ఐపీఎల్-2024లో పంజాబ్ కింగ్స్ ఆటగాడు శశాంక్ సింగ్ మరోసారి సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శశాంక్ సింగ్ విధ్వంసం సృష్టించాడు. 262 పరుగుల భారీ లక్ష్య చేధనలో కేకేఆర్ బౌలర్లను శశాంక్ ఊచకోత కోశాడు.
జానీ బెయిర్ స్టోతో కలిసి మ్యాచ్‌ను శశాంక్ మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన శశాంక్ కేవలం 28 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్స్‌లతో 68 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. శశాంక్ సింగ్ ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇది చూసిన నెటిజన్లు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదెక్కడి విధ్వంసం.. తన లాంటి ఆటగాడు భారత జట్టులో ఉండాలని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇంతకుముందు కూడా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ను శశాంక్ గెలిపించాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. పంజాబ్ 262 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.4 ఓవర్లలో చేధించింది.
దీంతో టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన జట్టుగా పంజాబ్ నిలిచింది. పంజాబ్ బ్యాటర్లలో బెయిర్‌స్టో( పాటు శశాంక్ సింగ్( 68 నాటౌట్), ప్రభుసిమ్రాన్ సింగ్(54) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు.
SHASHANK SINGH, THE FINISHER. 🫡
- The consistency of an Indian uncapped player is remarkable. pic.twitter.com/bJpfOj4PsL— Johns. (@CricCrazyJohns) April 26, 2024
Comments
Please login to add a commentAdd a comment