Shashank Singh
-
IPL 2024: అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఇరగదీస్తున్న చిచ్చరపిడుగులు వీళ్లే..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో పలువురు ఆటగాళ్లు ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఇరగదీస్తున్నారు. బ్యాటర్ల విషయానికొస్తే.. రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ సీజన్లో అన్ క్యాప్డ్ ప్లేయర్‌గా బరిలోకి దిగి మెరుపులు మెరిపిస్తున్నాడు. రియాన్ ఈ సీజన్లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడి 58.43 సగటున 159.14 స్ట్రయిక్‌రేట్‌తో 409 పరుగులు చేసి నాలుగో లీడింగ్ రన్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.అన్క్యాప్డ్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన ఇరగదీస్తున్న మరో బ్యాటర్ అభిషేక్ శర్మ. ఈ ఎస్ఆర్హెచ్ ఓపెనర్ ఈ సీజన్లో అదిరిపోయే ప్రదర్శనలతో అంచనాలకు అందని రీతిలో రెచ్చిపోతూ తన జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అభిషేక్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో అదిరిపోయే స్ట్రయిక్‌రేట్‌తో 315 పరుగులు చేశాడు.వద్దనుకున్న ఆటగాడే గెలుపు గుర్రమయ్యాడు..ఈ ఐపీఎల్ సీజన్లో ఓ ఆటగాడు ప్రత్యేకించి అందరి దృష్టిని ఆకర్శిస్తున్నాడు. శశాంక్ సింగ్ అనే పంజాబ్ మిడిలార్డర్ బ్యాటర్ ఈ సీజన్లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఈ సీజన్లో శశాంక్ మెరుపు స్ట్రయిక్‌రేట్‌తో 288 పరుగులు చేసి తన జట్టు సాధించిన ప్రతి విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. శశాంక్‌ను ఈ సీజన్ వేలంలో పంజాబ్ పొరపాటున సొంతం చేసుకుందని ప్రచారం జరిగింది. పంజాబ్ సహ యజమాని ప్రీతి జింటా మరో శశాంక్ అనుకుని ఈ శశాంక్‌ను సొంతం చేసుకుందని సోషల్‌మీడియా కోడై కూసింది. అంతిమంగా చూస్తే ఈ వద్దనుకున్న ఆటగాడే పంజాబ్ సాధించిన అరకొర విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.ఈ సీజన్లో రఫ్ఫాడిస్తున్న మరో ప్లేయర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్. ప్రభ్‌సిమ్రన్ ఈ సీజన్లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి మెరుపు స్ట్రయిక్‌రేట్‌తో 221 పరుగులు చేశాడు. అన్క్యాప్డ్ ప్లేయర్‌గా బరిలోకి దిగి సంచలనాలు సృష్టిస్తున్న మరో బ్యాటర్ నితీశ్‌కుమార్ రెడ్డి. ఈ ఎస్ఆర్హెచ్ మిడిలార్డర్ బ్యాటర్ ఏ అంచనాలు లేకుండా బరిలోకి దిగి మెరుపు ఇన్నింగ్స్‌లతో తన జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. నితీశ్ ఈ సీజన్ లభించిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సన్‌రైజర్స్ పాలిట గెలుపు గుర్రమయ్యాడు. వీళ్లే కాక చాలామంది అన్క్యాప్డ్ బ్యాటర్లు ఈ సీజన్లో ఇరగదీస్తున్నారు.బౌలర్ల విషయానికొస్తే.. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి బంతితో సత్తా చాటుతున్న వారిలో సన్‌రైజర్స్ పేసర్ నటరాజన్ ముందు వరుసలో ఉన్నాడు. నటరాజన్ గతంలో అద్భుతంగా రాణించినప్పటికీ.. గత కొన్ని సీజన్లలో ఇతని ప్రదర్శన సాధారణ స్థాయికి పడిపోయింది. దీంతో ఈ సీజన్‌కు ముందు ఇతనిపై ఎలాంటి అంచనాలు లేవు. అండర్ డాగ్‌గా బరిలోకి దిగిన నట్టూ.. ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి 15 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం అతను సెకెండ్ లీడింగ్ వికెట్‌టేకర్‌గా కొనసాగుతున్నాడు. అన్క్యాప్డ్ ప్లేయర్లుగా బరిలోకి దిగి ఇరగదీస్తున్న బౌలర్లలో మయాంక్ యాదవ్, యశ్ ఠాకూర్, సందీప్ శర్మ, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్ నట్టూ తర్వాతి స్థానాల్లో ఉన్నాడు. వీరంతా ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి తమతమ జట్ల పాలిట గెలుపు గుర్రాలయ్యారు. -
అసలుసిసలైన ఛేజింగ్ మాస్టర్ ఇతడే.. మార్మోగిపోతున్న శశాంక్ సింగ్ పేరు
పంజాబ్ కింగ్స్ మెరుపు వీరుడు శశాంక్ సింగ్ పేరు ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్‌లో మార్మోగిపోతుంది. కేకేఆర్‌పై చారిత్రక ఇన్నింగ్స్ (28 బంతుల్లో 68 నాటౌట్; 2 ఫోర్లు, 8 సిక్సర్లు) అనంతరం నెట్టింట ఎక్కడ చూసినా శశాంక్ గురించే చర్చ నడుస్తుంది. కేకేఆర్‌తో మ్యాచ్‌లో భారీ లక్ష్య ఛేదనలో శశాంక్ చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడని జనాలు జేజేలు కొడుతున్నారు. ఈ మ్యాచ్‌లో శశాంక్ ఆడిన షాట్లు న భూతే న భవిష్యతి అన్నట్లున్నాయని కొనియాడుతున్నారు. శశాంక్‌పై ప్రశంసల వర్షం కురుస్తున్న క్రమంలో ఓ నెటిజన్ ఆసక్తికర పోస్ట్ షేర్ చేశాడు. ఈ పోస్ట్‌లోని డేటాను చూసిన వారు శశాంక్‌ను అసలుసిసలైన ఛేజింగ్ మాస్టర్ అనక మానరు. ఈ పోస్ట్‌లో శశాంక్ ఛేజింగ్‌లో చేసిన పరుగుల గురించి ప్రస్తావించబడింది. ఛేజింగ్‌లో (ప్రస్తుత సీజన్) శశాంక్ ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడి నాలుగింట నాటౌట్‌గా నిలిచాడు. అంతే కాదు శశాంక్ తన అబ్బురపరిచే బ్యాటింగ్ విన్యాసాలతో రెండు మ్యాచ్‌ల్లో పంజాబ్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ గణంకాలు చూసిన తర్వాత ఇతడే అసలుసిసలైన ఛేజింగ్ మాస్టర్ అంటూ జనాలు శశాంక్‌ను కొనియాడుతున్నారు. ఈ సీజన్లో ఛేజింగ్‌లో శశాంక్ ఆడిన ఇన్నింగ్స్‌లు..- లక్నోపై 7 బంతుల్లో 9 నాటౌట్- గుజరాత్‌పై 29 బంతుల్లో 61 నాటౌట్ (పంజాబ్ గెలుపు)- సన్‌రైజర్స్‌పై 25 బంతుల్లో 46 నాటౌట్- ముంబై ఇండియన్స్‌పై 25 బంతుల్లో 41- కేకేఆర్‌పై 28 బంతుల్లో 68 నాటౌట్ (పంజాబ్ గెలుపు)మ్యాచ్ విషయానికొస్తే.. శశాంక్‌తో పాటు బెయిర్‌స్టో (48 బంతుల్లో 108 నాటౌట్; 8 ఫోర్లు, 9 సిక్సర్లు), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (20 బంతుల్లో 54; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), రోసో (16 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్స్‌లు) చెలరేగడంతో పంజాబ్ కేకేఆర్ నిర్దేశించిన 262 పరుగుల లక్ష్యాన్ని మరో ఎనిమిది బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు చేసిన కేకేఆర్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్ (37 బంతుల్లో 75; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు), సునీల్ నరైన్ (32 బంతుల్లో 71; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించగా, వెంకటేశ్ అయ్యర్ (23 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. -
ఇదెక్కడి విధ్వంసం... కేవలం 28 బంతుల్లోనే! 8 సిక్స్‌లతో
ఐపీఎల్-2024లో పంజాబ్ కింగ్స్ ఆటగాడు శశాంక్ సింగ్ మరోసారి సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శశాంక్ సింగ్ విధ్వంసం సృష్టించాడు. 262 పరుగుల భారీ లక్ష్య చేధనలో కేకేఆర్ బౌలర్లను శశాంక్ ఊచకోత కోశాడు.జానీ బెయిర్ స్టోతో కలిసి మ్యాచ్‌ను శశాంక్ మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన శశాంక్ కేవలం 28 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్స్‌లతో 68 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. శశాంక్ సింగ్ ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఇది చూసిన నెటిజన్లు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదెక్కడి విధ్వంసం.. తన లాంటి ఆటగాడు భారత జట్టులో ఉండాలని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇంతకుముందు కూడా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ను శశాంక్ గెలిపించాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. పంజాబ్ 262 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.4 ఓవర్లలో చేధించింది.దీంతో టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన జట్టుగా పంజాబ్ నిలిచింది. పంజాబ్ బ్యాటర్లలో బెయిర్‌స్టో( పాటు శశాంక్ సింగ్( 68 నాటౌట్), ప్రభుసిమ్రాన్ సింగ్(54) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. SHASHANK SINGH, THE FINISHER. 🫡- The consistency of an Indian uncapped player is remarkable. pic.twitter.com/bJpfOj4PsL— Johns. (@CricCrazyJohns) April 26, 2024 -
టీమిండియా కెప్టెన్‌గా రిషబ్ పంత్.. సిక్సర్ల కింగ్‌లు ఎంట్రీ!?
ఈ ఏడాది జూన్‌లో అమెరికా, వెస్టిండీస్‌ల వేదికగా జరగనున్న టీ20 వరల్డ్‌కప్-2024 అనంతరం భారత జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా టీమిండియా ఆతిథ్య జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్ జూలై 6న ప్రారంభమై అదే నెల 14న ముగియనుంది. ఈ సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లు హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగానే జరగనున్నాయి. అయితే ఈ జింబాబ్వే పర్యటనకు భారత తృతీయ శ్రేణి జట్టును బీసీసీఐ పంపించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్‌కప్‌లో భాగమయ్యే ఒకరిద్దరూ మినహా మిగతా భారత ఆటగాళ్లందరికి ఈ సిరీస్‌కు విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం. అంతేకాకుండా గాయం నుంచి కోలుకుని రీ ఎంట్రీలో అదరగొడుతున్న వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌కు ఈ సిరీస్‌లో భారత జట్టు పగ్గాలు అప్పగించాలని అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ యోచిస్తుందంట. కాగా పంత్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. పునరాగమనంలో కెప్టెన్‌గానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శన పరంగా కూడా సత్తాచాటుతున్నాడు. ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన పంత్ 210 పరుగులు చేశాడు. మరోవైపు ఐపీఎల్-2024లో దుమ్ములేపుతున్న రియాన్ పరాగ్, శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, సాయిసుదర్శన్, అభిషేక్ శర్మ వంటి యువ ఆటగాళ్లను ఈ సిరీస్‌కు ఎంపిక చేయనున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. వీరితో పాటు రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్, శివమ్ దూబే, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్ వంటి స్టార్ ఆటగాళ్లను సైతం జింబాబ్వే టూర్‌కు పంపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. -
IPL 2024: ఆ ఇద్దరు ముంబైని వణికించారు.. ఇలా మూడోసారి..!
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో నిన్న (ఏప్రిల్ 18) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 9 పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఓడినా.. ఇద్దరు బ్యాటర్లు మాత్రం ముంబైకి ముచ్చెమటలు పట్టించి, మూడు చెరువుల నీళ్లు తాగించారు. 184 పరుగుల లక్ష్య ఛేదనలో 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి గెలుపుపై ఏ మాత్రం ఆశలు లేని పంజాబ్‌ను అశుతోష్ శర్మ (28 బంతుల్లో 61; 2 ఫోర్లు, 7 సిక్సర్లు), శశాంక్ సింగ్ (25 బంతుల్లో 41; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో తిరిగి లైన్లో నిలబెట్టారు. అయితే ఆఖర్లో ముంబై బౌలర్లు పుంజుకోవడంతో పంజాబ్‌కు ఓటమి తప్పలేదు. ఇలా చేజారిందనున్న మ్యాచ్‌లలో తిరిగి తమ జట్టును రేస్‌లో నిలబెట్టడంతో శశాంక్, అశుతోష్ జోడీకి ఇది కొత్తేమీ కాదు. ఈ సీజన్లోనే ఈ జోడీ ఇలా చేయడం ఇది మూడోసారి. ఓ సందర్భంగా తమ జట్టును విజయతీరాలకు చేర్చిన ఈ జోడీ.. రెండు మ్యాచ్‌ల్లో గెలుపు అంచుల దాకా తీసుకెళ్లగలిగింది. ఈ సీజన్లో పంజాబ్ ఆడిన 7 మ్యాచ్‌ల్లో చివరి ఓవర్లో ఓటములను ఎదుర్కొవడం ఇది నాలుగో సారి (ఆర్సీబీ, సన్‌రైజర్స్, రాజస్థాన్, ముంబై). ఈ సీజన్లో శశాంక్-అశుతోష్ జోడీ దాదాపు ప్రతి మ్యాచ్‌లో అద్బుతమైన పోరాటపటిమ కనబరుస్తున్నప్పటికీ మిగతా సభ్యుల తోడ్పాటు లభించకపోవడంతో పంజాబ్ వరుస ఓటములు ఎదుర్కొంటుంది. జట్టులో పెద్ద స్టార్లు లేకపోయినా ఈ సీజన్లో శశాంక్, అశుతోషే వారి పాలిట స్టార్లయిపోయారు. విచిత్రమేమిటంటే శశాంక్‌ను పంజాబ్ వేలంలో పొరపాటున తీసుకుంది. ఇంకో శశాంక్ అని ఈ శశాంక్‌ను తీసుకున్నట్లు ఫ్రాంచైజీ సహా యజయాని ప్రీతి జింటా అప్పట్లో తెగ బాధ పడిపోయింది. ఇప్పుడు వద్దనుకున్న ఆ శశాంకే పంజాబ్‌ను కనీసం రేస్‌లో అయిన నిలబెట్టగలుగుతున్నాడు. ఈ సీజన్ మొత్తంలో శశాంక్ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడుతూ తన జట్టును గెలుపు రేస్‌లో నిలబెడుతున్నాడు. ఇతనికి ఇంపాక్ట్ ప్లేయర్ అశుతోష్ తోడవుతున్నాడు. అశుతోష్ ఇంపాక్ట్ ప్లేయర్ అన్న పదానికి సరైన న్యాయం చేస్తున్నాడు. ఎక్కడో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటమే కాకుండా తన జట్టును గెలిపించేందుకు చివరి వరకు ప్రయత్నిస్తున్నాడు. నిన్న ముంబైతో జరిగిన మ్యాచ్‌లో అయితే అశుతోష్ పంజాబ్‌ను గెలిపించినంత పని చేశాడు. అశుతోష్ దెబ్బకు ముంబై బౌలర్లు వణికిపోయారు. గెలుపు ఆశలు సైతం వదులుకున్నారు. ఈ సీజన్ మొత్తంలో శశాంక్, అశుతోష్ పోరాటం చాలా స్పూర్తిదాయకం. వీరిద్దరు ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి ప్రత్యర్దులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఈ సీజన్లో శశాంక్, అశుతోష్ చేసిన స్కోర్లు.. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్: 193 పరుగుల లక్ష్య ఛేదన- శశాంక్ (41), అశుతోష్ (61)- 9 పరుగుల తేడాతో చివరి ఓవర్లో పంజాబ్ ఓటమి రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్: తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్- శశాంక్ (9), అశుతోష్ (16 బంతుల్లో 31; ఫోర్, 3 సిక్సర్లు)- చివరి ఓవర్లో 3 వికెట్ల తేడాతో పంజాబ్ ఓటమి సన్‌రైజర్స్‌తో మ్యాచ్: 183 పరుగుల లక్ష్య ఛేదన- శశాంక్ (25 బంతుల్లో 46 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్), అశుతోష్ (15 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు)- 2 పరుగుల తేడాతో చివరి ఓవర్లో పంజాబ్ ఓటమి. గుజరాత్‌తో మ్యాచ్: 200 పరుగుల లక్ష్య ఛేదన-శశాంక్ (29 బంతుల్లో 61 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), అశుతోష్ (17 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్)- మరో బంతి మిగిలుండగా పంజాబ్ గెలుపు లక్నోతో మ్యాచ్: 200 పరుగుల లక్ష్య ఛేదన- శశాంక్ (7 బంతుల్లో 9 నాటౌట్; ఫోర్)- 21 పరుగుల తేడాతో పంజాబ్ ఓటమి ఆర్సీబీతో మ్యాచ్: తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్- శశాంక్ (8 బంతుల్లో 21 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు)-4 వికెట్ల తేడాతో పంజాబ్ ఓటమి ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్: 175 పరుగుల లక్ష్య ఛేదన- తొలి బంతికే ఔటైన శశాంక్ - అయినా 4 వికెట్ల తేడాతో పంజాబ్ గెలుపు -
సన్‌రైజర్స్‌తో మ్యాచ్.. పంజాబ్ ఓడినా ఆ ఇద్దరు అభిమానుల మనసుల్ని గెలిచారు..!
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 2 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. చివరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో శశాంక్ సింగ్ (25 బంతుల్లో 46 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్), అశుతోష్ శర్మ (15 బంతుల్లో 33 నాఔట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి పంజాబ్‌ను గెలిపించే ప్రయత్నం చేశారు. ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఓడినా శశాంక్, అశుతోష్ అభిమానుల మనసుల్ని గెలిచారు. 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గెలుపుపై ఏమాత్రం ఆశలు లేని పంజాబ్‌ను శశాంక్, అశుతోష్ దాదాపుగా గెలిపించినంత పని చేశారు. తమ జట్టును గట్టెక్కించడం కోసం ఈ ఇద్దరు చేసిన పోరాటం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. పంజాబ్‌ను గెలిపించేందుకు ఈ ఇద్దరు చేయాల్సిందంతా చేశారు. అయినా పంజాబ్‌కు స్వల్ప తేడాతో ఓటమి తప్పలేదు. ఉనద్కత్ వేసిన చివరి ఓవర్లో పంజాబ్ గెలుపుకు 29 పరుగులు అవసరం కాగా.. శశాంక్, అశుతోష్ 26 పరుగులు పిండుకున్నారు. వీరిద్దరి దెబ్బకు అనుభవజ్ఞుడైన ఉనద్కత్ లయ తప్పి మూడు వైడ్లు కూడా వేశాడు. ఆఖరి బంతికి శశాంక్ సిక్సర్ కొట్టినప్పటికీ అప్పటికే జరగాల్సి నష్టం జరిగిపోయింది. చివరి బంతికి పంజాబ్‌కు 9 పరుగులు కావల్సి ఉండింది. ఈ ఓవర్లో అశుతోష్ రెండు, శశాంక్ ఓ సిక్సర్ బాది సన్‌రైజర్స్ శిబిరంలో ఆందోళన రేకెత్తించారు. 19వ ఓవర్లో ఈ ఇద్దరు అదనంగా ఓ బౌండరీ బాది ఉంటే పంజాబ్ గెలిచుండేది. ఆ ఓవర్లో నటరాజన్ కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి శశాంక్, అశుతోష్‌లను కట్టడి చేశాడు. అంతింగా పంజాబ్ మ్యాచ్ ఓడినా శశాంక్, అశుతోష్ అద్బుతమైన పోరాటపటిమ కనబర్చి అభిమానులకు కావాల్సిన అసలుసిసలు టీ20 మజాను అందించారు. శశాంక్, అశుతోష్ ఈ మ్యాచ్‌కు ముందు గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఇదే తరహాలో పోరాటం చేశారు. ఆ మ్యాచ్‌లో గుజరాత్ నిర్దేశించిన 200 పరుగుల లక్ష్యాన్ని ఈ ఇద్దరి పోరాటం కారణంగా పంజాబ్ విజయవంతంగా ఛేదించింది. గుజరాత్‌తో మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్‌తో మ్యాచ్ తరహాలోనే పంజాబ్‌కు గెలుపుపై ఆశలు లేవు. SHASHANK SINGH IS A HERO...!!!! - He is still in pain after missing the game by a narrow margin 💔 pic.twitter.com/OYf6ZxJl1t — Johns. (@CricCrazyJohns) April 10, 2024 అలాంటి స్థితి నుంచి శశాంక్ (29 బంతుల్లో 61 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), అశుతోష్ (17 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి పంజాబ్‌ను విజయతీరాలకు చేర్చారు. ఈ రెండు ప్రదర్శనల కారణంగా శశాంక్, అశుతోష్ రాత్రికిరాత్రి హీరోలైపోయారు. సన్‌రైజర్స్ మ్యాచ్‌లో ఓడినా క్రికెట్ అభిమానులు వీరిద్దరికి పోరాటాన్ని కొనియాడుతున్నారు. ఇదిలా ఉంటే, పంజాబ్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. యువ ఆటగాడు నితీశ్ రెడ్డి (37 బంతుల్లో 64; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. అర్ష్‌దీప్ సింగ్ (4-0-29-4) సన్‌రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేశాడు. 183 పరుగుల లక్ష్య ఛేదనలో శశాంక్, అశుతోష్ చివరి నిమిషం వరకు పోరాడినా పంజాబ్ లక్ష్యానికి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయింది. -
IPL 2024: శశాంక్ సింగ్ గతంలోనూ గుజరాత్ బౌలర్లను వదల్లేదు.. చీల్చిచెండాడు..!
గుజరాత్ టైటాన్స్‌తో నిన్న (ఏప్రిల్ 4) జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఆటగాడు శశాంక్ సింగ్ (29 బంతుల్లో 61 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్‌పై ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్‌లో చర్చ జోరుగా సాగుతుంది. క్రికెట్ అభిమానులు శశాంక్ గురించి ఆరా తీసే క్రమంలో అతని పాత వీడియో ఒకటి బయటపడింది. ఇందులో శశాంక్ విధ్వంసం వీర లెవెల్లో ఉంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. 2022 ఐపీఎల్ సీజన్‌కు సంబందించిన ఆ వీడియోలో శశాంక్ సన్‌రైజర్స్‌కు ఆడుతూ గుజరాత్ బౌలర్లు చీల్చిచెండాడాడు. నిన్నటి మ్యాచ్‌తో పోలిస్తే ఆ విధ్వంసం వేరే లెవెల్లో ఉంది. శశాంక్ ఊచకోతకు గతంలోనూ గుజరాత్ బౌలర్లు బలయ్యారు. When Shashank Singh used to play for SRH, he smashed Lockie Ferguson like a club bowler 😨#GTvPBKS #ShashankSingh #GTvPBKS #PBKSvsGT pic.twitter.com/MxN4jH5k9f — Richard Kettleborough (@RichKettle07) April 5, 2024 నాడు గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో శశాంక్ ఏడో స్థానంలో బరిలోకి దిగి 6 బంతుల్లో 3 సిక్సర్లు, బౌండరీ సాయంతో 25 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆ ఇన్నింగ్స్‌లో శశాంక్ స్ట్రయిక్‌రేట్ 416.67గా ఉంది. అదే సీజన్లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన శశాంక్ ఫెర్గూసన్ లాంటి బౌలర్‌పై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడటం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు శశాంక్‌కు గుజరాత్ అంటే కసిలా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, శాశంక్ సింగ్, అశుతోష్ శర్మ (17 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్) చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లతో చెలరేగడంతో నిన్నటి మ్యాచ్‌లో పంజాబ్ గుజరాత్ టైటాన్స్‌పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. శుభ్‌మన్ గిల్ (89 నాటౌట్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేయగా.. శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (35) రెచ్చిపోవడంతో పంజాబ్ 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా 3 వికెట్ల తేడాతో విజయం సాధించి, పాయింట్ల పట్టికలో గుజరాత్‌ను వెనుక్కునెట్టి ఐదో స్థానానికి చేరుకుంది. -
IPL 2024 GT VS PBKS: చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సార్లు 200 అంతకు పైగా లక్ష్యాలను ఛేదించిన జట్టుగా పంజాబ్ కింగ్స్ చరిత్ర సృష్టించింది. నిన్న గుజరాత్‌పై 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంతో పంజాబ్ కింగ్స్ ఈ రికార్డును నమోదు చేసింది. ఐపీఎల్లో పంజాబ్ ఇప్పటివరకు ఆరుసార్లు 200 అంతకంటే ఎక్కువ లక్ష్యాలను ఛేదించింది. పంజాబ్ తర్వాత ముంబై ఇండియన్స్ అత్యధిక సార్లు (5) 200 ఆపైచిలుకు లక్ష్యాలను ఛేదించింది. PUNJAB KINGS NOW HAVE MOST 200 OR MORE TOTALS CHASED DOWN IN IPL HISTORY. 🤯💥pic.twitter.com/Jz56stB8kB — Mufaddal Vohra (@mufaddal_vohra) April 4, 2024 మ్యాచ్ విషయానికొస్తే.. నిన్నటి మ్యాచ్‌లో గుజరాత్ నిర్దేశించిన 200 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ మరో బంతి మిగిలుండగానే విజయవంతంగా ఛేదించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. శుభ్‌మన్ గిల్ (89 నాటౌట్) రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో సాహా (11), విజయ్ శంకర్ (8) నిరాశపర్చగా.. కేన్ విలియమ్సన్ (26), సాయి సుదర్శన్ (33) పర్వాదేనిపించారు. ఆఖర్లో రాహుల్ తెవాటియా (8 బంతుల్లో 23 నాటౌట్) గిల్‌తో కలిసి మెరుపులు మెరిపించాడు. పంజాబ్ బౌలర్లలో రబాడ 2, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు. Most successful 200 or more run chases in IPL history: Punjab Kings - 6*. Mumbai Indians - 5. pic.twitter.com/ego8rhdFWq — Mufaddal Vohra (@mufaddal_vohra) April 4, 2024 భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్ 70 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడగా.. ఆ సమయంలో క్రీజ్‌లోకి వచ్చిన శాశంక్ సింగ్ (29 బంతుల్లో 61 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. శశాంక్‌తో పాటు అశుతోష్ శర్మ (17 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్) కూడా అద్భుతమై ఇన్నింగ్స్ ఆడాడు. అశుతోష్.. శశాంక్‌తో కలిసి ఏడో వికెట్‌కు మెరుపు వేగంతో 43 పరుగులు సమకూర్చి పంజాబ్‌కు ఊహించని విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్ అరంగేట్రం చేసిన అశుతోష్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి పంజాబ్ పాలిట గెలుపు గుర్రంగా మారాడు. పంజాబ్ ఇన్నింగ్స్‌లో శశాంక్, అశుతోష్‌తో పాటు ప్రభ్‌సిమ్రన్ (35), బెయిర్‌స్టో (22) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. గుజరాత్ బౌలర్లలో నూర్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టగా.. ఒమర్జాయ్, ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, దర్శన్ నల్కండే తలో వికెట్ దక్కించుకున్నారు. -
IPL 2024: గుజరాత్‌కు గెలుపు దూరం చేసిన ఈ అశుతోష్ రాంబాబు ఎవరు..?
ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. 200 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో గెలుపుపై ఆశలు లేని పంజాబ్‌ను శాశంక్ సింగ్ (29 బంతుల్లో 61 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), అశుతోష్ శర్మ (17 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్) అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడి గెలిపించారు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు మెరుపు వేగంతో 43 పరుగులు సమకూర్చి పంజాబ్‌కు ఊహించని విజయాన్ని అందించారు. PUNJAB KINGS NOW HAVE MOST 200 OR MORE TOTALS CHASED DOWN IN IPL HISTORY. 🤯💥pic.twitter.com/Jz56stB8kB — Mufaddal Vohra (@mufaddal_vohra) April 4, 2024 73 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో శశాంక్.. 27 బంతుల్లో 50 పరుగులు చేయాల్సిన దశలో అశుతోష్ అంచనాలు లేకుండా బరిలోకి దిగి పంజాబ్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఓటమి తప్పతనుకున్న వేళ వీరిద్దరూ తమ బ్యాటింగ్ విన్యాసాలతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశారు. శశాంక్ ప్రత్యర్ది బౌలర్లపై ఎదురుదాడికి దిగి విధ్వంసం సృష్టిస్తే.. అశుతోష్ బాధ్యతమైన షాట్లు ఆడి స్ట్రయిక్‌ను రొటేట్ చేశాడు. Ashutosh Sharma said "I should thank Dhawan Paji, Sanjay Bangar & Punjab Kings for trusting me a lot". pic.twitter.com/EhOvU3m298 — Johns. (@CricCrazyJohns) April 4, 2024 ఎవరీ అశుతోష్..? పంజాబ్ గెలుపులో శశాంక్ పాత్ర ఎంత కీలకమైందో అశుతోష్ పాత్ర కూడా అంతే వెల కట్టలేనిది. అరంగేట్రం మ్యాచ్‌లోనే అశుతోష్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి మరీ ఇరగదీశాడు. 25 ఏళ్ల అశుతోష్ రాంబాబు శర్మ.. తన తొలి ఐపీఎల్ మ్యాచ్‌లోనే ఈ రేంజ్లో చెలరేగుతాడని ఎవరూ ఊహించ లేదు. - IPL Debut. - Impact player. - Came when PBKS needed 50 from 27 balls. Ashutosh Sharma smashed 31 runs from just 17 balls, A clean ball striker. 🔥 pic.twitter.com/wWW4osw3BR — Johns. (@CricCrazyJohns) April 4, 2024 దేశవాలీ క్రికెట్లోనూ పెద్దగా ట్రాక్ రికార్డు లేని అశుతోష్‌ను పంజాబ్ కింగ్స్ తన బేస్ ధర రూ. 20 లక్షలకు సొంతం చేసుకుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన అశుతోష్.. 4 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, 7 లిస్ట్-ఏ, 16 టీ20లు ఆడాడు. ఫస్ట్ క్లాస్ కెరీర్లో సెంచరీ, హాఫ్ సెంచరీ చేసిన అశుతోష్.. టీ20ల్లో 4 అర్దసెంచరీలు నమోదు చేశాడు. పొరపాటున ఎంపిక చేసుకున్నవాడే గెలుపు గుర్రమయ్యాడు.. శశాంక్ విషయానికొస్తే.. ఐపీఎల్ 2024 వేలంలో పంజాబ్ కింగ్స్ ఇతగాడిని పొరపాటున ఎంపిక చేసుకుందని వార్తలు వచ్చాయి. వేలంలో ఇద్దరు శశాంక్ సింగ్‌లు ఉండటంతో పొరపాటున ఈ శశాంక్ సింగ్‌ను తీసుకున్నట్లు పంజాబ్ సహ యజమాని ప్రీతి జింటా అప్పట్లో తెగ బాధపడిపోయింది. SHASHANK SINGH MASTERCLASS! A fifty in just 23 balls against GT in Ahmedabad. He's keeping Punjab Kings in the chase, a knock to remember. 💥 pic.twitter.com/nYuWif1luJ — Mufaddal Vohra (@mufaddal_vohra) April 4, 2024 పొరపాటున తీసుకున్నాయని భావించిన ఆ శశాంక్ సింగే ఇప్పుడు పంజాబ్ పాలిట గెలుపు గుర్రంగా అవతరించడం విశేషం. చత్తీస్‌ఘడ్‌కు చెందిన ఈ శశాంక్ సింగ్‌ను పంజాబ్ కింగ్స్ 2024 వేలంలో రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. కాగా, గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. శుభ్‌మన్ గిల్ (89 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేయగా.. పంజాబ్ శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (35) రాణించడంతో 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. -
మెరుపు ఇన్నింగ్స్‌తో పంజాబ్‌ను గెలిపించిన శశాంక్ (ఫొటోలు)
-
శశాంక్ కిర్రాక్...
అహ్మదాబాద్: సొంతగడ్డపై మాజీ చాంపియన్లు ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌లను ఓడించిన గుజరాత్ టైటాన్స్‌కు పంజాబ్ కింగ్స్ చెక్ పెట్టింది. గురువారం ఆఖరి ఓవర్లో ఉత్కంఠ రేపిన ఐపీఎల్ పోరులో నిరుటి రన్నరప్ టైటాన్స్ 3 వికెట్ల తేడాతో ఓడింది. మొదట గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. కెప్టెన్ , ఓపెనర్ శుబ్‌మన్ గిల్ (48 బంతుల్లో 89 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగాడు. సాయి సుదర్శన్ (19 బంతుల్లో 33; 6 ఫోర్లు) ధాటిగా ఆడాడు. రబడకు 2 వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన పంజాబ్ కింగ్స్ 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శశాంక్ సింగ్ (29 బంతుల్లో 61 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఇంపాక్ట్ ప్లేయర్ అశుతోష్ శర్మ (17 బంతుల్లో 31; 3 ఫోర్లు, 1 సిక్స్) మెరుపు బ్యాటింగ్‌తో పంజాబ్‌ను గెలిపించారు. నూర్ అహ్మద్ 2 వికెట్లు తీశాడు. ఓపెనర్ గిల్ ఆఖరిదాకా... వృద్ధిమాన్ సాహా (11)తో ఇన్నింగ్స్ ఓపెన్ చేసిన శుబ్‌మన్ ఆఖరిదాకా టైటాన్స్ స్కోరు పెంచే పనిలో పడ్డాడు. కేన్ విలియమ్సన్ (22 బంతుల్లో 26; 4 ఫోర్లు) నింపాదిగా ఆడగా, జట్టు పవర్‌ప్లేలో 52/1 స్కోరు చేసింది. కెప్టెన్ గిల్ ధాటికి సాయి సుదర్శన్ జోరు తోడయ్యాకే గుజరాత్ పుంజుకుంది. 12వ ఓవర్లో జట్టు స్కోరు 100 దాటింది. శుబ్‌మన్ 31 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. చకచకా పరుగులు జతచేస్తున్న సుదర్శన్‌కు హర్షల్ చెక్‌పెట్టగా, విజయ్ శంకర్ (8) నిరాశపరిచాడు. 18వ ఓవర్లో క్రీజులోకి వచ్చిన రాహుల్ తెవాటియా డెత్ ఓవర్లలో బ్యాట్ ఝుళిపించాడు. 19వ ఓవర్ వేసిన హర్షల్ పటేల్ 3 వైడ్లు సహా 9 బంతులేయగా తెవాటియా 6, 4 బాదడంతో ఏకంగా 20 పరుగులు వచ్చాయి. అయితే ఆఖరి ఓవర్ వేసిన అర్ష్‌దీప్ తొలి నాలుగు బంతుల్లో 5 పరుగులే ఇచ్చాడు. అయితే చివరి రెండు బంతుల్ని తెవాటియా బౌండరీలకు తరలించడంతో టైటాన్స్ 199/4 స్కోరు చేసి సరిగ్గా 200 లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచింది. మ్యాచ్ విన్నర్‌గా... భారీ లక్ష్యఛేదనలో శిఖర్ ధావన్ (1) విఫలమైనా... బెయిర్‌స్టో (13 బంతుల్లో 22; 4 ఫోర్లు), ప్రభ్‌సిమ్రన్ (24 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా పరుగులు సాధించారు. 13వ ఓవర్లో సికందర్ రజా (15) అవుటైనప్పడు పంజాబ్ స్కోరు 111/5. గెలుపుపై ఆశల్లేని స్థితిలో జితేశ్ శర్మ అండతో శశాంక్ సింగ్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఇద్దరు 3.1 ఓవర్లలోనే 39 పరుగులు జోడించారు. రెండు వరుస సిక్సర్లు కొట్టిన జితేశ్‌ను రషీద్ బోల్తా కొట్టించాడు. ఈ దశలో కింగ్స్ విజయానికి 27 బంతుల్లో 50 పరుగులు కావాలి. ఇంపాక్ట్ ప్లేయర్‌గా క్రీజులోకి వచ్చిన అశుతో‹Ù... నిలదొక్కుకున్న శశాంక్‌తో కలిసి ధనాధన్ ఆటతో 19వ ఓవర్లోనే విజయసమీకరణాన్ని సులువు చేశాడు. ఆఖరి ఓవర్‌కు వచ్చేసరికి 6 బంతుల్లో 7 పరుగులు చేయాల్సివుండగా, తొలి బంతికే అశుతోష్ అవుటైనా... శశాంక్ మరో వికెట్ పడకుండా జట్టును గెలిపించాడు. గత డిసెంబర్లో జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో పంజాబ్ కింగ్స్ యాజమాన్యం శశాంక్ సింగ్‌ను కొనుగోలు చేసింది. అయితే వేలం జాబితాలో ఇద్దరు శశాంక్ సింగ్‌లు ఉండగా... తాము కోరుకున్న శశాంక్ సింగ్‌ను కాకుండా అదే పేరుతో ఉన్న మరో శశాంక్ సింగ్‌ను పొరపాటుగా తీసుకున్నామని పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా వ్యాఖ్యానించింది. ఇది కాస్తా వివాదం కావడంతో ఇద్దరు శశాంక్‌లు తమ దృష్టిలో ఉన్నారని, తాము పొరపాటు చేయలేదని వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసింది. ఆనాడు శశాంక్ సింగ్‌ను పొరపాటుగా తీసుకున్నామని భావించిన పంజాబ్ కింగ్స్ జట్టుకు నేడు మ్యాచ్ విన్నర్‌గా అవతరించడం విశేషం. స్కోరు వివరాలు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (సి) ధావన్ (బి) రబడ 11; గిల్ (నాటౌట్) 89; విలియమ్సన్ (సి) బెయిర్‌స్టో (బి) హర్‌ప్రీత్ 26; సుదర్శన్ (సి) జితేశ్ (బి) హర్షల్ 33; విజయ్ శంకర్ (సి) హర్‌ప్రీత్ (బి) రబడ 8; తెవాటియా (నాటౌట్) 23; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం ( 20 ఓవర్లలో 4 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1–29, 2–69, 3–122, 4–164. బౌలింగ్: హర్‌ప్రీత్ బ్రార్ 4–0–33–1, అర్ష్‌దీప్ 4–0–33–0, రబడ 4–0–44–2, స్యామ్ కరన్ 2–0–18–0, హర్షల్ పటేల్ 4–0–44–1, సికందర్ రజా 2–0–22–0. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ధావన్ (బి) ఉమేశ్ 1; బెయిర్‌స్టో (బి) నూర్ అహ్మద్ 22; ప్రభ్‌సిమ్రన్ (సి) మోహిత్ (బి) నూర్ అహ్మద్ 35; స్యామ్ కరన్ (సి) విలియమ్సన్ (బి) అజ్మతుల్లా 5; సికందర్ (సి) సాహా (బి) మోహిత్ 15; శశాంక్ (నాటౌట్) 61; జితేశ్ (సి) దర్శన్ (బి) రషీద్ ఖాన్ 16; అశుతోష్ (సి) రషీద్ ఖాన్ (బి) దర్శన్; హర్‌ప్రీత్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (19.5 ఓవర్లలో 7 వికెట్లకు) 200. వికెట్ల పతనం: 1–13, 2–48, 3–64, 4–70, 5–111, 6–150, 7–193. బౌలింగ్: అజ్మతుల్లా 4–0–41–1, ఉమేశ్ 3–0–35–1, రషీద్ ఖాన్ 4–0–40–1, నూర్ అహ్మద్ 4–0–32–2, మోహిత్ శర్మ 4–0–38–1, దర్శన్ 0.5–0–6–1. ఐపీఎల్లో నేడు హైదరాబాద్ X చెన్నై వేదిక: హైదరాబాద్ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
పంజాబ్ హీరో.. ఓడిపోయే మ్యాచ్‌ను గెలిపించాడు! ఎవరీ శశాంక్ సింగ్?
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) నుంచి మరో టాలెంటడ్ బ్యాటర్ వరల్డ్ క్రికెట్‌కు పరిచయమయ్యాడు. తన బ్యాటింగ్‌తో ప్రత్యర్ధి బౌలర్లకు వణకుపుట్టించాడు. అతడే పంజాబ్ కింగ్స్ యువ కెరటం శశాంక్ సింగ్. ఐపీఎల్-2024లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శశాంక్ సింగ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ధావన్, బెయిర్ స్టో, సికిందర్ రజా వంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్లు విఫలమైన చోట.. శశాంక్ సింగ్ సత్తాచాటాడు. పంజాబ్‌కు ఓటమి తప్పదు అనుకున్న వేళ శశాంక్ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. 200 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కేవలం 73 పరుగులకే 4 వికెట్లు పంజాబ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన శశాంక్ సింగ్ ప్రత్యర్ది బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటి అతడు మాత్రం తన హిట్టింగ్‌ను కొనసాగించి పంజాబ్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. కేవలం 29 బంతులు మాత్రమే ఎదుర్కొన్న శశాంక్ 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా పంజాబ్ 200 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ క్రమంలో ఎవరీ శశాంక్ సింగ్ అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. ఎవరీ శశాంక్ సింగ్? 32 ఏళ్ల శశాంక్ సింగ్ 1991 నవంబర్ 21న ముంబైలో జన్మించాడు. ప్రస్తుతం శశాంక్ సింగ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఛత్తీస్‌గఢ్ జట్టు తరఫున ఆడుతున్నాడు. ఇప్పటివరకు 21 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన శశాంక్ 1072 పరుగులు చేశాడు. అంతకుముందు 2015-16 విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా లిస్ట్-ఏ క్రికెట్లో ముంబై తరఫున అరంగేట్రం చేశాడు. తన లిస్ట్-ఏ కెరీర్లో ఇప్పటివరకు 30 మ్యాచ్‌లు ఆడిన అతడు.. 275 పరుగులు చేశాడు. అదే ఏడాదిలో సయ్యద్ ముస్తాక్ అలీతో ముంబై తరపున శశాంక్ సిం టీ20 డెబ్యూ కూడా చేశాడు. ఈ రెండో ఫార్మాట్లలో పోల్చుకుంటే టీ20ల్లో శశాంక్ మంచి రికార్డు ఉంది. ఆఖరిలో వచ్చి మెరుపులు మెరిపించడమే శశాంక్ స్పెషల్. ఇప్పటివరకు 58 టీ20 మ్యాచ్‌లు ఆడిన శశాంక్.. 137.34 స్ట్రైక్ రేట్‌తో 754 పరుగులు చేశాడు. శశాంక్ బౌలింగ్ చేసే సత్తా కూడా ఉంది. మూడు ఫార్మాల్లో కలిపి తన పేరిట 60 వికెట్లు ఉన్నాయి. ఇక 2017లో ఐపీఎల్ కోసం అప్పటి ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్) జట్టు అతన్ని 10లక్షలకు సొంతం చేసుకుంది. కానీ అతడికి అరంగేట్రం చేసే ఛాన్స్ రాలేదు. ఆ తర్వాత 2019, 2020 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ అతడిని సొంతం చేసుకుంది. అక్కడ కూడా అతడికి డెబ్యూ ఛాన్స్ రాలేదు. అనంతరం ఐపీఎల్-2022 మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అతన్ని బేస్ ప్రైస్ 20 లక్షలకు సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఐపీఎల్-2022 సీజన్లో సీఎస్కేపై ఈ క్యాష్ రిచ్ లీగ్‌లోకి శశాంక్ అడుగుపెట్టాడు. అయితే ఐపీఎల్-2023 మినీ వేలంలో అతడిని ఎస్ఆర్హెచ్ విడిచిపెట్టింది. ఆ ఏడాది వేలంలోకి వచ్చిన శశాంక్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. మళ్లీ ఐపీఎల్-2024 వేలంలో తన పేరును శశాంక్ రిజిస్టర్ చేసుకున్నాడు. కనీస ధర 20 లక్షలకు పంజాబ్ కొనుగోలు చేసింది అయితే వేలంలో ఇద్దరూ శశాంక్ సింగ్‌లు ఉండడంతో పంజాబ్ కింగ్స్ కాస్త కన్ఫ్యూజ్ అయింది. పంజాబ్ పొరపాటున వేరే శశాంక్ సింగ్ అనుకోని ఈ ఛత్తీస్‌ఘడ్ ఆల్‌రౌండర్ శశాంక్ సింగ్‌ని కొనుగోలు చేసిందని వార్తలు వినిపించాయి. ఆ తర్వాత పంజాబ్ సరైన శశాంక్ సింగ్‌ని కొనుగోలు చేశామని క్లారిటీ ఇచ్చింది. ఇలా కన్ఫ్యూజిన్‌లో పంజాబ్ జట్టులోకి వచ్చిన శశాంక్ ఇప్పుడు సంచలన విజయాన్ని అందించాడు. Shashank singh, You Savior ❤️ pic.twitter.com/VyE7Z49hrO — Prayag (@theprayagtiwari) April 4, 2024 -
IPL 2024: పొరపాటు పడ్డ ప్రీతి జింటా.. ఒకరి బదుల ఇంకొకరి కొనుగోలు..!
దుబాయ్‌లోని కోలోకోలా ఎరీనా వేదికగా నిన్న (డిసెంబర్ 19) జరిగిన ఐపీఎల్ 2024 వేలంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పంజాబ్ కింగ్స్ కో ఓనర్ ప్రీతి జింటా పొరపాటున ఓ ఆటగాడు అనుకుని మరో ఆటగాడిని కొనుగోలు చేసింది. అయితే, వెంటనే తప్పు తెలుసుకుని సరిదిద్దుకునే ప్రయత్నం చేసినప్పటికీ, అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. వేలం నిర్వహకులు సదరు ఆటగాడిని పంజాబ్ కింగ్స్‌కు లాక్ చేసేసినట్లు ప్రకటించారు. ఐపీఎల్ రూల్స్ ప్రకారం ఒక్కసారి ఆటగాడు ఫ్రాంచైజీకి లాక్ చేయబడితే తిరిగి అతన్ని వేలానికి విడిచిపెట్టడానికి వీలు ఉండదు. ఏం జరిగిందంటే.. నిన్న జరిగిన ఐపీఎల్ 2024 వేలం సందర్భంగా 32 ఏళ్ల ఛత్తీస్‌ఘడ్ ఆల్‌రౌండర్ శశాంక్ సింగ్ పేరు వేలానికి వచ్చింది. ప్రీతి జింటా, నెస్ వాడియాలతో కూడిన పంజాబ్ కింగ్స్ మేనేజ్మెంట్ పొరపాటున ఓ శశాంక్ సింగ్ అనుకుని మరో శశాంక్ సింగ్‌ను కొనుగోలు చేసింది. శశాంక్‌ను పంజాబ్ అతని కనీస ధర 20 లక్షలకు కొనుగోలు చేసింది. శశాంక్ కోసం మరే ఇతర ఫ్రాంచైజీలు పోటీపడలేదు. అయితే శశాంక్‌ను తాము సొంతం చేసుకున్నట్లు దృవీకరించబడిన తర్వాత పంజాబ్ యాజమాన్యం పొరబడ్డామని తెలుసుకుంది. Fantastic scenes here as the notoriously inept Punjab Kings manage to not only purchase a player they didn’t want, (Shashank Singh), they also admit to this in front of literally everyone. Singh we can guess is sat at home wondering whether to show up in March. #IPLAuction #pbks pic.twitter.com/PtLQv9t07H — Punjab Kings UK🇬🇧👑 (@PunjabKingsUK) December 19, 2023 అయితే అప్పటికే సమయం మించి పోవడంతో చేసేదేమీ లేక సర్దుకుపోయింది. తాము పొరబడ్డామని తెలుసుకున్న క్షణంలో పంజాబ్ కో ఓనర్ పడ్డ ఆందోళన నెట్టింట వైరలవుతుంది. ఓ శశాంక్ అనుకుని మరో శశాంక్‌ను సొంతం చేసుకున్నామని ప్రీతి జింటా బాధపడుతున్న వీడియో సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తుంది. కాగా, పంజాబ్ పొరపాటున సొంతం చేసుకున్న శశాంక్ సింగ్ ట్రాక్ రికార్డు మరీ అంత తీసి పారేయడానికి వీల్లేదు. అతను 55 టీ20ల్లో 724 పరుగులు చేసి 15 వికెట్లు పడగొట్టాడు. శశాంక్‌ను 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వేలానికి విడిచి పెట్టింది. 2023 సీజన్ వేలంలో శశాంక్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. నిన్నటి వేలంలో పంజాబ్ చేసిన పొరపాటే మరో ఫ్రాంచైజీ కూడా చేయబోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఓ ఆటగాడు అనుకుని మరో ఆటగాడి కోసం వేలంలో ప్రయత్నించింది. అయితే వారు తప్పు తెలుసుకుని డ్రాప్ అయిపోయారు. -
ఫిలిప్స్ విధ్వంసకర ఇన్నింగ్స్.. అరుదైన రికార్డు! అయితే 416.66 స్ట్రైక్‌రేటుతో..
IPL 2023 RR Vs SRH: ఐపీఎల్-2023లో.. ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ కోసం ఎంతో ఓపికగా ఎదురుచూశాడు న్యూజిలాండ్ బ్యాటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ గ్లెన్ ఫిలిఫ్స్. తొమ్మిది మ్యాచ్‌ల పాటు బెంచ్‌కే పరిమితమైన అతడు రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌తో ఎట్టకేలకు ఈ సీజన్లో ఖాతా తెరిచాడు. భారీ మొత్తం చెల్లించి కొనుగోలు చేసిన ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ వరుస వైఫల్యాల నేపథ్యంలో ఆదివారం నాటి మ్యాచ్‌లో రైజర్స్ తుది జట్టులో చోటు సంపాదించాడు. వచ్చీరాగానే.. ఇన్నాళ్లు తనను పక్కకు పెట్టి మేనేజ్మెంట్ ఎంత పెద్ద తప్పు చేసిందో తన అద్భుత ఆట తీరుతో చాటిచెప్పాడు. కీలక సమయంలో తుపాన్ ఇన్నింగ్స్‌తో విధ్వంసం సృష్టించాడు. 7 బంతుల్లో 25 పరుగులతో చెలరేగాడు. వరుసగా మూడు సిక్సర్లు, ఒక ఫోర్ బాది సత్తా చాటాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఫిలిప్స్ అద్భుత ఆట తీరు సృష్టించిన సునామీలో రాజస్తాన్ ప్లేయర్లు జోస్ బట్లర్ ఇన్నింగ్స్(95 పరుగులు), యజువేంద్ర చహల్(4/29) స్పెల్ కొట్టుకుపోయాయి. వీరిద్దరినీ కాదని 7 బంతుల్లో 357.14 స్ట్రేక్రేటుతో మెరిసి సన్‌రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఫిలిప్స్‌ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. కాగా ఈ ఇన్నింగ్స్‌తో గ్లెన్ ఫిలిప్స్ ఐపీఎల్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఓ మ్యాచ్‌లో తక్కువ సమయంలో ఎక్కువ ప్రభావం చూపి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలిచిన ఆటగాళ్ల జాబితాలో ముందు వరుసలో నిలిచాడు. మొదటి స్థానంలో ఈ క్రమంలో బౌలర్ నువన్ కులశేఖర పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. ఫిలిప్స్ 7 బంతుల్లో 25 పరుగులతో టాప్‌నకు చేరుకోగా.. సీఎస్కే తరఫు పుణెతో మ్యాచ్‌లో నువన్ 2012లో 2/10 బౌలింగ్ గణాంకాలతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఆర్సీబీకి ఆడిన మార్క్ బౌచర్(2009లో) కేకేఆర్ మీద 13 బంతుల్లో 25 పరుగులతో అజేయంగా నిలిచి మూడో స్థానంలో ఉండగా.. 2021లో కీరన్ పొలార్డ్(ముంబై) పంజాబ్ కింగ్స్‌తో 7 బంతుల్లో 15 పరుగుల(నాటౌట్)తో నాలుగో స్థానంలో ఉన్నాడు. సన్‌రైజర్స్ తరఫున రెండో ఆటగాడిగా ఇదిలా ఉంటే.. ఎస్ఆర్హెచ్ తరఫున ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక స్ట్రైక్‌రేటు నమోదు చేసిన రెండో క్రికెటర్‌గా గ్లెన్ ఫిలిప్స్ మరో రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో టాప్-4లో ఉన్నది వీళ్లే! ►416.66 - 25*(6) - శశాంక్ సింగ్- గుజరాత్ టైటాన్స్ మీద- 2022లో- వాంఖడే స్టేడియంలో ►357.14 - 25 (7) - గ్లెన్ ఫిలిప్స్- రాజస్తాన్ రాయల్స్ మీద- 2023లో- జైపూర్‌లో ►340.00 - 34*(10) - రషీద్ ఖాన్- కేకేఆర్ మీద- కోల్‌కతాలో- 2018లొ ►285.71 - 40(14) - వాషింగ్టన్ సుందర్- రాజస్తాన్ రాయల్స్ మీద- 2022లో పుణెలో. చదవండి: సన్‌రైజర్స్ విజయంపై డేవిడ్ వార్నర్ ట్వీట్! మెచ్చుకున్నాడా? లేదంటే.. WHAT. A. GAME 😱😱 Abdul Samad wins it for the @SunRisers as he hits a maximum off the final delivery. #SRH win by 4 wickets. Scorecard - https://t.co/1EMWKvcgh9 #TATAIPL #RRvSRH #IPL2023 pic.twitter.com/yh0WVMEbOz — IndianPremierLeague (@IPL) May 7, 2023 7⃣ balls that changed the Sunday night for us 🧡 Glenn Phillips is our 𝐑𝐢𝐬𝐞𝐫 𝐨𝐟 𝐭𝐡𝐞 𝐝𝐚𝐲 and we couldn't be more happy 😍 pic.twitter.com/YrCG7gd1UC — SunRisers Hyderabad (@SunRisers) May 8, 2023 -
ఫెర్గూసన్‌కు చుక్కలు చూపించాడు.. ఎవరీ శశాంక్ సింగ్?
ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. 196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ఆఖర్లో రషీద్ ఖాన్(11 బంతుల్లో 31*), రాహుల్ తెవాటియా(21 బంతుల్లో 40*) విధ్వంసం సృష్టించడంతో విజయం అందుకుంది. అయితే ఎస్ఆర్హెచ్ ఓడినప్పటికి బ్యాటింగ్‌లో ఎస్ఆర్హెచ్ నుంచి మరో ఆణిముత్యం బయటపడ్డాడు. అతనే శశాంక్ సింగ్. ఫెర్గూసన్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో హాట్రిక్ సిక్సర్లు బాది అతనికి చుక్కలు చూపించాడు. ఓవరాల్‌గా 6 బంతుల్లోనే మూడు సిక్సర్లు, ఒక ఫోర్ సహా 25 పరుగులు సాధించాడు. ఒక రకంగా ఎస్ఆర్హెచ్ 195 పరుగుల భారీ స్కోరు చేయడంలో శశాంక్ సింగ్ కీలకపాత్ర పోషించాడు. ఐదు మ్యాచ్‌ల నుంచి జట్టులో ఉన్నప్పటికి శశాంక్‌కు బ్యాటింగ్ ఆడే అవకాశం రాలేదు. ఎట్టకేలకు గుజరాత్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్ అవకాశం రాగానే తన పవరేంటో చూపించాడు. ఈ సీజన్లో ఉమ్రాన్ మాలిక్‌తో పోటీ పడుతూ అత్యంత వేగవంతమైన బంతులు విసురుతున్న లోకీ ఫెర్గూసన్‌ను ఒక ఆట ఆడుకున్నాడు. ముఖ్యంగా 147 కిమీ వేగంతో ఫెర్గూసన్ వేసిన 20వ ఓవర్ ఐదో బంతిని ఫైన్‌లెగ్ దిశగా సిక్స్ కొట్టడం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. Courtesy: IPL Twitter ఎవరీ శశాంక్ సింగ్..? ముంబైకి చెందిన శశాంక్ సింగ్ 1991 నవంబర్ 21న జన్మించాడు. మంచి స్ట్రైక్ రొటేట్ చేయగల బ్యాటర్‌గా గుర్తింపు పొందిన శశాంక్ ఆఫ్‌స్పిన్ బౌలింగ్ చేయగలడు. 2015లో ముంబై తరపున డొమొస్టిక్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత అదే ఏడాది టి20, లిస్ట్- ఏ క్రికెట్లో ఎంటరయ్యాడు, ఇక 2019లో చత్తీస్‌ఘర్ తరపున ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. 2017 నుంచి ఐపీఎల్లో ఉన్న శశాంక్ సింగ్ తొలుత ఢిల్లీ క్యాపిటల్స్.. 2019, 2020 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ జట్టులో ఉన్నాడు. ఐపీఎల్ మెగావేలంఓ ఎస్ఆర్హెచ్.. శశాంక్ సింగ్‌ను కనీస ధర రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. చదవండి: Umran Malik 5 Wickets: ఐదో అన్క్యాప్డ్ ప్లేయర్‌గా ఉమ్రాన్ మాలిక్ కొత్త చరిత్ర Muttiah Muralitharan Vs Marco Jansen: 'మైండ్ దొబ్బిందా.. ఆ బౌలింగ్ ఏంటి?'.. మురళీధరన్ ఆగ్రహం var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } });