పంజాబ్ కింగ్స్ మెరుపు వీరుడు శశాంక్ సింగ్ పేరు ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్‌లో మార్మోగిపోతుంది. కేకేఆర్‌పై చారిత్రక ఇన్నింగ్స్ (28 బంతుల్లో 68 నాటౌట్; 2 ఫోర్లు, 8 సిక్సర్లు) అనంతరం నెట్టింట ఎక్కడ చూసినా శశాంక్ గురించే చర్చ నడుస్తుంది. కేకేఆర్‌తో మ్యాచ్‌లో భారీ లక్ష్య ఛేదనలో శశాంక్ చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడని జనాలు జేజేలు కొడుతున్నారు. ఈ మ్యాచ్‌లో శశాంక్ ఆడిన షాట్లు న భూతే న భవిష్యతి అన్నట్లున్నాయని కొనియాడుతున్నారు.
శశాంక్‌పై ప్రశంసల వర్షం కురుస్తున్న క్రమంలో ఓ నెటిజన్ ఆసక్తికర పోస్ట్ షేర్ చేశాడు. ఈ పోస్ట్‌లోని డేటాను చూసిన వారు శశాంక్‌ను అసలుసిసలైన ఛేజింగ్ మాస్టర్ అనక మానరు. ఈ పోస్ట్‌లో శశాంక్ ఛేజింగ్‌లో చేసిన పరుగుల గురించి ప్రస్తావించబడింది.
ఛేజింగ్‌లో (ప్రస్తుత సీజన్) శశాంక్ ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడి నాలుగింట నాటౌట్‌గా నిలిచాడు. అంతే కాదు శశాంక్ తన అబ్బురపరిచే బ్యాటింగ్ విన్యాసాలతో రెండు మ్యాచ్‌ల్లో పంజాబ్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ గణంకాలు చూసిన తర్వాత ఇతడే అసలుసిసలైన ఛేజింగ్ మాస్టర్ అంటూ జనాలు శశాంక్‌ను కొనియాడుతున్నారు.
ఈ సీజన్‌లో ఛేజింగ్‌లో శశాంక్ ఆడిన ఇన్నింగ్స్‌లు..
- లక్నోపై 7 బంతుల్లో 9 నాటౌట్
- గుజరాత్‌పై 29 బంతుల్లో 61 నాటౌట్ (పంజాబ్ గెలుపు)
- సన్‌రైజర్స్‌పై 25 బంతుల్లో 46 నాటౌట్
- ముంబై ఇండియన్స్‌పై 25 బంతుల్లో 41
- కేకేఆర్‌పై 28 బంతుల్లో 68 నాటౌట్ (పంజాబ్ గెలుపు)
మ్యాచ్ విషయానికొస్తే.. శశాంక్‌తో పాటు బెయిర్‌స్టో (48 బంతుల్లో 108 నాటౌట్; 8 ఫోర్లు, 9 సిక్సర్లు), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (20 బంతుల్లో 54; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), రోసో (16 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్స్‌లు) చెలరేగడంతో పంజాబ్ కేకేఆర్ నిర్దేశించిన 262 పరుగుల లక్ష్యాన్ని మరో ఎనిమిది బంతులు మిగిలుండగానే ఛేదించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు చేసిన కేకేఆర్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్ (37 బంతుల్లో 75; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు), సునీల్ నరైన్ (32 బంతుల్లో 71; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించగా, వెంకటేశ్ అయ్యర్ (23 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు.
Comments
Please login to add a commentAdd a comment