుల కోసం బాలి వెళ్లినపుడు కాఫీ టేబుల్ మీద ఉన్న టెలిఫోన్ డైరెక్టరి సైజులో ఓ పుస్తకం... అందులో క్రికెటర్ల జీవిత చరిత్రలు, రికార్డులు, వారు సాధించిన విజయాలు.. ఇలా అన్నీ ఉన్నాయి. ఆ బుక్ చదవడం పూర్తి చేయాలనే పిచ్చి పట్టింది తనకు. స్విమ్మింగ్ విరామ సమయంలో పూల్ ఒడ్డున కూర్చుని ఒక్క పేజీ కూడా వదలకుండా ఆ బుఖ్ చదివింది. ఇది చాలా అసహజమైన విషయం కదా! 12 ఏళ్ల పిల్ల ఇంతలా ఒక విషయం గురించి ఆలోచించడం! వయసు పెరిగే కొద్దీ తనలో క్రికెట్ పట్ల ఆసక్తి కూడా పెరుగుతూ వచ్చింది. క్రికెట్ గురించి మాట్లాడితే తన ముఖం మతాబులా వెలిగిపోతుంది. మూడేళ్ల క్రితం.. ఐపీఎల్ వేలంలో పాల్గొన్న అత్యంత పిన్న వయస్కురాలిగా జాహ్నవి 17 ఏళ్ల వయసులో రికార్డు సాధించింది. ఆర్యన్‌తో కలిసి జాహ్నవి వేలంలో పాల్గొంది. ఈసారి సుహానా కూడా వాళ్లతో చేరింది. దీనంతటికీ కారణమైన మా సీఈఓ వెంకీ మైసూర్‌కు ధన్యవాదాలు. జాహ్నవి అభిప్రాయాలకు విలువనిస్తూ... తనను ప్రోత్సహించారు. ఆమె అతడిని ఆప్యాయంగా ‘కోచ్’ అని పిలుస్తుంది. తన మనసంతా ఆట మీదే. ఒక తల్లిగా నా చిట్టితల్లిని చూసి గర్వపడుతున్నా. దేవుడి ఆశీర్వాదాలతో తన భవిష్యత్తు మరింత ప్రకాశవంతంగా ఉండాలి’’ అని అంటూ ఉద్వేగభరిత నోట్ రాశారు. చదవండి: IPL 2022- SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ షాక్...సైమన్ కటిచ్ రాజీనామా!? ఐపీఎల్ 2022: గతేడాది మిస్ అయ్యింది, ఈసారి తగ్గేదేలే.. కేకేఆర్ పూర్తి జట్టు ఇదే.. View this post on Instagram A post shared by Juhi Chawla (@iamjuhichawla) -
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీలో కలకలం..సైమన్ కటిచ్ రాజీనామా!?
-
IPL 2022- SRH: మొన్ననే సంతోషంగా ఉందన్నాడు.. ఇంతలోనే ఏమైందో!
IPL 2022 SRH- Simon Katich:- సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఐపీఎల్-2021 సీజన్లో దారుణ ప్రదర్శన... 2016లో జట్టుకు టైటిల్ అందించిన కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కు ఉద్వాసన.. తుది జట్టులో కూడా చోటు కల్పించలేదు... మెగా వేలం నేపథ్యంలో వార్నర్ సహా స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్‌ను రిటైన్ చేసుకోలేదు.. ఇక కోచ్‌ల విషయానికొస్తే... అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత విజయవంతమైన కోచ్‌గా పేరున్న ట్రెవర్ బేలిస్... అసిస్టెంట్ కోచ్ పనిచేసిన బ్రాడ్ హాడిన్ సైతం గత సీజన్లో తమ పదవుల నుంచి తప్పుకొన్నారు. పేలవ ప్రదర్శనకు తోడు వార్నర్, రషీద్ లాంటి స్టార్ ప్లేయర్లను వదులుకున్న క్రమంలో ఐపీఎల్-2022 సీజన్ నేపథ్యంలో సన్‌రైజర్స్ కొత్త సిబ్బందితో ముందుకు వచ్చింది. టామ్ మూడీ తిరిగి హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టగా... రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు హెడ్ కోచ్‌గా పనిచేసిన సైమన్ కటిచ్‌ను అసిస్టెంట్ కోచ్‌గా నియమించింది. ఇక విండీస్ దిగ్గజం బ్రియన్ లారా, డేల్ స్టెయిన్, ముత్తయ్య మురళీధరన్, హేమంగ్ బదానీని తమ సిబ్బందిలో చేర్చుకుంది. అయితే, ఐపీఎల్ మెగా వేలానికి ముందుగా రచించిన ప్రణాళికలను అమలు చేయకుండా భిన్నంగా వ్యవహరించారంటూ అసిస్టెంట్ కోచ్ సైమన్ కటిచ్ రాజీనామా చేశారన్న వార్త సంచలనంగా మారింది. సన్‌రైజర్స్ యాజమాన్యం తన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదన్న ఆరోపణలతో ఆయన పదవి నుంచి వైదొలిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో.. వేలం నేపథ్యంలో సన్‌రైజర్స్ విడుదల చేసిన సైమన్ కటిచ్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో కటిచ్.. దక్షిణాఫ్రికా క్రికెటర్లు ఎయిడెన్ మార్కరమ్, మార్కో జాన్సెన్ను ఎంపిక చేయడం వెనుక కారణాలు వివరించాడు. ‘‘గత సీజన్లో పంజాబ్‌కు ఆడిన ఎయిడెన్ మార్కరమ్.. రెండేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్లోనూ మెరుగ్గా రాణిస్తున్నాడు. అందుకే అతడిని తీసుకున్నాం. తను మంచి ఆల్‌రౌండ్ ఆప్షన్. ఆఫ్ స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగలడు. అదే విధంగా మార్కో జాన్సెన్.. గతంలో ముంబైకి ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్లో తన ప్రదర్శన బాగుంది. వీళ్లిద్దరినీ జట్టులోకి తీసుకోవడం పట్ల సంతోషంగా ఉంది’’ అని చెప్పుకొచ్చాడు. ఇంతలోనే ఇలా ఫ్రాంఛైజీని వీడుతున్నట్లు వార్తలు రావడం గమనార్హం. ఈ నేపథ్యంలో... ‘‘కొత్త తెలుగు ఆటగాడు కూడా లేడు. పైగా ఒకరిద్దరు తప్ప మిగిలిన వారంతా నామ్ కే వాస్తే అన్నట్లుగానే ఆడేవాళ్లు... అసలు ఓపెనింగ్ జోడీ ఎలా సెట్ చేస్తారో తెలియదు. బహుశా కావ్య సెలక్షన్ నచ్చలేదేమో! అందుకే కటిచ్ రాజీనామా చేసి ఉంటాడు’’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ అయిన సైమన్ కటిచ్ దేశం తరఫున 56 టెస్టులు, 45 వన్డేలు, మూడు టీ20లు ఆడాడు. It's time for South Africa. 🇿🇦 Listen to Simon Katich speak about what Aiden Markram and Marco Jansen bring to the table. 🗣️#OrangeArmy #ReadyToRise #IPLAuction pic.twitter.com/Ob6pEjVvx4 — SunRisers Hyderabad (@SunRisers) February 13, 2022 ఎస్ఆర్హెచ్- మెగా వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: నికోలస్ పూరన్(10.75 కోట్లు) వాషింగ్టన్ సుందర్(8.75 కోట్లు) రాహుల్ త్రిపాఠి(8.5 కోట్లు) రొమారియో షెపర్డ్(7.7 కోట్లు) అభిషేక్ శర్మ(6.5 కోట్లు) భువనేశ్వర్ కుమార్(4.2 కోట్లు) మార్కో జన్సెన్(4.2 కోట్లు) టి నటరాజన్(4 కోట్లు) కార్తీక్ త్యాగి(4 కోట్లు) ఎయిడెన్ మార్క్రమ్(2.6 కోట్లు) సీన్ అబాట్(2.4 కోట్లు) గ్లెన్ ఫిలిప్(1.5 కోట్లు) శ్రేయస్ గోపాల్(75 లక్షలు) విష్ణు వినోద్(50 లక్షలు) ఫజల్ హక్ ఫారుఖి(50 లక్షలు) జె సుచిత్(20 లక్షలు) ప్రియమ్ గార్గ్(20 లక్షలు) ఆర్ సమర్థ్(20 లక్షలు) శశాంక్ సింగ్(20 లక్షలు) సౌరభ్ దూబే(20 లక్షలు) -
IPL 2022- SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ షాక్... కోచ్ రాజీనామా!
IPL 2022 Mega Auction: ఐపీఎల్-2022 సీజన్ ఆరంభానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు అసిస్టెంట్ కోచ్ సైమన్ కటిచ్ తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. బెంగళూరు వేదికగా సాగిన ఐపీఎల్ మెగా వేలం-2022లో హైదరాబాద్ ఫ్రాంఛైజీ అనుసరించిన వ్యూహాలు నచ్చకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఆటగాళ్ల ఎంపిక, కొనుగోలు విషయంలో యాజమాన్యంతో విభేదాలు తలెత్తడంతో జట్టును వీడినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ది ఆస్ట్రేలియన్ కథనం వెలువరించింది. కాగా గత సీజన్లో సన్‌రైజర్స్ దారుణ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. 14 మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ కేవలం మూడింట మాత్రమే గెలిచింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్‌ను తొలగించడం సహా తుది జట్టులో కూడా చోటుకల్పించకపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కొత్త సీజన్ ఆరంభానికి ముందు కొత్త సిబ్బందిని నియమించింది. వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారాను బ్యాటింగ్ కోచ్‌గా నియమించుకుంది. ఆర్సీబీ మాజీ హెడ్ కోచ్ సైమన్ కటిచ్‌ను అసిస్టెంట్ కోచ్‌గా ఎంచుకుంది. హెడ్‌కోచ్‌గా టామ్ మూడీ, ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా డేల్ స్టెయిన్, స్పిన్ బౌలింగ్ కోచ్‌గా ముత్తయ్య మురళీధరన్, ఫీల్డింగ్ కోచ్, స్కౌట్‌గా హేమంగ్ బదాని వ్యవహరించనున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా.. మెగా వేలంలో ఎస్ఆర్హెచ్ తీరుపై కూడా అభిమానులు పెదవి విరుస్తున్న క్రమంలో కటిచ్ రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. చదవండి: IPL 2022: ఆర్సీబీకి బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం..! IPL 2022: కేన్ మామ 'బకరా' అయ్యే అవకాశాలు ఎక్కువ.. -
IPL 2022: ఆర్సీబీకి బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం..!
ఐపీఎల్ 2022 ప్రారంభానికి ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వేలం కంటే ముందే ఆటగాళ్ల రిటెన్షన్ లో భాగంగా అట్టిపెట్టుకున్న స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్.. వ్యక్తిగత కారణాల (వివాహం) చేత లీగ్ ప్రారంభ మ్యాచ్‌లకు దూరమవుతాడని తెలుస్తోంది. మార్చి 27న మ్యాక్స్ వెల్.. తన ప్రేయసి, భారత సంతతికి(తమిళనాడు) చెందిన వినీ రామన్‌ను మనువాడబోతున్నాడు. వీరిరువురు 9 ఏళ్ల ప్రేమ ప్రయాణానికి స్వస్తి పలుకుతూ మూడు ముళ్ల బంధంతో ఒక్కటవబోతున్నారు. వీరి వివాహం తమిళ, క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం మెల్బోర్న్లో జరగనుంది. తమిళంలో ముద్రించిన వీరి వెడ్డింగ్ కార్డ్ ఇప్పటికే నెట్టింట రచ్చ చేస్తుంది. ఇదిలా ఉంటే, గత సీజన్‌తోనే ఆర్సీబీలోకి ఎంట్రీ ఇచ్చిన మ్యాక్సీ.. రెండు దశల్లోనూ రాణించి, జట్టు ప్లే ఆఫ్స్ కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో, ఆర్సీబీ అతన్ని రూ.11 కోట్లకు రిటైన్ చేసుకుంది. అన్నీ కుదిరితే కెప్టెన్సీ కట్టబెట్టేందుకు కూడా ఆర్సీబీ రెడీ అయ్యింది. అయితే, వివాహం కారణం మ్యాక్సీ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానుండడంతో ఆర్సీబీ ఈ విషయమై పునరాలోచనలోపడింది. కాగా, ఐపీఎల్ 2022 సీజన్ ను మార్చి చివరి వారంలో ప్రారంభించేందుకు నిర్వాహకులు కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు, మార్చి 29 నుంచి ఆసీస్.. పాకిస్థాన్‌లో పర్యటించనున్న విషయం విధితమే. ఈ పర్యటనలో ఆస్ట్రేలియా.. మూడు టెస్ట్‌లతో పాటు వన్డే, టీ20 సిరీస్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్లు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, పాట్ కమిన్స్, మార్కస్ స్టోయినిస్ లు కూడా ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నారు. వివాహం కారణంగా మ్యాక్సీ పాక్ పర్యటనకు దూరంగా ఉంటానని ఇదివరకే ప్రకటించాడు. చదవండి: వీరేంద్ర సెహ్వాగ్, భువనేశ్వర్ కుమార్ భాటలో ఆరోన్ ఫించ్..! -
IPL 2022 Auction: రైనా.. ధోని నమ్మకాన్ని కోల్పోయాడు, అందుకే ఈ పరిస్థితి..!
మిస్టర్ ఐపీఎల్‌గా పేరొందిన చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు సురేష్ రైనాను ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఏ జట్టు కొనుగోలు చేయకపోవడం అందరిని ఆశ్చర్య పరిచింది. సీఎస్కే యజమాని శ్రీనివాసన్.. రైనాను పక్కకు పెట్టడానికి గల కారణాలను సైతం వివరించాడు. ఈ క్రమంలో చాలా మంది మాజీ క్రికెటర్లు రైనా అమ్ముడుపోకపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తూ ఉన్నారు. తాజాగా న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్.. రైనాపై ఏ జట్టు ఆసక్తి కనబర్చకపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. గత రెండు ఐపీఎల్ సీజన్లలో వ్యక్తిగత కారణాల చేత కొన్ని మ్యాచ్ లకు, మోకాలికి శస్త్రచికిత్స కారణంగా మరి కొన్ని మ్యాచ్ లకు దూరమైన రైనా.. ఫామ్ లేమి కారణంగా ధోనితో పాటు సీఎస్కే యాజమాన్యం నమ్మకాన్ని కోల్పోయాడని, అందుకే అతన్ని తిరిగి జట్టులోకి తీసుకోలేదని, ఈ విషయాన్ని ఆ ఫ్రాంచైజీ యజమానే స్వయంగా వెల్లడించాడని గుర్తు చేశాడు. ఫామ్ లేమి కారణంగా ఓ ఆటగాడిని ఏ జట్టైనా ఇలా పక్కకు పెడితే, ఇతర జట్లు సదరు ఆటగాడిని కొనుగోలు చేసే సాహసం చేయవని ఓ క్రీడా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇదే కారణంతోనే రైనాను మెగా వేలంలో సీఎస్కే తో పాటు ఏ ఇతర జట్లు కొనుగోలు చేయలేదని సైమన్ డౌల్ అభిప్రాయపడ్డాడు. కాగా, రెండు సీజన్లు (2006,17) మినహా ఐపీఎల్ ప్రారంభం నుంచి సీఎస్కే కే ప్రాతినిధ్యం వహించిన రైనాకు ఈ సారి ఆ జట్టు రిటెన్షన్ జాబితాలో చోటు దక్కలేదు. వేలంలోనైనా సీఎస్కే అతన్ని దక్కించుకుంటుందని అంతా భావించినప్పటికీ అలా జరగలేదు. వయసు మీద పడటం, అంతంత మాత్రంగానే ఉన్న ఫామ్ కారణంగా అతనిపై ఇతర జట్లు కూడా ఆసక్తి కనబర్చలేదు. దీంతో ఈ వెటరన్ బ్యాటర్ ఈ ఏడాది మెగా వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయాడు. చెన్నై సూపర్ కింగ్స్ 4 సార్లు ట్రోఫీ గెలుచుకున్న జట్టులో సభ్యుడైన రైనా.. తన ఐపీఎల్ కెరీర్ లో మొత్తం 205 మ్యాచ్‌లు ఆడి 30కి పైగా సగటుతో 5528 పరుగులు చేశాడు. చదవండి: ఆర్సీబీ కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు.. వేలంలో 7కోట్లు! -
ఆర్సీబీ కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు.. వేలంలో 7కోట్లు!
రాయల్ ఛాలంజెర్స్ బెంగళూరుకు త్వరలో కొత్త కెప్టెన్ రాబోతున్నాడు. ఆర్సీబీ కొత్త కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఫాప్ డుప్లిసెస్ ఎంపిక దాదాపు ఖాయం అయినట్లు తెలుస్తోంది. డుప్లిసెస్‌ను కెప్టెన్‌గా ఆర్సీబీ యాజమాన్యం ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. కాగా ఐపీఎల్-2022 మెగా వేలంలో డుప్లిసెస్‌ను ఆర్సీబీ రూ. 7 కోట్లకు దక్కించుకుంది. వేలంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో పోటీ పడి మరి అతడిని ఆర్సీబీ దక్కించుకుంది. ఇక ఐపీఎల్-2021 సీజన్ తర్వాత ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లి తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే తర్వాత కెప్టెన్‌గా ఏబీ డివిలియర్స్ అవుతాడని అంతా భావించారు. ఈ క్రమంలోనే డివిలియర్స్ అన్ని రకాల ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుని అందరని షాక్‌కు గురి చేశాడు. ఇక మాక్స్వెల్ కూడా కెప్టెన్‌గా ఒక ఆఫ్షన్‌గా ఉన్నప్పటికీ ఆర్సీబీ మేనేజ్మెంట్ డుప్లిసెస్ వైపే మెగ్లు చూపినట్లు తెలుస్తోంది. "మా జట్టు కెప్టెన్‌గా డుప్లిసెస్ సరైనోడు అని భావిస్తున్నాం. అయితే మేము నిర్ణయించుకోవడానికి మాకు సమయం ఉంది. మాక్స్వెల్ అందుబాటుపై స్పష్టత కోసం ఎదురు చూస్తున్నాము. అతడు తన వివాహం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో డుప్లిసెస్ సరైన ఎంపికగా కనిపిస్తోంది" అని ఆర్సీబీ ఆధికారి ఒకరు పేర్కొన్నారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టు: విరాట్ కోహ్లి: రూ. 15 కోట్లు మ్యాక్స్‌వెల్: రూ. 11 కోట్లు హర్షల్ పటేల్: రూ. 10 కోట్ల 75 లక్షలు హసరంగ: రూ. 10 కోట్ల 75 లక్షలు హాజెల్‌వుడ్: రూ. 7 కోట్ల 75 లక్షలు సిరాజ్ :రూ. 7 కోట్లు డు ప్లెసిస్: రూ. 7 కోట్లు దినేశ్ కార్తీక్: రూ. 5 కోట్ల 50 లక్షలు అనూజ్ రావత్: రూ. 3 కోట్ల 40 లక్షలు షాబాజ్ అహ్మద్: రూ. 2 కోట్ల 40 లక్షలు రూథర్‌ఫొర్డ్: రూ. 1 కోటి మహిపాల్ లామ్రోర్: రూ. 95 లక్షలు ఫిన్ అలెన్: రూ. 80 లక్షలు బెహ్రెండార్ఫ్: రూ.75 లక్షలు కరణ్ శర్మ: రూ. 50 లక్షలు సుయశ్ ప్రభుదేశాయ్: రూ.30 లక్షలు సీవీ మిలింద్: రూ. 25 లక్షలు ఆకాశ్‌దీప్: రూ. 20 లక్షలు అనీశ్వర్ గౌతమ్ : రూ. 20 లక్షలు చదవండి: Ranji Trophy- Yash Dhull: అరంగేట్రంలోనే అద్భుత సెంచరీ.. మరో కోహ్లివి.. మరీ 50 లక్షలు తక్కువే కదా! -
Ranji Trophy 2022: వారెవ్వా యశ్ ధుల్.. అరంగేట్రంలోనే సెంచరీ.. మరో కోహ్లి!
అండర్- 19 ప్రపంచకప్ టోర్నీలో భారత్‌కు ప్రపంచకప్ సాధించి పెట్టిన కెప్టెన్ యశ్ ధుల్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ కెరీర్‌ను ఘనంగా ఆరంభించాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ సాధించి సత్తా చాటాడు. తద్వారా ఆడిన మొదటి రంజీ మ్యాచ్‌ను మరింత ప్రత్యేకంగా మార్చుకున్నాడు. కాగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడుతూ వస్తున్న దేశవాళీ రంజీ టోర్నీ రెండేళ్ల తర్వాత ఎట్టకేలకు ఫిబ్రవరి 17న మొదలైంది. ఇందులో భాగంగా ఢిల్లీ, తమిళనాడు జట్లు మొదటి మ్యాచ్‌లో తలపడుతున్నాయి. టాస్ గెలిచిన తమిళనాడు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనింగ్‌కు దిగిన ఢిల్లీ బ్యాటర్ యశ్ ధుల్ 136 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 150 బంతులు ఎదుర్కొన్న అతడు 113 పరుగులు చేశాడు. ఇందులో 18 ఫోర్లు ఉన్నాయి. కాగా యశ్ ధుల్‌కు ఇదే మొదటి రంజీ మ్యాచ్ కావడం విశేషం. ఇక తమిళనాడు వంటి పటిష్ట జట్టుపై అరంగేట్ర మ్యాచ్‌లోనే ఇలా అదరగొట్టడంపై అభిమానులు ఫిదా అవుతున్నారు. యశ్ ధుల్ మరో కోహ్లి అవుతాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. నీలాంటి అత్యుత్తమ ఆటగాడిని ఢిల్లీ క్యాపిటల్స్ లక్కీగా తక్కువ ధరకే సొంతం చేసుకుందని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఐపీఎల్ మెగా వేలం-2022లో భాగంగా ఢిల్లీ ఫ్రాంఛైజీ 50 లక్షల రూపాయలు వెచ్చించి యశ్ ధుల్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: Rohit Sharma- Ravi Bishnoi: అందుకే అతడిని జట్టులోకి తీసుకున్నాం.. అదరగొట్టాడు: రోహిత్ శర్మ ప్రశంసలు FIFTY on First-Class debut! 👏 👏 Yash Dhull - India's #U19CWC-winning captain - begins his #RanjiTrophy journey in style. 👍 👍 @Paytm #DELvTN Follow the match ▶️ https://t.co/ZIohzqOWKi pic.twitter.com/mrbYBHNrBL — BCCI Domestic (@BCCIdomestic) February 17, 2022 𝙒𝙝𝙖𝙩 𝘼 𝙈𝙤𝙢𝙚𝙣𝙩! 👌 👌 💯 on Ranji Trophy debut! 👏 👏 This has been a fantastic batting performance from Yash Dhull in his maiden First Class game. 👍 👍 @Paytm | #RanjiTrophy | #DELvTN | @YashDhull2002 Follow the match ▶️ https://t.co/ZIohzqOWKi pic.twitter.com/uaukVSHgUq — BCCI Domestic (@BCCIdomestic) February 17, 2022 -
IPL 2022: రాజస్థాన్ రాయల్స్ వెల్కమ్ వీడియో అదుర్స్.. సంగక్కర ఎంట్రీ చూడాల్సిందే..!
ఐపీఎల్ మెగా వేలం 2022లో ప్రణాళిక ప్రకారం ఆటగాళ్లను కొనుగోలు చేసి ఉత్సాహంగా కనిపిస్తున్న రాజస్థాన్ రాయల్స్.. జట్టులోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన ఆటగాళ్లకు గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పింది. ప్రముఖ బాలీవుడ్ చిత్రంలోని ఓ హిట్ పాటను ప్లే చేస్తూ నూతన ఆటగాళ్లను ఆహ్వానించింది. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన ఓం శాంతి ఓం చిత్రంలోని టైటిల్ సాంగ్ కు ఫేస్ మార్ఫింగ్ చేసి, తమ కొత్త ఆటగాళ్లతో వీడియోను రిక్రియేట్ చేసింది. ఈ వీడియోలో షారుక్ ప్లేసులో సంజూ శాంసన్ ముఖాన్ని.. మిగతా వారికి నూతన ఆటగాళ్ల ముఖాలను అంటించి అదిరిపోయే రేంజ్ లో మార్ఫింగ్ వీడియోను రూపొందించింది. Wait for Sanga’s entry 😂#RoyalsFamily | #IPL2022 | @yuzi_chahal | @JimmyNeesh | @SHetmyer | @KumarSanga2 | @ashwinravi99 | @IamSanjuSamson pic.twitter.com/PGgSJkmk7R — Rajasthan Royals (@rajasthanroyals) February 15, 2022 ఈ వీడియోలో సంజూ శాంసన్ జట్టులోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన చహల్, జిమ్మీ నీషమ్, షిమ్రోన్ హెట్మేయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్ తదితర ఆటగాళ్లను పాట పాడుతూ, నృత్యంతో ఆహ్వానిస్తూ కనిపించాడు. వీడియో చివర్లో జట్టు డైరెక్టర్ కుమార సంగక్కర ధర్మేంద్రలా వీర లెవెల్లో ఎంట్రీ ఇస్తాడు. వీడియో మొత్తానికి సంగక్కర ఎంట్రీ హైలైట్ గా నిలిచింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తుంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు: సంజూ శాంసన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చహల్, రియాన్ పరాగ్, కెసి కరియప్ప, ఒబెద్ సైని, నవ్‌దీప్ సైని సింగ్, కుల్దీప్ సేన్, కరుణ్ నాయర్, ధృవ్ జురెల్, తేజస్ బరోకా, కుల్దీప్ యాదవ్, శుభమ్ గర్వాల్, జేమ్స్ నీషమ్, నాథన్ కౌల్టర్-నైల్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, డారిల్ మిచెల్. చదవండి: Virat Kohli: చరిత్ర తిరగరాసేందుకు మరో 73 పరుగుల దూరంలో.. -
IPL 2022: వేలంలో పాక్ బౌలర్ కు 200 కోట్లు.. ఆశకు హద్దు ఉండాలంటున్న నెటిజన్లు
చాలా కాలంగా భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సరిగ్గా లేనందున ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు కూడా అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయి. ఎప్పుడో ఐసీసీ టోర్నీల్లో తప్పించి మధ్యలో ఇరు దేశాలు తలపడింది లేదు. భారత్, పాక్ లను కలుపుకుని నాలుగు దేశాల టీ20 టోర్నీ అంటూ పాక్ క్రికెట్ బోర్డ్(పీసీబీ) హడావుడి చేసినప్పటికీ బీసీసీఐ దాన్ని కొట్టి పారేసింది. If, Shaheen Shah Afridi was in #IPLAuction. He would’ve gone for 200 crores. — Ihtisham Ul Haq (@iihtishamm) February 13, 2022 ఇక క్యాష్ రిచ్ లీగ్ (ఐపీఎల్) విషయానికొస్తే.. పాక్ ఆటగాళ్లను ఎప్పటి నుంచో దూరం పెట్టింది బీసీసీఐ. ఐపీఎల్ లో తమకు ప్రవేశం లేదన్న అక్కసును పాక్ ఆటగాళ్లతో సహా ఆ దేశ మీడియా సైతం చాలా సందర్భాల్లో బాహాటంగానే వెళ్లగక్కింది. తాజాగా ఐపీఎల్ 2022 మెగా వేలం ముగిసిన నేపథ్యంలో ఓ పాక్ జర్నలిస్ట్ తమ దేశ క్రికెటర్ ను ఆకాశానికెత్తుతూ చేసిన ట్వీట్ ఒకటి నెట్టింట రచ్చ రచ్చ చేస్తుంది. Idiocy has no end. Each franchise can spend only ₹90C & must’ve 18 players. So even if you buy 17 players at ₹20L, you wouldn’t be able to spend more than ₹87C for a single player. This dude perhaps thinks 2-3 franchises can match fix & spend ₹200C collectively to buy Afridi! https://t.co/4X1687deiU — Sreejith Panickar (@PanickarS) February 15, 2022 పాకిస్థాన్ పేసర్ షాహీన్ అఫ్రిది ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొన్నట్లయితే 200 కోట్లకు అమ్ముడుపోయేవాడంటూ అత్యుత్సాహంతో ట్వీటాడు పాక్ కు చెందిన ఇతిషమ్ ఉల్ హక్ అనే జర్నలిస్ట్. ఈ ట్వీట్ ను చూసిన భారత క్రికెట్ అభిమానులు సదరు పాక్ విలేకరిని ఓ రేంజ్ లో ఆటాడుకుంటున్నారు. ఐపీఎల్ వేలంలో ఓ జట్టు ఖర్చు చేసేది 90 కోట్లే అయితే.. మీ పాకీ బౌలర్ కి ఎక్కడి నుంచి తెచ్చి 200 కోట్లు ఇచ్చేదంటూ సెటైర్లు వేస్తున్నారు. ఆశకు ఓ హద్దుండాలి భయ్యా అంటూ చురకలంటించే కామెంట్లు చేస్తున్నారు. How many zeroes in that number? Any idea? 😂 https://t.co/fBBmmxy4oc pic.twitter.com/VnlQXQ6E6e — PrinceJii (@i_m_princeji) February 16, 2022 మరికొందరైతే.. పాక్ ప్రధాని చైనాకు రుణమాఫీ చేయడానికి షాహిన్ అఫ్రిదిని ఉపయోగిస్తే మంచిదని సూచనలిస్తున్నారు. కాగా, ఇటీవల కాలంలో షాహీన్ అఫ్రిది అదిరిపోయే ప్రదర్శన చేస్తున్నాడు. గతేడాది టీ20 ప్రపంచకప్ లో టీమిండియాతో జరిగిన మ్యాచ్ లోనూ రెచ్చిపోయాడు. కొత్త బంతితో అద్బుతంగా స్వింగ్ రాబట్టే ఈ యంగ్ పేసర్ పై పాక్ అభిమానులు భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటివరకు 21 టెస్టులు, 28 వన్డేలు, 39 టీ20 మ్యాచ్ లు ఆడిన షాహీన్..184 వికెట్లు పడగొట్టాడు. Here's a look at the Top Buys of what has been an eventful #TATAIPLAuction 2022 😎👌@TataCompanies pic.twitter.com/vnFMj1NKj9 — IndianPremierLeague (@IPL) February 13, 2022 ఇదిలా ఉంటే, ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరిగిన ఐపీఎల్ 2022 మెగావేలంలో చాలా మంది క్రికెటర్లు రాత్రికిరాత్రి కోటీశ్వరులైపోయారు. ఈసారి వేలంలో స్టార్ క్రికెటర్లతో పాటు అనామకులపై కూడా కనక వర్షం కురిసింది. వేలంలో మొత్తం 204 మందిపై 10 ఫ్రాంచైజీలు ఏకంగా 552 కోట్లు ఖర్చు చేశాయి. టీమిండియా వికెట్ కీపర్/బ్యాటర్ ఇషాన్ కిషన్ వేలంలో జాక్ పాట్ కొట్టేశాడు. అతన్ని ముంబై ఇండియన్స్ రూ. 15.25 కోట్లకు దక్కించుకుంది. ఈ ఏడాది ఐపీఎల్ మెగా వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయింది ఇతనే. చదవండి: పాత గొడవను గుర్తుచేసి కౌంటర్ ఇద్దామనుకున్నాడు.. బెడిసికొట్టింది -
IPL 2022: కోల్‌కతా కెప్టెన్ అతడే... కేకేఆర్ అధికారిక ప్రకటన
ఐపీఎల్ ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కొత్త కెప్టెన్ వచ్చేశాడు. అంతా ఊహించినట్లుగానే టీమిండియా యువ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు కేకేఆర్ సారథ్య బాధ్యతలు అప్పజెప్పింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేసింది. ‘‘లేడీస్ అండ్ జెంటిల్మెన్.. అమ్మాయిలు.. అబ్బాయిలు... కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు హలో చెప్పండి’’ అంటూ తమ సారథులతో కూడిన ఫొటోను షేర్ చేసింది. ఇందులో సౌరవ్ గంగూలీ, బ్రెండన్ మెకల్లమ్, గౌతమ్ గంభీర్, దినేశ్ కార్తిక్, ఇయాన్ మోర్గాన్... ప్రస్తుత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. కాగా ఐపీఎల్-2022 మెగా వేలంలో భాగంగా కేకేఆర్ శ్రేయస్ అయ్యర్‌ను 12.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక గతంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు సారథిగా వ్యవహరించి శ్రేయస్‌కు మంచి రికార్డు ఉంది. అయితే, గాయం కారణంగా ఐపీఎల్-2021 సీజన్ తొలి దశకు అతడు దూరం కాగా.. టీమిండియా యువ కెరటం రిషభ్ పంత్ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు. జట్టును విజయాల బాట పట్టించాడు. దీంతో అయ్యర్ రెండో అంచెకు అందుబాటులోకి వచ్చినప్పటికీ పంత్‌నే కెప్టెన్‌గా కొనసాగించారు. అంతేకాదు మెగా వేలం నేపథ్యంలో ఢిల్లీ అయ్యర్‌ను రిటైన్ చేసుకోలేదు కూడా. దీంతో అతడు ఆక్షన్‌లోకి రాగా కేకేఆర్ కొనుగోలు చేసింది. కాగా గత సీజన్లో రన్నరప్‌గా నిలిచిన కోల్‌కతా ఈసారి ఎలాగైనా టైటిల్ గెలవాలనే పట్టుదలతో ఉంది. కేకేఆర్ జట్టు ఇదే.. రిటైన్డ్ ఆటగాళ్లు: ఆండ్రీ రసెల్ (12 కోట్లు) వరుణ్ చక్రవర్తి (8 కోట్లు) వెంకటేశ్ అయ్యర్ (8 కోట్లు) సునీల్ నరైన్ (6 కోట్లు) మెగా వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: శ్రేయస్ అయ్యర్ (12.25 కోట్లు) నితీశ్ రాణా (8 కోట్లు) పాట్ కమిన్స్ (7.25 కోట్లు) శివమ్ మావి (7.25 కోట్లు) సామ్ బిల్లింగ్స్ (2 కోట్లు) ఉమేశ్ యాదవ్ (2 కోట్లు) అలెక్స్ హేల్స్ (1.5 కోట్లు) అజింక్య రహానే (కోటి) మహ్మద్ నబీ ( కోటి) షెల్డన్ జాక్సన్ (60 లక్షలు) అశోక్ శర్మ (55 లక్షలు) అభిజీత్ తోమర్ (40 లక్షలు) రింకు సింగ్ (20 లక్షలు) అంకుల్ రాయ్ (20 లక్షలు) రసిక్ దార్ (20 లక్షలు) బి ఇంద్రజిత్ (20 లక్షలు) ప్రీతమ్ సింగ్ (20 లక్షలు) రమేశ్ కుమార్ (20 లక్షలు) అమాన్ ఖాన్ (2 లక్షలు) చదవండి: . IPL 2022 Auction: నన్నంటే కొనలేదు.. అతడిని కూడానా.. నిజంగా షాకయ్యా! అప్పుడు అలా చేశాం కాబట్టే ఇలా! IPL 2022: ఆ ఇద్దరే మా ఓపెనర్లు.. క్లారిటీ ఇచ్చిన సన్‌రైజర్స్ కోచ్ Ind Vs Wi T20 Series: పంత్‌కు బంపర్ ఆఫర్.. వైస్ కెప్టెన్‌గా ఛాన్స్ 🚨 Ladies and gentlemen, boys and girls, say hello 👋 to the NEW SKIPPER of the #GalaxyOfKnights অধিনায়ক #ShreyasIyer @ShreyasIyer15 #IPL2022 #KKR #AmiKKR #Cricket pic.twitter.com/veMfzRoPp2 — KolkataKnightRiders (@KKRiders) February 16, 2022 -
IPL 2022 Auction: వేలంలో ప్రత్యేక ఆకర్షణ.. అందరి కళ్లు తన మీదే.. అసలు ఎవరామె?
IPL 2022 Auction: ఐపీఎల్-2022 మెగా వేలం ముగిసినా సోషల్ మీడియాలో ఆ సందడి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏ ఆటగాడు ఎంత ధరకు అమ్ముడు పోయాడు? ఏ ఫ్రాంఛైజీది సరైన ఎంపిక? ఎవరు అనవసరంగా డబ్బు ఖర్చు చేశారు? తదితర అంశాల గురించి ఐపీఎల్ ప్రేమికులు చర్చిస్తూనే ఉన్నారు. ఆటగాళ్ల విషయాన్ని కాసేపు పక్కన పెడితే... తన ఆకర్షణీయ రూపం, అందమైన నవ్వుకు తోడు చాకచక్యంగా వ్యవహరిస్తూ ఓ యువతి వేలంలో అందరి దృష్టిని తనవైపు తిప్పుకొన్నారు. ఆమె మరెవరో కాదు... సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్. ఐపీఎల్ ఫాలో అయ్యేవారికి కావ్య గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తనదైన హావభావాలతో ఎన్నో సార్లు మ్యాచ్‌లో హైలెట్‌గా నిలిచారు ఆమె. 2018 వేలం సందర్భంగా వెలుగులోకి వచ్చిన ఆమెకు ఫ్యాన్స్ కూడా ఎక్కువే. కావ్య పాప అంటూ ఆమెను ముద్దుగా పిలుచుకుంటారు. ఈసారి బెంగళూరు వేదికగా జరిగిన మెగా వేలం-2022లో కూడా 30 ఏళ్ల కావ్య మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ట్రెండింగ్‌లో నిలిచారు. చాలా మంది నెటిజన్లు ఆమె గురించి సెర్చ్ చేశారు. అసలు ఎవరీ కావ్య మారన్? మీడియా మొఘల్‌గా పేరొందిన కళానిధి మారన్ కుమార్తె కావ్య. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీకి సహ యజమానిగా వ్యవహరిస్తున్నారు. అదే విధంగా సన్ మ్యూజిక్, సన్ టీవీ ఎఫ్ఎం చానెల్స్ వ్యవహారాలు చూస్తున్నారు. కాగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి కరుణానిధికి కళానిధి మారన్ బంధువన్న విషయం తెలిసిందే. ఇక ఆయన సోదరుడు దయానిధి మారన్ చెన్నై సెంట్రల్ నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇక సంపన్న కుటుంబానికి చెందిన కావ్య... ఎస్ఆర్హెచ్లో కీలక పాత్ర పోషిస్తూ తనకంటూ సొంత గుర్తింపు సంపాదించుకోవడం విశేషం. ఇక ఎస్ఆర్హెచ్ డైరెక్టర్ టామ్ మూడీ, బౌలింగ్ మెంటార్ ముత్తయ్య మురళీధరన్‌తో కలిసి ఆమె ఐపీఎల్ మెగా వేలం-2022లో పాల్గొన్నారు. ఇక ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరిగిన ఆక్షన్‌లో హైదరాబాద్ అత్యధికంగా 10.75 కోట్లు వెచ్చించి విండీస్ హిట్టర్ నికోలస్ పూరన్‌ను సొంతం చేసుకుంది. చదవండి: IPL 2022 Auction: ఐపీఎల్ వేలంలో అందాల భామ.. ఎవరా బ్యూటీ గర్ల్ ? IPL 2022 Mega Auction: ఆరెంజ్ ఆర్మీ ఇదే.. -
IPL 2022 Auction: 10 కోట్లు .. హోటల్లో పిజ్జా పార్టీ.. పాపం కరెంట్ షాక్ కొట్టడంతో..
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2021లో పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం... 11 ఇన్నింగ్స్‌లో మొత్తంగా 85 పరుగులు.. అత్యధిక స్కోరు 32.. కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)-2021లో 10 ఇన్నింగ్స్‌లో 263 పరుగులు... కట్‌చేస్తే... ఐపీఎల్ మెగా వేలం-2022లో ఏకంగా 10.75 కోట్లు పలికాడు. పంజాబ్‌తో పోటీ పడి మరీ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ భారీ మొత్తం అతడి కోసం ఖర్చు చేసింది. అవును మీరు ఊహించింది నిజమే... ఈ ఉపోద్ఘాతం వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ గురించే! పెద్దగా ఫామ్‌లో లేనప్పటికీ మంచి ధరకు అమ్ముడు పోయాడు. తనదైన రోజున చెలరేగి ఆడే పూరన్ కోసం వేలంలో హైదరాబాద్ తగ్గేదేలే అంటూ పోటీపడి రికార్డు ధరకు కొనుగోలు చేసింది. ఏ ఆటగాడిగైనా ఇంతకంటే సంతోషం ఏముంటుంది! వేలంలో అమ్ముడుపోయానని తెలియగానే.. సహచర ఆటగాళ్లకు అహ్మదాబాద్‌లో పిజ్జా పార్టీ ఇచ్చాడట పూరన్. కాగా టీమిండియాతో సిరీస్ నేపథ్యంలో భారత్‌లో పూరన్ భారత్‌లోనే ఉన్న సంగతి తెలిసిందే. అయితే, బయో బబుల్‌లో ఉన్న కారణంగా బయటకు వెళ్లే పరిస్థితి లేదు కాబట్టి హోటల్ రూమ్‌కే పిజ్జాలు తెప్పించి ఆనందం పంచుకున్నాడట. పాపం.. కరెంట్ షాక్ కొట్టింది! ఈ విషయం గురించి హోటల్ మేనేజర్ మాట్లాడుతూ... ‘‘బయో బబుల్ కారణంగా బయటి నుంచి భోజనం తెప్పించే వీలు లేదు. మా చెఫ్తోనే 15 పిజ్జాలు తయారు చేయించాం. శుభ్రంగా ప్యాక్ చేసి, శానిటైజ్ చేసి అందించాం. అయితే దురదృష్టవశాత్తు పూరన్‌కు చిన్నపాటి ఎలక్ట్రిక్ షాక్ కొట్టింది. శానిటైజర్లో స్వల్పంగా ఆల్కహాల్ ఉంటుంది కదా! బహుశా శానిటైజ్ చేసినపుడు ఆరకపోవడంతో ప్లగ్ పెట్టగానే షాక్ కొట్టినట్లుంది’’ అని చెప్పుకొచ్చాడు. కాగా అహ్మదాబాద్‌లో వన్డే సిరీస్ ముగించుకున్న విండీస్.. బుధవారం నుంచి ఆరంభమయ్యే టీ20 సిరీస్ కోసం కోల్‌కతా చేరుకుంది. చదవండి: IPL 2022 Auction: నన్నంటే కొనలేదు.. అతడిని కూడానా.. నిజంగా షాకయ్యా! అప్పుడు అలా చేశాం కాబట్టే ఇలా! IPL 2022 Mega Auction: 23 మంది ఆటగాళ్లతో కూడిన ఆరెంజ్ ఆర్మీ ఇదే.. We got him in the Nick of time, and we can't wait for him to wear the #OrangeArmour. 🧡#OrangeArmy, @nicholas_47 is #ReadyToRise. 🔥#IPLAuction pic.twitter.com/jWQLZ5efKz — SunRisers Hyderabad (@SunRisers) February 13, 2022 -
IPL 2022 Auction: నన్నంటే కొనలేదు.. అతడిని కూడానా.. నిజంగా షాకయ్యా!
IPL 2022 Mega Auction: ఐపీఎల్ మెగా వేలం-2022 కొందరు ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపిస్తే మరికొందరికి నిరాశను మిగిల్చింది. బెంగళూరులో రెండు రోజుల పాటు సాగిన ఆక్షన్‌లో 10 ఫ్రాంఛైజీలు స్టార్ ఆటగాళ్ల కోసం పోటీపడ్డాయి. అయితే, 217 స్థానాలకు క్రికెటర్లను ఎంచుకునే అవకాశం ఉన్నా... 204 మందితోనే సరిపెట్టడం గమనార్హం. ఇక సురేశ్ రైనా, షకీబ్ అల్ హసన్, ఇయాన్ మోర్గాన్, ఆరోన్ ఫించ్ తదితర పేరున్న పలువురు ఆటగాళ్లు అన్‌సోల్డ్‌గా మిగిలిపోయిన సంగతి తెలిసిందే. ఏ జట్టు కూడా వీరిని కొనేందుకు ఆసక్తికనబరచలేదు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్లు ఆడం జంపా, కేన్ రిచర్డ్సన్ కూడా ఉన్నారు. గత సీజన్లో వీరిద్దరు ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించారు. ఈ నేపథ్యంలో.. తామిద్దరం అమ్ముడుపోకుండా మిగిలిపోవడంపై రిచర్డ్సన్ స్పందించాడు. ఈఎస్ఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ... ‘‘నిజంగా ఆడం జంపాను ఎవరూ కొనలేదంటే నేను విస్మయానికి గురయ్యాను. అయితే, నిజాయితీగా మాట్లాడుకుంటే... మేము గత సీజన్ మధ్యలోనే లీగ్ నుంచి వైదొలిగాము. ఈ విషయం గురించి తనతో సంభాషించే క్రమంలో... ‘‘ఇందుకు మనం కచ్చితంగా మూల్యం చెల్లించాల్సి వస్తుంది’’ అని తనకు చెప్పాను. అయితే, ఆ సమయంలో తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లిపోవడమే మాకు అత్యంత ప్రాధాన్యమైనది. అందుకే వెళ్లిపోయాము. వేలం సమయంలో ఫ్రాంఛైజీలు మాపై ఆసక్తి చూపకపోవడానికి, మమ్మల్ని కొనుగోలు చేయకపోవడానికి ఇదొక కారణమని నేను భావిస్తున్నా’’ అని పేర్కొన్నాడు. అదే విధంగా కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల గత రెండు సీజన్లలో పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోయానని చెప్పుకొచ్చాడు. మెగా వేలం నేపథ్యంలోనూ తాను ఏ ఫ్రాంఛైజీతోనూ సంప్రదింపులు జరుపలేదని రిచర్డ్సన్ స్పష్టం చేశాడు. కాగా ఐపీఎల్ -2021 కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యూఏఈ వేదికగా సాగిన రెండో అంచెకు కొందరు ఆటగాళ్లు దూరమయ్యారు. ఇక ఆడం జంపా టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఆసీస్ ట్రోఫీ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. చదవండి: IPL 2022: ఆ ఇద్దరే మా ఓపెనర్లు.. క్లారిటీ ఇచ్చిన సన్‌రైజర్స్ కోచ్ -
కేన్ మామ 'బకరా' అయ్యే అవకాశాలు ఎక్కువ..
ఎస్ఆర్హెచ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ జట్టులో 'హైదరాబాదీ బకరా' అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ మాజీ క్రికెటర్ వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇటీవలే ముగిసిన వేలంలో ఎస్ఆర్హెచ్ పెద్దగా పేరున్న ఆటగాళ్లను తీసుకోలేదు. ఫామ్‌లో లేని పూరన్ కోసం రూ. 10 కోట్లు పెట్టడం అందర్ని ఆశ్చర్యపరిచింది. మరో విండీస్ క్రికెటర్ రొమారియో షెఫర్డ్ కోసం రూ. 7.75 కోట్లు ఖర్చు పెట్టడం ఆసక్తి కలిగించింది. అయితే ఉన్నంతలో రాహుల్ త్రిపాటి, ఎయిడెన్ మార్క్రమ్, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ పిలిప్స్ లాంటి ఆటగాళ్లను కొనుగోలు చేయడం కాస్త ఊరట. అయితే తుది జట్టులో ఎంత మంది ఉంటారో తెలియదు కానీ.. కేన్ విలియమ్సన్కు బ్యాటింగ్ ఆర్డర్లో ఎవరిని పంపించాలనే దానిపై ఇబ్బందులు ఎదురుకానున్నాయి. ఈ నేపథ్యంలోనే వసీం జాఫర్ కేన్ విలియమ్సన్ గురించి స్పందించాడు. చదవండి: IPL 2022: ఆ ఇద్దరే మా ఓపెనర్లు.. క్లారిటీ ఇచ్చిన సన్‌రైజర్స్ కోచ్ ''ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఆర్డర్లో కేన్ విలియమ్సన్ మూడో స్థానంలో ఎక్కువగా వస్తుంటాడు. తాజాగా ఐపీఎల్ మెగావేలంలో పూరన్, అభిషేక్ శర్మ లాంటి ఆటగాళ్లను తీసుకోవడం ద్వారా విలియమ్సన్ తన స్థానాన్ని వేరొకరికి ఇచ్చే అవకాశాలు ఉంటాయి. తనకు అచ్చొచ్చిన మూడో స్థానాన్ని వేరొకరికి త్యాగం చేస్తే అది బకరా కిందే లెక్క. అయితే పవర్‌ప్లేలో ఎక్కువ పరుగులు రావాలంటే హిట్టర్లకు చాన్స్ ఇవ్వడం మినహాయించి విలియమ్సన్కు మరో అవకాశం లేదు. ఇక ఓపెనర్‌గా అభిషేక్ శర్మ వస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం. అభిషేక్ ఓపెనర్‌గా వస్తే మంచి స్ట్రైకర్‌గా వ్యవహరిస్తాడు. ఇది ఒక మంచి చాయిస్ అనే చెప్పొచ్చు'' అని పేర్కొన్నాడు. చదవండి: IPL 2022 Auction: అందుకే మా ఆయన్ని ఎవరూ కొనలేదు.. స్టార్ ఆల్‌రౌండర్ భార్య -
ఐపీఎల్ మెగావేలానికి వచ్చి పాన్‌కార్డ్ పోగొట్టుకున్న మాజీ క్రికెటర్
ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ కెవిన్ పీటర్సన్ పాన్‌కార్డును పోగొట్టుకున్నాడు. ప్రస్తుతం స్టార్‌స్పోర్ట్ బ్రాడ్‌కాస్టర్‌లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న పీటర్సన్ ఐపీఎల్ మెగావేలం కవర్ చేయడానికి భారత్‌కు వచ్చాడు. ఈ నేపథ్యంలో ఈ మాజీ ఆల్‌రౌండర్ పాన్‌కార్డు పోగొట్టుకున్నట్లు తెలిపాడు. ఈ విషయంలో తనకు సహాయం చేయాలంటూ ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశాడు. చదవండి: అందుకే మా ఆయన్ని ఎవరూ కొనలేదు.. స్టార్ ఆల్‌రౌండర్ భార్య ''నా పాన్‌కార్డ్ ఎక్కడో పోయింది. ప్లీజ్ నాకు సాయం చేయండి. కొన్ని కార్యకలాపాల కోసం పాన్‌కార్డు అవసరం ఇప్పుడు చాలా ఉంది. అయితే పాన్‌కార్డును ఎలా పొందాలో తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా'' అంటూ ట్వీట్ చేశాడు. కాగా పీటర్సన్ ట్వీట్‌కు భారత ఆదాయపు పన్ను శాఖ స్పందించింది. ''డియర్ కెవిన్ పీటర్సన్.. మీకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. మీ దగ్గర పాన్ వివరాలు ఉంటే మేము ఇచ్చే వెబ్సైట్ లింక్‌ను ఓపెన్ చేసి పాన్‌కార్డు రీ ప్రింట్కోసం ప్రయత్నించండి. ఒకవేళ పాన్‌కార్డు వివరాలు అందుబాటులో లేకపోతే రీప్రింట్ కోసం తమ శాఖకు దరఖాస్తూ చేసుకోవచ్చు'' అని తెలిపింది. దీంతో తన ట్వీట్‌కు స్పందించిన భారత ఆదాయపు పన్ను శాఖ అధికారులకు కెవిన్ పీటర్సన్ కృతజ్ఞతలు తెలిపాడు. ⚠️INDIA PLEASE HELP⚠️ I’ve misplaced my PAN card & travelling Mon to India but need the physical card for work. Can some PLEASE PLEASE direct me to someone who I can contact asap to help me? 🙏🏽 — Kevin Pietersen🦏 (@KP24) February 15, 2022 Dear @KP24, We are here to help you. If you have your PAN details with you, please visit these links for the procedure to apply for reprint of physical PAN Card: (1/2)https://t.co/M2RFFlDsCThttps://t.co/fySMs6nm62 — Income Tax India (@IncomeTaxIndia) February 15, 2022 -
Ind Vs Wi: కోట్లలో డబ్బు.. ఐపీఎల్‌తో సంబంధం లేదు.. జాగ్రత్త.. రోహిత్ వార్నింగ్!
ఇషాన్ కిషన్... రూ. 15 కోట్ల 25 లక్షలు(ముంబై ఇండియన్స్)... శ్రేయస్ అయ్యర్ రూ. 12.25 కోట్లు... ఐపీఎల్ మెగా వేలం-2022లో రికార్డు ధరకు అమ్ముడుపోయారు. వీరితో పాటు పలువురు టీమిండియా క్రికెటర్లు సైతం కోట్లు కొల్లగొట్టారు. మరికొందరికి ఆశించినంత దక్కలేదు. అయితే, ఈ భావోద్వేగాల ప్రభావం జాతీయ జట్టు ప్రయోజనాలపై పడకూడదని భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఆటగాళ్లను హెచ్చరించాడు. అదే విధంగా ఐపీఎల్లో ఏ జట్టుకు ఆడుతున్నారు? ఎన్నో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతున్నారు? అన్న అంశాలతో తమకు సంబంధం లేదన్న హిట్‌మ్యాన్.. భారత్ తరఫున ఆడేటపుడు జట్టు అవసరాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. కాగా వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు టీమిండియా సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రోహిత్ శర్మ మాట్లాడుతూ... ‘‘వేలం ముగిసింది. భావోద్వేగాలకు గురికావడం సహజం. అయ్యిందేదో అయ్యింది. ఇప్పుడు దృష్టి మొత్తం విండీస్‌తో సిరీస్‌పైనే ఉండాలి. జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడితో నిన్న మాట్లాడాము. రానున్న రెండు వారాలు ఎంతో ముఖ్యం. బ్లూ జెర్సీలో ఆడుతున్నపుడు ఎలా ఉండాలో మరోసారి గుర్తు చేశాం. నిజానికి వాళ్లంతా ప్రొఫెషనల్స్. అయితే, మేం చెప్పాల్సింది చెప్పాం. ఆయా ఫ్రాంఛైజీలకు ఆడుతున్నపుడు బాధ్యతలు వేరుగా ఉంటాయి. టీమిండియాకు ఆడేటపుడు అలా ఉండదు. ప్రస్తుతం జాతీయ జట్టు కూర్పుపైనే మా దృష్టి’’ అని పేర్కొన్నాడు. ఐపీఎల్ గురించి తాను ప్రస్తుతం మాట్లాడదలచుకోలేదన్న రోహిత్ శర్మ... ప్రపంచకప్ టోర్నీని దృష్టిలో పెట్టుకుని కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదన్నాడు. కాగా ఇప్పటికే స్వదేశంలో విండీస్‌తో వన్డే సిరీస్ 3-0తో వైట్‌వాష్ చేసిన రోహిత్ సేన.. ఇప్పుడు టీ20 సిరీస్‌పై దృష్టి సారించింది. ఇందుకోసం నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్: భారత జట్టు ఇదే! రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్(వైస్ కెప్టెన్- వికెట్ కీపర్), యజువేంద్ర చహల్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, ఆవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడా, కుల్దీప్ యాదవ్. చదవండి: IPL 2022 Auction: అందుకే మా ఆయన్ని ఎవరూ కొనలేదు.. స్టార్ ఆల్‌రౌండర్ భార్య A sneak peek into #TeamIndia's fielding drill at the Eden Gardens. 👀 👌#INDvWI | @Paytm pic.twitter.com/wSFH4keVTx — BCCI (@BCCI) February 15, 2022 -
IPL 2022: ఆ ఇద్దరే మా ఓపెనర్లు.. క్లారిటీ ఇచ్చిన సన్‌రైజర్స్ కోచ్
ఐపీఎల్ 2022 మెగా వేలంలో అనమాక ఆటగాళ్లను కొనుగోలు చేసి విమర్శలపాలవుతున్నసన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం వ్యూహ రచన విషయంలో మాత్రం అందరికంటే ముందున్నట్లు కనిపిస్తోంది. జట్టు కూర్పు విషయంలో ఏ ఫ్రాంచైజీ కూడా ప్రకటన చేయకముందే ఎస్ఆర్హెచ్ తమ ఓపెనింగ్ జోడీ ఎవరనే విషయమై క్లారిటీ ఇచ్చేసింది. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ ఈ విషయాన్ని సూచనప్రాయంగా వెల్లడించాడు. ఐపీఎల్ 2022 సీజన్లో సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌ను కెప్టెన్ కేన్ విలియమ్సన్తో పాటు యువ ఆటగాడు అభిషేక్ శర్మ ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపాడు. గతంలో మిడిలార్డర్లో ఆడిన లెఫ్ట్ హ్యాండ్ ఆల్‌రౌండర్ అయిన అభిషేక్ శర్మకు ఈసారి ఓపెనర్‌గా ప్రమోషన్ ఇవ్వనున్నట్లు మురళీధరన్ పేర్కొన్నాడు. మెగా వేలంలో ఈ యువ ఆల్‌రౌండర్ కోసం ఎస్ఆర్హెచ్ ఏకంగా 6.5 కోట్లు వెచ్చించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. అభిషేక్ శర్మ కోసం ఆరెంజ్ ఆర్మీ.. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్‌లతో పోటీ పడి భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఐపీఎల్లో అభిషేక్ శర్మ ఇప్పటివరకు 22 మ్యాచ్‌ల్లో 17.2 సగటుతో 241 పరుగులు మాత్రమే చేసి 7 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే, ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరిగిన మెగా వేలంలో సన్‌రైజర్స్ మొత్తం 20 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అంతకుముందు రిటైన్ చేసుకున్న ముగ్గురు ఆటగాళ్లను కలుపుకుంటే ఎస్ఆర్హెచ్ సభ్యుల సంఖ్య 23కు చేరింది. రిటైన్డ్ ఆటగాళ్లు: కేన్ విలియమ్సన్(14 కోట్లు), కెప్టెన్ అబ్దుల్ సమద్(4 కోట్లు) ఉమ్రాన్ మాలిక్(4 కోట్లు) మెగా వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: నికోలస్ పూరన్(10.75 కోట్లు) వాషింగ్టన్ సుందర్(8.75 కోట్లు) రాహుల్ త్రిపాఠి(8.5 కోట్లు) రొమారియో షెపర్డ్(7.7 కోట్లు) అభిషేక్ శర్మ(6.5 కోట్లు) భువనేశ్వర్ కుమార్(4.2 కోట్లు) మార్కో జన్సెన్(4.2 కోట్లు) టి నటరాజన్(4 కోట్లు) కార్తీక్ త్యాగి(4 కోట్లు) ఎయిడెన్ మార్క్రమ్(2.6 కోట్లు) సీన్ అబాట్(2.4 కోట్లు) గ్లెన్ ఫిలిప్(1.5 కోట్లు) శ్రేయస్ గోపాల్(75 లక్షలు) విష్ణు వినోద్(50 లక్షలు) ఫజల్ హక్ ఫారుఖి(50 లక్షలు) జె సుచిత్(20 లక్షలు) ప్రియమ్ గార్గ్(20 లక్షలు) ఆర్ సమర్థ్(20 లక్షలు) శశాంక్ సింగ్(20 లక్షలు) సౌరభ్ దూబే(20 లక్షలు) చదవండి ఐపీఎల్ 2022: ఆరెంజ్ ఆర్మీ ఇదే.. ఈసారి దబిడి దిబిడే..! -
IPL 2022 Auction: అందుకే మా ఆయన్ని ఎవరూ కొనలేదు.. స్టార్ ఆల్‌రౌండర్ భార్య
ఐపీఎల్ 2022 మెగా వేలంలో వయసు మీద పడ్డ వెటరన్ ప్లేయర్లపై ఫ్రాంచైజీలు పెద్దగా ఆసక్తి కనబర్చని సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా వైట్ బాల్ కెప్టెన్ ఆరోన్ ఫించ్, ఇంగ్లండ్ వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌తో పాటు సురేశ్ రైనా, స్టీవ్ స్మిత్, పుజారా, అమిత్ మిశ్రా, ఆదిల్ రషీద్, ఇమ్రాన్ తాహిర్, షకీబ్ అల్ హసన్.. ఇలా చాలా మంది వెటరన్ స్టార్లను దాదాపు అన్ని ఫ్రాంచైజీలు చూసిచూడనట్లు వ్యవహరించాయి. వేలం అనంతరం వీరిలో కొందరు ఆటగాళ్లను ఎంపిక చేసుకోకపోవడంపై పలు ఫ్రాంచైజీలు వివరణ కూడా ఇచ్చాయి. తాజాగా, స్టార్ ఆల్‌రౌండర్, బంగ్లా ఆటగాడు షకీబ్ అల్ హసన్ మెగా వేలంలో అమ్ముడుపోకపోవడంపై అతడి భార్య ఉమ్మే అహ్మద్ శిశిర్ స్పందించింది. సోషల్ మీడియా వేదికగా షకీబ్ అన్ సోల్డ్‌గా మిగిలిపోవడానికి గల కారణాలను వివరించింది. మెగా వేలానికి ముందు కొన్ని ఫ్రాంచైజీలు షకీబ్‌ను సంప్రదించాయని, సీజన్ మొత్తానికి అతను అందుబాటులో ఉంటాడా.. లేదా.. అని ఆరా తీశాయని, శ్రీలంకతో సిరీస్ ఉన్నందున షకీబ్ వారికి నో చెప్పాడని, ఈ కారణంగానే అతన్ని ఏ జట్టూ తీసుకోలేదని శిశిర్ వివరణ ఇచ్చింది. వేలంలో అమ్ముడుపోకపోవడం పెద్ద పొరపాటేం కాదని, షకీబ్‌కి ఇంకొన్నాళ్లు క్రికెట్ ఆడే సత్తా ఉందని భర్తను వెనకేసుకొచ్చింది. షకీబ్ ఐపీఎల్ ఆడాలనుకుంటే శ్రీలంక సిరీస్ నుంచి తప్పుకునైనా ఆ పని చేయవచ్చని, కాని అతను డబ్బుల కంటే దేశానికి ఆడటాన్నే గౌరవంగా భావిస్తాడని శిశిర్ తన భర్తను ఆకాశానికెత్తింది. కాగా, శిశిర్ తన పోస్ట్‌లో శ్రీలంక సిరీస్ అని రాసుకొచ్చినప్పటికీ, వాస్తవానికి బంగ్లాదేశ్ మార్చి చివరన దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. మార్చి 18న మొదలయ్యే ఈ పర్యటనలో బంగ్లాదేశ్ మూడు వన్డేలు, రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. ఇదిలా ఉంటే, 2021 ఐపీఎల్ సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ఆడిన షకీబ్.. ఆశించిన మేరకు రాణించలేకపోయాడు. దీంతో అతడిపై ఈ ఏడాది మెగా వేలంలో ఫ్రాంచైజీలు పెద్దగా ఆసక్తి కనబర్చలేదు. చదవండి: IND Vs WI: టీ20 సిరీస్‌కు ముందు అభిమానులకు బ్యాడ్‌న్యూస్.. -
ధోని, కోహ్లిలకు తగ్గింది.. రాహుల్, పంత్‌లకు పెరిగింది
ఐపీఎల్ మెగావేలం విజయవంతంగా ముగిసింది. ఈసారి వేలంలో పాల్గొన్న 10 ఫ్రాంచైజీలు తమకు కావాల్సిన ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాయి. కొందరికి జాక్‌పాట్ తగిలితే.. ఇంకొందరికి నామమాత్రపు ధర దక్కింది. కాగా వేలంలో ఈసారి విదేశీ క్రికెటర్ల కన్నా స్వదేశీ క్రికెటర్ల వైపే ఫ్రాంచైజీలు ఎక్కువ ఆసక్తిని కనబరిచాయి. ఉదాహరణకు ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్, శ్రేయాస్ అయ్యర్, ప్రసిధ్ కృష్ణ, ఆవేశ్ ఖాన్ లాంటి ఆటగాళ్లకు జాక్‌పాట్ తగిలింది. అదే సమయంలో కొందరిని వేలంలో అసలు పట్టించుకోకపోవడం విశేషం. సురేశ్ రైనా, ఇయాన్ మోర్గాన్, స్టీవ్ స్మిత్, ఆరోన్ ఫించ్ ఈ జాబితాలో ఉన్నారు. చదవండి: Ind Vs Wi T20 Series: పంత్‌కు బంపర్ ఆఫర్.. వైస్ కెప్టెన్‌గా ఛాన్స్ ఇక వేలానికి ముందు ఆయా ఫ్రాంచైజీలు కొందరి ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల ధరల్లోనూ హెచ్చుతగ్గులు ఉన్నాయి. రిటైన్ జాబితాలో ఉన్న కోహ్లి, ధోనిల ధర పడిపోగా.. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్‌ల ధర అమాంతం పెరిగిపోయింది. వీరే కాదు.. గుజరాత్ టైటాన్స్‌కు వెళ్లి కెప్టెన్ రేసులో ఉన్న హార్దిక పాండ్యాతో రషీద్ ఖాన్, శుబ్‌మన్ గిల్ల ధర భారీగా పెరిగింది. అహ్మదాబాద్ ఫ్రాంచైజీ ఈ ముగ్గురిని రిటైన్ చేసుకోకముందు హార్దిక్ పాండ్యా ధర రూ. 11 కోట్లు ఉంటే.. ప్రస్తుతం రూ.15 కోట్లకు పెరిగింది. రషీద్ ఖాన్ ధర రూ.9 కోట్ల నుంచి రూ. 15 కోట్లు, శుభ్‌మన్ గిల్ ధర రూ.1.8 కోట్ల నుంచి రూ. 8 కోట్లకు పెరగడం విశేషం. ఇక గత సీజన్లోనే ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా ప్రమోషన్ పొందిన రిషబ్ పంత్ ధర భారీగా పెరిగింది. రిటైన్‌కు ముందు పంత్ ధర రూ. 8 కోట్లు ఉంటే.. ఇప్పుడు రూ. 16 కోట్లకు చేరడం విశేషం. ఇక సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని ధర రిటైన్‌కు ముందు రూ. 15 కోట్లు ఉంటే.. ఆ తర్వాత రూ. 12 కోట్లకు తగ్గింది. అలాగే ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ధర రిటైన్‌కు ముందు రూ. 17 కోట్లు ఉంటే.. ప్రస్తుతం రూ.15 కోట్లుగా ఉంది. ఇంకా రిటైన్ జాబితాలో ఏయే ఆటగాడికి పెరిగింది.. తగ్గిందనేది ఒకసారి పరిశీలిద్దాం. చదవండి: European Cricket: మాములు ప్రతీకారం మాత్రం కాదు.. 'అంతకు మించి' చెన్నై సూపర్ కింగ్స్: సీఎస్కే 2021 ధర 2022 ధర పెరిగింది/తగ్గింది జడేజా రూ.7 కోట్లు రూ.16 కోట్లు రూ 9 కోట్లు పెరిగింది ధోని రూ.15 కోట్లు రూ.12 కోట్లు రూ. 3 కోట్లు తగ్గింది మొయిన్ అలీ రూ. 8 కోట్లు రూ. 9 కోట్లు రూ. కోటి పెరిగింది రుతురాజ్‌గైక్వాడ్ రూ. 20 లక్షలు రూ.6 కోట్లు రూ. 5.8 కోట్లు పెరిగింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: ఆర్సీబీ 2021 ధర 2022 ధర పెరిగింది/తగ్గింది విరాట్ కోహ్లి రూ. 17 కోట్లు రూ.15 కోట్లు రూ. 2 కోట్లు తగ్గింది గ్లెన్ మ్యాక్స్‌వెల్ రూ. 14.25 కోట్లు రూ. 11 కోట్లు రూ. 3.25 కోట్లు పెరిగింది మహ్మద్ సిరాజ్ రూ. 2.6 కోట్లు రూ. 7 కోట్లు రూ. 4.4 కోట్లు పెరిగింది పంజాబ్ కింగ్స్ మయాంక్ అగర్వాల్ రూ.1 కోటి రూ.12 కోట్లు రూ.11 కోట్లు పెరిగింది అర్షదీప్ సింగ్ రూ. 20లక్షలు రూ. 4 కోట్లు రూ.3.8 కోట్టు పెరిగింది కోల్‌కతా నైట్‌రైడర్స్ కేకేఆర్ 2021 ధర 2022 ధర పెరిగింది/తగ్గింది ఆండ్రీ రసెల్ 7 కోట్లు 12 కోట్లు రూ. 5 కోట్లు పెరిగింది వరుణ్ చక్రవర్తి 4 కోట్లు 8 కోట్లు రూ. 4 కోట్లు పెరిగింది వెంకటేశ్ అయ్యర్ 20 లక్షలు 8 కోట్లు రూ. 7.8 కోట్లు పెరిగింది సునీల్ నరైన్ 8.5 కోట్లు 6 కోట్లు రూ.2.5 కోట్లు తగ్గింది సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ 2021 ధర 2022 ధర పెరిగింది/తగ్గింది కేన్ విలియమ్సన్ రూ.3 కోట్లు రూ.14 కోట్లు రూ.11 కోట్లు పెరిగింది అబ్దుల్ సమద్ 20 లక్షలు రూ. 4 కోట్లు రూ.3.8 కోట్లు పెరిగింది ఉమ్రాన్ మలిక్ 10 లక్షలు రూ. 4 కోట్లు రూ. 3.9 కోట్లు పెరిగింది ముంబై ఇండియన్స్ ముంబై ఇండియన్స్ 2021 ధర 2022 ధర పెరిగింది/తగ్గింది రోహిత్ శర్మ 15 కోట్లు 16 కోట్లు రూ. కోటి పెరిగింది బుమ్రా 7 కోట్లు 12 కోట్లు రూ. 5 కోట్లు పెరిగింది సూర్యకుమార్ 3.2 కోట్లు 8 కోట్లు రూ. 5.4 కోట్లు పెరిగింది పొలార్డ్ 5.4 కోట్లు 6 కోట్లు రూ. 60 లక్షలు తగ్గింది రాజస్తాన్ రాయల్స్ రాజస్తాన్ రాయల్స్ 2021 ధర 2022 ధర పెరిగింది/తగ్గింది సంజు సామ్సన్ రూ. 8 కోట్లు రూ.14 కోట్లు 6 కోట్లు పెరిగింది జాస్ బట్లర్ రూ. 4.4 కోట్లు రూ.10 కోట్లు రూ. 3.6 కోట్లు పెరిగింది యశస్వి జైస్వాల్ రూ. 2.4 కోట్లు రూ. 4 కోట్లు రూ. 1.6 కోట్లు పెరిగింది గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్ 2021 ధర 2022 ధర పెరిగింది/తగ్గింది హార్దిక్ పాండ్యా రూ.11 కోట్లు రూ.15 కోట్లు రూ. 4 కోట్లు పెరిగింది రషీద్ ఖాన్ రూ. 9 కోట్లు రూ.15 కోట్లు రూ. 6 కోట్లు పెరిగింది శుబ్‌మన్ గిల్ రూ. 1.8 కోట్లు రూ.8 కోట్లు రూ. రూ. 6.2 కోట్లు పెరిగింది లక్నో సూపర్ జెయింట్స్ లక్నో సూపర్‌జెయింట్స్ 2021 ధర 2022 ధర పెరిగింది/తగ్గింది కేఎల్ రాహుల్ రూ.11 కోట్లు రూ.16 కోట్లు రూ.5 కోట్లు పెరిగింది రవి బిష్ణోయ్ 2 కోట్లు రూ.4 కోట్లు రూ. 2 కోట్లు పెరిగింది మార్కస్ స్టోయినిస్ 4.8 కోట్లు రూ.9.2 కోట్లు రూ. 4.4 కోట్లు పెరిగింది -
ఐపీఎల్ వేలంలో అందాల భామ.. ఎవరా బ్యూటీ గర్ల్ ?
రెండురోజుల పాటు జరిగిన ఐపీఎల్ మెగావేలం విజయవంతమైంది. కొందరు ఆటగాళ్లు జాక్‌పాట్ దక్కించుకుంటే.. మరికొందరికి నిరాశే మిగిలింది. ఎక్కువ మొత్తం దక్కించుకుంటారనుకున్న ప్లేయర్లకు భంగపాటు ఎదురైంది. అయితే ఈసారి వేలంలో ఆటగాళ్లతో పాటు ఒక 19 ఏళ్ల అమ్మాయి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన చురుకుదనంతో చూపు తిప్పుకోకుండా చేసింది. తన చార్మింగ్ లుక్‌తో వేలంలో అందరి దృష్టి తనవైపు ఉండేలా చేసుకుంది. ఎవరా బ్యూటీ గర్ల్ అంటూ టీవీల్లో ఆమెను చూసిన వారంతా ముచ్చటపడ్డారు. కొందరు గుర్తుపట్టారు కూడా. ఆమే.. జాహ్నవి మెహతా. కోల్‌కతా టీం సహా యజమాని, బాలీవుడ్ నటి జూహీ చావ్లా కూతురు. కోల్‌కతా తరఫున షారుఖ్ కుమారుడు ఆర్యన్‌ఖాన్, కుమార్తె సుహానాలతో కలిసి వేలంలో పాల్గొన్నారు జూహీ చావ్లా తనయురాలు జాహ్నవి మెహతా. ఆమె ఆకర్షణీయ రూపం... ఆ కళ్లలో మేజిక్ అందరినీ ఆకర్షించింది. రెండేళ్ల క్రితం జరిగిన ఐపీఎల్ వేలంలోనూ ఆమె పార్టిసిపేట్ చేసింది. ఇది సెంకడ్ టైమ్. తల్లి జూహ్లీ చావ్లా తోడు లేకుండానే.. కోల్‌కతా నైట్ రైడర్స్ వేలంలో యాక్టివ్‌గా వ్యవహరించడం విశేషం. ఆమె ఛార్మింగ్‌తో కెమెరాలన్నీ అటువైపే ఫోకస్ చేశాయి. జాహ్నవి విదేశాల్లో డిగ్రీ పూర్తి చేసివచ్చి.. ప్రస్తుతం కేకేఆర్ వ్యవహారాలు చూస్తున్నట్లు తెలుస్తోంది. -
‘మేం దూరదృష్టితో ఆలోచిస్తాం’
ముంబై: ఐపీఎల్లో తాము ఆటగాళ్లను కొనుగోలు చేసే సమయంలో రాబోయే సీజన్లను కూడా దృష్టిలో పెట్టుకున్నట్లు ముంబై ఇండియన్స్ యజమాని నీతా అంబానీ వ్యాఖ్యానించారు. తమ కొత్త జట్టు ముంబై అభిమానులకు కూడా నచ్చుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది. జోఫ్రా ఆర్చర్ 2022లో ఆడలేడని తెలిసినా ముంబై భారీ మొత్తానికి అతడిని సొంతం చేసుకుంది. ‘ముంబై ఇండియన్స్ టీమ్‌ను నిర్మించడంలో మేం స్వల్ప కాలిక లక్ష్యాలను పెట్టుకుంటూనే దూరదృష్టితో కూడా ఆలోచిస్తాం. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొనే వేలంలో కొందరు ఆటగాళ్లను తీసుకున్నాం. అభిమానుల నమ్మకం వమ్ము కాకుండా మా జట్టు లీగ్‌లో ఆడుతుందని ఆశిస్తున్నాం. నిజానికి మెగా వేలం అంటే చాలా కష్టమైన వ్యవహారం. ఇన్నేళ్లుగా మాతో ఉన్న ఆటగాళ్లను వదిలేయడానికి మనసొప్పదు. కానీ తప్పదు. హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, డి కాక్, బౌల్ట్‌లను మా జట్టులోకి తీసుకునేందుకు చివరి వరకు ప్రయత్నించాం. అయితే ఇప్పుడు ఉన్న టీమ్ పట్ల చాలా సంతృప్తిగా ఉన్నాం’ అని నీతా స్పష్టం చేసింది. మాకూ సంతోషమే... వేలంలో తాము తీసుకున్న ఆటగాళ్ల పట్ల రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), రాజస్తాన్ రాయల్స్ జట్లు కూడా సంతృప్తి వ్యక్తం చేశాయి. డు ప్లెసిస్ రాకతో తమ టాపార్డర్ మెరుగైందని, కెప్టెన్‌గా అతనికి ఉన్న విశేష అనుభవం తమ జట్టుకు అదనపు ప్రయోజనాన్ని కల్పిస్తుందని ఆర్సీబీ హెడ్ కోచ్ సంజయ్ బంగర్ అన్నాడు. మరోవైపు బలమైన భారత ఆటగాళ్లతో జట్టును రూపొందించాలనే ఉద్దేశంతో వేలం బరిలోకి దిగామని, ఈ విషయంలో విజయవంతమయ్యామని రాజస్తాన్ రాయల్స్ యజమాని మనోజ్ బదాలే చెప్పాడు. సంజూ సామ్సన్, యశస్వి జైస్వాల్‌లతో పాటు అశ్విన్, చహల్, కరుణ్ నాయర్, సైనీ, దేవ్‌దత్ పడిక్కల్, ప్రసిధ్ కృష్ణవంటి ఆటగాళ్లు రాయల్స్‌ను గెలిపించగలరని అతను విశ్వాసం వ్యక్తం చేశాడు. -
IPL 2022: అందుకే రైనాను తీసుకోలేదు.. క్లారిటీ ఇచ్చిన సీఎస్కే
Suresh Raina: బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో కొందరు స్టార్ ప్లేయర్స్ అన్ సోల్డ్ గా మిగిలిపోయారు. ఐపీఎల్ కెరీర్లోనే ది బెస్ట్ అనిపించుకున్న వారు సైతం కనీస ధరకు అమ్ముడు పోలేదు. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ సురేశ్ రైనా అన్ సోల్డ్‌గా మిగిలిపోవడం క్రికెట్ ఫ్యాన్స్ ను, తమిళ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. Super Thanks for all the Yellove memories, Chinna Thala!🥺 #SuperkingForever 🦁 pic.twitter.com/RgyjXHyl9l — Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) February 13, 2022 అయితే, వేలంలో రైనాను తీసుకోకపోవడంపై చైన్నై ఫ్రాంచైజీ సీఈఓ కాశీ విశ్వనాథ్ సోమవారం స్పందించారు. ఆయన మాట్లాడుతూ..' సురేశ్ రైనా పన్నెండేళ్లుగా ఐపీఎల్లో అద్భుతంగా రాణించాడు. కానీ, ప్రతీ ఆటగాడిని ఫామ్ ఆధారంగానే జట్టులోకి తీసుకోవడం జరుగుతుంది. అతన్ని కొనుగోలు చేయడం మాకు చాలా కష్టమైన విషయమని అర్థం చేసుకోవాలన్నారు. మా టీంకు అతను ఫిట్ కాదని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. రైనాను మిస్ అవుతున్నామని తెలిపారు. మరోవైపు.. ఐపీఎల్లో తమ జట్టుకు ఎన్నో విజయాలు అందించిన రైనా సేవలకు చెన్నై సూపర్‌కింగ్స్ ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపింది. చదవండి: IPL 2022: ధోని జట్టుపై గరం అవుతున్న సొంత అభిమానులు.. కారణం ఇదేనా..? -
IPL 2022: ధోని జట్టుపై గరం అవుతున్న సొంత అభిమానులు.. కారణం ఇదేనా..?
ఐపీఎల్ మెగా వేలం 2022లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) జట్టు శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ మహీశ్ తీక్షణను 70 లక్షలకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ లంక క్రికెటర్ ఎంపిక ప్రస్తుతం సీఎస్కే యాజమాన్యానికి పెద్ద తలనొప్పిగా మారింది. అమితంగా ఆరాధించే సొంత అభిమానుల చేతనే చివాట్లు తినే స్థాయికి సీఎస్కేను దిగజార్చింది. కొందరు తమిళ తంబిలైతే ఏకంగా సీఎస్కేను ఐపీఎల్ నుంచి బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తూ.. ట్విటర్లో #Boycott_ChennaiSuperKings పేరిట వ్యతిరేక ప్రచారాన్ని చేస్తున్నారు. #Boycott_ChennaiSuperKings pic.twitter.com/KkHw7T9OUb — மேட்டூர் தினேஷ் (@NTK_DINESH) February 14, 2022 తమిళులకు తీరని అన్యాయం చేసిన లంకేయులను జట్టులోకి ఎందుకు తీసుకున్నారని వారు మండిపడుతున్నారు. లక్షల సంఖ్యలో భారతీయ తమిళులను శరణార్ధులుగా పంపిన దేశానికి చెందిన ఆటగాడిని తమిళ జట్టులోకి ఎలా తీసుకుంటారని సీఎస్కే యాజయాన్యంపై ఫైరవుతున్నారు. లంక క్రికెటర్ తీక్షణను వెంటనే జట్టులో నుంచి తొలగించాలని లేదంటే సీఎస్కేను ఐపీఎల్ నుంచి బ్యాన్ చేయాలని సోషల్‌మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు. సీఎస్కేకు మరపురాని విజయాలందించిన సురేశ్ రైనా లాంటి ఆటగాడిని కాదని సింహల ఆటగాడిని ఎంపిక చేయడమేంటని కొందరు అభిమానులు ప్రశ్నిస్తున్నారు. తీక్షణను వెంటనే తొలగించి సురేశ్ రైనాను జట్టులోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. #Boycott_ChennaiSuperKings pic.twitter.com/LGS61z4s74 — Narasimha Midde (@narasimhamvnr) February 14, 2022 చదవండి: IPL 2022: సంగక్కర తొండాట.. అమాంతం పెరిగిపోయిన ఆర్చర్ ధర..! -
IPL 2022: సంగక్కర తొండాట.. అమాంతం పెరిగిపోయిన ఆర్చర్ ధర..!
ఐపీఎల్ 2022 మెగా వేలం రెండో రోజు(ఫిబ్రవరి 13) సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ డైరెక్టర్ కుమార సంగక్కర వింత ప్రవర్తన పలు అనుమానాలకు తావిచ్చింది. ఇంగ్లండ్ ఆటగాడు జోఫ్రా అర్చర్‌కు సంబంధించి లైవ్ అక్షన్ జరుగుతుండగా సంగక్కర ప్రవర్తించిన తీరుపై ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ప్రత్యర్ధి జట్లకు సైగలు చేస్తూ.. ఆర్చర్ ధర అమాంతంగా పెరిగిపోయేలా చేసిన సంగక్కర చీటింగ్‌కు పాల్పడ్డాడని సోషల్‌మీడియా కోడై కుస్తుంది. ఇందుకు తగిన ఆధారాలు కూడా లభించడంతో అభిమానులు సంగక్కరపై విమర్శలు గుప్పిస్తున్నారు. దిగ్గజ ఆటగాడిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలా ప్రవర్తించడమేంటని ప్రశ్నిస్తున్నారు. Sanga was trying to convince other teams to increase the bid 😏 pic.twitter.com/H6GRKU1Myk — ᧁꪖꪊ᥅ꪖꪜ (@ImGS_08) February 13, 2022 వివరాల్లోకి వెళితే.. ఐపీఎల్ మెగా వేలం రెండో రోజు ఆసక్తికరంగా సాగుతుండగా, ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ 2 కోట్ల రూపాయల బేస్ ప్రైజ్ విభాగంలో వేలంలోకి వచ్చాడు. అయితే, ఆర్చర్ ఈ సీజన్లో ఆడడని తెలిసి కూడా రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు అతని కోసం పోటీ పడటం మొదలెట్టాయి. వేలంలో ఆర్చర్ ధర 6 కోట్ల వద్దకు రాగానే రాజస్థాన్ పాకెట్లో డబ్బులు అయిపోవడంతో ఆ ఫ్రాంచైజీ డైరెక్టర్ కుమార సంగక్కర చీటింగ్‌కు పాల్పడ్డాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమకు దక్కని ఆర్చర్‌కు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో ముంబై ఇండియన్స్‌తో పోటీ పడాలని సన్ రైజర్స్‌కు సైగలు చేశాడు సంగక్కర. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో సంగక్కరపై ముప్పేట దాడి మొదలైంది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి చీటింగ్ పాల్పడటానికి సిగ్గు లేదా అంటూ నెటిజన్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. సంగక్కరపై ఐపీఎల్ పాలక మండలి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా, అర్చర్ విషయంలో పట్టువదలని ముంబై ఇండియన్స్ అతన్ని 8 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. అతడు ఐపీఎల్ 2022 సీజన్‌కు అందుబాటులో ఉండడని తమకు తెలుసని, బుమ్రా- ఆర్చర్ కాంబినేషన్ అద్భుతంగా ఉంటుందని భావించి, వచ్చే ఏడాది కోసమే ఆర్చర్‌ను సొంతం చేసుకున్నామని ముంబై యాజమాన్యం వివరణ ఇవ్వడం కొసమెరుపు. చదవండి: IPL 2022: మిశీ భాయ్, నీ సేవలకు సలాం.. ఢిల్లీ జట్టు ఎప్పటికీ నీదే..! -
IPL 2022: మిశీ భాయ్, నీ సేవలకు సలాం.. ఢిల్లీ జట్టు ఎప్పటికీ నీదే..!
ఐపీఎల్ కెరీర్లో సింహ భాగం ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించి, లీగ్ చరిత్రలో మూడో అత్యధిక వికెట్ టేకర్‌గా(154 మ్యాచ్‌ల్లో 166 వికెట్లు) నిలిచిన అమిత్ మిశ్రాను తాజాగా ముగిసిన ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఏ జట్టు కూడా సొంతం చేసుకోకపోవడంతో అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయాడు. ఈ నేపథ్యంలో ఈ టీమిండియా వెటరన్ లెగ్ స్పిన్నర్‌ను ఉద్దేశిస్తూ.. ఢిల్లీ క్యాపిటల్స్ యజమాని పార్థ జిందాల్ భావోద్వేగ ట్వీట్ చేశాడు. To one of the @IPL greats @MishiAmit we @DelhiCapitals would like to salute everything you have done for us over all these years and would love to have you back at DC in whatever capacity you see fit as your insights would be most valuable. Mishy bhai DC is yours for life — Parth Jindal (@ParthJindal11) February 13, 2022 ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ బౌలర్లలో ఒకడివైన మిశి భాయ్.. ఢిల్లీ క్యాపిటల్స్ నీ సేవలకు సలాం చేస్తుంది, నీవు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నీ సేవలను వినియోగించుకునేందుకు డీసీ జట్టు సిద్ధంగా ఉంది, ఈ జట్టు ఎప్పటికీ నీదే అంటూ పార్థ.. ట్విటర్ వేదికగా ఐపీఎల్ దిగ్గజ స్పిన్నర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ ట్విట్‌ను బట్టి చూస్తే.. డీసీ జట్టు అమిత్ మిశ్రా సేవలకు పరోక్షంగా వినియోగించుకునేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఇదిలా ఉంటే, ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో కోటి రూపాయల బేస్ ప్రైజ్ విభాగంలో పేరును నమోదు చేసుకున్న అమిత్ మిశ్రాపై ఢిల్లీ సహా ఏ ఇతర ఐపీఎల్ జట్టు కూడా ఆసక్తి కనబర్చలేదు. మిశ్రా గతేడాది లీగ్‌లో చివరిసారిగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో దర్శనమిచ్చాడు. ఆ మ్యాచ్‌లో మిశ్రా 3 ఓవర్లలో 27 పరుగులు సమర్పించకుని ఓ వికెట్ పడగొట్టాడు. కాగా, ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ముగిసిన ఐపీఎల్ మెగా వేలంలో అమిత్ మిశ్రాతో పాటు టీమిండియా వెటరన్ ఆటగాళ్లు సురేశ్ రైనా, ఇషాంత్ శర్మ, పుజారా, కేదార్ జాదవ్, హనుమ విహారిలపై కూడా ఏ జట్టు ఆసక్తి కనబర్చలేదు. దీంతో ఈ టీమిండియా వెటరన్ క్రికెటర్లంతా అమ్ముడుపోని ఆటగాళ్లుగా మిగిలిపోయారు. చదవండి: వేలంలో వారికి పంట పండింది.. వీళ్లను అసలు పట్టించుకోలేదు -
ఐపీఎల్ 2022: విధ్వంసకర వీరులతో కూడిన గుజరాత్ టైటాన్స్ జట్టు ఇదే..
ఐపీఎల్ 2022 సీజన్ ద్వారా క్యాష్ రిచ్ లీగ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్.. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరిగిన మెగా వేలంలో చాలా చాకచక్యంగా వ్యవహరించి, టీ20లకు కావాల్సిన అసలుసిసలైన జట్టును ఎంచుకుంది. ఈ జట్టుకు కెప్టెన్‌గా టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా(15 కోట్లు)ను రికార్డు ధర వెచ్చించి సొంతం చేసుకున్న గుజరాత్ టైటాన్స్.. అఫ్గాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్(15 కోట్లు), టీమిండియా యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్(8 కోట్లు)లను మరో ఇద్దరు డ్రాఫ్టెడ్ ప్లేయర్లుగా ఎంచుకుంది. వీరిపై ఏకంగా 38 కోట్లు వెచ్చించి మిగతా జట్లలో కాక రేపిన టైటాన్స్.. భారీ హిట్టర్లే టార్గెట్‌గా వేలం బరిలోకి దిగింది. ఫెర్గూసన్ (10 కోట్లు), జేసన్ రాయ్ (2 కోట్లు), డేవిడ్ మిల్లర్ (3 కోట్లు), మాథ్యూ వేడ్ (2.4 కోట్లు), రాహుల్ తెవాతియా (9 కోట్లు) వంటి విధ్వంసకర వీరులకు రికార్డు ధర చెల్లించి సొంతం చేసుకుంది. మెగా వేలంలో 52 కోట్లు ఖర్చు చేసి 20 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. 2022 ఐపీఎల్ ఫైట్‌లో తలపడబోయే గుజరాత్ టైటాన్స్ పూర్తి జాబితా ఇదే.. రిటైన్డ్ ఆటగాళ్లు: హార్ధిక్ పాండ్యా(15 కోట్లు) రషీద్ ఖాన్(15 కోట్లు) శుభ్‌మన్ గిల్(8 కోట్లు) మెగా వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: లోకి ఫెర్గూసన్ (10 కోట్లు) రాహుల్ తెవాతియా (9 కోట్లు) మహ్మద్ షమీ (6.25 కోట్లు) యశ్ దయాల్ (3.2 కోట్లు) ఆర్ సాయ్ కిషోర్ (3 కోట్లు) డేవిడ్ మిల్లర్ (3 కోట్లు) అభినవ్ సదరంగని (2.6 కోట్లు) మాథ్యూ వేడ్ (2.4 కోట్లు) అల్జరీ జోసఫ్ (2.4 కోట్లు) జేసన్ రాయ్ (2 కోట్లు) వృద్ధిమాన్ సాహా (1.9 కోట్లు) జయంత్ యాదవ్ (1.70 కోట్లు) విజయ్ శంకర్ (1.40 కోట్లు) డామినిక్ డ్రేక్స్ (1.10 కోట్లు) గురుకీరత్ సింగ్ (50 లక్షలు) వరుణ్ ఆరోన్ (50 లక్షలు) నూర్ అహ్మద్ (30 లక్షలు) దర్శన్ నల్ఖండే (20 లక్షలు) ప్రదీప్ సాంగ్వాన్ (20 లక్షలు) సాయి సుదర్శన్ (20 లక్షలు) చదవండి: ఐపీఎల్ 2022: గతేడాది మిస్ అయ్యింది, ఈసారి తగ్గేదేలే.. కేకేఆర్ పూర్తి జట్టు ఇదే.. -
ఐపీఎల్ 2022: గతేడాది మిస్ అయ్యింది, ఈసారి తగ్గేదేలే.. కేకేఆర్ పూర్తి జట్టు ఇదే..
రెండు రోజుల పాటు(ఫిబ్రవరి 12, 13) ఆసక్తికరంగా సాగిన ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు ఆచితూచి వ్యవహరించింది. తమకు కావల్సిన ఆటగాళ్ల కోసం పోటీపడుతూనే, అవసరానికి తగ్గట్టుగా పర్స్ మేనేజ్మెంట్ చేసినట్లు స్పష్టంగా కనిపించింది. పాట్ కమిన్స్(7.25 కోట్లు), శ్రేయస్ అయ్యర్ (12.25 కోట్లు), నితీశ్ రాణా (8 కోట్లు), శివమ్ మావి (7.25 కోట్లు) లాంటి ఆటగాళ్ల కోసం ఎంతైనా తగ్గేదేలే అన్నట్లు కనిపించిన కేకేఆర్.. టీమిండియా టెస్ట్ ఆటగాడు ఆజింక్య రహానేపై అనూహ్యంగా కోటి రూపాయలు ఖర్చు చేసి అందరినీ ఆశ్చర్యపరచింది. వేలానికి ముందే 34 కోట్లు పెట్టి ఆండ్రీ రసెల్ (12 కోట్లు), వరుణ్ చక్రవర్తి (8 కోట్లు), వెంకటేశ్ అయ్యర్ (8 కోట్లు), సునీల్ నరైన్ (6 కోట్లు)లను రీటైన్ చేసుకున్న కేకేఆర్.. మెగా వేలంలో 45 కోట్లు ఖర్చు చేసి 19 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. 2021 సీజన్లో అనూహ్య విజయాలతో ఫైనల్‌కు దూసుకొచ్చిన కేకేఆర్ ఈ సారి పక్కా ప్రణాళిక ప్రకారం జట్టును ఎంచుకుని మరో టైటిల్ తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. వేలంలో భారీ ధర వెచ్చించి సొంతం చేసుకున్న టీమిండియా ప్లేయర్ శ్రేయస్ అయ్యర్‌కు కేకేఆర్ సారధ్య బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉంది. 2022 ఐపీఎల్ ఫైట్‌లో తలపడబోయే కేకేఆర్ పూర్తి జాబితా ఇదే.. రిటైన్డ్ ఆటగాళ్లు: ఆండ్రీ రసెల్ (12 కోట్లు) వరుణ్ చక్రవర్తి (8 కోట్లు) వెంకటేశ్ అయ్యర్ (8 కోట్లు) సునీల్ నరైన్ (6 కోట్లు) మెగా వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: శ్రేయస్ అయ్యర్ (12.25 కోట్లు) నితీశ్ రాణా (8 కోట్లు) పాట్ కమిన్స్ (7.25 కోట్లు) శివమ్ మావి (7.25 కోట్లు) సామ్ బిల్లింగ్స్ (2 కోట్లు) ఉమేశ్ యాదవ్ (2 కోట్లు) అలెక్స్ హేల్స్ (1.5 కోట్లు) అజింక్య రహానే (కోటి) మహ్మద్ నబీ ( కోటి) షెల్డన్ జాక్సన్ (60 లక్షలు) అశోక్ శర్మ (55 లక్షలు) అభిజీత్ తోమర్ (40 లక్షలు) రింకు సింగ్ (20 లక్షలు) అంకుల్ రాయ్ (20 లక్షలు) రసిక్ దార్ (20 లక్షలు) బి ఇంద్రజిత్ (20 లక్షలు) ప్రీతమ్ సింగ్ (20 లక్షలు) రమేశ్ కుమార్ (20 లక్షలు) అమాన్ ఖాన్ (2 లక్షలు) చదవండి: ఐపీఎల్ 2022: ఆరెంజ్ ఆర్మీ ఇదే.. ఈసారి దబిడి దిబిడే..! -
హిట్టర్లలతో సిద్దమైన పంజాబ్.. పూర్తి జట్టు ఇదే
ఐపీఎల్-2022 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ కీలక ఆటగాళ్లను సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ ఆల్ రౌండర్ లయమ్ లివింగ్ స్టోన్‌ను రూ. 11.50 కోట్లకు కొనుగోలు చేసింది. అదే విధంగా రబడాను 9.25 కోట్లకు, షారుఖ్ ఖాన్‌ను 9 కోట్లకు, ధావన్‌ను 8. 25 కోట్లకు సొంతం చేసుకుంది. ఇక జట్టులో 25 మంది ఆటగాళ్లు ఉండగా, అందులో భారత క్రికెటర్లు 18 మంది, విదేశీ ఆటగాళ్లు 7గురు ఉన్నారు. వీరిని వేలంలో కొనుగోలు చేయడానికి పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ రూ. 86 కోట్ల 55 లక్షలు ఖర్చు చేసింది. పంజాబ్ కింగ్స్ జట్టు మయాంక్ అగర్వాల్ : రూ. 12 కోట్లు లివింగ్‌స్టోన్: రూ. 11 కోట్ల 50 లక్షలు రబడ: రూ. 9 కోట్ల 25 లక్షలు షారుఖ్ ఖాన్: రూ. 9 కోట్లు ధావన్: రూ. 8 కోట్ల 25 లక్షలు బెయిర్‌స్టో: రూ. 6 కోట్ల 75 లక్షలు ఒడియన్ స్మిత్: రూ. 6 కోట్లు రాహుల్ చహర్: రూ. 5 కోట్ల 25 లక్షలు అర్శ్‌దీప్ సింగ్: రూ. 4 కోట్లు హర్‌ప్రీత్ బ్రార్: రూ. 3 కోట్ల 80 లక్షలు రాజ్ బావా: రూ. 2 కోట్లు వైభవ్ అరోరా: రూ. 2 కోట్లు నాథన్ ఎలిస్: రూ. 75 లక్షలు ప్రభ్‌సిమ్రన్: రూ. 60 లక్షలు రిషి ధావన్: రూ. 55 లక్షలు భానుక రాజపక్స: రూ. 50 లక్షలు సందీప్ శర్మ: రూ. 50 లక్షలు బెన్ని హోవెల్ : రూ. 40 లక్షలు ఇషాన్ పొరెల్ : రూ. 25 లక్షలు ప్రేరక్ మన్కడ్: రూ. 20 లక్షలు జితేశ్ శర్మ: రూ. 20 లక్షలు బల్తేజ్ సింగ్: రూ. 20 లక్షలు రితిక్ ఛటర్జీ: రూ. 20 లక్షలు అథర్వ తైడ్: రూ. 20 లక్షలు అన్శ్ పటేల్: రూ. 20 లక్షలు -
ఐపీఎల్ 2022: ఆరెంజ్ ఆర్మీ ఇదే.. ఈసారి దబిడి దిబిడే..!
రెండు రోజుల పాటు(ఫిబ్రవరి 12, 13) ఆసక్తికరంగా సాగిన ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలం నిన్నటితో ముగిసింది. లీగ్‌లో పాల్గొనబోయే 10 జట్లు తమతమ పర్స్లలోని డబ్బులకు సరిపడా ఆటగాళ్లను కొనుగోలు చేసి ఐపీఎల్ 2022 మెగా ఫైట్‌కు ఇప్పటినుంచే కత్తులు నూరుతున్నాయి. ఈ సారి వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మిగిలిన జట్లతో పోలిస్తే కాస్త భిన్నంగా ఆటగాళ్లను కొనుగోలు చేసింది. తమ వద్ద ఉన్న 68 కోట్లతో ఎస్ఆర్హెచ్ యాజమాన్యం యువ క్రికెటర్ల కొనుగోలుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు స్పష్టంగా తెలిసింది. కేన్ విలియమ్సన్(14 కోట్లు), అబ్దుల్ సమద్(4 కోట్లు), ఉమ్రాన్ మాలిక్(4 కోట్లు)లను రిటైన్ చేసుకున్న ఎస్ఆర్హెచ్.. మెగా వేలంలో 67.9 కోట్లు వెచ్చించి 20 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. 2022 ఐపీఎల్ ఫైట్‌లో తలపడబోయే ఎస్ఆర్హెచ్ పూర్తి జాబితా ఇదే.. రిటైన్డ్ ఆటగాళ్లు: కేన్ విలియమ్సన్(14 కోట్లు), కెప్టెన్ అబ్దుల్ సమద్(4 కోట్లు) ఉమ్రాన్ మాలిక్(4 కోట్లు) మెగా వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: నికోలస్ పూరన్(10.75 కోట్లు) వాషింగ్టన్ సుందర్(8.75 కోట్లు) రాహుల్ త్రిపాఠి(8.5 కోట్లు) రొమారియో షెపర్డ్(7.7 కోట్లు) అభిషేక్ శర్మ(6.5 కోట్లు) భువనేశ్వర్ కుమార్(4.2 కోట్లు) మార్కో జన్సెన్(4.2 కోట్లు) టి నటరాజన్(4 కోట్లు) కార్తీక్ త్యాగి(4 కోట్లు) ఎయిడెన్ మార్క్రమ్(2.6 కోట్లు) సీన్ అబాట్(2.4 కోట్లు) గ్లెన్ ఫిలిప్(1.5 కోట్లు) శ్రేయస్ గోపాల్(75 లక్షలు) విష్ణు వినోద్(50 లక్షలు) ఫజల్ హక్ ఫారుఖి(50 లక్షలు) జె సుచిత్(20 లక్షలు) ప్రియమ్ గార్గ్(20 లక్షలు) ఆర్ సమర్థ్(20 లక్షలు) శశాంక్ సింగ్(20 లక్షలు) సౌరభ్ దూబే(20 లక్షలు) చదవండి: ‘మాకు అనామకులే కావాలి’.. సన్‌రైజర్స్ తీరే వేరు -
రూ.10 కోట్లకు ప్రసిధ్ద్ కృష్ణ.. రాజస్తాన్ రాయల్స్ జట్టు ఇదే
ఐపీఎల్-2022 మెగా వేలంలో రాజస్తాన్ రాయల్స్ తమ జట్టును బలమైన జట్టుగా సిద్దం చేసుకుంది. ఈ సారి వేలంలో రాజస్తాన్ స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసింది. కాగా వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో అద్భుతంగా రాణించిన భారత బౌలర్ ప్రసిధ్ద్ కృష్ణను రూ.10 కోట్లకు రాజస్తాన్ కొనుగోలు చేసింది. అదే విధంగా వెస్టిండీస్ బ్యాటర్ హెట్మైర్ను రూ. 8.50 కోట్లకు, ట్రెంట్ బౌల్ట్‌ను రూ.8 కోట్లకు, దేవ్‌దత్త్ పడిక్కల్‌ను రూ. 7.75 కోట్లకు కొనుగోలు చేసింది. రాజస్తాన్ జట్టు మొత్తం 24 మంది ఆటగాళ్లు కాగా.. అందులో 16 మంది భారత క్రికెటర్లు కాగా, ఎనమిది మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. వీరి కోసం రాజస్తాన్ రూ. 89.5 కోట్లు ఖర్చు చేసింది. ఇక రాజస్తాన్ రాయల్స్ ఆటగాళ్లను ఒకసారి పరిశీలిద్దాం. రాజస్తాన్ రాయల్స్ జట్టు: సంజూ సామ్సన్: రూ. 14 కోట్లు ప్రసిధ్ కృష్ణ: రూ. 10 కోట్లు జోస్ బట్లర్: రూ. 10 కోట్లు హెట్‌మైర్: రూ. 8 కోట్ల 50 లక్షలు ట్రెంట్ బౌల్ట్: రూ. 8 కోట్లు దేవ్‌దత్ పడిక్కల్: రూ. 7 కోట్ల 75 లక్షలు యజువేంద్ర చహల్: రూ. 6 కోట్ల 50 లక్షలు అశ్విన్: రూ. 5 కోట్లు యశస్వీ జైస్వాల్: రూ. 4 కోట్లు రియాన్ పరాగ్: రూ. 3 కోట్ల 80 లక్షలు నవ్‌దీప్ సైనీ: రూ. 2 కోట్ల 60 లక్షలు కూల్టర్‌నీల్: రూ. 2 కోట్లు జిమ్మీ నీషమ్: రూ. 1 కోటి 50 లక్షలు కరుణ్ నాయర్: రూ. 1 కోటి 40 లక్షలు వాన్‌డెర్ డసెన్: రూ. 1 కోటి డారిల్ మిచెల్: రూ. 75 లక్షలు ఒబెడ్ మెకాయ్: రూ. 75 లక్షలు కరియప్ప: రూ. 30 లక్షలు తేజస్ బరోకా: రూ. 20 లక్షలు అనునయ్ సింగ్: రూ. 20 లక్షలు కుల్దీప్ సేన్: రూ. 20 లక్షలు ధ్రువ్ జురెల్: రూ. 20 లక్షలు కుల్దీప్ : రూ. 20 లక్షలు శుభమ్ గార్హ్వాల్: రూ. 20 లక్షలు -
IPL 2022 Auction: దీపక్ చహర్‌కు రూ.14 కోట్లు.. సీఎస్కే జట్టు చూసేద్దాం
ఐపీఎల్ మెగావేలంలో సీఎస్కే జట్టు నుంచి పెద్దగా మెరుపులు లేవు. దీపక్ చహర్‌ను రూ. 14 కోట్లకు పెట్టి మళ్లీ కొనుగోలు చేయడం.. అంబటి రాయుడుకు రూ. 6 కోట్ల 75 లక్షలు ఖర్చు చేసింది. ఇక డ్వేన్ బ్రావోతో పాటు శివమ్ దూబే, క్రిస్ జోర్డాన్ లాంటి ఆటగాళ్లను వేలంలో దక్కించుకుంది. వేలానికి ముందు ఎంఎస్ ధోని, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, రవీంద్ర జడేజాలను రిటైన్ చేసుకుంది. మొత్తం ఆటగాళ్ల సంఖ్య 25 కాగా.. అందులో 17 మంది భారత క్రికెటర్లు.. 8 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఖర్చు చేసిన మొత్తం: రూ. 87 కోట్ల 5 లక్షలుగా ఉంది. చెన్నై సూపర్‌కింగ్స్ రవీంద్ర జడేజా : రూ. 16 కోట్లు దీపక్ చహర్: రూ. 14 కోట్లు ధోని : రూ. 12 కోట్లు మొయిన్ అలీ : రూ. 8 కోట్లు అంబటి రాయుడు: రూ. 6 కోట్ల 75 లక్షలు రుతురాజ్ గైక్వాడ్ : రూ. 6 కోట్లు బ్రేవో: రూ. 4 కోట్ల 40 లక్షలు శివమ్ దూబే : రూ. 4 కోట్లు క్రిస్ జోర్డాన్ : రూ. 3 కోట్ల 60 లక్షలు రాబిన్ ఉతప్ప : రూ. 2 కోట్లు ఆడమ్ మిల్నే: రూ. 1 కోటి 90 లక్షలు సాన్‌ట్నర్ : రూ. 1 కోటి 90 లక్షలు రాజ్వర్ధన్ హంగార్గెకర్: రూ. 1 కోటి 50 లక్షలు ప్రశాంత్ సోలంకి : రూ. 1 కోటి 20 లక్షలు డెవాన్ కాన్వే : రూ. 1 కోటి మహీశ్ తీక్షన : రూ. 70 లక్షలు డ్వేన్ ప్రిటోరియస్ : రూ. 50 లక్షలు భగత్ వర్మ : రూ. 20 లక్షలు ఆసిఫ్: రూ. 20 లక్షలు తుషార్ దేశ్‌పాండే: రూ. 20 లక్షలు జగదీశన్ : రూ. 20 లక్షలు హరి నిశాంత్ : రూ. 20 లక్షలు సుభ్రాన్షు సేనాపతి : రూ. 20 లక్షలు ముఖేశ్ చౌదరి: రూ. 20 లక్షలు సిమర్జీత్ సింగ్ : రూ. 20 లక్షలు -
తండ్రి ఫెయిలైన ఎలక్ట్రిషియన్.. తెలుగుతేజం తిలక్‌వర్మ కథేంటి
హైదరాబాద్ యువ క్రికెటర్ తిలక్ వర్మ తొలిసారి ఐపీఎల్ బరిలోకి దిగనున్నాడు.ముంబై ఇండియన్స్ జట్టు 19 ఏళ్ల తిలక్ వర్మను రూ. కోటీ 70 లక్షలకు కొనుగోలు చేసింది. అండర్-19 ప్రపంచకప్ 2020లో రన్నరప్‌గా నిలిచిన టీమిండియా జట్టులో తిలక్‌వర్మ సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఇటీవల ముగిసిన దేశవాళీ వన్డే టోర్నీలో విజయ్ హజారే ట్రోఫీలో తిలక్ వర్మ 180 పరుగులు చేశాడు. అదే విధంగా.. టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 215 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో మెగావేలంలో తిలక్ వర్మ ఐపీఎల్ జట్ల దృష్టిని ఆకర్షించాడు. అందులో భాగంగానే కనీస ధర రూ. 20లక్షలతో వేలంలోకి వచ్చిన తిలక్‌ను ముంబై మంచి ధరకే కొనుగోలు చేసింది. తిలక్ కోసం సన్‌రైజర్స్ తొలుత ప్రయత్నించినప్పటికి డ్రాప్ అయింది. దీంతో తిలక్ ముంబై ఇండియన్స్ ఖాతాలోకి వెళ్లిపోయాడు. అలాంటి తిలక్‌వర్మ జీవితంలో చాలా కష్టపడి వచ్చాడు. ఒక ఫెయిలయిన ఎలక్ట్రిషన్ తండ్రికి కొడుకుగా ఇవాళ సక్సెస్ సాధించి అందరికి ఆదర్శంగా నిలిచాడు. మరి తిలక్‌వర్మ కథేంటో ఒకసారి గమనిద్దాం. చదవండి: IPL 2022: పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా శిఖర్ ధావన్! తిలక్‌వర్మ కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. తిలక్ తండ్రి నంబూరి నాగరాజు సాధారణ ఎలక్ట్రిషియన్. చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకొని కుటుంబాన్ని నెట్టుకొచ్చాడు. అయితే ఒక ఎలక్ట్రిషయన్ తండ్రి తను సాధించలేదనిది కొడుకులో చూడాలని తాపత్రయపడ్డాడు. ఎంత కష్టమైన కొడుకును క్రికెటర్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. కుటుంబ పోషణ భారమైనప్పటికి తిలక్‌కు క్రికెట్ గేర్, బ్యాట్‌ను కొనిపెట్టి క్రికెట్ అకాడమీకి క్రమం తప్పకుండా పంపించేవాడు. ఈ సమయంలోనే తిలక్ వర్మలోని ప్రతిభను కోచ్ సాలమ్ బయాష్ గమనించాడు. తిలక్‌వర్మకు కోచింగ్‌తో పాటు తన ఇంట్లోనే వసతి కల్పించాడు. అలా అష్టకష్టాలు పడి తిలక్‌వర్మ నేడు మంచి క్రికెటర్‌గా ఎదగాడు. 2020 అండర్-19 ప్రపంచకప్‌లో టీమిండియా రన్నరప్‌గా నిలిచినప్పటికి తిలక్‌వర్మ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇక ఇటీవల ముగిసిన దేశవాలీ టోర్నీలు విజయ్ హజారే ట్రోఫీతో పాటు సయ్యద్‌ముస్తాక్ అలీ టి20 ట్రోఫీలోనూ దుమ్మురేపే ప్రదర్శన కనబరిచాడు. ఇక కోవిడ్-19 సమయంలో తిలక్‌వర్మ కుటుంబం చాలా కష్టాలు పడింది. తండ్రి నాగరాజు సరిగ్గా కాంట్రాక్ట్‌లు రాకపోవడంతో కొన్నిరోజులు పస్తులుండాల్సింది. అయితే ఇక్కడ విషయమేంటంటే కుటుంబం అంత కష్టాల్లో ఉందన్న విషయం తిలక్‌వర్మకు తెలియదట. ఎంత కష్టమైనా సరే అప్పు తెచ్చైనా కొడుకు డబ్బులు పంపేవాడు. ఈ విషయాన్ని తిలక్ వర్మ ఇటీవలే ఒక ఇంటర్య్వూలో చెప్పుకొచ్చాడు. ఇక ఐపీఎల్ మెగావేలంలో ముంబై ఇండియన్స్ కొనుగోలు చేయడంపై తిలక్ వర్మ హర్షం వ్యక్తం చేశాడు. ‘ఐపీఎల్లో ఆడాలన్నది నా కల. పలు ఫ్రాంచైజీలు నిర్వహించిన ట్రయల్స్‌లో పాల్గొన్నాను. తమ ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించడానికి ఐపీఎల్ మంచి వేదిక. నా భవిష్యత్తుకు ఇది మంచి పునాదిలా ఉపయోగపడుతుందని భావిస్తున్నా వేలంలో ముంబై ఇండియన్స్‌కు వెళ్లడం అదృష్టంగా భావిస్తున్నా. ఐపీఎల్ చరిత్రలో అత్యధికసార్లు చాంపియన్‌గా నిలిచిన జట్టుతో నా ఐపీఎల్ కెరీర్‌ను ఆరంభించనుండడం సంతోషం కలిగిస్తుంది’ అంటూ తిలక్ వర్మ పేర్కొన్నాడు. -
కెప్టెన్ అయ్యేదెవరు.. ఆర్సీబీ జట్టు ఇదే
ఐపీఎల్ మెగావేలంలో ఆర్సీబీ రెండురోజుల పాటు ఉత్సాహంగా పాల్గొంది. తొలిరోజు వేలంలోనే ఆర్సీబీ దాదాపు ప్రధాన ఆటగాళ్లపై మొగ్గు చూపి వేలంలో దక్కించుకుంది. గతేడాది టాప్ వికెట్ టేకర్ హర్షల్‌పటేల్‌ను రూ .10. 75 కోట్లకు సొంతం చేసుకున్న ఆర్సీబీ.. శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగాను కూడా అదే ధర వద్ద దక్కించుకోవడం విశేషం. ఆ తర్వాత హాజిల్‌వుడ్, డుప్లెసిస్‌ను మంచి ధర దక్కింది. ఇక దినేశ్ కార్తిక్‌ను రూ. 5.50 కోట్లు పెట్టి కొనుగోలు చేయడం కాస్త ఆశ్చర్యపరిచింది. చదవండి: IPL 2022 Mega Auction: శార్దుల్ ఠాకూర్‌కి రూ. 10.75 కోట్లు.. ఢిల్లీ జట్టు ఇదే రిటైన్ జాబితాలో విరాట్ కోహ్లి, మ్యాక్స్‌వెల్‌తో పాటు సిరాజ్ ఉన్నారు. అయితే గత సీజన్లో కెప్టెన్‌గా కోహ్లి పక్కకు తప్పుకోవడంతో ఈ సీజన్లో కెప్టెన్ ఎవరవుతారనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఆర్సీబీ మొత్తం ఆటగాళ్ల సంఖ్య 22 మంది కాగా.. అందులో 14 మంది భారత క్రికెటర్లు కాగా.. మిగతా 8 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. రిటైన్ జాబితా మినహాయించి వేలంలో ఆటగాళ్లను దక్కించుకోవడం కోసం రూ.88 కోట్ల 45 లక్షలు ఖర్చు చేసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ): విరాట్ కోహ్లి: రూ. 15 కోట్లు మ్యాక్స్‌వెల్: రూ. 11 కోట్లు హర్షల్ పటేల్: రూ. 10 కోట్ల 75 లక్షలు హసరంగ: రూ. 10 కోట్ల 75 లక్షలు హాజెల్‌వుడ్: రూ. 7 కోట్ల 75 లక్షలు సిరాజ్ : రూ. 7 కోట్లు డు ప్లెసిస్: రూ. 7 కోట్లు దినేశ్ కార్తీక్: రూ. 5 కోట్ల 50 లక్షలు అనూజ్ రావత్: రూ. 3 కోట్ల 40 లక్షలు షాబాజ్ అహ్మద్: రూ. 2 కోట్ల 40 లక్షలు రూథర్‌ఫొర్డ్: రూ. 1 కోటి మహిపాల్ లామ్రోర్: రూ. 95 లక్షలు ఫిన్ అలెన్: రూ. 80 లక్షలు బెహ్రెండార్ఫ్: రూ.75 లక్షలు కరణ్ శర్మ: రూ. 50 లక్షలు సుయశ్ ప్రభుదేశాయ్: రూ.30 లక్షలు సీవీ మిలింద్: రూ. 25 లక్షలు ఆకాశ్‌దీప్: రూ. 20 లక్షలు అనీశ్వర్ గౌతమ్ : రూ. 20 లక్షలు -
ఐపీఎల్-2022 వేలంలో హైదరాబాద్ సీపీ కూమారుడు.. ఏ జట్టు దక్కించుకుందంటే
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 2022 ఐపీఎల్ సీజన్ కోసం మిలింద్‌ను రూ. 25 లక్షలకు కొనుగోలు చేసింది. గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (2015), ఢిల్లీ డేర్‌డెవిల్స్ (2016) జట్లకు హైదరాబాద్ క్రికెటర్ సీవీ మిలింద్ ఎంపికయ్యాడు. ఎడంచేతివాటం పేస్ బౌలర్ మిలింద్ 2013 నుంచి హైదరాబాద్ జట్టు తరఫున రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ, ముస్తాక్ అలీ ట్రోఫీ టోర్నీలలో ఆడుతూ నిలకడగా రాణిస్తున్నాడు. మిళింద్ లిస్ట్-ఏలో 45 మ్యాచ్‌లు ఆడి 82 వికెట్లను పడగొట్టాడు. 20 ఏళ్ల చామ మిళింద్ గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఐపీఎల్లో ఆడాడు. ఇక హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కుమారుడే ఈ చామ మిళింద్ ఆనంద్. -
ఐపీఎల్-2022 మెగా వేలంలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ మనోడే !
ఐపీఎల్ మెగా వేలంలో ఏ ఆటగాడు ఎంత ధర పలుకుతాడే టాపిక్‌ని మించి సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాడు మన తెలుగు తేజం గ్రంధి కిరణ్‌కుమార్. ఆటగాళ్లను మించిన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. వేలం సందర్భంగా ఎవ్వరూ ఊహించని ఎత్తుగడలు అమలు చేశాడు. దీంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. అసలెవరీ కిరణ్ కుమార్.. ఆయన అమలు చేసిన వ్యూహాలు ఏంటీ? రెండురోజుల పాటు జరిగిన ఐపీఎల్ మెగావేలం విజయవంతంగా ముగిసింది. ఈసారి వేలంలో పెద్దగా మెరుపులు లేకపోయినప్పటికి కొందరు ఆటగాళ్లకు జాక్‌పాట్ తగిలితే.. కొందరిని మాత్రం అసలు పట్టించుకోకపోవడం విశేషం. ఇక ఐపీఎల్ మెగా వేలంలో ఒక వ్యక్తి మాత్రం తన ఎత్తుగడలతో ఫ్రాంచైజీలకు ముచ్చెమటలు పట్టించాడు. తన స్ట్రాటజీతో ఫ్రాంచైజీలకు భారీ నష్టాలను మిగులుస్తూ...ప్లేయర్లకు మంచి ధర వచ్చేలా చేసిన తెలుగు వ్యక్తి ఎవరంటే ఢిల్లీ క్యాపిటల్స్ కో-ఓనర్ గ్రంధి కిరణ్ కుమార్. వీరు స్వయాన తెలుగు వారు కావడం విశేషం. పొగడ్తలతో ముంచెత్తిన క్రికెట్ ఫ్యాన్స్..! ఐపీఎల్ యాక్షన్ -2022 క్రికెట్ ప్రపంచం మొత్తం ఎంతో ఆశగా ఆసక్తిగా చూసింది. అభిమానులు తమ ఫేవరెట్ జట్లు ఎవరిని కొనుగోలు చేస్తాయనే విషయంపై ఆసక్తిగా చూశారు. ఈ వేలం పాటలో బాగా హైలెట్ గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కో-ఓనర్ గ్రంధి కిరణ్ కుమార్ క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో పొగడ్తలతో ముంచెత్తారు. మిగతా ఫ్రాంచైజీలకు అంతు చిక్కకుండా వేలంలో కిరణ్ వ్యూహాలకు క్రికెట్ అభిమానులు ముగ్దులయ్యారు. అప్పటికప్పుడే తక్కువ ధరకే అమ్ముడయ్యే ప్లేయర్స్‌ను ఎక్కువ ధరకు అమ్ముడయ్యేలా చేశాడు కిరణ్ కుమార్. ఇక డేవిడ్ వార్నర్ లాంటి విధ్వంసకర బ్యాటర్‌ను తక్కువ ధరకే ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకునేలా కిరణ్ కుమార్ కీలక పాత్ర వహించారు. పృథ్వీ షా, కెఎస్ భరత్ లను కూడా మంచి ధరకే కొనుగోలు చేసింది ఢిల్లీ జట్టు. కుల్దీప్ యాదవ్, సర్ఫరాజ్ ఖాన్, మిచెల్ మార్ష్ , ముస్తాఫిజుర్ రెహమాన్. శార్దూల్ ఠాకూర్ విషయంలో కాస్త ఎక్కువగా ఖర్చు చేసినా సరే… కిరణ్ కుమార్ మాత్రం తగ్గేదేలే అంటూ వారిని ఢిల్లీ క్యాపిటల్స్ టీంకు దక్కేలా చేశారు. ఇక తన స్ట్రాటజీతో వేలంలో కేవలం 4.60 కోట్లకు 19 ప్లేయర్స్ ఢిల్లీకి వచ్చేలా చేశారు. ఈయన దెబ్బకు ఇతర జట్ల ఓనర్లు షాక్ అయ్యారు. ఇక ఈ సందర్భంగా ఆయన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. జీఏంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సీఈవో..! ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త గ్రంధి మలికార్జున రావు(జీఎంఆర్) కుమారుడు..కిరణ్ కుమార్. వీరు ప్రస్తుతం జీఏంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సీఈఓ, ఎండీ & డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దాంతో పాటుగా ఐపీఎల్లో ఢిల్లీ జట్టుకి కో-ఓనర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. The real game changer of mega auction #IPLAuction #DelhiCapitals All players should thank this man because of him they got more 💸💵for any franchise 🤣🤣#StarSports pic.twitter.com/bs9QXhvtTc — ankit@kumar (@ankitku98643706) February 13, 2022 Use 🧠! #DelhiCapitals are the first team to complete their minimum players' squad. They've bought 19 players with 4.60cr still left in their purse. pic.twitter.com/KIAU8v2CkX — EMPURAAN👑 (@aswin_offcl) February 13, 2022 This man 😂 #IPLMegaAuction2022 #IPL2022Auction #DelhiCapitals pic.twitter.com/uq1gTDpCKG — Akarsh (@akarsh024) February 12, 2022 చదవండి: ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి..! ప్లేయర్స్‌తో పాటుగా దీని వేలం కూడా..! -
పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా శిఖర్ ధావన్!
