
బెంగళూరుపై ముంబై ఇండియన్స్ విజయం
బెంగళూరు: డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టుకు సొంతగడ్డపై చుక్కెదురైంది. అమన్‌జ్యోత్ కౌర్ ఆల్‌రౌండ్ మెరుపులు మెరిపించడంతో మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ముంబై ఇండియన్స్ జట్టు రెండో విజయం నమోదు చేసుకుంది. శుక్రవారం జరిగిన పోరులో ముంబై ఇండియన్స్ నాలుగు వికెట్ల తేడాతో ఆర్‌సీబీపై గెలుపొందింది. మొదట ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది.
ఎలీస్ పెర్రీ (43 బంతుల్లో 81; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) విజృంభించింది. ముంబై బౌలర్లలో అమన్‌జ్యోత్ కౌర్ 3 వికెట్లు పడగొట్టింది. అనంతరం ముంబై జట్టు 19.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (38 బంతుల్లో 50, 8 ఫోర్లు, 1 సిక్స్), సివర్ బ్రంట్ (21 బంతుల్లో 42; 9 ఫోర్లు) ధాటిగా ఆడారు.
చివర్లో ఉత్కంఠ నెలకొన్న సమయంలో అమన్‌జ్యోత్ కౌర్ (27 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), కమలిని (11 నాటౌట్; 1 ఫోర్) కీలక పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చారు. నేడు జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో యూపీ వారియర్స్ తలపడుతుంది.
స్కోరు వివరాలు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: స్మృతి (సి) యస్తిక (బి) షబ్నిమ్ 26; డానీ వ్యాట్ (సి) హేలీ (బి) సివర్ బ్రంట్ 9; పెర్రీ (సి) షబ్నిమ్ (బి) అమన్‌జ్యోత్ 81; కనిక (బి) సంస్కృతి 3; రిచా (బి) అమన్‌జ్యోత్ 28; జార్జియా (సి) సంస్కృతి (బి) అమన్‌జ్యోత్ 6; కిమ్ గార్త్ (నాటౌట్) 8; ఎక్తా బిష్త్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 167. వికెట్ల పతనం: 1–29, 2–48, 3–51, 4–57, 5–107, 6–119, 7–165, బౌలింగ్: షబ్నిమ్ 4–0–36–1; సివర్ బ్రంట్ 4–0–40–1; హేలీ మాథ్యూస్ 4–0–37–1; అమేలియా కెర్ 4–0–28–0; సంస్కృతి 1–0–3–1; అమన్‌జ్యోత్ 3–0–22–3.
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: హేలీ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఏక్తా 15; యస్తిక (ఎల్బీడబ్ల్యూ) (బి) కిమ్ గార్త్ 8; సివర్ బ్రంట్ (బి) కిమ్ గార్త్ 42; హర్మన్‌ప్రీత్ (సి) రిచా (బి) జార్జియా 50; అమేలియా (సి) ఏక్తా (బి) జార్జియా 2; అమన్‌జ్యోత్ (నాటౌట్) 34; సంజనా (ఎల్బీడబ్ల్యూ) జార్జియా 0; కమలిని (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (19.5 ఓవర్లలో 6 వికెట్లకు) 170. వికెట్ల పతనం: 1–9, 2–66, 3–74, 4–82, 5–144, 6–144, బౌలింగ్: రేణుక 4–0–35–0; కిమ్ గార్త్ 4–0–30–2; జార్జియా 4–1–21–3; ఏక్తా 3.5–0–37–1; జోషిత 2–0–19–0; కనిక 2–0–28–0.
Comments
Please login to add a commentAdd a comment