IPL 2025: ఢిల్లీపై గుజరాత్‌ విజయం | IPL 2025 GT vs DC: Toss Playing XIs Updates And Highlights | Sakshi
Sakshi News home page

IPL 2025: ఢిల్లీపై గుజరాత్‌ విజయం

Published Sat, Apr 19 2025 3:02 PM | Last Updated on Sat, Apr 19 2025 7:52 PM

IPL 2025 GT vs DC: Toss Playing XIs Updates And Highlights

Photo Courtesy: BCCI

ఢిల్లీపై గుజరాత్‌ విజయం
ఐపీఎల్‌ 2025 సీజన్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇవాళ (ఏప్రిల్‌ 19) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గుజరాత్‌ టైటాన్స్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. 

ఢిల్లీ బ్యాటర్లలో అక్షర్‌ 39, అశుతోష్‌ శర్మ 37, కరుణ్‌ నాయర్‌, ట్రిస్టన్‌ స్టబ్స్‌ తలో 31, కేఎల్‌ రాహుల్‌ 28, అభిషేక్‌ పోరెల్‌ 18, విప్రాజ్‌ నిగమ్‌ 0, డొనోవన్‌ ఫెరియెరా 1, స్టార్క్‌ 2 (నాటౌట్‌), కుల్దీప్‌ 4 (నాటౌట్‌) పరుగులు చేశారు. గుజరాత్‌ బౌలర్లలో ప్రసిద్ద్‌ కృష్ణ 4 వికెట్లు తీయగా.. సిరాజ్‌, అర్షద్‌ ఖాన్‌, ఇషాంత్‌ శర్మ, సాయికిషోర్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం​ భారీ లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్‌ ఆదిలోనే శుభ్‌మన్‌ గిల్‌ (7) వికెట్‌ కోల్పోయినప్పటికీ.. జోస్‌ బట్లర్‌ వీరోచిత ఇన్నింగ్స్‌ (97 నాటౌట్‌) కారణంగా 19.2 ఓవర్లలో (3 వికెట్ల నష్టానికి) లక్ష్యాన్ని చేరుకుంది. గుజరాత్‌ బ్యాటర్లలో సాయి సుదర్శన్‌ 36, రూథర్‌ఫోర్డ్‌ 43, తెవాతియా 11 పరుగులు (నాటౌట్‌) చేశారు. 

ఆఖర్లో బట్లర్‌కు సెంచరీ చేసే అవకాశం ఉన్నా తెవాతియా చివరి ఓవర్‌లో వరుసగా సిక్సర్‌, బౌండరీ కొట్టి గుజరాత్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్‌ కుమార్‌, కుల్దీప్‌ యాదవ్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఈ గెలుపుతో గుజరాత్‌ ఢిల్లీని వెనక్కు నెట్టి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం గుజరాత్‌, ఢిల్లీ, పంజాబ్‌ తలో 10 పాయింట్లతో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.

హాఫ్‌ సెంచరీ పూర్తి చేసిన బట్లర్‌
12.5వ ఓవర్‌- మోహిత్‌ శర్మ బౌలింగ్‌లో బౌండరీ బాది బట్లర్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. బట్లర్‌ ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. బట్లర్‌కు జతగా రూథర్‌ఫోర్డ్‌ క్రీజ్‌లో ఉన్నాడు. ఇదే ఓవర్‌లో రూథర్‌ఫోర్డ్‌ తొలి రెండు బంతులకు రెండు సిక్సర్లు బాదాడు. 13 ఓవర్ల తర్వాత గుజరాత్‌ స్కోర్‌ 129/2గా ఉంది. బట్లర్‌ 52, రూథర్‌ఫోర్డ్‌ 31 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 

రెండో వికెట్‌ కోల్పోయిన గుజరాత్‌
7.3వ ఓవర్‌- 74 పరుగుల వద్ద గుజరాత్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో స్టబ్స్‌కు క్యాచ్‌ ఇచ్చి సాయి సుదర్శన్‌ (36) ఔటయ్యాడు. 9 ఓవర్ల తర్వాత గుజరాత్‌ స్కోర్‌ 85/2గా ఉంది. బట్లర్‌ (38), రూథర్‌ఫోర్డ్‌ (3) క్రీజ్‌లో ఉన్నారు. 

తొలి వికెట్‌ కోల్పోయిన గుజరాత్‌
1.4వ ఓవర్‌- 204 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్‌ 14 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. కరుణ్‌ నాయర్‌ అద్బుతమైన త్రోతో శుభ్‌మన్‌ గిల్‌ను (7) రనౌట్‌ చేశాడు. 3 ఓవర్ల తర్వాత గుజరాత్‌ స్కోర్‌ 29/1గా ఉంది. సాయి సుదర్శన్‌ (16), బట్లర్‌ (6) క్రీజ్‌లో ఉన్నారు. 

భారీ స్కోర్‌ చేసిన ఢిల్లీ
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో అక్షర్‌ 39, అశుతోష్‌ శర్మ 37, కరుణ్‌ నాయర్‌, ట్రిస్టన్‌ స్టబ్స్‌ తలో 31, కేఎల్‌ రాహుల్‌ 28, అభిషేక్‌ పోరెల్‌ 18, విప్రాజ్‌ నిగమ్‌ 0, డొనోవన్‌ ఫెరియెరా 1, స్టార్క్‌ 2 (నాటౌట్‌), కుల్దీప్‌ 4 (నాటౌట్‌) పరుగులు చేశారు. 

గుజరాత్‌ బౌలర్లలో ప్రసిద్ద్‌ కృష్ణ 4 వికెట్లు తీయగా.. సిరాజ్‌, అర్షద్‌ ఖాన్‌, ఇషాంత్‌ శర్మ, సాయికిషోర్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

18 ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 188/6 (18) 
అశుతోష్‌ 12 బంతుల్లో 32 పరుగులతో క్రీజులో ఉండగా.. ఫెరీరా ఇంకా ఖాతా తెరవలేదు.
ఒకే ఓవర్లో రెండు వికెట్లు
17.1: ప్రసిద్‌ కృష్ణ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగిన అక్షఱ్‌ పటేల్‌ (38). ఆ వెంటనే విప్రాజ్‌ నిగమ్‌ను అవుట్‌ చేసిన ప్రసిద్‌. 18వ ఓవర్లో వరుస బంతుల్లో గుజరాత్‌కు రెండు వికెట్లు. ఢిల్లీ స్కోరు: 173/6 (17.2)

అక్షర్‌ పటేల్‌కు గాయం?
15.3: అర్షద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో డీప్‌ స్క్వేర్‌ లెగ్‌ మీదుగా బంతిని తరలించిన అక్షర్‌.. సింగిల్‌ తీసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతడు చీలమండ నొప్పితో విలవిల్లాడగా.. ఫిజియో వచ్చి పరీక్షించాడు.

15 ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 150/4
అక్షర్‌ 33, అశుతోష్‌ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.

నాలుగో వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ
14.2: సిరాజ్‌ బౌలింగ్లో స్టబ్స్‌ (31) అవుట్‌. అక్షర్‌ 32 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 146/4 (14.2). అశుతోష్‌ శర్మ క్రీజులోకి వచ్చాడు.

ఢిల్లీ ధనాధన్‌
14 ఓవర్లు పూర్తయ్యే సరికి ఢిల్లీ స్కోరు: 146/3
స్టబ్స్‌ 19 బంతుల్లో 31, అక్షర్‌ పటేల్‌ 24 బంతుల్లో 32 పరుగులతో జోరుమీదున్నారు.

పది ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 105-3
స్టబ్స్‌ 8, అక్షర్‌ పటేల్‌ 15 పరుగులతో ఉన్నారు.

మూడో వికెట్‌ డౌన్‌
8.1: ప్రసిద్‌ కృష్ణ బౌలింగ్‌ మూడో వికెట్‌గా వెనుదిరిగిన కరుణ్‌ నాయర్‌ (31). స్కోరు: 93/3 (8.2). అక్షర్‌ పటేల్‌ 12 పరుగులతో ఆడుతుండగా.. ట్రిస్టన్‌ స్టబ్స్‌క్రీజులోకి వచ్చాడు.
 

పవర్‌ ప్లేలో ఢిల్లీ స్కోరు: 73/2 (6)
కరుణ్‌ నాయర్‌ 19, అక్షర్‌ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

కేఎల్‌ రాహుల్‌ అవుట్‌
4.4: ప్రసిద్‌ కృష్ణ బౌలింగ్లో లెగ్‌ బిఫోర్‌ వికెట్‌గా వెనుదిరిగిన కేఎల్‌ రాహుల్‌ (28). దీంతో ఢిల్లీ రెండో వికెట్‌ కోల్పోయింది. అక్షర్‌ పటేల్‌ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 58/2 (4.4)

నాలుగు ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 52/1
రాహుల్‌ 22, కరుణ్‌ నాయర్‌ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు.

తొలి వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ
1.4: అర్షద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో అభిషేక్‌ పోరెల్‌ సిరాజ్‌కు క్యాచ్‌ ఇచ్చి 18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. కేఎల్‌ రాహుల్‌ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 23/1 (1.4)

తొలి ఓవర్లోనే 16 పరుగులు
గుజరాత్‌ బౌలింగ్‌ ఎటాక్‌ను సిరాజ్‌ పేలవంగా ఆరంభించాడు. తొలి రెండు బంతులను వైడ్‌గా వేసిన ఈ రైటార్మ్‌ పేసర్‌ బౌలింగ్‌లో.. తర్వాతి రెండు బంతుల్లో అభిషేక్‌ పోరెల్‌ వరుసగా 4, 6 బాదాడు. ఐదో బంతిని కూడా బౌండరీకి తరలించాడు. అభిషేక్‌ పోరెల్‌ 14, కరుణ్‌ నాయర్‌ సున్నా పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఐపీఎల్‌-2025లో మరో ఆసక్తికర పోరు... వరుస విజయాలతో జోరు మీదున్న ఢిల్లీ ‍క్యాపిటల్స్‌ శనివారం మధ్యాహ్నం నాటి మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌తో తలపడుతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఇందుకు వేదిక. టాస్‌ గెలిచిన గుజరాత్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. ఢిల్లీ బ్యాటింగ్‌ చేస్తోంది.

తుదిజట్లు
గుజరాత్‌ టైటాన్స్‌
సాయి సుదర్శన్, శుబ్‌మన్‌ గిల్(కెప్టెన్‌), జోస్ బట్లర్(వికెట్‌ కీపర్‌), షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ.
ఇంపాక్ట్‌ సబ్‌స్టిట్యూట్స్‌: షెర్ఫానే రూథర్‌ఫర్డ్‌, మహిపాల్‌ లామ్రోర్‌, అనూజ్‌ రావత్‌, వాషింగ్టన్‌ సుందర్‌, కరీం జనత్‌.

ఢిల్లీ క్యాపిటల్స్‌
అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్(వికెట్‌ కీపర్‌), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్(కెప్టెన్‌), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముకేష్ కుమార్.
ఇంపాక్ట్‌ సబ్‌స్టిట్యూట్స్‌: జేక్‌ ఫ్రేజర్‌-మెగర్క్‌, దర్శన్‌ నల్కాండే, సమీర్‌ రిజ్వీ, డొనొవన్‌ ఫెరీరా, దుష్మంత చమీర.

కాగా ఢిల్లీ ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో ఐదు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా.. గుజరాత్‌ ఆరింట నాలుగు గెలిచి మూడో స్థానంలో కొనసాగుతోంది.

చదవండి: సంజూతో విభేదాలు!.. స్పందించిన రాహుల్‌ ద్రవిడ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement