Royal Challengers Bangalore
-
IPL 2025: మరో జెర్సీలో ఊహించుకోలేను..ఎప్పటికీ ఆర్సీబీతోనే!
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మరో జట్టు జెర్సీలో తనని తాను ఊహించుకోలేనని భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి వెల్లడించాడు. లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కే ప్రాతినిధ్యం వహిస్తున్న కోహ్లి... మరో మూడేళ్ల పాటు బెంగళూరుకు ఆడటం ఖాయమే అని సూచనప్రాయంగా చెప్పాడు. 2008లో ఐపీఎల్ ప్రారంభం కాగా... అప్పటి నుంచి కోహ్లి బెంగళూరు జట్టు తరఫునే బరిలోకి దిగుతూ వస్తున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే జట్టుకు ఇన్ని సీజన్లు ఆడిన ఏకైక ప్లేయర్‌గా విరాట్ రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ మెగా వేలానికి ముందు తాజాగా జరిగిన రిటెన్షన్ విధానంలో ఆర్సీబీ యాజమాన్యం రూ. 21 కోట్లకు కోహ్లిని తిరిగి దక్కించుకుంది. 36 ఏళ్ల విరాట్ 2027 వరకు బెంగళూరు జట్టు తరఫున ఆడనున్నట్లు ఆర్సీబీ విడుదల చేసిన ప్రత్యేక వీడియోలో వెల్లడించాడు. ఐపీఎల్లో ఇప్పటి వరకు 252 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి... 131.97 స్ట్రయిక్ రేట్, 38.66 సగటుతో 8004 పరుగులు చేశాడు. అందులో 8 సెంచరీలు 55 అర్ధ శతకాలు ఉన్నాయి. తాజా రిటెన్షన్ విధానం మరో మూడేళ్లు కొనసాగనుండగా... అప్పటి వరకు ఆర్సీబీ జట్టులో విరాట్ కీలక పాత్ర పోషించనున్నాడు. ‘ఈ సర్కిల్ ముగిసేసరికి నాకు ఐపీఎల్లో 20 ఏళ్లు పూర్తవుతాయి. అప్పటి వరకు ఆర్సీబీతోనే కొనసాగడం చాలా గొప్ప విషయంగా అనిపిస్తోంది. కెరీర్ ఆరంభించిన తొలినాళ్లలో ఇన్నాళ్లు ఆడతానని అనుకోలేదు. కానీ ఫ్రాంచైజీ యాజమాన్యంతో ఉన్న అనుబంధం వల్ల ఈ ప్రయాణం సాగుతోంది. ఒకే జట్టుతో ఇన్నేళ్ల పాటు ఉండటం బాగుంది. ఆర్సీబీతో నా బంధం ఎంత బలమైందంటే... నన్ను నేను వేరే ఐపీఎల్ జెర్సీలో ఊహించుకోలేను. కొత్త సీజన్ కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్నా. కొత్త జట్టును సిద్ధం చేసేందుకు నేను రెడీగా ఉన్నాను. జట్టును ముందుకు తీసుకెళ్లడంలో నా వంతు పాత్ర పోషిస్తా. ఐపీఎల్ టైటిల్ సాధించడం మా అందరి లక్ష్యం. వచ్చే మూడేళ్లలో అది సాధ్యమయ్యే దిశగా అడుగులువేస్తా’ అని కోహ్లి వెల్లడించాడు. ఆర్సీబీ అభిమానుల గురించి మాట్లాడుతూ కోహ్లి భావోద్వేగానికి గురయ్యాడు. ఒక్కసారి టైటిల్ గెలవకపోయినా...గెలుపోటముల్లో ఎల్లవేళలా మద్దతునిచ్చిన ఫ్యాన్స్‌కు అతను కృతజ్ఞతలు తెలిపాడు. ‘ప్రపంచంలో ఏ జట్టుకు లేనంత మంది అభిమానులు అర్సీబీకి ఉన్నారు. వారితో విడదీయలేని అనుబంధం ఉంది. ఆర్సీబీ అంటే నేను అనే విధంగా అభిమానులు చూపే ఆదరణకు ముగ్దుడిని అయ్యాను. ఇన్నేళ్లలోనే నేను సంపాదించుకున్న అతి విలువైనది అభిమానుల మనసు గెలవడమే. రోజు రోజుకు నాకు, అభిమానులకు మధ్య బంధం బలపడుతూ వస్తోంది. ఆర్సీబీ తరఫున బరిలోకి దిగిన ప్రతిసారి ప్రేక్షకుల అరుపులు నాకు మరింత ఉత్సాహాన్నిస్తాయి. అదే కొత్త జోష్లాగా ఉంటుంది. తదుపరి దశలో ఏం చేయగలననే దానిపైనే దృష్టి పెడుతున్నా.నా వరకు బరిలోకి దిగిన ప్రతిసారి వంద శాతం కష్ట పడేందుకు ప్రయత్నిస్తా. ఫలితం మన చేతిలో ఉండదు. అభిమానులు గర్వపడే ప్రదర్శన చేయడమే నా కర్తవ్యం. మైదానంలో అభిమానులు నా పేరు, ఫ్రాంచైజీ పేరుతో గోల చేయడాన్ని నాకు దక్కిన గౌరవంగా భావిస్తా’ అని విరాట్ వీడియోలో వివరించాడు. విరాట్ వెన్నెముక: ఆండీ ఫ్లవర్ ఇక బెంగళూరు హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ మాట్లాడుతూ... రిటెన్షన్ విధానంలో సరైన ఆటగాళ్లనే ఎంపిక చేసుకున్నట్లు వెల్లడించాడు. ఆర్సీబీకి విరాట్ వెన్నెముక లాంటి ఆటగాడని ఆండీ ఫ్లవర్ పేర్కొన్నాడు. ‘విరాట్ కోహ్లిని రీటైన్ చేసుకోవడం నన్నే కాదు... దేశంలో ఏ ఒక్కరినీ ఆశ్చర్య పరచలేదు. అతడు చాన్నాళ్లుగా జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. బెంగళూరు ఫ్రాంచైజీ విజయవంతం కావడానికి విరాట్ ప్రధాన కారణం. గత సీజన్లో అతడు అద్భుత ప్రదర్శన చేశాడు. లీగ్ తొలి అర్ధ భాగంలో జట్టు ప్రదర్శన చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోయినా... అతడి ఆటతీరుకు వంక పెట్టలేం. ఆ తర్వాత తిరిగి గాడిన పడిందంటే అది కూడా విరాట్ వల్లే’ అని ఆండీ ఫ్లవర్ అన్నాడు. ఐపీఎల్ రిటెన్షన్ గడువు ముగియగా... బెంగళూరు జట్టు ముగ్గురు ఆటగాళ్లను మాత్రమే అట్టి పెట్టుకుంది. రూ. 21 కోట్లు పెట్టి విరాట్‌ను తిరిగి తీసుకున్న ఆర్సీబీ దూకుడైన బ్యాటర్ రజత్ పటిదార్‌కు రూ. 11 కోట్లు, లెఫ్టార్మ్ పేస్ బౌలర్ యశ్ దయాళ్‌కు రూ. 5 కోట్లు కేటాయించింది. ఆటగాళ్లను కొనుగోలు చేసుకునేందుకు ఒక్కో జట్టుకు అత్యధికంగా రూ. 120 కోట్లు కేటాయించగా... అందులో బెంగళూరు ఫ్రాంచైజీ 37 కోట్లు ఖర్చు పెట్టింది. వేలం కోసం ఆర్సీబీ వద్ద రూ. 83 కోట్లు మిగిలాయి. ఈ నెలాఖరున జరిగే ఐపీఎల్ వేలంలో బెంగళూరు ఎలాంటి జట్టును ఎంపిక చేసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ముగ్గురు క్యాప్డ్ ప్లేయర్లను ఆర్టీఎమ్ ద్వారా తిరిగి దక్కించుకునే అవకాశం బెంగళూరుకు ఉండగా... ఇప్పటి వరకు జట్టును నడిపించిన ఫాఫ్ డుప్లెసిస్, ఆ్రస్టేలియా హార్డ్ హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్, హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్‌ను అట్టి పెట్టుకోకుండా విడుదల చేసింది. -
Eliminator: ఆర్సీబీని చిత్తు చేసిన రాజస్తాన్
-
రాయల్స్ ముందుకు...చాలెంజర్స్ ఇంటికి...
అసాధారణ రీతిలో ఆరు వరుస విజయాలతో ‘ప్లే ఆఫ్స్’ వరకు దూసుకొచ్చిన బెంగళూరు ప్రస్థానం ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముగిసింది. ‘కప్ నమ్దే’ అంటూ కొత్త ఆశలు రేపిన టీమ్ నాకౌట్ సమరంలో కుప్పకూలి మరోసారి అభిమానులను నిరాశకు గురి చేసింది. వరుసగా నాలుగు ఓటముల తర్వాత ఎట్టకేలకు అసలు పోరులో తమ స్థాయిని ప్రదర్శించిన రాజస్తాన్ రాయల్స్ మరో అడుగు ముందుకేసి రెండో క్వాలిఫయర్‌లో సన్‌రైజర్స్‌తో సమరానికి సిద్ధమైంది. ముందుగా పదునైన బౌలింగ్‌తో బెంగళూరును కట్టిపడేసిన రాజస్తాన్ ఆ తర్వాత సాధారణ లక్ష్యాన్ని ఆరు బంతుల ముందే అందుకుంది. అక్కడక్కడా కాస్త తడబాటు కనిపించినా...ఆఖరికి గెలుపు తీరం చేరింది. 700కుపైగా పరుగులు చేసిన తర్వాత కూడా ఇక్కడే ఆగిపోయిన విరాట్ కోహ్లి చిత్రం చూస్తే చాలు ఆర్సీబీ దురదృష్టం ఎలాంటిదో చెప్పేందుకు! అహ్మదాబాద్: ఐపీఎల్ ఫైనల్లో స్థానం కోసం రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాజస్తాన్ రాయల్స్ తలపడనుంది. బుధవారం జరిగిన ‘ఎలిమినేటర్’ మ్యాచ్‌లో రాజస్తాన్ 4 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. రజత్ పటిదార్ (22 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), విరాట్ కోహ్లి (24 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్), మహిపాల్ లోమ్రోర్ (17 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. అనంతరం రాజస్తాన్ 19 ఓవర్లలో 6 వికెట్లకు 174 పరుగులు సాధించి గెలిచింది. యశస్వి జైస్వాల్ (30 బంతుల్లో 45; 8 ఫోర్లు), రియాన్ పరాగ్ (26 బంతుల్లో 36; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. కీలకమైన రెండు వికెట్లు తీసిన అశ్విన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. దూకుడు లేకుండా... బెంగళూరు ఇన్నింగ్స్ ఆరంభం నుంచి తడబడుతూనే సాగింది. కోహ్లి, డుప్లెసిస్ ఆశించిన మెరుపు ఆరంభాన్ని ఇవ్వలేకపోయారు. బౌల్ట్ తన 3 ఓవర్లలో 6 పరుగులే ఇచ్చి ప్రత్యర్థిని కట్టిపడేశాడు. డుప్లెసిస్, కోహ్లి తక్కువ వ్యవధిలో వెనుదిరిగిన తర్వాత కామెరాన్ గ్రీన్ (21 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్) కొన్ని పరుగులు జోడించాడు. అయితే గ్రీన్, మ్యాక్స్‌వెల్ (0)లను వరుస బంతులకు అవుట్ చేసి అశ్విన్ దెబ్బ కొట్టాడు. ఈ దశలో పటిదార్ ఇన్నింగ్స్ ఆర్సీబీని ముందుకు నడిపించింది. 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జురేల్ సునాయాస క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన పటిదార్ కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. చహల్ ఓవర్లో అతను 2 సిక్స్‌లు, ఫోర్ బాదడంతో స్కోరు వంద పరుగులు దాటింది. తన చివరి ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో దినేశ్ కార్తీక్ (11) విఫలం కాగా, చివర్లో లోమ్రోర్ ధాటిగా ఆడాడు. రాణించిన జైస్వాల్... ఛేదనను జైస్వాల్, టామ్ కోలర్ (20) జాగ్రత్తగా మొదలు పెడుతూ తొలి 2 ఓవర్లలో 6 పరుగులే చేశారు. అయితే యశ్ దయాళ్ వేసిన మూడో ఓవర్లో జైస్వాల్ 4 ఫోర్లు బాది జోరు మొదలు పెట్టగా, సిరాజ్ వేసిన తర్వాతి ఓవర్లో కూడా 3 ఫోర్లు వచ్చాయి. కోలర్ వెనుదిరిగిన తర్వాత జైస్వాల్, స్యామ్సన్ ఇన్నింగ్స్‌ను నడిపించారు.అయితే వీరిద్దరు ఐదు పరుగుల వ్యవధిలో వెనుదిరగడం, జురేల్ (8) రనౌట్ కావడంతో కొంత ఉత్కంఠ పెరిగింది. అయితే మరో ఎండ్‌లో పరాగ్ ఆకట్టుకునే ఆటతో గెలుపు భారాన్ని తీసుకున్నాడు. పరాగ్, హెట్‌మైర్ (14 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్) మధ్య 45 పరుగుల భాగస్వామ్యం (25 బంతుల్లో) రాజస్తాన్‌ను విజయం దిశగా తీసుకెళ్లింది. విజయానికి చేరువైన దశలో వీరిద్దరు నిష్క్రమించినా రావ్మన్ పావెల్ (8 బంతుల్లో 16 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) పని పూర్తి చేశాడు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) (సబ్) ఫెరీరా (బి) చహల్ 33; డుప్లెసిస్ (సి) పావెల్ (బి) బౌల్ట్ 17; గ్రీన్ (సి) పావెల్ (బి) అశ్విన్ 27; పటిదార్ (సి) పరాగ్ (బి) అవేశ్ 34; మ్యాక్స్‌వెల్ (సి) జురేల్ (బి) అశ్విన్ 0; లోమ్రోర్ (సి) పావెల్ (బి) అశ్విన్ 32; కార్తీక్ (సి) జైస్వాల్ (బి) అవేశ్ 11; స్వప్నిల్ (నాటౌట్) 9; కరణ్ (సి) పావెల్ (బి) సందీప్ 5; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 172. వికెట్ల పతనం: 1–37, 2–56, 3–97, 4–97, 5–122, 6–154, 7–159, 8–172. బౌలింగ్: బౌల్ట్ 4–0–16–1, సందీప్ శర్మ 4–0–48–1, అవేశ్ ఖాన్ 4–0–44–3, అశ్విన్ 4–0–19–2, చహల్ 4–0–43–1. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) కార్తీక్ (బి) గ్రీన్ 45; టామ్ కోలర్ (బి) ఫెర్గూసన్ 20; సామ్సన్ (స్టంప్డ్) కార్తీక్ (బి) కరణ్ 17; పరాగ్ (సి) సిరాజ్ 36; జురేల్ (రనౌట్) 8; హెట్‌మైర్ (సి) డుప్లెసిస్ (బి) సిరాజ్ 26; పావెల్ (నాటౌట్) 16; అశ్విన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19 ఓవర్లలో 6 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1–46, 2–81, 3–86, 4–112, 5–157, 6–160. బౌలింగ్: స్వప్నిల్ 2–0–19–0, సిరాజ్ 4–0–33–2, దయాళ్ 3–0–37–0, ఫెర్గూసన్ 4–0–37–1, కరణ్ శర్మ 2–0–19–1, గ్రీన్ 4–0–28–1. -
RCB Vs RR: నిష్క్రమించేదెవరో..? నేడు ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరుతో రాజస్తాన్ ‘ఢీ’
ఐపీఎల్ టైటిల్ రేసులో నిలవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో... నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్తాన్ రాయల్స్ జట్లు ముఖాముఖి పోరుకు సిద్ధమయ్యాయి. అహ్మదాబాద్‌లో రాత్రి గం. 7:30 నుంచి జరిగే ఈ ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టుకు ఫైనల్ చేరే అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఓడిపోయిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించేదెవరో..? నేడు ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరుతో రాజస్తాన్ ‘ఢీ’ మిస్తుంది. ఎలిమినేటర్ మ్యాచ్ విజేత జట్టు క్వాలిఫయర్–1లో ఓడిపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో శుక్రవారం చెన్నైలో జరిగే క్వాలిఫయర్–2 మ్యాచ్‌లో ఫైనల్ బెర్త్ కోసం పోటీపడుతుంది. తాజా సీజన్లో బెంగళూరు లీగ్ దశలోనే నిష్క్రమించే దశ నుంచి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించి అబ్బురపరిచింది. డు ప్లెసిస్ నాయకత్వంలోని బెంగళూరు జట్టు తమ చివరి 6 లీగ్ మ్యాచ్‌ల్లో నెగ్గి ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. మరోవైపు సంజూ సామ్సన్ సారథ్యంలోని రాజస్తాన్ రాయల్స్ జట్టు తమ చివరి నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోగా, ఐదో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. -
