![IPL Auction 2024: Harshal Patel sold to Punjab Kings - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/19/Harshal-Patel.jpg.webp?itok=84mXWHR1)
ఐపీఎల్-2024 వేలంలో టీమిండియా పేసర్ హర్షల్ పటేల్‌కు ఊహించని ధర దక్కింది. హర్షల్ పటేల్‌ను రూ.11.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. గత కొంత కాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న హర్షల్ పటేల్‌పై కోట్ల వర్షం కురవడం అందరిని ఆశ్చర్యపరిచింది. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన హర్షల్ పటేల్ కోసం గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ తీవ్రంగా పోటీ పడ్డాయి.
చివరికి పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. కాగా గత కొన్ని సీజన్ల నుంచి ఆర్సీబీకి హర్షల్ పటేల్ ప్రాతినిథ్యం వహించాడు. అయితే ఐపీఎల్-2024 వేలానికి ముందు ఆర్సీబీ విడిచిపెట్టింది. దీంతో వేలంలోకి హర్షల్ పటేల్ వచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment