IPL 2023, MI vs RCB: Fans brutally troll Harshal Patel, calls worst bowler - Sakshi
Sakshi News home page

#Harshal Patel: ఆర్సీబీకి పట్టిన దరిద్రం.. ఇకనైనా అతడిని వదిలేయండి! లేదంటే మీ కర్మ!

Published Wed, May 10 2023 11:04 AM | Last Updated on Wed, May 10 2023 11:30 AM

IPL 2023 MI Vs RCB: Fans Brutally Troll Harshal Patel Calls Worst Bowler - Sakshi

ఆర్సీబీ (PC: RCB Twiter/IPL)

IPL 2023- MI Vs RCB: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు పేసర్‌ హర్షల్‌ పటేల్‌ ఆట తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆర్సీబీకి పట్టిన దరిద్రం అని.. జట్టు నుంచి అతడిని తీసివేస్తేనే బాగుపడతారంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంత చెత్త బౌలర్‌ను ఎక్కడా చూడలేదని.. వచ్చే ఏడాదైనా అతడిని వదిలించుకోవాలని ఫ్రాంఛైజీకి సూచిస్తున్నారు. 

బంగారం కోసం వెదుకుతూ.. వజ్రం లాంటి యజువేంద్ర చహల్‌ను వదులుకున్నారంటూ చురకలు అంటిస్తున్నారు. ఈసారి కూడా ట్రోఫీ మీద ఆశలు వదిలేసుకోవాల్సిందేనని.. ఇలాంటి బౌలర్‌ను ఆడిస్తే మూల్యం చెల్లించక తప్పదంటూ పెద్ద ఎత్తున హర్షల్‌ను ట్రోల్‌ చేస్తున్నారు.

మరోసారి విఫలం
ఐపీఎల్‌-2023లో ఇప్పటి వరకు మొత్తంగా 11 ఇన్నింగ్స్‌ ఆడిన ఈ గుజరాతీ బౌలర్‌ 388 పరుగులు ఇచ్చి 12 వికెట్లు తీశాడు. ఎకానమీ 9.94. ఇక ముంబై ఇండియన్స్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో హర్షల్‌ చెత్త ప్రదర్శన కనబరిచాడు. 3.3 ఓవర్లు బౌలింగ్‌లో ఒక్క వికెట్‌ కూడా తీయకపోగా ఏకంగా 41 పరుగులు సమర్పించుకున్నాడు. 

ఈ మ్యాచ్‌లో ముంబై చేతిలో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ముంబై బ్యాటర్లు ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, నేహల్‌ వధేరా దూకుడు నేపథ్యంలో 200 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. 

హర్షల్‌ ఒక్కడే కాదు
హర్షల్‌ ఒక్కడే కాదు మహ్మద్‌ సిరాజ్‌(3 ఓవర్లలో 31 పరుగులు, 0 వికెట్‌) కూడా పూర్తిగా విఫలమయ్యాడు. వనిందు హసరంగా రెండు వికెట్లు తీసినప్పటికీ 4 ఓవర్ల కోటాలో ఏకంగా 53 పరుగులు సమర్పించుకున్నాడు. విజయ్‌ కుమార్‌ వైశాక్‌ సైతం చెత్తగా బౌలింగ్‌ చేశాడు. 3 ఓవర్లలో 37 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు.

ఇలా ఆర్సీబీ బౌలర్ల నాసికరం బౌలింగ్‌ కారణంగా ముంబై 16.3 ఓవర్లలోనే ముంబై లక్ష్యాన్ని ఛేదించి ప్లే ఆఫ్స్‌ రేసులో ముందడుగు వేసింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ బౌలర్లను సోషల్‌ మీడియా వేదికగా చీల్చి చెండాడుతున్న ఫ్యాన్స్‌.. ముఖ్యంగా హర్షల్‌ పటేల్‌ను దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు.

చదవండి: ఆ నలుగురు అద్భుతం.. ఎంతటి రిస్క్‌కైనా వెనుకాడటం లేదు: రోహిత్‌ శర్మ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement