IPL 2024: గుజరాత్‌కు గెలుపు దూరం చేసిన ఈ అశుతోష్‌ రాంబాబు ఎవరు..? | IPL 2024, GT vs PBKS: Shashank Singh, Ashutosh Sharma Helped Punjab To Register Unexpected Victory | Sakshi
Sakshi News home page

IPL 2024: ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చి ఇరగదీసిన ఈ అశుతోష్‌ రాంబాబు ఎవరు..?

Published Fri, Apr 5 2024 11:48 AM | Last Updated on Fri, Apr 5 2024 12:46 PM

IPL 2024 GT VS PBKS: Shashank Singh, Ashutosh Sharma Helped Punjab To Register Unexpected Victory - Sakshi

ఐపీఎల్‌ 2024లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ 3 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. 200 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో గెలుపుపై ఆశలు లేని పంజాబ్‌ను శాశం​క్‌ సింగ్‌ (29 బంతుల్లో 61 నాటౌట్‌; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), అశుతోష్‌ శర్మ (17 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్‌) అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడి గెలిపించారు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు మెరుపు వేగంతో 43 పరుగులు సమకూర్చి పంజాబ్‌కు ఊహించని విజయాన్ని అందించారు. 

73 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో శశాంక్‌.. 27 బంతుల్లో 50 పరుగులు చేయాల్సిన దశలో అశుతోష్‌ అంచనాలు లేకుండా బరిలోకి దిగి పంజాబ్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఓటమి తప్పతనుకున్న వేళ వీరిద్దరూ తమ బ్యాటింగ్‌ విన్యాసాలతో మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశారు. శశాంక్‌ ప్రత్యర్ది బౌలర్లపై ఎదురుదాడికి దిగి విధ్వంసం సృష్టిస్తే.. అశుతోష్‌ బాధ్యతమైన షాట్లు ఆడి స్ట్రయిక్‌ను రొటేట్‌ చేశాడు. 

ఎవరీ అశుతోష్‌..?
పంజాబ్‌ గెలుపులో శశాంక్‌ పాత్ర ఎంత కీలకమైందో అశుతోష్‌ పాత్ర కూడా అంతే వెల కట్టలేనిది. అరంగేట్రం మ్యాచ్‌లోనే అశుతోష్‌ ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చి మరీ ఇరగదీశాడు. 25 ఏళ్ల అశుతోష్‌ రాంబాబు శర్మ.. తన తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌లోనే ఈ రేంజ్‌లో చెలరేగుతాడని ఎవరూ ఊహించ లేదు.

దేశవాలీ క్రికెట్‌లోనూ పెద్దగా ట్రాక్‌ రికార్డు లేని అశుతోష్‌ను పంజాబ్‌ కింగ్స్‌ తన బేస్‌ ధర రూ. 20 లక్షలకు సొంతం చేసుకుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన అశుతోష్‌.. 4 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు, 7 లిస్ట్‌-ఏ, 16 టీ20లు ఆడాడు. ఫస్ట్‌ క్లాస్‌ కెరీర్‌లో సెంచరీ, హాఫ్‌ సెంచరీ చేసిన అశుతోష్‌.. టీ20ల్లో 4 అర్దసెంచరీలు నమోదు చేశాడు. 

పొరపాటున ఎంపిక చేసుకున్నవాడే గెలుపు గుర్రమయ్యాడు..
శశాంక్‌ విషయానికొస్తే.. ఐపీఎల్‌ 2024 వేలంలో పంజాబ్‌ కింగ్స్‌ ఇతగాడిని పొరపాటున ఎంపిక చేసుకుందని వార్తలు వచ్చాయి. వేలంలో ఇద్దరు శశాంక్‌ సింగ్‌లు ఉండటంతో పొరపాటున ఈ శశాంక్‌ సింగ్‌ను తీసుకున్నట్లు పంజాబ్‌ సహ యజమాని ప్రీతి జింటా అప్పట్లో తెగ బాధపడిపోయింది.

పొరపాటున తీసుకున్నాయని భావించిన ఆ శశాంక్‌ సింగే ఇప్పుడు పంజాబ్‌ పాలిట గెలుపు గుర్రంగా అవతరించడం విశేషం. చత్తీస్‌ఘడ్‌కు చెందిన ఈ శశాంక్‌ సింగ్‌ను పంజాబ్‌ కింగ్స్‌ 2024 వేలంలో రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. 

కాగా, గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌.. శుభ్‌మన్‌ గిల్‌ (89 నాటౌట్‌) అద్భుత ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేయగా.. పంజాబ్‌ శశాంక్‌ సింగ్‌, అశుతోష్‌ శర్మ, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (35) రాణించడంతో 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement