ప్రస్తుతం మన దేశంలో ఎక్కడ చూసినా క్రికెట్ ఫీవరే కనిపిస్తోంది. 2011 తర్వాత వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్‌కి వెళ్లడం, ఇదే ప్రపంచకప్‌లో టోర్నీలో అన్ని మ్యాచులు గెలవడం.. ఇలా చాలా శుభశకునాలు కనిపిస్తున్నాయి. దీంతో కప్ గ్యారంటీ అని అందరూ గట్టిగా నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతిఒక్కరూ మ్యాచ్ కోసం తెగ ఎదురుచూస్తున్నారు. తెలుగు స్టార్ హీరోలు కూడా ఇందులో మినహాయింపు ఏం కాదు.
సినిమా-క్రికెట్‌ని విడదీసి చూడలేం. రెండింటికి చాలా మంచి రిలేషన్స్ ఉంటాయి. అందుకు తగ్గట్లే చాలామంది తెలుగు హీరోలకు క్రికెట్ అంటే చాలా ఇష‍్టం కూడా. ఈ లిస్టులో ఫస్ట్ వెంకటేశ్ ఉంటాడు. ఐపీఎల్ మ్యాచ్‌ల దగ్గర నుంచి ఇండియా మ్యాచ్‌ల వరకు హైదరాబాద్‌లో జరిగే ప్రతి మ్యాచ్‌కి హాజరవుతుంటారు. ఈ వరల్డ్‌కప్‌లో అయితే మొన్నటికి మొన్న జరిగిన సెమీఫైనల్‌లో సందడి చేశారు. ఇప్పుడు ఫైనల్‌లో అంతకు మించిన ఎనర్జీతో సందడి చేయడం గ్యారంటీ.
(ఇదీ చదవండి: Bigg Boss 7: ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరు ఔట్?)
వెంకటేశ్ మాత్రమే కాదు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, కింగ్ నాగార్జున.. వరల్డ్‌కప్ ఫైనల్ చూసేందుకు అహ్మదాబాద్ రాబోతున్నారట. తెలుగు నుంచి ప్రస్తుతానికైతే ఈ ముగ్గురు హీరోల పేర్లు వినిపిస్తున్నాయి. ఆదివారం మ్యాచ్ జరిగే సమయానికి ఈ లిస్టులో ఇంకా చాలామంది చేరుతారు. మిగతా ఇండస్ట్రీల నుంచి చూసుకుంటే బాలీవుడ్ స్టార్స్ ఆల్మోస్ట్ అటెండ్ అయిపోతారు. అందులో నో డౌట్. తమిళ్ నుంచి రజనీకాంత్, కమల్ హాసన్, మలయాళం నుంచి మోహన్ లాల్, హిందీ నుంచి అమితాబ్ బచ్చన్.. మ్యాచ్ కోసం గ్యారంటీగా స్టేడియానికి వస్తారని తెలుస్తోంది. దీనిబట్టి చూస్తే గ్రౌండ్‌లో టీమిండియా హడావుడి కంటే స్టాండ్స్‌లో స్టార్స్ హీరోల హడావుడే ఎక్కువ ఉండబోతుందనమాట.
ఫైనల్ విషయానికొస్తే ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. దీన్ని చూసేందుకు ఇండియా-ఆస్ట్రేలియా ప్రధాన మంత్రులతో పాటు ఇప్పటివరకు వరల్డ్‌కప్ గెలుచుకున్న జట్ల కెప్టెన్స్ కూడా హాజరు కానున్నారట. ఇదిలా ఉండగా.. ఉదయం 7 గంటల నుంచే స్టార్‌స్పోర్ట్స్‌లో లైవ్ కవరేజీ ఉండనుంది.
(ఇదీ చదవండి: హీరో ధనుష్ ఇంటికొచ్చిన పోలీసులు? కొడుకు ఆ తప్పు చేయడంతో!)
Comments
Please login to add a commentAdd a comment