IPL 2024 Auction
-
IPL 2024- SRH: సన్‌రైజర్స్ కెప్టెన్‌గా అతడే!
ఐపీఎల్ ఎడిషన్లు మారుతున్నా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రాత మాత్రం మారడం లేదు. 2016లో తొలిసారి టైటిల్‌ను ముద్దాడిన రైజర్స్.. ఆ తర్వాత మళ్లీ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. గత కొన్ని సీజన్లుగా మరీ పేలవంగా ఆడుతూ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం కోసం పోటీ పడుతోంది. జట్టును చాంపియన్‌గా నిలిపిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ను తప్పించిన తర్వాత.. న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్కు పగ్గాలు అప్పగించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో.. కేన్ మామకూ ఉద్వాసన పలికి సౌతాఫ్రికా స్టార్ ఐడెన్ మార్క్రమ్కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. అతడి కెప్టెన్సీలో రైజర్స్ ఐపీఎల్-2023 సీజన్లో మరీ దారుణంగా పద్నాలుగింట 4 మాత్రమే గెలిచి అట్టడుగున నిలిచింది. ఈ నేపథ్యంలో.. ఐపీఎల్-2024 ఆరంభానికి ముందే కెప్టెన్ వేటలో పడ్డ సన్‌రైజర్స్ యాజమాన్యం మినీ వేలంలో భాగంగా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ను సొంతం చేసుకుంది. వన్డే వరల్డ్‌కప్-2023లో ఆసీస్‌ను జగజ్జేతగా నిలిపిన ఈ పేస్ బౌలర్ కోసం ఏకంగా రూ. 20.50 కోట్లు ఖర్చు చేసింది. ఈ క్రమంలో తాజా ఎడిషన్‌లో తమ కెప్టెన్‌గా కమిన్స్‌ను నియమించడం ఖాయమని సన్‌రైజర్స్ ఫ్రాంఛైజీ చెప్పకనే చెప్పిందని అభిమానులు భావిస్తున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ సునిల్ గావస్కర్ కూడా ఇదే మాట అంటున్నాడు. ‘‘ప్యాట్ కమిన్స్‌ను కొనుగోలు చేయడం ఎస్ఆర్హెచ్ తెలివైన నిర్ణయం. అయితే, అతడి కోసం కాస్త ఎక్కువగానే ఖర్చుపెట్టిన మాట వాస్తవమే. కానీ.. సన్‌రైజర్స్‌కు నాయకుడి అవసరం ఉంది. గత కొన్నేళ్లుగా ఆ వెలితితో జట్టు సమస్య ఎదుర్కొంటోంది. గత సీజన్లో చెత్త కెప్టెన్సీ కారణంగా భారీ మూల్యమే చెల్లించారు. ఈసారి ప్యాట్ కమిన్స్ రూపంలో వారికి మంచి ఆటగాడు దొరికాడు. కచ్చితంగా అతడినే కెప్టెన్‌గా నియమిస్తారు. సారథిగా తను తప్పక ప్రభావం చూపుతాడు’’ అని సునిల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. -
ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోలేదు.. కానీ ఆ జట్టులో మాత్రం ఛాన్స్!
లోన్ నాసిర్.. జమ్మూ కశ్మీర్ నయా పేస్ సంచలనం. గంటకు 150 కి.మీ వేగంతో బౌలింగ్ చేయగల్గే సత్తా అతడిది. ఐపీఎల్-2024 వేలంలో అందరి కళ్లు అతడిపైనే ఉండేవి. ఈ యువ పేసర్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడతాయని అందరూ భావించారు. కానీ రూ.20 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన నాసిర్‌ను ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. అయితే ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని లోన్ నాసిర్‌కు.. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసే ఛాన్స్ లభించింది. రంజీ ట్రోఫీలో తొలి రెండు మ్యాచ్‌లకు ఎంపిక చేసిన జమ్మూ కశ్మీర్ జట్టులో లోన్ నాసిర్‌కు చోటుదక్కింది. రంజీ ట్రోఫీ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును జమ్మూ కశ్మీర్ క్రికెట్ ఆసోషియేషన్ ప్రకటించింది. ఈ జట్టుకు శుభమ్ ఖజురియా కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అదే విధంగా గాయం నుంచి కోలుకున్న ఉమ్రాన్ మాలిక్ కూడా తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నాడు. రంజీ ట్రోఫీ 2024కు జమ్మూ కాశ్మీర్ జట్టు: శుభమ్ ఖజురియా(కెప్టెన్), కమ్రాన్ ఇక్బాల్, అభినవ్ పూరి, వివ్రాంత్ శర్మ, అబ్దుల్ సమద్, శుభమ్ సింగ్ పుండిర్, ఫాజిల్ రషీద్ (వికెట్ కీపర్), ముసైఫ్ ఐజాజ్, అబిద్ ముస్తాక్, సాహిల్ లోత్రా,ఉమ్రాన్ మలీర్క్, లోన్ మలీక్ ఉమర్ నజీర్, ఔకిబ్ నబీ, రోహిత్ శర్మ. చదవండి:సచిన్ వేరొక గ్రహం నుంచి వచ్చాడనుకుంటా.. గొప్ప వ్యక్తి! లారా కంటే బెటర్ -
'మా నాన్న పాన్ షాప్ నడిపాడు.. ఐపీఎల్ డబ్బులతో ఇల్లు కొనాలనుకుంటున్నా'
ఐపీఎల్-2024 వేలంలో విధర్భ ఆటగాడు శభమ్ దూబేపై కాసుల వర్షం కురిసిన సంగతి తెలిసిందే. ఈ వేలంలో దూబేను రూ.5.60 కోట్ల భారీ ధరకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. దేశీవాళీ క్రికెట్లో దుమ్మురేపుతున్న 28 ఏళ్ల దూబే.. ఇప్పుడు క్యాష్‌రిచ్ లీగ్‌లోనూ సత్తాచాటేందుకు సిద్దమవుతున్నాడు. ఇక తాజాగా తన మనసులోని మాటను దూబే బయటపెట్టాడు. ఐపీఎల్లో వచ్చిన డబ్బులతో తన కుటుంబం కోసం కోసం ఇళ్లు కొంటానని దూబే తెలిపాడు. 'మా కుటుంబం ఆర్ధికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. క్రికెట్ కిట్ కొనే స్థోమత లేదు. కానీ మా నాన్న ఇప్పటికీ తన కష్టంతో నాకు క్రికెట్ కిట్‌ని కొని ఇస్తున్నారు. నేను ఈ స్థాయికి వచ్చానంటే అందుకు కారణం మా నాన్నే. ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉన్నప్పటికీ నన్ను వేరే పని చేయమని ఎప్పుడూ బలవంతం చేయలేదు. మా నాన్న నిరాడంబరమైన వ్యక్తి. కుటంబాన్ని పోషించడానికి ఎంతో కష్టపడ్డారు. మొదటిలో పాన్ స్టాల్ నిర్వహించారు. ఆ తర్వాత హోటల్ మేనేజర్‌గా కూడా పనిచేశారు. మా నాన్నతో పాటు నా సోదరుడు కూడా ఎంతో మద్దతుగా నిలిచాడు. నాపై ఎటువంటి ఒత్తడి కలగకుండా తన కూడా ఎదో ఒక పనిచేసి మా నాన్నకు సాయంగా ఉండేవాడు. నేను గాయపడి క్రికెట్‌కు దూరంగా ఉన్న సమయంలో కూడా నా కుటుంబం చాలా సపోర్ట్‌గా ఉంది. ఇకపై వారికి ఎటువంటి కష్టం కలగకుండా చూసుకోవాలనకుంటున్నాను. నేను ముందుగా నా ఫ్యామిలీ కోసం ఇల్లు కొనాలనుకుంటున్నానని" రాజస్తాన్ రాయల్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దుబే పేర్కొన్నాడు. చదవండి: IND vs AFG: అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్.. టీమిండియా కొత్త కెప్టెన్ అతడే!? రోహిత్ డౌటే? -
IPL 2024: పాండ్యా కోసం రూ. 100 కోట్లు చెల్లించిన ముంబై?
‘‘ముంబై ఇండియన్స్‌తో పోలిస్తే అహ్మదాబాద్ ఫ్రాంఛైజీ పూర్తి భిన్నమైనది. ఇరు ఫ్రాంఛైజీల సంస్కృతి, లక్ష్యాలు వేరు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగమయ్యేందుకు 2021లో సీవీసీ క్యాపిటల్ రూ. 5625 కోట్లు చెల్లించింది. అయితే, ఎంఐ ఫ్రాంఛైజీ ఇందుకు భిన్నమైనది. అతిపెద్ద వ్యాపార కుటుంబం ఈ ఫ్రాంఛైజీని నడిపిస్తోంది. మరోవైపు.. సీవీసీ అనేది ఒక పెట్టుబటి సంస్థ. ప్రపంచవ్యాప్తంగా సీవీసీకి 40 మంది మేనేజింగ్ పార్ట్నర్లు, ఆయా చోట్ల 29 స్థానిక కార్యాలయాలు ఉన్నాయి. ఆ సంస్థకు సంబంధించిన వెబ్సైట్లో గుజరాత్ టైటాన్స్ ఒక ప్రత్యేకమైన పోర్ట్ఫొలియోలో లిస్ట్ అయింది. నిజానికి హార్దిక్‌ను ట్రేడ్ చేయడం ద్వారా గుజరాత్ టైటాన్స్ పర్సు రూ. 15 కోట్ల మేర ఖాళీ అయింది. అయితే, దానిని పూడ్చడంతో పాటు ట్రేడింగ్ ద్వారా ట్రాన్స్ఫర్ ఫీజు కూడా లభించింది. అయితే, అది ఎంత మొత్తం అన్నది కేవలం ఐపీఎల్ నిర్వాహకులకు మాత్రమే తెలుసు. కానీ ఇందుకు సంబంధించి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. రూ. 100 కోట్లకు హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ జరిగిందనేది వాటి సారాంశం’’... టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, టీ20 తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా గురించి తాజాగా వినిపిస్తున్న వార్తలు. నెట్టింట చర్చకు దారితీసిన ట్వీట్ ఈ మేరకు.. ‘‘హార్దిక్ ఎంఐకి వెళ్లిపోయేందుకు గుజరాత్ టైటాన్స్ ఎందుకు అంగీకరించింది?’’ అన్న శీర్షికతో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రచురించినట్లు క్రికెట్ గురించి అప్డేట్లు అందించే ఎక్స్ యూజర్ ముఫద్దాల్ వొహ్రా చేసిన ట్వీట్ నెట్టింట దుమారం రేపుతోంది. అంతసీన్ లేదు ఇప్పటికే ఐదు లక్షలకు పైగా ఈ పోస్ట్‌కు వీక్షణలు లభించడం విశేషం. అయితే, ఈ విషయంపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. హార్దిక్కోసం మరీ 100 కోట్ల రూపాయలు చెల్లించాల్సిన పని లేదని.. ఇలాంటివి కేవలం హైప్ క్రియేట్ చేసేందుకే సృష్టిస్తారని పేర్కొంటున్నారు. బంగారు బాతు.. పైసా వసూల్ పెర్ఫామెన్స్ గ్యారెంటీ మరికొందరు మాత్రం.. ‘‘హార్దిక్ పాండ్యా బంగారు బాతు లాంటివాడు. అతడి కోసం ముంబై ఒకవేళ నిజంగానే వంద కోట్లు ఖర్చు పెట్టినా అందుకు రెట్టింపు పైసా వసూల్ ప్రదర్శన ఇస్తాడు’’ అని కామెంట్ చేస్తున్నారు. కాగా ఐపీఎల్-2024 వేలానికి ముందు హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కష్టకాలంలో గుజరాత్ కెప్టెన్‌గా ముంబై ఇండియన్స్ ఆఫర్ మేరకు గుజరాత్ టైటాన్స్‌ను వీడి తిరిగి సొంతగూటికి చేరాడు. తనకు లైఫ్ ఇచ్చినప్పటికీ.. గడ్డుకాలంలో తనను వదిలించుకున్న ముంబై వైపే మొగ్గు చూపి టైటాన్స్‌కు వీడ్కోలు పలికాడు. కాగా ఐపీఎల్-2022 సందర్భంగా క్యాష్ రిచ్ లీగ్‌లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన అహ్మదాబాద్ ఫ్రాంఛైజీ.. పాండ్యాను కొనుగోలు చేసి కెప్టెన్‌గా నియమించింది. భారీ ఆఫర్ ఇచ్చిన ముంబై.. టైటాన్స్ పాండ్యా టాటా అంతకు ముందు సారథిగా పనిచేసిన అనుభవం లేకపోయినా.. పూర్తి ఫిట్నెస్ సాధించకపోయినా హార్దిక్‌పై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించింది. అందుకు తగ్గట్లుగానే హార్దిక్.. అరంగేట్ర సీజన్లోనే టైటాన్స్‌ను విజేతగా నిలిపాడు. ఈ ఏడాది ఫైనల్‌కు కూడా తీసుకువచ్చాడు. అయితే, అనూహ్యంగా ముంబై ఇండియన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుని టైటాన్స్‌కు టాటా చెప్పాడు. రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023 సందర్భంగా గాయపడ్డ హార్దిక్ పాండ్యా ఐపీఎల్-2024 ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యే ఛాన్స్ ఉంది. చదవండి: Ind vs SA: వికెట్ కీపర్ విషయంలో ద్రవిడ్ క్లారిటీ .. తప్పుబట్టిన మాజీ క్రికెటర్ Hardik Pandya's trade details (Indian Express): pic.twitter.com/MNiN5grdYC — Mufaddal Vohra (@mufaddal_vohra) December 24, 2023 -
IPL 2024: ముస్తాబాద్ నుంచి ఐపీఎల్ దాకా.. సీఎస్కేకు ఆడే ఛాన్స్!
ముస్తాబాద్(సిరిసిల్ల): క్రికెట్ అండర్–19 ప్రపంచ కప్ టోర్నీకి ఎంపికై , సంచలనం సృష్టించాడు 18 ఏళ్ల ఎరవెల్లి అవనీష్‌రావు. అంతేకాదు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్టుకు ఆడబోతున్నాడు కూడా! రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామానికి చెందిన అవనీష్రావును.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రూ.20 లక్షలకు దక్కించుకుంది. దుబాయ్‌లో గత మంగళవారం జరిగిన ఐపీఎల్-2024 వేలంలో అతడిని సొంతం చేసుకుంది. తొమ్మిదేళ్ల వయసులో ఆట ప్రారంభం వికెట్ కీపర్‌గా, లెఫ్ట్‌హ్యాండ్ బ్యాటర్‌గా రాణిస్తున్న అవనీష్‌రావు.. నెల రోజుల వ్యవధిలో ఆసియా కప్, ఇండియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ ట్రై సీరిస్‌తోపాటు.. జనవరి 19 నుంచి జరగనున్న అండర్–19 వరల్డ్ కప్ టోర్నీకి ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం. ఇప్పుడు ఐపీఎల్లో పెద్ద జట్టుగా పేరుగాంచిన చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని తీసుకుంది. సాఫ్ట్వేర్ ఇంజినీర్ కుమారుడు పోతుగల్‌కు చెందిన ఎరవెల్లి బాలకిషన్‌రావు సబ్‌రిజిస్ట్రార్‌గా రిటైరయ్యారు. ఆయన కుమారుడు, సాఫ్ట్వేర్ ఇంజినీర్ లక్ష్మణ్‌రావు–సుష్మ దంపతుల కుమారుడు అవనీష్‌రావు బాల్యం హైదరాబాద్‌లోనే గడిచింది. ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. తన తొమ్మిదేళ్ల వయసులోనే క్రికెట్ ఆడటం ప్రారంభించగా తండ్రి ప్రోత్సహించారు. నిత్యం జింఖానా మైదానంలో 10 గంటలకు పైగా ప్రాక్టీస్ చేసేవాడు. పాఠశాల చదువు సమయంలోనే అవనీష్‌రావు హైదరాబాద్ అండర్–14, 16కు ఎంపికయ్యాడు. హెచ్‌సీఏ సైతం అతని ప్రతిభ చూసి, చాలెంజర్స్ ట్రోఫీకి ఎంపిక చేసింది. బీసీసీఐ దృష్టిలో పడగా, అండర్–19 భారత జట్టుకు ఎంపిక చేసింది. తక్కువ వయసులో క్రికెట్లో రాణిస్తున్న అవనీష్‌రావు రాష్ట్ర యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆడమ్ గిల్‌క్రిస్ట్ స్ఫూర్తి.. చిన్నప్పటి నుంచి తనకు ఆడమ్ గిల్‌క్రిస్ట్ అంటే ఇష్టమని అవనీష్‌రావు తెలిపాడు. ఎడమ చేతివాటంతో ఆయన ఎంత ఫేమస్ అయ్యారో.. తాను కూడా అలా కావాలనుకున్నానని తెలిపాడు. తాను మొదట హైదరాబాద్‌లోని హిందూ మహావిద్యాలయలో చేరి, కోచ్ చందు ఆధ్వర్యంలో ఆటపై పట్టు సాధించానని, అనంతరం ఇండియా ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ అకాడమీలో చేరి, మరింత రాటుదేలినట్లు తెలిపాడు. పలు టోర్నీల్లో అవకాశాలు వచ్చాయని, అండర్–19 వరల్డ్ కప్‌కు ఎంపికవ్వాలనే లక్ష్యంతో నిత్యం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రాక్టీస్ చేశానన్నాడు. తన లక్ష్యం భారత సీనియర్ జట్టుకు ఎంపిక కావడమేనని పేర్కొన్నాడు. చదవండి: ముంబై ఇండియన్స్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్!.. కెప్టెన్ దూరం! -
'అతడొక టెస్టు బౌలర్.. ఎస్ఆర్హెచ్కు రూ.20 కోట్లు దండగ'
దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్-2024 వేలంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ భారీ ధర పలికిన సంగతి తెలిసిందే. కమ్మిన్స్‌ను రూ.20.50 కోట్ల భారీ మొత్తం వెచ్చించి మరీ సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. అయితే కమ్మిన్స్ అంత భారీ ధరకు అమ్ముడుపోవడం పట్ల ఆస్ట్రేలియా మాజీ పేసర్ జాసన్ గిల్లెస్పీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కమ్మిన్స్‌కు టీ20ల్లో కంటే టెస్టుల్లోనే మంచి రికార్డు ఉందని గిల్లెప్సీ అభిప్రాయపడ్డాడు. 'పాట్ కమ్మిన్స్ వరల్డ్‌క్లాస్ క్వాలిటీ బౌలర్. అందులో ఎటువంటి సందేహం లేదు. అదే విధంగా మంచి కెప్టెన్ కూడా. కానీ టీ20లకు అతడి సరిపోడు. టీ20లో మంచి రికార్డుల కూడా లేవు. నావరకు అయితే కమ్మిన్స్ టెస్టు ఫార్మాట్ బౌలర్. టెస్టు క్రికెట్ అయితే అతడికి వెన్నతో పెట్టిన విద్య" అని సేన్ రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గిల్లెప్సీ పేర్కొన్నాడు. కాగా కమ్మిన్స్ ఐపీఎల్లో ప్యాట్ కమిన్స్ ఢిల్లీ తరఫున 12 మ్యాచ్‌లు, కోల్‌కతా తరఫున 30 మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం 42 మ్యాచ్‌ల్లో 45 వికెట్లు పడగొట్టాడు. 2020 వేలంలో కేకేఆర్ అతనికి రూ. 15.50 కోట్లు ఇచ్చింది. అంతర్జాతీయ షెడ్యూల్ కారణంగా 2023 సీజన్లో కమిన్స్ ఆడలేదు. వరల్డ్ కప్‌లో జట్టును విజేతగా నిలిపి అతను మళ్లీ ఐపీఎల్లో అడుగు పెట్టాడు. చదవండి: Sanju Samson: గర్వంగా ఉంది.. చాలా కష్టపడ్డాను! అతడొక అద్భుతం -
హృదయం ముక్కలైంది.. సిరాజ్ పోస్ట్ వైరల్! అతడికి ఏకంగా రూ. 11 కోట్లు!
టీమిండియా స్టార్ బౌలర్, ఆర్సీబీ పేసర్ మహ్మద్ సిరాజ్ తన సోషల్ మీడియా పోస్ట్‌తో నెట్టింట వైరల్ అవుతున్నాడు. ఇన్‌స్టా స్టోరీలో ముక్కలైన హృదయాన్ని తలపించే ఎమోజీలతో హాట్‌టాపిక్‌గా మారాడు. ఈ నేపథ్యంలో సిరాజ్ నర్మగర్భ పోస్ట్‌పై టీమిండియా, ఆర్సీబీ ఫ్యాన్స్ తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా హైదరాబాదీ స్టార్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. టీ20 సిరీస్‌లో భాగమైన అతడికి.. వన్డే సిరీస్ సందర్భంగా మేనేజ్మెంట్ విశ్రాంతినిచ్చింది. ఈ క్రమంలో.. డిసెంబరు 26న మొదలుకానున్న టెస్టు సిరీస్‌తో సిరాజ్ మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ఈ నేపథ్యంలో రెడ్ హార్ట్‌బ్రేక్ ఎమోజీలను సిరాజ్ తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేయడం చర్చకు దారితీసింది. ఈ క్రమంలో.. ‘‘ఐపీఎల్-2024 వేలంలో ఆర్సీబీ అనుసరించిన వ్యూహాలు.. బౌలర్లను కొనుగోలు చేసిన విధానం సిరాజ్‌కు నచ్చలేదేమో’’ అని కొందరు కామెంట్ చేస్తున్నారు. మరికొందరేమో.. ‘‘కొంపదీసి సిరాజ్ గాయపడ్డాడా ఏంటి? ఇప్పటి వరకు సౌతాఫ్రికా గడ్డపై ఇండియా టెస్టు సిరీస్ గెలిచిందే లేదు. ఇప్పటికే మహ్మద్ షమీ జట్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు సిరాజ్ ఈ బ్రేకింగ్ హార్ట్ ఎమోజీలతో ఏం సందేశం ఇస్తున్నట్లు?’’ అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరేమో.. ‘‘సూర్యకుమార్ యాదవ్ మాదిరిగానే సిరాజ్ ఆర్సీబీ కెప్టెన్ కావాలని భావించాడేమో! పాపం.. ఇంతకీ ఆర్సీబీ క్యాంప్‌లో ఏం జరుగుతోందో మీకేమైనా తెలుసా?’’ అంటూ సరదాగా ట్రోల్ చేస్తున్నారు. కాగా ఐపీఎల్-2024 వేలానికి ముందు హార్దిక్ పాండ్యాను ట్రేడ్ చేసుకున్న ముంబై ఇండియన్స్ అతడిని కెప్టెన్‌గా నియమించింది. టీమిండియా సారథి రోహిత్ శర్మను కాదని పాండ్యాకు పెద్దపీట వేసింది. ఈ నేపథ్యంలో తన హృదయం ముక్కలైందంటూ.. రోహిత్ గైర్హాజరీలో ముంబై ఇండియన్స్‌ను ముందుకు నడిపించిన సూర్యకుమార్ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. సిరాజ్ క్రిప్టిక్ పోస్ట్ నేపథ్యంలో సూర్య పోస్ట్‌ను తెరమీదకు తెచ్చి నెటిజన్లు ఇలా కామెంట్లు చేస్తున్నారు. తాను ఆ ఎమోజీలు పోస్ట్ చేయడానికి గల కారణం ఏమిటో మహ్మద్ సిరాజ్ స్పందిస్తేనే క్లారిటీ వస్తుంది. ఐపీఎల్ వేలం-2024లో ఆర్సీబీ కొన్న ప్లేయర్లు వీరే: వెస్టిండీస్ స్పీడ్‌స్టర్ అల్జారీ జోసెఫ్‌ను అత్యధికంగా రూ.11.50 కోట్లకు కొనుగోలు చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. అతడితో పాటు యశ్ దయాళ్ (రూ.5 కోట్లు), టామ్ కరన్ (రూ.1.50 కోట్లు), లాకీ ఫెర్గూసన్ (రూ.2 కోట్లు), స్వప్నిల్ సింగ్ (రూ.20 లక్షలు), సౌరవ్ చౌహాన్ (రూ.20 లక్షలు)లను సొంతం చేసుకుంది. ఇక సిరాజ్‌ను ఆర్సీబీ రూ. ఏడు కోట్లకు రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. Did Siraj wake up and see his co-bowlers who ll be bowling at Chinnaswamy? pic.twitter.com/ZIDVVUvUD6 — 𝐒𝐞𝐫𝐠𝐢𝐨 Das (@SergioCSKK) December 21, 2023 Is there any secret message behind this? — King Kohli's Fan (@ViratFan100) December 21, 2023 Mohammed Siraj's Instagram story. pic.twitter.com/TSCqSCbshv — Mufaddal Vohra (@mufaddal_vohra) December 21, 2023 -
IPL 2024: ఆర్సీబీ ఆటగాడికిపై నిషేధం
ఇటీవల జరిగిన ఐపీఎల్ 2024 వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కొనుగోలు చేసిన ఆటగాడిపై బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్) నిర్వహకులు నిషేధం విధించారు. బీబీఎల్ 2023-24లో సిడ్నీ సిక్సర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఇంగ్లండ్ పేసర్ టామ్ కర్రన్‌ను నాలుగు మ్యాచ్‌ల పాటు నిషేధించారు. బీబీఎల్‌లో భాగంగా డిసెంబర్ 11న హోబర్ట్ హరికేన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అంపైర్‌ను బెదిరించినందుకు గాను టామ్ కర్రన్‌పై చర్యలకు తీసుకున్నట్లు బీబీఎల్ నిర్వహకులు వెల్లడించారు. హోబర్ట్తో మ్యాచ్‌కు ముందు రిహార్సల్స్ సందర్భంగా కర్రన్ అంపైర్ పట్ల దురుసుగా ప్రవర్తించాడని బీబీఎల్ నిర్వహకులు తెలిపారు. మ్యాచ్‌కు ముందు పిచ్‌పై బౌలింగ్ చేసేందుకు కర్రన్ ప్రయత్నించగా అంపైర్ వారించాడని, అయినా కర్రన్ లెక్క చేయకుండా అంపైర్ వైపు బౌలింగ్ చేయబోయాడని పేర్కొన్నారు. కర్రన్ చర్యను లెవెల్ 3 నేరం కింద పరిగణించి, అతనిపై నాలుగు మ్యాచ్‌ల నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. Tom Curran has been banned for four BBL games after intimidating the umpire during pre-match practice.pic.twitter.com/OwvVYkb7kz — CricTracker (@Cricketracker) December 21, 2023 కాగా, డిసెంబర్ 11న హోబర్ట్తో జరిగిన మ్యాచ్‌లో కర్రన్ అద్భుతంగా బౌలింగ్ చేసి తన జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. ఆ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన కర్రన్ కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అలాగే బ్యాటింగ్‌లోనూ ఓ బౌండరీ బాది తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇదిలా ఉంటే, దుబాయ్‌లోని కోకోకోలా ఎరీనా వేదికగా డిసెంబర్ 19న జరిగిన ఐపీఎల్ 2024 వేలంలో ఆర్సీబీ జట్టు టామ్ కర్రన్‌ను 1.5 కోట్లకు సొంతం చేసుకుంది. 28 ఏళ్ల టామ్ కర్రన్ ఐపీఎల్లో వివిధ జట్ల తరఫున 13 మ్యాచ్‌లు ఆడాడు. గత సీజన్ వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న సామ్ కర్రన్‌కు టామ్ అన్న అవుతాడు. టామ్ ఇంగ్లండ్ జాతీయ జట్టు తరఫున 2 టెస్ట్‌లు, 29 వన్డేలు, 30 టీ20 ఆడాడు. -
వాళ్లిద్దరికి అంత మొత్తమా? ముంబై మాత్రం తెలివిగా రూ. 15 కోట్లకే: ఏబీడీ
ఐపీఎల్ వేలం-2024 వేలంలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తెలివిగా వ్యవహరించాయని సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ అన్నాడు. అదే సమయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మాత్రం ఆస్ట్రేలియా క్రికెటర్ల కోసం భారీ మొత్తం వెచ్చించడం సరికాదని అభిప్రాయపడ్డాడు. ఈసారి వేలంలో ఫాస్ట్ బౌలర్లకు డిమాండ్ ఉన్న వాస్తవమే అయినా.. మరీ ఈ స్థాయిలో రూ. 20 కోట్లకు పైగా ఖర్చుచేస్తారని ఊహించలేదన్నాడు. కాగా దుబాయ్ వేదికగా మంగళవారం జరిగిన ఆక్షన్‌లో ఆసీస్ పేసర్లు ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ రికార్డు స్థాయి ధర పలికిన విషయం తెలిసిందే. కమిన్స్‌ను సన్‌రైజర్స్ రూ. 20.50 కోట్లకు కొనుగోలు చేయగా.. స్టార్క్ కోసం కేకేఆర్ ఏకంగా రూ. 24.75 కోట్లు ఖర్చు చేసింది. దీంతో క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే వీరిద్దరు అత్యధిక ధర పలికిన ఆటగాళ్లుగా నిలిచారు. ఈ నేపథ్యంలో తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిమానులతో ముచ్చటించిన ఏబీ డివిలియర్స్‌కు ఈ విషయం గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు స్పందిస్తూ.. ‘‘ఈసారి వేలంలో కొన్ని ఫ్రాంఛైజీలు స్మార్ట్‌గా వ్యవహరించాయి. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ భావోద్వేగాలకు తావులేకుండా తెలివిగా కొనుగోళ్లు చేశాయి. నిజానికి కమిన్స్, స్టార్క్ అద్భుతమైన ఆటగాళ్లే! అయితే, వాళ్ల కోసం అంత భారీ మొత్తం వెచ్చించాలా? అంటే అవసరం లేదనే చెప్పవచ్చు. ఫాస్ట్ బౌలర్లకు ఈసారి వేలంలో డిమాండ్ ఉన్న మాట నిజమే! అందుకే ధరలు అమాంతం పెరిగిపోయాయి. అయితే, ముందుగా చెప్పినట్లు ముంబై ఇండియన్స్ తెలివిగా ఆటగాళ్లను కొనుగోలు చేసింది. నువాన్ తుషార, దిల్షాన్ మధుషాంక అద్భుతమైన క్రికెటర్లు. ఇక మహ్మద్ నబీ, శ్రేయస్ గోపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మంచి ధరకే వాళ్లిద్దరు ముంబైకి లభించారు. ముఖ్యంగా.. కొయెట్జీ, మధుషాంక, తుషారలను కలిపి 15 కోట్ల రూపాయలకే సొంతం చేసుకోవడం నాకు నచ్చింది’’ అని డివిలియర్స్ పేర్కొన్నాడు. కాగా పేస్‌త్రయం గెరాల్డ్ కొయెట్జీని రూ. 5 కోట్లు, దిల్షాన్ మధుషాంకను రూ. 4.5 కోట్లు, నువాన్ తుషారను రూ. 4.8 కోట్లకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. ఇక నబీ కోసం రూ. 1.5 కోట్లు, గోపాల్ కోసం రూ. 20 లక్షలకు సొంతం చేసుకుంది. వీరితో పాటు నామన్ ధిర్‌ను రూ. 20 లక్షలు, అన్షూల్ కాంబోజ్‌ను రూ. 20 లక్షలు, శైవిక్ శర్మను రూ. 20 లక్షలకు ఐపీఎల్-2024 వేలంలో ముంబై కొనుగోలు చేసింది. -
రూ. 10 కోట్లదాకా వెళ్తామని గంగూలీ మాటిచ్చారు.. ఇలా అనుకోలేదు!
IPL 2024 Auction: క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ వల్ల వెలుగులోకి వచ్చిన యువ క్రికెటర్లు ఎందరో ఉన్నారు. దేశవాళీ క్రికెట్, సెలక్షన్ క్యాంపులలో అసాధారణ ప్రతిభాపాటవాలతో ఆకట్టుకున్న ఆటగాళ్లకు ఫ్రాంఛైజీలు భారీ మొత్తం చెల్లించేందుకు కూడా సిద్ధపడతాయన్న విషయం తెలిసిందే. తమ జట్టుకు సదరు ఆటగాడు ఉపయోగపడతాడని భావిస్తే కనీస ధరతో సంబంధం లేకుండా కోట్ల వర్షం కురిపించిన దాఖలాలు కోకొల్లలు. ఐపీఎల్-2024 వేలం సందర్భంగా ఇలాంటి గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడు ఓ అన్క్యాప్డ్ ప్లేయర్. రూ. 20 లక్షల కనీస ధరతో ఆక్షన్‌లోకి వచ్చి ఏకంగా రూ. 7.20 కోట్లు కొల్లగొట్టాడు. అతడి పేరు కుమార్ కుషాగ్ర. ఢిల్లీ క్యాపిటల్స్ అతడి కోసం చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్‌తో పోటీ పడి మరీ ఈ భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. అయితే, దీనంతటికి క్యాపిటల్స్ మెంటార్ సౌరవ్ గంగూలీనే కారణం అంటున్నాడు కుషాగ్ర తండ్రి శశికాంత్. ధోనిలా వికెట్ కీపింగ్ చేస్తున్నాడంటూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. ‘‘ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ట్రయల్స్ సందర్భంగా గంగూలీ కుషాగ్రతో మాట్లాడారు. నీకోసం ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 10 కోట్ల వరకు ఇతర ఫ్రాంఛైజీలతో పోటీ పడుతుందని కుషాగ్రకు చెప్పారు. నిజానికి ట్రయల్స్‌లో భాగంగా కుషాగ్ర సిక్సర్లు బాదడం చూసి గంగూలీ ముచ్చటపడ్డారు. వికెట్ కీపింగ్ నైపుణ్యాలు కూడా అద్భుతంగా ఉన్నాయని మెచ్చుకున్నారు. అంతేకాదు.. కుషాగ్ర మహేంద్ర సింగ్ ధోని మాదిరే బెయిల్స్‌ను హిట్ చేస్తున్నాడంటూ కొనియాడారు. ఉత్సాహపరిచేందుకు చెప్తున్నారనుకున్నా గానీ.. ఇలా అనుకోలేదు వేలంలో కుషాగ్రను ఢిల్లీ కనీస ధరకే కొనుగోలు చేస్తుందని భావించాం. అయితే, ఆ తర్వాత అద్భుతాలు జరిగాయి. గంగూలీ మాట ఇచ్చినట్లుగానే ఇతర జట్లతో పోటీ పడీ మరీ మా వాడిని కొనుగోలు చేసేలా చేశారు. జార్ఖండ్ వికెట్ కీపర్ బ్యాటర్ కుషాగ్రకు ఐదేళ్ల వయసు నుంచే క్రికెట్ అంటే ఇష్టం పెరిగింది. తను ఇక్కడిదాకా చేరుకోవడం గర్వంగా ఉంది’’ అని శశికాంత్ పేర్కొన్నారు. కాగా జార్ఖండ్‌కు చెందిన 19 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాటర్ కుమార్ కుషాగ్ర. గతేడాది రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఏకంగా 266 పరుగులు సాధించి వెలుగులోకి వచ్చాడు. రంజీ చరిత్రలో ఓ మ్యాచ్‌లో 250కి పైగా రన్స్ చేసిన పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. లిస్ట్-ఏ, దేళవాళీ టీ20 క్రికెట్లోనూ సత్తా చాటాడు. తద్వారా ఐపీఎల్ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించి కాసుల వర్షంలో తడిశాడు. చదవండి: తండ్రిది పాన్ షాప్.. గ్లవ్స్ కొనేందుకు కూడా డబ్బులు లేవు! ఇప్పుడు ఏకంగా రూ.5 కోట్లు -
సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం.. !?
దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్-2024 మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ వ్యూహత్మకంగా వ్యవహరించింది. వేలంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్, వరల్డ్‌కప్ హీరో ట్రావిస్ హెడ్, శ్రీలంక స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగాను ఎస్ఆర్హెచ్ సొంతం చేసుకుంది. వీరి ముగ్గురి రాకతో ఎస్ఆర్హెచ్ జట్టు ఇప్పుడు మరింత పటిష్టంగా కన్పిస్తోంది. అయితే ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఓ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వేలంలో రూ.20.50 కోట్టు ఖర్చు పెట్టి కొనుగోలు చేసిన ప్యాట్ కమ్మిన్స్‌కు తమ జట్టు పగ్గాలు అప్పజెప్పాలని ఎస్ఆర్హెచ్ మేనెజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్న ఐడైన్ మార్క్రమ్ను తప్పించాలని ఎస్ఆర్హెచ్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. కెప్టెన్‌గా కమ్మిన్స్‌కు ఉన్న అనుభవం దృష్ట్యా సారథ్య మార్పు కోసం సన్‌రైజర్స్ యోచిస్తున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. కాగా కమ్మిన్స్ సారథ్యంలోనే వన్డే ప్రపంచకప్‌ను, వరల్డ్‌టెస్టు ఛాంపియన్ షిప్ టైటిల్‌ను ఆసీస్ సొంతం చేసుకుంది. కాగా గత మూడు సీజన్ల నుంచి ఎస్ఆర్హెచ్ దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. కెప్టెన్లు, కోచ్‌లను మార్చినప్పటికి ఫలితం మాత్రం శూన్యమే. కమ్మిన్స్, హెడ్ రాకతోనైనా ఎస్ఆర్హెచ్ తలరాత మారుతుందో లేదో వేచి చూడాలి. ఐపీఎల్ 2024 కోసం సన్‌రైజర్స్ జట్టు: అబ్దుల్ సమద్ బ్యాటర్ 4 కోట్లు రాహుల్ త్రిపాఠి బ్యాటర్ 8.5 కోట్లు ఎయిడెన్ మార్క్రమ్ బ్యాటర్ 2.6 కోట్లు (కెప్టెన్) గ్లెన్ ఫిలిప్స్ బ్యాటర్ 1.5 కోట్లు హెన్రిచ్ క్లాసెన్ బ్యాటర్ 5.25 కోట్లు మయాంక్ అగర్వాల్ బ్యాటర్ 8.25 కోట్లు ట్రావిస్ హెడ్ బ్యాటర్ 6.8 కోట్లు అన్మోల్ప్రీత్ సింగ్ బ్యాటర్ 20 లక్షలు ఉపేంద్ర యాదవ్ వికెట్ కీపర్ 25 లక్షలు షాబాజ్ అహ్మద్ ఆల్ రౌండర్ 2.4 కోట్లు నితీష్ కుమార్ రెడ్డి ఆల్ రౌండర్ 20 లక్షలు అభిషేక్ శర్మ ఆల్ రౌండర్ 6.5 కోట్లు మార్కో జాన్సెన్ ఆల్ రౌండర్ 4.2 కోట్లు వాషింగ్టన్ సుందర్ ఆల్ రౌండర్ 8.75 కోట్లు సన్వీర్ సింగ్ ఆల్ రౌండర్ 20 లక్షలు పాట్ కమిన్స్ బౌలర్ 20.5 కోట్లు భువనేశ్వర్ కుమార్ బౌలర్ 4.2 కోట్లు టి నటరాజన్ బౌలర్ 4 కోట్లు వనిందు హసరంగా బౌలర్ 1.5 కోట్లు మయాంక్ మార్కండే బౌలర్ 50 లక్షలు ఉమ్రాన్ మాలిక్ బౌలర్ 4 కోట్లు ఫజల్హాక్ ఫరూకీ బౌలర్ 50 లక్షలు జయదేవ్ ఉనద్కత్ బౌలర్ 1.6 కోట్లు ఆకాశ్ సింగ్ బౌలర్ 20 లక్షలు ఝటావేద్ సుబ్రమణ్యం బౌలర్ 20 లక్షలు -
తండ్రిది పాన్ షాప్.. గ్లవ్స్ కొనేందుకు కూడా డబ్బులు లేవు! ఇప్పుడు ఏకంగా రూ.5 కోట్లు
ఐపీఎల్.. ఎంతో మంది యువ ఆటగాళ్లను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేసింది. చాలా మంది క్రికెటర్ల జీవితాలను మార్చేసింది. అనామిక క్రికెటర్లను కోటీశ్వరలను చేసింది. తాజాగా ఈ జాబితాలోకి విధర్బ ఆటగాడు శుభమ్ దూబే చేరాడు. ఐపీఎల్-2024 వేలంతో దుబే కోటీశ్వరుడు అయిపోయాడు. ఈ వేలంలో దుబేను రూ.5.8 కోట్ల భారీ ధరకు రాజస్తాన్ రాయల్స్ కొనుగొలు చేసింది. అయితే దూబే ఈ స్ధాయికి చేరుకోవడానికి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. కనీసం మంచి గ్లవ్స్ కొనేందుకు కూడా ఇబ్బంది పడ్డ దూబే.. ఇప్పుడు జోస్ బట్లర్, ట్రెంట్ బౌల్ట్, రవిచంద్రన్ అశ్విన్ వంటి ఆటగాళ్లతో డ్రెస్సింగ్‌రూమ్‌ను పంచుకోనున్నాడు. ఈ క్రమంలో ఎవరీ శుభమ్ దూబే అని నెటిజన్లు తెగ వెతుకుతున్నారు. ఎవరీ శుభమ్ దుబే..? 29 ఏళ్ల శుభమ్ దూబే నాగ్‌పూర్‌లోని ఓ దిగువ మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి బద్రీప్రసాద్ దూబె పాన్ షాప్‌ను నిర్వహించేవాడు. అతడి సోదరుడు ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. వీరిద్దిరి సంపాదనపైనే దుబే కుటంబం ఇప్పటివరకు జీవనం గడుపుకుంటూ వచ్చింది. అయితే చిన్నతనం నుంచే దూబే క్రికెట్‌పై మక్కువ ఎక్కువ. కానీ క్రికెట్ కొనుకోవడానికి కూడా అతడి దగ్గర డబ్బులు లేకపోయేవి. ఈ సమయంలో విధర్బ మాజీ క్రికెటర్, దివంగత సుదీప్ జైస్వాల్ దుబేలోనే టాలెంట్‌ను గుర్తించారు. వృత్తి రీత్యా న్యాయవాది అయిన సుదీప్ జైస్వాల్ అడ్వకేట్ XI అనే క్రికెట్ క్లబ్‌ను నడిపేవాడు. ఆర్ధిక స్ధోమత లేని ప్రతిభావంతులైన ఆటగాళ్లకు అన్ని విధాల సాయం ఈ క్లబ్ తరపున సుదీప్ చేసేవాడు. ఆటగాళ్ల శిక్షణ, టోర్నీలకు వెళ్లేందుకు అయ్యే ఖర్చులను సుదీప్ భరించేవాడు. దూబేకు కూడా అర్ధికంగా సాయం చేసి మెంటార్‌గా వ్యవహరించాడు. అతడి పరిచయమే దుబే కెరీర్‌ను మలుపు తిప్పింది. దీంతో విదర్భ అండర్-19, అండర్-23 జట్లలో చోటు దక్కించుకున్న శుభమ్.. సత్తా చాటి సీనియర్ జట్టులోకి వచ్చాడు. అయితే దుబే ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో మాత్రం ఇప్పటివరకు అరంగేట్రం చేయలేదు. కానీ టీ20ల్లో మాత్రం దుబేకు మంచి రికార్డు ఉంది. లోయరార్డ్‌లో వచ్చి పవర్ హిట్టింగ్ చేసే సత్తా అతడికి ఉంది. ఈ ఏడాది ఏడాది జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో శుభమ్ దూబే అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ఈ టోర్నీలో 7 మ్యాచ్‌ల్లో 222 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా ఇప్పటివరకు 20 టీ20లు ఆడిన దుబే 485 పరుగులు చేశాడు. చదవండి: IND vs SA: సౌతాఫ్రికాతో మూడో వన్డే.. తిలక్‌పై వేటు! ఆర్సీబీ ప్లేయర్ అరంగేట్రం -
IPL 2024: ఆర్సీబీ తుది జట్టు ఇలా..?
ఐపీఎల్ 2024 సీజన్ వేలం నిన్న ముగియడంతో అన్ని ఫ్రాంచైజీల అభిమానులు తమ తమ తుది జట్లు ఇలా ఉంటే బాగుంటుందని అంచనాలు వేస్తున్నారు. ఈసారి వేలంలో అన్ని జట్లు ఆచితూచి వ్యవహరించి సమతూకమే లక్ష్యంగా కొనుగోళ్లు జరిపాయని అన్ని జట్ల ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అన్ని జట్లు ఇదివరకే ఉన్న సభ్యులకు అనుగుణంగా కొత్త వారిని తీసుకున్నారని అభిప్రాయపడుతున్నారు. ఫ్రాంచైజీల లెక్కలు సఫలీకృతమవుతాయే లేదో అన్న విషయాన్ని పక్కన పెడితే.. ఫ్యాన్స్ మాత్రం సీజన్ ప్రారంభమయ్యే వరకు కూడా ఆగలేకపోతున్నారు. మా జట్టులో పలాన వాళ్లు ఉంటారు.. వీళ్లు ఉంటేనే జట్టు సమతూకంగా ఉంటుందని విశ్లేషిస్తున్నారు. సోషల్‌మీడియా మొత్తం అభిమానుల అంచనా జట్లచే నిండిపోయింది. కొత్త జట్టుతో ఈసారి కప్ మాదే అంటూ ప్రతి ఫ్రాంచైజీ అభిమాని సంకలు గుద్దుకుంటున్నాడు. ప్రతిసారి ఈసారి కప్ మాదే అని గగ్గోలు పెట్టే ఆర్సీబీ అభిమానులు సైతం వచ్చే సీజన్ కోసం తమ అంచనా జట్లను ప్రకటిస్తున్నారు. మెజార్టీ శాతం ఆర్సీబీ అభిమానుల ప్రకారం తుది జట్టులో విదేశీ ఆటగాళ్ల కోటాలో డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్, కెమారూన్ గ్రీన్, అల్జరీ జోసఫ్ ఉంటున్నారు. దేశీయ ఆటగాళ్ల కోటాలో విరాట్ కోహ్లి, మొహమ్మద్ సిరాజ్, దినేశ్ కార్తీక్, మహిపాల్ లోమ్రార్, రజత్ పాటిదార్ ఉంటున్నారు. ఆర్సీబీ తుది జట్టు (అంచనా): విరాట్ కోహ్లి (బ్యాటర్), ఫాఫ్ డుప్లెసిస్ (బ్యాటర్/కెప్టెన్), రజత్ పాటిదార్ (ఆఫ్ స్పిన్/బ్యాటర్), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (ఆఫ్ స్పిన్/బ్యాటర్), కెమారూన్ గ్రీన్ (ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్), దినేశ్ కార్తీక్ (వికెట్‌కీపర్/బ్యాటర్), మహిపాల్ లోమ్రార్ (బ్యాటర్/లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్), కర్ణ్ శర్మ (లెగ్ స్పిన్నర్), అల్జరీ జోసఫ్ (పేస్ బౌలర్), మొహమ్మద్ సిరాజ్ (పేసర్), యశ్ దయాల్ (లెఫ్ట్ ఆర్మ్ పేసర్) -
IPL 2024: ఈసారి టైటిల్ మాదే అంటున్న సన్‌రైజర్స్ ఫ్యాన్స్..!
2013లో ఐపీఎల్‌లోకి అడుగుపెట్టి 2016 సీజన్లో విజేతగా, 2018లో రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ చాలాకాలం తర్వాత పటిష్టంగా కనిపిస్తుంది. లీగ్ ఆరంభ సీజన్లలో పర్వాలేదనిపించిన ఆరెంజ్ ఆర్మీ.. ఇటీవలి కాలంలో అధఃపాతాళానికి పడిపోయి సొంత అభిమానుల ఆగ్రహానికి కూడా గురైంది. గడిచిన మూడు సీజన్లలో ఎస్ఆర్హెచ్ ప్రదర్శన ఎంత దారుణంగా ఉండిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. 2021లో ఆఖరి స్థానం, 2022లో 10లో ఎనిమిదో స్థానం, గత సీజన్లో చివరి స్థానంలో నిలిచిన ఎస్ఆర్హెచ్.. 2024 సీజన్‌కు ముందు దాదాపుగా దుఖానం సర్దేసుకునే పరిస్థితికి వచ్చింది. అయితే తాజాగా జరిగిన వేలంలో యాజమాన్యం అవసరానికి తగ్గట్టుగా కొందరు ఆటగాళ్లను (పాట్ కమిన్స్, ట్రవిస్ హెడ్, హసరంగ, జయదేవ్ ఉనద్కత్) కొనుగోలు చేయడంతో అభిమానుల్లో ఆశలు చిగురించాయి. ప్రసుత్త జట్టుతో టైటిల్ కచ్చితంగా నెగ్గగలమని ఫ్యాన్స్ ధీమాకు వచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జట్టు సమతూకంగా ఉందని అభిప్రాయపడుతున్నారు. తుది జట్టులో ఎవరెవరిని ఆడించాలో ఇప్పటినుంచే డిసైడ్ చేస్తున్నారు. ఇప్పటికే రిటెయిన్ చేసుకున్న జట్టులో మార్క్రమ్, క్లాసెస్ లాంటి విధ్వంసకర విదేశీ బ్యాటర్లు ఉండగా.. కొత్తగా వచ్చిన కమిన్స్, హెడ్లతో విదేశీ ఆటగాళ్ల కోటా పరిపూర్ణమవుతుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. దేశీయ ఆటగాళ్ల విషయానికొస్తే.. భువనేశ్వర్ కుమార్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ, నటరాజన్, అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్ లాంటి ఆటగాళ్లు ఉండనే ఉన్నారు. స్వదేశీ, విదేశీ స్టార్ల కలయికతో ఈ సారి ట్రోఫీ మాదే అంటూ ఫ్యాన్స్ ఇప్పటినుంచే సంకలు గుద్దుకుంటున్నారు. ఐపీఎల్ 2024 కోసం సన్‌రైజర్స్ జట్టు: అబ్దుల్ సమద్ బ్యాటర్ 4 కోట్లు రాహుల్ త్రిపాఠి బ్యాటర్ 8.5 కోట్లు ఎయిడెన్ మార్క్రమ్ బ్యాటర్ 2.6 కోట్లు (కెప్టెన్) గ్లెన్ ఫిలిప్స్ బ్యాటర్ 1.5 కోట్లు హెన్రిచ్ క్లాసెన్ బ్యాటర్ 5.25 కోట్లు మయాంక్ అగర్వాల్ బ్యాటర్ 8.25 కోట్లు ట్రావిస్ హెడ్ బ్యాటర్ 6.8 కోట్లు అన్మోల్ప్రీత్ సింగ్ బ్యాటర్ 20 లక్షలు ఉపేంద్ర యాదవ్ వికెట్ కీపర్ 25 లక్షలు షాబాజ్ అహ్మద్ ఆల్ రౌండర్ 2.4 కోట్లు నితీష్ కుమార్ రెడ్డి ఆల్ రౌండర్ 20 లక్షలు అభిషేక్ శర్మ ఆల్ రౌండర్ 6.5 కోట్లు మార్కో జాన్సెన్ ఆల్ రౌండర్ 4.2 కోట్లు వాషింగ్టన్ సుందర్ ఆల్ రౌండర్ 8.75 కోట్లు సన్వీర్ సింగ్ ఆల్ రౌండర్ 20 లక్షలు పాట్ కమిన్స్ బౌలర్ 20.5 కోట్లు భువనేశ్వర్ కుమార్ బౌలర్ 4.2 కోట్లు టి నటరాజన్ బౌలర్ 4 కోట్లు వనిందు హసరంగా బౌలర్ 1.5 కోట్లు మయాంక్ మార్కండే బౌలర్ 50 లక్షలు ఉమ్రాన్ మాలిక్ బౌలర్ 4 కోట్లు ఫజల్హాక్ ఫరూకీ బౌలర్ 50 లక్షలు జయదేవ్ ఉనద్కత్ బౌలర్ 1.6 కోట్లు ఆకాశ్ సింగ్ బౌలర్ 20 లక్షలు ఝటావేద్ సుబ్రమణ్యం బౌలర్ 20 లక్షలు -
IPL 2024: 5 సిక్సర్లు బాదించుకున్న వ్యక్తికి 5 కోట్లు, కొట్టిన వ్యక్తికి 50 లక్షలు
ఐపీఎల్ 2024లో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాధించుకున్న బౌలర్‌కు 5 కోట్ల భారీ మొత్తం దక్కనుండగా.. ఆ ఐదు సిక్సర్లు బాదిన బ్యాటర్‌కు మాత్రం కేవలం 50 లక్షలే లభించనున్నాయి. ఈపాటికి విషయం అర్థమయ్యే ఉంటుంది. 2023 సీజన్లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ యశ్ దయాల్ బౌలింగ్‌లో కేకేఆర్ తురుపుముక్క రింకూ సింగ్ ఆఖరి ఓవర్లో చివరి ఐదు బంతులకు ఐదు భారీ సిక్సర్లు బాది తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. ఇది జరిగి ఏడు నెలల కాలం అయిపోయింది. ఈ విషయాన్ని దాదాపుగా అందరూ మర్చిపోయారు. అయితే నిన్న జరిగిన ఐపీఎల్ వేలం తర్వాత ఈ టాపిక్ మళ్లీ నెట్టింట హల్చల్ చేస్తుంది. pic.twitter.com/wCHjXTmZ2S — Out Of Context Cricket (@GemsOfCricket) December 20, 2023 ఎందుకుంటే.. నిన్న జరిగిన వేలంలో గుజరాత్ విడిచపెట్టిన యశ్ దయాల్‌ను ఆర్సీబీ 5 కోట్ల ఊహించని ధరకు కొనుగోలు చేసింది. యశ దయాల్ ఇంత భారీ మొత్తానికి అమ్ముడుపోతాడని అతనితో సహా ఎవరూ ఊహించి ఉండరు. అయితే ఆర్సీబీ మాత్రం యశ్‌పై భారీ విశ్వాసం ఉంచి, ఇతర ఫ్రాంచైజీలతో పోటీపడి మరీ అతన్ని దక్కించుకుంది. ఇక్కడి వరకు బాగానే ఉంది. సిక్సర్లు బాదించుకున్నవ్యక్తికే ఇంత భారీ మొత్తం లభిస్తున్నప్పుడు, ఆ సిక్సర్లు కొట్టిన రింకూ సింగ్‌కు మాత్రం ఎందుకు అంత తక్కువ మొత్తమని అతని అభిమానులు సోషల్‌మీడియాలో గగ్గోలుపెడుతున్నారు. కేకేఆర్.. రింకూని కేవలం 50 లక్షలకే దక్కించుకుని, అతన్ని తిరిగి రీటెయిన్ చేసుకుని, అతన్ని ఆర్ధికంగా ఎదగకుండా కట్టిపడేసిందని అతని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మనమన్నా, ఐపీఎల్ అన్నా గిట్టని ఆస్ట్రేలియన్లకు కోట్లకు కోట్లు కుమ్మరించిన ఫ్రాంచైజీలు, అత్యంత ప్రతిభావంతుడైన రింకూ సింగ్ విషయంలో ఒక్కసారి పునరాలోచన చేసి అతని ప్రతిభకు తగ్గ మొత్తాన్ని ఫిక్స్ చేయాలని సగటు భారత క్రికెట్ అభిమాని ఆకాంక్షిస్తున్నాడు. ఇదే సమయంలో కొందరు హర్షల్ పటేల్ (11.75 కోట్లు), శార్దూల్ ఠాకూర్ (4 కోట్లు), షారుక్ ఖాన్ (7.4 కోట్లు), శివమ్ మావీ (6.4 కోట్లు) లాంటి ఆటగాళ్ల పేర్లను ప్రస్తావిస్తూ జస్టిస్ ఫర్ రింకూ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. -
ఐపీఎల్ వేలం ఎఫెక్ట్.. బౌలర్‌ను విధ్వంసకర బ్యాటర్లా మార్చేసింది..!
ఐపీఎల్ 2024 వేలంలో తిరస్కరణకు గురైన ఇద్దరు ఆటగాళ్లు వేలం మరుసటి రోజు ఫ్రాంచైజీలపై తమ అసంతృప్తిని పరోక్షంగా వెల్లగక్కారు. వేలంలో 1.5 కోట్ల విభాగంలో పేర్లు నమోదు చేసుకుని భంగపడ్డ ఇంగ్లండ్ ఆటగాళ్లు ఫిలిప్ సాల్ట్, క్రిస్ జోర్డన్లు ఇవాళ జరిగిన వేర్వేరు మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌లో చెలరేగిపోయారు. ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమను నిర్లక్ష్యం చేశాయని భావించిన ఈ ఇద్దరూ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించారు. ఇంగ్లండ్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్.. వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో టీ20లో విధ్వంసకర శతకంతో (57 బంతుల్లో 119; 7 ఫోర్లు, 10 సిక్సర్లు) విరుచుకుపడగా.. బిగ్‌బాష్ లీగ్‌లో హోబర్ట్ హరికేన్స్‌కు ఆడుతున్న క్రిస్ జోర్డన్ 17 బంతుల్లోనే మెరుపు అర్ధశతకంతో (20 బంతుల్లో 59; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగిపోయాడు. సాల్ట్‌కు అంతర్జాతీయ టీ20ల్లో ఇది వరుసగా రెండో శతకం కాగా.. జోర్డన్, తాను బౌలర్‌ను అన్న విషయాన్ని మరిచిపోయి, బ్యాట్‌తో వీరవిహారం చేశాడు. వేలం మరుసటి రోజే ఈ ఇద్దరు ఇంగ్లండ్ ఆటగాళ్లు బ్యాట్‌తో రెచ్చిపోవడంతో ఫ్రాంచైజీలు ఆలోచనలో పడ్డాయి. వీరిద్దరి విషయంలో తప్పు చేశామని పశ్చాత్తాపపడుతున్నాయి. టీ20 స్పెషలిస్ట్‌లు అయిన సాల్ట్, జోర్డన్లను పట్టించుకోకపోవడం అన్ని ఫ్రాంచైజీలు చేసిన అతి పెద్ద తప్పిదమని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అవకాశం ఉంటే ఈ ఇద్దరినీ వచ్చే ఐపీఎల్ సీజన్లో ఆడించే ప్రయత్నం చేయాలని వారు ఫ్రాంచైజీలకు సూచిస్తున్నారు. Madness from CJ 🤯pic.twitter.com/XLS7wMAsih— CricTracker (@Cricketracker) December 20, 2023 -
IPL 2024: పొరపాటు పడ్డ ప్రీతి జింటా.. ఒకరి బదుల ఇంకొకరి కొనుగోలు..!
దుబాయ్‌లోని కోలోకోలా ఎరీనా వేదికగా నిన్న (డిసెంబర్ 19) జరిగిన ఐపీఎల్ 2024 వేలంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పంజాబ్ కింగ్స్ కో ఓనర్ ప్రీతి జింటా పొరపాటున ఓ ఆటగాడు అనుకుని మరో ఆటగాడిని కొనుగోలు చేసింది. అయితే, వెంటనే తప్పు తెలుసుకుని సరిదిద్దుకునే ప్రయత్నం చేసినప్పటికీ, అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. వేలం నిర్వహకులు సదరు ఆటగాడిని పంజాబ్ కింగ్స్‌కు లాక్ చేసేసినట్లు ప్రకటించారు. ఐపీఎల్ రూల్స్ ప్రకారం ఒక్కసారి ఆటగాడు ఫ్రాంచైజీకి లాక్ చేయబడితే తిరిగి అతన్ని వేలానికి విడిచిపెట్టడానికి వీలు ఉండదు. ఏం జరిగిందంటే.. నిన్న జరిగిన ఐపీఎల్ 2024 వేలం సందర్భంగా 32 ఏళ్ల ఛత్తీస్‌ఘడ్ ఆల్‌రౌండర్ శశాంక్ సింగ్ పేరు వేలానికి వచ్చింది. ప్రీతి జింటా, నెస్ వాడియాలతో కూడిన పంజాబ్ కింగ్స్ మేనేజ్మెంట్ పొరపాటున ఓ శశాంక్ సింగ్ అనుకుని మరో శశాంక్ సింగ్‌ను కొనుగోలు చేసింది. శశాంక్‌ను పంజాబ్ అతని కనీస ధర 20 లక్షలకు కొనుగోలు చేసింది. శశాంక్ కోసం మరే ఇతర ఫ్రాంచైజీలు పోటీపడలేదు. అయితే శశాంక్‌ను తాము సొంతం చేసుకున్నట్లు దృవీకరించబడిన తర్వాత పంజాబ్ యాజమాన్యం పొరబడ్డామని తెలుసుకుంది. Fantastic scenes here as the notoriously inept Punjab Kings manage to not only purchase a player they didn’t want, (Shashank Singh), they also admit to this in front of literally everyone. Singh we can guess is sat at home wondering whether to show up in March. #IPLAuction #pbks pic.twitter.com/PtLQv9t07H — Punjab Kings UK🇬🇧👑 (@PunjabKingsUK) December 19, 2023 అయితే అప్పటికే సమయం మించి పోవడంతో చేసేదేమీ లేక సర్దుకుపోయింది. తాము పొరబడ్డామని తెలుసుకున్న క్షణంలో పంజాబ్ కో ఓనర్ పడ్డ ఆందోళన నెట్టింట వైరలవుతుంది. ఓ శశాంక్ అనుకుని మరో శశాంక్‌ను సొంతం చేసుకున్నామని ప్రీతి జింటా బాధపడుతున్న వీడియో సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తుంది. కాగా, పంజాబ్ పొరపాటున సొంతం చేసుకున్న శశాంక్ సింగ్ ట్రాక్ రికార్డు మరీ అంత తీసి పారేయడానికి వీల్లేదు. అతను 55 టీ20ల్లో 724 పరుగులు చేసి 15 వికెట్లు పడగొట్టాడు. శశాంక్‌ను 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వేలానికి విడిచి పెట్టింది. 2023 సీజన్ వేలంలో శశాంక్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. నిన్నటి వేలంలో పంజాబ్ చేసిన పొరపాటే మరో ఫ్రాంచైజీ కూడా చేయబోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఓ ఆటగాడు అనుకుని మరో ఆటగాడి కోసం వేలంలో ప్రయత్నించింది. అయితే వారు తప్పు తెలుసుకుని డ్రాప్ అయిపోయారు. -
విరాట్ కోహ్లికి రూ.42 కోట్లు.. టీమిండియా మాజీ ఓపెనర్ సంచలన వ్యాఖ్యలు
ఐపీఎల్-2024 వేలంలో స్టార్క్‌ను రూ.24.75 కోట్ల భారీ ధరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర దక్కించుకున్న ఆటగాడిగా స్టార్క్ నిలిచాడు. అతడితో పాటు ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కూడా భారీ మొత్తం దక్కించుకున్నాడు. రూ.20.50 కోట్లకు ఎస్ఆర్హెచ్ కొనుగొలు చేసింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాళ్లు సురేష్ రైనా, ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత ఆటగాళ్ల కంటే విదేశీ ఆటగాళ్లపై ఎక్కువ మొత్తం ఫ్రాంచైజీలు వెచ్చించడాన్ని రైనా తప్పుబట్టాడు. మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ వంటి టీమిండియా స్టార్లు విదేశీ ఆటగాళ్ల కంటే తక్కువ తీసుకుంటున్నారని అతడు అన్నాడు. అదే విధంగా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ప్రస్తుతం వేలంలోకి వస్తే రూ. 42 కోట్లకు అమ్ముడుపోతాడని ఆకాష్ చోప్రా జోస్యం చెప్పాడు. అయితే అందుకు ఐపీఎల్ రూల్స్ సవరించాల్సి ఉంటుందని చోప్రా చెప్పుకొచ్చాడు. "ఐపీఎల్ రూల్స్‌లో కొన్ని మార్పులు చేయాలి. ప్రతీ ఫ్రాంచైజీ పర్స్‌ను రూ.200 కోట్లకు పెంచాలి. అందులో భారత ఆటగాళ్ల కోసం రూ.150 కోట్లు వెచ్చించేలా కండీషన్ పెట్టాలి. మిగిలిన 50 కోట్ల రూపాయలను విదేశీ క్రికెటర్ల కోసం ఉంచాలి. అప్పుడు కోహ్లి వేలంలో వస్తే 42 కోట్ల రూపాయలకు అమ్ముడుపోతాడని" జియో సినిమాతో చోప్రా పేర్కొన్నాడు. రైనా మాట్లాడుతూ.. "ప్రస్తుతం భారత స్టార్లు జస్ప్రీత్ బుమ్రాకు రూ.12 కోట్లు, మహ్మద్ షమీకి రూ.5 కోట్లు మాత్రమే ఇస్తున్నారు. ధోని కూడా కేవలం రూ.12 కోట్లకే సీఎస్కే ఆడుతున్నాడు. 8 ఏళ్ల పాటు ఐపీఎల్ ఆడని ఆటగాడికి దాదాపు రూ.25 కోట్లు ఇచ్చారు. అది సరైన నిర్ణయం కాదని అన్నాడు. చదవండి: IPL 2024 Auction: వేలంలో ఎవరూ కొనలేదు.. అక్కడ కసి చూపించేశాడు! 10 సిక్స్‌లతో విధ్వంసం -
ఐపీఎల్-2024 వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లు వీరే..
దుబాయ్‌లోని కోలోకోలా ఎరీనా వేదికగా జరిగిన ఐపీఎల్-2024 వేలంలో ఎన్నో సంచలనాలు నమోదయ్యాయి. ఆస్ట్రేలియా పేసర్లు మిచెల్ స్టార్క్, ప్యాట్ కమ్మిన్స్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరలకు అమ్ముడుపోయారు. స్టార్క్‌ను రూ.24.75 కోట్లకు కేకేఆర్ కొనుగోలు చేయగా.. కమ్మిన్స్‌ను రూ.20.50 కోట్ల భారీ ధరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. కాగా మొత్తం 77 స్ధానాల కోసం వేలం జరగగా.. ఆయా ఫ్రాంచైజీలు 72 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ఇక ఈ వేలంలో ఆసీస్ ఆటగాళ్లపై కాసుల వర్షం కురిస్తే.. మరో ఆసీస్ స్టార్ స్టీవ్ స్మిత్ మాత్రం ఆన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. రూ. 2 కోట్ల వచ్చిన స్మిత్‌ను కొనేందుకు ఏ ప్రాంచైజీ ఆసక్తి చూపలేదు. ఇక స్మిత్‌తో పాటు ఆన్‌సోల్డ్‌గా మిగిలిపోయిన టాప్ ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం. అమ్ముడుపోని ఆటగాళ్లు వీరే: స్టీవ్ స్మిత్ (కనీస ధర రూ.2 కోట్లు) వాండర్ డసెన్ (కనీస ధర రూ.2 కోట్లు) జోష్ ఇంగ్లిస్ (కనీస ధర రూ.2 కోట్లు) జేమీ ఓవర్టన్ (కనీస ధర రూ.2 కోట్లు) బెన్ డకెట్ (కనీస ధర రూ.2 కోట్లు) జేమ్స్ విన్స్ (కనీస ధర రూ.2 కోట్లు) సీన్ అబాట్ (కనీస ధర రూ.2 కోట్లు) జోష్ హేజిల్ వుడ్ (కనీస ధర రూ.2 కోట్లు) ఆదిల్ రషీద్ (కనీస ధర రూ.2 కోట్లు) జేసన్ హోల్డర్ (కనీస ధర రూ.1.50 కోట్లు) కొలీన్ మున్రో (కనీస ధర రూ.1.50 కోట్లు) టిమ్ సౌథీ (కనీస ధర రూ.1.50 కోట్లు) క్రిస్ జొర్డాన్ (కనీస ధర రూ.1.50 కోట్లు) డానియల్ సామ్స్ (కనీస ధర రూ.1.50 కోట్లు) ఫిలిప్ సాల్ట్ (కనీస ధర రూ.1.50 కోట్లు) జేమ్స్ నీషమ్ (కనీస ధర రూ.1.50 కోట్లు) టైమల్ మిల్స్ (కనీస ధర రూ.1.50 కోట్లు చదవండి: IPL 2024 Auction: వేలంలో ఎవరూ కొనలేదు.. అక్కడ కసి చూపించేశాడు! 10 సిక్స్‌లతో విధ్వంసం -
ఒకప్పుడు రూ.11 కోట్లు.. ఇప్పుడు రూ.50 లక్షలు! అయ్యో మనీష్
మనీష్ పాండే.. భారత జట్టు తరపున కంటే ఐపీఎలోనూ ఎక్కువగా గుర్తింపు పొందాడు. ముఖ్యంగా ఐపీఎల్-2014 సీజన్ విజేతగా కోల్‌కతా నైట్‌రైడర్స్ నిలవడంలో పాండేది కీలక పాత్ర. ఫైనల్‌తో పాటు లీగ్ ఆసాంతం పాండే అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. అయితే మళ్లీ 6 ఏళ్ల తర్వాత కేకేఆర్‌తో పాండే జతకట్టాడు. ఐపీఎల్-2024 వేలంలో అతడిని కేకేఆర్ సొంతం చేసుకుంది. కానీ గత సీజన్లలో కోట్లు పలికిన పాండే.. ఈసారి మాత్రం రూ.50 లక్షల కనీస ధరకే అమ్ముడుపోయాడు. ఫస్ట్ రౌండ్లో వేలానికి వచ్చిన పాండేను ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తిచూపలేదు. అనంతరం రెండో సారి వేలంలోకి వచ్చిన పాండేను కనీస ధరకు కేకేఆర్ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో పాండే ఐపీఎల్ కెరీర్‌పై ఓ లుక్కేద్దాం. ముంబైతో ఎంట్రీ.. మనీష్ పాండేను 2008 అరంగేట్ర సీజన్లో రూ. 6లక్షల కనీస ధరకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. అనంతరం 2009 సీజన్లో ఈ కర్ణాటక బ్యాటర్‌ను రూ.12 లక్షలకు ఆర్సీబీ సొంతం చేసుకుంది. ఆ తర్వాత వరుసగా పూణేవారియర్స్(రూ.20 లక్షలు), కేకేఆర్(రూ.1.70 కోట్లు)కు ప్రాతినిథ్యం వహించాడు. 2018 సీజన్‌కు ముందు కేకేఆర్ అతడిని విడిచిపెట్టింది. దీంతో మెగా వేలానికి వచ్చిన అతడిని రూ.11 కోట్ల భారీ ధరకు ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసింది. మూడు సీజన్ల పాటు సన్‌రైజర్స్ తరపున ఆడిన మనీష్.. ఐపీఎల్-2022 మెగా వేలంలోకి వచ్చాడు. ఈ క్రమంలో అతడిని రూ.4.60 కోట్లకు లక్నో సొంతం చేసుకుంది. అక్కడ కూడా మెరుగైన ప్రదర్శన చేయకపోవడంతో ఎల్ఎస్జీ విడిచిపెట్టింది. దీంతో ఐపీఎల్-2023 వేలంలో ఢిల్లీ రూ.2.40 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ అవకాశాన్ని కూడా పాండే సద్వినియోగపరచుకోలేకపోయాడు. ఢిల్లీ కూడా విడిచి పెట్టింది. దీంతో ఈసారి కేకేఆర్ ప్రాంఛైజీలో చేరాడు. మరి ఈసారి ఎలా రాణిస్తాడో వేచి చూడాలి. ఇప్పటివరకు 178 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన పాండే.. 3808 పరుగులు చేశాడు. అతడి కెరీర్లో ఐపీఎల్ సెంచరీ కూడా ఉంది. చదవండి: IPL 2024: టెన్త్ క్లాస్‌తో చదువు బంద్.. వేలంలో కోట్ల వర్షం! ఎవరీ రాబిన్ మింజ్? View this post on Instagram A post shared by Kolkata Knight Riders (@kkriders) -
హైదరాబాదంటే నాకెంతో ఇష్టం.. ఆతృతగా ఎదురుచూస్తున్నా: కమ్మిన్స్
ఐపీఎల్-2024 వేలంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్పై కాసుల వర్షం కురిసింది. రూ. 2 కోట్ల బేస్‌ప్రైస్‌తో వచ్చిన కమ్మిన్స్‌ను రూ. 20.50 కోట్ల భారీ ధరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. కమ్మిన్స్ కోసం ఆర్సీబీతో పోటీ పడి ఎస్ఆర్హెచ్ దక్కించుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర సొంతం చేసుకున్న రెండో ఆటగాడిగా కమ్మిన్స్ రికార్డులకెక్కాడు. ఇక రికార్డు ధర దక్కించుకోవడంపై కమ్మిన్స్ స్పందించాడు. "సన్‌రైజర్స్‌తో జత కట్టేందుకు అమితోత్సాహంతో ఉన్నా. ఆరెంజ్ ఆర్మీ గురించి చాలా విన్నా. హైదరాబాద్‌లో కూడా మ్యాచ్‌లు ఆడా. నాకు బాగా నచ్చింది. నాతో పాటు హెడ్ కూడా ఉన్నాడు. విజయాలతో సీజన్ సాగాలని ఆశిస్తున్నా" అని స్టార్ స్పోర్ట్స్‌తో కమ్మిన్స్ పేర్కొన్నాడు. కాగా కమ్మిన్స్‌కు గతంలో ఐపీఎల్లో ఆడిన అనువభం ఉంది. ప్యాట్ కమిన్స్ ఢిల్లీ తరఫున 12 మ్యాచ్‌లు, కోల్‌కతా తరఫున 30 మ్యాచ్‌లు ఆడి మొత్తం 45 వికెట్లు పడగొట్టాడు. 2020 వేలంలో కేకేఆర్ అతనికి రూ. 15.50 కోట్లు ఇచ్చింది. అంతర్జాతీయ షెడ్యూల్ కారణంగా 2023 సీజన్లో కమిన్స్ ఆడలేదు. వరల్డ్ కప్‌లో జట్టును విజేతగా నిలిపి అతను మళ్లీ ఇక్కడ అడుగు పెట్టాడు. చదవండి: IPL 2024: టెన్త్ క్లాస్‌తో చదువు బంద్.. వేలంలో కోట్ల వర్షం! ఎవరీ రాబిన్ మింజ్? -
వేలంలో ఎవరూ కొనలేదు.. అక్కడ కసి చూపించేశాడు! 10 సిక్స్‌లతో విధ్వంసం
ఐపీఎల్-2024 వేలంలో ఇంగ్లండ్ విధ్వంసకర ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఆన్‌సోల్డ్‌గా మిగిలిపోయిన సంగతి తెలిసిందే. రెండు రౌండ్లలో కూడా సాల్ట్‌ను సొంతం చేసుకునేందుకు ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపలేదు. అయితే వేలంలో అమ్ముడుపోకపోయిన కోపాన్ని సాల్ట్ వెస్టిండీస్‌పై చూపించాడు. మంగళవారం వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో వన్డేలో సాల్ట్ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో కరేబియన్ బౌలర్లను సాల్ట్ ఊచకోత కోశాడు. కేవలం 57 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్స్‌లతో 119 పరుగులు చేశాడు. సాల్ట్‌కు ఈ సిరీస్‌లో ఇది వరుసగా రెండో సెంచరీ. అంతేకాకుండా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఇంగ్లండ్ ఆటగాడిగా సాల్ట్ నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు అలెక్స్ హేల్స్(116) పేరిట ఉండేది. ఈ మ్యాచ్‌తో హేల్స్ రికార్డును సాల్ట్ బ్రేక్ చేశాడు. ఇక సాల్ట్ విధ్వంసకర ఇన్నింగ్స్‌ను చూసిన నెటిజన్లు.. ఫ్రాంచైజీలు అతడిని తీసుకోక తప్పు చేశాయని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. కాగా 2022, 23 సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు సాల్ట్ ప్రాతినిథ్యం వహించాడు. అయితే ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు అతడిని ఢిల్లీ విడిచిపెట్టింది. దీంతో వేలంలోకి వచ్చిన సాల్ట్ ఆన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. Stunning victory to level the series! 🦁 Scorecard: https://t.co/C5Ns5auLYY#EnglandCricket | 🏝️ #WIvENG 🏴 pic.twitter.com/OXkPqGoA9r — England Cricket (@englandcricket) December 19, 2023 చదవండి: IPL 2024: టెన్త్ క్లాస్‌తో చదువు బంద్.. వేలంలో కోట్ల వర్షం! ఎవరీ రాబిన్ మింజ్? -
టెన్త్ క్లాస్‌తో చదువు బంద్.. వేలంలో కోట్ల వర్షం! ఎవరీ రాబిన్ మింజ్?
ఐపీఎల్-2024 వేలంలో చాలా మంది భారత యువ ఆటగాళ్లపై కాసుల వర్షం కురిసింది. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఆన్క్యాప్డ్ ప్లేయర్స్ కోట్లు కుమ్మరించారు. ఈ జాబితాలో జార్ఖండ్ యువ సంచలనం రాబిన్ మింజ్ కూడా ఉన్నాడు. రాబిన్ మింజ్‌ను రూ. 3.6 కోట్ల భారీ ధరకు గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. రూ.20లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌ను సొంతం చేసుకునేందుకు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్, గుజరాత్ తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరికి గుజరాత్ దక్కించుకుంది. కాగా ఈ డీల్‌తో ఐపీఎల్ వేలం చరిత్రలో అమ్ముడుపోయిన మొట్టమొదటి గిరిజన క్రికెటర్‌గా మింజ్ నిలిచాడు. ఈ క్రమంలో రాబిన్ మింజ్ కోసం ఆసక్తిర విషయాలు తెలుసుకుందాం. ఎవరీ రాబిన్ మింజ్? 21 ఏళ్ల రాబిన్ మింజ్ జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలోని ఓ మధ్యతరగతి కుటుబంలో జన్మించాడు. అతడి తండ్రి ఇండియన్ ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన జార్ఖండ్ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీలో పనిచేస్తున్నాడు. మింజ్‌కు చిన్నతనం నుంచే క్రికెట్‌పై ఇష్టం ఎక్కువ. ఈ క్రమంలో చదువును మింజ్ పక్కన పెట్టేశాడు. మింజ్ కేవలం పదివ తరగతి వరకే చదువుకున్నాడు. ఆ తర్వాత క్లబ్ క్రికెట్, అండర్-19, అండర్-25 టోర్నీల్లో జార్ఖండ్ తరపున మింజ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. క్లబ్ క్రికెట్లో మింజ్‌కు ఏకంగా 140 పైగా స్ట్రైక్ రేట్ ఉంది. దీంతో మింజ్ ఈ ఏడాది ఆగస్టులో యూకే వేదికగా ముంబై ఇండియన్స్ ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ ట్రైనింగ్ క్యాంప్‌కు సెలక్ట్ అయ్యాడు. అదే విధంగా దేశీవాళీ టీ20 అరంగేట్రంలో కూడా మింజ్ సత్తాచాటాడు. ఒడిశా వేదిగా జరిగిన ఓ టీ20 టోర్నీలో తన తొలి మ్యాచ్‌లో మింజ్ కేవలం 35 బంతుల్లో 73 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కాగా మింజ్ టీమిండియా లెజెండ్ ఎంఎస్ ధోనిని ఆదర్శంగా తీసుకుని క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. అదే విధంగా మింజ్‌కు బౌలింగ్ చేసే సత్తా ఉంది. గుజరాత్ జట్టులో వృద్దిమన్ సాహాతో పాటు వికెట్ కీపర్ల జాబితాలో మింజ్ చేరాడు. -
రూ.24.75 కోట్లు! అస్సలు ఊహించలేదు.. షాక్‌కు గురయ్యాను: స్టార్క్
ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్-2024 వేలంలో స్టార్క్‌ను రూ.24.75 కోట్ల భారీ ధరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ సొంతం చేసుకుంది. ఈ ఆసీస్ పేసర్ కోసం ఢిల్లీ, ముంబై,గుజరాత్,కోల్‌కతా తీవ్రంగా పోటీ పడ్డాయి. కానీ చివరి వరకు ఎక్కడ తగ్గని కేకేఆర్.. ఈ యార్కర్ల కింగ్‌ను దక్కించుకుంది. అంతకంటే ముందు ఇదే వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న ప్యాట్ కమ్మిన్స్(రూ.20.50 కోట్లు) రికార్డును స్టార్క్ బ్రేక్ చేశాడు. ఇక ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర దక్కడంపై స్టార్క్ స్పందించాడు. "నిజంగానే షాక్‌కు గురయ్యాను. ఇంత మొత్తాన్ని అసలు ఊహించలేదు. ఎనిమిదేళ్ల తర్వాత ప్రపంచంలోని అత్యుత్తమ టీ20 లీగ్‌లో మళ్లీ ఆడేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా. ఇప్పుడు విలువ పెరిగినా నా ఆటతీరు ఎప్పుడూ మారలేదు. భారీ మొత్తం కాబట్టి ఒత్తిడి సహజమే అయినా... నాకున్న అనుభవంతో మంచి ఫలితాలు సాధిస్తాననే నమ్మకం ఉందని" స్టార్ స్పోర్ట్స్‌తో స్టార్క్ పేర్కొన్నాడు. కాగా మిచెల్ స్టార్క్ గతంలో ఐపీఎల్లో ఆడిన అనుభవం పెద్దగా లేదు. అతడు కేవలం రెండు సార్లు మాత్రమే ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ఆడాడు. 2014, 15 సీజన్లలో ఆర్సీబీ తరపున స్టార్క్ ప్రాతినిథ్యం వహించాడు. 27 మ్యాచ్‌లలో 7.16 ఎకానమీతో 34 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత వేర్వేరు కారణాలతో అతను ఎనిమిది సీజన్ల పాటు లీగ్‌కు దూరంగా ఉన్నాడు. 2018లో కోల్‌కతా అతడిని ఎంచుకున్నా... గాయంతో టోర్నీకి ముందే తప్పుకున్నాడు. చదవండి: ENG vs WI: ఇదేమి విధ్వంసం.. ఏకంగా 267 పరుగులు! పాపం విండీస్ -
IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇదే..!
డేవిడ్ వార్నర్ బ్యాటర్ 6.25 కోట్లు రిషబ్ పంత్ వికెట్ కీపర్ 16 కోట్లు (కెప్టెన్) ఇషాంత్ శర్మ బౌలర్ 50 లక్షలు అభిషేక్ పోరెల్ వికెట్ కీపర్ 20 లక్షలు మిచెల్ మార్ష్ ఆల్ రౌండర్ 6.5 కోట్లు అన్రిచ్ నోర్ట్జే బౌలర్ 6.5 కోట్లు పృథ్వీ షా బ్యాటర్ 7.5 కోట్లు కుల్దీప్ యాదవ్ బౌలర్ 2 కోట్లు ప్రవీణ్ దూబే బౌలర్ 50 లక్షలు విక్కీ ఓస్త్వాల్ ఆల్ రౌండర్ 20 లక్షలు లుంగీ ఎంగిడి బౌలర్ 50 లక్షలు ఖలీల్ అహ్మద్ బౌలర్ 5.25 కోట్లు ముఖేష్ కుమార్ బౌలర్ 5.5 కోట్లు అక్షర్ పటేల్ ఆల్ రౌండర్ 9 కోట్లు యష్ ధుల్ బ్యాటర్ 50 లక్షలు లలిత్ యాదవ్ ఆల్ రౌండర్ 65 లక్షలు హ్యారీ బ్రూక్ బ్యాటర్ 4 కోట్లు ట్రిస్టన్ స్టబ్స్ వికెట్ కీపర్ 50 లక్షలు రికీ భుయ్ వికెట్ కీపర్ 20 లక్షలు కుమార్ కుషాగ్రా వికెట్ కీపర్ 7.2 కోట్లు రసిఖ్ దార్ బౌలర్ 20 లక్షలు జై రిచర్డ్సన్ బౌలర్ 5 కోట్లు సుమీత్ కుమార్ బౌలర్ 1 కోటి షాయ్ హోప్ వికెట్ కీపర్ 75 లక్షలు స్వస్తిక్ చికారా బ్యాటర్ 20 లక్షలు స్క్వాడ్ బలం – 25 (భారతీయ ఆటగాళ్లు-17, ఓవర్సీస్ ప్లేయర్స్-8) మిగిలిన పర్స్- 9.90 కోట్లు -
IPL 2024: కోల్‌కతా నైట్‌రైడర్స్ వీరే..!
శ్రేయస్ అయ్యర్ బ్యాటర్ 12.5 కోట్లు (కెప్టెన్) ఆండ్రీ రస్సెల్ ఆల్ రౌండర్ 12 కోట్లు వరుణ్ చక్రవర్తి బౌలర్ 12 కోట్లు నితీష్ రాణా ఆల్ రౌండర్ 8 కోట్లు వెంకటేష్ అయ్యర్ ఆల్ రౌండర్ 8 కోట్లు సునీల్ నరైన్ బౌలర్ 6 కోట్లు జాసన్ రాయ్ బ్యాటర్ 2.8 కోట్లు వైభవ్ అరోరా బౌలర్ 60 లక్షలు రింకూ సింగ్ బ్యాటర్ 55 కోట్లు రహ్మానుల్లా గుర్బాజ్ కీపర్-బ్యాటర్ 50 లక్షలు సుయాష్ శర్మ బౌలర్ 20 లక్షలు హర్షిత్ రాణా బౌలర్ 20 లక్షలు అనుకుల్ రాయ్ ఆల్ రౌండర్ 20 లక్షలు కేఎస్ భారత్ కీపర్-బ్యాటర్ 50 లక్షలు చేతన్ సకారియా బౌలర్ 50 లక్షలు మిచెల్ స్టార్క్ బౌలర్ 24.75 కోట్లు రమణదీప్ సింగ్ ఆల్ రౌండర్ 20 లక్షలు అంగ్క్రిష్ రఘువంశీ బ్యాటర్ 20 లక్షలు షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ బ్యాటర్ 1.50 కోట్లు మనీష్ పాండే బ్యాటర్ 50 లక్షలు ముజీబ్-ఉర్-రెహ్మాన్ బౌలర్ 2 కోట్లు గస్ అట్కిన్సన్ బౌలర్ 1 కోటి సాకిబ్ హుస్సేన్ బౌలర్ 20 లక్షలు స్క్వాడ్ బలం - 23 (భారతీయ ఆటగాళ్లు-15, ఓవర్సీస్ ప్లేయర్స్-8) మిగిలిన పర్స్- 1.35 కోట్లు -
IPL 2024: లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఇదే..!
కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ INR 15 కోట్లు (కెప్టెన్) ఆయుష్ బదోని బ్యాటర్ INR 20 లక్షలు దీపక్ హుడా ఆల్ రౌండర్ 5.75 కోట్లు రవి బిష్ణోయ్ బౌలర్ INR 4 కోట్లు కృనాల్ పాండ్యా ఆల్ రౌండర్ 8.25 కోట్లు యుధ్వీర్ సింగ్ ఆల్ రౌండర్ INR 20 లక్షలు ప్రేరక్ మన్కడ్ ఆల్ రౌండర్ INR 20 లక్షలు యశ్ ఠాకూర్ బౌలర్ 45 లక్షలు అమిత్ మిశ్రా బౌలర్ 50 లక్షలు మయాంక్ యాదవ్ బౌలర్ 20 లక్షలు మొహ్సిన్ ఖాన్ బౌలర్ 20 లక్షలు క్వింటన్ డికాక్ వికెట్ కీపర్ INR 6.75 కోట్లు నికోలస్ పూరన్ బ్యాటర్ INR 16 కోట్లు కైల్ మేయర్స్ ఆల్ రౌండర్ INR 50 లక్షలు మార్కస్ స్టోయినిస్ ఆల్ రౌండర్ INR 11 కోట్లు నవీన్-ఉల్-హక్ బౌలర్ 50 లక్షలు కె గౌతమ్ బౌలర్ INR 90 లక్షలు మార్క్ వుడ్ బౌలర్ INR 7.5 కోట్లు దేవదత్ పడిక్కల్ (ట్రేడెడ్) బ్యాటర్ INR 7.75 కోట్లు శివమ్ మావి బౌలర్ 6.4 కోట్లు అర్షిన్ కులకర్ణి ఆల్ రౌండర్ INR 20 లక్షలు ఎం సిద్ధార్థ్ బౌలర్ 2.4 కోట్లు యాష్టన్ టర్నర్ బ్యాటర్ INR 1 కోటి డేవిడ్ విల్లీ ఆల్ రౌండర్ INR 2 కోట్లు మహ్మద్ అర్షద్ ఖాన్ బౌలర్ 20 లక్షలు స్క్వాడ్ బలం- 25 (భారతీయ ఆటగాళ్లు-17, ఓవర్సీస్ ప్లేయర్స్-8) మిగిలిన పర్స్- INR 0.95 కోట్లు -
IPL 2024: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇదే..!
అబ్దుల్ సమద్ బ్యాటర్ 4 కోట్లు రాహుల్ త్రిపాఠి బ్యాటర్ 8.5 కోట్లు ఎయిడెన్ మార్క్రమ్ బ్యాటర్ 2.6 కోట్లు (కెప్టెన్) గ్లెన్ ఫిలిప్స్ బ్యాటర్ 1.5 కోట్లు హెన్రిచ్ క్లాసెన్ బ్యాటర్ 5.25 కోట్లు మయాంక్ అగర్వాల్ బ్యాటర్ 8.25 కోట్లు ట్రావిస్ హెడ్ బ్యాటర్ 6.8 కోట్లు అన్మోల్ప్రీత్ సింగ్ బ్యాటర్ 20 లక్షలు ఉపేంద్ర యాదవ్ వికెట్ కీపర్ 25 లక్షలు షాబాజ్ అహ్మద్ ఆల్ రౌండర్ 2.4 కోట్లు నితీష్ కుమార్ రెడ్డి ఆల్ రౌండర్ 20 లక్షలు అభిషేక్ శర్మ ఆల్ రౌండర్ 6.5 కోట్లు మార్కో జాన్సెన్ ఆల్ రౌండర్ 4.2 కోట్లు వాషింగ్టన్ సుందర్ ఆల్ రౌండర్ 8.75 కోట్లు సన్వీర్ సింగ్ ఆల్ రౌండర్ 20 లక్షలు పాట్ కమిన్స్ బౌలర్ 20.5 కోట్లు భువనేశ్వర్ కుమార్ బౌలర్ 4.2 కోట్లు టి నటరాజన్ బౌలర్ 4 కోట్లు వనిందు హసరంగా బౌలర్ 1.5 కోట్లు మయాంక్ మార్కండే బౌలర్ 50 లక్షలు ఉమ్రాన్ మాలిక్ బౌలర్ 4 కోట్లు ఫజల్హాక్ ఫరూకీ బౌలర్ 50 లక్షలు జయదేవ్ ఉనద్కత్ బౌలర్ 1.6 కోట్లు ఆకాశ్ సింగ్ బౌలర్ 20 లక్షలు ఝటావేద్ సుబ్రమణ్యం బౌలర్ 20 లక్షలు స్క్వాడ్ బలం - 25 (భారతీయ ఆటగాళ్లు-18, ఓవర్సీస్ ప్లేయర్స్-7) మిగిలిన పర్స్- 3.2 కోట్లు -
IPL 2024: గుజరాత్ టైటాన్స్ జట్టు ఇదే..!
శుభమన్ గిల్ బ్యాటర్ 7 కోట్లు (కెప్టెన్) డేవిడ్ మిల్లర్ బ్యాటర్ 3 కోట్లు మాథ్యూ వేడ్ వికెట్ కీపర్బ్యాటర్ 2.40 కోట్లు వృద్ధిమాన్ సాహా వికెట్ కీపర్బ్యాటర్ 1.90 కోట్లు కేన్ విలియమ్సన్ బ్యాటర్ 2 కోట్లు అభినవ్ మనోహర్ బ్యాటర్ 2.60 కోట్లు సాయి సుదర్శన్ కొట్టు 20 లక్షలు దర్శన్ నల్కండే బౌలర్ 20 లక్షలు విజయ్ శంకర్ ఆల్ రౌండర్ 1.40 కోట్లు జయంత్ యాదవ్ బౌలర్ 1.70 కోట్లు రాహుల్ తెవాటియా ఆల్ రౌండర్ 9 కోట్లు మహ్మద్ షమీ బౌలర్ 6.25 కోట్లు నూర్ అహ్మద్ బౌలర్ 30 లక్షలు ఆర్ సాయి కిషోర్ బౌలర్ 3 కోట్లు రషీద్ ఖాన్ బౌలర్ 15 కోట్లు జాషువా లిటిల్ బౌలర్ 4.40 కోట్లు మోహిత్ శర్మ బౌలర్ 50 లక్షలు అజ్మతుల్లా ఒమర్జాయ్ ఆల్ రౌండర్ 50 లక్షలు ఉమేష్ యాదవ్ బౌలర్ 5.80 కోట్లు షారుక్ ఖాన్ ఆల్ రౌండర్ 7.40 కోట్లు సుశాంత్ మిశ్రా బౌలర్ 2.20 కోట్లు కార్తీక్ త్యాగి బౌలర్ 60 లక్షలు మానవ్ సుతార్ బౌలర్ 20 లక్షలు స్పెన్సర్ జాన్సన్ బౌలర్ 10 కోట్లు రాబిన్ మింజ్ వికెట్ కీపర్/బ్యాటర్ 3.60 కోట్లు స్క్వాడ్ బలం - 25 (భారతీయ ఆటగాళ్లు - 17, ఓవర్సీస్ ప్లేయర్స్ - 8) మిగిలిన పర్స్- 7.85 కోట్లు -
IPL 2024: రాజస్థాన్ రాయల్స్ వీరే..!
సంజు శాంసన్ వికెట్కీపర్బ్యాటర్ 14 కోట్లు (కెప్టెన్) జోస్ బట్లర్ వికెట్కీపర్బ్యాటర్ 10 కోట్లు ప్రసిద్ధ్ కృష్ణ బౌలర్ 10 కోట్లు షిమ్రోన్ హెట్ర్మైర్ బ్యాటర్ 8.5 కోట్లు ట్రెంట్ బౌల్ట్ బౌలర్ 8 కోట్లు యుజ్వేంద్ర చహల్ బౌలర్ 6.5 కోట్లు అశ్విన్ ఆల్ రౌండర్ 5 కోట్లు యశస్వి జైస్వాల్ బ్యాటర్ 4 కోట్లు రియాన్ పరాగ్ ఆల్ రౌండర్ 3.8 కోట్లు నవదీప్ సైనీ బౌలర్ 2.6 కోట్లు ఆడమ్ జంపా బౌలర్ 1.6 కోట్లు సందీప్ శర్మ బౌలర్ 50 లక్షలు డోనోవన్ ఫెరీరా బౌలర్ 50 లక్షలు కుల్దీప్ సేన్ బౌలర్ 20 లక్షలు ధృవ్ జురెల్ వికెట్ కీపర్బ్యాటర్ 20 లక్షలు కునాల్ సింగ్ రాథోడ్ వికెట్ కీపర్బ్యాటర్ 20 లక్షలు రోవ్‌మన్ పావెల్ బ్యాటర్ 7.4 కోట్లు శుభమ్ దూబే బ్యాటర్ 5.8 కోట్లు టామ్ కోహ్లర్ కాడ్మోర్ వికెట్ కీపర్ బ్యాటర్ 40 లక్షలు అవేష్ ఖాన్ బౌలర్ 10 కోట్లు స్క్వాడ్ బలం - 20 (భారతీయ ఆటగాళ్లు-13, ఓవర్సీస్ ప్లేయర్స్-7) మిగిలిన పర్స్- 90 లక్షలు -
IPL 2024: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇదే..!
ఎంఎస్ ధోని వికెట్కీపర్బ్యాటర్ 12 కోట్లు (కెప్టెన్) డెవాన్ కాన్వే బ్యాటర్ కోటి రుతురాజ్ గైక్వాడ్ బ్యాటర్ 6 కోట్లు అజింక్య రహానే బ్యాటర్ 50 లక్షలు అజయ్ మండల్ ఆల్ రౌండర్ 20 లక్షలు నిశాంత్ సింధు ఆల్ రౌండర్ 60 లక్షలు మొయిన్ అలీ ఆల్ రౌండర్ 8 కోట్లు శివమ్ దూబే ఆల్ రౌండర్ 4 కోట్లు రాజవర్ధన్ హంగర్గేకర్ బౌలర్ 1.5 కోట్లు షేక్ రషీద్ బ్యాటర్ 20 లక్షలు మిచెల్ సాంట్నర్ ఆల్ రౌండర్ 1.9 కోట్లు రవీంద్ర జడేజా ఆల్ రౌండర్ 16 కోట్లు తుషార్ దేశ్‌పాండే బౌలర్ 20 లక్షలు ముఖేష్ చౌదరి బౌలర్ 20 లక్షలు మతీషా పతిరణ బౌలర్ 20 లక్షలు సిమ్రన్‌జీత్ సింగ్ బౌలర్ 20 లక్షలు దీపక్ చాహర్ బౌలర్ 14 కోట్లు ప్రశాంత్ సోలంకి బౌలర్ 1.2 కోట్లు మహేశ్ తీక్షణ బౌలర్ 70 లక్షలు రచిన్ రవీంద్ర బ్యాటర్ 1.8 కోట్లు శార్దూల్ ఠాకూర్ ఆల్ రౌండర్ 4 కోట్లు డారిల్ మిచెల్ ఆల్ రౌండర్ 14 కోట్లు సమీర్ రిజ్వీ బ్యాటర్ 8.4 కోట్లు ముస్తాఫిజుర్ రెహమాన్ బౌలర్ 2 కోట్లు అవినాష్ రావు ఆరవెల్లి కొట్టు 20 లక్షలు స్క్వాడ్ బలం - 25 మిగిలిన పర్స్- కోటి -
IPL 2024: ముంబై ఇండియన్స్ జట్టు ఇదే..!
రోహిత్ శర్మ బ్యాట్స్‌మన్ 16 కోట్లు జస్ప్రీత్ బుమ్రా బౌలర్ 12 కోట్లు సూర్యకుమార్ యాదవ్ బ్యాట్స్‌మన్ 8 కోట్లు ఇషాన్ కిషన్ బ్యాట్స్‌మన్ 15.25 కోట్లు డెవాల్డ్ బ్రెవిస్ బ్యాట్స్‌మన్ 3 కోట్లు తిలక్ వర్మ బ్యాట్స్‌మెన్ 1.7 కోట్లు హార్దిక్ పాండ్యా ఆల్ రౌండర్ 15 కోట్లు (కెప్టెన్) టిమ్ డేవిడ్ ఆల్ రౌండర్ 8.25 కోట్లు అర్జున్ టెండూల్కర్ బౌలర్ 30 లక్షలు కుమార్ కార్తికేయ బౌలర్ 20 లక్షలు జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ బౌలర్ 75 లక్షలు ఆకాష్ మధ్వల్ బౌలర్ 20 లక్షలు విష్ణు వినోద్ వికెట్ కీపర్ 20 లక్షలు రొమారియో షెపర్డ్ ఆల్ రౌండర్ 50 లక్షలు షామ్స్ ములానీ ఆల్ రౌండర్ 20 లక్షలు నేహాల్ వధేరా బ్యాటర్ 20 లక్షలు పీయూష్ చావ్లా బౌలర్ 50 లక్షలు గెరాల్డ్ కోయెట్జీ ఆల్ రౌండర్ 5 కోట్లు దిల్షాన్ మధుశంక బౌలర్ 4.6 కోట్లు శ్రేయాస్ గోపాల్ బౌలర్ 20 లక్షలు నువాన్ తుషార బౌలర్ 4.8 కోట్లు నమన్ ధీర్ ఆల్ రౌండర్ 20 లక్షలు అన్షుల్ కాంబోజ్ బౌలర్ 20 లక్షలు మహ్మద్ నబీ ఆల్ రౌండర్ 1.5 కోట్లు శివాలిక్ శర్మ ఆల్ రౌండర్ 20 లక్షలు స్క్వాడ్ బలం - 25 (భారతీయ ఆటగాళ్లు-17, ఓవర్సీస్ ప్లేయర్స్-8) మిగిలిన పర్స్- 1.05 కోట్లు -
IPL 2024: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇదే..!
ఫాఫ్ డుప్లెసిస్ బ్యాటర్ 7 కోట్లు (కెప్టెన్) విరాట్ కోహ్లీ బ్యాటర్ 15 కోట్లు గ్లెన్ మాక్స్వెల్ ఆల్ రౌండర్ 11 కోట్లు మహ్మద్ సిరాజ్ బౌలర్ 7 కోట్లు దినేష్ కార్తీక్ వికెట్‌కీపర్-బ్యాటర్ 5.5 కోట్లు వైషాక్ విజయ్‌కుమార్ బౌలర్ 20 లక్షలు మనోజ్ భాండగే ఆల్ రౌండర్ 20 లక్షలు రజత్ పాటిదార్ బ్యాటర్ 20 లక్షలు అనూజ్ రావత్ వికెట్‌కీపర్-బ్యాటర్ 3.4 కోట్లు సుయాష్ ప్రభుదేశాయి ఆల్ రౌండర్ 30 లక్షలు ఆకాష్ దీప్ బౌలర్ 20 లక్షలు రీస్ టాప్లీ బౌలర్ 1.9 కోట్లు రాజన్ కుమార్ బౌలర్ 70 లక్షలు హిమాన్షు శర్మ ఆల్ రౌండర్ 20 లక్షలు కర్ణ్ శర్మ బౌలర్ 50 లక్షలు మహిపాల్ లోమ్రోర్ బ్యాటర్ 95 లక్షలు విల్ జాక్స్ ఆల్ రౌండర్ 3.2 కోట్లు కామెరాన్ గ్రీన్ ఆల్ రౌండర్ 17.5 కోట్లు అల్జరీ జోసెఫ్ బౌలర్ 11.5 కోట్లు యశ్ దయాళ్ బౌలర్ 5 కోట్లు టామ్ కర్రన్ ఆల్ రౌండర్ 1.5 కోట్లు లాకీ ఫెర్గూసన్ బౌలర్ 2 కోట్లు స్వప్నిల్ సింగ్ ఆల్ రౌండర్ 20 లక్షలు సౌరవ్ చౌహాన్ ఆల్ రౌండర్ 20 లక్షలు మయాంక్ డాగర్ ఆల్ రౌండర్ 1.8 కోట్లు స్క్వాడ్ బలం - 25 (భారతీయ ఆటగాళ్లు -17, విదేశీ ప్లేయర్స్ - 8) మిగిలిన పర్స్ - 2.85 కోట్లు -
IPL 2024: పంజాబ్ కింగ్స్ జట్టు ఇదే..!
వేలం తర్వాత పంజాబ్ కింగ్స్ జట్టు ఇదే.. సామ్ కర్రన్ ఆల్ రౌండర్ 18.5 కోట్లు లియామ్ లివింగ్‌స్టోన్ ఆల్ రౌండర్ 11.5 కోట్లు కగిసో రబడ బౌలర్ 9.25 కోట్లు శిఖర్ ధవన్ బ్యాటర్ 8.25 కోట్లు (కెప్టెన్) రిలీ రొస్సో బ్యాటర్ 8 కోట్లు జానీ బెయిర్‌స్టో బ్యాటర్/వికెట్ కీపర్ 6.75 కోట్లు రాహుల్ చాహర్ బౌలర్ 5.25 కోట్లు అర్ష్‌దీప్ సింగ్ బౌలర్ 4 కోట్లు హర్‌ప్రీత్ బ్రార్ ఆల్ రౌండర్ 3.8 కోట్లు నాథన్ ఎల్లిస్ బౌలర్ 75 లక్షలు ప్రభసిమ్రాన్ సింగ్ బ్యాటర్/వికెట్ కీపర్ 60 లక్షలు రిషి ధవన్ ఆల్ రౌండర్ 55 లక్షలు సికందర్ రజా ఆల్ రౌండర్ 50 లక్షలు హర్‌ప్రీత్ సింగ్ బ్యాటర్ 40 లక్షలు అథర్వ తైదే ఆల్ రౌండర్ 20 లక్షలు విద్వాత్ కవేరప్ప బౌలర్ 20 లక్షలు శివమ్ సింగ్ ఆల్ రౌండర్ 20 లక్షలు జితేష్ శర్మ బ్యాటర్/వికెట్ కీపర్ 20 లక్షలు హర్షల్ పటేల్ బౌలర్ 11.75 కోట్లు క్రిస్ వోక్స్ ఆల్ రౌండర్ 4.2 కోట్లు అశుతోష్ శర్మ ఆల్ రౌండర్ 20 లక్షలు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఆల్ రౌండర్ 20 లక్షలు శశాంక్ సింగ్ ఆల్ రౌండర్ 20 లక్షలు తనయ్ త్యాగరాజన్ ఆల్ రౌండర్ 20 లక్షలు ప్రిన్స్ చౌదరి బ్యాటర్ 20 లక్షలు స్క్వాడ్ బలం - 25 (భారతీయులు-17, విదేశీ ఆటగాళ్లు-8) మిగిలిన పర్స్ విలువ - 12.15 కోట్లు -
2024 ఐపీఎల్ వేలంలో కొనుగోలు చేయబడ్డ ఆటగాళ్లు వీరే..!
దుబాయ్‌లోని కోలోకోలా ఎరీనా వేదికగా ఇవాళ (డిసెంబర్ 19) జరిగిన ఐపీఎల్ 2024 వేలం ఆసక్తికరంగా సాగింది. మొత్తం 77 స్లాట్ల కోసం వేలం జరగగా.. ఆయా ఫ్రాంచైజీలు 72 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ఈ వేలంలో మిచెల్ స్టార్క్ అత్యధిక ధర పలికిన క్యాప్డ్ ప్లేయర్ కాగా.. సమీర్ రిజ్వి అత్యధిక ధర పలికిన అన్ క్యాప్డ్ ప్లేయర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2024 వేలం 2024 ఆయా ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్న ఆటగాళ్ల జాబితా: రోవ్‌మన్ పావెల్ (రూ. 7.40 కోట్లు); రాజస్థాన్ రాయల్స్ హ్యారీ బ్రూక్ (రూ. 4 కోట్లు); ఢిల్లీ క్యాపిటల్స్ ట్రావిస్ హెడ్ (రూ. 6.80 కోట్లు); సన్‌రైజర్స్ హైదరాబాద్ వనిందు హసరంగ (రూ. 1.50 కోట్లు); సన్‌రైజర్స్ హైదరాబాద్ రచిన్ రవీంద్ర (రూ. 1.80 కోట్లు); చెన్నై సూపర్ కింగ్స్ శార్దూల్ ఠాకూర్ (రూ. 4 కోట్లు); చెన్నై సూపర్ కింగ్స్ అజ్మతుల్లా ఒమర్జాయ్ (రూ. 50 లక్షలు); గుజరాత్ టైటాన్స్ పాట్ కమిన్స్ (రూ. 20.50 కోట్లు); సన్‌రైజర్స్ హైదరాబాద్ గెరాల్డ్ కోయెట్జీ (రూ. 5 కోట్లు); ముంబై ఇండియన్స్ హర్షల్ పటేల్ (రూ. 11.75 కోట్లు); పంజాబ్ కింగ్స్ డారిల్ మిచెల్ (రూ. 14 కోట్లు); చెన్నై సూపర్ కింగ్స్ క్రిస్ వోక్స్ (రూ. 4.20 కోట్లు); పంజాబ్ కింగ్స్ ట్రిస్టన్ స్టబ్స్ (రూ. 50 లక్షలు); ఢిల్లీ క్యాపిటల్స్ కేఎస్ భరత్ (రూ. 50 లక్షలు); కోల్‌కతా నైట్ రైడర్స్ చేతన్ సకారియా (రూ. 50 లక్షలు); కోల్‌కతా నైట్ రైడర్స్ అల్జరీ జోసెఫ్ (రూ. 11.50 కోట్లు); రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమేష్ యాదవ్ (రూ. 5.80 కోట్లు); గుజరాత్ టైటాన్స్ శివమ్ మావి (రూ. 6.40 కోట్లు); లక్నో సూపర్ జెయింట్స్ మిచెల్ స్టార్క్ (రూ. 24.75 కోట్లు); కోల్‌కతా నైట్ రైడర్స్ జయదేవ్ ఉనద్కత్ (రూ. 1.60 కోట్లు); సన్‌రైజర్స్ హైదరాబాద్ దిల్షన్ మధుశంక (4.60 కోట్లు); ముంబై ఇండియన్స్ శుభమ్ దూబే (రూ. 5.80 కోట్లు); రాజస్థాన్ రాయల్స్ సమీర్ రిజ్వీ (8.40 కోట్లు); చెన్నై సూపర్ కింగ్స్ అంగ్క్రిష్ రఘువంశీ (రూ. 20 లక్షలు); కోల్‌కతా నైట్ రైడర్స్ అర్షిన్ కులకర్ణి (రూ. 20 లక్షలు); లక్నో సూపర్ జెయింట్స్ షారుక్ ఖాన్ (రూ. 7.40 కోట్లు); గుజరాత్ టైటాన్స్ రమణదీప్ సింగ్ (రూ. 60 లక్షలు); కోల్‌కతా నైట్ రైడర్స్ టామ్ కోహ్లర్ కాడ్మోర్ (రూ. 40 లక్షలు); రాజస్థాన్ రాయల్స్ రికీ భుయ్ (రూ. 20 లక్షలు); ఢిల్లీ క్యాపిటల్స్ కుమార్ కుషాగ్రా (రూ. 7.20 కోట్లు); ఢిల్లీ క్యాపిటల్స్ యష్ దయాల్ (రూ. 5 కోట్లు); రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సుశాంత్ మిశ్రా (రూ. 2.20 కోట్లు); గుజరాత్ టైటాన్స్ ఆకాశ్ సింగ్ (రూ. 20 లక్షలు); సన్‌రైజర్స్ హైదరాబాద్ కార్తీక్ త్యాగి (రూ. 60 లక్షలు); గుజరాత్ టైటాన్స్ రాసిఖ్ దార్ (రూ. 20 లక్షలు); ఢిల్లీ క్యాపిటల్స్ మానవ్ సుతార్ (రూ. 20 లక్షలు); గుజరాత్ టైటాన్స్ ఎం సిద్ధార్థ్ (రూ. 2.40 కోట్లు); లక్నో సూపర్ జెయింట్స్ శ్రేయాస్ గోపాల్ (రూ. 20 లక్షలు); ముంబై ఇండియన్స్ షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (రూ. 1.5 కోట్లు); కోల్‌కతా నైట్ రైడర్స్ ఆష్టన్ టర్నర్ (రూ. 1 కోటి); లక్నో సూపర్ జెయింట్స్ టామ్ కర్రన్ (1.50 కోట్లు); రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డేవిడ్ విల్లీ (2 కోట్లు); లక్నో సూపర్ జెయింట్స్ స్పెన్సర్ జాన్సన్ (రూ. 10 కోట్లు); గుజరాత్ టైటాన్స్ ముస్తాఫిజుర్ రెహమాన్ (రూ. 2 కోట్లు); చెన్నై సూపర్ కింగ్స్ జై రిచర్డ్సన్ (రూ. 5 కోట్లు); ఢిల్లీ క్యాపిటల్స్ నువాన్ తుషార (రూ. 4.80 కోట్లు); ముంబై ఇండియన్స్ నమన్ ధీర్ (రూ. 20 లక్షలు); ముంబై ఇండియన్స్ అన్షుల్ కాంబోజ్ (రూ. 20 లక్షలు); ముంబై ఇండియన్స్ సుమిత్ కుమార్ (రూ. 1 కోటి); ఢిల్లీ క్యాపిటల్స్ అశుతోష్ శర్మ (రూ. 20 లక్షలు); పంజాబ్ కింగ్స్ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ (రూ. 20 లక్షలు); పంజాబ్ కింగ్స్ శశాంక్ సింగ్ (రూ. 20 లక్షలు); పంజాబ్ కింగ్స్ తనయ్ త్యాగరాజన్ (రూ. 20 లక్షలు); పంజాబ్ కింగ్స్ రాబిన్ మింజ్ (3.60 కోట్లు); గుజరాత్ టైటాన్స్ ప్రిన్స్ చౌదరి (రూ. 20 లక్షలు); పంజాబ్ కింగ్స్ జాతవేద్ సుబ్రమణ్యన్ (రూ. 20 లక్షలు); సన్‌రైజర్స్ హైదరాబాద్ రిలీ రోసౌ (రూ. 8 కోట్లు); పంజాబ్ కింగ్స్ అర్షద్ ఖాన్ (రూ. 20 లక్షలు); లక్నో సూపర్ జెయింట్స్ ముమ్మద్ నబీ (రూ. 1.50 కోట్లు); ముంబై ఇండియన్స్ షాయ్ హోప్ (రూ. 75 లక్షలు); ఢిల్లీ క్యాపిటల్స్ గుస్ అట్కిన్సన్ (రూ. 1 కోటి); కోల్‌కతా నైట్ రైడర్స్ స్వస్తిక్ చికారా (రూ. 20 లక్షలు); ఢిల్లీ క్యాపిటల్స్ అబిద్ ముస్తాక్ (రూ. 20 లక్షలు); రాజస్థాన్ రాయల్స్ శివాలిక్ శర్మ (రూ. 20 లక్షలు); ముంబై ఇండియన్స్ స్వప్నిల్ సింగ్ (రూ. 20 లక్షలు); రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అవినాష్ రావు ఆరవెల్లి (రూ. 20 లక్షలు); చెన్నై సూపర్ కింగ్స్ నాండ్రే బర్గర్ (రూ. 50 లక్షలు); రాజస్థాన్ రాయల్స్ సాకిబ్ హుస్సేన్ (రూ. 20 లక్షలు); కోల్‌కతా నైట్ రైడర్స్ సౌరవ్ చౌహాన్ (రూ. 20 లక్షలు); రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లాకీ ఫెర్గూసన్ (రూ. 2 కోట్లు); రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముజీబ్ ఉర్ రెహమాన్ (రూ. 2 కోట్లు); కోల్‌కతా నైట్ రైడర్స్ మనీశ్ పాండే (రూ. 50 లక్షలు); కోల్‌కతా నైట్ రైడర్స్ -
IPL 2024 Auction: స్టార్క్‌కు లభించే మొత్తం ఐపీఎల్ ప్రైజ్‌మనీ కంటే ఎక్కువ..!
దుబాయ్‌లోని కోకోకోలా ఎరీనాలో ఇవాళ (డిసెంబర్ 19) జరుగుతున్న ఐపీఎల్ 2024 వేలంలో ఆసీస్ స్పీడ్‌స్టర్ మిచెల్ స్టార్క్‌కు ఊహకందని ధర దక్కిన విషయం తెలిసిందే. స్టార్క్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ రికార్డు స్థాయిలో 24.75 కోట్లకు సొంతం చేసుకుంది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే ఓ ఆటగాడికి దక్కిన అత్యధిక ధర. స్టార్క్‌కు ఇంతటి ధర లభించకముందు ఇదే వేలంలో అతని సహచరుడు, ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్‌కు కూడా ఇంచుమించు ఇలాంటి ధరనే లభించింది. కమిన్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 కోట్ల 50 లక్షలకు సొంతం చేసుకుంది. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. 2024 సీజన్లో స్టార్క్, కమిన్స్‌లకు లభించబోయే మొత్తం ఐపీఎల్ విజేత ప్రైజ్‌మనీ కంటే ఎక్కువ. ఐపీఎల్ విజేతకు 20 కోట్ల ప్రైజ్‌మనీ లభిస్తుంది. ఇది స్టార్క్, కమిన్స్‌లకు వ్యక్తిగతంగా లభించే మొత్తం కంటే తక్కువ. ఐపీఎల్ విన్నర్, రన్నరప్‌లకు లభించే మొత్తం కలుపుకుంటే కూడా స్టార్క్, కమిన్స్‌లకు లభించే మొత్తంతో సరితూగదు. ఐపీఎల్ రన్నరప్‌కు లభించే 13 కోట్లు, విజేతకు లభించే 20 కోట్లు కలుపుకుంటే 33 కోట్లు మాత్రమే అవుతుంది. ఇది ఆసీస్ బౌలింగ్ ద్వయానికి లభించే మొత్తంతో పోల్చుకుంటే ఇంకా 11.75 కోట్లు తక్కువ. ఈ విషయం ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. -
ఐపీఎల్ 2024 వేలంలో భారీ ధర పలికిన అనామక ఆటగాడు
ఐపీఎల్ 2024 వేలంలో ఓ అనామక ఆటగాడు భారీ ధర పలికాడు. జార్ఖండ్‌కు చెందిన 19 ఏళ్ల వికెట్‌కీపర్ బ్యాటర్ కుమార్ కుషాగ్రా కలలో కూడా ఊహించని ధరకు అమ్ముడుపోయాడు. అతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ ఏకంగా 7.2 కోట్లకు కొనుగోలు చేసింది. కుషాగ్రాను దక్కించుకోవడం కోసం ఢిల్లీ క్యాపిటల్స్ చిన్న సైజు యుద్దమే చేసింది. ఈ యువ హిట్టర్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తీవ్రంగా పోటీపడ్డాయి. ఈ వేలంలో 20 లక్షల బేస్ ధర విభాగంలో పేరును నమోదు చేసుకున్న కుషాగ్రా.. సమీర్ రిజ్వి తర్వాత అత్యధిక ధర పలికిన అన్ క్యాప్డ్ ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు. కుషాగ్రాకు ముందు సమీర్ రిజ్వికి సీఎస్కే 8.4 కోట్ల రికార్డు ధరకు సొంతం చేసుకుంది. ఈ వేలంలో మరో ఆటగాడు కూడా భారీ ధర పలికాడు. శుభమ్ దూబే అనే ఆటగాడిని రాజస్థాన్ రాయల్స్ 5.8 కోట్లు కొనుగోలు చేసింది. ఇవాల్టి వేలంలో ఢిల్లీ పెట్టిన అత్యధిక పెట్టుబడి కుషాగ్రాపైనే కావడం విశేషం. కుషాగ్రా కెరీర్ విషయానికొస్తే.. చిన్నతనం నుంచి టీమిండియా దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోనిని చూస్తూ పెరిగిన ఈ యువ వికెట్‌కీపర్ బ్యాటర్ ధోనిలా ఎదగాలని కలలు కనే వాడట. ఈ విషయాన్ని కుషాగ్రా చాలా సందర్భాల్లో చెప్పాడు. 2021లో దేశవాలీ క్రికెట్లో అడుగుపెట్టిన కుషాగ్రా.. అంతకుముందు ఏడాది (2020) అండర్ 19 వరల్డ్‌కప్ జట్టుకు ఎంపికయ్యాడు. 2021-2022 సీజన్లో రంజీ జట్టుకు ఎంపికైన కుషాగ్రా.. నాగాలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ డబుల్ సెంచరీ (288) బాది అందరి దృష్టి ఆకర్శించాడు. కుషాగ్రా తన స్వల్ప కెరీర్లో 3 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 2 లిస్ట్ ఏ మ్యాచ్‌లు, 2 టీ20లు ఆడాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కుషాగ్రా సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు సాధించాడు. -
IPL 2024: స్టార్క్ వేయబోయే ఒక్కో బంతి విలువ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
వచ్చే సీజన్లో ఐపీఎల్ ఆల్‌టైమ్ హైయ్యెస్ట్ పెయిడ్ ప్లేయర్ మిచెల్ స్టార్క్ వేయబోయే ఒక్కో బంతి విలువ 7 లక్షలకు పైమాటే ఉంటుంది. ఖచ్చితంగా చెప్పాలంటే 2024 సీజన్లో స్టార్క్ వేయబోయే ఒక్కో బంతి విలువ 7 లక్షల 36 వేల 607 రూపాయలు. లీగ్ క్రికెట్ చరిత్రలోనే ఇది కనీవినీ ఎరుగని మొత్తం. ఏ బౌలర్ కలలోనూ ఇంత మొత్తాన్ని ఊహించి ఉండడు. అయితే స్టార్క్‌కు ఇంత మొత్తం లభించాలంటే అతన్ని కొనుగోలు చేసిన కేకేఆర్ ప్లే ఆఫ్స్‌కు ముందే నిష్క్రమించాల్సి ఉంటుంది. ఒకవేళ కేకేఆర్ ప్లే ఆఫ్స్ దశ దాటి ఫైనల్స్‌కు చేరితే స్టార్క్‌కు లభించే మొత్తంలో కోత పడుతుంది. వచ్చే సీజన్లో కేకేఆర్ ఫైనల్స్‌కు చేరే క్రమంలో దాదాపుగా 16 మ్యాచ్‌లు ఆడాల్సి వస్తుంది. స్టార్క్ 16 మ్యాచ్‌లు ఆడాల్సి వస్తే ఒక్కో బంతికి లభించే మొత్తం 6.44 లక్షలకు తగ్గిపోతుంది. కాగా, దుబాయ్‌లోని కోకోకోలా ఎరినాలో ఇవాళ (డిసెంబర్ 19) జరిగిన ఐపీఎల్ 2024 వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు మిచెల్ స్టార్క్‌ను 24 కోట్ల 75 లక్షల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఓ ఆటగాడికి లభించే అత్యధిక ధర ఇదే. స్టార్క్‌కు ఇంత భారీ ధర దక్కక ముందు అతని సహచరుడు, ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్‌కు కూడా ఇంచుమించు ఈ స్థాయి ధరనే లభించింది. కమిన్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 కోట్ల 50 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ వేలానికి ముందు వరకు ఐపీఎల్ ఆల్‌టైమ్ అత్యధిర ధర 18.5 కోట్లుగా ఉండింది. గత సీజన్లో పంజాబ్ కింగ్స్ ఇంగ్లండ్ ఆటగాడు సామ్ కర్రన్‌ను ఈ రికార్డు ధరకు కొనుగోలు చేసింది. -
యువ ఆటగాడికి బంపరాఫర్.. ఏకంగా రూ.8.40 కోట్లు! ఎవరీ సమీర్ రిజ్వీ?
ఐపీఎల్-2024 మినీ వేలంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువ బ్యాటర్ సమీర్ రిజ్వీపై కాసుల వర్షం కురిసింది. రూ. 20 లక్షలతో వేలంలోకి వచ్చిన సమీర్ రిజ్వీని రూ.8.40 కోట్ల భారీ ధరకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ చెన్నై మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఆఖరికి పోటీ నుంచి గుజరాత్, ఢిల్లీ తప్పుకోగా సీఎస్కే దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఎవరీ సమీర్ రిజ్వీ అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. ఎవరీ సమీర్ రిజ్వీ..? 20 ఏళ్ల సమీర్ రిజ్వీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఉత్తర్ ప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 2020లో మధ్యప్రదేశ్‌తో జరిగిన రంజీట్రోఫీ మ్యాచ్‌తో రిజ్వీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అడుగుపెట్టాడు. అయితే రిజ్వీకు టీ20 క్రికెట్లో మంచి రికార్డు ఉంది. కేవలం 9 ఇన్నింగ్స్‌లలో రిజ్వీ 49.16 సగటుతో 295 పరుగులు చేశాడు. ఈ ఏడాది జరిగిన యూపీ టీ20 లీగ్‌లో రిజ్వీ దుమ్మురేపాడు. ఈ లీగ్‌లో కన్పూర్ సూపర్ స్టార్స్ తరపున ప్రాతినిథ్యం వహించిన రిజ్వీ.. 455 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా రిజ్వీ అదరగొట్టాడు. ఈ టోర్నీలో ఓవరాల్‌గా 18 సిక్స్‌లు రిజ్వీ కొట్టాడు. టీ20ల్లో అద్భుతంగా రాణిస్తుండడంతోనే రిజ్వీని సీఎస్కే సొంతం చేసుకుంది. -
IPL 2024 Auction: సీఎస్కేపై స్టీఫెన్ ఫ్లెమింగ్ ప్రభావం
చెన్నై సూపర్ కింగ్స్‌పై ఆ జట్టు హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ప్రభావం భారీగా ఉన్నట్లు ఇవాళ జరిగిన ఐపీఎల్ వేలం తర్వాత స్పష్టంగా తెలుస్తుంది. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, కోచ్ అయిన ఫ్లెమింగ్ సీఎస్కే కోచింగ్ బాధ్యతలు చేపట్టాక ఆ జట్టుపై తన మార్కు ప్రభావం చూపిస్తున్నాడు. ఇప్పటికే డెవాన్ కాన్వే (కోటి), మిచెల్ సాంట్నర్ (1.9 కోట్లు) లాంటి కివీస్ ఆటగాళ్లను పంచన చేర్చుకున్న ఫ్లెమింగ్.. ఇవాళ జరిగిన వేలంలో మరో ఇద్దరు కివీస్ ఆటగాళ్లను జట్టులో చేర్చుకుని సీఎస్కేపై బ్లాక్ క్యాప్స్ మార్కు స్పష్టంగా కనిపించేలా చేశాడు. ఇవాళ జరిగిన వేలంలో సీఎస్కే మేనేజ్మెంట్ డారిల్ మిచెల్‌ను 14 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేయగా.. వన్డే వరల్డ్‌కప్ హీరో రచిన్ రవీంద్రను 1.8 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ ఇద్దరితో పాటు సీఎస్కే ఇవాల్టి వేలంలో మరో భారీ కొనుగోలు చేసింది. ఆ జట్టు యాజమాన్యం శార్దూల్ ఠాకూర్‌ను 4 కోట్లకు సొంతం చేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్: ఎంఎస్ ధోని (కెప్టెన్), మొయిన్ అలీ, దీపక్ చాహర్, డెవాన్ కాన్వే, తుషార్ దేశ్‌పాండే, శివమ్ దూబే, రుతురాజ్ గైక్వాడ్, రాజవర్ధన్ హంగర్గేకర్, రవీంద్ర జడేజా, అజయ్ మండల్, ముఖేష్ చౌదరి, మతీషా పతిరణ, అజింక్య రహానే, షేక్ రషీద్, మిచెల్ సాంట్నర్, సిమర్జీత్ సింగ్, నిశాంత్ సింధు, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ ఐపీఎల్ 2024 వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: డారిల్ మిచెల్ (14 కోట్లు), రచిన రవీంద్ర (1.8 కోట్లు), శార్దూల్ ఠాకూర్ (4 కోట్లు) -
ఐపీఎల్ వేలం చరిత్రలో సరికొత్త రికార్డ్
-
మిచెల్ స్టార్క్ సరి కొత్త చరిత్ర.. ఐపీఎల్లో అత్యధిక ధర! రూ. 24.75 కోట్లకు
ఐపీఎల్-2024 వేలంలో సంచలనాలు నమోదవుతున్నాయి. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచిల్ స్టార్క్ రికార్డులకెక్కాడు. స్టార్క్‌ను రూ.24.70 కోట్లకు కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది. రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన అతడి కోసం గుజరాత్ టైటాన్స్, కేకేఆర్ తీవ్రంగా పోటీ పడ్డాయి. ఆఖరికి గుజరాత్ టైటాన్స్ టైటాన్స్ వెనక్కి తగ్గడంతో కేకేఆర్ సొంతం చేసుకుంది. కాగా ఇదే వేలంలో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్‌ను రూ.20.50 కోట్ల రికార్డు ధరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. అయితే ఇప్పుడు స్టార్క్ డీల్‌తో కమ్మిన్స్ రికార్డు బద్దలైంది. కాగా స్టార్క్ ఐపీఎల్లో చివరగా 2015 సీజన్లో ఆర్సీబీ తరపున ఆడాడు. ప్రస్తుతం వరల్డ్‌క్లాస్ పేసర్లలో స్టార్క్ ఒకడు. ఇటీవల భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లోనూ స్టార్క్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. -
విదేశీ ఆటగాళ్ళపై కాసుల వర్షం
-
టీమిండియా ఆటగాడికి ఊహించని ధర.. మరి ఇన్ని కోట్లా?
ఐపీఎల్-2024 వేలంలో టీమిండియా పేసర్ హర్షల్ పటేల్‌కు ఊహించని ధర దక్కింది. హర్షల్ పటేల్‌ను రూ.11.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. గత కొంత కాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న హర్షల్ పటేల్‌పై కోట్ల వర్షం కురవడం అందరిని ఆశ్చర్యపరిచింది. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన హర్షల్ పటేల్ కోసం గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరికి పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. కాగా గత కొన్ని సీజన్ల నుంచి ఆర్సీబీకి హర్షల్ పటేల్ ప్రాతినిథ్యం వహించాడు. అయితే ఐపీఎల్-2024 వేలానికి ముందు ఆర్సీబీ విడిచిపెట్టింది. దీంతో వేలంలోకి హర్షల్ పటేల్ వచ్చాడు. -
కమ్మిన్స్పై కాసుల వర్షం.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర? ఎన్ని కోట్లంటే?
ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ సరి కొత్త రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర దక్కించుకున్న ఆటగాడిగా కమ్మిన్స్ నిలిచాడు. ఐపీఎల్-2024 వేలంలో కమ్మిన్స్‌ను రూ.20.50 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన అతడి కోసం ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరికి ఆర్సీబీ పోటీ నుంచి తప్పుకోవడంతో భారీ ధరకు ఎస్ఆర్హెచ్ సొంతం చేసుకుంది. ప్యాట్ కమ్మిన్స్‌కు బాల్‌తోనూ బ్యాట్‌తోనూ రాణించే సత్తా ఉంది. కెప్టెన్ పాట్ కమ్మిన్స్ తన నాయకత్వంలో ఆస్ట్రేలియాకు ఆరో ప్రపంచకప్‌ను అందించాడు. అదే విధంగా ఐపీఎల్-2022 సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్-2023 సీజన్‌కు వ్యక్తిగత కారణాలతో కమ్మిన్స్ దూరమయ్యాడు. అయితే ఈసారి ఐపీఎల్లో ఆడాలని కమ్మిన్స్ నిర్ణయించుకున్నాడు. దీంతో ఐపీఎల్-2024 వేలంలో తన పేరును రిజిస్టర్ చేసుకున్నాడు. వేలంలోకి వచ్చిన అతడిపై ఎస్ఆర్హెచ్ కాసుల వర్షం కురిపించింది. ఈ క్రమంలో ఐపీఎల్ వేలంలో అత్యధిక అమ్ముడుపోయిన శామ్ కుర్రాన్ రికార్డును కమిన్స్ బద్దలుకొట్టాడు. సామ్ కుర్రన్.. ఐపీఎల్ 2023 వేలంలో రూ.18.25 కోట్లకు అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే. 𝑻𝒉𝒊𝒔 𝒍𝒊𝒕𝒕𝒍𝒆 PAT 𝒐𝒇 𝒍𝒊𝒇𝒆 𝒊𝒔 𝒄𝒂𝒍𝒍𝒆𝒅 𝑯𝒂𝒑𝒑𝒊𝒏𝒆𝒔𝒔 🧡 Welcome, Cummins! 🫡#HereWeGOrange pic.twitter.com/qSLh5nDbLM — SunRisers Hyderabad (@SunRisers) December 19, 2023 -
ఐపీఎల్లో కొత్త రూల్.. ఇక బ్యాటర్లకు చుక్కలే!?
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024 సీజన్‌కు ముందు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్లో కొత్త రూల్ అమల్లోకి రానున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది సీజన్ నుంచి బ్యాటర్ల దూకుడును కట్టడి చేసేందుకు ఒకే ఓవర్లో రెండు బౌన్సర్లలను అనుమతించనున్నట్లు ఈఎస్సీఎన్ క్రిక్ ఈన్‌ఫో తమ నివేదికలో పేర్కొంది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో ఐపీఎల్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. కాగా ఇప్పటికే ఈ రూల్‌ను ఇటీవల జరిగిన దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ బీసీసీఐ అమలు చేసింది. కాగా ఈ నిబంధన బౌలర్లకు సహకరిస్తుందని టీమిండియా వెటరన్ జయదేవ్ ఉనద్కట్ ఈఎస్సీఎన్తో చెప్పుకొచ్చాడు. ఈ చిన్న మార్పు గెలుపోటములను ఎంతగానో ప్రభావితం చేస్తుందని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2024 సీజన్‌కు సంబంధించిన మినీ వేలం దుబాయ్ వేదికగా డిసెంబర్ 19న జరగనుంది. ఈ కొత్త రూల్‌ను దృష్టిలో పెట్టుకుని వేలంలో ఆయా ఫ్రాంచైజీలు పాల్గోనే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో వరల్డ్‌క్లాస్ పేసర్లు మిచిల్ స్టార్క్, ప్యాట్ కమ్మిన్స్, దక్షిణాఫ్రికా యువ సంచలనం గెరాల్డ్ కోట్జీపై కాసుల వర్షం కురిసే అవకాశం ఉంది. చదవండి: WI vs ENG: వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడికి బిగ్ షాక్.. -
'స్మిత్‌ను ఎవరూ కొనరు.. అతడికి మాత్రం ఏకంగా రూ.20 కోట్లు'
ఐపీఎల్-2024 మినీ వేలానికి సర్వం సిద్దమైంది.ఈ క్యాష్‌రిచ్ లీగ్ వేలం దుబాయ్‌లోని కోకాకోలా అరేనా వేదికగా మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ వేలంలో 77 స్ధానాలకు గానూ మొత్తంగా 330 ఆటగాళ్లు పాల్గోనున్నారు. ఇందులోనే ఇద్దరు అసోసియేట్ ప్లేయర్లు సహా 119 విదేశీ ఆటగాళ్లున్నారు. భారత్ నుంచి 214 ప్లేయర్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక ఈ వేలంలో నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గం, ఎస్ఆర్హెచ్ హెడ్ కోచ్ టామ్ మూడీ కీలక వ్యాఖ్యలు చేశాడు. వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్‌ను ఎవరూ కొనుగోలు చేయరని మూడీ జోస్యం చెప్పాడు. అయితే ఆసీస్ పేసర్ మిచిల్ స్టార్క్ మాత్రం భారీ ధరకు అమ్ముడుపోతాడని మూడీ అభిప్రాయపడ్డాడు. ఈ ఏడాది వేలంలో స్టీవ్ స్మిత్‌ను ఏ ఫ్రాంఛైజీ కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపకపోవచ్చు. కానీ మిచిల్ స్టార్క్‌పై మాత్రం కాసుల వర్షం కురుస్తోంది. ప్రస్తుతం అత్యధిక ధర కలిగి ఉన్న శామ్ కుర్రాన్(రూ.18.50) రికార్డును స్టార్క్ బ్రేక్ చేస్తాడు. స్టార్క్ దాదాపు రూ.20 కోట్లకు అమ్ముడుపోయిన ఆశ్చర్యపోన్కర్లేదని ఈఎస్పీఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మూడీ పేర్కొన్నాడు. చదవండి: IPL 2024 Auction Updates: ఐపీఎల్ వేలానికి సర్వం సిద్దం.. జాక్‌పాట్ ఎవరికో? -
IPL 2024 Auction Updates: రిలీ రొస్సోకు జాక్‌పాట్
గస్ అట్కిన్సన్ను కేకేఆర్ కోటి రూపాయలకు సొంతం చేసుకుంది. సౌరవ్ చౌహాన్‌ను ఆర్సీబీ 20 లక్షలకు దక్కించుకుంది. షాయ్ హోప్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ 75 లక్షలకు దక్కించుకుంది. స్వస్తిక్ చిక్కరను ఢిల్లీ క్యాపిటల్స్ 20 లక్షలకు సొంతం చేసుకుంది. నండ్రే బర్గర్‌ను 50 లక్షలకు దక్కించుకున్న రాజస్తాన్ రాయల్స్ రిలీ రొస్సోను 8 కోట్లకు దక్కించుకున్న పంజాబ్ కింగ్స్. లోకీ ఫెర్గూసన్‌ను 2 కోట్లకు సొంతం చేసుకున్న ఆర్సీబీ. ముజీబ్ ఉర్ రెహ్మాన్‌ను 2 కోట్లకు దక్కించుకున్న కేకేఆర్. మొహమ్మద్ నబీని 1.5 కోట్లకు దక్కించుకున్న ముంబై ఇండియన్స్. మనీశ్ పాండేను 50 లక్షలకు దక్కించుకున్న కేకేఆర్. జమ్మూ పేసర్ రసిక్ దార్ సలామ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ 20 లక్షలకు దక్కించుకుంది. ఆకాశ్ సింగ్‌ను సన్‌రైజర్స్ 20 లక్షలకు దక్కించుకుంది. అన్క్యాప్డ్ జార్ఖండ్ పేసర్ సుశాంత్ మిశ్రాను గుజరాత్ టైటాన్స్ 2.2 కోట్లకు సొంతం చేసుకుంది. రికీ భుయ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ 20 లక్షలకు దక్కించుకుంది. రమన్‌దీప్ సింగ్‌ను కేకేఆర్ 20 లక్షలకు దక్కించుకుంది. షారుక్ ఖాన్‌ను గుజరాత్ టైటాన్స్ 7.4 కోట్లకు సొంతం చేసుకుంది. చేతన్ సకారియాను కేకేఆర్ 50 లక్షలకు సొంతం చేసుకుంది. రాబిన్ మింజ్ అనే అన్క్యాప్డ్ వికెట్‌కీపర్‌ను గుజరాత్ టైటాన్స్ 3.6 కోట్లకు సొంతం చేసుకుంది. సుమిత్ కుమార్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ కోటి రూపాయలకు దక్కించుకుంది. తమిళనాడు స్పిన్నర్ మణిమారన్ సిద్దార్థ్‌ను లక్నో 2.4 కోట్లకు దక్కించుకుంది. పంజాబ్ కింగ్స్ ప్రిన్స్ చౌదరీ అనే ఆటగాడిని 20 లక్షలకు సొంతం చేసుకుంది. జతవేద్ సుబ్రమన్యన్ అనే ఆటగాడిని సన్‌రైజర్స్ 20 లక్షలకు దక్కించుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ డేవిడ్ విల్లేను 2 కోట్లకు దక్కించుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ ఆస్టన్ టర్నర్‌ను కోటి రూపాయలకు సొంతం చేసుకుంది. షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్‌ను కేకేఆర్ 1.5 కోట్లకు దక్కించుకుంది. స్పెన్సర్ జాన్సన్‌ను 10 కోట్ల భారీ ధరకు గుజరాత్ టైటాన్స్ హస్తగతం చేసుకుంది. జై రిచర్డ్సన్ను 5 కోట్లకు సొంతం చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్. టామ్ కర్రన్‌ను ఆర్సీబీ 1.5 కోట్లకు దక్కించుకుంది. ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను సీఎస్కే 2 కోట్లకు సొంతం చేసుకుంది. నువాన్ తుషారను ముంబై ఇండియన్స్ 4.8 కోట్లకు దక్కించుకుంది. ముంబై ఇండియన్స్ శ్రేయస్ గోపాల్‌ను 20 లక్షలకు దక్కించుకుంది. గుజరాత్ టైటాన్స్ మానవ్ సుతార్‌ను 20 లక్షలకు సొంతం చేసుకుంది. బంపర్ ఆఫర్ కొట్టిన రింకూ సింగ్ బాధితుడు గత ఐపీఎల్లో రింకూ సింగ్ చేతిలో చావుదెబ్బ (ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు) తిన్న యశ్ దయాల్ 2024 ఐపీఎల్ వేలంలో జాక్‌పాట్ కొట్టాడు. అతన్ని ఆర్సీబీ 5 కోట్లకు కొనుగోలు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ కుమార్ కుషాగ్రాను 7.2 కోట్లకు దక్కించుకుంది. గుజరాత్ టైటాన్స్ యువ పేసర్ కార్తీక్ త్యాగిని 60 లక్షలకు దక్కించుకుంది. ►భారత అండర్-19 ఆటగాడు అర్షిన్ కులకర్ణిని రూ.20 లక్షలకు లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది. ►ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆన్క్యాప్డ్ ఆటగాడు సమీర్ రిజ్వీ రూ.8.40 కోట్లకు చెన్నైసూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. ►విధర్బకు చెందిన ఆన్క్యాప్డ్ ఆటగాడు శుబమ్ దుబేను రూ. 5.80 కోట్ల భారీ ధరకు రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. ఐపీఎల్ ఫ్రాంచైజీల వద్ద ఉన్న మిగిలిన నగదు ఢిల్లీ క్యాపిటల్స్: రూ. 24.45 కోట్లు గుజరాత్ టైటాన్స్: రూ. 31.85 కోట్లు పంజాబ్ కింగ్స్: రూ.13.15 కోట్లు చెన్నై సూపర్ కింగ్స్: రూ. 11.6 కోట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: రూ. 11.75 కోట్లు ముంబై ఇండియన్స్: రూ. 8.15 కోట్లు కోల్‌కతా నైట్‌రైడర్స్: రూ.6.95 కోట్లు లక్నో సూపర్ జెయింట్స్: రూ. 6.75 కోట్లు రాజస్థాన్ రాయల్స్: రూ. 7.1 కోట్లు సన్‌రైజర్స్ హైదరాబాద్: రూ. 3.6 కోట్లు ►శ్రీలంక యువ పేసర్ దిల్షాన్ మధుశంకను రూ. 4.6 కోట్లకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. ►భారత పేసర్ జయదేవ్ ఉనద్కట్‌ను రూ. 1.6 కోట్లకు ఎస్ఆర్హెచ్ సొంతం చేసుకుంది. ►ఆసీస్ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్‌కు జాక్‌పాట్ రూ. 24.75 కోట్లు. స్టార్క్‌కు భారీ ధరకు దక్కించుకున్న కోల్కత్తా నైట్ రైడర్స్. ►భారత బౌలర్ శివమ్ మావీకి రూ.6.40కోట్లు. మావీకి దక్కించుకున్న లక్నో సూపర్ జాయింట్స్. ►ఇండియన్ ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్‌కు భారీ ధర రూ. 5.80కోట్లు. ఉమేశ్‌ను దక్కించుకున్న గుజరాత్ టైటాన్స్. ►విండీస్ బౌలర్ అల్జ్జరీ జోసెఫ్‌కు భారీ ధర.. రూ.11.50కోట్ల ధర. జోసెఫ్‌ను దక్కించుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. పోటీ పడిన లక్నో, ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ ►భారత యువ వికెట్ కీపర్ శ్రీకర్ భర్తను రూ. 50 లక్షల కనీస ధరకు కేకేఆర్ సొంతం చేసుకుంది. ►దక్షిణాఫ్రికా యువ ఆటగాడు ట్రిస్టన్ స్టబ్స్‌ను రూ. 50లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. ►ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్‌ను రూ. 4.20 కోట్ల భారీ ధరకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. డార్లీ మిచెల్‌కు రూ. 14 కోట్లు... వేలంలో న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ డార్లీ మిచిల్పై కోట్ల వర్షం కురిసింది. మిచిల్‌ను రూ. 14 కోట్లకు చెన్నై సూపర్ కంగ్స్ సొంతం చేసుకుంది. కోటి రూపాయలు బేస్ ఫ్రైజ్‌గా వేలంలోకి వచ్చిన మిచిల్ కోసం పంజాబ్ కింగ్స్, సీఎస్కే తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరికి సీఎస్కే సొంతం చేసుకుంది. హర్షల్ పటేల్‌కు భారీ ధర.. ►వేలంలో టీమిండియా పేసర్ హర్షల్ పటేల్‌కు ఊహించని ధర దక్కింది. హర్షల్ పటేల్‌ను రూ. 11.75 కోట్లకు పంజాబ్ కొనుగోలు చేసింది. ► గెరాల్డ్ కోట్జీ: రూ5 కోట్లకు కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్ ప్యాట్ కమ్మిన్స్‌కు జాక్ పాట్.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర వేలంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్పై కాసుల వర్షం కురిసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా కమ్మిన్స్ నిలిచాడు. కమ్మిన్స్‌ను రూ.20.50 కోట్లకు ఎస్ఆర్హెచ్ కొనుగోలుచేసింది. అతడి కోసం ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ తీవ్రంగా పోటీ పడ్డాయి. 𝑻𝒉𝒊𝒔 𝒍𝒊𝒕𝒕𝒍𝒆 PAT 𝒐𝒇 𝒍𝒊𝒇𝒆 𝒊𝒔 𝒄𝒂𝒍𝒍𝒆𝒅 𝑯𝒂𝒑𝒑𝒊𝒏𝒆𝒔𝒔 🧡 Welcome, Cummins! 🫡#HereWeGOrange pic.twitter.com/qSLh5nDbLM — SunRisers Hyderabad (@SunRisers) December 19, 2023 శార్ధూల్‌కు జాక్ పాట్.. ►టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ రూ.4కోట్ల భారీ ధరకు సీఎస్కే కొనుగోలు చేసింది. ►అఫ్గానిస్తాన్ ఆల్‌రౌండర్ ఒమర్జాయ్ను రూ. 50లక్షలకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. సీఎస్కేలోకి కివీ స్టార్.. ►న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్రకు నామమాత్రపు ధరే దక్కింది. రూ 1.50 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. ఈ వరల్డ్‌కప్ హీరో కోసం ఢిల్లీ క్యాపిటల్స్, సీఎస్కే మధ్య తీవ్ర పోటీ నెలకొంది. చివరికి ఢిల్లీ వెనక్కి తగ్గడంతో సీఎస్కే సొంతం చేసుకుంది. ►శ్రీలంక ఆల్‌రౌండర్ వనిందు హసరంగాను రూ. 1.50 కోట్లకు ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసింది. ► ఈ వేలంలో టీమిండియా ఆటగాళ్లు మనీష్ పాండే, కరుణ్ నాయర్, అమ్ముడు పోలేదు. అదే విధంగా ఆసీస్ స్టార్ స్టీవ్ స్మిత్‌ను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. ►ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్‌కు భారీ ధర దక్కింది. హెడ్‌ను రూ. 6.80 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. హెడ్ కోసం సీఎస్కే పోటీ పడినప్పటికీ ఆఖరికి ఎస్ఆర్హెచ్ సొంతం చేసుకుంది. ►ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్‌ను రూ. 4 కోట్ల భారీ ధరకు ఢిల్లీ క్యాపిటిల్స్ కొనుగోలు చేసింది. ►ఐపీఎల్-2024 మినీ వేలంలో అమ్ముడు పోని తొలి ఆటగాడిగా దక్షిణాఫ్రికాకు చెందిన రూసో నిలిచాడు. రూసోను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తికనబరచలేదు. రోవ్‌మన్ పావెల్‌కు జాక్‌పాట్ ఐపీఎల్-2024 మినీ వేలంలో అమ్ముడు పోయిన ఆటగాడిగా వెస్టిండీస్ టీ20 జట్టు కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ నిలిచాడు. పావెల్‌ను రూ. 7.40 కోట్ల భారీ ధరకు రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. ఐపీఎల్ వేలం ప్రారంభం.. దుబాయ్‌లోని కోకాకోలా ఎరీనా వేదికగా ఐపీఎల్-2024 మినీ వేలం ప్రారంభమైంది. ఐపీఎల్ చైర్మెన్ అరుణ్ సింగ్ ధుమాల్ వేలం పక్రియనను ప్రారంభించారు. కాగా వేలంను మల్లికా సాగర్ నిర్వహించనున్నారు. ►ఐపీఎల్-2024 మినీ వేలం మరి కొద్ది నిమిషాల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే మొత్తం 10 ఫ్రాంచైజీల మేనెజ్మెంట్ కోకాకోలా ఎరీనాకు చేరుకున్నారు. గత కొంత కాలంగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్న టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ .. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున వేలంలో పాల్గోనున్నాడు. క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్-2024 మినీ వేలానికి సమయం అసన్నమైంది. మరికొన్ని గంట్లలో దుబాయ్‌లోని కోకాకోలా ఎరీనా వేదికగా ఈ క్యాష్‌రిచ్ లీగ్ వేలం ప్రారంభం కానుంది. కాగా ఐపీఎల్ వేలం ప్రక్రియ విదేశీ గడ్డపై జరగడం ఇదే తొలిసారి. 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా ఈ లీగ్ వేలాన్ని ఓ మహిళ నిర్వహించనున్నారు. డబ్ల్యూపీఎల్ రెండు సీజన్ల వేలం పాటను విజయవంతంగా నిర్వహించిన మల్లికా సాగర్‌కు.. ఈ సారి ఆటగాళ్లను వేలంవేసే బాధ్యతను బీసీసీఐ అప్పగించింది. ఇక ఈ వేలంలో మొత్తంగా 333 మంది ఆటగాళ్లు పాల్గోనున్నారు. కాగా 10 ఫ్రాంచైజీల్లో కలిపి మొత్తం గరిష్టంగా 77 స్థానాలు ఖాళీగా ఉండగా.. ఇందులో 30 విదేశీ ఆటగాళ్ల కోసం ఖాళీలు ఉన్నాయి. ఇప్పటికే ఈ వేలం పాటలో అనుసరించాల్సిన ప్రణాళికలను ఆయా ఫ్రాంచైజీలు సిద్దం చేసుకున్నాయి. ఏ ఫ్రాంచైజీ పర్స్‌లో ఎంతందంటే? ఈ వేలంలో గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ అత్యధిక పర్స్ వాల్యూతో బరిలోకి దిగనుంది. గుజరాత్ టైటాన్స్ వద్ద రూ. 38.15 కోట్ల పర్స్ మనీ ఉంది. ఆ తర్వాత వరుసగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (రూ.34 కోట్లు), కోల్‌కతా నైట్‌రైడర్స్ (రూ.32.7 కోట్లు) చెన్నై సూపర్ కింగ్స్ (రూ.31.4 కోట్లు), పంజాబ్ కింగ్స్ (రూ.29.10 కోట్లు), ఢిల్లీ క్యాపిటల్స్ (రూ.28.95 కోట్లు) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (రూ.23.25 కోట్లు), ముంబై ఇండియన్స్(రూ.17.75 కోట్లు), రాజస్తాన్ రాయల్స్(రూ. 14.5 కోట్లు), లక్నో సూపర్ జెయింట్స్(రూ. 13.15 కోట్లు) ఉన్నాయి. ఫ్రాంఛైజీలు రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు వీరే.. గుజరాత్ టైటాన్స్: శుభమన్ గిల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, మాథ్యూ వేడ్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, రాహుల్ తెవాటియా, మహమ్మద్ షమీ, నూర్ అహ్మద్, సాయి కిషోర్, రషీద్ ఖాన్, జాషువా లిటిల్, మోహిత్ శర్మ గుజరాత్ టైటాన్స్ గరిష్ఠంగా ఎనిమిది ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు. అందులో ఇద్దరి వీదేశీ ఆటగాళ్లు స్ధానాలు ఉన్నాయి. ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, విష్ణు వినోద్, అర్జున్ టెండూల్కర్, షమ్స్ ములానీ, నెహాల్ వధేరా, జస్ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తికేయ , పీయూష్ చావ్లా, ఆకాష్ మాధ్వల్, జేసన్ బెహ్రెన్‌డార్ఫ్, రొమారియో షెపర్డ్ ముంబైలో ప్రస్తుతం 8 ఖాళీలు ఉన్నాయి. అందులో 4 స్ధానాలు వీదేశీ ఆటగాళ్లవి చెన్నై సూపర్ కింగ్స్: ఎంఎస్ ధోని (కెప్టెన్), మొయిన్ అలీ, దీపక్ చాహర్, డెవాన్ కాన్వే, తుషార్ దేశ్‌పాండే, శివమ్ దూబే, రుతురాజ్ గైక్వాడ్, రాజవర్ధన్ హంగర్గేకర్, రవీంద్ర జడేజా, అజయ్ మండల్, ముఖేష్ చౌదరి, మతీషా పతిరణ, అజింక్య రహానే, షేక్ రషీద్, మిచెల్ సాంట్నర్, సిమర్జీత్ సింగ్, నిశాంత్ సింధు, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ ఢిల్లీ క్యాపిటల్స్: రిషబ్ పంత్ (కెప్టెన్), ప్రవీణ్ దూబే, డేవిడ్ వార్నర్, విక్కీ ఓస్త్వాల్, పృథ్వీ షా, అన్రిచ్ నోర్ట్జే, అభిషేక్ పోరెల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, లుంగీ ఎంగిడి, లలిత్ యాదవ్, ఖలీల్ అహ్మద్, మిచెల్ మార్ష్, ఇషాంత్ శర్మ, ముకేశ్ కుమార్ ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-15 (11 మంది దేశీయ ఆటగాళ్లు, 4 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (71.5 కోట్లు), పర్స్‌లో మిగిలిన మొత్తం (28.95 కోట్లు), ఇంకా 9 మందిని తీసుకోవచ్చు. ఇందులో విదేశీ ఆటగాళ్లు (4) లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, కృనాల్ పాండ్యా, యుధ్వీర్ సింగ్, ప్రేరక్ మన్కడ్, యశ్ ఠాకూర్ , అమిత్ మిశ్రా, మార్క్ వుడ్, మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, దేవదత్ పడిక్కల్ ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-18 (12 మంది దేశీయ ఆటగాళ్లు, 6 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (86.85 కోట్లు), పర్స్‌లో మిగిలిన మొత్తం (13.15 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (6), ఇందులో విదేశీ ఆటగాళ్లు (2) రాజస్థాన్ రాయల్స్ : సంజు శాంసన్ (కెప్టెన్), జోస్ బట్లర్, షిమ్రాన్ హెట్మెయర్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, డోనోవన్ ఫెరీరా, కునాల్ రాథోడ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ సేన్, నవదీప్ సైనీ, ప్రసిద్ధ్ కృష్ణ, సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, ఆడమ్ జంపా, అవేష్ ఖాన్ ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-17 (12 మంది దేశీయ ఆటగాళ్లు, 5 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (85.5 కోట్లు), పర్స్‌లో మిగిలిన మొత్తం (14.5 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (8), ఇందులో విదేశీ ఆటగాళ్లు (3) సన్‌రైజర్స్ హైదరాబాద్: ఎయిడెన్ మార్క్రామ్ (కెప్టెన్), అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, మార్కో జాన్సెన్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ అగర్వాల్, టి నటరాజన్, అన్మోల్ప్రీత్ సింగ్, మయాంక్ మార్కండే, ఉపేంద్ర సింగ్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, నితీష్ కుమార్ రెడ్డి, ఫజల్ హక్ ఫారూఖీ, షాబాజ్ అహ్మద్ ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-19 (14 మంది దేశీయ ఆటగాళ్లు, 5 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (66 కోట్లు), పర్స్‌లో మిగిలిన మొత్తం (34 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (6), ఇందులో విదేశీ ఆటగాళ్లు (3) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్వెల్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేసాయి, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ డాగర్, విజయ కుమార్ వైశాక్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్, రీస్ టాప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, కామెరాన్ గ్రీన్ ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-19 (14 మంది దేశీయ ఆటగాళ్లు, 5 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (59.25 కోట్లు), పర్స్‌లో మిగిలిన మొత్తం (23.25 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (7), ఇందులో విదేశీ ఆటగాళ్లు (4) పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, ప్రభ్‌సిమ్రన్ సింగ్, జితేష్ శర్, సికందర్ రజా, రిషి ధవన్, లియామ్ లివింగ్‌స్టోన్, అథర్వ టైడే, అర్ష్‌దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్, సామ్ కర్రాన్, కగిసో రబడ, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ భాటియా, విద్వాత్ కవేరప్ప, శివమ్ సింగ్ ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-17 (11 మంది దేశీయ ఆటగాళ్లు, 6 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (70.9 కోట్లు), పర్స్‌లో మిగిలిన మొత్తం (29.1 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (8), ఇందులో విదేశీ ఆటగాళ్లు (2) కోల్‌కతా నైట్ రైడర్స్: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రాణా, రింకూ సింగ్, రహ్మానుల్లా గుర్బాజ్, జాసన్ రాయ్, సునీల్ నరైన్, సుయాష్ శర్మ, అనుకూల్ రాయ్, ఆండ్రీ రస్సెల్, వెంకటేష్ అయ్యర్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-13 (9 మంది దేశీయ ఆటగాళ్లు, 4 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (67.3 కోట్లు), పర్స్‌లో మిగిలిన మొత్తం (32.7 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (12), ఇందులో విదేశీ ఆటగాళ్లు (4) -
పంజాబ్ కింగ్స్‌లోకి వరల్డ్‌కప్ హీరో.. టీమిండియా మాజీ ఓపెనర్ జోస్యం
ఐపీఎల్-2024 సీజన్‌కు సంబంధించిన మినీ వేలం దుబాయ్ వేదికగా మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ వేలంలో ఆటగాళ్ల కోసం పోటీ పడేందుకు మొత్తం 10 ఫ్రాంచైజీలు సిద్దమయ్యాయి. ఈ వేలంలో మొత్తం 333 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే 10 ఫ్రాంచైజీలకు కావాల్సింది కేవలం 77 మంది మాత్రమే. ఇక వన్డే వరల్డ్‌కప్‌లో దుమ్మురేపిన న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్రపై కాసుల వర్షం కురిపించే అవకాశముంది. ఈ వేలం నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు అభినవ్ ముకుంద్ తన అభిప్రాయాలను వెల్లడించాడు. వేలంలో రవీంద్రను పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ సొంతం చేసుకుంటుందని ముకుంద్ జోస్యం చెప్పాడు. జియో సినిమాతో ముకుంద్ మాట్లాడుతూ.. "అంతర్జాతీయ స్ధాయిలో అద్భుతంగా రాణిస్తున్న ఆటగాళ్ల కోసం పంజాబ్ కింగ్ భారీగా ఖర్చుచేస్తుంది. ఈ సారి కొత్త కూడా ఆటగాళ్ల కోసం పంజాబ్ భారీ మొత్తం వెచ్చించే ఛాన్స్ ఉంది. ప్రపంచకప్‌లో అదరగొట్టన కివీ స్టార్ రచిన్ రవీంద్రను దక్కించుకోనేకుందు పంజాబ్ ప్రయత్నం చేస్తుంది. టీ20ల్లో గణాంకాలు పెద్దగా బాగోలేకపోయినప్పటికి.. భారత్ పిచ్‌లపై ఏమి చేశాడో మనమందరం చూశం. టోర్నీలో 3 సెంచరీలతో ఏకంగా 578 పరుగులు చేశాడు. అదే విధంగా వచ్చే ఐపీఎల్ సీజన్ ప్లేఆఫ్స్‌కు బెయిర్ స్టో కూడా అందుబాటులో ఉండడు. ఈ నేపథ్యంలో పంజాబ్ రవీంద్ర కోసం కచ్చితంగా ప్రయత్నిస్తోందని" చెప్పుకొచ్చాడు. వన్డేల్లో అద్బుతంగా రాణిస్తున్న రవీంద్రకు టీ20ల్లో మాత్రం పెద్దగా రికార్డులు లేవు. 18 మ్యాచ్‌లు ఆడిన రవీంద్ర కేవలం 145 పరుగులు మాత్రమే చేశాడు. చదవండి: సిరీస్ విజయమే లక్ష్యంగా... -
IPL 2024: మల్లికా సాగర్‌కు ‘హ్యామర్‌మ్యాన్’ విషెస్.. ఫొటో వైరల్
ఐపీఎల్-2024 వేలంలో ఆక్షనీర్‌గా వ్యవహరించనున్న మల్లికా సాగర్‌కు రిచర్డ్ మ్యాడ్లే అభినందనలు తెలిపాడు. ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగన్న క్యాష్ రిచ్ లీగ్‌లో వేలం నిర్వహణకర్తగా వ్యవహరించే అవకాశం రావడం గొప్ప విషయమని పేర్కొన్నాడు. ఆక్షనీర్లకు ఇంతకంటే గొప్ప గౌరవం మరొకటి ఉండదంటూ హర్షం వ్యక్తం చేశాడు. బీసీసీఐ తనకు అప్పజెప్పిన పనిని సమర్థవంతంగా పూర్తి చేయాలని మల్లికకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. అదే విధంగా.. ఐపీఎల్‌తో తనకున్న జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేనంటూ ఈ సందర్భంగా అరుదైన ఫొటోను పంచుకున్నాడు. కాగా 2008లో మొదలైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ గత పదహారేళ్లుగా విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇంతింతై వటుడింతై అన్నట్లు ప్రపంచంలోనే ధనిక టీ20 లీగ్‌గా మారి.. యువ క్రికెటర్ల నుంచి అనుభవజ్ఞుల దాకా అందరిపై కనక వర్షం కురిపిస్తూ ఎంతోమందికి జీవితాన్నిస్తోంది. ఇక ఈ లీగ్ అరంగేట్ర వేలంలో ఇంగ్లండ్‌కు చెందిన రిచర్డ్ మ్యాడ్లే ఆక్షనీర్‌గా వ్యవహరించాడు. పదేళ్లపాటు తనే ఈ బాధ్యతలు నిర్వర్తించి హ్యామర్మాన్గా గుర్తింపు పొందాడు. ఆ తర్వాత హ్యూ ఎడ్మడ్స్ ఐపీఎల్ ఆక్షనీర్‌గా సేవలు అందించాడు. అయితే, ఇప్పుడు అతడి స్థానాన్ని మల్లికా సాగర్ భర్తీ చేయనుంది. తద్వారా ఈ అవకాశం దక్కించుకున్న భారత తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించింది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ చరిత్రలో మల్లికా సాగర్ ఓవరాల్‌గా నాలుగో ఆక్షనీర్. రిచర్డ్ మ్యాడ్లే, ఎడ్మడ్స్తో పాటు చారు శర్మ కూడా ఐపీఎల్ వేలం నిర్వహించాడు. ఐపీఎల్-2022 మెగా వేలం సందర్భంగా ఎడ్మడ్స్ స్థానంలో తాత్కాలిక బాధ్యతలు చేపట్టాడు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు మరో ఇండియన్ మల్లికా సాగర్ ఆక్షనీర్‌గా వ్యవహరించేందుకు సిద్ధమవుతున్నారు. కాగా దుబాయ్‌లోని కోకాకోలా ఎరీనా వేదికగా మంగళవారం ఐపీఎల్-2024 వేలం జరుగనుంది. Good luck Mallika Sagar as you prepare for the #IPL2024Auction . It is the ultimate honour to be invited to conduct the world’s highest profile auction and I wish you well. I will always treasure the memories #IPLAuction #IPL2024 pic.twitter.com/6IKznkKlXD — Richard Madley (@iplauctioneer) December 18, 2023 -
మార్చి 22 నుంచి ఐపీఎల్ 2024..?
సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతున్న కథనాల ప్రకారం ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభమవుతుందని తెలుస్తుంది. రెండు నెలల పాటు సుదీర్ఘంగా సాగనున్న ఈ సీజన్ మే చివరి నాటి పూర్తవుతుందని సమాచారం. వచ్చే ఏడాది దేశంలో సార్వత్రిక ఎన్నికల జరగాల్సి ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన తర్వాతే తదనుగుణంగా ఐపీఎల్ షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఎన్నికల పోలింగ్ తేదీలు ఖరారయ్యాక ఐపీఎల్ 2024 షెడ్యూల్ విడుదలవుతుందని ఓ ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ వెల్లడించింది. ఇదిలా ఉంటే, వచ్చే ఏడాది జరుగబోయే ఐపీఎల్ కోసం ఇప్పటినుంచే హడావుడి మొదలైంది. 2024 సీజన్ వేలం రేపు (డిసెంబర్ 19) జరుగనుండటంతో అన్ని ఫ్రాంచైజీలు సన్నాహకాల్లో నిమగ్నమై ఉన్నాయి. దుబాయ్‌లోని కోకాకోలా ఎరీనాలో రేపు వేలం జరుగనుంది. ఈ వేలం భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ప్రారంభమవుతుంది. వేలం ప్రక్రియ మొత్తం స్టార్ స్పోర్ట్స్ (టీవీ), జియో సినిమాలో (డిజిటల్) ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ వేలంలో 77 స్లాట్ల కోసం 333 మంది ఆటగాళ్లు పోటీపడనున్నారు. ఇందులో 214 మంది భారత ఆటగాళ్లు, 119 మంది విదేశీ ఆటగాళ్లు పాల్గొంటున్నారు. వేర్వేరు బేస్ ప్రైజ్ విభాగాల్లో ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ వేలంలో మిచెల్ స్టార్క్, గెరాల్డ్ కొయెట్జీ, పాట్ కమిన్స్, హ్యారీ బ్రూక్, ట్రవిస్ హెడ్, రచిన్ రవీంద్రలపై అందరీ దృష్టి ఉంది. ఈ ఆటగాళ్లు వేలంలో గత రికార్డులు కొల్లగొట్టడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ఐపీఎల్ 2024 వేలంలో అదృష్టం పరీక్షించుకోనున్న తెలుగు ఆటగాళ్లు వీరే..!
దుబాయ్‌లోని కోకాకోలా ఎరీనాలో రేపు (డిసెంబర్ 19) జరుగబోయే ఐపీఎల్ 2024 వేలంలో 11 మంది తెలుగు క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరిలో హనుమ విహారి, కేఎస్ భరత్, పృథ్వీరాజ్ యర్రాలకు గతంలో ఐపీఎల్ ఆడిన అనుభవం ఉంది. విహారి 24, కేఎస్ భరత్ 10, పృథ్వీరాజ్ యర్రా 2 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడారు. హనుమ విహారి (30) (కాకినాడ, బ్యాటింగ్ ఆల్‌రౌండర్, 24 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 284 పరుగులు) కేఎస్ భరత్ (30) (వైజాగ్, వికెట్‌కీపర్ బ్యాటర్, 10 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 199 పరుగులు, ఓ హాఫ్ సెంచరీ) పృథ్వీరాజ్ యర్రా (25) (గుంటూరు, లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేసర్, 2 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో (కేకేఆర్) ఓ వికెట్) రోహిత్ రాయుడు (29) (గుంటూరు, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్) అనికేత్ రెడ్డి (23) (నిజామాబాద్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్) రవి తేజ (29) (హైదరాబాద్, ఆల్‌రౌండర్) మనీశ్ రెడ్డి (24) (హైదరాబాద్, ఆల్‌రౌండర్) మురుగన్ అభిషేక్ (19) (హైదరాబాద్, స్పిన్ బౌలర్) ఎర్రవల్లి అవనీశ్ రావ్ (19) (హైదరాబాద్, బ్యాటర్) రక్షణ్ రెడ్డి (23) (హైదరాబాద్, మీడియ పేసర్) రాహుల్ బుద్ది (26) (హైదరాబాద్, బ్యాటర్, 2022లో ముంబై ఇండియన్స్ సభ్యుడు) ఐపీఎల్ 2024 వేలం తేదీ: డిసెంబర్ 19, 2023 సమయం: మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ప్రారంభం (భారతకాలమానం ప్రకారం) ప్రత్యక్ష ప్రసారం: స్టార్ స్పోర్ట్స్ (టీవీ) డిజిటల్: జియో సినిమా మొత్తం స్లాట్లు: 77 వేలంలో పాల్గొంటున్న మొత్తం ఆటగాళ్లు: 333 భారతీయ ఆటగాళ్లు: 214 విదేశీ ఆటగాళ్లు: 119 -
ఐపీఎల్ 2024 వేలానికి ముందు ఆయా జట్ల పరిస్థితి ఇది..!
ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, విష్ణు వినోద్, అర్జున్ టెండూల్కర్, షమ్స్ ములానీ, నెహాల్ వధేరా, జస్ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తికేయ , పీయూష్ చావ్లా, ఆకాష్ మాధ్వల్, జేసన్ బెహ్రెన్‌డార్ఫ్, రొమారియో షెపర్డ్ ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-17 (13 మంది దేశీయ ఆటగాళ్లు, 4 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (84.75 కోట్లు), పర్స్‌లో మిగిలిన మొత్తం (17.75 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (7), ఇందులో విదేశీ ఆటగాళ్లు (3) చెన్నై సూపర్ కింగ్స్: ఎంఎస్ ధోని (కెప్టెన్), మొయిన్ అలీ, దీపక్ చాహర్, డెవాన్ కాన్వే, తుషార్ దేశ్‌పాండే, శివమ్ దూబే, రుతురాజ్ గైక్వాడ్, రాజవర్ధన్ హంగర్గేకర్, రవీంద్ర జడేజా, అజయ్ మండల్, ముఖేష్ చౌదరి, మతీషా పతిరణ, అజింక్య రహానే, షేక్ రషీద్, మిచెల్ సాంట్నర్, సిమర్జీత్ సింగ్, నిశాంత్ సింధు, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-19 (14 మంది దేశీయ ఆటగాళ్లు, 5 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (68.6 కోట్లు), పర్స్‌లో మిగిలిన మొత్తం (31.4 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (6), ఇందులో విదేశీ ఆటగాళ్లు (3) గుజరాత్ టైటాన్స్: శుభమన్ గిల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, మాథ్యూ వేడ్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, రాహుల్ తెవాటియా, మహమ్మద్ షమీ, నూర్ అహ్మద్, సాయి కిషోర్, రషీద్ ఖాన్, జాషువా లిటిల్, మోహిత్ శర్మ ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-17 (11 మంది దేశీయ ఆటగాళ్లు, 6 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (76.85 కోట్లు), పర్స్‌లో మిగిలిన మొత్తం (38.15 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (7), ఇందులో విదేశీ ఆటగాళ్లు (2) ఢిల్లీ క్యాపిటల్స్: రిషబ్ పంత్ (కెప్టెన్), ప్రవీణ్ దూబే, డేవిడ్ వార్నర్, విక్కీ ఓస్త్వాల్, పృథ్వీ షా, అన్రిచ్ నోర్ట్జే, అభిషేక్ పోరెల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, లుంగీ ఎంగిడి, లలిత్ యాదవ్, ఖలీల్ అహ్మద్, మిచెల్ మార్ష్, ఇషాంత్ శర్మ, ముకేశ్ కుమార్ ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-15 (11 మంది దేశీయ ఆటగాళ్లు, 4 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (71.5 కోట్లు), పర్స్‌లో మిగిలిన మొత్తం (28.95 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (9), ఇందులో విదేశీ ఆటగాళ్లు (4) లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, కృనాల్ పాండ్యా, యుధ్వీర్ సింగ్, ప్రేరక్ మన్కడ్, యశ్ ఠాకూర్ , అమిత్ మిశ్రా, మార్క్ వుడ్, మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, దేవదత్ పడిక్కల్ ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-18 (12 మంది దేశీయ ఆటగాళ్లు, 6 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (86.85 కోట్లు), పర్స్‌లో మిగిలిన మొత్తం (13.15 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (6), ఇందులో విదేశీ ఆటగాళ్లు (2) రాజస్థాన్ రాయల్స్ : సంజు శాంసన్ (కెప్టెన్), జోస్ బట్లర్, షిమ్రాన్ హెట్మెయర్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, డోనోవన్ ఫెరీరా, కునాల్ రాథోడ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ సేన్, నవదీప్ సైనీ, ప్రసిద్ధ్ కృష్ణ, సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, ఆడమ్ జంపా, అవేష్ ఖాన్ ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-17 (12 మంది దేశీయ ఆటగాళ్లు, 5 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (85.5 కోట్లు), పర్స్‌లో మిగిలిన మొత్తం (14.5 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (8), ఇందులో విదేశీ ఆటగాళ్లు (3) సన్‌రైజర్స్ హైదరాబాద్: ఎయిడెన్ మార్క్రామ్ (కెప్టెన్), అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, మార్కో జాన్సెన్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ అగర్వాల్, టి నటరాజన్, అన్మోల్ప్రీత్ సింగ్, మయాంక్ మార్కండే, ఉపేంద్ర సింగ్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, నితీష్ కుమార్ రెడ్డి, ఫజల్ హక్ ఫారూఖీ, షాబాజ్ అహ్మద్ ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-19 (14 మంది దేశీయ ఆటగాళ్లు, 5 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (66 కోట్లు), పర్స్‌లో మిగిలిన మొత్తం (34 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (6), ఇందులో విదేశీ ఆటగాళ్లు (3) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్వెల్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేసాయి, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ డాగర్, విజయ కుమార్ వైశాక్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్, రీస్ టాప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, కామెరాన్ గ్రీన్ ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-19 (14 మంది దేశీయ ఆటగాళ్లు, 5 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (59.25 కోట్లు), పర్స్‌లో మిగిలిన మొత్తం (23.25 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (7), ఇందులో విదేశీ ఆటగాళ్లు (4) పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, ప్రభ్‌సిమ్రన్ సింగ్, జితేష్ శర్, సికందర్ రజా, రిషి ధవన్, లియామ్ లివింగ్‌స్టోన్, అథర్వ టైడే, అర్ష్‌దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్, సామ్ కర్రాన్, కగిసో రబడ, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ భాటియా, విద్వాత్ కవేరప్ప, శివమ్ సింగ్ ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-17 (11 మంది దేశీయ ఆటగాళ్లు, 6 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (70.9 కోట్లు), పర్స్‌లో మిగిలిన మొత్తం (29.1 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (8), ఇందులో విదేశీ ఆటగాళ్లు (2) కోల్‌కతా నైట్ రైడర్స్: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రాణా, రింకూ సింగ్, రహ్మానుల్లా గుర్బాజ్, జాసన్ రాయ్, సునీల్ నరైన్, సుయాష్ శర్మ, అనుకూల్ రాయ్, ఆండ్రీ రస్సెల్, వెంకటేష్ అయ్యర్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-13 (9 మంది దేశీయ ఆటగాళ్లు, 4 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (67.3 కోట్లు), పర్స్‌లో మిగిలిన మొత్తం (32.7 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (12), ఇందులో విదేశీ ఆటగాళ్లు (4) ఐపీఎల్ 2024 వేలం తేదీ: డిసెంబర్ 19, 2023 సమయం: మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ప్రారంభం (భారతకాలమానం ప్రకారం) వేదిక: దుబాయ్‌లోని కోకాకోలా ఎరీనా ప్రత్యక్ష ప్రసారం: స్టార్ స్పోర్ట్స్ (టీవీ) డిజిటల్: జియో సినిమా మొత్తం స్లాట్లు: 77 వేలంలో పాల్గొంటున్న మొత్తం ఆటగాళ్లు: 333 భారతీయ ఆటగాళ్లు: 214 విదేశీ ఆటగాళ్లు: 119 -
మనీశ్ పాండే, రచిన్‌తో పాటు అతడిని కొంటే సీఎస్కే టాప్-3లో!
ఐపీఎల్-2024 మినీ వేలానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో గెలుపు గుర్రాలను సొంతం చేసుకునేందుకు పది ఫ్రాంఛైజీలు తమ ప్రణాళికలతో సిద్ధమైపోయాయి. దుబాయ్ వేదికగా మంగళవారం జరుగనున్న ఆక్షన్‌లో గుజరాత్ టైటాన్స్ రూ. 38.15 కోట్ల మేర ఖాళీగా ఉన్న పర్సుతో బరిలోకి దిగనుండగా.. లక్నో సూపర్ జెయింట్స్ అత్యల్పంగా 13.15 కోట్లు కలిగి ఉండి ఆరు ఖాళీలను పూర్తి చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు.. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ పర్సులో రూ. 31.4 కోట్ల రూపాయలు మిగిలి ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ పర్సులో రూ. 28.95 కోట్లు, కోల్‌కతా నైట్‌రైడర్స్ పర్సులో రూ. 32.7 కోట్లు, ముంబై ఇండియన్స్ ఖాతాలో రూ. 17.75 కోట్లు, పంజాబ్ కింగ్స్ ఖాతాలో రూ. 29.1 కోట్లు, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఖాతాలో రూ. 23.25 కోట్లు, రాజస్తాన్ రాయల్స్ పర్సులో రూ. 14.5 కోట్లు , సన్‌రైజర్స్ హైదరాబాద్ పర్సులో రూ. 34 కోట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ బౌలర్ బ్రాడ్ హాగ్ సీఎస్కే గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్-2024 వేలంలో చెన్నై యాజమాన్యం ఇలాంటి వ్యూహాలు అనుసరిస్తే బాగుంటుందని పలు సూచనలు చేశాడు. మనీశ్ పాండే, హర్షల్ పటేల్‌లను కొనుక్కుంటే సీఎస్కేకు ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు.. ‘‘ఆర్సీబీతో పోటీ పడి మరీ సీఎస్కే హర్షల్ పటేల్‌ను దక్కించుకునే అవకాశం ఉంది. చెన్నై వికెట్ మీద హర్షల్ అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. ఒకవేళ వాళ్లు మనీష్ పాండే.. డారిల్ మిచెల్ లేదంటే రచిన్ రవీంద్రలలో ఒకరు.. హర్షల్ పటేల్‌లను కూడా కూడా కొనుక్కుంటే.. పాయింట్ల పట్టికలో కచ్చితంగా టాప్-3లో ఉంటుంది. ప్రస్తుతం సీఎస్కేకు మిడిలార్డర్లో రాణించగల భారత బ్యాటర్ అవసరం ఉంది. మనీశ్ పాండే ఆ లోటు భర్తీ చేయగలడు. కేవలం బ్యాటర్ మాత్రమే కాదు.. అతడొక మంచి ఫీల్డర్ కూడా! అయితే, ఇప్పటి వరకు తనలోని అత్యుత్తమ ఆటగాడిని బయటపెట్టలేదు. ఈసారి సీఎస్కే గనుక అతడికి అవకాశం ఇస్తే.. మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో కచ్చితంగా తనను తాను మరోసారి నిరూపించుకోగలడు. ఒకవేళ మనీశ్ పాండే మిడిలార్డర్లో సరైన బ్యాటర్ కాదనుకుంటే సీఎస్కే.. డారిల్ మిచెల్ వైపు చూసే అవకాశం ఉంది. లేదంటే.. రచిన్ రవీంద్రకు పెద్ద పీట వేసే అవకాశం ఉంటుంది’’ అని బ్రాడ్ హాగ్ యూట్యూబ్ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు రిటైర్ కావడంతో మిడిలార్డర్లో అతడి స్థానాన్ని సరైన ఆటగాడితో భర్తీ చేసే దిశగా సీఎస్కే ప్రణాళికలు రచిస్తోంది. చదవండి: IPL 2024: అందుకే కెప్టెన్‌గా రోహిత్‌పై వేటు.. పాండ్యావైపు మొగ్గు!? గావస్కర్ చెప్పిందిదే.. -
ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాళ్లు వీరే..!
ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు జరిగిన 16 వేలాల్లో అత్యధిక ధర పలికిన ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. సామ్ కర్రన్- 18.5 కోట్లు (2023, పంజాబ్ కింగ్స్) కెమారూన్ గ్రీన్- 17.5 కోట్లు (2023, ముంబై ఇండియన్స్) బెన్ స్టోక్స్- 16.25 కోట్లు (2023, చెన్నై సూపర్ కింగ్స్) క్రిస్ మోరిస్- 16.25 కోట్లు (2021,రాజస్తాన్ రాయల్స్) నికోలస్ పూరన్- 16 కోట్లు (2023, లక్నో సూపర్ జెయింట్స్) యువరాజ్ సింగ్-16 కోట్లు (2015, ఢిల్లీ డేర్ డెవిల్స్) పాట్ కమిన్స్-15.5 కోట్లు (2020, కేకేఆర్) ఇషాన్ కిషన్-15.25 కోట్లు (2022, ముంబై ఇండియన్స్) కైల్ జేమీసన్-15 కోట్లు (2021, ఆర్సీబీ) బెన్ స్టోక్స్-14.5 కోట్లు (2017, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్) సీజన్ల వారీగా అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు.. 2023: సామ్ కర్రన్- 18.5 కోట్లు (పంజాబ్ కింగ్స్) 2022: ఇషాన్ కిషన్-15.25 కోట్లు (ముంబై ఇండియన్స్) 2021: క్రిస్ మోరిస్- 16.25 కోట్లు (రాజస్తాన్ రాయల్స్) 2020: పాట్ కమిన్స్-15.5 కోట్లు (కోల్‌కతా నైట్‌రైడర్స్) 2019: జయదేవ్ ఉనద్కత్, వరుణ్ చక్రవర్తి- 8.4 కోట్లు (RR, KXIP) 2018: బెన్ స్టోక్స్- 12.5 కోట్లు (రాజస్తాన్ రాయల్స్) 2017: బెన్ స్టోక్స్-14.5 కోట్లు (రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్) 2016: షేన్ వాట్సన్- 9.5 కోట్లు (ఆర్సీబీ) 2015: యువరాజ్ సింగ్-16 కోట్లు (ఢిల్లీ డేర్ డెవిల్స్) 2014: యువరాజ్ సింగ్- 14 కోట్లు (ఆర్సీబీ) 2013: గ్లెన్ మ్యాక్స్‌వెల్- 6.3 కోట్లు (ముంబై ఇండియన్స్) 2012: రవీంద్ర జడేజా- 12.8 కోట్లు (సీఎస్కే) 2011: గౌతమ్ గంభీర్- 14.9 కోట్లు (కేకేఆర్) 2010: షేన్ బాండ్, కీరన్ పోలార్డ్- 4.8 కోట్లు (కేకేఆర్, ముంబై) 2009: కెవిన్ పీటర్సన్, ఆండ్రూ ఫ్లింటాఫ్- 9.8 కోట్లు (ఆర్సీబీ, సీఎస్కే) 2008: ఎంఎస్ ధోని- 9.5 కోట్లు (సీఎస్కే) ఐపీఎల్లో అత్యంత ఖరీదైన భారత ఆటగాడిగా విరాట్ కోహ్లి నిలిచాడు. కోహ్లికి ఆర్సీబీ యాజమాన్యం 2023 సీజన్ కోసం 17 కోట్లు ముట్టజెప్పింది. కోహ్లి తర్వాత అత్యధిక మొత్తం అందుకున్న భారత ఆటగాళ్లుగా రోహిత్ శర్మ (2023 సీజన్లో 16 కోట్లు), రవీంద్ర జడేజా (2023లో 16 కోట్లు, రిషబ్ పంత్ (2023లో 16 కోట్లు, యువరాజ్ సింగ్ (2015లో 16 కోట్లు) ఉన్నారు. వీరి తర్వాత ఇషాన్ కిషన్ (2022లో 15.25 కోట్లు), యువరాజ్ సింగ్ (2014లో 14 కోట్లు), దినేశ్ కార్తీక్ (2014లో 12.5 కోట్లు), శ్రేయస్ అయ్యర్ (2022లో 12.25 కోట్లు) అత్యధిక ధర పలికిన భారత ఆటగాళ్లుగా ఉన్నారు. ఐపీఎల్ 2024 వేలం తేదీ: డిసెంబర్ 19, 2023 సమయం: మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ప్రారంభం (భారతకాలమానం ప్రకారం) వేదిక: దుబాయ్‌లోని కోకాకోలా ఎరీనా ప్రత్యక్ష ప్రసారం: స్టార్ స్పోర్ట్స్ (టీవీ) డిజిటల్: జియో సినిమా మొత్తం స్లాట్లు: 77 వేలంలో పాల్గొంటున్న మొత్తం ఆటగాళ్లు: 333 భారతీయ ఆటగాళ్లు: 214 విదేశీ ఆటగాళ్లు: 119 -
ఐపీఎల్ 2024 వేలంలో పాల్గొంటున్న ఆటగాళ్లు వీరే.. ఎవరికి అధిక ధర దక్కవచ్చు..?
దుబాయ్‌లోని కోకాకోలా ఎరీనా వేదికగా రేపు (డిసెంబర్ 19) జరుగబోయే ఐపీఎల్ 2024 వేలంలో 77 స్లాట్ల కోసం మొత్తం 333 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. వీరిలో 214 మంది భారతీయ ఆటగాళ్లు కాగా.. 119 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. వేలం ప్రక్రియ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ప్రారంభమవుతుంది. 2 కోట్ల బేస్ ధర విభాగం: హ్యారీ బ్రూక్ ట్రవిస్ హెడ్ రిలీ రొస్సో స్టీవ్ స్మిత్ గెరాల్డ్ కొయెట్జీ పాట్ కమిన్స్ హర్షల్ పటేల్ శార్దూల్ ఠాకూర్ క్రిస్ వోక్స్ జోష్ ఇంగ్లిస్ లోకీ ఫెర్గూసన్ జోష్ హాజిల్‌వుడ్ మిచెల్ స్టార్క్ ఉమేశ్ యాదవ్ ముజీబ్ రెహ్మాన్ ఆదిల్ రషీద్ రస్సీ వాన్ డర్ డస్సెన్ జేమ్స్ విన్స్ సీన్ అబాట్ జేమీ ఓవర్టన్ డేవిడ్ విల్లే బెన్ డకెట్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ కోటి 50 లక్షల బేస్ ధర విభాగం: వనిందు హసరంగ ఫిలిప్ సాల్ట్ కొలిన్ మున్రో షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ టామ్ కర్రన్ జేసన్ హోల్డర్ మొహమ్మద్ నబీ జేమ్స్ నీషమ్ డేనియల్ సామ్స్ క్రిస్ జోర్డన్ టైమాల్ మిల్స్ జై రిచర్డ్సన్ టిమ్ సౌథీ కోటి విభాగం: రోవ్‌మన్ పావెల్ డారిల్ మిచెల్ అల్జరీ జోసఫ్ ఆష్టన్ టర్నర్ ఆస్టన్ అగర్ మైకేల్ బ్రేస్‌వెల్ డ్వేన్ ప్రిటోరియస్ సామ్ బిల్లింగ్స్ గస్ అట్కిన్సన్ కైల్ జేమీసన్ రిలే మెరిడిత్ ఆడమ్ మిల్నే వేన్ పార్నెల్ డేవిడ్ వీస్ 75 లక్షల విభాగం: ఐష్ సోధి ఫిన్ అలెన్ ఫేబియన్ అలెన్ కీమో పాల్ షాయ్ హోప్ తస్కిన్ అహ్మద్ మాట్ హెన్రీ లాన్స్ మోరిస్ ఓలీ రాబిన్సన్ బిల్లీ స్టాన్లేక్ ఓల్లీ స్టోన్ 50 లక్షల విభాగం: కరుణ్ నాయర్ మనీశ్ పాండే అజ్మతుల్లా ఒమర్జాయ్ రచిన్ రవీంద్ర కేఎస్ భరత్ కుశాల్ మెండిస్ ట్రిస్టన్ స్టబ్స్ దిల్షన్ మధుషంక శివమ్ మావీ చేతన సకారియా జయదేవ్ ఉనద్కత్ అకీల్ హొసేన్ మొహమ్మద్ వకార్ సలామ్‌కీల్ తబ్రేజ్ షంషి అలిక్ అథాంజే మార్క్ చాప్మన్ సామ్యూల్ హెయిన్ రీజా హెండ్రిక్స్ బ్రాండన్ కింగ్ ఇబ్రహీం జద్రాన్ నజీబుల్లా జద్రాన్ వెస్లీ అగర్ ఖౌస్ అహ్మద్ రెహాన్ అహ్మద్ చరిత్ అసలంకఔ బ్రైడన్ కార్స్ బెన్ కట్టింగ్ మాథ్యూ ఫోర్డ్ జార్జ్ లిండే కేశవ్ మహారాజ్ వియాన్ ముల్డర్ దసున్ షనక మాథ్యూ షార్ట్ ఓడియన్ స్మిత్ హనుమ విహారీ జాన్సన్ ఛార్లెస్ వరుణ్ ఆరోన్ ఫరీద్ అహ్మద్ దుష్మంత చమీర బెన్ డ్వార్షుయిష్ రిచర్డ్ గ్లీసన్ షోరీఫుల్ ఇస్లాం స్పెన్సర్ జాన్సన్ సిద్దార్థ్ కౌల్ లహీరు కుమార ఓబెద్ మెక్కాయ్ బ్లెసింగ్ ముజరబానీ రిచర్డ్ నగరవ జార్జ్ స్క్రిమ్షా భరిందర్ శ్రన్ ఒషేన్ థామస్ నువాన్ తిసార సందీప్ వారియర్ లిజాడ్ విలియమ్స్ లూక్ వుడ్ 40 లక్షల విభాగం: షారుఖ్ ఖాన్ టామ్ కొహ్లెర్ కాడ్మోర్ బెన్నీ హోవెల్ జలజ్ సక్సేనా 30 లక్షల విభాగం: కోర్బిన్ బోష్ కమలేశ్ నాగర్‌కోటీ బసిల్ థంపీ లలిత్ యాదవ్ ఎస్ మిథున్ ఇజ్‌హర్ ఉల్ హక్ నవీద్ 20 లక్షల విభాగం: ప్రియాంశ్ ఆర్య సౌరవ్ చౌహాన్ శుభమ్ దూబే రోహన్ కున్ముమ్మల్ అంగ్రిష్ రఘువంశీ సమీర్ రిజ్వి మనన్ వోహ్రా రాజ్ అంగద్ బవా మొహమ్మద్ అర్షద్ ఖాన్ సర్ఫరాజ్ ఖాన్ అర్షిన్ కులకర్ణి వివ్రాంత్ శర్మ అతీత్ సేథ్ హృతిక్ షోకీన్ రమన్‌దీప్ సింగ్ రికీ భుయ్ కుమార్ కుషాగ్రా ఉర్విల్ పటేల్ విష్ణు సోలంకీ రసిక్ దార్ యశ్ దయాల్ సుశాంత్ మిశ్రా ఇషాన్ పోరెల్ ఆకాశ్ సింగ్ కార్తీక్ త్యాగి కుల్దీప్ యాదవ్ మురుగన్ అశ్విన్ శ్రేయస్ గోపాల్ పుల్కిత్ నారంగ్ ఎం సిద్దార్థ్ శివ సింగ్ మనవ్ సుతార్ దినేశ్ బనా స్వస్తిక్ చిక్కరా రజత్ డే అభిమన్యు ఈశ్వరన్ రితిక్ ఈశ్వరన్ చిరాగ్ గాంధీ నికిల్ గంగ్తా సుదీప్ ఘరామీ అన్ష్ గోసాయి అజిమ్ ఖాజీ అమన్‌దీప్ ఖరే అంకిత్ కుమార్ భేపేన్ లల్వానీ పుక్రాజ్ మాన్ తన్మయ్ మిశ్రా సల్మాన్ నిజార్ ప్రియాంక్ పంచల్ అక్షత్ రఘువంశీ ఏకాంత్ సేన్ సుబ్రాన్షు సేనాపతి నౌషద్ షేక్ ధృవ్ షోరే హిమ్మత్ సింగ్ విరాట్ సింగ్ శశాంక్ సింగ్ సుమీత్ వర్మ పీఏ అబ్దుల్ మురుగన్ అభిషేక్ అథర్వ అంకోలేకర్ బాబా అపరాజిత్ జసిందర్ బైద్వాన్ రాహుల్ బుద్దీ వైశాక్ చంద్రన్ వ్రిత్తిక్ చటర్జీ రాజ్ చౌదరీ రవి చౌహాన్ అశ్విన్ దాస్ ఆర్య దేశాయ్ ఆర్య దేశాయ్ వినీత్ ధనకర్ నమన్ ధిర్ హర్ష్ దూబే ప్రేరిత్ దత్తా జేక్ ఫ్రేజర్ శుభంగ్ హేగ్డే సరాన్ష్ జైన్ డుయన్ జన్సెన్ మొహమ్మద్ కైఫ్ అన్షుల్ కంబోజ్ అమన్ ఖాన్ అర్సలన్ ఖాన్ ముషీర్ ఖాన్ సుమిత్ కుమార్ మన్వంత్ కుమార్ సౌరబ్ కుమార్ దేవ్ లక్రా నసీర్ లోన్ కౌశిక్ మైతీ దివిజ్ మెహ్రా మణిశంకర్ మురసింగ్ ఆబిద్ ముస్తాక్ సంజయ్ పహల్ జితిందర్ పాల్ అనుష్ పటేల్ సాయిరాజ్ పాటిల్ ప్రదోష్ పాల్ రోహిత్ రాయుడు ఉత్కర్ష్ సింగ్ రవి తేజ అవినాశ్ రావ్ అరవెల్లీ హార్విక్ దేశాయ్ బాబ ఇంద్రజిత్ ఆదిత్య తారే కేఎస్ ఆసిఫ్ బాసిత్ బషీర్ గుర్నూర్ సింగ్ బ్రార్ నండ్రే బర్గర్ అర్పిత్ గులేరియా రాజ్ లింబాని బాసిల్ థంపి పాల్ వాన్ మీకెరెన్ నితిన్ వర్మ క్రిస్ వుడ్ లలిత్ యాదవ్ పృథ్వీ రాజ్ యర్రా కేసీ కరియప్ప 20 లక్షల విభాగంలో ఇంకా 89 మంది ఆటగాళ్లు పేర్లు నమోదు చేసుకున్నారు. -
IPL 2024: స్టార్క్, కమిన్స్‌లకు భారీ ధర.. శార్దూల్ ఠాకూర్‌కు జాక్‌పాట్..!
ఐపీఎల్ 2024 వేలం రేపు (డిసెంబర్ 19) దుబాయ్‌లోని కోకాకోలా ఎరీనాలో జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ వేలం రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమవుతుంది. ఈ వేలానికి ముందు ఇవాళ (డిసెంబర్ 18) అదే వేదికపై మాక్ ఆక్షన్ (డమ్మీ వేలం) జరిగింది. ఈ వేలంలో పలువురు స్టార్ ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ కోసం ఆర్సీబీ చిన్న సైజ్ యుద్దమే చేసింది. ఆ జట్టు ప్రతినిధి మైక్ హెస్సన్ స్టార్క్‌ను 18.5 కోట్ల భారీ ధరకు దక్కించుకున్నాడు. మాక్ వేలంలో ఇదే అత్యధిక ధర. స్టార్క్ తర్వాత సౌతాఫ్రికా యంగ్ గన్ గెరాల్డ్ కొయెట్జీ కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. చివరికి కొయెట్జీని గుజరాత్ టైటాన్స్ 18 కోట్లకు దక్కించుకుంది. వీరిద్దరి తర్వాత ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ కోసం ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీపడ్డాయి. అంతిమంగా కమిన్స్‌ను 17.5 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. ఈ మాక్ ఆక్షన్‌లో ఎవరూ ఊహించని ధరకు లార్డ్ శార్దూల్ ఠాకూర్ అమ్ముడుపోయాడు. శార్దూల్‌ను పంజాబ్ కింగ్స్ 14 కోట్లకు దక్కించుకుంది. లంక పేసర్ దిల్షన్ మధుషంక, లంక స్పిన్నర్ వనిందు హసరంగ, ఆసీస్ స్టార్ బ్యాటర్, వరల్డ్‌కప్ హీరో ట్రవిస్ హెడ్ల కోసం కూడా ఫ్రాంచైజీలు తెగ పోటీపడ్డాయి. మధుషంకను కేకేఆర్ (10.5 కోట్లు), హ్యారీ బ్రూక్‌ను గుజరాత్ టైటాన్స్ ( 9.5 కోట్లు), హసరంగను (8.5 కోట్లు), ట్రవిస్ హెడ్లను (7 కోట్లు) సీఎస్కే దక్కించుకున్నాయి. మిచెల్ స్టార్క్- 18.5 కోట్లు (ఆర్సీబీ) గెరాల్డ్ కొయెట్జీ-18 కోట్లు (గుజరాత్ టైటాన్స్) పాట్ కమిన్స్- 17.5 కోట్లు (సన్‌రైజర్స్ హైదరాబాద్) శార్దూల్ ఠాకూర్-14 కోట్లు (పంజాబ్ కింగ్స్) దిల్షన్ మధుషంక-10.5 కోట్లు (కేకేఆర్) హ్యారీ బ్రూక్- 9.5 కోట్లు (గుజరాత్ టైటాన్స్) వనిందు హసరంగ-8.5 కోట్లు (సీఎస్కే) ట్రవిస్ హెడ్- 7 కోట్లు (సీఎస్కే) కాగా, మాక్ వేలంలో లభించిన ధర డమ్మీ ధర అయినప్పటికీ.. పై పేర్కొన్న ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు ఎగబడటం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది. రేపు జరుగబోయే అధికారిక వేలంలో ఈ ఆటగాళ్లపై కనక వర్షం కురువడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీరితో పాటు వరల్డ్‌కప్ హీరో, న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర కోసం కూడా ఫ్రాంచైజీలు ఎగబడవచ్చు. ఐపీఎల్ 2024 వేలం తేదీ: డిసెంబర్ 19, 2023 సమయం: మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ప్రారంభం (భారతకాలమానం ప్రకారం) వేదిక: దుబాయ్‌లోని కోకాకోలా ఎరీనా ప్రత్యక్ష ప్రసారం: స్టార్ స్పోర్ట్స్ (టీవీ) డిజిటల్: జియో సినిమా మొత్తం స్లాట్లు: 77 వేలంలో పాల్గొంటున్న మొత్తం ఆటగాళ్లు: 333 భారతీయ ఆటగాళ్లు: 214 విదేశీ ఆటగాళ్లు: 119 -
IPL 2024: వేలంలో వాళ్లిద్దరికి రూ. 14 కోట్లకు పైగానే! హెడ్‌కు తక్కువే!
ఐపీఎల్-2024 వేలానికి సమయం ఆసన్నమైన తరుణంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మంగళవారం(డిసెంబరు 19)నాటి వేలంలో భారీ ధరకు అమ్ముడుపోయే ఆటగాళ్లు వీరేనంటూ తన అంచనాలు తెలియజేశాడు. అయితే, ఈ వేలంలో హాట్‌కేక్‌గా మారతాడనుకున్న వన్డే వరల్డ్‌కప్-2023 హీరో ట్రవిస్ హెడ్ విషయంలో మాత్రం అశ్విన్ ట్విస్ట్ ఇవ్వడం విశేషం. అశ్విన్ అంచనా ప్రకారం.. దుబాయ్ వేదికగా జరుగునున్న క్యాష్ రిచ్ లీగ్ వేలంలో తమిళనాడు బ్యాటింగ్ ఆల్‌రౌండర్ షారుఖ్ ఖాన్ 10 -14 కోట్ల రూపాయలకు అమ్ముడుపోతాడు. న్యూజిలాండ్ ఆల్‌రౌండర్, ప్రపంచకప్-2023లో సెంచరీలతో విరుచుకుపడిన రచిన్ రవీంద్రకి రూ. 4- 7 కోట్ల మేర దక్కే అవకాశం ఉంది. ఇక టీమిండియా బౌలర్ హర్షల్ పటేల్, వెస్టిండీస్ బ్యాటర్ రోవ్‌మన్ పావెల్, సౌతాఫ్రికా బౌలర్ గెరాల్డ్ కోయెట్జీలు రూ. 7- 10 కోట్ల మేర ధర పలికే ఛాన్స్ ఉంది. మరోవైపు.. ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రవిస్ హెడ్ రేంజ్ మాత్రం రూ. 2- 4 కోట్ల మధ్యే ఉంటుందని అశ్విన్ అంచనా వేయడం గమనార్హం. ఇదిలా ఉంటే.. టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్ ఐపీఎల్-2024 వేలంలో రూ. 4- 7 కోట్లకు అమ్ముడుపోగలడని అశ్విన్ పేర్కొన్నాడు. అదేవిధంగా.. ఆస్ట్రేలియా స్టార్ పేసర్లు ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ మాత్రం రూ. 14 కోట్ల మార్కును దాటగలరని అశూ పేర్కొనడం విశేషం. సోషల్ మీడియా వేదికగా ఈ మేరకు తన అంచనాలు తెలియజేసిన అశ్విన్.. క్రికెట్ షాట్ల రూపంలో ఎవరు ఎంత ధర పలికే అవకాశం ఉందని తెలియజేయడం మరో విశేషం. డిఫెన్స్ షాట్(రూ. 2-4 కోట్ల మధ్య), డ్రైవ్(రూ. 4-7), పుల్‌షాట్(రూ. 7- 10 కోట్లు), స్లాగ్(రూ. 10-14 కోట్లు), హెలికాప్టర్ షాట్(14+ కోట్లకు పైగా) అంటూ అశ్విన్ వివిధ రేంజ్‌ల మధ్య ఉంటారనుకున్న ప్లేయర్ల పేర్లను ఇలా షాట్లతో పోల్చి వెల్లడించాడు. ఇందుకు సంబంధించిన వీడియోపై లుక్కేయండి! View this post on Instagram A post shared by Ashwin (@rashwin99) -
ఐపీఎల్ వేలానికి సర్వం సిద్దం.. కొత్త ఆక్షనీర్ ప్రకటన! ఎవరీ మల్లికా సాగర్?
ఐపీఎల్-2024 వేలానికి సర్వం సిద్దమైంది. మంగళవారం(డిసెంబర్ 19) దుబాయ్ వేదికగా ఈ క్యాష్‌రిచ్ లీగ్ వేలం జరగనుంది. ఈ వేలంలో భారత్‌తో సహా 12 దేశాల నుంచి మొత్తం 333 మంది ఆటగాళ్లు పాల్గొననున్నారు. ఉన్న ఖాళీలు 77 మాత్రమే. ఈ క్రమంలో వేలంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఐపీఎల్ ఫ్రాంచైజీలు దృష్టిపెట్టాయి. అయితే ఈసారి వేలాన్ని మల్లిక సాగర్ అడ్వానీ అనే మహిళ నిర్వహించనుంది. గత కొన్ని ఐపీఎల్ సీజన్లకు అక్షనిర్ వ్యవహరించిన హ్యూ ఎడ్మీడ్స్ స్ధానాన్ని మల్లిక సాగర్ భర్తీ చేయనుంది. ఈ మెరకు బీసీసీఐ ఆదివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. తద్వారా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో వేలం నిర్వహించనున్న తొలి మహిళా ఆక్షనిర్‌గా మల్లిక నిలవనుంది. ఈ క్రమంలో ఆమె గురించి నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. ఎవరీ మల్లికా సాగర్? 48 ఏళ్ల మల్లికా సాగర్ ముంబై చెందిన ఓ ఆర్ట్ కలెక్టర్. ఆమె మోడ్రన్ అండ్ కాన్టెంపరరీ ఇండియన్ ఆర్ట్ అనే ముంబై ఆధారిత సంస్థకు ఆర్ట్ కలెక్టర్ కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. ఆక్షన్లు నిర్వహించడంలో మల్లికకు పూర్వ అనుభవం ఉంది. ఆమె గత 20 ఏళ్లగా వేలం నిర్వాహకురాలిగా పనిచేస్తున్నారు. 2001లో క్రిస్టీస్ ఆక్షన్ హౌస్‌లో వేలం నిర్వాహకురాలిగా తన కెరీర్ మొదలుపెట్టారు. క్రిస్టీస్‌లో వేలం నిర్వహించిన భారత సంతతికి తొలి మహిళ ఆక్షనీర్‌గా మల్లికా నిలిచింది. ఇక క్రీడా వేలంలో కూడా ఆమెకు అనుభవం ఉంది. 2021లో ప్రొ కబడ్డీ లీగ్ వేలంలో తన వాక్ చాతుర్యంతో మల్లికా అందరిని అకట్టుకుంది. ఆ తర్వాత మహిళల ప్రీమియర్ లీగ్ తొట్టతొలి సీజన్‌కు సంబంధించిన వేలాన్ని కూడా మల్లికానే నిర్వహించింది. అదే విధంగా డిసెంబర్ 9న ముంబై వేదికగా జరిగిన డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ వేలంలో కూడా మల్లికానే ఆక్షనీర్. ఇప్పుడు మరోసారి వేలాన్ని దిగ్విజయంగా ముగించేందుకు మల్లికా సిద్దమైంది. చదవండి: IPL 2024: నిన్న రోహిత్... తాజాగా సచిన్ గుడ్‌బై... ముంబై ఇండియన్స్‌లో ఏమవుతోంది? -
టీమిండియా పేసర్‌కు ఊహించని షాకిచ్చిన బీసీసీఐ
టీమిండియా యువ బౌలర్, ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ పేసర్ చేతన్ సకారియాకు బీసీసీఐ ఊహించని షాకిచ్చింది. ఐపీఎల్ 2024 వేలానికి ముందు ఈ సౌరాష్ట్ర బౌలర్‌ను అనుమానిత బౌలింగ్ యాక్షన్ కలిగిన బౌలర్ల జాబితాలో చేర్చింది. బీసీసీఐ సకారియాను పూర్తిగా నిషేధించనప్పటికీ, అతని బౌలింగ్ యాక్షన్‌పై అనుమానాలు ఉన్నాయని ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు చెప్పకనే చెప్పింది. బీసీసీఐ చర్యతో 25 ఏళ్ల చేతన్ సకారియా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. బీసీసీఐ సకారియాతో పాటు మరో ఆరుగురు బౌలర్ల పేర్లను కూడా అనుమానిత బౌలింగ్ యాక్షన్ కలిగిన బౌలర్ల జాబితాలో చేర్చింది. కాగా, ఐపీఎల్‌కు సంబంధించి ఆటగాళ్ల రిలీజ్ ప్రక్రియలో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఇటీవలే సకారియాను రిలీజ్ చేసింది. అతను తిరిగి 2024 ఐపీఎల్ వేలంలో తన పేరును నమోదు చేసుకున్నాడు. ఈ వేలంలో సకారియా 50 బేస్ ప్రైజ్ విభాగంలో 27 నంబర్‌తో రిజిస్టర్ చేయబడ్డాడు. బీసీసీఐ అనుమానిత బౌలర్ల జాబితాలో సకారియా పేరు చేర్చడంతో ఫ్రాంఛైజీలు ఇతన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపకపోవచ్చు. సకారియా ఇప్పటివరకు తన ఐపీఎల్ కెరీర్లో 19 మ్యాచ్‌లు ఆడాడు. ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ రెండు టీ20లు, ఓ వన్డేలో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. అనుమానిత బౌలింగ్ యాక్షన్ కలిగిన ఇతర బౌలర్ల వివరాలు.. తనుష్ కోటియన్ (ముంబై) రోహన్ కున్నుమ్మల్ (కేరళ) చిరాగ్ గాంధీ (గుజరాత్) సల్మాన్ నిజార్ (కేరళ) సౌరబ్ దూబే (విదర్భ) అర్పిత్ గులేరియా (హిమాచల్‌ప్రదేశ్) మనీశ్ పాండే (కర్ణాటక) కేఎల్ శ్రీజిత్ (కర్ణాటక) పై పేర్కొన్న ఆటగాళ్లు అనుమానిత బౌలింగ్ యాక్షన్ కలిగిన ఆటగాళ్ల జాబితాలో మాత్రమే చేర్చబడ్డారు. వీరిపై ఎలాంటి నిషేధమూ లేదు. బ్యాటింగ్‌కు సంబంధించి వీరిపై ఎలాంటి అంక్షలు ఉండవు. -
IPL 2024 Auction: ఫ్రాంఛైజీల కళ్లన్నీ అతడిపైనే! హాట్‌కేకుల్లా ఆ ఇద్దరు!
IPL 2024 Auction: ఐపీఎల్–2024 సీజన్ కోసం ఆటగాళ్ల వేలానికి సర్వం సిద్ధమైంది. ఈనెల 19న దుబాయ్‌లో వేలం కార్యక్రమం జరుగుతుంది. మొత్తం 1166 మంది ఆటగాళ్లు నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో.. ఫ్రాంచైజీలతో సంప్రదించాక ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ 333 మందితో సోమవారం తుది జాబితాను ప్రకటించింది. ఇందులో 119 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఫ్రాంచైజీల కళ్లన్నీ అతడిపైనే ఇక వన్డే వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాను విజేతగా నిలపడంలో కీలకపాత్ర పోషించిన ట్రావిస్ హెడ్‌పై ఫ్రాంచైజీలన్నీ కన్నేశాయి. కమిన్స్, మిచెల్ స్టార్క్‌లు కూడా ఆసీస్ తరఫున హాట్ కేక్‌లు కానున్నారు. ప్రపంచకప్‌లో సెమీఫైనలిస్టుగా నిలిచిన న్యూజిలాండ్ తరఫున మెరిసిన రచిన్ రవీంద్రపై కూడా కోట్లు కురిసే అవకాశాలున్నాయి. 77 స్థానాలు.. కేకేఆర్‌కు అత్యధికంగా అదే విధంగా.. ఫ్రాంచైజీల విషయానికొస్తే మొత్తం 10 జట్లకు కావాల్సింది 77 మంది ఆటగాళ్లయితే ఇందులో 30 విదేశీ బెర్తులున్నాయి. ఇందుకోసం రూ. 262.95 కోట్లు వెచ్చించాల్సి ఉంది. ఖాళీల పరంగా చూస్తే అత్యధికంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ 12 మందిని కొనుక్కోవాల్సి ఉండగా... ఆ జట్టు చేతిలో రూ. 32.70 కోట్లు అందుబాటులో ఉన్నాయి. టైటాన్స్ వద్ద రూ.38.15 కోట్లు ఇక అత్యధిక మొత్తం రూ.38.15 కోట్లు గుజరాత్ వద్ద ఉంటే వారికి 8 మంది ఆటగాళ్లు కావాలి. కనిష్ట మొత్తం రూ. 13.15 కోట్లు లక్నో సూపర్ జెయింట్స్ ఖాతాలో ఉండగా... వారు ఆరు బెర్తుల్ని భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది. బరిలో ఉన్న తెలుగు క్రికెటర్లు వీరే! మరోవైపు.. ధోని టీమ్ చెన్నై ఖాతాలో రూ. 31.40 కోట్లు, కోహ్లి జట్టు బెంగళూరు ఖాతాలో రూ. 23.25 కోట్లు అందుబాటులో ఉండగా ఇరుజట్లకు ఆరుగురు చొప్పున ఖాళీలున్నాయి. ఇక హైదరాబాద్ నుంచి అభిషేక్ మురుగన్, రాహుల్ బుద్ధి, రోహిత్ రాయుడు, అనికేత్ రెడ్డి, రవితేజ, తనయ్ త్యాగరాజన్, అరవెల్లి అవినాశ్రావు, రక్షణ్ రెడ్డి, మనీశ్ రెడ్డి... ఆంధ్ర నుంచి కోన శ్రీకర్ భరత్, రికీ భుయ్, హనుమ విహారి, పృథ్వీరాజ్ వేలంలో ఉన్నారు. జట్టు- ఖాళీల సంఖ్య - మిగిలిన మొత్తం ►చెన్నై- 6- రూ. 31.4 కోట్లు ►ఢిల్లీ- 9 - రూ. 28.95 కోట్లు ►గుజరాత్- 8- రూ. 38.15 కోట్లు ►కోల్‌కతా - 12- రూ. 32.7 కోట్లు ►లక్నో- 6 - రూ. 13.15 కోట్లు ►ముంబై - 8 - రూ. 17.75 కోట్లు ►పంజాబ్- 8- రూ. 29.1 కోట్లు ►బెంగళూరు- 6 - రూ. 23.25 కోట్లు ►రాజస్తాన్ - 8- రూ. 14.5 కోట్లు ►హైదరాబాద్- 6- రూ. 34 కోట్లు ►మొత్తం- 77- రూ. 262.95 కోట్లు -
ఐపీఎల్ 2024 వేలంలో పాల్గొనబోయే ఆటగాళ్ల జాబితా విడుదల
దుబాయ్ వేదికగా ఈ నెల 19న జరిగే ఐపీఎల్ 2024 వేలంలో పాల్గొనబోయే ఆటగాళ్ల జాబితాను ఐపీఎల్ గవర్నింగ్ బాడీ కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. 77 స్లాట్ల కోసం (47 స్లాట్లు భారత్ ఆటగాళ్ల కోసం, 30 స్లాట్లు విదేశీ ఆటగాళ్ల కోసం) జరిగే ఈ వేలంలో మొత్తం 333 మంది ఆటగాళ్లు పాల్గొననున్నారు. ఇందులో 214 మంది భారత ఆటగాళ్లు కాగా.. 119 మంది విదేశీ ఆటగాళ్లు (ఇద్దరు అసోసియేట్ దేశాల ఆటగాళ్లు కలుపుకుని) ఉన్నారు. మొత్తం జాబితాలో 116 మంది క్యాప్డ్ ప్లేయర్స్ కాగా.. 215 మంది అన్క్యాప్డ్ ప్లేయర్స్, ఇద్దరు అసోసియేట్ దేశాల ఆటగాళ్లు ఉన్నారు. Kwena Maphaka will be the youngest, and Mohammad Nabi will be the oldest player among the 333 players set to go under the hammer on December 19th in Dubai. pic.twitter.com/Ekpxld6k2R — CricTracker (@Cricketracker) December 11, 2023 ఈ జాబితాలో 23 మంది ఆటగాళ్లు రూ. 2 కోట్ల బేస్ ధర విభాగంలో పేర్లు నమోదు చేసుకోగా.. 13 మంది రూ. 1.5 కోట్ల బేస్ ధరలో తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. ఈ వేలం భారతకాలమానం ప్రకారం డిసెంబర్ 19న మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. సెట్ నంబర్ 1: హ్యారీ బ్రూక్, ట్రవిస్ హెడ్, కరుణ్ నాయర్, మనీష్ పాండే, రోవ్‌మన్ పావెల్, రిలీ రొస్సో, స్టీవ్ స్మిత్ సెట్ నంబర్ 2: గెరాల్డ్ కోయెట్జీ, పాట్ కమిన్స్, వనిందు హసరంగా, డారిల్ మిచెల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్షల్ పటేల్, రచిన్ రవీంద్ర, శార్దూల్ ఠాకూర్, క్రిస్ వోక్స్ సెట్ నంబర్ 3: కేఎస్ భరత్, జోస్ ఇంగ్లిస్, కుశాల్ మెండిస్, ఫిలిప్ సాల్ట్, ట్రిస్టన్ స్టబ్స్ సెట్ నంబర్ 4: లోకీ ఫెర్గూసన్, జోష్ హాజిల్‌వుడ్, అల్జరీ జోసఫ్, మధుషంక, శివమ్ మావి, చేతన్ సకారియా, మిచెల్ స్టార్క్, జయదేవ్ ఉనద్కత్, ఉమేష్ యాదవ్ https://t.co/uarpx23uvV ☝️ Full players list for IPL 2024 Auction. You can download the PDF! Join 'CricketGully' telegram channel for all IPL Auction updates! pic.twitter.com/fujsFxdXUy — Johns. (@CricCrazyJohns) December 11, 2023 -
IPL 2023: నేనొక ఇడియట్.. సెంచరీ తర్వాత అలా మాట్లాడినందుకు: బ్రూక్
IPL 2023- SRH- Harry Brook: భారత క్రికెట్ అభిమానుల గురించి తాను అలా మాట్లాడకపోవాల్సిందంటూ ఇంగ్లండ్ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. ఐపీఎల్-2023లో సెంచరీ చేసిన సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యల వల్ల మనశ్శాంతి లేకుండా పోయిందని గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. ఏదేమైనా సోషల్ మీడియాకు కొంతకాలం దూరంగా ఉన్న తర్వాతే తన మానసిక స్థితి మెరుగుపడిందని చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్-2022 వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ 13.25 కోట్ల రూపాయాల భారీ మొత్తానికి హ్యారీ బ్రూక్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే, 24 ఏళ్ల ఈ మిడిలార్డర్ బ్యాటర్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. నోళ్లు మూయించానంటూ ఘాటు వ్యాఖ్యలు వరుస వైఫల్యాలతో విమర్శలు మూటగట్టుకున్నాడు. సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో శతకం బాదిన తర్వాత.. తనను ట్రోల్ చేసిన వాళ్ల నోళ్లు మూయించాను అంటూ బ్రూక్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. పశ్చాత్తాపంతో ఈ విషయం గురించి తాజాగా బీబీసీ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్న హ్యారీ బ్రూక్.. ‘‘అప్పుడు నేను ఓ ఇడియట్‌లా ప్రవర్తించాను. ఇంటర్వ్యూలో అలాంటి పిచ్చి మాటలు మాట్లాడకుండా ఉండాల్సింది. ఆ తర్వాత దాని గురించి పశ్చాత్తాపపడ్డాను. హోటల్ గదిలో కూర్చుని సోషల్ మీడియా అకౌంట్లు ఓపెన్ చేయగానే.. చూడకూడని కామెంట్లు ఎన్నో చూశాను. అప్పటి నుంచి నెట్టింటికి కొంతకాలం పాటు దూరం కావాలని నిర్ణయించుకున్నాను. భారీ మొత్తానికి న్యాయం చేయలేక నెగిటివిటీ గురించి పట్టించుకోకుండా.. కేవలం ఆట మీదే దృష్టిసారించాను. తద్వారా నా మానసిక ఆరోగ్యం మరింత మెరుగైంది’’ అని తెలిపాడు. కాగా ఐపీఎల్-2023 కోసం సన్‌రైజర్స్ తనపై వెచ్చించిన భారీ మొత్తానికి హ్యారీ బ్రూక్ న్యాయం చేయలేకపోయాడు. ఆడిన 11 ఇన్నింగ్స్‌లో కేవలం 190 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఈ క్రమంలో ఎస్ఆర్హెచ్ ఐపీఎల్-2024 వేలానికి ముందు బ్రూక్‌ను రిలీజ్ చేసింది. ప్రస్తుతం అతడు వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో బిజీగా ఉన్నాడు. విండీస్‌తో తొలి మ్యాచ్‌లో అతడు 71 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కానీ ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విండీస్ చేతిలో ఓటమిపాలైంది. చదవండి: సెంచరీతో చెలరేగిన సంజూ శాంసన్.. సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్! -
ప్రేయసిని పెళ్లాడిన సఫారీ పేస్ గన్
సౌతాఫ్రికా యంగ్ పేస్ గన్ గెరాల్డ్ కొయెట్జీ తన చిరకాల ప్రేయసిని పెళ్లాడాడు. వివాహానికి సంబంధించిన పలు ఫోటోలను కొయెట్జీ తన సోషల్‌మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేశాడు. కొయెట్జీ భాగస్వామి ఎవరన్న విషయమై పూర్తి సమాచారం లేనప్పటికీ.. గతంలో ఈ ఇద్దరూ చాలా సందర్భాల్లో కలిసి కనిపించారు. కొయెట్జీ పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. కాగా, భారత్ వేదికగా ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో గెరాల్డ్ కొయెట్జీ అద్భుతంగా రాణించాడు. 23 ఏళ్ల ఈ పేస్ గన్ అన్రిచ్ నోర్జే గాయపడటంతో జట్టులోకి వచ్చి సంచలన ప్రదర్శనలు నమోదు చేశాడు. మెగా టోర్నీలో 8 మ్యాచ్‌లు ఆడిన కొయెట్జీ.. 19.80 సగటున 20 వికెట్లు పడగొట్టి, టోర్నీ లీడింగ్ వికెట్‌టేకర్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. తన స్వల్ప కెరీర్లో 3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన కొయెట్జీ.. 43 వికెట్లు పడగొట్టాడు. కొయెట్జీ.. త్వరలో స్వదేశంలో భారత్‌తో జరిగే టీ20, టెస్ట్ సిరీస్‌లకు కూడా ఎంపికయ్యాడు. వరల్డ్‌కప్ సంచలన ప్రదర్శనల నేపథ్యంలో కొయెట్జీకి ఐపీఎల్ 2024 వేలంలో భారీ ధర దక్కే అవకాశం ఉంది. ఇతని కోసం ఫైవ్ టైమ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ పోటీ పడే అవకాశం ఉందని టీమిండియా వెటరన్ స్పిన్నర్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. పేస్ దిగ్గజం డేల్ స్టెయిన్‌ను పోలిన బౌలింగ్ శైలి కొయెట్జీని ప్రత్యేకంగా నిలబెడుతుందని యాశ్ అన్నాడు. ఇదిలా ఉంటే, డిసెంబర్ 10 నుంచి భారత్ దక్షిణాఫ్రికాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో 2 టెస్ట్‌లు, 3 టీ20లు, 3 వన్డేలు జరుగుతాయి. ఈ సిరీస్ కోసం ఇరు జట్లు ఇదివరకే జట్లను కూడా ప్రకటించాయి. సిరీస్‌లో భాగంగా తొలి టీ0 డర్బన్ వేదికగా డిసెంబర్ 10న జరుగనుంది. -
IPL 2024: క్యాష్ రిచ్ లీగ్‌కు దూరం కానున్న స్టార్ పేసర్.. కారణం?
ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ విషయంలో ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగం కావొద్దని అతడికి ఈసీబీ సూచించినట్లు తెలుస్తోంది. కాగా బార్బడోస్‌కు చెందిన 28 ఏళ్ల రైటార్మ్ పేసర్ జోఫ్రా ఆర్చర్.. ఐపీఎల్-2023 సీజన్లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. గతేడాది అతడిని ఎనిమిది కోట్ల రూపాయల భారీ ధరకు కొనుగోలు చేసింది ముంబై ఫ్రాంఛైజీ. గాయం కారణంగా ఐపీఎల్-2022 సీజన్ మొత్తానికి దూరమవుతాడని తెలిసినా పెద్ద మొత్తం అతడి కోసం పక్కకు పెట్టింది. అయితే, ఐపీఎల్-2023కి అతడు అందుబాటులోకి వచ్చినా.. ఆశించిన మేర ఆర్చర్ సేవలను వినియోగించుకోలేకపోయింది. గాయాల బెడద కారణంగా అతడు సింహభాగం మ్యాచ్‌లకు దూరమయ్యాడు. తాజా ఎడిషన్‌లో కేవలం ఐదు మ్యాచ్‌లు ఆడిన ఆర్చర్.. రెండు వికెట్లు మాత్రమే తీయగలిగాడు. తనపై ఖర్చు పెట్టిన మొత్తానికి న్యాయం చేయలేకపోయాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2024 వేలానికి ముందు ముంబై అతడిని విడుదల చేసింది. అయితే, ఆర్చర్ వేలంలో పాల్గొనాలని భావించినా ఈసీబీ అందుకు అడ్డు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ మేరకు..‘‘ఆర్చర్ పునరాగమనం చేయాలని కోరుకుంటున్న ఈసీబీ.. అతడిని ఏప్రిల్, మే మొత్తం తమ పర్యవేక్షణలోనే ఉండాలని భావిస్తోంది. ఒకవేళ అతడు వేలంలో పాల్గొంటే కచ్చితంగా ఏదో ఒక ఐపీఎల్ జట్టు అతడిని కొనుగోలు చేయడమే కాకుండా ఖర్చు తగ్గ ఫలితం పొందాలని ఆశిస్తుంది. కాబట్టి.. వరల్డ్‌కప్-2024 జూన్‌లోనే ప్రారంభమవుతున్న కారణంగా పని భారాన్ని తగ్గించుకునే వీలు ఉండకపోవచ్చు. అందుకే అతడు ఈసారి ఐపీఎల్‌కు దూరంగా ఉండనున్నాడు’’ అని ఈఎస్‌పీఎన్‌క్రిక్ ఇన్ఫో తన కథనంలో పేర్కొంది. కాగా జోఫ్రా ఆర్చర్ టీ20 వరల్డ్‌కప్‌నకు ముందు ఈసీబీతో రెండేళ్లకు గానూ కొత్త ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. దీంతో తమ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని ఆర్చర్‌కు ఈసీబీ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్‌కప్-2023 కోసం భారత్‌కు వచ్చిన జోఫ్రా ఆర్చర్ మోచేయి గాయం కారణంగా..వారంలోపే తిరిగి యూకేకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. కాబట్టి తమ పేసర్ ఫిట్నెస్ విషయంలో రిస్క్ తీసుకునేందుకు బోర్డు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. చదవండి: భారత్‌కు తిరిగి వచ్చిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. వీడియో వైరల్ -
IPL: సీఎస్కే కెప్టెన్‌గా.. ధోని వారసుడిగా పంత్!?
ఐపీఎల్-2024 వేలానికి ముందు టీమిండియా మాజీ వికెట్ కీపర్ దీప్‌దాస్ గుప్తా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐదుసార్లు చాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ భవిష్యత్ కెప్టెన్‌గా ఎవరూ ఊహించని పేరును చెప్పాడు. మహేంద్ర సింగ్ ధోని వారసుడు అయ్యే అవకాశం టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌కు ఉందని అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2023 ధోనికి చివరి సీజన్ అంటూ వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. అయితే, 40 ఏళ్ల వయసులో అనూహ్య రీతిలో చెన్నైకి ఐదోసారి ట్రోఫీ అందించిన ధోని.. రానున్న ఎడిషన్‌లోనూ బరిలోకి దిగడం దాదాపుగా ఖాయమైపోయింది. కానీ అతడు పూర్తిస్థాయి కెప్టెన్‌గా కొనసాగుతాడా లేదంటే.. గతంలో రవీంద్ర జడేజాకు అప్పగించిన మాదిరి ఈసారి కూడా వేరే వాళ్లకు పగ్గాలు ఇస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ధోని వారసుడిగా టీమిండియా యువ ఓపెనర్ రుతురాజ్‌కు ఆ అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే, దీప్‌దాస్ గుప్తా మాత్రం ఈ విషయంపై భిన్నంగా స్పందించాడు. అనూహ్యంగా రిషభ్ పంత్ పేరును తెరమీదకు తెచ్చాడు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. ‘‘ఐపీఎల్ 2025 నాటికి రిషభ్ పంత్‌ను వాళ్లు జట్టులోకి తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. మహేంద్ర సింగ్ ధోని, రిషభ్ పంత్ అత్యంత సన్నిహితంగా ఉంటారు. ధోనిని రిషభ్ ఆరాధిస్తాడు. ఎంఎస్‌కు కూడా పంత్ అంటే ఇష్టమే. వాళ్లిద్దరు గతంలో చాలాకాలం వరకు కలిసి ఆడారు. ఇద్దరూ ఒకే ఆలోచనా విధానం కలిగిన వారు. ఇద్దరూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతారు. గెలవాలన్న ఆలోచన తప్ప ప్రతికూల భావనలు దరిచేరనీయరు’’ అని దీప్‌దాస్ గుప్తా కొత్త చర్చకు తెరతీశాడు. కాగా డిసెంబరు 19న ఐపీఎల్ మినీ వేలానికి ముహూర్తం ఖరారైన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. గతేడాది ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన రిషభ్ పంత్.. 2023 సీజన్‌కు దూరమయ్యాడు. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా అతడి స్థానాన్ని డేవిడ్ వార్నర్ భర్తీ చేశాడు. అయితే, ఇప్పుడిపుడే కోలుకుంటున్న పంత్ 2024 ఎడిషన్‌లో ఢిల్లీ జట్టును ముందుకు నడిపించే అవకాశం ఉంది. చదవండి: షో చేయకపోవడం రాకపోవచ్చు కానీ.. భారత్, పాక్ మాజీ క్రికెటర్లు సమర్థులే: గంభీర్ Will Rishabh Pant move to CSK? Here’s what I feel. #deeppoint #cricket #indiancricketer #ipl #trending #viral #csk #dc pic.twitter.com/tgZQ9D3KRp — Deep Dasgupta (@DeepDasgupta7) December 2, 2023 -
Its official: డిసెంబర్ 19న ఐపీఎల్ 2024 వేలం.. ఎక్కడంటే?
ఐపీఎల్-2024కు సంబంధించిన వేలం దుబాయ్ వేదికగా డిసెంబర్ 19న జరగనుంది. ఈ విషయాన్ని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అధికారికంగా ఆదివారం ప్రకటించింది. కాగా ఐపీఎల్ వేలం భారత్‌లో కాకుండా బయట దేశంలో జరగడం ఇదే తొలి సారి. కాగా ఇప్పటికే ఈ మెగా ఈవెంట్లో భాగమయ్యే మొత్తం 10 ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ రిటైన్, విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాను బీసీసీఐకు సమర్పించాయి. ఐపీఎల్ వేలంలో 1166 మంది ఆటగాళ్లు.. ఇక ఈ క్యాష్ రిచ్ లీగ్ వేలంలో1166 మంది ఆటగాళ్లు తమ పేర్లను రిజస్టర్ చేస్తున్నారు. ఇందులో 830 మంది భారత ఆటగాళ్లు కాగా, 336 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. 212 మంది క్యాప్డ్ ప్లేయర్లు.. 909 అన్క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. అసోసియేట్ దేశాల నుంచి 45 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అయితే ఐపీఎల్ ప్రాంఛైజీలలో మొత్తం కలిపి 77 స్ధానాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 30 స్లాట్స్ విదేశీ క్రికెటర్లవే కావడం గమనార్హం. ఈ వేలంలో మిచెల్ స్టార్క్, ట్రావిస్ హెడ్, ప్యాట్ కమ్మిన్స్, రచిన్ రవీంద్ర వంటి స్టార్ ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. భారత్ నుంచి శార్ధూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, హర్షల్ పటేల్ వంటి వారు వేలంలో ఉన్నారు. చదవండి: PAK vs AUS: వార్నర్ ఏమి హీరో కాదు.. ఘన వీడ్కోలు ఎందుకు? జాన్సన్ సంచలన వ్యాఖ్యలు 𝗜𝗣𝗟 𝟮𝟬𝟮𝟰 𝗔𝘂𝗰𝘁𝗶𝗼𝗻 🔨 🗓️ 19th December 📍 𝗗𝗨𝗕𝗔𝗜 🤩 ARE. YOU. READY ❓ #IPLAuction | #IPL pic.twitter.com/TmmqDNObKR — IndianPremierLeague (@IPL) December 3, 2023 -
ఐపీఎల్ వేలంలోకి 1166 మంది ప్లేయర్స్.. వారి కోసం తీవ్ర పోటీ!
ఐపీఎల్-2024 సీజన్ మినీ వేలానికి రంగం సిద్దమవుతోంది. ఇప్పటికే ఈ క్యాష్‌రిచ్ లీగ్‌లో భాగమయ్యే మొత్తం 10 ఫ్రాంఛైజీలు తమ రిటేన్షన్ జాబితాను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌కు సమర్పించాయి. వేలానికి ముందే ఎన్నో సంచలనాలు నమోదు అవుతున్నాయి. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడింగ్ ద్వారా ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. ఈ డీల్ అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించిన మినీ వేలం డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా జరగనుంది. ఈ క్రమంలో వేలంలో 1166 మంది ఆటగాళ్లు తమ పేర్లను రిజస్టర్ చేస్తున్నారు. ఇందులో 830 మంది భారత ఆటగాళ్లు కాగా, 336 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. 212 మంది క్యాప్డ్ ప్లేయర్లు.. 909 అన్క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. అసోసియేట్ దేశాల నుంచి 45 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అయితే ఐపీఎల్ ప్రాంఛైజీలలో మొత్తం కలిపి 77 స్ధానాలు ఖాలీగా ఉన్నాయి. ఇందులో 30 స్లాట్స్ విదేశీ క్రికెటర్లవే కావడం గమనార్హం. కాగా వేలానికి ముందు 1166 మంది ఆటగాళ్లను ఫిల్టర్ చేసి ఫైనల్ లిస్ట్‌ను తాయరు చేసే ఛాన్స్ ఉంది. ఈ వేలంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లకు భారీ ధర పలికే అవకాశముంది. వరల్డ్‌కప్‌లో అదరగొట్టిన ట్రావిస్ హెడ్, ప్యాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్ వంటి వారి కోసం ఫ్రాంచైజీలు పోటీ పడే ఛాన్స్ ఉంది. అదే విధంగా వరల్డ్‌కప్‌లో దుమ్మురేపిన కివీస్ యవ సంచలనం రచిన్ రవీంద్ర కూడా భారీ ధరకు అమ్ముడుపోయే సూచనలు కన్పిస్తున్నాయి. కాగా ఈ వేలంలో శ్రీలంక స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగా గాయం కారణంగా తన పేరును నమోదు చేసుకోలేదు. చదవండి: IND vs AUS: ఆసీస్‌తో ఐదో టీ20.. టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్! తిలక్ రీ ఎంట్రీ -
ఐపీఎల్-2024 విషయంలో బీసీసీఐకి తలనొప్పులు! కారణాలు?
IPL 2024: క్రికెట్ ప్రేమికులకు ఏటా కావాల్సినంత వినోదం పంచుతోంది ఇండియన్ ప్రీమియర్ లీగ్. ప్రపంచంలోనే ధనిక టీ20 లీగ్‌గా పేరొందిన ఈ మెగా టోర్నీని ప్రతి ఏడాది ప్రథమార్థం ముగింపు దశలో నిర్వహిస్తోంది భారత క్రికెట్ నియంత్రణ మండలి. అయితే, ఈసారి మాత్రం ఐపీఎల్ షెడ్యూల్ విషయంలో బీసీసీఐకి తలనొప్పులు తప్పేలా లేవు. ఓవైపు లోక్‌సభ ఎన్నికలు.. మరోవైపు టీ20 ప్రపంచకప్-2024 నేపథ్యంలో క్యాష్‌రిచ్ లీగ్ ఎక్కడ నిర్వహించాలన్న అంశంపై బీసీసీఐ ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లు సమాచారం. కాగా సాధారణ ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇలాంటి తరుణంలో దేశ, విదేశాల నుంచి వచ్చే స్టార్ క్రికెటర్లు పాల్గొనే ఐపీఎల్ కూడా నిర్వహించడం కత్తిమీద సాములాంటిదే. లోక్‌సభ ఎన్నికల నగారా మోగిన తర్వాతే ఈ నేపథ్యంలో ఐపీఎల్ షెడ్యూల్‌ను వాయిదా వేయాలని భావిస్తే జూన్ 4 నుంచి టీ20 ప్రపంచకప్ రూపంలో ఐసీసీ ఈవెంట్ అడ్డుతగులుతుంది. దీంతో ఈసారి ఐపీఎల్‌ను విదేశాల్లో నిర్వహించేందుకు బీసీసీఐ మొగ్గుచూపే అవకాశం ఉంది. ఈ విషయంలో ఐపీఎల్ పాలకమండలి లోక్‌సభ ఎన్నికల నగారా మోగే వరకు ఎదురుచూసి అంతిమ నిర్ణయం తీసుకోనున్నట్లు పీటీఐ వెల్లడించింది. గతంలో సౌతాఫ్రికా, యూఏఈలో కాగా 2009, 2014, 2019 సాధారణ ఎన్నికల సమయంలో కూడా ఐపీఎల్ నిర్వహణ విషయంలో ఇలాంటి సమస్యలే తలెత్తాయి. రెండో ఎడిషన్(2009)లో వేదికను మొత్తంగా సౌతాఫ్రికాకు తరలించగా.. ఏడో సీజన్(2014)లో మొదటి సగం మ్యాచ్‌లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో నిర్వహించారు. ఇక 2019లో తొలి 19 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను విడుదల చేసిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్.. ఎన్నికల తేదీల విషయంలో స్పష్టత వచ్చాక మిగతా మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ప్రకటించి ఇండియాలోనే టోర్నీని నిర్వహించింది. ఇదిలా ఉంటే.. డిసెంబరు 19 ఐపీఎల్-2024 మినీ వేలం జరుగనున్న విషయం తెలిసిందే. చదవండి: బీసీసీఐ అలా చేస్తే.. అంతకంటే పిచ్చితనం మరొకటి ఉండదు: రసెల్ -
అతడొక ఫినిషర్.. వేలంలో తీవ్ర పోటీ! రూ.13 కోట్లకు
ఐపీఎల్-2024 సీజన్ వేలానికి ముందు తమిళనాడు స్టార్ ఆల్‌రౌండర్ షారుఖ్ ఖాన్ ను పంజాబ్ కింగ్స్ విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. ఐపీఎల్-2021 మినీ వేలంలో రూ.9 కోట్ల భారీ ధరకు షారుఖ్ ఖాన్‌ను పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. అయితే ఫినిషర్‌గా పంజాబ్ జట్టులోకి వచ్చిన షారూఖ్ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమయ్యాడు. 3 సీజన్ల పాటు పంజాబ్ కింగ్స్ తరపున 33 మ్యాచ్‌లు ఆడిన ఆడిన అతడు 134.81 స్ట్రైక్ రేట్‌తో కేవలం 426 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలోనే అతడిని పంజాబ్ కింగ్స్ ఈసారి విడిచిపెట్టింది. ఇక ఇది ఇలా ఉండగా.. వేలంలోకి వచ్చిన షారుఖ్ ఖాన్ మరోసారి భారీ ధరకు అమ్ముడుపోతాడని టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. షారుఖ్ ఖాన్ కోసం వేలంలో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ జట్లు కచ్చితంగా పోటీపడతాయి. గుజరాత్ హార్దిక్ పాండ్యాను విడిచిపెట్టింది కాబట్టి ఆ జట్టు ఇప్పుడు ఒక ఫినిషర్ కావాలి. ఈ నేపథ్యంలో అతడిని సొంతం చేసుకునేందుకు గుజరాత్ ప్రయత్నిస్తోంది. అదే విధంగా చెన్నైకు బెన్ స్టోక్స్ కూడా లేడు, దీంతో సీఎస్కే కూడా అతడిని దక్కించుకునేందుకు శ్రమిస్తోంది. ఇప్పటివరకు షారుఖ్ పంజాబ్ కింగ్స్‌తో 9 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. కానీ ఈసారి అతడిని పంజాబ్ కింగ్స్ రిటైన్ చేసుకోలేదు. అతడు మళ్లీ రూ.12 నుంచి 13 కోట్లకు అమ్ముడుపోతడాని అశ్విన్ జోస్యం చెప్పాడు. కాగా ఐపీఎల్-2024 సీజన్‌కు సంబంధించిన మినీ వేలం డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా జరగనుంది. చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాతో టీ20, వన్డే సిరీస్.. టీమిండియా కెప్టెన్‌గా కేఎల్ రాహుల్!? -
IPL 2024: ధోని ఇంకో మూడేళ్లు ఐపీఎల్ ఆడతాడు!
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ గురించి సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోని ఓ సర్ప్రైజ్ ప్యాకేజ్ అని.. అతడి భవిష్యత్తు గురించి అంచనా వేయడం ఎవరికీ సాధ్యం కాదని పేర్కొన్నాడు. ఏదేమైనా.. ఐపీఎల్- 2024 వేలం నేపథ్యంలో సీఎస్కే ఫ్రాంచైజీ తీసుకున్న నిర్ణయం తనకు సంతోషాన్నిచ్చిందని హర్షం వ్యక్తం చేశాడు కాగా ఐపీఎల్-2023 లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అంతకుముందు సీజన్లో ఘోరంగా విఫలమైన చెన్నైని ధోని తన అద్భుత కెప్టెన్సీతో తదుపరి ఎడిషన్‌లో మరోసారి చాంపియన్‌గా నిలిపాడు. రికార్డు స్థాయిలో ఏకంగా ఐదోసారి ట్రోఫీ అందించాడు. అయితే.. 41 ఏళ్ల ధోని వయసు దృష్ట్యా అతడు వచ్చే ఏడాది ఐపీఎల్‌కు వీడ్కోలు పలుకుతాడని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ.. రిటెన్షన్ గడువు ముగిసే నేపథ్యంలో సీఎస్కే తమ రిటెన్షన్ లిస్టులో ధోనీ పేరును చేర్చడం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ నేపథ్యంలో ఏబీ డివిలియర్స్ స్పందిస్తూ.. ధోని మరో రెండు మూడేళ్ల పాటు ఐపీఎల్లో కొనసాగే సత్తా ఉన్న ఆటగాడని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు.. రిటెన్షన్‌లో అతడి పేరు చూడగానే నాకు సంతోషంగా అనిపించింది. గత సీజన్ అతడికి చివరిది అవుతుంది అంటూ వార్తలు వినిపించాయి. అయితే అతడు 2024 సీజన్ కూడా ఆడేందుకు సిద్ధమయ్యాడు. ధోని అంటే సర్ప్రైజ్ ప్యాకేజ్ ఇంకో రెండు.. మూడు ఏళ్ల పాటు అతడు ఐపీఎల్లో కొనసాగే అవకాశం ఉంది. ఏదేమైనా వచ్చే ఎడిషన్‌లో అతడు కనిపించనుండటం నాకు నిజంగా సంతోషాన్నిస్తోంది అని పేర్కొన్నారు. కాగా గత సీజన్లో మోకాలికి గాయమైనప్పటికీ ధోని ఒక్క మ్యాచ్ కూడా మిస్ కాకుండా జట్టును టైటిల్ విజేతగా నిలిపాడు -
IPL 2024: రూ. 15 కోట్లు కాదు! అంతకు మించి.. అశూ కీలక వ్యాఖ్యలు
IPL 2024- Hardik Pandya: ఐపీఎల్-2024 వేలం నేపథ్యంలో హార్దిక్ పాండ్యా ఫ్రాంఛైజీ మార్పు గురించి క్రీడావర్గాల్లో చర్చ కొనసాగుతూనే ఉంది. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా విజయవంతంగా కొనసాగుతున్న ఈ స్టార్ ఆల్‌రౌండర్ అకస్మాత్తుగా ముంబై ఇండియన్స్‌లో తిరిగి చేరడం సంచలనంగా మారింది. రూ. 15 కోట్ల విలువైన ఆటగాడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఐపీఎల్ చరిత్రలో ఖరీదైన ట్రేడింగ్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ట్రేడింగ్ ద్వారా ఐపీఎల్ జట్టు మారిన ఆటగాడికి అందే మొత్తం ఎంత ఉంటుందో వివరించే ప్రయత్నం చేశాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్ ట్రేడ్ డీల్ ఎలా ఉంటుందో మీకు చెప్పడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. గతంలో నేను కూడా ఇలాగే జట్టు మారిన వాడినే. ట్రేడింగ్ సమయంలో ఓ ఆటగాడు ఎంత మొత్తానికైతే మారుతున్నాడో అందులో పది నుంచి 50% వరకు పొందుతాడు. ఉదాహరణకు.. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ హార్దిక్ పాండ్యాను గుజరాత్ టైటాన్స్ నుంచి 15 కోట్ల రూపాయలకు ట్రేడ్ చేసుకున్నట్లు చెబుతోంది. ఇలాంటి సందర్భాల్లో ఆటగాడిని ఆయా ప్రాంచేజీలు తమ కమోడిటీగా భావిస్తాయి. అందుకోసం కాంట్రాక్ట్ చేసుకున్న మొత్తం చెల్లిస్తాయి. అయితే ప్లేయర్‌కు అదనంగా ఇంకొంత మొత్తం కూడా అందజేస్తాయి. ఈ విషయాన్ని మాత్రం బయటకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ట్రేడింగ్ చేసుకున్న ఫ్రాంచైజీలు, ఆటగాడికి మధ్య ఉన్న అంతర్గత వ్యవహారం’’ అని అశ్విన్ పేర్కొన్నాడు. తొలుత రహానే.. కాగా.. క్యాష్ రిచ్ లీగ్‌లో ట్రేడింగ్ రూపంలో ఫ్రాంచైజీ మారిన తొలి కెప్టెన్ అజింక్యా రహానే. ఐపీఎల్-2020 సీజన్‌కు ముందు ఈ వెటరన్ బ్యాటర్ రాజస్తాన్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌కు ట్రేడ్ అయ్యాడు. ఐపీఎల్-2011లో రాజస్తాన్ రాయల్స్‌కు రహానే కెప్టెన్‌గా వ్యవహరించాడు. రహానే తర్వాత .. ఈ లిస్ట్‌లో రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు. ఐపీఎల్-2020కు ముందు పంజాబ్ కింగ్స్ నుంచి అశ్విన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ట్రేడింగ్ ద్వారానే సొంతం చేసుకుంది. -
ముంబై కెప్టెన్‌గా హార్దిక్? బుమ్రా అసహనం.. పోస్ట్ వైరల్
IPL 2024- Mumbai Indians: ఐపీఎల్ చరిత్రలో సంచలన ట్రేడింగ్‌గా నిలిచింది హార్దిక్ పాండ్యా వ్యవహారం. ఈ ఆల్‌రౌండర్‌కు జీవితాన్నిచ్చిన ముంబై ఇండియన్స్.. గాయాల బెడదతో బాధపడుతున్న సమయంలో అతడిని వదిలేసింది. ఈ క్రమంలో పూర్తిస్థాయి ఫిట్నెస్ లేనప్పటికీ కొత్త ఫ్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్ హార్దిక్ పాండ్యాపై నమ్మకం ఉంచింది. గతంలో కెప్టెన్సీ అనుభవం లేకున్నా పాండ్యాకు తమ జట్టు పగ్గాలు అప్పగించింది. అరంగేట్రంలోనే చాంపియన్‌గా యాజమాన్యం తనపై పెట్టుకున్న నమ్మకానికి తగ్గట్లుగానే ఈ బరోడా క్రికెటర్.. అరంగేట్ర సీజన్లోనే టైటాన్స్‌ను 2022 సీజన్ విజేతగా నిలిపాడు. అదే విధంగా.. ఐపీఎల్-2023 ఎడిషన్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన జట్టును ఫైనల్ వరకు తీసుకువెళ్లాడు. ఈ క్రమంలో ఐపీఎల్-2024 వేలానికి ముందు పాండ్యా జట్టు మారనున్నాడనే వార్తలు వినిపించినా టైటాన్స్ అభిమానులు మాత్రం వీటిని వట్టి పుకార్లేనని కొట్టిపారేశారు. అనూహ్యంగా సొంతగూటికి పాండ్యా అందుకు తగ్గట్లుగానే గుజరాత్ టైటాన్స్ తమ రిటైన్ ప్లేయర్ల జాబితాలో పాండ్యా పేరును చేర్చింది. కానీ గంటల వ్యవధిలోనే అతడు సొంత గూటికి చేరిపోయాడు. గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ అధికారికంగా తమ కుటుంబంలోకి ఆహ్వానించింది. పాండ్యా కోసం రూ. 15 కోట్లు టైటాన్స్‌కు చెల్లించి అతడిని తిరిగి తీసుకుంది. తీవ్ర అసహనంలో బుమ్రా? ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ అభిమానులు ఖుషీ అవుతుండగా.. ఆ జట్టు స్టార్ బౌలర్, టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ‘‘కొన్నిసార్లు నిశ్శబ్దమే అత్యుతమ సమాధానంగా నిలుస్తుంది’’ అంటూ బుమ్రా చేసిన పోస్ట్ ఇందుకు కారణం. కాగా టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ టీ20లకు స్వస్తి పలకాలనే యోచనలో ఉన్నాడన్న వార్తల నేపథ్యంలో.. హార్దిక్ పాండ్యా ముంబై కెప్టెన్సీ చేపట్టడం లాంఛనమే కానుంది. అయితే, ఇదే బుమ్రా అసహనానికి కారణంగా తెలుస్తోంది. రోహిత్ తర్వాత నాయకుడు కావాలనుకున్న బుమ్రా? రోహిత్ తర్వాత ముంబై నాయకుడు కావాలనే ఉద్దేశంతోనే బుమ్రా ఇన్నాళ్లూ ఆ జట్టుతో కొనసాగుతున్నాడని.. అయితే, పాండ్యా రీఎంట్రీతో అది సాధ్యపడదన్న విషయం అతడికి అర్థమైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే.. ఇన్‌స్టా వేదికగా ఇలాంటి పోస్ట్ పెట్టాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుమ్రా పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. ముంబై ఇండియన్స్‌ను అన్‌ఫాలో చేసిన బుమ్రా.. ఆర్సీబీని ఫాలో అవుతున్నాడంటూ మరికొన్ని వార్తలు వస్తున్నాయి. ముంబైని వీడి అతడు బెంగళూరు ఫ్రాంఛైజీతో ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అత్యాశతో ఉన్నవాళ్లకే పెద్దపీట మరోవైపు.. అతడు చెన్నై సూపర్‌కింగ్స్‌తో జట్టుకట్టే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా బుమ్రా అధికారికంగా ఈ విషయంపై స్పందిస్తేనే స్పష్టత వస్తుంది. అయితే, బుమ్రా అభిమానులు మాత్రం.. ‘‘నమ్మకంగా ఉండేవాళ్ల కంటే.. అత్యాశతో అటూ ఇటూ పరుగులు తీసేవాళ్లకే ఇప్పుడు పెద్దపీట వేస్తున్నారు’’ అంటూ పాండ్యా జట్టు మారిన తీరును విమర్శిస్తున్నారు. చదవండి: IPL 2024: గుజరాత్ టైటాన్స్ వదిలేసింది.. కసితో సుడిగాలి శతకం Jasprit Bumrah's Instagram story. pic.twitter.com/EgpAirzwai — Mufaddal Vohra (@mufaddal_vohra) November 28, 2023 -
IPL 2024: ఫ్రాంచైజీలు వదిలించుకున్న ఖరీదైన ఆటగాళ్లు వీరే..! (ఫొటోలు)
-
IPL 2024: గుజరాత్ కెప్టెన్‌గా గిల్
న్యూఢిల్లీ: భారత ఓపెనర్, కెరీర్లో మంచి ఫామ్‌తో దూసుకుపోతున్న శుబ్‌మన్ గిల్‌కు మరో మంచి అవకాశం లభించింది. ఐపీఎల్ జట్టు గుజరాత్ టైటాన్స్‌కు అతను కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌కు వెళ్లిపోవడంతో అతని స్థానంలో గిల్‌ను సారథిగా నియమిస్తున్నట్లు టైటాన్స్ మేనేజ్మెంట్ ప్రకటించింది. ‘గిల్ తన కెరీర్లో మంచి ఎదుగుదలను చూపించాడు. గత రెండేళ్లుగా అతను అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. అతనిలో మంచి నాయకత్వ లక్షణాలను కూడా టీమ్ మేనేజ్మెంట్ చూసింది. గిల్ నాయకత్వంలో మా జట్టు మరిన్ని మంచి ఫలితాలు సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అని గుజరాత్ టీమ్ డైరెక్టర్ విక్రమ్ సోలంకి వెల్లడించారు. 24 ఏళ్ల గిల్ ఐపీఎల్ కెరీర్ 2018లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మొదలైంది. నాలుగేళ్లు ఆడిన తర్వాత ఆ జట్టు గిల్‌ను వదులుకుంది. 2022 సీజన్‌కు ముందు జరిగిన వేలంలో గుజరాత్ టైటాన్స్ గిల్‌ను సొంతం చేసుకుంది. తొలి సీజన్లో 16 మ్యాచ్‌లలో 483 పరుగులు చేసిన అతను ఫైనల్లో కీలకమైన 45 పరుగులు సాధించి జట్టు విజయంలో తనదైన పాత్ర పోషించాడు. అయితే తర్వాతి సీజన్లో గిల్ చెలరేగిపోయాడు. 3 సెంచరీలు సహా ఏకంగా 893 పరుగులు సాధించాడు. గత ఐదేళ్ల ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో గిల్ టాప్–5లో ఉన్నాడు. విలియమ్సన్, రషీద్, మిల్లర్, వేడ్, షమీలాంటి అనుభవజు్ఞలైన ఆటగాళ్లతో కూడిన జట్టును గిల్ నడిపించాల్సి ఉంది. గతంలో దేశవాళీ క్రికెట్లో దులీప్ ట్రోఫీ, దేవధర్ ట్రోఫీలలో కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం గిల్‌కు ఉంది. మరో వైపు హార్దిక్ పాండ్యా 2015 వేలం సమయంలో తొలిసారి తన పేరు వచి్చనప్పుడు, ముంబై ఇండియన్స్ తనను రూ. 10 లక్షలకు సొంతం చేసుకున్న వీడియోను పోస్ట్ చేస్తూ ‘ఎన్నో చిరస్మరణీయ జ్ఞాపకాలు కదలాడుతున్నాయి. ముంబై..వాంఖెడే..పల్టన్...చాలా బాగుంది. సొంతింటికి తిరిగి వచి్చనట్లుగా ఉంది’ అని వ్యాఖ్య జోడించాడు. -
హార్దిక్ ఒక్కడే కాదు.. గతంలోనూ కెప్టెన్ల ట్రేడింగ్! ఎవరెవరంటే?
ఐపీఎల్-2024 సీజన్‌కు ఇంకా 5 నెలల సమయం ఉన్నప్పటికి.. ఇప్పటినుంచే సంచలనాలు నమోదు అవుతున్నాయి. ఈ ఐపీఎల్-17వ సీజన్‌కు వేలానికి ముందు ఓ అనుహ్య మార్పు చోటు చేసుకుంది. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్, టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా.. తిరిగి ముంబై ఇండియన్స్‌లోకి చేరాడు. క్యాష్ ట్రేడింగ్ ద్వారా గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది. తొలి రెండు సీజన్లలో గుజరాత్‌ను ఓ సారి ఛాంఫియన్స్‌గా.. మరోసారి రన్నరప్‌గా నిలిపిన హార్దిక్ పాండ్యా అనూహ్యంగా ఫ్రాంచైజీ మారడంపై క్రికెట్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనడుస్తోంది. 2015 సీజన్లో హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఆ సీజన్లో వేలంలో అతడినికి కనీస ధర రూ.10లక్షలకు ముంబై కొనుగోలు చేసింది. ఆ తర్వాత 6 సీజన్ల పాటు ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన హార్దిక్‌ను.. ఐపీఎల్-2022 వేలానికి ముందు ముంబై ఫ్రాంఛైజీ విడిచిపెట్టింది. దీంతో వేలంలోకి వచ్చిన అతడిని రూ.15 కోట్లకు గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసి జట్టు పగ్గాలు అప్పగించింది. ఈ క్రమంలో అరంగేట్ర సీజన్లోనే తన జట్టును విజేతగా నిలిపాడు. ఇక ఇది ఇలా ఉండగా.. ట్రేడింగ్ ద్వారా కెప్టెన్ ఫ్రాంచైజీ మారడం ఇదేమి తొలిసారి కాదు. హార్దిక్ కంటే ముందు మరో ఇద్దరు కెప్టెన్లు క్యాష్ ట్రేడింగ్ ద్వారా ఫ్రాంఛైజీలు మారారు. ఎవరెవరంటే? అజింక్యా రహానే.. ట్రేడింగ్ రూపంలో ఫ్రాంచైజీ మారిన తొలి కెప్టెన్ టీమిండియా వెటరన్ ఆటగాడు అజింక్యా రహానే. ఐపీఎల్-2020 సీజన్‌కు ముందు రాజస్తాన్ నుంచి రహానేను ఢిల్లీ క్యాపిటల్స్ ట్రేడ్ చేసుకుంది. ఐపీఎల్-2011లో రాజస్తాన్ రాయల్స్‌కు రహానే సారథ్యం వహించాడు. రవిచంద్రన్ అశ్విన్.. ఈ లిస్ట్‌లో రహానే తర్వాతి స్ధానంలో భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు. అశ్విన్‌ను ఐపీఎల్-2020 సీజన్‌కు ముందు పంజాబ్ కింగ్స్ నుంచి అశ్విన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ట్రేడింగ్ ద్వారానే సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ జాబితాలోకి హార్దిక్ కూడా చేరాడు. -
IPL 2024 Auction: ఆ ఇద్దరి కోసం క్యూ కట్టనున్న ఫ్రాంచైజీలు
ఈ ఏడాది డిసెంబర్ 19న జరిగే ఐపీఎల్ 2024 వేలంలో వరల్డ్‌కప్-2023 హీరోలకు ఫుల్ డిమాండ్ ఉంటున్నది కాదనలేని సత్యం. దుబాయ్ వేదికగా జరిగే ఈ మెగా ఆక్షన్‌లో న్యూజిలాండ్‌కు చెందిన రచిన్ రవీంద్ర, ఆసీస్ స్టార్ బ్యాటర్ ట్రవిస్ హెడ్ల కోసం ఫ్రాంచైజీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొనే అవకాశం ఉంది. భారత్ వేదికగా కొద్ది రోజుల క్రితం జరిగిన వరల్డ్‌కప్‌లో రచిన్ బ్యాట్‌తో చెలరేగిపోయిన విషయం తెలిసిందే. భారత్ మూలాలున్న రచిన్ తన పెద్దల సొంతగడ్డపై పరుగుల వరద పారించాడు. ఈ టోర్నీలో రచిన్ 10 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు, 2 అర్ధసెంచరీల సాయంతో 578 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో విరాట్, రోహిత్, డికాక్ తర్వాతి స్థానంలో నిలిచాడు. ట్రవిస్ హెడ్ విషయానికొస్తే.. ఈ ఆసీస్ బ్యాటర్ ప్రపంచకప్‌లోకి లేట్‌గా ఎంట్రీ ఇచ్చినా టోర్నీని ఘనంగా ముగించాడు. భారత్‌తో జరిగిన ఫైనల్లో చిరస్మరణీయ శతకం (137) సాధించిన హెడ్ తన జట్టును ఆరోసారి జగజ్జేతగా నిలిపాడు. ఈ ఒక్క ప్రదర్శనతో హెడ్ ఐపీఎల్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేరిపోయాడు. రచిన్, హెడ్ ఇద్దరు బ్యాట్‌తో పాటు బంతితోనూ మాయ చేయగల సమర్దులు కావడంతో ఐపీఎల్ ఫ్రాంచైజీలు వీరి కోసం ఎగబడే అవకాశం ఉంది. వీరిద్దరితో పాటు వరల్డ్‌కప్ బౌలింగ్ హీరోలు దిల్షన్ మధుషంక (శ్రీలంక), గెరాల్డ్ కొయెట్జీ (సౌతాఫ్రికా) కోసం కూడా ఫ్రాంచైజీలు పోటీపడవచ్చు. ప్రస్తుతం ఆయా ఫ్రాంచైజీల వద్ద మిగులు బడ్జెట్ ప్రకారం చూస్తే.. రచిన్, మధుషంక కోసం ఆర్సీబీ.. హెడ్ కోసం ఢిల్లీ.. కొయెట్జీ కోసం సీఎస్కే పోటీపడవచ్చని తెలుస్తుంది. ఈ ఫ్రాంచైజీలు వదిలించుకున్న ఆటగాళ్ల జాబితా చూసినా వారికి ఈ రోల్స్‌లో ఆటగాళ్ల అవసరం ఉంది. మిగులు బడ్జెట్ గుజరాత్ వద్ద అధికంగా (38.15 కోట్లు) ఉండగా, ఎక్కువ మంది ఆటగాళ్లను తీసుకునే వెసులుబాటు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు (12 మందిని) ఉంది. పైన పేర్కొన్న ఆటగాళ్ల కోసం పోటీపడే ఫ్రాంచైజీల్లో ఢిల్లీ వద్ద 28.95 కోట్లు, సీఎస్కే వద్ద 31.4 కోట్లు, ఆర్సీబీ వద్ద 23.25 కోట్ల పర్స్ వ్యాల్యూ మిగిలి ఉంది. -
గుజరాత్ నుంచి ముంబై ఇండియన్స్‌లోకి.. స్పందించిన హార్దిక్ పాండ్యా
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మళ్లీ సొంత గూటికి చేరాడు. ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యా తిరిగి మళ్లీ ముంబై ఇండియన్స్‌లోకి వచ్చాడు. ఐపీఎల్-2024 మినీ వేలానికి ముందు క్యాష్ ట్రేడింగ్ పద్దతి ద్వారా గుజరాత్ నుంచి ముంబై ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది. ఇక ఈ విషయంపై హార్దిక్ పాండ్యా తొలిసారి స్పందించాడు. తన అరంగేట్ర ఫ్రాంచైజీకి తిరిగి రావడం చాలా సంతోషంగా ఉందని హార్దిక్ ట్విట్ చేశాడు. "ముంబై ఇండియన్స్‌లోకి తిరిగి రావడం చాలా ఆనందంగా ఉంది. ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలను తిరిగి పొందనున్నాను. ముంబై, వాంఖడే, పల్టాన్ వంటి ఎన్నో మధుర జ్ఞాపకాలు ముంబైతో ఉన్నాయి" అని ట్విటర్లో రాసుకొచ్చాడు. అయితే అతడు చేసిన ట్విట్లో రెండు సీజన్ల పాటు ప్రాతినిథ్యం వహించిన గుజరాత్ టైటాన్స్ ప్రస్తావన లేకపోవడం గమనార్హం. కాగా హార్దిక్ పాండ్యా తన ఐపీఎల్ అరంగేట్రం నుంచి 2021 సీజన్‌కు వరకు ముంబై ఇండియన్స్‌కే ప్రాతినిధ్యం వహించాడు. అయితే ఐపీఎల్-2022 మేగా వేలానికి ముందు ముంబై అతడిని విడిచిపెట్టింది. ఈ క్రమంలో వేలంలోకి వచ్చిన అతడిని కొత్త ప్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్ రూ.15 కోట్ల భారీ ధరకు కొనుగొలు చేసింది. అంతేకాకుండా ఐపీఎల్-2022లో తమ జట్టు పగ్గాలు కూడా అప్పగించింది. ఈ క్రమంలో అరంగేట్ర సీజన్లోనే గుజరాత్ టైటాన్స్‌ను ఛాంపియన్స్‌గా నిలిపాడు. అంతేకాకుండా ఐపీఎల్-2023లో అతడి సారథ్యంలోనూ గుజరాత్ రన్నరప్‌గా నిలిచింది. కాగా పాండ్యా తన ఐపీఎల్ కెరీర్లో ఇప్పటివరకు 123 మ్యాచ్‌లు ఆడి 2309 పరుగులతో పాటు 53 వికెట్లు సాధించాడు. చదవండి: IPL 2024: గుజరాత్ టైటాన్స్ నయా కెప్టెన్ అతడే..! This brings back so many wonderful memories. Mumbai. Wankhede. Paltan. Feels good to be back. 💙 #OneFamily @mipaltan pic.twitter.com/o4zTC5EPAC — hardik pandya (@hardikpandya7) November 27, 2023 -
సన్‌రైజర్స్ తప్పుచేసింది.. పశ్చాత్తాపపడక తప్పదు: టామ్ మూడీ
IPL 2024- Sunrisers Hyderabad: ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ విషయంలో తీసుకున్న నిర్ణయంపై సన్‌రైజర్స్ హైదరాబాద్ పశ్చాత్తాపపడక తప్పదని ఆ జట్టు మాజీ కోచ్ టామ్ మూడీ అన్నాడు. బ్రూక్ వంటి అద్భుతమైన నైపుణ్యాలున్న ఆటగాడిని వదిలి ఫ్రాంఛైజీ తప్పు చేసిందని అభిప్రాయపడ్డాడు. కాగా గత ఐపీఎల్ వేలంలో హ్యారీ బ్రూక్‌ను రూ. 13 కోట్ల 25 లక్షలకు సన్‌రైజర్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ డాషింగ్ క్రికెటర్ ప్రదర్శన ఆశించినస్థాయిలో లేకపోవడంతో తాజా వేలానికి ముందు విడుదల చేసింది. ఐపీఎల్-2023లో బ్రూక్ 11 మ్యాచ్‌లు ఆడి కేవలం 190 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడిని వదిలేయాలని నిర్ణయించుకున్న సన్‌రైజర్స్ ఆదివారం నాటి రిలీజ్ లిస్టులో బ్రూక్ పేరును చేర్చింది. సగం ధరకే కొనాలని ప్లాన్! కానీ.. ఈ విషయంపై స్పందించిన ఎస్ఆర్హెచ్ మాజీ కోచ్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ కీలక వ్యాఖ్యలు చేశాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘బ్రూక్‌ను రిలీజ్ చేసి మళ్లీ సగం ధరకే అతడిని సొంతం చేసుకోవాలన్నది సన్‌రైజర్స్ వ్యూహం అయి ఉండొచ్చు. అయితే, ఇలాంటి నిర్ణయం వల్ల ఎస్ఆర్హెచ్ కచ్చితంగా పశ్చాత్తాపపడుతుంది. ఎందుకంటే.. హ్యారీ బ్రూక్ తప్పకుండా వేలంలోకి వస్తాడు. అసాధారణ ప్రతిభ ఉన్న బ్రూక్ కోసం పోటీ తప్పకుండా ఉంటుంది’’ అని టామ్ మూడీ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. అతడిని బాధ్యుడిని చేయడం సరికాదు అదే విధంగా బ్రూక్ సేవలను సన్‌రైజర్స్ సరిగ్గా ఉపయోగించుకోలేకపోయిందని టామ్ మూడీ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. టీ20 క్రికెట్లో ఓపెనింగ్ చేయని బ్యాటర్‌ను టాపార్డర్‌కు ప్రమోట్ చేసి ఎస్ఆర్హెచ్ తప్పు చేసిందని పేర్కొన్నాడు. మిడిలార్డర్ బ్యాటర్‌ను ముందుగా రప్పించి మూల్యం చెల్లించడమే కాకుండా.. అందుకు అతడిని బాధ్యుడిని చేయడం సరికాదని విమర్శించాడు. యువ ఆటగాడైన బ్రూక్ సేవలను సుదీర్ఘకాలం పాటు వినియోగించుకునే అవకాశాన్ని మిస్ చేసుకుందని టామ్ మూడీ సన్‌రైజర్స్ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. కాగా ఐపీఎల్-2024 వేలానికి ముందు.. సన్‌రైజర్స్ జట్టు ఆదిల్ రషీద్ (ఇంగ్లండ్), అకీల్ హోసిన్ (వెస్టిండీస్), దేశవాళీ క్రికెటర్లు సమర్థ్ వ్యాస్, వివ్రాంత్ శర్మ, కార్తీక్ త్యాగిలను కూడా విడుదల చేసింది. వేలం కోసం ప్రస్తుతం సన్‌రైజర్స్ వద్ద రూ. 34 కోట్లు ఉన్నాయి. చదవండి: T20I: యశస్వి సరికొత్త చరిత్ర.. రోహిత్ రికార్డు బ్రేక్ -
IPL 2024: ఆటగాళ్ల రిలీజ్ ప్రక్రియ తర్వాత ఫ్రాంచైజీల పరిస్థితి ఇలా..!
ఐపీఎల్ 2024కి సంబంధించి ఆటగాళ్ల రిలీజ్ (వదిలేయడం), రిటెన్షన్ (నిలబెట్టుకోవడం) ప్రక్రియకు నిన్న (నవంబర్ 26) ఆఖరి తేదీ కావడంతో అన్ని ఫ్రాంచైజీలు తమ పూర్తి వివరాలను వెల్లడించాయి. ఏ ఫ్రాంచైజీ ఏ ఆటగాడిని వదిలేసిందో, ఏ ఆటగాడిని నిలబెట్టుకుందో అన్న అంశంపై నిన్నటితో పూర్తి క్లారిటీ వచ్చింది. అలాగే పర్స్ (బడ్జెట్) వివరాలు, ఇంకా ఎంత మందిని తీసుకునే వెసులుబాటు ఉందనే అంశాలపై కూడా లెక్కలు తేలాయి. Salary cap for all IPL teams. pic.twitter.com/YYZOW69HlY — Johns. (@CricCrazyJohns) November 26, 2023 ఆటగాళ్ల రిలీజ్, రిటెన్షన్ ప్రక్రియ తర్వాత ఫ్రాంచైజీల పరిస్థితి ఇలా ఉంది.. చెన్నై సూపర్ కింగ్స్: ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-19 (14 మంది దేశీయ ఆటగాళ్లు, 5 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (68.6 కోట్లు), పర్స్‌లో మిగిలిన మొత్తం (31.4 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (6), ఇందులో విదేశీ ఆటగాళ్లు (3). ఢిల్లీ క్యాపిటల్స్: ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-16 (12 మంది దేశీయ ఆటగాళ్లు, 4 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (71.5 కోట్లు), పర్స్‌లో మిగిలిన మొత్తం (28.95 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (9), ఇందులో విదేశీ ఆటగాళ్లు (4). గుజరాత్ టైటాన్స్: ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-18 (12 మంది దేశీయ ఆటగాళ్లు, 6 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (76.85 కోట్లు), పర్స్‌లో మిగిలిన మొత్తం (23.15 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (7), ఇందులో విదేశీ ఆటగాళ్లు (2). కోల్‌కతా నైట్‌రైడర్స్: ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-13 (9 మంది దేశీయ ఆటగాళ్లు, 4 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (67.3 కోట్లు), పర్స్‌లో మిగిలిన మొత్తం (32.7 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (12), ఇందులో విదేశీ ఆటగాళ్లు (4). లక్నో సూపర్ జెయింట్స్: ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-19 (13 మంది దేశీయ ఆటగాళ్లు, 6 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (86.85 కోట్లు), పర్స్‌లో మిగిలిన మొత్తం (13.15 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (6), ఇందులో విదేశీ ఆటగాళ్లు (2). ముంబై ఇండియన్స్: ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-17 (12 మంది దేశీయ ఆటగాళ్లు, 5 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (84.75 కోట్లు), పర్స్‌లో మిగిలిన మొత్తం (15.25 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (8), ఇందులో విదేశీ ఆటగాళ్లు (3). పంజాబ్ కింగ్స్: ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-17 (11 మంది దేశీయ ఆటగాళ్లు, 6 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (70.9 కోట్లు), పర్స్‌లో మిగిలిన మొత్తం (29.1 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (8), ఇందులో విదేశీ ఆటగాళ్లు (2). రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-18 (14 మంది దేశీయ ఆటగాళ్లు, 4 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (59.25 కోట్లు), పర్స్‌లో మిగిలిన మొత్తం (40.75 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (7), ఇందులో విదేశీ ఆటగాళ్లు (4). రాజస్థాన్ రాయల్స్: ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-17 (12 మంది దేశీయ ఆటగాళ్లు, 5 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (85.5 కోట్లు), పర్స్‌లో మిగిలిన మొత్తం (14.5 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (8), ఇందులో విదేశీ ఆటగాళ్లు (3). సన్‌రైజర్స్ హైదరాబాద్: ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-19 (14 మంది దేశీయ ఆటగాళ్లు, 5 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (66 కోట్లు), పర్స్‌లో మిగిలిన మొత్తం (34 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (6), ఇందులో విదేశీ ఆటగాళ్లు (3). ఐపీఎల్ 2024 వేలం తేదీ: 2023, డిసెంబర్ 19 వేదిక: దుబాయ్