Narendra Modi Stadium
-
సెమీఫైనల్ మ్యాచ్.. లంచ్‌కు ముందు ఐదుగురు.. తర్వాత ఒక్కడే.. జనాలు లేక వెలవెలబోయిన నరేంద్ర మోదీ స్టేడియం
ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ మైదానమైన నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న సుప్రసిద్ధ దేశవాళీ టోర్నీ సెమీఫైనల్‌కు (కేరళ వర్సెస్ గుజరాత్) సరైన ప్రచారం లేక ప్రేక్షకులు అటువైపే కన్నెత్తి చూడలేదు. దాదాపు లక్షా 30 వేల సామర్థ్యమున్న ప్రేక్షకుల గ్యాలరీలో తొలిరోజు తొలి సెషన్లో కేవలం ఐదుగురే మ్యాచ్‌ను తిలకించేందుకు వచ్చారు. భోజన విరామం తర్వాత ఇందులో ఒకే ఒక్కడు మిగిలాడు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్స్ స్పందించారు. కొందరేమో ప్రేక్షకులను అనుమతించరేమోనని వెళ్లలేదని పేర్కొనగా, మరికొందరు అసలిక్కడ సెమీస్ జరుగుతున్న సంగతే తమకు తెలియదని పోస్ట్‌లు పెట్టారు. మరికొందరు క్రికెట్ ఔత్సాహికులు అనుమతిస్తున్నారనే బదులు రావడంతో రెండో రోజు నుంచి వెళ్తామని ఆసక్తి చూపారు. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేరళ, ఇన్నింగ్స్‌ను చప్పగా ప్రారంభించింది. కెప్టెన్ సచిన్ బేబీ (193 బంతుల్లో 69 బ్యాటింగ్, 8 ఫోర్లు) జిడ్డుగా బ్యాటింగ్ చేశాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి కేరళ జట్టు 89 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఓపెనర్లు అక్షయ్ చంద్రన్ (30; 5 ఫోర్లు), రోహన్ (30; 5 ఫోర్లు) మంచి ఆరంభాలు లభించినా భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. వరుణ్ నాయనార్ (10) తక్కువ స్కోర్‌కే ఔటయ్యాడు.జలజ్ సక్సేనా (30; 4 ఫోర్లు) గుజరాత్ బౌలర్ల సహనానికి పరీక్షించాడు. ఆట ముగిసే సమయానికి సచిన్ బేబితో పాటు మొహమ్మద్ అజారుద్దీన్ (30) క్రీజ్‌లో ఉన్నాడు. గుజరాత్ బౌలర్లలో అర్జన్ నగస్వల్లా, పి జడేజా, రవి బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు. -
అహ్మదాబాద్‌లో అదరగొట్టిన భారత బ్యాటర్లు.. ఇదే తొలిసారి
ఇంగ్లండ్‌తో మూడో వన్డే(India vs England)లో భారత బ్యాటర్లు అదరగొట్టారు. ఫలితంగా అహ్మదాబాద్‌లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. తద్వారా నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ ఖాతాలో అతిపెద్ద స్కోరు(Highest ODI total) నమోదైంది. కాగా రోహిత్ సేన ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా నాగ్‌పూర్, కటక్ వన్డేల్లో ఇంగ్లండ్‌ను నాలుగేసి వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బుధవారం మూడో వన్డేలోనూ గెలిచి వైట్‌వాష్ చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగింది.అయితే, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆరంభంలోనే కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ(Rohit Sharma) వికెట్ రూపంలో టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. గత వన్డేలో సెంచరీ(119)తో చెలరేగిన హిట్‌మ్యాన్ మూడో వన్డేలో మాత్రం ఒక్క పరుగే చేసి మార్క్‌వుడ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.ఎట్టకేలకు ఫామ్లోకిఈ నేపథ్యంలో మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌కు జతైన వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. మూడుసార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 55 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 52 పరుగులు చేశాడు. అప్పటికే, హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న గిల్.. దానిని శతకంగా మార్చుకున్నాడు.గిల్ శతకంమొత్తంగా 102 బంతులు ఎదుర్కొన్న శుబ్‌మన్ గిల్ 14 ఫోర్లు, 3 సిక్స్‌లు బాది.. 112 పరుగులు సాధించాడు. అతడికి తోడుగా నాలుగో నంబర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్(64 బంతుల్లో 78 రన్స్) అద్భుత అర్ధ శతకంతో మెరిశాడు. మరోవైపు.. తన రెగ్యులర్ స్థానమైన ఐదో నంబర్లో వచ్చిన కేఎల్ రాహుల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.కేవలం 29 బంతుల్లోనే మూడు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టి 40 పరుగులు సాధించాడు ఈ వికెట్ కీపర్ బ్యాటర్. మిగతా వాళ్లలో ఎవరూ పెద్దగా రాణించలేదు. ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా(17), అక్షర్ పటేల్(13), వాషింగ్టన్ సుందర్(14).. పేసర్లు హర్షిత్ రాణా(13), అర్ష్‌దీప్ సింగ్(2), కుల్దీప్ యాదవ్(1*) నామమాత్రపు స్కోర్లకే పరిమితమయ్యారు.అవయవ దానం గురించిఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా 356 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బౌలర్లలో రైటార్మ్ లెగ్‌బ్రేక్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ అత్యధికంగా నాలుగు వికెట్లు తీయగా.. పేసర్లు మార్క్ వుడ్ రెండు, గస్ అట్కిన్సన్ ఒకటి, పార్ట్ టైమ్ స్పిన్నర్ జో రూట్ ఒక వికెట్ తీశారు. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా టీమిండియా- ఇంగ్లండ్ క్రికెటర్లు అవయవ దానం గురించి అవగాహన కల్పించే చేసే క్రమంలో గ్రీన్ ఆర్మ్ బ్యాండ్‌తో బరిలోకి దిగడం విశేషం.అహ్మదాబాద్‌లో వన్డేల్లో అత్యధిక స్కోర్లుసౌతాఫ్రికా వర్సెస్ ఇండియా- 2010లో 365/2ఇండియా వర్సెస్ ఇంగ్లండ్- 2025లో 356ఇండియా వర్సెస్ వెస్టిండీస్- 2002లో 325/5వెస్టిండీస్ వర్సెస్ ఇండియా- 2002లో 324/4 పాకిస్తాన్ వర్సెస్ ఇండియా- 2007లో 319/7.చదవండి: చరిత్ర సృష్టించిన కోహ్లి.. భారత తొలి బ్యాటర్‌గా అరుదైన రికార్డువారెవ్వా!.. శుబ్‌మన్ గిల్ ప్రపంచ రికార్డు -
IPL 2024: గుజరాత్ అవుట్
అహ్మదాబాద్: సొంతగడ్డపైనే గుజరాత్ టైటాన్స్ పుట్టి మునిగింది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలనే పట్టుదలతో ఉన్న నిరుటి రన్నరప్ టైటాన్స్ ఆశల్ని భారీ వర్షం ముంచేసింది. తెరిపినివ్వని వానతో నరేంద్ర మోదీ స్టేడియం తడిసిముద్దయ్యింది. కనీసం 5 ఓవర్ల మ్యాచ్గానైనా నిర్వహించేందుకు గ్రౌండ్ సిబ్బంది చాలా కష్టపడింది. కానీ ఆగినట్లే ఆగిన వాన మళ్లీ చినుకు చినుకుగా పడటంతో నిర్వాహకులు చేసేదేమీలేక తుది నిర్ణయం తీసుకోవాల్సి వచి్చంది. నిజానికి రాత్రి 10 గంటలైనా అసలు టాస్ వేసేందుకే అవకాశం లేకపోయింది. చివరిసారిగా రాత్రి 10.36 గంటలకు మైదానాన్ని పరిశీలించిన ఫీల్డు అంపైర్లు నవ్‌దీప్ సింగ్, నిఖిల్ పట్వర్దన్ మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇరుజట్లకు చెరో పాయింట్ లభించగా, ఆటగాళ్లు పరస్పర కరచాలనంతో మైదానంలోని ప్రేక్షకుల్ని పలుకరిస్తూ డ్రెస్సింగ్ రూమ్‌వైపు నడిచారు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో వర్షంవల్ల రద్దయిన తొలి మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. పటిష్టస్థితిలో కోల్‌కతా ఫలితం తేలని మ్యాచ్‌తో టాప్–2 స్థానాలు మాత్రం తేలిపోయాయి. మ్యాచ్ రద్దుతో వచి్చన ఒక పాయింట్‌తో కోల్‌కతా 19 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. కేకేఆర్ మిగిలున్న ఆఖరి మ్యాచ్‌లో ఓడినా... తొలి రెండు స్థానాల్లో ఉండటం ఖాయమైంది. ప్రస్తుతం 16 పాయింట్లతో ఉన్న రాజస్తాన్ రాయల్స్ తమ రెండు లీగ్ మ్యాచ్‌ల్లోనూ ఒకవేళ గెలిస్తే 20 పాయింట్లతో అగ్రస్థానంలోకి ఎగబాకుతుంది. అప్పుడు నైట్‌రైడర్స్ రెండో స్థానానికి పడిపోయినా ఎలిమినేటర్ ఆడే పరిస్థితి అయితే రాదు. ఐపీఎల్‌లోకి ప్రవేశించిన గత రెండేళ్ల నుంచి ఫైనల్ చేరిన గుజరాత్ ఈసారి ఇంకో మ్యాచ్ మిగిలున్నా... లీగ్ దశలోనే ని్రష్కమించనుంది. 2022లో టైటిల్ గెలిచిన టైటాన్స్ గతేడాది రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ప్రస్తుతం 13 మ్యాచ్‌ల్లో ఐదింట గెలిచిన టైటాన్స్ ఖాతాలో 11 పాయింట్లున్నాయి. ఒకవేళ ఆఖరిపోరు గెలిచినా... 13 పాయింట్లవద్దే ఆగిపోతుంది. అయితే పట్టికలో ఇప్పటికే కోల్‌కతా (19), రాజస్తాన్ (16), చెన్నై (14), హైదరాబాద్ (14) ముందు వరుసలో ఉండటంతో గుజరాత్ ఖేల్ లీగ్‌తోనే ముగిసింది. -
MS Dhoni: తలా ధోనిపై అభిమానంతో మ్యాచ్ మధ్యలో వీరాభిమాని పాదాభివందనం (ఫొటోలు)
-
మోదీ స్టేడియం అంటే చాలు శుభ్‌మన్‌కు పూనకం వస్తుంది.. ఇరగదీస్తాడు..!
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తమ సొంత మైదానమైన నరేంద్ర మోదీ స్టేడియం (అహ్మదాబాద్) అంటే చాలు చెలరేగిపోతాడు. ఈ గ్రౌండ్లో శుభ్‌మన్‌కు ఎవరికీ లేని అద్బుతమైన ట్రాక్ రికార్డు ఉంది. గిల్ ఇక్కడ మ్యాచ్ ఆడిన ప్రతిసారి ఇరగదీస్తాడు. ఇక్కడ అతనికి పట్టపగ్గాలు ఉండవు. తాజాగా మరోసారి ఇది నిరూపితమైంది. నిన్న (ఏప్రిల్ 4) పంజాబ్ కింగ్స్‌తో ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో గిల్ మరోసారి విశ్వరూపం ప్రదర్శించాడు. 48 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 89 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మోదీ స్టేడియంలో గిల్ ఆడిన క్లాసీ ఇన్నింగ్స్‌ల్లో ఇదీ ఒకటి. ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఓటమిపాలైనప్పటికీ.. గిల్ ఇన్నింగ్స్ ఆందరినీ ఆకట్టుకుంది. Shubman Gill at Narendra Modi stadium in IPL: 9(8), 43(38), 45*(43), 63(36), 39(31), 39(31), 45(34), 56(34), 6(7), 94*(51), 101(58), 129(60), 39(20), 31(22), 36(28), 89*(48). 15 innings, 825 runs, 68.75 average, 159.26 strike Rate - This is Incridible from Gill. ⭐ pic.twitter.com/mbUmoe9GJb — CricketMAN2 (@ImTanujSingh) April 4, 2024 నరేంద్ర మోదీ స్టేడియంలో గిల్ చేసిన స్కోర్లపై లుక్కేస్తే ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం. ఇక్కడ అతను 15 ఇన్నింగ్స్‌ల్లో 159.26 స్ట్రయిక్‌రేట్‌తో 68.75 సగటున 825 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్దసెంచరీలు, రెండు సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ చరిత్రలో బహుశా ఏ క్రికెటర్ తన హోం గ్రౌండ్లో ఈ స్థాయి చెలరేగి ఉండడు. మోదీ స్టేడియంలో గిల్ చేసిన స్కోర్లు.. 9(8), 43(38), 45*(43), 63(36), 39(31), 39(31), 45(34), 56(34), 6(7), 94*(51), 101(58), 129(60), 39(20), 31(22), 36(28), 89*(48) కాగా, పంజాబ్‌తో మ్యాచ్‌లో గిల్ మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగినప్పటికీ.. గుజరాత్ టైటాన్స్‌కు ఓటమి తప్పలేదు. శశాంక్ సింగ్ (29 బంతుల్లో 61 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), అశుతోష్ శర్మ (17 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్) చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడి పంజాబ్‌ను గెలిపించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేయగా.. పంజాబ్ 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా 3 వికెట్ల తేడాతో విజయం సాధించి, పాయింట్ల పట్టికలో గుజరాత్‌ను వెనుక్కునెట్టి ఐదో స్థానానికి చేరుకుంది. -
'అలా అయ్యుంటే టీమిండియా వరల్డ్ కప్ ఫైనల్లో గెలిచేది!
లక్నో: క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లో కాకుండా లక్నోలో జరిగి ఉంటే టీమ్ ఇండియా గెలిచి ఉండేదని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. లక్నోలో మ్యాచ్ జరిగి ఉంటే, టీమిండియాకు విష్ణువు, భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఆశీస్సులు లభించేవని అన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. లక్నోలోని క్రికెట్ స్టేడియానికి సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎకనా స్టేడియం అని పేరు పెట్టింది. విష్ణువు అనేక పేర్లలో ఏకనా ఒకటి. ఆ తర్వాత యోగీ ఆదిత్య నాథ్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆ స్టేడియానికి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ పేరును ఖరారు చేశారు. అహ్మదాబాద్ వేదికగా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. నరేంద్ర మోదీ స్టేడియంలో ఆస్ట్రేలియా-భారత్ తలపడ్డాయి. ఇందులో ఆసిస్ 6 వికెట్ల తేడాతో అలవోకగా విజయం సాధించింది. టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్‌కు చేరిన భారత జట్టు క్రిడాకారులు నిరాశలో మునిగిపోయారు. మ్యాచ్‌కు హాజరైన ప్రధాని మోదీ వారిని ఓదార్చారు. ఇదీ చదవండి: Delhi Pollution Update: ఢిల్లీలో మరికొద్ది రోజుల ఇంతే.. -
CWC 2023 Final: బోల్తా కొట్టించింది పిచ్ వ్యూహమేనా?
2023 ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో వరుసగా 10 మ్యాచ్‌ల్లో గెలుపొంది, అజేయ జట్టుగా నిలిచిన భారత్ ఆఖరి మెట్టుపై బోల్తా పడి మూడోసారి టైటిల్ గెలిచే సువర్ణావకాశాన్ని చేజార్చుకుంది. నాకౌట్ మ్యాచ్‌ల్లో చతికిలపడటం టీమిండియాకు కొత్తేమీ కానప్పటికీ, ఈ దఫా మాత్రం అభిమానులను తీవ్రంగా బాధ పెట్టింది. ఆశలు రేకెత్తించి, ఆఖరి మెట్టుపై ఉసూరుమనిపించడంతో ఫ్యాన్స్ బాధ వర్ణణాతీతంగా ఉంది. ఈ ఓటమి 140 కోట్ల మంది భారతీయులకు గుండె కోత మిగిల్చింది. ఫైనల్లో భారత్ ఓటమికి గల కారణాలు విశ్లేషిస్తూ పలువురు నిపుణులు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఒత్తిడి, టాస్ ఓడిపోవడమే టీమిండియా ఓటమికి ప్రధాన కారణాలని మెజారిటీ శాతం అభిప్రాయపడుతున్నారు. కొందరు మాత్రం పిచ్ విషయంలో బీసీసీఐ చేసిన అతే కొంపముంచిందని అంటున్నారు. తమ పేసర్లు భీకరమైన ఫామ్‌లో ఉన్నప్పుడు నిదానమైన ట్రాక్ రూపొందించడమే పెద్ద తప్పని అభిప్రాయపడుతున్నారు. పిచ్ విషయంలో బీసీసీఐ వ్యూహం బెడిసికొట్టిందని, అదే మనపై ప్రత్యర్ధి పైచేయి సాధించేలా చేసిందని అంటున్నారు. పిచ్ ఎప్పటిలాగే ఉన్నా టీమిండియాకు లబ్ది చేకూరేదే అని అభిప్రాయపడుతున్నారు. మన పేసర్లపై నమ్మకం లేక స్లో పిచ్‌ను తయారు చేశారా అని ప్రశ్నిస్తున్నారు. జట్టు అన్ని విభాగాల్లో (బ్యాటింగ్, స్పిన్ బౌలింగ్, పేస్ బౌలింగ్) పటిష్టంగా ఉన్నప్పుడు నిదానమైన పిచ్‌ను తయారు చేయడంలో అర్ధం లేదని మండిపడుతున్నారు. పిచ్ విషయంలో బీసీసీఐ వ్యూహం మిస్ ఫైర్ అయ్యిందని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కూడా అన్నాడు. పిచ్ స్లోగా ఉండటం, ఆదిలోనే వికెట్లు కోల్పోవడం వల్ల టీమిండియా తీవ్ర ఒత్తిడికి లోనైందని తెలిపాడు. షాట్లు ఆడేందుకు భారత బ్యాటర్లు అష్టకష్టాలు పడ్డారని అభిప్రాయపడ్డాడు. కాగా, అహ్మదాబాద్ పిచ్‌పై గతంలో పరుగుల వరద పారిన విషయం తెలిసిందే. ఇక్కడి రెగ్యులర్ పిచ్‌పై అత్యంత భారీ స్కోర్లు నమోదయ్యాయి. అయితే వరల్డ్‌కప్ ఫైనల్లో రెగ్యులర్ వికెట్ కాకుండా స్లో ట్రాక్‌ను రూపొందించడంతో టీమిండియా పరుగులు చేసేందుకు నానా ఇబ్బందులు పడి స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. అనంతరం ఛేదనలో మంచు ప్రభావం చేత పిచ్ మరింత నిదానంగా మారి, దాదాపు నిర్జీవమైన పిచ్‌గా మారిపోయింది. ఫలితంగా ఆసీస్ బ్యాటర్లు హెడ్, లబూషేన్ క్రీజ్‌లో పాతుకుపోయి తమ జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించారు. -
Pat Cummins: నిశ్శబ్దంలో ఉన్న కిక్కే వేరప్పా..!
వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా టీమిండియాను ఆరె వికెట్ల తేడాతో ఓడించి, ఆరోసారి జగజ్జేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఆసీస్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 240 పరుగుల స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్ ఆరంభంలో కాస్త తడబడినప్పటికీ.. ట్రవిస్ హెడ్ (137), లబూషేన్ (58 నాటౌట్) చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ల సహకారంతో విజయతీరాలకు చేరింది. హెడ్-లబూషేన్ జోడీ నాలుగో వికెట్‌కు 192 పరుగలు భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఆసీస్‌ను గెలిపించారు. భారత బౌలర్లలో బుమ్రా, షమీ, సిరాజ్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ (47), విరాట్ కోహ్లి (54), కేఎల్ రాహుల్ (66) ఓ మోస్తరుగా రాణించారు. ఆసీస్ బౌలర్లు స్టార్క్ (3/55), హాజిల్‌వుడ్ (2/60), కమిన్స్ (2/34), మ్యాక్స్‌వెల్ (1/35), జంపా (1/44) కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి టీమిండియా పతనాన్ని శాశించారు. కాగా, ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. 1.3 లక్షల మంది ప్రేక్షకులను (ఫైనల్‌కు హాజరయ్యే ప్రేక్షకుల సంఖ్య) సైలెంట్‌గా ఉంచడంలో దొరకే సంతృప్తి ఇంకొక దాంట్లో దొరకదని కమిన్స్ వ్యాఖ్యానించాడు. అన్నట్లుగానే కమిన్స్ నిన్న జరిగిన ఫైనల్లో భారత్‌ను ఓడించి నరేంద్ర మోదీ స్టేడియం మొత్తాన్ని సైలెంట్‌గా ఉంచగలిగాడు. కమిన్స్ చేసిన ఈ వ్యాఖ్యలను ప్రస్తుతం కొందరు నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. నిశబ్దంలో ఉన్న కిక్కే వేరప్పా అనే సినిమా డైలాగ్‌తో కామెంట్స్ చేస్తున్నారు. -
CWC 2023 Final: ఇప్పటికంటే 2015లోనే ఎక్కువ..!
వన్డే వరల్డ్‌కప్ 2023 ఫైనల్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన విషయం తెలిసిందే. నిన్న (నవంబర్ 19) జరిగిన ఈ మ్యాచ్‌కు అశేష జనవాహిని హాజరై టీమిండియాను ప్రోత్సహించారు. దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలై అభిమానులను నిరాశపర్చింది. అధికారక లెక్కల ప్రకారం ఈ మ్యాచ్‌కు 92453 మంది హాజరైనట్లు సమాచారం. 2015 వరల్డ్‌కప్‌తో పోల్చుకుంటే ఈ సంఖ్య తక్కువ. మెల్బోర్న్ వేదికగా జరిగిన నాటి ఫైనల్‌కు 93013 మంది హాజరయ్యారు. న్యూజిలాండ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో గెలుపొంది, ఐదో సారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. తాజాగా జరిగిన 2023 ఎడిషన్ ఫైనల్లో అదే ఆసీస్ టీమిండియాను 6 వికెట్ల తేడాతో ఓడించి, ఆరోసారి జగజ్జేతగా నిలిచింది. According to official attendance numbers, the 2015 World Cup in MCG had higher attendance than the 2023 World Cup final in Ahmedabad👀🤯 pic.twitter.com/j2kapHeAfB — CricTracker (@Cricketracker) November 20, 2023 నిన్నటి మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నామమాత్రపు స్కోర్‌కే (240) పరిమితమైనప్పటికీ.. బౌలింగ్‌లో రాణించి చివరి వరకు పోరాడింది. ట్రవిస్ హెడ్ (137) చిరస్మరణీయ శతకంతో ఆసీస్ గెలుపు అంచుల వరకు తీసుకెళ్లాడు. లబూషేన్ (58 నాటౌట్) సహకారంతో భారత్‌కు గెలుపును దూరం చేశాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 192 పరుగలు భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఆసీస్‌ను గెలిపించారు. భారత బౌలర్లలో బుమ్రా, షమీ, సిరాజ్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ (47), విరాట్ కోహ్లి (54), కేఎల్ రాహుల్ (66) ఓ మోస్తరుగా రాణించారు. ఆసీస్ బౌలర్లు స్టార్క్ (3/55), హాజిల్‌వుడ్ (2/60), కమిన్స్ (2/34), మ్యాక్స్‌వెల్ (1/35), జంపా (1/44) కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి టీమిండియా పతనాన్ని శాశించారు. -
అబ్బుర పరిచిన వాయుసేన విన్యాసాలు
అహ్మదాబాద్: అనుకున్నట్లుగానే చక్కని ప్రణాళికతో, స్వల్పకాల రిహార్సల్స్‌తో భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ చేసిన ఏయిర్ షో లక్షమందికి పైగా ప్రేక్షకుల్ని కన్నార్పకుండా చేసింది. తొమ్మిది హాక్ ఎంకే–132 ఎయిర్‌క్రాఫ్ట్‌లతో కూడా బృందం నరేంద్ర మోదీ స్టేడియంపై చరిత్ర సృష్టించింది. లక్షా 32 వేల మంది జేజేలతో విన్యాసాలను ఆస్వాదించారు. సూర్యకిరణ్ టీమ్ వైమానిక విన్యాసాలు కొత్త కాకపోయినా... ఓ క్రికెట్ స్టేడియంపై ఎయిర్‌షో చేయడమే కొత్త. గతంలో క్రికెట్ అనే కాదు... ఏ ఆటకు అంతెందుకు భారత్ ఆతిథ్యమిచ్చిన కామన్వెల్త్ గేమ్స్ (2010)లోనూ ఇలాంటి విన్యాసాలు చేయలేదు. తద్వారా ఈ ప్రపంచకప్‌కు ఎయిర్ షో కొత్త శోభ తెచ్చినట్లయింది. -
CWC 2023 Final: ఇటు ఫైనల్... అటు జిగేల్! తారలు, తారాజువ్వలు
ఆట మొదలవ్వాలంటే ముందు టాస్ పడాలి. కానీ ఈ టాస్ కంటే ముందు కనువిందు చేసే విన్యాసాలెన్నో నరేంద్ర మోదీ స్టేడియాన్ని ఆద్యంతం రంజింపచేసేలా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రత్యేక ఏర్పాట్లు, అరుదైన ఘట్టాలు ఆవిష్కరించనుంది. అహ్మదాబాద్: భారత్, ఆస్ట్రేలియాల మధ్య నేడు నరేంద్రమోదీ స్టేడియంలో జరిగే ఫైనల్ పోరు వికెట్లు, మెరుపులతోనే కాదు... మిరుమిట్లు, వెలుగుజిలుగులతో నెక్ట్స్ లెవెల్ వినోదాన్ని పంచేందుకు సిద్ధమైంది. ఆటకుముందే ఎయిర్‌షో, ఆట మధ్యలో లేజర్ షో, సంగీత విభావరి ఆఖర్లో కనివినీ ఎరుగని రీతిలో బాణాసంచా మిరుమిట్లు ఆకాశానికి పందిరి పరచనుంది. వైమానిక ‘షో’కులద్దుకొని ఆట ప్రారంభానికి ముందు ఎంతో హంగామా మైదానంలో నడువనుంది. నేలని టాస్ నాణెం ముద్దుపెట్టుకుంటే... నింగిని ఎయిర్ షో సెల్యూట్ చేస్తుంది. భారత వైమానిక దళానికి చెందిన ‘ది సూర్యకిరణ్ ఏరోబాటిక్’ టీమ్ ఆకాశంలో విన్యాసాలతో అలరించనుంది. తొమ్మిది ప్రత్యేక ఫ్లైట్లతో పది నిమిషాల పాటు ఈ ఎయిర్ షో ప్రేక్షకుల్ని ఆకట్టిపడేయనుంది. దీనికి సంబంధించి శుక్ర, శనివారాల్లో రిహార్సల్స్ కూడా పూర్తిచేశారు. చాంపియన్ కెప్టెన్లకు సలామ్ ఇంతకుముందెపుడు జరగని విధంగా... ప్రపంచకప్ చరిత్రలోనే నిలిచిపోయే మధురఘట్టానికి చాంపియన్ కెప్టెన్లు విశిష్ట అతిథులు కానున్నారు. 1975, 1979, 1983, 1987, 1992, 1996, 1999, 2003, 2007, 2011, 2015, 2019... ఈ పన్నెండు ప్రపంచకప్‌ల విజయసారథులకు విశేషరీతిలో బ్లేజర్లు, జ్ఞాపికలతో సత్కరించే కార్యక్రమం జరుగనుంది. ప్రీతమ్ గానాబజానా ‘ధూమ్’ సిరీస్‌లకే ధూమ్ మచాలేతో సినీప్రియుల్ని వెర్రెక్కించిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ ఆధ్వర్యంలో 500 పైచిలుకు కళకారులతో నిర్వహించబోయే ఆటపాట స్టేడియాన్ని హోరెత్తించనుంది. భారతీయ సంప్రదాయ నాట్యం, నృత్యరీతులు, డాన్సులు జేజేలు పలికే విధంగా కళాకారుల బృందం రిహార్సల్స్‌లో చెమటోడ్చింది. లేజర్ షో...డ్రోన్ వీజువల్ వండర్స్ దేనికదే సాటి అన్నచందంగా ఇన్నింగ్స్ బ్రేక్‌లో లేజర్ షో లైటింగ్ విన్యాసాలు ఆకాశాన్ని రంగుల మయం చేయనుంది. అలాగే డ్రోన్ వీజువల్ వండర్స్‌తో నింగిలో ప్రపంచకప్‌ను ఆవిష్కృతం చేసే షోపై అందరి దృష్టి పడింది. తారలు, తారాజువ్వలు స్టేడియంలో బాలీవుడ్, మాలీవుడ్, టాలీవుడ్ ఇలా ప్రతీ సినీ పరిశ్రమకు చెందిన తారలు స్టేడియంలో ప్రత్యేక ఆకర్షణ కానుండగా... ఆకాశంలో బాణాసంచా వెలుగులు, తారాజువ్వలతో చేసే హంగామా కృత్రిమ చుక్కల్ని చూపనున్నాయి. 6000 మందితో భద్రత పెద్ద స్టేడియం కావడం... ఫైనల్ పోరు జరగడం... లక్ష పైచిలుకు ప్రేక్షకులండటం... అతిరథమహారథులంతా విచ్చేయనుండటంతో నరేంద్రమోదీ స్టేడియమే కాదు... అహ్మదాబాద్‌పై కూడా డేగకన్ను వేశారు. గుజరాత్ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ‘రాష్ట్ర పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, హోంగార్డ్స్, ఇతర సాయుధ బలగాలు కలుపుకొని 6000 పైచిలుకు సిబ్బందితో మోదీ స్టేడియాన్ని పహారా కాస్తున్నారు. మూడు వేల మంది అయితే స్టేడియం లోపలే అప్రమత్తంగా ఉంటారు. -
ICC World Cup 2023: ఒక రోజు హోటల్ అద్దె లక్షన్నర
అహ్మదాబాద్ పంట పండింది. ఆదివారం జరగనున్న ఇండియా– ఆస్ట్రేలియా వరల్డ్‌కప్ వన్డే క్రికెట్ ఫైనల్స్ సందర్భంగా ఆ నగరంలోని నరేంద్ర మోడీ స్టేడియం జాతీయ, అంతర్జాతీయ విమానాలు అభిమానులతో దిగనున్నాయి. మరి హోటల్ రూమ్‌లు? టికెట్లు? ఏవీ దొరకట్లేదు. రేట్లు చూస్తే గుండె గుభేల్స్. ప్రతి విశేషమూ వైరలే. ‘ఆల్ రోడ్స్ లీడ్ టు అహ్మదాబాద్’. క్రికెట్ జ్వరం, క్రికెట్ జలుబు, క్రికెట్ దగ్గు, క్రికెట్ కలవరింతలు, క్రికెట్ స్లీప్ వాక్... ఇవన్నీ ఉన్నవారు లేనివారు కూడా అహ్మదాబాద్‌కు చలో అంటున్నారు. అక్కడ లక్ష మంది పట్టే స్టేడియంలో వరల్డ్ కప్ ఫైనల్స్. ఇండియా వెర్సస్ ఆస్ట్రేలియా. ఎన్నాళ్లకెన్నాళ్లకు.. మనవాళ్లు ఫైనల్స్. ఇది నేరుగా చూడ దగ్గ మేచ్యే గాని... టీవీలలో చూడ మ్యాచ్ కాదే... కాదు కాకూడదు అనుకుంటే మరి అహ్మదాబాద్ వెళ్లుట ఎటుల? వెళ్లెను పో అక్కడ ఆశ్రయం పొందుట ఎటుల? పొందెను పో టికెట్ సాధించుట ఎటుల?.. అన్నట్టుగా అందరూ సతమతమవుతున్నారు. అందరి దగ్గరా డబ్బులు ఉన్నాయి. కాని ఫ్లయిట్ టికెట్లు లేవు. ఒకప్పుడు ఢిల్లీ అహ్మదాబాద్ ఫ్లయిట్ టికెట్ మహా అయితే 4000. ఇప్పుడు 2500. అహ్మదాబాద్‌లో అత్యంత ఖరీదైన హోటల్లో రూమ్ అరవై వేలు దాకా ఉంటుంది. కాని ఇప్పుడు మామూలు హోటల్లో కూడా లక్షన్నర అడుగుతున్నారు. ఇస్తామన్నా దొరకడం లేదు. స్టేడియంలో అడుగు పెట్టడానికి 2000 టికెట్ 34 వేలకు అమ్ముతున్నారు. 2500 టికెట్ 42 వేలు. పదివేల టికెట్ అయితే లక్షా అరవై రెండు వేలు. మన దేశం నుంచే కాదు విదేశాల నుంచి కూడా అభిమానులు నేరుగా అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవుతుండటం వల్ల అక్కడ స్ట్రీట్ ఫుడ్డు, రెస్టరెంట్ బిజినెస్, క్యాబ్‌ల వాళ్లు ఆటోల వాళ్లు అందరూ రాత్రికి రాత్రి కుబేరులు అయ్యేలా ఉన్నారు. గుడ్. నగరాలకు ఇలాంటి జ్ఞాపకాలు ఉండాలి. 100 కోట్ల జాతకం ఎలా ఉందో! చూడండి తమాషా. ‘ఆస్ట్రోటాక్’ యాప్ ప్రవేశపెట్టి, దేశ విదేశాలలో ఉన్న భారతీయులు ఓలా క్యాబ్ బుక్ చేసుకున్నట్టుగా జ్యోతిష్యుణ్ణి బుక్ చేసుకునేలా చేసి కోట్లు గడించిన ఆ యాప్ ఫౌండర్ పునీత్ గుప్తాకు ఫైనల్స్ జాతకం ఏమిటో కచ్చితంగా తెలియదు. ‘రేపు ఇండియాదే గెలుపు. మా ఆస్ట్రోటాక్ జోస్యం నిజం అవుతుంది చూడండి’ అనట్లేదు అతడు. ‘ఇండియా కనుక కప్పు గెలిస్తే మా యాప్ యూజ్ చేసేవారికి 100 కోట్లు పంచుతా’ అంటున్నాడు. 2011లో ఇండియా వరల్డ్ కప్‌లో గెలిచినప్పుడు తాను కాలేజీ చదువులు చదువుతున్నానని, ఇప్పుడు సంపాదించాను కనుక ఆ సంతోషాన్ని 100 కోట్లు పంచి పంచుకుంటానని అంటున్నాడు. ఏమో మన జాతకం ఎలా ఉందోనని ఆస్ట్రోటాక్ యూజర్లు ఆశగా చూస్తున్నారు. ఇతగాడు ఇలాంటి వాగ్దానాలు చేస్తుంటే మనవాళ్లు కప్పు కొడితే ఫలానా బీచ్‌లో బట్టలు విప్పుతానని ఒక హీరోయిన్ హల్చల్ చేసింది. ఇక మొక్కులు, పొట్టేళ్లు ఎంతమంది అనుకున్నారో తెలియదు. కమాన్ ఇండియా! జాతకం తిరగరాయి. -
World Cup 2023 Final: బ్యాటింగా.. బౌలింగా? భారత్ టాస్ గెలిస్తే తొలుత ఏమి చేయాలి?
వన్డే ప్రపంచకప్-2023లో తుది సమరానికి మరి కొన్ని గంటల మాత్రమే మిగిలి ఉంది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న ఫైనల్ పోరులో భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే అహ్మబాద్కు చేరుకున్న ఇరు జట్లు ప్రాక్టీస్‌లో మునిగి తేలుతున్నాయి. ఇరు జట్లు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇక ఇది ఇలా ఉండగా.. అహ్మదాబాద్ స్టేడియంలోని పిచ్‌కు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వికెట్‌పైన మ్యాచ్ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ పిచ్‌ను టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హెడ్ కోచ్ ద్రవిడ్‌తో కలిసి పరిశీలించాడు. మరోవైపు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కూడా స్టేడియంకు వచ్చి పిచ్‌ను పరిశీలించి, ఫోటోలను తన ఫోన్లో తీసుకున్నాడు. ఆ తర్వాత వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ,ఆస్ట్రేలియా స్పిన్ బౌలింగ్ కోచ్ డేనియల్ వెట్టోరీ కూడా చాలా సేపు ఈ పిచ్‌ను చెక్ చేశారు. టాస్ గెలిస్తే తొలుత ఏమి చేయాలి..? కాగా ఈ మ్యాచ్‌లో టాస్ మరోసారి కీలకం కానుంది. ఈ తుదిపోరులో టాస్ గెలిచిన జట్టు తొలుత ఏమి చేస్తే బాగుంటుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అయితే సోషల్ మీడియాలో వైరలవుతున్న ఫోటోను బట్టి చూస్తే.. అహ్మదాబాద్ పిచ్‌ను నల్లమట్టితో తాయారు చేసినట్లు కన్పిస్తోంది. ట్రాక్‌పై పెద్దగా గ్రాస్(గడ్డి) కూడా లేదు. కాబట్టి కొత్త బంతితో సీమర్లు పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. అయితే మ్యాచ్ జరిగే సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఎండ ఎక్కువగా ఉంటే మాత్రం పిచ్ బాగా డ్రై అవుతుంది. Captain Pat Cummins inspects the pitch ahead of the final 🔍#CWC23 #INDvAUS pic.twitter.com/ymBAK5o8x6 — ICC (@ICC) November 18, 2023 దీంతో వికెట్ కాస్త హార్డ్‌గా మారి స్పిన్నర్లకు అనూకూలించే ఛాన్స్ ఉంది. ప్లడ్ లైట్ల కింద పిచ్ కాస్త సీమర్లకు అనుకూలించే ఛాన్స్ ఉంది. ఏదైమనప్పటికీ మధ్యాహ్నం పరిస్థితులు బ్యాటింగ్‌కు అనూకూలించే అవకాశమున్నందన.. టాస్ గెలిచిన జట్టు తొలుత బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉంది. చదవండి: World Cup 2023 IND Vs AUS Finals: ఈ సారి వరల్డ్‌కప్ టీమిండియాదే.. ఎలా అంటే? -
CWC 2023 Final : భారత్, ఆస్ట్రేలియా ఫైనల్‌కు సర్వం సిద్ధం (ఫోటోలు)
-
IND vs AUS: అంతిమ సమరం కోసం అహ్మదాబాద్‌కు భారత్ జట్టు (ఫోటోలు)
-
ICC World Cup 2023: అంతిమ సమరం కోసం...
అహ్మదాబాద్: వన్డే ప్రపంచకప్ ఫైనల్లో పోటీపడేందుకు భారత క్రికెట్ జట్టు గురువారం అహ్మదాబాద్ నగరానికి చేరుకుంది. విమానాశ్రయంలో భారత జట్టుకు ఘనస్వాగతం లభించింది. నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం జరిగే టైటిల్ పోరులో ఐదుసార్లు విశ్వవిజేత ఆ్రస్టేలియా జట్టుతో భారత్ తలపడుతుంది. ఫైనల్ వేదికపై ఎయిర్ షో ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఎయిర్ షో నిర్వహించేందుకు భారత వైమానిక దళం (ఐఏఎఫ్) సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ సహా అతిరథ మహారథులు, లక్ష మంది ప్రేక్షకులు విచ్చేసే మ్యాచ్ వేదికపై ఐఏఎఫ్‌కు చెందిన ‘ది సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్’ ఎయిర్ షోతో మ్యాచ్‌కు ముందే కనువిందు చేయనుంది. దీనికి సంబంధించిన రిహార్సల్స్‌ను నేడు, రేపు స్టేడియంపై చేస్తారని గుజరాత్‌కు చెందిన డిఫెన్స్ ప్రొ ఒక ప్రకటనలో తెలిపింది. ఇలాంటి వైమానిక విన్యాసాలతో అలరించడం సూర్యకిరణ్ టీమ్‌కు కొత్తేం కాదు. దేశవ్యాప్తంగా ఎయిర్ షోలు ఈ జట్టే చేస్తుంది. మొత్తం తొమ్మిది ఎయిర్‌క్రాఫ్ట్‌లు నింగిలో తమ వైమానిక విన్యాసంతో ప్రేక్షకుల్ని ఆకట్టిపడేస్తాయి. మ్యాచ్ ప్రారంభానికి ముందుగా పది నిమిషాల పాటు ఈ ప్రదర్శన నిర్వహిస్తారు. -
పాక్ క్రికెటర్ల ఎదుట ఆ నినాదాలు సరైనవి కావు: ఉదయనిధి
చెన్నై: భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా అభిమానులు జై శ్రీరాం నినాదాలు చేయడాన్ని తమిళనాడు క్రీడా మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఖండించారు. పాకిస్థాన్ క్రికెటర్ల సమక్షంలో అభిమానుల ప్రవర్తన ఎంత మాత్రం అమోదయోగ్యం కాదని అన్నారు. క్రీడలు దేశాన్ని ఐక్యమత్యం చేయడానికి ఉపయోగపడాలి కానీ.. ద్వేషం వ్యాప్తి చెందడానికి సాధనంగా వాడకూడదని చెప్పారు. శనివారం గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. పాక్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ డ్రెస్సింగ్ రూంకు వస్తున్న క్రమంలో అభిమానులు జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీటిపై ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. సోషల్ మీడియాలో అభిమానుల ప్రవర్తనపై భిన్నరకాల స్పందనలు వచ్చాయి. అభిమానుల అర్ధం లేని వ్యూహంగా కొందరు కామెంట్ పెట్టారు. మరో పది రోజుల్లో చెన్నైలో పాక్ క్రీడాకారులు రెండు మ్యాచ్‌లు అడటానికి వస్తారు. వారందరిని గౌరవంగా స్వాగతించండి అంటూ మరికొందరు స్పందించారు. చెన్నైలో పిచ్ వారికి కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిన్న గుజరాత్లో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను భారత్ ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లోనే బాబార్ ఆజాంకు కోహ్లీ ఆరుదైన బహుమతి కూడా అందించాడు. తన సంతకం చేసిన జెర్సీని కానుకగా పంపించి సోదరభావాన్ని చాటుకున్నాడు. గత ఏడాది కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఇండియా-ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ సందర్భంగా మహ్మద్ షమీ బౌలింగ్ వేసే క్రమంలో అభిమానులు జై శ్రీ రామ్ అంటూ నినాదాలు చేయడం అప్పట్లో వార్తల్లో నిలిచింది. ఇదీ చదవండి: Udayanidhi Stalin: సనాతన ధర్మంపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు -
ODI World Cup 2023: 'అష్ట' దిగ్భంధనం
వన్డే వరల్డ్ కప్‌లో లెక్క మారలేదు. 31 ఏళ్లుగా పాకిస్తాన్‌పై వేర్వేరు వేదికల్లో కనిపించిన ఆధిపత్యం అహ్మదాబాద్‌లోనూ కొనసాగింది. ఫేవరెట్‌గా భావించిన భారత జట్టు అన్ని రంగాల్లో చెలరేగి పాక్‌ను ఊపిరాడనీయకుండా చేసింది. ఒకవైపు భారత బౌలర్లంతా సమష్టిగా చెలరేగుతుంటే... మరోవైపు లక్ష మంది జనం ‘భారత్ మాతాకీ జై’ అంటూ హోరెత్తిస్తుంటే... మైదానంలో దాయాది జట్టు బెంబేలెత్తిపోయింది... బ్యాటింగ్‌లో కనీస స్థాయి ప్రదర్శన కూడా ఇవ్వలేక... కనీసం 200 పరుగులు కూడా చేయలేక కుప్పకూలింది... ఆపై మొదటి బంతి నుంచే ఇండియా జోరు మొదలైంది... సిక్సర్లతో చెలరేగిపోతున్న రోహిత్ శర్మను నిలువరించలేక పాక్ బౌలర్లు చేతులెత్తేయగా మరో అలవోక విజయం మన ఖాతాలో చేరింది. ఏకంగా 19.3 ఓవర్లు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించిన టీమిండియా వరల్డ్ కప్‌లో చిరకాల ప్రత్యరి్థపై తన అజేయ రికార్డును ఘనంగా నిలబెట్టుకుంది. 8–0తో సంపూర్ణ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. అహ్మదాబాద్: ప్రపంచకప్‌లో తిరుగులేకుండా దూసుకుపోతున్న భారత జట్టు వరుసగా మూడో విజయంతో ‘హ్యాట్రిక్’ నమోదు చేసింది. పటిష్టమైన టీమిండియా అంచనాలకు అనుగుణంగా చెలరేగి పాకిస్తాన్‌పై ఏకపక్ష విజయాన్ని అందుకుంది. శనివారం నరేంద్ర మోదీ స్టేడియంలో ఎలాంటి హోరాహోరీ, పోటాపోటీ లేకుండా సాగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 42.5 ఓవర్లలో 191 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్న్ బాబర్ ఆజమ్ (58 బంతుల్లో 50; 7 ఫోర్లు), మొహమ్మద్ రిజ్వాన్ (69 బంతుల్లో 49; 7 ఫోర్లు) మినహా ఇతర బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఒకదశలో 155/2తో మెరుగైన స్థితిలో కనిపించిన పాక్ 36 పరుగుల తేడాలో 8 వికెట్లు కోల్పోయింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జస్ప్రీత్ బుమ్రా (2/19) రెండు కీలక వికెట్లు తీయగా... పాండ్యా, కుల్దీప్, జడేజా, సిరాజ్ కూడా తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ 30.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 192 పరుగులు సాధించి గెలిచింది. కెప్టెన్న్ రోహిత్ శర్మ (63 బంతుల్లో 86; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) దూకుడైన బ్యాటింగ్‌తో భారత్ గెలుపును సులువుగా మార్చగా... శ్రేయస్ అయ్యర్ (62 బంతుల్లో 53 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీతో ఫామ్‌లోకి వచ్చాడు. భారత్ తమ తదుపరి మ్యాచ్‌ను గురువారం పుణేలో బంగ్లాదేశ్‌తో ఆడుతుంది. ఆ భాగస్వామ్యం మినహా... పాకిస్తాన్ తమ ఇన్నింగ్స్‌ను సానుకూలంగానే ప్రారంభించింది. ఓపెనర్లు ఇమామ్ ఉల్ హక్ (38 బంతుల్లో 36; 6 ఫోర్లు), అబ్దుల్లా షఫీక్ (20) ఒత్తిడికి లోనుకాకుండా చక్కటి షాట్లతో పరుగులు రాబట్టారు. అయితే షఫీక్‌ను సిరాజ్ ఎల్బీగా అవుట్ చేయడంతో పాక్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కొద్ది సేపటికే ఇమామ్‌ను పాండ్యా వెనక్కి పంపించాడు. ఈ దశలో జట్టును ఆదుకునే బాధ్యత సీనియర్లు బాబర్, రిజ్వాన్‌లపై పడింది. జడేజా తన తొలి ఓవర్లోనే రిజ్వాన్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నా... బ్యాటర్ రివ్యూలో అది నాటౌట్‌గా తేలింది. ఇద్దరు బ్యాటర్లు జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిరి్మంచే ప్రయత్నం చేశారు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ వీరిద్దరు మూడో వికెట్‌కు 82 పరుగులు జోడించారు. ఈ క్రమంలో 57 బంతుల్లో బాబర్ అర్ధసెంచరీ పూర్తయింది. అయితే సిరాజ్ వేసిన చక్కటి బంతి స్టంప్స్ పైభాగాన్ని తాకడంతో బాబర్ అదే స్కోరు వద్ద నిరాశగా ని్రష్కమించాడు. అంతే... ఆ వికెట్ తర్వాత పాక్ పతనం వేగంగా సాగింది. కుల్దీప్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి దెబ్బ కొట్టగా, బుమ్రా ఆఫ్కటర్కు రిజ్వాన్ బౌల్డ్ కావడంతో భారీ స్కోరుపై పాక్ ఆశలు వదులుకుంది. మిగిలిన నాలుగు వికెట్ల లాంఛనాన్ని పూర్తి చేయడానికి భారత్‌కు ఎంతో సమయం పట్టలేదు. పాకిస్తాన్‌పై 2011 వరల్డ్ కప్ సెమీఫైనల్ (మొహాలిలో) తరహాలోనే భారత్ తరఫున ఐదుగురు బౌలర్లు తలా 2 వికెట్లు పంచుకోవడం విశేషం. మెరుపు బ్యాటింగ్... డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్‌లెగ్, వైడ్ లాంగాన్, మిడాన్, కవర్స్, స్క్వేర్ లెగ్, డీప్ మిడ్ వికెట్... రోహిత్ శర్మ అలవోకగా వేర్వేరు దిశల్లో బాదిన ఆరు సిక్సర్లు ఇవి! స్వల్ప లక్ష్యాన్ని భారత్ ఛేదించేందుకు సిద్ధమైన తరుణంలో స్టేడియంలోని అభిమానులకు ఇదే తరహా రోహిత్ ఆట వినోదం పంచింది. ఇన్నింగ్స్ తొలి బంతిని ఫోర్‌తో మొదలు పెట్టిన రోహిత్ ఎప్పుడెప్పుడు మ్యాచ్‌ను ముగిద్దామా అన్నట్లుగా వేగంగా దూసుకుపోయాడు. మరో ఎండ్‌లో శుబ్‌మన్ గిల్ (11 బంతుల్లో 16; 4 ఫోర్లు), కోహ్లి (18 బంతుల్లో 16; 3 ఫోర్లు) మాత్రం విఫలమయ్యారు. షాదాబ్ చక్కటి క్యాచ్‌కు గిల్ వెనుదిరగ్గా, పేలవ షాట్ ఆడి కోహ్లి ని్రష్కమించాడు. అయితే రోహిత్ జోరును మాత్రం పాక్ అడ్డుకోలేకపోయింది. 36 బంతుల్లోనే అతను 3 ఫోర్లు, 4 సిక్సర్లతో రోహిత్ అర్ధసెంచరీ పూర్తయింది. ఆ తర్వాతా పాక్ బౌలర్లను వదలకుండా మరో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు బాదిన రోహిత్ జట్టును గెలుపు దిశగా తీసుకెళ్లాడు. కానీ విజయానికి మరో 36 పరుగులు చేయాల్సిన స్థితిలో అవుటై రోహిత్ వరల్డ్ కప్ చరిత్రలో ఎనిమిదో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. అనంతరం అయ్యర్, కేఎల్ రాహుల్ (29 బంతుల్లో 19 నాటౌట్; 2 ఫోర్లు) కలిసి ఎలాంటి ఇబ్బంది లేకుండా మ్యాచ్‌ను ముగించారు. నవాజ్ వేసిన 31వ ఓవర్ మూడో బంతిని నేరుగా శ్రేయస్ బౌండరీకి తరలించగా అతని అర్ధసెంచరీతో పాటు భారత్ విజయం పూర్తయింది. మా బౌలర్లే ఈ రోజు మ్యాచ్ ఫలితాన్ని శాసించారు. పాక్ కనీసం 290 వరకు వెళుతుందనుకుంటే 191 పరుగులకే కట్టడి చేయడం అద్భుతం. బౌలర్లంతా సమష్టిగా సత్తా చాటారు. అందరూ అన్ని రోజుల్లో బాగా ఆడలేరు. మనదైన రోజును మరో అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోవాలి. నేను అదే పని చేశాను. కెప్టెన్న్గా కూడా నాపై అదనపు బాధ్యత ఉంది. ఈ మ్యాచ్‌లో కూడా పాక్‌ను మేం మరో ప్రత్యర్థిగానే చూశాం తప్ప ఎలాంటి ప్రత్యేకత లేదు. మేం గత రికార్డును పట్టించుకోలేదు. ప్రపంచకప్‌లోకి అడుగు పెట్టక ముందే జట్టులో అందరికీ తమ బాధ్యతలపై స్పష్టత ఉంది. అందుకే అందరూ తమదైన పాత్ర పోషిస్తున్నారు. అయితే ఈ విజయంతో మేమేమీ అతిగా ఉప్పొంగిపోవడం లేదు. టోరీ్నలో ఇంకా చాలా మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ముందుకు వెళ్లాలి. –రోహిత్ శర్మ, భారత కెప్టెన్న్ స్కోరు వివరాలు పాకిస్తాన్ ఇన్నింగ్స్: షఫీక్ (ఎల్బీ) (బి) సిరాజ్ 20; ఇమామ్ (సి) రాహుల్ (బి) పాండ్యా 36; బాబర్ ఆజమ్ (బి) సిరాజ్ 50; రిజ్వాన్ (బి) బుమ్రా 49; షకీల్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 6; ఇఫ్తికార్ (బి) కుల్దీప్ 4; షాదాబ్ (బి) బుమ్రా 2; నవాజ్ (సి) బుమ్రా (బి) పాండ్యా 4; హసన్ (సి) గిల్ (బి) జడేజా 12; షాహిన్ అఫ్రిది (నాటౌట్) 2; రవూఫ్ (ఎల్బీ) (బి) జడేజా 2; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (42.5 ఓవర్లలో ఆలౌట్) 191. వికెట్ల పతనం: 1–41, 2–73, 3–155, 4–162, 5–166, 6–168, 7–171, 8–187, 9–187, 10–191. బౌలింగ్: బుమ్రా 7–1–19–2, సిరాజ్ 8–0–50–2, పాండ్యా 6–0–34–2, కుల్దీప్ 10–0–35–2, జడేజా 9.5–0–38–2, శార్దుల్ 2–0–12–0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) ఇఫ్తికార్ (బి) షాహిన్ 86; గిల్ (సి) షాదాబ్ (బి) షాహిన్ 16; కోహ్లి (సి) నవాజ్ (బి) హసన్ అలీ 16; అయ్యర్ (నాటౌట్) 53; కేఎల్ రాహుల్ (నాటౌట్) 19; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (30.3 ఓవర్లలో 3 వికెట్లకు) 192. వికెట్ల పతనం: 1–23, 2–79, 3–156. బౌలింగ్: షాహిన్ అఫ్రిది 6–0–36–2, హసన్ అలీ 6–0–34–1, నవాజ్ 8.3–0–47–0, రవూఫ్ 6–0–43–0, షాదాబ్ 4–0–31–0. -
భారత్-పాక్ మ్యాచ్ చూసేందుకు పాక్ వీరాభిమానికి లభించని అనుమతి
భారత్-పాక్‌ల మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇవాళ (అక్టోబర్ 14) హైఓల్టేజీ సమరం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. డెంగ్యూ కారణంగా తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. పాకిస్తాన్ గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. బషీర్ చాచాకు లభించని అనుమతి.. ఈ మ్యాచ్ ప్రత్యక్షంగా చూసేందుకు అమెరికా నుంచి వచ్చిన పాక్ వీరాభిమాని బషీర్ చాచా అలియాస్ చికాగో బషీర్‌కు స్టేడియంలోకి అనుమతి లభించలేదు. స్టేడియంలో లక్షకు పైగా భారత అభిమానులు ఉంటే, బషీర్ ఒక్కడే పాక్ అభిమాని ఉంటాడు కాబట్టి, భద్రతా సమస్యలు తలెత్తుతాయని పోలీసులు అతన్ని స్టేడియంలోపలికి అనుమతించలేదని తెలుస్తుంది. కాగా, బషీర్‌కు ప్రస్తుత ప్రపంచకప్‌లో పాక్ ఆడిన తొలి రెండు మ్యాచ్‌లకు స్టేడియంలోకి అనుమతి లభించింది. అమెరికా పాస్‌పోర్ట్ కలిగి ఉండటంతో పాక్‌కు సంబంధించి ఒక్క బషీర్‌కు మాత్రమే భారత్‌లోకి ప్రవేశం లభించింది. పాక్ ప్రభుత్వం తమ జట్టును ఉత్సాహపరిచేందుకు తమ దేశానికి చెందిన అభిమానులను భారత్‌లోకి అనుమతించాలని కోరినప్పటికీ, భారత ప్రభుత్వం అందుకు తిరస్కరించింది. పాక్‌లో పుట్టి అమెరికాలో స్ధిరపడ్డ బషీర్ 2003 నుంచి ఇప్పటివరకు వరకు పాక్ ఆడిన ఒక్క వరల్డ్‌కప్ మ్యాచ్ కూడా మిస్ కాలేదు. అలాంటిది బషీర్ 20 ఏళ్లలో తొలిసారి పాక్ ఆడుతున్న వరల్డ్‌కప్ మ్యాచ్‌ను మిస్ అవుతున్నాడు. ఇదిలా ఉంటే, టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న పాక్ 12 ఓవర్లలో వికెట్ నష్టానికి 68 పరుగులు చేసింది. అబ్దుల్లా షఫీక్ (20) సిరాజ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ కాగా.. ఇమామ్ ఉల్ హాక్ (32), బాబర్ ఆజమ్ (15) క్రీజ్‌లో ఉన్నారు. -
WC 2023: టీమిండియాతో పోరుకు సిద్ధం.. అహ్మదాబాద్ చేరుకున్న పాక్ జట్టు
ICC ODI WOrld Cup 2023 Ind Vs Pak: వన్డే వరల్డ్‌కప్-2023లో అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అసలు సిసలు పోరుకు సమయం ఆసన్నమైంది. చిరకాల ప్రత్యర్థులు టీమిండియా- పాకిస్తాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. మెగా టోర్నీలో భాగంగా అక్టోబరు 14న దాయాదులు పరస్పరం ఢీకొట్టేందుకు సమాయత్తమవుతున్నాయి. ఇందుకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. ఈ క్రమంలో ఇప్పటికే పాకిస్తాన్ జట్టు హైదరాబాద్ నుంచి అహ్మదాబాద్‌కు చేరుకుంది. మరోవైపు.. టీమిండియా ఢిల్లీలో ఆఫ్గనిస్తాన్‌తో మ్యాచ్ ముగించుకున్న తర్వాత మ్యాచ్ జరిగే వేదికకు పయనం కానుంది. కాగా భారత గడ్డపై జరుగుతున్న ప్రపంచకప్-2023లో బాబర్ ఆజం బృందం శుభారంభం చేసిన విషయం తెలిసిందే. ఉప్పల్ వేదికగా ఆడిన రెండు మ్యాచ్‌లలో జయకేతనం ఎగురవేసింది. తొలుత నెదర్లాండ్స్‌పై 81 పరుగులతో గెలుపొందిన పాక్.. మలి మ్యాచ్‌లో శ్రీలంక విధించిన 345 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి రికార్డు సృష్టించింది. సంచలన విజయం అనంతరం టీమిండియాతో పోరుకు సిద్ధమైంది. మరోవైపు.. రోహిత్ సేన ఆస్ట్రేలియాతో ఆరంభ మ్యాచ్‌లో తడ‘బ్యా’టుకు లోనై విరాట్ కోహ్లి(85), కేఎల్ రాహుల్(97- నాటౌట్) అద్భుత భాగస్వామ్యం కారణంగా గట్టెక్కింది. ఇక ఆసీస్‌పై భారత్ విజయం సాధించినా.. టాపార్డర్ దారుణంగా విఫలం కావడం విమర్శలకు దారితీసింది. ఈ క్రమంలో ఆఫ్గనిస్తాన్‌తో బుధవారం నాటి మ్యాచ్ టీమిండియాకు కీలకంగా మారింది. ఇక ఈ మ్యాచ్ తర్వాత భారత జట్టు కూడా అహ్మదాబాద్‌లో అడుగుపెట్టనుంది. చదవండి: 'అయ్యో షమీ.. రోహిత్ శర్మ కావాలనే అలా చేస్తున్నాడు' Pakistan team reached Ahmedabad for the clash against India....!!! - The Greatest battle in Cricket. pic.twitter.com/Qjx2oPcFju — Johns. (@CricCrazyJohns) October 11, 2023 -
CWC 2023: ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌కు సంబంధించి ఆసక్తికర అప్డేట్
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈనెల 14న జరుగనున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు సంబంధించి పలు ఆసక్తికర అప్డేట్స్ వచ్చాయి. క్రికెట్ ప్రపంచం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్‌కు ముందు పలు ఆసక్తికర కార్యక్రమాలు జరుగనున్నట్లు ఓ ప్రముఖ దినపత్రిక వెల్లడించింది. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అతిరధ మహారధులు నరేంద్ర మోదీ స్టేడియంకు తరలిరానున్నట్లు సదరు పత్రిక పేర్కొంది. సినీ సెలబ్రిటీలు అమితాబ్ బచ్చన్, తలైవా రజినీకాంత్, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌తో పాటు వివిధ రంగాలకు చెందిన పలువురు సెలబ్రిటీలు ఈ హైఓల్టేజీ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షిస్తారని తెలుస్తుంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ప్రముఖ బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్ స్పెషల్ ప్రోగ్రాం ఉంటుందని సమాచారం. అలాగే పలువురు సినీ సెలబ్రిటీలచే నృత్య ప్రదర్శన కూడా ఉంటుందని తెలుస్తుంది. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు లక్ష మందికి పైగా స్టేడియంకు వస్తారని బీసీసీఐ అంచనా వేస్తుంది. టోర్నీ ఆరంభానికి ముందు ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించని బీసీసీఐ.. భారత్-పాక్ మ్యాచ్‌కు ముందు ఇలాంటి ఆసక్తికర కార్యక్రమాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. కాగా, ప్రస్తుత వరల్డ్‌కప్‌లో భారత్.. తమ తొలి మ్యాచ్‌లో ఆసీస్‌ను మట్టికరిపించి బోణీ విజయం సాధించింది. ఇవాళ (అక్టోబర్ 11) జరుగబోయే రెండో మ్యాచ్‌లో టీమిండియా ఆఫ్ఘనిస్తాన్‌ను (న్యూఢిల్లీ వేదికగా) ఢీకొంటుంది. ప్రస్తుతం భారత్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన న్యూజిలాండ్, పాక్‌లు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. -
CWC 2023: ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌కు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పిన బీసీసీఐ
యావత్ క్రికెట్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్-పాకిస్తాన్ వరల్డ్‌కప్ మ్యాచ్‌కు సంబంధించి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) ఓ ఆసక్తికర అప్డేట్ ఇచ్చింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈనెల (అక్టోబర్) 14న జరుగనున్న ఈ హైఓల్టేజీ పోరుకు సంబంధించి 14,000 టికెట్లను ఇవాళ (అక్టోబర్ 8) ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి వరల్డ్‌కప్ అధికారిక టికెటింగ్ వెబ్సైట్లో ( https://tickets.cricketworldcup.com,”) టికెట్లు అందుబాటులో ఉంటాయని బోర్డు తెలిపింది. 🚨 NEWS 🚨 BCCI set to release 14,000 tickets for India v. Pakistan League Match on October 14, 2023. Details 🔽 #CWC23 https://t.co/p1PYMi8RpZ — BCCI (@BCCI) October 7, 2023 కాగా, వరల్డ్‌కప్‌లో భారత్-పాక్ మ్యాచ్‌కు సంబంధించి అదనపు టికెట్లు విడుదల చేయడం ఇది తొలిసారి కాదు. గత నెలలో కూడా బీసీసీఐ భారీ సంఖ్యలో టికెట్లను విడుదల చేసింది. వరల్డ్‌కప్-2023 ఓపెనింగ్ మ్యాచ్‌కు (ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్) ప్రేక్షకుల ఆదరణ కరువైన నేపథ్యంలో బీసీసీఐ టికెట్ల సంఖ్యను పెంచుతూ జనాలను ఆకర్శించే పనిలో పడింది. భారత్-పాక్ మ్యాచ్‌కు నరేంద్ర మోదీ స్టేడియం కిక్కిరిసిపోవడమే లక్ష్యంగా బీసీసీఐ పెద్దలు అదనపు టికెట్లను రిలీజ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ప్రస్తుత వరల్డ్‌కప్‌లో భారత్.. ఇవాళ (అక్టోబర్ 8) తమ తొలి మ్యాచ్ ఆడనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభంకానుంది. మరోవైపు ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు పూర్తైన విషయం తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్‌తో జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్ అద్భుత విజయం సాధించగా.. రెండో మ్యాచ్‌లో నెదార్లండ్స్‌పై పాక్ సూపర్ విక్టరీ సాధించింది. నిన్న జరిగిన 2 మ్యాచ్‌ల్లో తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్పై బంగ్లాదేశ్.. శ్రీలంకపై సౌతాఫ్రికా ఘన విజయాలు నమోదు చేశాయి. -
ఓపెనింగ్ సెర్మనీ లేదు.. ఖాళీ కుర్చీలు.. ఊహించిన విధంగా ప్రారంభం కాని క్రికెట్ వరల్డ్‌కప్
మహా క్రికెట్ సంగ్రామం వన్డే వరల్డ్‌కప్ 2023 ఊహించిన విధంగా ఆరంభానికి నోచుకోలేదని క్రికెట్ అభిమానులు బాధపడుతున్నారు. ప్రతిష్టాత్మకమైన నరేంద్ర మోదీ స్టేడియంలో టోర్నీ ఆరంభ మ్యాచ్‌కు ముందు భారీ తారాగణంతో ఓపెనింగ్ సెర్మనీ ఉంటుందని అంతా అనుకున్నారు. అయితే అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ మెగా టోర్నీని తూతూమంత్రంగా ప్రారంభించారు నిర్వహకులు. The scene for the World Cup opener…IT’S MASSIVE 🤯#CWC23 pic.twitter.com/Rljsp4HICA— England's Barmy Army 🏴🎺 (@TheBarmyArmy) October 5, 2023 The stands at the 132,000 capacity Narendra Modi stadium in Ahmedabad are only sparsely filled for the #CWC23 opener between England and New Zealand 🏟️ pic.twitter.com/lQSgGEWuTE — ESPNcricinfo (@ESPNcricinfo) October 5, 2023 అలాగే టోర్నీ ఆరంభ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు భారీ సంఖ్యలో ప్రేక్షకులు తరలివస్తారని అంతా ఊహించారు. అయితే ఇది కూడా జరగలేదు. మ్యాచ్ ప్రారంభమై గంట గడుస్తున్నా స్టేడియం మొత్తం ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. ఈ సీన్‌ను చూసి అభిమానులు నిరుత్సాహపడుతున్నారు. అసలు ఇది వరల్డ్‌కప్ టోర్నీనేనా.. ఈ మ్యాచ్ జరుగున్నది భారత దేశంలోనే అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఐసీసీ వరల్డ్‌కప్ గ్లోబల్ అంబాసిడర్ హోదాలో సచిన్ టెండూల్కర్ టోర్నీని అధికారికంగా ప్రారంభించాడనే మాట తప్పించి మెగా టోర్నీ ప్రారంభమంతా నామమాత్రంగా సాగడంతో అభిమానులు పెదవి విరుస్తున్నారు. జనాలు స్టేడియంకు రాలేదంటే ఇవాళ పని దినం అనుకునే సర్దిచెప్పుకోవచ్చు.. మరి కనీసం ఓపెనింగ్ సెర్మనీ కూడా నిర్వహించలేని దుస్థితిలో బీసీసీఐ ఉందా అంటే..? ఈ ప్రశ్నకు ఏలికలే సమాధానం చెప్పాలి. Hopefully after office hours, there should be more people coming in. But for games not featuring Bharat, there should be free tickets for school and college children. With the fading interest in 50 over game, it will definitely help that youngsters get to experience a World Cup… — Virender Sehwag (@virendersehwag) October 5, 2023 ఏదిఏమైనప్పటికీ వరల్డ్‌కప్ 2023 మాత్రం ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. 13 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 64/2గా ఉంది. ఓపెనర్లు బెయిర్‌స్టో (33), మలాన్ (14) ఔట్ కాగా.. జో రూట్ (16), హ్యారీ బ్రూక్ క్రీజ్‌లో ఉన్నారు. మ్యాట్ హెన్రీ, మిచెల్ సాంట్నర్‌కు తలో వికెట్ దక్కింది. -
ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో భారీ సంఖ్యలో హాజరుకానున్న మహిళలు..?
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే వన్డే ప్రపంచకప్ తొలి మ్యాచ్‌కు భారీ సంఖ్యలో మహిళలు హాజరుకానున్నారని తెలుస్తుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, గత ఎడిషన్ రన్నరప్ న్యూజిలాండ్ మధ్య అక్టోబర్ 5న జరిగే ఈ మ్యాచ్ కోసం గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం 40,000 మందికి పైగా మహిళలను తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రముఖ హిందీ దినపత్రిక దైనిక్ భాస్కర్ వెల్లడించింది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చే మహిళలకు ఉచిత టికెట్లతో పాటు ఆల్పాహారం కూడా అందించనున్నట్లు సమాచారం. గతంలో మహిళల ఐపీఎల్ సందర్భంగా కూడా ఓ మ్యాచ్ కోసం ఇలాగే భారీ సంఖ్యలో మహిళలను తరలించారు. అయితే అప్పుడు ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఈ చర్యను చేపట్టింది. ఇదిలా ఉంటే, మరో రెండు రోజుల్లో ప్రారంభంకానున్న ప్రపంచకప్ కోసం అన్ని జట్లు సన్నాహకాల్లో బిజీగా ఉన్నాయి. కొన్ని జట్లు ఇవాళ తమ ఆఖరి వార్మప్ మ్యాచ్‌లు ఆడుతుండగా.. మిగతా జట్లు వరల్డ్‌కప్ వ్యూహరచనల్లో నిమగ్నమై ఉన్నాయి. మెగా టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 8న ఆడనుంది. చెన్నై వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆస్ట్రేలియాతో తలపడుతుంది. అనంతరం భారత్ తమ రెండో మ్యాచ్‌ను అక్టోబర్ 11న ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడుతుంది. దీని తర్వాత టీమిండియా అక్టోబర్ 14న చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్‌కు కూడా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. ఈ వరల్డ్‌కప్‌లో నరేంద్ర మోదీ స్టేడియం మొత్తంగా ఐదు మ్యాచ్‌లను ఆతిథ్యమివ్వనుంది. నవంబర్ 19న జరిగే ఫైనల్ మ్యాచ్ కూడా ఇదే మైదానంలో జరుగనుంది. -
Sikh for Justice: వరల్డ్ కప్ కాదు.. టెర్రర్ కప్
అహ్మదాబాద్: కరడుగట్టిన ఖలిస్తాన్ ఉగ్రవాది, నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) సంస్థ అధినేత గురుపట్వంత్ సింగ్ పన్నూపై గుజరాత్ పోలీసుల ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో అక్టోబర్ 5 నుంచి ప్రారంభమయ్యే క్రికెట్ ప్రపంచ కప్ ‘ప్రపంచ టెర్రర్ కప్’గా మారతుందంటూ సోషల్ మీడియాలో పన్నూ చేసిన హెచ్చరికలను పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా బెదిరింపులకు పాల్పడినందుకు అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ విభాగం పోలీసు అధికారులు శుక్రవారం వెల్లడించారు. ముందే రికార్డు చేసిన ఓ వాయిస్ మెసేజ్‌ను విదేశీ ఫోన్ నంబర్‌తో సోషల్ మీడియాలో పన్నూ పోస్టు చేశాడని తెలిపారు. +447418343648 అనే నంబర్‌తో దేశవ్యాప్తంగా చాలామందికి ఈ మెసేజ్ అందిందని పేర్కొన్నారు. మెసేజ్ అందుకున్నవారు ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. సబ్ఇన్స్పెక్టర్ హెచ్.ఎన్.ప్రజాపతి ఫిర్యాదు మేరకు పన్నూపై కేసు పెట్టినట్లు వివరించారు. +44 అనేది యునైటెడ్ కింగ్డమ్(యూకే) కోడ్ కావడం గమనార్హం. అయితే, ఇంటర్నెట్ కాల్ టెక్నాలజీతో ఇలా విదేశీ ఫోన్ నంబర్ల నుంచి సందేశం వస్తున్నట్లు తప్పుదోవ పట్టించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే పన్నూ హెచ్చరికల మెసేజ్ ఎక్కడి నుంచి వస్తోందన్న దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ...ఇట్లు గురుపట్వంత్ సింగ్ పన్నూ విదేశీ ఫోన్ నంబర్‌తో వచి్చన కాల్‌ను రిసీవ్ చేసుకున్న తర్వాత ప్రి–రికార్డెడ్ వాయిస్ మెసేజ్ వినిపిస్తోందని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు జీతూ యాదవ్ తెలియజేశారు. ‘‘అమర వీరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు కచి్చతంగా ప్రతీకారం తీర్చుకుంటాం. మీ బుల్లెట్లకు వ్యతిరేకంగా బ్యాలెట్లు ఉపయోగిస్తాం. మీరు సాగిస్తున్న హింసాకాండకు వ్యతిరేకంగా ఓట్లు వేస్తాం. అక్టోబర్ 5వ తేదీని గుర్తు పెట్టుకోండి. ఆ రోజు క్రికెట్ ప్రపంచ కప్ కాదు, ప్రపంచ టెర్రర్ కప్ ప్రారంభమవుతుంది. సిఖ్స్ ఫర్ జస్టిస్ ఆధ్వర్యంలో ఖలిస్తాన్ జెండాలతో అహ్మదాబాద్‌ను ముట్టడిస్తాం.. ఇట్లు గురుపట్వంత్ సింగ్ పన్నూ’’ అంటూ ఆ సందేశంలో హెచ్చరికలు వినిపిస్తున్నాయని వెల్లడించారు. అహ్మదాబాద్ నగర ప్రజలకు గత రెండు రోజులుగా ఈ మెసేజ్ వస్తోందన్నారు. ఎవరీ పన్నూ? సిక్కుల కోసం భారత్‌లో ఖలిస్తాన్ అనే ప్రత్యేక దేశం ఏర్పాటే తన జీవితాశయమని ప్రకటించుకున్న గురుపట్వంత్ సింగ్ పన్నూ పంజాబ్ రాష్ట్రంలో అమృత్సర్ సమీపంలోని ఖంజోత్ అనే గ్రామంలో జని్మంచాడు. న్యాయ విద్య అభ్యసించాడు. అనంతరం కెనడాకు వలస వెళ్లి, అక్కడే స్థిరపడ్డారు. కెనడా పౌరసత్వం కూడా సంపాదించాడు. సిఖ్స్ ఫర్ జస్టిస్ అనే సంస్థను స్థాపించాడు. భారత్‌కు వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగిస్తున్నాడు. భారత్‌లో జరిగిన పలు ఉగ్రవాద దాడుల్లో అతడి హస్తం ఉన్నట్లు గుర్తించారు. ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతుగా కెనడాతోపాటు అమెరికా, యూకే, ఆ్రస్టేలియా తదితర దేశాల్లో ర్యాలీలు నిర్వహించాడు. ఖలిస్తాన్‌కు అనుకూలంగా వివిధ దేశాల ప్రభుత్వాల మద్దతును కూడగట్టడానికి లాబీయింగ్ చేస్తున్నాడు. హరిదీప్ సింగ్ నిజ్జర్ హత్యపై పన్నూ తీవ్రంగా రగిలిపోయాడు. కెనడాలోని హిందువులంతా దేశం విడిచి వెళ్లిపోవాలని కొన్ని రోజుల క్రితం హెచ్చరికలు జారీ చేశాడు. 2020 జూలైలో పన్నూను భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. ప్రస్తుతం అతడు కెనడాలో అజ్ఞాతంలో ఉన్నాడు. -
మహిళా బిల్లు ఆమోదంపై ప్రధాని మోదీ హర్షం ఇదే
-
అక్కడ ఒక్కరాత్రికి 4 వేలు ఉండేది.. ఆరోజు మాత్రం ఏకంగా 60 వేలు!
India-Pakistan World Cup 2023 Clash: వన్డే వరల్డ్‌కప్.. చిరకాల ప్రత్యర్థులు టీమిండియా- పాకిస్తాన్ మధ్య పోరు.. అది కూడా భారత గడ్డ మీద.. అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐసీసీ ఈవెంట్లో దాయాదుల అమీతుమీకి అహ్మదాబాద్ వేదిక కానున్న విషయం తెలిసిందే. ఈ గుజరాత్ పట్టణంలో గల నరేంద్ర మోదీ స్టేడియంలో అక్టోబరు 14న దాయాదుల మధ్య క్రికెట్ సమరం జరుగనుంది. భారీ ఎత్తున పోటీ భారత్- పాక్.. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ అంటే ఇరు దేశాల అభిమానులతో పాటు క్రికెట్ ప్రపంచానికి మొత్తం పూనకాలే! మెగా టోర్నీలో ఎవరు పైచేయి సాధిస్తారన్న అంశం ఆసక్తికరంగా మారిన తరుణంలో.. ఈ పోరును నేరుగా వీక్షించేందుకు టిక్కెట్ల కోసం పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. ఇదిలా ఉంటే.. ఆగష్టు 25 నుంచి దశల వారీగా టిక్కెట్ల విక్రయ ప్రక్రియ జరుగనుందని అంతర్జాతీయ క్రికెట్ మండలి మంగళవారం తెలిపింది. నేరుగా వీక్షించడమే లక్ష్యంగా ఈ క్రమంలో సెప్టెంబరు 3 నుంచి భారత్- పాక్ మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్ల అమ్మకం ప్రక్రియ ప్రారంభం కానుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో టిక్కెట్ల కొనుగోలుతో పాటు మ్యాచ్ వీక్షంచే క్రమంలో అహ్మదాబాద్‌లో వసతి సౌకర్యాలపై కూడా అభిమానులు దృష్టి సారించారు. అమాంతం 15 రెట్లు పెరిగాయి దీంతో.. దాదాపు లక్ష సీట్ల సామర్థ్యం ఉన్న మోదీ స్టేడియానికి క్రికెట్ ప్రేమికులు పోటెత్తనున్న తరుణాన్ని క్యాష్ చేసుకునేందుకు స్థానిక హోటల్స్ కూడా రెడీ అయిపోయాయి. అహ్మదాబాద్‌లోని ఒక్కో హోటల్లో సాధారణం కంటే టారిఫ్‌లు 15 రెట్లు పెరిగినట్లు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో నివేదిక వెల్లడించింది. ‘‘బుకింగ్.కామ్ ప్రకారం ఒక్క రాత్రి స్టే చేసేందుకు మామూలుగా 4 వేల రూపాయలు చార్జ్ చేసే హోటల్.. 4 వేలు కాదు.. ఏకంగా 60 వేలు ఇప్పుడు ఏకంగా ఇద్దరు వ్యక్తులు ఒక్కరాత్రి ఉండేందుకు 60,000 రూపాయలకు పెంచింది’’ అని సదరు రిపోర్టు పేర్కొంది. దీనిని బట్టి చూస్తే.. ఈసారి మ్యాచ్ చూసేందుకు ఫ్యాన్స్ జేబుకు చిల్లుపెట్టుకోకతప్పదు! ఇక ఆఫ్‌లైన్‌లో టిక్కెట్లు కలెక్ట్ చేసుకునేందుకు ఇంకెంతగా ‘పోరాడాల్సి’ వస్తుందో ఊహించుకోండి!! కాగా ఈ- టిక్కెట్లు కాకుండా ఫిజికల్ టిక్కెట్లు ఉంటేనే స్టేడియంలోకి అనుమతిస్తామరని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్ కంటే ముందు ఆసియా కప్-2023లో సెప్టెంబరు 2న భారత్- పాక్ మ్యాచ్ జరుగనుంది. చదవండి: దేశంలో ఒకే ఒక్క హార్దిక్ పాండ్యా ఉన్నాడు.. కానీ: భారత మాజీ క్రికెటర్ IPL: ‘ఢిల్లీ క్యాపిటల్స్’ కోసం కోట్లు వదులుకున్న సూపర్‌స్టార్.. అందుకే! -
Ind vs WI: శుబ్‌మన్ సెంచరీ చేయాలంటే అదొక్కటే దారి! పేలుతున్న సెటైర్లు
Shubman Gill Again Fails IND vs WI 2nd Test Leads To Pointing Out Reasons: వెస్టిండీస్‌లో టీమిండియా యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ వైఫల్యం కొనసాగుతోంది. మేనేజ్మెంట్ను రిక్వెస్ట్ చేసి.. హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్‌ను ఒప్పించిన ఈ రెగ్యులర్ ఓపెనర్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఏరికోరి ఎంచుకున్న స్థానంలో సఫలం కాలేక గిల్ విమర్శల పాలవుతున్నాడు. డొమినికా వేదికగా తొలి టెస్టులో 11 బంతులు ఎదుర్కొన్న ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్ కేవలం 6 పరుగులు చేశాడు. విండీస్ స్పిన్నర్ వారికన్ బౌలింగ్‌లో అలిక్ అథనాజ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. వరుస వైఫల్యాలు ట్రినిడాడ్‌లోని రెండో టెస్టులోనైనా రాణిస్తాడనుకుంటే మళ్లీ నిరాశ పరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా 12 బంతులు ఎదుర్కొని 10 పరుగులు మాత్రమే రాబట్టాడు. కరేబియన్ పేసర్ కీమర్ రోచ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ జాషువా డా సిల్వాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఈ నేపథ్యంలో శుబ్‌మన్ గిల్ ఆట తీరుపై టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఏరికోరి వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు రావడాన్ని ఉద్దేశించి.. ‘‘విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. నెట్టింట పేలుతున్న సెటైర్లు శుబ్‌మన్ గిల్.. రాహుల్ ద్రవిడ్‌తో మాట్లాడి ఇకపై అన్ని మ్యాచ్‌లు అహ్మదాబాద్ స్టేడియంలో జరిగేలా చూడాలని కోరాడు. నేను అహ్మదాబాద్ పిచ్‌లపై మాత్రమే బ్యాటింగ్ చేయగలను. అందుకే ఈ సాయం చేయగలరు అని అభ్యర్థించాడు’’ అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. అహ్మదాబాద్ పిచ్ ఎందుకంటే కాగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబీ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ తన కెరీర్లో గత మూడు సెంచరీలు చేయడంవిశేషం. ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో శతకం బాదిన అతడు.. న్యూజిలాండ్‌తో టీ20లోనూ సెంచరీ కొట్టాడు. ఇక ఐపీఎల్-2023లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో శతక్కొట్టాడు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు ఈ మేరకు గిల్‌ను ట్రోల్ చేయడం గమనార్హం. కాగా విండీస్‌తో రెండో టెస్టులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా మెరుగైన స్థితిలో ఉంది. గురువారం నాటి తొలి రోజు ఆట ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. ఇక అంతర్జాతీయ కెరీర్లో 500వ మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లి 87, రవీంద్ర జడేజా 36 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇదిలా ఉంటే.. తొలి టెస్టులో గిల్‌తో పాటు విఫలమైన టీమిండియా వైస్ కెప్టెన్ రహానే మలి టెస్టులోనూ అతడి మాదిరే వైఫల్యం చెంది విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. చదవండి: సన్‌రైజర్స్ హెడ్‌కోచ్‌గా వీరేంద్ర సెహ్వాగ్.. ఇక తిరుగుండదు! Ind vs WI: ధోని భయ్యా లేడు కదా.. ఇలాగే ఉంటది! ఇప్పటికైనా వాళ్లను పిలిస్తే.. -
ఇండియాతో మ్యాచ్‌కు అంత హైప్ అవసరం లేదు.. పాక్ కెప్టెన్ అతి వ్యాఖ్యలు
వన్డే వరల్డ్‌కప్-2023లో టీమిండియాతో మ్యాచ్‌పై పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఆసక్తికర (అతి) వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్‌కప్ అంటే కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే కాదని, టీమిండియాతో తాము ఆడబోయే మ్యాచ్‌కు అంత హైప్ అవసరం లేదని, మెగా టోర్నీలో తాము ఆడబోయే 9 మ్యాచ్‌లూ తమకు ముఖ్యమేనని అన్నాడు. వరల్డ్‌కప్‌లో తమ ఫోకస్ ఒక్క జట్టుపై మాత్రమే ఉండదని, తామాడిన అన్ని మ్యాచ్‌ల్లో గెలవడమే తమ లక్ష్యమని తెలిపాడు. కేవలం ఇండియాపై గెలిస్తే తాము వరల్డ్‌కప్ గెలిచినట్లు కాదని, మొత్తం 11 మ్యాచ్‌ల్లో (9 తొలి దశ మ్యాచ్‌లు, సెమీఫైనల్, ఫైనల్) గెలిస్తేనే జగజ్జేతలమవుతామని పేర్కొన్నాడు. శ్రీలంకతో త్వరలో (జులై 16 నుంచి) ప్రారంభం కాబోయే టెస్ట్ సిరీస్‌కు ముందు మీడియాతో మాట్లాడుతూ పాక్ కెప్టెన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. కాగా, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా అక్టోబర్ 15న భారత్-పాక్ మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌కు ముందు పాక్.. నెదర్లాండ్స్, శ్రీలంకలతో అక్టోబర్ 6, 12 తేదీల్లో హైదరాబాద్‌లో ఆడుతుంది. అనంతరం అక్టోబర్ 20న బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాతో, చెన్నై వేదికగా 23న ఆఫ్ఘనిస్తాన్‌తో, అదే చెన్నై వేదికగా 27న సౌతాఫ్రికాతో, కోల్‌కతా వేదికగా 31న బంగ్లాదేశ్‌తో, బెంగళూరు వేదికగా నవంబర్ 4న న్యూజిలాండ్‌తో, కోల్‌కతా వేదికగా నవంబర్ 12న ఇంగ్లండ్‌తో పాక్ తమ తొలి దశ మ్యాచ్‌లు ఆడుతుంది. -
వరల్డ్‌కప్ షెడ్యూల్ విడుదల.. జైషాపై ట్రోల్స్, మీమ్స్
క్రికెట్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ రిలీజ్ అయింది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనున్న మెగా సమరం దాదాపు 50 రోజులపాటు అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. మొత్తం 10 వేదికల్లో గ్రూప్ దశలో 48 మ్యాచ్‌లు జరగనుండగా.. నాకౌట్ దశలో మూడు మ్యాచ్‌లు ముంబై(సెమీఫైనల్-1), కోల్‌కతా(సెమీఫైనల్-2), అహ్మదాబాద్(ఫైనల్) జరగనున్నాయి. ఇక ఆరంభమ్యాచ్ 2019 వన్డే ప్రపంచకప్ విన్నర్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య అక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. అయితే వన్డే ప్రపంచకప్‌లో భాగంగా అహ్మదాబాద్ మొత్తంగా ఐదు మ్యాచ్‌లకు వేదిక కానుంది. ఆరంభ, ఫైనల్ మ్యాచ్‌లతో పాటు మధ్యలో చిరకాల ప్రత్యర్థులుగా భావించే టీమిండియా-పాకిస్తాన్, ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌లకు కూడా ఇదే స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక మరో మ్యాచ్ సౌతాఫ్రికా, అఫ్గానిస్తాన్‌ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌కు అంతగా ప్రాధాన్యం లేకపోయినప్పటికి మిగతా నాలుగు మ్యాచ్‌లకు టీఆర్పీ రేటింగ్ బద్దలవడం ఖాయం. కాగా అహ్మదాబాద్‌కు కేటాయించిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు మ్యాచ్‌లు ఆసక్తికరంగానే సాగుతాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెక్రటరీ జై షా మ్యాచ్‌ల ఎంపికలో ఏ మేరకు చక్రం తిప్పాడో స్పష్టంగా అర్థమవుతుంది. తన ఆధిపత్యాన్ని చూపిస్తూ తన సొంత ఇలాకాలో జరిగే ఐదు మ్యాచ్‌లు మంచి ఆసక్తి కలిగించేవే. అందుకే జై షాను సోషల్ మీడియాలో అభిమానులు ట్రోల్ చేయడంతో పాటు మీమ్స్‌తో రెచ్చిపోయారు. ''సొంత ఇలాకాలో మంచి మ్యాచ్‌లు పెట్టుకున్నాడు.. బయటి వేదికలకు మాత్రం పనికిరాని మ్యాచ్‌లు కొన్ని ఇచ్చాడు.. తన ఆధిపత్యం ఎంతలా ఉందనేది అర్థమవుతుంది.. మోదీ ఉన్నంతవరకు ప్రతి ప్రతిష్టాత్మక మ్యాచ్ అహ్మదాబాద్‌కే వెళుతుందన్నది సత్యం'' అంటూ పేర్కొన్నారు. ఈసారి అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 15న జరగబోయే భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు క్రికెట్ చరిత్రలోనే అత్యధిక టీఆర్పీ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్టేడియం సామర్థ్యం లక్ష మంది కాగా.. దాయాదుల మ్యాచ్‌కు లక్షకు పైగా వచ్చే అవకాశముంది. ప్రతిష్టాత్మక ఫైనల్‌తో పాటు మిగతా మ్యాచ్‌లు పరిశీలిస్తే ఆరంభమ్యాచ్ ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న తొలిమ్యాచ్ తొలిరోజే ఆసక్తిగా మొదలయ్యే చాన్స్ ఉంటుంది. ఇక ఇంగ్లండ్, ఆస్ట్రేలియా నవంబర్ 4న అహ్మదాబాద్‌లో ఆడనున్న మ్యాచ్‌కు కూడా యమా క్రేజ్ ఉంది. వీటితో పాటు ప్రతిష్టాత్మక ఫైనల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. Proud moment for India! Hosting the ICC Men's Cricket World Cup for the fourth time is an incredible honor. With 12 cities as the backdrop, we'll showcase our rich diversity and world-class cricketing infrastructure. Get ready for an unforgettable tournament! #CWC2023 @ICC @BCCI pic.twitter.com/76VFuuvpcK — Jay Shah (@JayShah) June 27, 2023 Jay Shah selecting venues for Pakistan matches pic.twitter.com/EKdSr3rn7h — Rajabets India🇮🇳👑 (@smileandraja) June 18, 2023 #ICCWorldCup2023 schedule pic.twitter.com/Ii7OIoWbMC — Rajabets India🇮🇳👑 (@smileandraja) June 27, 2023 Jay Shah after scheduling Pakistan match against Afghanistan in Chennai #PakistanCricket #WorldCup2023 pic.twitter.com/Wiky1eyRD8 — Rishabh (@Pun_Intended___) June 19, 2023 చదవండి: 'అప్పుడు సచిన్ కోసం.. ఇప్పుడు కోహ్లి కోసం' -
అహ్మదాబాద్ స్టేడియం నిజంగా గొప్పదా!.. ఎందుకంత ప్రాముఖ్యత?
ప్రతిష్టాత్మక ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ 2023కు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. పుష్కరకాలం తర్వాత మళ్లీ మెగా టోర్నీకి మన దేశం ఆతిథ్యం ఇస్తుండడంతో ప్రాధాన్యత నెలకొంది. ఇప్పటికే మ్యాచ్‌లు నిర్వహించనున్న స్టేడియాలకు సంబంధించిన డ్రాఫ్ట్‌ను బీసీసీఐ ఐసీసీకి పంపించింది. రెండు మూడు రోజుల్లో ఐసీసీ ఆమోదముద్ర వేయడంతో పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేయనుంది. ఇక అందరూ ఊహించినట్లుగానే వరల్డ్‌కప్ ఆరంభమ్యాచ్, ఫైనల్ మ్యాచ్ సహా మరికొన్ని కీలక మ్యాచ్‌లకు(భారత్-పాక్) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. లక్ష మంది సామర్థ్యం, ఆధునిక టెక్నాలజీ.. అత్యాధునిక సౌకర్యాలు.. మంచి డ్రైనేజీ వ్యవస్థ.. ఇది మోదీ స్టేడియం గురించి బయటికి వినపడే విషయాలు. కానీ అసలు మ్యాటర్ ఏంటంటే.. అహ్మదాబాద్ స్టేడియం అనుకున్నంత రేంజ్లో లేదన్నది అభిమానుల వాదన. ఇది నిజమే అని ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2023 ఫైనల్ సందర్భంగా నిరూపితమైంది. సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన ఫైనల్ భారీ వర్షం కారణంగా రిజర్వ్‌డేకు వాయిదా పడింది. రిజర్వ్ డే రోజున కూడా వర్షం పలుమార్లు అంతరాయం కలిగించింది. అయితే మే 28న కురిసిన భారీ వర్షానికి అహ్మదాబాద్ స్టేడియంలో ఒక పెవిలియన్ ఎండ్‌లో పైకప్పుకు సొట్ట పడడంతో స్టాండ్స్ మొత్తం నీటితో నిండిపోయింది. దీనివల్ల తర్వాతి రోజు మ్యాచ్‌కు వచ్చిన ప్రేక్షకులకు కూర్చోవడానికి ఇబ్బంది తలెత్తింది. అంతేకాదు స్టేడియం ఔట్ఫీల్డ్తో పాటు పిచ్ కూడా పూర్తిగా బురదమయం అయింది. పిచ్‌ను తయారు చేయడానికి సాపర్స్, ఇసుకను ఉపయోగించారు. దీనితో పాటు హెయిర్ డ్రైయ్యర్లు, ఇస్త్రీ పెట్టెలు ఉపయోగించినట్లు వార్తలు వచ్చాయి. అయితే తర్వాత ఇది నిజం కాదని తేలింది. కానీ ఒక్క భారీ వర్షం వల్ల నరేంద్ర మోదీ స్టేడియంలోని లోపాలన్ని బయటపడ్డాయి. ఇవన్నీ పక్కనబెడితే.. కొత్త స్టేడియం కావడంతో అది ప్రారంభమయినప్పటి నుంచి టీమిండియా ఆడిన ఏ ప్రతిష్టాత్మక మ్యాచ్‌కు అయినా అహ్మదాబాద్ ఆతిథ్యం ఇస్తూనే వస్తోంది. ఇది కొంతమంది అభిమానులకు నచ్చడం లేదు. బీజేపీ హయాంలో ఈ స్టేడియం నిర్మాణం పూర్తవ్వడంతో స్టేడియం పేరును సర్దార్ పటేల్ నుంచి నరేంద్ర మోదీకి మార్చి పొలిటికల్ యాంగిల్‌కు తెర తీశారు. అంతేకాదు బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జై షా అహ్మదాబాద్‌కు చెందినవాడు కావడం.. అతని తండ్రి దేశ రాజకీయాల్లో నెంబర్-2గా.. మోదీకి అత్యంత సన్నిహితుడిగా చక్రం తిప్పుతుండడంతో అహ్మదాబాద్ స్టేడియానికి కలిసి వస్తోందని చెప్పొచ్చు. People who are asking for closed roof stadiums have a look at the pillars and roofs of the biggest stadium and the richest cricket board leaking. pic.twitter.com/idKjMeYWYd — Manya (@CSKian716) May 28, 2023 అభిమానులు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే.. ఎందుకు అహ్మదాబాద్ స్టేడియానికి అంత ప్రాముఖ్యత ఇస్తున్నారు. వాస్తవానికి దేశంలో అతిపెద్ద స్టేడియాల్లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ కూడా ఉంది. అందులో ఫైనల్ నిర్వహిస్తే బాగుంటుందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పేరుకే బీసీసీఐ అయినప్పటికి.. మొత్తం జై షా కనుసన్నుల్లోనే జరుగుతున్నట్లు అర్థమవుతుంది. ఇక మన భాగ్యనగరంలోని ఉప్పల్ స్టేడియం అత్యాధునిక డ్రైనేజీ సౌకర్యం కలిగిన స్టేడియాల్లో ఒకటిగా ఉంది. ఈ వరల్డ్‌కప్‌కు ఉప్పల్ ఆతిథ్యమిస్తున్నప్పటికి టీమిండియా ఆడే ఒక్క మ్యాచ్ కూడా ఈ లిస్ట్‌లో లేదని తెలిసింది. కనీసం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్ అయినా మన భాగ్యనగరంలో నిర్వహించి ఉంటే బాగుండేదని అభిమానులు బాధపడ్డారు. చదవండి: World Cup 2023: భారత మ్యాచ్ ‘భాగ్యం’ లేదు! -
రిటైర్మెంట్ ప్రకటనకు ఇదే సరైన సమయం.. కానీ! నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి: ధోని
IPL 2023 Winner CSK- Emotional MS Dhoni Comments: ‘‘ఎదురుచూపులకు సమాధానం చెప్పే సమయం.. నా రిటైర్మెంట్ ప్రకటనకు ఇంతకంటే గొప్ప సందర్భం ఉండదు. నాపై అంతులేని ప్రేమాభిమానాలు, ఆప్యాయతా అనురాగాలు చూపించిన చూపించిన అభిమానులకు ధన్యవాదాలు చెబుతున్నా. అయితే, మరో తొమ్మిది నెలల పాటు ఇలాంటి కఠిన శ్రమకోర్చి.. ఐపీఎల్ వచ్చే సీజన్లోనూ కొనసాగాలంటే కొంచెం కష్టంతో కూడుకున్న పనే. కెరీర్ కొనసాగించేందుకు నా శరీరం ఏ మేరకు సహకరిస్తుందన్న అంశం మీదే అంతా ఆధారపడి ఉంది. నా నిర్ణయం ఏమిటనేది ప్రకటించడానికి మరో 6-7 నెలల సమయం ఉంది. నాపై ప్రేమ చూపిస్తున్న వాళ్లందరికీ నా తరఫున మంచి బహుమతి అందించాలని అనుకుంటున్నా. ఆ గిఫ్ట్ ఇవ్వాలంటే నేను కష్టపడక తప్పదు’’ అని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఉద్వేగపూరితంగా మాట్లాడాడు. Photo Credit : AFP అంతా బాగుంటే మళ్లీ వస్తా ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పేందుకు ఇదే సరైన సమయం అంటూనే.. తన అభిమానులకు తప్పకుండా మర్చిపోలేని గిఫ్ట్ ఇస్తానని 41 ఏళ్ల ధోని మాట ఇచ్చాడు. శరీరం సహకరిస్తే తప్పకుండా ఐపీఎల్లో కొనసాగుతానని చెప్పకనే చెప్పాడు. ఐపీఎల్-2023 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి చెన్నై విజేతగా అవతరించిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో.. వర్షం అడ్డంకి కారణంగా రిజర్వ్ డే అయిన సోమవారం నాటి మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం సీఎస్కే 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. Photo Credit : AFP తద్వారా క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో ఐదోసారి చాంపియన్‌గా నిలిచి.. ముంబై ఇండియన్స్ పేరిట ఉన్న రికార్డును సమం చేసింది. చెన్నైని ఐదుసార్లు టైటిల్ విజేతగా నిలిపిన ధోని.. రోహిత్ శర్మ సరసన నిలిచాడు. ఈ నేపథ్యంలో ఫైనల్లో విజయానంతరం ధోని మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. Photo Credit : AFP కెరీర్లో చివరి అంకం.. నా కళ్లు చెమర్చాయి ‘‘నా కెరీర్లో ఇది చివరి అంకం. మొదటి మ్యాచ్ నుంచే నేను మైదానంలో అడుగుపెట్టిన ప్రతిసారి నా నామస్మరణతో అభిమానులు నాపై ప్రేమను కురిపించారు. వాళ్ల అభిమానానికి నా కళ్లు చెమర్చాయి. డగౌట్లో కూర్చుని ఉన్నపుడు.. ఈ ప్రత్యేకమైన, అందమైన క్షణాలను పూర్తిగా ఆస్వాదించాను. Photo Credit : AFP చెన్నైలో నా ఆఖరి మ్యాచ్ ఆడినపుడు కూడా ఇదే భావన. అయితే, సాధ్యమైనంత వరకు నేను తిరిగి రావడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. వాళ్ల ప్రేమ వెలకట్టలేనిది’’ అని ధోని.. ఫ్యాన్స్ పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. Photo Credit : AFP చదవండి: చాంపియన్‌గా చెన్నై.. గిల్ సరికొత్త చరిత్ర! అవార్డులు, ప్రైజ్‌మనీ పూర్తి వివరాలు ఇవే.. ఐపీఎల్ ఫైనల్లో అత్యధిక స్కోరు.. అన్క్యాప్డ్ ప్లేయర్‌గా చరిత్ర Thala happy and so are we ✨💥pic.twitter.com/WfT3VybSUt — Chennai Super Kings (@ChennaiIPL) May 29, 2023 5️⃣INALLY THE CELEBRATIONS! 🥳#CHAMPION5 #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/I8fl6siQ2e — Chennai Super Kings (@ChennaiIPL) May 30, 2023 Happy Tears 🥹#CHAMPION5 #WhistlePodu #Yellove 🦁pic.twitter.com/jf05fszEDA — Chennai Super Kings (@ChennaiIPL) May 30, 2023 -
ధోని అంటే ఇంత అభిమానమా? రాత్రంతా రోడ్లపై పడుకుని! వీడియో వైరల్
ఐపీఎల్-2023లో భాగంగా ఆదివారం గుజరాత్, చెన్నై మధ్య జరగాల్సిన ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించిన సంగతి తెలిసిందే. భారీ వర్షం కారణంగా ఆట సాధ్యం కాకపోవడంతో ఐపీఎల్ ఫైనల్‌ను రిజర్వ్ డే(సోమవారం)కు వాయిదా వేశారు. ఇక ఆదివారం ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. వరుణడు ఎప్పటికీ కరుణించకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనికి ఇదే చివరిమ్యాచ్ అని వార్తలు వినిపిస్తుండంతో.. అతడి అభిమానులు దేశం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చారు. అయితే మ్యాచ్ వాయిదా పడడంతో ఫ్యాన్స్ నానా అవస్థలు పడ్డారు. తమ ఆరాధ్య క్రికెటర్ ఆడే మ్యాచ్‌ను సోమవారమైనా చూసేందుకు అహ్మదాబాద్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో కొంతమంది సీఎస్కే ఫ్యాన్స్ ఆదివారం రాత్రం రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్‌లో నిద్రించారు. మరికొంత మంది బయట రోడ్ల పక్కన ఫుట్‌పాత్‌లపై కూడా నిద్రపోయినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. కాగా మ్యాచ్ జరగనున్న అహ్మదాబాద్‌లో ప్రస్తుతం వాతావారణం పొడిగా ఉంది. ఎండ బాగా కాస్తోంది. మ్యాచ్ జరిగే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. చదవండి: WTC Final- Virat Kohli: ఇంగ్లండ్‌లో ఉన్నపుడు ఇలా! అదే ఇండియాలో అయితే! కోహ్లి ఫొటో వైరల్! It is 3 o'clock in the night when I went to Ahmedabad railway station, I saw people wearing jersey of csk team, some were sleeping, some were awake, some people, I asked them what they are doing, they said we have come only to see MS Dhoni @IPL @ChennaiIPL #IPLFinal #Ahmedabad pic.twitter.com/ZJktgGcv8U — Sumit kharat (@sumitkharat65) May 28, 2023 -
ఐపీఎల్ ఫైనల్.. స్టేడియం వద్ద వాతావారణం ఎలా ఉందంటే?
భారీ వర్షం కారణంగా ఆదివారం(మే28) జరగాల్సిన IPL 2023 ఫైనల్ రిజర్వేడే సోమవారంకు వాయిదా పడిన విషయం విధితమే. ఈ టైటిల్ పోరులో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, చెన్నైసూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. అయితే రిజర్వ్‌డే రోజు సోమవారం కూడా వర్షం కురిసే అవకాశం ఉండడంతో.. కనీసం ఈ రోజునైనా మ్యాచ్ జరగుతుందా లేదా అన్న ఆందోళన అభిమానులలో నెలకొంది. కాగా ప్రస్తుతం మ్యాచ్ జరగున్న అహ్మదాబాద్‌లో ప్రస్తుత వాతావారణం ఎలా ఉందో తెలుసుకుందాం. వాతావరణం ఎలా ఉందంటే? ప్రస్తుతం అహ్మదాబాద్‌లో ఎండ బాగా కాస్తోంది. పొడివాతావరణం ఉంది. ఉదయం నుంచి ఎటువంటి వర్షం కురవలేదు. అహ్మదాబాద్‌లో ప్రస్తుతం ఉష్ణోగ్రత 35డిగ్రీలగా ఉంది. అక్కడ వాతావరణంకు సంబంధించిన ఫోటోలను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం వాతావరణం బాగా ఉన్నప్పటికీ సాయంత్రంకు ఎలా మారుతుందో వేచి చూడాలి. ఇక ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. అయితే సోమవారం నాడు వర్షం కురిసే అవకాశం 40 శాతం మాత్రమే మాత్రమే ఉన్నట్లు అక్కడ వాతావరణ శాఖ వెల్లడించింది. కాబట్టి మ్యాచ్ జరిగే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. చదవండి: WTC Final 2023: రోహిత్ శర్మతో కలిసి లండన్‌కు యశస్వి.. తిలక్ వర్మ రియాక్షన్.. వైరల్ Wether is clearl at Ahmedabad. Time 3:12 pm Its Hot sunny 🌞 #IPL2023Final #weather #Ahmedabad pic.twitter.com/J7v9V3ZCt2 — Vikram (@Vikram47467061) May 29, 2023 Today’s weather in Ahmedabad pic.twitter.com/0Uirdwp1sq — Yash MSdian ™️ 🦁 (@itzyash07) May 29, 2023