ఐపీఎల్ మెగావేలం ముగిసింది. మెగావేలంలో తమకు ఇష్టమైన ఆటగాళ్లను దక్కించుకున్న ఫ్రాంచైజీలు ఇక కెప్టెన్ల వేట మొదలుపెట్టనున్నాయి. కాగా పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా శిఖర్ ధావన్‌ను ఎంపికచేయనున్నట్లు సమాచారం. కొన్ని రోజుల్లో ఈ విషయాన్ని పంజాబ్ కింగ్స్ ప్రకటించనుంది. కాగా వేలంలో ధావన్‌ను పంజాబ్ కింగ్స్ రూ. 8.25 కోట్లకు దక్కించుకుంది. ''జట్టు కెప్టెన్‌గా ధావన్ ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. టీమిండియాలో ఒక సీనియర్ ఆటగాడిగా ఉన్న ధావన్ పంజాబ్ కెప్టెన్‌గా జట్టును తన భుజాలపై మోస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీతో పాటు కోచ్ కూడా ధావన్‌వైపు మొగ్గుచూపుతున్నారు. తొందర్లోనే దీనిపై స్పష్టమైన ప్రకటన వస్తుంది.'' అంటూ పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీలో ఒక కీలక వ్యక్తి తెలిపారు. చదవండి: IPL 2022 Auction: ఎవరు కొనరేమో అనుకున్నాం.. చివర్లో అదృష్టం కాగా 12 కోట్లతో పంజాబ్ కింగ్స్ రిటైన్ చేసుకున్న మయాంక్ అగర్వాల్‌ను కెప్టెన్ చేసే అవకాశం లేకపోలేదు. అయితే సీనియారిటీ ప్రకారం ధావన్ కెప్టెన్ అయితేనే బాగుంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మరికొద్ది రోజుల్లో కెప్టెన్ ఎవరనే దానిపై క్లారిటీ రానుంది. ఇక ఈసారి కచ్చితంగా కప్ సాధించాలాని అనుకుంటున్న పంజాబ్ వేలంలో నిఖార్సైన ఆటగాళ్లను దక్కించుకుంది. లియామ్ లివింగ్‌స్టోన్, జానీ బెయిర్ స్టో, కగిసో రబాడ, ఓడియన్ స్మిత్, షారుక్ ఖాన్ లాంటి టాలెంటెడ్ ప్లేయర్లు వేలంలో కొనుగోలు చేసింది. మరి ఈసారైనా పంజాబ్ రాత మారుతుందో లేదో చూడాలి. ఇక పంజాబ్ కింగ్స్ మొత్తం ఆటగాళ్ల సంఖ్య 25 కాగా.. అందులో భారత క్రికెటర్లు 18 మంది ఉండగా.. ఏడుగురు విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఇక ఆటగాళ్లపై పంజాబ్ రూ. 86 కోట్ల 55 లక్షలు ఖర్చు చేసింది. చదవండి: IPL 2022 Auction: వేలంలో వారికి పంట పండింది.. వీళ్లను అసలు పట్టించుకోలేదు -
శార్దుల్ ఠాకూర్‌కి రూ. 10.75 కోట్లు.. ఢిల్లీ జట్టు ఇదే
ఐపీఎల్-2022 మెగా వేలం దిగ్విజయంగా ముగిసింది. ఇక ఈ మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటిల్స్ కీలకమైన ఆటగాళ్లను కొనుగోలు చేసింది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ శార్దుల్ ఠాకూర్‌ను ఢిల్లీ 10.75 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. అతడితో పాటు ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్‌ను రూ.6. 50 కోట్లకు, డేవిడ్ వార్నర్‌ను రూ.6. 25 కోట్లకు సొంతం చేసుకుంది. ఢిల్లీ క్యాపిటిల్స్ జట్టు మొత్తం 24 మంది ఆటగాళ్లు కాగా.. అందులో 17 మంది భారత క్రికెటర్లు కగా, ఏడుగురు విదేశీ క్రికెటర్లు ఉన్నారు. వీరి కోసం ఢిల్లీ క్యాపిటిల్స్ రూ. 89.50 కోట్లు ఖర్చు చేసింది. ఇక ఢిల్లీ క్యాపిటిల్స్ ఆటగాళ్లను ఒకసారి పరిశీలిద్దాం.. ఢిల్లీ క్యాపిటల్స్ రిషభ్ పంత్: రూ. 16 కోట్లు శార్దుల్ ఠాకూర్: రూ. 10 కోట్ల 75 లక్షలు అక్షర్ పటేల్ : రూ. 9 కోట్లు పృథ్వీ షా: రూ. 7 కోట్ల 50 లక్షలు నోర్జే : రూ. 6 కోట్ల 50 లక్షలు మిచెల్ మార్ష్ : రూ. 6 కోట్ల 50 లక్షలు డేవిడ్ వార్నర్: రూ. 6 కోట్ల 25 లక్షలు ఖలీల్ అహ్మద్: రూ. 5 కోట్ల 25 లక్షలు చేతన్ సకారియా: రూ. 4 కోట్ల 20 లక్షలు రోవ్‌మన్ పావెల్: రూ. 2 కోట్ల 80 లక్షలు కోన శ్రీకర్ భరత్ : రూ. 2 కోట్లు కుల్దీప్ యాదవ్: రూ. 2 కోట్లు ముస్తఫిజుర్: రూ. 2 కోట్లు మన్దీప్ సింగ్: రూ. 1 కోటి 10 లక్షలు కమలేశ్ నాగర్కోటి: రూ. 1 కోటి 10 లక్షలు లలిత్ యాదవ్: రూ. 65 లక్షలు యశ్ ధుల్: రూ. 50 లక్షలు ప్రవీణ్ దూబే: రూ. 50 లక్షలు సీఫెర్ట్: రూ. 50 లక్షలు లుంగి ఎన్గిడి: రూ. 50 లక్షలు విక్కీ ఓస్త్వాల్ : రూ. 20 లక్షలు సర్ఫరాజ్ ఖాన్: రూ. 20 లక్షలు అశ్విన్ హెబర్: రూ. 20 లక్షలు రిపాల్ పటేల్ : రూ. 20 లక్షలు -
IPL 2022 Auction: కేఎల్ రాహుల్ కెప్టెన్సీ.. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఇదే
ఐపీఎల్‌లోకి కొత్తగా ఎంటరైన లక్నో సూపర్‌జెయింట్స్ మెగావేలంలో కొందరు నిఖార్సైన ఆటగాళ్లను దక్కించుకుంది. కేఎల్ రాహుల్‌తోపాటు స్టోయినిస్, రవి బిష్ణోయిలను రిటైన్ చేసుకున్న లక్నో ఫ్రాంచైజీ ఆవేశ్ ఖాన్‌కు రూ. 10 కోట్లు పెట్టింది. విండీస్ ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్‌ను రూ. 8.75 కోట్లకు, కృనాల్ పాండ్యాను రూ. 8.25 కోట్లకు కొనుగోలు చేసింది. వీరితో పాటు మార్క్‌వుడ్, డికాక్, దీపక్ హుడాలకు మంచి ధరే పలికింది. జట్టులో మొత్తం 21 మంది ఆటగాళ్లు కాగా.. 14 మంది భారత క్రికెటర్లు ఉంటే.. మిగతా ఏడుగురు విదేశీ క్రికెటర్లు ఉన్నారు. వీరి కోసం లక్నో సూపర్ జెయింట్స్ రూ. 90 కోట్లు ఖర్చు చేసింది. ఇక లక్నో సూపర్‌జెయింట్స్ ఆటగాళ్లను ఒకసారి పరిశీలిద్దాం.. లక్నో సూపర్‌జెయింట్స్ జట్టు.. కేఎల్ రాహుల్(కెప్టెన్): రూ. 17 కోట్లు స్టోయినిస్ : రూ. 9 కోట్ల 20 లక్షలు అవేశ్ ఖాన్ : రూ. 10 కోట్లు హోల్డర్ : రూ. 8 కోట్ల 75 లక్షలు కృనాల్ పాండ్యా : రూ. 8 కోట్ల 25 లక్షలు మార్క్ వుడ్ : రూ. 7 కోట్ల 50 లక్షలు డికాక్ : రూ. 6 కోట్ల 75 లక్షలు దీపక్ హుడా : రూ. 5 కోట్ల 75 లక్షలు మనీశ్ పాండే: రూ. 4 కోట్ల 60 లక్షలు రవి బిష్ణోయ్ : రూ. 4 కోట్లు ఎవిన్ లూయిస్: రూ. 2 కోట్లు దుశ్మంత చమీర: : రూ. 2 కోట్లు కృష్ణప్ప గౌతమ్: రూ. 90 లక్షలు అంకిత్ రాజ్‌పుత్: రూ. 50 లక్షలు షాబాజ్ నదీమ్: రూ. 50 లక్షలు కైల్ మేయర్స్: రూ. 50 లక్షలు మోసిన్‌ఖాన్ : రూ. 20 లక్షలు ఆయుశ్ బదోని: రూ. 20 లక్షలు కరణ్ సన్నీ శర్మ: రూ. 20 లక్షలు మయాంక్ యాదవ్ రూ. 20 లక్షలు మనన్ వోహ్రా: రూ. 20 లక్షలు -
వేలంలో వారికి పంట పండింది.. వీళ్లను అసలు పట్టించుకోలేదు
రెండురోజుల పాటు జరిగిన ఐపీఎల్ మెగావేలం విజయవంతంగా ముగిసింది. ఈసారి వేలంలో పెద్దగా మెరుపులు లేకపోయినప్పటికి కొందరు ఆటగాళ్లకు జాక్‌పాట్ తగిలితే.. కొందరిని అసలు పట్టించుకోకపోవడం విశేషం. మెగా వేలంలో అన్‌సోల్డ్ జాబితా కూడా పెద్దగానే ఉంది. టీమిండియా మాజీ ఆటగాడు సురేశ్ రైనా మొదలుకొని స్టీవ్ స్మిత్, షకీబ్ అల్ హసన్, ఇయాన్ మోర్గాన్, ఇషాంత్ శర్మ, తబ్రెయిజ్ షంసీ, కేదార్ జాదవ్, కొలిన్ గ్రాండ్‌హోమ్, గప్టిల్, కార్లోస్ బ్రాత్‌వైట్, పుజారా, హనుమ విహారి లాంటి కీలక ఆటగాళ్లవైపు కనీసం తొంగిచూడలేదు. సారీ సురేశ్ రైనా.. 205 మ్యాచ్‌లు... 5,528 పరుగులు... ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగుల జాబితాలో నాలుగో స్థానం... అద్భుత ప్రదర్శనలతో చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీలక పాత్ర... ‘చిన్న తలా’ సురేశ్ రైనా సూపర్ కెరీర్ ముగిసినట్లే. వేలంలో రైనాను తీసుకోవడానికి చెన్నై సహా ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపించలేదు. ఇన్నేళ్లలో చెన్నైపై నిషేధం ఉన్న రెండేళ్లు మినహా (అప్పుడు గుజరాత్‌కు) మరే ఫ్రాంచైజీకి అతను ఆడలేదు. అతను రెగ్యులర్‌గా మ్యాచ్‌లు ఆడకపోవడం కూడా ప్రధాన కారణం. కనీసం బేస్‌ప్రైస్ వద్ద కూడా ఎవరూ పట్టించుకోలేదు. ►అంతర్జాతీయ క్రికెట్లో స్టార్ ఆల్‌రౌండర్‌గా పేరున్న షకీబ్ అల్ హసన్వైపు కూడా ఫ్రాంచైజీలు కన్నెత్తి చూడలేదు. కారణం షకీబ్ ఐపీఎల్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకపోవడమే. నాణ్యమైన ఆల్‌రౌండర్‌గా పేరున్నప్పటికి షకీబ్ ఐపీఎల్లో పెద్దగా రాణించింది లేదు. ►ఇక ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ పరిస్థితి మరొకటి. పరిమిత, టెస్టు క్రికెట్లో మంచి పేరున్న స్మిత్ టి20 క్రికెట్లో అంతగా రాణించలేడనే ముద్ర ఉంది. నిలబడితే మెరుపులు మెరిపించే స్మిత్.. ఆరంభంలో ఎక్కువ సమయం తీసుకుంటాడు. టి20లకు ఇలాంటి ఆట సరిపోదు. ఐపీఎల్ లాంటి లీగ్‌ల్లో అస్సలు పనికిరాదు. గతేడాది ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున స్మిత్ పెద్దగా ఆకట్టుకోలేదు. అందుకే ఈసారి స్మిత్‌ను ఏ ఫ్రాంచైజీ కొనడానికి ఆసక్తి చూపలేదు. ►గతేడాది ఐపీఎల్లో కేకేఆర్ రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ జట్టు కెప్టెన్‌గా ఇయాన్ మోర్గాన్ జట్టును ముందుండి నడిపించాడు. కెప్టెన్‌గా సక్సెస్ అయినప్పటికి.. బ్యాట్స్‌మన్‌గా విఫలమయ్యాడు. ఐపీఎల్లో కెప్టెన్సీ ఒక్కటే కాదు.. బ్యాటింగ్‌లోనూ మెరవాలి అన్న సంగతి మోర్గాన్ మరిచిపోయాడు. అందుకే ఈసారి వేలంలో ఫ్రాంచైజీలు అతన్ని మరిచిపోయాయి. ఏదైనా ఒక గొప్ప కెప్టెన్‌గా పేరున్న మోర్గాన్ ఐపీఎల్ కెరీర్ దాదాపు ఎండ్ అయినట్లే. ఆటగాళ్లకు జాక్‌పాట్.. విండీస్ ప్లేయర్లే ఎక్కువగా ఈసారి మెగావేలంలో అనూహ్య జాక్‌పాట్ కొట్టిన ఆటగాళ్ల సంఖ్య ఎక్కవే ఉంది. కాగా ఆ జాబితాలో విండీస్ ప్లేయర్లు ఎక్కువగా ఉండడం విశేషం. ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, దీపక్ చహర్, శార్దూల్ ఠాకూర్ లాంటి స్టార్ ఆటగాళ్లను మినహాయిస్తే వేలంలో కొందరు ఆటగాళ్లకు పంట పండిందనే చెప్పొచ్చు. విండీస్ ఆటగాళ్లు.. నికోలస్ పూరన్(రూ. 10 కోట్లు), ఓడియన్ స్మిత్(రూ. 6 కోట్లు), రొమెరియో షెఫర్డ్(రూ. 7.75 కోట్లు), జాసన్ హోల్డర్(8.75 కోట్లు), హెట్మైర్లకు (రూ. 8.50 కోట్లు) అనుకున్నదానికంటే ఎక్కువే దక్కింది. ఇక సింగపూర్ క్రికెటర్ టిమ్ డేవిడ్ కూడా(రూ. 8 కోట్లు) ఊహించని ధరకు అమ్ముడుకావడం విశేషం. -
IPL 2022 Auction: ముంబై ఇండియన్స్ జట్టును చూసేద్దాం..
ఐపీఎల్ మెగావేలం ముగిసింది. ముంబై ఇండియన్స్ జట్టు ఈసారి వేలంలో రూ. 89 కోట్ల 90 లక్షలు ఖర్చు చేసింది. మొత్తం 25 మంది ఆటగాళ్లలో 17 మంది భారత్‌కు చెందినవారు కాగా.. 8 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. రిటైన్ జాబితాలో రోహిత్ శర్మ, కీరన్ పొలార్డ్, బుమ్రా, సూర్యకుమార్‌లను తమ వద్దే ఉంచుకుంది. మిగతా 21 మంది ఆటగాళ్లను మెగావేలంలో కొనుగోలు చేసింది. ముంబై ఇండియన్స్ జట్టును ఒకసారి పరిశీలిస్తే.. రోహిత్ శర్మ : రూ. 16 కోట్లు ఇషాన్ కిషన్ : రూ. 15 కోట్ల 25 లక్షలు జస్ప్రీత్ బుమ్రా : రూ. 12 కోట్లు టిమ్ డేవిడ్ : రూ. 8 కోట్ల 25 లక్షలు సూర్యకుమార్ : రూ. 8 కోట్లు జోఫ్రా అర్చర్ : రూ. 8 కోట్లు కీరన్ పొలార్డ్ : రూ. 6 కోట్లు బ్రెవిస్ : రూ. 3 కోట్లు డానియెల్ సామ్స్ : రూ. 2 కోట్ల 60 లక్షలు ఠాకూర్ తిలక్‌వర్మ : రూ. 1 కోటి 70 లక్షలు అశ్విన్ మురుగన్ : రూ. 1 కోటి 60 లక్షలు టైమల్ మిల్స్ : రూ. 1 కోటి 50 లక్షలు జైదేవ్ ఉనాద్కట్ : రూ. 1 కోటి 30 లక్షలు రిలె మెరిడిత్ : రూ. 1 కోటి ఫ్యాబియన్ అలెన్ : రూ. 75 లక్షలు మయాంక్ మార్కండే : రూ. 65 లక్షలు సంజయ్ యాదవ్ : రూ. 50 లక్షలు బాసిల్ థంపి : రూ. 30 లక్షలు అర్జున్ టెండూల్కర్ : రూ. 30 లక్షలు రమణ్‌దీప్ సింగ్ : రూ. 20 లక్షలు హృతిక్ షోకీన్ : రూ. 20 లక్షలు రాహుల్ బుద్ధి : రూ. 20 లక్షలు అన్మోల్ప్రీత్ : రూ. 20 లక్షలు ఆర్యన్ జుయల్ : రూ. 20 లక్షలు అర్షద్ ఖాన్ : రూ. 20 లక్షలు -
ఆ ఆటగాడు మాకే సొంతం.. మీరెలా తీసుకుంటారు!
ఐపీఎల్ మెగావేలంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ చివర్లో వేలంలోకి వచ్చాడు. సచిన్ మీద ఉన్న అభిమానంతో అర్జున్ను మళ్లీ ముంబై ఇండియన్స్ బేస్‌ప్రైస్‌కు కొనుగోలు చేస్తుందని అంతా భావించారు. అన్నట్లుగానే ముంబై అతన్ని రూ. 20 లక్షలకు తీసుకుందామని సిద్ధపడింది. చదవండి: IPL 2022 Auction: ఎవరు కొనరేమో అనుకున్నాం.. చివర్లో అదృష్టం ఇక్కడే ట్విస్టు ఎదురైంది. అర్జున్ను తీసుకోవాలని గుజరాత్ టైటాన్స్ ప్యాడ్ ఎత్తి రూ. 5 లక్షలు పెంచింది. దాంతో అంబానీ, జహీర్ ఇదేంటి... అన్నట్లుగా చిరునవ్వు చూపుతో ఆశిష్ నెహ్రా వైపు చూడటం... మరోసారి ప్యాడ్ ఎత్తి ముంబై రూ. 25 లక్షలకే తీసుకోవడం చకచగా జరిగిపోయాయి. గతేడాది తొలిసారి ముంబై ఇండియన్స్ టీమ్‌కు వచ్చిన అర్జున్ టెండూల్కర్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. మరి ఈసారైనా ముంబై తరపున ఐపీఎల్లో అరంగేట్రం చేస్తాడేమో చూడాలి. చదవండి: IPL 2022 Auction: ‘మాకు అనామకులే కావాలి’.. సన్‌రైజర్స్ తీరే వేరు -
‘మాకు అనామకులే కావాలి’.. సన్‌రైజర్స్ తీరే వేరు
ఐపీఎల్ వేలం వేదిక వద్ద సన్‌రైజర్స్ హైదరాబాద్ బృందం ఏం చేస్తోంది? సగటు అభిమానికి రెండు రోజులుగా ఇదే సందేహం వచ్చింది. ఇతర జట్లతో పోలిస్తే సన్‌రైజర్స్ వేలం దశ దిశ లేకుండానే సాగినట్లుగా అనిపిస్తోంది. అసలు వేలానికి ముందు ఏదైనా ‘హోం వర్క్’ చేసి వచ్చారా లేక టేబుల్‌పైనే నిర్ణయాలు తీసుకున్నారా అని అనిపించింది. వ్యూహాత్మకంగా డబ్బులను ఉపయోగించడంలో ఆ జట్టు బాగా విఫలమైంది. మొదటి నుంచి టీమ్ మిడిలార్డర్ బ్యాటింగ్ బలహీనం. కొన్ని బంతుల్లోనే మ్యాచ్ రాత మార్చే ఒక్క విధ్వంసక ఆటగాడు ఈసారి కూడా జట్టులో లేడు. చదవండి: IPL 2022 Auction: వేలంలో వారికి పంట పండింది.. వీళ్లను అసలు పట్టించుకోలేదు తాజా ఫామ్, నిలకడను బట్టి చూస్తే విండీస్ వికెట్ కీపర్ నికోలస్ పూరన్‌కు రూ. 10 కోట్ల 75 లక్షల చాలా ఎక్కువ. విండీస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రొమారియో షెఫర్డ్‌కు మరీ రూ. 7 కోట్ల 75 లక్షలు ఇచ్చి తీసుకోవడం అనూహ్యం. బౌలింగ్‌లో అతని అంతర్జాతీయ టి20 కెరీర్ ఎకానమీ 11.33 అంటే ఎంతో అధ్వానం! ఫ్రాంచైజీ యజమానులు కరీబియన్ ప్రీమియర్ లీగ్ ప్రదర్శనపైనే ఆధారపడ్డారా అనిపించింది. ఎవరూ పట్టించుకోని న్యూజిలాండ్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్‌కు రూ. కోటీ 50 లక్షలు, ఒకే ఒక అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన అఫ్గానినిస్తాన్ లెఫ్టార్మ్ పేసర్ ఫజల్ హఖ్‌కు రూ. 50 లక్షలు, ఫామ్ కోల్పోయి చాలా కాలంగా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమైన దక్షిణాఫ్రికా ప్లేయర్ మార్క్రమ్కు రూ. 2 కోట్ల 60 లక్షలు, అసలు సీన్లోనే లేని సీన్ అబాట్ (ఆస్ట్రేలియా)కు రూ. 2 కోట్ల 40 లక్షలు... ఇలా సన్‌రైజర్స్ ఖర్చు చేసింది. వరుస గాయాలతో బాధపడుతున్న విలియమ్సన్ కోలుకొని జట్టుకు బ్యాటింగ్‌పరంగా ఎంతగా ఉపయోగపడతాడనేది ఒక సందేహం కాగా... మిగిలిన ఏడుగురు విదేశీ ఆటగాళ్లలో ఒక్కరు కూడా వార్నర్, రషీద్ ఖాన్ల తరహాలో సింగిల్ హ్యాండ్‌తో మ్యాచ్ గెలిపించే సత్తా ఉన్నవారు లేరు! వీళ్లూ అంతంతే... భారత క్రికెటర్లకు ఎంచుకునే విషయంలో కూడా సన్‌రైజర్స్ ఎక్కడా దూకుడు కనిపించలేదు. తొలి రోజే రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మలకు స్థాయికి మించి మొత్తాలు ఆఫర్ చేసిన టీమ్ రెండో రోజు కూడా పెద్దగా గుర్తింపు లేని ఆటగాళ్లనే వరుసగా ఎంచుకుంది. ఓపెనర్‌గా కెరీర్ బ్యాటింగ్ స్ట్రయిక్ రేట్ కనీసం 100 కూడా లేని ఆర్.సమర్థ్ సామర్థ్యంపై రైజర్స్ నమ్మకముంచింది! సౌరభ్ దూబే (విదర్భ), శశాంక్ సింగ్ (ఛత్తీస్‌గఢ్), విష్ణు వినోద్ (కేరళ), జె. సుచిత్ (కర్ణాటక), ప్రియమ్ గార్గ్ (యూపీ)... వీరంతా జట్టు విలువను పెంచగలరా! చదవండి: IPL 2022 Mega Auction: కేఎల్ రాహుల్ కెప్టెన్సీ.. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఇదే హైదరాబాదీలు లేని టీమ్... ఒక్క హైదరాబాద్ క్రికెటర్... పోనీ దేశవాళీలో ఆంధ్ర జట్టుకు ఆడుతున్నా సరే, ఒక తెలుగు ఆటగాడు... సన్‌రైజర్స్ టీమ్‌కు తమ జట్టులో చేర్చుకునేందుకు ఎవరూ దొరకలేదు. హైదరాబాద్, ఆంధ్ర జట్ల నుంచి కనీసం ‘నామ్‌కే వాస్తే’గానైనా ఒకరిని హైదరాబాద్ టీమ్‌లో తీసుకునే సాహసం చేయలేదు! హోం సిటీ ఆటగాళ్లను జట్టులోకి చేర్చుకునే విషయంలో మొదటినుంచీ సన్‌రైజర్స్ వ్యవహార శైలి ఇలాగే ఉంటోంది. నిజమైన హైదరాబాద్ అభిమానులు ఇతర ఫ్రాంజైజీల తరహాలో ‘ఇది మా టీమ్’ అంటూ గర్వంగా ఎప్పుడూ చెప్పుకునే అవకాశం ఫ్రాంచైజీ ఇవ్వలేదు. ఈసారి కూడా 25 మంది సభ్యుల టీమ్‌లో హైదరాబాద్ లేదా ఆంధ్రకు చెందిన ఒక్క ప్లేయర్ కూడా సన్‌రైజర్స్ టీమ్‌లో లేడు. గొప్ప ఆటగాళ్లు, అద్భుత ప్రదర్శనల సంగతి తర్వాత... ఐపీఎల్ ఫ్యాన్స్ టీమ్‌తో కనెక్ట్ కావడానికి లోకల్ ప్లేయర్స్ కూడా ఒక కారణం అవుతారు. కానీ సన్‌రైజర్స్ మాత్రం అలా ఎప్పుడూ ఆలోచించలేదు. ‘షాక్‌కు గురి చేసింది’ భారత క్రికెటర్ హనుమ విహారి పేరు కూడా వేలంలో వినిపించకపోవడం దురదృష్టకరం. ఎంతో మంది అనామకులకు లీగ్‌లో అవకాశం దక్కిన చోట భారత టెస్టు జట్టు సభ్యుడికి కనీసం అవకాశం లభించకపోవడం నన్ను చాలా బాధపెట్టింది. ఫ్రాంచైజీలు ఏం ఆలోచించాయో తెలీదు. ఏదో ఒక జట్టుకు ఎంపికవుతాడని నేను ఊహించిన దేశవాళీ టి20 టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీ టాప్ స్కోరర్ తన్మయ్ అగర్వాల్‌ను కూడా తీసుకోకపోవడం ఆశ్చర్యకరం. ప్రతిభ గల ఆంధ్ర క్రికెటర్లు రికీ భుయ్, స్టీఫెన్, పృథ్వీరాజ్లకు కూడా అవకాశం దక్కకపోవడం నిరాశ కలిగించింది. –ఎమ్మెస్కే ప్రసాద్, మాజీ చీఫ్ సెలక్టర్ -
ఎవరు కొనరేమో అనుకున్నాం.. చివర్లో అదృష్టం
ఐపీఎల్ మెగావేలం విజయవంతంగా ముగిసింది. రెండు రోజుల పాటు సాగిన లీగ్ వేలంలో క్రికెటర్లను సొంతం చేసుకునేందుకు 10 ఫ్రాంచైజీలు హోరాహోరీగా పోటీ పడ్డాయి. గరిష్టంగా 217 స్థానాలకు ఆటగాళ్లను ఎంచుకునే అవకాశం ఉండగా అన్ని జట్లు కలిపి 204 మందితో సరిపెట్టాయి. ఇందులో భారత్ నుంచి 137 మంది ఉండగా... విదేశీ క్రికెటర్లు 67 మంది ఉన్నారు. ఎప్పటిలాగే కొందరు ఆటగాళ్లకు అంచనాలకు మించిన అనూహ్య ధర పలకగా... మరికొందరు స్టార్లు ఆశ్చర్యకరంగా తక్కువ విలువతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాగా ఆశ్చర్యంగా అసలు వేలంలో అమ్ముడుపోతారో లేదో అని అనుకున్న కొందరి ఆటగాళ్లను చివర్లో అదృష్టం వరించింది. వీళ్లది లక్ అనే చెప్పొచ్చు. చదవండి: IPL 2022 Auction: అన్క్యాప్డ్ ప్లేయర్‌కు అంత ధర.. ఎవరీ యష్ దయాల్ తొలి రోజు అమ్ముడుపోక రెండో రోజు చివర్లో మళ్లీ వేలానికి వచ్చిన వారిలో డేవిడ్ మిల్లర్‌కు రూ. 3 కోట్ల విలువ పలికింది. అప్పటి వరకు ఒక్క వికెట్ కీపర్‌ను కూడా తీసుకోని గుజరాత్ టైటాన్స్ వరుసగా వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్లను తీసుకుంది. భారత పేసర్ ఉమేశ్ యాదవ్‌ను కూడా చివర్లో కోల్‌కతా బేస్‌ప్రైస్‌కే తీసుకోవడం ఊరట కలిగించింది. 333 టి20ల్లో ఏకంగా 146.35 స్ట్రయిక్‌రేట్‌తో 9,346 పరుగులు సాధించిన ఘనమైన రికార్డు ఉన్న అలెక్స్ హేల్స్ సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఐపీఎల్‌లోకి అడుగు పెట్టాడు. కోల్‌కతా తక్కువ మొత్తానికే (రూ.కోటీ 50 లక్షలు) అతడిని దక్కించుకోగలిగింది. ఇంగ్లండ్‌కు చెందిన డేవిడ్ విల్లీ (బెంగళూరు; రూ. 2 కోట్లు) ఈ సీజన్ వేలంలో అమ్ముడైన చివరి ఆటగాడిగా నిలిచాడు. చదవండి: IPL 2022 Mega Auction: ఎవరీ షెపర్డ్.. 7.75 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతం! -
IPL 2022 Auction: అక్షరాలా రూ. 551 కోట్ల 70 లక్షలు
ఐపీఎల్‌కు ఆర్థిక మాంద్యం ఉండదని మరోసారి రుజువైంది. రెండు రోజుల పాటు సాగిన లీగ్ వేలంలో క్రికెటర్లను సొంతం చేసుకునేందుకు 10 ఫ్రాంచైజీలు హోరాహోరీగా పోటీ పడ్డాయి. గరిష్టంగా 217 స్థానాలకు ఆటగాళ్లను ఎంచుకునే అవకాశం ఉండగా అన్ని జట్లు కలిపి 204 మందితో సరిపెట్టాయి. ఇందులో భారత్ నుంచి 137 మంది ఉండగా... విదేశీ క్రికెటర్లు 67 మంది ఉన్నారు. 2022 సీజన్ వేలం కోసం అన్ని టీమ్‌లు కలిపి రూ. 551 కోట్ల 70 లక్షలు ఖర్చు చేయడం విశేషం. ఎప్పటిలాగే కొందరు ఆటగాళ్లకు అంచనాలకు మించిన అనూహ్య ధర పలకగా... మరికొందరు స్టార్లు ఆశ్చర్యకరంగా తక్కువ విలువతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపించకపోవడంతో మరికొందరు పెద్ద క్రికెటర్లు కూడా నిరాశగా చూస్తుండిపోవడం కూడా సహజ పరిణామంలా కనిపించింది. రెండో రోజు ఆదివారం సాగిన వేలంలో ఇంగ్లండ్ క్రికెటర్ లియామ్ లివింగ్‌స్టోన్‌ను అత్యధికంగా రూ. 11 కోట్ల 50 లక్షలకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఓవరాల్‌గా నలుగురు హైదరాబాద్ క్రికెటర్లు నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ, సీవీ మిలింద్, భగత్ వర్మ, రాహుల్ బుద్ధిలకు... ముగ్గురు ఆంధ్ర క్రికెటర్లు అంబటి రాయుడు, కేఎస్ భరత్, అశ్విన్ హెబర్‌లను వివిధ ఫ్రాంచైజీలు వేలంలో ఎంచుకున్నాయి. వేలానికే ముందే సిరాజ్‌ను బెంగళూరు ఎంచుకోగా... ఆశ్చర్యకరంగా టెస్టు క్రికెటర్ హనుమ విహారి పేరు కూడా వేలంలో వినిపించలేదు. వేలంతో క్రికెటర్ల విలువపై ఒక అంచనా ఏర్పడగా ఏప్రిల్–మేలో జరిగే టోర్నీలో ఆటగాళ్ల అసలు సత్తా ఏమిటో బయటపడుతుంది. బెంగళూరు: దక్షిణాఫ్రికా బ్యాటర్ ఎయిడెన్ మార్క్రమ్తో వేలం మొదలైంది. రూ. 1 కోటి బేస్‌ప్రైస్ కాగా, ముంబైతో పోటీ పడి చివరకు సన్‌రైజర్స్ దక్కించుకుంది. భారత ఆటగాడు అజింక్య రహానే కోసం ఎవరూ పోటీ పడకపోగా, కనీస ధర రూ.1 కోటితోనే కోల్‌కతా సొంతం చేసుకుంది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్న మలాన్‌ను ఎవరూ పట్టించుకోలేదు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు లబుషేన్, ఫించ్, భారత టెస్టు బ్యాటర్ పుజారా కోసం ఎవరూ ఆసక్తి చూపించకపోగా...గత సీజన్ వరకు కోల్‌కతాకు కెప్టెన్‌గా ఉన్న ఇయాన్ మోర్గాన్ కోసం కూడా ఏ జట్టూ ముందుకు రాలేదు. ► ధాటిగా ఆడగల విండీస్ బ్యాటర్ ఒడెన్ స్మిత్ కోసం పోటీ బాగా సాగింది. రూ. 5.75 కోట్ల వరకు వచ్చి సన్‌రైజర్స్ తప్పుకోగా, రూ. 6 కోట్లకు పంజాబ్ సొంతం చేసుకుంది. ఇటీవల సొంతగడ్డపై భారత్‌ను ఇబ్బంది పెట్టిన దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ జాన్సెన్ కోసం అతని తొలి ఐపీఎల్ జట్టు ముంబై రూ. 4 కోట్ల వరకు బాగా ఆసక్తి చూపిం చింది. అయితే మరో 20 లక్షలు జోడించి హైదరాబాద్ అతడిని తీసుకుంది. గత సీజన్లో రూ. 9.25 కోట్లకు అమ్ముడుపోయిన కృష్ణప్ప గౌతమ్‌కు ఈ సారి రూ. 90 లక్షలు దక్కడం గమనార్హం. ► అండర్–19 ప్రపంచకప్ గెలిచిన జట్టు కెప్టెన్ యష్ ధుల్‌ను అతని సొంత నగరం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రూ. 50 లక్షలకు ఎంచుకుంది. ప్రపంచకప్ ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన అంగద్ రాజ్ బావాను పంజాబ్ సొంతం చేసుకుంది. ► ఇంగ్లండ్ పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ కోసం భారీ పోటీ సాగింది. గాయంతో అతను 2022లో ఆడే అవకాశం లేకపోయినా వచ్చే సీజన్లను దృష్టిలో పెట్టుకొని టీమ్‌లు పోటీ పడ్డాయి. రాజస్తాన్, హైదరాబాద్‌లతో పోటీ పడి చివరకు ముంబై రూ. 8 కోట్లకు దక్కించుకుంది. ► జమ్ము కశ్మీర్‌కు చెందిన 21 ఏళ్ల రసిఖ్ సలామ్‌ను రూ. 20 లక్షల బేస్‌ప్రైస్‌కు కోల్‌కతా ఎంచుకుంది. 2019లో ముంబై ఇండియన్స్ తరఫున అతను ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. అయితే ఆ తర్వాత వయసు తప్పుగా చూపించాడంటూ బీసీసీఐ అతనిపై రెండేళ్ల నిషేధం విధించింది. ముంబై ఇండియన్స్ రెండేళ్ల పాటు అతని బాధ్యత తీసుకొని రసిఖ్‌ను ముంబైకి రప్పించింది. అన్ని సౌకర్యాలూ కల్పించి ప్రాక్టీస్‌కు అవకాశం ఇస్తూ స్థానిక మ్యాచ్‌లు కూడా ఆడించింది. అయితే వేలంలో అతని పేరు వచ్చినప్పుడు మాత్రం ముంబై అసలు స్పందించనే లేదు! లివింగ్‌స్టోన్‌కు రూ. 11 కోట్ల 50 లక్షలు విధ్వంసక బ్యాటింగ్‌తో పాటు అటు ఆఫ్‌స్పిన్, ఇటు లెగ్‌స్పిన్ బౌలింగ్ వేయగల నైపుణ్యం లివింగ్‌స్టోన్ సొంతం. 165 టి20 మ్యాచ్‌లలో 144.29 స్ట్రయిక్‌రేట్ కాగా 2 సెంచరీలు, 23 అర్ధ సెంచరీలు అతని ఖాతాలో ఉన్నాయి. బౌలింగ్‌లోనూ మెరుగైన 7.86 ఎకానమీని అతను నమోదు చేశాడు. గత ఐపీఎల్లో రూ. 75 లక్షలకు రాజస్తాన్ తరఫున ఆడిన అతను 5 మ్యాచ్‌లలో 42 పరుగులే చేశాడు. అయితే ఏడాది కాలంగా అతని ఆటతీరు అద్భుతంగా మారిపోయింది. 2021లో టి20ల్లో 86 సిక్స్‌లు బాదిన అతను పాకిస్తాన్‌పై 43 బంతుల్లోనే 103 పరుగులు చేశాడు. ఓపెనింగ్ నుంచి ఏడో స్థానం వరకు ఎక్కడైనా ఆడగలడు. లివింగ్‌స్టోన్ ఆట గురించి బాగా తెలిసిన పంజాబ్ కింగ్స్ అనలిస్ట్ డాన్ వెస్టన్ కూడా అతడిని సొంతం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. రూ. 1 కోటి కనీస ధరతో మొదలైన లివింగ్‌స్టోన్ బిడ్డింగ్ ఆ తర్వాత దూసుకుపోయింది. వేలంలో ఒకరిని మించి మరొకరు మొత్తం ఐదు జట్లు అతని కోసం పోటీ పడ్డాయి. చివరకు పంజాబ్ రూ. 11 కోట్ల 50 లక్షలకు లివింగ్‌స్టోన్‌ను గెలుచుకుంది. ఐపీఎల్ చరిత్రలో స్టోక్స్ (రూ. 14 కోట్ల 50 లక్షలు), స్టోక్స్ (రూ. 12 కోట్ల 50 లక్షలు), టైమల్ మిల్స్ (రూ. 12 కోట్లు) తర్వాత అత్యధిక మొత్తం పలికిన ఇంగ్లండ్ ఆటగాళ్ల జాబితాలో అతను నాలుగో స్థానంలో నిలిచాడు. సింగపూర్ ఆటగాడు టిమ్ డేవిడ్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. 85 మ్యాచ్‌ల టి20 కెరీర్లో 159.39 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు చేసిన డేవిడ్ గత ఏడాది బెంగళూరు టీమ్‌తో ఉన్నాడు. రూ.40 లక్షలతో ఢిల్లీ బిడ్ మొదలు పెట్టగా మరో నాలుగు జట్లు బరిలో నిలిచాయి. చివరకు అతడిని ముంబై ఎంచుకుంది. ముంబై ఇండియన్స్ చరిత్రలో ఒక విదేశీ ఆటగాడికి ఇచ్చిన అత్యధిక మొత్తం ఇదే కావడం విశేషం. అతను ఐదు లేదా ఆరో స్థానంలో ఆడతాడని ఓనర్ అంబానీ ప్రకటించాడు. టిమ్ డేవిడ్ తండ్రి రోడరిగ్ డేవిడ్‌ది ఆస్ట్రేలియా కాగా, ఉద్యోగరీత్యా అతను సింగపూర్‌కు వలస వచ్చాడు. రోడరిక్ కూడా సింగపూర్ జాతీయ జట్టు తరఫున ఆడాడు. సారీ రైనా..! 205 మ్యాచ్‌లు... 5,528 పరుగులు... ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగుల జాబితాలో నాలుగో స్థానం... అద్భుత ప్రదర్శనలతో చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీలక పాత్ర... ‘చిన్న తలా’ సురేశ్ రైనా సూపర్ కెరీర్ ముగిసినట్లే. వేలంలో రైనాను తీసుకోవడానికి చెన్నై సహా ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపించలేదు. ఇన్నేళ్లలో చెన్నైపై నిషేధం ఉన్న రెండేళ్లు మినహా (అప్పుడు గుజరాత్‌కు) మరే ఫ్రాంచైజీకి అతను ఆడలేదు. అతను రెగ్యులర్‌గా మ్యాచ్‌లు ఆడకపోవడం కూడా ప్రధాన కారణం. కనీసం బేస్‌ప్రైస్ వద్ద కూడా ఎవరూ పట్టించుకోలేదు. ఈ సీజన్ వేలంలో అమ్ముడుపోని కీలక ఆటగాళ్లలో స్టీవ్ స్మిత్, షకీబ్ అల్ హసన్, ఇయాన్ మోర్గాన్, ఇషాంత్ శర్మ, షమ్సీ, కేదార్ జాదవ్, గ్రాండ్‌హోమ్, గప్టిల్, కార్లోస్ బ్రాత్‌వైట్, పుజారా, హనుమ విహారి తదితరులు ఉన్నారు. -
40 లక్షల కనీస ధర.. కానీ ఏకంగా 8 కోట్లు.. ఎవరీ టిమ్ డేవిడ్!
సింగపూర్ ఆటగాడు టిమ్ డేవిడ్‌కు వేలంలో జాక్ పాట్ తగిలింది. ఐపీఎల్-2022 మెగా వేలంలో డేవిడ్‌ను ముంబై ఇండియన్స్ రూ. 8 కోట్లకు కొనుగోలు చేసింది. రూ. 40 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన టిమ్ డేవిడ్ కోసం బెంగళూరు, ముంబై ఇండియన్స్,ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడ్డాయి. చివరకు ముంబై సొంతం చేసుకుంది. కాగా గత సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు టిమ్ డేవిడ్ ప్రాతినిథ్యం వహించాడు. అయితే ఆ సీజన్లో ఒకే ఒక మ్యాచ్‌లో ఆడే అవకాశం లభించింది. అందులో కేవంల 1 పరుగు మాత్రమే తీవ్రంగా నిరాశపరిచాడు. ఆ తరువాత అతడికి బెంగళూరు మరి అవకాశం ఇవ్వలేదు. దీంతో మెగా వేలంలో తన పేరును డేవిడ్ రిజిస్టర్ చేసుకున్నాడు. హిట్టింగ్ స్కిల్స్ ఉన్న డేవిడ్‌ను ముంబై పోటీ పడి మరి దక్కించుకుంది. బిగ్ బాష్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్, టీ20 బ్లాస్ట్, ది హండ్రెడ్ వంటి టోర్నమెంట్లలో టిమ్ డేవిడ్ అద్భుతంగా రాణించాడు. డేవిడ్ ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో అడుతున్నాడు. -
ఎవరీ షెపర్డ్.. 7.75 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతం!
ఐపీఎల్ మెగా వేలం-2022లో వెస్టిండీస్ ఆల్ రౌండర్లు దమ్ము రేపుతున్నారు. ఓడియన్ స్మిత్‌ను పంజాబ్ కొనుగోలు చేయగా, మరో ఆల్ రౌండర్ రొమారియో షెపర్డ్‌ను రూ. 7.75 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. వేలంలో రూ.75 లక్షల బెస్ ప్రైస్‌తో వచ్చిన షెపర్డ్ కోసం లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ పోటీ పడ్డాయి. చివరకు హైదరాబాద్ కైవసం చేసుకుంది. షెపర్డ్ 2019 లో వెస్టిండీస్ తరుపున అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు,14 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. కాగా గత కొద్ది కాలంగా టీ20 ల్లో బ్యాట్‌తో, బాల్‌తో షెపర్డ్ అద్భుతంగా రాణిస్తున్నాడు. టీ20ల్లో 44 మ్యాచ్‌లు ఆడిన షెపర్డ్ 53 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లోనూ షెపర్డ్ రాణించాడు. చదవండి: IPL 2022 Mega Auction: టీమిండియాపై అదరగొట్టాడు.. వేలంలో జాక్ పాట్! -
టీమిండియాపై అదరగొట్టాడు.. వేలంలో జాక్ పాట్!
వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఓడియన్ స్మిత్‌కి ఐపీఎల్-2022 మెగా వేలంలో భారీ ధర దక్కింది. స్మిత్ కోసం పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ పోటీ పడ్డాయి. చివరకు పంజాబ్ కింగ్స్ రూ. 6కోట్లకు కొనుగోలు చేసింది. కాగా భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో స్మిత్ అద్భుతంగా రాణించాడు. టీమిండియాతో రెండు వన్డేలు ఆడిన స్మిత్ 60 పరుగలతో పాటు, మూడు వికెట్లు సాధించాడు. అదే విధంగా కరేబియన్ ప్రీమియర్ లీగ్-2021లో కూడా స్మిత్ రాణించాడు. ఈ టోర్నమెంట్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా స్మిత్ నిలిచాడు. స్మిత్ బ్యాట్‌తోను, బాల్‌తోను విద్వంసం సృష్టించగలడు. అందుకే పంజాబ్ అతడిని పోటీ పడి మరి దక్కించుకుంది. ఇక రెండో రోజు వేలంలో ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్‌కు భారీ ధర దక్కింది. వేలంలో లివింగ్‌స్టోన్‌ని రూ11.50 కోట్లకు పంజాబ్ కింగ్స్ జట్టు కొనుగోలు చేసింది. చదవండి: IPL 2022 Mega Auction: టీమిండియా కెప్టెన్‌ను సొంతం చేసుకున్న ఢిల్లీ.. ధర ఎంతంటే!