సిరాజ్‌తో కోహ్లి సెలబ్రేషన్స్ (Photo Credit: IPL)
IPL 2023- RCB Vs CSK: టీమిండియా స్టార్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లికి ఊహించని షాక్ తగిలింది. ఈ రన్‌మెషీన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ ఐపీఎల్ నిర్వాహకులు జరిమానా విధించారు. మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
కోహ్లికి జరిమానా
ఈ మేరకు.. ‘ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్‌తో బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ సమయంలో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని అతిక్రమించినందుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లికి ఫైన్ విధిస్తున్నాం.
మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత పెడుతున్నాం. మిస్టర్ కోహ్లి ఐపీఎల్ కోడ్‌లోని ఆర్టికల్ 2.2లోని లెవల్ 1 నిబంధన ఉల్లంఘించారు’’ అని బీసీసీఐ ప్రకటనలో పేర్కొంది. కాగా కోహ్లికి ఏ ఘటన కారణంగా జరిమానా విధించారన్న విషయం వెల్లడించనప్పటికీ.. సీఎస్‌కే బ్యాటర్ శివం దూబే అవుటైన సమయంలో కోహ్లి వ్యవహరించి తీరే ఇందుకు కారణమని తెలుస్తోంది.
అందుకే ఫైన్ వేశారా?
26 బంతుల్లో 52 పరుగులతో మెరిసిన దూబే పార్నెల్ బౌలింగ్‌లో సిరాజ్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ కాగానే కోహ్లి సెలబ్రేషన్స్ కాస్త శ్రుతిమించినట్లు అనిపించింది. మరీ దూకుడుగా వ్యవహరించిన కారణంగానే ఈ ఆర్సీబీ స్టార్‌కు ఫైన్ పడినట్లు తెలుస్తోంది.
కాగా ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో సీఎస్‌కే ఆర్సీబీ మీద 8 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇక మ్యాచ్‌లో బెంగళూరు ఓపెనర్ కోహ్లి 4 బంతులు ఎదుర్కొని కేవలం 6 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. సీఎస్‌కే యువ పేసర్ ఆకాశ్ సింగ్ బౌలింగ్‌లో కోహ్లి బౌల్డ్ అయ్యాడు.
చదవండి: వాళ్లిద్దరు ఇంకాసేపు క్రీజులో ఉంటే మేము ఓడిపోయేవాళ్లం.. కానీ: ధోని
మరీ ఇంత బద్దకమా.. మొయిన్ అలీపై కోపంతో ఊగిపోయిన ధోని! వీడియో వైరల్
రహానే అద్భుత విన్యాసం.. వీడియో వైరల్! ఆ 5 పరుగులు సేవ్ చేయకుంటే..
.@ChennaiIPL come out on top in the mid-table clash as they beat #RCB by 8 runs in highly entertaining and run-filled #TATAIPL match. 👏 👏
— IndianPremierLeague (@IPL) April 17, 2023
Scorecard ▶️ https://t.co/QZwZlNk1Tt#RCBvCSK pic.twitter.com/jlEz6KmM0V
Comments
Please login to add a commentAdd a comment