Royal Challenger Bangalore
-
గెలుపు జోష్‌లో ఉన్న ఆర్సీబీకి బిగ్ షాక్..
డబ్ల్యూపీఎల్-2025 సీజన్ తొలి మ్యాచ్‌లో గెలిచి మంచి జోష్ మీద ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ గాయం కారణంగా టోర్నీ నుంచి నుంచి తప్పుకుంది. శ్రేయంక ప్రస్తుతం మోకాలి గాయంతో బాధపడుతోంది.దీంతో గతేడాది జరిగిన ఆసియాకప్‌కు దూరమైంది. ఆతర్వాత యూఏఈ వేదికగా జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆమె రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే తన గాయం మళ్లీ తిరగబెట్టడంతో స్వదేశంలో ఐర్లాండ్, వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లకు దూరంగా ఉంది. పూర్తి ఫిట్నెస్ సాధించకపోవడంతో శుక్రవారం జరిగిన టోర్నీ తొలి మ్యాచ్‌లో కూడా ఆమె బరిలోకి దిగలేదు.ఆమె పూర్తిగా కోలుకోవడానికి నెల రోజుల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సీజన్ మొత్తానికి పాటిల్ దూరమైంది. తాజాగా శ్రేయాంక పాటిల్ కూడా సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. తన గుండె పగిలిందని, అయినా కానీ తాను మళ్లీ పుంజుకుంటాననే క్యాప్షన్‌తో ఊయల ఊగుతున్న ఫొటోను పంచుకుంది. ఇక శ్రేయాంక స్థానంలో స్నేహ్ రాణాను ఆర్సీబీ జట్టులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని శనివారం ఆర్సీబీ ఒక ప్రకటనలో పేర్కొంది. గత ఏడాది గుజరాత్ జెయింట్స్ తరఫున ఆడిన రాణా ఈ సారి వేలంలో ఎంపిక కాలేదు. రాణాను రూ.30 లక్షలకు బెంగళూరు ఎంచుకుంది.గతేడాది సీజన్లో ఆర్సీబీ ఛాంపియన్‌గా నిలవడంలో శ్రేయంకది కీలక పాత్ర. 8 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ అందుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్లో 4 వికెట్లతో ఆమె సత్తాచాటింది. ఆర్బీబీ తమ తదుపరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తో ఈనెల 17న తలపడనుంది.ఆర్సీబీ జట్టు: స్మృతి మంధాన (కెప్టెన్), ఆశా శోభన జాయ్, జోషిత విజయ్, రిచా ఘోష్, డానీ వ్యాట్, కనికా అహుజా, సబినేని మేఘన, ఏక్తా బిష్ట్, కేట్ క్రాస్, స్నేహ్రాణా, ఎల్లీస్ పెర్రీ, ప్రేమ రావత్, జార్జియా బాహ్మ్, రేణుకా సింగ్, సోఫీ మోలిన్యూక్స్.చదవండి: IPL 2025: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ షెడ్యూల్ ఖారారు! తొలి మ్యాచ్ ఎప్పుడంటే? -
ఇదేమి చెత్త బ్యాటింగ్‌రా బాబు.. ఫుల్ టాస్ బాల్‌కు కూడా! వీడియో
ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ ఐడైన్ మార్క్రమ్ తన పేలవ ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఉప్పల్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో మార్క్రమ్ నిరాశపరిచాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన మార్క్రమ్ ఏ మాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. 8 బంతులు ఎదుర్కొన్న మార్క్రమ్.. కేవలం 7 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.స్పిన్నర్ స్వప్నిల్ సింగ్ బౌలింగ్‌లో ఫుల్ టాస్ బంతికి వికెట్ల ముందు మార్క్రమ్ దొరికిపోయాడు. రివ్యూ తీసుకున్నప్పటికి క్లియర్ ప్లంబ్(ఎల్బీ)గా తేలింది. ఈ క్రమంలో అతడిని నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఫుల్ టాస్ బాల్ కూడా ఆడలేవా అంటూ పోస్టులు పెడుతున్నారు.మరి కొంతమంది వరుసగా విఫలమవతున్నప్పటికి మార్క్రమ్కు ఛాన్స్ ఇవ్వడాన్ని తప్పుబడుతున్నారు. అతడి స్ధానంలో గ్లెన్ ఫిలిప్స్‌కు ఛాన్స్ ఇవ్వాలని ఎస్ఆర్హెచ్ మెనెజ్‌మెంట్‌కు సూచిస్తున్నారు. ఇప్పటివరకు ఈ ఏడాది సీజన్లో 8 మ్యాచ్‌లు ఆడిన మార్క్రమ్.. 27.83 సగటుతో 167 పరుగులు చేశాడు. SRH fans reaction watching Aiden markram batting in this season pic.twitter.com/b6vx0pgeZr— Abhi (@Ragnarfreak) April 25, 2024pic.twitter.com/4klNQt9XoJ— Cricket Videos (@cricketvid123) April 25, 2024 -
గౌతం గంభీర్, విరాట్ కోహ్లికి బిగ్ షాక్.. భారీ జరిమానా
లక్నో సూపర్ జెయింట్స్, ఆర్సీబీ మ్యాచ్ సందర్భంగా మైదానంలోనే గొడవపడ్డ విరాట్ కోహ్లి, గౌతం గంభీర్‌లకు బిగ్ షాక్ తగిలింది. వీరిద్దరితో పాటు గొడవకు పరోక్షంగా కారణమైన నవీన్-ఉల్-హక్లకు ఐపీఎల్ నిర్వహకులు భారీ జరిమానా విధించారు. కోహ్లి, గంభీర్ మ్యాచ్ ఫీజులో 100 శాతం.. నవీన్-ఉల్-హక్ మ్యాచ్ ఫీజులో 50 శాతం కొత ఐపీఎల్ నిర్వహకులు విధించారు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవెల్ 2 ఆర్టికల్ 2.21 కింద ఈ ముగ్గిరికి ఈ జరిమానా విధించినట్లు ఐపీఎల్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఏం జరిగిందంటే? మ్యాచ్ ముగిసిన అనంతరం కోహ్లి, గంభీర్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. షేక్ హ్యండ్ ఇచ్చే సమయంలో కోహ్లి, లక్నో పేసర్ నవీనుల్ హఖ్ మధ్య ఏదో వాదన జరిగింది. తర్వాత ఇదే విషయంపై లక్నో ఆటగాడు కైల్ మైర్స్ కోహ్లితో మాట్లాడతుండగా.. గంభీర్ అతడితో మాట్లాడవద్దు అంటూ మైర్స్‌ను తీసుకు వెళ్లిపోయాడు. దీంతో గంభీర్, కోహ్లి మధ్య మాటమాట పెరిగి గొడవకు దారితీసింది. ఈ క్రమంలో సహచర ఆటగాళ్లు జోక్యం చేసి గొడవ సద్దుమణిగేలా చేశారు. ఆర్సీబీ సంచలన విజయం ఈ మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో ఆర్సీబీ సంచలన విజయం సాధించింది. 127 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 108 పరుగులకే ఆలౌటైంది. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్‌వుడ్, కరణ్ శర్మ రెండు వికెట్లు పడగొట్టగా మ్యాక్స్‌వెల్, హసరంగా, సిరాజ్, హర్షల్ పటేల్ తలా వికెట్ సాధించారు. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో బౌలర్లు చెలరేగడంతో కేవలం 126 పరుగులు మాత్రమే చేసింది. లక్నోబౌలర్లలో నవీనుల్ హఖ్ మూడు వికెట్లు పడగొట్టగా, బిష్ణోయ్, మిశ్రా తలా వికెట్ సాధించారు. ఆర్సీబీ బ్యాటర్లలో డుప్లెసిస్ 44 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చదవండి: #Kohli Gambhir Fight: మళ్లీ డిష్యూం డిష్యూం.. కోహ్లి, గంభీర్ మధ్య తీవ్ర వాగ్వాదం! వీడియో వైరల్ The full fight video #virat #gambhir #fight #rcb #lsg #RCBvsLSG #TataIPL #DARKBLOOD #LabourDay #IPL #Viral #ViralFight #naveen #LSGvsRCB pic.twitter.com/ehymWbIE49 — Vipul Chahal Infinitech (@v7pul) May 1, 2023 -
మళ్లీ డిష్యూం డిష్యూం.. కోహ్లి, గంభీర్ మధ్య తీవ్ర వాగ్వాదం! వీడియో వైరల్
ఐపీఎల్-2023లో భాగంగా వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగులు తేడాతో ఆర్సీబీ సంచలన విజయం సాధించింది. 127 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 108 పరుగులకే ఆలౌటైంది. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్‌వుడ్, కరణ్ శర్మ రెండు వికెట్లు పడగొట్టగా మ్యాక్స్‌వెల్, హసరంగా, సిరాజ్, హర్షల్ పటేల్ తలా వికెట్ సాధించారు. గంభీర్, కోహ్లి మధ్య తీవ్ర వాగ్వాదం ఇక ఈ మ్యాచ్ సందర్భంగా లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్, ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. గతంలో ఐపీఎల్ మ్యాచ్‌లో వీరిద్దరి మధ్య జరిగిన గొడవను ఇది గుర్తుకు తెచ్చింది. అయితే ఇందులో నేరుగా గంభీర్ పాత్ర లేకపోయినా...అతని జోక్యంతో పరిస్థితి కాస్త వేడిగా మారింది. బెంగళూరు విజయం తర్వాత షేక్ హ్యాండ్ల సమయంలో కోహ్లి, లక్నో పేసర్ నవీనుల్ హఖ్ (అఫ్గానిస్తాన్) మధ్య ఏదో వాదన జరిగింది. చేతులు విసిరికొట్టి మరీ ఇద్దరూ విడిపించుకున్నారు. అయితే ఆ తర్వాత నవీన్‌ను పిలిచి కోహ్లి ఏదో చెప్పేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ముందుగా కైల్ మేయర్స్ (వెస్టిండీస్), ఆ తర్వాత గంభీర్ తమ ఆటగాడికి అండగా నిలుస్తూ మధ్యలోకి వచ్చారు. దాంతో కోహ్లి, గంభీర్ తీవ్రంగా వాదించుకున్నారు. చివరకు రాహుల్, మిశ్రా జోక్యం చేసుకొని విడిపించాల్సి వచ్చింది. ఆ తర్వాతా కోహ్లి పదే పదే ఇదే విషయాన్ని రాహుల్‌కు ఫిర్యాదు చేయడం కనిపించింది. నిజానికి గత మ్యాచ్‌లో గెలిచిన తర్వాత చిన్నస్వామి స్టేడియంలో నోరు మూయమంటూ ప్రేక్షకులను ఉద్దేశించి గంభీర్ సైగ చేయగా...ఈసారి గెలుపు బాటలో కోహ్లి అదే తరహాలో సైగ చేస్తూ దానిని గుర్తు చేయడం కూడా ఒక కారణం కావచ్చు! ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి చదవండి: LSG VS RCB: టాప్-3లోకి చేరిన అమిత్ మిశ్రా.. ఒకేసారి ముగ్గురిని అధిగమించి..! The full fight video #virat #gambhir #fight #rcb #lsg #RCBvsLSG #TataIPL #DARKBLOOD #LabourDay #IPL #Viral #ViralFight #naveen #LSGvsRCB pic.twitter.com/ehymWbIE49 — Vipul Chahal Infinitech (@v7pul) May 1, 2023 -
IPL 2023: ఆర్సీబీకి బిగ్ షాక్.. స్టార్ క్రికెటర్ దూరం
ఐపీఎల్-2023 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు కీలక ఆటగాడు రజత్ పటిదార్ గాయం కారణంగా ఈ ఏడాది సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ ట్విటర్ వేదికగా వెల్లడించింది.మడమ గాయంతో బాధపడుతున్న పాటిదార్.. పూర్తిగా కోలుకోవడానికి దాదాపు రెండు నెలలసమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడు ఈ మెగా టోర్నీకి దూరమయ్యాడు. "దురదృష్టవశాత్తూ కాలి మడమ గాయం కారణంగా రజత్ పాటిదార్ ఐపీఎల్-2023 నుంచి తప్పుకున్నాడు. అతడు త్వరగా కోలుకోవాలని మేము కోరుకుంటున్నాము. రజత్‌కు మేము ఎల్లప్పుడూ మద్దతునిస్తూనే ఉంటాము. ఇక పాటిదార్ స్థానంలో ఎవరని తీసుకోవాలన్నది కోచ్, మేనేజ్మెంట్ ఇంకా నిర్ణయించలేదు అని ఆర్సీబీ ట్వీట్ చేసింది. కాగా గతేడాది జరిగిన మెగావేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిన పాటిదార్‌ను అనూహ్యంగా ఆర్సీబీ జట్టులోకి తీసుకుంది. అయితే తనకు వచ్చి అవకాశాన్ని పాటిదార్ అందిపుచ్చుకున్నాడు. గతేడాది ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై అద్భుతమైన సెంచరీ బాదాడు. గతేడాది సీజన్లో 7 మ్యాచ్‌లు ఆడిన పాటిదార్.. 333 పరుగులు సాధించాడు. ఇక ఇప్పటికే ఆర్సీబీకి ఆసీస్ స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ దూరం కాగా.. ఇప్పుడు పాటిదార్ దూరం కావడం మేనేజ్మెంట్ను మరింత కలవరపెడుతోంది. చదవండి: IPL 2023: 'అదే మా కొంపముంచింది.. అతడు మాకు దొరికిన విలువైన ఆస్తి' Unfortunately, Rajat Patidar has been ruled out of #IPL2023 due to an Achilles Heel injury. 💔 We wish Rajat a speedy recovery and will continue to support him during the process. 💪 The coaches and management have decided not to name a replacement player for Rajat just yet. 🗒️ pic.twitter.com/c76d2u70SY — Royal Challengers Bangalore (@RCBTweets) April 4, 2023 -
వారెవ్వా తిలక్.. ధోనిని గుర్తు చేస్తూ హెలికాప్టర్ షాట్! వీడియో వైరల్
ఐపీఎల్-2023లో భాగంగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ మిడిలార్డర్ బ్యాటర్ తిలక్ వర్మ అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో ముంబై ఓటమిపాలైనప్పటికీ తిలక్ వర్మ మాత్రం అభిమానుల మనసు గెలుచుకున్నాడు. రోహిత్, సూర్య కుమార్ వంటి స్టార్ బ్యాటర్లు విఫలమైన చోట వర్మ తన అద్భుత ఇన్నింగ్స్‌తో అందరిని అకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 46 బంతులు ఎదుర్కొన్న 9 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 84 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడు అద్భుత ఇన్నింగ్స్‌తో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 171 పరుగులు చేసింది. ధోనిని గుర్తు చేసిన తిలక్ వర్మ.. ఇక ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ సీఎస్కే కెప్టెన్, టీమిండియా మాజీ సారథి ఎంస్ ధోనిని గుర్తు చేశాడు. ధోని స్టైల్లో వర్మ హెలికాప్టర్ షాట్ ఆడాడు. ముంబై ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన హర్షల్ పటేల్ బౌలింగ్‌లో చివరి బంతికి తిలక్ వర్మ హెలికాప్టర్ షాట్ రూపంలో అద్భుతమైన సిక్స్ బాదాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక అద్భుత ఇన్నింగ్స్ ఆడిన వర్మపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. అతడు కచ్చితంగా భారత జట్టులోకి ఎంట్రీ ఇస్తాడని అభిమానులు భావిస్తున్నారు. చదవండి: IPL 2023: ధోనికి సరైన వారసుడు.. అతడికి ఎందుకు అవకాశాలు ఇవ్వడం లేదో!: సెహ్వాగ్ Tribute to Thala @msdhoni Helicopter shot.. What an inning by Tilak Varma.. Take a bow @TilakV9 , next big thing in #IndianCricket #IPL2023 #MIvsRCB #RCBvsMI pic.twitter.com/cwYmMFedaL — Prem Baranwal (@prembaranwal) April 2, 2023 -
RCB: స్మృతి మంధాన సహా ఆర్సీబీ కొన్న ప్లేయర్లు వీరే.. పర్సులో ఎంత ఉందంటే?
WPL 2023 Auction- RCB Women Squad: మహిళా ప్రీమియర్ లీగ్-2023 వేలంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అత్యధిక ధర వెచ్చించి స్మృతి మంధానను సొంతం చేసుకుంది. భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్‌ను భారీ మొత్తం చెల్లించి హైలైట్‌గా నిలిచింది. ముంబైలో సోమవారం (ఫిబ్రవరి 13) జరిగిన ఈ వేలంలో ఆర్సీబీ కొనుగోలు చేసిన ప్లేయర్లు వీరే.. ►స్మృతి మంధాన- రూ.3.40 కోట్లు ►రిచా ఘోష్- రూ.1.90 కోట్లు ►ఎలీస్ పెర్రీ- రూ.1.70 కోట్లు ►రేణుక సింగ్- రూ.1.50 కోట్లు ►సోఫీ డివైన్- రూ.50 లక్షలు ►హీతెర్ నైట్- రూ.40 లక్షలు ►మేగన్ షుట్- రూ.40 లక్షలు ►కనిక అహుజ- రూ.35 లక్షలు ►డేన్‌వాన్ నికెర్క్- రూ.30 లక్షలు ►ఎరిన్ బర్న్స్ - రూ.30 లక్షలు ►ప్రీతి బోస్ - రూ.30 లక్షలు ►కోమల్ జంజద్ - రూ.25 లక్షలు ►ఆశ శోభన- రూ.10 లక్షలు ►దిశ కాసత్ - రూ.10 లక్షలు ►ఇంద్రాణి రాయ్- రూ.10 లక్షలు ►పూనమ్ ఖేమ్నర్- రూ.10 లక్షలు ►సహన పవార్- రూ.10 లక్షలు ►శ్రేయాంక పాటిల్- రూ.10 లక్షలు ►మొత్తం ప్లేయర్లు: 18 విదేశీ ప్లేయర్లు: 6 ఈ మేరకు ప్లేయర్ల కొనుగోలు ఖర్చు చేసిన మొత్తం పోగా.. ఆర్సీబీ పర్సులో రూ. 10 లక్షలు మిగిలిపోయాయి. -
ఆర్సీబీకి షాక్.. ట్విటర్‌ను కూడా వదల్లేదు
ఐపీఎల్లో అత్యంత ప్రజాదరణ పొందిన జట్టుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు పేరుంది. సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న జట్టు కూడా ఆర్సీబీనే. అలాంటి ఆర్సీబీ ట్విటర్‌ను హ్యాక్ చేయడం సంచలనం కలిగించింది. శనివారం (జనవరి 21) ఉదయం 4 గంటల సమయంలో అకౌంట్ హ్యాక్ చేసినట్లు ఆర్సీబీ ప్రకటించింది. హ్యాకర్లు ప్రొఫైల్ నేమ్‌ని ‘బోర్డ్ ఏప్ యాచ్ క్లబ్’గా మార్చారు. ప్రొఫైల్ పిక్‌గా కార్టూన్ ఇమేజ్ పెట్టారు. అకౌంట్ బయోలో ఎన్ఎఫ్టీ గురించి అప్డేట్ చేయడంతో పాటు దానికి సంబంధించిన కొన్ని ట్వీట్లను పోస్ట్ చేశారు. ఆర్సీబీ ట్విటర్ ఖాతా హ్యాక్ కావడం ఇదే మొదటిసారి కాదు. 2021లో కూడా ఈ టీమ్ ట్విటర్ ఖాతా హ్యాక్ అయింది.ఆర్సీబీ ట్విటర్ ఖాతాలను రెండుసార్లు హ్యాక్ చేసిన హ్యాకర్లు.. ఆగస్టు 2022లో ఆర్సీబీ యూట్యూబ్ చానెల్‌ను కూడా హ్యాక్ చేశారు. ప్రస్తుతం ట్విట్టర్ ఖాతాని తిరిగి పునరుద్దరించినట్లు ఆర్సీబీ ప్రకటించింది. Rcb acc hacked?😭 pic.twitter.com/0PoVZaH2yc — SDS (@Saumyadeep63) January 21, 2023 Kohli 👑 Bengaluru 🏠 ABD 👽 Chinnaswamy 🏟️ IPL 2023 🏏 Play Bold 💪 Vibe check complete ✅ Yes! We can confirm that our Twitter handle is restored. Phew! 😅 — Royal Challengers Bangalore (@RCBTweets) January 21, 2023 చదవండి: రెజ్లర్ల మీటూ ఉద్యమం.. క్రీడాశాఖ కీలక నిర్ణయం 'టీమిండియా రైట్ ట్రాక్‌లోనే వెళ్తుందా?'.. మీకేమైనా అనుమానమా! -
IPL 2022 Playoffs: రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఆర్సీబీ చిత్తు.. ఫైనల్లో గుజరాత్‌తో ఢీ
ఆర్సీబీను చిత్తు చేసిన రాజస్తాన్ రాయల్స్.. ఫైనల్లో గుజరాత్‌తో ఢీ ఐపీఎల్-2022 ఫైనల్లో రాజస్తాన్ రాయల్స్ అడుగు పెట్టింది. అహ్మదాబాద్ వేదికగా ఆర్సీబీతో జరిగిన క్వాలిఫైయర్-2లో ఆర్సీబీపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 158 లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. రాజస్తాన్ బ్యాటర్లలో జోస్ బట్లర్ సెంచరీతో చేలరేగాడు. 60 బంతుల్లో 106 పరుగులు సాధించాడు. ఆర్సీబీ బౌలర్లలో హాజల్‌వుడ్ రెండు వికెట్లు,హాసరంగా ఒక వికెట్ సాధించారు. ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు మాత్రమే చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో రజత్ పాటిదార్ 58 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక రాజస్తాన్ బౌలర్లలో ప్రసిద్ కృష్ణ, ఒబెడ్ మెక్కాయ్ చెరో మూడు వికెట్లు సాధించగా.. బౌల్ట్, అశ్విన్ తలా వికెట్ పడగొట్టారు. ఇక ఆదివారం(మే29) అహ్మదాబాద్ వేదికగా ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌తో రాజస్తాన్ తలపడనుంది. 15 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 126/2 15 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ రెండు వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. క్రీజులో బట్లర్(75), పడిక్కల్(7), పరుగులతో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన రాజస్తాన్ 113 పరుగుల వద్ద రాజస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన శాంసన్.. హాసరంగా బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు. క్రీజులో బట్లర్(69), పడిక్కల్(1)ఉన్నారు. 8 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 81/1 8 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ వికెట్ నష్టానికి 81 పరుగులు చేసింది. క్రీజులో బట్లర్(56), శాంసన్(4), పరుగులతో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన రాజస్తాన్ 61 పరుగుల వద్ద రాజస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది. 21 పరుగులు చేసిన జైశ్వాల్.. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 68/1. క్రీజులో బట్లర్(45), శాంసన్ ఉన్నారు. 2 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 22/0 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ దూకుడుగా ఆడుతోంది. 2 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేసింది. క్రీజులో జైశ్వాల్(16), బట్లర్(6) పరుగులతో ఉన్నారు. తడబడ్డ ఆర్సీబీ బ్యాటర్లు.. రాజస్తాన్ టార్గెట్ 158 పరుగులు 20 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు మాత్రమే చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో రజత్ పాటిదార్ 58 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక రాజస్తాన్ బౌలర్లలో ప్రసిద్ కృష్ణ, ఒబెడ్ మెక్కాయ్ చెరో మూడు వికెట్లు సాధించగా.. బౌల్ట్, అశ్విన్ తలా వికెట్ పడగొట్టారు. 19 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 154/7 ఆర్సీబీ వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో దినేష్ కార్తీక్, హాసరంగా పెవిలియన్‌కు చేరారు. 19 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 154/7 142 పరుగుల వద్ద ఆర్సీబీ ఐదో వికెట్‌ను కోల్పోయింది. 8 పరుగులు చేసిన పాటిదార్.. మెకాయ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 17 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 139/4 17 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ నాలుగు వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. క్రీజులో కార్తీక్(5),లోమ్రోర్(7) పరుగులతో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ 130 పరుగుల వద్ద ఆర్సీబీ నాలుగో వికెట్‌ను కోల్పోయింది. 58 పరుగులు చేసిన పాటిదార్.. అశ్విన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి దినేష్ కార్తీక్ వచ్చాడు. పాటిదార్ హాఫ్ సెంచరీ 15 ఓవర్లు ముగిసే సమయానికి ఆర్సీబీ మూడు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. క్రీజులో పాటిదార్ 52, లామోర్ 2 ఉన్నారు. 40 బంతుల్లోనే పాటిదార్ హాఫ్ సెంచరీ సాధించాడు. మూడో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ 14 వ ఓవర్లో ఆర్సీబీ కీలకమైన మాక్స్వెల్ వికెట్‌ను కోల్పోయింది. ఇప్పటికే కోహ్లి, డుప్లెసిస్ పెవిలియన్ చేరగా.. బౌల్ట్ బౌలింగ్‌లో మెకాయ్ క్యాచ్ పట్టడం ద్వారా మాక్సీ (24) వికెట్ సమర్పించుకున్నాడు. సెంచరీకి చేరువగా ఆర్సీబీ 12 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ రెండు (కోహ్లి 7, డుప్లెసిస్ 25) వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. క్రీజులో పాటిదార్ 41, మాక్స్వెల్ 9 ఉన్నారు. డుప్లెసిస్ (25) ఔట్ ఆర్సీబీ కీలక బ్యాట్స్‌మన్ డుప్లెసిస్ 11 ఓవర్లో పెలివియన్‌కు చేరాడు. ఒబెద్ మెకాయ్ బౌలింగ్‌లో అశ్విన్‌కు క్యాచ్ ఇచ్చి తన వ్యక్తిగత స్కోరు 25 వద్ద డుప్లెసిస్ ఔట్ అయ్యాడు. 10 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 74-1 డుప్లెసిస్, రజత్ పాటిదార్ కీలకమైన 65 పరుగుల భాగస్వామ్యంతో ఆర్సీబీ 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 74 పరుగులు చేసింది. డుప్లెసిస్ 25 , రజత్ పాటిదార్ 32 పరుగులతో క్రీజులో ఉన్నారు. 8 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 58-1 ఆర్సీబీ బ్యాటర్లు నిలకడగా ఇన్నింగ్స్ నిర్మిస్తున్నారు. 8 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి బెంగళూరు 58 పరుగులు చేసింది. డుప్లెసిస్ 22, రజత్ పాటిదార్ 20 పరుగులతో క్రీజులో ఉన్నారు. 5 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 37/1 5 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది. క్రీజులో డుప్లెసిస్(17), పాటిదార్(5) పరుగులతో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ.. కోహ్లి ఔట్ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ ఆదిలోనే విరాట్ కోహ్లి వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన కోహ్లి.. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 2 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 13/1 ఐపీఎల్-2022లో భాగంగా క్వాలిఫైయర్-2లో అహ్మదాబాద్ వేదికగా ఆర్సీబీతో రాజస్తాన్ రాయల్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు కూడా ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాయి. ఇక ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆదివారం ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. తుది జట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్ రాజస్తాన్ రాయల్స్ యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(కెప్టెన్/వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, ఒబెద్ మెక్కాయ్, యుజ్వేంద్ర చాహల్ -
సెంచరీతో లక్నోకు చుక్కలు చూపించాడు.. ఎవరీ రజత్ పాటిదార్..?
IPL 2022 LSG Vs RCB- Rajat Patidar: ఐపీఎల్-2022లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ ఆటగాడు రజత్ పాటిదార్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 54 బంతుల్లోనే 112 పరుగులు సాధించి.. ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 14 పరుగుల తేడాతో గెలిపొంది.. రాజస్తాన్ రాయల్స్‌తో క్వాలిఫెయిర్2కు సిద్దమైంది. అయితే కీలకమైన మ్యాచ్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన పాటిదార్‌పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో పాటిదార్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ఎవరీ రజత్ పాటిదార్..? మధ్య ప్రదేశ్‌కు చెందిన 28 ఏళ్ల పాటిదార్ 2020 నుంచి 2021 సీజన్ వరకు ఆర్సీబీ జట్టులో భాగమై ఉన్నాడు. అయితే పాటిదార్ చాలా మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇక ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు పటిదార్‌ను ఆరీసీబీ విడిచి పెట్టింది. ఇక వేలంలో పాల్గొన్న అతడిని ఏ ప్రాంఛైజీ కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరచలేదు. అయితే ఈ ఏడాది టోర్నీ మధ్యలో గాయపడిన లువ్నిత్ సిసోడియా స్ధానంలో పటిదార్‌ను ఆర్సీబీ భర్తీ చేసుకుంది. దీంతో మళ్లీ అతడికి ఆర్సీబీ తరపున ఆడే అవకాశం దక్కింది. ఇక డొమాస్టిక్ క్రికెట్లో మధ్య ప్రదేశ్ తరపున పటిదార్ ఆడుతున్నాడు. 39 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడిన పటిదార్ 2500పైగా పరుగులు సాధించాడు. అదే విధంగా 43 లిస్ట్-ఎ మ్యాచ్‌లు, 38 టీ20లు కూడా ఆడాడు. టీ20ల్లో తన 1000 పరుగులను కూడా పటిదార్ పూర్తి చేసుకున్నాడు. చదవండి: IPL 2022: రజత్ పాటిదార్ కొత్త చరిత్ర.. ఆర్సీబీ తరపున తొలి బ్యాటర్‌గా var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); .@RCBTweets seal a spot in the #TATAIPL 2022 Qualifier 2! 👏 👏@faf1307 & Co. beat #LSG by 14 runs in the high-scoring Eliminator at the Eden Gardens, Kolkata. 👍 👍 Scorecard ▶️ https://t.co/cOuFDWIUmk #TATAIPL | #LSGvRCB pic.twitter.com/mOqY5xggUT — IndianPremierLeague (@IPL) May 25, 2022 -
IPL 2022: ఆర్సీబీపై పంజాబ్ కింగ్స్ సూపర్ విక్టరీ
-
ఐపీఎల్లో అదరగొడుతున్నాడు.. భారత్ తరపున రీ ఎంట్రీ!
ఐపీఎల్-2022లో టీమిండియా వెటరన్ ఆటగాడు, ఆర్సీబీ స్టార్ ఆటగాడు దినేష్ కార్తీక్ అదరగొడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన కార్తీక్ 209 పరుగులు సాధించాడు. 7వస్థానంలో బ్యాటింగ్ దిగుతున్న కార్తీక్ తన సునామీ ఇన్నింగ్స్‌తో ఆర్సీబీకి బెస్ట్ షినిషర్‌గా మారాడు. ఇక అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కార్తీక్ టీమిండియాలో రీఎంట్రీ దాదాపు ఖాయమనిపిస్తోంది. ఇన్‌సైడ్‌స్పోర్ట్ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది జూన్‌లో జరగనున్న దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు కార్తీక్ భారత జట్టుకు ఎంపికయ్యే అవకాశం ఉంది. "ప్రస్తుతం నిలకడగా ప్రదర్శన చేస్తున్న వారందరికీ బారత్ తరపున ఆడేందుకు తలుపులు తెరిచే ఉన్నాయి. టీ20 ప్రపంచకప్‌కు ముందు మేము కొన్ని సిరీస్‌లు ఆడనున్నాము. కార్తీక్ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే.. కచ్చితంగా సెలక్టర్ల దృష్టి ఉంటాడు" అని బీసీసీఐ సెలక్షన్ కమిటీ సభ్యడు ఒకరు పేర్కొన్నారు. అయితే, మిడిల్ ఆర్డర్లో రిషబ్ పంత్, సంజూ శాంసన్, శ్రేయాస్ అయ్యర్ల రూపంలో వెటరన్ వికెట్ కీపర్‌కు గట్టి పోటీ ఎదురు కానుంది. కాగా రిషబ్ పంత్ ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్‌గా ఉండే అవకాశం ఉంది. చదవండి: Dhawal Kulkarni: ముంబై జట్టులో టీమిండియా బౌలర్.. రోహిత్ సిఫార్సుతో చోటు..! -
సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ.. విజయం ఎవరిది..?
ఐపీఎల్-2022లో మరో ఉత్కంఠభరిత పోరుకు రంగం సిద్దమైంది. మంగళవారం(ఏప్రిల్ 12) డివై పాటెల్ స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. కాగా ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు సీఎస్కే బోణీ కొట్టలేదు. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యా్చ్ల్లోనూ ఓటమి చెంది పాయింట్ల పట్టికలో అఖరి స్థానంలో సీఎస్కే నిలిచింది. కాగా ఆర్సీబీపై విజయం సాధించి క్యాష్ రీచ్ లీగ్‌లో సీఎస్కే తొలి విజయం సాధించాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఇరు జట్లు బలాబలాలు ఓ సారి పరిశీలిద్దాం. కాగా గత మ్యాచ్‌లో స్పిన్నర్ మహేశ్ తీక్షణనను సీఎస్కే తుది జట్టులోకి తీసుకుంది. అయితే అతడు భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో అండర్-19 సంచలనం రాజవర్ధన్ హంగర్గేకర్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. బ్యాటింగ్ పరంగా సీఎస్కే పటిష్టంగా కన్పిస్తోంది. రాబిన్ ఊతప్ప, మోయిన్ అలీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఇక రుత్‌రాజ్ గైక్వాడ్ ఫామ్‌లోకి వస్తే ఆ జట్టుకు మరింత కలిసిస్తోంది. మరో వైపు బౌలింగ్ పరంగా చెన్నై బలహీనంగా ఉంది. ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ఇక ఆర్సీబీ విషయానికి వస్తే.. ఈ ఏడాది సీజన్లో వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు ఆర్సీబీ సాధించింది. బౌలింగ్ బ్యాటింగ్ పరంగా ఆర్సీబీ పటిష్టంగా కన్పిస్తోంది. కాగా ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ తుది జట్టలోకి జోష్ హాజల్‌వుడ్ వచ్చే అవకాశం ఉంది. తుది జట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(అంచనా) ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), జోష్ హేజిల్‌వుడ్, వనిందు హసరంగా, సిద్ధార్థ్ కౌల్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్ చెన్నై సూపర్ కింగ్స్ (అంచనా) రాబిన్ ఉతప్ప, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా (కెప్టెన్), శివమ్ దూబే, ఎంస్ ధోని (వికెట్ కీపర్), డ్వేన్ బ్రావో, క్రిస్ జోర్డాన్, మహేశ్ తీక్షణ, రాజవర్ధన్ హంగర్గేకర్ -
థర్డ్ అంపైర్ నిర్ణయంపై కోపంతో ఊగిపోయిన కోహ్లి.. ఏం చేశాడంటే..!
ఐపీఎల్-2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా మూడో విజయం నమోదు చేసింది. శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఔటైన తీరు వివాదాస్పదంగా మారింది. ఆర్సీబీ ఇన్నింగ్స్ 19 ఓవర్లో డెవాల్డ్ బ్రెవిస్ వేసిన తొలి బంతిని ఢిపెన్స్ ఆడటానికి విరాట్ కోహ్లి ప్రయ్నతించాడు. ఈ క్రమంలో బంతి మిస్స్ అయ్యి కోహ్లి ప్యాడ్‌ను తాకింది. దీంతో బౌలర్‌తో పాటు ఫీల్డర్లు ఎల్బీడబ్ల్యూకి అప్పీల్ చేయడంతో ఫీల్డ్ అంపైర్ దాన్ని ఔట్‌గా ప్రకటించాడు. అయితే వెంటనే కోహ్లి రివ్యూ తీసుకున్నాడు. కాగా రీప్లేలో బంతి బ్యాట్, ప్యాడ్ రెండింటినీ తాకుతున్నట్లు కనిపించింది. దీంతో కోహ్లితో పాటు అభిమానులు ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని వెనుక్కి తీసుకోక తప్పదని భావించారు. అయితే బంతి బ్యాట్‌కు ముందు తాకినట్లు సృష్టమైన ఆధారాలు కనిపించడం లేదంటూ థర్డ్ అంపైర్ కూడా దాన్ని ఔట్‌గా ప్రకటించాడు. దీంతో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయానికి కోహ్లితో పాటు అందరూ ఒక్క సారిగా షాక్‌కు గురయ్యారు. థర్డ్ అంపైర్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోహ్లి.. పెవిలియన్‌కు వెళ్తుండగా గట్టిగా అరుస్తూ బ్యాట్‌ను నేలకేసి కొట్టాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి అద్భుతంగా రాణించాడు. కోహ్లి 36 బంతుల్లో 48 పరుగులు సాధించి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక కోహ్లి ఎల్బీడబ్లూ్య వివాదంపై ఆర్సీబీ మెనేజేమెంట్ స్పందించింది. "మేరిల్బోన్ క్రికెట్ క్లబ్ నియమం 36.2.2 ప్రకారం.. బంతి బ్యాటను, ప్యాడ్‌ను తాకుతున్నట్లు అనిపిస్తే.. అది బ్యాట్‌ను తాకినట్లు గాను పరిగణించాలి" అని ట్విటర్లో పేర్కొంది. చదవండి: IPL 2022: బయో బబుల్‌ను వీడిన ఆర్సీబీ స్టార్ బౌలర్! కారణం? Aggressive Kohli >>>>> 🥵🔥 https://t.co/a5HgUp4yYi — Pree 🦋 (@Preethi_70) April 9, 2022 We were just reading through the MCC Laws of Cricket for LBW decisions, and here’s what we found. 🤔🤭 Unfortunate that Virat Kohli had to walk back disappointed after a brilliant knock.#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB pic.twitter.com/fSEj1CaKOW — Royal Challengers Bangalore (@RCBTweets) April 10, 2022 -
రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్.. ఆర్సీబీకి బ్యాడ్ న్యూస్!
ఆస్ట్రేలియా విధ్వంసకర ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో చేరిన సంగతి తెలిసిందే. అయితే మంగళవారం (ఏప్రిల్ 5) వాంఖడే వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌కు మాక్స్వెల్ దూరంగా ఉండనున్నాడు. క్రికెట్ ఆస్ట్రేలియా మార్గదర్శకాల ప్రకారం.. బోర్డు కాంట్రాక్ట్ పొందిన ఏ ఆసీస్ ఆటగాడు ఏప్రిల్ 6 లోపు ఐపీఎల్లో పాల్గొనకూడదు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌కు గ్లెన్ మాక్స్వెల్ దూరం కానున్నాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ మైక్ హెస్సన్ ధృవీకరించాడు. “క్రికెట్ ఆస్ట్రేలియా గైడ్‌లైన్స్ ప్రకారం.. ఏప్రిల్ 6వ తేదీ లోపు కాంట్రాక్టు పొందిన ఆసీస్ ఆటగాళ్లు ఎవరూ అందుబాటులో ఉండరు. కాబట్టి గ్లెన్ మాక్స్వెల్ జట్టుతో చేరినప్పటికి అతడు బెంచ్‌కే పరిమితం కానున్నాడు. అతడు ఏప్రిల్ 9న ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నాడు" అని మైక్ హెస్సన్ పేర్కొన్నాడు. తన వివాహం కారణంగా మాక్స్వెల్ ఐపీఎల్-2022 ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. చదవండి: IPL 2022 SRH Vs LSG: ఐపీఎల్ కప్ కావాలా? లేదంటే ఆరెంజ్ క్యాప్ కావాలా? Our Tom and Jerry forever! 😍🤩@Gmaxi_32 @yuzi_chahal #PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB pic.twitter.com/sHDkjMWj4g — Royal Challengers Bangalore (@RCBTweets) April 4, 2022 -
ఆర్సీబీకి భారీ షాక్.. యువ ఆటగాడు దూరం!
ఐపీఎల్-2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు యువ ఆటగాడు లవ్‌నీత్ సిసోడియా గాయం కారణంగా ఈ ఏడాది సీజన్‌కు దూరమయ్యాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌లో కూడా సిసోడియా అవకాశం రాలేదు. కర్ణాటకకు చెందిన ఈ యువ ఆటగాడు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుతంగా రాణించాడు. ఈ క్రమంలో ఐపీఎల్-2022 మెగా వేలంలో రూ. 20 లక్షలకు సిసోడియాను ఆర్సీబీ కొనుగోలు చేసింది. ఇక అతడి స్థానంలో మధ్యప్రదేశ్ యువ ఆటగాడు రజత్ పాటిదార్‌ను భర్తీ చేసింది. గతేడాది సీజన్లో ఆర్సీబీకు ప్రాతినిద్యం వహించిన పాటిదార్ పర్వాలేదనిపించాడు. అయితే ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు ఆర్పీబీ అతడిని రీటైన్ చేసుకోలేదు. ఈ క్రమంలో వేలంలోకి వెళ్లిన పాటిదార్‌ను ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. అయితే మళ్లీ అతడిని ఆర్సీబీ కొనుగోలు చేయడం విశేషం. దేశీయ స్థాయిలో 31 టీ20 మ్యాచ్‌లు ఆడిన పాటిదార్ 861 పరుగులు సాధించాడు. ఇక ఆర్సీబీ తన తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్5న రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుంది. చదవండి: IPL 2022 CSK Vs PBKS: ఆహా ఏమా షాట్.. ! 108 మీటర్ల భారీ సిక్సర్ బాదిన లివింగ్‌స్టోన్ -
'మేము సీఎస్కే అభిమానులం.. కానీ డుప్లెసిస్ అంటే పిచ్చి'
దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ చెన్నైసూపర్ కింగ్స్‌తో తన అనుబంధాన్ని ముగించినప్పటికీ సీఎస్కే ఫ్యాన్స్ ఇంకా అతడిని అభిమానిస్తూనే ఉన్నారు. కాగా బుధవారం(మార్చి30) ఆర్సీబీ, కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే అభిమానులు ప్రత్యేక బ్యానర్‌తో సందడి చేశారు. ఆ బ్యానర్లో "మేము చెన్నైసూపర్ కింగ్స్ అభిమానులం, కానీ డుప్లెసిస్ కోసం మేము ఇక్కడకు వచ్చాం" అని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఐపీఎల్-2022లో మెగా వేలంలో డుప్లెసిస్‌ను రూ. 7 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. అంతేకాకుండా ఆర్సీబీ యాజమాన్యం తమ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు డుప్లెసిస్‌కు అప్పగించింది. ఇక ఐపీఎల్-2022లో భాగంగా తొలి మ్యాచ్‌లో పంజాబ్ చేతిలో అనూహ్యంగా ఓటమి చెందిన ఆర్సీబీ రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 128 పరుగులకే ఆలౌట్ అయింది. కేకేఆర్ బ్యాటర్లలో ఆండ్రీ రసెల్ (25), ఉమేశ్ యాదవ్(18) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. ఆర్సీబీ బౌలర్లలో వనిందు హసరంగా 4, ఆకాశ్ దీప్ 3, హర్షల్ పటేల్ 2, సిరాజ్ ఒక వికెట్ సాదించారు. అనంతరం 129 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 7 వికెట్లు కోల్పోయి చేధించింది.. ఆర్సీబీ బ్యాటర్లలో రూథర్‌పోర్డ్ 28, షాబాజ్ అహ్మద్ 27 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. కేకేఆర్ బౌలర్లలో టిమ్ సౌథీ 3, ఉమేవ్ యాదవ్ 2, నరైన్, వరుణ్ చక్రవర్తి తలా ఒక వికెట్ తీశారు. చదవండి: IPL 2022: పంజాబ్ కింగ్స్‌కు గుడ్‌న్యూస్.. సిక్సర్ల వీరుడు వచ్చేశాడు! Fans poster during #RCBvsKKR : "We are CSK fans, but we are here for Faf Du Plessis @faf1307 💛🦁." #WhistlePodu | #IPL2022 pic.twitter.com/K6wg4oF1Be — CSK Fans Army™ 🦁 (@CSKFansArmy) March 30, 2022 -
'కోహ్లి ఓపెనర్‌గా వద్దు.. ఆస్ధానంలోనే బ్యాటింగ్‌కు రావాలి'
ఐపీఎల్-2021లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి అంతగా రాణించలేకపోయాడు. గత ఏడాది సీజన్లో ఓపెనర్‌గా వచ్చిన కోహ్లి విఫలమయ్యాడు. 14 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 405 పరుగులు మాత్రమే సాదించాడు. అయితే ఐపీఎల్ 2022లో కోహ్లి ఓపెనర్‌గా కాకుండా ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్‌కు రావాలని టీమిండియా మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా అభిప్రాయ పడ్డాడు. ఏబీ డివిలియర్స్ క్రికెట్ నుంచి తప్పుకోవడంతో కోహ్లి మరింత బాధ్యత వహించాల్సిఉంటుంది అని అతడు తెలిపాడు. "గతేడాది సీజన్లో కోహ్లి ఇన్నింగ్స్‌ను ప్రారంభించినప్పుడు.. మూడో స్దానం కోసం మ్యూజికల్ చైర్స్ గేమ్ ఆడారు. శ్రీకర్ భరత్ కొన్ని మ్యాచ్‌లకు మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు రాగా.. కొన్ని మ్యాచ్‌ల్లో గ్లెన్ మాక్స్వెల్ వచ్చే వాడు. వారు గత సీజన్లో బ్యాటింగ్ ఆర్డర్లో చాలా మార్పులు చేశారు. ఈ సీజన్లో కీలకమైన ఆటగాళ్లను ముందు బ్యాటింగ్‌కు పంపాలి. ఇక జట్టులో ఏబీ డివిలియర్స్ లేడు. అతడు జట్టులో ఉన్నప్పుడు పరిస్థితిని బట్టి నాలుగు లేదా ఐదో స్ధానంలో బ్యాటింగ్ చేసేవాడు. అయితే దినేష్ కార్తీక్ జట్టులోకి వచ్చాడు. కానీ అతడి స్ధానాన్ని కార్తీక్ భర్తీ చేయలేడు. ఫస్ట్ డౌన్లో ఒక స్ధిరమైన ఆటగాడు కావాలి. కాబట్టి కోహ్లి మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు వస్తే జట్టుకు చాలా ఉపయోగపడుతుంది" అని చోప్రా పేర్కొన్నాడు. చదవండి: World Cup 2022: మిథాలీ సేనకు షాక్.. సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన ఆసీస్ -
'సిరాజ్ చాలా దురదృష్టవంతుడు.. అతనికి అవకాశాలు ఇవ్వండి'
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డైరెక్టర్ మైక్ హెస్సన్ ప్రశంసలు వర్షం కురిపించాడు. సిరాజ్ ఎప్పడూ చాలా ఉత్సాహంగా ఉండే క్రికెటర్ అని హెస్సన్ తెలిపాడు. సాదారణంగా ఆటగాళ్లు అద్భతమైన ఫామ్‌లో ఉన్నప్పడు ఉత్సహంగా కనిపిస్తారు. సిరాజ్ మాత్రం అతడు ఫామ్‌లో ఉన్న లేక పోయినా ఎప్పడూ ఒకేలా ఉంటాడు. "సిరాజ్ ఆర్సీబీ జట్టులో తొలుత అంతగా రాణించలేదు. కానీ అతడు తన పట్టుదలతో జట్టులో ఒక్కసారిగా స్టార్ బౌలర్‌గా మారిపోయాడు. ఇక భారత తరుపున అద్భుతమైన బౌలర్లలో సిరాజ్ ఒకడు. అయినప్పటకీ దురదృష్టవంతుడని నేను భావిస్తున్నాను. ఎందుకంటే భారత తరుపున అంతగా అవకాశాలు అతడికి రావడం లేదు. ఎక్కువగా సిరాజ్ బెంచ్‌కే పరిమితం అవుతున్నాడు. భువనేశ్వర్ కుమార్ వంటి వారికి ఇంకా అవకాశాలు ఇస్తున్నారు. అయితే కొంతమంది భారత పేసర్లు తమ కెరీర్ ముగింపు దశకు చేరుకున్నారు. అనంతరం సిరాజ్ భారత పేస్ బౌలింగ్ విభాగాన్ని లీడ్ చేస్తాడని" హెస్సన్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు సిరాజ్‌ను రూ. 7 కోట్లకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. మార్చి 26 నుంచి ఐపీఎల్-2022 ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో కోలకతా నైట్రైడెర్స్ తలపడనుంది. చదవండి: IPL 2022 -Lucknow Super Giants : లక్నో సూపర్‌జెయింట్స్‌కు వరుస షాకులు.. మరో ప్లేయర్ దూరం! -
ధోని.. నా ఆలోచనలకు పూర్తి భిన్నంగా చేసేవాడు.. నేనేమీ కోహ్లిని కాదుగా: డు ప్లెసిస్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఫాప్ డుప్లెసిస్ ఎంపికైన సంగతి తెలిసిందే. ఐపీఎల్-2022 మెగా వేలంలో డుప్లెసిస్‌ను రూ.7కోట్లకు కొనుగోలు చేసింది. అయితే గతంలో అతడు దాదాపు 10 సీజన్ల పాటు చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో తన అనుబంధాన్ని డుప్లెసిస్ గుర్తు చేసుకున్నాడు. "నేను చాలా అదృష్టవంతుడిని. నా క్రికెట్ జర్నీలో ఇప్పటివరకు కొంత మంది అధ్బతమైన సారథిలతో కలిసి పని చేశాను. ముఖ్యంగా దక్షిణాఫ్రికా అత్యుత్తమ నాయకుడైన గ్రేమ్ స్మిత్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. అదే విధంగా ఐపీఎల్లో 10 ఏళ్ల పాటు మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని, స్టీఫెన్ ఫ్లెమింగ్ వంటి అద్భుతమైన కెప్టెన్లతో కలిసి ఆడాను. నా నాయకత్వ శైలి ధోనీని పోలి ఉంటుంది. మేమిద్దరం ఫీల్డ్‌లో చాలా రిలాక్స్‌గా ఉంటాం. నేను ఆరంభంలో చెన్నైకు ప్రాతినిథ్యం వహించినప్పుడు ధోని ఆలోచనలు నాకు ఆర్ధం కాలేదు. నేను అనుకున్న దానికంటే అతడు భిన్నంగా ఉండేవాడు. ఇక ఐపీఎల్ వంటి మెగా టోర్నీలో నాయకత్వం వహించడం వల్ల వచ్చే ఒత్తిడి ఎలా ఉంటుందో నాకు తెలుసు. ప్రతి ఒక్కరకి జట్టును నడిపించడంలో తన దైన శైలి ఉంటుంది. నేను నా స్టైల్లోనే జట్టును నడిపిస్తాను. మనపై ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు మన స్వంత నిర్ణయాలతో ముందుకు పోవడం మంచింది. నేను కోహ్లిలా ఉండటానికి ప్రయత్నించను. ఎందుకంటే నేను కోహ్లిని కాను. అదే విధంగా ధోనిను కూడా ఫాలో అవ్వను. కానీ ధోని నుంచి నేను నేర్చుకున్న చాలా విషయాలు నా నాయకత్వ శైలిని పెంచుకోవడంలో సహాయపడతాయి" అని డుప్లెసిస్ పేర్కొన్నాడు. ఇక మార్చి 27న ఆర్సీబీ తమ తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. చదవండి: Virat Kohli: ‘కోహ్లిని మళ్లీ టెస్టు కెప్టెన్‌గా నియమించండి’! -
ఆర్సీబీకి కొత్త కెప్టెన్ వచ్చేశాడు.. బెంగళూరు అధికారిక ప్రకటన
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కొత్త కెప్టెన్ వచ్చేశాడు. అంతా ఊహించినట్లుగానే దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఫఫ్ డుప్లెసిస్‌కు ఆర్సీబీ సారథ్య బాధ్యతలు అప్పజెప్పింది. ఈ మేరకు బెంగళూరులో నిర్వహించిన "ఆర్సీబీ ఆన్‌బాక్స్" ఈవెంట్‌లోఈ విషయాన్ని బెంగళూరు ఫ్రాంచైజీ వెల్లడించింది. ఇక ఐపీఎల్-2021 తర్వాత ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మళ్లీ కోహ్లి సారథ్య బాధ్యతలు చేపట్టున్నాడని వార్తలు వినిపించాయి. ఆర్సీబీ తాజా ప్రకటనతో ఆ వార్తలకు బ్రేక్ పడింది. కాగా ఐపీఎల్-2022 మెగా వేలంలో భాగంగా ఫఫ్ డు ప్లెసిస్‌ను ఆర్సీబీ రూ. 7కోట్లకు కొనుగోలు చేసింది. ఇక గతంలో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడిన డు ప్లెసిస్ అద్భుతంగా రాణించాడు. ఐపీఎల్-2021 సీజన్లో 633 పరుగులు చేసి టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా డు ప్లెసిస్ నిలిచాడు. గత ఏడాది చెన్నై టైటిల్ గెలవడంలో డు ప్లెసిస్ కీలక పాత్ర పోషించాడు. ఇక ప్రొటీస్ జట్టు తరఫున 37 టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించి.. 23 మ్యాచ్‌లలో విజయాలు అందుకున్నాడు. చదవండి: Ind Vs Sl 2nd Test: అప్పుడు సెహ్వాగ్ .. ఇప్పుడు మయాంక్ అగర్వాల్.. తొమ్మిదేళ్ల తర్వాత! The Leader of the Pride is here! Captain of RCB, @faf1307! 🔥#PlayBold #RCBCaptain #RCBUnbox #ForOur12thMan #UnboxTheBold pic.twitter.com/UfmrHBrZcb — Royal Challengers Bangalore (@RCBTweets) March 12, 2022 -
'కోహ్లి మళ్లీ కెప్టెన్ కాలేడు.. ఆర్సీబీ కెప్టెన్‌గా అతడే సరైనోడు'
ఐపీఎల్-2022 సీజన్లో దాదాపు అన్ని ఫ్రాంచైజీలు కెప్టెన్లు నియమించుకోగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం ఇంకా సారథిని నియమించకోలేదు. కాగా ఐపీఎల్-2021 సీజన్ తర్వాత ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లి తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది సీజన్లో మళ్లీ తిరిగి కోహ్లి ఆర్సీబీ సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై ఆర్సీబీ మాజీ కెప్టెన్, న్యూజిలాండ్ స్పిన్ లెజెండ్ డేనియల్ వెట్టోరి స్పందించాడు. విరాట్ కోహ్లి మళ్లీ బెంగళూరు జట్టుకు నాయకత్వం వహించే అవకాశమే లేదని అతడు తెలిపాడు. "విరాట్ కోహ్లి మళ్లీ ఆర్సీబీ కెప్టెన్ అయ్యే అవకాశం లేదు. ఈ విషయం గురించి మనం అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక్క సారి తప్పుకున్నాక మళ్లీ సారథ్య బాధ్యతలు చేపట్టడం ఆసాధ్యం. ఫ్రాంచైజీ క్రికెట్లో లేదా అంతర్జాతీయ క్రికెట్లో ఇలా జరిగే అవకాశం లేదు. ఆర్సీబీ మెనేజేమెంట్ కోహ్లి వరసుడిగా మాక్స్వెల్, డు ప్లెసిస్, దినేష్ కార్తీక్ పేర్లును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మాక్స్‌వెల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేస్తారని అనుకుంటున్నాను. ఒక వేళ మాక్స్వెల్ ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు దూరమైతే వారు ఖచ్చితంగా డు ప్లెసిస్ వైపే మొగ్గు చూపుతారని నేను భావిస్తున్నాను" అని వెట్టోరి పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్ 2022 షెఢ్యూల్‌ను బీసీసీఐ ఆదివారం విడుదల చేసింది. వాంఖడే వేదికగా తొలి మ్యాచ్‌లో చెన్నైతో కేకేఆర్ తలపడనుంది. చదవండి: IPL 2022: షెడ్యూల్ వచ్చేసింది.. తొలి మ్యాచ్‌లో సీఎస్కేను ఢీకొట్టనున్న కేకేఆర్ -
ఆర్సీబీ కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు.. వేలంలో 7కోట్లు!
రాయల్ ఛాలంజెర్స్ బెంగళూరుకు త్వరలో కొత్త కెప్టెన్ రాబోతున్నాడు. ఆర్సీబీ కొత్త కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఫాప్ డుప్లిసెస్ ఎంపిక దాదాపు ఖాయం అయినట్లు తెలుస్తోంది. డుప్లిసెస్‌ను కెప్టెన్‌గా ఆర్సీబీ యాజమాన్యం ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. కాగా ఐపీఎల్-2022 మెగా వేలంలో డుప్లిసెస్‌ను ఆర్సీబీ రూ. 7 కోట్లకు దక్కించుకుంది. వేలంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో పోటీ పడి మరి అతడిని ఆర్సీబీ దక్కించుకుంది. ఇక ఐపీఎల్-2021 సీజన్ తర్వాత ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లి తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే తర్వాత కెప్టెన్‌గా ఏబీ డివిలియర్స్ అవుతాడని అంతా భావించారు. ఈ క్రమంలోనే డివిలియర్స్ అన్ని రకాల ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుని అందరని షాక్‌కు గురి చేశాడు. ఇక మాక్స్వెల్ కూడా కెప్టెన్‌గా ఒక ఆఫ్షన్‌గా ఉన్నప్పటికీ ఆర్సీబీ మేనేజ్మెంట్ డుప్లిసెస్ వైపే మెగ్లు చూపినట్లు తెలుస్తోంది. "మా జట్టు కెప్టెన్‌గా డుప్లిసెస్ సరైనోడు అని భావిస్తున్నాం. అయితే మేము నిర్ణయించుకోవడానికి మాకు సమయం ఉంది. మాక్స్వెల్ అందుబాటుపై స్పష్టత కోసం ఎదురు చూస్తున్నాము. అతడు తన వివాహం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో డుప్లిసెస్ సరైన ఎంపికగా కనిపిస్తోంది" అని ఆర్సీబీ ఆధికారి ఒకరు పేర్కొన్నారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టు: విరాట్ కోహ్లి: రూ. 15 కోట్లు మ్యాక్స్‌వెల్: రూ. 11 కోట్లు హర్షల్ పటేల్: రూ. 10 కోట్ల 75 లక్షలు హసరంగ: రూ. 10 కోట్ల 75 లక్షలు హాజెల్‌వుడ్: రూ. 7 కోట్ల 75 లక్షలు సిరాజ్ :రూ. 7 కోట్లు డు ప్లెసిస్: రూ. 7 కోట్లు దినేశ్ కార్తీక్: రూ. 5 కోట్ల 50 లక్షలు అనూజ్ రావత్: రూ. 3 కోట్ల 40 లక్షలు షాబాజ్ అహ్మద్: రూ. 2 కోట్ల 40 లక్షలు రూథర్‌ఫొర్డ్: రూ. 1 కోటి మహిపాల్ లామ్రోర్: రూ. 95 లక్షలు ఫిన్ అలెన్: రూ. 80 లక్షలు బెహ్రెండార్ఫ్: రూ.75 లక్షలు కరణ్ శర్మ: రూ. 50 లక్షలు సుయశ్ ప్రభుదేశాయ్: రూ.30 లక్షలు సీవీ మిలింద్: రూ. 25 లక్షలు ఆకాశ్‌దీప్: రూ. 20 లక్షలు అనీశ్వర్ గౌతమ్ : రూ. 20 లక్షలు చదవండి: Ranji Trophy- Yash Dhull: అరంగేట్రంలోనే అద్భుత సెంచరీ.. మరో కోహ్లివి.. మరీ 50 లక్షలు తక్కువే కదా! -
ఐపీఎల్-2022 వేలంలో హైదరాబాద్ సీపీ కూమారుడు.. ఏ జట్టు దక్కించుకుందంటే
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 2022 ఐపీఎల్ సీజన్ కోసం మిలింద్‌ను రూ. 25 లక్షలకు కొనుగోలు చేసింది. గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (2015), ఢిల్లీ డేర్‌డెవిల్స్ (2016) జట్లకు హైదరాబాద్ క్రికెటర్ సీవీ మిలింద్ ఎంపికయ్యాడు. ఎడంచేతివాటం పేస్ బౌలర్ మిలింద్ 2013 నుంచి హైదరాబాద్ జట్టు తరఫున రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ, ముస్తాక్ అలీ ట్రోఫీ టోర్నీలలో ఆడుతూ నిలకడగా రాణిస్తున్నాడు. మిళింద్ లిస్ట్-ఏలో 45 మ్యాచ్‌లు ఆడి 82 వికెట్లను పడగొట్టాడు. 20 ఏళ్ల చామ మిళింద్ గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఐపీఎల్లో ఆడాడు. ఇక హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కుమారుడే ఈ చామ మిళింద్ ఆనంద్. -
అప్పుడు రూ.20 లక్షలు.. ఇప్పుడు ఏకంగా రూ.10.75 కోట్లు.. వారెవ్వా హర్షల్!
ఐపీఎల్-2022 మెగా వేలంలో టీమిండియా ఆల్‌రౌండర్ హర్షల్ పటేల్ భారీ ధరకు అమ్ముడు పోయాడు. ఈ వేలంలో అతడిని రూ.10.75 కోట్లకు రాయల్ ఛాలంజెర్స్ బెంగళూరు కైవసం చేసుకుంది. హర్షల్ పటేల్ బేస్ ప్రైస్ 2 కోట్లుగా ఉంది. వేలంలో హర్షల్ పటేల్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆర్సీబీ చివర వరకు పోటీ పడ్డాయి. కాగా వేలానికి ముందు ఆర్సీబీ హర్షల్ పటేల్‌ను రీటైన్ చేసుకోలేదు. అయితే మళ్లీ వేలంలో ఆర్సీబీ అతడిని సొంతం చేసుకుంది. ఐపీఎల్-2021 సీజన్లో పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా హర్షల్ పటేల్ నిలిచాడు. గత సీజన్లో ఆర్సీబీ కేవలం 20 లక్షలకు మాత్రమే కోనుగోలు చేసింది. అయితే అదే ఫ్రాంచైజీ అతడిని 10.75 కోట్లకు కోనుగోలు చేయడం గమనార్హం. ఇక ఈ మెగా వేలంలో భారత స్టార్ ఆటగాడు, ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ భారీ ధర పలికాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు అతడిని రూ. 12.25 కోట్లకు దక్కించుకుంది. ఇప్పటి వరకు జరిగిన వేలంలో అయ్యర్‌కే అత్యధిక ధర. ఇక సురేష్ రైనా, స్టీవ్ స్మిత్ వంటి స్టార్ ఆటగాళ్లు తొలి ఫేజ్‌లో అమ్ముడు పోలేదు. చదవండి: IPL 2022 Auction: వేలంలో షాకింగ్ ఘటన.. కుప్పకూలిన ఆక్షనీర్ -
ఆర్సీబీ కెప్టెన్‌గా ఇయాన్ మోర్గాన్!
ఐపీఎల్-2022 మెగా వేలంలో ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కోసం మూడు జట్లు పోటీ పడనున్నట్లు తెలుస్తోంది. వేలానికి ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ మోర్గాన్‌ను రీటైన్ చేసుకోలేదు. వేలంలో 1.5 కోట్ల బేస్ ఫ్రైజ్‌కు తన పేరును మోర్గాన్ నమోదు చేసుకున్నాడు. కాగా గత కొద్ది రోజులు నుంచి ఫామ్‌లో లేకపోయినా, అతడి కెప్టెన్‌గా అనుభవం ఉండడంతో అతడిని ఫ్రాంచైజీలు దక్కించుకోనేందుకు మక్కువ చూపుతున్నాయి. ముఖ్యంగా ఆర్సీబీ వేలంలో మోర్గాన్‌ను దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2021 సీజన్ అనంతరం విరాట్ కోహ్లి ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మోర్గాన్‌ను కొనుగోలు చేసి కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పాలని ఆర్సీబీ యాజమాన్యం భావిస్తోంది. మరోవైపు పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా మోర్గాన్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోన్నట్లు సమాచారం. ఇక ఐపీఎల్ మెగా వేలానికి మరి కొద్ది గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బీసీసీఐ వేలాన్ని నిర్వహించనుంది. ఈ మెగా వేలంలో 590 మంది ఆటగాళ్లు పాల్గోనబోతున్నారు. చదవండి: IND vs WI 3rd ODI: మొన్న ప్రపంచ రికార్డు.. ఈరోజేమో మరీ ఇలా.. నిరాశపరిచావు కదా! -
'ఐపీఎల్లో ఆ జట్టుకు ఆడాలని ఉంది.. అతడే నా ఫేవరెట్ కెప్టెన్'
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్-2022 మెగా వేలంకు సమయం ఆసన్నమైంది. బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఈ మెగా వేలాన్ని నిర్వహించనున్నారు. ఇక గతేడాది పర్పుల్ క్యాప్ హోల్డర్ హర్షల్ పటేల్‌ను ఆర్సీబీ రీటైన్ చేసుకోలేదు. ఆర్సీబీ విరాట్ కోహ్లితో పాటు గ్లెన్ మ్యాక్స్‌వెల్, సిరాజ్‌ను రీటైన్ చేసుకుంది. దీంతో రానున్న మెగా వేలంలో హర్షల్ పటేల్ కోసం జట్లు పోటీ పడతాయి ఆనడంలో సందేహం లేదు. అయితే తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్షల్ పటేల్ తన మనసులోని మాటను బయట పెట్టాడు. ఈ ఏడాది సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడేందుకు ఆసక్తిగా ఉన్నానని హర్షల్ తెలిపాడు. చెన్నై కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని తన ఆల్ టైమ్ బెస్ట్ కెప్టెన్ అని హర్షల్ పటేల్ పేర్కొన్నాడు. ఐపీఎల్- 2021లో 32 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా హర్షల్ పటేల్ నిలిచాడు. ముంబై ఇండియన్స్‌పై హ్యాట్రిక్ వికెట్లతో అదరగొట్టాడు. కాగా రానున్న మెగా వేలంలో తన బేస్ ప్రైస్ రూ.2 కోట్లగా నమోదు చేసుకున్నాడు. ఇక ఐపీఎల్ 2021లో కేవలం రూ. 20 లక్షలకు కొనుగోలు చేయడం గమనార్హం. చదవండి: Shakib Al Hasan: 'శ్రీవల్లీ' పాటకు బంగ్లా ఆల్‌రౌండర్ స్టెప్పులు.. ఊహించని ట్విస్ట్ -
ఆర్సీబీ కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్!
ఐపీఎల్-2022 సీజన్ మెగా వేలం త్వరలో జరగనుంది. కాగా ఇప్పటికే రీటైన్ చేసుకునే జాబితాను ఆయా జట్లు ప్రకటించాయి. చాలా మంది స్టార్ ఆటగాళ్లను ప్రాంఛైజీలు రీటైన్ చేసుకోలేదు. సన్‌రైజర్స్ విషయానికి వస్తే.. కెప్టెన్ డేవిడ్ వార్నర్‌తో పాటు రషీద్ ఖాన్ని విడిచి పెట్టింది. దీంతో వీరిద్దరికీ రానున్న మెగా వేలం భారీ ధర పలకడం ఖాయం. అయితే వార్నర్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కోడుతుంది. రానున్న సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు డేవిడ్ భాయ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడన్నదే ఆ వార్త సారాంశం. అంతేకాకుండా ఆర్సీబీలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నాడని సమాచారం.కాగా ఐపీఎల్-2021 సీజన్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లి వైదొలిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కెప్టెన్‌గా ఎవరు ఉండనున్నరన్నది అందరి మెదడులను తొలుస్తున్న ప్రశ్న. కాగా ఐపీఎల్-2022 సీజన్‌కు గాను ఆర్సీబీ.. విరాట్ కోహ్లి, గ్లేన్ మ్యాక్స్‌వెల్, సిరాజ్‌ను రీటైన్ చేసుకుంది. చదవండి: Chakda Xpress: జూలన్ గోస్వామిగా అనుష్క శర్మ.. చక్దా ఎక్స్‌ప్రెస్ టీజర్ రిలీజ్ -
అతని కోసం ఆర్సీబీ పోటీ పడుతుంది.. కెప్టెన్‌గా అతనే సరైనోడు..
RCB will break the bank for Rahul Chahar in mega auction: ఐపీఎల్-2022 మెగా వేలంకు ముందు 8 ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ల రీటైన్ జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఆర్సీబీ విషయానికి వస్తే.. విరాట్ కోహ్లి, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్‌ను రీటైన్ చేసుకుంది. కాగా రానున్న మెగా వేలంలో ఆర్సీబీ.. లెగ్ స్పిన్నర్ రాహుల్ చహర్‌ను దక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తుందని భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. తమ స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను అంటిపెట్టుకోనందున అతడి స్దానంలో చహర్‌ను భర్తీ చేయాలని భావిస్తున్నట్టు చోప్రా తెలిపాడు. “ స్టార్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను ఆర్సీబీ కోనుగోలు చేయదు. మరో లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్‌ను సొంతం చేసుకోవడానికి ఆర్సీబీ సిద్దంగా ఉంది. ఎందుకంటే వాళ్ల హోం గ్రౌండ్లో లెగ్ స్పిన్నర్లకు తప్ప మిగితా స్పిన్నర్లుకు అంతగా రికార్డులు లేవు. అయితే రవి బిష్ణోయ్ కూడా ఓ అవకాశంగా వాళ్లకి ఉండవచ్చు, కానీ నేను మాత్రం రాహుల్ చాహర్‌ని తీసుకుంటారని అని భావిస్తున్నాను" అని చోప్రా పేర్కొన్నాడు. ఇక కాబోయే ఆర్సీబీ కెప్టెన్ గురించి మాట్లాడూతూ... "విండీస్ ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్‌కు ఆర్సీబీ కెప్టెన్ అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయి. ఆర్సీబీ రానున్న మెగా వేలంలో హోల్డర్ కొనుగోలు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఎందుకంటే అతడికి వెస్టిండీస్ జట్టుతో పాటు కరీబీయన్ లీగ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం ఉంది. అంతే కాకుండా అతడు తను ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని జట్లులో బాగా రాణిస్తున్నాడు" అని తన యూట్యూబ్ ఛానెల్లో చోప్రా తెలిపాడు. చదవండి: IPL 2021 Auction: ‘వేలంలో అతడి కోసం చాలా జట్లు పోటీ పడతాయి’ -
ఆర్సీబీ హెడ్ కోచ్‌గా భారత మాజీ ఆటగాడు..
RCB appoint Sanjay Bangar as head coach: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హెడ్‌కోచ్‌గా భారత మాజీ ఆటగాడు సంజయ్ బంగర్ ఎంపికయ్యాడు. తదుపరి రెండు ఐపీఎల్ సీజన్లకు ప్రధాన కోచ్‌గా అతడిని ఆర్సీబీ నియమించింది. అయితే గత కొద్ది సీజన్ల నుంచి ఆ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా బంగర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాగా ఐపీఎల్-2021 తొలి దశలో ఆర్సీబీకు ప్రధాన కోచ్‌గా ఉన్న సైమన్ కటిచ్.. సెకెండ్ ఫేజ్‌కు వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడు. అతడి స్ధానంలో మైక్ హెస్సన్ తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టాడు. ఇక మైక్ హెస్సన్ ఆజట్టు క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా కొనసాగనున్నాడు. అయితే ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లి తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో తదుపరి ఆర్సీబీ సారథి ఎవరన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. చదవండి: Virat Kohli: ఓటమితో ఆరంభించి.. 'ఓటమి'తో ముగించినా.. లవ్ యూ భాయ్! -
'నీకు సోదరిగా పుట్టినందుకు గర్విస్తున్నా'
Bhawna Kohli Dhingra Commnets On Virat kholi: ఐపీఎల్ 2021లో భాగంగా సోమవారం కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి చెంది టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ క్రమంలో విరాట్ కోహ్లి సోదరి భవ్నా కోహ్లి ధింగ్రా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో భావోద్వేగ సందేశాన్ని పోస్ట్ చేసింది. "నీవు కెప్టెన్‌గా ఆర్సీబీకి శక్తి మేరకు పనిచేశావు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా ఎల్లప్పుడూ జట్టు భారాన్ని నీ భుజాలపైన వేసుకుని నడిపించావు. ఆర్సీబీ గొప్ప కెప్టెన్లో ఒకడిగా నిలిచిపోతావు. ఎప్పటికీ గౌరవ, ప్రశంసలకు నీవు అర్హుడివే. నేను నీకు సోదరిగా పుట్టినందుకు గర్విస్తున్నా" అంటూ భవ్నా కోహ్లి రాసుకొచ్చింది. కాగా కెప్టెన్‌గా కోహ్లికు ఇదే చివరి సీజన్ కాగా.. ఈసారి ఎలాగైనా కప్ సాధించి కెప్టెన్‌గా ఘనమైన వీడ్కోలు తీసుకోవాలని అతడు భావించాడు. కానీ ఆ కోరిక తీరకుండానే కోహ్లి కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. చదవండి: Virat Kohli: ఆశించిన ఫలితం దక్కలేదు.. కోహ్లి భావోద్వేగం -
హర్షల్ పటేల్‌ను అభినందనల్లో ముంచెత్తిన బ్రావో.. సూపర్ అంటూ..
Harshal Patel: ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ అరుదైన రికార్డు సాధించాడు. ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా హర్షల్ పటేల్ చరిత్ర సృష్టించాడు. దీంతో హర్షల్ పటేల్ 2013 సీజన్లో అత్యధిక వికెట్లు (32) తీసిన డ్వేన్ బ్రావో రికార్డును సమం చేశాడు. ఈ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో తనతో సమంగా నిలిచిన హర్షల్ పటేల్‌ను అభినందించాడు. "అభినందనలు హర్షల్. నీవు ఖచ్చితంగా ఈ రికార్డును సాధిస్తావు !! నీ పోరాట పటిమ చూడటానికి చాలా బాగుంది!' అని బ్రావో ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాశాడు. కాగా మొత్తం 15 మ్యాచ్‌లాడిన హర్షల్ పటేల్ 32 వికెట్లు పడగొట్టాడు. అయితే ఎలిమినేటర్ మ్యాచ్ లో భాగంగా సోమవారం కోల్‌కతా నైట్ రైడర్స్ జరిగిన మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టిన హర్షల్ ఈ ఘనత సాధించాడు. కాగా 17ఓవర్ వేసిన హర్షల్ పటేల్ బౌలింగ్‌లో సునీల్ నరైన్ క్యాచ్ పడక్కల్ వదిలివేయడంతో ఒక సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డను తృటిలో చేజార్చుకున్నాడు. ఇప్పటికే ఓ ఐపీఎల్ సీజన్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా హర్షల్ పటేల్ నిలిచాడు. కాగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సోమవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దీంతో కేకేఆర్.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో క్వాలిఫైయర్-2 ఆడేందుకు అర్హత సాధించగా... కోహ్లి సేన ఇంటిముఖం పట్టింది. చదవండి: Glenn Maxwell: కొంచెం డీసెంట్‌గా ఉండండి.. చెత్తగా వాగొద్దు -
RCB VS DC: ఉత్కంఠ పోరులో ఆర్సీబీ విజయం..
ఉత్కంఠ పోరులో ఆర్సీబీ విజయం చివర వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఆర్సీబీ విజయం సాధించింది. చివరి బంతికి ఐదు పరుగులు కావల్సిన నేపథ్యంలో శ్రీకర్ భరత్ సిక్స్ కొట్టి ఆర్సీబీనీ గెలిపించాడు. 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు ఆదిలోనే కోహ్లి, పడిక్కల్ వికెట్‌ను కోల్పోయింది. ఈ క్రమంలో శ్రీకర్ భరత్, డివిలియర్స్ ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. డివిలియర్స్ ఔటయ్యాక వచ్చిన మాక్స్వెల్(51) తో కలిసి శ్రీకర్ భరత్ ఆర్సీబీను విజయతీరాలకు చేర్చాడు. కాగా ఐపీఎల్లో భరత్ తొలి అర్ధసెంచరీనీ నమోదు చేశాడు. అతడు 52 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 78 పరుగులు చేశాడు. అంతకముందు ఢిల్లీ క్యాపిటల్స్ నీర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఢిల్లీకు ఓపెనర్లు 88 పరుగుల శుభారంభం ఇచ్చారు. శిఖర్ ధావన్ 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43 పరుగులు చేయగా, పృథ్వీ షా 31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48 పరుగులు సాధించాడు. కాగా ఆర్సీబీ బౌలర్లలో మహ్మద్ సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టగా, చహల్, డేనియల్ క్రిస్టియన్, హర్షల్ పటేల్ చెరో వికెట్ పడగొట్టారు మూడో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ.. డివిలియర్స్(26) ఔట్ 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ ఛేజింగ్‌లో తడబడుతుంది. 55 పరుగులకే మూడు కీలకమైన వికెట్లు కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో డివిలియర్స్ (26) శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 12 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ 3 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో శ్రీకర్ భరత్(39) , గ్లెన్ మాక్స్వెల్ (5) పరుగులతో ఉన్నారు. రెండు వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ.. 23/2 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 11 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు విరాట్ కోహ్లి 4 పరుగులు చేసి ఔటవ్వగా.. పడిక్కల్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆర్సీబీ స్కోరు 4 ఓవర్లలో 23/2గా ఉంది ఆర్సీబీ టార్గెట్ 165.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నీర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఢిల్లీకు ఓపెనర్లు 88 పరుగుల శుభారంభం ఇచ్చారు. శిఖర్ ధావన్ 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43 పరుగులు చేయగా, పృథ్వీ షా 31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48 పరుగులు సాధించాడు. కాగా ఆర్సీబీ బౌలర్లలో మహ్మద్ సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టగా, చహల్, డేనియల్ క్రిస్టియన్, హర్షల్ పటేల్ చెరో వికెట్ పడగొట్టారు. నాలగో వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. శ్రేయస్ అయ్యర్(18) ఔట్ 143 పరుగుల వద్ద ఢిల్లీ నాలగో వికెట్ కోల్పోయింది. మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్(18) క్రిస్టియన్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 18 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ 4 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో షిమ్రాన్ హెట్‌మైర్(21), రిపల్ పటేల్ (1) పరుగులతో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. పంత్(10) ఔట్ 108 పరుగుల వద్ద ఢిల్లీ మూడో వికెట్ కోల్పోయింది. డేనియల్ క్రిస్టియన్ బౌలింగ్‌లో పంత్(10) వికెట్ కీపర్ శ్రీకర్ భరత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 14 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ 3 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో శ్రేయస్ అయ్యర్(4), షిమ్రాన్ హెట్‌మైర్(2) పరుగులతో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. దూకుడగా ఆడుతున్న పృథ్వీ షా వికటె్ను ఢిల్లీ కోల్పోయింది. 48 పరుగలు చేసిన పృథ్వీ షా యజ్వేంద్ర చహల్ బౌలింగ్‌లో జార్జ్ గార్టన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. ధావన్(43) ఔట్ శిఖర్ ధావన్ రూపంలో ఢిల్లీ తొలి వికెట్ కోల్పోయింది. కాగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకు ఓపెనర్లు 88 పరుగుల శుభారంభం ఇచ్చారు. 43 పరుగులు చేసిన ధావన్ హర్షల్ పటేల్ బౌలింగ్‌లో డేనియల్ క్రిస్టియన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 11 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ వికెట్ నష్టానికి 95 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో పృథ్వీ షా(42), రిషబ్ పంత్(5) పరుగులతో ఉన్నారు. Photo Courtesy: IPL నిలకడగా ఆడతున్న ఢిల్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ నిలకడగా ఆడుతుంది. 5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 45 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో పృథ్వీ షా(20), శిఖర్ ధావన్(22) పరుగులతో ఉన్నారు. Photo Courtesy: IPL దుబాయ్: ఐపీఎల్2021 సెకెండ్ ఫేజ్‌లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ ఢీకొనబోతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా 14ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఒకే సమయంలో ఒకే రోజు రెండు మ్యాచ్‌లు తొలిసారి ప్రారంభం కానున్నాయి.ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో రెండు జట్లు 26 మ్యాచ్‌ల్లో ముఖాముఖి తలపడగా.. ఆర్సీబీ 15 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. ఢిల్లీ 10 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. కాగా ప్రస్తుత సీజన్ తొలి దశలో భాగంగా ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో 1పరుగు తేడాతో ఆర్సీబీ విజయం సాదించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్వెల్, ఎబి డివిలియర్స్, డేనియల్ క్రిస్టియన్, జార్జ్ గార్టన్, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యజ్వేంద్ర చహల్ ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (కెప్టెన్), రిపల్ పటేల్, అక్షర్ పటేల్, షిమ్రాన్ హెట్‌మైర్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడా, అవేశ్ ఖాన్, అన్రిచ్ నోర్జ్ -
RCB VS SRH: ఉత్కంఠ పోరులో ఆర్సీబీపై ఎస్ఆర్హెచ్ విజయం..
ఉత్కంఠ పోరులో ఆర్సీబీపై ఎస్ఆర్హెచ్ విజయం.. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై సన్‌రైజర్స్ హైదరాబాద్ 4పరుగుల తేడాతో విజయం సాధించింది. 142 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ నీర్ణీత 20 ఓవర్లలో 137 పరుగలకే పరిమితమైంది. చివర వరకు డివిలియర్స్ క్రీజులో ఉన్న బెంగళూరును గెలిపించ లేకపోయాడు. ఆర్సీబీ బ్యాట్సమన్లో మాక్స్వెల్(40), పడిక్కల్ (41) ఆద్బుతంగా రాణించారు. అఖరి ఓవర్లో 13 పరుగుల కావల్సిన నేపథ్యంలో భువనేశ్వర్ కుమార్ 9 పరుగులే ఇచ్చి హైదరాబాద్‌కు విజయాన్ని అందించాడు. అంతక ముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఎస్ఆర్హెచ్ నీర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానకి 141 పరుగులు చేసింది. ఆరంభం ఆదిరినా మిడిలార్డర్ చేతలు ఎత్తేయడంతో 141 పరుగులకే సన్‌రైజర్స్ పరిమితమైంది. ఆరంభంలోనే అభిషేక్ శర్మ వికెట్ కోల్పోయినప్పటికి కెప్టెన్ విలియమ్సన్(31) జాసన్ రాయ్(44) ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. విలియమ్సన్ ఔటయ్యక హైదరాబాద్ వికెట్ల పతనం మొదలైంది. ఆర్సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు వికెట్లు పడగొట్టగా, డేనియల్ క్రిస్టియన్ రెండు వికెట్లు, యజ్వేంద్ర చహల్, జార్జ్ గార్టన్ చెరో వికెట్ సాధించారు ఐదో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ.. పడిక్కల్ (41) ఔట్ కీలక సమయంలో ఆర్సీబీ పడిక్కల్ వికెట్ కోల్పోయింది. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో పడిక్కల్ (41) సమద్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం ఆర్సీబీ 18ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. షాబాజ్ అహ్మద్(10), డివిలియర్స్(12) ఉన్నారు. నాలగో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ.. మాక్స్వెల్(40) ఔట్ స్కోర్ 92 పరుగుల వద్ద మంచి ఊపు మీద ఉన్న మాక్స్వెల్ , రషీద్ ఖాన్ బౌలింగ్‌లో విలియమ్సన్ సూపర్ త్రో కు రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. 25 బంతుల్లో 4ఫోర్లు, 2సిక్స్‌లతో 40 పరుగులు చేశాడు. కాగా ప్రస్తుతం ఆర్సీబీ 16 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. క్రీజులో దేవదత్ పడిక్కల్(38), ఎబి డివిలియర్స్(5) ఉన్నారు. కాగా విజయానికి 23 బంతుల్లో 37 పరుగలు కావాలి మూడో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ.. శ్రీకర్ భరత్(12)ఔట్ 142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ తడబడతుంది. కేవలం 37 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో శ్రీకర్ భరత్(12) వృద్ధిమాన్ సాహాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకు ముందు సిద్దార్థ్ కౌల్ బౌలింగ్‌లో క్రిస్టియన్(1) పరుగుకే విలియమ్సన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. కాగా ప్రస్తుతం 8 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో దేవదత్ పడిక్కల్(23), గ్లెన్ మాక్స్వెల్(7) ఉన్నారు. ఆర్సీబీకు బిగ్ షాక్.. కోహ్లి(5) ఔట్ 142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ ఆదిలోనే కెప్టెన్ కోహ్లి వికెట్ కోల్పోయింది. కేవలం 5 పరుగులు చేసి కోహ్లి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం 2 ఓవర్లలో ఆర్సీబీ వికెట్ నష్టానికి 13 పరుగులు చేసింది. క్రీజులో దేవదత్ పడిక్కల్ (7), డేనియల్ క్రిస్టియన్(0) ఉన్నారు ఆర్సీబీ టార్గెట్ 142 పరుగులు.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ నీర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానకి 141 పరుగులు చేసింది. ఆరంభం ఆదిరినా మిడిలార్డర్ చేతలు ఎత్తేయడంతో 141 పరుగులకే సన్‌రైజర్స్ పరిమితమైంది. ఆరంభంలోనే అభిషేక్ శర్మ వికెట్ కోల్పోయినప్పటికి కెప్టెన్ విలియమ్సన్(31) జాసన్ రాయ్(44) ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. విలియమ్సన్ ఔటయ్యక హైదరాబాద్ వికెట్ల పతనం మొదలైంది. ఆర్సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు వికెట్లు పడగొట్టగా, డేనియల్ క్రిస్టియన్ రెండు వికెట్లు, యజ్వేంద్ర చహల్, జార్జ్ గార్టన్ చెరో వికెట్ సాధించారు. 2 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు.. అబ్దుల్ సమద్(1) ఔట్, ఎస్ఆర్హెచ్ 107/5 ఎస్ఆర్హెచ్ జట్టు 2 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. డేనియల్ క్రిస్టియన్ వేసిన 15వ ఓవర్లో ప్రియం గార్గ్, జేసన్ రాయ్ వికెట్లు కోల్పోయిన ఎస్ఆర్హెచ్.. చహల్ వేసిన మరుసటి ఓవర్ తొలి బంతికే(15.1 ఓవర్) అబ్దుల్ సమద్(1) వికెట్ కూడా సమర్పించుకుంది. 15.1 ఓవర్ల తర్వాత ఎస్ఆర్హెచ్ స్కోర్ 107/5. క్రీజ్‌లో సాహా, హోల్డర్ ఉన్నారు. ఒకే ఓవర్లో 2 వికెట్లు.. జేసన్ రాయ్(44) ఔట్, ఎస్ఆర్హెచ్ 107/4 డేనియల్ క్రిస్టియన్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి ఎస్ఆర్హెచ్ను దారుణంగా దెబ్బకొట్టాడు. 14వ ఓవర్ తొలి బంతికి ప్రియం గార్గ్‌ను అవుట్ చేసిన క్రిస్టియన్.. అదే ఓవర్ ఆఖరి బంతికి జేసన్ రాయ్(38 బంతుల్లో 44; 5 ఫోర్లు)ని కూడా పెవిలియన్‌కు పంపాడు. 15 ఓవర్ల తర్వాత ఎస్ఆర్హెచ్ స్కోర్ 107/4. క్రీజ్‌లో అబ్దుల్ సమద్(1), సాహా ఉన్నారు. ప్రియం గార్గ్(15) ఔట్.. ఎస్ఆర్హెచ్ 105/3 డేనియల్ క్రిస్టియన్ వేసిన 14 ఓవర్లో ప్రియం గార్గ్(11 బంతుల్లో 15; సిక్సర్) ఔటయ్యాడు. ఏబీ డివిలియర్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 14.1 ఓవర్ల తర్వాత ఎస్ఆర్హెచ్ స్కోర్ 105/3. క్రీజ్‌లో జేసన్ రాయ్(43), అబ్దుల్ సమద్ ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్.. విలియమ్సన్(31) ఔట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో కెప్టెన్ విలియమ్సన్(31) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ 12 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో జాసన్ రాయ్(22), ప్రియం గార్గ్(3) పరుగులతో ఉన్నారు. నిలకడగా ఆడుతున్న ఎస్ఆర్హెచ్.. ఆరంభంలోనే అభిషేక్ శర్మ వికెట్ కోల్పోయినప్పటికి ఎస్ఆర్హెచ్ ప్రస్తుతం నిలకడగా ఆడుతుంది. ప్రస్తుతం 7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోయి ఎస్ఆర్హెచ్ 58 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కేన్ విలియమ్సన్(20), జాసన్ రాయ్(22) పరుగులతో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్.. అభిషేక్ శర్మ(13) ఔట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో అభిషేక్ శర్మ రూపంలో సన్‌రైజర్స్ తొలి వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ సెకెండ్ ఓవర్ వేసిన జార్జ్ గార్టన్ బౌలింగ్‌లో.. ఓపెనర్‌గా వచ్చిన అభిషేక్ శర్మ(13) మాక్స్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 3 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ వికెట్ నష్టానికి 23 పరుగులు చేసింది. క్రీజులో కేన్ విలియమ్సన్(8), జాసన్ రాయ్(1) పరుగులతో ఉన్నారు. అబుదాబి: ఐపీఎల్2021 సెకెండ్ ఫేజ్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఐపీఎల్లో తమ 100 వ విజయాన్ని నమోదు చేసుకోవడానకి బెంగళూరు తహ తహ లాడుతుంటే.. హైదరాబాద్ మాత్రం ఎలాగైనా గెలిచి పరువు దక్కించుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో రెండు జట్లు 19 మ్యాచ్‌ల్లో ముఖాముఖి తలపడగా.. హైదరాబాద్ 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. బెంగళూరు 11 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ఇక మిగిలిన ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. కాగా ప్రస్తుత సీజన్ తొలి దశలో భాగంగా ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో 6 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాదించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్వెల్, ఎబి డివిలియర్స్, డేనియల్ క్రిస్టియన్, జార్జ్ గార్టన్, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యజ్వేంద్ర చహల్ సన్‌రైజర్స్ హైదరాబాద్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), జాసన్ రాయ్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), ప్రియం గార్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, సిద్దార్థ్ కౌల్ -
షర్ట్ లేకుండా విరాట్ కోహ్లి ఫోటోలు... వైరల్
Virat Kohli’s Shirtless Photo During RCB’s Pool Session: ప్రపంచంలోనే అంత్యంత ప్రజాదరణ పొందిన క్రికటర్‌ల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఒకడు. అయితే ఐపీఎల్2021 సెకెండ్ ఫేజ్‌లో రెండు వరుస అపజాయాల తర్వాత ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించి ఆర్సీబీ తిరిగి ట్రాక్‌లో పడింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబైను 54 పరుగుల తేడాతో బెంగళూరు చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కోహ్లి 51 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు సహచర ఆటగాళ్లు స్విమ్మింగ్ పూల్‌లో సేద తీరుతున్నారు. ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా కోహ్లి షర్ట్ లేకుండా ఉన్న ఫొటోలపై నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. కాగా శుక్రవారం( సెప్టెంబర్ 29)న రాజస్తాన్ రాయల్స్‌తో బెంగళూరు తలపడనుంది. చదవండి: MS Dhoni: ఈ సీజన్ తర్వాత రిటైర్మెంట్.. హెడ్‌కోచ్‌గా.. లేదంటే! Our boys definitely deserve to cool off after a couple of days of intense #IPL action. 🧊🏊♂️ #PlayBold #WeAreChallengers #IPL2021 pic.twitter.com/SNNMwIvxtJ — Royal Challengers Bangalore (@RCBTweets) September 27, 2021 -
Virat Kohli: ఐపీఎల్ కెప్టెన్సీపై కోహ్లి కీలక నిర్ణయం
Virat Kohli Sted Down As IPL Captain.. అబుదాబి: గత గురువారం... ఈ ఏడాది టి20 ప్రపంచకప్ ముగిశాక భారత టి20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించిన విరాట్ కోహ్లి... ఆదివారం మరో అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్–14వ సీజన్ ముగిశాక తాను సారథ్యం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు పగ్గాలు వదులుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు ఆర్సీబీ అధికారిక ట్విటర్ ఖాతాలో కోహ్లి వీడియో సందేశం విడుదల చేశాడు. ‘ఆర్సీబీ కెప్టెన్ హోదాలో నాకిదే చివరి ఐపీఎల్ సీజన్. గతంలో చెప్పినట్టుగా ఐపీఎల్లో చివరి మ్యాచ్ ఆడినంత కాలం ప్లేయర్‌గా బెంగళూరు జట్టు తరఫున మాత్రమే బరిలోకి దిగుతాను. మరో ఐపీఎల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనని మరోసారి స్పష్టం చేస్తున్నాను. ఇంతకాలం నాపై నమ్మకం ఉంచి, నన్ను ప్రోత్సహించి, మద్దతుగా నిలిచిన ఆర్సీబీ యాజమాన్యానికి, కోచ్‌లకు, సహచర ఆటగాళ్లకు, అభిమానులకు ధన్యవాదాలు’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు. చదవండి: Suresh Raina Wicket: అయ్యో రైనా.. వికెట్‌తో పాటు బ్యాట్‌ను విరగొట్టుకున్నాడు ►ఐపీఎల్ ప్రారంభమైన 2008 నుంచి కోహ్లి ఆర్సీబీ జట్టు సభ్యుడిగా ఉన్నాడు. 2011లో నాటి కెప్టెన్ వెటోరి గాయపడటంతో కొన్ని మ్యాచ్‌ల్లో కోహ్లి కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2013 సీజన్ నుంచి పూర్తి స్థాయిలో బెంగళూరు జట్టుకు కెప్టెన్ అయ్యాడు. ►కోహ్లి సారథ్యంలో ఆర్సీబీ జట్టు 132 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడింది. 60 విజయాలు, 65 పరాజయాలు నమోదు చేసింది. మూడు మ్యాచ్‌లు ‘టై’ అయ్యాయి. నాలుగు మ్యాచ్‌లు రద్దయ్యాయి. ►కోహ్లి సారథ్యంలో ఆర్సీబీ 2015లో మూడో స్థానంలో, 2016లో రన్నరప్‌గా... 2020లో నాలుగో స్థానంలో నిలిచింది. Virat Kohli to step down from RCB captaincy after #IPL2021 “This will be my last IPL as captain of RCB. I’ll continue to be an RCB player till I play my last IPL game. I thank all the RCB fans for believing in me and supporting me.”: Virat Kohli#PlayBold #WeAreChallengers pic.twitter.com/QSIdCT8QQM — Royal Challengers Bangalore (@RCBTweets) September 19, 2021 -
కోహ్లి, సిరాజ్‌ల కోసం ప్రత్యేక చార్టర్ ఫ్లైట్
దుబాయ్: ఇంగ్లండ్‌తో జరగాల్సిన ఐదో టెస్టు మ్యాచ్ కరోనా కారణంగా అర్థంతరంగా రద్దయిన సంగతి తెలిసిందే. దీంతో టీమిండియా 2-1 తేడాతో సిరీస్‌తో ఆధిక్యంలో ఉంది. ఇక ఐపీఎల్ 14వ సీజన్ రెండో అంచె పోటీలకు వారం సమయం మాత్రమే మిగిలి ఉండడంతో ఇంగ్లండ్ టూర్లో ఉన్న టీమిండియా ఆటగాళ్లు యూఏఈకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తమ కెప్టెన్ విరాట్ కోహ్లి, మహ్మద్ సిరాజ్‌ల కోసం ప్రత్యేక చార్టర్ ఫ్లైట్‌ను లండన్‌కు పంపించనుంది. చార్టర్ ఫ్లైట్‌లో దుబాయ్‌కి చేరుకోనున్న ఈ ఇద్దరు ఆరు రోజుల పాటు క్వారంటైన్లో ఉండనున్నారు. ఈ విషయాన్ని ఆర్సీబీ ఒక ప్రకటనలో తెలిపింది. కోహ్లి, సిరాజ్‌ల కోసం ప్రత్యేక చార్టర్ ఫ్లైట్‌ను సిద్ధం చేశాం. శనివారం రాత్రి కోహ్లి, సిరాజ్‌లు చార్టర్ ఫ్లైట్ ఎక్కుతారు.. ఆదివారం ఉదయం దుబాయ్‌లో దిగిన వెంటనే నిబంధనల ప్రకారం ఆరు రోజుల పాటు క్వారంటైన్లో ఉండనున్నారు. అంటూ ఆర్సీబీ పేర్కొంది. చదవండి: IND VS ENG 5th Test: ఒక్క టెస్ట్ మ్యాచ్ రద్దవడం వల్ల ఇంత భారీ నష్టమా..? ఇక ఐపీఎల్ 2021 సీజన్లో ఆర్సీబీ మంచి ప్రదర్శన కనబరిచింది. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 5 విజయాలు, రెండు ఓటములతో 10 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది. ఈ సీజన్లో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించడం ఆర్సీబీ ఫ్రాంచైజీ చరిత్రలో తొలిసారి కావడం విశేషం. ఈసారి టైటిల్ ఫెవరెట్లలో ఆర్సీబీ ఒకటని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చదవండి: SL Vs SA: ఓపెనర్‌గా వచ్చి నాటౌట్.. అయినా గెలిపించలేకపోయాడు -
ఆర్సీబీ కీలక నిర్ణయం.. ప్రధాన కోచ్‌గా మైక్ హెసన్
దుబాయ్: ఐపీఎల్-14వ సీజన్ రెండో అంచె పోటీల ప్రారంభానికి ముందు ఆర్సీబీ కీలక మార్పులు చేస్తుంది. శనివారం జట్టులోకి ముగ్గురు కొత్త ఆటగాళ్లను తీసుకున్న ఆర్సీబీ కోచ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్సీబీ హెడ్ కోచ్ సైమన్ కటిచ్ వ్యక్తిగత కారణాలతో మిగిలిన సీజన్‌కు అందుబాటులో ఉండటం లేదని ప్రకటించాడు. దాంతో టీమ్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్ మైక్ హెసన్ ఈ సారి హెడ్‌కోచ్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తాడు. ఇక ఆర్సీబీ తన జట్టులో మూడు మార్పులు చేసింది. తొలి దశ పోటీల్లో ఆడిన ఆడమ్ జంపా, ఫిన్ అలెన్, డానియెల్ స్యామ్స్ ఈ సారి లీగ్‌కు దూరమయ్యారు. వారి స్థానాల్లో శ్రీలంక బౌలర్లు వనిందు హసరంగ, దుష్మంత చమీరాలను జట్టు ఎంచు కుంది. సింగపూర్‌కు చెందిన బ్యాట్స్‌మన్ టిమ్ డేవిడ్ కూడా ఆర్సీబీ టీమ్‌లోకి ఎంపికయ్యాడు. సింగపూర్‌కు చెందిన ఒక ఆటగాడు ఐపీఎల్లో అడుగు పెట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక ఈ సీజన్లో ఆర్సీబీ మంచి ప్రదర్శనే కనబరిచింది. 7 మ్యాచ్‌లాడిన ఆర్సీబీ ఐదు విజయాలు.. రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. చదవండి: MS Dhoni: ధోని సిక్సర్ల వర్షం.. ఇంత కసి దాగుందా ఐపీఎల్ నుంచి బట్లర్ అవుట్! -
కోహ్లీకి ఎమోషనల్ బర్త్ డే విషెస్
దుబాయ్: విరాట్ కోహ్లీ 32వ జన్మదిన వేడుకుల సందర్భంగా గురువారం తన టీమ్ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ (ఆర్సీబీ) ట్విటర్ వేదికగా ఎమోషనల్ బర్త్ డే విషెస్ చెప్పింది. జట్టు గెలుపు కోసం రక్తాన్ని, స్వేదాన్ని, కన్నీళ్లను ఇచ్చే గొప్ప వ్యక్తి అని ట్వీట్ చేసింది. మా నాయకుడు లెజెండ్ అని ప్రశింసిస్తూ.. ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. జన్మదిన వేడుకలు గొప్పగా ఉండాలని ఆశించింది. 2008 ఐపిఎల్ ప్రారంభం నుంచి లీగ్‌లో ఉన్న విషయాన్ని గుర్తు చేసుకుంది. ఐపీఎల్ అధికారక ట్విటర్లో అద్భుతమైన ప్రదర్శన చేసిన వీడియోను షేర్ చేసింది. హ్యాపీ బర్త్ డే ఇండియన్ గ్రేట్ బ్యాట్స్‌మెన్, నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని, సిక్సర్లు బాదాలని యువరాజ్ సింగ్ ట్వీట్ చేశాడు. సురేశ్ రైనా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ మరిన్ని విజయాలు సాధించాలని కోరుతున్నానన్నాడు. శిఖర్ ధావన్, వివిఎస్ లక్క్ష్మణ్ పలువురు ట్విటర్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. క్రికెటర్లతో పాటు... యావత్ ప్రపంచమంతా తన అభిమాన క్రికెటర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు ఐపీఎల్లో 191మ్యాచ్‌లు ఆడాడు. 5872 పరుగులు సాధించాడు. ఈ సీజన్లో లీగ్ దశలో 460 పరుగులు చేశాడు. 2016 తర్వాత ప్లేఆఫ్‌కి వెళ్లడానికి కోహ్లీ చేసిన పరుగులు చాలా కీలకమయ్యాయి. శుక్రవారం ఎలిమినేషన్ మ్యాచ్‌లో హైదరాబాద్‌తో తలపడనుంది. -
రైజింగ్‌కు వేళాయె...
దుబాయ్: అనుకున్నట్లే ఐపీఎల్ హంగామా మొదలైంది. కరోనా నేపథ్యంలో నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ సాఫీగా ఫ్రాంచైజీలన్నీ ఆటలో నిమగ్నమయ్యాయి. ఇప్పటివరకు డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల ఆటను చూసి సంతోషించిన హైదరాబాద్ అభిమానులు ఇక తమ సొంత జట్టును మైదానంలో చూసుకునేందుకు సిద్ధమయ్యారు. స్టార్లతో కూడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో సోమవారం జరుగనున్న మ్యాచ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ఈ సీజన్ ఐపీఎల్ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఇరు జట్లకూ ఇదే తొలి మ్యాచ్ కావడం... విధ్వంసం సృష్టించే ఆటగాళ్లకు కొదవలేకపోవడంతో అభిమానులకు అసలైన ఐపీఎల్ మజా అందనుంది. రైజింగ్‌కు సిద్ధం... బ్యాట్స్‌మెన్ జోరు కొనసాగే ఐపీఎల్లో... బౌలర్ల ఉనికి కనబడే జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్. చాప కింద నీరులా ఎస్ఆర్హెచ్ లీగ్‌లో తన పని తను చేసుకుపోతుంటుంది. తక్కువ లక్ష్యాలు కాపాడుకోవడం ఎస్ఆర్హెచ్కు బంతితో పెట్టిన విద్య. డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ రూపంలో జట్టును నడిపించే అద్భుతమైన నాయకులున్నారు. ఓపెనర్‌గా, కెప్టెన్‌గా, అత్యధిక పరుగుల వీరుడిగా లీగ్‌లో వార్నర్‌ను మించిన వారు లేరు. మరో ఓపెనర్ జానీ బెయిర్‌స్టో ఎంత ప్రమాదకారో అందరికీ తెలిసిందే. ఈ జంట గత సీజన్లో బెంగళూరుపైనే రికార్డు ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. వీరితో పాటు మనీశ్ పాండే, మిచెల్ మార్‡్ష, ఫాబియాన్ అలెన్ సత్తా చాటితే భారీ స్కోరు ఖాయం. ఇక వైవిధ్యమైన బౌలింగ్ సన్‌రైజర్స్ సొంతం. అఫ్గాన్ బౌలర్లు రషీద్ ఖాన్, మొహమ్మద్ నబీలతో పాటు భువనేశ్వర్, షాబాజ్ నదీమ్ తమ స్థాయికి తగినట్లు రాణిస్తే ఎంతటి బ్యాట్స్‌మెన్ అయినా సింగిల్ డిజిట్ స్కోరుకే వెనుదిరగడం ఖాయం. అమితోత్సాహంలో కోహ్లి సేన... దుబాయ్ చేరినప్పటి నుంచి కచ్చితమైన ప్రణాళిక ప్రకారం సన్నద్ధమవుతోన్న జట్టు ఆర్సీబీ. మిగతా జట్లు క్వారంటైన్ కాలంలో ఏదో ఒక రకమైన ఇబ్బందిని ఎదుర్కొంటుంటే ఆర్సీబీ శిబిరం మాత్రం ఆనందోత్సాహాలతో సంబరాలు చేసుకుంది. తొలి మ్యాచ్ విజయంతో ఈ ఆనందాన్ని పదిలం చేసుకోవాలని కెపె్టన్ కోహ్లి భావిస్తున్నాడు. ఈ సీజన్లో తమ జట్టు రాత మార్చాలనే దృఢ సంకల్పంతో ఉన్నాడు. అంతా తానై నడిపించే కోహ్లికి ఆస్ట్రేలియా విధ్వంసక ఆటగాడు ఆరోన్ ఫించ్ తోడయ్యాడు. యువ ఓపెనర్ దేవదత్ పడిక్కల్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి. (పంజాబ్ సూపర్ ఫ్లాప్...) వీరికి తోడు ‘మిస్టర్ 360’ ప్లేయర్ ఏబీ డివిలియర్స్, శివమ్ దూబే, క్రిస్ మోరిస్ బ్యాట్ ఝళిపిస్తే చూస్తుండగానే భారీ స్కోరు నమోదు కావడం ఖాయం. బౌలింగ్‌లో ఎప్పటిలాగే స్పిన్నర్ యజువేంద్ర చహల్ కీలకం కానున్నాడు. వాషింగ్టన్ సుందర్, పవన్ నేగి, ఆడమ్ జంపా, మొయిన్ అలీ స్పిన్ బాధ్యతల్ని మోయనున్నారు. అయితే డెత్ ఓవర్లలో తేలిపోయే బలహీనతను అధిగమించకపోతే ఆర్సీబీ ఎంత పోరాడినా వృథాయే. జట్టు నిండా స్టార్లతో కూడిన ఆర్సీబీకి ఆవగింజంత అదృష్టం తోడైతే టైటిల్ సాధించడం కష్టమేమీ కాదు. -
'కోహ్లి, డివిలియర్స్ ఫేవరెట్ కాదు'
దుబాయ్ : భారత మాజీ ఆటగాడు.. లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ గురువారం చెన్నై సూపర్ కింగ్స్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన చేసిన సంగతి తెలిసిందే. ఈ ఐపీఎల్లో చెన్నై టైటిల్ గెలవడం కష్టమే అన్న గవాస్కర్ ధోనికి మాత్రం లాభదాయకంగా మారనుందంటూ పేర్కొన్నాడు. తాజాగా సునీల్ గవాస్కర్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై స్పందించాడు. (చదవండి : ఈసారి చెన్నై టైటిల్ గెలవడం కష్టమే..) 'పేపర్‌పై బలంగా కనిపించే ఆర్సీబీ జట్టు ఇంతవరకు ఐపీఎల్ టైటిల్ గెలవకపోవడం ఒక మిస్టరీగా మారింది. మేటి ఆటగాళ్లైన విరాట్ కోహ్లి, డివిలియర్స్ లాంటి వారు ఉన్నా ఆ జట్టు కీలకదశలో ఒత్తిడికి లోనయ్యేది. ఒకవేళ వీరిద్దరు విఫలమైతే.. ఇక ఆర్సీబీ జట్టులో మిగతా ఆటగాళ్లు ఆడలేరన్నంతగా ముందుగానే చేతులెత్తేస్తుంది. ఈసారి టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్న ఆర్సీబీకి కొత్త కోచ్ తన సలహాలతో జట్టు తలరాత మారుస్తాడేమో చూడాలి. అంటే పేర్కొన్నాడు. దీంతో పాటు ఐపీఎల్ 13వ సీజన్లో ఆర్సీబీ జట్టు తరపున మ్యాచ్ విన్నర్ ఎవరనేది గవాస్కర్ పేర్కొన్నాడు. 'ఈ ఐపీఎల్లో కోహ్లి, డివిలియర్స్‌లే ఫేవరెట్ అని అంతా భావిస్తున్నారు. నిజానికి ఈసారి లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ మ్యాచ్ విన్నర్ కానున్నాడు. యూఏఈ పిచ్‌లు స్లోగా ఉండడంతో స్పిన్ బౌలర్లు కీలకంగా మారనున్నారు. అందుకే చహల్ మ్యాచ్ విన్నర్ కానున్నాడు. ' అంటూ తెలిపాడు. (చదవండి : ఖాళీ మైదానాలతో తీవ్రత తగ్గదు!) గత 12 సీజన్లుగా పేపర్‌పై బలంగా కనిపించే ఆర్సీబీ జట్టు ఐపీఎల్ మ్యాచ్‌ల్లో మాత్రం తడబడుతూనే ఉంది. విరాట్ కోహ్లి.. ఏబీ డివిలియర్స్ లాంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నా ఆ జట్టు తలరాత మాత్రం మారడం లేదు. ఈసారి వేలంలో బిగ్ హిట్టర్ ఆరోన్ ఫించ్, ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్‌లను దక్కించుకొని మరింత బలంగా తయారైంది. ఈసారి మాత్రం టైటిల్‌ను ఎలాగైనా దక్కించుకోవాలనే కసితో బరిలోకి దిగుతున్న ఆర్సీబీ ఏం చేస్తుందో చూడాలి. కాగా ఆర్సీబీ జట్టు సెప్టెంబర్ 21న తమ మొదటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. -
వావ్.. కోహ్లి కొత్త నిక్‌నేమ్ బాగుంది!!
ఐపీఎల్ సీజన్ 12లో భాగంగా కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ జట్టు10 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. శుక్రవారం సొంతగడ్డపై కేకేఆర్‌ను ఓడించిన కోహ్లి జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈడెన్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో సెంచరీతో ఆకట్టుకున్న ఆర్సీబీ కెప్టెన్ కోహ్లి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కించుకున్నాడు. అంతేగాక ఐపీఎల్లో ఐదో సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు. ఈ నేపథ్యంలో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో సత్తా చాటి ప్లే ఆఫ్ ఆశలను నిలిపిన కోహ్లిపై ఆర్సీబీ అభిమానులతో పాటు సహచర ఆటగాళ్లు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందులో భాగంగా... అస్వస్థత కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమైన ఆర్సీబీ హిట్టర్ ఏబీ డివిలియర్స్ కూడా కోహ్లిని ప్రశంసలతో ముంచెత్తాడు. ‘ విరాట్!!!!! యూ లిటిల్ బిస్కెట్. మెయిన్ అలీతో ఆటు బౌలర్లను హడలెత్తించావు. ఫస్ట్ ఆఫ్ వెరీగుడ్’ అంటూ ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన కోహ్లి, ఏబీ అభిమానులు ‘వావ్.. కోహ్లి నిక్‌నేమ్ బాగుంది. లిటిల్ బిస్కెట్ రాకింగ్ పర్ఫామెన్స్తో అదరగొట్టాడు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా పరుగుల వరద పారిస్తున్న కోహ్లిని రన్ మెషీన్, చీకూ, కింగ్ కోహ్లి అని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారన్న సంగతి తెలిసిందే. కోహ్లి మ్యాజిక్‌తో కట్టిపడేశాడు! ఈ‘డెన్’లోని ప్రేక్షకులను కోహ్లి తన మ్యాజిక్‌తో కట్టిపడేశాడు. ముందు ఓపిగ్గా ఆడినా... తర్వాత బౌండరీలతో ఊపేసినా... చివరకు శతక్కొట్టినా... అద్భుతమైన క్యాచ్‌లు పట్టినా... ఈడెన్ గార్డెన్స్‌లో ‘విరాట్’పర్వమే కనబడింది. అంతేకాదు... తన సరదాలహరి కూడా ఈడెన్ ప్రేక్షకుల్ని రంజింపజేసింది. 18వ ఓవర్ వేసిన నరైన్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన కోహ్లి పరుగు తీసి నాన్ స్ట్రయిక్‌లోకి వచ్చాడు. బంతి వేసేందుకు వచ్చిన నరైన్ బంతిని సంధించలేదు. ‘మన్కడింగ్’ అనుకొని కోహ్లి క్రీజ్‌లోకి బ్యాట్ పెడుతూ ఫోజు ఇచ్చాడు. ఇది మైదానంలో నవ్వులు పూయించింది. VIRAT!!!!!!!!!!!🎉🎉🎉 you little biscuit @imVkohli Top knock from @MoeenaliAli as well👏Bowlers to follow through what’s been a very good 1st half — AB de Villiers (@ABdeVilliers17) April 19, 2019 -
రసెల్‌కు ఆ బంతి వేసుంటే..!
బెంగళూరు : ‘హమ్మయ్యా.. ఈ మ్యాచ్ అయితే గెలిచేట్టున్నాం..’ అని రాయల్‌చాలెంజర్స్ బ్యాటింగ్ చూసిన తరువాత ఆ జట్టు ప్రతి అభిమాని మనసులో మెదిలిన మాట. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో తమ అభిమాన జట్టు దారుణ ఓటమి మూటగట్టుకోవడంతో వారి అసహనం తీవ్రస్థాయికి చేరింది. ఒక్క మ్యాచ్ అన్న గెలవండి అంటూ కోహ్లిసేనను వారంతా సోషల్ మీడియా వేదికగా అర్ధించారు.. తిట్టారు.. ప్రాధేయపడ్డారు. అభిమానులను అలరించాడానికి ఎలాగైన కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగే మ్యాచ్ గెలవాలని ఆర్సీబీ ఆటగాళ్లు సైతం సిద్దమయ్యారు. కానీ ఏం లాభం.. అదృష్టం తలుపు తడితే దురుదృష్టం వెనక తలుపు తట్టినట్లు... కెప్టెన్ విరాట్ కోహ్లి, మిస్టర్ 360 డివిలియర్స్ రూపంలో భారీ లక్ష్యం నమోదైతే.. ఆండ్రీ రసెల్ భీకర ఇన్నింగ్స్ రూపంలో ఆ కొండంత లక్ష్యం కొట్టుకుపోయింది. రసెల్ క్రీజులోకి వచ్చినప్పుడు కోల్‌కతా విజయానికి 26 బంతుల్లో 67 పరుగులు అవసరం. ఈ పరిస్థితుల్లో ఒక్క ఓవర్ సరిగ్గా పడ్డా ఆర్సీబీదే విజయమని మ్యాచ్చూస్తున్న ప్రతి ప్రేక్షకుడు అనుకున్నాడు. కానీ రసెల్ విధ్వంసం సృష్టించాడు. 13 బంతుల్లోనే 7 సిక్సర్లు, ఒక ఫోర్‌తో చెలరేగి 48 పరుగులు చేసి ఐదు బంతులు మిగిలి ఉండగానే విజయాన్నందించాడు. అయితే రసెల్ భీకరంగా ఆడుతుంటే ఒక్కరు కూడా యార్కర్లు సంధించకపోవడం మ్యాచ్ చూస్తున్న అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. అవే షార్ట్ పిచ్, స్లో బంతులు వేస్తుంటే రసెల్ దంచికొట్టాడు. ఒక్కరైనా ఒక ఓవర్లో కనీసం మూడు బంతులను యార్కర్లు సంధించినా మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేదని అభిప్రాయపడుతున్నారు. రసెల్ యార్కర్లను ఆడటంలో తడబడుతాడని, అతను ఆ బంతులను భారీ షాట్స్‌గా మల్చలేడని పేర్కొంటున్నారు. రసెల్ గత మ్యాచ్‌లను చూస్తే ఇది నిజమే అనిపిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్ బరిలో దిగిన రసెల్‌ను రబడ యార్కర్లతోనే ఇబ్బందిపెట్టి ఔట్ చేశాడు. కింగ్స్ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా ఆ జట్టు బౌలర్ మహ్మద్ షమీ అద్భుత యార్కర్‌తో రసెల్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. దురదృష్టవశాత్తు.. అది కాస్త అశ్విన్ కెప్టెన్సీ లోపంతో నోబాల్ కావడంతో రసెల్ బతికిపోయాడు. అనంతరం సునామీలా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. -
ఆ విధ్వంసకర ఇన్నింగ్స్‌కు పదేళ్లు..
పదేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు.. క్యాష్ రిచ్ లీగ్‌గా పేరుగాంచిన ఐపీఎల్ మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ బ్రెండన్ మెకల్లమ్ సృష్టించిన పరుగుల సునామీని అంత తేలిగ్గా ఎవరూ మర్చిపోలేరు. అట్టహాసంగా ప్రారంభమైన ఐపీఎల్ మొదటి సీజన్ మొదటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడ్డాయి. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ జట్టు కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ప్రత్యర్థి జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. పరుగుల ప్రవాహం సాగిందిలా.. కేకేఆర్ తరపున బరిలోకి దిగిన కివీస్ బ్యాట్స్‌మెన్ మెకల్లమ్ ధాటికి ప్రత్యర్థి జట్టు విలవిల్లాడిపోయింది. మ్యాచ్ ప్రారంభమైన మొదటి ఆరు బంతులలో ఒక్క పరుగు కూడా సాధించలేకపోయిన మెకల్లమ్.. ఆ తర్వాతి నాలుగు బంతుల్లో 18 పరుగులు చేసి ఖాతా తెరిచాడు. అంతే ఇక ఏ బౌలర్ కూడా మెల్లకమ్ దూకుడుకు అడ్డుకట్ట వేయలేక పోయారు. కేవలం 73 బంతుల్లోనే 10 ఫోర్లు, 13 సిక్స్‌లతో 158 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన మెకల్లమ్ రికార్డు నెలకొల్పాడు. మెకల్లమ్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో 222 పరుగుల ప్రత్యర్థి జట్టుకు భారీ లక్ష్యాన్ని విధించింది కేకేఆర్. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.. క్రికెట్ అభిమానులకు కొత్త అనుభవాన్ని మిగిల్చిన ఈ మ్యాచ్‌లో బౌలింగ్ విభాగంలో విఫలమైన ఆర్సీబీ జట్టు బ్యాటింగ్‌లోనూ చతికిల పడింది. భారీ లక్ష్యాన్ని ఛేదించలేక 82 పరుగులకే ఆలౌట్ అయింది. కేకేఆర్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన మెకల్లమ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గా నిలిచాడు. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్ విజయం సాధించడంతో కెప్టెన్ సౌరవ్ గంగూలీతో పాటు, అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఐపీఎల్ కెరీర్లో ఇప్పటివరకు 106 మ్యాచులాడిన మెకల్లమ్ 2801 పరుగులు చేశాడు. వాటిలో రెండు సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ సీజన్ 11లో ఆర్సీబీ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న మెకల్లమ్ ఆడిన మూడు మ్యాచుల్లో కేవలం 47 పరుగులు మాత్రమే చేశాడు. ఇంతవరకు తన మార్క్ ప్రదర్శనను కనబరచకపోవటం అభిమానులను నిరుత్సాహానికి గురిచేస్తోంది. -
బెంగళూరు బతికిపోయింది
ఓటమికి చేరువగా వచ్చిన బెంగళూరు అదృష్టవశాత్తూ గట్టెక్కింది. జట్టు బౌలర్ క్రిస్ జోర్డాన్ ఒత్తిడిని తట్టుకొని బౌండరీ రాకుండా ఆఖరి బంతిని విసరడంతో ఆ జట్టుకు ఒక్క పరుగుతో విజయం దక్కింది. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి నాలుగు పరుగులు కావాల్సి ఉండగా స్టొయినిస్ 2 పరుగులే తీయగలిగాడు. చివరి ఓవర్లో విజయానికి 17 పరుగులు కావాల్సిన స్థితిలో పంజాబ్ బ్యాట్స్‌మెన్ స్టొయినిస్, బెహర్దీన్ 15 పరుగులు తీయగలిగినా పంజాబ్‌ను ఓటమి నుంచి రక్షించలేకపోయారు. అంతకుముందు చహల్ బౌలింగ్ ప్రదర్శన ఆర్సీబీని ఆదుకుంది. ఒక్క పరుగుతో విజయం * రాణించిన డివిలియర్స్, చహల్ * చివరి బంతికి ఓడిన పంజాబ్ * విజయ్ మెరుపులు వృథా మొహాలీ: ఐపీఎల్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కీలక విజయాన్ని అందుకుంది. మరోసారి బౌలింగ్ వైఫల్యం జట్టును దెబ్బ తీసేలా కనిపించినా, ఎట్టకేలకు గట్టెక్కింది. సోమవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు పరుగు తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. డివిలియర్స్ (35 బంతుల్లో 64; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేయగా, రాహుల్ (25 బంతుల్లో 42; 6 ఫోర్లు, 1 సిక్స్), సచిన్ బేబీ (29 బంతుల్లో 33; 1 ఫోర్) రాణించారు. అనంతరం పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 174 పరుగులే చేయగలిగింది. మురళీ విజయ్ (57 బంతుల్లో 89; 12 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగగా, స్టొయినిస్ (22 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. రెండు కీలక వికెట్లు తీసిన వాట్సన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. చెలరేగిన డివిలియర్స్... వరుసగా రెండో ఇన్నింగ్స్‌లో 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి రాహుల్, కోహ్లి (21 బంతుల్లో 20; 2 ఫోర్లు) బెంగళూరుకు శుభారంభం అందించారు. ఒకవైపు కోహ్లి సంయమనంతో ఆడగా, మరోవైపు నుంచి రాహుల్ చెలరేగిపోయాడు. స్టొయినిస్ వేసిన నాలుగో ఓవర్లో అతను మూడు ఫోర్లు, 1 సిక్సర్ బాదడంతో 20 పరుగులు వచ్చాయి. ఈ జోరులో పవర్‌ప్లేలో ఆర్సీబీ 56 పరుగులు చేసింది. 11 పరుగుల వద్ద స్టొయినిస్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన కోహ్లి దానిని పెద్దగా ఉపయోగించుకోలేకపోయాడు. కరియప్ప వేసిన ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్లో బెంగళూరు వేగానికి బ్రేక్ వేసింది. మూడో బంతికి రాహుల్‌ను బౌల్డ్ చేసిన కరియప్ప, మరో రెండు బంతుల తర్వాత కోహ్లిని పెవిలియన్ పంపించాడు. మరుసటి ఓవర్లోనే వాట్సన్ (1) కూడా వెనుదిరిగాడు. గత రెండు మ్యాచ్‌లలో విఫలమైన డివిలియర్స్ ఈ దశలో తన ధాటిని ప్రదర్శించాడు. సందీప్ ఓవర్లో సిక్స్, ఫోర్ కొట్టిన అతను, మోహిత్ వేసిన తర్వాతి ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టి 30 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సందీప్ తర్వాతి ఓవర్లో కూడా మళ్లీ సిక్స్, ఫోర్ కొట్టిన తర్వాత మరో భారీ షాట్‌కు ప్రయత్నించి వెనుదిరిగాడు. డివిలియర్స్‌కు సచిన్ బేబీ నుంచి చక్కటి సహకారం లభించింది. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 55 బంతుల్లోనే 88 పరుగులు జోడించారు. ఆఖరి ఓవర్లో బెంగళూరు రెండు వికెట్లు కోల్పోయింది. తొలి 10 ఓవర్లలో 73 పరుగులు చేసిన కోహ్లి సేన, తర్వాతి 10 ఓవర్లలో 102 పరుగులు సాధించింది. విజయ్ ఒంటరి పోరు... పంజాబ్ ఇన్నింగ్స్‌ను విజయ్ దూకుడుగా ఆరంభించగా, ఆమ్లా (20 బంతుల్లో 21; 2 ఫోర్లు) కొద్ది సేపు అండగా నిలిచాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 33 బంతుల్లో 45 పరుగులు జోడించిన అనంతరం ఆమ్లాను వాట్సన్ అవుట్ చేశాడు. విజయ్‌కు సాహా (13 బంతుల్లో 16; 1 ఫోర్) కూడా సహకరించడంతో రెండో వికెట్‌కూ 32 బంతుల్లో 43 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. 10 ఓవర్లు ముగిసే సరికి కింగ్స్ స్కోరు 83 పరుగులకు చేరింది. అయితే 11వ ఓవర్లో పంజాబ్ రెండు వికెట్లు కోల్పోయింది. సాహా రనౌట్ కాగా, మిల్లర్(0) స్టంపౌట్ అయి వెనుదిరిగాడు. మరోవైపు 36 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న విజయ్, ఆ తర్వాత మరింత బాధ్యతగా ఆడాడు. అబ్దుల్లా ఓవర్లో రెండు వరుస ఫోర్లు కొట్టిన విజయ్, చహల్ ఓవర్లో మరో రెండు బౌండరీలు రాబట్టాడు. విజయ్, స్టొయినిస్ నాలుగో వికెట్‌కు ఆరు ఓవర్లలో 51 పరుగులు జత చేసిన తర్వాత భారీ షాట్‌కు ప్రయత్నించి విజయ్ వెనుదిరగడం పంజాబ్ అవకాశాలను దెబ్బ తీసింది. స్కోరు వివరాలు:- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) విజయ్ (బి) కరియప్ప 20; రాహుల్ (బి) కరియప్ప 42; డివిలియర్స్ (సి) కరియప్ప (బి) సందీప్ 64; వాట్సన్ (బి) అక్షర్ 1; సచిన్ బేబీ (రనౌట్) 33; హెడ్ (సి) విజయ్ (బి) సందీప్ 11; బిన్నీ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 175. వికెట్ల పతనం: 1-63; 2-64; 3-67; 4-155; 5-174; 6-175. బౌలింగ్: సందీప్ 4-0-49-2; అనురీత్ 3-0-15-0; మోహిత్ 3-0-33-0; స్టొయినిస్ 3-0-35-0; అక్షర్ పటేల్ 4-0-27-1; కరియప్ప 3-0-16-2. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: ఆమ్లా (సి) బిన్నీ (బి) వాట్సన్ 21; విజయ్ (సి) చహల్ (బి) వాట్సన్ 89; సాహా (రనౌట్) 16; మిల్లర్ (స్టంప్డ్) రాహుల్ (బి) చహల్ 0; స్టొయినిస్ (నాటౌట్) 34; బెహర్దీన్ (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1-45; 2-88; 3-88; 4-139. బౌలింగ్: బిన్నీ 2-0-16-0; చహల్ 4-0-30-1; జోర్డాన్ 4-0-52-0; వాట్సన్ 4-0-22-2; ఆరోన్ 3-0-25-0; అబ్దుల్లా 3-0-26-0.