
Courtesy: IPL Twitter
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్-2022 మెగా వేలంకు సమయం ఆసన్నమైంది. బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఈ మెగా వేలాన్ని నిర్వహించనున్నారు. ఇక గతేడాది పర్పుల్ క్యాప్ హోల్డర్ హర్షల్ పటేల్‌ను ఆర్సీబీ రీటైన్ చేసుకోలేదు. ఆర్సీబీ విరాట్ కోహ్లితో పాటు గ్లెన్ మ్యాక్స్‌వెల్, సిరాజ్‌ను రీటైన్ చేసుకుంది. దీంతో రానున్న మెగా వేలంలో హర్షల్ పటేల్ కోసం జట్లు పోటీ పడతాయి ఆనడంలో సందేహం లేదు. అయితే తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్షల్ పటేల్ తన మనసులోని మాటను బయట పెట్టాడు.
ఈ ఏడాది సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడేందుకు ఆసక్తిగా ఉన్నానని హర్షల్ తెలిపాడు. చెన్నై కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని తన ఆల్ టైమ్ బెస్ట్ కెప్టెన్ అని హర్షల్ పటేల్ పేర్కొన్నాడు. ఐపీఎల్- 2021లో 32 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా హర్షల్ పటేల్ నిలిచాడు. ముంబై ఇండియన్స్‌పై హ్యాట్రిక్ వికెట్లతో అదరగొట్టాడు. కాగా రానున్న మెగా వేలంలో తన బేస్ ప్రైస్ రూ.2 కోట్లగా నమోదు చేసుకున్నాడు. ఇక ఐపీఎల్ 2021లో కేవలం రూ. 20 లక్షలకు కొనుగోలు చేయడం గమనార్హం.
చదవండి: Shakib Al Hasan: 'శ్రీవల్లీ' పాటకు బంగ్లా ఆల్‌రౌండర్ స్టెప్పులు.. ఊహించని ట్విస్ట్