
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రాహుల్ త్రిపాఠి వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా చెపాక్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో త్రిపాఠి దారుణ ప్రదర్శన కనబరిచాడు. మరోసారి ఓపెనర్‌గా బరిలోకి దిగిన త్రిపాఠి కేవలం 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు.
జోష్ హాజిల్ వుడ్ బౌలింగ్‌లో చెత్త షాట్‌కు ప్రయత్నించి తన వికెట్‌ను కోల్పోయాడు. అంతకుముందు ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా త్రిపాఠి కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో త్రిపాఠిని సీఎస్‌కే ఫ్యాన్స్ దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఈ చెత్త ఆడినందుకే సన్‌రైజర్స్ వదిలేసింది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
కాగా రాహుల్ త్రిపాఠి గత కొన్ని సీజన్లగా ఎస్ఆర్‌హెచ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. కానీ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మెగా వేలానికి ముందు ఎస్ఆర్‌హెచ్ విడిచిపెట్టింది. దీంతో వేలంలోకి వచ్చిన అతడిని సీఎస్‌కే రూ. 3.40 కోట్లకు కొనుగోలు చేసింది. తన ధరకు తగ్గ న్యాయం త్రిపాఠి చేయలేకపోతున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.
చదవండి: #MS Dhoni: వారెవ్వా ధోని..కళ్లు మూసి తెరిచేలోపే! వీడియో వైరల్