విరాట్ కోహ్లి- మహ్మద్ సిరాజ్ (PC: IPL)
Virat Kohli- Mohammed Siraj: ‘‘విరాట్ భయ్యా రాత్రి 11 గంటలకల్లా నిద్రకు ఉపక్రమిస్తాడు. ఆరోజు సెంచరీ చేశానా.. లేదంటే సున్నా స్కోరుకే పరిమితమయ్యానా అన్న విషయంతో భయ్యాకు సంబంధం ఉండదు. ముందు రోజు ఎలా ఉన్నా మరుసటి రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కల్లా ఎంతో ఉత్సాహంగా పలకరిస్తాడు. యథావిథిగా జిమ్‌లో కలుస్తాడు
కోహ్లి భయ్యా సెట్ చేసిన ఫిట్‌నెస్ ప్రమాణాలు వేరే లెవల్ అంతే! క్రికెటర్‌గా ఇంత సాధించినప్పటికీ.. ఆయన అస్సలు రిలాక్స్ కాడు. మరింత మెరుగ్గా ముందుకు సాగాలనే ఎల్లవేళలా తాపత్రయపడుతుంటాడు. భయ్యాకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే’’ అంటూ టీమిండియా స్టార్ పేసర్, ఆర్సీబీ బౌలర్ మహ్మద్ సిరాజ్ అన్నాడు.
ఆర్సీబీకి మారిన తర్వాతే
టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లిని ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. విరాట్ భయ్యా తనలాంటి ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నాడు. కాగా సన్‌రైజర్స్ తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన హైదరాబాదీ సిరాజ్.. ఆర్సీబీకి మారిన తర్వాత అతడి దశ తిరిగింది.
నాటి కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రోత్సాహంతో అంచెలంచెలుగా ఎదిగిన సిరాజ్ 2017లో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. 2019లో వన్డేల్లో, 2020లో టెస్టుల్లో అడుగుపెట్టిన అతడు ప్రస్తుతం టీమిండియా ప్రధాన పేసర్లలో ఒకడిగా ఎదిగాడు.
నా పెద్దన్న
టీమిండియా క్రికెటర్‌గా సిరాజ్ ఈస్థాయికి ఎదగడంలో కోహ్లిది కీలక పాత్ర అనడంలో సందేహం లేదు. ఇక తనను ఇంతగా ప్రోత్సహించిన కోహ్లిని పెద్దన్నగా భావించే సిరాజ్ మియా బ్రేక్‌ఫాస్ట్ విత్ చాంపియన్స్ షోలో ఆటగాడిగా కోహ్లి పరుగుల దాహం తీరనిదంటూ ప్రశంసలు కురిపించాడు.
ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం ఇచ్చే కోహ్లి జిమ్‌లో నిరంతరం శ్రమిస్తాడని.. ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో ఉంటాడని చెప్పుకొచ్చాడు. కాగా సిరాజ్ టెస్టు అరంగేట్రం చేసే సమయానికి అతడి తండ్రి కన్నుమూసిన విషయం విదితమే.
టీమిండియాతో కలిసి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన సిరాజ్‌కు తండ్రి మరణించాడనే పిడుగులాంటి వార్త తెలిసింది. అయినప్పటికీ, తండ్రి కలను నెరవేర్చాలనే సంకల్పంతో బాధను దిగమింగుకుని.. ఆసీస్ గడ్డపై అరంగేట్రంలోనే సత్తా చాటాడు. ఈ విషయం గురించి తాజాగా ప్రస్తావనకు రాగా సిరాజ్ ఉద్వేగానికి లోనయ్యాడు.
అప్పుడు ఏడ్చేశాను
‘‘జాతీయ గీతం ఆలపించేటపుడు నేను ఏడ్చేశాను. నా టెస్టు అరంగేట్రం అద్బుతంగా జరిగింది. టెస్టు క్రికెట్ ఆడితేనే ఆటగాడిగా నీకు గౌరవం దక్కుతుందని మా నాన్న ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. ఒకవేళ ఆయన బతికి ఉంటే.. తన కలను నెరవేర్చినందుకు నన్ను చూసి గర్వపడేవారు.
ఆయన భౌతికంగా మాకు దూరమైనా.. ఆయన దీవెనలు నాకెప్పుడూ ఉంటాయి’’ అని సిరాజ్ భావోద్వేగానికి గురయ్యాడు. కాగా ఆర్సీబీ స్టార్లు విరాట్ కోహ్లి, సిరాజ్ ప్రస్తుతం ఐపీఎల్-2023తో బిజీగా ఉన్నారు. వీరిద్దరు జూన్‌లో జరుగబోయే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ ఆడే జట్టుకు ఎంపికయ్యారు.
చదవండి: WTC Final: టీమిండియా వైస్ కెప్టెన్‌గా అతడే! ద్రవిడ్‌తో కలిసి వాళ్లంతా..
లక్షలు పెట్టి కొంటే అద్భుతాలు సృష్టిస్తున్నాడు.. మరి 18 కోట్లు తీసుకున్న నువ్విలా!
Comments
Please login to add a commentAdd a comment