వన్డే ప్రపంచకప్-2023లో తుది సమరానికి మరి కొన్ని గంటల మాత్రమే మిగిలి ఉంది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న ఫైనల్ పోరులో భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే అహ్మబాద్‌కు చేరుకున్న ఇరు జట్లు ప్రాక్టీస్‌లో మునిగి తేలుతున్నాయి.
ఇరు జట్లు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇక ఇది ఇలా ఉండగా.. అహ్మదాబాద్ స్టేడియంలోని పిచ్‌కు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వికెట్‌పైన మ్యాచ్ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ పిచ్‌ను టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హెడ్ కోచ్ ద్రవిడ్‌తో కలిసి పరిశీలించాడు.
మరోవైపు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కూడా స్టేడియంకు వచ్చి పిచ్‌ను పరిశీలించి, ఫోటోలను తన ఫోన్‌లో తీసుకున్నాడు. ఆ తర్వాత వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ,ఆస్ట్రేలియా స్పిన్ బౌలింగ్ కోచ్ డేనియల్ వెట్టోరీ కూడా చాలా సేపు ఈ పిచ్‌ను చెక్ చేశారు.
టాస్ గెలిస్తే తొలుత ఏమి చేయాలి..?
కాగా ఈ మ్యాచ్‌లో టాస్ మరోసారి కీలకం కానుంది. ఈ తుదిపోరులో టాస్ గెలిచిన జట్టు తొలుత ఏమి చేస్తే బాగుంటుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అయితే సోషల్ మీడియాలో వైరలవుతున్న ఫోటోను బట్టి చూస్తే.. అహ్మదాబాద్ పిచ్‌ను నల్లమట్టితో తాయారు చేసినట్లు కన్పిస్తోంది.
ట్రాక్‌పై పెద్దగా గ్రాస్(గడ్డి) కూడా లేదు. కాబట్టి కొత్త బంతితో సీమర్లు పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. అయితే మ్యాచ్ జరిగే సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఎండ ఎక్కువగా ఉంటే మాత్రం పిచ్ బాగా డ్రై అవుతుంది.
Captain Pat Cummins inspects the pitch ahead of the final 🔍#CWC23 #INDvAUS pic.twitter.com/ymBAK5o8x6
— ICC (@ICC) November 18, 2023
దీంతో వికెట్ కాస్త హార్డ్‌గా మారి స్పిన్నర్లకు అనూకూలించే ఛాన్స్ ఉంది. ప్లడ్ లైట్ల కింద పిచ్ కాస్త సీమర్లకు అనుకూలించే ఛాన్స్ ఉంది. ఏదైమనప్పటికీ మధ్యాహ్నం పరిస్థితులు బ్యాటింగ్‌కు అనూకూలించే అవకాశమున్నందన.. టాస్ గెలిచిన జట్టు తొలుత బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉంది.
చదవండి: World Cup 2023 IND Vs AUS Finals: ఈ సారి వరల్డ్‌కప్ టీమిండియాదే.. ఎలా అంటే?
Comments
Please login to add a commentAdd a comment