గుజరాత్ టైటాన్స్‌తో నిన్న (ఏప్రిల్ 4) జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఆటగాడు శశాంక్ సింగ్ (29 బంతుల్లో 61 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్‌పై ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్‌లో చర్చ జోరుగా సాగుతుంది. క్రికెట్ అభిమానులు శశాంక్ గురించి ఆరా తీసే క్రమంలో అతని పాత వీడియో ఒకటి బయటపడింది. ఇందులో శశాంక్ విధ్వంసం వీర లెవెల్లో ఉంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తుంది.
2022 ఐపీఎల్ సీజన్‌కు సంబందించిన ఆ వీడియోలో శశాంక్ సన్‌రైజర్స్‌కు ఆడుతూ గుజరాత్ బౌలర్లు చీల్చిచెండాడాడు. నిన్నటి మ్యాచ్‌తో పోలిస్తే ఆ విధ్వంసం వేరే లెవెల్లో ఉంది. శశాంక్ ఊచకోతకు గతంలోనూ గుజరాత్ బౌలర్లు బలయ్యారు.
When Shashank Singh used to play for SRH, he smashed Lockie Ferguson like a club bowler 😨#GTvPBKS #ShashankSingh #GTvPBKS #PBKSvsGT pic.twitter.com/MxN4jH5k9f
— Richard Kettleborough (@RichKettle07) April 5, 2024
నాడు గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో శశాంక్ ఏడో స్థానంలో బరిలోకి దిగి 6 బంతుల్లో 3 సిక్సర్లు, బౌండరీ సాయంతో 25 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆ ఇన్నింగ్స్‌లో శశాంక్ స్ట్రయిక్‌రేట్ 416.67గా ఉంది. అదే సీజన్‌లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన శశాంక్ ఫెర్గూసన్ లాంటి బౌలర్‌పై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడటం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు శశాంక్‌కు గుజరాత్ అంటే కసిలా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.
కాగా, శాశంక్ సింగ్, అశుతోష్ శర్మ (17 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్) చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లతో చెలరేగడంతో నిన్నటి మ్యాచ్‌లో పంజాబ్ గుజరాత్ టైటాన్స్‌పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. శుభ్‌మన్ గిల్ (89 నాటౌట్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేయగా.. శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (35) రెచ్చిపోవడంతో పంజాబ్ 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా 3 వికెట్ల తేడాతో విజయం సాధించి, పాయింట్ల పట్టికలో గుజరాత్‌ను వెనుక్కునెట్టి ఐదో స్థానానికి చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment