world cup final
-
షూటింగ్ వరల్డ్ కప్ ఫైనల్‌కు భారత్ ఆతిథ్యం
ప్రతిష్టాత్మక అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్ సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) వరల్డ్ కప్ ఫైనల్ టోర్నీకి భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఈ ఏడాది అక్టోబర్‌లో న్యూఢిల్లీలోని కర్ణీ సింగ్ రేంజ్లో ప్రపంచకప్ ఫైనల్ పోటీలు నిర్వహించనున్నట్లు భారత రైఫిల్ సంఘం (ఎన్ఆర్ఏఐ) గురువారం ప్రకటించింది. ఒలింపిక్స్‌లోని 12 వ్యక్తిగత విభాగాల్లో విజేతలుగా నిలిచిన షూటర్లు ఈ టోర్నీకి నేరుగా అర్హత సాధించనున్నారు. వీరితో పాటు గత సంవత్సరం దోహా, ఖతార్‌లో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్స్ చాంపియన్లు కూడా ఇందులో నేరుగా పాల్గొననున్నారు. ఇక ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తొలి ఆరు స్థానాల్లో నిలిచిన షూటర్లు కూడా నేరుగా పోటీ పడనున్నారు. ఆతిథ్య హోదాలో భారత్‌కు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అవకాశాలు ఉన్నాయి. ‘ప్రపంచకప్ ఫైనల్ భారత్ లో జరగనుండటం ఇది రెండోసారి’ అని ఎన్ఆర్ఏఐ గురువారం ప్రకటించింది. -
సూర్యకుమార్ యాదవ్ వరల్డ్‌కప్ విన్నింగ్ క్యాచ్... వివాదాస్పదం
టీమిండియా 2024 టీ20 వరల్డ్‌కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన సూర్యకుమార్ యాదవ్ సూపర్ మ్యాన్ క్యాచ్ ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో డేవిడ్ మిల్లర్ కొట్టిన షాట్‌ను స్కై బౌండరీ లైన్ వద్ద అద్భుతమైన విన్యాసం చేసి క్యాచ్‌గా మలిచాడు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరలైంది. స్కై సూపర్ మ్యాన్‌లా క్యాచ్ పట్టాడని అభిమానులు కొనియాడారు.అయితే స్కై పట్టిన ఈ క్యాచ్ క్యాచ్ కాదు సిక్సర్ అని కొందరు సౌతాఫ్రికా అభిమానులు అంటున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నిన్నటి నుంచి సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో స్కై క్యాచ్ పట్టుకునే క్రమంలో అతని కాలు బౌండరీ లైన్‌ను తాకినట్లు కనిపిస్తుంది.This certainly deserved more than one look, just saying. Boundary rope looks like it clearly moves. 🤷 pic.twitter.com/ulWyT5IJxy— Ben Curtis 🇿🇦 (@BenCurtis22) June 29, 2024ఈ వీడియోను పోస్ట్ చేస్తూ.. ఓ సౌతాఫ్రికా అభిమాని మేం దోచుకోబడ్డాం అని కామెంట్ చేశాడు. ఈ వీడియోకు సోషల్‌మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. టీమిండియా వ్యతిరేకులు ఈ వీడియోను ఆసరగా చేసుకునే భారత జట్టును నిందిస్తున్నారు. టీమిండియా మోసం చేసి గెలిచిందని కామెంట్ చేస్తున్నారు.బంతి చేతిలో ఉన్నప్పుడు సూర్యకుమార్ కాలు బౌండరీ లైన్‌ను తాకినట్లు రీప్లేలో స్పష్టంగా కనిపించినా థర్డ్ అంపైర్ నిజాయితీగా వ్యవహరించలేదని ఆరోపిస్తున్నారు. ఒకవేళ ఆ బంతిని సిక్సర్‌గా ప్రకటించి ఉంటే సౌతాఫ్రికా వరల్డ్‌కప్ గెలిచేదని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. కాగా, 2024 వరల్డ్‌కప్ ఫైనల్లో టీమిండియా సౌతాఫ్రికాపై 7 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. చివరి నిమిషం వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో భారత్ పైచేయి సాధించింది. సూర్యకుమార్ క్యాచ్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. చివరి ఓవర్లో సౌతాఫ్రికా గెలుపుకు 16 పరుగులు అవసరం కాగా.. ఆ ఓవర్ తొలి బంతికే మిల్లర్ ఔటయ్యాడు. మిల్లర్ ఔట్ కావడంతో సౌతాఫ్రికా విజయావకాశాలు దెబ్బతిన్నాయి. -
టీ20 వరల్డ్‌కప్-2024 ఛాంపియన్స్‌గా భారత్..
IND vs SA T20 WC Final Live Updates:టీ20 వరల్డ్‌కప్-2024 ఛాంపియన్స్‌గా భారత్.. టీ20 వరల్డ్‌కప్-2024 ఛాంపియన్స్‌గా టీమిండియా నిలిచింది. బార్బోడస్ వేదికగా జరగనున్న ఫైనల్లో 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించిన భారత్.. రెండో సారి టీ20 వరల్డ్‌కప్ టైటిల్‌ను ముద్దాడింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు మాత్రమే చేయగల్గింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. హార్దిక్ పాండ్యా మూడు వికెట్లతో సత్తాచాటగా.. బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ తలా రెండు వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించారు.ఐదో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా..దక్షిణాఫ్రికా ఐదో వికెట్ కోల్పోయింది. 52 పరుగులు చేసిన హెన్రిచ్ క్లాసెన్.. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు. సౌతాఫ్రికా విజయానికి 23 బంతుల్లో 26 పరుగులు కావాలి.విజయం దిశగా దక్షిణాఫ్రికా..15 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా 4 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ 49 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. అతడితో పాటు మిల్లర్(14) పరుగులతో క్రీజులో ఉన్నాడు. దక్షిణాఫ్రికా విజయానికి 30 బంతుల్లో 30 పరుగులు కావాలి. సౌతాఫ్రికా మూడో వికెట్ డౌన్.. స్టబ్స్ ఔట్70 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. 31 పరుగులు చేసిన స్టబ్స్.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి క్లాసెన్ వచ్చాడు. 10 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా మూడు వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది.6 ఓవర్లకు సౌతాఫ్రికా స్కోర్: 42/26 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా రెండు వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసింది. క్రీజులో డికాక్(20), స్టబ్స్(12) పరుగులతో ఉన్నారు.సౌతాఫ్రికా రెండో వికెట్ డౌన్.. మార్క్రమ్ ఔట్దక్షిణాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన మార్క్రమ్.. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో స్టబ్స్ వచ్చాడు.సౌతాఫ్రికా తొలి వికెట్ డౌన్.. హెండ్రిక్స్ ఔట్177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. 4 పరుగులు చేసిన రీజా హెండ్రిక్స్.. బుమ్రా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.2 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా వికెట్ నష్టానికి 11 పరుగులు చేసింది. క్రీజులో డికాక్, మార్క్రమ్(4) పరుగులతో ఉన్నారు.ఫైనల్లో చెలరేగిన విరాట్ కోహ్లి.. దక్షిణాఫ్రికాతో ఫైనల్లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా అదరగొట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి భారత్ 176 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. 59 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 76 పరుగులు చేసి ఔటయ్యాడు. విరాట్‌తో పాటు అక్షర్ పటేల్(47) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్, నోర్జే తలా రెండు వికెట్లు పడగొట్టగా.. జానెసన్, రబాడ ఒక్క వికెట్ సాధించారు.విరాట్ కోహ్లి ఫిప్టీ.. కీలకమైన ఫైనల్లో విరాట్ కోహ్లి ఫామ్‌లోకి వచ్చాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో కోహ్లి హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 64 పరుగులతో కోహ్లి బ్యాటింగ్ చేస్తున్నాడు. 18 ఓవర్లకు భారత్ స్కోర్: 150/4భారత్ నాలుగో వికెట్ డౌన్.. అక్షర్ పటేల్ ఔట్టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 47 పరుగులతో అద్బుత ఇన్నింగ్స్ ఆడిన అక్షర్ పటేల్ రనౌట్ రూపంలో ఔటయ్యాడు. 15 ఓవర్లు ముగిసే సరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(46), దూబే(9) పరుగులతో ఉన్నారు.12 ఓవర్లకు భారత్ స్కోర్: 93/3విరాట్ కోహ్లి, అక్షర్ పటేల్ నిలకడగా ఆడుతున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 50 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. 12 ఓవర్లు ముగిసే సరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 39 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(41), అక్షర్ పటేల్(38) పరుగులతో ఉన్నారు.నిలకడగా ఆడుతున్న విరాట్, అక్షర్..వరుసగా మూడు వికెట్లు కోల్పోయిన తర్వాత టీమిండియా బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ లభించిన అక్షర్ పటేల్ అద్బుతంగా ఆడుతున్నాడు. 9 ఓవర్లు ముగిసే సరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 39 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(31), అక్షర్ పటేల్(25) పరుగులతో ఉన్నారు.టీమిండియా మూడో వికెట్ డౌన్..34 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. రబాడ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 5 ఓవర్లు ముగిసే సరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 39 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(22), అక్షర్ పటేల్(5) పరుగులతో ఉన్నారు.భారత్‌కు బిగ్ షాక్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లుటాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఓకే ఓవర్లో భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. కేశవ్ మహారాజ్ వేసిన రెండో ఓవర్లో తొలుత రోహిత్ శర్మ ఔట్ కాగా.. అనంతరం రిషబ్ పంత్ పెవిలియన్‌కు చేరాడు. 3 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 26 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(14), సూర్యకుమార్ యాదవ్(0) పరుగులతో ఉన్నారు.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్బార్బోడస్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా ఫైనల్ మ్యాచ్‌కు విజిల్ మ్రోగింది. ఈ టైటిల్ పోరులో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఇరు జట్లు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి.తుది జట్లుదక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే, తబ్రైజ్ షమ్సీభారత్ : రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాస్టేడియంకు చేరుకున్న ఇరు జట్లుఇక ఫైనల్ మ్యాచ్ కోసం భారత్-దక్షిణాఫ్రికా జట్లు బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానానికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఇరు జట్లు వామాప్ చేస్తున్నాయి. మరో 30 నిమిషాల్లో టాస్ పడనుంది.అభిమానులకు గుడ్ న్యూస్.. భారత్-దక్షిణాఫ్రికా ఫైనల్ మ్యాచ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్. ఫైనల్ జరిగే బార్బోడస్‌లో ప్రస్తుతం ఎటువంటి వర్షం పడడం లేదు. ప్రస్తుతం ఎండకాస్తోంది. దీంతో మ్యాచ్ సజావుగా జరిగే సూచనలు కన్పిస్తున్నాయి.టైటిల్ పోరులో భారత్-దక్షిణాఫ్రికాటీ20 వరల్డ్‌కప్-2024లో తుది సమరానికి సమయం అసన్నమైంది. బార్బోడస్ వేదికగా టైటిల్‌పోరులో భారత్-దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ మెగా టోర్నీలో ఆజేయంగా నిలిచిన ఇరు జట్లు.. ఆఖరి పోరులో తాడోపేడో తెల్చుకోనున్నాయి. భారత్ తమ రెండో టీ20 వరల్డ్‌కప్ ట్రోఫీపై కన్నేయగా.. సౌతాఫ్రికా తొలి సారి వరల్డ్‌కప్‌ను ముద్దాడాలని ఉవ్విళ్లూరుతోంది. ఇరు జట్లు సమవుజ్జీగా ఉన్నాయి. ఈ టైటిల్ పోరులో ఎవరిది పై చేయో మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది. -
T20 World Cup 2024 Final: టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో తొలిసారి ఇలా..!
టీ20 వరల్డ్‌కప్ 2024 ఫైనల్లో ఇవాళ (జూన్ 29) భారత్, సౌతాఫ్రికా జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. బార్బడోస్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి టైటిల్ సాధించాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. ఇందు కోసం ఇప్పటికే వ్యూహప్రతివ్యూహాలు సిద్దం చేసుకున్నాయి. వరల్డ్‌కప్ గెలవడం ఓ జట్టుకు (టీమిండియా) 13 ఏళ్ల నిరీక్షణ అయితే.. మరో జట్టుకు (సౌతాఫ్రికా) చిరకాల కోరిక.ప్రపంచ కప్‌లో తొలిసారి ఇలా..ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్, సౌతాఫ్రికా అజేయ జట్లుగా ఫైనల్‌కు చేరాయి. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇలా (ఫైనల్‌కు చేరిన జట్లు అజేయ జట్లుగా నిలవడం) జరగడం ఇదే తొలిసారి.ఈ మెగా సమరానికి ముందు పొట్టి ఫార్మాట్లో ఇరు జట్లు ఎన్ని సార్లు ఎదురెదురుపడ్డాయో ఓ లుక్కేద్దాం. ఈ ఫార్మాట్లో భారత్-సౌతాఫ్రికా పోరాటం 18 ఏళ్ల కిందట మొదలైంది. జోహనెస్బర్గ్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ప్రొటీస్‌ను ఖంగుతినిపించింది. ఆ మ్యాచ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆడిన ఏకైక అంతర్జాతీయ టీ20 మ్యాచ్.టీమిండియాదే ఆధిక్యంఅప్పటి నుంచి పొట్టి క్రికెట్లో భారత్-సౌతాఫ్రికా జట్లు 26 మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా.. టీమిండియా 14, సౌతాఫ్రికా 11 మ్యాచ్‌ల్లో గెలిచాయి. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.టీ20 ప్రపంచకప్‌లో ఇరు జట్ల హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. సౌతాఫ్రికాపై భారత్‌కు స్పష్టమైన ఆధిక్యత ఉంది. ఇరు జట్లు ఆరు సందర్భాల్లో ఎదురెదురుపడగా.. భారత్ 4, సౌతాఫ్రికా 2 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. ఇరు జట్ల మధ్య చివరిసారి జరిగిన వరల్డ్‌కప్ (2022 ఎడిషన్) మ్యాచ్‌లో భారత్‌పై సౌతాఫ్రికా విజయం సాధించింది. -
కమాన్ టీమిండియా.. భారత జట్టు ప్రపంచకప్ గెలవాలని దేశవ్యాప్తంగా పూజలు
టీ20 వరల్డ్‌కప్ 2024 ఫైనల్ ఇవాళ (జూన్ 29) జరుగనుంది. బార్బడోస్ వేదికగా భారత్, సౌతాఫ్రికా అమీతుమీ తేల్చుకోనున్నాయి. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ కోసం యావత్ భారత దేశం కళ్లకు వొత్తులు పెట్టుకుని ఎదురుచూస్తుంది. ఈ సారి టీమిండియా ఎలాగైనా వరల్డ్‌కప్ గెలవాలని అభిమానులు తమ ఇష్ట దైవాలకు ప్రార్దనలు చేస్తున్నారు. Prayers for team India at Siddhivinayak Temple. 🥹🇮🇳 pic.twitter.com/dgwBJ5XiPi— Mufaddal Vohra (@mufaddal_vohra) June 29, 2024దేశవ్యాప్తంగా అభిమానులు తమ ఫేవరెట్ ప్లేయర్ల పేరిట ప్రత్యేక పూజలు చేయిస్తున్నారు. టీమిండియా ఫ్యాన్స్ పూజలతో దేశవ్యాప్తంగా ప్రార్ధనాలయాలు కిక్కిరిసిపోయాయి. ప్రజలు అనునిత్యం టచ్‌లో ఉండే సోషల్‌మీడియా టీమిండియా నామస్మరణతో మార్మోగుతుంది. ఏ ప్లాట్‌ఫాంలో చూసినా టీమిండియాను ఉత్తేజపరిచే పోస్ట్‌లే దర్శనమిస్తున్నాయి. 140 కోట్లకుపైగా భారతీయులు ఈసారి వరల్డ్‌కప్ మనదే అని ధీమాగా ఉన్నారు. Fans from Prayagraj offering prayers for team India's victory. 🇮🇳pic.twitter.com/4AGCwdAr0b— Mufaddal Vohra (@mufaddal_vohra) June 29, 2024భారత ఆటగాళ్లు సైతం గతంలో కాకుండా ఈసారి చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. గ్రూప్ దశలో, సూపర్-8, సెమీస్‌లో ఇది స్పష్టంగా కనిపించింది. ఈ టోర్నీలో భారత్ అజేయ జట్టుగా ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ అరివీర భయంకర ఫామ్‌లో ఉన్నాడు. సూర్యకుమార్, రిషబ్ పంత్ సత్తా చాటుతున్నారు. హార్దిక్ ఆల్‌రౌండర్ పాత్రకు న్యాయం చేస్తున్నారు. బౌలర్లంతా అద్భుతంగా రాణిస్తున్నారు. Indian fans doing Havan and prayers in Varanasi for Team India to win this T20 World Cup 2024 Trophy. 🇮🇳🙏pic.twitter.com/ETAuGiMfGP— Tanuj Singh (@ImTanujSingh) June 29, 2024పేసు గుర్రం బుమ్రా అయితే పట్టపగ్గాల్లేకుండా దూసుకుపోతున్నాడు. విరాట్, శివమ్ దూబే ఫామ్ మినహాయించి టీమిండియా అన్ని విషయాల్లో భేషుగ్గా ఉంది. వీరిద్దరు ఫైనల్లో టచ్‌లోకి వస్తే టీమిండియాకు తిరుగుండదు. మరోవైపు సౌతాఫ్రికా సైతం గెలుపుపై ధీమాగా ఉంది. ఆ జట్టు కూడా ఈ టోర్నీలో అజేయంగా ఉంది. సౌతాఫ్రికా సైతం అన్ని విభాగాల్లో టీమిండియాతో సరిసమానంగా ఉంది. మన దగ్గర సూర్యకుమార్ ఉంటే.. వాళ్ల దగ్గర క్లాసెన్ ఉన్నాడు. మన దగ్గర రోహిత్ ఉంటే.. వారి దగ్గర మార్క్రమ్ ఉన్నారు. మన దగ్గర కోహ్లి ఉంటే.. వారి వద్ద మిల్లర్ ఉన్నారు. మన దగ్గర పంత్ ఉంటే.. వారి దగ్గర డికాక్ ఉన్నాడు. THE DAY HAS ARRIVED - IT'S T20 WORLD CUP 2024 FINAL...!!!!! 🏆- Team India will take on South Africa in Final of this T20 World Cup. This is the dream of Billion Indians, Every Indian wants to see India lift the World Cup.- ALL THE BEST, TEAM INDIA, LET'S CREATE HISTORY. 🇮🇳 pic.twitter.com/4P1PbUC4CW— Tanuj Singh (@ImTanujSingh) June 28, 2024మన దగ్గర హార్దిక్ ఉంటే.. వారి దగ్గర జన్సెన్ ఉన్నాడు. బౌలింగ్ విషయానికొస్తే.. ఇరు జట్లలో మేటి పేసర్లు ఉన్నారు. మన దగ్గర బుమ్రా, అర్ష్‌దీప్ ఉంటే వారి దగ్గర రబాడ, నోర్జే ఉన్నారు. భారత్, సౌతాఫ్రికా మధ్య తేడా వచ్చేది స్పిన్ విభాగంలోనే. మన దగ్గర ప్రపంచ స్థాయి స్పిన్నర్లు కుల్దీప్, అక్షర్, జడేజా ఉండగా.. వారి దగ్గర షంషి, కేశవ్ మహారాజ్ మాత్రమే ఉన్నారు. భారత్ ఈ ఒక్క విషయంలో సఫారీలపై ఆధిక్యం కలిగి ఉంది. ఈ ఆధిక్యమే ఫైనల్లో టీమిండియాను గెలిపించే అవకాశం ఉంది. సో.. ఆల్ ద బెస్ట్ టీమిండియా. -
T20 World Cup 2024 Final: శివమ్ దూబేనా..సంజూ శాంసనా..?
మరికొద్ది గంటల్లో టీ20 వరల్డ్‌కప్ 2024 ఫైనల్ ప్రారంభం కానుంది. బార్బడోస్ వేదికగా భారత్-సౌతాఫ్రికా జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఇవాళ (జూన్ 29) రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి టైటిల్ సాధించాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. ఈ టైటిల్ ఓ జట్టుకేమో (టీమిండియా) 13 ఏళ్ల నిరీక్షణ.. మరో జట్టుకు (సౌతాఫ్రికా) చిరకాల కోరిక. ఈ తుది సమరం కోసం కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుతగిలేలా ఉన్నాడు. ఒకవేళ ఇవాళ మ్యాచ్ రద్దైనా రిజర్వ్ డే ఉంది. ఒకవేళ రిజర్వ్ డేలో కూడా మ్యాచ్ సాధ్యపడకపోతే ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. సంయుక్త విజేతలుగా నిలవడం ఇరు జట్ల ఆటగాళ్లుకు, అభిమానులు ఇష్టం ఉండదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మ్యాచ్ జరగాలనే దేవుళ్లను ప్రార్ధిస్తున్నారు.ఇదిలా ఉంటే, ఫైనల్ మ్యాచ్ కోసం భారత తుది జట్టు కూర్పులో ఓ తలనొప్పి ఉంది. వరుసగా విఫలమవుతున్న శివమ్ దూబేను ఫైనల్లో ఆడించాలా వద్దా అని మేనేజ్మెంట్ తలలు పట్టుకు కూర్చుంది. ఫామ్‌లోని లేని దూబేని ఫైనల్లో కూడా కొనసాగిస్తే.. టీమిండియా విజయావకాశాలను దెబ్బతినే ప్రమాదముందని అభిమానులు భావిస్తున్నారు. ఒకవేళ దూబేని తప్పిస్తే జట్టు లయ దెబ్బతీనే ప్రమాదం కూడా లేకపోలేదు.ప్రస్తుతం భారత జట్టు బ్యాటర్లు, ఆల్‌రౌండర్లు, బౌలర్లతో సమతూకంగా ఉంది. ఒకవేళ దూబే స్థానంలో సంజూ శాంసన్ లేదా యశస్వి జైస్వాల్‌ను తుది జట్టులోకి తీసుకుంటే భారత్‌కు ఓ ఆల్‌రౌండర్ తక్కువ అవుతాడు. ఈ టోర్నీలో దూబేతో బౌలింగ్ చేయించనప్పటికీ అతన్ని ఆల్‌రౌండర్‌గానే పరిగణించాలి. బౌలర్‌గా అతనికి ఓ మోస్తరు ట్రాక్ రికార్డు ఉంది. బార్బడోస్ పిచ్ బౌలర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో జట్టు మేనేజ్మెంట్ దూబేని తప్పించే సాహసం చేయకపోవచ్చు. కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ ద్రవిడ్‌కు కూడా దూబేని మార్చడం ఇష్టం ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్‌లో భారత తుది జట్టుపై మీ అంచాలనేమో కామెంట్ చేయండి. శివమ్ దూబేని ఆడిస్తే బాగుంటుందా లేక సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్‌లలో ఒకరికి అవకాశమిస్తే బాగుంటుందా..? -
T20 World Cup 2024 Final: ద్రవిడ్‌కు చివరి మ్యాచ్.. టైటిల్‌తో వీడ్కోలు పలకండి..!
టీ20 వరల్డ్‌కప్ 2024 చివరి అంకానికి చేరింది. బార్బడోస్ వేదికగా భారత్-సౌతాఫ్రికా మధ్య ఇవాళ (జూన్ 29) జరుగబోయే ఫైనల్‌తో మెగా టోర్నీ ముగస్తుంది. ఈ మ్యాచ్ టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌కు చివరిది. భారత హెడ్ కోచ్‌గా ద్రవిడ్ పదవీకాలం ఈ మ్యాచ్‌తో ముగస్తుంది. టైటిల్ గెలిచి ద్రవిడ్‌కు ఘనంగా వీడ్కోలు పలకాలని టీమిండియా ఆటగాళ్లు భావిస్తున్నారు. భారత క్రికెట్ అభిమానులు సైతం ఇదే కోరుకుంటున్నారు. కోచ్‌గా ద్రవిడ్ టీమిండియాకు ఎనలేని సేవలనందించాడు. ద్రవిడ్ ఆథ్వర్యంలో టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్, వన్డే ప్రపంచకప్ ఫైనల్ లాంటి ప్రతిష్టాత్మకమైన మ్యాచ్‌లు ఆడింది. ఇప్పుడు టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఆడనుంది. తన హయాంలో భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన ద్రవిడ్‌కు ఒక్క ఐసీసీ టైటిల్ గెలవలేదన్న లోటు మిగిలిపోయింది. ఈ ప్రపంచకప్‌తో ఆ లోటు తీర్చుకోవాలని ద్రవిడ్ పట్టుదలగా ఉన్నాడు. RAHUL DRAVID - ONE FINAL DAY AS HEAD COACH. 🌟- Indian cricket will miss you. pic.twitter.com/Xd7hMZiPBP— Johns. (@CricCrazyJohns) June 28, 2024ఇందుకోసం అతను బాయ్స్‌ను (టీమిండియా క్రికెటర్లను) సమాయత్తం చేస్తున్నాడు. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దైనా (రిజర్వ్ డేలో కూడా) భారత్ సంయుక్త విజేతగా నిలుస్తుంది కానీ.. అది ద్రవిడ్‌కు అంత సంతృప్తిని ఇవ్వకపోవచ్చు. భారత ఆటగాళ్లకు, అభిమానులకు కూడా సంయుక్త విజేతలుగా నిలవడం ఇష్టం లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మ్యాచ్ జరిగి. అందులో టీమిండియా విజేతగా నిలవాలని యావత్ భారత దేశం కోరుకుంటుంది. భారత్ చివరిసారి ప్రపంచకప్ టైటిల్‌ను (వన్డే) 2011లో సాధించింది. టీ20 వరల్డ్‌కప్‌ను 2007 అరంగేట్రం ఎడిషన్‌లో గెలిచింది. ఈ సారి టీమిండియా టైటిల్ సాధిస్తే.. ప్రపంచకప్ కోసం 13 ఏళ్ల నిరీక్షణకు తెరపడినట్లవుతుంది.మరోవైపు ఈ వరల్డ్‌కప్‌లో మరో ఫైనలిస్ట్ అయిన సౌతాఫ్రికా కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో టైటిల్ గెలవాలని పట్టుదలగా ఉంది. రాకరాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆ జట్టు ఆటగాళ్లు, అభిమానులు కోరుకుంటున్నారు. సౌతాఫ్రికా ఇప్పటివరకు ఒక్క వరల్డ్‌కప్ టైటిల్ కూడా గెలవలేదు. ఫైనల్స్‌కు చేరడం కూడా ఆ జట్టుకు ఇదే మొదటిసారి. కాబట్టి సౌతాఫ్రికా కూడా టైటిల్ సాధించే విషయంలో కృత నిశ్చయంతో ఉంది. మరి ఎవరు టైటిల్ గెలుస్తారో వేచి చూడాలి. -
భారత్-దక్షిణాఫ్రికా ఫైనల్.. అంపైర్లు వీరే! ఐరెన్ లెగ్లకు చోటు
టీ20 వరల్డ్‌కప్-2024లో ఫైనల్ పోరుకు సమయం అసన్నమవుతోంది. జూన్ 29(శనివారం) బార్బోడస్ వేదికగా ఫైనల్ మ్యాచ్‌లో భారత్-దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్ కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) అంపైర్ల జాబితాను ప్రకటించింది.ఈ టైటిల్ పోరులో న్యూజిలాండ్‌కు చెందిన క్రిస్ గాఫ్నీ, ఇంగ్లండ్‌కు చెందిన రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనున్నాడు. అదే విధంగా థర్డ్ అంపైర్‌గా రిచర్డ్ కెటిల్‌బరో, ఫోర్త్ అంపైర్‌గా రోడ్ టక్కర్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.అయితే ఈ జాబితాలో ఐరెన్ లెగ్ అంపైర్లు రిచర్డ్ కెటిల్‌బరో, ఇల్లింగ్‌వర్త్ ఉండటం భారత ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. గత నాలుగేళ్లలో ఐసీసీ టోర్నీల్లో వీరు అంపైర్లుగా వ్యవహరించిన నాలుగు నాకౌట్ మ్యాచ్‌ల్లో భారత్ ఓటమి పాలైంది. 2019 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్లో ఇల్లింగ్‌వర్త్, కెటిల్‌బరో ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా ఉన్నారు. ఆ మ్యాచ్‌లో టీమిండియా పరాజయం పాలైంది. ఆ తర్వాత 2021 డబ్ల్యూటీసీ ఫైనల్లో, ఇల్లింగ్‌వర్త్ ఆన్-ఫీల్డ్ అంపైర్‌గా ఉండగా, కెటిల్ బరో టీవీ అంపైర్‌గా వ్యవహరించాడు. ఈ మ్యాచ్‌లోనూ న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమి చవిచూసింది. అనంతరం 2023 డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా ఇదే జరిగింది. ఆసీస్ చేతిలో భారత్ ఓడిపోయింది. ఇక చివరగా వన్డే వరల్డ్‌కప్-2023లో కూడా వీరిద్దరూ ఆన్-ఫీల్డ్ అంపైర్లగా వ్యహరించారు. మరి ఈసారి వీరిద్దరూ ఫైనల్ మ్యాచ్ అంపైర్ల జాబితాలో ఉండడంతో ఏమి జరుగుతుందో అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. -
దక్షిణాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్.. టీమిండియా కీలక నిర్ణయం
టీ20 వరల్డ్‌కప్-2024 టైటిల్‌ను ముద్దాడేందుకు టీమిండియా అడుగు దూరంలో నిలిచింది. ఈ మెగా టోర్నీ తుదిపోరులో జూన్ 29 (శనివారం) బార్బోడస్ వేదికగా దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది.ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తమ 13 ఏళ్ల వరల్డ్‌కప్ నిరీక్షణకు తెరదించాలని భారత్ భావిస్తోంది. ఈ తుది పోరు కోసం రోహిత్ సేన ఇప్పటికే బార్బోడస్‌కు చేరుకుంది. అయితే ఫైనల్ మ్యాచ్‌కు ముందు భారత జట్టు మెనెజ్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫైనల్ మ్యాచ్ ముందు తమ జట్టు ఆటగాళ్లు ఎటువంటి గాయాల బారిన పడకుండా ఉండడానికి శుక్రవారం తమ ప్రాక్టీస్ సెషన్‌ను భారత్ మెనెజ్‌మెంట్ రద్దు చేసింది. సెమీఫైనల్‌కు, ఫైనల్‌కు కేవలం ఒక్క రోజు మాత్రమే గ్యాప్ ఉండడంతో మెనెజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది.కాగా గురువారం జరిగిన జరిగిన సెకెండ్ సెమీస్‌లో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్.. ముచ్చటగా మూడో సారి ఫైనల్లో అడుగుపెట్టింది. మరోవైపు దక్షిణాఫ్రికా మాత్రం ఈ ఫైనల్ మ్యాచ్‌కు ముందు తమ ప్రాక్టీస్ సెషన్లో పాల్గోంది. తొలిసారి ఫైనల్‌కు చేరుకున్న సౌతాఫ్రికా నెట్స్‌లో తీవ్రంగా శ్రమించింది. కాగా ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశముంది. -
U19 WC Ind vs Aus: జగజ్జేతగా ఆసీస్ .. ఇలాంటివి లెక్కలోకి రావు!
ICC Under 19 World Cup 2024: క్రికెట్ ప్రపంచంలో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఆస్ట్రేలియా మరో ఐసీసీ టైటిల్ సాధించింది. అండర్-19 వరల్డ్‌కప్-2024 ఫైనల్లో భారత యువ జట్టుపై గెలిచి నాలుగోసారి జగజ్జేగతగా అవతరించింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్‌ను 79 పరుగుల తేడాతో ఓడించి ఘన విజయం అందుకుని ఏ ఫార్మాట్లోనైనా తమకు తామే సాటి అని మరోసారి నిరూపించుకుంది. ఇక సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్-2023లో సీనియర్ జట్టు మాదిరిగానే.. కుర్రాళ్లూ కంగారూల ధాటికి కంగారెత్తి ఒత్తిడిలో చిత్తయ్యారు. ఫలితంగా ఆరోసారి ప్రపంచకప్ గెలవాలన్న యువ భారత్ ఆశలు అడియాలసయ్యాయి. రోహిత్ సేన మాదిరే.. ఉదయ్ సహారన్ బృందం కూడా కీలక పోరులో ప్రత్యర్థి ముందు తలవంచడంతో మరోసారి ఆసీస్ చేతిలో భంగపాటు తప్పలేదు. ఇలాంటివి అసలు లెక్కలోకే తీసుకోరు ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘అండర్-19 స్థాయిలో క్రికెట్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఫలితాలు పెద్దగా పరిగణనలోకి రావు. అయితే, ఈ టోర్నీలో సుదీర్ఘ ప్రయాణం ద్వారా భవిష్య క్రికెట్ స్టార్లు తమ తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకునే అవకాశం మాత్రం ఉంటుంది. భారత జట్టు చాలా బాగా ఆడింది. అయితే, ఈసారి ఆస్ట్రేలియా పేపర్ మీద మాత్రమే కాదు.. మైదానంలో కూడా మెరుగ్గానే కనిపించింది’’ అని కైఫ్ ఎక్స్ వేదికగా తన అభిప్రాయం పంచుకున్నాడు. ఇందుకు నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ‘‘ఇప్పటికైనా కైఫ్ బాయ్ ఆస్ట్రేలియా ప్రదర్శనను మెచ్చుకున్నాడు’’ అని కొంతమంది.. ‘‘అండర్-19 వరల్డ్‌కప్‌లోనూ మనం ఓడిపోయాం కాబట్టే.. ఈ విజయం లెక్కలోకి రాదంటున్నాడు కైఫ్’’ అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. అప్పుడు పేపర్ మీద మనమే బెస్ట్ అంటూ.. కాగా భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్లో ఆస్ట్రేలియాతో చేతిలో టీమిండియా ఓడిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన భారత మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్.. ‘‘అత్యుత్తమ జట్టు టైటిల్ గెలిచిందంటే నేను అస్సలు ఒప్పుకోను. పేపర్ మీద చూస్తే టీమిండియా అత్యుత్తమంగా ఉంది’’ అని వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో కైఫ్ తాజా వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే.. తొమ్మిది నెలల వ్యవధిలో ఆస్ట్రేలియా వల్ల.. ఐసీసీ ఈవెంట్లలో టీమిండియాకు మూడుసార్లు పరాభవం ఎదురైంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్, వన్డే వరల్డ్‌కప్ ఫైనల్, అండర్ 19 వరల్డ్‌కప్ ఫైనల్లో ఆసీస్.. భారత క్రికెట్ జట్లను ఓడించి.. టైటిల్స్ ఎగురేసుకుపోయింది. చదవండి: Ravindra Jadeja: మా కోడలి వల్లే ఇదంతా... మండిపడ్డ రివాబా! At u-19 level team results don't matter much. Future stars learn lesson that help them in long journey.. Well played India. This time have to say Australia good on pitch, and on paper 😊#U19WorldCup2024 — Mohammad Kaif (@MohammadKaif) February 11, 2024 -
సీనియర్ల బాటలోనే జూనియర్లు.. వరల్డ్‌కప్ ఫైనల్లో ఆసీస్ చేతిలో భారత్ ఓటమి
అండర్ 19 వరల్డ్‌కప్ 2024 ఫైనల్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. యంగ్ ఇండియాతో ఇవాళ (ఫిబ్రవరి 11) జరిగిన ఫైనల్లో యువ ఆసీస్ జట్టు 79 పరుగుల తేడాతో విజయం సాధించి, నాలుగో సారి జగజ్జేతగా నిలిచింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. భారత సంతతికి చెందిన హర్జస్ సింగ్ (55) అర్దసెంచరీతో రాణించగా.. హ్యారీ డిక్సన్ (42), హగ్ వెబ్జెన్ (48), ఒలివర్ పీక్ (46 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో రాజ్ లింబాని 3, నమన్ తివారి 2, సౌమీ పాండే, ముషీర్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన యువ భారత్.. 43.5 ఓవర్లలో 174 పరుగులకు కుప్పకూలి వంద కోట్లకు పైగా ఉన్న భారతీయులకు నిరాశ కలిగించింది. భారత ఇన్నింగ్స్‌లో ఆదర్శ్ సింగ్ (47), తెలుగు ఆటగాడు మురుగన్ అభిషేక్ (42), ముషీర్ ఖాన్ (22), నమన్ తివారి (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లు బియర్డ్మ్యాన్ (3/15), రాఫ్ మెక్‌మిలన్ (3/43), కల్లమ్ విడ్లర్ (2/35), ఆండర్సన్ (1/42) టీమిండియా పతనాన్ని శాశించారు. సీనియర్ల బాటలోనే జూనియర్లు.. భారత క్రికెట్ జట్టును వరల్డ్‌కప్ ఫైనల్ ఫోబియా వదలట్లేదు. గతేడాది చివర్లో జరిగిన వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో భారత సీనియర్లు ఇదే ఆసీస్ చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొనగా.. తాజాగా జూనియర్లు సీనియర్ల బాటలోనే నడుస్తూ అండర్ 19 వరల్డ్‌కప్ ఫైనల్లో కుర్ర ఆసీస్ జట్టు చేతిలో ఓటమిపాలయ్యారు. ప్రస్తుత ఎడిషన్‌లో ఫైనల్ వరకు అజేయ జట్టుగా నిలిచిన భారత్ రోహిత్ సేనలాగే తుది సమరంలో బొక్కబోర్లా పడి భారత క్రికెట్ అభిమానులకు గుండెకోత మిగిల్చింది. చదవండి: World Cup Final: తెలుగులో మాట్లాడుకున్న క్రికెటర్లు.. వైరల్ వీడియో -
World Cup Final: తెలుగులో మాట్లాడుకున్న క్రికెటర్లు.. వైరల్ వీడియో
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న అండర్ 19 వరల్డ్‌కప్ 2024 ఫైనల్లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీమిండియాకు ప్రాతినిథ్యం వహిస్తున్న తెలంగాణ ప్రాంత ఆటగాళ్లు అవనీశ్ రావు, అభిషేక్ మురుగన్ తెలుగులో మాట్లాడుకున్నారు. ఆస్ట్రేలియా బ్యాటింగ్ సమయంలో వికెట్‌కీపర్ అవనీశ్ రావు, స్పిన్ బౌలర్ అభిషేక్ మురుగన్‌తో హైదరాబాద్ యాసలో సంభాషించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. విదేశీ గడ్డపై వరల్డ్‌కప్ లాంటి మెగా ఈవెంట్ ఫైనల్లో ఇద్దరు తెలుగు వాళ్లు మాట్లాడుకుంటుంటే వినసొంపుగా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇద్దరు క్రికెటర్లు గ్రౌండ్ లో తెలుగులో మాట్లాడుతుంటే వినడానికి హాయిగా ఉంటుంది కదూ.!! 🤩 మరి ఈరోజు U19 ఫైనల్స్ లో అదే జరిగింది 😃 మరి మీరు కూడా చూసేయండి.!! చూడండి ICC U19 World Cup Final#INDU19vAUSU19 లైవ్ మీ #StarSportsTelugu & Disney + Hotstar లో#U19WorldCupOnStar pic.twitter.com/UPX0xz7zCd — StarSportsTelugu (@StarSportsTel) February 11, 2024 ఇదిలా ఉంటే, వరల్డ్‌కప్ ఫైనల్లో టీమిండియా ఓటమి దిశగా పయనిస్తుంది. ఆసీస్ నిర్ధేశించిన 254 పరుగుల లక్ష్య ఛేదనలో యువ భారత్ చేతులెత్తేసింది. 36 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 136/8గా ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే ఇంకా 118 పరుగులు చేయాలి చేతిలో కేవలం మూడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఏదైన మహాద్బుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో టీమిండియా గట్టెక్కలేదు. మురుగన్ అభిషేక్ (23), నమన్ తివారి (2) క్రీజ్‌లో ఉన్నారు. భారత స్టార్ త్రయం ముషీర్ ఖాన్ (22), ఉదయ్ సహారన్ (8), సచిన్ దాస్ (9) డు ఆర్ డై మ్యాచ్‌లో చేతులెత్తేశారు. ఓపెనర్ ఆదర్శ్ సింగ్ (47) కొద్దో గొప్పో ఆడేందుకు ప్రయత్నించాడు. ఆర్శిన్ కులకర్ణి 3, ప్రియాన్షు మోలియా 9, అవనీశ్ 0, రాజ్ లింబాని 0 పరుగులకు ఔటయ్యారు. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో హర్జస్ సింగ్ (55) అర్దసెంచరీతో రాణించగా.. హ్యారీ డిక్సన్ (42), హగ్ వెబ్జెన్ (48), ఒలివర్ పీక్ (46 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో రాజ్ లింబాని 3, నమన్ తివారి 2, సౌమీ పాండే, ముషీర్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. -
ఆస్ట్రేలియాతో ఫైనల్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..?
అండర్ 19 వరల్డ్‌కప్ 2024 ఫైనల్లో ఆస్ట్రేలియా 254 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ముందుంచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో హర్జస్ సింగ్ (55) అర్దసెంచరీతో రాణించగా.. హ్యారీ డిక్సన్ (42), హగ్ వెబ్జెన్ (48), ఒలివర్ పీక్ (46 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సామ్ కాంస్టాస్ 0, ర్యాన్ హిక్స్ 20, రాఫ్ మెక్‌మిలన్ 2, చార్లీ ఆండర్సన్ 13 పరగులు చేశారు. భారత బౌలర్లలో రాజ్ లింబాని 3 వికెట్లతో చెలరేగగా.. నమన్ తివారి 2, సౌమీ పాండే, ముషీర్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. భారత ఇన్నింగ్స్ కాసేపట్లో ప్రారంభమవుతుంది. ఈ టోర్నీలో భారత బ్యాటింగ్ త్రయం ఉదయ్ సహారన్, ముషీర్ ఖాన్, సచిన్ దాస్ భీకర ఫామ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ఈ ముగ్గురు రాణిస్తే టీమిండియా గెలుపు నల్లేరుపైనడక అవుతుంది. ఈ టోర్నీ ప్రస్తుత ఎడిషన్‌లో భారత్ అజేయ జట్టుగా ఉంది. ఈసారి యువ భారత్ టైటిల్‌ను గెలిస్తే ఆరో సారి జగజ్జేతగా అవతరిస్తుంది. ఆస్ట్రేలియా సైతం మూడుసార్లు వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచింది. టీమిండియా ఈసారి కూడా టైటిల్ గెలవాలని ఆశిద్దాం. -
టీమిండియా అభిమానుల్లో కలవరం
అండర్-19 వరల్డ్‌కప్ 2024లో యువ భారత్ జట్టు ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 11న జరిగే ఫైనల్లో టీమిండియా.. పటిష్టమైన ఆస్ట్రేలియాతో తలపడనుంది. అయితే ఈ మెగా ఫైనల్‌కు ముందు భారత క్రికెట్ అభిమానులకు ఓ విషయం తెగ కలవరపెడుతుంది. అదేంటంటే.. వరల్డ్‌కప్ ఫైనల్ ఆస్ట్రేలియా ఫోబియా. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత సీనియర్ జట్టు ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. అచ్చం ప్రస్తుత అండర్ 19 వరల్డ్‌కప్‌లో యువ భారత్‌లాగే 2023 వరల్డ్‌కప్‌లో భారత జట్టు కూడా ఫైనల్ వరకు అజేయంగా నిలిచింది. ఈ క్రమమే ప్రస్తుతం భారత క్రికెట్ అభిమానుల కలవరానికి కారణంగా మారింది. సీనియర్ జట్టు లాగే జూనియర్లు కూడా ఫైనల్ వరకు అజేయంగా నిలిచి, తుది సమరంలో చేతులెత్తేస్తారేమోనని భారత అభిమానులు బెంగ పెట్టుకున్నారు. భారీ అంచనాల నడుమ నాటి వరల్డ్‌కప్ ఫైనల్ బరిలోకి దిగిన టీమిండియా.. తుది సమరంలో తడబడి ఆసీస్ చేతిలో పరాభవాన్ని ఎదుర్కొంది. వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో భారత జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఓడటం ఇది కొత్తేమీ కాదు. 2003 ఎడిషన్‌లోనూ టీమిండియా ఇలానే ఫైనల్లో ఆసీస్ చేతిలో చిత్తైంది. అయితే ఆ ఎడిషన్‌లో ఇప్పటిలా భారత్ అజేయ జట్టు మాత్రం కాదు. లీగ్ దశలో ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. ఈ సెంటిమెంట్లను పక్కన పెడితే పరిస్థితులు ఎప్పటికీ ఒకేలా ఉండవన్న గ్రహించాలి. గత వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో ఆసీస్ చేతిలో ఓడిన భారత జట్ల పరిస్థితి.. ప్రస్తుత యువ భారత జట్టు పరిస్థితి వేర్వేరుగా ఉన్నాయి. ప్రస్తుత యువ భారత్ జట్టు అంత ఈజీగా ఓటమి ఒప్పుకునే పరిస్థితి లేదు. సౌతాఫ్రికాతో జరిగిన సెమీఫైనలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. 249 పరుగుల లక్ష్య ఛేదనలో 32 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన భారత్‌ను కెప్టెన్ ఉదయ్ సహారన్ (81), సచిన్ దాస్ (96) చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడి గెలిపించారు. ప్రస్తుత యువ భారత జట్టు ఎంతటి ఒత్తిడినైనా అధిగమించి, సత్ఫలితాలు రాబట్లగల సమర్ధమైన జట్టు. ఫైనల్లో యంగ్ ఇండియా ఆసీస్‌ను మట్టికరిపించి, సీనియర్లకు ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని అశిద్దాం. ఈ వరల్డ్‌కప్ గెలిస్తే యువ భారత్ ఐదో సారి జగజ్జేతగా నిలుస్తుంది. ఫైనల్ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు మొదలవుతుంది. -
వితిన్ వన్ మంత్... డాడీ మళ్లీ నవ్వుతాడు!
వరల్డ్ కప్ ఫైనల్ ఫలితం ‘అయ్యయ్యో’ అనిపించింది. కన్నీళ్ల పర్యంతం అయిన రోహిత్‌శర్మను చూసిన తరువాత ఈ ‘అయ్యయ్యో’లు రెట్టింపు అయ్యాయి. ఈ అయ్యయ్యోల సంగతి ఎలా ఉన్నా రోహిత్‌శర్మ కూతురు సమైర వీడియో క్లిప్ ఇంటర్నెట్లో నవ్వుల పువ్వులు పూయిస్తోంది. ఈ వీడియోలో... సమైర తల్లితో కలిసి వస్తుంటే రోహిత్ గురించి ‘ఎక్కడ ఉన్నారు? ఎలా ఉన్నారు?’ అని ఎవరో అడిగారు. ‘రూమ్‌లో ఉన్నారు. వితిన్ వన్ మంత్ ఆయన మళ్లీ నవ్వుతాడు’ అన్నది సమైర. ఈ చిన్నారి పెద్దరికానికి నెటిజనులు మురిసిపోతున్నారు. ఇంతకీ ఇది తాజా వీడియో కాదు. గత ఏడాది ఏదో సందర్భంలో ఒక అభిమాని షేర్ చేసిన వీడియో. అయితే మాత్రం ఏమిటీ తాజా పరిస్థితికి జిరాక్స్‌లా ఉంది. The way she answered 🥹❤ Samaira said : He is in a room, he is almost positive & within one month he will laugh again.@ImRo45 pic.twitter.com/yt3iSQa6MP — 46thcenturywhenRohit (@RohitCharan_45) November 23, 2023 -
తండ్రీకొడుకుల మధ్య చిచ్చురేపిన క్రికెట్ మ్యాచ్.. ఛార్జర్ కేబుల్‌తో ఉరేసి..
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం జరిగిన వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాాచ్ను యావత్ క్రికెట్ అభిమానులంతా ఆసక్తికరంగా వీక్షించారు. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ హై ఓల్టేజ్ పోరును, టీవీ, హాట్‌స్టార్, పలుచోట్ల భారీ స్క్రీన్ల ద్వారా ఉత్కంఠగా చూశారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఫైనల్ ఫీవర్ దేశం మొత్తాన్ని ఊపేసింది. అయితే వరల్డ్ కప్ తుది పోరు ఓ తండ్రి కొడుకుల మధ్య చిచ్చు పెట్టింది. ఇంట్లో టీవీ చూస్తున్న ఓ తండ్రి.. మ్యాచ్ మధ్యలో టీవీ ఆపేశాడన్న కోపంతో కన్న కొడుకుతో వాగ్వాదానికిదిగాడు. ఈ క్రమంలో గొడవ పెద్దది కావడంతో ఆవేశంలో కొడుకును హత్య చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దారుణం వెలుగుచూసింది,. వివరాలు.. కాన్పూర్‌కు చెందిన గణేష్ ప్రసాద్ అనే వ్యక్తి ఆదివారం భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ చూస్తున్నాడు. ఈ సమయంలో అతడి కుమారుడు దీపక్.. తనకు ఆకలిగా ఉండటంతో త్వరగా వంట చేయాలని కోరాడు. తన మాటలను తండ్రి పట్టించుకోకుండా మ్యాచ్‌లో లీనమైపోవడంతో దీపక్ టీవీని ఆఫ్ చేశాడు. దీంతో గణేష్ ప్రసాద్ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయి కొడుకుతో గొడవపడ్డాడు. ఇది ఇద్దరి మధ్య కొట్లాటకు దారితీసింది. చదవండి: అయ్యయ్యో..ఎంత విషాదం: మంచికోసం వెళ్లి..మృత్యు ఒడిలోకి! అప్పటికే మద్యం మత్తులో ఉన్న గణేష్ ప్రసాద్.. పక్కనే ఉన్న మొబైల్ ఛార్జర్ కేబుల్‌తో కొడుకును ఉరేసి చంపాండు. అనంతరం ఇంటి నుంచి పారిపోయాడు. మెట్లపై దీపక్ మృతదేహాన్ని పడి ఉండటాన్ని గుర్తించిన వారి బంధువు.. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడిని సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కాన్పూర్ ఏసీపీ బ్రిజ్ నారాయణ్ సింగ్ మాట్లాడుతూ.. క్రికెట్ మ్యాచ్ విషయంలో జరిగిన గొడవే హత్యకు కారణమైందని వెల్లడించారు. నిందితుడు హత్యకు మొబైల్ ఛార్జర్ కేబుల్‌ను ఉపయోగించాడని తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారని చెప్పారు. తండ్రీ కొడుకులిద్దరూ తరుచూ మద్యం సేవించి గొడవ పడుతుంటారని తెలిసినట్లు పేర్కొన్నారు. ఇటీవల దీపక్ తన తల్లిని కొట్టాడంతో గతవారం ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయిందని తెలిపారు. -
'అలా అయ్యుంటే టీమిండియా వరల్డ్ కప్ ఫైనల్లో గెలిచేది!
లక్నో: క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లో కాకుండా లక్నోలో జరిగి ఉంటే టీమ్ ఇండియా గెలిచి ఉండేదని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. లక్నోలో మ్యాచ్ జరిగి ఉంటే, టీమిండియాకు విష్ణువు, భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఆశీస్సులు లభించేవని అన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. లక్నోలోని క్రికెట్ స్టేడియానికి సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎకనా స్టేడియం అని పేరు పెట్టింది. విష్ణువు అనేక పేర్లలో ఏకనా ఒకటి. ఆ తర్వాత యోగీ ఆదిత్య నాథ్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆ స్టేడియానికి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ పేరును ఖరారు చేశారు. అహ్మదాబాద్ వేదికగా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. నరేంద్ర మోదీ స్టేడియంలో ఆస్ట్రేలియా-భారత్ తలపడ్డాయి. ఇందులో ఆసిస్ 6 వికెట్ల తేడాతో అలవోకగా విజయం సాధించింది. టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్‌కు చేరిన భారత జట్టు క్రిడాకారులు నిరాశలో మునిగిపోయారు. మ్యాచ్‌కు హాజరైన ప్రధాని మోదీ వారిని ఓదార్చారు. ఇదీ చదవండి: Delhi Pollution Update: ఢిల్లీలో మరికొద్ది రోజుల ఇంతే.. -
CWC 2023 Final: బోల్తా కొట్టించింది పిచ్ వ్యూహమేనా?
2023 ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో వరుసగా 10 మ్యాచ్‌ల్లో గెలుపొంది, అజేయ జట్టుగా నిలిచిన భారత్ ఆఖరి మెట్టుపై బోల్తా పడి మూడోసారి టైటిల్ గెలిచే సువర్ణావకాశాన్ని చేజార్చుకుంది. నాకౌట్ మ్యాచ్‌ల్లో చతికిలపడటం టీమిండియాకు కొత్తేమీ కానప్పటికీ, ఈ దఫా మాత్రం అభిమానులను తీవ్రంగా బాధ పెట్టింది. ఆశలు రేకెత్తించి, ఆఖరి మెట్టుపై ఉసూరుమనిపించడంతో ఫ్యాన్స్ బాధ వర్ణణాతీతంగా ఉంది. ఈ ఓటమి 140 కోట్ల మంది భారతీయులకు గుండె కోత మిగిల్చింది. ఫైనల్లో భారత్ ఓటమికి గల కారణాలు విశ్లేషిస్తూ పలువురు నిపుణులు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఒత్తిడి, టాస్ ఓడిపోవడమే టీమిండియా ఓటమికి ప్రధాన కారణాలని మెజారిటీ శాతం అభిప్రాయపడుతున్నారు. కొందరు మాత్రం పిచ్ విషయంలో బీసీసీఐ చేసిన అతే కొంపముంచిందని అంటున్నారు. తమ పేసర్లు భీకరమైన ఫామ్‌లో ఉన్నప్పుడు నిదానమైన ట్రాక్ రూపొందించడమే పెద్ద తప్పని అభిప్రాయపడుతున్నారు. పిచ్ విషయంలో బీసీసీఐ వ్యూహం బెడిసికొట్టిందని, అదే మనపై ప్రత్యర్ధి పైచేయి సాధించేలా చేసిందని అంటున్నారు. పిచ్ ఎప్పటిలాగే ఉన్నా టీమిండియాకు లబ్ది చేకూరేదే అని అభిప్రాయపడుతున్నారు. మన పేసర్లపై నమ్మకం లేక స్లో పిచ్‌ను తయారు చేశారా అని ప్రశ్నిస్తున్నారు. జట్టు అన్ని విభాగాల్లో (బ్యాటింగ్, స్పిన్ బౌలింగ్, పేస్ బౌలింగ్) పటిష్టంగా ఉన్నప్పుడు నిదానమైన పిచ్‌ను తయారు చేయడంలో అర్ధం లేదని మండిపడుతున్నారు. పిచ్ విషయంలో బీసీసీఐ వ్యూహం మిస్ ఫైర్ అయ్యిందని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కూడా అన్నాడు. పిచ్ స్లోగా ఉండటం, ఆదిలోనే వికెట్లు కోల్పోవడం వల్ల టీమిండియా తీవ్ర ఒత్తిడికి లోనైందని తెలిపాడు. షాట్లు ఆడేందుకు భారత బ్యాటర్లు అష్టకష్టాలు పడ్డారని అభిప్రాయపడ్డాడు. కాగా, అహ్మదాబాద్ పిచ్‌పై గతంలో పరుగుల వరద పారిన విషయం తెలిసిందే. ఇక్కడి రెగ్యులర్ పిచ్‌పై అత్యంత భారీ స్కోర్లు నమోదయ్యాయి. అయితే వరల్డ్‌కప్ ఫైనల్లో రెగ్యులర్ వికెట్ కాకుండా స్లో ట్రాక్‌ను రూపొందించడంతో టీమిండియా పరుగులు చేసేందుకు నానా ఇబ్బందులు పడి స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. అనంతరం ఛేదనలో మంచు ప్రభావం చేత పిచ్ మరింత నిదానంగా మారి, దాదాపు నిర్జీవమైన పిచ్‌గా మారిపోయింది. ఫలితంగా ఆసీస్ బ్యాటర్లు హెడ్, లబూషేన్ క్రీజ్‌లో పాతుకుపోయి తమ జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించారు. -
డ్రెస్సింగ్ రూంలో క్రికెటర్లను ఓదార్చిన మోదీ
అహ్మదాబాద్: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఓటమి తర్వాత తీవ్ర నిరాశలో ఉన్న భారత క్రికెటర్లను ప్రధాని మోదీ ఓదార్చారు. ఓటమి సాధారణమైనది, నిరుత్సాపడకూడదని ప్రోత్సహించారు. టోర్నీలో వరుసగా పది మ్యాచ్‌లు గెలిచిన తీరును గుర్తుచేశారు. దేశమంతా చూస్తోంది.. దయచేసి నవ్వండని కోరారు. అప్పుడప్పుడు ఇలా జరగుతుందని కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి చేతులు పట్టుకుని ఉత్సాహపరిచారు. ఆటగాళ్లు ఒకరినొకరు నిరంతరం ప్రోత్సహించుకోవాలని చెప్పారు. గుజరాతీ అయిన రవీంద్ర జడేజాతో ప్రధాని మోదీ గుజరాతీలో మాట్లాడారు. ఏం బాబు అని పలకరిస్తూ ఇరువురు నవ్వులు కురిపించారు. మహ్మద్ షమీ వద్దకు వచ్చిన మోదీ.. షమీని కౌగిలించుకున్నారు. అద్భుతమైన ఆటతీరు కనబరిచావని మెచ్చుకున్నారు. #WATCH | Prime Minister Narendra Modi met Team India in their dressing room after the ICC World Cup Finals at Narendra Modi Stadium in Ahmedabad, Gujarat on 19th November. The PM spoke to the players and encouraged them for their performance throughout the tournament. (Video:… pic.twitter.com/ZqYIakoIIj — ANI (@ANI) November 21, 2023 అహ్మదాబాద్ వేదికగా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో భారత్ పోరుకు దిగింది. అయితే.. 6 వికెట్ల తేడాతో భారత్‌పై ఆసిస్ అలవోక విజయం సాధించింది. ఓటమిని చవిచూసిన భారత ఆటగాళ్లు నిరుత్సాహంతో మైదానాన్ని వీడారు. కొందరు ఆటగాళ్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. మ్యాచ్‌ను వీక్షించడానికి వెళ్లిన ప్రధాని మోదీ క్రికెటర్లను డ్రస్సింగ్ రూంలో కలిశారు. నిరుత్సాహంలో ఉన్న ఆటగాళ్లను ఓదార్చారు. ఇదీ చదవండి: ద్రవిడ్‌ను కొనసాగిస్తారా లేక సాగనంపుతారా.. టీమిండియా తదుపరి కోచ్ ఎవరు..? -
వరల్డ్ కప్ రాలేదని యువకుడి ఆత్మహత్య
కోల్‌కతా : ఇండియా వరల్డ్ కప్ గెలవలేదన్న బాధను జీర్ణించుకోలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పశ్చిమబెంగాల్లోని బంకురా జిల్లాలో ఈ ఘటన జరిగింది. చీరలు అమ్మే దుకాణంలో పనిచేసే రాహుల్ లోహర్(23) టీమ్ ఇండియాకు వీరాభిమాని. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా ఓటమిని రాహుల్ తట్టుకోలేకపోయాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత రాత్రి 11 గంటలకు రాహుల్ ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడని అతడి బావ ఉత్తమ్ సుర్ తెలిపారు. ఆదివారం రాహుల్ షాప్‌కు వెళ్లలేదని,ప్రొజెక్టర్‌లో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూశాడని ఉత్తమ్ చెప్పాడు. ఆ తర్వాత ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపాడు. విషయం తెలిసిన వెంటనే తాను వెళ్లి రాహుల్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లానని, అప్పటికే అతడు చనిపోయినట్లు డాక్టర్లు చెప్పినట్లు తెలిపాడు. ఇదీచదవండి..వరల్డ్‌కప్ ఫైనల్లో టీమిండియా ఓటమి.. షాహీన్ షా అఫ్రిది పోస్ట్ వైరల్ -
ఆసీస్‌పై ప్రతీకారం తీర్చుకునే అవకాశం
వన్డే వరల్డ్‌కప్ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం టీమిండియాకు అతి త్వరలో రానుంది. స్వదేశంలోనే మరో 3 రోజుల్లో భారత్, ఆసీస్ టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. 5 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో గెలిచి ఆసీస్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని భారత ఆటగాళ్లు భావిస్తున్నారు. ఈ సిరీస్ నవంబర్ 23 నుంచి ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్ వైజాగ్ వేదికగా, రెండో టీ20 నవంబర్ 26న (తిరువనంతపురం), మూడో మ్యాచ్ నవంబర్ 28న (గౌహతి), నాలుగు (నాగ్‌పూర్), ఐదు టీ20లు (హైదరాబాద్) డిసెంబర్ 1, 3 తేదీల్లో జరుగనున్నాయి. కాగా, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో టీమిండియా పోరాడి ఓడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నామమాత్రపు స్కోర్‌కే (240) పరిమితమైనప్పటికీ.. బౌలింగ్‌లో రాణించి చివరి వరకు పోరాడింది. ట్రవిస్ హెడ్ (137) చిరస్మరణీయ శతకంతో ఆసీస్ గెలుపు అంచుల వరకు తీసుకెళ్లాడు. లబూషేన్ (58 నాటౌట్) సహకారంతో భారత్‌కు గెలుపును దూరం చేశాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 192 పరుగలు భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఆసీస్‌ను గెలిపించారు. భారత బౌలర్లలో బుమ్రా, షమీ, సిరాజ్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ (47), విరాట్ కోహ్లి (54), కేఎల్ రాహుల్ (66) ఓ మోస్తరుగా రాణించారు. ఆసీస్ బౌలర్లు స్టార్క్ (3/55), హాజిల్‌వుడ్ (2/60), కమిన్స్ (2/34), మ్యాక్స్‌వెల్ (1/35), జంపా (1/44) కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి టీమిండియా పతనాన్ని శాశించారు. -
CWC 2023: ధోని, పాంటింగ్ సరసన చేరిన కమిన్స్
వన్డే వరల్డ్‌కప్ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా టీమిండియాను ఓడించి ఆరోసారి జగజ్జేతగా నిలిచిన విషయం తెలిసిందే. పాట్ కమిన్స్ కెప్టెన్‌గా తన తొలి వరల్డ్‌కప్ సాధించి, ఓ వినూత్న ఘనత సాధించాడు. పెళ్లైన మరుసటి ఏడాదే వన్డే ప్రపంచకప్ గెలిచిన కెప్టెన్‌గా దిగ్గజాల సరసన చేరాడు. గతంలో రికీ పాంటింగ్ (2003), మహేంద్ర సింగ్ ధోని (2011), ఇయాన్ మోర్గన్లు (2019) పెళ్లైన మరుసటి ఏడాదే ప్రపంచకప్ సాధించిన ఆటగాళ్లుగా అరుదైన గుర్తింపు దక్కించుకున్నారు. తాజాగా కమిన్స్ వీరి సరసన చేరి అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. Who should get married in 2026?🤔 pic.twitter.com/RtVJ8PGUuf — CricTracker (@Cricketracker) November 20, 2023 కాగా, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో టీమిండియా పోరాడి ఓడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నామమాత్రపు స్కోర్‌కే (240) పరిమితమైనప్పటికీ.. బౌలింగ్‌లో రాణించి చివరి వరకు పోరాడింది. ట్రవిస్ హెడ్ (137) చిరస్మరణీయ శతకంతో ఆసీస్ గెలుపు అంచుల వరకు తీసుకెళ్లాడు. లబూషేన్ (58 నాటౌట్) సహకారంతో భారత్‌కు గెలుపును దూరం చేశాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 192 పరుగలు భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఆసీస్‌ను గెలిపించారు. భారత బౌలర్లలో బుమ్రా, షమీ, సిరాజ్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ (47), విరాట్ కోహ్లి (54), కేఎల్ రాహుల్ (66) ఓ మోస్తరుగా రాణించారు. ఆసీస్ బౌలర్లు స్టార్క్ (3/55), హాజిల్‌వుడ్ (2/60), కమిన్స్ (2/34), మ్యాక్స్‌వెల్ (1/35), జంపా (1/44) కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి టీమిండియా పతనాన్ని శాశించారు. -
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్: 51 టెంకాయలు ఆర్డర్.. ‘ఎక్స్’ పోస్ట్ వైరల్!
అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగింది. భారత్ విజయం కోసం కోట్లాది మంది భారతీయులు ఎంతో ఆతృతంగా ఎదురు చూశారు.. అన్ని వర్గాల వారు ఆకాంక్షించారు.. ప్రార్థనలు చేశారు. కానీ అవేవీ ఫలించలేదు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించి వరల్డ్ కప్ కైవసం చేసుకుంది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు వరల్డ్ కప్‌లో భారత్ విజయం సాధించి కప్ గెలిస్తే కొట్టడానికి 51 టెంకాయలను థానేకు చెందిన ఓ వ్యక్తి ఫుడ్‌డెలివరీ యాప్ స్విగ్గీలో ఆర్డర్ చేశారు. ఈ సమాచారాన్ని స్విగ్గీ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘ఎక్స్’ (ట్విటర్) ద్వారా తెలియజేసింది. థానే నుంచి ఎవరో ఇప్పుడే 51 టెంకాయలు ఆర్డర్ చేశారు. బహుశా వరల్డ్ కప్ ఫైనల్ గెలుపు కోసమే అయిఉండచ్చు. అదే నిజమై భారత్‌కు కప్ రావాలని ఆకాంక్షించింది. కాగా స్విగ్గీ పోస్ట్ చేసిన కొద్దిసేపటికే ఈ ఆర్డర్ చేసింది తానే అంటూ ఓ వ్యక్తి స్విగ్గీ పోస్ట్‌ను రీట్వీట్ చేశారు. భారత్ వరల్డ్ కప్ గెలిస్తే కొట్టడానికే టెంకాయలు ఆర్డర్ చేసినట్లు పేర్కొన్నారు. టీవీ ముందు టెంకాయలు ఉంచిన దృశ్యాన్ని ఈ ట్వీట్‌కు జత చేశారు. ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ మారాయి. లక్షల్లో వ్యూవ్స్, కామెంట్లు వచ్చాయి. కాగా ఇదే వ్యక్తి భారత్ విజయాన్ని వ్యక్తీకరించడానికి 240 అగరబత్తులను ఆర్డర్ చేశారు. haan bhay yeh someone from thane bhi mai hi hoon, 51 nariyal for unreal manifestation✨ https://t.co/aNa3WACNOp pic.twitter.com/kVuQ6WjCjH — gordon (@gordonramashray) November 19, 2023 -
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో కలకలం
అహ్మదాబాద్: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో కలకలం రేగింది. మ్యాచ్ జరుగుతుండగా పాలస్తీనాకు మద్దతు తెలుపుతూ ఓ వ్యక్తి మైదానంలోకి దూసుకొచ్చాడు. క్రీజ్‌లో ఉన్న విరాట్ కోహ్లిని కౌగిలించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో మ్యాచ్ కాసేపు నిలిచిపోయింది. దీంతో మ్యాచ్ నిర్వహణలో భద్రతా వైఫల్యంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. #ICCCricketWorldCup | Security breach during the India versus Australia ICC World Cup 2023 Final match, in Ahmedabad after a spectator entered the field (Pics: ANI Photos) pic.twitter.com/AfilmF75sB — ANI (@ANI) November 19, 2023 మైదానంలోకి దూసుకొచ్చిన వ్యక్తి పాలస్తీనాను ప్రతిబింబించే వేషధారణను కలిగి ఉన్నాడు. ఎర్రని షార్ట్ ధరించాడు. తెల్లని టీ షర్ట్ ముందు భాగంలో పాలస్తీనాపై బాంబు దాడులు నిలిపివేయండి అని పేర్కొని ఉంది. టీషర్ట్ వెనుక భాగంలో ఫ్రీ పాలస్తీనా అని రాసి ఉంది. పాలస్తీనా జెండాను ప్రతిబింబించేలా మాస్క్‌ను ధరించాడు. మ్యాచ్ జరుగుతుండగా.. ఎక్కసారిగా మైదానంలోకి దూసుకొచ్చాడు. క్రీజ్ వరకు చేరుకుని విరాట్ కోహ్లిని హత్తుకునే ప్రయత్నం చేశాడు. ఇంతలో రంగంలోకి దిగిన సిబ్బంది అతన్ని పట్టుకుని వెనక్కి తీసుకెళ్లారు. క్రికెట్ వరల్డ్‌కప్‌లో నేడు భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. అహ్మదాబాద్ వేదికగా మొతేరా స్టేడియంలో నేడు భారత్-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్‌ను వీక్షించడానికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. ఇప్పటికే ఐదు వికెట్లు కోల్పోయింది. 37 ఓవర్లకు 182 పరుగులు సాధించింది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం అక్టోబర్ 7న ప్రారంభం అయింది. హమాస్ అంతమే ధ్యేయంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. రాకెట్ దాడుల అనంతరం భూతల యుద్ధం చేపట్టింది. హమాస్ మూకలను మట్టికరిపిస్తూ ఇప్పటికే ఉత్తర గాజాను ఆక్రమించింది. అటు దక్షిణ గాజాను కూడా ఖాలీ చేయాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు చేసింది. అటు అల్-షిఫా ఆస్పత్రిని రక్షణ కవచంగా హమాస్ మూకలు ఉపయోగించుకుంటున్నాయని ఆరోపిస్తూ ఆస్పత్రిపై ఇజ్రాయెల్ సేనలు దాడులు చేస్తున్నాయి. ఇప్పటివరకు జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ వైపు 1,200 మంది మరణించగా.. పాలస్తీనా వైపు 12,500 మంది మరణించారు. ఇందులో 5,000 మంది చిన్నారులు కూడా ఉన్నారు. ఇదీ చదవండి: పాలస్తీనాకు భారత్ రెండోసారి మానవతా సాయం -
వరల్డ్‌కప్ ఫైనల్‌పై శివసేన ఎంపీ తీవ్ర విమర్శలు
World Cup final: ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆతిథ్య భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య హోరాహోరీగా సాగుతోంది. దేశవ్యాప్తంగా కోట్ల మంది ఈ ఫైనల్ మ్యాచ్ సంరంభంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో వరల్డ్ ఫైనల్‌పై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర విమర్శలు చేశారు. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్స్ క్రికెట్ ఈవెంట్ కంటే కూడా బీజేపీ ఈవెంట్‌లా సాగుతోందని సంజయ్ రౌత్ ఆరోపించారు. క్రికెట్ పరిభాషలో బీజేపీపై విమర్శలు గుప్పించారు. "ఈరోజు ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ప్రధాని మోదీ బౌలింగ్, అమిత్ షా బ్యాటింగ్, ఫీల్డింగ్ చేసేలా ఉన్నారు" అని వ్యంగంగా విమర్శించారు. "క్రికెట్లోకి రాజకీయాలు తీసుకురావాల్సిన అవసరం లేదు. కానీ అహ్మదాబాద్‌లో అదే జరుగుతోంది" అని రౌత్ అన్నారు. ఇందులో తనకేమీ ఆశ్చర్యం లేదన్నారు. ప్రధాని మోదీ హాజరవుతున్నారు కాబట్టి భారత్ కచ్చితంగా కప్ గెలవాలని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్‌ను వీక్షించనున్నట్లు శనివారం అధికారిక ప్రకటన విడుదలైన సంగతి తెలిసిందే. -
WC Final: మొతేరా స్టేడియంపై అబ్బురపరిచే ఎయిర్‌షో దృశ్యాలు
అహ్మదాబాద్: క్రికెట్ వరల్డ్‌కప్‌లో నేడు భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. అహ్మదాబాద్ వేదికగా మొతేరా స్టేడియంలో నేడు భారత్-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్‌ను వీక్షించడానికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. ఈ క్రమంలో నరేంద్ర మోదీ స్టేడియంపై ఐఏఎఫ్ సూర్యకిరణ్ బృందం ఎయిర్ షోను ప్రదర్శించింది. ఉత్కంఠభరితమైన దృశ్యాలు ప్రేక్షకులను అబ్బురపరిచాయి. IAF's Suryakiran team performs Aerobatic Show over Narendra Modi Stadium ahead of India vs Australia in the ICC Cricket World Cup 2023 Final pic.twitter.com/CKCjJ5jGCX — DeshGujarat (@DeshGujarat) November 19, 2023 ఇప్పటికే మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా.. మొదట్లోనే కాస్త తడబడింది. ప్రస్తుతం కోహ్లి, రాహుల్ నిలకడగా రాణిస్తున్నారు. క్రికెట్ అభిమానులు టీవీలకు అతుక్కుపోయారు. భారత్ గెలవాలని ఆకాంక్షిస్తున్నారు. టీమిండియా మెరుగ్గా రాణించాలని అభిమానులు పూజలు చేస్తున్నారు. More visuals of the Indian Air Force's air show over Narendra Modi Stadium pic.twitter.com/kXpd2kkJFa — DeshGujarat (@DeshGujarat) November 19, 2023 ఇదీ చదవండి: భారత్ మ్యాచ్ గెలిస్తే చాట్ ఫ్రీ! -
ధనవంతులకు ఫ్రీ పాస్లా..! : హర్ష్ గొయెంకా
న్యూఢిల్లీ: దేశమంతా వరల్డ్ కప్ ఫైనల్ సందడి నడుస్తోంది. సోషల్ మీడియా మొత్తం భారత్-ఆసీస్ మ్యాచ్ ఫీవరే కనిపిస్తోంది. ఈ ఫీవర్ పరిస్థితుల్లో ప్రముఖ పారిశ్రామిక వేత్త, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆర్పీజీ గ్రూప్ అధినేత హర్ష్ గొయెంకా చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. ట్వీట్‌ను నెటిజన్లు ఆయనకే బూమరాంగ్ చేసి రివర్స్ ప్రశ్నలేశారు. ఇంతకీ హర్ష్ గొయెంకా ఏమని ట్వీట్ చేశారంటే ‘ ప్రముఖ వ్యాపారస్తులైన నా స్నేహితులెవరూ డబ్బులు చెల్లించి ఫైనల్ మ్యాచ్ టికెట్లు కొనలేదు. వాళ్లందరూ ఫ్రీ పాస్‌లు తీసుకున్నారు. ఇక్కడ బాధేంటంటే ధనవంతులు డబ్బు చెల్లించడానికి ఇష్టపడకపోవడమే’ అని వ్యాఖ్యానించారు. దీనికి స్పందించిన ఆయన ఫాలోవర్ ఒకతను ‘మరి మీ పరిస్థితేంటి సార్? టికెటా..పాసా..?’ అని ప్రశ్నించారు. దీనికి స్పందించిన హర్ష్ గొయెంకా ఏదీకాదని సమాధానమిచ్చారు. అహ్మదాబాద్‌లో జరుగుతున్న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ టికెట్లు ఒక్కోటి రూ. 2 లక్షల దాకా ప్రముఖ రీసెల్లింగ్ ప్లాట్‌ఫాంలో అమ్ముడవుతున్నాయి. ఈ ప్లాట్‌ఫాంలో టికెట్ స్టార్టింగ్ ధర 32వేలుండడం విశేషం. భారత్, ఆసీస్ మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. None of my businessmen friends have paid to get tickets for the #WorldcupFinal, they have all managed to get a ‘pass’. And that’s where the irony lies- it’s the rich who don’t want to pay! — Harsh Goenka (@hvgoenka) November 18, 2023 How about you, Sir? Ticket or Pass. — Anand Singh (@Anands_page) November 18, 2023 ఇదీచదవండి...‘టీమిండియా గెలిచేవరకూ మెతుకు ముట్టం’ -
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు భారీ భద్రత.. వేల మందితో బందోబస్తు
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో 6,000 మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరిస్తున్నట్లు అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ జీఎస్ మాలిక్ తెలిపారు. ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ గ్రాండ్ ఫినాలేకు హాజరయ్యే ముఖ్య వ్యక్తులలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రధాని రిచర్డ్ మార్లెస్ ఉన్నట్లు ఆయన చెప్పారు. ఇక్కడ విలేకరుల సమావేశంలో జీఎస్ మాలిక్ మాట్లాడుతూ మ్యాచ్ చూడటానికి లక్ష మందికి పైగా ప్రేక్షకులు, అనేక మంది ప్రముఖులు వస్తున్న నేపథ్యంలో గుజరాత్ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ , హోంగార్డులు, ఇతర సిబ్బందితో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ‘ఈ మెగా ఈవెంట్ ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగేలా చూసేందుకు 6,000 మందికి పైగా పోలీసు సిబ్బందిని మోహరిస్తున్నాం. వీరిలో దాదాపు 3,000 మంది స్టేడియం లోపల ఉంటారు. మరికొందరు ఆటగాళ్లు, ప్రముఖులు బస చేస్తున్న హోటళ్లు, ఇతర కీలక ప్రదేశాలలో బందోబస్తు నిర్వహిస్తారు’ అని జీఎస్ మాలిక్ వివరించారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఒక కంపెనీ స్టేడియం లోపల, మరొకటి స్టేడియం వెలుపల మోహరించి ఉంటుందని, నగర పోలీసుల ఆధ్వర్యంలో స్టేడియం లోపల తాత్కాలిక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఐజీ, డీఐజీ ర్యాంకుకు చెందిన నలుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులతో పాటు 23 మంది డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ అధికారులు మ్యాచ్ రోజు సిబ్బందిని పర్యవేక్షిస్తారని జీఎస్ మాలిక్ పేర్కొన్నారు. వీరికి 39 మంది అసిస్టెంట్ కమిషనర్లు, 92 మంది పోలీస్ ఇన్స్పెక్టర్లు సహాయం చేస్తారని వివరించారు. మ్యాచ్‌లో ఏదైనా రసాయన, జీవ, రేడియోలాజికల్, న్యూక్లియర్ (CBRN) అత్యవసర పరిస్థితులు తలెత్తితే వెంటనే స్పందించడానికి, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) బృందాలను కూడా నగరంలో మోహరిస్తామని తెలిపారు. బాంబ్ డిటెక్షన్, డిస్పోజల్ స్క్వాడ్‌కు చెందిన 10 బృందాలతో పాటు రెండు బృందాలు చేతక్ కమాండోస్, ఒక ఎలైట్ యూనిట్‌ను స్టేడియం సమీపంలో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. బాంబ్ బెదిరింపులపై స్పందిస్తూ.. ఎక్కడో బయట దేశాల్లో కూర్చొని ఆకతాయిగా చేసే బెదిరింపులను మీడియా హైలైట్ చేయొద్దని జీఎస్ మాలిక్ కోరారు. -
ఆసీస్‌తో అంత ఈజీ కాదు.. ఏమి చేయాలో మాకు బాగా తెలుసు: రోహిత్ శర్మ
క్రికెట్ అభిమానులు ఏంతో అతృతగా ఎదురు చూస్తున్న వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్ పోరుకు మరి కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా తుది పోరులో భారత్-ఆస్ట్రేలియా జట్లు తాడోపేడో తెల్చుకోనున్నాయి. ఇప్పటికే ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం ఇరు జట్లు తమ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో ఆజేయంగా నిలిచిన భారత జట్టు.. ఫైనల్లో కూడా తమ జోరును కొనసాగించి మరోసారి వరల్డ్ ఛాంపియన్స్‌గా నిలవాలని పట్టుదలతో ఉంది. ఈ ఫైనల్ మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్ మీడియా సమావేశంలో పాల్గోన్నాడు. ఈ ఫైనల్ మ్యాచ్ కోసం అన్ని విధాల సిద్దమైనట్లు రోహిత్ తెలిపాడు. ఏమి చేయాలో మాకు బాగా తెలుసు.. "నేను కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనప్పటి నుంచి ఈ రోజు కోసమే ఎదురు చూశాను. ఈ వరల్డ్‌కప్ కోసం మేము రెండేళ్ల కిందటే సన్నాహాలు ప్రారంభించాము. మూడు ఫార్మాట్లలో మేము ఒక యూనిట్‌గా అద్బుతంగా రాణిస్తున్నాం. జట్టులో ఉన్న ప్రతీ ఒక్కరికి వారి పాత్రపై ఒక క్లారిటీ ఉంది. మూడు ఫార్మాట్లలో ఆటగాళ్ల ప్రదర్శన బట్టి అవకాశాలు ఇస్తూ వస్తున్నాం. ఇప్పటివరకు ఈ టోర్నీలో మేము మెరుగైన ప్రదర్శన కనబరిచాం. రేపు కూడా అదే జోరును కొనసాగిస్తామని ఆశిస్తున్నాను. ఇక ఆస్ట్రేలియాను మేము తేలికగా తీసుకోము. ప్రపంచక్రికెట్లో అత్యుత్తమ జట్లలో ఆస్ట్రేలియా ఒకటి. ఈ టోర్నీలో వరుసగా 8 కి ఎనిమిది మ్యాచ్‌లు గెలిచి ఫైనల్‌కు వచ్చింది. ఆస్ట్రేలియా ఏమి చేయగలదో మాకు తెలుసు. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. అయితే మా ప్రణాళికలు మాకు ఉన్నాయి. వాటిపై మేము దృష్టి పెట్టాలనుకుంటున్నాము. వారి ఫామ్‌ను చూసి మేము ఎటువంటి ఆందోళన చెందడం లేదు. మాపై చాలా అంచనాలు ఉన్నాయి. టోర్నీ స్వదేశంలో జరుగుతుంది కాబట్టి అంతే ఒత్తిడి కూడా ఉంటుంది. కానీ వాటిన్నంటిని తట్టుకుని ఎలా ఆడాలో మాకు బాగా తెలుసు. డ్రెస్సింగ్ రూమ్‌లో కూడా మేము ప్రశాంతమైన వాతావారణం ఏర్పరుచుకున్నామని" రోహిత్ పేర్కొన్నాడు. బౌలర్ల గురించి రోహిత్ శర్మ మాట్లాడుతూ.. "ఈ టోర్నీలో మా బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. మేము తొలి నాలుగు,ఐదు మ్యాచ్‌ల్లో ఛేజింగ్ చేసి విజయం సాధించాం. ప్రత్యర్ధి జట్లను 300 కంటే తక్కువకు పరిమితం చేయడంలో మా బౌలర్లు కీలక పాత్ర పోషించారు. పేసర్లు స్పిన్నర్లు ఇద్దరూ అదరగొట్టారు. మేము టార్గెట్‌ను డిఫెండ్ చేసుకోవడంలోనూ మా బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేశారు. బుమ్రా, షమీ, సిరాజ్ కొత్త బంతితో అద్బుతాలు చేయగా.. మిడిల్ ఓవర్లలో స్నిన్నర్లు కూడా అత్యుత్తమంగా రాణించారు" అని చెప్పుకొచ్చాడు. -
World Cup 2023 Final: బ్యాటింగా.. బౌలింగా? భారత్ టాస్ గెలిస్తే తొలుత ఏమి చేయాలి?
వన్డే ప్రపంచకప్-2023లో తుది సమరానికి మరి కొన్ని గంటల మాత్రమే మిగిలి ఉంది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న ఫైనల్ పోరులో భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే అహ్మబాద్కు చేరుకున్న ఇరు జట్లు ప్రాక్టీస్‌లో మునిగి తేలుతున్నాయి. ఇరు జట్లు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇక ఇది ఇలా ఉండగా.. అహ్మదాబాద్ స్టేడియంలోని పిచ్‌కు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వికెట్‌పైన మ్యాచ్ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ పిచ్‌ను టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హెడ్ కోచ్ ద్రవిడ్‌తో కలిసి పరిశీలించాడు. మరోవైపు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కూడా స్టేడియంకు వచ్చి పిచ్‌ను పరిశీలించి, ఫోటోలను తన ఫోన్లో తీసుకున్నాడు. ఆ తర్వాత వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ,ఆస్ట్రేలియా స్పిన్ బౌలింగ్ కోచ్ డేనియల్ వెట్టోరీ కూడా చాలా సేపు ఈ పిచ్‌ను చెక్ చేశారు. టాస్ గెలిస్తే తొలుత ఏమి చేయాలి..? కాగా ఈ మ్యాచ్‌లో టాస్ మరోసారి కీలకం కానుంది. ఈ తుదిపోరులో టాస్ గెలిచిన జట్టు తొలుత ఏమి చేస్తే బాగుంటుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అయితే సోషల్ మీడియాలో వైరలవుతున్న ఫోటోను బట్టి చూస్తే.. అహ్మదాబాద్ పిచ్‌ను నల్లమట్టితో తాయారు చేసినట్లు కన్పిస్తోంది. ట్రాక్‌పై పెద్దగా గ్రాస్(గడ్డి) కూడా లేదు. కాబట్టి కొత్త బంతితో సీమర్లు పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. అయితే మ్యాచ్ జరిగే సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఎండ ఎక్కువగా ఉంటే మాత్రం పిచ్ బాగా డ్రై అవుతుంది. Captain Pat Cummins inspects the pitch ahead of the final 🔍#CWC23 #INDvAUS pic.twitter.com/ymBAK5o8x6 — ICC (@ICC) November 18, 2023 దీంతో వికెట్ కాస్త హార్డ్‌గా మారి స్పిన్నర్లకు అనూకూలించే ఛాన్స్ ఉంది. ప్లడ్ లైట్ల కింద పిచ్ కాస్త సీమర్లకు అనుకూలించే ఛాన్స్ ఉంది. ఏదైమనప్పటికీ మధ్యాహ్నం పరిస్థితులు బ్యాటింగ్‌కు అనూకూలించే అవకాశమున్నందన.. టాస్ గెలిచిన జట్టు తొలుత బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉంది. చదవండి: World Cup 2023 IND Vs AUS Finals: ఈ సారి వరల్డ్‌కప్ టీమిండియాదే.. ఎలా అంటే? -
వన్డే వరల్డ్‌కప్ ఫైనల్.. ఆ తెలుగు హీరోలందరూ గ్యారంటీగా!
ప్రస్తుతం మన దేశంలో ఎక్కడ చూసినా క్రికెట్ ఫీవరే కనిపిస్తోంది. 2011 తర్వాత వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్‌కి వెళ్లడం, ఇదే ప్రపంచకప్‌లో టోర్నీలో అన్ని మ్యాచులు గెలవడం.. ఇలా చాలా శుభశకునాలు కనిపిస్తున్నాయి. దీంతో కప్ గ్యారంటీ అని అందరూ గట్టిగా నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతిఒక్కరూ మ్యాచ్ కోసం తెగ ఎదురుచూస్తున్నారు. తెలుగు స్టార్ హీరోలు కూడా ఇందులో మినహాయింపు ఏం కాదు. సినిమా-క్రికెట్‌ని విడదీసి చూడలేం. రెండింటికి చాలా మంచి రిలేషన్స్ ఉంటాయి. అందుకు తగ్గట్లే చాలామంది తెలుగు హీరోలకు క్రికెట్ అంటే చాలా ఇష్టం కూడా. ఈ లిస్టులో ఫస్ట్ వెంకటేశ్ ఉంటాడు. ఐపీఎల్ మ్యాచ్‌ల దగ్గర నుంచి ఇండియా మ్యాచ్‌ల వరకు హైదరాబాద్‌లో జరిగే ప్రతి మ్యాచ్‌కి హాజరవుతుంటారు. ఈ వరల్డ్‌కప్‌లో అయితే మొన్నటికి మొన్న జరిగిన సెమీఫైనల్లో సందడి చేశారు. ఇప్పుడు ఫైనల్లో అంతకు మించిన ఎనర్జీతో సందడి చేయడం గ్యారంటీ. (ఇదీ చదవండి: Bigg Boss 7: ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరు ఔట్?) వెంకటేశ్ మాత్రమే కాదు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, కింగ్ నాగార్జున.. వరల్డ్‌కప్ ఫైనల్ చూసేందుకు అహ్మదాబాద్ రాబోతున్నారట. తెలుగు నుంచి ప్రస్తుతానికైతే ఈ ముగ్గురు హీరోల పేర్లు వినిపిస్తున్నాయి. ఆదివారం మ్యాచ్ జరిగే సమయానికి ఈ లిస్టులో ఇంకా చాలామంది చేరుతారు. మిగతా ఇండస్ట్రీల నుంచి చూసుకుంటే బాలీవుడ్ స్టార్స్ ఆల్మోస్ట్ అటెండ్ అయిపోతారు. అందులో నో డౌట్. తమిళ్ నుంచి రజనీకాంత్, కమల్ హాసన్, మలయాళం నుంచి మోహన్ లాల్, హిందీ నుంచి అమితాబ్ బచ్చన్.. మ్యాచ్ కోసం గ్యారంటీగా స్టేడియానికి వస్తారని తెలుస్తోంది. దీనిబట్టి చూస్తే గ్రౌండ్లో టీమిండియా హడావుడి కంటే స్టాండ్స్‌లో స్టార్స్ హీరోల హడావుడే ఎక్కువ ఉండబోతుందనమాట. ఫైనల్ విషయానికొస్తే ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. దీన్ని చూసేందుకు ఇండియా-ఆస్ట్రేలియా ప్రధాన మంత్రులతో పాటు ఇప్పటివరకు వరల్డ్‌కప్ గెలుచుకున్న జట్ల కెప్టెన్స్ కూడా హాజరు కానున్నారట. ఇదిలా ఉండగా.. ఉదయం 7 గంటల నుంచే స్టార్‌స్పోర్ట్స్‌లో లైవ్ కవరేజీ ఉండనుంది. (ఇదీ చదవండి: హీరో ధనుష్ ఇంటికొచ్చిన పోలీసులు? కొడుకు ఆ తప్పు చేయడంతో!) -
Rohit & Cummins WC 2023 Final Poses: సిద్ధమైన మోదీ స్టేడియం.. ట్రోఫీతో కెప్టెన్లు (ఫొటోలు)
-
వరల్డ్‌కప్ తుది పోరు రేపే.. ఫైనల్స్‌లో టీమిండియా ప్రదర్శన ఎలా ఉందంటే?
క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-ఆస్ట్రేలియా ప్రపంచకప్-2023 ఫైనల్‌కు రంగం సిద్దమైంది. అహ్మదాబాద్ వేదికగా మరో 24 గంటల్లో ఈ మెగా టోర్నీ తుది తుది సమరానికి తెరలేవనుంది. పది వరుస విజయాలతో ఊపు మీద ఉన్న టీమిండియా.. ప్రత్యర్ధి ఆస్ట్రేలియాను చిత్తు చేసి మూడోసారి విశ్వవిజేతగా నిలవాలని పట్టుదలతో ఉంది. ఇప్పటికే అహ్మదాబాద్‌కు చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్‌లో మునిగి తేలుతోంది. ఇక వన్డే వరల్డ్‌కప్ టోర్నీల్లో టీమిండియా ఎన్ని సార్లు ఫైనల్లో అడుగు పెట్టింది? ప్రదర్శన ఎలా ఉందో ఓ లుక్కేద్దాం. టీమిండియా ఎన్ని సార్లు ఫైనల్ చేరిందంటే? వన్డే ప్రపంచకప్ టోర్నీ ఫైనల్లో టీమిండియాకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటివరకు ఈ ఏడాదితో కలిపి నాలుగు సార్లు వరల్డ్‌కప్ ఫైనల్లో అడుగుపెట్టింది. 1987 వరల్డ్‌కప్ సెమీస్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి తొలిసారి భారత్ ఫైనల్‌కు చేరింది. అనంతరం 2003 వరల్డ్‌కప్ సెమీస్‌లో కెన్యాను చిత్తు చేసి రెండో సారి ఈ మెగా టోర్నీ ఫైనల్లో భారత్ అడుగుపెట్టింది. ఆ తర్వాత 2011 వరల్డ్‌కప్ టోర్నీలో సెమీస్‌లో దాయాది పాకిస్తాన్‌ను ఓడించి ఫైనల్ బెర్త్‌ను భారత్ ఖరారు చేసింది. ఇక ఈ ఏడాది వరల్డ్‌కప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్‌పై విజయం సాధించిన తుదిపోరుకు అర్హత సాధించిన విషయం తెలిసిందే. కాగా ఈ టోర్నీ కంటే ముందు మూడు సార్లు ఫైనల్‌కు చేరిన టీమిండియా రెండు సార్లు విశ్వవిజేతగా నిలిచింది. కపిల్ డేవిల్స్ అద్బుతం.. 1987 వన్డే వరల్డ్‌కప్‌లో అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన భారత జట్టు.. తొలిసారి ఈ మెగా టోర్నీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఫైనల్‌కు చేరడమే కాకుండా పటిష్ట వెస్టిండీస్‌ను ఓడించి వరల్డ్ ఛాంపియన్స్‌గా కపిల్ దేవ్ సారథ్యంలోని టీమిండియా నిలిచింది. ఈ మ్యాచ్‌లో బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచి భారత్‌కు తొలి ప్రపంచకప్‌ను అందించారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 54.4 ఓవరల్లో కేవలం 183 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో కృష్ణమాచారి శ్రీకాంత్(38) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. అనంతరం 184 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్.. భారత బౌలర్ల దాటికి 140 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమిండియా 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత బౌలర్లలో మదన్ లాల్, మొహిందర్ అమర్నాథ్ తలా మూడు వికెట్లు పడగొట్టి కరేబియన్ల పతనాన్ని శాసించారు. వీరిద్దరితో పాటు సంధు రెండు, బిన్నీ, కపిల్ దేవ్ చెరో వికెట్ సాధించారు. ఆసీస్ చేతిలో ఘోర పరాభావం.. 2003 వరల్డ్‌కప్‌లో సౌరవ్ గంగూలీ సారథ్యంలోని టీమిండియా రన్నరప్‌గా నిలిచింది. జోహన్నెస్‌బర్గ్ వేదికగా ఫైనల్లో 125 పరుగుల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 359 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్(140 నాటౌట్) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. పాంటింగ్‌తో పాటు డామియన్ మార్టిన్(88 నాటౌట్), ఆడమ్ గిల్‌క్రిస్ట్(57) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. భారత బౌలర్లలో హర్భజన్ సింగ్ ఒక్కడే రెండు వికెట్లు సాధించాడు అనంతరం 360 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 234 పరుగులకే ఆలౌటైంది. భారత బ్యాటర్లలో సెహ్వాగ్ ఒక్కడే 81 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 82 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దీంతో రెండో వరల్డ్‌కప్ ఫైనల్‌ను టీమిండియా ఓటమితో ముగించింది. మిస్టర్ కూల్ మాయ.. 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. వాంఖడే వేదికగా జరిగిన ఫైనల్లో శ్రీలంకను చిత్తుచేసిన ధోని సారథ్యంలోని భారత జట్టు.. 28ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ మరోసారి వరల్డ్‌కప్ ట్రోఫిని ముద్దాడింది. ఈ ఫైనల్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 6 వికెట్లకు 274 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాటర్లలో మహేలా జయవర్ధనే (88 బంతుల్లో 103, 13 ఫోర్లు) సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. హర్భజన్ సింగ్ ఒక్క వికెట్ సాధించాడు. అనంతరం 275 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. తొలి ఓవర్ రెండో బంతికే డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (0) డకౌట్ అయ్యాడు. మరికాసేపటికే సచిన్ టెండూల్కర్ (18) అవుటయ్యాడు. దాంతో భారత్ 31 పరుగులకే ఓపెనర్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో విరాట్ కోహ్లి (35)తో జతకట్టిన గౌతం గంభీర్ జట్టును నడిపించాడు. అయితే క్రీజులో నిలదొక్కుకున్న కోహ్లిని దిల్షాన్ పెవిలియన్‌కు పంపాడు. ఈ క్రమంలో ఎవరూ ఊహించని విధంగా యువరాజ్ స్ధానంలో మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్‌కు వచ్చాడు. ధోని క్రీజులోకి వచ్చే సమయానికి భారత్ విజయానికి 170 బంతుల్లో 163 పరుగులు చేయాల్సి ఉంది. గంభీర్, ధోని అద్భుతంగా ఆడుతూ భారత్ ను విజయానికి చేరువ చేశారు. అయితే 97 పరుగులతో సెంచరీకి చేరువలోన్న గౌతం గంభీర్ క్లీన్ బౌల్డయ్యాడు. ఆ తర్వాత ధోని సిక్స్ కొట్టి జట్టును వరల్డ్ ఛాంపియన్స్‌గా నిలిపాడు. -
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నిలిపివేయాలని బెదిరింపులు
అహ్మదాబాద్: ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోమారు బెదిరింపులకు పాల్పడ్డాడు. క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ను నిలిపివేయాలని హెచ్చరిస్తూ ఓ వీడియోను విడుదల చేశాడు. 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లు, 2002 నాటి గుజరాత్ అల్లర్ల గురించి పేర్కొంటూ మతపరంగా ఓ వర్గం ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై భారత్ అభిప్రాయాన్ని కూడా ప్రశ్నించాడు. అమెరికా ఆధారిత నిషేధిత సంస్థ సిక్ ఫర్ జస్టిస్ సంస్థకు గురుపత్వంత్ సింగ్ నాయకునిగా ఉన్నాడు. భారత్‌కు వ్యతిరేకంగా ఈయన హెచ్చరికలు చేయడం ఇదే మొదటి సారి కాదు. ప్రధాని నరేంద్ర మోదీపై హెచ్చరికలు చేస్తూ గత నెలలో కూడా ఓ వీడియోను విడుదల చేశాడు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నుంచి ప్రధాని గుణపాఠం నేర్చుకోవాలని పేర్కొన్నాడు. ఇండియాలో కూడా ఇలాంటి యుద్ధం ప్రారంభమైతుందని బెదిరించాడు. సెప్టెంబరులో భారత్-పాక్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా కూడా పన్నూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇరుదేశాల మధ్య శత్రుత్వాన్ని పోత్రహించే చర్యలకు పాల్పడినందుకు ఆయనపై కేసు కూడా నమోదైంది. అహ్మదాబాద్ వేదికగా క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరగనుంది. ఇండియా-ఆస్ట్రేలియా మధ్య మొతేరా స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌కి దేశ విదేశాల నుంచి ప్రముఖులతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ఉపప్రధాని రిచర్డ్ మార్లెస్ కూడా హాజరవనున్నారు. ఇదీ చదవండి: దక్షిణ గాజాను వీడండి.. పాలస్తీనాకు ఇజ్రాయెల్ హెచ్చరికలు -
CWC 2023: టీమిండియా ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా అంతే!
వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్లో రెండు అత్యుత్తమ జట్లు తలపడటం సంతోషంగా ఉందని భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ అన్నాడు. లీగ్ దశలో అజేయంగా నిలిచిన టీమిండియా సెమీస్‌లో సత్తా చాటిందన్న ఈ మాజీ ఓపెనర్.. పడిలేచిన కెరటంలా ఆస్ట్రేలియా తుదిమెట్టుకు చేరుకున్న తీరు అద్భుతమని ప్రశంసించాడు. ప్రపంచకప్ ఫైనల్ ఆడేందుకు ఈ రెండు జట్లు వందకు వందశాతం అర్హత కలిగినవే అని గావస్కర్ అభిప్రాయపడ్డాడు. అయితే, ఫైనల్లో భారత జట్టు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా భారీ మూల్యం చెల్లించకతప్పదని రోహిత్ సేనను హెచ్చరించాడు. పట్టువదలని విక్రమార్కుల్లా ఆఖరి వరకు పోరాడే ఆటగాళ్లున్న ఆస్ట్రేలియాతో పోటీ అంటే మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. కాగా సొంతగడ్డపై ప్రపంచకప్-2023 టోర్నీలో ఇప్పటి దాకా అపజయమన్నదే ఎరుగని టీమిండియా ఫైనల్లో కంగారూ జట్టుతో పోటీకి సిద్ధమైంది. కాగా ఆరంభ మ్యాచ్‌లలో ఓటమిని చవిచూసిన ఆస్ట్రేలియా.. ఆ తర్వాత వరుస విజయాలతో తుదిపోరుకు అర్హత సాధించింది. ముఖ్యంగా అఫ్గనిస్తాన్‌తో లీగ్ మ్యాచ్‌లో ఓడిపోవడం ఖాయమనుకున్న తరుణంలో.. ఆ జట్టు ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ అజేయ డబుల్ సెంచరీతో.. అనూహ్య విజయం అందించాడు. ఇక సౌతాఫ్రికాతో సెమీ ఫైనల్లో ఓపెనర్ ట్రవిస్ హెడ్ బ్యాట్‌తోనే కాకుండా బంతితోనూ మెరిసి గెలుపులో కీలక పాత్ర పోషించాడు. కీలక సమయాల్లో ఇలా ఎవరో ఒకరు అద్భుత ఆట తీరుతో గట్టెక్కించి ఆస్ట్రేలియాను ఇక్కడి దాకా తీసుకువచ్చారు. ఈ క్రమంలో ఇప్పటికే ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ఆసీస్.. ఆరో టైటిల్‌ను ఖాతాలో వేసుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ ఇండియా టుడే మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘టీమిండియా అద్భుతంగా ఆడుతోంది కాబట్టే టైటిల్ ఫేవరెట్‌గా ఉంది. కానీ ఆస్ట్రేలియన్లు అంత తేలికగ్గా తలవంచేవాళ్లు రకం కాదు. గ్లెన్ మాక్స్వెల్ ఆరోజు ఎలా ఆడాడో చూశాం కదా! ఆఖరి వరకు పట్టుదలగా నిలబడి జట్టును గెలిపించుకున్నాడు. దేశం కోసం గెలవాలన్న కసి వారిలో ఎంతగా ఉంటుందో మరోసారి నిరూపించాడు. కాబట్టి ఆసీస్‌ను తక్కువగా అంచనా వేస్తే భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుంది’’ అని సునిల్ గావస్కర్ ఇండియా టుడేతో వ్యాఖ్యానించాడు. కాగా అహ్మదాబాద్ వేదికగా ఆదివారం టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. -
CWC 2023 Final: ఆకాశనంటుతున్న ధరలు.. హోటల్ గదికే రూ. 2 లక్షలు!
క్రికెట్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన తరుణం రానే వచ్చింది. మరికొన్ని గంటల్లో వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్ జరుగనుంది. తుదిపోరులో పటిష్ట టీమిండియా- మేటి జట్టు ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇరవై ఏళ్ల తర్వాత టీమిండియా- ఆసీస్‌లు మరోసారి ప్రపంచకప్ ఫైనల్లో తలపడటం మరో విశేషం. ఈ నేపథ్యంలో దారులన్నీ అహ్మదాబాద్ వైపే సాగుతున్నాయి. దీంతో వ్యాపార వర్గాలు వరల్డ్‌కప్ ఫీవర్‌ను క్యాష్ చేసుకునే పనిలో పడ్డాయి. విమాన టిక్కెట్ల ధరలతో పాటు హోటల్ గదుల రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. సాధారణంగా అహ్మదాబాద్‌లో సాదాసీదా డార్మెటరీ, మోస్తరు గదులున్న హోటళ్లలో రేట్లు కేవలం రూ.1000, మహా అయితే రూ. 3000 ఉండేవి. కానీ... క్రికెట్ అభిమానుల తాకిడి నేపథ్యంలో ఈ రేట్లు అమాంతం రూ. 20 వేలు, నుంచి 50 వేలకు పెరిగిపోయాయి. ఏసీ, లగ్జరీ సదుపాయాలంటే ఆ రేటు ఇక చెప్పాల్సిన పనేలేదు. లక్షకు అటు ఇటుగానే ఉండనుంది. అలాగే అత్యంత పరిమితంగా 5000 అటు ఇటుగా ఉన్న త్రీస్టార్, ఫైవ్‌స్టార్ హోటళ్లలో బస చేయాలంటే రూ. 2 లక్షలదాకా వెచ్చిం చాల్సిందే. నిజం చెప్పాలంటే ఫైనల్ జరుగుతుంది ముంబైలో కాదు... అహ్మదాబాద్‌లో కాబట్టి చిన్నా, చితక హోటళ్లు, డార్మెటరీ బెడ్లు అన్నీ కలుపుకున్నా 10 వేలకు మించవు. కాబట్టే రేట్లు రాకెట్లలా దూసుకెళ్తున్నాయి. అదీ సంగతి.. మరి క్రికెట్ వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌ను నేరుగా వీక్షించాలంటే జేబుకు ఆ మాత్రం చిల్లుపడాల్సిందే అంటారా?! ఈ విషయం గురించి గుజరాత్ ఫెడరేషన్ ఆఫ్ హోటల్, రెస్టారెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేంద్ర సోమాని పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘వరల్డ్‌కప్ ఫీవర్ కేవలం ఇండియాకే పరిమితం కాదు కదా! దుబాయ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా వంటి విదేశాల నుంచి కూడా అభిమానులు ఇక్కడికి వస్తున్నారు. అహ్మదాబాద్‌లో త్రీ స్టార్, ఫైవ్ స్టార్ హోటల్స్‌లో కలిపి దాదాపు 5 వేల గదులు అందుబాటులో ఉన్నాయి. చిన్నాచితకా హోటళ్లన్నీ కలుపుకొని మొత్తం 10 వేల వరకు ఉంటాయి. మరి నరేంద్ర మోదీ స్టేడియంలో సీట్ల సామర్థ్యమేమో లక్షా ఇరవై వేల వరకు ఉంటుంది. కాబట్టే పరిస్థితి ఇలా ఉంది’’ అని పేర్కొన్నారు. View this post on Instagram A post shared by ICC (@icc) -
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు ప్రధాని మోదీ
అహ్మదాబాద్: క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌కు అహ్మదాబాద్ వైదికైంది. ఈ మ్యాచ్‌ను చూడటానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ హాజరు కానున్నారు. మ్యాచ్‌ను వీక్షించడానికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు రానున్న నేపథ్యంంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. మ్యాచ్ నిర్వహణకు కావాల్సిన భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. మ్యాచ్ సజావుగా సాగేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను అధికారులు సమీక్షించారు. మ్యాచ్ సందర్భంగా మొత్తం 4,500 మంది సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. అభిమానులకు ఇబ్బంది కలగకుండా నరేంద్ర మోదీ స్టేడియం వైపు మెట్రో రైళ్ల సంఖ్యను పెంచినట్లు పేర్కొన్నారు. భారత వైమానిక దళానికి చెందిన సూర్య కిరణ్ ఏరోబాటిక్ బృందం మ్యాచ్‌కు ముందు పది నిమిషాల పాటు ఎయిర్ షోను నిర్వహించనున్నారు. మిడ్-ఇన్నింగ్స్‌లో కంపోజర్ ప్రీతమ్ ప్రదర్శనతో సహా అనేక ఈవెంట్లు నిర్వహించనున్నారు. వింగ్ కమాండర్ సిదేశ్ కార్తిక్ నేతృత్వంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన తొమ్మిది విమానాలు వైమానిక ప్రదర్శన నిర్వహిస్తాయి. మ్యాచ్ టాస్ వేసిన తర్వాత నరేంద్ర మోడీ స్టేడియం పైన ఎయిర్ షో ప్రదర్శిస్తాయి. ఇప్పటివరకు ప్రపంచ వరల్డ్‌కప్‌లలో విజయం సాధించిన జట్ల కెప్టెన్లందర్ని బీసీసీఐ సత్కరించనుంది. సంగీత స్వరకర్త ప్రీతమ్ లైవ్ షో నిర్వహించనున్నారు. 500 కంటే ఎక్కువ మంది డ్యాన్సర్లతో ఈ ప్రదర్శన జరగనుంది. మ్యాచ్ సందర్భంగా స్డేడియం విద్యుత్ వెలుగులతో మెరిసిపోనుంది. ఇందుకోసం యూకే నుంచి ప్రత్యేక టెక్నాలజీని తీసుకొచ్చారు. ఇదీ చదవండి: జై షాకు క్షమాపణలు చెప్పిన శ్రీలంక ప్రభుత్వం.. -
CWC 2023: అటెన్షన్ ప్లీజ్! అహ్మదాబాద్‌కు విమానంలో అయితే అర లక్ష!
యువర్ అటెన్షన్ ప్లీజ్! అహ్మదాబాద్ వెళ్లవలసిన రోడ్డు, రైలు, ఆకాశ మార్గాలన్నీ కిక్కిరిసి ఉన్నాయి. ఇందులో ఏది ఎక్కినా చుక్కలు చూడటం ఖాయం. తినాలనుకుంటే రేట్లు చూసిన వెంటనే కడుపు నిండిపోయే ‘మెనూ’లున్నాయి. బస చేయాలంటే సాధారణ హోటళ్లలోనే వేల రూపాయలు, స్టార్ హోటళ్లలో రూ. లక్షలు... ఫైనల్ ఆట కంటే ముందే ‘హాట్ హాట్’ టాపిక్‌లయ్యాయి. అహ్మదాబాద్: తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. కానీ యావత్ దేశం మాత్రం భారత క్రికెట్ జట్టు వన్డే ప్రపంచకప్ టైటిల్ పోరాటాన్ని చూసేందుకు ఇప్పటి నుంచే సిద్ధమైపోతోంది. ప్రయాణ టికెట్లు వేలకు వేలైనా ... తినుబండారాలు ఖరీదైనా... హోటల్ గదులు ఎన్ని వేల రూపాయలైనా సరే భారత అభిమానులు మాత్రం ‘తగ్గేదేలే’ అంటున్నారు. లక్ష పైచిలుకు మంది ప్రత్యక్షంగా చూసే నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం జరిగే ఫైనల్ కోసం ఖర్చులు బారెడైనా... కళ్లు కాయలు కట్టుకొని మరీ చూసేందుకు ఎదురు చూస్తున్నారు.ఆ్రస్టేలియా రూపంలో గట్టి ప్రత్యర్థి ఎదురైనా... 2003 ఫైనల్ బూచీ వెంబడిస్తున్నా... టీమిండియా అజేయ జైత్రయాత్రపైనే అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. మూడు రోజుల క్రితం న్యూజిలాండ్ జట్టుపై గత ప్రపంచ కప్ సెమీఫైనల్ ప్రతీకారాన్ని తీర్చుకున్న భారత్... 20 ఏళ్ల క్రితం ఆ్రస్టేలియా చేతిలో ఎదురైన ఫైనల్ ఓటమి ప్రతీకారాన్ని కూడా తీర్చుకుంటుందని సగటు అభిమానులంతా ఆశిస్తున్నారు. విమానం ఎక్కితే... అహ్మదాబాద్ వెళ్లే విమానం ఎక్కితే దేశంలో ఎక్కడి నుంచైనా దాదాపు రూ. 5 వేల నుంచి 9 వేల లోపే ఉంటుంది. నెలముందు బుక్ చేసుకుంటే సగం రూ. 3 వేల లోపే అందుబాటులో ఉంటాయి. కొన్ని సంస్థ ప్రొమో కోడ్లతో 500 వందలైనా తగ్గేవి. కానీ అలా చూసుకుంటే రూ. 2500 టిక్కెట్ ధర ఇప్పుడు ఏకంగా రూ. 25 నుంచి 35 వేల మధ్యకు పెరిగింది. ఇది నిన్నటి (శుక్రవారం) ధరలు. శనివారం బుక్ చేసుకుంటే మాత్రం అర లక్షయినా ఆశ్చర్యం కలుగక మానదు. పలు విమానయాన సంస్థలు ఆ రూట్లో ప్రత్యేకంగా ఫ్లైట్లు అందుబాటు లో పెడుతున్నా అవేవీ ప్రయాణికుల రద్దీని తట్టుకో లేకపోతున్నాయని టికెట్ ఏజెంట్స్ చెబుతున్నారు. విన్యాసాలకు రిహార్సల్స్ భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ ఫైనల్‌కు ముందు పది నిమిషాల పాటు ఎయిర్ షోతో కనువిందు చేయనుంది. ఇందుకోసం శుక్రవారం ఈ టీమ్ స్టేడియంపై వైమానిక విన్యాసాలను రిహార్సల్స్ చేసింది. -
ఆస్ట్రేలియాతో ఫైనల్ పోరు.. అహ్మదాబాద్‌కు చేరుకున్న టీమిండియా! వీడియో వైరల్
వన్డే వరల్డ్‌కప్-2023 ట్రోఫీని ముద్దాడేందుకు టీమిండియా అడుగుదూరంలో నిలిచింది. నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఫైనల్ పోరులో ఆస్ట్రేలియాతో అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమైంది. తుది పోరులో ఆస్ట్రేలియాను చిత్తు చేసి ముచ్చటగా మూడో సారి టైటిల్‌ను సొంతం చేసుకోవాలని భారత జట్టు వ్యహాలు రచిస్తోంది. ఈ క్రమంలో ఫైనల్ మ్యాచ్ కోసం భారత జట్టు అహ్మదాబాద్‌లో అడుగుపెట్టింది. గురువారం రాత్రి ముంబై నుంచి ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్‌కు చేరకుకుంది. అహ్మదాబాద్‌కు చేరుకున్న భారత జట్టుకు ఘన స్వాగతం లభించింది. జట్టు బస చేయనున్న హోటల్ సిబ్బంది భారత ఆటగాళ్లకు నుదుట తిలకం దిద్ది మరీ స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు.. ఆల్ ది బెస్ట్ టీమిండియా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అహ్మదాబాద్‌కు చేరుకున్న భారత జట్టు శుక్రవారం సాయంత్రం తమ ప్రాక్టీస్ సెషన్లో పాల్గోనుంది. చదవండి: ఆసీస్‌ను ఒత్తిడిలోకి నెట్టాం.. మాకూ విజయావకాశాలు వచ్చాయి: సౌతాఫ్రికా కెప్టెన్ A beautiful welcome of team India in Ahmedabad. pic.twitter.com/Qh4lGHHp5c — Mufaddal Vohra (@mufaddal_vohra) November 16, 2023 -
7 వికెట్లతో చెలరేగిన షమీ.. కివీస్‌పై గ్రాండ్ విక్టరీ! ఫైనల్లో టీమిండియా
వన్డేప్రపంచకప్-2023 ఫైనల్లో టీమిండియా అడుగుపెట్టింది. వాంఖడే వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ను 70 పరుగుల తేడాతో ఓడించిన భారత్.. ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. వరల్డ్‌కప్ 398 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటైంది. కివీస్ బ్యాటర్లలో డార్లీ మిచెల్(134) విరోచిత శతకంతో పోరాడినప్పటికీ.. తన జట్టును ఫైనల్‌కు చేర్చలేకపోయాడు. మిచెల్‌తో పాటు కెప్టెన్ కేన్ విలియమ్సన్(69) పర్వాలేదన్పించాడు. 7 వికెట్లతో చెలరేగిన షమీ.. భారత బౌలర్లలో మహ్మద్ షమీ అద్భుమైన ప్రదర్శన కనబరిచాడు. ఏకంగా 7 వికెట్లు పడగొట్టి కివీస్ పతనాన్ని శాసించాడు. ఓవరాల్‌గా 9.5 ఓవర్లు వేసిన షమీ.. 57 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. షమీ ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. మొదటిలో ఓపెనర్లను ఔట్ చేసి కివీస్‌ను ఒత్తిడిలోకి నెట్టిన షమీ.. అనంతరం సెకెండ్ స్పెల్‌లో విలియమ్సన్‌ను ఔట్ చేసి మలుపు తిప్పాడు. ఇక షమీతో పాటు బుమ్రా, సిరాజ్, కుల్దీప్ యాదవ్ ఒక్క వికెట్ సాధించారు. కాగా అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 397 పరుగులు సాధించింది. రోహిత్ శర్మ(47) సూపర్ ఇన్నింగ్స్‌కు తోడు మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ అర్ధ శతకం(80-నాటౌట్)తో రాణించాడు. ఇక విరాట్ కోహ్లి(117) రికార్డు సెంచరీతో కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించగా.. శ్రేయస్ అయ్యర్(105) తనదైన శైలిలో చెలరేగి శతకం బాదాడు. ఇక న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీకి మూడు, ట్రెంట్ బౌల్ట్‌కు ఒక వికెట్ దక్కింది. కాగా వరల్డ్‌కప్ నాకౌట్స్‌లో తొలిసారి న్యూజిలాండ్‌ను భారత్ ఓడించింది. 2019 వరల్డ్‌కప్‌లో సెమీఫైనల్స్‌లో ఓటమికి భారత్ బదులు తీర్చుకోంది. చదవండి: పాకిస్తాన్ టీ20 కెప్టెన్‌గా షాహీన్ అఫ్రిది.. టెస్టు సారధి ఎవరంటే? -
ఏసీఏ వల్లే ఆటగాళ్ల అద్భుత రాణింపు
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) ప్రోత్సాహంతోనే ఏపీ ఆటగాళ్లు రాణించి.. జాతీయ స్థాయిలో అవకాశాలు పొందుతున్నారని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ అన్నారు. ఏసీఏ 70 వసంతాల వేడుకలు సోమవారం విశాఖపట్నంలోని వైఎస్సార్ స్టేడియంలోని ప్రధాన కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్టేడియంలో ఏర్పాటు చేసిన పైలాన్‌ను బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ ఆవిష్కరించారు. అనంతరం రోజర్ బిన్నీ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం ఏపీలో క్రికెటర్లకు అవసరమైన మౌలిక వసతులు, గ్రౌండ్లు, అకాడమీలు పెరుగుతున్నాయి. మరో పదేళ్లలో ఢిల్లీ, ముంబైతో పోటీపడే స్థాయికి రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధి చెందుతోంది. తొలిసారిగా 1975లో రంజీ మ్యాచ్ ఆడేందుకు విశాఖ వచ్చాను. ఇప్పుడు విశాఖపట్నం ఎంతో అభివృద్ధి చెందింది. ఏపీలో మాదిరిగా అన్ని రాష్ట్రాల్లోనూ క్రీడలకు తగిన మౌలిక వసతులు కల్పించి.. క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరముంది. అప్పుడే భారత్‌లో క్రీడాభివృద్ధి సాధ్యపడుతుంది. బీసీసీఐ తరఫున స్కూల్ స్థాయి నుంచే ప్రొఫెషనల్ క్రికెటర్లను తయారు చేసేందుకు కృషి చేస్తున్నాం. ఈ ప్రక్రియ ఐదు రాష్ట్రాల్లో ముందంజలో ఉండగా.. ఇప్పుడు ఆంధ్ర చేరింది’ అని అన్నారు. ఐపీఎల్‌తో అద్భుత అవకాశాలు.. క్రికెట్ ఆడే దేశాల్లో నిర్వహిస్తున్న ప్రీమియర్ లీగ్స్ అన్నింటిలో.. ఐపీఎల్‌కున్న క్రేజ్ ప్రత్యేకమైనదని రోజర్ బిన్నీ చెప్పారు. ఆ స్టాండర్డ్స్‌ను కాపాడాలంటే.. ఐపీఎల్లో పాల్గొనే ప్రాంచైజీల నియంత్రణ చాలా అవసరమన్నారు. అందుకే ఐపీఎల్లో మరో కొత్త ఫ్రాంచైజీకి అవకాశం ఇవ్వడం లేదని చెప్పారు. ఆ రోజుల్లో మూడు దశల్లో రాణించిన వారికి జాతీయ జట్టులో అవకాశం వచ్చేదని.. కానీ ఇప్పుడు ఐపీఎల్ తరహా ప్లాట్‌ఫాంలతో మెరుగైన ప్రొఫెషనల్ క్రికెటర్‌గా మారేందుకు అవకాశం ఏర్పడిందని పేర్కొన్నారు.మహిళల క్రికెట్‌ను బాగా ప్రోత్సహిస్తున్నామని.. వరల్డ్‌కప్ ఫైనల్‌కు చేరడమే ఇందుకు నిదర్శనమన్నారు. టీమిండియా మాజీ క్రికెటర్, కోచ్ మదన్‌లాల్ మాట్లాడుతూ.. మహిళా క్రికెట్ అభివృద్ధికి ఏసీఏ ఎంతో కృషి చేస్తోందని ప్రశంసించారు. ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారికి ప్రీమియర్ లీగ్ నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ కార్యదర్శి ఎస్ఆర్ గోపినాథరెడ్డి, ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు పి.రోహిత్‌రెడ్డి, ఏసీఏ పూర్వ కార్యదర్శి చాముండేశ్వర్‌నాథ్, అపెక్స్ కౌన్సిల్ సభ్యులు, సీఈఓ శివారెడ్డి, వీడీసీఏ వర్కింగ్ ప్రెసిడెంట్ విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
అప్పుడే నాకు తెలియకుండా నా ఫోటోలు తీశారు! ఇంకా ఎన్నో గెలవాలి!
బాకు (అజర్బైజాన్): ప్రపంచకప్‌లో ఫైనల్ చేరిన సంచలనం సృష్టించిన భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద ప్రదర్శనపై అతని తల్లి నాగలక్ష్మి సంతోషం వ్యక్తం చేసింది. అతని కెరీర్ ఆరంభం నుంచి అన్నింటా తోడుగా ఉంటూ వచ్చిన నాగలక్ష్మి వరల్డ్ కప్‌లోనూ ప్రజ్ఞానంద వెన్నంటే నిలిచింది. అతను ఫైనల్ చేరడంతో పాటు క్యాండిడేట్స్ టోర్నీకి కూడా అర్హత సాధించడం గొప్పగా అనిపిస్తోందన్న ఆమె... తన కొడుకు ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని వ్యాఖ్యానించింది. ‘‘ప్రపంచకప్‌లో ప్రజ్ఞానంద ఫైనల్ వరకు రావడం చాలా సంతోషంగా ఉంది. పైగా క్యాండిడేట్స్‌కు అర్హత సాధించడం దానిని రెట్టింపు చేసింది. అతను మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలి. అర్జున్‌తో క్వార్టర్ ఫైనల్ జరుగుతున్నప్పుడు ప్రజ్ఞ ఏం చేస్తున్నాడనే ఉత్కంఠతోనే అలా చూస్తూ ఉండిపోయాను. అప్పుడే నాకు తెలియకుండా కొందరు నా ఫోటోలు తీశారు. అవే జనంలోకి వెళ్లాయి. చివరకు ఆ మ్యాచ్‌లో మా అబ్బాయి గెలిచాడు’ అని నాగలక్ష్మి గుర్తు చేసుకుంది. -
T20 WC: ఆసీస్‌పై ఇంగ్లండ్ విజయం.. ఫైనల్లో టీమిండియాతో పోరు
ICC Under 19 Womens T20 World Cup 2023 - పోష్‌స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా): అండర్-19 టీ20 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్ మూడు పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. ఆదివారం జరిగే ఫైనల్లో భారత్‌తో పోరుకు సిద్ధమైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ గ్రేస్ స్రివెన్స్ 20, అలెక్సా స్టోన్‌హౌజ్ 25 మాత్రమే 20కి పైగా పరుగులు స్కోరు చేశారు. దీంతో 19.5 ఓవర్లలో 99 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాను ఇంగ్లండ్ బౌలర్లు దెబ్బకొట్టారు. హన్నా బేకర్ మూడు, గ్రేస్ స్రివెన్స్ రెండు, జోసీ గ్రోవ్స్, రియానా, ఎలీ ఆండర్సన్, అలెక్సా స్టోన్‌హౌజ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. దీంతో 96 పరగులకే ఆలౌట్ అయిన ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. హన్నా బేకర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. చరిత్రకు అడుగుదూరంలో ఆసీస్ బ్యాటర్లలో క్లేర్ మూరే 20, అమీ స్మిత్ 26 పరుగులతో రాణించగా.. మిగతా వాళ్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం అయ్యారు. ఇప్పటి వరకు భారత మహిళల క్రికెట్ జట్టు ఏ ఫార్మాట్లోనైనా విశ్వవిజేతగా నిలువలేకపోయింది. వన్డే ప్రపంచకప్‌లో రెండుసార్లు రన్నరప్‌గా, టి20 ప్రపంచకప్‌లో ఒకసారి రన్నరప్‌గా నిలిచింది. అయితే సీనియర్లకు సాధ్యంకాని ఘనతను సాధించేందుకు భారత జూనియర్ మహిళల జట్టు విజయం దూరంలో నిలిచింది. తొలిసారి నిర్వహిస్తున్న అండర్–19 టి20 ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్ చేరింది. శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 107 పరుగులు సాధించింది. భారత లెగ్ స్పిన్నర్ పార్శవి చోప్రా (3/20) కివీస్‌ను కట్టడి చేసింది. టిటాస్ సాధు, మన్నత్, షఫాలీ, అర్చన దేవి ఒక్కో వికెట్ తీశారు. అనంతరం భారత్ 14.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసి గెలిచింది. శ్వేత సెహ్రావత్ (45 బంతుల్లో 61 నాటౌట్; 10 ఫోర్లు) అజేయ అర్ధ సెంచరీ చేసింది. సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది. చదవండి: Washington Sundar: స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిసిన సుందర్.. IND Vs NZ: తొలి టి20లో టీమిండియా ఓటమి.. -
నేడే ప్రపంచకప్ ఫుట్‌బాల్ ఫైనల్.. అర్జెంటీనాతో అమీతుమీ తేల్చుకోనున్న ఫ్రాన్స్
దోహా: ఎనిమిదేళ్ల క్రితం ప్రపంచకప్ అందినట్టే అంది చేజారిన క్షణం ఇప్పటికీ అర్జెంటీనా కెప్టెన్ లయనెల్ మెస్సీకి గుర్తుండే ఉంటుంది. ఎనిమిదేళ్ల తర్వాత ప్రపంచకప్‌ను ముద్దాడే అవకాశం మళ్లీ మెస్సీ ముంగిట వచ్చింది. ఈరోజు జరిగే ప్రపంచకప్ ఫైనల్ తన అంతర్జాతీయ కెరీర్లో అర్జెంటీనా తరఫున చివరి మ్యాచ్ కాబోతుందని ఇప్పటికే ప్రకటించిన 35 ఏళ్ల మెస్సీ ఈ తుది సమరాన్ని చిరస్మరణీయం చేసుకోవాలని పట్టుదలతో ఉన్నాడు. పేరుకు అర్జెంటీనా–ఫ్రాన్స్ జట్ల మధ్య సాకర్ ప్రపంచకప్ ఫైనల్ అంటున్నా... దీనిని మెస్సీ, ఫ్రాన్స్ మధ్య పోరుగానే అభివర్ణించాల్సి ఉంటుంది. తటస్థ అభిమానులందరూ అర్జెంటీనా గెలిచి మెస్సీ తన కెరీర్‌ను ఘనంగా ముగించాలని కోరుకుంటున్నా... అత్యంత పటిష్టంగా ఉన్న ఫ్రాన్స్ మెస్సీ కల కలగానే మిగిలిపోవాలనే లక్ష్యంతో పోరాటం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అంతా తానై... టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకటిగా ఖతర్‌కు వచ్చిన అర్జెంటీనాకు తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో అనూహ్య ఓటమి ఎదురైంది. దాంతో మెస్సీపైనే కాకుండా అర్జెంటీనా జట్టు సత్తాపై అందరికీ సందేహం కలిగింది. అయితే కెప్టెన్‌గా మెస్సీ రెండో మ్యాచ్ నుంచి అంతా తానై జట్టును ముందుండి నడిపించాడు. మెరుపు కదలికలతో ప్రత్యర్థి డిఫెండర్లను బోల్తా కొట్టిస్తూ ఐదు గోల్స్ చేయడంతోపాటు సహచరులు గోల్స్ చేయడానికి తోడ్పడ్డాడు. ముఖ్యంగా క్రొయేషియాతో జరిగిన సెమీఫైనల్లో మెస్సీ విశ్వరూపం ప్రదర్శించాడు. ఆ మ్యాచ్‌లో మెస్సీ మ్యాజిక్‌తోనే అర్జెంటీనా మూడో గోల్ చేయగలిగింది. క్రొయేషియా డిఫెండర్ గ్వార్డియోల్ ఎంత వెంటపడ్డా మెస్సీ తన పాదరసంలాంటి కదలికలతో అతడిని తప్పిస్తూ సహచరుడు అల్వారెజ్‌కు అందించిన పాస్, క్షణాల్లో నమోదైన గోల్‌ను ఎప్పటికీ మర్చిపోలేము. అయితే ఫ్రాన్స్‌తో జరిగే ఫైనల్‌ను అర్జెంటీనా కెప్టెన్ మెస్సీతోపాటు అతడి సహచరులు తేలిగ్గా తీసుకునే అవకాశం లేదు. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఆడినా తమ నుంచి ట్రోఫీ మరోసారి చేజారిపోతుందని అర్జెంటీనాకు తెలుసు. మెస్సీతోపాటు ఈ టోర్నీలో నాలుగు గోల్స్ చేసిన అల్వారెజ్, ఎంజెల్ డి మారియా, రోడ్రిగో డి పాల్, ఎంజో ఫెర్నాండెజ్, గోల్‌కీపర్ మార్టినెజ్ రాణించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అర్జెంటీనా ఆద్యంతం పకడ్బందీగా ఆడి ట్రోఫీని అందుకుంటుందా లేక ఆఖరి మెట్టుపై తడబడి నాలుగోసారి ట్రోఫీని చేజార్చుకుంటుందో మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. ఎంబాపె ఒక్కడే కాదు... అర్జెంటీనా విజయావకాశాలు మెస్సీ ఆటపై ఆధారపడి ఉండగా... ఫ్రాన్స్ మాత్రం ఒకరిద్దరిపై ఆధారపడకుండా సమష్టి ఆటతో ఫైనల్‌కు చేరుకుంది. 23 ఏళ్ల కిలియాన్ ఎంబాపె ఐదు గోల్స్‌తో అదరగొట్టగా... 36 ఏళ్ల ఒలివియర్ జిరూడ్ నాలుగు గోల్స్‌తో మెరిపించాడు. థియో హెర్నాండెజ్, చువమెని, రాన్‌డల్, రాబియోట్ ఒక్కో గోల్ చేయగా... గ్రీజ్మన్ గోల్స్ చేయకున్నా సహచరులు గోల్స్ చేయడానికి తోడ్పడ్డాడు. గోల్‌కీపర్, కెప్టెన్ హుగో లోరిస్ ఏకంగా 53 సార్లు గోల్స్ కాకుండా అడ్డుగోడలా నిలబడ్డాడు. 1998లో తొలిసారి విశ్వవిజేతగా నిలిచిన ఫ్రాన్స్ జట్టులో సభ్యుడిగా ఉన్న దీదీర్ డెషాంప్స్... కోచ్‌గా మారి 2018లో ఫ్రాన్స్‌కు రెండోసారి ప్రపంచ కప్‌ను అందించాడు. ఈ నేపథ్యంలో అత్యంత పటిష్టంగా కనిపిస్తున్న ఫ్రాన్స్ జట్టుకు మరోసారి గెలవాలంటే ఎలా ఆడాలో తెలుసు కాబట్టి నేటి ఆఖరి సమరం రంజుగా సాగుతుందని కచ్చితంగా చెప్పవచ్చు. 6: అర్జెంటీనాకిది ఆరో ప్రపంచకప్ ఫైనల్. 1978, 1986లలో విజేతగా నిలిచిన అర్జెంటీనా 1930, 1990, 2014లలో రన్నరప్‌గా నిలిచింది. నేటి ఫైనల్లో అర్జెంటీనా ఓడిపోతే అత్యధిక సార్లు ఫైనల్లో ఓడిపోయిన జట్టుగా జర్మనీ (4 సార్లు) పేరిట ఉన్న రికార్డును సమం చేస్తుంది. 4: ఫ్రాన్స్ జట్టుకిది నాలుగో ప్రపంచకప్ ఫైనల్. 1998, 2018లలో టైటిల్ నెగ్గిన ఫ్రాన్స్ 2006లో రన్నరప్‌గా నిలిచింది. 3: నేటి ఫైనల్లో ఫ్రాన్స్ గెలిస్తే ఇటలీ (1930, 1934), బ్రెజిల్ (1958, 1962) జట్ల తర్వాత వరుసగా రెండుసార్లు ప్రపంచకప్ గెలిచిన మూడోజట్టుగా చరిత్ర సృష్టిస్తుంది. 4: ప్రపంచకప్ చరిత్రలో ఫ్రాన్స్, అర్జెంటీనా జట్ల మధ్య జరగనున్న నాలుగో మ్యాచ్ ఇది. 1930లో అర్జెంటీనా 1–0తో... 1978లో అర్జెంటీనా 2–1తో ఫ్రాన్స్‌పై గెలిచింది. 2018 ప్రిక్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ 4–3తో అర్జెంటీనాను ఓడించింది. 10: దక్షిణ అమెరికా జట్లతో జరిగిన గత 10 ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో ఫ్రాన్స్ ఓడిపోలేదు. ఆరు మ్యాచ్‌ల్లో గెలిచి, నాలుగు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకుంది. చివరిసారి దక్షిణ అమెరికా జట్టు చేతిలో ఫ్రాన్స్ ఓడిపోవడం 1978లో (అర్జెంటీనా చేతిలో 1–2తో) జరిగింది. 11: దక్షిణ అమెరికా, యూరోప్ ఖండాలకు చెందిన దేశాల మధ్య జరగనున్న 11వ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఇది. ఏడుసార్లు దక్షిణ అమెరికా జట్లకు టైటిల్ లభించగా... మూడుసార్లు యూరోప్ జట్ల ఖాతాలో టైటిల్ చేరింది. -
WC: 2012లో వెస్టిండీస్ అలా.. 2022లో పాకిస్తాన్ ఇలా! విండీస్ గెలిస్తే.. పాక్ మాత్రం
T20 World Cup: 2012 Winner West Indies- 2022 Winner England: వరల్డ్‌కప్ ఫైనల్ ఈసారి ‘టై’ కాలేదు... సూపర్ ఓవర్లు కూడా సమం కాలేదు... క్రీడా స్ఫూర్తిని ప్రశ్నించడానికి, సగం గెలుపు అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేయడానికి ఇంగ్లండ్ అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు అలాంటి చర్చే రాకుండా అద్భుత ఆటతో అందరికంటే శిఖరాన నిలిచింది. టోర్నీ ఆరంభంలో వర్షం తమ అవకాశాలను దెబ్బకొట్టినా, ఒక్కసారిగా పుంజుకొని మ్యాచ్‌లు వానపాలైన వేదికపైనే విశ్వ విజేతగా ఆవిర్భవించింది. వన్డే, టి20 వరల్డ్‌కప్‌లు రెండూ ఒకే సమయంలో తమ వద్ద కలిగి ఉన్న తొలి జట్టుగా చరిత్రకెక్కింది. మూడేళ్ల క్రితం వన్డే వరల్డ్‌కప్ గెలిచినా వివాదం వెంట తీసుకొచ్చి ఆనందం కాస్త మసకబారగా... అంతకుముందే ఆరేళ్ల క్రితం టి20 వరల్డ్‌కప్ ఆఖరి మెట్టుపై అనూహ్య రీతిలో ఓడింది. వాటిని మరిచేలా తాజా విజయం పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇంగ్లండ్ ఆధిపత్యాన్ని చూపించింది. వరల్డ్‌కప్ ఫైనల్ పోరులో 8 ఫోర్లు, 2 సిక్సర్లు... తొలుత బ్యాటింగ్ చేస్తూ.. పాకిస్తాన్ చూపిన పేలవ బ్యాటింగ్ ఇది... టి20ల్లో చివరి నాలుగు ఓవర్లంటే బౌలర్లకు డెత్ ఓవర్లు! కానీ పాక్ దానిని రివర్స్‌గా మార్చింది. ఆఖరి 4 ఓవర్లలో కనీసం 40 పరుగులు చేస్తే విజయంపై ఆశలు ఉంచుకోగలిగే చోట 18 పరుగులకే పరిమితమైంది. ముగింపు స్కోరుతోనే పాక్ ఓటమికి పునాది పడింది. టోర్నీ ఆసాంతం చెలరేగిన స్యామ్ కరన్ బౌలింగ్ పదును ముందు పాక్ తేలిపోయింది. 2012 ఫైనల్లో కూడా విండీస్ 137 పరుగులే చేసి విజేతగా నిలిచిన తీరు గుర్తుకొచ్చిందేమో... పాక్‌లో కాస్త ఆశలు పెరిగాయి! పైగా తొలి ఓవర్లోనే హేల్స్ అవుట్ కావడం, మెల్బోర్న్ మైదానం మొత్తం హోరెత్తిపోవడం ఆ జట్టును మరింత ఉత్సాహపరచింది. మధ్య ఓవర్లలో ప్రత్యర్థిని పాక్ కట్టడి కూడా చేయగలిగింది కూడా. అయితే పాక్ ఆశించినట్లుగా 1992 పునరావృతం కాలేదు. బెన్ స్టోక్స్ వారి ఆశలపై నీళ్లు చల్లాడు. 43 మ్యాచ్‌ల టి20 కెరీర్లో తన తొలి అర్ధసెంచరీ చేసేందుకు అతను సరైన సమయాన్ని ఎంచుకున్నట్లున్నాడు. చివరి వరకూ నిలబడి మరోసారి తన చేతుల మీదుగా ఇంగ్లండ్‌ను వరల్డ్‌కప్ చాంపియన్‌గా నిలిపాడు. 2012లో వెస్టిండీస్ అలా విజేతగా.. శ్రీలంక వేదికగా కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో టీ20 ప్రపంచకప్-2012 ఫైనల్లో వెస్టిండీస్ ఆతిథ్య శ్రీలంకతో తలపడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు ఆరంభంలోనే ఓపెనర్లు జాన్సన్ చార్ల్స్(0), క్రిస్ గేల్ (3) వికెట్లు కోల్పోయినా.. వన్‌డౌన్ బ్యాటర్ మార్లన్ సామ్యూల్స్ 56 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 78 పరుగులు సాధించాడు. మిగిలిన వాళ్లలో డ్వేన్ బ్రావో 19, కెప్టెన్ డారెన్ సామీ 26(నాటౌట్) పరుగులు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి సామీ బృందం 137 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంకకు ఓపెనర్ మహేల జయవర్దనే 33 పరుగులతో శుభారంభం అందించగా.. మరో ఓపెనర్ తిలకరత్నె దిల్షాన్ డకౌట్ అయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కుమార్ సంగక్కర 22 పరుగులు చేయగా.. నువాన్ కులశేఖర 26 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాటర్ల స్కోరు కనీసం ఐదు పరుగులు కూడా దాటకుండా విండీస్ బౌలర్లు కట్టడి చేశారు. దీంతో18.4 ఓవర్లలో 101 పరుగులకే లంక ఆలౌట్ అయింది. నాడు అదరగొట్టిన విండీస్ బౌలర్లు వెస్టిండీస్ బౌలర్లలో సునిల్ నరైన్ 3.4 ఓవర్లలో 9 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు కూల్చగా.. సామీ రెండు ఓవర్లలో 6 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. సామ్యూల్ బద్రీకి ఒకటి, రవి రాంపాల్‌కు ఒకటి, మార్లన్ సామ్యూల్స్‌కు ఒక వికెట్ దక్కాయి. ఆల్‌రౌండ్ ప్రతిభతో మార్లన్ సామ్యూల్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. 2022లో ఇంగ్లండ్ చేతిలో పాకిస్తాన్ ఇలా టి20 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఆదివారం మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. షాన్ మసూద్ (28 బంతుల్లో 38; 2 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా, కెప్టెన్ బాబర్ ఆజమ్ (28 బంతుల్లో 32; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్యామ్ కరన్ (3/12) పాక్‌ను పడగొట్టగా... ఆదిల్ రషీద్, జోర్డాన్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం ఇంగ్లండ్ 19 ఓవర్లలో 5 వికెట్లకు 138 పరుగులు చేసి గెలిచింది. బెన్ స్టోక్స్ (49 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో చివరి వరకు నిలిచి జట్టును గెలిపించాడు. 6 మ్యాచ్‌లలో 11.38 సగటు, 6.52 ఎకానమీతో 13 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ టైటిల్ విజయంలో కీలకపాత్ర పోషించిన స్యామ్ కరన్ ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా కూడా నిలిచాడు. అంతా విఫలం... ఓపెనర్లు బాబర్, రిజ్వాన్ (15) పాక్‌కు దూకుడైన ఆరంభం ఇవ్వడంలో విఫలమయ్యారు. తొలి నాలుగు ఓవర్లలో ఆ జట్టు ఒకే ఒక బౌండరీ (సిక్స్) కొట్టగా, తర్వాతి ఓవర్లో రిజ్వాన్ వెనుదిరిగాడు. పవర్‌ప్లేలో స్కోరు 39 పరుగులకు చేరింది. ధాటిగా ఆడగల హారిస్ (8)ను రషీద్ తన తొలి బంతికే అవుట్ చేయగా, 10 ఓవర్లు ముగిసేసరికి జట్టు 68 పరుగులు చేసింది. ఇందులో మూడు ఫోర్లే ఉన్నాయి! లివింగ్‌స్టోన్ ఓవర్లో 4, 6తో మసూద్ జోరును పెంచే ప్రయత్నం చేయగా, బాబర్‌ను చక్కటి రిటర్న్ క్యాచ్‌తో అవుట్ చేసి రషీద్ మళ్లీ దెబ్బ కొట్టాడు. ఇఫ్తికార్ (0) కూడా చేతులెత్తేయడంతో పాక్ కష్టాలు మరింత పెరిగాయి. ఇంగ్లండ్ పదునైన బౌలింగ్‌లో తీవ్రంగా ఇబ్బంది పడిన పాక్ బ్యాటర్లు భారీ షాట్లు ఆడటంలో పూర్తిగా విఫలమయ్యారు. డెత్ ఓవర్లలో జట్టు పరిస్థితి మరీ ఘోరంగా కనిపించింది. చివరి 4 ఓవర్లలో పాక్ కేవలం 18 పరుగులు మాత్రమే జోడించి ఓవర్‌కు ఒక వికెట్ చొప్పున 4 వికెట్లు కోల్పోయింది. దాంతో కనీస స్కోరును కూడా సాధించలేక పాక్ ఇన్నింగ్స్ ముగించింది. హేల్స్ విఫలం... ఛేదనలో ఇంగ్లండ్ కూడా గొప్పగా ఆడలేదు. అయితే లక్ష్యం బాగా చిన్నది కావడంతో జాగ్రత్తగా, తగిన ప్రణాళికతో ఆ జట్టు విజయాన్నందుకుంది. తొలి ఓవర్లోనే ప్రమాదకరమైన హేల్స్ (1)ను షాహిన్ అఫ్రిది అవుట్ చేయగా, జోస్ బట్లర్ (17 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్) ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఆపై నసీమ్ తొలి ఓవర్లోనే ఇంగ్లండ్ మూడు ఫోర్లతో ఎదురుదాడి చేసింది. రవూఫ్ తన రెండు వరుస ఓవర్లలో సాల్ట్ (10), బట్లర్‌లను అవుట్ చేయడంతో పవర్‌ప్లే ముగిసేసరికి ఇంగ్లండ్ స్కోరు 49/3 వద్ద నిలిచింది. ఈ దశలో పాక్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లండ్ బ్యాటర్లు పరుగుల కోసం తీవ్రంగా శ్రమించారు. బౌండరీలు రావడం కష్టంగా మారిపోయింది. ఒకదశలో వరుసగా 31 బంతుల పాటు ఇంగ్లండ్ బౌండరీ కొట్టలేకపోయింది! అయితే స్టోక్స్ మాత్రం పట్టుదలగా నిలబడ్డాడు. హ్యారీ బ్రూక్ (23 బంతుల్లో 20; 1 ఫోర్) అవుటైనా... సింగిల్స్‌తోనే పరుగులు రాబడుతూ తన వికెట్ మాత్రం అప్పగించకుండా జాగ్రత్త పడ్డాడు. గాయంతో అఫ్రిది అర్ధాంతరంగా తప్పుకోవడంతో ఆ ఓవర్ పూర్తి చేసేందుకు ఇఫ్తికార్ రాగా వరుసగా 4, 6 బాదాడు. 24 బంతుల్లో 28 పరుగులు చేయాల్సిన దశలో వసీమ్ వేసిన 17వ ఓవర్లో మొయిన్ అలీ (12 బంతుల్లో 19; 3 ఫోర్లు) 3 ఫోర్లు కొట్టడంతో పని సులువైంది. వసీమ్ వేసిన 19వ ఓవర్లో నాలుగో బంతికి ఫోర్‌తో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న స్టోక్స్... చివరి బంతిని మిడ్ వికెట్ దిశగా సింగిల్ తీసి ఇంగ్లండ్‌ను వరల్డ్ చాంపియన్‌గా నిలిపాడు. చదవండి: T20 WC 2022 Final: అఫ్రిది గాయపడకుంటే టైటిల్ గెలిచేవాళ్లం: పాక్ కెప్టెన్ టీ20 వరల్డ్‌కప్-2022 అత్యుత్తమ జట్టులో ఇద్దరు టీమిండియా క్రికెటర్లు View this post on Instagram A post shared by ICC (@icc) -
T20 WC 2022 Final: అఫ్రిది గాయపడకుంటే కథ వేరేలా ఉండేది: పాక్ కెప్టెన్
టీ20 వరల్డ్‌కప్-2022 ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో పరాజయం అనంతరం, పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. పాక్ ఓటమికి షాహీన్ అఫ్రిది గాయపడటమే ప్రధాన కారణమని, పరాభవాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు. అఫ్రిది గాయపడినప్పటికీ, తమ బౌలర్లు అసాధారణ పోరాటపటిమ కనబర్చారని, ప్రపంచంలోనే తమ బౌలింగ్ విభాగం అత్యుత్తమమైందని గొప్పలు పోయాడు. బ్యాటింగ్‌లో మరో 20 పరుగులు చేసి ఉంటే, కథ వేరేలా ఉండేదంటూ ఓటమి బాధలో పిచ్చి వాగుడు వాగాడు. వెంటనే టాపిక్ డైవర్ట్ చేస్తూ.. ఇంగ్లండ్ ఛాంపియన్ జట్టులా ఆడింది, వారు విజయానికి అర్హులు అంటూ లేని పరిణితిని ప్రదర్శించాడు. ప్రపంచకప్‌లో ఫైనల్ వరకు సాగిన మా జర్నీ అద్భుతమని, అంతిమ పోరులో శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ, విజయం తమకు దక్కలేదని ఫైనల్ మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించాడు. కాగా, ఇంగ్లండ్ జట్టు 30 బంతుల్లో 41 పరుగులు చేయాల్సిన దశలో అఫ్రిది మోకాలి గాయం కారణంగా మైదానాన్ని వీడాడు. అఫ్రిది గాయం తీవ్రమైంది కావడంతో అతను తిరిగి బరిలోకి దిగలేకపోయాడు. అప్పటికి అతను ఇంకా రెండు ఓవర్లు వేయాల్సి ఉండింది. ఒకవేళ అఫ్రిది బరిలో ఉంటే, పరిస్థితి ఎలా ఉండేదో చెప్పలేని పరిస్థితి. ఇదిలా ఉంటే, మెల్బోర్న్ వేదికగా నిన్న (నవంబర్ 13) జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్.. పాకిస్తాన్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. బ్యాటర్లు ఘోరంగా విఫలం కావడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లు సామ్ కర్రన్ 3 వికెట్లు, ఆదిల్ రషీద్, క్రిస్ జోర్డన్ తలో 2 వికెట్లు, స్టోక్స్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. 45 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్నప్పటికీ, బెన్ స్టోక్స్ (52) అజేయమైన అర్ధసెంచరీతో రాణించి జట్టును విజయతీరాలకు చేర్చడంతో పాటు ఇంగ్లండ్‌ను రెండోసారి జగజ్జేతగా నిలబెట్టాడు. చదవండి: మొయిన్ అలీ, రషీద్ విషయంలో బట్లర్ పెద్ద మనసు -
అప్పుడు వన్డే ప్రపంచకప్.. ఇప్పుడు టీ20 వరల్డ్‌కప్! హీరో ఒక్కడే
టీ20 ప్రపంచకప్-2022 ట్రోఫీని ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. మెల్బోర్న్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఇంగ్లండ్.. రెండో టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. 138 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 5 వికెట్లు కోల్పోయి చేధించింది. స్టోక్స్ ఆల్‌రౌండ్ షో ఇంగ్లండ్ విజయంలో ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ కీలక పాత్ర పోషించాడు. తొలుత బౌలింగ్‌లో కీలక వికెట్ పడగొట్టిన స్టోక్స్.. అనంతరం బ్యాటింగ్‌లో 52 పరుగులతో అఖరి వరకు నిలిచి జట్టును జగజ్జేతగా నిలిపాడు. పవర్ ప్లేలో మూడు కీలక వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను స్టోక్స్ అదుకున్నాడు. హ్యారీ బ్రూక్‌తో కలిసి కీలక బాగస్వామ్యం నెలకొల్పాడు. అనంతరం బ్రూక్ ఔటైనప్పటికీ.. స్టోక్స్ మాత్రం ఎక్కడ పాక్ బౌలర్లకు అవకాశం ఇవ్వలేదు. అఖరికి విన్నింగ్ రన్స్ కూడా స్టోక్స్ బ్యాట్ నుంచే వచ్చాయి. 2019 వన్డే ప్రపంచకప్‌లో.. 2019 వన్డే ప్రపంచకప్‌ను ఇంగ్లండ్ కైవసం చేసుకోవడంలోనూ బెన్ స్టోక్స్ కీలక పాత్ర పోషించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో 84 పరుగులు చేసిన స్టోక్స్.. జట్టుకు తొలి ప్రపంచకప్ టైటిల్‌ను అందించాడు. ఈ మ్యాచ్‌లో కూడా స్టోక్స్ ఆఖరి వరకు ఆజేయంగా నిలిచాడు. అయితే మ్యాచ్ డ్రా కావడంతో సూపర్ ఓవర్ నిర్వహించారు. సూపర్ ఓవర్ కూడా డ్రా కావడంతో.. బౌండరీల సంఖ్య ఆధారంగా ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించారు. సూపర్ ఓవర్లో కూడా మూడు బంతులు ఎదుర్కొన్న స్టోక్స్ 8 పరుగులు సాధించాడు. View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: T20 WC 2022 Winner Prize Money: ఛాంపియన్ ఇంగ్లండ్‌కు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే..? భారత్‌కు మరి! -
వరల్డ్‌కప్ గెలవడం కంటే, టీమిండియాను ఓడించడమే ముఖ్యం: పాక్ వైస్ కెప్టెన్
టీ20 వరల్డ్‌కప్-2022 చివరి అంకానికి చేరుకుంది. మెల్బోర్న్లో ఇవాళ (నవంబర్ 13) ఇంగ్లండ్-పాకిస్తాన్ జట్లు టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ వైస్ కెప్టెన్, ఆ జట్టు కీలక ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమకు వరల్డ్‌కప్ గెలవడం కంటే టీమిండియాను ఓడించామా లేదా అన్నదే ముఖ్యమంటూ బిల్డప్ మాటలు మాట్లాడాడు. వరల్డ్‌కప్ గెలిచామా లేదా అన్నది పాక్‌లో ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరని, తమ దేశీయులు ఇండియాపై గెలిస్తే చాలనుకుంటారని స్కై స్పోర్ట్స్ ఛానల్లో నాస్సర్ హుసేన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా వ్యాఖ్యానించాడు. పాక్ ప్రజల ఈ ఆకాంక్ష తమపై సహజంగానే ఒత్తిడి పెంచుతుందని, ఈ క్రమంలోనే పలు సందర్భాల్లో టీమిండియా చేతిలో ఓడామని అన్నాడు. ప్రస్తుత వరల్డ్‌కప్ సూపర్-12 దశలో టీమిండియా చేతిలో ఓటమిపై షాదాబ్ స్పందిస్తూ.. మాకు తెలుసు టీమిండియా కంటే తమదే ఉత్తమమమైన జట్టు అని, అయితే ఆఖర్లో తడబడటం వల్లే ఓటమిపాలయ్యామని తెలిపాడు. భారత్‌తో సమరం అంటే, మాపై ఎంత ఒత్తిడి ఉంటుందో, వారిపై కూడా అదే స్థాయిలో ఒత్తిడి ఉంటుందని అన్నాడు. ప్రస్తుతానికి ఇంగ్లండ్‌తో జరుగబోయే ఫైనల్ పైనే తమ దృష్టి అంతా ఉందని, టీమిండియాతో మ్యాచ్‌కు ముందు ఎలాంటి ప్రెజర్ ఉంటుందో, ఈ మ్యాచ్‌కు ముందు కూడా అలాంటి ఫీలింగే కలుగుతుందని పేర్కొన్నాడు. ఏదిఏమైనప్పటికీ ఏమాత్రం ఆశలు లేని స్థాయి నుంచి ఫైనల్ దాకా వచ్చిన మేము తప్పకుండా వరల్డ్‌కప్‌తోనే ఇంటికి వెళ్తామంటూ ధీమా వ్యక్తం చేశాడు. కాగా, పాక్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఇవాళ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. చదవండి: T20 World Cup 2022: ఆఖరి పోరాటం -
PAK Vs ENG: ఇంగ్లండ్- పాక్ ఫైనల్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దు అయితే?
టీ20 ప్రపంచకప్-2022 తుది సమరానికి సమయం అసన్నమైంది. ఆదివారం(నవంబర్ 13)న మెల్బోర్న్ వేదికగా ఫైనల్ పోరులో పాకిస్తాన్- ఇంగ్లండ్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి పాక్ ఫైనల్లో అడుగు పెట్టగా.. రెండో సెమీఫైనల్లో భారత్‌పై ఘన విజయం సాధించి ఇంగ్లండ్ ఫైనల్‌కు చేరుకుంది. అయితే ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించే అవకాశం ఉంది. మ్యాచ్ జరిగే సమయంలో 95 శాతం కురిసే అవకాశం ఉందని బ్యూరో ఆఫ్ మెట్రాలజీ వెల్లడించింది. "ఆదివారం మేఘావృతమై ఉంటుంది. మ్యాచ్ జరిగే సమయంలో 95 శాతం భారీ వర్షం పడే అవకాశం ఉంది. ఉదయం సమయంలో గంటకు 25 నుంచి 40 కిమీ వేగంతో గాలులు వీస్తాయి" అని బ్యూరో ఆఫ్ మెట్రాలజీ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఫైనల్ రద్దు అయితే? కాగా సెమీఫైనల్‌కు,ఫైనల్‌కు రిజర్వ్‌డేను ఐసీసీ కేటాయించింది. కాబట్టి ఒక వేళ ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించి, ఆదివారం ఆట సాధ్యపడకపోతే.. మ్యాచ్ నిలిచిపోయిన దగ్గరి నుంచి రిజర్వ్ డే(సోమవారం)లో కొనసాగిస్తారు. ఒకవేళ రిజర్వ్ డేలో కూడా వర్షం కారణంగా ఆట సాధ్యపడకపోతే మ్యాచ్‌ను రద్దు చేసి ఇరు జట్లను విజేతగా ప్రకటిస్తారు. చదవండి: Kohli Emotional Post: మా కల నేరవేరలేదు.. చాలా బాధగా ఉంది! కోహ్లి భావోద్వేగం -
వరల్డ్ కప్ ఫైనల్ ఆ టీమ్స్ మధ్యే మిథాలీ రాజ్ సంచలన కామెంట్స్
-
ICC Women's World Cup 2022: భారీ విజయం.. ఓటమన్నదే ఎరుగదు.. జగజ్జేతగా ఆస్ట్రేలియా
ICC Women's World Cup 2022 Winner Australia: ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్-2022 విజేతగా ఆస్ట్రేలియా జట్టు నిలిచింది. న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను మట్టి కరిపించి జగజ్జేతగా అవతరించింది. డిఫెండింగ్ చాంపియన్‌ను 71 పరుగుల భారీ తేడాతో ఓడించి ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది. ఈ టోర్నీలో ఓటమన్నదే ఎరుగని మెగ్ లానింగ్ బృందం అజేయ రికార్డును కొనసాగిస్తూ టైటిల్‌ను సొంతం చేసుకుంది. అలిస్సా హేలీ విధ్వంసం టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు ఓపెనర్లు రాచెల్ హేన్స్(93 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 68 పరుగులు), అలిస్సా హేలీ(138 బంతుల్లో 26 ఫోర్ల సాయంతో 170 పరుగులు) ఘనమైన ఆరంభం అందించారు. View this post on Instagram A post shared by ICC (@icc) స్టార్ బ్యాటర్ బెత్‌మూనీ సైతం అర్ధ సెంచరీ(47 బంతుల్లోనే 62 పరుగులు) సాధించింది. ఇక హేలీ అవుటైన తర్వాత ఇంగ్లండ్ వరుసగా వికెట్లు తీసినా ఫలితం లేకుండా పోయింది. హేలీ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 356 పరుగులు సాధించింది. View this post on Instagram A post shared by ICC (@icc) ఆదిలోనే గట్టి షాక్.. అయినా ఆమె ఒక్కతే భారీ లక్ష్యంతో బరిలోని దిగిన ఇంగ్లండ్‌కు ఆసీస్ బౌలర్ మేగన్ షట్ ఆరంభంలోనే గట్టిషాకిచ్చింది. ఓపెనర్లు టామీ బీమౌంట్(27), డానియెల్ వ్యాట్(4) వికెట్లు కూల్చి మానసికంగా వారిని దెబ్బకొట్టింది. View this post on Instagram A post shared by ICC (@icc) అయితే వరుసగా వికెట్లు పడుతున్నా ఇంగ్లండ్ బ్యాటర్ నటాలీ సీవర్ ఏమాత్రం ధైర్యం కోల్పోలేదు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఆమె 121 బంతులు ఎదుర్కొని 148 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచింది. అయితే, మరో ఎండ్ నుంచి సహకారం అందకపోవడంతో నటాలీ ఒంటరి పోరాటం వృథా అయింది. 43.4 ఓవర్లలో 285 పరుగులు మాత్రమే చేసి ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియా ఏడోసారి విశ్వవిజేతగా అవతరించింది. ఇక ఆసీస్‌కు టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించిన అలిస్సా హేలీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. View this post on Instagram A post shared by ICC (@icc) ఐసీసీ మహిళా ప్రపంచకప్-2022 ఫైనల్ విజేత ఆస్ట్రేలియా ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా స్కోర్లు ఆసీస్- 356/5 (50) ఇంగ్లండ్- 285 (43.4) -
T20 World Cup 2021 Final Nz Vs Aus: ఈసారి ఎవరు గెలిచినా..
T20 World Cup 2021 Final New Zealand Vs Australia: ‘ట్రాన్స్ టాస్మన్’ జట్లు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఫైనల్ చేరడంతో టి20 ప్రపంచ కప్‌లో కొత్త జట్టు చాంపియన్‌గా నిలవడం ఖాయమైంది. ఆస్ట్రేలియా ఐదు సార్లు వన్డే వరల్డ్ కప్ సాధించినా 2007నుంచి టి20 వరల్డ్ కప్ ఆ టీమ్‌ను ఊరిస్తూనే ఉంది. 2010లో ఫైనల్ చేరిన ఆసీస్...తుది పోరులో ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైంది. మరో వైపు న్యూజిలాండ్‌కు టి20 ప్రపంచ కప్‌లో ఇదే తొలి ఫైనల్. 2015, 2019 వన్డే వరల్డ్ కప్‌లలో ఫైనల్ చేరినా... ఓటమికి పరిమితమైన కివీస్ తొలి ప్రపంచ కప్ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకోవాలని పట్టుదలగా ఉంది. జూన్‌లోనే టెస్టు వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన విలియమ్సన్ సేన ఐదు నెలల వ్యవధిలో మరో ఫార్మాట్లో విజేతగా నిలిస్తే అది గొప్ప ఘనతగా భావించవచ్చు! ఇక తొలి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ ఇంగ్లండ్‌ను.. రెండో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా పాకిస్తాన్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. దాయాది జట్లు రెండూ కూడా ప్రత్యర్థులను ఐదు వికెట్ల తేడాతో ఓడించి మరీ తుది పోరుకు అర్హత సాధించడం విశేషం. సెమీ ఫైనల్ స్కోర్లు: ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్ ఇంగ్లండ్- 166/4 (20) న్యూజిలాండ్- 167/5 (19) ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ పాకిస్తాన్- 176/4 (20) ఆస్ట్రేలియా- 177/5 (19) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: T20 World Cup: గెలిచింది మన జట్టే కదా.. మనోడే కదా -
మిస్టరీ : అసలు ఆరోజు ఏం జరిగింది?
ప్రపంచ క్రికెట్లో విజయాలు, వైఫల్యాలే కాదు... వివాదాలు, వ్యాఖ్యలు, నిషేధాలు, శిక్షలు కొత్త కాదు. సుదీర్ఘ చరిత్ర గల ఆటలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. కానీ వీటన్నింటికీ భిన్నంగా ఒక విషాదం క్రికెట్‌ను విస్తుపోయేలా చేసింది. వెస్టిండీస్‌లో 2007 వన్డే ప్రపంచకప్ జరుగుతున్న సమయంలో నాటి పాకిస్తాన్ కోచ్ బాబ్ ఊమర్ అనూహ్య మరణం సంచలనం రేపింది. సుదీర్ఘ విచారణ తర్వాత కూడా చావుకు కారణాన్ని పోలీసులు చెప్పలేకపోవడం మరింత బాధాకరం. ఒక మెగా ఈవెంట్ సాగుతున్నప్పుడు జరిగిన ఘటన అసలు నిజాలు వెలుగు చూడకుండా ‘మిస్టరీ’గానే మిగిలిపోయింది. మార్చి 18, 2007... పాకిస్తాన్ క్రికెట్ జట్టు కోచ్ బాబ్ ఊమర్ మరణించిన రోజు. జమైకాలోని కింగ్‌స్టన్‌లో తన హోటల్ గదిలో తెల్లవారుజామున ఊమర్ అచేతనంగా పడి ఉండటాన్ని హోటల్ సిబ్బంది గుర్తించడంతో విషయం బయటపడింది. ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లినా అప్పటికే ఆలస్యమైపోయింది. ఆయన గుండెపోటుతో చనిపోయారని ప్రకటించారు. అంతకుముందు రోజే పసికూన ఐర్లాండ్ చేతిలో లీగ్ మ్యాచ్‌లో ఓడిన పాకిస్తాన్ జట్టు వరల్డ్‌కప్ నుంచి నిష్క్రమించింది. బహుశా ఆ ఓటమిని ఆయన కాస్త సీరియస్‌గా తీసుకున్నారని అంతా అనుకున్నారు. హత్య కేసుగా దర్యాప్తు... కథ అంతటితో ముగిసిపోలేదు. నాలుగు రోజుల తర్వాత జమైకా పోలీసులు ‘గొంతు పిసకడం వల్ల ఊపిరాడక’ ఊమర్ చనిపోయారని ప్రకటించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆ తర్వాతి నుంచి ఊమర్ మరణంపై దర్యాప్తు సినిమాను తలపించే రీతిలో ఒక క్రైమ్ స్టోరీ తరహాలో సాగింది. క్రికెట్ ప్రపంచం తాజా పరిణామంతో నివ్వెరపోయింది. పాకిస్తాన్ మ్యాచ్ ఓటమికి, కోచ్ హత్యకు సంబంధం ఉండవచ్చని అందరూ అనుమానించారు. పాక్ క్రికెట్ జట్టుకు, మ్యాచ్ ఫిక్సింగ్‌కు అవినాభావ సంబంధం ఉందనేది ప్రపంచం మొత్తానికి తెలుసు. ఐర్లాండ్ చేతిలో పరాజయం వెనక కూడా ఇలాంటిదేమో ఉందని అనుకున్నారు. కొన్నేళ్ల క్రితం ఫిక్సింగ్ వ్యవహారంలో హాన్సీ క్రానే పేరు బయటకు వచ్చినప్పుడు దక్షిణాఫ్రికా కోచ్‌గా ఊమరే ఉన్నారు. దానికీ, దీనికీ కొందరు లంకె కలిపి చూశారు. సహజంగా ముందుగానే పాకిస్తాన్ ఆటగాళ్లనే పోలీసులు అనుమానించారు. జింబాబ్వేతో మ్యాచ్ ఆడిన తర్వాత ఫ్లయిట్ ఎక్కడానికి సిద్ధమైన తరుణంలో పాక్ కెప్టెన్ ఇంజమాముల్ హక్ తదితరులను వెనక్కి పిలిచి పోలీసులు విచారించారు. సీసీటీవీ కెమెరాలు, సాక్షులు, హోటల్ సెక్యూరిటీ సిబ్బంది... ఇలా ఎవరిని విచారించినా స్పష్టత రాలేదు. ప్రపంచవ్యాప్తంగా పోలీసు విచారణలో లబ్దప్రతిష్టులైన స్కాట్లాండ్ యార్డ్ పోలీసుల సహాయం తీసుకున్నా లాభం లేకపోయింది. ఐసీసీ అవినీతి నిరోధక విభాగం కూడా ఇందులో భాగమైంది కానీ ఫిక్సింగ్ లేదా బెట్టింగ్ ఊమర్ మరణానికి కారణం కావచ్చని ఎవరూ చెప్పలేకపోయారు. నిజంగా హత్యే అయినా ప్రపంచకప్‌లాంటి ఈవెంట్ జరుగుతున్న సమయంలో ఒక పెద్ద హోటల్లో ఒక జాతీయ జట్టు కోచ్ గదిలో దూరి అలా చేయడం సాధ్యమేనా అనిపించింది. ఫోరెన్సిక్ నివేదికతో... ఊమర్ మరణాన్ని హత్యగా ప్రకటించడానికి ఫోరెన్సిక్ వైద్య నిపుణుడు డాక్టర్ ఈరి శేషయ్య (మన చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి) ఇచ్చిన నివేదికే కారణమైంది. తన పోస్ట్‌మార్టం రిపోర్టులో ఆయన ఊమర్‌కు ముందుగా విషం ఇచ్చి ఆ తర్వాత గొంతు పిసికారని రాశారు. అయితే తదుపరి పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఎవరో కావాలని కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినట్లు కనిపించింది. అసలు శేషయ్యకు ఈ తరహా కేసులను డీల్ చేయడంలో ఏమాత్రం అనుభవం లేదని, ఆయన తప్పుగా నివేదిక ఇచ్చారంటూ జమైకా పోలీసులు కేసును మళ్లీ మొదటికి తీసుకొచ్చారు. ముగ్గురు స్వతంత్ర వైద్య నిపుణులతో ఒక కమిటీ వేశారు. సహజ మరణంగా ముద్ర... ఊహించినట్లుగానే ఈ కమిటీ శేషయ్య నివేదికను తప్పు పట్టింది. పోస్ట్‌మార్టం నిర్వహించిన సమయంలో ఆయన మరీ ప్రాథమిక స్థాయి తప్పులు చేశారని ఆరోపించింది. ఊమర్ శరీరంలో కనిపించిన స్వల్ప మోతాదు సైపర్ మెథ్‌రీన్‌కు మనిషిని చంపేంత తీవ్రత లేదని తేల్చింది. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ క్లైవ్ రైస్, ఆసీస్ దిగ్గజం ఇయాన్ చాపెల్ కూడా ఊమర్‌ది హత్య కావచ్చంటూ పదే పదే సందేహించినా జమైకా పోలీసులు పట్టించుకోలేదు. హత్య కాదనే వాదనకు అనుగుణంగా పోలీసులు కథనం అల్లుకుంటూ వచ్చారు. చాలా కాలంగా ఊమర్ అనారోగ్యంతో బాధపడుతున్నాడని, అధిక బరువుతో పాటు టైప్–2 డయాబెటిస్ రోగి అని డాక్టర్లు చెప్పారు. చనిపోయిన ముందు రోజు బాగా తాగడం ప్రమాదం తీవ్రతను పెంచిందని, చివరకు గుండెపోటుతో చనిపోయాడని కమిటీ వెల్లడించింది. అన్నింటికి మించి పాకిస్తాన్‌లాంటి జట్టుకు కోచ్‌గా ఉంటే వారిపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుందని, ఘోర పరాభవం తర్వాత అది అతనిపై ప్రభావం చూపించిందని కూడా తేల్చారు. ఓపెన్ వెర్డిక్ట్... సాక్ష్యాలు, సుదీర్ఘ విచారణ తర్వాత అదే ఏడాది నవంబరులో జమైకా కోర్టు ‘ఓపెన్ వెర్డిక్ట్’ అంటూ తుది తీర్పు వెలువరించింది. అంటే సదరు మృతిని అనుమానాస్పదంగానే తేల్చుతూ మరణానికి ఎలాంటి కారణాన్ని మాత్రం చెప్పలేకపోయింది. దాంతో ఫైల్‌ను మూసేశారు. భారత స్వాతంత్య్రానికి పూర్వం ఊమర్ తండ్రి మన దేశంలో సివిల్ సర్వెంట్‌గా పని చేశారు. 1948 మే 14న ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో పుట్టిన బాబ్ ఊమర్ జీవితం అలా విండీస్ గడ్డపై ముగిసింది. ఆయన ఇంగ్లండ్ జట్టు తరఫున 19 టెస్టులు, 6 వన్డేలు ఆడారు. తీర్పు తర్వాత ఊమర్ భార్య గిల్ మాట్లాడుతూ...‘ఇప్పుడు మేం చేయగలిగిందేమీ లేదు. అయితే పోలీసు విచారణలో చాలా తప్పులు జరిగాయనేది మాత్రం వాస్తవం’ అని వేదనతో ముగించడం నిజమేమిటో చెప్పకనే చెబుతుంది. ఇద్దరు కుమారులతో ఊమర్ భార్య గిల్ -
సచిన్‌ను సగర్వంగా భుజాలపై...
ఏప్రిల్ 2, 2011... భారత క్రికెట్ అభిమానులందరి గుండె ఆనందంతో ఉప్పొంగిన రోజు... 28 ఏళ్ల తర్వాత టీమిండియా వన్డే ప్రపంచ కప్‌ను గెలుచుకొని చరిత్ర సృష్టించింది. నాడు విజేతగా నిలిచిన ఆ జట్టులో ఒక వ్యక్తి మాత్రం నిస్సందేహంగా అందరికంటే ఎక్కువగా భావోద్వేగానికి లోనయ్యాడు. వరుసగా ఐదు ప్రపంచకప్‌లలో పాల్గొన్నా విజయం అందని ద్రాక్షగా మారిపోయిన వేళ ఆరో ప్రయత్నంలో జగజ్జేత జట్టులో భాగమైన ఆ వ్యక్తి సచిన్ టెండూల్కర్. తమకు పెద్దన్నయ్యలాంటి సచిన్‌ను భారత జట్టు సభ్యులందరూ తమ భుజాలపై మోసి మైదానంలో కలియతిరిగారు. ఇప్పుడు అదే ఘట్టానికి ప్రతిష్టాత్మక ‘లారియస్’ పురస్కారం దక్కింది. బెర్లిన్: ‘సచిన్ టెండూల్కర్ ఇరవై ఏళ్ల పాటు భారత క్రికెట్‌ను తన భుజాలపై మోశాడు. ఇప్పుడు అతడిని మా భుజాలపై మోయడానికి మాకు ఇదే సరైన సమయం’... 2011 వరల్డ్ కప్ ఫైనల్లో విజయం అనంతరం విరాట్ కోహ్లి చేసిన వ్యాఖ్య ఇది. నాడు వాంఖడే స్టేడియంలో ఉన్న ప్రేక్షకులే కాదు భారత జాతి మొత్తం ఆ క్షణాన్ని సగర్వంగా ఆస్వాదించింది. ఇప్పుడు అదే సంబరాలకు ప్రఖ్యాత క్రీడా పురస్కారం లభించింది. ‘లారియస్’ అవార్డుల్లో గత 20 ఏళ్లలో అత్యుత్తమ క్రీడా ఘట్టంగా ‘స్పోర్టింగ్ మూమెంట్’ అవార్డు లభించింది. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన కార్యక్రమంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా, మాజీ టెన్నిస్ స్టార్ బోరిస్ బెకర్ చేతుల మీదుగా స్వయంగా సచిన్ టెండూల్కర్ ఈ అవార్డును అందుకున్నాడు. రెండు దశాబ్దాల ‘లారియస్ క్రీడా పురస్కారాల చరిత్ర’లో భారత్ లేదా భారత క్రీడాకారుడు ఒక అవార్డును గెలుచుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా ఓటింగ్‌తో... గత ఇరవై ఏళ్లలో (2000–2020) ఇరవై అత్యుత్తమ క్రీడా ఘట్టాలను ‘లారియస్’ ముందుగా ఎంపిక చేసింది. మూడు రౌండ్ల ద్వారా విజేతను తేల్చారు. జనవరి 10 నుంచి ఫిబ్రవరి 16 మధ్య ప్రపంచ వ్యాప్తంగా అభిమానులకు దీనికి ఓటింగ్ చేసే అవకాశం కల్పించగా... జాబితాను ముందుగా టాప్–10కు, ఆ తర్వాత టాప్–5కు కుదించి చివరకు అత్యుత్తమ క్షణాన్ని ప్రకటించారు. ఫైనల్ రౌండ్లో మిగిలిన నాలుగు నామినేషన్లను వెనక్కి నెట్టిన ‘క్యారీడ్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ ఎ నేషన్’కు అవార్డు దక్కింది. ఈ అవార్డుకు సాధారణ మ్యాచ్‌ల ఫలితాలు, స్కోర్లు తదితర అంశాలతో సంబంధం లేకుండా ఎక్కువగా భావోద్వేగాలకు సంబంధించిన ఘట్టాలనే ఎంపిక చేసి నామినేట్ చేశారు. ప్రపంచ కప్ గెలిచిన అనుభూతి అద్భుతం. దానిని మాటల్లో వర్ణించలేను. రెండో మాటకు తావు లేకుండా అందరూ ఒక తరహా భావనతో ఉండే ఘట్టాలు చాలా అరుదు. దేశం మొత్తం ఒకేసారి సంబరాలు చేసుకోవడం అలాంటిదే. క్రీడలు ఎంత గొప్పవో, అవి మన జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తాయో ఇది చూపిస్తుంది. ఇప్పుడు కూడా ఆ క్షణాలను చూస్తూ నేను తన్మయత్వానికి లోనవుతాను. 1983లో భారత జట్టు తొలిసారి ప్రపంచకప్ గెలిచినప్పుడు పదేళ్ల వయసులో నా క్రికెట్ ప్రస్థానం మొదలైంది. ఆ గెలుపు ప్రత్యేకత ఏమిటో నాకు అప్పుడు తెలీదు. అందరూ సంబరాలు చేసుకుంటున్నారు కాబట్టి నేనూ భాగమయ్యాను. అయితే దీనికి ఏదో విశేషం ఉందని, నేను కూడా అలాంటి అనుభూతిని పొందాలని మాత్రం అనిపించింది. 22 ఏళ్లు వేచి చూసిన తర్వాత ట్రోఫీని అందుకోవడం నేనెప్పటికీ గర్వపడే క్షణం. నా దేశ ప్రజల తరఫున ఆ ట్రోఫీని పట్టుకున్నట్లు భావించాను. నాపై నెల్సన్ మండేలా ప్రభావం ఉంది. ఆయన పడిన కష్టాలు నాయకుడిగా ఎదగడంలో అడ్డు రాలేదు. మండేలా చెప్పిన ఎన్నో గొప్ప మాటల్లో క్రీడలకు ప్రతీ ఒక్కరినీ కలిపే శక్తి ఉందని చెప్పిన మాట నాకు ఎంతో ఇష్టం. ఈ రోజు ఎంతో మంది గొప్ప అథ్లెట్లతో కలిసి కూర్చున్నాను. ఎన్ని సమస్యలు ఉన్నా అన్నీ అధిగమించి విజయాలు సాధించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచినవారందరికీ నా కృతజ్ఞతలు. ఈ ట్రోఫీ నా ఒక్కడిదే కాదు, మన అందరిదీ కూడా. –పురస్కారం స్వీకరించిన అనంతరం సచిన్ ప్రసంగం అవార్డు గెలుచుకోకపోయినా ‘సచిన్ క్షణం’తో పోటీ పడిన మిగిలిన నాలుగు నామినేషన్లను చూస్తే... దక్షిణాఫ్రికాకు చెందిన స్విమ్మర్ నటాలీ డు టొయిట్ 14 ఏళ్ల వయసులో కామన్వెల్త్ గేమ్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించింది. 2001లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె ఒక కాలు పోగొట్టుకుంది. అయితే పట్టుదలగా పోరాడిన నటాలీ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌కు ఓపెన్ విభాగంలో (వికలాంగుల పారాలింపిక్స్‌లో కాకుండా) అర్హత పొందింది. ఈ ఘనత సాధించిన తొలి మహిళా క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ఏడుసార్లు ఫార్ములావన్ చాంపియన్‌గా నిలిచిన విఖ్యాత రేసర్ మైకేల్ షుమాకర్ బాటలోనే అతని కొడుకు మిక్ కూడా రేసింగ్‌లోకి అడుగు పెట్టాడు. 2004లో జర్మన్ గ్రాండ్‌ప్రిలో షుమాకర్ విజేతగా నిలబడిన హోకెన్హీమ్ వేదిక వద్దే 15 ఏళ్ల తర్వాత నాటి కారులోనే మిక్ రేసింగ్ చేయడం ఎఫ్1 అభిమానులను భావోద్వేగానికి గురి చేసింది. 2016 కోపా సుడ్ అమెరికానా ఫుట్‌బాల్ టోర్నీ ఫైనల్స్‌లో పాల్గొనేందుకు వెళుతున్న సమయంలో ‘కాపికోన్స్’ టీమ్ ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలింది. 77 మందిలో 71 మంది చనిపోగా... మిగిలిన ఆరుగురిలో ముగ్గురు ఆ జట్టు ఆటగాళ్లు ఉన్నారు. ఆ తర్వాత 50 వేల మంది పాల్గొన్న స్మారక సభలో ప్రత్యర్థి జట్టు అట్లెటికో నకోనియల్ టైటిల్‌ను ‘కాపికోన్స్’కు అందజేస్తున్నట్లు ప్రకటించింది. కొన్నాళ్లకు జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఆ ముగ్గురు ఆటగాళ్లు ఫాల్మన్, రషెల్, నెటో కన్నీళ్లపర్యంతమవుతూ పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ ప్రేమికులను ఆ ఘటన కలచివేసింది. చైనాకు చెందిన జియా బోయు 1975లో తొలిసారి ఎవరెస్ట్ శిఖరం ఎక్కే క్రమంలో విఫలమయ్యాడు. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రయత్నించాలని భావిస్తే క్యాన్సర్ కారణంగా అతని రెండు కాళ్లు తొలగించాల్సి వచ్చింది. ఆ తర్వాత మరిన్ని సార్లు ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. అయితే 2018లో ఎట్టకేలకు 69 ఏళ్ల వయసులో బోయు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. రెండు కాళ్లు కోల్పోయిన తర్వాత కూడా ఎవరెస్ట్‌ను ఎక్కిన రెండో వ్యక్తిగా గుర్తింపు పొందాడు. లారియస్ ఇతర అవార్డుల విజేతల వివరాలు ►స్పోర్ట్స్‌మన్ ఆఫ్ ద ఇయర్: లూయిస్ హామిల్టన్ (ఫార్ములావన్–బ్రిటన్), లయోనల్ మెస్సీ (ఫుట్‌బాల్–అర్జెంటీనా) ►స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ద ఇయర్: సిమోన్ బైల్స్ (జిమ్నాస్టిక్స్–అమెరికా) ►వరల్డ్ టీమ్ ఆఫ్ ద ఇయర్: దక్షిణాఫ్రికా రగ్బీ జట్టు ►వరల్డ్ బ్రేక్ త్రూ ఆఫ్ ద ఇయర్: ఎగాన్ బెర్నాల్ (సైక్లింగ్–కొలంబియా) ►వరల్డ్ కమ్‌బ్యాక్ ఆఫ్ ద ఇయర్: సోఫియా ఫ్లోర్ష్ (రేసింగ్–జర్మనీ) ►స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ విత్ డిస్‌ఎబిలిటీ: ఒక్సానా మాస్టర్స్ (పారా రోయింగ్–అమెరికా) ►యాక్షన్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్: కోయి కిమ్ (స్నో బోర్డింగ్–అమెరికా) ►స్పోర్ట్ ఫర్ గుడ్: సౌత్ బ్రాంక్స్ యునైటెడ్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్: డర్క్ నొవిట్జీ (బాస్కెట్‌బాల్–జర్మనీ) ►అకాడమీ ఎక్సెప్షనల్ అచీవ్మెంట్: స్పానిష్ బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ -
వాళ్లే వరల్డ్‌కప్ విజేతలు !!
1992 వరల్డ్‌కప్ తర్వాత ఆరు టోర్నీలలో ఒక్కసారి కూడా సెమీస్ చేరలేకపోయిన ఇంగ్లండ్ ఇప్పుడు సొంతగడ్డపై ఎట్టకేలకు తుదిపోరుకు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ప్రపంచకప్‌లో భాగంగా గురువారం బర్మింగ్‌హామ్‌లో జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాపై గెలుపొందిన ఆతిథ్య జట్టు 44 ఏళ్ల తమ టైటిల్ కలను నెరవేర్చుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది. తమ చిరకాల ప్రత్యర్థి ఆసీస్‌ను చిత్తు చేసిన మోర్గాన్ సేన టైటిల్ సాధించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో టీమిండియాను ఓడించిన జట్టే వరల్డ్‌కప్‌ను ఎగరేసుకుపోతుందని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు.. ‘ ఇండియాను ఎవరైతే ఓడిస్తారో వాళ్లే ప్రపంచకప్ గెలుస్తారు’ అని అతడు చేసిన ట్వీట్ క్రికెట్ అభిమానుల మధ్య పెద్ద చర్చకు దారి తీసింది. ఈ క్రమంలో మైఖేల్ ట్వీట్‌పై స్పందించిన భారత అభిమానులు...‘ మీరు చెప్పిన దాన్ని బట్టి వరల్డ్ కప్ చాంపియన్ కంటే టీమిండియానే అత్యుత్తమ జట్టు అని స్పష్టమవుతోంది అని చమత్కరిస్తుండగా.. .‘ ఫైనలిస్టుల చేతిలో ఇండియా ఓడిపోయింది. ఆ రెండు జట్లను పాకిస్తాన్ ఓడించింది. అంటే అన్ని జట్ల కంటే పాక్ చాలా గొప్పగా ఆడినట్లు’ అని దాయాది జట్టు ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొంత మంది మాత్రం.. మైఖేల్ అసలు నీ ట్వీట్లో ఏమైనా లాజిక్ ఉందా అని ప్రశ్నిస్తుండగా... మరికొంత మంది.. ‘ 2015 సెమీస్ ఫలితాన్నిబట్టి మైఖేల్ ఇలా చెబుతున్నారేమో. అంటే ఆనాడు కూడా టీమిండియా సెమీ ఫైనల్లో ఓడిపోయింది. వాళ్లపై నెగ్గిన ఆసీస్ కప్ ఎగురేసుకుపోయింది. దీన్ని బట్టి ఈసారి కప్ న్యూజిలాండ్‌దే. ఏమంటావు మైఖేల్’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కాగా మెగాటోర్నీలో భాగంగా బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి సేన తొలి ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తొలి సెమీస్ మ్యాచ్‌లో అనూహ్యంగా న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై జయకేతనం ఎగురవేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 223 పరుగుల వద్ద ఆలౌటైంది. స్మిత్ (119 బంతుల్లో 85; 6 ఫోర్లు) ఒంటరి పోరాటం చేశాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ క్రిస్ వోక్స్ ప్రత్యర్థిని దెబ్బతీశాడు. లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్ 32.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసింది. ఓపెనర్ జేసన్ రా య్ (65 బంతుల్లో 85; 9 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరిపించాడు. మోర్గాన్ (39 బంతుల్లో 45 నాటౌట్), రూట్ (46 బంతుల్లో 49 నాటౌట్; 8 ఫోర్లు) రాణించారు. Always said whoever Beats India will the win the World Cup ... 👍 #CWC19 — Michael Vaughan (@MichaelVaughan) July 11, 2019 -
ప్రపంచకప్ ఫైనల్లో ఆసీస్ ట్యాంపరింగ్!
ఆక్లాండ్ : ఆస్ట్రేలియా ఆటగాళ్లు 2015 ప్రపంచకప్ ఫైనల్లో బాల్ ట్యాంపరింగ్‌కు యత్నించి ఉంటారని న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ గ్రాంట్ ఇలియట్ అనుమానం వ్యక్తం చేశారు. శుక్రవారం ఓ రేడియో స్టేషన్లో తాజా బాల్ ట్యాంపరింగ్ ఉదంతంపై మాట్లాడుతూ.. 2015 ప్రపంచకప్ ఫైనల్లో మా జట్టు ఆరంభం బాగుందని, 150 పరుగులకు మూడు వికెట్లే కోల్పయమన్నారు. అయితే ఈ సమయంలో బంతి అనూహ్యంగా రివర్స్ స్వింగ్ అయిందని, అప్పటి వరకు మాములుగా బౌలింగ్ చేసిన బౌలర్లు బంతిని అద్భుతంగా స్వింగ్ చేశాడన్నారు. దీంతో తాను బ్యాటింగ్‌లో ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో వారు బంతి ఆకారాన్ని ఏమైనా దెబ్బతీసారేమో అనే అనుమానం వచ్చినట్లు నాటి రోజును ఈ కివీస్ ప్లేయర్ గుర్తు చేసుకున్నారు. ఇక 2015 ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్ ఆసీస్ చేతిలో ఓడిన విషయం తెలిసిందే. ఈమ్యాచ్‌లో గ్రాంట్ ఇలియట్ ఒక్కరే (83) పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. స్మిత్ నిషేదంపై సానుభూతి.. స్మిత్, వార్నర్, బెన్ క్రాఫ్ట్‌ల నిషేదం పట్ల ఇలియట్ సానుభూతిని వ్యక్తం చేశారు. జోహన్నస్ బర్గ్ ఏయిర్‌పోర్టులో స్మిత్ పట్ల వ్యవహరించిన తీరును ఖండించారు. వారు నేరస్థులు ఏం కాదని, వారి పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు అమానుషమన్నారు. ‘నేను చూసిన వీడియోలో స్మిత్‌ను ఓ నేరస్థుడిలా పోలీసులు చుట్టుముట్టి మరి తీసుకెళ్లారు. అతనేం నేరస్థుడు కాదు. గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు’ అని ఏలియట్ అభిప్రాయపడ్డారు. -
స్పైక్ ఇరుక్కుపోవడం వల్లే...
ఫైనల్లో రనౌట్‌పై మిథాలీ వివరణ ముంబై: ఇంగ్లండ్‌తో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్లో కీలక దశలో భారత కెప్టెన్ మిథాలీ రాజ్ రనౌట్ కావడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ఆ తర్వాత అనుభవలేమితో జట్టు కుప్పకూలింది. మిథాలీ క్రీజ్‌లో ఉండి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదేమో! ఆ పరుగు తీసే ప్రయత్నంలో మిథాలీ నెమ్మదిగా స్పందించిన తీరు, డైవ్ చేసే ప్రయత్నం కూడా చేయకుండా ముందే ఆగిపోవడం విమర్శలకు కారణమైంది. దీనిపై మిథాలీ వివరణ ఇచ్చింది. ‘నా రనౌట్ గురించి సోషల్ మీడియాలో చాలా మంది తమ ఇష్టమొచ్చినట్లు రాశారు. నిజానికి పూనమ్ రౌత్ పిలుపునకు నేను సరిగ్గానే స్పందించాను. అయితే సగం దూరం వెళ్లే లోపే నా షూ స్పైక్ పిచ్‌లో ఇరుక్కుపోయింది. నేను డైవ్ చేసే అవకాశం కూడా లేకపోయింది. నిస్సహాయంగా ఆగిపోవడం తప్ప నేనేమీ చేయలేకపోయాను. ఈ విషయాన్ని టీవీ కెమెరాలు గుర్తించలేకపోయాయి’ అని భారత కెప్టెన్ చెప్పింది. వరల్డ్ కప్ ముగిసిన అనంతరం బుధవారం తెల్ల వారుజామున భారత్‌కు చేరుకున్న జట్టుకు భారీ ఎత్తున ఘనస్వాగతం లభించింది. ప్రస్తుతం దక్కుతున్న గౌరవాన్ని పొందేందుకు తమ జట్టు సభ్యులందరికీ అర్హత ఉందని మిథాలీ తెలిపింది. -
ఆ మ్యాచ్ గుర్తుకొచ్చిందా!
చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పరాజయం భారత వన్డే చరిత్రలో మరో పెద్ద ఓటమిని గుర్తుకు తెచ్చింది. ఆ మ్యాచ్ 2003 వరల్డ్ కప్ ఫైనల్. ఇలాంటి పెద్ద మ్యాచ్‌లో లక్ష్యాన్ని ఛేదించడంలో సహజంగానే చాలా ఒత్తిడి ఉంటుంది. కానీ దానిని కాదని నాటి కెప్టెన్ గంగూలీ టాస్ గెలిచి కూడా ఫీల్డింగ్ తీసుకున్నాడు. పాంటింగ్ భారీ సెంచరీ, మరో రెండు అర్ధ సెంచరీలతో ఆసీస్ స్కోరు 359/2. తొలి ఓవర్లోనే సచిన్ అవుట్‌తో భారత్ ఆశలకు కళ్లెం. అనంతరం పోరాడినా చివరకు 125 పరుగులతో పరాజయం. నాడు కూడా దూకుడుగా ఆడి 82 పరుగులు చేసిన సెహ్వాగ్ రనౌట్. అన్నట్లు మన ప్రధాన బౌలర్ జహీర్ ఖాన్ 2 నోబాల్స్, 6 వైడ్లు వేస్తే ఈసారి బుమ్రా 3 నోబాల్స్, 5 వైడ్లతో సమంగా నిలిచాడు. ఛేదనల్లో 250 పరుగులు చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్న పాక్ బలహీనతను గుర్తించకుండా కోహ్లి తమ బలం ఛేజింగ్లోనే ఉందని నమ్మాడు. టాస్ గెలిచి తాను ఫీల్డింగ్ చేయాలనుకున్న నిర్ణయం అతడిని బహుశా చాలా కాలం వెంటాడవచ్చు! -
ఈడెన్ గార్డెన్స్‌లో ఫైనల్
- చెన్నైలోనూ మ్యాచ్‌లు - టి20 ప్రపంచకప్ వేదికలు ఖరారు న్యూఢిల్లీ: దాదాపు మూడు దశాబ్దాల తర్వాత కోల్‌కతాలోని ప్రతిష్టాత్మక ఈడెన్ గార్డెన్స్ క్రికెట్ ప్రపంచ కప్ తుదిపోరుకు వేదిక కానుంది. వచ్చే ఏడాది భారత్‌లో జరిగే టి20 వరల్డ్ కప్ ఫైనల్ (ఏప్రిల్ 3న)ను ఈడెన్ గార్డెన్స్‌లో నిర్వహించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. 1987 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు ఆతిథ్యం ఇచ్చిన ఈ చారిత్రాత్మక మైదానంలో 2011 వన్డే ప్రపంచకప్‌లో మూడు అప్రాధాన్య మ్యాచ్‌లు జరిగాయి. వరల్డ్ కప్ నిర్వహించే ఎనిమిది వేదికలను బోర్డు మంగళవారం ప్రకటించింది. కోల్‌కతా, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, మొహాలీ, ధర్మశాల, నాగపూర్ ఈ జాబితాలో ఉన్నాయి. గత ఐదు టి20 ప్రపంచకప్‌లతో పోలిస్తే మూడుకంటే ఎక్కువ వేదికల్లో ఈ టోర్నమెంట్ జరుగుతుండటం ఇదే తొలిసారి. ఢిల్లీ, ముంబైలలో ఒక్కో సెమీ ఫైనల్ మ్యాచ్ నిర్వహించే అవకాశం ఉంది. ఒక వేళ ఏదైనా కారణంతో ఢిల్లీలో సెమీస్‌కు అవకాశం లేకపోతే అక్కడ భారత్-పాకిస్తాన్‌లాంటి కీలక మ్యాచ్ నిర్వహిస్తామని బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో మూడు స్టాండ్లకు సంబంధించి ఇంకా వివాదం కొనసాగుతూనే ఉన్నా... దానికీ మ్యాచ్‌లు కేటాయించారు. అయితే తగిన సమయంలో సమస్యను పరిష్కరించుకొని ఐసీసీ నిబంధనల ప్రకారం స్టేడియాన్ని సిద్ధం చేయాలని లేదంటే మ్యాచ్‌లు కోల్పోతారని బీసీసీఐ, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్‌కు సమాచారం అందించినట్లు తెలిసింది. మరో వైపు ఎనిమిది మంది సభ్యులతో కూడిన టి20 ప్రపంచకప్ మేనేజింగ్ కమిటీని కూడా బీసీసీఐ ఏర్పాటు చేసింది. బోర్డు ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు ఇందులో సభ్యులుగా ఉన్నారు. -
సెమీఫైనల్లో బ్రెజిల్ పై జర్మనీ విజయం
-
సెమీఫైనల్లో 7-1 తేడాతో బ్రెజిల్ చిత్తు!
ప్రపంచకప్ పుట్ బాల్ ఫైనల్లోకి జర్మనీ దూసుకెళ్లింది. బెలో హరిజోంటే లో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో ఆతిథ్య జట్టు బ్రెజిల్ ను చిత్తు చిత్తుగా ఓడించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ లో జర్మనీ ఏకంగా 7-1 గోల్స్ తేడాతో బ్రెజిల్ పై విజయం సాధించింది. ఈ విజయంతో జర్మనీ ఎనిమిదోసారి ప్రపంచ పుట్ బాల్ కప్ పైనల్లోకి చేరిన ఘనతను సొంతం చేసుకుంది. జర్మనీ జట్టు మ్యాచ్ తొలిభాగంలోనే 11, 23,24, 26, 29 నిమిషాల్లో గోల్స్ సాధించి ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఆట రెండో అర్ధ భాగంలో అదే ఊపును కొనసాగించి 69, 76 నిమిషాల్లో మరో రెండు గోల్స్ సాధించింది. జర్మనీ ఆటగాళ్ల ఎటాకింగ్ కు బ్రెజిల్ విలవిల్లాడింది. మ్యాచ్ మొత్తంలో తన ఆటతీరుతో కనీసం ప్రభావం చూపలేకపోయిన బ్రెజిల్.. ఆట చివర్లో ఆస్కార్ 89 నిమిషంలో గోల్ సాధించడం బ్రెజిల్ కు కొంతలో కొంత ఊరట లభించింది. ఓ అంతర్జాతీయ మ్యాచ్ లో బ్రెజిల్ ఇంత చెత్తగా ఓటమి పాలవ్వడం 1920 తర్వాత ఇదే తొలిసారి. 1920లో ఉరుగ్వే చేతిలో బ్రెజిల్ 0-6 తేడాతో ఓటమి పాలైంది. -
సౌరబ్ గంగూలీ జోస్యం ఫలిస్తుందా?
ప్రపంచ క్రీడాభిమానులందరికి ఫుట్ బాల్ ఫీవర్ పట్టుకుంది. ప్రపంచ పుట్ బాల్ కప్ టోర్నిలో నాకౌట్ దశ ముగిసి సెమీఫైనల్ పోటీలకు జట్లు సిద్దమవుతున్నాయి. ఇక ఫైనల్ కు ఏ జట్లు చేరుతాయా అని అంచనాలు వేసుకోవడం, జోస్యం చెప్పడం పనిలో పడ్డారు. పుట్ బాల్ అభిమానైన భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రపంచ కప్ పోటీలను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇంగ్లాండ్ తో జరిగే భారత సిరీస్ కోసం కామెంటేటర్ గా మారిన గంగూలీ ప్రపంచ కప్ ఫుట్ బాల్ ఫైనల్ పోటీల్లో ఏ జట్లు ఆడబోతున్నాయో.. ముందే ఓ అంచనాకు వచ్చాడు. జూలై 13న జరిగే ఫైనల్ మ్యాచ్ లో జర్మనీ, నెదర్లాండ్ జట్టు పోటీ పడుతాయని జోస్యం చెప్పాడు. ఓ ఫుట్ బాల్ అభిమానిగా బ్రెజిల్, అర్జెంటీనా జట్లు ఫైనల్ మ్యాచ్ ఆడాలని కోరుకుంటాను. కాని పుట్ బాల్ జట్ల ఫామ్ ను పరిగణనలోకి తీసుకుంటే జర్మనీ, నెదర్లాండ్ జట్లు ఫైనల్ పోటీకి అర్హత సాధిస్తాయనిపిస్తోంది అని గంగూలీ అన్నారు. ఇక ఇంగ్లాండ్ లో పర్యటిస్తున్న భారత జట్టు ఐదు టెస్టుల సిరీస్ ను జూలై 9 తేదిన ఆరంభం కానుంది. Follow @sakshinews -
సందీప్ ‘ఫుల్ స్వింగ్’
పంజాబ్ విజయాల్లో కీలకం సందీప్‌శర్మ ఆకట్టుకుంటున్న యువ పేసర్ అండర్-19తో గుర్తింపు దేశవాళీలోనూ మంచి ప్రదర్శన సాక్షి క్రీడావిభాగం దాదాపు రెండేళ్ల క్రితం...అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్. అప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లోనూ అజేయంగా నిలిచిన ఆస్ట్రేలియాతో భారత్ పోరు.. తొలి ఓవర్ వేసిన సందీప్ శర్మ నాలుగో బంతికే వికెట్ తీశాడు. ఆ తర్వాత తన రెండో ఓవర్లోనూ మరో వికెట్. అంతే...8 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఆసీస్ ఆ తర్వాత ఒత్తిడిలో తక్కువ స్కోరు పరిమితమై, భారత్ విజయానికి బాట పరిచింది. ఆ మ్యాచ్‌లో 4 వికెట్లతో భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించిన సందీప్ శర్మ ఆ తర్వాత మరింత రాటుదేలాడు. అన్ని ఫార్మాట్లలోనూ కీలక బౌలర్‌గా ఎదిగిన అతను, ఇప్పుడు ఐపీఎల్‌తో అందరి దృష్టిలో పడ్డాడు. స్వింగ్ బలం పాటియాలాలో స్కూల్ క్రికెట్ స్థాయిలో బ్యాట్స్‌మెన్‌గా ఆటను ప్రారంభించినా...కోచ్ సలహాతో సందీప్ బౌలింగ్ వైపు మళ్లాడు. వేగంకంటే కచ్చితత్వాన్నే ఎక్కువగా నమ్ముకున్న అతనికి స్వింగ్ ప్రధానాయుధం. ముఖ్యంగా నేరుగా వచ్చి పిచ్ అయిన తర్వాత బయటి వైపు వెళ్లే బంతి ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌ను బాగా ఇబ్బంది పెడుతుంది. అదే బాల్ సందీప్‌కు గేల్ వికెట్‌ను అందించింది. ‘బెంగళూరు జట్టులో ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండర్లు ఉండటంతో అంతకు ముందు రోజు నా బలమైన ఈ డెలివరీపై బాగా సాధన చేశాను. ఎక్కువగా ఎడమ చేతివారికే బౌలింగ్ చేశాను. అది ఫలితాన్నిచ్చింది’ అని అతను ఆనందంగా చెప్పాడు. అయితే పిచ్ బంతి స్వింగ్‌కు అనుకూలంగా లేనప్పుడు బ్యాట్స్‌మన్‌ను కట్టడి చేసేందుకు యార్కర్లు, స్లో బౌన్సర్లపై కూడా సాధన చేస్తున్నట్లు అతను చెప్పాడు. అండర్-19తో గుర్తింపు పంజాబ్ తరఫున అండర్-19 స్థాయిలో ఆకట్టుకోవడంతో సందీప్ శర్మ 2010 అండర్-19 ప్రపంచకప్‌కు ఎంపికయ్యాడు. ఆ టోర్నీలో జట్టు ప్రదర్శన గొప్పగా లేకున్నా...ఇండియా తరఫున ఎక్కువ వికెట్లు సాధించాడు. దాంతో 18 ఏళ్ల వయసులో అతనికి తొలి సారి పంజాబ్ రంజీ జట్టులో చోటు లభించింది. అయితే 2010 అండర్-19 ప్రపంచ కప్ ఓటమిని వెనక్కి నెడుతూ మళ్లీ రెండేళ్ల తర్వాత కూడా సత్తా చాటి భారత్‌ను విజేతగా నిలపడంలో భాగమయ్యాడు. 2012 టోర్నమెంట్లో ఈ పంజాబీ క్రికెటర్ 6 మ్యాచుల్లో 15.75 సగటుతో 12 వికెట్లు తీసి టీమ్ టాపర్‌గా నిలిచాడు. ఆ తర్వాత అతను పంజాబ్ ప్రధాన పేసర్‌గా జట్టులో భాగమయ్యాడు. రంజీల్లో ఆడిన తొలి సీజన్ (2012-13)లోనే 9 మ్యాచుల్లో 41 వికెట్లు తీసి ఓవరాల్ జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. అంది వచ్చిన ఐపీఎల్ పంజాబ్ జట్టు తరఫున చేసిన ప్రదర్శన సందీప్‌కు ఐపీఎల్లో చోటు కల్పించింది. గత ఏడాది ఆరో సీజన్ కోసం కింగ్స్ ఎలెవన్ అతడిని ఎంపిక చేసుకుంది. 4 మ్యాచ్‌లే ఆడి 14.87 సగటుతో 8 వికెట్లు తీయడంతో అతనిపై ప్రశంసలు కురిసాయి. ఇదే ఆట కింగ్స్ ఎలెవన్‌తో మరో అవకాశాన్ని కల్పించింది. ఈ ఏడాది యూఏఈలో జరిగిన ఐపీఎల్‌తో సందీప్ శర్మ ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. లీగ్‌లో ఆడిన మూడు మ్యాచుల్లో చక్కటి ప్రదర్శన (1/26, 3/21, 3/15) కనబర్చిన అతను రెండు సార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ముఖ్యంగా గేల్, కోహ్లిలాంటి ఆటగాళ్ల వికెట్లు తీయడం సందీప్ ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. నిలకడే కీలకం ఈ ఏడాది ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు విజయాలు చూస్తే ఇప్పుడు అందరి దృష్టి ఆ జట్టుపైనే ఉంది. జట్టు విజయాల్లో భాగస్వామిగా ఉన్న సందీప్ ఆటను కూడా అంతా గమనిస్తున్నారు. భారత్‌కు ఆడిన ప్రవీణ్ కుమార్, భువనేశ్వర్ కుమార్ల శైలిని సందీప్ బౌలింగ్ పోలి ఉంటుంది. పేస్ బౌలింగ్‌లో పదును పెరిగేందుకు మిచెల్ జాన్సన్ సాహచర్యంలో ఎంతో నేర్చుకుంటున్నానని అతను చెప్పాడు. ఐపీఎల్ ప్రదర్శనే ప్రాతిపదిక కాకున్నా ఫస్ట్ క్లాస్ క్రికెట్లోనూ రాణిస్తుండటం శర్మకు అదనపు బలం. దేశవాళీలో మరో రెండు సీజన్ల పాటు నిలకడగా ఆడితే అతనికి భారత జట్టులోకి వచ్చేందుకు మంచి అవకాశాలు ఉన్నాయి. అయితే టీమిండియాలో పేసర్ల మధ్య ప్రస్తుతం గట్టి పోటీ ఉంది. చాలామంది వస్తున్న పెద్దగా ఆకట్టుకునే వాళ్ల సంఖ్య తక్కువగా ఉంది. అలా మెరిసి ఇలా పోయే బౌలర్ల జాబితాలో కాకుండా సుదీర్ఘ కాలం పాటు ఆడే క్రికెటర్‌గా సందీప్ శర్మ నిలవాలని ఆశిద్దాం.