IPL 2024: పొరపాటు పడ్డ ప్రీతి జింటా.. ఒకరి బదుల ఇంకొకరి కొనుగోలు..! | IPL 2024: PBKS Accidentally Buy Wrong Shashank At IPL Auction, Preity Zinta Reaction Video Goes Viral - Sakshi
Sakshi News home page

IPL 2024: పొరపాటు పడ్డ ప్రీతి జింటా.. ఒకరి బదులు ఇంకొకరి కొనుగోలు..!

Published Wed, Dec 20 2023 3:39 PM | Last Updated on Wed, Dec 20 2023 4:06 PM

IPL 2024: PBKS Accidentally Buy Shashank Singh Said Preity Zinta - Sakshi

దుబాయ్‌లోని కోలోకోలా ఎరీనా వేదికగా నిన్న (డిసెంబర్‌ 19) జరిగిన ఐపీఎల్‌ 2024 వేలంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పంజాబ్‌ కింగ్స్‌ కో ఓనర్‌ ప్రీతి జింటా పొరపాటున ఓ ఆటగాడు అనుకుని మరో ఆటగాడిని కొనుగోలు చేసింది. అయితే, వెంటనే తప్పు తెలుసుకుని సరిదిద్దుకునే ప్రయత్నం చేసినప్పటికీ, అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. వేలం నిర్వహకులు సదరు ఆటగాడిని పంజాబ్‌ కింగ్స్‌కు లాక్‌ చేసేసినట్లు ప్రకటించారు. ఐపీఎల్‌ రూల్స్‌ ప్రకారం ఒక్కసారి ఆటగాడు ఫ్రాంచైజీకి లాక్‌ చేయబడితే తిరిగి అతన్ని వేలానికి విడిచిపెట్టడానికి వీలు ఉండదు.

ఏం జరిగిందంటే.. నిన్న జరిగిన ఐపీఎల్‌ 2024 వేలం సందర్భంగా 32 ఏళ్ల ఛత్తీస్‌ఘడ్‌ ఆల్‌రౌండర్‌ శశాంక్‌ సింగ్‌ పేరు వేలానికి వచ్చింది. ప్రీతి జింటా, నెస్‌ వాడియాలతో కూడిన పంజాబ్‌ కింగ్స్‌ మేనేజ్‌మెంట్‌ పొరపాటున ఓ శశాంక్‌ సింగ్‌ అనుకుని మరో శశాంక్‌ సింగ్‌ను కొనుగోలు చేసింది. శశాంక్‌ను పంజాబ్‌ అతని కనీస ధర 20 లక్షలకు కొనుగోలు చేసింది. శశాంక్‌ కోసం మరే ఇతర ఫ్రాంచైజీలు పోటీపడలేదు. అయితే శశాంక్‌ను తాము సొంతం చేసుకున్నట్లు దృవీకరించబడిన తర్వాత పంజాబ్‌ యాజమాన్యం పొరబడ్డామని తెలుసుకుంది.

అయితే అప్పటికే సమయం మించి పోవడంతో చేసేదేమీ లేక సర్దుకుపోయింది. తాము పొరబడ్డామని తెలుసుకున్న క్షణంలో పంజాబ్‌ కో ఓనర్‌ పడ్డ ఆందోళన నెట్టింట వైరలవుతుంది. ఓ శశాంక్‌ అనుకుని మరో శశాంక్‌ను సొంతం చేసుకున్నామని ప్రీతి జింటా బాధపడుతున్న వీడియో సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. 

కాగా, పంజాబ్‌ పొరపాటున సొంతం చేసుకున్న శశాంక్‌ సింగ్‌ ట్రాక్‌ రికార్డు మరీ అంత తీసి పారేయడానికి వీల్లేదు. అతను 55 టీ20ల్లో 724 పరుగులు చేసి 15 వికెట్లు పడగొట్టాడు. శశాంక్‌ను 2022లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వేలానికి విడిచి పెట్టింది. 2023 సీజన్‌ వేలంలో శశాంక్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. నిన్నటి వేలంలో పంజాబ్‌ చేసిన పొరపాటే మరో ఫ్రాంచైజీ కూడా చేయబోయింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ కూడా ఓ ఆటగాడు అనుకుని మరో ఆటగాడి కోసం వేలంలో ప్రయత్నించింది. అయితే వారు తప్పు తెలుసుకుని డ్రాప్‌ అయిపోయారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement