అహ్మదాబాద్: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఓటమి తర్వాత తీవ్ర నిరాశలో ఉన్న భారత క్రికెటర్లను ప్రధాని మోదీ ఓదార్చారు. ఓటమి సాధారణమైనది, నిరుత్సాపడకూడదని ప్రోత్సహించారు. టోర్నీలో వరుసగా పది మ్యాచ్‌లు గెలిచిన తీరును గుర్తుచేశారు. దేశమంతా చూస్తోంది.. దయచేసి నవ్వండని కోరారు. అప్పుడప్పుడు ఇలా జరగుతుందని కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి చేతులు పట్టుకుని ఉత్సాహపరిచారు. ఆటగాళ్లు ఒకరినొకరు నిరంతరం ప్రోత్సహించుకోవాలని చెప్పారు.
గుజరాతీ అయిన రవీంద్ర జడేజాతో ప్రధాని మోదీ గుజరాతీలో మాట్లాడారు. ఏం బాబు అని పలకరిస్తూ ఇరువురు నవ్వులు కురిపించారు. మహ్మద్ షమీ వద్దకు వచ్చిన మోదీ.. షమీని కౌగిలించుకున్నారు. అద్భుతమైన ఆటతీరు కనబరిచావని మెచ్చుకున్నారు.
#WATCH | Prime Minister Narendra Modi met Team India in their dressing room after the ICC World Cup Finals at Narendra Modi Stadium in Ahmedabad, Gujarat on 19th November.
— ANI (@ANI) November 21, 2023
The PM spoke to the players and encouraged them for their performance throughout the tournament.
(Video:… pic.twitter.com/ZqYIakoIIj
అహ్మదాబాద్ వేదికగా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో భారత్ పోరుకు దిగింది. అయితే.. 6 వికెట్ల తేడాతో భారత్‌పై ఆసిస్ అలవోక విజయం సాధించింది. ఓటమిని చవిచూసిన భారత ఆటగాళ్లు నిరుత్సాహంతో మైదానాన్ని వీడారు. కొందరు ఆటగాళ్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. మ్యాచ్‌ను వీక్షించడానికి వెళ్లిన ప్రధాని మోదీ క్రికెటర్లను డ్రస్సింగ్ రూంలో కలిశారు. నిరుత్సాహంలో ఉన్న ఆటగాళ్లను ఓదార్చారు.
ఇదీ చదవండి: ద్రవిడ్‌ను కొనసాగిస్తారా లేక సాగనంపుతారా.. టీమిండియా తదుపరి కోచ్ ఎవరు..?
Comments
Please login to add a commentAdd a comment