IPL 2022: Faf du Plessis Named RCB Captain For Upcoming Season, Know Details - Sakshi
Sakshi News home page

IPL RCB Captain: ఆర్సీబీకి కొత్త కెప్టెన్‌ వచ్చేశాడు.. బెంగళూరు అధికారిక ప్రకటన కొత్త కెప్టెన్‌ వచ్చేశాడు.. బెంగళూరు అధికారిక ప్రకటన

Published Sat, Mar 12 2022 5:11 PM | Last Updated on Sat, Mar 12 2022 7:43 PM

Faf du Plessis named RCB captain for the upcoming season - Sakshi

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు కొత్త  కెప్టెన్‌ వచ్చేశాడు. అంతా ఊహించినట్లుగానే దక్షిణాఫ్రికా స్టార్‌ ఆటగాడు ఫఫ్ డుప్లెసిస్‌కు ఆర్సీబీ సారథ్య బాధ్యతలు అప్పజెప్పింది. ఈ మేరకు బెంగళూరులో నిర్వహించిన "ఆర్సీబీ ఆన్‌బాక్స్‌" ఈవెంట్‌లోఈ విషయాన్ని బెంగళూరు ఫ్రాంచైజీ వెల్లడించింది. ఇక ఐపీఎల్‌-2021 తర్వాత ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మళ్లీ కోహ్లి సారథ్య బాధ్యతలు చేపట్టున్నాడని వార్తలు వినిపించాయి.

ఆర్సీబీ తాజా ప్రకటనతో ఆ వార్తలకు బ్రేక్‌ పడింది. కాగా ఐపీఎల్‌-2022 మెగా వేలంలో భాగంగా ఫఫ్ డు ప్లెసిస్‌ను ఆర్సీబీ రూ. 7కోట్లకు కొనుగోలు చేసింది. ఇక గతంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరుపున ఆడిన డు ప్లెసిస్‌ అద్భుతంగా రాణించాడు. ఐపీఎల్‌-2021 సీజన్‌లో 633 పరుగులు చేసి టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా డు ప్లెసిస్ నిలిచాడు. గత ఏడాది చెన్నై టైటిల్‌ గెలవడంలో డు ప్లెసిస్‌ కీలక పాత్ర పోషించాడు. ఇక  ప్రొటీస్ జట్టు తరఫున 37 టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించి.. 23 మ్యాచ్‌లలో విజయాలు అందుకున్నాడు.

చదవండి: Ind Vs Sl 2nd Test: అప్పుడు సెహ్వాగ్ .. ఇప్పుడు మయాంక్‌ అగర్వాల్.. తొమ్మిదేళ్ల తర్వాత!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement