IPL 2024: ఆర్సీబీ తుది జట్టు ఇలా..? | IPL 2024: RCB Fans Plans Their Playing XI | Sakshi
Sakshi News home page

IPL 2024: ఆర్సీబీ తుది జట్టు ఇలా..?

Published Wed, Dec 20 2023 9:48 PM | Last Updated on Thu, Dec 21 2023 9:39 AM

IPL 2024: RCB Fans Plans Their Playing XI - Sakshi

ఐపీఎల్‌ 2024 సీజన్‌ వేలం నిన్న ముగియడంతో అన్ని ఫ్రాంచైజీల అభిమానులు తమ తమ తుది జట్లు ఇలా ఉంటే బాగుంటుందని అంచనాలు వేస్తున్నారు. ఈసారి వేలంలో అన్ని జట్లు ఆచితూచి వ్యవహరించి సమతూకమే లక్ష్యంగా కొనుగోళ్లు జరిపాయని అన్ని జట్ల ఫ్యాన్స్‌ అనుకుంటున్నారు. అన్ని జట్లు ఇదివరకే ఉన్న సభ్యులకు అనుగుణంగా కొత్త వారిని తీసుకున్నారని అభిప్రాయపడుతున్నారు.

ఫ్రాంచైజీల లెక్కలు సఫలీకృతమవుతాయే లేదో అన్న విషయాన్ని పక్కన పెడితే.. ఫ్యాన్స్‌ మాత్రం సీజన్‌ ప్రారంభమయ్యే వరకు కూడా ఆగలేకపోతున్నారు. మా జట్టులో పలాన వాళ్లు ఉంటారు.. వీళ్లు ఉంటేనే జట్టు సమతూకంగా ఉంటుందని విశ్లేషిస్తున్నారు. సోషల్‌మీడియా మొత్తం అభిమానుల అంచనా జట్లచే నిండిపోయింది. కొత్త జట్టుతో ఈసారి కప్‌ మాదే అంటూ ప్రతి ఫ్రాంచైజీ అభిమాని సంకలు గుద్దుకుంటున్నాడు.

ప్రతిసారి ఈసారి కప్‌ మాదే అని గగ్గోలు పెట్టే ఆర్సీబీ అభిమానులు సైతం వచ్చే సీజన్‌ కోసం తమ అంచనా జట్లను ప్రకటిస్తున్నారు. మెజార్టీ శాతం ఆర్సీబీ అభిమానుల ప్రకారం తుది జట్టులో విదేశీ ఆటగాళ్ల కోటాలో డుప్లెసిస్‌, మ్యాక్స్‌వెల్‌, కెమారూన్‌ గ్రీన్‌, అల్జరీ జోసఫ్‌ ఉంటున్నారు. దేశీయ ఆటగాళ్ల కోటాలో విరాట్‌ కోహ్లి, మొహమ్మద్‌ సిరాజ్‌, దినేశ్‌ కార్తీక్‌, మహిపాల్‌ లోమ్రార్‌, రజత్‌ పాటిదార్‌ ఉంటున్నారు.   

ఆర్సీబీ తుది జట్టు (అంచనా): విరాట్‌ కోహ్లి (బ్యాటర్‌), ఫాఫ్‌ డుప్లెసిస్‌ (బ్యాటర్‌/కెప్టెన్‌), రజత్‌ పాటిదార్‌ (ఆఫ్‌ స్పిన్‌/బ్యాటర్‌), గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (ఆఫ్‌ స్పిన్‌/బ్యాటర్‌), కెమారూన్‌ గ్రీన్‌ (ఫాస్ట్ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌)‌, దినేశ్‌ కార్తీక్‌ (వికెట్‌కీపర్‌/బ్యాటర్‌), మహిపాల్‌ లోమ్రార్‌ (బ్యాటర్‌/లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌), కర్ణ్‌ శర్మ (లెగ్‌ స్పిన్నర్‌), అల్జరీ జోసఫ్‌ (పేస్‌ బౌలర్‌), మొహమ్మద్‌ సిరాజ్‌ (పేసర్‌), యశ్‌ దయాల్‌ (లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement