ఆర్బీసీ ఆటగాళ్లు(PC: IPL/BCCI)
IPL 2022 CSK vs RCB: చెన్నై సూపర్‌కింగ్స్‌తో మ్యాచ్‌లో తమ స్టార్ బౌలర్ హర్షల్ పటేల్ లేని లోటు స్పష్టంగా కనిపించిందని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అన్నాడు. తానుంటే జట్టుకు బలమని, మ్యాచ్ స్వరూపాన్ని ఒంటిచేత్తో మార్చేయగల సత్తా అతడిని సొంతమని పేర్కొన్నాడు.
త్వరలోనే అతడు జట్టులోకి తిరిగి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా ఐపీఎల్-2022లో భాగంగా చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 23 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించిన శివమ్ దూబే, రాబిన్ ఊతప్ప తమ అద్భుత ప్రదర్శనతో సీఎస్‌కేకు ఈ సీజన్‌లో మొదటి విజయం దక్కడంలో కీలక పాత్ర పోషించారు. కాగా గత సీజన్‌లో పర్పుల్ క్యాప్ గెలుచుకున్న ఆర్సీబీ బౌలర్ హర్షల్ పటేల్ ఈసారి కూడా తమ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.
PC: IPL
అయితే, వ్యక్తిగత కారణాల దృష్ట్యా అతడు ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. తన చెల్లెలు మరణం నేపథ్యంలో హర్షల్ పటేల్ బయోబబుల్‌ను వీడి ఇంటికి వెళ్లాడు. కాగా గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న హర్షల్ సోదరి ఏప్రిల్ 9న తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే ఆమె చనిపోయినట్లు జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి.
ఇదిలా ఉండగా.. తమ సహచర ఆటగాడికి కష్టకాలంలోనూ అండగా ఉంటామన్న సందేశం ఇచ్చే క్రమంలో.. ఆర్సీబీ క్రికెటర్లు సీఎస్‌కేతో మ్యాచ్ సమయంలో నల్లటి బ్యాండ్లు ధరించి సోదరభావాన్ని చాటుకున్నారు. హర్షల్ పటేల్ సోదరి మరణం నేపథ్యంలో చేతులకు బ్యాండ్లు ధరించి మైదానంలో దిగారు.
సీఎస్‌కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ స్కోర్లు:
చెన్నై: 216/4 (20)
బెంగళూరు: 193/9 (20)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: శివమ్ దూబే
చదవండి: IPL 2022 CSK Vs RCB: కెప్టెన్‌గా తొలి గెలుపు.. ఈ విజయం నా భార్యకు అంకితం: జడేజా
Comments
Please login to add a commentAdd a comment