Harshal Patel
-
చరిత్ర సృష్టించిన హర్షల్ పటేల్.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలి ప్లేయర్‌గా
ఐపీఎల్-2024 సీజన్‌కు ఎండ్ కార్డ్ పడిన సంగతి తెలిసిందే. చెపాక్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ మ్యాచ్‌తో ఈ ఏడాది క్యాష్ రిచ్ లీగ్ సీజన్ ముగిసింది. ఈ ఏడాది సీజన్ విజేతగా కోల్‌కతా నైట్‌రైడర్స్ నిలిచింది. ఇక ఇది ఇలా ఉండగా ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా టీమిండియా స్టార్, ఆర్సీబీ ఓపెనర్ విరాట్ కోహ్లి నిలవగా.. పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా పంజాబ్ కింగ్స్ స్టార్ ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ నిలిచాడు. ఈ ఏడాది సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడిన హర్షల్.. 24 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో హర్షల్ పటేల్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో రెండు సార్లు పర్పుల్ క్యాప్‌ను అవార్డును సొంతం చేసుకున్న మూడో క్రికెటర్‌గా హర్షల్ పటేల్ నిలిచాడు. ఈ జాబితాలో హర్షల్ పటేల్ భువనేశ్వర్ కుమార్, డ్వేన్ బ్రావో ఉన్నారు. భువనేశ్వర్ (2016, 2017), బ్రావో (2013, 2015) సీజన్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఈ అవార్డును గెలుచుకున్నారు. హర్షల్ పటేల్ అంతకుముందు 2021 సీజన్లో ఆర్సీబీ తరపున పర్పుల్ క్యాప్‌ను దక్కించుకున్నాడు.అదే విధంగా మరో రికార్డును కూడా పటేల్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో రెండు వేర్వేరు జట్లు తరపున పర్పుల్ క్యాప్ గెలిచిన తొలి ఆటగాడిగా హర్షల్ నిలిచాడు. -
ఐపీఎల్ 2024 అవార్డు విన్నర్లు వీరే..!
ఐపీఎల్ 2024 సీజన్ నిన్నటితో (మే 26) ముగిసింది. ఫైనల్లో కేకేఆర్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి విజేతగా ఆవిర్భవించింది. ఐపీఎల్లో కేకేఆర్‌కు ఇది మూడో టైటిల్. శ్రేయస్ అయ్యర్ కేకేఆర్‌కు పదేళ్ల నిరీక్షణ అనంతరం మరో టైటిల్‌ను అందించాడు.కేకేఆర్ పేసర్ స్టార్క్ ఫైనల్లో అద్భుతమైన గణంకాలతో సత్తా చాటి కేకేఆర్ గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. సీజన్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన సునీల్ నరైన్ మూడోసారి మోస్ట్ వ్యాల్యుబుల్ ప్లేయర్ అవార్డును గెలుచుకున్నాడు. అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా విరాట్.. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా హర్షల్ ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లను అందుకున్నారు. మరికొందరు ఆటగాళ్లు వివిధ విభాగాల్లో అవార్డులు గెలుచుకున్నారు. ఐపీఎల్ 2024 ఛాంపియన్స్- కేకేఆర్రన్నరప్- సన్‌రైజర్స్ హైదరాబాద్ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు)- విరాట్ కోహ్లి (ఆర్సీబీ, 15 మ్యాచ్‌ల్లో 741 పరుగులు)పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు)- హర్షల్ పటేల్ (పంజాబ్, 14 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు)మోస్ట్ వ్యాల్యుబుల్ ప్లేయర్- సునీల్ నరైన్ (కేకేఆర్, 14 మ్యాచ్‌ల్లో 488 పరుగులు, 17 వికెట్లు)ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్- నితీశ్ కుమార్ రెడ్డి (సన్‌రైజర్స్ హైదరాబాద్)ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్- మిచెల్ స్టార్క్ (కేకేఆర్, 3-0-14-2)ఎలెక్ట్రిక్ స్ట్రయికర్ ఆఫ్ ద సీజన్- జేక్ ఫ్రేసర్ మెక్‌గుర్క్ (ఢిల్లీ)గేమ్ ఛేంజర్ ఆఫ్ ద సీజన్- సునీల్ నరైన్ (కేకేఆర్)పర్ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ద సీజన్- రమణ్‌దీప్ సింగ్ (కేకేఆర్)ఫెయిర్ ప్లే అవార్డు- సన్‌రైజర్స్ హైదరాబాద్విన్నర్ ప్రైజ్‌మనీ- రూ. 20 కోట్లు (కేకేఆర్)రన్నరప్ ప్రైజ్‌మనీ- రూ. 12.5 కోట్లు (సన్‌రైజర్స్) -
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
ఐపీఎల్-2024లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 167 పరుగులు మాత్రమే చేసింది. సీఎస్కే బ్యాటర్లలో రవీంద్ర జడేజా 43 పరుగులు చేయగా.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(32), డార్లీ మిచెల్(30) పరుగులు చేశాడు. మరోవైపు పంజాబ్ బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్, రాహుల్ చాహర్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. అర్ష్‌దీప్ సింగ్ రెండు, సామ్ కుర్రాన్ తలా వికెట్ సాధించారు. -
టీమిండియా ఆటగాడికి ఊహించని ధర.. మరి ఇన్ని కోట్లా?
ఐపీఎల్-2024 వేలంలో టీమిండియా పేసర్ హర్షల్ పటేల్‌కు ఊహించని ధర దక్కింది. హర్షల్ పటేల్‌ను రూ.11.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. గత కొంత కాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న హర్షల్ పటేల్‌పై కోట్ల వర్షం కురవడం అందరిని ఆశ్చర్యపరిచింది. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన హర్షల్ పటేల్ కోసం గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరికి పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. కాగా గత కొన్ని సీజన్ల నుంచి ఆర్సీబీకి హర్షల్ పటేల్ ప్రాతినిథ్యం వహించాడు. అయితే ఐపీఎల్-2024 వేలానికి ముందు ఆర్సీబీ విడిచిపెట్టింది. దీంతో వేలంలోకి హర్షల్ పటేల్ వచ్చాడు. -
మనీశ్ పాండే, రచిన్‌తో పాటు అతడిని కొంటే సీఎస్కే టాప్-3లో!
ఐపీఎల్-2024 మినీ వేలానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో గెలుపు గుర్రాలను సొంతం చేసుకునేందుకు పది ఫ్రాంఛైజీలు తమ ప్రణాళికలతో సిద్ధమైపోయాయి. దుబాయ్ వేదికగా మంగళవారం జరుగనున్న ఆక్షన్‌లో గుజరాత్ టైటాన్స్ రూ. 38.15 కోట్ల మేర ఖాళీగా ఉన్న పర్సుతో బరిలోకి దిగనుండగా.. లక్నో సూపర్ జెయింట్స్ అత్యల్పంగా 13.15 కోట్లు కలిగి ఉండి ఆరు ఖాళీలను పూర్తి చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు.. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ పర్సులో రూ. 31.4 కోట్ల రూపాయలు మిగిలి ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ పర్సులో రూ. 28.95 కోట్లు, కోల్‌కతా నైట్‌రైడర్స్ పర్సులో రూ. 32.7 కోట్లు, ముంబై ఇండియన్స్ ఖాతాలో రూ. 17.75 కోట్లు, పంజాబ్ కింగ్స్ ఖాతాలో రూ. 29.1 కోట్లు, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఖాతాలో రూ. 23.25 కోట్లు, రాజస్తాన్ రాయల్స్ పర్సులో రూ. 14.5 కోట్లు , సన్‌రైజర్స్ హైదరాబాద్ పర్సులో రూ. 34 కోట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ బౌలర్ బ్రాడ్ హాగ్ సీఎస్కే గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్-2024 వేలంలో చెన్నై యాజమాన్యం ఇలాంటి వ్యూహాలు అనుసరిస్తే బాగుంటుందని పలు సూచనలు చేశాడు. మనీశ్ పాండే, హర్షల్ పటేల్‌లను కొనుక్కుంటే సీఎస్కేకు ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు.. ‘‘ఆర్సీబీతో పోటీ పడి మరీ సీఎస్కే హర్షల్ పటేల్‌ను దక్కించుకునే అవకాశం ఉంది. చెన్నై వికెట్ మీద హర్షల్ అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. ఒకవేళ వాళ్లు మనీష్ పాండే.. డారిల్ మిచెల్ లేదంటే రచిన్ రవీంద్రలలో ఒకరు.. హర్షల్ పటేల్‌లను కూడా కూడా కొనుక్కుంటే.. పాయింట్ల పట్టికలో కచ్చితంగా టాప్-3లో ఉంటుంది. ప్రస్తుతం సీఎస్కేకు మిడిలార్డర్లో రాణించగల భారత బ్యాటర్ అవసరం ఉంది. మనీశ్ పాండే ఆ లోటు భర్తీ చేయగలడు. కేవలం బ్యాటర్ మాత్రమే కాదు.. అతడొక మంచి ఫీల్డర్ కూడా! అయితే, ఇప్పటి వరకు తనలోని అత్యుత్తమ ఆటగాడిని బయటపెట్టలేదు. ఈసారి సీఎస్కే గనుక అతడికి అవకాశం ఇస్తే.. మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో కచ్చితంగా తనను తాను మరోసారి నిరూపించుకోగలడు. ఒకవేళ మనీశ్ పాండే మిడిలార్డర్లో సరైన బ్యాటర్ కాదనుకుంటే సీఎస్కే.. డారిల్ మిచెల్ వైపు చూసే అవకాశం ఉంది. లేదంటే.. రచిన్ రవీంద్రకు పెద్ద పీట వేసే అవకాశం ఉంటుంది’’ అని బ్రాడ్ హాగ్ యూట్యూబ్ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు రిటైర్ కావడంతో మిడిలార్డర్లో అతడి స్థానాన్ని సరైన ఆటగాడితో భర్తీ చేసే దిశగా సీఎస్కే ప్రణాళికలు రచిస్తోంది. చదవండి: IPL 2024: అందుకే కెప్టెన్‌గా రోహిత్‌పై వేటు.. పాండ్యావైపు మొగ్గు!? గావస్కర్ చెప్పిందిదే.. -
హర్షల్ పటేల్ పై నెటిజన్ ల తిట్ల వర్షం
-
ఆర్సీబీకి పట్టిన దరిద్రం.. ఇకనైనా అతడిని వదిలేయండి! లేదంటే మీ కర్మ!
IPL 2023- MI Vs RCB: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేసర్ హర్షల్ పటేల్ ఆట తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆర్సీబీకి పట్టిన దరిద్రం అని.. జట్టు నుంచి అతడిని తీసివేస్తేనే బాగుపడతారంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంత చెత్త బౌలర్‌ను ఎక్కడా చూడలేదని.. వచ్చే ఏడాదైనా అతడిని వదిలించుకోవాలని ఫ్రాంఛైజీకి సూచిస్తున్నారు. బంగారం కోసం వెదుకుతూ.. వజ్రం లాంటి యజువేంద్ర చహల్‌ను వదులుకున్నారంటూ చురకలు అంటిస్తున్నారు. ఈసారి కూడా ట్రోఫీ మీద ఆశలు వదిలేసుకోవాల్సిందేనని.. ఇలాంటి బౌలర్‌ను ఆడిస్తే మూల్యం చెల్లించక తప్పదంటూ పెద్ద ఎత్తున హర్షల్‌ను ట్రోల్ చేస్తున్నారు. మరోసారి విఫలం ఐపీఎల్-2023లో ఇప్పటి వరకు మొత్తంగా 11 ఇన్నింగ్స్ ఆడిన ఈ గుజరాతీ బౌలర్ 388 పరుగులు ఇచ్చి 12 వికెట్లు తీశాడు. ఎకానమీ 9.94. ఇక ముంబై ఇండియన్స్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో హర్షల్ చెత్త ప్రదర్శన కనబరిచాడు. 3.3 ఓవర్లు బౌలింగ్‌లో ఒక్క వికెట్ కూడా తీయకపోగా ఏకంగా 41 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ముంబై చేతిలో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ముంబై బ్యాటర్లు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, నేహల్ వధేరా దూకుడు నేపథ్యంలో 200 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. హర్షల్ ఒక్కడే కాదు హర్షల్ ఒక్కడే కాదు మహ్మద్ సిరాజ్(3 ఓవర్లలో 31 పరుగులు, 0 వికెట్) కూడా పూర్తిగా విఫలమయ్యాడు. వనిందు హసరంగా రెండు వికెట్లు తీసినప్పటికీ 4 ఓవర్ల కోటాలో ఏకంగా 53 పరుగులు సమర్పించుకున్నాడు. విజయ్ కుమార్ వైశాక్ సైతం చెత్తగా బౌలింగ్ చేశాడు. 3 ఓవర్లలో 37 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఇలా ఆర్సీబీ బౌలర్ల నాసికరం బౌలింగ్ కారణంగా ముంబై 16.3 ఓవర్లలోనే ముంబై లక్ష్యాన్ని ఛేదించి ప్లే ఆఫ్స్ రేసులో ముందడుగు వేసింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ బౌలర్లను సోషల్ మీడియా వేదికగా చీల్చి చెండాడుతున్న ఫ్యాన్స్.. ముఖ్యంగా హర్షల్ పటేల్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. చదవండి: ఆ నలుగురు అద్భుతం.. ఎంతటి రిస్క్‌కైనా వెనుకాడటం లేదు: రోహిత్ శర్మ Next sala cup namde without harshal patel in team @RCBTweets #MIvRCB pic.twitter.com/KwuzRXFdTS — Mr.littleboy (@chitti_babu__) May 9, 2023 1 like = 1 slap to Harshal Patel 1 retweet = 10 slap to Harshal Patel pic.twitter.com/Ptd15eUV0z — SUPRVIRAT (@ishantraj51) May 9, 2023 Harshal Patel#MIvsRCB #RCBvsMI pic.twitter.com/rF524cSO4f — Bhushan Kamble (@Vibewithbhusshh) May 9, 2023 WHAT. A. WIN! 👌 👌 A clinical chase from @mipaltan to beat #RCB & bag 2⃣ more points! 👏 👏 Scorecard ▶️ https://t.co/ooQkYwbrnL#TATAIPL | #MIvRCB pic.twitter.com/dmt8aegakV — IndianPremierLeague (@IPL) May 9, 2023 Up Above The World So High Like A Diamond His Name Is SKY 🤩#TATAIPL | #MIvRCB | @surya_14kumar | @mipaltan pic.twitter.com/EgUDqe7aao — IndianPremierLeague (@IPL) May 9, 2023 -
గతంలో ఎప్పుడూ చూడలేదు.. పర్పుల్ క్యాప్ పొందేందుకు అర్హుడు: కోహ్లి
IPL 2023 RCB Vs RR: టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తాత్కాలిక కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్-2023లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో కీలక వికెట్ తీసి మంచి బ్రేక్ అందించాడని కొనియాడాడు. గతంలో తానెప్పుడూ సిరాజ్ నుంచి ఇలాంటి ప్రదర్శన చూడలేదంటూ సిరాజ్ ఆట తీరును ప్రశంసించాడు. కోహ్లి డకౌట్.. కానీ వాళ్లిద్దరూ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో ఆర్సీబీ ఆదివారం తలపడింది. సొంత మైదానంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన విరాట్ కోహ్లి డకౌట్ కాగా.. ఫాఫ్ డుప్లెసిస్(62), గ్లెన్ మాక్స్వెల్ (77) అద్భుత ప్రదర్శనతో జట్టుకు ఈ మేర స్కోరు సాధ్యమైంది. కీలక వికెట్ కూల్చి టార్గెట్ ఛేదనలో భాగంగా రాజస్తాన్‌కు ఆరంభంలోనే షాకిచ్చాడు ఆర్సీబీ ఫాస్ట్‌బౌలర్ మహ్మద్ సిరాజ్. స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్‌ను డకౌట్ చేసి ఆర్సీబీకి శుభారంభం అందించాడు. ఇక హర్షల్ పటేల్ మూడు వికెట్లతో చెలరేగగా.. డేవిడ్ విల్లే ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయిన సంజూ శాంసన్ బృందం 182 పరుగులకే పరిమితమైంది. దీంతో ఏడు పరుగుల తేడాతో కోహ్లి సేన గెలుపొందింది. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన గ్లెన్ మాక్స్వెల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. పర్పుల్ క్యాప్ పొందేందుకు అర్హుడు ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్ కోహ్లి మాట్లాడుతూ.. ‘‘సిరాజ్ అద్భుతంగా ఆడాడు. ఆరంభంలోనే జోస్ బట్లర్ వికెట్ పడగొట్టాడు. గతంలో కంటే ఇప్పుడు మరెంతో మెరుగ్గా బౌలింగ్ చేస్తున్నాడు. కొత్త బంతితోనూ రాణిస్తున్నాడు. ఆత్మవిశ్వాసంతో.. పట్టుదలతో ఆడుతున్నాడు. హర్షల్ వల్లే పర్పుల్ క్యాప్ పొందేందుకు అతడు అన్ని విధాలా అర్హుడు. బౌలింగ్ విభాగానికి నాయకుడిగా ఎదగగలడు’’ అని సిరాజ్‌ను ప్రశంసించాడు. అదే విధంగా హర్షల్ పటేల్ డెత్ ఓవర్లలో మెరుగ్గా బౌలింగ్ చేస్తాడని.. ఈరోజు కూడా అదే పనిచేశాడంటూ అతడికి క్రెడిట్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. జోష్ హాజిల్‌వుడ్ తదుపరి మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని కోహ్లి సంకేతాలు ఇచ్చాడు. టాప్‌లో సిరాజ్ ఇక రాజస్తాన్‌తో మ్యాచ్‌లో 160 పరుగుల స్కోరుకే పరిమితమవుతామని భావించానని.. అయితే, ఫాఫ్, మాక్సీ కారణంగానే 180 పరుగులకు పైగా స్కోరు చేశామని కోహ్లి పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. రాజస్తాన్‌తో మ్యాచ్‌లో 4 ఓవర్ల కోటాలో సిరాజ్ 39 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్‌లలో 13 వికెట్లతో అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో టాప్‌నకు చేరుకున్నాడు. పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. ఇక ఆర్సీబీ విషయానికొస్తే.. ఏడింటిలో నాలుగు గెలిచి పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. చదవండి: వాళ్లంతా వేస్ట్, రహానేనే బెస్ట్.. టీమిండియాకు ఎంపిక చేయండి..! #HBD Sachin: సచిన్ క్రికెట్‌కి దేవుడైతే.. ఆ భక్తుడు ప్రత్యక్షం కావాల్సిందే! A successful last over ✅ THAT delivery to dismiss Jos Buttler 💥 Fielding brilliance in crunch situations 💪🏻 Bowling heroes from Bengaluru sum up @RCBTweets' special day at Home 👌🏻👌🏻 - By @RajalArora Full Interview 🎥🔽 #TATAIPL | #RCBvRR https://t.co/G9fuW9rBvg pic.twitter.com/qnJUCTg3P7 — IndianPremierLeague (@IPL) April 24, 2023 -
నాన్ స్ట్రయికర్ ముందుగా క్రీజ్ వదిలితే 6 పరుగులు పెనాల్టి..!
ఐపీఎల్-2023లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య నిన్న (ఏప్రిల్ 11) జరిగిన హైఓల్టేజీ మ్యాచ్ తర్వాత సీఎస్కే ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఓ ఆసక్తికర ప్రతిపాదనను తెరపైకి వచ్చింది. నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్.. బౌలర్ బంతి వేయకముందే క్రీజ్ దాటితే 6 పరుగులు పెనాల్టి విధించాలని ఆయన కోరాడు. Bishnoi was leaving his crease early. Any silly people out there still saying you shouldn't run the non-striker out? — Harsha Bhogle (@bhogleharsha) April 10, 2023 ఎల్ఎస్జే-ఆర్సీబీ మ్యాచ్‌లో హర్షల్-బిష్ణోయ్ మన్కడింగ్ ఉదంతం తర్వాత ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే చేసిన ట్వీట్‌కు స్పందిస్తూ స్టోక్స్ ఈరకంగా స్పందించాడు. బిష్ణోయ్.. బౌలర్ బంతి వేయకముందే క్రీజ్ వదిలి వెళ్లాడు. ఇంకా ఎవరైనా ఇలాంటి సందర్భంలో కూడా మన్కడింగ్ (నాన్ స్ట్రయికర్ రనౌట్) చేయొద్దని అంటారా అంటూ హర్షా ట్వీట్ చేయగా.. ఈ ట్వీట్‌కు బదులిస్తూ స్టోక్స్ పైవిధంగా స్పందించాడు. Thought’s Harsha? Umpires discretion.. 6 penalty runs if obviously trying to gain unfair advantage by leaving crease early? Would stop batters doing it without all the controversy https://t.co/xjK7Bnw0PS — Ben Stokes (@benstokes38) April 10, 2023 కాగా, నిన్నటి మ్యాచ్‌లో లక్నో గెలవాలంటే చివరి బంతికి ఒక్క పరుగు కావాల్సి తరుణంలో నాన్ స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్న రవి బిష్ణోయ్.. బౌలర్ హర్షల్ పటేల్ బంతి వేయకముందే క్రీజ్ దాటి చాలా ముందుకు వెళ్లాడు. ఇది గమనించిన హర్షల్ మన్కడింగ్ చేసి భిష్ణోయ్ను రనౌట్ చేశాడు. అయితే దీన్ని అంపైర్ పరిగణించలేదు. హర్షల్‌కు బౌల్ వేసే ఉద్ధేశం లేకపోవడంతో పాటు క్రీజ్ దాటినందుకు గానూ మన్కడింగ్‌ను అంపైర్ ఒప్పుకోలేదు. Virat Kohli mocking his own RCB teammate Harshal Patel for Mankad / Mankading. R Ashwin gonna get good sleep today. pic.twitter.com/Qnvnv1WaGZ — Chintan (@ChinTTan221b) April 10, 2023 నిబంధనల ప్రకారం బౌలర్ బౌలింగ్ చేసే ఉద్దేశం లేకపోయినా, క్రీజ్ దాటి బయటకు వెళ్లినా మన్కడింగ్ చేయడానికి వీలు లేదు. మన్కడింగ్ రూల్ ప్రకారం బౌలర్ బంతి సంధించే ఉద్దేశం కలిగి, క్రీజ్ దాటకుండా ఉంటేనే రనౌట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. మొత్తానికి హర్షల్ చివరి బంతికి మన్కడింగ్ చేయలేకపోవడంతో బిష్ణోయ్ బ్రతికిపోయాడు. ఆతర్వాత ఆఖరి బంతికి బై రూపంలో పరుగు రావడంతో లక్నో వికెట్ తేడాతో విజయం సాధించింది. -
అయ్యో హర్షల్.. ఆ పని ముందే చేయాల్సింది! అలా జరిగి ఉంటేనా! వీడియో వైరల్
ఐపీఎల్-2023లో లక్నో సూపర్ జెయింట్స్ సంచలన విజయం నమోదు చేసింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఆర్సీబీతో ఆఖరి వరకు నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన మ్యాచ్‌లో లక్నో ఒక్క వికెట్ తేడాతో గెలిపొందింది. 213 పరుగుల భారీ లక్ష్యాన్ని 9 వికెట్లు కోల్పోయి రాహుల్ సేన చేధించింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక టార్గెట్‌ను ఛేధించిన నాలుగో జట్టుగా లక్నో నిలిచింది. కాగా 213 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన లక్నో ఆరంభంలో తడబడింది. 23 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడింది. ఈ క్రమంలో స్టోయినిష్(65), పూరన్(62) మెరుపు ఇన్నింగ్స్‌లతో లక్నో శిబరంలో గెలుపు ఆశలను రేకెత్తించాడు. అయితే 18 ఓవర్ వేసిన సిరాజ్ బౌలింగ్‌లో పూరన్ ఓ భారీ షాట్‌కు ప్రయత్నించి తన వికెట్ కోల్పోయాడు. దీంతో ఆట ఆఖరిలో హై డ్రామా చోటు చేసుకుంది. ఆట చివర్లో అలా... పూరన్ అవుటైన సమయంలో లక్నో స్కోరు 189/6. మరో 18 బంతుల్లో 24 పరుగులు చేయాలి. కానీ తర్వాతి ఆట మొత్తం మలుపులతో సాగింది. 9 బంతుల్లో 7 పరుగులు చేయాల్సిన సురక్షిత స్థితిలో పార్నెల్ బౌలింగ్‌లో బదోని స్కూప్ షాట్‌తో బంతిని సిక్సర్‌గా మలచడంతో లక్నో సంబరపడింది. కానీ అతని బ్యాట్ స్టంప్స్‌కు తాకడంతో బదోని వెనుదిరగాల్సి వచ్చింది. చివరి ఓవర్లో 5 పరుగులు సునాయాసంగానే అనిపించినా హర్షల్ 5 బంతుల్లో 2 వికెట్లు తీశాడు. స్కోర్లు సమం కాగా, లక్నో విజయానికి చివరి బంతికి ఒక పరుగు కావాలి. అయితే బంతి వేయకముందే బిష్ణోయ్ క్రీజు దాటి ముందుకు వెళ్లడంతో హర్షల్ ‘మన్కడింగ్’కు ప్రయతి్నంచాడు. కానీ బంతి స్టంప్స్‌ను తాకలేదు. దాంతో రనౌట్ కోసం త్రో చేశాడు. స్టంప్స్ ఎగిరినా, నిబంధనల ప్రకారం అలా రెండు సార్లు చేయడం కుదరదని అంపైర్ చెప్పేశాడు. దాంతో బిష్ణోయ్ నాటౌట్‌గా తేలాడు. చివరి బంతిని అవేశ్ ఆడలేకపోగా, కీపర్ దినేశ్ కార్తీక్ కూడా తడబడి దానిని నేరుగా అందుకోవడంలో విఫలమయ్యాడు. అతను త్రో చేసేలోగా బిష్ణోయ్ ఆ వైపు, అవేశ్ ఈ వైపునకు వచ్చేశారు! దాంతో లక్నో జట్టు ఆనందాన్ని ఆపడం ఎవరితరం కాలేదు. చదవండి: IPL 2023 Dinesh Karthik: ఎంత పనిచేశావు కార్తీక్.. లేదంటేనా? అయ్యో ఆర్సీబీ! వీడియో వైరల్ Virat Kohli mocking his own RCB teammate Harshal Patel for Mankad / Mankading. R Ashwin gonna get good sleep today. pic.twitter.com/Qnvnv1WaGZ — Chintan (@ChinTTan221b) April 10, 2023 -
మెరిసిన అశ్విన్, హర్షల్.. టీమిండియా టార్గెట్ 169
టి20 ప్రపంచకప్‌కు సన్నాహకంగా గురువారం వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా వెటరన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ మెరిశాడు. భారీ స్కోరు ఖాయమనుకున్న దశలో అశ్విన్ మూడు వికెట్లు, హర్షల్ పటేల్ రెండు వికెట్లతో చెలరేగి వెస్ట్రన్ ఆస్ట్రేలియాను కట్టడి చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో వెస్ట్రన్ ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. నిక్ హాబ్సన్ 64 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. డీ ఆర్సీ షార్ట్ 52 పరుగులు చేశాడు. వీరిద్దరు కలిసి రెండో వికెట్‌కు 110 పరుగులు జోడించారు. ఈ జోడిని విడదీసేందుకు కెప్టెన్ కేఎల్ రాహుల్ చాలా ప్రయత్నాలు చేశాడు. చివరికి హర్షల్ పటేల్ బౌలింగ్‌లో నిక్ హాబ్సన్ అక్షర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో వెస్ట్రన్ ఆస్ట్రేలియా 125 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే డీఆర్సీ షార్ట్ రనౌట్‌గా వెనుదిరగడంతో మూడో వికెట్ నష్టపోయింది. ఇక అక్కడి నుంచి వెస్ట్రన్ ఆస్ట్రేలియా పరుగులు చేయడంలో నానా ఇబ్బందులు పడింది. ఆ తర్వాత బ్యాటర్స్ పెద్దగా రాణించలేకపోయారు. చివర్లో మాథ్యూ కెల్లీ 15 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. టీమిండియా బౌలర్లో అశ్విన్ మూడు, హర్షల్ పటేల్ 2, హర్ష్‌దీప్ సింగ్ ఒక వికెట్ తీశాడు. చదవండి: IND vs Western AUS: కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో రోహిత్ శర్మ.. -
T20 WC: మరీ ఇంత దారుణమా? టీమిండియా ట్రోఫీ గెలవడం కష్టమే!
T20 World Cup 2022- Team India: టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో టీమిండియా విజయావకాశాలపై భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత బౌలింగ్ విభాగం బలహీనంగా ఉందని.. ఇలాంటి జట్టుతో ట్రోఫీ గెలవడం కష్టమేనని పేర్కొన్నాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో మొదటి టీ20లో 208 పరుగుల భారీ స్కోరు చేసి కూడా మ్యాచ్ కాపాడుకోలేకపోయారని విమర్శించిన ఆకాశ్ చోప్రా.. టీమిండియా బౌలర్ల ఆట తీరు ఇలాగే ఉంటే మెగా టోర్నీలో ముందుకు వెళ్లడం కష్టమేనని అభిప్రాయపడ్డాడు. కాగా అక్టోబరు 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్-2022 ఈవెంట్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. చెత్త ఫీల్డింగ్, బౌలింగ్! ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్ ఆరంభానికి ముందు స్వదేశంలో ఆసీస్, దక్షిణాఫ్రికాతో టీమిండియా వరుస సిరీస్‌లు ఆడుతోంది. ఇందులో భాగంగా కంగారూలతో తొలి టీ20లో 208 పరుగులు చేసిన టీమిండియా.. చెత్త ఫీల్డింగ్, బౌలర్ల వైఫల్యం కారణంగా 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. అదే విధంగా.. ఆసియా కప్-2022లో సూపర్-4 దశలో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో సైతం టీమిండియా బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. దీంతో 5 వికెట్ల తేడాతో ఓడిపోయిన రోహిత్ సేన.. ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఆ తర్వాత శ్రీలంకతో మ్యాచ్‌లోనూ ఓడి ఫైనల్ కూడా చేరకుండానే నిష్క్రమించింది ఈ డిఫెండింగ్ చాంపియన్. కాగా గాయం కారణంగా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, మరో ఫాస్ట్‌బౌలర్ హర్షల్ పటేల్ ఈ టోర్నీకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, వీరిద్దరు టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నారు. వీళ్లతో ట్రోఫీ గెలవడం కష్టమే ఈ పరిణామాల నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ బౌలర్ల వైఫల్యాన్ని ఎత్తి చూపాడు. ముఖ్యంగా యజువేంద్ర చహల్ ఆట తీరుపై పెదవి విరిచాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ... ‘‘నా అభిప్రాయం ప్రకారం.. టీమిండియా బౌలింగ్ విభాగం బలహీనంగా ఉంది. వికెట్లు తీసే బౌలర్ ఒక్కరూ కనబడటం లేదు. లెగ్ స్పిన్నర్ యుజీ చహల్ ఫాస్ట్‌గా బౌలింగ్ చేస్తున్నాడు. ఆసియా కప్‌లోనూ ఇలాగే ఆడాడు. స్లోవర్ బాల్స్ వేయకుండా అతడు వికెట్లు ఎలా తీస్తాడు? ఇక ఇప్పుడేమో హర్షల్, బుమ్రా జట్టులోకి తిరిగి వచ్చారని.. అంతా బాగుంటుందని సంబరపడిపోతున్నారు. కానీ నాకెందుకు పరిస్థితులు సానుకూలంగా ఉన్నట్లు కనిపించడం లేదు. బాధగా అనిపించినా ఇదే నిజం. ఐపీఎల్లో బుమ్రా ముంబై ఇండియన్స్ జట్టు తరఫున ఈసారి మరీ అంత గొప్పగా ఏమీ ఆడలేదు. ఒక్క మ్యాచ్‌లో ఐదు లేదంటే ఆరు వికెట్లు తీసి మిగతా మ్యాచ్‌లలో చేతులు ఎత్తేయడం సరికాదు కదా! మన బౌలింగ్ బలహీనంగా ఉందనేది వాస్తవం. ఇలాంటి ఆట తీరుతో మనం ట్రోఫీ ఎలా గెలవగలం? రోజురోజుకీ మన విజయావకాశాలు సన్నగిల్లుతున్నాయి’’ అని పేర్కొన్నాడు. చదవండి: భారత్, ఇంగ్లండ్, పాకిస్తాన్ కాదు.. టీ20 ప్రపంచకప్ విజేత ఆ జట్టే: భారత మాజీ ఆటగాడు -
ఇలాంటి ఫీల్డింగ్, బౌలింగ్‌తో కష్టమే.. కప్ కాదు కదా కనీసం!
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టి20లో టీమిండియా చెత్త ఫీల్డింగ్, బౌలింగ్‌తో తగిన మూల్యం చెల్లించుకుంది. ఆస్ట్రేలియా బ్యాటర్లు ఇచ్చిన మూడు సులువైన క్యాచ్‌లను టీమిండియా ఆటగాళ్లు నేలపాలు చేయడం కొంపముంచింది. ఆ తర్వాత వికెట్లు పడి మ్యాచ్ భారత్ చేతిలోకి వచ్చినప్పటికి భువనేశ్వర్, హర్షల్ పటేల్‌లు తమ చెత్త బౌలింగ్‌తో చేజేతులా టీమిండియాను ఓడిపోయేలా చేశారు. భువనేశ్వర్ అయితే మరీ దారుణంగా బౌలింగ్ చేశాడు. 4ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయని భువీ ఏకంగా 52 పరుగులు సమర్పించుకున్నాడు. అంతకముందు హర్షల్ పటేల్ కూడా దారుణంగా విఫలమయ్యాడు. 4 ఓవర్లలో 49 పరుగులిచ్చి ఒక్క వికెట్ తీయలేదు. ఇక ఫ్రంట్‌లైన్ స్పిన్నర్‌గా జట్టులోకి వచ్చిన చహల్ 3.2 ఓవర్లలోనే 42 పరుగులిచ్చి ఒక వికెట్ మాత్రమే తీశాడు. ఇక ఆల్‌రౌండర్‌గా జట్టులోకి వచ్చిన అక్షర్ పటేల్ బ్యాటింగ్‌లో విఫలమైనప్పటికి.. బౌలింగ్ మాత్రం బాగా వేశాడు. ఒక దశలో టీమిండియా చేతుల్లోకి మ్యాచ్ వచ్చిందంటే అదంతా అక్షర్ పటేల్ చలవే. అక్షర్ ఒక్కడే 4 ఓవర్లలో 17 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. గుడ్డిలో మెల్ల అన్నట్లుగా టీమిండియా తరపున టి20లు ఆడి చాలా కాలమైనప్పటికి.. ఉమేశ్ యాదవ్ 2 ఓవర్లలో 27 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. అసలు ఫ్రంట్‌లైన్ పేసర్‌గా ఉన్న ఉమేశ్ యాదవ్‌ను రెండు ఓవర్లకే పరిమితం చేయడంలో రోహిత్ శర్మ అంతరం ఏంటో అర్థం కాలేదు. వాస్తవానికి తొలి ఓవర్లో ఉమేశ్ భారీగా పరుగులు ఇచ్చుకున్నప్పటికి.. ఆ తర్వాతి ఓవర్లో సూపర్ బౌలింగ్ వేశాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి మ్యాచ్‌ను భారత్ చేతుల్లోకి తెచ్చాడు. ఆ తర్వాత ఉమేశ్ మళ్లీ బౌలింగ్‌కు రాకపోవడం గమనార్హం. ఇక ఫీల్డింగ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మూడు విలువైన క్యాచ్‌లు టీమిండియాను విజయానికి దూరం చేశాయి. అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హర్షల్ పటేలు సులవైన క్యాచ్‌లు వదిలేసి మూల్యం చెల్లించుకున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే మాత్రం టీమిండియా ఆసీస్‌కు సిరీస్‌ను కోల్పోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. అంతేకాదు ఇలాంటి ఫీల్డింగ్, బౌలింగ్ వనరులతో టి20 ప్రపంచకప్‌కు వెళితే కప్ కాదు కదా.. తొలి రౌండ్‌ను దాటడం కూడా కష్టమే. అయితే బుమ్రా, షమీ రూపంలో ఇద్దరు నాణ్యమైన పేసర్లు అందుబాటులో లేకపోవడం కూడా టీమిండియాకు దెబ్బే అని చెప్పొచ్చు. అయితే వచ్చే టి20కి షమీ, బుమ్రాలలో ఒకరు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. చదవండి: 'సరైన బౌలర్లు లేరు.. అందుకే ఓడిపోయాం' -
T20 WC: నేనైతే వాళ్లిద్దరిని సెలక్ట్ చేసేవాడిని! నువ్వొక మాజీ కెప్టెన్.. కానీ ఏం లాభం?
T20 World Cup 2022- India Squad: టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించిన జట్టుపై టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ పెదవి విరిచాడు. శ్రేయస్ అయ్యర్, మహ్మద్ షమీలను వరల్డ్‌కప్ జట్టుకు ఎంపిక చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు. తానైతే దీపక్ హుడా స్థానంలో అయ్యర్‌కు.. హర్షల్ పటేల్ స్థానంలో షమీకి చోటు ఇస్తానని పేర్కొన్నాడు. కొన్ని మార్పులు మినహా అంతా వాళ్లే! కాగా యువ పేసర్ ఆవేశ్ ఖాన్‌పై వేటు వేయడం సహా.. గాయంతో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా దూరమైన నేపథ్యంలో ఆసియా కప్-2022 ఈవెంట్ ఆడిన జట్టునే ప్రపంచకప్‌నకు సెలక్ట్ చేసింది బీసీసీఐ. గాయం నుంచి కోలుకున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ సహా అక్షర్ పటేల్ కొత్తగా జట్టులోకి వచ్చారు. ప్రధాన జట్టుకు ఎందుకు ఎంపిక చేయలేదు! ఇక షమీ, శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయి, దీపక్ చహర్ స్టాండ్ బై ప్లేయర్లుగా ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో ట్విటర్ వేదికగా స్పందించిన అజారుద్దీన్.. శ్రేయస్ అయ్యర్, షమీని ప్రధాన జట్టుకు ఎంపిక చేయకపోవడం పట్ల విస్మయం వ్యక్తం చేశాడు. వాళ్లిద్దరి అవకాశం ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డాడు. అయితే, చాలా మంది నెటిజన్లు అజారుద్దీన్‌తో ఏకీభవించడం లేదు. నువ్వొక మాజీ కెప్టెన్‌వి.. కానీ! గత టీ20 ప్రపంచకప్ టోర్నీలో షమీ ఆట తీరును.. ఆస్ట్రేలియా పిచ్‌లపై శ్రేయస్ అయ్యర్ విఫలమైన విషయాన్ని గుర్తు చేస్తూ అజారుద్దీన్‌ను ట్రోల్ చేస్తున్నారు. ‘‘నువ్వొక మాజీ కెప్టెన్‌వి.. కానీ నీకు ఈ విషయాలు తెలియవు. గతేడాది టీ20 వరల్డ్‌కప్‌లో షమీ ఎకానమీ ఎంతో తెలియదు. అతడు ఎన్ని వికెట్లు పడగొట్టాడో తెలియదు. ఇక శ్రేయస్ అయ్యర్ షార్ట్ పిచ్ బంతులను ఆడటంలో విఫలమవుతున్నాడనీ తెలియదు. అసలే ఈ ఐసీసీ టోర్నీ జరిగేది ఆస్ట్రేలియాలో! కనీసం ఈ విషయమైనా నీకు గుర్తున్నట్లు లేదు! ఇది టీ20 ఫార్మాట్ సర్. దీపక్ హుడా ఆల్‌రౌండర్. అవసరమైనపుడు బౌలింగ్ కూడా చేయగలడు. అయినా.. ‘కెప్టెన్’ నువ్వు ఏ ప్రాతిపదికన ఈ కామెంట్ చేశావు’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. షమీ అప్పుడు నిరాశపరిచినా.. ఐపీఎల్-2022లో.. కాగా టీ20 ప్రపంచకప్-2021లో షమీ కేవలం ఆరు వికెట్లు తీసిన విషయం తెలిసిందే. అయితే, ఐపీఎల్-2022లో మాత్రం గుజరాత్ టైటాన్స్ తరఫున అద్భుత ప్రదర్శన కనబరిచాడు. మొత్తంగా 16 మ్యాచ్‌లు ఆడిన షమీ 20 వికెట్లతో రాణించి తమ జట్టును విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. కానీ.. పొట్టి ఫార్మాట్‌కు షమీ సూట్ కాడన్న అభిప్రాయాల నేపథ్యంలో అతడిని స్టాండ్ బైగా ఎంపిక చేయడం గమనార్హం. ఇక దీపక్ హుడా బ్యాటర్‌గా రాణించడంతో పాటు స్పిన్ బౌలింగ్ చేయగలడు కూడా! చదవండి: నువ్వేమి చేశావు నేరం.. శాంసన్‌ను ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేయకపోవడంపై ఫ్యాన్స్ విచారం క్రికెట్ సౌతాఫ్రికాకు భారీ షాక్ Surprised at the omission of Shreyas Iyer and Md. Shami from the main squad. https://t.co/GOKUzRyMot — Mohammed Azharuddin (@azharflicks) September 12, 2022 Shreyas Iyer instead of Deepak Hooda and Md. Shami in the place of Harshal Patel would be my choice. — Mohammed Azharuddin (@azharflicks) September 12, 2022 Then please teach Iyer how to play short ball becase in Australian bouncy pitches, he cant survive — Ankit Singh (@ankittfit) September 12, 2022 You are just outdated and shami had never been a good T20 bowler. Deepak hooda can bowl pls be aware what is T20 format — Arunkumar06 (@Arunkumar064) September 12, 2022 This man captained India... I don't even know how to react! — Gagan Chawla (@toecrushrzzz) September 12, 2022 -
టీమిండియా ఎంపికకు ముహూర్తం ఖరారు.. హర్షల్ ఫిట్, బుమ్రా ఔట్..!
వచ్చే నెల (అక్టోబర్) 16 నుంచి ప్రారంభంకానున్న టీ20 వరల్డ్‌కప్ కోసం భారత జట్టు ఎంపికకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. 15 మంది సభ్యులతో కూడిన టీమిండియాను సెప్టెంబర్ 16న ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ప్రధాన పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ గాయాలపై ఎలాంటి అధికారిక అప్డేట్ అందకపోవడంతో జట్టు ప్రకటన ఆలస్యమైనట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఎన్సీఏలో ఉంటున్న బుమ్రా, హర్షల్ పటేల్‌కు మరోసారి ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించాలని బీసీసీఐ భావిస్తుంది. ఒకవేళ బుమ్రా, హర్షల్ ఫిట్నెస్ పరీక్షలో విఫలమైతే వారిని పక్కకు కూర్చోబెట్టడం ఖాయమని సెలక్షన్ కమిటీ ముఖ్యుడొకరు తెలిపారు. అతడందించిన సమాచారం మేరకు.. హర్షల్ పటేల్ ఫిట్నెస్ సాధించాడని తెలుస్తోంది. బుమ్రా విషయమే ఎటూ తేలడం లేదని, మునపటిలా అతను వేగంగా బౌలింగ్ చేయలేకపోతున్నాడని సమాచారం. బుమ్రా ఫిట్నెస్ పరీక్షలో విఫలమైతే అతని స్థానంలో మహ్మద్ షమీ జట్టులోకి రావడం ఖాయమని తెలుస్తోంది. టీ20 వరల్డ్‌కప్ కోసం ప్రకటించే టీమిండియాలో తప్పక ఉంటాడనుకున్న రవీంద్ర జడేజా ఇదివరకే గాయం కారణంగా జట్టుకు దూరం కాగా.. తాజాగా బుమ్రా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదన్న సమాచారం టీమిండియాను మరింత కలవరపెడుతుంది. చదవండి: సెంచరీ చేయకుండా మూడేళ్లు కొనసాగడం కోహ్లికే సాధ్యమైంది..! -
టీమిండియాకు భారీ షాక్... గాయంతో స్టార్ బౌలర్ ఔట్..!
Harshal Patel: ప్రస్తుతం విండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతున్న టీమిండియాకు భారీ షాక్ తగిలింది. స్టార్ బౌలర్ హర్షల్ పటేల్ మిగతా రెండు మ్యాచ్‌లతో పాటు త్వరలో ప్రారంభంకానున్న ఆసియా కప్‌కు (ఆగస్ట్ 27) దూరం కానున్నట్లు సమాచారం. పక్కటెముకల గాయంతో బాధపడుతున్న హర్షల్.. మరో మూడు నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండాలని వైద్యులు సూచించినట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే హర్షల్.. ఆసియా కప్‌తో పాటు టీ20 వరల్డ్‌కప్‌కు (అక్టోబర్‌లో ప్రారంభం) కూడా అందుబాటులో ఉండే అవకాశం లేదు. Harshal Patel set to miss Asia Cup and doubtful for T20 World Cup. (Reported by Cricbuzz). — Mufaddal Vohra (@mufaddal_vohra) August 6, 2022 టీ20 స్పెషలిస్ట్‌గా ఇప్పుడిప్పుడే ఎదుగుతూ, వరల్డ్‌కప్ జట్టులో చోటు ఖాయం అనుకున్న తరుణంలో గాయం బారిన పడటం హర్షల్‌తో పాటు టీమిండియాకు కూడా గట్టి ఎదురుదెబ్బేనని చెప్పాలి. హర్షల్ గాయపడటంతో అతని స్థానాన్ని దీపక్ చహర్‌తో భర్తీ చేసే అవకాశం ఉంది. డెత్ ఓవర్లలో కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో పాటు కీలక సమయాల్లో బ్యాట్‌తోనూ రాణించే సత్తా ఉన్న హర్షల్.. టీమిండియా తరఫున 17 మ్యాచ్‌ల్లో 23 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే, ఆసియాకప్ కోసం భారత జట్టును ఈనెల 8న (ఆగస్ట్) ప్రకటించే అవకాశం ఉంది. చదవండి: 'కోహ్లి, హసన్ అలీ ఒకేలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు' -
హర్షల్ ఆల్‌రౌండ్ షో.. రెండో మ్యాచ్‌లోనూ టీమిండియాదే విజయం
ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా ఓ పక్క టెస్ట్ మ్యాచ్‌లో చెలరేగి ఆడుతుంటే, మరో పక్క యువ భారత జట్టు టీ20ల్లో దుమ్మురేపుతోంది. డెర్బీషైర్‌తో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన యువ భారత్.. నార్తంతాంప్టన్షైర్ క్లబ్‌తో జరిగిన రెండో వార్మప్ మ్యాచ్‌లోనూ సత్తా చాటింది. నిన్న జరిగిన ఈ మ్యాచ్‌లో డీకే సారధ్యంలోని యంగ్ ఇండియా 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేసినప్పటికీ.. నామమాత్రపు స్కోర్‌ను డిఫెండ్ చేసుకోవడంలో భారత బౌలర్లు సఫలమయ్యారు. టాపార్డర్ బ్యాటర్లు దారుణంగా విఫలం కాగా.. కెప్టెన్ డీకే (26 బంతుల్లో 34; 3 ఫోర్లు, సిక్స్), హర్షల్ పటేల్ (36 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) టీమిండియాను ఆదుకున్నారు. నార్తంతాంప్టన్ బౌలర్లలో బ్రాండన్ గ్లోవర్ 3, బక్, ఫ్రెడ్డీ హెల్డ్రిచ్ తలో 2 వికెట్లు, కాబ్ ఓ వికెట్ పడగొట్టారు. ఛేదనలో భారత బౌలర్లు విజృంభించడంతో నార్తంతాంప్టన్ 19.3 ఓవర్లలో 139 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. ఆ జట్టులో సైఫ్ జైబ్ 33 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలువగా.. మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, ఆవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, చహల్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ప్రసిద్ధ్ కృష్ణ, వెంకటేశ్ అయ్యర్ చెరో వికెట్ దక్కించుకున్నారు. హర్షల్ పటేల్ ఆల్‌రౌండర్ షోతో (54, 2/23) టీమిండియా వరుసగా రెండో టీ20లోనూ విజయం సాధించింది. చదవండి: వారెవ్వా... కెప్టెన్ బుమ్రా -
డెత్ ఓవర్లంటే చాలా భయం.. కానీ అదే నాకిష్టం
ఐపీఎల్ 2022 సీజన్లో ఆర్సీబీ క్వాలిఫయర్-2కు చేరుకున్న సంగతి తెలిసిందే. బుధవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆర్సీబీ బౌలర్ హర్షల్ పటేల్ ఇన్నింగ్స్ 18వ ఓవర్ సూపర్ బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్లో తొలి రెండు బంతులు వైడ్ వేసినప్పటికి ఒత్తిడిని దరి చేరనీయకుండా సూపర్ స్పెల్ వేశాడు. రెండు వైడ్లు సహా కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చిన హర్షల్ కీలకమైన స్టోయినిస్ వికెట్‌ను పడగొట్టి ఆర్సీబీకి ఊరటనిచ్చాడు. ఒక రకంగా ఆర్సీబీ మ్యాచ్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకుంది ఈ ఓవర్లోనే అని చెప్పొచ్చు. ఆర్సీబీ ఫ్రంట్‌లైన్ బౌలర్‌గా ఉన్న హర్షల్.. లక్నోతో మ్యాచ్ తర్వాత డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గానూ పేరు సంపాదించాడు. కాగా మ్యాచ్ విజయం అనంతరం హర్షల్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ''డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడం ఎప్పుడు ఒత్తిడిని కలిగిస్తుంది. కానీ ఆ ఒత్తిడి అంటేనే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఒక బౌలర్లో నెర్వస్‌లో సూపర్ బౌలింగ్ చేయడం ముఖ్యం. దానిని ఇవాళ లక్నోతో మ్యాచ్‌లో సాధించాను. గత రెండు- మూడేళ్లుగా హర్యానా తరపున డెత్ ఓవర్లలో బౌలింగ్ చేస్తూ బాగా రాటుదేలాను. అలాంటి సందర్భాలను ఐపీఎల్‌లోనూ కొనసాగించాలనుకున్నా. కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆ అవకాశం వచ్చింది. మ్యాచ్ ఓడిపోతే ఇంటిబాటే అన్న సందర్భంలో బౌలింగ్ చేయడం సవాల్‌తో కూడుకున్నది. ఇలాంటి చాలెంజ్‌లను సమర్థంగా స్వీకరిస్తా. వచ్చే సౌతాఫ్రికా సిరీస్‌కు భువనేశ్వర్‌తో కలిసి కొత్త బంతిని పంచుకోవడానికి ఉత్సాహంగా ఉన్నా'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక లక్నో సూపర్ జెయింట్స్‌పై 14 పరుగుల తేడాతో గెలిచిన ఆర్సీబీ క్వాలిఫయర్-2కు చేరుకుంది. మే 27(శుక్రవారం) రాజస్తాన్ రాయల్స్‌తో ఆర్సీబీ క్వాలిఫయర్-2లో అమితుమీ తేల్చుకోనుంది. చదవండి: IPL 2022 LSG Vs RCB: 'వడ్ల బస్తా మోసుకెళ్లినట్లు సింపుల్‌గా'.. కోహ్లి రియాక్షన్ వైరల్ కార్తీక్ క్యాచ్‌ను విడిచి పెట్టిన రాహుల్.. గంభీర్ రియాక్షన్ ఇదే -
IPL 2022: గత సీజన్లో అదరగొట్టారు.. కోట్లు కొట్టేశారు.. ఈసారి అట్టర్ ఫ్లాఫ్!
IPL 2022: ఐపీఎల్ లాంటి టీ20 టోర్నమెంట్లో ఎప్పుడు ఎవరు అదరగొడుతారు? ఎప్పుడు ఎవరు డీలా పడతారు? ఏ జట్టు పైచేయి సాధిస్తుందన్న విషయాలను అంచనా వేయడం కాస్త కష్టమే! ఐదుసార్లు చాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ ఈసారి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలవగా.. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఇక ఈ విషయం కాసేపు పక్కన పెడితే.. పొట్టి ఫార్మాట్లో ఫామ్‌ను కొనసాగిస్తూ ముందుకు సాగటం కొంతమంది ఆటగాళ్లకు మాత్రమే సాధ్యమవుతుంది. ఒక సీజన్లో అదరగొట్టిన వాళ్లు.. మరో ఎడిషన్‌లో ఏమాత్రం ప్రభావం చూపకపోవచ్చు. లేదంటే ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆసీస్ డేవిడ్ వార్నర్‌లా గతంలో ఫామ్‌లేమితో ఇబ్బంది పడిన వాళ్లు తిరిగి విజృంభించనూ వచ్చు. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2021లో అదరగొట్టి.. 2022 ఎడిషన్‌లో చతికిలపడ్డ టాప్-5 ఆటగాళ్లు ఎవరో ఓసారి గమనిద్దాం. PC: IPL/BCCI మయాంక్ అగర్వాల్ పంజాబ్ కింగ్స్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్ ఐపీఎల్-2021లో అదరగొట్టే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 12 ఇన్నింగ్స్‌లలో కలిపి 441 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్ధ శతకాలు ఉండటం విశేషం. ఇక పంజాబ్ తరఫున గత ఎడిషన్‌లో అత్యధిక పరుగులు సాధించిన రెండో బ్యాటర్‌గా మయాంక్ నిలిచాడు. అయితే, తాజా సీజన్లో పరిస్థితులు మారాయి. 12 కోట్ల రూపాయలకు రిటైన్ చేసుకుని పంజాబ్ కెప్టెన్‌గా అతడిని నియమించింది ఫ్రాంఛైజీ. కానీ కెప్టెన్సీ భారం మోయలేక మయాంక్ చేతులెత్తేశాడు. బ్యాటర్‌గానూ విఫలమయ్యాడు. ఐపీఎల్-2022లో ఆడిన 12 మ్యాచ్‌లలో కలిపి 195 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మయాంక్ సారథ్యంలో పంజాబ్ కింగ్స్ పెద్దగా రాణించింది కూడా లేదు. ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్‌లలో కేవలం ఆరు గెలిచి ఏడో స్థానంలో ఉంది. PC: IPL/BCCI వెంకటేశ్ అయ్యర్ దేశవాళీ క్రికెట్లో అదరగొట్టిన మధ్యప్రదేశ్ యువ ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. గత సీజన్ రెండో అంచెలో వరుస అవకాశాలు దక్కించుకున్న వెంకటేశ్.. 10 ఇన్నింగ్స్‌లలో 370 పరుగులు చేశాడు. ఈ క్రమంలో టీమిండియాలోనూ చోటు దక్కించుకున్నాడు. హార్దిక్ పాండ్యా స్థానాన్ని భర్తీ చేయగల ఆల్‌రౌండర్‌గా ప్రశంసలు అందుకున్నాడు. కానీ ఐపీఎల్-2022లో అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోయాడు. వరుస వైఫల్యాలతో ఒకానొక సమయంలో తుది జట్టులో చోటు కోల్పోయాడు. ఇక మొత్తంగా ఈ సీజన్లో 12 ఇన్నింగ్స్ ఆడిన అతడు కేవలం 182 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 50 నాటౌట్. తనను రిటైన్ చేసుకునేందుకు ఫ్రాంఛైజీ ఖర్చు చేసిన 8 కోట్లకు న్యాయం చేయలేకపోయాడు. PC: IPL/BCCI కీరన్ పొలార్డ్ వెస్టిండీస్ బ్యాటర్, ముంబై ఇండియన్స్ హిట్టర్ కీరన్ పొలార్డ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 2010 నుంచి ముంబై జట్టు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ విండీస్ మాజీ కెప్టెన్ గత సీజన్లో 245 పరుగులు చేశాడు. చెన్నైపై సంచలన ఇన్నింగ్స్(34 బంతుల్లో 87 పరుగులు నాటౌట్) ఆడాడు. కట్ చేస్తే ఐపీఎల్-2022లో పరిస్థితి తలకిందులైంది. 6 కోట్లకు ముంబై రిటైన్ చేసుకుంటే స్థాయికి తగ్గట్లు రాణించలేక అతడు డీలా పడ్డాడు. ఆడిన 11 మ్యాచ్‌లలో కలిపి పొలార్డ్ చేసిన స్కోరు 144. ఇక వరుసగా పొలార్డ్ నిరాశపరిచిన నేపథ్యంలో యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే తలంపుతో అతడిని తుది జట్టు నుంచి తప్పించారు. PC: IPL/BCCI హర్షల్ పటేల్ గత ఐపీఎల్ ఎడిషన్‌లో అదరగొట్టే ప్రదర్శనతో పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్. ఆడిన 15 మ్యాచ్‌లలో 8.14 ఎకానమీతో 32 వికెట్లు పడగొట్టి ‘పర్పుల్’ పటేల్ అని కితాబులందుకున్నాడు. ఆర్సీబీని ప్లే ఆఫ్స్ చేర్చడంలో హర్షల్ కీలక పాత్ర పోషించాడు. అయితే, రిటెన్షన్‌లో వదిలేసిన్పటికీ మెగా వేలంలో ఆర్సీబీ అతడ కోసం 10.75 కోట్లు వెచ్చించింది. కానీ తాజా సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. 12 మ్యాచ్‌లలో అతడు తీసినవి 18 వికెట్లు. గతేడాది పోలిస్తే ఈసారి పెద్దగా రాణించలేదనే చెప్పాలి. PC: IPL/BCCI వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గత ఐపీఎల్ సీజన్లో 17 వికెట్లు పడగొట్టాడు. వరుణ్ అద్భుత ప్రదర్శనతో యూఏఈ వేదికగా సాగిన రెండో అంచెలో కోల్‌కతా నైట్‌రైడర్స్ అదరగొట్టింది. ఏకంగా ఫైనల్ చేరి రన్నరప్‌గా నిలిచింది. ఈ క్రమంలో ఐపీఎల్-2022 మెగా వేలం నేపథ్యంలో వరుణ్‌ను 8 కోట్లకు రిటైన్ చేసుకుంది కేకేఆర్. కానీ అతడు ధరకు తగ్గ న్యాయం చేయలేకపోయాడు. దీంతో తుదిజట్టు నుంచి తప్పించి హర్షిత్ రాణా వంటి కొత్త ఆటగాళ్లకు అవకాశమిచ్చారు. ఐపీఎల్-2022లో వరుణ్ చక్రవర్తి 11 ఇన్నింగ్స్‌లో కలిపి తీసిన వికెట్ల సంఖ్య- 6. చదవండి👉🏾IPL 2022: సన్‌రైజర్స్ చేసిన అతిపెద్ద తప్పిదం అదే.. అందుకే ఇలా: సెహ్వాగ్ చదవండి👉🏾IPL 2022: యార్కర్లతో అదరగొట్టాడు.. చివరి మ్యాచ్‌లోనైనా అవకాశమివ్వండి! -
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్.. భారత యువ పేసర్ దూరం..!
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. భారత యువ పేసర్ హర్షల్ పటేల్ గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఐపీఎల్- 2022లో భాగంగా గురువారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్షల్ పటేల్ చేతికి గాయమైంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ చేసిన హర్షల్ పటేల్ ఫీల్డ్‌ను వీడాడు. ఇక ఈ సిరీస్‌కు భారత జట్టును మే 25న బీసీసీఐ ప్రకటించనుంది. అయితే టీమిండియాను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే స్టార్ పేసర్ దీపక్ చాహర్ గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరం కాగా.. సూర్యకుమార్ యాదవ్, జడేజా టోర్నీ మధ్యలో తప్పుకున్నారు. దీంతో ఈ సిరీస్‌కు వీరి ముగ్గురు అందుబాటుపై కూడా సందిగ్ధం నెలకొంది. ఇక ఈ సిరీస్‌లో భాగంగా తొలి టీ20 ఢిల్లీ వేదికగా జూన్ 9న జరగనుంది. చదవండి: Asia Cup and T20 WC: డీకేకు మొండిచేయి.. హార్దిక్, చహల్‌కు చోటు! బ్యాకప్ ప్లేయర్‌గా త్రిపాఠి -
'నేను యార్కర్లు వేయలేకపోతున్నాను.. కానీ రాబోయే మ్యాచ్‌ల్లో'
ఐపీఎల్-2022లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఆర్సీబీ పేసర్ హర్షల్ పటేల్ మూడు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో హర్షల్ పటేల్ తన నాలుగు ఓవర్ల కోటాలో మూడు వికెట్లు పడగొట్టి, 35 పరుగులు ఇచ్చాడు. ఇక అద్భుతమైన ప్రదర్శనకు గాను హర్షల్ పటేల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. అయితే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైన హర్షల్ పటేల్ ఈ మ్యాచ్‌లో తన ప్రదర్శన పట్ల సంతృప్తిగా లేడు. తన స్పెల్‌లో తొలి మూడు ఓవర్లు అద్భుతంగా బౌలింగ్ చేసిన హర్షల్.. అఖరి ఓవర్లో 17 పరుగులు ఇచ్చాడు. అయితే ఈ ఓవర్లో కీలకమైన డ్వైన్ ప్రిటోరియస్ వికెట్ సాధించాడు. “నేను నా మొదటి ఓవర్లో స్లో బాల్స్ వేయడానికి ప్రయత్నించాను. అయితే పిచ్ బ్యాటర్లకు అనుకూలిస్తుంది. కాబట్టి నా బౌలింగ్‌లో మార్పులు చేశాను. లెఫ్ట్ హ్యాండర్లిద్దరికీ వైడ్ ఆఫ్‌సైడ్ బౌలింగ్ చేశాను. ఎందుకుంటే ఆఫ్‌సైడ్ బౌండరీలు కొంచెం పెద్దవిగా ఉన్నాయి. బ్యాటర్లు స్లో బాల్స్ ఆడేందుకు ఎదురుచూస్తున్నప్పుడు.. గతంలో నేను యార్కర్లు సంధించేవాడిని. కానీ ఈ సీజన్లో యార్కర్లు వేయలేకపోతున్నాను. అయితే రాబోయే మ్యాచ్‌ల్లో యార్కర్లు వేయడానికి ప్రయత్నిస్తాను" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో హర్షల్ పటేల్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: ఒకప్పుడు నెట్ బౌలర్‌గా.. ఇప్పుడు ఏకంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో..! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
టైటాన్స్‌తో మ్యాచ్.. గుజరాత్ ప్రజల మద్దతు మాత్రం నాకే: ఆర్సీబీ బౌలర్!
IPL 2022 RCB Vs GT: ఐపీఎల్-2022లో భాగంగా టైటాన్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్ ప్రజలు తనకు మద్దతుగా నిలుస్తారని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) బౌలర్ హర్షల్ పటేల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరిగే పోరులో సొంతవాళ్లు తనకు అండగా నిలబడతారని పేర్కొన్నాడు. కాగా గుజరాత్‌లోని సనంద్‌లో పుట్టిపెరిగిన ఈ రైట్ ఆర్మ్ పేసర్.. దేశవాళీ క్రికెట్లో మాత్రం హర్యానాకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇక 2012లో ఆర్సీబీ తరఫున ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చి అంచెలంచెలుగా ఎదిగాడు. టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఇక గత సీజన్లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించిన హర్షల్ పటేల్.. అత్యధిక వికెట్లు(32) తీసిన బౌలర్‌గా నిలిచి పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో మెగా వేలం-2022లో ఆ జట్టు 10.75 కోట్ల రూపాయలు వెచ్చించి అతడిని కొనుగోలు చేసింది. కాగా ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్‌లలో హర్షల్ 10 వికెట్లు కూల్చాడు. ఇదే జోష్‌లో గుజరాత్ టైటాన్స్‌తో శనివారం నాటి(ఏప్రిల్ 30) మ్యాచ్‌కు సన్నద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆర్సీబీ సోషల్ మీడియాతో ముచ్చటిస్తూ ఆసక్తిర వ్యాఖ్యలు చేశాడు. ‘‘గుజరాత్ ప్రజలు నన్ను సపోర్టు చేస్తారని అనుకుంటున్నా. ఏదేమైనా.. ఎవరేం అనుకున్నా.. మ్యాచ్ గెలవాలనే మేము కోరుకుంటాం. జట్టు ప్రయోజనాల దృష్ట్యా విజయం సాధించేందుకు కృషి చేస్తాం’’ అని ఈ ఆర్సీబీ ప్లేయర్ చెప్పుకొచ్చాడు. కాగా టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే ఎనిమిదింట ఏడు విజయాలు సాధించి 14 పాయింట్లతో టాప్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై హర్షల్ పటేల్ స్పందిస్తూ.. ‘‘గుజరాత్ బలమైన ప్రత్యర్థి. ఆ జట్టులోని ఆటగాళ్లంతా మంచి ఫామ్‌లో ఉన్నారు. ఆ జట్టుతో పోరు మాకు నిజంగా సవాలే. అయితే, ఈ సవాలును ఎదుర్కొనేందుకు మేము అన్ని రకాలుగా సిద్ధమయ్యాం. ఎవరిని ఎలా ఎదుర్కోవాలో ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. మైదానంలో వాటిని అమలు చేస్తాం’’ అని పేర్కొన్నాడు. Captain Faf du Plessis, Head Coach Sanjay Bangar and Harshal Patel preview the #GTvRCB match, on @KreditBee presents Game Day.#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB pic.twitter.com/Bwmb341EdP — Royal Challengers Bangalore (@RCBTweets) April 30, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఎంత గొడవపడితే.. ఇది పద్దతి కాదు హర్షల్ పటేల్
రాజస్తాన్ రాయల్స్, ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్‌లో రియాన్ పరాగ్, హర్షల్ పటేల్ మధ్య గొడవ చర్చనీయాంశంగా మారింది. మాటలతో మొదలైన గొడవ దాదాపు కొట్టుకునేస్థాయి వరకు వెళ్లింది. విషయంలోకి వెళితే.. రాజస్తాన్ టాప్ ఆర్డర్ విఫలమైన వేళ రియాన్ పరాగ్ తొలిసారి బ్యాటింగ్‌లో మెరిశాడు. 31 బంతుల్లో 56 పరుగులు చేసిన పరాగ్.. హర్షల్ పటేల్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్ సహా మొత్తం 18 పరుగులు రాబట్టాడు. కాగా ఆఖరి బంతికి డీప్ మిడ్‌వికెట్ మీదుగా కళ్లు చెదిరే సిక్సర్ కొట్టాడు. దీంతో చిర్రెత్తిపోయిన హర్షల్ పరాగ్వైపు కోపంగా చూస్తూ కాస్త ఘాటు వ్యాఖ్యలు చేశాడు. తానేమైనా తక్కువ తిన్నానా అన్నట్లు పరాగ్ కూడా హర్షల్‌కు కౌంటర్ ఇచ్చాడు. ఇద్దరి మధ్య మాటామాట పెరిగి ఒకరిపైకి ఒకరు దూసుకొచ్చారు. ఇంతలో రాజస్తాన్ ఆటగాళ్లు వెళ్లి పరాగ్‌ను దూరంగా తీసుకెళ్లారు. ఆర్సీబీ ఆటగాళ్లు కూడా హర్షల్‌ను కూల్ చేశారు. దీంతో వివాదం ఇక్కడికి ముగిసింది అని మనం అనుకున్నాం. కానీ మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా పరాగ్- హర్షల్ పటేల్‌ల గొడవకు ముగింపు లేదని అర్థమైంది. మ్యాచ్ పూర్తైన అనంతరం ఇరుజట్లు కరచాలనం చేయడం ఆనవాయితీ. ఎంత గొడవపడినా ఇరుజట్ల ఆటగాళ్లు సారీ చెప్పుకునే సందర్బం ఉంటుంది. కానీ హర్షల్ పటేల్ మాత్రం ఆనవాయితీని తుంగలో తొక్కాడు. పరాగ్ వచ్చి హర్షల్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వాలని ప్రయత్నించినప్పటికి.. అతను కనీసం మొహం కూడా చూడలేదు. పరాగ్‌తో చేతులు కలపడానికి ఇష్టపడని హర్షల్ వేరే ఆటగాడికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Courtesy: IPL Twitter ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రాజస్తాన్ రాయల్స్ 29 పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టును ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రియాన్ పరాగ్ (31 బంతుల్లో 56 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించాడు. అనంతరం బెంగళూరు 19.3 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ డుప్లెసిస్ (21 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్)దే అత్యధిక స్కోరు. కుల్దీప్ సేన్ (4/20) రాణించగా, అశ్విన్ 3 వికెట్లు, ప్రసిధ్ కృష్ణ 2 వికెట్లు తీశారు. చదవండి: పరాగ్, హర్షల్ పటేల్ మధ్య గొడవ.. కొట్టుకునేంత పని చేశారు This was after 2 sixes were hit off the last over pic.twitter.com/qw3nBOv86A — ChaiBiscuit (@Biscuit8Chai) April 26, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
పరాగ్, హర్షల్ పటేల్ మధ్య గొడవ.. కొట్టుకునేంత పని చేశారు.. వీడియో వైరల్!
ఐపీఎల్-2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్ రియాన్ పరాగ్ అర్ధసెంచరీతో రాణించాడు. ఈ మ్యాచ్‌లో 31 బంతుల్లో 56 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. రాజస్తాన్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయినప్పుడు.. పరాగ్ తన అద్భుత ఇన్నింగ్స్ జట్టును అదుకున్నాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో రాజస్తాన్ 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. కాగా రాజస్తాన్ ఇన్నింగ్స్ అఖరి ఓవర్ వేసిన హర్షల్ పటేల్ బౌలింగ్‌లో పరాగ్ 18 పరుగులు పరగులు రాబాట్టాడు. అయితే హర్షల్ పటేల్ వేసిన అఖరి బంతికి పరాగ్ భారీ సిక్స్ బాదాడు. ఈ క్రమంలో రియాన్ పరాగ్, హర్షల్ పటేల్‌కి మధ్య మాటల యుద్దం జరిగింది. రాజస్తాన్ ఇన్నింగ్స్‌ను ఫినిష్ చేసి పెవిలియన్‌కు వెళ్తున్న పరాగ్.. హర్షల్ పటేల్‌ను ఉద్దేశించి ఏదో అన్నాడు. అది విన్నహర్షల్ పటేల్ పైపైకి వచ్చాడు. వెంటనే రాజస్తాన్ రాయల్స్ సహాయక సిబ్బందిలో ఒకరు జోక్యం చేసుకుని గొడవ సద్దుమణిగేలా చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: IPL 2022: "గత మ్యాచ్‌లు గురించి ఆలోచించం.. ప్లేఆఫ్స్‌కు మేము వచ్చామంటే.. కప్ మదే Harshal vs riyan parag fight#RCBvsRR #parag #HarshalPatel #IPL20222 pic.twitter.com/Xotv4DGF8T — John cage (@john18376) April 26, 2022 -
ఐపీఎల్ వేలం: నమ్మకద్రోహం, మోసం.. చాలా బాధపడ్డాను!
IPL 2022 RCB Player Harshal Patel: హర్షల్ పటేల్.. ఐపీఎల్-2012లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) తరఫున అరంగేట్రం చేశాడు. 2015 సీజన్లో 17 వికెట్లు పడగొట్టి వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత 2018-2020 మధ్య ఢిల్లీ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. అనంతరం మళ్లీ ఆర్సీబీకి ఆడే అవకాశం దక్కించుకున్న హర్షల్ 2021 ఎడిషన్‌లో 32 వికెట్లు కూల్చి పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు. జట్టును ప్లే ఆఫ్స్ చేర్చడంలో తన వంతు పాత్ర పోషించాడు. అంతేగాక టీమిండియా తరఫున అరంగేట్రం చేసే అవకాశం దక్కించుకున్నాడు. అయితే రిటెన్షన్ సమయంలో ఆర్సీబీ అనూహ్యంగా హర్షల్‌ను వదిలేసింది. దీంతో అతడు మెగా వేలం-2022లోకి రాగా ఇతర ఫ్రాంఛైజీలతో పోటీ పడి 10.75 కోట్ల భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసింది. ఈ విషయం గురించి హర్షల్ తాజాగా బ్రేక్‌ఫాస్ట్ విత్ చాంపియన్స్ షోలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2018 వేలం సమయంలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి పంచుకున్నాడు. ఈ మేరకు అతడు మాట్లాడుతూ.. ‘‘2018 వేలం జరుగుతున్న సమయంలో.. నా కోసం ఎవరో ఒకరు బోర్డు ఎత్తుతారని ఆశగా ఎదురు చూశాను.. నిజానికి అప్పుడు నేను డబ్బు గురించి ఏమాత్రం ఆలోచించలేదు. కేవలం ఆడే అవకాశం దక్కితే చాలనుకున్నా. అంతకుముందే వేర్వేరు ఫ్రాంఛైజీలకు చెందిన ఓ ముగ్గురు నలుగురు ఆటగాళ్లు నన్ను తమ జట్టు కోసం కొనుగోలు చేసే అవకాశం ఉందని చెప్పారు. కానీ ఎవరూ ఆ పని చేయలేదు. ఆ సమయంలో నాకు ఎదురైన అనుభవం చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. నమ్మకద్రోహానికి గురైనట్లు, మోసానికి గురయ్యానన్న భావన మనసును మెలిపెట్టింది. కొన్ని రోజుల పాటు దాని గురించే ఆలోచించాను. చాలా బాధపడ్డాను. కానీ ఆ తర్వాత ఆటపై మాత్రమే దృష్టి సారించి ముందుకు సాగాను’’ అని చెప్పుకొచ్చాడు. ఇక ఐపీఎల్ మెగా వేలం-2022లో ఆర్సీబీ తనను భారీ ధరకు కొనుగోలు చేసిన తర్వాత విరాట్ కోహ్లి సంతోషంగా తనకు మెసేజ్ చేశాడన్న హర్షల్ పటేల్.. తనకు నిజంగానే లాటరీ తగిలిందని అతడితో చెప్పినట్లు పేర్కొన్నాడు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4301451426.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి👉🏾RCB Vs RR: మొన్న 68 పరుగులకే ఆలౌట్.. అక్కడేమో అత్యల్ప స్కోరు 73..! -
"చెల్లీ.. మళ్లీ నేను ఆడుతున్నానంటే కారణం నీవే"..
టీమిండియా పేసర్, ఆర్సీబీ స్టార్ పేసర్ హర్షల్ పటేల్ సోదరి మరణించిన సంగతి తెలిసిందే. దీంతో హర్షల్ పటేల్ చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌కు ముందు బయోబబుల్ వీడి సోదరి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. అయితే ఒక్క రోజులో తిరిగి మళ్లీ ఆర్సీబీ జట్టులో చేరి హర్షల్ పటేల్ అందరిని ఆశ్చర్యపరిచాడు. తాజాగా తన చెల్లెలను ఉద్దేశించి ఓ ఎమోషనల్ నోట్‌ను ఇన్స్టాగ్రామ్ వేదికగా హర్షల్ పటేల్ షేర్ చేశాడు. "మా జీవితాల్లో అత్యంత విలువైన వ్యక్తివి నీవు. నీవు లేని లోటు ఎప్పటికీ తీర్చలేనిది. తుది శ్వాస విడిచే వరకూ నీ ముఖం మీద చిరు నవ్వు పోనివ్వలేదు. నీ జీవితంలో ఎన్నో కష్టాలను ఎదర్కొన్నావు. నేను నీతో హాస్పిటల్లో ఉన్నప్పుడు నా ఆటపై దృష్టి పెట్టమని.. తిరిగి ఇండియాకు పంపించేశావు. ఆ మాటల వల్లనే నేను వచ్చి మళ్లీ ఆడగాలిగాను. నీ మాటలను గౌరవిస్తూ, నిన్ను ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటానని చెప్పడానికి నేను చేయగలిగింది ఇదే. నేను చేసే ప్రతీ పని నీవు గర్వపడేలా చేస్తాను. నా జీవితంలోని ప్రతీ క్షణం నిన్ను మిస్ అవుతున్నా. అవి మంచివైనా చెడ్డవైనా. ఐ లవ్ యూ సో మచ్... రెస్ట్ ఇన్ పీస్ జదీ’" అంటూ హర్షల్ పటేల్ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. చదవండి: IPL 2022 CSK Vs GT: "వెల్కమ్ బ్యాక్ రుత్‌రాజ్.. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడావు" -
IPL 2022: ధర 30 లక్షలు.. ఇంతకీ సూయశ్ ఎవరు?
ఐపీఎల్ అరంగేట్రంలోనే అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు రాయల్ చెలెంజర్స్ యువ ఆటగాడు సూయశ్ ప్రభుదేశాయి. చెన్నై సూపర్‌కింగ్స్ సీనియర్ ప్లేయర్ మొయిన్ అలీ రనౌట్‌లో కీలక పాత్ర పోషించిన సూయశ్.. బ్యాట్‌తోనూ ఆకట్టుకున్నాడు. మొత్తంగా 18 బంతులు ఎదుర్కొన్న అతడు 34 పరుగులు(5 ఫోర్లు, ఒక సిక్సర్) ఆగమనంలోనే తనదైన ముద్ర వేశాడు. కాగా ఐపీఎల్-2022లో భాగంగా సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 23 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్ ద్వారా సూయశ్ రూపంలో మరో కొత్త టాలెంట్ మాత్రం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో అతడి గురించి ఆసక్తికర అంశాలు! దేశవాళీ టోర్నీల్లో సత్తా చాటిన సూయశ్ ►సూయశ్ 1997 డిసెంబరు 6న జన్మించాడు. ►గోవా తరఫున దేశవాళీ టోర్నీల్లో ఆడుతున్న కుడిచేతి వాటం గల ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ 2016లో లిస్ట్ ఏ క్రికెట్లో అడుగుపెట్టాడు. ►2016-17 సీజన్లో బెంగాల్‌తో మ్యాచ్‌తో విజయ్ హజారే ట్రోఫీ వన్డే టోర్నీతో అరంగేట్రం చేశాడు. ►2018-19 రంజీ ట్రోఫీలో భాగంగా హర్యానాతో మ్యాచ్‌లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోకి సూయశ్ ఎంట్రీ ఇచ్చాడు. ►ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఒక సెంచరీ, 8 అర్ధ శతకాలు సాధించడంతో పాటుగా ఇప్పటి వరకు ఎనిమిది వికెట్లు తీశాడు ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్. టీ20 ఫార్మాట్లోనూ.. ►సూయశ్ 2018-9 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా సిక్కింతో మ్యాచ్‌లో తొలిసారిగా టీ20 ఫార్మాట్లో అడుగుపెట్టాడు. ►రాజస్తాన్‌తో మ్యాచ్‌లో 23 బంతుల్లో 35 పరుగులు సాధించి గోవాను గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా క్రికెట్ ప్రేమికుల దృష్టిని ఆకర్షించాడు సూయశ్. ►అదే విధంగా మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌లో 200 స్ట్రైకు రేటుతో 48 పరుగులు సాధించి అజేయంగా నిలిచి సత్తా చాటాడు. ►అంతేగాక తమిళనాడుపై గోవా విజయంలో కీలక పాత్ర పోషించి వార్తల్లో నిలిచాడు. ►దేశీ టీ20 ఫార్మాట్లో ఇప్పటి వరకు 20 ఇన్నింగ్స్ ఆడిన సూయశ్ 443 పరుగులు సాధించాడు. గోవా తరఫున నాలుగో ఆటగాడు.. ►ఈ క్రమంలో ఐపీఎల్ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించిన సూయశ్ ఐపీఎల్ మెగా వేలం-2022లోకి రాగా ఆర్సీబీ 30 లక్షలు వెచ్చించి అతడిని కొనుగోలు చేసింది. సీఎస్కేతో మ్యాచ్‌లో హర్షల్ పటేల్ దూరమైన నేపథ్యంలో సూయశ్ ఆర్సీబీ తరఫున ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చాడు. ►గోవా తరఫున ఐపీఎల్లో ఆడుతున్న నాలుగో ఆటగాడు సూయశ్. అతడి కంటే ముందు స్వప్నిల్ అసోంద్కర్(రాజస్తాన్ రాయల్స్), షాదాబ్ జకాటి(సీఎస్కే, ఆర్సీబీ, గుజరాత్ లయన్స్), సౌరభ్ బండేద్కర్(ఆర్సీబీ) క్యాష్ రిచ్లో ఎంట్రీ ఇచ్చారు. చదవండి: IPL 2022 CSK Vs RCB: సోదరి మరణం.. జట్టుకు దూరం.. అతడి సేవలను మిస్సవుతున్నాం! #CSKvRCB: Post Match Chat We win some. We fight hard, but still lose some. Mike Hesson talks about the positives from today’s match, & we also caught up with the impressive debutant Suyash Prabhudessai. Here are some post match visuals on Game Day.#PlayBold #IPL2022 #RCB pic.twitter.com/ECIqOqIaTk — Royal Challengers Bangalore (@RCBTweets) April 13, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
చెల్లెలి మరణం.. జట్టుకు దూరం.. అతడి సేవలను మిస్సవుతున్నాం!
IPL 2022 CSK vs RCB: చెన్నై సూపర్‌కింగ్స్‌తో మ్యాచ్‌లో తమ స్టార్ బౌలర్ హర్షల్ పటేల్ లేని లోటు స్పష్టంగా కనిపించిందని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అన్నాడు. తానుంటే జట్టుకు బలమని, మ్యాచ్ స్వరూపాన్ని ఒంటిచేత్తో మార్చేయగల సత్తా అతడిని సొంతమని పేర్కొన్నాడు. త్వరలోనే అతడు జట్టులోకి తిరిగి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా ఐపీఎల్-2022లో భాగంగా చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 23 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించిన శివమ్ దూబే, రాబిన్ ఊతప్ప తమ అద్భుత ప్రదర్శనతో సీఎస్కేకు ఈ సీజన్లో మొదటి విజయం దక్కడంలో కీలక పాత్ర పోషించారు. కాగా గత సీజన్లో పర్పుల్ క్యాప్ గెలుచుకున్న ఆర్సీబీ బౌలర్ హర్షల్ పటేల్ ఈసారి కూడా తమ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. PC: IPL అయితే, వ్యక్తిగత కారణాల దృష్ట్యా అతడు ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. తన చెల్లెలు మరణం నేపథ్యంలో హర్షల్ పటేల్ బయోబబుల్‌ను వీడి ఇంటికి వెళ్లాడు. కాగా గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న హర్షల్ సోదరి ఏప్రిల్ 9న తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే ఆమె చనిపోయినట్లు జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా.. తమ సహచర ఆటగాడికి కష్టకాలంలోనూ అండగా ఉంటామన్న సందేశం ఇచ్చే క్రమంలో.. ఆర్సీబీ క్రికెటర్లు సీఎస్కేతో మ్యాచ్ సమయంలో నల్లటి బ్యాండ్లు ధరించి సోదరభావాన్ని చాటుకున్నారు. హర్షల్ పటేల్ సోదరి మరణం నేపథ్యంలో చేతులకు బ్యాండ్లు ధరించి మైదానంలో దిగారు. సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ స్కోర్లు: చెన్నై: 216/4 (20) బెంగళూరు: 193/9 (20) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: శివమ్ దూబే చదవండి: IPL 2022 CSK Vs RCB: కెప్టెన్‌గా తొలి గెలుపు.. ఈ విజయం నా భార్యకు అంకితం: జడేజా var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2022: బయో బబుల్‌ను వీడిన ఆర్సీబీ స్టార్ బౌలర్!
IPL 2022: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బౌలర్ హర్షల్ పటేల్ బయో బబుల్‌ను వీడినట్లు తెలుస్తోంది. అతడి కుటుంబంలో విషాదం చోటు చేసుకున్న క్రమంలో ఇంటికి వెళ్లినట్లు సమాచారం. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ ముగిసిన అనంతరం హర్షల్‌కు ఈ విషయం గురించి తెలిసినట్లు ఐపీఎల్ వర్గాలు జాతీయ మీడియాకు వెల్లడించాయి. కాగా ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ హర్షల్ పటేల్... స్టార్ బౌలర్‌గా ఎదిగాడు. గత సీజన్లో 15 ఇన్నింగ్స్ ఆడిన అతడు అత్యధికంగా 32 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు. అయితే, హర్షల్‌ను రిటైన్ చేసుకోని బెంగళూరు.. వేలంలో ఇతర జట్లతో పోటీ మరీ అతడిని సొంతం చేసుకుంది. 10.75 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేసింది. అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తున్న హర్షల్ ఐపీఎల్-2022లో ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో కలిపి 6 వికెట్లు పడగొట్టాడు. ఇక ముంబైతో శనివారం నాటి మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన హర్షల్ కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. కాగా హర్షల్ కుటుంబానికి చెందిన వ్యక్తి ఒకరు మరణించినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న హర్షల్ మ్యాచ్ ముగిసిన వెంటనే కుటుంబాన్ని కలవడానికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ మేరకు.. ‘‘దురదృష్టవశాత్తూ హర్షల్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. అందుకే అతడు బయో బబుల్‌ను వీడాల్సి వచ్చింది. అయితే, చెన్నై సూపర్‌కింగ్స్‌తో ఏప్రిల్ 12 నాటి మ్యాచ్ కంటే ముందే అతడు జట్టుతో చేరే అవకాశం ఉంది’’ అని ఐపీఎల్ వర్గాలు చెప్పినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. చదవండి: IPL 2022: అతడు భవిష్యత్ ఆశా కిరణం: డుప్లెసిస్ ప్రశంసలు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కోహ్లి స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్
ఐపీఎల్ 2022లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ ఆటగాడు కోహ్లి స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. ఇన్నింగ్స్ 10వ ఓవర్ హర్షల్ పటేల్ వేశాడు. అప్పటికే పడిక్కల్ 38 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఓవర్ ఆఖరి బంతిని పడిక్కల్ లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. బ్యాట్ ఎడ్జ్‌కు తగలడంతో సరిగ్గా కనెక్ట్ కాలేదు. అయితే బౌండరీ లైన్ వద్ద ఉన్న కోహ్లి వెనక్కి పరిగెట్టి విల్లులా తిరిగి రెండు చేతులతో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోహ్లి స్టన్నింగ్ క్యాచ్ కోసం క్లిక్ చేయండి -
ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్‌గా హర్షల్ పటేల్
ఐపీఎల్లో ఆర్సీబీ బౌలర్ హర్షల్ పటేల్ అరుదైన ఫీట్ సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో వరుసగా రెండు మెయిడెన్ ఓవర్లు వేసిన రెండో బౌలర్‌గా హర్షల్ పటేల్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ 2022లో భాగంగా కేకేఆర్‌తో మ్యాచ్‌లో హర్షల్ ఈ ఫీట్ అందుకున్నాడు. ఇంతకముందు ఆర్సీబీకే చెందిన మహ్మద్ సిరాజ్ అదే కేకేఆర్‌పై ఐపీఎల్ 2020లో తన వరుస రెండు ఓవర్లను మెయిడెన్ వేసి తొలి బౌలర్‌గా ఉన్నాడు. ఇక 12వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన హర్షల్ ఆ ఓవర్‌ను మెయిడెన్ వేశాడు. అంతేకాదు తన తొలి ఓవర్లోనే సామ్ బిల్లింగ్స్‌ను ఔట్ చేశాడు. ఆ తర్వాత రెండో ఓవర్‌ను కూడా మెయిడెన్ వేసిన హర్షల్ ఈసారి రసెల్ రూపంలో రెండో వికెట్ తీసుకున్నాడు. మొత్తంగా రెండు ఓవర్లు ముగిసేసరికి హర్షల్ స్పెల్ 2-2-0-2గా ఉంది. ఏ క్రికెటర్‌కైనా ఇది బెస్ట్ స్పెల్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత మూడో ఓవర్‌నూ దాదాపు అదే రీతిలో బౌల్ చేసిన హర్షల్.. ఓవరాల్‌గా తన కోటా బౌలింగ్‌ను (4-2-11-2)తో ముగించాడు. చదవండి: IPL 2022: క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రివ్యూగా మిగిలిపోనుంది పవర్ ప్లేను కూడా వదలని ఎస్ఆర్హెచ్.. ఇంకెన్ని చూడాలో! -
క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రివ్యూగా మిగిలిపోనుంది
ఐపీఎల్ 2022లో భాగంగా కేకేఆర్,ఆర్సీబీ మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. కేకేఆర్ ఇన్నింగ్స్ 16వ ఓవర్ హర్షల్ పటేల్ వేశాడు. అప్పటికే హర్షల్ పటేల్ 2 ఓవర్లు వేసి 2 మెయిడెన్లు సహా 2 వికెట్లు తీసి ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో క్రీజులో ఉన్న వరుణ్ చక్రవర్తికి హర్షల్ 16వ ఓవర్లో ఆఖరి బంతిని ఫుల్‌టాస్‌గా వేశాడు. ఆ బంతి బ్యాట్‌కు తగిలి వన్ స్టప్ అయి కీపర్ చేతుల్లోకి వెళ్లింది. అది క్లియర్‌గా ఔట్ కాదని తెలిసినప్పటికి.. బంతి వరుణ్ చక్రవర్తి బూట్లకు తగిలి బ్యాట్‌కు తగిలిందేమోనని హర్షల్ పటేల్ అంపైర్‌కు అప్పీల్ చేశాడు. అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. ఇంతటితో ఊరుకుంటే అయిపోయేది.. కానీ హర్షల్ పటేల్ కెప్టెన్ డుప్లెసిస్వైపు చూడడం.. అతను రివ్యూ తీసుకోవడం జరిగిపోయింది. ఇక రిప్లేలో బంతి ఎక్కడా కనీసం బ్యాట్స్‌మన్ బూట్లకు తగిలినట్లుగా కూడా కనిపించలేదు. అంతేకాదు బంతి బ్యాట్ మిడిల్లో తగిలినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ''డుప్లెసిస్ తీసుకున్న రివ్యూ.. క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రివ్యూగా మిగిలిపోనుంది.. బౌలర్ కంటే తెలియకపోవచ్చు.. కెప్టెన్‌గా అనుభవం ఉన్న నీకు ఆ రివ్యూ ఎలా తీసుకోవాలనిపించింది డుప్లీ..'' అంటూ క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్ చేశారు. చదవండి: Ravi Shastri: ఉమ్రాన్ మాలిక్‌పై టీమిండియా మాజీ కోచ్ ప్రశంసల వర్షం IPL 2022: కేకేఆర్‌కు ఆ జట్టు మాజీ ప్లేయర్ వార్నింగ్.. తేడా వస్తే -
'వేలంలో ఏకంగా 10.75 కోట్లు.. అతడు ఒక అద్భుతమైన బౌలర్'
ఐపీఎల్-2022 మెగా వేలంలో టీమిండియా పేసర్ హర్షల్ పటేల్‌ను దక్కించకోవడానికి చాలా ప్రాంఛైజీలు పోటీ పడ్డాయి. చివరకి ఆర్సీబీ రూ. 10.75 కోట్ల భారీ ధరకు హర్షల్ పటేల్‌ను కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో హర్షల్ పటేల్‌పై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. మెగా వేలంలో హర్షల్ పటేల్ తగిన ధర దక్కిందని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఇక వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో రెండు వికెట్లు పడగొట్టి భారత విజయంలో హర్షల్ పటేల్ తన వంతు పాత్ర పోషించాడు. "వేలంలో దక్కిన ప్రతీ పైసా, ప్రతీ రూపాయికి హర్షల్ పటేల్ అర్హుడు. గత ఏడాది సీజన్లో హర్షల్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అంతకుముందు అతడి బౌలింగ్ పేస్‌లో ఏటువంటి మార్పు లేకపోవడంతో బ్యాటర్లు ఈజీగా ఎదుర్కొనేవారు. కానీ అతడు ఇప్పుడు తనను తాను రూపు దిద్దు కున్నాడు. ప్రస్తుతం అద్భుతమైన పేస్‌తో హర్షల్ పటేల్ బౌలింగ్ చేస్తున్నాడు. తన పేస్‌లో మార్పులతో బ్యాటర్లను అతడు ఇబ్బంది పెడుతున్నాడు. అదే విధంగా అఖరి ఓవర్లలో అతడు స్లో బౌన్సర్లు, యార్కర్లు బౌలింగ్ చేయగలడు" అని గవాస్కర్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: ఆర్సీబీ కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు.. వేలంలో 7కోట్లు! -
మెగావేలంలో టాప్ లేపిన భారత కుర్రాళ్లు
IPL 2022 Auction: ఐపీఎల్ మెగావేలం 2022లో ఊహించనట్లుగానే టీమిండియా యువ ఆటగాళ్లు సత్తా చాటారు. అంచనాలకు మించి ఈ ఆటగాళ్లు మంచి ధరను సొంతం చేసుకున్నారు. నితీష్ రాణా, హర్షల్ పటేల్, ఆల్‌రౌండర్ దీపక్ హుడా, దేవదూత్ పడిక్కల్ ఈ జాబితాలో ఉన్నారు. హర్షల్ పటేల్: గత సీజన్లో అంచనాలకు మించి రాణించిన హర్షల్ పటేల్‌కు జాక్‌పాట్ తగిలింది. 32 వికెట్లతో పర్పుల్‌క్యాప్ అందుకున్న హర్షల్‌ను మరోసారి ఆర్సీబీ దక్కించుకుంది. రూ. 2 కోట్ల కనీస ధరతో బరిలోకి దిగిన హర్షల్‌ను రూ. 10.75 కోట్లకు ఆర్సీబీ మరోసారి దక్కించుకుంది. నవంబర్ 2021లో న్యూజిలాండ్‌తో జరిగిన టి20 సిరీస్ ద్వారా టీమిండియా తరపున హర్షల్ పటేల్ అరంగేట్రం చేశాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే రెండు వికెట్లు తీసిన హర్షల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. దేవదూత్ పడిక్కల్: టీమిండియా అన్క్యాప్డ్ ప్లేయర్ దేవదూత్ పడిక్కల్ దశ తిరిగింది. ఐపీఎల్ 2020, 2021 సీజన్లలో ఆర్సీబీ తరపున దేవదూత్ పడిక్కల్ దుమ్మురేపాడు. ఐపీఎల్ 2020 సీజన్లో 473 పరుగులతో ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డు గెలుచుకున్న పడిక్కల్.. మరుసటి ఏడాది ఐపీఎల్ సీజన్లోనూ అదే జోరు చూపెట్టాడు. 411 పరుగులు చేసిన పడిక్కల్ సీజన్లో వేగవంతమైన సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. 51 బంతుల్లోనే సెంచరీ మార్క్ సాధించి ఔరా అనిపించాడు.తాజాగా ఐపీఎల్ మెగావేలంలో ఆర్సీబీ అతని కోసం పోటీపడినప్పటికి చివరికి రాజస్తాన్ రాయల్స్ రూ. 7.75 కోట్లకు దక్కించుకుంది. నితీష్ రాణా: గత సీజన్లో కేకేఆర్ తరపున నితీష్ రాణా మంచి ప్రదర్శన కనబరిచాడు. దీంతో అతనిపై నమ్మకముంచిన కేకేఆర్ నితీష్ రాణాను రూ. 8 కోట్లతో దక్కించుకుంది. కాగా గత సీజన్లో కేకేఆర్ తరపున 17 మ్యాచ్‌ల్లో 383 పరుగులు చేసిన నితీష్ ఖాతాలో రెండు అర్థసెంచరీలు ఉన్నాయి. కాగా 2015లో తొలిసారి ఐపీఎల్లో అరంగేట్రం చేసిన నితీష్ రానా ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. తొలి సీజన్లో ఒక్క మ్యాచ్ ఆడని నితీష్.. ఆ తర్వాతి సీజన్లో 4 మ్యాచ్‌ల్లో 104 పరుగులు చేశాడు. 2017 సీజన్లో 13 మ్యాచ్‌ల్లో 333 పరుగులతో ఆకట్టుకున్న నితీష్‌ను ముంబై రిలీజ్ చేయగా.. 2018 వేలంలో అతన్ని కేకేఆర్ దక్కించుకుంది. అప్పటినుంచి నితీష్ రాణా కేకేఆర్ రెగ్యులర్ ప్లేయర్‌గా మారిపోయాడు. దీపక్హుడా: టీమిండియా ఆల్‌రౌండర్ దీపక్ హుడాను రూ. 5.75 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకుంది. రూ. 75 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన దీపక్ హుడాది మంచి ధరే అని చెప్పొచ్చు. ఇప్పటివరకు ఐపీఎల్లో 80 మ్యాచ్‌లాడిన దీపక్ హుడా 785 పరుగులు చేశాడు. -
అప్పుడు రూ.20 లక్షలు.. ఇప్పుడు ఏకంగా రూ.10.75 కోట్లు.. వారెవ్వా హర్షల్!
ఐపీఎల్-2022 మెగా వేలంలో టీమిండియా ఆల్‌రౌండర్ హర్షల్ పటేల్ భారీ ధరకు అమ్ముడు పోయాడు. ఈ వేలంలో అతడిని రూ.10.75 కోట్లకు రాయల్ ఛాలంజెర్స్ బెంగళూరు కైవసం చేసుకుంది. హర్షల్ పటేల్ బేస్ ప్రైస్ 2 కోట్లుగా ఉంది. వేలంలో హర్షల్ పటేల్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆర్సీబీ చివర వరకు పోటీ పడ్డాయి. కాగా వేలానికి ముందు ఆర్సీబీ హర్షల్ పటేల్‌ను రీటైన్ చేసుకోలేదు. అయితే మళ్లీ వేలంలో ఆర్సీబీ అతడిని సొంతం చేసుకుంది. ఐపీఎల్-2021 సీజన్లో పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా హర్షల్ పటేల్ నిలిచాడు. గత సీజన్లో ఆర్సీబీ కేవలం 20 లక్షలకు మాత్రమే కోనుగోలు చేసింది. అయితే అదే ఫ్రాంచైజీ అతడిని 10.75 కోట్లకు కోనుగోలు చేయడం గమనార్హం. ఇక ఈ మెగా వేలంలో భారత స్టార్ ఆటగాడు, ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ భారీ ధర పలికాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు అతడిని రూ. 12.25 కోట్లకు దక్కించుకుంది. ఇప్పటి వరకు జరిగిన వేలంలో అయ్యర్‌కే అత్యధిక ధర. ఇక సురేష్ రైనా, స్టీవ్ స్మిత్ వంటి స్టార్ ఆటగాళ్లు తొలి ఫేజ్‌లో అమ్ముడు పోలేదు. చదవండి: IPL 2022 Auction: వేలంలో షాకింగ్ ఘటన.. కుప్పకూలిన ఆక్షనీర్ -
Ind Vs Wi: నీకు మా మద్దతు ఉంటుందని ద్రవిడ్ చెప్పారు.. అందుకే..
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు సన్నద్ధమవుతున్నాడు టీమిండియా బౌలర్ హర్షల్ పటేల్. స్వదేశంలో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన హర్షల్.. డెబ్యూలోనే ఇరగదీసిన సంగతి తెలిసిందే. రెండో మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన అతడు కేవలం 25 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా తుది జట్టులోకి తన ఎంపిక సరైందేనని నిరూపించాడు. ఇక టీమిండియా హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌కు, టీ20 కెప్టెన్‌గా రోహిత్ శర్మకు కివీస్‌తో సిరీసే మొదటిదన్న సంగతి తెలిసిందే. హర్షల్‌కు కూడా అరంగేట్రం కారణంగా ఈ సిరీస్ మరింత స్పెషల్. ఈ నేపథ్యంలో కెప్టెన్, కోచ్ తన పట్ల వ్యవహరించిన తీరు గురించి హర్షల్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన అతడు...‘‘రోహిత్ శర్మ మన చేతికి బంతిని ఇస్తాడు. ఒకవేళ మన పట్ల తనకు నమ్మకం ఉంటే ఏం చేయాలన్న విషయం గురించి చెప్పడు. ‘‘ఏం చేయాలో తెలుసు కదా.. అదే చేసెయ్’’ మరి మన కర్తవ్యాన్ని గుర్తు చేస్తాడు. నిజంగా తను చాలా మంచి కెప్టెన్. అలాంటి వ్యక్తి సారథ్యంలో ఆడటాన్ని ఎవరైనా పూర్తిగా ఆస్వాదిస్తారు. ఒకవేళ పరుగులు ఎక్కువగా ఇస్తున్నానని అనిపిస్తే.. నా వద్ద ప్లాన్ ఏ, బీ, సీ సిద్ధంగా ఉంటాయి. వాటినిక అమలు చేసేందుకు కెప్టెన్ సహకారం ఉంటుంది. నిజంగా రోహిత్.. ఆటగాళ్లకు స్వేచ్ఛనిస్తాడు’’ అని ప్రశంసలు కురిపించాడు. ఇక రాహుల్ ద్రవిడ్ తనతో మాట్లాడిన విధానాన్ని హర్షల్ పటేల్ గుర్తు చేసుకున్నాడు. ‘‘మాకు తెలుసు నువ్వు ఆత్మవిశ్వాసం గల బౌలర్‌వి. నువ్వు చేయగలవో.. ఏం చేయాలనుకుంటున్నావో.. చేసెయ్. మైదానంలో దిగిన తర్వాత నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో అలాగే ఉండు. ప్రతి క్షణాన్ని ఆస్వాదించు. ఏదేమైనా నీకు మా మద్దతు ఉంటుంది’’ అని ద్రవిడ్ తనకు భరోసా ఇచ్చాడని చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్ -2021 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున బరిలోకి దిగిన హర్షల్ పటేల్... 32 వికెట్లు పడగొట్టాడు. తద్వారా పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో జాతీయ జట్టులో చోటు దక్కించుకుని 30 ఏళ్ల 361 రోజుల వయసులో అంతర్జాతీయ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చాడు. విండీస్‌తో సిరీస్‌కు భారత టి20 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, కోహ్లి, సూర్యకుమార్, శ్రేయస్ అయ్యర్, పంత్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ చహర్, శార్దుల్, యుజువేంద్ర చహల్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్, అక్షర్ పటేల్, సిరాజ్, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్. చదవండి: IPL 2022 Mega Auction: వేలంలో అతడికి ఏకంగా రూ.11 కోట్లు.. అయ్యర్‌కి మరీ ఇంత తక్కువా! -
'ఐపీఎల్లో ఆ జట్టుకు ఆడాలని ఉంది.. అతడే నా ఫేవరెట్ కెప్టెన్'
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్-2022 మెగా వేలంకు సమయం ఆసన్నమైంది. బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఈ మెగా వేలాన్ని నిర్వహించనున్నారు. ఇక గతేడాది పర్పుల్ క్యాప్ హోల్డర్ హర్షల్ పటేల్‌ను ఆర్సీబీ రీటైన్ చేసుకోలేదు. ఆర్సీబీ విరాట్ కోహ్లితో పాటు గ్లెన్ మ్యాక్స్‌వెల్, సిరాజ్‌ను రీటైన్ చేసుకుంది. దీంతో రానున్న మెగా వేలంలో హర్షల్ పటేల్ కోసం జట్లు పోటీ పడతాయి ఆనడంలో సందేహం లేదు. అయితే తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్షల్ పటేల్ తన మనసులోని మాటను బయట పెట్టాడు. ఈ ఏడాది సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడేందుకు ఆసక్తిగా ఉన్నానని హర్షల్ తెలిపాడు. చెన్నై కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని తన ఆల్ టైమ్ బెస్ట్ కెప్టెన్ అని హర్షల్ పటేల్ పేర్కొన్నాడు. ఐపీఎల్- 2021లో 32 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా హర్షల్ పటేల్ నిలిచాడు. ముంబై ఇండియన్స్‌పై హ్యాట్రిక్ వికెట్లతో అదరగొట్టాడు. కాగా రానున్న మెగా వేలంలో తన బేస్ ప్రైస్ రూ.2 కోట్లగా నమోదు చేసుకున్నాడు. ఇక ఐపీఎల్ 2021లో కేవలం రూ. 20 లక్షలకు కొనుగోలు చేయడం గమనార్హం. చదవండి: Shakib Al Hasan: 'శ్రీవల్లీ' పాటకు బంగ్లా ఆల్‌రౌండర్ స్టెప్పులు.. ఊహించని ట్విస్ట్ -
IPL 2022 Auction: వదిలేసినా ఆ జట్టుకే ఆడాలని ఉందన్న స్టార్ ప్లేయర్
IPL 2022 Auction: ఐపీఎల్-2021 సీజన్లో అద్భుతంగా రాణించాడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు బౌలర్ హర్షల్ పటేల్. 15 ఇన్నింగ్స్‌లో 32 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. తద్వారా పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు. అయితే, రిటెన్షన్ సమయంలో మాత్రం యాజమాన్యం అతడిని పరిగణనలోకి తీసుకోలేదు. హర్షల్ కంటే కూడా టీమిండియాలో రెగ్యులర్ పేసర్‌గా మారిన సిరాజ్ వైపు ఫ్రాంఛైజీ మొగ్గు చూపింది. స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి (రూ.15 కోట్లు) , ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (రూ. 11 కోట్లు), సిరాజ్ (రూ. 7 కోట్లు)లను అట్టిపెట్టుకుంది. అత్యధికంగా నలుగురిని రిటైన్ చేసుకునే అవకాశం ఉన్నా హర్షల్‌ను వదిలేసింది. దీంతో అతడు మెగా వేలంలోకి రానున్నాడు. ఈ క్రమంలో క్రిక్‌ట్రాకర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్షల్ పటేల్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీ తనను కొనుగోలు చేసే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘‘నన్ను రిటైన్ చేసుకోలేదని తెలిసిన వెంటనే... ఆర్సీబీ క్రికెట్ డైరెక్టర్ మైక్ హెసన్ నాకు కాల్ చేశారు. పర్సులో సరిపడా డబ్బు లేనందు వల్లే నన్ను వదిలేశామని చెప్పారు. కాబట్టి మెగా వేలంలో వాళ్లు కచ్చితంగా నన్ను పరిగణనలోకి తీసుకుంటారనుకుంటున్నా.. నేను కూడా మరోసారి ఆర్సీబీకి ఆడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఎందుకంటే... ఐపీఎల్-2021 సీజన్లో బెంగళూరు జట్టుకు ఆడటం.. నా కెరీర్‌ను మాత్రమే కాదు... నా జీవితాన్ని కూడా కీలక మలుపు తిప్పింది’’ అని ఉద్వేగానికి లోనయ్యాడు. ఇక వేలం నేపథ్యంలో ఇప్పటి వరకు తనను ఏ ఫ్రాంఛైజీ సంప్రదించలేదని హర్షల్ చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్-2021 ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ పేసర్.. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో నాలుగు వికెట్లతో రాణించి... కివీస్‌ను 3-0 తేడాతో వైట్‌వాష్ చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక యార్కర్లతో బ్యాటర్లను ఇబ్బంది పెట్టగల హర్షల్‌ను కొనుగోలు చేసేందుకు ఐపీఎల్ ఫ్రాంఛైజీలు పోటీపడతాయడనంలో ఏమాత్రం సందేహం లేదు. చదవండి: Ind Vs Sa: హనుమ విహారికి నో ఛాన్స్.. పంత్‌కు అవకాశం... సిరాజ్ స్థానంలో అతడే! ఎందుకంటే.. IPL 2022: ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీలకు డెడ్‌లైన్ విధించిన బీసీసీఐ -
Harshal Patel: ‘ఎలా మొదలైంది.. ఎలా కొనసాగుతోంది’.. ఫొటోలు వైరల్
Harshal Patel Shared Before After Picture With Team India Head Coach Rahul Dravid: ఆలస్యంగానైనా సరే టీమిండియా తరఫున అరంగేట్రం చేయాలన్న కలను నెరవేర్చుకున్నాడు హర్షల్ పటేల్. ఇటీవల న్యూజిలాండ్‌తో ముగిసిన టీ20 సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన హర్షల్.. డెబ్యూ మ్యాచ్‌లోనే ఇరగదీశాడు. రెండో టీ20లో నాలుగు ఓవర్లు వేసిన హర్షల్ పటేల్ 25 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఇక 30 ఏళ్ల 361 రోజుల వయసులో పొట్టి ఫార్మాట్లో అడుగుపెట్టిన హర్షల్.. హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ తాజాగా రెండు ఫొటోలు షేర్ చేశాడు. ‘‘ఎలా మొదలైంది.. ఎలా కొనసాగుతోంది’’ అన్న క్యాప్షన్‌తో ద్రవిడ్‌తో దిగిన పాత, కొత్త ఫొటోలను పంచుకున్నాడు. ఈ క్రమంలో.. ‘‘2004కు... ఇప్పటికీ పెద్దగా మార్పులేమీ కనిపించడం లేదు. కానీ నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకోవడానికి పట్టుదలగా ముందుకు సాగిన విధానం మాత్రం మమ్మల్ని ఆకట్టుకుంటోంది’’ అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ద్రవిడ్ నమ్మకాన్ని గెలుచుకోవడమే కాదు.. దానిని నిలబెట్టుకున్నావు కూడా అంటూ అభినందిస్తున్నారు. కాగా లేటు వయసులో టీ20లో ఎంట్రీ ఇచ్చిన ఆటగాళ్ల జాబితాలో ద్రవిడ్ (38 ఏళ్ల 232 రోజులు).. మొదటి స్థానంలో ఉండగా.. హర్షల్ ఆరో స్థానంలో కొనసాగుతుండటం విశేషం. ఇక ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న హర్షల్ పటేల్.. 2021 సీజన్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా నిలిచాడు. 15 మ్యాచ్‌లు ఆడిన అతడు 32 వికెట్లు తన ఖాతాలో వేసుకుని పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్‌తో పొట్టి ఫార్మాట్ సిరీస్‌కు ఎంపికయ్యాడు. చదవండి: India vs New Zealand: గిల్ కళ్లు చెదిరే సిక్స్ .. వీడియో వైరల్ IND vs NZ 1st Test- Shreyas Iyer: నెరవేరిన అయ్యర్ కల.. దిగ్గజ క్రికెటర్ చేతుల మీదుగా క్యాప్.. వీడియో View this post on Instagram A post shared by Harshal Patel (@harshalvp23) -
Ind vs Nz 2021: క్లీన్‌స్వీప్.. ‘కెప్టెన్’ రోహిత్ శర్మ సూపర్!
Ind vs Nz 2021: India Beat New Zealand 73 Runs In 3rd T20I Clean Sweep: మ్యాచ్ నామమాత్రం అయినప్పటికీ భారత జట్టు నిర్లక్ష్యం చూపకుండా చెలరేగింది. న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన చివరిదైన మూడో టి20 మ్యాచ్‌లో టీమిండియా 73 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను రోహిత్ శర్మ బృందం 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 184 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ కెప్టెన్ రోహిత్ శర్మ (31 బంతుల్లో 56; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఇషాన్ కిషన్ (21 బంతుల్లో 29; 6 ఫోర్లు) మెరిశారు. చివర్లో దీపక్ చహర్ (8 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ధనాధన్ ఆటతీరుతో భారత్ భారీ స్కోరు ను అందుకుంది. ఛేదనలో న్యూజిలాండ్ 17.2 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ గప్టిల్ (36 బంతుల్లో 51; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) మినహా మిగిలినవారు విఫలమయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అక్షర్ పటేల్ (3/9), హర్షల్ పటేల్ (2/26) ప్రత్యర్థిని దెబ్బ తీశారు. న్యూజిలాండ్ తాత్కాలిక సారథి సౌతీ విశ్రాంతి తీసుకోవడంతో ఈ మ్యాచ్‌లో సాన్‌ట్నర్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించాడు. రెండు జట్ల మధ్య తొలి టెస్టు ఈనెల 25న కాన్పూర్‌లో మొదలవుతుంది. రోహిత్ దూకుడు... భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ శుభారంభం చేశారు. బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి ఖాతా తెరిచిన రోహిత్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మిల్నే వేసిన రెండో ఓవర్లో ఇషాన్ కూడా రెండు ఫోర్లు కొట్టి స్కోరు బోర్డును పరుగెత్తించాడు. ఫెర్గూసన్ వేసిన ఆరో ఓవర్లో రోహిత్ రెండు ఫోర్లు, ఒక సిక్సర్ బాదగా... ఇషాన్ మరో ఫోర్ కొట్టాడు. దాంతో ఆ ఓవర్లో భారత్‌కు 20 పరుగులు లభించాయి. పవర్‌ప్లేలో భారత్ వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేసింది. పవర్ ప్లే ముగిశాక టీమిండియా ఇన్నింగ్స్ గాడి తప్పింది. సాన్‌ట్నర్ ఒకే ఓవర్లో ఇషాన్, సూర్యకుమార్ (0)లతో పాటు తన తర్వాతి ఓవర్లో పంత్ (4)ను అవుట్ చేశాడు. అయితే మరో ఎండ్‌లో రోహిత్ దూకుడు తగ్గించలేదు. అతడు 27 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం సోధి పట్టిన అద్భుత రిటర్న్ క్యాచ్‌తో రోహిత్ పెవిలియన్‌కు చేరాడు. దాంతో భారత్ 69/0 నుంచి 103/4గా నిలిచింది. చివర్లో హర్షల్ (11 బంతుల్లో 18; 2 ఫోర్లు, 1 సిక్స్), దీపక్ చహర్ దూకుడుగా ఆడారు. మిల్నే వేసిన ఆఖరి ఓవర్లో దీపక్ వరుసగా 4, 4, 2, 6, 2, 1తో 19 పరుగులు రాబట్టాడు. గప్టిల్ ఒక్కడే... భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు. ఓపెనర్ మిచెల్ (5) త్వరగా అవుటయ్యాడు. చాప్మన్ (0), ఫిలిప్స్ (0)లను అక్షర్ పెవిలియన్‌కు చేర్చాడు. ఓపెనర్ గప్టిల్ అర్ధ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. చహల్ బౌలింగ్‌లో గప్టిల్ భారీ షాట్‌కు యత్నించి లాంగాన్‌లో సూర్యకుమార్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్స్ విఫలమవ్వడంతో టీమిండియా విజయం ఖాయమైంది. మీకు తెలుసా? న్యూజిలాండ్‌పై భారత్‌కిది మూడో టి20 సిరీస్ విజయం. రెండు జట్ల మధ్య ఆరు టి20 సిరీస్‌లు జరిగాయి. మరో మూడింటిలో న్యూజిలాండ్ గెలిచింది. స్వదేశంలో రోహిత్ కెప్టెన్సీలో భారత్ గెలిచిన టి20 మ్యాచ్‌ల సంఖ్య. 11 భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి అండ్ బి) సోధి 56; ఇషాన్ (సి) సీఫెర్ట్ (బి) సాన్‌ట్నర్ 29; సూర్యకుమార్ (సి) గప్టిల్ (బి) సాన్‌ట్నర్ 0; పంత్ (సి) నీషమ్ (బి) సాన్‌ట్నర్ 4; శ్రేయస్ (సి) మిచెల్ (బి) మిల్నే 25; వెంకటేశ్ (సి) చాప్మన్ (బి) బౌల్ట్ 20; అక్షర్ (నాటౌట్) 2; హర్షల్ (హిట్‌వికెట్) (బి) ఫెర్గూసన్ 18; దీపక్ (నాటౌట్) 21; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 184. వికెట్ల పతనం: 1–69, 2–71, 3–83, 4–103, 5–139, 6–140, 7–162. బౌలింగ్: బౌల్ట్ 4–0–31–1, మిల్నే 4–0–47–1, ఫెర్గూసన్ 4–0–45–1, సాన్‌ట్నర్ 4–0–27–3, సోధి 4–0–31–1. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్టిల్ (సి) సూర్యకుమార్ (బి) చహల్ 51; మిచెల్ (సి) హర్షల్ (బి) అక్షర్ 5; చామ్మన్ (స్టంప్డ్) (బి) అక్షర్ 0; ఫిలిప్స్ (బి) అక్షర్ 0; సీఫెర్ట్ (రనౌట్) 17; నీషమ్ (సి) పంత్ (బి) హర్షల్ 3; సాన్‌ట్నర్ (రనౌట్) 2; మిల్నే (సి) రోహిత్ (బి) వెంకటేశ్ 7; సోధి (సి) సూర్యకుమార్ (బి) హర్షల్ 9; ఫెర్గూసన్ (సి అండ్ బి) దీపక్ 14; బౌల్ట్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (17.2 ఓవర్లలో ఆలౌట్) 111. వికెట్ల పతనం: 1–21, 2–22, 3–30, 4–69, 5–76, 6–76, 7–84, 8–93, 9–95, 10–111. బౌలింగ్: భువనేశ్వర్ 2–0–12–0, దీపక్ 2.2–0–26–1, అక్షర్ 3–0–9–3, చహల్ 4–0–26–1, వెంకటేశ్ 3–0–12–1, హర్షల్ 3–0–26–2. చదవండి: Unmukt Chand Marriage: ప్రేయసిని పెళ్లాడిన ఉన్ముక్త్ చంద్... ఫొటోలు వైరల్ -
పాపం హర్షల్ పటేల్.. రాహుల్ తర్వాత ఆ చెత్త రికార్డు నమోదు..
Harshal Patel becomes second Indian to be dismissed hit wicket in T20Is: టీ20ల్లో హర్షల్ పటేల్ ఓ చెత్త రికార్డును మూటకట్టుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో అనుహ్యరీతిలో హిట్ వికెట్‌గా హర్షల్ పటేల్ వెనుదిరిగాడు. దీంతో టీ20ల్లో టీమిండియా తరుపున హిట్ వికెట్‌గా ఔటైన రెండో ఆటగాడిగా హర్షల్ నిలిచాడు. ఇన్నింగ్స్ 19 ఓవర్ వేసిన లాకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో కట్ షాట్‌కు ప్రయత్నించిన హర్షల్ పటేల్.. తన బ్యాట్‌తో వికెట్లను టచ్ చేయడంతో ఈ ఆప్రతిష్టతను మూటకట్టుకున్నాడు. అంతకముందు 2018లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ హిట్ వికెట్‌గా ఔటయ్యాడు. కాగా ఈ మ్యాచ్‌లో హర్షల్ పటేల్ 11 బంతుల్లో 18 పరుగులు సాధించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మెదట బ్యాటింగ్ చేసిన టీమిండియా, కీవిస్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. టీమిండియా బ్యాటర్లలో రోహిత్ శర్మ(56) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, కిషన్(29), శ్రేయాప్ అయ్యర్(25),దీపక్ చాహర్(21) పరుగులతో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ మూడు వికెట్లు పడగొట్టగా, బౌల్ట్ రెండు వికెట్లు, సోధి, మిల్నే చెరో వికెట్ సాధించారు. ఇక 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ తడబడుతుంది. 10 ఓవర్లలలో మూడు వికెట్ల నష్టానికి కివీస్ 68 పరగులు చేసింది. pic.twitter.com/eelIHt718i — Simran (@CowCorner9) November 21, 2021 -
అసలు మెదటి మ్యాచ్ ఆడుతున్నట్లే అనిపించలేదు
Gautam Gambhir Comments on Harshal Patel: అంతర్జాతీయ అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టిన టీమిండియా ఫాస్ట్‌బౌలర్ హర్షల్ పటేల్‌పై భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. శుక్రవారం (నవంబర్ 19) న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో హర్షల్ పటేల్ అరంగేట్రం చేశాడు. తొలి టీ20లో గాయపడిన మహ్మద్ సిరాజ్ స్థానంలో హర్షల్ జట్టులోకి వచ్చాడు. డెబ్యూ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన హర్షల్ పటేల్ 25 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు. అంతేకాకుండా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా హర్షల్ పటేల్ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో హర్షల్ తన తొలి మ్యాచ్ ఆడుతున్నట్లు కనించలేదని, అనుభవజ్ఞుడులా బౌలింగ్ చేశాడిని గంభీర్ తెలిపాడు. సుదీర్ఘకాలం పాటు దేశవాళీ క్రికెట్, ఐపీఎల్లో ఆడడం అతడికి ఎంతో ఉపయోగపడింది అని గంభీర్ చెప్పాడు. “హర్షల్ పటేల్ అద్బుతమైన బౌలర్. అతడు తన మొదటి మ్యాచ్ ఆడుతున్నట్లు అనిపించలేదు. అతడి ప్రదర్శన నన్ను చాలా ఆకట్టుకుంది. 8-10 సంవత్సరాల ఫస్ట్-క్లాస్ క్రికెట్, ఐపీఎల్లో ఆడడం అతనికి కలిసొచ్చింది. ఐపీఎల్లో హర్షల్ పటేల్ ఏ విధంగా అయితే రాణించాడో భారత తరుపున అదే విధంగా రాణించాలి అని కోరుకుంటున్నాను. అంతర్జాతీయ స్ధాయిలో ఆడటం పట్ల అతడు చాలా సంతోషంగా ఉన్నాడు" అని గంభీర్ స్టార్ స్పోర్ట్స్ షోలో పేర్కొన్నాడు. చదవండి: Pat Cummins : ఆస్ట్రేలియా కొత్త కెప్టెన్‌గా పాట్ కమిన్స్..! -
వారెవ్వా హర్షల్ పటేల్.. డెబ్యూ మ్యాచ్‌లోనే ఇరగదీశాడు
Harshal Patel Best Bowling Debut T20I Match.. టీమిండియా పేసర్ హర్షల్ పటేల్ డెబ్యూ మ్యాచ్‌లోనే ఇరగదీశాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్ ద్వారా 94వ ఆటగాడిగా టీమిండియా తరపున టి20ల్లో అరంగేట్రం చేశాడు. బౌలింగ్‌లో నాలుగు ఓవర్లు వేసిన హర్షల్ పటేల్ 25 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు. హర్షల్ తాను వేసిన ప్రతీ బంతి దాదాపు 140 కిమీ వేగంతో విసరడం విశేషం. అలా తన డెబ్యూ మ్యాచ్‌తోనే హర్షల్ అందరిచేత ప్రశంసలు అందుకున్నాడు. ఇక కివీస్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత హర్షల్ పటేల్ తన బౌలింగ్ ప్రదర్శనపై స్పందించాడు. ''దేశానికి ఆడడం గర్వంగా ఉంటుంది. ఆటను ఇష్టపడే నేను.. దేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. మ్యాచ్‌కు ముందు ద్రవిడ్ సర్ నాతో మాట్లాడుతూ.. నీ ప్రిపరేషన్ ముగిసింది అంటే మ్యాచ్‌లో వికెట్లు తీస్తూ ఎంజాయ్ చేయాలని చెప్పాడు. ద్రవిడ్ అన్నట్లుగానే తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకునే ప్రదర్శన చేయడం సంతోషం కలిగించింది. ఐపీఎల్ ఫామ్‌ను ఇక్కడ కంటిన్యూ చేస్తూ డెబ్యూ మ్యాచ్‌లోనే రెండు వికెట్లు తీశాను. ఈ ప్రదర్శన ఎప్పటికి మరిచిపోను.'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: Harshal Patel: 30 ఏళ్ల 361 రోజులు.. హర్షల్ పటేల్ కొత్త చరిత్ర Axar patel: అక్షర్ పటేల్.. 2017 తర్వాత మళ్లీ ఇప్పుడే -
30 ఏళ్ల 361 రోజులు.. హర్షల్ పటేల్ కొత్త చరిత్ర
Harshal Patel Sixth Oldest Player T20I Debut For Team India.. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా తరపున హర్షల్ పటేల్ టి20ల్లో 94వ ఆటగాడిగా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఈ సందర్భంగా లేటు వయసులో టి20ల్లో అరంగేట్రం చేసిన ఆటగాడిగా హర్షల్ పటేల్ కొత్త చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం హర్షల్ పటేల్ 30 ఏళ్ల 361 రోజులతో ఆరో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో రాహుల్ ద్రవిడ్ 38 ఏళ్ల 232 రోజులు.. మొదటిస్థానంలో ఉన్నాడు. సచిన్ టెండూల్కర్(33 ఏళ్ల 221 రోజులు), శ్రీనాథ్ అరవింద్( 31 ఏళ్ల 177 రోజులు), స్టువర్ట్ బిన్నీ(31 ఏళ్ల 44 రోజులు), మురళీ కార్తిక్( 31 ఏళ్ల 39 రోజులు) వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. చదవండి: Shoaib Malik: మరీ ఇంత బద్దకమా; విచిత్రరీతిలో రనౌట్ ఇక ఐపీఎల్ 2021 సీజన్లో ఆర్సీబీకి ఆడిన హర్షల్ పటేల్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఈ సీజన్లో 15 మ్యాచ్‌లాడి 32 వికెట్లు తీసుకున్న హర్షల్ పటేల్ అత్యధిక వికెట్లతో పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఇక ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో హర్షల్ పటేల్ డ్వేన్ బ్రావోతో కలిసి సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచాడు. చదవండి: PAK vs BAN: ఓటమి అంచుల వరకు వెళ్లింది.. కానీ గెలిచింది Really nice to see Ajit Agarkar giving the debut cap for Harshal Patel, leading wicket taker in IPL 2021, one of the stars and making the debut for India tonight.pic.twitter.com/ct9QN5I3n0 — Johns. (@CricCrazyJohns) November 19, 2021 -
రోహిత్‌కే టి20 పగ్గాలు.. జట్టులోకి వెంకటేశ్ అయ్యర్, రుతురాజ్
Venkatesh Iyer, Ruturaj Gaikwad, Harshal Patel Picked For T20Is Against New Zealand: న్యూఢిల్లీ: ఊహించిందే జరిగింది. లాంఛనం ముగిసింది. భారత టి20 క్రికెట్ జట్టుకు పూర్తిస్థాయి నాయకత్వ మార్పిడి జరిగింది. టీమిండియా టి20 జట్టుకు కొత్త కెప్టెన్‌గా రోహిత్ శర్మను నియమిస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం ప్రకటించింది. యూఏఈలో జరిగిన ఐపీఎల్ టోర్నీ సందర్భంగా టి20 ప్రపంచకప్ తర్వాత తాను భారత టి20 జట్టు కెప్టెన్సీ నుంచి వైదొలుగుతానని విరాట్ కోహ్లి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోహ్లి స్థానంలో మరో సీనియర్ క్రికెటర్ రోహిత్ శర్మను ఈ ఫార్మాట్లో కెప్టెన్‌గా నియమిస్తారని ప్రచారం జరిగింది. ఎలాంటి సంచలనాలకు తావివ్వకుండా బీసీసీఐ సెలెక్షన్ కమిటీ రోహిత్ శర్మకే టి20 పగ్గాలు అప్పగించింది. కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. టి20 ఫార్మాట్లో రోహిత్ శర్మకు కెప్టెన్సీ కొత్తేమీ కాదు. ఐపీఎల్లో రోహిత్ సారథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టు ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచింది. గతంలో కోహ్లి గైర్హాజరీలో రోహిత్ శర్మ 19 మ్యాచ్‌ల్లో భారత టి20 జట్టుకు తాత్కాలికంగా నాయకత్వం వహించాడు. రోహిత్ కెప్టెన్సీలో భారత జట్టు 15 మ్యాచ్‌ల్లో గెలిచి, 4 మ్యాచ్‌ల్లో ఓడింది. 2017లో 3 మ్యాచ్‌ల్లో... 2018లో 9 మ్యాచ్‌ల్లో... 2019లో 6 మ్యాచ్‌ల్లో... 2020లో ఒక్క మ్యాచ్‌లో రోహిత్ భారత టి20 జట్టుకు తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు. హార్దిక్, వరుణ్‌లపై వేటు టి20 ప్రపంచకప్‌లో భారత జట్టు లీగ్ దశలోనే నిష్క్రమించడం... ఈనెల 17 నుంచి స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ ఉండటంతో మంగళవారం బీసీసీఐ సెలెక్షన్ కమిటీ 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. టి20 ప్రపంచకప్ బరిలో దిగిన 15 మంది జట్టులో ఏడుగురు మాత్రమే న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ఎంపికయ్యారు. ఫిట్నెస్ సమస్యలు.. ఫామ్‌లో లేకపోవడం కారణంగా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిలపై సెలెక్టర్లు వేటు వేశారు. టి20 ప్రపంచకప్‌లో ఆడిన శార్దుల్ ఠాకూర్, రాహుల్ చహర్‌లను కూడా న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ఎంపిక చేయలేదు. కోహ్లి, బుమ్రా, షమీ, రవీంద్ర జడేజాలకు వారి కోరిక మేరకు విశ్రాంతి ఇచ్చారు. శ్రేయస్ అయ్యర్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్, దీపక్ చహర్, హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్‌లకు మళ్లీ పిలుపు వచ్చింది. మూడు కొత్త ముఖాలు... ఐపీఎల్లో నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్న వెంకటేశ్ అయ్యర్ (కోల్‌కతా నైట్‌రైడర్స్), హర్షల్ పటేల్ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు), అవేశ్ ఖాన్ (ఢిల్లీ క్యాపిటల్స్)లకు తొలిసారి జాతీయ జట్టులో స్థానం దక్కింది. మధ్యప్రదేశ్‌కు చెందిన 26 ఏళ్ల వెంకటేశ్ అయ్యర్ ఈ ఏడాది ఐపీఎల్లో 370 పరుగులు చేయడంతోపాటు మూడు వికెట్లు తీశాడు. దేశవాళీ క్రికెట్లో హరియాణా జట్టుకు ఆడే గుజరాత్‌కు చెందిన 30 ఏళ్ల హర్షల్ పటేల్ ఐపీఎల్లో 32 వికెట్లు తీసి ‘పర్పుల్ క్యాప్’ గెల్చుకున్నాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన 24 ఏళ్ల అవేశ్ ఖాన్ ఈ ఐపీఎల్లో 24 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్లో 635 పరుగులు సాధించిన మహారాష్ట్ర ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్‌కు కూడా జట్టులో చోటు దక్కింది. ఇటీవల శ్రీలంకలో పర్యటించిన రుతురాజ్ భారత్ తరఫున రెండు టి20 మ్యాచ్‌ల్లో ఆడాడు. తొలి టెస్టుకు కూడా రోహితే కెప్టెన్! న్యూజిలాండ్‌తో టి20 సిరీస్ ముగిశాక రెండు టెస్టులు జరగనున్నాయి. తొలి టెస్టుకు కూడా కోహ్లి అందుబాటులో ఉండటంలేదని.. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ తొలి టెస్టులో టీమిండియాకు నేతృత్వం వహిస్తాడని సమాచారం. డిసెంబర్ 3 నుంచి 7 వరకు ముంబైలో జరిగే రెండో టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ కోహ్లి జట్టుకు అందుబాటులో ఉంటాడని తెలిసింది. ఇక వన్డే ఫార్మాట్లోనూ కోహ్లిని కెప్టెన్సీ నుంచి తప్పించి రోహిత్ శర్మకే పగ్గాలు ఇవ్వాలని బీసీసీఐ సెలెక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. అయితే భారత జట్టు వచ్చే జనవరిలో దక్షిణాఫ్రికాలో వన్డే సిరీస్ ఆడనుండటంతో అప్పుడే ఈ మార్పు జరిగే అవకాశముంది. భారత టి20 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, యజువేంద్ర చహల్, అశ్విన్, అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్, భువనేశ్వర్, దీపక్ చహర్, హర్షల్ పటేల్, మొహమ్మద్ సిరాజ్. భారత్, న్యూజిలాండ్ టి20 సిరీస్ షెడ్యూల్ నవంబర్ 17: తొలి మ్యాచ్ (జైపూర్‌లో) నవంబర్ 19: రెండో మ్యాచ్ (రాంచీలో) నవంబర్ 21: మూడో మ్యాచ్ (కోల్‌కతాలో) NEWS - India’s squad for T20Is against New Zealand & India ‘A’ squad for South Africa tour announced.@ImRo45 named the T20I Captain for India. More details here - https://t.co/lt1airxgZS #TeamIndia pic.twitter.com/nqJFWhkuSB — BCCI (@BCCI) November 9, 2021 చదవండి: పొట్టి క్రికెట్లో ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన భారత్-పాక్ మ్యాచ్ -
IPL 2021 Prize Money: విజేతకు 20 కోట్లు.. మరి వాళ్లందరికీ ఎంతంటే!
IPL 2021 Prize Money: ఐపీఎల్-2021 విజేతగా చెన్నై సూపర్‌కింగ్స్ అవతరించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై విజయం సాధించి నాలుగోసారి ట్రోఫీని ముద్దాడింది. మరి... టైటిల్ విన్నర్, రన్నరప్ గెలుచుకున్న ప్రైజ్ మనీ ఎంత? ఎమర్జింగ్ ప్లేయర్, ఫెయిర్ ప్లే, గేమ్ ఛేంజర్ ఆఫ్ ది సీజన్, అత్యధిక సిక్సర్ల వీరుడు ఎవరు.. వాళ్లు గెలుచుకున్న మొత్తం ఎంత? తదితర అంశాలను పరిశీలిద్దాం. అవార్డు ప్లేయర్ గెలుచుకున్న మొత్తం (రూపాయల్లో) ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు రుతురాజ్ గైక్వాడ్ 10 లక్షలు ఫెయిర్ ప్లే అవార్డు రాజస్తాన్ రాయల్స్ 10 లక్షలు గేమ్ ఛేంజర్ ఆఫ్ ది సీజన్ హర్షల్ పటేల్ 10 లక్షలు సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ షిమ్రోన్ హెట్మెయిర్ 10 లక్షలు మాక్సిమమ్ సిక్సెస్ అవార్డు కేఎల్ రాహుల్ 10 లక్షలు పవర్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ వెంకటేశ్ అయ్యర్ 10 లక్షలు పర్ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ది సీజన్ రవి బిష్ణోయి 10 లక్షలు పర్పుల్ క్యాప్ హర్షల్ పటేల్ 10 లక్షలు ఆరెంజ్ క్యాప్ రుతురాజ్ గైక్వాడ్ 10 లక్షలు అత్యంత విలువైన ఆటగాడు హర్షల్ పటేల్ 10 లక్షలు విజేత చెన్నై సూపర్ కింగ్స్ 20 కోట్లు రన్నరప్ కోల్‌కతా నైట్‌రైడర్స్ 12.5 కోట్లు మూడోస్థానం ఢిల్లీ క్యాపిటల్స్ 8.75 కోట్లు నాలుగో స్థానం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 8.75 కోట్లు చదవండి: IPl 2021 Final: ఈ ఏడాది టైటిల్ గెలిచే అర్హత కేకేఆర్‌కు ఉంది: ధోని -
హర్షల్ పటేల్‌ను అభినందనల్లో ముంచెత్తిన బ్రావో.. సూపర్ అంటూ..
Harshal Patel: ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ అరుదైన రికార్డు సాధించాడు. ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా హర్షల్ పటేల్ చరిత్ర సృష్టించాడు. దీంతో హర్షల్ పటేల్ 2013 సీజన్లో అత్యధిక వికెట్లు (32) తీసిన డ్వేన్ బ్రావో రికార్డును సమం చేశాడు. ఈ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో తనతో సమంగా నిలిచిన హర్షల్ పటేల్‌ను అభినందించాడు. "అభినందనలు హర్షల్. నీవు ఖచ్చితంగా ఈ రికార్డును సాధిస్తావు !! నీ పోరాట పటిమ చూడటానికి చాలా బాగుంది!' అని బ్రావో ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాశాడు. కాగా మొత్తం 15 మ్యాచ్‌లాడిన హర్షల్ పటేల్ 32 వికెట్లు పడగొట్టాడు. అయితే ఎలిమినేటర్ మ్యాచ్ లో భాగంగా సోమవారం కోల్‌కతా నైట్ రైడర్స్ జరిగిన మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టిన హర్షల్ ఈ ఘనత సాధించాడు. కాగా 17ఓవర్ వేసిన హర్షల్ పటేల్ బౌలింగ్‌లో సునీల్ నరైన్ క్యాచ్ పడక్కల్ వదిలివేయడంతో ఒక సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డను తృటిలో చేజార్చుకున్నాడు. ఇప్పటికే ఓ ఐపీఎల్ సీజన్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా హర్షల్ పటేల్ నిలిచాడు. కాగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సోమవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దీంతో కేకేఆర్.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో క్వాలిఫైయర్-2 ఆడేందుకు అర్హత సాధించగా... కోహ్లి సేన ఇంటిముఖం పట్టింది. చదవండి: Glenn Maxwell: కొంచెం డీసెంట్‌గా ఉండండి.. చెత్తగా వాగొద్దు -
ఐపీఎల్లో హర్షల్ పటేల్ నయా రికార్డు
Harshal Patel Most wickets In IPL Season.. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) బౌలర్ హర్షల్ పటేల్ అరుదైన ఘనత అందుకున్నాడు. ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా హర్షల్ పటేల్ చరిత్ర సృష్టించాడు. మొత్తం 15 మ్యాచ్‌లాడిన హర్షల్ పటేల 32 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒక హ్యాట్రిక్ ఉండడం విశేషం. తద్వారా హర్షల్ పటేల్ సీఎస్కే బౌలర్ డ్వేన్ బ్రావోతో సమానంగా అగ్రస్థానంలో నిలిచాడు. 2013 ఐపీఎల్లో సీఎస్కే తరపున ఆ సీజన్లో 32 వికెట్లు తీశాడు. హర్షల్ పటేల్, బ్రావోల తర్వాత రెండో స్థానంలో కగిసో రబడ( ఢిల్లీ క్యాపిటల్స్, 30 వికెట్లు, ఐపీఎల్ 2020) ఉన్నాడు. ఇక జేమ్స్ ఫాల్కనర్ (28వికెట్లు, 2013 ఐపీఎల్), లసిత్ మలింగ (28 వికెట్లు, 2011 ఐపీఎల్), బుమ్రా( 27 వికెట్లు, ఐపీఎల్ 2020) వరుసగా మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో ఉన్నారు. కాగా 139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ ప్రస్తుతం 18 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. కేకేఆర్ విజయానికి ఇంకా 12 పరుగుల దూరంలో ఉంది. -
అరుదైన రికార్డుకు చేరువలో హర్షల్ పటేల్..
Harshal Patel On The Brink Of Breaking This Huge IPL Record: ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ అరుదైన ఘనతకు చేరువలో ఉన్నాడు. ఐపీఎల్ సీజన్లో అత్యధిక వికెట్ల తీసిన రికార్డు చెన్నై బౌలర్ డ్వేన్ బ్రావో పేరిట ఉంది. 2013 సీజన్లో బ్రేవో ఏకంగా 32 వికెట్లు పడగొట్టాడు. కాగా ప్రస్తుతం ఈ సీజన్లో హర్షల్ ఖాతాలో 30 వికెట్లు ఉన్నాయి. నేడు కోల్‌కతాతో జరగనున్న మ్యాచ్‌లో మరో రెండు వికెట్లు సాధిస్తే ఆ ఘనత అతడి సొంతమవుతుంది. ఇప్పటికే ఓ ఐపీఎల్ సీజన్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా హర్షల్ పటేల్ నిలిచిన సంగతి తెలిసిందే. ఎలిమినేటర్ మ్యాచ్ లో భాగంగా నేడు(సోమవారం) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. కోల్‌కతా నైట్ రైడర్స్ తో తలపడనుంది. చదవండి: Virat Kohli: కెప్టెన్సీ నుంచి ఎందుకు తప్పుకున్నాడో బయట పెట్టిన కోహ్లి... -
చరిత్ర తిరగరాసిన ఆర్సీబీ బౌలర్.. బుమ్రా రికార్డు బద్దలు
Harshal Patel Breaks Bumrah IPL Record: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ చరిత్రను తిరగరాసాడు. ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పేరిట ఉన్న రికార్డు(27 వికెట్లు)ను బద్దలు కొట్టి.. ఓ ఐపీఎల్ సీజన్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా నిలిచాడు. బుధవారం సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టిన హర్షల్.. అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ప్రస్తుతం ఈ సీజన్లో హర్షల్ ఖాతాలో 29 వికెట్లు ఉన్నాయి. ఈ సీజన్లో ఆర్సీబీ కనీసం మరో రెండు మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉండడంతో అతను ఐపీఎల్ సీజన్లో అత్యధిక వికెట్ల రికార్డును కూడా బద్దలు కొట్టే అవకాశం ఉంది. ఈ రికార్డు చెన్నై బౌలర్ డ్వేన్ బ్రావో పేరిట ఉంది. 2013 సీజన్లో బ్రేవో ఏకంగా 32 వికెట్లు పడగొట్టాడు. కాగా, లీగ్ దశలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. చదవండి: Umran Malik: పళ్లు, కూరగాయలు అమ్ముతాం.. మమ్మల్ని గర్వపడేలా చేశాడు -
హర్షల్ పటేల్ సూపర్ త్రో.. మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్
Harshal Patel Super Throw Turning Point For RCB.. ఐపీఎల్ 2021 సీజన్లో ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ సత్తా చాటింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 6 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆర్సీబీ ఈ సీజన్లో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన మూడో జట్టుగా నిలిచింది. అయితే 19వ ఓవర్ వరకు ఇరు జట్ల మధ్య విజయం దోబుచులాడింది. ఇక ఆఖరి ఓవర్లో పంజాబ్ విజయానికి 19 పరుగులు అవసరమయ్యాయి. కాగా 20వ ఓవర్‌ను హర్షల్ పటేల్ వేశాడు. కాగా హర్షల్ తన తొలి బంతికే షారుక్ ఖాన్‌ను అద్భుత త్రోతో రనౌట్‌గా పెవిలియన్‌కు చేర్చాడు. మ్యాచ్‌కు ఇదే టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అంతకముందు ఒక ఫోర్.. ఒక సిక్స్‌తో షారుక్ మంచి టచ్‌లో ఉన్నాడు. అతను స్ట్రైక్ తీసుకోవాలని భావించాడు. అందుకే హర్షల్ వేసిన తొలి బంతిని హెన్రిక్స్ ఢిఫెన్స్ ఆడినప్పటికి షారుక్ అనవసరంగా పరుగుకు కాల్ ఇచ్చాడు. ఇంకేముంది అప్పటికే సగం క్రీజులో ఉన్న హర్షల్ మెరుపువేగంతో బంతిని త్రో విసరగా.. నేరుగా వికెట్లను గిరాటేసింది. దీంతో షారుక్ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఇక షారుక్ అవుటయ్యాడని తెలియగానే కోహ్లి సంబరాలు మాములుగా లేవు. మైదానంలో నే గెంతులు వేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ మ్యాక్స్‌వెల్ మెరుపులతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన పంజాబ్ 6 వికెట్లు నష్టపోయి 158 పరుగులకే పరిమితమై 6 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. చదవండి: కేఎల్ రాహుల్ కొత్త చరిత్ర.. వరుసగా నాలుగోసారి Glenn Maxwell: ఒకసారి అంటే సరే.. మళ్లీ అదేనా.. ఏంటి మ్యాక్సీ -
ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ బౌలర్ సరికొత్త రికార్డు..
Harshal Patel Breaks Chahal IPL Record: ఐపీఎల్-2021 సెకెండ్ ఫేస్‌లో భాగంగా బుధవారం(సెప్టెంబర్ 29) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సరికొత్త రికార్డు ఆవిష్కృతమైంది. ఐపీఎల్ చరిత్రలో ఓ సీజన్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన అన్క్యాప్డ్ ప్లేయర్‌గా ఆర్సీబీ బౌలర్ హర్షల్ పటేల్(11 మ్యాచ్‌ల్లో 26 వికెట్లు) రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసుకోవడంతో ద్వారా హర్షల్.. సహచర ఆటగాడు చహల్ పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు. చాహల్ 2015లో అన్క్యాప్డ్ ప్లేయర్‌గా బరిలోకి దిగి 15 మ్యాచ్‌ల్లో 23 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో హర్షల్ మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఓ సీజన్లో ఆర్సీబీ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. గతంలో ఈ రికార్డు(23 వికెట్లు) చహల్, వినయ్‌కుమార్‌ల పేరిట ఉండేది. ప్రస్తుత సీజన్లో హర్షల్ మరో 7 వికెట్లు పడగొడితే లీగ్ చరిత్రలో ఓ సీజన్లో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. 2013 సీజన్లో చెన్నై బౌలర్ డ్వేన్ బ్రేవో ఏకంగా 32 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే, నిన్న రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్షల్ పటేల్ ఆఖరి ఓవర్లో మూడు వికెట్లు తీశాడు. ఈ మధ్యే ముంబైతో మ్యాచ్‌లో అతను హ్యాట్రిక్ కూడా నమోదు చేశాడు. ఇప్పటివరకు 59 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన హర్షల్ 72 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. చదవండి: IPL 2021: అదిరిపోయే రికార్డు.. లీగ్ చరిత్రలో అత్యధికం -
Harshal Patel: కోహ్లి తొడను గట్టిగా రుద్దేశాను.. సిరాజ్ కాలికి గాయం!
Harshal Patel on His hat-trick Celebrations Vs MI: కెరీర్లో తొలి హ్యాట్రిక్ విజయం సాధించడం ఏ బౌలర్‌కైనా మధుర జ్ఞాపకమే. అలాంటి ఆనంద క్షణాల్లో పక్కన ఉన్న వాళ్లతో సంతోషం పంచుకోవడం, ఎగిరి గంతేయడం సహజం. ఐపీఎల్-2021 రెండో అంచెలో భాగంగా సెప్టెంబరు 26న దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్ అలాంటి అద్భుత అనుభూతిని పొందాడు. 17వ ఓవర్లో ముంబై ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, రాహుల్ చహర్ వెంట వెంటనే అవుట్ చేసి.. తొలి హ్యాట్రిక్ కొట్టాడు. దీంతో అతడి సంబరాలు అంబరాన్నంటాయి. కెప్టెన్ విరాట్ కోహ్లి, సహచర బౌలర్ మహ్మద్ సిరాజ్ సహా జట్టు సభ్యులంతా అతడిని ఆలింగనం చేసుకుని అభినందనలు తెలిపారు. అయితే, ఆ సమయంలో కోహ్లి, సిరాజ్‌కు చిన్నపాటి అసౌకర్యం కలిగింది. స్వల్ప గాయాలు కూడా అయ్యాయట. ఈ విషయం గురించి 30 ఏళ్ల హర్షల్ పటేల్ ఐపీఎల్20.కామ్‌తో మాట్లాడుతూ.. తన వల్ల వాళ్లిద్దరికీ ఇబ్బంది కలిగిందన్నాడు. ‘‘అవును.. నా సెలబ్రేషన్స్‌లో భాగంగా సిరాజ్ కాలికి గాయమైంది. అయితే, ఇప్పుడు తను బాగున్నాడు. హ్యాట్రిక్ కొట్టిన ఆనందంలో కోహ్లి... తొడను గట్టిగా రుద్దేశాను. తనకు అసౌకర్యం కలిగించాను. అందుకే, సెలబ్రేషన్ అయి పోగానే వారిద్దరి పరిస్థితి ఎలా ఉందని ఆరా తీశాను’’ అని చెప్పుకొచ్చాడు. బుధవారం నాడు రాజస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు ఈ మేరకు మాట్లాడుతూ... తన బౌలింగ్ శైలికి యూఏఈ పరిస్థితులు చక్కగా సరిపోతాయని పేర్కొన్నాడు. ఇక నిన్నటి మ్యాచ్‌లో హర్షల్ పటేల్.. 3 వికెట్లతో రాణించిన సంగతి తెలిసిందే. చదవండి: Glenn Maxwell: కోహ్లి 10 వేలు, మాక్సీ 7 వేల పరుగులు.. ఇప్పుడు చెప్పండిరా! T20 World Cup 2021: మంచి ఫామ్‌లో ఉన్నాడు.. కానీ దురదృష్టవంతుడు We couldn’t be more proud of that performance last night, @HarshalPatel23! 🤩#PlayBold #WeAreChallengers #IPL2021 pic.twitter.com/vq0YkoMbU8 — Royal Challengers Bangalore (@RCBTweets) September 27, 2021 -
తొలి భాగం మొత్తం వీళ్లదే.. రాహుల్ మెరుపులు.. గబ్బర్ గర్జన.. సంజూ శతక్కొట్టుడు
Recap Of First Half IPL 2021: క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్-2021 రెండో అంచె నేటి నుంచి ప్రారంభం కానుంది. కోవిడ్ కారణంగా ఆకస్మికంగా వాయిదా పడిన క్యాష్ రిచ్ లీగ్.. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే మ్యాచ్‌తో పునః ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సీజన్ మొదటి దశలో చాలా మ్యాచ్‌లు హోరాహోరీగా సాగాయి. బౌలర్లపై బ్యాట్స్మెన్లు పూర్తి ఆధిపత్యం చలాయించారు. భారీ సంఖ్యలో ఫోర్లు, సిక్సర్లు నమోదవ్వడంతో పరుగుల వరద పారింది. కొన్ని మ్యాచ్‌ల్లో బౌలర్లు సైతం ప్రతాపం చూపినప్పటికీ వారి ప్రభావం నామమాత్రమే. సీజన్ తొలి దశలో నమోదైన గణాంకాలను పరిశీలిస్తే.. టీమిండియా బ్యాట్స్మెన్లు పరుగుల వరద పారించారు. ముఖ్యంగా శిఖర్ ధవన్, కేఎల్ రాహుల్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న గబ్బర్.. ఇప్పటివరకు జరిగిన 8 మ్యాచ్‌ల్లో 54.28 సగటుతో 380 పరుగులు చేసి ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుత సీజన్లో అత్యధిక ఫోర్ల (43) రికార్డు కూడా ధవన్ పేరిటే ఉంది. ఈ సీజన్లో ఇప్పటివరకు 3 హాఫ్ సెంచరీలు నమోదు చేసిన ధవన్.. ఓ ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 92 పరుగులు చేశాడు. తొలి దశలో గర్జించిన గబ్బర్.. రెండో దశలో ఎలా రాణిస్తాడోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చదవండి: IPL 2021: జోరు మీదున్న ధోని.. సీఎస్కే ప్రతీకారం తీర్చుకుంటుందా? మరోవైపు తొలిదశ ఐపీఎల్-2021లో టీమిండియా మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ సైతం మెరుపులు మెరిపించాడు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా ఆశించిన మేరకు ప్రభావం చూపనప్పటికీ.. వ్యక్తిగతంగా రాణించాడు. ఈ సీజన్లో రాహుల్ సారధ్యంలో పంజాబ్ 8 మ్యాచ్‌ల్లో మూడింటిలో మాత్రమే నెగ్గింది. అయినా బ్యాట్స్‌మెన్‌గా రాహుల్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 7 మ్యాచ్‌ల్లో 66.20 సగటుతో 331 పరుగులు చేసి ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. దీంతో పాటు ఈ సీజన్లో అత్యధిక సిక్సర్లు (16), అత్యధిక అర్ధ సెంచరీ(4)ల రికార్డులు కూడా రాహుల్ పేరిటే నమోదై ఉన్నాయి. కాగా, టీమిండియా టీ20 కెప్టెన్సీ రేసులో ఉన్న రాహుల్ రెండో దశలోనూ రాణించి.. జట్టును విజయాల బాట పట్టించాలని పంజాబ్ కింగ్స్ అభిమానులు కోరుకుంటున్నారు. వీరిద్దరితో పాటు చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు డుప్లెసిస్( 7 మ్యాచ్‌ల్లో 64 సగటుతో 320 పరుగులు, 4 హాఫ్ సెంచరీలు), మరో ఢిల్లీ ఆటగాడు పృథ్వీ షా(8 మ్యాచ్‌ల్లో 38.50 సగటుతో 308 పరుగులు, 3 అర్ధ శతకాలు), రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ సామ్సన్(7 మ్యాచ్‌ల్లో 46.16 సగటు, 145.78 స్ట్రయిక్ రేట్‌తో 277 పరుగులు, సెంచరీ), మరో రాజస్థాన్ ఆటగాడు జోస్ బట్లర్(7 మ్యాచ్‌ల్లో 36. 29 సగటు, 153.01 స్ట్రయిక్ రేట్‌తో 254 పరుగులు, సెంచరీ), రాయల్ ఛాలెంజర్స్ ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్(6 మ్యాచ్‌ల్లో 39 సగటు, 152.34 స్ట్రయిక్ రేట్‌తో 195 పరుగులు, సెంచరీ) జోరును ప్రదర్శించారు. ఇక బౌలింగ్ విషయానికొస్తే.. ఆర్సీబీ బౌలర్ హర్షల్ పటేల్ సీజన్ మొత్తానికే హైలైట్‌గా నిలిచాడు. 7 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు పడగొట్టి సీజన్ టాప్ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ఇందులో ఓసారి ఐదు వికెట్ల ప్రదర్శన(5/27) కూడా ఉంది. హర్షల్ తర్వాత చెప్పుకోదగ్గ బౌలింగ్ ప్రదర్శనల్లో ఆవేశ్ ఖాన్(8 మ్యాచ్‌ల్లో 14), క్రిస్ మోరిస్(7 మ్యాచ్‌ల్లో 14) ఉన్నారు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ ఆటగాడు ఆండ్రీ రసెల్(5/15) సీజన్ అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. చదవండి: ఆ మూడు బాదితే రోహిత్ ఖాతాలో మరో రికార్డు.. -
ఇరగదీసిన డివిల్లియర్స్.. సిక్సర్ల వర్షం.. కానీ సెంచరీ వృథా!
AB de Villiers Scores Century Intra Squad Match : ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండో దశ ఆరంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే యూఏఈ చేరుకున్న జట్లు ప్రాక్టీసు మొదలెట్టేశాయి. ఇక ఈసారైనా కప్ కొట్టాలన్న ఆశయంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు నెట్స్‌లో గట్టిగానే శ్రమిస్తున్నారు. రెండు జట్లుగా విడిపోయి ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్‌లతో కావాల్సినంత ప్రాక్టీసు చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం నాటి మ్యాచ్‌లో... ఆర్సీబీ ఏ కెప్టెన్ హర్షల్ పటేల్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో పవర్‌ప్లేలో వికెట్ కోల్పోయిన ‘ఏ’ జట్టును స్టార్ ఆటగాడు ఏబీ డివిల్లియర్స్, మహ్మద్ అజారుద్దీన్ ఆదుకున్నారు. ఏడో ఓవర్ ముగిసేసరికి డివిల్లియర్స్ హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. అదే జోరులో శతకం(46 బంతుల్లో 104 పరుగులుఏడు ఫోర్లు, 10 సిక్సర్లు) కూడా పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఆర్సీబీ ఏ 212 పరుగులు చేయగలిగింది. అయితే లక్ష్యఛేదనలో భాగంగా దేవదత్ పడిక్కల్ సారథ్యంలోని ఆర్సీబీ బీ మెరుగైన ఆట కనబరిచింది. చివరి రెండు బంతుల్లో మూడు పరుగులు చేయాల్సి ఉండగా.. బౌండరీ బాది విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మూడు వికెట్లు కోల్పోయి 216 పరుగులు సాధించి గెలుపొందింది. ఈ టీంలో కేఎస్ భరత్ 95 పరుగులు సాధించి సత్తా చాటగా.. ఆర్సీబీ ఏ జట్టులోని సెంచరీ చేసిన డివిల్లియర్స్ పోరాటం వృథాగా పోయింది. ఈ ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్‌కు సంబంధించిన వీడియోను ఆర్సీబీ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. చదవండి: IPL 2021 Phase 2: నాలాంటి ‘ఓల్డ్ మ్యాన్’కు కష్టమే: డివిల్లియర్స్ Bold Diaries: RCB’s Practice Match AB de Villiers scores a century, KS Bharat scores 95 as batsmen make merry in the practice match between Devdutt’s 11 and Harshal’s 11.#PlayBold #WeAreChallengers #IPL2021 pic.twitter.com/izMI4LCSG1 — Royal Challengers Bangalore (@RCBTweets) September 15, 2021 -
అత్యంత చెత్త రికార్డు సమం చేసిన ఆర్సీబీ బౌలర్
ముంబై: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) బౌలర్ హర్షల్ పటేల్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డును సమం చేశాడు. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్లో ఏకంగా 37 పరుగులు సమర్పించుకుని, 2011 సీజన్లో కొచ్చి టస్కర్స్ బౌలర్ ప్రశాంత్ పరమేశ్వరన్ 37 పరుగల చెత్త రికార్డును ఈక్వల్ చేశాడు. ప్రస్తుత సీజన్లో అత్యధిక వికెట్లతో పర్పుల్ క్యాప్‌ను(15 వికెట్లు) సొంతం చేసుకున్న హర్షల్ పటేల్.. ఈ మ్యాచ్‌లో మొదటి మూడు ఓవర్ల పాటు చాలా పొదుపుగా బౌలింగ్(14 పరుగలు) చేసి మూడు కీలక వికెట్లు తీసుకున్నాడు. అయితే, ఆఖరి ఓవర్లో జడ్డూ విశ్వరూపం ప్రదర్శించడంతో హర్షల్ తేలిపోయాడు. జడేజా ధాటికి అతను 5 సిక్స్‌లు, ఒక ఫోర్, డబుల్ నోబాల్‌తో కలిపి ఏకంగా 37 పరుగులు సమర్పించుకున్నాడు. గతంలో క్రిస్ గేల్ ధాటికి పరమేశ్వరన్ కూడా ఒకే ఓవర్లో 37 పరుగుల సమర్పించుకున్నాడు. పరమేశ్వరన్ బౌలింగ్‌లో గేల్ 4 సిక్స్‌లు, 3 ఫోర్లు బాది 36 పరుగులు పిండుకున్నాడు. ఇందులో ఒక నోబాల్ ఉంది. ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్ల జాబితాలో వీరి తర్వాత స్థానాల్లో పంజాబ్ బౌలర్ పర్వీందర్ ఆవానా(33 పరుగులు), పంజాబ్ బౌలర్ రవి బొపారా(33 పరుగులు) ఉన్నారు. ఆవానా బౌలింగ్‌లో చెన్నై ఆటగాడు రైనా 2 సిక్సర్లు, 5 ఫోర్లు, ఓ నోబాల్ కలిపి 33 పరుగుల రాబట్టగా, బొపారా బౌలింగ్‌లో గేల్ 4 సిక్సర్లు, 7 వైడ్లు, 2 సింగల్స్‌తో కలిపి 33 పరుగులు పిండుకున్నాడు. చదవండి: భజ్జీ.. సెలబ్రిటీలకు మాత్రమే రిప్లై ఇస్తావా? -
వార్నర్ అనుకున్నది తప్పు.. అంపైరే కరెక్ట్: ఎస్ఆర్హెచ్ కోచ్
చెన్నై: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ పేసర్ హర్షల్ పటేల్ రెండు ఫుల్‌టాస్ నో బాల్స్(బీమర్లు) వేశాడు. అయిన్పటికీ ఫీల్డ్ అంపైర్లు అతనికి ఎటువంటి వార్నింగ్ ఇవ్వలేదు. ఒక బీమర్‌ను చివరి ఓవర్ మూడో బంతికి సంధించిన హర్షల్.. 18 ఓవర్ నాల్గో బంతికి బీమర్ వేశాడు. ఈ రెండు బీమర్లలో ఒక దాన్ని రషీద్ ఖాన్ బౌండరీకి తరలించాడు. ఆఖరి ఓవర్లో యార్కర్ వేసే యత్నంలో బీమర్ పడగా, దాన్ని రషీద్ ఖాన్ భారీ షాట్‌గా మలిచాడు. కాగా, ఒక మ్యాచ్‌లో రెండు బీమర్లు వేసిన హర్షల్ పటేల్‌ను ఎందుకు ఓవర్ వేయకుండా నిషేధించలేదని డగౌట్లో ఉన్న ఎస్ఆర్హెచ్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. 2017 లో మార్చిన క్రికెట్ రూల్స్ ప్రకారం ఒక బౌలర్ రెండు బీమర్లు వేసి వార్నింగ్‌కు గురైతే అతన్ని మళ్లీ బౌలింగ్ ఎటాక్‌కు దిగకుండా నిబంధనను మార్చిన సంగతి తెలిసిందే. ఈ నిబంధననే గుర్తుచేశాడు వార్నర్. ఎందుకు హర్షల్ పటేల్ బౌలింగ్ చేయకుండా ఆపలేదని ప్రశ్నించాడు. ఇదే విషయాన్ని డగౌట్లో ఉన్న వారితో పంచుకున్నాడు ఈ లెఫ్ట్‌హ్యాండ్ బ్యాట్స్‌మన్. అయితే వార్నర్ ఏదైతే అనుకున్నాడో అది తప్పని అంటున్నాడు ఎస్ఆర్హెచ్ హెడ్ కోచ్. హర్షల్ పటేల్‌కు అంపైర్ ఎందుకు వార్నింగ్ ఇవ్వలేదో వివరించాడు. ట్రేవర్ బేలిస్. పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన బేలిస్.. ‘హర్షల్ రెండు బీమర్లు వేసిన మాట నిజమే. మామూలుగా రెండు బీమర్లు వేస్తే ఆ బౌలర్ బౌలింగ్ ఎటాక్ నిలిపివేయాలి. కానీ అంపైర్స్ అలా చేయలేదు. ఇక్కడ అంపైర్స్ చేసింది కర్టెక్టే. జేసన్ హోల్డర్‌కు హర్షల్ పటేల్ వేసిన తొలి బీమర్ బ్యాటర్స్ బాడీని టార్గెట్ చేసేదిగా లేదు. అది బ్యాట్స్‌మన్ బాడీకి బాగా పక్కగా వెళ్లింది. దాంతో రెండో బీమర్ వేసినా కూడా అంపైర్ ఎటువంటి వార్నింగ్ ఇవ్వలేదు. ఇక్కడ అంపైర్ చేసింది కరెక్ట్’ అని బేలిస్ చెప్పుకొచ్చాడు. ఓవరాల్‌గా తాము మంచి క్రికెట్ ఆడకపోవడం వల్లే ఓటమి చవిచూడాల్సి వచ్చిందని బేలీస్ అన్నాడు. ఆర్సీబీ నిర్దేశించిన 150 పరుగుల టార్గెట్‌ను ఛేదించలేక చతికిలబడింది. గెలవాల్సిన మ్యాచ్‌ను తీసుకెళ్లి ఆర్సీబీ చేతిలో పెట్టింది. ఆరు పరుగుల తేడాతో ఆరెంజ్ ఆర్మీ ఓటమి పాలైంది. 15 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లను కోల్పోవడంతో సన్‌రైజర్స్ తిరిగి తేరుకోలేకపోయింది. 0 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 143 పరుగులకే పరిమితమైన సన్‌రైజర్స్ పరాజయం చెందింది. ఇక్కడ చదవండి: విరాట్ కోహ్లికి మందలింపు తుదిజట్టులో అతడికి స్థానం ఉంటేనే హైదరాబాద్ గెలుపు! -
Harshal Patel: ఎందుకనుకున్నారు.. ఏమిటో చూపించాడు!
చెన్నై: హర్షల్ పటేల్.. పెద్దగా అంచనాలు లేని క్రికెటర్. ఈ ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీకి ఆడిన తొలి మ్యాచ్‌లోనే అవకాశం దక్కించుకుని శభాష్ అనిపించాడు. నిన్న ఆర్సీబీకి ఆడిన మ్యాచ్ హర్షల్ పటేల్‌కు 49వ ఐపీఎల్ మ్యాచ్. కానీ ఈ మ్యాచ్ కంటే ముందు ఏనాడు అతను ఆకట్టుకున్న దాఖలాలు లేవు. ప్రధానంగా ఐపీఎల్లో హర్షల్ పటేల్ నామమాత్రపు ఆటగాడే. సుదీర్ఘ కాలంగా దేశవాళీ మ్యాచ్‌ల్లో పేస్ బౌలర్‌గా రాణిస్తున్న హర్షల్.. ఐపీఎల్‌కు వచ్చేసరికి మాత్రం ఓ మోస్తరు బౌలర్‌గానే మిగిలిపోతున్నాడు. గత ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున 5 మ్యాచ్‌లు ఆడిన హర్షల్ 3 వికెట్లే తీశాడు. దాంతో అతను ఆర్సీబీకి అవసరమా.. అనే అనుమానాలు వచ్చాయి. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్సీబీ అతన్ని తీసుకుంది. అసలు హర్షల్ పటేల్ తీసుకోవడమే ఒకటైతే, తొలి మ్యాచ్‌లనే అతనికి అవకాశం ఇవ్వడంపై ఆర్సీబీ కూర్పు బాలేదని అభిమానుల నోట వినిపించింది. కానీ వారి అంచనాలను తప్పని నిరూపించాడు హర్షల్. ఏకంగా ఐదు వికెట్లు సాధించి ముంబైపై రికార్డు నమోదు చేశాడు. ఇప్పటివరకు ముంబై ఇండియన్స్‌పై ఏ జట్టులోని ఆటగాడు కూడా 5 వికెట్లు తీయలేదు. కానీ ఈ సీజన్లో తొలి మ్యాచ్‌లోనే హర్షల్ ఈ ఘనత సాధించాడు. ముంబై ఇండియన్స్‌పై ఈ రికార్డు నెలకొల్పిన తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఎలా వచ్చాడు.. ఆర్సీబీ ఎందుకు తీసుకుంది? ఈ సీజన్ కోసం వేలానికి ముందు బెంగళూరు ‘ట్రేడింగ్ విండో’లో హర్షల్‌ను తీసుకుంది. ఆర్సీబీకి ఒక భారత పేస్ బౌలర్ అవసరం ఉండటంతో హర్షల్‌ను తీసుకుంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ‘నోబాల్’తో అతను బౌలింగ్ మొదలు పెట్టాడు. ఆపై లిన్ సిక్స్, సూర్య ఫోర్ బాదడంతో తొలి ఓవర్లో మొత్తం 15 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే 16వ ఓవర్లో తిరిగొచ్చిన అతను సత్తా చాటాడు. హార్దిక్‌ను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసిన హర్షల్... తన తర్వాతి ఓవర్లో కిషన్‌ను కూడా ఇలాగే వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఇక ఆఖరి ఓవర్‌నైతే అతను శాసించాడు. భారీ షాట్లు ఆడే అవకాశం ఉన్న కృనాల్ , పొలార్డ్ లను తొలి రెండు బంతుల్లో అవుట్ చేసిన అనంతరం త్రుటిలో హ్యాట్రిక్‌ను చేజార్చుకున్నాడు. అయితే నాలుగో బంతికి జాన్సెన్ (0)ను కూడా బౌల్డ్ చేసి ఐదో వికెట్ సాధించాడు. ఫలితంగా తన ఐపీఎల్ కెరీర్లో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. అదే సమయంలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు. అరంగేట్రమే ఆర్సీబీతో.. హర్షల్ పటేల్ ఐపీఎల్ అరంగేట్రమే ఆర్సీబీతో మొదలైంది. 2012 సీజన్ ఐపీఎల్లో భాగంగా జరిగిన వేలంలో హర్షల్‌ను ఆర్సీబీ కొనుగోలు చేసింది. ఈ క్రమంలోనే ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్షల్ పటేల్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. ఆ మ్యాచ్‌లో రెండు ఓవర్లు వేసి 10 పరుగులిచ్చిన హర్షల్.. వికెట్ కూడా తీయలేదు. ఇక బ్యాటింగ్‌లో డకౌట్ అయ్యాడు. ఆ సీజన్ మొదలుకొని 2017 వరకూ ఆర్సీబీతోనే కొనసాగాడు. 2018లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు జట్టు అతన్ని వేలంలో కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఢిల్లీ డేర్‌డెవిల్స్ కాస్త ఢిల్లీ క్యాపిటల్స్‌గా మారగా అప్పట్నుంచి గత సీజన్ వరకూ ఢిల్లీ క్యాపిటల్స్‌తో కొనసాగాడు. ఈ సీజన్లో ట్రేడింగ్ విధానం ద్వారా ఆర్సీబీలోకి రీఎంట్రీ ఇచ్చి కోహ్లి చేతే ప్రశంసలు అందుకున్నాడు. నిన్న హర్షల్ బౌలింగ్ వేసిన విధానం చూస్తుంటే అతను ఆర్సీబీ ఆడే ప్రతీ మ్యాచ్‌లోనూ ఉండటం దాదాపు ఖాయం. ఇదే విషయాన్ని కోహ్లి కూడా స్పష్టం చేశాడు. ఈ సీజన్ మొత్తం హర్షల్‌ను కొనసాగించాలనుకుంటున్నట్లు కోహ్లినే తెలపడం హర్షల్ కీలక బౌలర్‌గా మారడానికి ఒక సువర్ణావకాశం ఇచ్చినట్లే. -
సీజన్ మొత్తం తననే కొనసాగించాలనుకుంటున్నాం: కోహ్లి
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2021 తొలి మ్యాచ్‌లో తమకు అద్భుత విజయం దక్కడంలో కీలక పాత్ర పోషించిన బౌలర్ హర్షల్ పటేల్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రశంసలు కురిపించాడు. డెత్ ఓవర్ బౌలర్‌గా తనను సీజన్ మొత్తం కొనసాగిస్తామని పేర్కొన్నాడు. మ్యాచ్ విజయానంతరం కోహ్లి మాట్లాడుతూ.. ‘‘ఢిల్లీ నుంచి హర్షల్‌ను మేం కొనుగోలు చేశాం. తనదైన ప్రణాళికలతో, జట్టు తనపై పెట్టిన బాధ్యతను నెరవేర్చడంలో సఫలం అయ్యాడు. ఈ మ్యాచ్‌లో తను ఎంతో ప్రత్యేకంగా నిలిచాడు. డెత్ ఓవర్లలో తన సేవలు వినియోగించుకుంటాం. ఒక కెప్టెన్‌గా తన నుంచి నేనేం ఆశించానో, ఆ అంచనాలను తను అందుకున్నాడు’’ అని కితాబిచ్చాడు. ఇక జెమీసన్, యజువేంద్ర చహల్, మహ్మద్ సిరాజ్ సైతం శుభారంభం చేశారని కోహ్లి పేర్కొన్నాడు. కాగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఆర్సీబీ ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ అద్భుతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, కీరన్ పొలార్డ్, మార్కో జెన్సన్ వంటి ముంబై ఇండియన్స్ కీలక ఆటగాళ్లను పెవిలియన్‌కు చేర్చి ఉత్కంఠ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన హర్షల్ ఆర్సీబీ అభిమానుల చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. కాగా సీజన్ ఆరంభ మ్యాచ్‌లో ముంబై 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయగా, ఆర్సీబీ 2 వికెట్లు మిగిలి ఉండగానే లక్ష్యానఇన ఛేదించి గెలుపుతో బోణీ కొట్టింది. చదవండి: అందుకే హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయలేదు.. కానీ పడిక్కల్‌ను పక్కకు పెట్టడానికి కారణం అదేనా..