బెంగళూరు అద్భుతం
బెంగళూరుతో మ్యాచ్‌లో చెన్నై విజయలక్ష్యం 219 పరుగులు...కానీ ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే 201 పరుగులే చేస్తే చాలు...తడబడుతూనే సాగిన ఛేదన చివరిలో ఉత్కంఠను పెంచింది. ఆఖరి ఓవర్లో 17 పరుగులు చేస్తే చాలు... ఐపీఎల్ ప్రమాణాలు, ఈ సీజన్లో ఆట చూస్తే ఇది సునాయాసమే అనిపించింది. యశ్ దయాళ్ వేసిన తొలి బంతినే ధోని సిక్సర్‌గా మలచడంతో చెన్నై బృందంలో ఆనందం. సమీకరణం 5 బంతుల్లో 11 పరుగులుగా నిలిచింది. కానీ రెండో బంతికి ధోని అవుట్ కావడంతో పరిస్థితి మారిపోయింది. తర్వాతి రెండు బంతుల్లో శార్దుల్ సింగిల్ మాత్రమే తీయగా...చివరి రెండు బంతులకు జడేజా బ్యాట్ కూడా తగిలించలేకపోయాడు! దాంతో ఆర్సీబీ సంబరాలు షురూ అయిపోయాయి. టోర్నీ తొలి 8 మ్యాచ్‌లలో ఒకటి మాత్రమే గెలిచి వరుసగా 6 ఓడి అందరూ లెక్కలోంచి తీసేసిన తర్వాత బెంగళూరు అద్భుతం చేసింది. ఇప్పుడు వరుసగా ఆరు విజయాలతో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఆర్సీబీ సమష్టితత్వం ముందు ఓడిన సూపర్ కింగ్స్ లీగ్ దశకే పరిమితమైంది. ఇక మిగిలింది ధోని తన చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడేశాడా అనే చర్చ మాత్రమే! బెంగళూరు: ఐపీఎల్ డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఈ సారి లీగ్ దశలో నిష్క్రమించింది. ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో విజయాల పోరాటం చేస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 27 పరుగులతో గెలిచి ‘ప్లే ఆఫ్స్’కు అర్హత సాధించింది. ముందుగా బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. డుప్లెసిస్ (39 బంతుల్లో 54; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), విరాట్ కోహ్లి (29 బంతుల్లో 47; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), రజత్ పటిదార్ (23 బంతుల్లో 41; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరిపించారు. అనంతరం చెన్నై సూపర్‌కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 191 పరుగులు చేసి ఓడింది. రచిన్ రవీంద్ర (37 బంతుల్లో 61; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), జడేజా (22 బంతుల్లో 42 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. కోహ్లి, డుప్లెసిస్ దూకుడు రెండో ఓవర్ నుంచే ఓపెనర్లు కోహ్లి, డుప్లెసిస్‌లు చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డారు. మూడో ఓవర్లో కోహ్లి రెండు భారీ సిక్సర్లు బాదగా... వర్షం వచ్చి మ్యాచ్‌ను ఆపేసింది. అప్పుడు ఆర్సీబీ స్కోరు 31/0. తర్వాత తెరిపినిచ్చాక స్పిన్ ప్రయోగంతో వేగం తగ్గింది. ఏడో ఓవర్లో జట్టు స్కోరు 50కి చేరింది. జడేజా, సాన్‌ట్నర్ బౌలింగ్‌లో సిక్స్‌లు బాదిన కోహ్లి అదే ఊపులో మరో సిక్సర్‌కు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద మిచెల్‌కు క్యాచ్ ఇచ్చాడు. పటిదార్ క్రీజులోకి రాగా డుప్లెసిస్... జడేజా వేసిన 11వ ఓవర్లో ఫోర్, 2 సిక్స్‌లు బాదాడు. 12వ ఓవర్లో జట్టు స్కోరు వందకు చేరగా డుప్లెసిస్ 35 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. కాసేపటికే సందేహాస్పద రనౌట్‌తో డుప్లెసిస్ క్రీజ్ వీడాడు. ఈ దశలో లైఫ్ వచ్చిన గ్రీన్ (17 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) పటిదార్‌తో కలిసి ధనాధన్ ఆటతీరుతో బెంగళూరు ఇన్నింగ్స్‌ను వేగంగా నడిపించాడు. 15 ఓవర్లలో 138/2 స్కోరు చేసింది. ఆ తర్వాత బ్యాటర్ల జోరు మరింత పెరిగింది. చివరి 5 ఓవర్లలో బెంగళూరు 80 పరుగులు రాబట్టడం విశేషం. రాణించిన రచిన్ ఇన్నింగ్స్ మొదటి ఓవర్ వేసిన మ్యాక్స్‌వెల్ తొలి బంతికే కెప్టెన్ రుతురాజ్ (0)ను డకౌట్ చేశాడు. తర్వాత మిచెల్ (4) కోహ్లి క్యాచ్‌తో వెనుదిరిగాడు. ఈ దశలో రహానే, రచిన్ రవీంద్ర వికెట్‌కు ప్రాధాన్యమివ్వడంతో వేగం మందగించింది. మూడో వికెట్‌కు 66 పరుగులు జోడించాక రహానె (22 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్) నిష్క్రమించాడు. రచిన్ 31 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. అయితే స్వల్ప వ్యవధిలో రచిన్ రనౌట్ కాగా, దూబే (7)ను గ్రీన్ పెవిలియన్ చేర్చాడు. సాన్‌ట్నర్ (3)ను డుప్లెసిస్ కళ్లు చెదిరే క్యాచ్‌తో పంపించాడు. ఈ దశలో జడేజా, ధోని (13 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్) ఆశలు రేపారు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) మిచెల్ (బి) సాన్‌ట్నర్ 47; డుప్లెసిస్ రనౌట్ 54; పటిదార్ (సి) మిచెల్ (బి) శార్దుల్ 41; గ్రీన్ నాటౌట్ 38; దినేశ్ కార్తీక్ (సి) ధోని (బి) తుషార్ 14; మ్యాక్స్‌వెల్ (సి) ధోని (బి) శార్దుల్ 16; మహిపాల్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 218. వికెట్ల పతనం: 1–78, 2–113, 3–184, 4–201, 5–218. బౌలింగ్: తుషార్ 4–0–49–1, శార్దుల్ 4–0–61–2, తీక్షణ 4–0–25–0, సాన్‌ట్నర్ 4–0–23–1, జడేజా 3–0–40–0, సిమర్జీత్ 1–0–19–0. చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) యశ్ (బి) మ్యాక్స్‌వెల్ 0; రచిన్ రనౌట్ 61; మిచెల్ (సి) కోహ్లి (బి) యశ్ 4; రహానె (సి) డుప్లెసిస్ (బి) ఫెర్గూసన్ 33; దూబే (సి) ఫెర్గూసన్ (బి) గ్రీన్ 7; జడేజా నాటౌట్ 42; సాన్‌ట్నర్ (సి) డుప్లెసిస్ (బి) సిరాజ్ 3; ధోని (సి) స్వప్నిల్ (బి) యశ్ 25; శార్దుల్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 191. వికెట్ల పతనం: 1–0, 2–19, 3–85, 4–115, 5–119, 6–129, 7–190. బౌలింగ్: మ్యాక్స్‌వెల్ 4–0–25–1, సిరాజ్ 4–0–35–1, యశ్ 4–0–42–2, స్వప్నిల్ 2–0–13–0, కరణ్ శర్మ 1–0–14–0, ఫెర్గూసన్ 3–0–39–1, గ్రీన్ 2–0–18–1. ఐపీఎల్లో నేడుహైదరాబాద్ X పంజాబ్‌వేదిక: హైదరాబాద్మధ్యాహ్నం 3: 30 గంటల నుంచిరాజస్తాన్ X కోల్‌కతావేదిక: గువహటిరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
RCB Vs CSK: చివరి బెర్త్ ఎవరిదో?
బెంగళూరు: ఐపీఎల్ 17వ సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్... మూడుసార్లు రన్నరప్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్లు ‘ప్లే ఆఫ్స్’ దశకు అర్హత సాధిస్తాయా లేక లీగ్ దశలోనే నిష్క్రమిస్తాయా ఈరోజే తేలిపోనుంది. ఇప్పటికే కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్తాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ‘ప్లే ఆఫ్స్’కు అర్హత పొందగా... చివరిదైన నాలుగో బెర్త్ కోసం చెన్నై, బెంగళూరు జట్లు ఈరోజు చిన్నస్వామి స్టేడియంలో ముఖాముఖి పోరుకు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం చెన్నై 14 పాయింట్లతో నాలుగో స్థానంలో... బెంగళూరు 12 పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్నాయి. » చెన్నైపై బెంగళూరు గెలిస్తే... చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, లక్నో జట్లు 14 పాయింట్లతో ఉమ్మడిగా నాలుగో స్థానంలో నిలుస్తాయి. ఈ నేపథ్యంలో మెరుగైన రన్‌రేట్ ఉన్న జట్టుకే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారవుతుంది. » బెంగళూరు, ఢిల్లీ, లక్నో జట్ల కంటే చెన్నై రన్‌రేట్ మెరుగ్గా ఉంది. చెన్నైపై గెలవడంతోపాటు ఆ జట్టు రన్‌రేట్‌ను అధిగమించాలంటే బెంగళూరు 18 పరుగుల తేడాతో చెన్నైను ఓడించాలి. ఒకవేళ చెన్నై లక్ష్యాన్ని నిర్దేశిస్తే ఆ లక్ష్యాన్ని బెంగళూరు 11 బంతులు మిగిలి ఉండగానే ఛేదించాలి. అయితేనే బెంగళూరుకు ప్లే ఆఫ్స్ బెర్త్ లభిస్తుంది. » మరోవైపు చెన్నై విజయం సాధించినా లేదా వర్షం వల్ల మ్యాచ్ రద్దయినా ఆ జట్టు ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్ బెర్త్‌ను దక్కించుకుంటుంది. »స్థానిక వాతావరణ శాఖ ప్రకారం శనివారం బెంగళూరు నగరానికి భారీ వర్ష సూచన ఉండటం గమనార్హం. ఫలితంగా బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు ఆ జట్టు ప్రదర్శనపైనే కాకుండా వరుణ దేవుడి దయపై కూడా ఆధారపడి ఉన్నాయి. -
IPL 2024 RCB Vs DC: భళా బెంగళూరు...
బెంగళూరు: ‘ప్లే ఆఫ్స్’ లక్ష్యంగా సర్వశక్తులు ఒడ్డుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వరుసగా ఐదో విజయంతో ఆశలు సజీవం చేసుకుంది. ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో 47 పరుగులతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించిన ఆర్సీబీ ఈ టోరీ్నలో ఆరో విజయం నమోదు చేసుకుంది. ముందుగా బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 187 పరుగులు చేసింది. రజత్ పటిదార్ (32 బంతుల్లో 52; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), విల్ జాక్స్ (29 బంతుల్లో 41; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించారు. తర్వాత ఢిల్లీ 20 ఓవర్లలో 140 పరుగులకు కుప్పకూలింది. పంత్‌పై ఒక మ్యాచ్ నిషేధం కారణంగా ఈ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టుకు కెపె్టన్‌గా వ్యవహరించిన అక్షర్ పటేల్ (39 బంతుల్లో 57; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించాడు. పటిదార్ ఫటాఫట్... డుప్లెసిస్ (6) విఫలమవగా, కోహ్లి (13 బంతుల్లో 27; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ఎంతో సేపు నిలువలేదు. ఢిల్లీ ఫీల్డర్లు పదేపదే క్యాచ్‌లు నేలపాలు చేయడంతో బతికిపోయిన జాక్స్, పటిదార్ ధాటిగా పరుగులు రాబట్టారు. దీంతో 9.1 ఓవర్లో బెంగళూరు 100 పరుగులకు చేరగా, పటిదార్ 29 బంతుల్లో ఫిఫ్టీ చేశాడు. కానీ స్వల్పవ్యవధిలో అతనితో పాటు జాక్స్ అవుటయ్యాక స్కోరు మందగించింది. గ్రీన్ (24 బంతుల్లో 32; 1 ఫోర్, 2 సిక్స్‌లు), మహిపాల్ సిక్స్‌లతో 17 ఓవర్లలో 169/4 స్కోరు చేసిన ఆర్సీబీ తర్వాత ఢిల్లీ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆఖరి 3 ఓవర్లలో 18 పరుగులే చేసి 5 వికెట్లను కోల్పోయింది. అక్షర్ ఒక్కడే! లక్ష్యఛేదనలో ఢిల్లీ బ్యాటర్లు చెత్తగా ఆడటంతో ఆరంభం నుంచి ఆలౌట్ దాకా ఏ దశలోనూ గెలిచేలా కని్పంచలేదు. ఫ్రేజర్ (8 బంతుల్లో 21; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) తర్వాత కెపె్టన్ అక్షర్ పటేల్ ఒంటరి పోరాటం చేశాడు. అతనికి షై హోప్ (23 బంతుల్లో 29; 4 ఫోర్లు) కాసేపు అండగా నిలిచాడు. మిగిలిన వారెవరూ చెప్పుకోదగ్గ స్కోరే చేయలేదు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) అభిõÙక్ (బి) ఇషాంత్ 27; డుప్లెసిస్ (సి) ఫ్రేజర్ (బి) ముకేశ్ 6; జాక్స్ (సి) అక్షర్ (బి) కుల్దీప్ 41; పటిదార్ (సి) అక్షర్ (బి) రసిఖ్ 52; గ్రీన్ (నాటౌట్) 32; మహిపాల్ (సి) అభిషేక్ (బి) ఖలీల్ 13; దినేశ్ కార్తీక్ (సి) కుల్దీప్ (బి) ఖలీల్ 0; స్వప్నిల్ (సి) కుషాగ్ర (బి) రసిఖ్ 0; కరణ్ శర్మ (రనౌట్) 6; సిరాజ్ (రనౌట్) 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 187. వికెట్ల పతనం: 1–23, 2–36, 3–124, 4–137, 5–174, 6–174, 7–176, 8–185, 9–187. బౌలింగ్: ఇషాంత్ 3–0–31–1, ఖలీల్ 4–0–31–2, ముకేశ్ 3–0–23–1, అక్షర్ 3–0–24–0, కుల్దీప్ 4–0–52–1, రసిఖ్ 3–0–23–2. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) జాక్స్ (బి) స్వప్నిల్ 1; ఫ్రేజర్ (రనౌట్) 21; అభిõÙక్ (సి) ఫెర్గూసన్ (బి) యశ్ 2; షై హోప్ (సి) కరణ్ (బి) ఫెర్గూసన్ 29; కుశాగ్ర (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్ 2; అక్షర్ (సి) డుప్లెసిస్ (బి) యశ్ 57; స్టబ్స్ (రనౌట్) 3; రసిఖ్ (సి) జాక్స్ (బి) గ్రీన్ 10; కుల్దీప్ (బి) యశ్ 6; ముకేశ్ (సి) మహిపాల్ (బి) ఫెర్గూసన్ 3; ఇషాంత్ శర్మ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19.1 ఓవర్లలో ఆలౌట్) 140. వికెట్ల పతనం: 1–8, 2–24, 3–24, 4–30, 5–86, 6–90, 7–127, 8–128, 9–135, 10–140. బౌలింగ్: స్వప్నిల్ 1–0–9–1, సిరాజ్ 4–0–28–1, యశ్ దయాళ్ 3.1–0–20–3, కరణ్ శర్మ 2–0–19–0, ఫెర్గూసన్ 4–0–23–2, గ్రీన్ 4–0–19–1, జాక్స్ 1–0–16–0. -
RCB Vs PBKS: బెంగళూరు జోరు...
ధర్మశాల: ఐపీఎల్లో ఆరు వరుస ఓటముల తర్వాత ఒక్కసారిగా చెలరేగుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఇప్పుడు వరుసగా నాలుగో విజయాన్ని అందుకుంది. ఫలితంగా ఎనిమిదో ఓటమితో పంజాబ్ కింగ్స్ జట్టు వరుసగా పదో ఏడాది ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలు కోల్పోయింది. గురువారం జరిగిన పోరులో ఆర్సీబీ 60 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (47 బంతుల్లో 92; 7 ఫోర్లు, 6 సిక్స్‌లు), రజత్ పటిదార్ (23 బంతుల్లో 55; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు), కామెరాన్ గ్రీన్ (27 బంతుల్లో 46; 5 ఫోర్లు, 1 సిక్స్) వీరవిహారం చేసి ఆర్సీబీ భారీ స్కోరులో కీలకపాత్ర పోషించారు. అనంతరం పంజాబ్ 17 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది. రిలీ రోసో (27 బంతుల్లో 61; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారీ భాగస్వామ్యాలు... కొత్త బౌలర్ కావేరప్ప తక్కువ వ్యవధిలో డుప్లెసిస్ (9), జాక్స్ (12)లను అవుట్ చేసి పంజాబ్‌కు తగిన ఆరంభం అందించాడు. అయితే మరో ఎండ్‌లో కోహ్లి చెలరేగిపోగా, అతనికి పటిదార్ జత కలిశాక మరింత వేగంగా పరుగులు వచ్చాయి. చహర్ ఓవర్లో పటిదార్ 3 సిక్స్‌లు కొట్టాక జోరు పెరిగింది. 21 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత పటిదార్ వెనుదిరిగాడు. ఈ దశలో వర్షంతో కొద్దిసేపు ఆట ఆగిపోయింది. మ్యాచ్ మళ్లీ మొదలయ్యాక 32 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్న కోహ్లి దూకుడు పెంచాడు. స్యామ్ కరన్ బౌలింగ్‌లో అతను కొట్టిన భారీ సిక్సర్ ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచింది. అయితే మరో భారీ షాట్‌కు ప్రయత్నించి కోహ్లి సెంచరీ చేజార్చుకున్నాడు. కోహ్లి, గ్రీన్ ఐదో వికెట్‌కు 46 బంతుల్లోనే 96 పరుగులు జత చేశారు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో 3 పరుగులే ఇచ్చి హర్షల్ పటేల్ 3 వికెట్లు తీశాడు. పంజాబ్ భారీ ఛేదనలో బెయిర్‌స్టో (27) కొంత ధాటిగా ఆడగా... రోసో ఇన్నింగ్స్ మాత్రమే కొద్దిసేపు ఆశలు రేపింది. అతను వెనుదిరిగిన తర్వాత శశాంక్ (19 బంతుల్లో 37; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) పోరాడినా లాభం లేకపోయింది.క్యాచ్‌లు వదిలేసి...పంజాబ్ పేలవ ఫీల్డింగ్ కూడా బెంగళూరుకు కలిసొచ్చింది. ఆరంభంలోనే వచ్చిన మంచి అవకాశాలను పంజాబ్ ఫీల్డర్లు వృథా చేశారు. కెరీర్లో తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన కావేరప్ప మాత్రం తీవ్రంగా నిరాశ చెందాల్సి వచ్చింది. అతని బౌలింగ్‌లోనే కోహ్లి (0, 10 వద్ద) ఇచ్చిన క్యాచ్‌లను అశుతోష్, రోసో వదిలేయగా... పటిదార్ (0 వద్ద) ఇచ్చిన క్యాచ్‌ను హర్షల్ నేలపాలు చేశాడు. పటిదార్ 33 వద్ద ఉన్నప్పుడు చహర్ బౌలింగ్‌లో కొంత కష్టమైన క్యాచ్‌ను బెయిర్‌స్టో అందుకోలేకపోయాడు. ‘సున్నా’ వద్ద బతికిపోయిన కోహ్లి 92 వరకు చేరడం పంజాబ్‌ను అన్నింటికంటే బాగా దెబ్బ తీసింది. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) రోసో (బి) అర్‡్షదీప్ 92; డుప్లెసిస్ (సి) శశాంక్ (బి) కావేరప్ప 9; జాక్స్ (సి) హర్షల్ (బి) కావేరప్ప 12; పటిదార్ (సి) బెయిర్‌స్టో (బి) స్యామ్ కరన్ 55; గ్రీన్ (సి) స్యామ్ కరన్ (బి) హర్షల్ 46; దినేశ్ కార్తీక్ (సి) స్యామ్ కరన్ (బి) హర్షల్ 18; లోమ్రోర్ (బి) హర్షల్ 0; స్వప్నిల్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 241. వికెట్ల పతనం: 1–19, 2–43, 3–119, 4–211, 5–238, 6–240, 7–241. బౌలింగ్: కావేరప్ప 4–0–36–2, అర్‡్షదీప్ 3–0–41–1, స్యామ్ కరన్ 3–0–50–1, హర్షల్ 4–0–38–3, రాహుల్ చహర్ 3–0–47–0, లివింగ్‌స్టోన్ 3–0–28–0. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రభ్‌సిమ్రన్ (ఎల్బీ) (బి) స్వప్నిల్ 6; బెయిర్‌స్టో (సి) డుప్లెసిస్ (బి) ఫెర్గూసన్ 27; రోసో (సి) జాక్స్ (బి) కరణ్ 61; శశాంక్ సింగ్ (రనౌట్) 37; జితేశ్ శర్మ (బి) కరణ్ 5; లివింగ్‌స్టోన్ (సి) కరణ్ (బి) స్వప్నిల్ 0; స్యామ్ కరన్ (బి) ఫెర్గూసన్ 22; అశుతోష్ శర్మ (ఎల్బీ) (బి) సిరాజ్ 8; హర్షల్ (సి) ఫెర్గూసన్ (బి) సిరాజ్ 0; చహర్ (నాటౌట్) 5; అర్‡్షదీప్ (సి) కరణ్ (బి) సిరాజ్ 4; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (17 ఓవర్లలో ఆలౌట్) 181. వికెట్ల పతనం: 1–6, 2–71, 3–107, 4–125, 5–126, 6–151, 7–164, 8–170, 9–174, 10–181. బౌలింగ్: స్వప్నిల్ 3–0–28–2, సిరాజ్ 4–0–43–3, యశ్ దయాళ్ 2–0–22–0, ఫెర్గూసన్ 3–0–29–2, జాక్స్ 1–0–5–0, గ్రీన్ 1–0–16–0, కరణ్ శర్మ 3–0–36–2.ఐపీఎల్లో నేడుగుజరాత్ X చెన్నై వేదిక: అహ్మదాబాద్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
తొలి ఎనిమిది మ్యాచ్‌లలో ఒక విజయం, ఏడు పరాజయాలు... అంతా లెక్కలోంచి తీసేసిన వేళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పుంజుకుంది. ప్రత్యర్థి వేదికపై గత రెండు మ్యాచ్‌లు గెలిచిన ఆర్సీబీ ఇప్పుడు సొంతగడ్డపై చెలరేగి విజయాల ‘హ్యాట్రిక్’ సాధించింది. పట్టికలో మూడు స్థానాలు ఎగబాకి పదినుంచి ఏడుకు చేరింది. అయితే తాజా విజయంలో కాస్త ఉత్కంఠను పెంచి చివరకు గెలుపుతీరం చేరింది. ముందుగా తమ పేలవ ఆటను కొనసాగిస్తూ టైటాన్స్ 147 పరుగులకే పరిమితమైంది. సులువైన ల„ ్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీ స్కోరు 92/0...ఇక మిగిలింది లాంఛనమే అనుకున్న తరుణంలో 25 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు పడ్డాయి. కానీ తడబాటును అధిగమించి మరో 38 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. బెంగళూరు: చిన్నస్వామి మైదానంలో అభిమానులకు ఆర్సీబీ ఆనందం పంచింది. శనివారం జరిగిన కీలక పోరులో బెంగళూరు 4 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 19.3 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌటైంది. షారుఖ్ ఖాన్ (24 బంతుల్లో 37; 5 ఫోర్లు, 1 సిక్స్), రాహుల్ తెవాటియా (21 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్), డేవిడ్ మిల్లర్ (20 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) జట్టు స్కోరులో తలా ఓ చేయి వేశారు. అనంతరం బెంగళూరు 13.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్ (23 బంతుల్లో 64; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), విరాట్ కోహ్లి (27 బంతుల్లో 42; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 35 బంతుల్లోనే 92 పరుగులు జోడించి విజయాన్ని సులువు చేశారు. జోష్ లిటిల్‌కు 4 వికెట్లు దక్కాయి. టపటపా... సిరాజ్ బౌలింగ్ ధాటికి గుజరాత్ బ్యాటింగ్ ఆరంభంలోనే తడబడింది. తన తొలి రెండు ఓవర్లలో సాహా (1), గిల్ (2)లను సిరాజ్ అవుట్ చేయగా, సుదర్శన్ (6)ను గిల్ వెనక్కి పంపించాడు. దాంతో పవర్‌ప్లేలో గుజరాత్ 23 పరుగులకే పరిమితమైంది. ఈ దశలో షారుఖ్, మిల్లర్ కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ మిల్లర్‌ను అవుట్ చేసి ఈ 61 పరుగుల భాగస్వామ్యానికి కరణ్ తెర దించగా...లేని పరుగు కోసం ప్రయత్నించి షారుఖ్ రనౌట్ కావడంతో పరిస్థితి మళ్లీ మారిపోయింది. ఆ తర్వాత తెవాటియా కాస్త దూకుడుగా ఆడటంతో గుజరాత్ ఈ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. కరణ్ శర్మ వేసిన 16వ ఓవర్లో తెవాటియా వరుసగా 4, 6, 4, 4 బాదాడు. యశ్ దయాళ్ ఒకే ఓవర్లో రషీద్ (18), తెవాటియాను అవుట్ చేసి దెబ్బ కొట్టగా...వైశాక్ వేసిన ఆఖరి ఓవర్ తొలి మూడు బంతుల్లో ఒకే స్కోరు వద్ద గుజరాత్ మూడు వికెట్లు కోల్పోయింది. మెరుపు భాగస్వామ్యం... ఛేదనలో బెంగళూరు చెలరేగిపోయింది. ఓపెనర్లు కోహ్లి, డుప్లెసిస్ బౌండరీలు బాదుతూ వేగంగా లక్ష్యం దిశగా సాగిపోయారు. మోహిత్ వేసిన తొలి ఓవర్లో కోహ్లి 2 సిక్స్‌లు కొట్టగా, లిటిల్ వేసిన తర్వాతి ఓవర్లో డుప్లెసిస్ 3 ఫోర్లు, సిక్స్ కొట్టాడు. మానవ్ వేసిన తర్వాతి ఓవర్లోనూ సిక్స్, ఫోర్ కొట్టిన డుప్లెసిస్...మోహిత్ ఓవర్లో 4 ఫోర్లు బాది 18 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. మానవ్ ఓవర్లో కోహ్లి 2 సిక్స్‌లు కొట్టగా...లిటిల్ వేసిన తర్వాతి ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ బాది అదే జోరులో డుప్లెసిస్ అవుటయ్యాడు. 6 ఓవర్లు ముగిసే సరికి 92 పరుగులు సాధించిన ఆర్సీబీ...ఐపీఎల్లో తమ అత్యుత్తమ పవర్‌ప్లే స్కోరును నమోదు చేసింది. అయితే డుప్లెసిస్ వెనుదిరిగిన తర్వాత బ్యాటింగ్ బృందం తడబడింది. కొంత ఉత్కంఠ నెలకొన్నా... దినేశ్ కార్తీక్ (12 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు), స్వప్నిల్ సింగ్ (9 బంతుల్లో 15 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఏడో వికెట్‌కు అభేద్యంగా 35 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. స్కోరు వివరాలు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (సి) కార్తీక్ (బి) సిరాజ్ 1; గిల్ (సి) వైశాక్ (బి) సిరాజ్ 2; సుదర్శన్ (సి) కోహ్లి (బి) గ్రీన్ 6; షారుఖ్ (రనౌట్) 37; మిల్లర్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) కరణ్ 30; తెవాటియా (సి) వైశాక్ (బి) దయాళ్ 35; రషీద్ (బి) దయాళ్ 18; విజయ్‌శంకర్ (సి) సిరాజ్ (బి) వైశాక్ 10; మానవ్ (సి) స్వప్నిల్ (బి) వైశాక్ 1; మోహిత్ (రనౌట్) 0; నూర్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.3 ఓవర్లలో ఆలౌట్) 147. వికెట్ల పతనం: 1–1, 2–10, 3–19, 4–80, 5–87, 6–131, 7–136, 8–147, 9–147, 10–147. బౌలింగ్: స్వప్నిల్ సింగ్ 1–0–1–0, సిరాజ్ 4–0–29–2, యశ్ దయాళ్ 4–0–21–2, గ్రీన్ 4–0–28–1, విజయ్‌కుమార్ వైశాక్ 3.3–0–23–2, కరణ్ శర్మ 3–0–42–1. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: కోహ్లి (సి) సాహా (బి) నూర్ 42; డుప్లెసిస్ (సి) షారుఖ్ (బి) లిటిల్ 64; జాక్స్ (సి) షారుఖ్ (బి) నూర్ 1; పటిదార్ (సి) మిల్లర్ (బి) లిటిల్ 2; మ్యాక్స్‌వెల్ (సి) మిల్లర్ (బి) లిటిల్ 4; గ్రీన్ (సి) షారుఖ్ (బి) లిటిల్ 1; కార్తీక్ (నాటౌట్) 21; స్వప్నిల్ (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (13.4 ఓవర్లలో 6 వికెట్లకు) 152 వికెట్ల పతనం: 1–92, 2–99, 3–103, 4–107, 5–111, 6–117. బౌలింగ్: మోహిత్ శర్మ 2–0–32–0, జోష్ లిటిల్ 4–0–45–4, మానవ్ సుథర్ 2–0–26–0, నూర్ అహ్మద్ 4–0–23–2, రషీద్ ఖాన్ 1.4–0–25–0. ఐపీఎల్లో నేడుపంజాబ్ X చెన్నైవేదిక: ధర్మశాలమధ్యాహ్నం 3: 30 గంటల నుంచిలక్నో X కోల్‌కతావేదిక: లక్నోరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
జాక్స్ ధమాకా...
బెంగళూరు గెలిచేందుకు 6 ఓవర్లలో 53 పరుగులు చేయాలి. కోహ్లి 69 పరుగులతో... విల్ జాక్స్ 44 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక్కడ సెంచరీ అయితే గియితే కోహ్లిదే అవుతుంది లేదంటే లేదు! కానీ ఎవరూ ఊహించని విధంగా జాక్స్ రెండే ఓవర్లలో సెంచరీ పూర్తి చేశాడు. మోహిత్ శర్మ వేసిన 15వ ఓవర్లో జాక్స్ 4, 6, నోబాల్ 6, 2, 6, 4, 0లతో 29 పరుగులు సాధించాడు. రషీద్ ఖాన్ వేసిన 16వ ఓవర్లో తొలి బంతికి కోహ్లి ఒక పరుగు తీసి జాక్స్‌కు స్ట్రయిక్ ఇచ్చాడు. జాక్స్ వరుసగా 6, 6, 4, 6, 6లతో 28 పరుగులు పిండుకొని సంచలన శతకం సాధించి అబ్బురపరిచాడు. జాక్స్ 29 బంతుల్లో 44 పరుగులు చేయగా... ఆ తర్వాత 12 బంతుల్లో ఏకంగా 56 పరుగులు సాధించి సెంచరీ మైలురాయిని అందుకోవడం విశేషం. అహ్మదాబాద్: మళ్లీ బౌలర్ డీలా... బంతేమో విలవిల... బ్యాట్ భళా! అంతే మరో 200 పైచిలుకు స్కోరు... దీన్ని 16 ఓవర్లలోనే ఛేదించిన తీరు చూస్తుంటే ఈ వేసవి వడగాడ్పులతో వేడెక్కించడమే కాదు... ఐపీఎల్ సిక్సర్లతో కిక్ ఎక్కిస్తోంది! ప్లే ఆఫ్స్ రేసుకు దాదాపు దూరమనుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఇంటాబయటా పరుగుల హోరెత్తిస్తోంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌పై జయభేరి మోగించింది. 201 పరుగుల లక్ష్యాన్ని 16 ఓవర్లలోనే ఉఫ్‌మని ఊదేసింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగుల భారీస్కోరు చేసింది. సాయి సుదర్శన్ (49 బంతుల్లో 84 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు), షారుఖ్ ఖాన్ (30 బంతుల్లో 58; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగారు. అనంతరం ఆర్సీబీ 16 ఓవర్లలోనే ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 206 పరుగులు చేసి ఘనవిజయం సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ విల్ జాక్స్ (41 బంతుల్లో 100 నాటౌట్; 5 ఫోర్లు, 10 సిక్స్‌లు), విరాట్ కోహ్లి (44 బంతుల్లో 70 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) సిక్సర్లతో హోరెత్తించారు. జాక్స్ 2 ఓవర్ల విధ్వంసంతో... కోహ్లితో ఛేదన ప్రారంభించిన డుప్లెసిస్ (12 బంతుల్లో 24; 1 ఫోర్, 3 సిక్స్‌లు) నాలుగో ఓవర్లో నిష్క్రమించాడు. సాయికిశోర్ వేసిన ఆ ఓవరే వికెట్ దక్కించుకుంది. ఆ తర్వాత ఎవరూ బౌలింగ్‌కు దిగినా... పరుగులు, ఈ దశ దాటి మెరుపులు... దాన్ని మించి ఉప్పెనే! పవర్‌ప్లేలో బెంగళూరు 63/1 స్కోరు చేసింది. సగం ఓవర్లు ముగిసేసరికి 98/1 అంటే వంద కూడా చేయని జట్టు ఇంకో 6 ఓవర్లు ముగిసేసరికే 108 పరుగుల్ని చేసి మ్యాచ్‌నే ముగించింది. కోహ్లి 32 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నప్పుడు జాక్స్ 16 బంతుల్లో 16 పరుగులే చేశాడు. 14 ఓవర్లలో బెంగళూరు స్కోరు 148/1. ఈ దశలో మోహిత్ వేసిన 15వ ఓవర్లో, రషీద్ ఖాన్ వేసిన 16వ ఓవర్లో జాక్స్ విశ్వరూపం ప్రదర్శించడంతో ఆర్సీబీ 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని అధిగమించి విజయతీరానికి చేరింది.స్కోరు వివరాలు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (సి) కరణ్ శర్మ (బి) స్వప్నిల్ 5; గిల్ (సి) గ్రీన్ (బి) మ్యాక్స్‌వెల్ 16; సుదర్శన్ (నాటౌట్) 84; షారుఖ్ (బి) సిరాజ్ 58; మిల్లర్ (నాటౌట్) 26; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 200. వికెట్ల పతనం: 1–6, 2–45, 3–131. బౌలింగ్: స్వప్నిల్ 3–0–23–1, సిరాజ్ 4–0–34–1, యశ్ దయాళ్ 4–0–34–0, మ్యాక్స్‌వెల్ 3–0–28–1, కరణ్ శర్మ 3–0–38–0, గ్రీన్ 3–0–42–0. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (నాటౌట్) 70; డుప్లెసిస్ (సి) సబ్–శంకర్ (బి) సాయికిశోర్ 24; విల్ జాక్స్ (నాటౌట్) 100; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (16 ఓవర్లలో వికెట్ నష్టానికి) 206. వికెట్ల పతనం: 1–40. బౌలింగ్: అజ్మతుల్లా 2–0–18–0, సందీప్ 1–0–15–0, సాయికిశోర్ 3–0–30–1, రషీద్ ఖాన్ 4–0–51–0, నూర్ అహ్మద్ 4–0–43–0, మోహిత్ 2–0–41–0. ఐపీఎల్లో నేడుకోల్‌కతా X ఢిల్లీ వేదిక: కోల్‌కతారాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
రైజింగ్‌కు బ్రేక్
హెడ్ విధ్వంసం సృష్టించలేదు... క్లాసెన్ కుమ్మేయలేదు... మార్క్రమ్ మెరుపుల్లేవు... అభిషేక్ ఆశించిన స్థాయిలో చెలరేగలేదు... వరుస మ్యాచ్‌లలో పరుగుల వరద పారిస్తూ ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నంలా మారిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు దూకుడుకు సొంతగడ్డపై బ్రేక్ పడింది. 300 స్కోరు సంగతేమో కానీ ఛేదనలో ఒకదశలో 100 కూడా దాటడమే కష్టమనిపించింది.వరుసగా నాలుగు విజయాల తర్వాత హైదరాబాద్ జట్టు తలవంచింది. మరోవైపు వరుసగా ఆరు పరాజయాలు... మైదానంలో దిగేదే ఓడేందుకా అన్నట్లు ఆడుతూ ఒక్క గెలుపు కోసం తపించిపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు భారీ ఊరట లభించింది. బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్‌లోనూ రాణించడంతో ఎట్టకేలకు ఆ జట్టుకు ఈ ఐపీఎల్ సీజన్లో రెండో విజయం దక్కింది. సాక్షి, హైదరాబాద్: సీజన్లో తిరుగులేకుండా సాగుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు అనూహ్య పరాజయం ఎదురైంది. గురువారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 35 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌పై విజయం సాధించింది.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగులు సాధించింది. విరాట్ కోహ్లి (43 బంతుల్లో 51; 4 ఫోర్లు, 1 సిక్స్), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రజత్ పటిదార్ (20 బంతుల్లో 50; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధసెంచరీలు చేయగా... కామెరాన్ గ్రీన్ (20 బంతుల్లో 37 నాటౌట్; 5 ఫోర్లు) రాణించాడు.అనంతరం హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 171 పరుగులు చేసి ఓడిపోయింది. షహబాజ్ అహ్మద్ (37 బంతుల్లో 40 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్), అభిషేక్ శర్మ (13 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), ప్యాట్ కమిన్స్ (15 బంతుల్లో 31; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. పటిదార్ మెరుపులు... భువనేశ్వర్ ఓవర్లో 3 ఫోర్లతో డుప్లెసిస్ (12 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించగా... కమిన్స్ ఓవర్లో కోహ్లి 2 ఫోర్లు కొట్టాడు. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 61 పరుగులకు చేరింది. డుప్లెసిస్, జాక్స్ (6) వెనుదిరిగిన తర్వాత కోహ్లి ఆశ్చర్యకర రీతిలో ఒక్కసారిగా నెమ్మదించాడు. తన 17వ బంతికి సిక్స్ కొట్టిన కోహ్లి... ఆ తర్వాత 25 బంతులపాటు బౌండరీ కొట్టలేకపోవడం అనూహ్యం.అయితే మరో ఎండ్‌లో పటిదార్ విధ్వంసం ఆర్సీబీ స్కోరును పరుగెత్తించింది. లెగ్‌స్పిన్నర్ మార్కండే లక్ష్యంగా అతను చెలరేగిపోయాడు. అతని రెండో ఓవర్లో ఒక సిక్స్ కొట్టిన పటిదార్... అతని తర్వాతి ఓవర్లో వరుసగా 6, 6, 6, 6 బాదడం విశేషం. కోహ్లి, పటిదార్ తక్కువ వ్యవధిలో వెనుదిరిగినా... గ్రీన్ చక్కటి షాట్లతో స్కోరును 200 పరుగులు దాటించాడు. ఆఖరి 5 ఓవర్లలో ఆర్సీబీ 64 పరుగులు చేసింది. టపటపా... తొలి ఓవర్లోనే హెడ్ (1) అవుట్ కావడంతో రైజర్స్‌కు సరైన ఆరంభం లభించలేదు. జాక్స్ ఓవర్లో 2 సిక్స్‌లు, ఫోర్ కొట్టిన అభిషేక్ తర్వాతి ఓవర్లో వెనుదిరిగాడు. అంతే... ఆ తర్వాత పరుగులు రావడం ఆగిపోవడంతో పాటు హైదరాబాద్ వరుసగా వికెట్లు కోల్పోయింది.మార్క్రమ్ (8 బంతుల్లో 7; 1 ఫోర్), క్లాసెన్ (3 బంతుల్లో 7; 1 సిక్స్), నితీశ్ కుమార్ రెడ్డి (13 బంతుల్లో 13; 1 సిక్స్) ఇలా వచ్చి అలా పెవిలియన్‌కు వెళ్లిపోయారు. దాంతో సన్‌రైజర్స్‌కు ఏ దశలోనూ గెలుపు అవకాశాలు కనిపించలేదు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) సమద్ (బి) ఉనాద్కట్ 51; డుప్లెసిస్ (సి) మార్క్రమ్ (బి) నటరాజన్ 25; జాక్స్ (బి) మార్కండే 6; పటిదార్ (సి) సమద్ (బి) ఉనాద్కట్ 50; గ్రీన్ (నాటౌట్) 37; లోమ్రోర్ (సి) కమిన్స్ (బి) ఉనాద్కట్ 7; కార్తీక్ (సి) సమద్ (బి) కమిన్స్ 11; స్వప్నిల్ (సి) అభిషేక్ (బి) నటరాజన్ 12; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 206. వికెట్ల పతనం: 1–48, 2–65, 3–130, 4–140, 5–161, 6–193, 7–206. బౌలింగ్: అభిషేక్ శర్మ 1–0–10–0, భువనేశ్వర్ 1–0–14–0, కమిన్స్ 4–0–55–1, నటరాజన్ 4–0–39–2, షహబాజ్ 3–0–14–0, మార్కండే 3–0–42–1, జైదేవ్ ఉనాద్కట్ 4–0–30–3. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (సి) కార్తీక్ (బి) యశ్ 31; హెడ్ (సి) కరణ్ (బి) జాక్స్ 1; మార్క్రమ్ (ఎల్బీ) (బి) స్వప్నిల్ 7; నితీశ్ కుమార్ రెడ్డి (బి) కరణ్ 13; క్లాసెన్ (సి) గ్రీన్ (బి) స్వప్నిల్ 7; షహబాజ్ (నాటౌట్) 40; సమద్ (సి అండ్ బి) శర్మ 10; కమిన్స్ (సి) సిరాజ్ (బి) గ్రీన్ 31; భువనేశ్వర్ (సి) సిరాజ్ (బి) గ్రీన్ 13; ఉనాద్కట్ (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1–3, 2–37, 3–41, 4–56, 5–69, 6–85, 7–124, 8–141. బౌలింగ్: జాక్స్ 2–0–23–1, సిరాజ్ 4–0–20–0, యశ్ దయాళ్ 3–0–18–1, స్వప్నిల్ 3–0–40–2, కరణ్ శర్మ 4–0–29–2, ఫెర్గూసన్ 2–0–28–0, గ్రీన్ 2–0–12–2. ఐపీఎల్లో నేడుకోల్‌కతా X పంజాబ్ వేదిక: కోల్‌కతారాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ లైవ్ అప్డేట్స్
IPL 2024 RCB vs SRH Live Updates: ఎస్ఆర్హెచ్పై ఆర్సీబీ ఘన విజయం..ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 పరుగుల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులు మాత్రమే చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో షాబాజ్ అహ్మద్(40) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ప్యాట్ కమ్మిన్స్(31), అభిషేక్ శర్మ(31) పర్వాలేదన్పించారు.ఆర్సీబీ బౌలర్లలో స్వప్నిల్ సింగ్, కామెరాన్ గ్రీన్,కరణ్ శర్మ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో రజిత్ పాటిదార్(50), విరాట్ కోహ్లి(51) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. అతడితో పాటు కామెరాన్ గ్రీన్(37 నాటౌట్) రాణించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో జయ్‌దేవ్ ఉనద్కట్ 3 వికెట్లు పడగొట్టగా.. నటరాజన్ రెండు వికెట్లు, ప్యాట్ కమ్మిన్స్,మార్కండే తలా వికెట్ సాధించారు.ఏడో వికెట్ డౌన్..124 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ ఏడో వికెట్ కోల్పోయింది. 31 పరుగులు చేసిన కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్.. గ్రీన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి భువనేశ్వర్ కుమార్ వచ్చాడు.కష్టాల్లో ఎస్ఆర్హెచ్..207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ 85 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. షాబాజ్ అహ్మద్(13), ప్యాట్ కమ్మిన్స్(3) పరుగులతో ఉన్నారు.56 పరుగులకే 4 వికెట్లు..207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ 56 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. 5 ఓవర్ వేసిన స్వప్నిల్ సింగ్ బౌలింగ్‌లో తొలుత మార్క్రమ్(7) ఔట్ కాగా.. తర్వాత క్లాసెన్(7) ఔటయ్యారు. 6 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 62/4. క్రీజులో నితీష్ కుమార్ రెడ్డి(10),షాబాజ్ అహ్మద్(3) ఉన్నారు.రెండో వికెట్ డౌన్..37 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. కేవలం 13 బంతుల్లోనే 31 పరుగులు చేసిన అభిషేక్ శర్మ.. యశ్‌దయాల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 4 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 37/2. క్రీజులో మార్క్రమ్(3), నితీష్ కుమార్ రెడ్డి ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన ట్రావిస్ హెడ్.. విల్ జాక్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.దంచి కొట్టిన ఆర్సీబీ.. ఎస్ఆర్హెచ్ టార్గెట్ 207 పరుగులుటాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన ఆర్సీబీ అదరగొట్టింది. ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో రజిత్ పాటిదార్(50), విరాట్ కోహ్లి(51) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. అతడితో పాటు కామెరాన్ గ్రీన్(37 నాటౌట్) రాణించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో జయ్‌దేవ్ ఉనద్కట్ 3 వికెట్లు పడగొట్టగా.. నటరాజన్ రెండు వికెట్లు, ప్యాట్ కమ్మిన్స్,మార్కండే తలా వికెట్ సాధించారు.18 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 179/518 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. క్రీజులో గ్రీన్(27), కార్తీక్(7) ఉన్నారు.విరాట్ కోహ్లి ఔట్..ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. 51 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. జయ్‌దేవ్ ఉనద్కట్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 13 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 142/4మూడో వికెట్ డౌన్..పాటిదార్ రూపంలో ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. 50 పరుగులు చేసిన పాటిదార్.. ఉనద్కట్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 13 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 132/312 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 126/212 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ రెండు వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(46), రజిత్ పాటిదార్(49) పరుగులతో ఉన్నారు. పాటిదార్ దూకుడుగా ఆడుతున్నాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు.రెండో వికెట్ డౌన్..విల్ జాక్స్ రూపంలో ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన విల్ జాక్స్.. మార్కండే బౌలింగ్‌లో ఔటయ్యాడు. 8 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 73/2. క్రీజులో విరాట్ కోహ్లి(34), పాటిదార్(6) పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ..48 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన ఫాప్ డుప్లెసిస్.. నటరాజన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 4 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 49/1. క్రీజులో విరాట్ కోహ్లి(23), విల్ జాక్స్(1) పరుగులతో ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న ఆర్సీబీ..టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ దూకుడుగా ఆడుతోంది. 2 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(9), ఫాప్ డుప్లెసిస్(15) పరుగులతో ఉన్నారు.తొలుత బ్యాటింగ్ చేయనున్న ఆర్సీబీ..ఐపీఎల్-2024లో భాగంగా హైదరాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆర్సీబీ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. ఎస్ఆర్హెచ్ మాత్రం ఒక మార్పు చేసింది.తుది జట్లుసన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ఐడెన్ మర్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండే, టి నటరాజన్రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పటీదార్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, లాకీ ఫెర్గూసన్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్ -
IPL 2024 RCB Vs SRH: 277 కాదు... 287
బెంగళూరు: సన్‌రైజర్స్ ఆటతీరు చిన్నస్వామి స్టేడియాన్ని పెద్ద పెద్ద రికార్డుల్లో నిలిపింది. బెంగళూరు టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకోగానే విధ్వంసానికి పునాది పడింది...బ్యాటింగ్ తుఫాన్‌తో హైదరాబాద్ మ్యాచ్ గెలిచింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒక సీజన్లో తమ రికార్డుకు ‘2.0’ ను చూపించింది. ముంబైపై 277 రికార్డును రోజుల వ్యవధిలోనే 287 పరుగుల అత్యధిక స్కోరుతో హైదరాబాద్ జట్టు తిరగరాసింది. ఈ ఎండల్ని తట్టుకోలేని జనాలకు మెరుపుల పండగని పంచిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 25 పరుగుల తేడాతో బెంగళూరుపై గెలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి మునుపెన్నడూ చేయని 287 పరుగుల భారీ స్కోరు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ట్రవిస్ హెడ్ (41 బంతుల్లో 102; 9 ఫోర్లు, 8 సిక్స్‌లు) శతకం బాదగా... హెన్రిచ్ క్లాసెన్ (31 బంతుల్లో 67; 2 ఫోర్లు, 7 సిక్స్‌లు) ఆకాశానికే చిల్లులుపడేలా సిక్స్‌లు కొట్టాడు. అనంతరం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. దినేశ్ కార్తీక్ (35 బంతుల్లో 83; 5 ఫోర్లు, 7 సిక్స్‌లు) దంచేశాడు చివరి వరకు పోరాడగా..డుప్లెసిస్ (28 బంతుల్లో 62; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరిపించాడు. దంచుడే... దంచుడు! రెండో ఓవర్ నుంచే హెడ్ వీరంగం మొదలైంది. టాప్లీ ఓవర్లో 4, 6 కొట్టగా, ఫెర్గూసన్ ఐదో ఓవర్లో రెండు సిక్స్‌లతో పాటు ఓ బౌండరీ బాదాడు. దీన్ని యశ్ తదుపరి ఓవర్లోనూ రిపీట్ చేయడంతో 20 బంతుల్లో హెడ్ ఫిఫ్టీ పూర్తవగా, పవర్‌ప్లే స్కోరు 76/0. జాక్స్ ఏడో ఓవర్ వేస్తే హెడ్ వరుసగా 4, 6, 6 బాదేశాడు. తర్వాత అభిషేక్ సిక్సర్‌తో 7.1 ఓవర్లోనే సన్‌రైజర్స్ వందను దాటేసింది. తర్వాతి ఓవర్లో అభిషేక్ (22 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)ను టాప్లీ అవుట్ చేసి 108 పరుగుల ఓపెనింగ్ జోడీని విడగొట్టాడు. క్లాసెన్ క్రీజులోకి రాగా... వైశాక్ 12వ ఓవర్లో మూడు ఫోర్లతో హెడ్ 39 బంతుల్లో శతకం పూర్తి చేసుకొని కాసేపటికే అవుటయ్యాడు. ఇక క్లాసెన్ వంతు! అప్పటిదాకా అడపాదడపా షాట్లతో 21 పరుగులు చేసిన క్లాసెన్ బాదే బాధ్యత తను తీసుకున్నాడు. లోమ్రోర్ 9 బంతులేసిన 14వ ఓవర్లో రెండు భారీ సిక్స్‌లు కొట్టాడు. తదుపరి వైశాక్ బౌలింగ్‌లో ఫోర్, సిక్స్ కొట్టి 23 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. టాప్లీ, ఫెర్గూసన్‌ల వరుస ఓవర్లలో ఒక్కో సిక్స్‌తో విరుచుకుపడిన క్లాసెన్‌కు ఫెర్గూసన్ చెక్‌పెట్టాడు. క్రీజులో ఉన్న మార్క్రమ్ (17 బంతుల్లో 32నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)కు అప్పుడే వచి్చన సమద్ (10 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) తోడయ్యాడు. వచ్చీ రాగానే టార్గెట్ తుఫాన్‌పై కదం తొక్కుతూ టాప్లీ వేసిన 19వ ఓవర్లో ఆడిన ఐదు బంతుల్ని 4, 4, 6, 6, 4లుగా బాదాడు. ఆఖరి ఓవర్లో మార్క్రమ్ 4, 6 కొడితే సమద్ మరో సిక్సర్ బాదాడు. 19వ ఓవర్లో 25, 20వ ఓవర్లో 21 పరుగులు హైదరాబాద్ గెలుపులో కీలకమయ్యాయి. బెంగళూరు తగ్గలేదు! ఎంతకొట్టినా ఎంతకీ కరగని లక్ష్యమని బెంగళూరు బెదిరిపోలేదు. ఆఖరి దాకా తగ్గేదే లే అన్నట్లుగా సన్‌రైజర్స్ ఫీల్డర్లను చెమటలు పట్టించింది. ఓపెనర్లు కోహ్లి (20 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), డుప్లెసిస్ కొండంత లక్ష్యానికి దీటైన ఆరంభం ఇచ్చారు. ఇద్దరు తొలి ఓవర్లో చెరో బౌండరీతో ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టారు. తర్వాత ఓవర్ ఓవర్‌కూ సిక్స్‌లు, ఫోర్లతో వేగాన్ని పెంచారు. భువీ నాలుగో ఓవర్లో ఇద్దరు చెరో 2 బౌండరీలతో 3.5 ఓవర్లోనే బెంగళూరు 50 దాటింది. నటరాజన్, కమిన్స్ ఓవర్లలో అవలీలగా ఫోర్లు, సిక్స్‌లు బాదడంతో పవర్‌ప్లేలో జట్టు 78/0 స్కోరు చేసింది. కోహ్లిని మార్కండే బౌల్డ్ చేయడంతో తొలిదెబ్బ తగిలింది. మరోవైపు డుప్లెసిస్ 24 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. కానీ విల్‌జాక్స్ (7) నాన్‌స్ట్రయిక్ ఎండ్‌లో దురదృష్టవశాత్తు రనౌటవడం, పటిదార్ (9)తో పాటు డుప్లెసిస్ స్వల్పవ్యవధిలో పెవిలియన్ చేరడం జట్టును వెనుకబడేలా చేసింది. అయితే పదో ఓవర్లో క్రీజులోకి వచి్చన దినేశ్ కార్తీక్ షాట్లతో విరుచుకుపడటంతో భారీ స్కోరు కాస్తా దిగి వస్తుండటంతో హైదరాబాద్ శిబిరం కాస్తా ఇబ్బంది పడింది. 23 బంతుల్లో కార్తీక్ ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. అయితే 12 బంతుల్లో 58 పరుగుల సమీకరణం కష్టసాధ్యం కావడంతో పాటు 19వ ఓవర్లో 6, 4 కొట్టిన కార్తీక్‌ను నటరాజన్ అవుట్ చేయడంతో పరాజయం ఖాయమైంది. 11, 12 ఓవర్లలో వరుసగా 5, 8 పరుగులే రావడం.... 15వ ఓవర్లో కమిన్స్... హిట్టర్ మహిపాల్ (11 బంతుల్లో 19; 2 సిక్స్‌లు)ను అవుట్ చేసి 6 పరుగులే ఇవ్వడం సన్‌రైజర్స్‌ను గట్టెక్కించింది. లేదంటే పరిస్థితి కచి్చతంగా మరోలా ఉండేది! స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) ఫెర్గూసన్ (బి) టాప్లీ 34; హెడ్ (సి) డుప్లెసిస్ (బి) ఫెర్గూసన్ 102; క్లాసెన్ (సి) వైశాక్ (బి) ఫెర్గూసన్ 67; మార్క్రమ్ నాటౌట్ 32; సమద్ నాటౌట్ 37; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 287. వికెట్ల పతనం: 1–108. 2–165, 3–231. బౌలింగ్: విల్ జాక్స్ 3–0–32–0, టాప్లీ 4–0–68–1, యశ్ దయాళ్ 4–0–51–0, ఫెర్గూసన్ 4–0–52–2, వైశాక్ 4–0–64–0, మహిపాల్ 1–0–18–0. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (బి) మార్కండే 42; డుప్లెసిస్ (సి) క్లాసెన్ (బి) కమిన్స్ 62; జాక్స్ రనౌట్ 7; పటిదార్ (సి) నితీశ్ (బి) మార్కండే 9; సౌరవ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) కమిన్స్ 0; దినేశ్ కార్తీక్ (సి) క్లాసెన్ (బి) నటరాజన్ 83; మహిపాల్ (బి) కమిన్స్ 19; అనూజ్ నాటౌట్ 25; వైశాక్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 262. వికెట్ల పతనం: 1–80, 2–100, 3–111, 4–121, 5–122, 6–181, 7–244. బౌలింగ్: అభిషేక్ 1–0–10–0, భువనేశ్వర్ 4–0–60–0, షహబాజ్ 1–0–18–0, నటరాజన్ 4–0–47–1, కమిన్స్ 4–0–43–3, మార్కండే 4–0–46–2, ఉనాద్కట్ 2–0–37–0. 287: ఐపీఎల్లో ఒక టీమ్ సాధించిన అత్యధిక స్కోరు. ఇదే సీజన్లో తాము చేసిన 277 స్కోరును సన్‌రైజర్స్ సవరించింది. ఓవరాల్‌గా టి20ల్లో ఇది రెండో అత్యధిక స్కోరు. ఆసియా క్రీడల్లో మంగోలియాపై నేపాల్ 314 పరుగులు చేసింది. 22: సన్‌రైజర్స్ సిక్సర్లు. గతంలో బెంగళూరు కొట్టిన 21 సిక్సర్ల రికార్డు బద్దలైంది. 4: హెడ్ చేసిన సెంచరీ (39 బంతుల్లో) ఐపీఎల్లో నాలుగో వేగవంతమైంది. గేల్ (30), యూసుఫ్ పఠాన్ (37), మిల్లర్ (38) ముందున్నారు. సన్‌రైజర్స్ తరఫున గతంలో వార్నర్ 43 బంతుల్లో సెంచరీ చేశాడు. 549: ఒక టి20ల్లో నమోదైన అత్యధిక పరుగులతో కొత్త రికార్డు. ఇదే సీజన్లో హైదరాబాద్, ముంబై మధ్య 523 పరుగులు నమోదయ్యాయి. ఐపీఎల్లో నేడు కోల్‌కతా X రాజస్తాన్ వేదిక: కోల్‌కతా రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
RCB Vs MI: ముంబై ఫటాఫట్...
ముంబై: ముంబై ఇండియన్స్ ముందున్న కొండంత లక్ష్యాన్ని ఇద్దరే ఇద్దరి విధ్వంసం మంచు ముక్కలా కరిగించేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (34 బంతుల్లో 69; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు), సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 52; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) సిక్సర్ల సునామీతో ముంబై 197 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.3 ఓవర్లలోనే ఛేదించింది. దాంతో హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)పై ఘనవిజయం సాధించింది. అంతకుముందు తొలుత ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. డుప్లెసిస్ (40 బంతుల్లో 61; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించగా, రజత్ పటిదార్ (26 బంతుల్లో 50; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), దినేశ్ కార్తీక్ (23 బంతుల్లో 53 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరిపించారు. ముంబై బౌలర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బుమ్రా 21 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. కోహ్లి విఫలం సూపర్ ఫామ్‌లో ఉన్న కోహ్లి (3) విఫలమవగా, విల్ జాక్స్ (8) నిరాశపరిచాడు. ఈ దశలో బెంగళూరును కెప్టెన్ డుప్లెసిస్ అండతో పటిదార్ ధాటిగా నడిపించాడు. 12వ ఓవర్లో కోయెట్జి బౌలింగ్‌లో రెండు వరుస సిక్స్‌లు బాదిన పటిదార్ 25 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకొని తర్వాతి బంతికే వెనుదిరిగాడు. మ్యాక్స్‌వెల్ (0) ఈ సీజన్లో మూడోసారి డకౌటయ్యాడు. అడపాదడపా షాట్లతో డుప్లెసిస్ 33 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. అయితే బుమ్రా వరుస ఓవర్లలో రెండేసి వికెట్లను పడగొట్టాడు. డుప్లెసిస్, హిట్టర్ లామ్రోర్ (0)లతో పాటు, సౌరవ్ (9), వైశాక్ (0)లను బుమ్రా అవుట్ చేసినా... దినేశ్ కార్తీక్ ధనాధన్ ఆటతో బెంగళూరు మంచి స్కోరు చేసింది. ఇషాన్, సూర్యల తుఫాన్‌తో... భారీ లక్ష్య ఛేదనలో ముంబై బ్యాటర్లు మెరుపు షాట్లతో హోరెత్తించారు. ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దీంతో ముంబై పవర్‌ప్లేలోనే 72/0 స్కోరు చేసింది. ఇషాన్ 23 బంతుల్లో అర్ధసెంచరీని సాధించగా, రోహిత్ నింపాదిగా ఆడాడు. కేవలం 8.3 ఓవర్లలోనే జట్టు స్కోరు 100 చేరింది. అదే ఓవర్లో ఇషాన్ దూకుడు ముగిసింది. అనంతరం సూర్యకుమార్ విధ్వంసం సృష్టించి 17 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. రోహిత్, సూర్యలు అవుటయ్యాక హార్దిక్ పాండ్యా (6 బంతుల్లో 21 నాటౌట్; 3 సిక్స్‌లు), తిలక్ వర్మ (10 బంతుల్లో 16 నాటౌట్; 3 ఫోర్లు) ధాటిగా ఆడి ముంబైను విజయతీరాలకు చేర్చారు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) ఇషాన్ (బి) బుమ్రా 3; డుప్లెసిస్ (సి) డేవిడ్ (బి) బుమ్రా 61; జాక్స్ (సి) డేవిడ్ (బి) మధ్వాల్ 8; పటిదార్ (సి) ఇషాన్ (బి) కోయెట్జీ 50; మ్యాక్స్‌వెల్ (ఎల్బీడబ్ల్యూ) గోపాల్ 0; దినేశ్ కార్తీక్ (నాటౌట్) 53; లామ్రోర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) బుమ్రా 0; సౌరవ్ (సి) ఆకాశ్ (బి) బుమ్రా 9; వైశాక్ (సి) నబి (బి) బుమ్రా 0; ఆకాశ్‌దీప్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1–14, 2–23, 3–105, 4–108, 5–153, 6–153, 7–170, 8–170. బౌలింగ్: నబీ 1–0–7–0, కోయెట్జీ 4–0–42–1, బుమ్రా 4–0–21–5, ఆకాశ్ 4–0–57–1, శ్రేయస్ గోపాల్ 4–0–32–1, షెఫర్డ్ 2–0–22–0, హార్దిక్ 1–0–13–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: ఇషాన్ (సి) కోహ్లి (బి) ఆకాశ్‌దీప్ 69; రోహిత్ (సి) టాప్లీ (బి) జాక్స్ 38; సూర్యకుమార్ (సి) మహిపాల్ (బి) వైశాక్ 52; హార్దిక్ (నాటౌట్) 21; తిలక్ వర్మ (నాటౌట్) 16; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (15.3 ఓవర్లలో 3 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1–101, 2–139, 3–176. బౌలింగ్: టాప్లీ 3–0–34–0, సిరాజ్ 3–0–37–0, ఆకాశ్‌దీప్ 3.3–0–55–1, మ్యాక్స్‌వెల్ 1–0–17–0, వైశాక్ 3–0–32–1, 2–0–24–1. ఐపీఎల్లో నేడు లక్నో X ఢిల్లీ వేదిక: లక్నో రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
IPL 2024 RR vs RCB: కోహ్లి సెంచరీ వృథా.. రాజస్తాన్ 4/4
జైపూర్: ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ అజేయంగా దూసుకెళ్తోంది. వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ ఆ జట్టు జయభేరి మోగించింది. శనివారం జరిగిన పోరులో రాజస్తాన్ 6 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. ముందుగా బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (72 బంతుల్లో 113 నాటౌట్; 12 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఐపీఎల్లో 8వ శతకం సాధించగా, కెప్టెన్ డుప్లెసిస్ (33 బంతుల్లో 44; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం రాజస్తాన్ 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జోస్ బట్లర్ (58 బంతుల్లో 100 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు శతకం సాధించగా, కెప్టెన్ సంజూ సామ్సన్ (42 బంతుల్లో 69; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. ఫ్రాంచైజీకి చెందిన ‘రాయల్ రాజస్తాన్ ఫౌండేషన్’ చేపట్టిన ‘పింక్ ప్రామిస్’లో భాగంగా మహిళా సాధికారత ప్రచార కార్యక్రమం కోసం రాజస్తాన్ జట్టు నిలువెల్లా గులాబీ రంగు జెర్సీతో బరిలోకి దిగింది. కోహ్లి శతక్కొట్టాడు కానీ... బెంగళూరుకు ఓపెనర్లు విరాట్ కోహ్లి, డుప్లెసిస్ శుభారంభం ఇచ్చారు. దీంతో పవర్‌ప్లేలో జట్టు 53/0 స్కోరు చేసింది. ఓవర్లు గడుస్తున్న కొద్దీ బ్యాటర్లు పాతుకుపోయినా... పరుగుల వేగం మాత్రం అంతంతమాత్రంగానే సాగింది. కోహ్లి 39 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 12వ ఓవర్లో బెంగళూరు స్కోరు వందకు చేరింది. అప్పటికీ ఓపెనింగ్ జోడీనే అజేయంగా ఉంది. సింహభాగం ఓవర్లు (14) ఇద్దరే ఆడారు. కానీ బ్యాటింగ్‌కు బాగా అనుకూలించిన పిచ్‌పై ధాటిని ప్రదర్శించలేకపోయారు. 14వ ఓవర్లో డుప్లెసిస్ నిష్క్ర మించడంతో 125 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. హిట్టర్ మ్యాక్స్‌వెల్ (1), సౌరవ్ చౌహాన్ (9) నిరాశపరిచారు. గ్రీన్ (5 నాటౌట్) వచ్చినా... కోహ్లి 67 బంతుల్లోనే సెంచరీతో అజేయంగా నిలిచినా... డెత్ ఓవర్లలో బెంగళూరు పెద్దగా మెరిపించలేదు. 19వ ఓవర్లో 4 పరుగులు, 20వ ఓవర్లో 14 పరుగులు రావడంతో 200 మార్క్‌కు ఆమడ దూరంలో నిలిచింది. బట్లర్, సామ్సన్ ధనాధన్ జైస్వాల్ (0) ఇన్నింగ్స్ రెండో బంతికే డకౌట్ కావడంతో బెంగళూరు శిబిరం సంబరాల్లో మునిగింది. కానీ ఈ ఆనందం ఆవిరయ్యేందుకు ఎంతోసేపు పట్టలేదు. బట్లర్‌కు కెప్టెన్ సంజూ సామ్సన్ జతవడంతో చేజింగ్ చాలా సులువుగా సాగింది. మయాంక్ డాగర్ వేసిన 6వ ఓవర్‌ను పూర్తిగా ఆడిన బట్లర్ 4, 0, 4, 6, 4, 0లతో 20 పరుగులు పిండుకున్నాడు. పవర్‌ప్లేలో రాయల్స్ స్కోరు 54/1 తక్కువే అయినా అక్కడ్నుంచి ఇద్దరు దంచేసే పనిలో పడటంతో బౌండరీలు, సిక్సర్లు క్రమం తప్పకుండా వచ్చేశాయి. బట్లర్ 30 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా... కాసేపటికే సామ్సన్ ఫిఫ్టీ 33 బంతుల్లో పూర్తయింది. ఇద్దరి దూకుడు కొనసాగడంతో బంతులు, పరుగుల మధ్య అంతరం తగ్గిపోయింది. సామ్సన్ను ఎట్టకేలకు సిరాజ్ అవుట్ చేయగా... 148 పరుగుల రెండో వికెట్‌కు భాగస్వామ్యం ముగిసింది. తర్వాత పరాగ్ (4), జురెల్ (2) స్వల్ప వ్యవధిలోనే అవుటయ్యారు. కానీ అప్పటికే 18 బంతుల్లో 14 పరుగుల సమీకరణం రాజస్తాన్‌కు విజయాన్ని ఖాయం చేసింది. 6 బంతుల్లో పరుగు అవసరమైన చోట 94 పరుగుల వద్ద ఉన్న బట్లర్ సిక్సర్‌తో సెంచరీని, మ్యాచ్‌ను ఒకేసారి పూర్తి చేశాడు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి నాటౌట్ 113; డుప్లెసిస్ (సి) బట్లర్ (బి) చహల్ 44; మ్యాక్స్‌వెల్ (బి) బర్గర్ 1; సౌరవ్ (సి) జైస్వాల్ (బి) చహల్ 9; గ్రీన్ నాటౌట్ 5; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 183. వికెట్ల పతనం: 1–125, 2–128, 3–155. బౌలింగ్: బౌల్ట్ 3–0–30–0, బర్గర్ 4–0–33–1, అశ్విన్ 4–0–28–0, అవేశ్‌ఖాన్ 4–0–46–0, చహల్ 4–0–34–2, పరాగ్ 1–0–10–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) టాప్లీ 0; బట్లర్ నాటౌట్ 100; సామ్సన్ (సి) యశ్ (బి) సిరాజ్ 69; పరాగ్ (సి) కోహ్లి (బి) యశ్ 4; జురెల్ (సి) కార్తీక్ (బి) టాప్లీ 2; హెట్‌మైర్ నాటౌట్ 11; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (19.1 ఓవర్లలో 4 వికెట్లకు) 189. వికెట్ల పతనం: 1–0, 2–148, 3–155, 4–164. బౌలింగ్: టాప్లీ 4–0–27–2, యశ్ దయాళ్ 4–0–37–1, సిరాజ్ 4–0–35–1, మయాంక్ 2–0–34–0, గ్రీన్ 3.1–0–27–0, హిమాన్షు 2–0–29–0. ఐపీఎల్లో నేడు ముంబై X ఢిల్లీ వేదిక: ముంబై మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి లక్నో X గుజరాత్ వేదిక: లక్నో రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
#Jos Buttler: ఇది కదా బట్లర్ అంటే.. సిక్స్‌తో సెంచరీ! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో రాజస్తాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ ఎట్టకేలకు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా జైపూర్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో బట్లర్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఓపెనర్‌గా వచ్చిన బట్లర్ ఆఖరి వరకు క్రీజులో నిలబడి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. రాజస్తాన్ విజయానికి కేవలం ఒక్క పరుగు కావల్సిన నేపథ్యంలో బట్లర్ సిక్స్ కొట్టి మ్యాచ్‌ను ముగించాడు. ఇదే సిక్స్‌తో తన సెంచరీ మార్క్‌ను కూడా అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 58 బంతులు ఎదుర్కొన్న బట్లర్.. 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 100 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. బట్లర్‌కు ఇది ఆరో ఐపీఎల్ సెంచరీ కావడం గమనార్హం. ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో బట్లర్ క్రిస్ గేల్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్ధానంలో కొనసాగతున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి సెంచరీతో మెరిశాడు. 72 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి.. 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 113 పరుగులు చేశాడు. అనంతరం 184 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి రాయల్స్ ఛేదించింది. రాజస్తాన్ బ్యాటర్లలో బట్లర్‌తో పాటు కెప్టెన్ సంజూ శాంసన్(69) పరుగులతో అదరగొట్టాడు. 4⃣ wins in 4⃣ matches for the @rajasthanroyals 🩷 And with that victory, the move to the 🔝 of the Points Table 😎💪 Scorecard ▶️ https://t.co/IqTifedScU#TATAIPL | #RRvRCB pic.twitter.com/cwrUr2vmJN — IndianPremierLeague (@IPL) April 6, 2024 -
మయాంక్ మెరుపు బౌలింగ్
బెంగళూరు: అందివచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా నిప్పులు చెరిగే బంతులతో మరోసారి లక్నో పేస్ బౌలర్ మయాంక్ యాదవ్ హడలెత్తించాడు. వేగానికితోడు కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసి ఐపీఎల్ టోర్నీ లో లక్నో జట్టుకు వరుసగా రెండో విజయాన్ని అందించాడు. మయాంక్ (3/14) దెబ్బకు సొంతగడ్డపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు మళ్లీ నిరాశే ఎదురైంది. మయాంక్‌తోపాటు డికాక్, నికోలస్ పూరన్ రాణించడంతో... మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 28 పరుగుల తేడాతో గెలిచింది. ముందుగా లక్నో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఓపెనర్ డికాక్ (56 బంతుల్లో 81; 8 ఫోర్లు, 5 సిక్స్‌లు), పూరన్ (21 బంతుల్లో 40 నాటౌట్; 1 ఫోర్, 5 సిక్స్‌లు) చెలరేగారు. అనంతరం బెంగళూరు 19.4 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌటైంది. మహిపాల్ లామ్రోర్ (13 బంతుల్లో 33; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధనాధన్ ఆట ఆడగా... పటిదార్, గ్రీన్, మ్యాక్స్‌వెల్ వికెట్లను తీసి లక్నో విజయంలో కీలకపాత్ర పోషించిన మయాంక్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లోనూ మయాంక్ మూడు వికెట్టు పడగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం అందుకున్నాడు. డికాక్, పూరన్ మెరుపులతో... లక్నో జట్టు ఓపెనర్ డికాక్ ఆరంభం నుంచే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. టాప్లీ ఇన్నింగ్స్ తొలి ఓవర్లో అతను 3 బౌండరీలు, సిరాజ్ మూడో ఓవర్లో 2 సిక్స్‌లు బాదాడు. దీంతో కెపె్టన్ కేఎల్ రాహుల్ (20; 2 సిక్స్‌లు) తక్కువే చేసినా... దేవదత్ పడిక్కల్ (6) విఫలమైనా... లక్నో ఇన్నింగ్స్‌పై ఏమాత్రం ప్రభావం పడలేదు. 36 బంతుల్లో డికాక్ ఫిఫ్టీ పూర్తవగా జట్టు స్కోరు 12వ ఓవర్లోనే వందకు చేరింది. స్టొయినిస్ (15 బంతుల్లో 24; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ధాటిని ప్రదర్శించగా, ఆఖర్లో పూరన్ మెరుపులతో లక్నో భారీస్కోరు చేయగలిగింది. 19, 20వ ఓవర్లను పూర్తిగా ఆడిన పూరన్ 5 సిక్స్‌లతో 33 పరుగులు పిండుకున్నాడు. కోహ్లి అవుటవడంతోనే... బెంగళూరు ఇన్నింగ్స్ ఆరంభంలో కొద్ది సేపే బాగుంది. కెపె్టన్ డు ప్లెసిస్ బౌండరీలతో వేగం పెంచగా, నవీనుల్ నాలుగో ఓవర్లో కోహ్లి సిక్స్‌తో టచ్‌లోకి వచ్చాడు. మరుసటి ఓవర్ తొలి బంతికి కోహ్లి ఫోర్ కొట్టడంతో స్కోరు 40/0 వద్ద బాగానే ఉంది. అక్కడే కోహ్లి నిష్క్రష్కమించగా, మరుసటి ఓవర్లో డుప్లెసిస్ (19; 3 ఫోర్లు) రనౌటయ్యాడు. చెత్త షాట్ ఆడిన మ్యాక్స్‌వెల్ (0) పూరన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతే 43 పరుగులకే ముగ్గురు హిట్టర్లను కోల్పోయిన బెంగళూరు కష్టాల్లో పడింది. మయాంక్ అద్భుత బంతికి గ్రీన్ (9) బౌల్డ్ కాగా.. అనూజ్ (11) కూడా జట్టును ఆదుకోలేకపోయాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన లామ్రోర్ సిక్స్‌లు, ఫోర్లతో రెచ్చిపోయాడు. 20 బంతుల్లో 46 పరుగుల సమీకరణం ఆర్సీబీలో కొత్త ఆశలు రేపగా... మరుసటి బంతికి కార్తీక్ (4) అవుట్ కావడంతోనే బెంగళూరు ఖేల్ ఖతమైంది. స్కోరు వివరాలు లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: డికాక్ (సి) డాగర్ (బి) టాప్లీ 81; కేఎల్ రాహుల్ (సి) డాగర్ (బి) మ్యాక్స్‌వెల్ 20; పడిక్కల్ (సి) అనూజ్ (బి) సిరాజ్ 6; స్టొయినిస్ (సి) డాగర్ (బి) మ్యాక్స్‌వెల్ 24; పూరన్ (నాటౌట్) 40; బదోని (సి) డుప్లెసిస్ (బి) యశ్ దయాళ్ 0; కృనాల్ పాండ్యా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 181. వికెట్ల పతనం: 1–53, 2–73, 3–129, 4–143, 5–148. బౌలింగ్: రీస్ టాప్లీ 4–0–39–1, యశ్ దయాళ్ 4–0–24–1, సిరాజ్ 4–0–47–1, మ్యాక్స్‌వెల్ 4–0–23–2, మయాంక్ డాగర్ 2–0–23–0, గ్రీన్ 2–0–25–0. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) పడిక్కల్ (బి) సిద్ధార్థ్ 22; డుప్లెసిస్ (రనౌట్) 19; పటిదార్ (సి) పడిక్కల్ (బి) మయాంక్ యాదవ్ 29; మ్యాక్స్‌వెల్ (సి) పూరన్ (బి) మయాంక్ యాదవ్ 0; గ్రీన్ (బి) మయాంక్ యాదవ్ 9; అనూజ్ (సి) పడిక్కల్ (బి) స్టొయినిస్ 11; మహిపాల్ (సి) పూరన్ (బి) యశ్ ఠాకూర్ 33; దినేశ్ కార్తీక్ (సి) రాహుల్ (బి) నవీనుల్ 4; మయాంక్ డాగర్ (రనౌట్) 0; టాప్లీ (నాటౌట్) 3; సిరాజ్ (సి) పూరన్ (బి) నవీనుల్ 12; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (19.4 ఓవర్లలో ఆలౌట్) 153. వికెట్ల పతనం: 1–40, 2–42, 3–43, 4–58, 5–94, 6–103, 7–136, 8–137, 9–138, 10–153. బౌలింగ్: సిద్ధార్థ్ 3–0–21–1, కృనాల్ పాండ్యా 1–0–10–0, నవీనుల్ 3.4–0–25–2, మయాంక్ యాదవ్ 4–0–14–3, రవి బిష్ణోయ్ 3–0–33–0, యశ్ ఠాకూర్ 4–0–38–1, స్టొయినిస్ 1–0–9–1. ఐపీఎల్లో నేడు ఢిల్లీ X కోల్‌కతా వేదిక: విశాఖపట్నం రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
వారెవ్వా మయాంక్.. టీమిండియాకు మరో శ్రీనాథ్ దొరికేశాడు
ఐపీఎల్-2024లో లక్నో సూపర్ జెయింట్స్ యవ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మరోసారి నిప్పులు చేరిగాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో మయాంక్ యాదవ్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. మయాంక్ తన పేస్ బౌలింగ్‌తో ఆర్సీబీ బ్యాటర్లను ముప్పుతిప్పులు పెట్టాడు. 22 ఏళ్ల కుర్రాడి బౌలింగ్‌కు మాక్స్వెల్ లాంటి వరల్డ్‌క్లాస్ బ్యాటరే వణికిపోయాడు. అంతేకాకుండా గంటకు 156.7 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించి ఈ సీజన్లోనే ఫాస్టెస్ట్ డెలివరీ రికార్డు అందుకున్నాడు. అదే విధంగా ఆర్సీబీ బ్యాటర్ గ్రీన్‌ను మయాంక్ అద్బుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇది మ్యాచ్ మొత్తానికే హైలెట్‌గా నిలిచింది. యాదవ్ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో నయాపేస్ సంచలనంపై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత క్రికెట్‌కు మరో జవగల్ శ్రీనాథ్ దొరికేశాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రైటర్మ్ ఫాస్ట్ మీడియం పేసర్ అయిన మయాంక్ యాదవ్ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే కచ్చితంగా అతి త్వరలోనే భారత జట్టులోకి ఎంట్రీ ఇస్తాడని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆర్సీబీపై 28 పరుగుల తేడాతో లక్నో ఘన విజయం సాధించింది. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ.. 19.4 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌటైంది. లక్నో యువ పేసర్ మయాంక్ యాదవ్ 3 వికెట్లతో ఆర్సీబీని దెబ్బతీశాడు. అతడితో పాటు నవీన్ ఉల్ హక్ రెండు,యశ్ ఠాకూర్, స్టోయినిష్, సిద్దార్డ్ తలా వికెట్ పడగొట్టారు. ఆర్సీబీ బ్యాటర్లలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన మహిపాల్ లామ్రోర్(33) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతకముందు బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో ఓపెనర్ క్వింటన్ డికాక్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 56 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో డికాక్ 81 పరుగులు చేశాడు. అతడితో పాటు నికోలస్ పూరన్ ఆఖరిలో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 21 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌తో 40 పరుగులు చేశాడు. 𝙎𝙃𝙀𝙀𝙍 𝙋𝘼𝘾𝙀! 🔥🔥 Mayank Yadav with an absolute ripper to dismiss Cameron Green 👏 Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #RCBvLSG pic.twitter.com/sMDrfmlZim — IndianPremierLeague (@IPL) April 2, 2024 -
RCB ‘అందాల’ పేర్లు పచ్చబొట్టుగా.. చాంపియన్లకు ట్రిబ్యూట్ (ఫోటోలు)
-
రింకూ సింగ్ కు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన కోహ్లి.. ఫోటో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(83) అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడినప్పటికి.. తన జట్టు మాత్రం 7 వికెట్ల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది. కాగా కోహ్లి ఓటమి బాధలో ఉన్నప్పటికి మాత్రం తన మంచి మనసును చాటుకున్నాడు. మ్యాచ్ అనంతరం కింగ్ కోహ్లి కోల్‌కతా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లి ఆటగాళ్లను కలిశాడు. యువ క్రికెటర్లకు విరాట్ విలువైన సూచనలు చేశాడు. ఈ క్రమంలో కేకేఆర్ ఫినిషర్ రింకూ సింగ్‌కు కోహ్లి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. కోహ్లి తన బ్యాట్‌ను రింకూకు గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను రింకూ సింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. తనకు బ్యాట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చినందుకు కోహ్లికి రింకూ ధన్యవాదాలు తెలియజేశాడు. "సలహాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు భయ్యా.. అదేవిధంగా బ్యాట్ ఇచ్చినందుకు కూడా థాంక్స్" అంటూ ఇన్‌స్టా స్టోరీలో రింకూ రాసుకొచ్చాడు. చదవండి: IPL 2024: బెయిర్ స్టో స్టన్నింగ్ క్యాచ్.. రాహుల్‌కు మైండ్ బ్లాంక్! వీడియో వైరల్ Rinku Singh thanking Virat Kohli for the gift. 👌 - Kohli is always there for youngsters. pic.twitter.com/p23y7ZHFj8 — Johns. (@CricCrazyJohns) March 30, 2024 -
KKR Vs RCB: కోల్‌కతా లెక్క మార్చేసింది
బెంగళూరు: కోల్‌కతా ఓపెనర్లు నరైన్ (22 బంతుల్లో 47; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు), సాల్ట్ (20 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడైన బ్యాటింగ్ ముందు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి (59 బంతుల్లో 83; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) క్లాసిక్ ఇన్నింగ్స్ చిన్నదిగా మారిపోయింది. దీంతో ఈ సీజన్లో తొలి సారి సొంతగడ్డపై ఆతిథ్య జట్టుకు చుక్కెదురైంది. కోల్‌కతా గత తొమ్మిది మ్యాచ్‌ల సంప్రదాయాన్ని ఈ మ్యాచ్‌తో మార్చేసింది. చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ 7 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై జయభేరి మోగించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఆరంభం నుంచి కోహ్లి, ఆఖర్లో దినేశ్ కార్తీక్ (8 బంతుల్లో 20; 3 సిక్స్‌లు) మెరిపించారు. అనంతరం కోల్‌కతా 16.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ (30 బంతుల్లో 50; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించాడు. కోహ్లి ఒక్కడే... తొలి బంతికే బౌండరీతో కోహ్లి బెంగళూరు ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టాడు. సహచరులంతా తక్కువ స్కోరుకే అవుటవుతున్నా... తన వీరోచిత ప్రదర్శనతో పరుగుల్ని వేగంగా పేర్చిన కోహ్లి పెద్ద భాగస్వామ్యాలతో ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. కెపె్టన్ డుప్లెసిస్ (8) రెండో ఓవర్లోనే అవుట్ కాగా, గ్రీన్ (21 బంతుల్లో 33; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), మ్యాక్స్‌వెల్ ( 19 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్) ఎంతోసేపు నిలువలేదు. కోహ్లి ఒక్కడే నిలిచి ఇన్నింగ్స్‌ను ఆఖరి దాకా నడిపించాడు. తన మార్కు క్లాసిక్ షాట్లతో, తనకు మాత్రమే సాధ్యమైన ఆటతీరుతో బెంగళూరు ప్రేక్షకుల్ని ఆద్యంతం కేరింతల్లో ముంచేశాడు. 36 బంతుల్లో విరాట్ అర్ధ సెంచరీ పూర్తయ్యింది. గత మ్యాచ్‌లో పేలవ బౌలింగ్‌లో ఒక్క వికెట్ తీయకుండా 53 పరుగులిచ్చిన మిచెల్ స్టార్క్ ఈ సారి కూడా వికెట్ తీయకుండా 47 పరుగులు సమర్పించుకున్నాడు. ‘పవర్ ప్లే’లో 85/0 కోల్‌కతా ముందున్న లక్ష్యం కష్టమైంది. కానీ సులువుగా ఛేదించింది. ఓపెనర్లు సాల్ట్, నరైన్‌ల బ్యాటింగ్ సునామీ ‘పవర్ ప్లే’లోనే మ్యాచ్‌ను తమ చేతుల్లోకి తెచ్చుకుంది. ఓపెనర్లు ఇద్దరూ దంచేసే పనిలో పడటంతో సిక్స్లైతే మంచినీళ్ల ప్రాయంలా వచ్చేశాయి. సిరాజ్ తొలి ఓవర్లో సాల్ట్ రెండు సిక్స్‌లు, ఒక బౌండరీలతో ఉతికేశాడు. సునీల్ నరైన్... తానేం తక్కువ కాదని జోసెఫ్ మూడో ఓవర్లో 2 భారీ సిక్సర్లతో చాటుకున్నాడు. ఈ మెరుపుల మేనియాలో నైట్‌రైడర్స్ జట్టు కేవలం 3.3 ఓవర్లలోనే 50 పరుగుల మార్క్‌ను దాటేసింది. 6 ఓవర్లలో వికెటే కోల్పోకుండా 85 పరుగులు చేసింది. అంతలోనే చేయాల్సిన పరుగులు వందలోపే దిగొచ్చింది.ఏడో ఓవర్లో నరైన్‌ను డాగర్, ఎనిమిదో ఓవర్లో సాల్ట్‌ను వైశాక్ అవుట్ చేశారు. కానీ అప్పటికే స్కోరు 92/2. లక్ష్యంలో సగం పనైపోయింది. మిగతా సగాన్ని వెంకటేశ్ అయ్యర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (24 బంతుల్లో 39 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) పూర్తి చేశారు. దీంతో 19 బంతులు మిగిలుండగానే నైట్‌రైడర్స్ లక్ష్యాన్ని చేరుకుంది. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి నాటౌట్ 83; డుప్లెసిస్ (సి) స్టార్క్ (బి) హర్షిత్ 8; గ్రీన్ (బి) రసెల్ 33; మ్యాక్స్‌వెల్ (సి) రింకూసింగ్ (బి) నరైన్ 28; పటిదార్ (సి) రింకూసింగ్ (బి) రసెల్ 3; రావత్ (సి) సాల్ట్ (బి) హర్షిత్ 3; దినేశ్ కార్తీక్ రనౌట్ 20; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం ( 20 ఓవర్లలో 6 వికెట్లకు) 182. వికెట్ల పతనం: 1–17, 2–82, 3–124, 4–144, 5–151, 6–182. బౌలింగ్: స్టార్క్ 4–0–47–0, హర్షిత్ 4–0–39–2, అనుకూల్ 2–0–6–0, నరైన్ 4–0–40–1, రసెల్ 4–0–29–2, వరుణ్ 2–0–20–0. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) గ్రీన్ (బి) వైశాక్ 30; నరైన్ (బి) డాగర్ 47; వెంకటేశ్ (సి) కోహ్లి (బి) యశ్ దయాళ్ 50; శ్రేయస్ నాటౌట్ 39; రింకూ సింగ్ నాటౌట్ 5; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (16.5 ఓవర్లలో 3 వికెట్లకు) 186. వికెట్ల పతనం: 1–86, 2–92, 3–167. బౌలింగ్: సిరాజ్ 3–0–46–0, యశ్ దయాళ్ 4–0–46–1, జోసెఫ్ 2–0–34–0, మయాంక్ డాగర్ 2.5–0–23–1, వైశాక్ 4–0–23–1, వైశాక్ 1–0–7–0. ఐపీఎల్లో నేడు లక్నో X పంజాబ్ వేదిక: లక్నో రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం The streak is broken! @KKRiders 💜 become the first team to register an away win in #TATAIPL 2024 👏👏 Scorecard ▶️https://t.co/CJLmcs7aNa#RCBvKKR pic.twitter.com/svxvtA409s — IndianPremierLeague (@IPL) March 29, 2024 -
IPL 2024: ఆర్సీబీ కెప్టెన్‌కు ఏమైంది..? చెత్త షాట్ ఆడి మరి? వీడియో వైరల్
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. వరుసగా మూడో మ్యాచ్‌లో డుప్లెసిస్ నిరాశపరిచాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో డుప్లెసిస్ విఫలమయ్యాడు. కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఓ చెత్త షాట్ ఆడి డుప్లెసిస్ తన వికెట్‌ను కోల్పోయాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన హర్షిత్ రాణా మూడో బంతి హాఫ్ కట్టర్‌గా సంధించాడు. కానీ డుప్లెసిస్ మాత్రం హాఫ్ సైడ్ వెళ్లి స్కూప్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో షార్ట్ ఫైన్ లెగ్ దిశగా బంతి గాల్లోకి లేచింది. షార్ట్ ఫైన్ లెగ్ ఫీల్డింగ్ చేస్తున్న మిచెల్ స్టార్క్.. ఈజీ క్యాచ్‌ను అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. pic.twitter.com/A1wRUMpZLP — Sitaraman (@Sitaraman112971) March 29, 2024 -
IPL RCB Vs PBKS Highlights Photos: పంజాబ్ కింగ్స్‌పై బెంగళూరు విజయం (ఫొటోలు)
-
IPL 2024- CSK Vs RCB: చెన్నై జోరు
డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ సొంత మైదానంలో శుభారంభం చేసింది...ఐపీఎల్ కొత్త సీజన్ తొలి పోరులో సమష్టి ప్రదర్శనతో బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌పై పైచేయి సాధించింది...ముందుగా బౌలింగ్‌లో పదునైన బంతులతో చెలరేగిన ముస్తఫిజుర్ బెంగళూరును సాధారణ స్కోరుకే పరిమితం చేశాడు. ఆపై ఛేదనలో ఎలాంటి ఆటంకం లేకుండా చెన్నై సులువుగా పని పూర్తి చేసింది. కెప్టెన్ గా రుతురాజ్ తొలి పోరులో తన పేరిట విజయాన్ని నమోదు చేసుకోగా...ఐపీఎల్లో తన మొదటి మ్యాచ్‌లోనే రచిన్ రవీంద్ర ఆకట్టుకోవడం హైలైట్. చెన్నై: ఐపీఎల్–2024ను సూపర్ కింగ్స్ దర్జాగా గెలుపుతో మొదలు పెట్టింది. శుక్రవారం జరిగిన పోరులో చెన్నై 6 వికెట్ల తేడాతో బెంగళూరును ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. అనూజ్ రావత్ (25 బంతుల్లో 48; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), దినేశ్ కార్తీక్ (26 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 50 బంతుల్లోనే 95 పరుగులు జోడించారు. ముస్తఫిజుర్ రహమాన్ (4/29) ప్రత్యర్థిని దెబ్బ కొట్టాడు. అనంతరం చెన్నై 18.4 ఓవర్లలో 4 వికెట్లకు 176 పరుగులు చేసింది. శివమ్ దూబే (28 బంతుల్లో 34 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), రచిన్ రవీంద్ర (15 బంతుల్లో 37; 3 ఫోర్లు) రాణించారు. భారీ భాగస్వామ్యం... బెంగళూరు ఇన్నింగ్స్‌లో 11.4 ఓవర్లు ముగిసే సరికి స్కోరు 78/5...ఈ స్థితినుంచి జట్టు చెప్పుకోదగ్గ స్కోరు సాధించగలిగిందంటే రావత్, కార్తీక్ భాగస్వామ్యమే కారణం. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత డుప్లెసిస్ ధాటిగా ఆడటంతో బెంగళూరు ఇన్నింగ్స్ మెరుగ్గానే మొదలైంది. విరాట్ కోహ్లి (20 బంతుల్లో 21; 1 సిక్స్) పెద్దగా ప్రభావం చూపకపోయినా తొలి వికెట్‌కు 27 బంతుల్లో 41 పరుగులు వచ్చాయి. అయితే ముస్తఫిజుర్ చెలరేగడంతో పరుగు వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయింది. రచిన్ చక్కటి ఫీల్డింగ్‌కు డుప్లెసిస్ వెనుదిరగ్గా, రహానే ఫీల్డింగ్ నైపుణ్యంతో కోహ్లి పెవిలియన్ చేరాడు. మ్యాక్స్‌వెల్ (0) తొలి బంతికే అవుట్ కాగా, గ్రీన్ (18)ను ముస్తఫిజుర్ బౌల్డ్ చేశాడు. ఇలాంటి సమయంలో 28 బంతుల పాటు ఒక్క బౌండరీ కూడా ఆర్సీబీ ఖాతాలో చేరలేదు! అయితే కుదురుకున్న తర్వాత రావత్, కార్తీక్ దూకుడు పెంచి బౌండరీలతో పరుగులు రాబట్టారు. తుషార్ వేసిన 18వ ఓవర్లో రావత్ 2 సిక్స్‌లు, ఫోర్ కొట్టగా, కార్తీక్ మరో సిక్స్ బాదడంతో మొత్తం 25 పరుగులు వచ్చాయి. ఆఖరి 5 ఓవర్లలో ఆర్సీబీ 71 పరుగులు సాధించింది. సమష్టి ప్రదర్శన... ఛేదనలో సీఎస్కే బ్యాటర్లు అంతా తలా ఓ చేయి వేశారు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో రుతురాజ్ (15) విఫలమైనా...ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్‌లోనే రచిన్ చక్కటి షాట్లతో అలరిస్తూ బౌండరీలతో వేగంగా పరుగులు సాధించాడు. ఫలితంగా పవర్‌ప్లే ముగిసే సరికి స్కోరు 62 పరుగులకు చేరింది. ఆ తర్వాత రహానే (19 బంతుల్లో 27; 2 సిక్స్‌లు), డరైల్ మిచెల్ (18 బంతుల్లో 22; 2 సిక్స్‌లు) కీలక పరుగులతో జట్టును విజయం దిశగా నడిపించారు. వీరిద్దరు తక్కువ వ్యవధిలో వెనుదిరిగినా...దూబే, రవీంద్ర జడేజా (17 బంతుల్లో 25 నాటౌట్; 1 సిక్స్) కలిసి 8 బంతుల ముందే మ్యాచ్‌ను ముగించారు. స్కోరు వివరాలు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) రచిన్ (బి) ముస్తఫిజుర్ 21; డుప్లెసిస్ (సి) రచిన్ (బి) ముస్తఫిజుర్ 35; పటిదార్ (సి) ధోని (బి) ముస్తఫిజుర్ 0; మ్యాక్స్‌వెల్ (సి) ధోని (బి) చహర్ 0; గ్రీన్ (బి) ముస్తఫిజుర్ 18; రావత్ (రనౌట్) 48; కార్తీక్ (నాటౌట్) 38; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 173. వికెట్ల పతనం: 1–41, 2–41, 3–42, 4–77, 5–78, 6–173. బౌలింగ్: దీపక్ చహర్ 4–0–37–1, తుషార్ 4–0–47–0, తీక్షణ 4–0–36–0, ముస్తఫిజుర్ 4–0–29–4, జడేజా 4–0–21–0. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) గ్రీన్ (బి) దయాళ్ 15; రచిన్ (సి) పటిదార్ (బి) కరణ్ 37; రహానే (సి) మ్యాక్స్‌వెల్ (బి) గ్రీన్ 27; మిచెల్ (సి) పటిదార్ (బి) గ్రీన్ 22; దూబే (నాటౌట్) 34; జడేజా (నాటౌట్) 25; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (18.4 ఓవర్లలో 4 వికెట్లకు) 176. వికెట్ల పతనం: 1–38, 2–71, 3–99, 4–110. బౌలింగ్: సిరాజ్ 4–0–38–0, యశ్ దయాళ్ 3–0–28–1, జోసెఫ్ 3.4–0–38–0, కరణ్ శర్మ 2–0–24–1, డాగర్ 2–0–6–0, గ్రీన్ 3–0–27–2, మ్యాక్స్‌వెల్ 1–0–7–0. అలరించిన ఆరంభ వేడుకలు తొలి మ్యాచ్‌కు ముందు చిదంబరం స్టేడియంలో ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ నేతృత్వంలో గాయకులు సోనూ నిగమ్, మోహిత్ చౌహాన్, నీతి మోహన్ తమ పాటలతో అలరించారు. అంతకు ముందు నటులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ప్రదర్శన కూడా ఆకట్టుకుంది. దీంతో పాటు లేజర్ షోతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగియి. పెద్ద సైజు ఐపీఎల్ ట్రోఫీ రెప్లికాను ఈ సందర్భంగా మైదానంలో ప్రదర్శించారు. ఐపీఎల్లో నేడు పంజాబ్ X ఢిల్లీ వేదిక: ముల్లన్పూర్ మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి కోల్‌కతా X హైదరాబాద్ వేదిక: కోల్‌కతా రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
అటు ఫోర్... ఇటు సిక్సర్!
కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోని ఆటగాడిగా మరో టైటిల్ విజయంలో భాగం అవుతాడా? ఇంకా తొలి ట్రోఫీ కోసమే ఎదురు చూస్తున్న కోహ్లికి ఈ సారైనా దానిని అందుకునే అదృష్టం ఉందా? సారథ్యం కోల్పోయిన రోహిత్ శర్మ తన బ్యాటింగ్ సత్తాతో ముంబైకి మరో విజయం అందిస్తాడా? చావుకు దగ్గరగా వెళ్లి వచ్చి మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టిన పంత్ కొత్త ఇన్నింగ్స్‌లో ఆటగాడిగా, నాయకుడిగా జట్టును నడిపించగలడా? ముంబై అభిమానుల ఆశలకు విరుద్ధంగా కెప్టెన్సీ అందుకున్న హార్దిక్ పాండ్యా తన ఆటతో, వ్యూహాలతో వారి మనసు గెలవగలడా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలన్నీ రాబోయే రెండు నెలల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో లభిస్తాయి. క్రికెట్ అభిమానులను ఫోర్లు, సిక్సర్లతో అలరిస్తూ పూర్తి స్థాయి వినోదాన్ని అందించే వేసవి పండగకు సమయం వచ్చేసింది. చెన్నై వేదికగా నేడు ఐపీఎల్ 17వ సీజన్ మొదలు కానుంది. గత ఏడాదిలాగే 10 జట్లు 74 మ్యాచ్‌లతో టోర్నీ సిద్ధం కాగా... ఎన్నికల కారణంగా తొలి దశలో 21 మ్యాచ్‌లకే బీసీసీఐ షెడ్యూల్ ప్రకటించింది. గత కొద్ది రోజులుగా భారత టెస్టు క్రికెట్‌ను ఆస్వాదించిన ఫ్యాన్స్ రాబోయే దాదాపు ఎనిమిది వారాల పాటు బౌండరీల గురించే చర్చించడం ఖాయం. చెన్నై: మెగా టి20 టోర్నీ ఐపీఎల్–2024కు రంగం సిద్ధమైంది. ఎంఎ చిదంబరం స్టేడియంలో నేడు జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తలపడుతుంది. గత రెండు సీజన్ల తరహాలోనే ప్రతీ జట్టు 14 మ్యాచ్‌ల చొప్పున ఆడుతుంది. లీగ్ దశలో 70 మ్యాచ్‌లు, 4 ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు (క్వాలిఫయర్–1, ఎలిమినేటర్, క్వాలిఫయర్–2, ఫైనల్) ఉంటాయి. తుది షెడ్యూల్ ప్రకటించకపోయినా... మే 26న ఫైనల్ జరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు జరిగిన 16 సీజన్లలో చెన్నై, ముంబై ఐదేసిసార్లు విజేతగా నిలవగా కోల్‌కతా 2 సార్లు టైటిల్ సాధించింది. దక్కన్ చార్జర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల ఖాతాలో ఒక్కో ట్రోఫీ చేరాయి. చెపాక్ మైదానంలో మొదటి మ్యాచ్‌కు ముందు ప్రత్యేక ఆరం¿ోత్సవ వేడుకలు జరుగుతాయి. ఎఆర్ రెహమాన్, సోనూ నిగమ్, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 17వ ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఏడాది టోర్నీకి సంబంధించిన విశేషాలు... ♦ తాజా సీజన్లో పలు జట్లకు కొత్త కెపె్టన్లు వచ్చారు. ముంబైకి రోహిత్ స్థానంలో పాండ్యా, హైదరాబాద్‌కు మార్క్రమ్ స్థానంలో కమిన్స్, చెన్నైకి ధోని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్, గుజరాత్‌కు పాండ్యా స్థానంలో శుబ్‌మన్ గిల్ బాధ్యతలు చేపడుతున్నారు. గాయం నుంచి కోలుకొని వచ్చిన రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్ మళ్లీ ఢిల్లీ, కోల్‌కతా జట్ల పగ్గాలు చేపట్టారు. మిగతా నలుగురు కేఎల్ రాహుల్ (లక్నో), సంజూ సామ్సన్ (రాజస్తాన్), డుప్లెసిస్ (బెంగళూరు), శిఖర్ ధావన్ (పంజాబ్)లు గత సీజన్‌లాగే ఈసారి సారథులుగా కొనసాగనున్నారు. ♦ ఎనిమిది జట్ల ‘హోం’ వేదికల్లో ఎలాంటి మార్పు లేకపోగా... ఢిల్లీ తమ తొలి రెండు మ్యాచ్‌లను విశాఖపట్నంలో ఆడుతుంది. పంజాబ్ కింగ్స్ ఈసారి మొహాలిలో కాకుండా కొత్తగా ముల్లన్‌పూర్‌లో కట్టిన స్టేడియాన్ని తమ హోం గ్రౌండ్‌గా మార్చుకుంది. ♦ ఈ సీజన్లో కొత్తగా రెండు నిబంధనలు వచ్చాయి. ఒక ఓవర్లో రెండు బౌన్సర్లను అనుమతిస్తారు. చెలరేగిపోతున్న బ్యాటర్లను కొంత వరకు నిలువరించేందుకు పేస్ బౌలర్లకు ఇది ఒక అదనపు బలంగా పనికొస్తుంది. ‘స్మార్ట్ రీప్లే’ సిస్టంను కూడా తొలిసారి అమలు చేస్తున్నారు. దీని ద్వారా అంపైర్ రివ్యూ ఫలితాలను మరింత వేగంగా, కచ్చితంగా అందించే అవకాశం ఉంటుంది. టీవీ అంపైర్, హాక్ ఐ ఆపరేటర్ కలిసి ఒకే చోట కూర్చునే ఏర్పాటు చేయడం వల్ల ఇది సాధ్యమవుతుంది. గత సీజన్లో అమల్లోకి వచ్చిన ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధన ఈసారి కూడా కొనసాగుతుంది. ♦ ఐపీఎల్ తర్వాత వెంటనే టి20 ప్రపంచకప్ ఉండటంతో భారత జట్టులో చోటు సంపాదించుకునేందుకు పలువురు యువ ఆటగాళ్లకు ఈ టోర్నీ అవకాశం కల్పిస్తోంది. ♦ ఐపీఎల్ వేలంలో ఆసీస్ స్టార్ బౌలర్లు మిచెల్ స్టార్క్ రూ. 24 కోట్ల 75 లక్షలకు, ప్యాట్ కమిన్స్ రూ.20 కోట్ల 50 లక్షలకు అమ్ముడుపోయారు. ఈ నేపథ్యంలో తమ జట్లు కోల్‌కతా, హైదరాబాద్‌లను గెలిపించే విషయంలో వీరిద్దరిపై తీవ్ర ఒత్తిడి ఉండటం ఖాయం. ♦ గాయం కారణంగా లేదా వేలంలో అమ్ముడుపోకపోవడం వల్ల తాజా సీజన్‌కు దూరమైన కొందరు కీలక ఆటగాళ్లలో షమీ, మార్క్ వుడ్, ప్రసిధ్ కృష్ణ, జేసన్ రాయ్, హ్యారీ బ్రూక్, డెవాన్ కాన్వే, ఎన్గిడి, మదుషంక, స్టీవ్ స్మిత్, హాజల్‌వుడ్, బెన్ స్టోక్స్, జో రూట్, ఆడమ్ జంపా తదితరులు ఉన్నారు.