cricketers
-
ఫ్యామిలి మ్యాన్ కోహ్లికి.. బీసీసీఐ భారీ షాక్
-
ప్రేమ పెళ్లి చేసుకున్న టాప్ క్రికెటర్లు (ఫొటోలు)
-
మహాకుంభ మేళాలో ‘టీమిండియా క్రికెటర్లు’.. అంతా AI మహిమ!
-
దీపావళి వేడుకల్లో టీమిండియా స్టార్ క్రికెటర్లు (ఫోటోలు)
-
అనంతపురంలో క్రికెటర్లు తీసుకునే ఆహారం (ఫొటోలు)
-
క్రికెటర్ల హ్యాపీ రక్షాబంధన్.. ఫొటోలు
-
Cricketers Celebrate Eid: రంజాన్ వేడుకల్లో క్రికెటర్లు.. ఫొటోలు చూశారా? (ఫొటోలు)
-
Cricketers Cute AI Photos: ముద్దు ముద్దుగా.. క్రికెటర్ల ఏఐ పిక్స్
-
డ్రెస్సింగ్ రూంలో క్రికెటర్లను ఓదార్చిన మోదీ
అహ్మదాబాద్: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఓటమి తర్వాత తీవ్ర నిరాశలో ఉన్న భారత క్రికెటర్లను ప్రధాని మోదీ ఓదార్చారు. ఓటమి సాధారణమైనది, నిరుత్సాపడకూడదని ప్రోత్సహించారు. టోర్నీలో వరుసగా పది మ్యాచ్‌లు గెలిచిన తీరును గుర్తుచేశారు. దేశమంతా చూస్తోంది.. దయచేసి నవ్వండని కోరారు. అప్పుడప్పుడు ఇలా జరగుతుందని కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి చేతులు పట్టుకుని ఉత్సాహపరిచారు. ఆటగాళ్లు ఒకరినొకరు నిరంతరం ప్రోత్సహించుకోవాలని చెప్పారు. గుజరాతీ అయిన రవీంద్ర జడేజాతో ప్రధాని మోదీ గుజరాతీలో మాట్లాడారు. ఏం బాబు అని పలకరిస్తూ ఇరువురు నవ్వులు కురిపించారు. మహ్మద్ షమీ వద్దకు వచ్చిన మోదీ.. షమీని కౌగిలించుకున్నారు. అద్భుతమైన ఆటతీరు కనబరిచావని మెచ్చుకున్నారు. #WATCH | Prime Minister Narendra Modi met Team India in their dressing room after the ICC World Cup Finals at Narendra Modi Stadium in Ahmedabad, Gujarat on 19th November. The PM spoke to the players and encouraged them for their performance throughout the tournament. (Video:… pic.twitter.com/ZqYIakoIIj — ANI (@ANI) November 21, 2023 అహ్మదాబాద్ వేదికగా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో భారత్ పోరుకు దిగింది. అయితే.. 6 వికెట్ల తేడాతో భారత్‌పై ఆసిస్ అలవోక విజయం సాధించింది. ఓటమిని చవిచూసిన భారత ఆటగాళ్లు నిరుత్సాహంతో మైదానాన్ని వీడారు. కొందరు ఆటగాళ్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. మ్యాచ్‌ను వీక్షించడానికి వెళ్లిన ప్రధాని మోదీ క్రికెటర్లను డ్రస్సింగ్ రూంలో కలిశారు. నిరుత్సాహంలో ఉన్న ఆటగాళ్లను ఓదార్చారు. ఇదీ చదవండి: ద్రవిడ్‌ను కొనసాగిస్తారా లేక సాగనంపుతారా.. టీమిండియా తదుపరి కోచ్ ఎవరు..? -
ఎన్నికల బరిలో డజను మంది డాక్టర్ బాబులు!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ ఎన్నికల బరిలో ఉమ్మడి కరీంనగర్ నుంచి అసెంబ్లీకి పోటీ పడుతున్న అభ్యర్థుల నేపథ్యం ఆసక్తికరంగా ఉంది. ఇక్కడ బరిలో దిగబోయేవారిలో డజనుమంది డాక్టర్లు ఉండటం విశేషం. వీరిలో ఎనిమిది మంది ఎంఎస్, ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి వైద్యశాస్త్రం చదివిన విద్యావంతులు ఉన్నారు. అదే సమయంలో కొందరు పీహెచ్డీ చేసి డాక్టరేట్ పొందిన అభ్యర్థులూ ఉన్నారు. ఈసారి అసెంబ్లీ బరిలో నిలిచేవారిలో ఉమ్మడి కరీంనగర్‌లోని పలు అసెంబ్లీ స్థానాల నుంచి 12 మంది పేర్లలో తొలుత డాక్టర్ ఉండటం గమనార్హం. అదే సమయంలో ఇద్దరు రంజీ ప్లేయర్లు కూడా అసెంబ్లీ బరిలో నిలవడం విశేషం. ఎనిమిది మంది వైద్యులు డాక్టర్ సంజయ్ ఎంఎస్, ఎమ్మెల్యే (బీఆర్ఎస్–జగిత్యాల) డాక్టర్ సంజయ్ ఎంఎస్, (బీఆర్ఎస్– కోరుట్ల) డాక్టర్ భోగశ్రావణి బీడీఎస్ (బీజేపీ–జగిత్యాల) డాక్టర్ వికాస్‌బాబు ఎంబీబీఎస్ (బీజేపీ– వేములవాడ) డాక్టర్ కే.సత్యనారాయణ ఎంఎస్ (కాంగ్రెస్–మానకొండూరు) డాక్టర్ బల్మూరి వెంకట్ ఎంబీబీఎస్ (కాంగ్రెస్–హుజూరాబాద్) డాక్టర్ జేఎన్ వెంకట్ ఎంబీబీఎస్ (బీజేపీ – కోరుట్ల) డాక్టర్ నగేశ్ ఎంబీబీఎస్ (వైఎస్సార్ టీపీ– కరీంనగర్) నలుగురు డాక్టరేట్లు డాక్టర్ రసమయిబాలకిషన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే (మానకొండూరు) డాక్టర్ కొనగాల మహేశ్ (కాంగ్రెస్–కరీంనగర్) డాక్టర్ మేడిపల్లి సత్యం (కాంగ్రెస్–చొప్పదండి) డాక్టర్ గోలి మోహన్ (సైంటిస్ట్) (బీఎస్పీ–వేములవాడ) ఇద్దరు క్రికెటర్లు.. సెకండ్ ఇన్నింగ్స్ విజయంపై.. కోరుట్ల నుంచి అసెంబ్లీ బరిలో నిలిచిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ రంజీ క్రికెటర్. 1995లో హైదరాబాద్ జట్టుకు ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా ఆడారు. గత ఎన్నికల్లో తాను ఓపెనింగ్ చేసిన తొలి ఎన్నికల్లో అప్పటి నిజామాబాద్ ఎంపీ కవితను ఓడించి సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా రెండో ఇన్నింగ్స్‌లోనూ సంచలన విజయంపై అర్వింద్ కన్నేశారు. బెస్ట్ ఫెర్ఫామెన్స్ కోసం.. ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి...2018లో ఈటల రాజేందర్‌పై కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా అదే ప్రత్యర్థిపై బరిలో నిలిచారు. రాజకీయాల్లోకి రాకముందు పాడి కౌశిక్‌రెడ్డి సైతం రంజీ ఆటగాడు. 2004 నుంచి 2007 వరకు హైదరాబాద్ జట్టులో ఫాస్ట్»ౌలర్‌గా కొనసాగారు. వీణవంక ఎక్స్‌ప్రెస్‌గా పేరున్న కౌశిక్‌రెడ్డి తన కెరీర్లో 47 వికెట్లు తీసి, ఒక అర్థసెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు పడగొట్టిన రికార్డు కూడా కౌశిక్ పేరిట ఉండటం విశేషం. -
లెజెండరీ క్రికెటర్ల కళ్లు చెదిరే ఇంద్రభవనాలు: అత్యాధునిక ఫీచర్లు
టీమిండియా మాజీ కెప్టెన్ కూల్, మహేంద్ర సింగ్ ధోనీకి తన స్వస్థలం రాంచీ నగరం నడిబొడ్డున విలాసవంతమైన ఫామ్‌హౌస్ ఉంది. సోషల్ మీడియాలో ధోనీ పెద్దగా యాక్టివ్‌గా ఉండపోయినప్పటికీ, ఆయన భార్య భార్య సాక్షి ధోని తరచుగా చేసే సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా ఈ ఇంటికి సంబంధించిన సంగతులు వెలుగు చూస్తూనే ఉంటాయి. కైలాసపతిగా పేరు పెట్టుకున్న ఫామ్‌హౌస్ 7 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. టాప్ మోస్ట్ సౌకర్యాలతోపాటు సహజమైన ప్రకృతి దృశ్యం, చక్కటి ఇంటీరియర్స్‌తో ఇదొక ఇంద్ర భవనమని ఫ్యాన్స్ మురిసిపోతూ ఉంటారు. యువరాజ్ సింగ్ ముంబైలోని వోర్లీలోని లావిష్ సీ ఫేస్డ్ అపార్ల్మెంట్కు ఓనర్ మాజీ క్రికెటర్ యువరాజ్ 16,000 చదరపు అడుగుల స్థలంలో ఓంకార్ టవర్స్‌లోని 29వ అంతస్తులో ఉన్న ఈ అపార్ట్‌మెంట్‌ను 2013లో రూ. రూ. 64 కోట్లకు కొనుగోలు చేశాడు. గ్లాస్ పేటెడ్ బాల్కని ప్రధాన హైలైట్. ఇతనికి గోవాలో హాలిడే హోమ్‌గా ఉంది. సచిన్ టెండూల్కర్ క్రికెట్ దేవుడు, సచిన్ టెండూల్కర్ ముంబైలోని బాంద్రాలోని నాగరిక ప్రాంతంలో లగ్జరి బంగ్లా ఉంది. డోరబ్ విల్లా అని పిలిచే దీనిని 2007లో క్రికెటర్ దానిని కొనుగోలు చేశాడు. దీన్ని అత్యాధునిక సౌకర్యాలు, ఫీచర్లతో పునర్నిర్మాణం చేసి 2011లో మాత్రమే ఇందులోకి మారారు. మూడు అంతస్తుల్లో 6000 చదరపు అడుగుల స్థలంలో విస్తరించి ఉన్న ఈ ఇంటి విలువ రూ. 38 కోట్లు. రోహిత్ శర్మ ఇల్లు, 2015లోదీని విలువ రూ. 30 కోట్లు, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముంబైలోని వర్లీలోని అహుజా టవర్స్‌లోని 29వ అంతస్తులో రోహిత్ శర్మకు సముద్రానికి ఎదురుగా భారీ అపార్ట్మెంట్ ఉంది. నాలుగు బెడ్రూమ్లు , ఆకట్టుకునే 13 అడుగుల ఎత్తైన సీలింగ్ ఉన్నాయి. వాక్-ఇన్ వార్డ్రోబ్, ఇతర అద్భుతమైన సౌకర్యాలు ఉన్నాయి. వాయిస్-కమాండ్ కంట్రోల్ ప్యానెల్ల ద్వారా లైటింగ్, గాడ్జెట్లు, ఉష్ణోగ్రత , ఎంటర్టైన్మెంట్ డివైస్‌లను రిమోట్‌గా నియంత్రించగల స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ హోమ్ ఆటోమేషన్ దీని ప్రత్యేకత. సునీల్ గవాస్కర్ లెజెండ్, మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ గోవాలో ఖరీదైన ఇంటిని 2017లో కొనుగోలు చేశారు. ఈ విలాసవంతమైన హాలిడే విల్లా 5000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రశాంత వాతావరణంలో ఉంటుంది. పురాతన ఫర్నిచర్‌తో చుట్టూ పచ్చదనంతో ఆహ్లాదకరమైన విల్లా ఇది. సురేష్ రైనా సురేష్ రైనా తన స్వస్థలమైన ఘజియాబాద్‌లో అందమైన ఇంటిని నిర్మించుకోవడం విశేషం. రాజ్ నగర్‌లోని పాపులర్ ఏరియాలో అన్ని ఆధునిక హంగులతో బ్లాక్ అండ్ వైట్ గ్రానైట్ మార్బుల్‌కి తోడు, చుట్టూ విలాసవంతమైన పచ్చదనంతో ఆకర్షణీయంగాఉంటుంది. ఇంకా ఓపెన్ యార్డ్‌లో సురేశ్ కోసం విశాలమైన చక్కటి జిమ్ ఉన్నాయి. ప్రస్తుతం ఘజియాబాద్‌లోని రూ.18 కోట్ల విలువైన ఢిల్లీలోని 5 బీహెచ్‌కే అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు. సౌరవ్ గంగూలీ కోల్‌కతా యువరాజు సౌరవ్ గంగూలీకి కోల్‌కతా నగరం నడిబొడ్డున వంశపారంపర్యంగా వచ్చిన ఆస్థికి యజమాని దాదాపు 45 ఏళ్లుగా ఆస్తి బాగా కరిగిపోయినప్పటికీ కోల్‌కతాలోని అతిపెద్ద ప్రైవేట్ భవనాల్లో ఒదొకటి. దాదా ఎక్కువ సమయాన్ని ఇక్కడే గడుపుతారట. స్మృతి చిహ్నాలతో నిండిన దాదా రూం ప్రత్యేక ఆకర్షణలలో ఒకటి. విశాలమైన గార్డెన్, క్రికెట్ పిచ్ , పోర్చ్తో కూడిన ఓపెన్ ఫ్రంట్ యార్డ్ ఉన్నాయి. రవీంద్ర జడేజా: గుజరాత్‌లోని జామ్‌నగర్‌లోని ఇంద్రభవనం లాంటి ఇల్లు రాజసంతో ఉట్టి పడుతూ ఉంటుంది. దీనివిలువ 10 కోట్లు ఉంటుందని అంచనా. పలు లగ్జరీ,రాయల్ ఫిట్టింగ్లతోపాటు, చెక్కతో అందంగా తీర్చిదిద్దిన జడేజా ఇంటి ప్రవేశ ద్వారం స్పెషల్ ఎట్రాక్షన్. హార్దిక్ పాండ్యా క్రికెటర్లు, అన్నదమ్ములైన హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా ఇద్దరి కలిపి లగ్జరీ ఇల్లు ఉంది. 6000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు అంతస్తుల్లో అత్యాధునిక హంగులతో ఉంటుంది. ఇందులో ప్రైవేట్ జిమ్, ప్రైవేట్ థియేటర్ వంటి అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి.దీని విలువ రూ. 3.6 కోట్లు. విరాట్ కోహ్లీ స్వీట్ హోం హర్యానాలోని గురుగ్రాంలో విరాట్ కోహ్లీ స్వీట్ హోం. 10,000 చదరపు అడుగుల స్థలంలో ఉన్న దీన్ని విలువ రూ. 80 కోట్లు . -
ఏపీఎల్ నిర్వహణ భేష్
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర ప్రీమియర్ లీగ్(ఏపీఎల్) నిర్వహణ చాలా బాగుందని.. యువ క్రికెటర్లకు ఇదొక మంచి వేదిక అని టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ కృష్ణమాచారి శ్రీకాంత్ అన్నారు. ఏపీఎల్ రెండో సీజన్ ఫైనల్ మ్యాచ్‌ను టాస్ వేసి ప్రారంభించడానికి ముందు ఆదివారం ఆయన విశాఖలోని వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో మీడియాతో మాట్లాడారు. ‘విశాఖపట్నం చాలా అందమైన నగరం. నాకెంతో ఇష్టమైన ప్రదేశమిది. ఇక్కడి వాతావరణం బాగుంటుంది. విశాఖ వేదికగా అనేక టోర్నిల్లో ఆడాను. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పనితీరు అద్భుతం. ఏపీలో ప్రతిభ ఉన్న క్రికెటర్లు చాలా మంది ఉన్నారు. వారిని ప్రోత్సహించేందుకు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏపీఎల్ తరహా టోర్నిల ద్వారా క్రికెటర్లకు అవకాశాలు పెరుగుతాయి. రాబోయే రోజుల్లో ఏపీ నుంచి దేశానికి మరింత మంది ప్రాతినిధ్యం వహించేలా ఏసీఏ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలి’ అని సూచించారు. ‘టెస్ట్, వన్డే, టీ20 ఇలా అన్ని ఫార్మాట్లలోనూ రాణించేవిధంగా యువ క్రికెటర్లు తమను తాము మలుచుకోవాలి. సచిన్ ప్యాషన్‌తో ఆడితే.. కోహ్లి ప్యాషన్‌తో పాటు అగ్రెసివ్‌గా ఆడుతాడు. అది వారి స్టయిల్. నేను కూడా అగ్రెసివ్‌గానే ఆడేవాడిని. జట్టులో చోటు దక్కించుకోవాలంటే ఆటతీరుతో పాటు చిత్తశుద్ధి, క్రమశిక్షణ కూడా చాలా అవసరం. నాకు మీడియాతో మంచి అనుబంధం ఉంది. మీడియా ఒక ఆటగాడిని ఎలివేట్ చేసేందుకు చాలా దోహదపడుతుంది. అది ఆటగాళ్లతో పాటు క్రికెట్ అభివృద్ధికి ఎంతో ఉపయోగకరం’ అని శ్రీకాంత్ అన్నారు. ఏసీఏ అధ్యక్షుడు పి.శరత్‌చంద్రారెడ్డి, కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏపీఎల్ సీజన్–2కు మంచి ఆదరణ లభించిందని చెప్పారు. కార్యక్రమంలో టీమిండియా క్రికెటర్ కేఎస్ భరత్, ఏసీఏ ఉపాధ్యక్షుడు పి.రోహిత్‌రెడ్డి, సీఈవో ఎంవీ శివారెడ్డి, అపెక్స్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. వెంకట్రావు పేరుతో ‘స్టాండ్’ గర్వకారణం అనంతరం విశాఖ స్టేడియంలోని ఓ స్టాండ్‌కు ఏసీఏ మాజీ కార్యదర్శి ఎన్.వెంకట్రావు పేరు పెట్టగా.. దానిని కృష్ణమాచారి శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏసీఏ కార్యదర్శిగా వెంకట్రావు సేవలందిస్తున్న రోజుల్లోనే తాను క్రికెటర్‌గా ఎదిగానని చెప్పారు.ఆయన పేరుతో స్టాండ్ ఏర్పాటు చేయడం గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా వెంకటరావు ‘సాక్షి’తో మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారు. అప్పట్లో బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా, అంపైర్ కమిటీ చైర్మన్‌గా, క్రమశిక్షణా కమిటీ చైర్మన్‌గా, 2003 వరల్డ్‌కప్‌లో పాల్గొన్న టీమిండియా జట్టు మేనేజర్‌గా తాను అందించిన సేవలకు ఇదో జ్ఞాపికగా భావిస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం ఆయన కుమారుడు రమణమూర్తి ఏపీఎల్‌లో తలపడుతున్న బెజవాడ టైగర్స్ జట్టుకు యజమానిగా ఉన్నారు. కార్యక్రమంలో ఏసీఏ అధ్యక్షుడు శరత్‌చంద్రారెడ్డి, కార్యదర్శి గోపినాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇంజనీరింగ్ చదివిన టీమిండియా క్రికెటర్లు వీరే! (ఫొటోలు)
-
రెండేళ్లలో 114 మంది క్రికెటర్లకు మాత్రమేనా.. WADA అసహనం
2021-22 ఏడాదికి గానూ భారత క్రికెట్లో(పురుషులు, మహిళలు) కలిపి కేవలం 114 మంది క్రికెటర్లకు మాత్రమే జాతీయ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(NADA) డోపింగ్ టెస్టులు హాజరయ్యారని వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(WADA) తెలిపింది. మంగళవారం వాడా(WADA) ఇండియా యాంటీ డోపింగ్ ప్రోగ్రామ్ పేరిట ఒక రిపోర్టును విడుదల చేసింది. దేశంలోని అథ్లెట్లకు నిర్వహించిన డోపింగ్ టెస్టుకు సంబంధించి తెలియని చాలా విషయాలు రిపోర్టులో చాలా ఉన్నాయని వాడా పేర్కొంది. ప్రముఖ పత్రిక ఇండియన్ ఎక్స్‌ప్రెస్.. సమాచార హక్కు చట్టం కింద 2021-22లో ఎంత మంది ఇండియన్ క్రికెటర్లకు డోపింగ్ టెస్టులు నిర్వహించారనే దానిపై కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది. నేషనల్ యాంటీ డోపింగ్ ఏజేన్సీ(నాడా-NADA) ప్రకారం 2021, 2022 ఏడాదిలో మొత్తంగా 5961 డోపింగ్ టెస్టులు నిర్వహించారు. ఇందులో కేవలం 114 మంది భారత క్రికెటర్లు ఉంటే.. మిగతా వాళ్లు వివిధ రకాల క్రీడలకు చెందిన అథ్లెట్లు ఉన్నారు. ఇందులో 1717 మంది అథ్లెట్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్‌కు చెందినవారే ఉన్నారు. రోహిత్ శర్మకు ఆరుసార్లు.. ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు అత్యధికంగా ఆరుసార్లు డోపింగ్ పరీక్షలు నిర్వహించినట్లు రిపోర్టులో ఉంది. ముంబై, అహ్మదాబాద్, చెన్నై, యూఏఈ వేదికగా రోహిత్‌కు ఆరుసార్లు డోపింగ్ పరీక్షలు నిర్వహించారు. ఇక రిషబ్ పంత్, సూర్యకుమార్, చతేశ్వర్ పుజారా సహా మరో నలుగురు క్రికెటర్లకు ఒకసారి డోపింగ్ టెస్టు నిర్వహించారు. కోహ్లికి ఒక్కసారి కూడా.. మరో ఆసక్తికర విషయమేంటంటే.. బీసీసీఐలో కాంట్రాక్ట్ కలిగి ఉన్న 25 మంది ఆటగాళ్లలో 12 మందికి ఒక్కసారి కూడా డోపింగ్ టెస్టు నిర్వహించలేదు. ఆ లిస్టులో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి సహా టి20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా, బౌలర్లు మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, అర్ష్‌దీప్ సింగ్.. బ్యాటర్లు శ్రేయాస్ అయ్యర్, దీపక్ హుడా, వికెట్ కీపర్లు సంజూ శాంసన్, కోన శ్రీకర్ భరత్‌లు ఉన్నారు. ఇక ఆల్రౌండర్లలో వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు. ఇక మహిళల జట్టులో మాత్రం కాంట్రాక్ట్ కలిగి ఉన్న ప్రతీ క్రికెటర్‌కు కనీసం ఒక్కసారైనా డోపింగ్ టెస్టు నిర్వహించారు. ఇందులో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధానలకు మూడుసార్లు డోపింగ్ టెస్టులు నిర్వహించారు. ఈ డేటా ఆటగాళ్లు ఎలాంటి తప్పు చేయలేదని సూచించదు. అయినప్పటికీ, సంభావ్య నేరస్థులను పట్టుకోవడంలో NADA తగినంతగా చేయడం లేదని వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(WADA) తన వాదనను ఇది మరింత నొక్కి చెబుతుంది. దేశంలోని ఒలింపిక్ అథ్లెట్లను టార్గెట్ చేస్తున్న నాడా డోపింగ్ టెస్టుల కోసం పురుషుల క్రికెటర్ల నమూనాలను సేకరించడంలో మాత్రం వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో పరోక్షంగా బీసీసీఐ హస్తం ఉందని.. నాడా వారికి భయపడే అతి తక్కువ మంది క్రికెటర్లకు డోపింగ్ టెస్టులు నిర్వహిస్తోందని వాడా స్పష్టం చేసింది. రవి దహియా ఇంటికి 18సార్లు.. ఇక జనవరి 2021 నుంచి డిసెంబర్ 2022 వరకు జాతీయ యాంటీ డోపింగ్ సంస్థ(నాడా) డోపింగ్ టెస్టు నిర్వహించడం కోసం ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్ రవీ దహియా ఇంటికి 18సార్లు వెళ్లినట్లు సమాచారం. నిషేధిక డ్రగ్స్ వాడినట్లు ఆరోపణలు రావడంతో న్యూఢిల్లీతో పాటు తన సొంత రాష్ట్రం హర్యానాలోని సోన్పట్కు వెళ్లి అతని యూరిన్, బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేశారు. నీరజ్ చోప్రాను వదల్లేదు.. ఇక మహిళా వెయిట్‌లిఫ్టర్.. టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత మీరాభాయి చానుకు కూడా ఎనిమిది సార్లు డోపింగ్ పరీక్షలు నిర్వహించారు. పాటియాల, గాంధీనగర్‌తో పాటు విదేశాల్లోనూ ఆమెకు డోపింగ్ టెస్టులు చేశారు. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో మన దేశానికి బంగారు పతకం అందించిన జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రాను కూడా వదల్లేదు. 2021 నుంచి 2022 ఏడాదిలో నీరజ్ చోప్రాకు ఐదుసార్లు డోపింగ్ టెస్టులు నిర్వహించారు. పాటియాలా, ఫిన్లాండ్, అమెరికాలోనూ ఈ టెస్టులు చేవారు. అయితే ఇవన్నీ ఆటగాళ్లకు ఎలాంటి కాంపిటీషన్స్ లేనప్పుడు కూడా నిర్వహించడం ఆసక్తి కలిగించింది. మరి భారత క్రికెటర్లు ఏడాది పొడవునా ఏదో ఒక సిరీస్ ఆడుతూనే ఉంటారు. క్షణం తీరిక లేకుండా స్వదేశం, విదేశాల్లో టోర్నీలు ఆడే టీమిండియా మధ్యలో ఐపీఎల్ కూడా ఆడుతుంది. మరి ఆటగాళ్లంతా ఫిట్‌గా ఉన్నారా లేదా అనేది తెలుసుకోవడానికి డోపింగ్ టెస్టులు క్రమం తప్పకుండా చేయాల్సిందే. ఫిట్నెస్ సాధించడానికి 'యోయో(YOYO)' పేరుతో ఫిట్నెస్ టెస్టులు నిర్వహిస్తున్నారే తప్ప ఎవరైనా క్రికెటర్ నిషేధిత డ్రగ్ ఏమైనా వాడుతున్నాడా అనేది డోపింగ్ టెస్టులో నిర్వహిస్తేనే బయటపడుతుంది. మన దేశంతో పోలిస్తే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులు తమ క్రికెటర్లకు క్రమం తప్పకుండా డోపింగ్ టెస్టులు నిర్వహిస్తుంటారు. ఇంగ్లండ్ ఏజెన్సీ 96 మంది పురుషుల క్రికెటర్లకు డోపింగ్ టెస్టులు నిర్వహిస్తే.. ఆస్ట్రేలియా ఏజెన్సీ 69 మంది మెన్స్ క్రికెటర్లకు నిర్వహించింది. కానీ భారత్‌లో మాత్రం నాడా 12 మంది పురుషుల క్రికెటర్లకు మాత్రమే డోపింగ్ టెస్టులు నిర్వహించింది. చదవండి: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసు: బ్రిజ్‌భూషణ్‌కు బెయిల్ ‘గిన్నిస్’లోకి సాత్విక్ స్మాష్... -
ఆర్టిఫిసికల్ ఇంటిలిజెన్స్ ద్వారా క్రికెటర్స్ డిస్నీ క్యారెక్టర్స్ ఎపుడైనా చూశారా?
-
అయ్యో.. క్రికెట్ లెజెండ్స్ ఇలా మారిపోయారా?
-
అమ్మో మన ధోని, కోహ్లి, రిషభ్ ఇలా ఉంటారా?
-
టీమిండియా క్రికెటర్లకు షాక్ ఇచ్చిన మస్క్ మామ
-
క్రికెటర్లుగా మారిన సినీతారలు.. ఇక్కడే ఓ ట్విస్ట్ ఉందండోయ్!
ఆటకు వేళాయె అంటూ కొందరు స్టార్స్ ప్లేయర్స్‌గా మారారు. క్రికెటర్లుగా, కోచ్‌లుగా మౌల్డ్ అయిపోయారు. అయితే ఈ ఆట అంతా సినిమాల కోసమే. ప్రస్తుతం క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో కొన్ని చిత్రాలు రూపొందుతున్నాయి. కొన్ని కాల్పనిక కథలు కాగా, కొన్ని బయోపిక్స్ కూడా ఉన్నాయి. ఇక వెండితెరపై క్రికెటర్లుగా అలరించనున్న స్టార్స్ గురించి తెలుసుకుందాం. ► సూపర్ స్టార్ రజనీకాంత్ ఓ క్రికెట్ మ్యాచ్ నిర్వహణ మీద ఉన్నారు. ‘లాల్ సలామ్’ చిత్రం కోసమే ఇదంతా. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది. క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో విష్ణువిశాల్, విక్రాంత్ లీడ్ రోల్స్‌లో, రజనీకాంత్, జీవితా రాజశేఖర్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రంలో రజనీకాంత్ క్రికెట్ కోచ్ పాత్రలో కనిపిస్తారనీ, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధిగా కనిపిస్తారనీ ప్రచారం జరుగుతోంది. మరి.. రజనీ ఏ పాత్రలో కనిపిస్తారో చూడాలి. ‘లాల్ సలామ్’ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది. ► క్రికెట్ గ్రౌండ్లో బిజీగా ఉంటున్నారు మాధవన్, సిద్ధార్థ్, నయనతార. ఈ ముగ్గురూ కలిసి సిల్వర్ స్క్రీన్‌పై ఆడనున్న మ్యాచ్ ‘ది టెస్ట్’. తమిళ నిర్మాత శశికాంత్ దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా ఇది. ఈ చిత్రంలో నయనతార, మాధవన్, సిద్ధార్థ్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. టెస్ట్ క్రికెట్ ఫార్మాట్లో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు సమాచారం. పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం తమిళ్, తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ► శ్రీలంక మాజీ క్రికెటర్, స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’ టైటిల్‌తో తెరకెక్కుతోంది. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ చిత్రంలో సలీమ్ మాలిక్ పాత్ర చేసిన మధుర్ మిట్టల్ ఈ చిత్రంలో మురళీధరన్ పాత్ర చేస్తున్నారు. ముత్తయ్య భార్య మదిమలర్ పాత్రను మహిమా నంబియార్ చేస్తున్నారు. ‘‘మురళీధరన్ జీవితంలోని పలు కోణాలను ఈ చిత్రంతో వెండితెరపై ఆవిష్కరించనున్నాం. 800 వికెట్లు తీసిన ఏకైక ఆఫ్ స్పిన్ బౌలర్‌గా మురళీధరన్ పేరిట రికార్డు ఉంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ► భారత ప్రముఖ మాజీ క్రికెటర్ జులన్ గోస్వామి జీవితం ఆధారంగా రూపొందిన వెబ్ మూవీ ‘చక్దా ఎక్స్‌ప్రెస్’. ఇందులో జులన్ గోస్వామిగా అనుష్కా శర్మ నటించారు. ప్రోసిత్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. పశ్చిమ బెంగాల్ చక్దా ప్రాంతానికి చెందిన జులన్ గోస్వామి దాదాపు రెండు దశాబ్దాలు మహిళా క్రికెటర్‌గా, కెప్టెన్‌గా సక్సెస్ఫుల్ కెరీర్‌ను లీడ్ చేశారు. ఉమెన్స్ వన్ డే ఇంటర్నేషనల్ క్రికెట్ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా జులన్ రికార్డు సాధించారు. ► యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ సైతం క్రికెట్ బ్యాట్ పట్టారు. ‘మిస్టర్ అండ్ మిస్ట్రస్ మహి’ సినిమాలో జాన్వీ కపూర్ క్రికెటర్‌గా నటిస్తున్నారు. రాజ్‌కుమార్ రావ్ మరో లీడ్ రోల్ చేస్తున్నారు. శరణ్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. రియల్ క్రికెటర్స్ దగ్గర శిక్షణ తీసుకుని జాన్వీ కపూర్ ఈ సినిమా చేశారు. వీరితోపాటు మరికొందరు క్రికెటర్ల బయోపిక్‌లు, క్రికెట్ ఆధారంగా సినిమాలకు చర్చలు జరుగుతున్నాయి. -
దుబాయ్ ఇండోర్ క్రికెట్ సిరీస్‌కి వెళ్లనున్న ఆటగాళ్లు, వీరే!
2023 జనవరిలో జరిగిన సంక్రాంతి పండగ సందర్భంగా "శ్రీ సాంస్కృతిక కళాసారథి" ఏర్పాటు చేసిన 'మైగ్రెంట్ ఫోర్స్ క్రికెట్ లీగ్' (MFCL) టోర్నమెంట్ దాదాపు అందరికి గుర్తుండే ఉంటుంది. ఇందులో ఎన్నికైన ముగ్గురు ఉత్తమ తెలుగు కార్మిక సోదరులైన 'పినకాన తులసి రామ్, సీడి దిలీప్ వరప్రసాద్, అక్కరమని గణేష్ కుమార్' లను ఇండోర్ క్రికెట్ అసోసియేషన్ - సింగపూర్ (ICA) వారు ఏప్రిల్ 24, 25న జరగనున్న క్లబ్ వరల్డ్ సిరీస్, ఇండోర్ క్రికెట్ టోర్నమెంట్‌కు పంపుతున్నారని సమాచారం. ఈ టీమ్ కెప్టెన్‌గా రామ్ మడిపల్లి వ్యవహరించనున్నారని సింగపూర్ ఇండోర్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిథులు మురళీధరన్ గోవిందరాజన్, శంకర్ వీర తెలిపారు. "మైగ్రెంట్ ఫోర్స్ క్రికెట్ లీగ్" (MFCL) లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ముగ్గురు ఆటగాళ్ళు దుబాయ్ ఇండోర్ క్రికెట్ సిరీస్‌కి ఎంపిక అవ్వడం పట్ల పలువు టోర్నమెంట్ నిర్వాహుకులు హర్షం వ్యక్తం చేశారు. ఇందులో గిరిధర్ సారాయి, నగేష్ టేకూరి, పోతగౌని నర్సింహా గౌడ్, అశోక్ ముండ్రు, కంకిపాటి శశిధర్ , సుదర్శన్ పూల, రాము చామిరాజు, సుధాకర్ జొన్నాదుల, పాతూరి రాంబాబు, శ్రీధర్ భరద్వాజ్, సునీల్ రామినేని, కరుణాకర్ కంచేటి , మిట్టా ద్వారకానాథ్, తోట సహదేవుడు, ఎస్ కుమార్, లీల మోహన్, సురేంద్ర చేబ్రోలు మొదలైనవారు ఉన్నారు. -
Formula E : హుస్సేన్ ‘సాగర తీరం’లో రేసింగ్.. సినీ, క్రికెట్ ప్రముఖుల సందడి (ఫొటోలు)
-
ఫార్ములా ఈ రేసులో క్రికెట్, సినీ హీరోల సందడి
-
అమిత్ షాతో పాండ్యా బ్రదర్స్ భేటీ
భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యాలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను న్యూఇయర్‌ను పురస్కరించుకుని శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం షాతో భేటీపై సోషల్ మీడియా వేదికగా ఫోటో షేర్ చేశారు హార్దిక్ పాండ్యా. తన ఇంటికి ఆహ్వానించినందుకు అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హోంమంత్రి అమిత్ షాతో వీరు భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘మీతో విలువైన సమయాన్ని గడిపేందుకు ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు. మిమ్మల్ని కలవడం గౌరవంగా భావిస్తున్నాం. ’అంటూ సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు హార్దిక్ పాండ్యా. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. పాండ్యా స్వస్థలం గుజరాత్ కావడంతోనే షా వారిని కలిసినట్లుగా పలువురు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం హార్దిక్, క్రునాల్ పాండ్యాలు క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకుని సేదతీరుతున్నారు. డిసెంబర్లో బంగ్లాదేశ్ టూర్‌కు హార్దిక్‌కు విశ్రాంతినివ్వగా.. క్రునాల్ పాండ్యా చివరిసారిగా నవంబర్‌లో విజయ్ హజారే ట్రోఫీలో బరోడా తరఫున ఆడారు. ఇటీవలో భారత టీ20 జట్టుకు సారథిగా ఎన్నికయ్యాడు హార్దిక్ పాండ్యా. కొత్త ఏడాదిని శ్రీలంకతో జరగనున్న 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో మొదలు పెట్టనున్నాడు. జనవరి 3 నుంచి ఈ పర్యటన ప్రారంభం కానుంది. ఈ టూర్లో రోహీత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, భువనేశ్వర్ కుమార్ వంటి స్టార్లకు విశ్రాంతినిచ్చింది బీసీసీఐ. మరోవైపు.. శ్రీలంకతో జరగనున్న వన్డే సిరీస్‌కు హార్దిక్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించింది బీసీసీఐ. Thank you for inviting us to spend invaluable time with you Honourable Home Minister Shri @AmitShah Ji. It was an honour and privilege to meet you. 😊 pic.twitter.com/KbDwF1gY5k — hardik pandya (@hardikpandya7) December 31, 2022 ఇదీ చదవండి: నీకే కాదు.. నీ తండ్రికి కూడా ఎవరూ భయపడటం లేదు: ఫడ్నవీస్ -
గుర్తు తెలియని వైరస్ సోకడంతో ఇంగ్లాండ్ క్రికెటర్లకు అస్వస్థత
-
కెప్టెన్సీ వద్దంటున్న ఆస్ట్రేలియా క్రికెటర్స్ ..!
-
హైదరాబాద్ చేరుకున్న భారత్ ,ఆస్ట్రేలియా జట్లు
-
APL 2022: ఏపీఎల్‌లో రాణిస్తున్న వైజాగ్ ఆటగాళ్లు
విశాఖ స్పోర్ట్స్: ఐపీఎల్.. క్రికెట్ ఆడే ప్రపంచ దేశాల్లోని ఆట గాళ్లకు ఎంతో మోజు. దేశంలో ఈ లీగ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినా పనిలేదు. రాష్ట్రాల్లోనూ ఇదే తరహాలో ప్రీమి యర్ లీగ్‌లు కొనసాగుతున్నాయి. ఐపీఎల్ స్ఫూర్తితో ఆంధ్రాలో ప్రీమియర్ లీగ్(ఏపీఎల్) ప్రారంభమైంది. లీగ్ తొలి దశ శుక్రవారంతో ముగిసింది. లీగ్‌ల్లో నాలుగు ప్రాంచైజీ జట్లు రెండేసి మ్యాచ్‌లు ఆడాయి. రాయలసీమ కింగ్స్ మూడు మ్యాచ్‌లు ఆడగా వైజాగ్ వారియర్స్ ఒక మ్యాచ్‌నే ఆడింది. దీంతో బెజవాడ టైగర్స్‌తో పాటు మిగిలిన మూడు జట్లు ఆరేసి పాయింట్లు సాధించినా.. నెట్ రన్‌రేట్‌తో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర లయన్స్ రెండో స్థానంలో, మూడు మ్యాచ్‌లాడిన రాయలసీమ కింగ్స్ మూడో స్థానంలో, గోదావరి టైటాన్స్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి. రాణిస్తున్న మన కుర్రాళ్లు ఉత్తరాంధ్ర నుంచి రెండు ప్రాంచైజీలకు అవకాశం ఇవ్వగా సెంట్రల్ ఆంధ్ర, దక్షిణాంధ్ర నుంచి మరో రెండేసి ప్రాంచైజీలకు అర్హత కల్పించారు. ఉత్తరాంధ్ర నుంచి హోం టీమ్‌గా వైజాగ్ వారియర్స్, ఉత్తరాంధ్ర లయన్స్ జట్లు ఆడుతున్నాయి. వైజాగ్ వారియర్స్‌కు విశాఖ ఆటగాళ్లు లేకున్నా.. ఉత్తరాంధ్ర లయన్స్ జట్టు కెప్టెన్‌గా భరత్‌ను, బౌలర్ అజయ్‌ను తీసుకుంది. అయితే అజయ్‌కు తొలి మ్యాచ్‌లో బాటింగ్ చేసే అవకాశం రాకుండానే జట్టు విజయం సాధించగా.. భరత్ అందుబాటులో లేడు. రెండో మ్యాచ్‌కు భరత్ అందుబాటులోకి వచ్చినా.. వర్షం అడ్డంకిగా మారి మ్యాచ్ రద్దయింది. సెంట్రల్ ఆంధ్ర నుంచి పోటీపడుతున్న రెండు జట్లకు విశాఖ కుర్రాళ్లే కెప్టెన్లుగా ముందుండి.. ఆడిన తొలి మ్యాచ్‌ల్లో జట్లను విజయతీరానికి చేర్చారు. బెజవాడ టైగర్స్‌కు అంతర్జాతీయ ఆటగాడు రికీబుయ్ ముందుండి నడపడమే కాక తొలి మ్యాచ్‌లో మూడో వికెట్ పడకుండానే విశాఖ కుర్రాడు అవినాష్‌తో కలిసి అజేయంగా ఉండి జట్టును గెలిపించాడు. బౌలర్ మనీష్ రెండు వికెట్లతో పాటు చివరి బ్యాటర్‌ను రనౌట్ చేసి ప్రత్యర్థి జట్టును తక్కువ స్కోర్‌కే నిలువరించడంలో సహకరించాడు. ఇక బి.సుమంత్(21 బంతుల్లోనే రెండు ఫోర్లతో 31 పరుగులు) ఓపెనర్‌గా వచ్చి తొలి వికెట్‌కు 66 పరుగుల(లక్ష్య ఛేదనలో సగం పరుగులు) భాగస్వామ్యాన్ని అందించాడు. టాప్ ఆర్డర్లో అవినాష్, రికీబుయ్ జోడీ వికెట్ చేజారుకుండానే జట్టును గెలిపించింది. ఇక టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో గోదావరి టైటాన్స్‌ను విశాఖ కుర్రాడు శశికాంత్ కెప్టెన్సీలో విజయతీరానికి చేర్చి శుభారంభం చేశాడు. టోర్నీలోనే తొలి అర్ధసెంచరీ నమోదు చేయడమే కాక మ్యాచ్ బెస్ట్‌గానూ నిలిచాడు. విశాఖ కుర్రాళ్లు ఓపెనర్‌గా హేమంత్, టాప్ ఆర్డర్లో నితీష్(25) రాణించారు. ఇక దక్షిణాంధ్ర జట్లు కోస్టల్ రైడర్స్, రాయలసీమ కింగ్స్‌లో ఒక్క విశాఖ ఆటగాడికి ఆడే అవకాశం రాలేదు. అటు ఐపీఎల్‌లోనే కాకుండా ఏపీఎల్‌లో సైతం స్థానిక ఆటగాళ్లు ఇతర ప్రాంచైజీ జట్లకు ఆడుతూ విజయంలో కీలకపాత్ర పోషించడం క్రీడాస్ఫూర్తికి నిదర్శనం. వరుణుడి రాకతో మ్యాచ్‌లు రద్దు ఏపీఎల్‌లో భాగంగా వైఎస్సార్ స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఉత్తరాంధ్ర లయన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బెజవాడ టైగర్స్ బ్యాటింగ్‌కు దిగింది. ఏడు ఓవర్లలో మూడు వికెట్లకు 23 పరుగుల చేసిన స్థితిలో వరుణుడు ప్రవేశించాడు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో మ్యాచ్ రద్దయింది. ఇరు జట్లకు రెండేసి పాయింట్లు చేకూరాయి. రాత్రి ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఆడాల్సిన మ్యాచ్ సైతం వర్షం కారణంగా రద్దయింది. దీంతో గోదావరి టైటాన్స్, రాయలసీమ కింగ్స్ జట్లకు చెరో రెండేసి పాయింట్లు కేటాయించారు. (క్లిక్: విశాఖ ఐటీ హిల్స్‌లో ఇన్ఫోసిస్!) -
టోర్నీ ముగిసినా స్వదేశానికి రాలేదు.. ఆరా తీస్తే
అండర్-19 ప్రపంచకప్ టోర్నీ ముగిసిన తర్వాత అఫ్గనిస్తాన్ జట్టులోని నలుగురు స్వదేశానికి వెళ్లడానికి నిరాకరించారు. ఆ దేశంలో నెలకొన్న అనిశ్చితి కారణంగానే ఆ నలుగురు లండన్‌లోనే ఆశ్రయం పొందుతున్నారని తెలిసింది. అందులో ఒకరు క్రికెటర్ కాగా.. మిగతా ముగ్గురు సిబ్బంది ఉన్నారు. ఈ విషయాన్ని అఫ్గన్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో వెల్లడించినట్లు సమాచారం. అండర్-19 ప్రపంచకప్ ఆడడానికి వెళ్లిన మా జట్టులో ఒక ఆటగాడు సహా ముగ్గురు సిబ్బంది స్వదేశానికి తిరిగిరాలేదు. వెస్టిండీస్ నుంచి నేరుగా బ్రిటన్ వెళ్లిన ఆ నలుగురు అక్కడే ఆశ్రయం పొందుతున్నారని తెలిసింది. చదవండి: కోహ్లి ఆ తప్పు చేసి ఉండకూడదు.. ఇకనైనా జాగ్రత్తగా ఉండాలి టోర్నీ ముగిసిన తర్వాత అఫ్గన్ క్రికెటర్లు అంటిగ్వా నుంచి కాబుల్ వయా యూఏఈ నుంచి స్వదేశానికి చేరుకున్నారు. అయితే ఆ నలుగురు మాత్రం ఆస్ట్రేలియాతో ప్లేఆఫ్స్ ముగిశాక యూఏఈ వరకు కలిసి ప్రయాణించినప్పటికి.. అక్కడి నుంచి లండన్ ఫ్లైట్ ఎక్కినట్లు తెలుస్తోంది. అయితే ఇలా జరగడం ఇది తొలిసారి మాత్రం కాదు. గతంలోనూ 2009 అండర్ -19 ప్రపంచకప్‌లో క్వాలిఫయర్స్ ముగిసిన తర్వాత టొరంటో, కెనడాకు చెందిన క్రికెటర్లు తమ దేశంలో భద్రతా పరమైన సమస్యలు ఉన్నాయని వేరే దేశంలో తలదాచుకున్నారు. కాగా ఈ విషయంపై అఫ్గనిస్తాన్ అండర్-19 హెడ్‌కోచ్ రయీస్ అహ్మద్‌జై స్పందించాడు. ఈ ఆరోపణలను కొట్టివేస్తూ.. విషయం తెలియగానే ఆ నలుగురికి..'' మీ అవసరం అఫ్గనిస్తాన్ క్రికెట్‌కు ఉంది అని'' మెసేజ్ పెట్టాను. మెసేజ్ చూసినప్పటికి వారి వద్ద నుంచి ఎలాంటి సమాధానం రాలేదని పేర్కొన్నాడు. కాగా అఫ్గనిస్తాన్ జట్టు అండర్-19 ప్రపంచకప్‌లో మంచి ప్రదర్శన కనబరిచింది. సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో పరాజయం పాలైనప్పటికి అఫ్గనిస్తాన్ ఆకట్టుకుంది. ఇక మూడో స్థానం కోసం ఆస్ట్రేలియాతో జరిగిన పోరులో ఆఖరి వరకు పోరాడినప్పటికి ఓటమి పాలైన అఫ్గన్ టోర్నీని నాలుగో స్థానంతో ముగించింది. చదవండి: IPL 2022 Auction:షేక్ రషీద్ సహా ఏడుగురు అండర్-19 ఆటగాళ్లకు బిగ్‌షాక్! -
తెర మీదే అయినా... తగ్గేదే లే!
సినిమాలో ఆటా (డ్యాన్స్) పాటా హీరోయిన్లకు కామన్. అయితే సినిమాలో వేరే ఆట (స్పోర్ట్స్) ఆడాల్సి వస్తే! సినిమా ఆటే కదా అని తేలికగా తీసుకోరు. కెమెరా ముందే అయినా... తగ్గేదే లే! అంటూ విజృంభిస్తారు. తాప్సీ, అనుష్కా శర్మ, జాన్వీ కపూర్... ఈ ముగ్గురూ వెండితెరపై అసలు సిసలైన క్రికెటర్లు అనిపించుకోవడానికి శిక్షణ తీసుకున్నారు. ఆగేదే లే అంటూ బరిలోకి దిగారు. ఆ ఆట విశేషాలు తెలుసుకుందాం. గ్లామర్‌కి చిరునామా అనే తరహా పాత్రలు తాప్సీ చాలానే చేశారు. అయితే చాన్స్ వస్తే అందుకు భిన్నమైన పాత్రలు చేయడానికి వెనకాడరు. పింక్, నామ్ షబానా, సూర్మ, సాండ్ కీ ఆంఖ్, రష్మీ రాకెట్ తదితర హిందీ చిత్రాలతో కెరీర్ ఇన్నింగ్స్‌ని బ్రహ్మాండంగా తీసుకెళుతున్నారు తాప్సీ. ఇప్పటికే సూర్మ, సాండ్ కీ ఆంఖ్, రష్మీ రాకెట్ వంటి క్రీడా నేపథ్యం ఉన్న చిత్రాల్లో నిరూపించుకున్నారు. ఇప్పుడు ‘శభాష్ మిథు’లో క్రికెటర్‌గా తెరపై దూసుకు రావడానికి రెడీ అయ్యారు. భారతీయ ప్రముఖ మహిళా క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా కోసం మాజీ క్రికెటర్ నూషిన్ అల్ ఖదీర్ దగ్గర ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు తాప్సీ. ‘‘నిర్భయంగా ఆడే ప్రతి క్రీడాకారుల వెనక ఓ నిర్భయమైన కోచ్ ఉంటారు. నాలోని బెస్ట్‌ని బయటికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు నూషిన్’’ అని గత ఏడాది టీచర్స్ డే సందర్భంగా తాప్సీ పేర్కొన్నారు. ఇక అచ్చంగా మిథాలీ రాజ్‌లా కనబడటం మీద కాదు కానీ ఆమెలా ఆడటం, ప్రవర్తించడం మీద ఎక్కువగా దృష్టి పెట్టామని కూడా తాప్సీ అన్నారు. ‘‘పోస్టర్ షూట్‌కి ముందు నేను మిథాలీ రాజ్‌తో మాట్లాడాను. పోస్టర్ చూశాక తనకూ, నాకూ పెద్దగా తేడా ఉన్నట్లు అనిపించలేదని మిథాలీ అన్నారు. సినిమా చూశాక కూడా ఆమె ఈ మాట అనాలని ఎదురు చూస్తున్నాను’’ అన్నారు తాప్సీ. వచ్చే నెల 4న ఈ చిత్రాన్ని థియేటర్స్‌లో విడుదల చేయనున్నట్లు ఇటీవల ఈ చిత్రబృందం ప్రకటించింది. ఇక బాలీవుడ్లో ఉన్న మరో గ్లామరస్ హీరోయిన్ అనుష్కా శర్మ. తాప్సీలానే అనుష్క కూడా చాలెంజింగ్ రోల్స్ చేస్తుంటారు. ‘ఎన్‌హెచ్ 10, పరీ, సూయీ థాగా’ చిత్రాలు అందుకు ఓ ఉదాహరణ. 2017లో క్రికెటర్ విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకుని, నటనకు చిన్న బ్రేక్ ఇచ్చారు అనుష్కా శర్మ. ఇప్పుడు మళ్లీ నటించాలనుకుంటున్నారు. బ్రేక్ తర్వాత ఓ చాలెంజింగ్ రోల్‌తో ప్రేక్షకులకు కనిపించనున్నారు. భారత ప్రముఖ మహిళా క్రికెటర్ ఝులన్ గోస్వామి బయోపిక్‌లో అనుష్క నటిస్తున్నారు. ‘చక్‌ద ఎక్స్‌ప్రెస్’ టైటిల్‌తో ప్రోసిత్ రాయ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. కాగా కాన్సెప్ట్ నచ్చి, ‘ఎన్‌హెచ్ 10’, ‘పరీ’లాంటి చిత్రాలను నిర్మించిన అనుష్కా శర్మ ‘చక్‌ద ఎక్స్‌ప్రెస్’ని కూడా నిర్మిస్తున్నారు. ఈ సినిమా చాలామందికి ఓ కనువిప్పు అని అనుష్కా శర్మ చెబుతూ – ‘‘మహిళలు క్రికెట్ ఆడటం అనేది పెద్ద విషయంగా అనుకుంటున్న సమయంలో ఝలన్ క్రికెటర్‌గా మారి, ప్రపంచ వేదికపై తన దేశం గర్వపడేలా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమా ఆమె జీవితం గురించి మాత్రమే కాదు.. మహిళా క్రికెట్ గురించి కూడా చెబుతుంది. క్రికెట్ ఆడటం ద్వారా మహిళలకు ఓ మంచి కెరీర్ ఉండదనే ఆలోచనా ధోరణిని మార్చేందుకు ఝులన్ కృషి చేశారు. భారతదేశంలో మహిళా క్రికెట్లో విప్లవాత్మక మార్పులు చేసినందుకు ఝులన్, ఆమె సహచరులకు సెల్యూట్ చేయాలి’’ అన్నారు. ఇక.. ప్రాక్టీస్ అంటారా? ఇంట్లోనే మంచి క్రికెటర్ ఉన్నారు కాబట్టి.. క్రికెటర్ పాత్ర కోసం భర్త విరాట్ నుంచి అనుష్క టిప్స్ అడిగి తెలుసుకుని ఉంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటు తాప్సీ సినిమాల పరంగా స్కోర్ యాభైకి టచ్ అవుతుంటే అటు అనుష్కా శర్మ స్కోర్ పాతిక చిత్రాల వరకూ ఉంది. అయితే పట్టుమని పది సినిమాల స్కోర్ కూడా లేని జాన్వీ కపూర్ కూడా క్రికెట్ బ్యాట్‌తో నటిగా ప్రేక్షకుల నుంచి మంచి స్కోర్ దక్కించుకోవడానికి రెడీ అయ్యారు. దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ ‘ధడక్’ చిత్రంతో కథానాయికగా పరిచయం అయిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత ‘గుంజన్ సక్సేనా’ బయోపిక్‌ని జాన్వీ అంగీకరించడం విశేషం. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో ఎయిర్ ఫోర్స్‌లో తొలి మహిళా అధికారిగా పాల్గొన్న గుంజన్ సక్సేనా పాత్రలో జాన్వీ మెప్పించగలిగారు. ఇప్పుడు క్రికెట్ నేపథ్యంలో ఉన్న సినిమా సైన్ చేశారు. ‘మిస్టర్ అండ్ మిసెస్ మహీ’ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరో రాజ్‌కుమార్ రావ్, జాన్వీ కపూర్ క్రికెటర్లుగా కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం టీమిండియా క్రికెటర్ దినేష్ కార్తీక్ వద్ద శిక్షణ తీసుకుంటున్నారు జాన్వీ. హెల్మెట్ పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోను బుధవారం షేర్ చేసి, ‘‘క్రికెట్ క్యాంప్.. ‘మిస్టర్ అండ్ మిసెస్ మహీ’’ అని పేర్కొన్నారు జాన్వీ. శరన్ శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం అక్టోబర్ 7న విడుదల కానుంది. ‘శభాష్ మిథు’, ‘చక్‌ద ఎక్స్‌ప్రెస్’, ‘మిస్టర్ అండ్ మిసెస్ మహీ’ .. చిత్రాలపై మంచి అంచనాలు ఉన్నాయి. తాప్సీ, అనుష్కా శర్మ, జాన్వీ కపూర్ మంచి ఆర్టిస్టులే కాబట్టి వెండితెర క్రికెటర్లుగా ప్రేక్షకుల నుంచి మంచి స్కోర్ దక్కించుకుంటారని చెప్పొచ్చు. -
BCCI: అనుకున్నాం... కానీ ఇవ్వలేకపోయాం
న్యూఢిల్లీ: గతేడాది కరోనా కారణంగా ఫస్ట్‌క్లాస్ క్రికెటర్లకు ప్రతిష్టాత్మకమైన రంజీ టోర్నీ రద్దయింది. మ్యాచ్ ఫీజులు, కాంట్రాక్టుల రూపంలో దేశవాళీ ఆటగాళ్లకు చెప్పలేనంత ఆర్థిక నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పెద్ద మనసు చేసుకుంది. ఆయా టోర్నీలను కోల్పోయిన పురుషులు, మహిళా క్రికెటర్లకు పరిహారం అందజేయాలని గతేడాదే నిర్ణయించుకుంది. ఇందుకోసం ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసుకుంది. అయితే బోర్డు కృషి మాత్రం ప్రణాళికాబద్ధంగా సాగలేదు. ఆచరణలో విఫలమైంది. ఏడాది పూర్తయినా కానీ ఇంకా ఫస్ట్‌క్లాస్ క్రికెటర్లకు, అమ్మాయిలకు ఎలాంటి పరిహారభత్యం అందలేదు. మహిళల టి20 ప్రపంచకప్ రన్నరప్ భారత్‌కు ప్రైజ్‌మనీ ఇవ్వలేదన్న అంశం తెరమీదకు రావడంతో ఇప్పుడు ఫస్ట్‌క్లాస్ ఆటగాళ్ల చెల్లింపుల విషయం కూడా బయటికొచ్చింది. దీనిపై బోర్డు కోశాధికారి అరుణ్ ధుమాల్ మాట్లాడుతూ రాష్ట్ర క్రికెట్ సంఘాలు ఆటగాళ్ల జాబితాలను ఇప్పటివరకు బీసీసీఐకి పంపలేదని, వారి తాత్సారం వల్లే ఫస్ట్‌క్లాస్ క్రికెటర్లకు పరిహారం అందజేయలేకపోయామని చెప్పారు. ‘ఎవరు ఆడేవాళ్లు. ఎన్ని మ్యాచ్‌లు ఆడతారు. ఎవరు రిజర్వ్ ఆటగాళ్లు అన్న వివరాలేవీ రాష్ట్ర సంఘాలు పంపలేదు. అందుకే చెల్లించలేకపోయాం’ అని అరుణ్ అన్నారు. -
ప్రసిధ్ కృష్ణ ‘పాజిటివ్’
ముంబై: ఐపీఎల్ టి20 టోర్నీ వాయిదా పడిన తర్వాత మరో ఇద్దరు క్రికెటర్లు కరోనా పాజిటివ్‌గా తేలారు. ఈ ఇద్దరూ కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) బృందంలోని సభ్యులే. పేస్ బౌలర్ ప్రసిధ్ కృష్ణ, న్యూజిలాండ్‌కు చెందిన వికెట్ కీపర్ టిమ్ సీఫెర్ట్‌లకు కరోనా సోకినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ‘రెండు నెగెటివ్ ఫలితాలు వచ్చిన తర్వాత ఇతర భారత క్రికెటర్లలాగే ప్రసిధ్ కూడా మే 3న బబుల్ వీడాడు. అయితే స్వస్థలం బెంగళూరు చేరిన తర్వాత అతని రిపోర్టు పాజిటివ్‌గా వచ్చింది’ అని బోర్డు అధికారి ఒకరు చెప్పారు. న్యూజిలాండ్‌కు చెందిన సీఫెర్ట్‌కు కూడా కరోనా రావడంతో అతను తన సహచర ఆటగాళ్లతో కలిసి ప్రత్యేక విమానంలో స్వదేశం వెళ్లే అవకాశం లేకుండా పోయింది. బయలుదేరే ముందు అతనికి చేసిన రెండు పరీక్షల్లో కూడా కరోనా ‘పాజిటివ్’ వచ్చింది. దాంతో సీఫెర్ట్ అహ్మదాబాద్‌లోనే ఆగిపోయాడు. సీఎస్కే బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ తరహాలోనే మెరుగైన చికిత్స కోసం సీఫెర్ట్‌ను కూడా చెన్నైకి తరలించనున్నారు. ఐసోలేషన్, ఆపై టెస్టులు నెగెటివ్‌గా వస్తేనే అతను న్యూజిలాండ్ పయనమవుతాడు. సీఫెర్ట్ ఆరోగ్యం గురించి తమకు పూర్తి సమాచారం ఉందని... బీసీసీఐతో పాటు అతను కోలుకునేందుకు తమవైపు నుంచి కూడా అన్ని రకాల సహకారం అందిస్తామని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ వైట్ వ్యాఖ్యానించారు. ప్రసిధ్‌కు సాధ్యమేనా... ఇంగ్లండ్ పర్యటనకు సెలక్టర్లు ప్రకటించిన నలుగురు రిజర్వ్ ఆటగాళ్లలో ప్రసిధ్ కృష్ణ ఒకడు. టీమిండియా బృందం ఈ నెల 25న ప్రత్యేక బయో బబుల్‌లోకి ప్రవేశిస్తుంది. ఆలోగా అతను నెగెటివ్‌గా తేలాల్సి ఉంటుంది. మరోవైపు ఇంగ్లండ్ వెళ్లాల్సిన భారత క్రికెటర్లంతా కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకుంటే బాగుంటుందని బీసీసీఐ భావిస్తోంది. ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన కోవిషీల్డ్‌ను తీసుకుంటే అది ఇంగ్లండ్‌లో కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి రెండో డోసు అక్కడా తీసుకోవచ్చనేది ఆలోచన. అయితే ప్రసిధ్ ఈ నెల 18 లేదా 20 వరకు నెగెటివ్‌గా తేలినా... వైద్య సూచనల ప్రకారం కరోనా నుంచి కోలుకున్న తర్వాత వ్యాక్సిన్‌కు కనీసం నాలుగు వారాల విరామం అవసరం. మరి ప్రసిధ్ విషయంలో బీసీసీఐ ఏం చేస్తుందనేది చూడాలి. -
ఐపీఎల్లో పాక్ క్రికటర్ల రీఎంట్రీ..?
ముంబై: ఐపీఎల్ తొలి ఎడిషన్‌లో మాత్రమే ప్రాతినిధ్యం వహించిన పాక్ క్రికెటర్లు, ఆతర్వాత వివిధ కారణాల చేత లీగ్‌కు దూరంగా ఉన్నారు. అయితే వారి 14 ఏళ్ల నిరీక్షణకు 2022 ఐపీఎల్ సీజన్లో తెరపడే అవకాశం కనిపిస్తోంది. భారత్, పాక్‌ల మధ్య స్నేహపూరిత వాతావరణం నెలకొని, చర్చలకు ఇరు దేశాధినేతలు అంగీకరించి, ఆ చర్చలు విజయవంతంగా ముగిస్తే.. వచ్చే ఏడాది ఐపీఎల్లో పాక్ క్రికెటర్లు ఆడే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది భారత్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ కోసం పాక్ క్రికెటర్లు భారత్‌కు రానున్నారు. ఆతరువాత ఇరు దేశాల మధ్య టీ20 సిరీస్ జరుగుతందన్న వార్తలు సైతం వినిపిస్తున్నాయి. కాగా, పాక్ ఆటగాళ్లు 2008లో తొలిసారిగా లీగ్‌లో పాల్గొన్నారు. ఇదే వారికి మొదటిది, ఆఖరిది. అప్పుడు 12 మంది పాక్ ఆటగాళ్ళు వివిధ ఫాంచైజీలకు ప్రాతినిధ్యం వహించారు. ఆ సీజన్లో మొత్తం 8 జట్లు పోటీలో ఉండగా, 5 జట్ల తరఫున 12 మంది పాక్ క్రికెటర్లు ప్రాతినిధ్యం వహించారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ యాజమాన్యంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ అత్యధికంగా నలుగురు పాక్ ఆటగాళ్లకు అవకాశం కల్పించగా, రాజస్థాన్ రాయల్స్ ముగ్గురిని, ఢిల్లీ డేర్‌డెవిల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు చెరో ఇద్దరిని కొనుగోలు చేశాయి. హైదరాబాద్‌కు చెందిన డెక్కన్ చార్జర్స్ కు పాక్ చిచ్చరపిడుగు షాహిద్ అఫ్రిది ప్రాతినిధ్యం వహించారు. ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ సోహైల్ తన్వీర్.. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. ఆ మ్యాచ్‌లో తన్వీర్ 4 ఓవర్లలో 14 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఆ రికార్డు ఐపీఎల్లో 11 ఏళ్ల పాటు అలానే కొనసాగింది. 2019 సీజన్లో ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ అల్జారి జోసెఫ్, తన లీగ్ డెబ్యూ మ్యాచ్‌లోనే తన్వీర్ రికార్డును బద్దలు కొట్టాడు. హైదరాబాద్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో జోసెఫ్ 3.4 ఓవర్లలో 12 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. -
బుమ్రా 'ప్యా'ర్కర్కు సంజన క్లీన్ బౌల్డ్..
ముంబై: టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా.. ప్రేయసి సంజన గణేశన్ సంధించిన 'ప్యా'యార్కర్‌కు క్లీన్ బౌల్డయ్యాడంటూ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బుమ్రా.. తన ప్రేయసి, స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్‌ను ఇవాళ గోవాలో వివాహం చేసుకున్న నేపథ్యంలో సన్నిహితుల శుభాకాంక్షలతో ఈ జంట తడిసి ముద్దవుతోంది. వీరి జంట వివాహం చేసుకోబోతున్నారనే వార్త గత కొద్ది రోజులుగా నెట్టింట హల్చల్ చేసిన నేపథ్యంలో ఇవాళ ఇరువురి కుటుంబసభ్యుల సమక్షంలో వీరు ఒక్కటయ్యారు. అభిమానుల కోసం బుమ్రా సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోలను షేర్ చేయడంతో అతని సన్నిహితులు, పలువురు క్రికెటర్లు, సినీ, రాజకీయ ప్రముఖులు వీరికి విషెస్ చెబుతున్నారు. Many congratulations on the start of this beautiful journey. Wishing you both a lifetime of happiness.❤️ https://t.co/MdkdKbwFjj — BCCI (@BCCI) March 15, 2021 Bumrah bowled over by Sanjana 💥 Here's wishing love, laughter and a happily ever after for @Jaspritbumrah93 and @SanjanaGanesan 👩❤️👨 #OneFamily #MumbaiIndians pic.twitter.com/tbJ3YXhN2I — Mumbai Indians (@mipaltan) March 15, 2021 Congratulations @Jaspritbumrah93 and @SanjanaGanesan 💐 Best wishes for a wonderful life together! https://t.co/go7ELMkPJM — ICC (@ICC) March 15, 2021 -
సిక్స్ కొట్టినంత ఈజీ కాదు.. సచిన్‌కు జగ్గారెడ్డి కౌంటర్
సాక్షి, హైదరాబాద్: ‘క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, రవిశాస్త్రి, సినీ తారలు కంగనా, అజయ్ దేవగన్, అక్షయ్‌కుమార్ లాంటి వారు ఒక్కసారి నాగలి పట్టి, భూమి దున్ని, ఇత్తులేసి, నీరు పోసి, పంట పండించగలరా? నాగలి పట్టి, పొలం దున్ని, పంట పండించడం అంటే క్రికెట్ ఆడినంత ఈజీ కాదు.. సినిమాల్లో డైలాగ్ చెప్పి డాన్స్ చేసినంత సులువు కాదు. రైతుల గురించి, వారు చేస్తున్న ఉద్యమాల గురించి అవమానకరంగా మాట్లాడడం మానుకోవాలి’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి హితవు పలికారు. రైతులు పండించిన పంట తింటూ వారి పోరాటాన్నే వ్యతిరేకిస్తూ కొందరు సినీ తారలు, క్రికెట్ ప్లేయర్లు మూర్ఖంగా మాట్లాడటం బాధాకరమని శుక్రవారం ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ‘సినీ పరిశ్రమలో, క్రికెట్ ఆటలో విరామం ఉంటుంది. వారు ఆడుతున్నా, నటిస్తున్నా చప్పట్లు కొట్టి ప్రోత్సహిస్తారు. కానీ రైతులు నాగలి పట్టి భూమి దున్నేటప్పుడు అలాంటిదేమీ ఉండదు. రైతులకు పరాయి దేశస్తులు మద్దతిస్తే దాన్ని చూసి బుద్ధి తెచ్చుకోవాల్సిన సెలబ్రిటీలు విమర్శలు చేయడం సిగ్గుచేటు’అని దుయ్యబట్టారు. -
క్రికెటర్స్.. ‘గేమ్’చేంజర్స్..!
కొన్నాళ్ల క్రితం దాకా ఎక్కువగా ఫుడ్ బిజినెస్ వైపు మొగ్గు చూపిన క్రికెటర్లు ప్రస్తుతం ఇతరత్రా రంగాలపై దృష్టి పెడుతున్నారు. ఫ్యాషన్, ఫిట్నెస్, గ్రూమింగ్ ఉత్పత్తులు మొదలైన వాటిపై ఆసక్తి చూపుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి టీమిండియా కోచ్ రవి శాస్త్రి కూడా ఈ జాబితాలో చేరాడు. 23 యార్డ్స్ పేరిట పురుషుల సౌందర్య సాధనాల శ్రేణిని ప్రవేశపెట్టాడు. ఇందుకోసం ఆదూర్ మల్టీప్రొడక్ట్స్ సంస్థతో జట్టు కట్టాడు. 23 యార్డ్స్ బ్రాండ్‌తో బాడీ వాష్, షేవింగ్ జెల్, డియోడరెంట్, శానిటైజర్ వంటి ఉత్పత్తులు లభిస్తాయి. ప్రస్తుతానికి ఆన్లైన్ మాధ్యమంలోనే వీటిని విక్రయిస్తున్నారు. దేశీయంగా పురుషుల గ్రూమింగ్ ఉత్పత్తుల మార్కెట్ దాదాపు రూ. 5,000 కోట్ల పైచిలుకు ఉంటుందని అంచనా. కోహ్లి అండ్ కో..: ఇప్పటికే చాలా మంది మాజీ, ప్రస్తుత క్రికెటర్లు.. ఇలాంటి వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేశారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి ఫ్యాషన్ లేబుల్ రాంగ్, ఇండియన్ సూపర్ లీగ్ టీమ్ ఎఫ్‌సీ గోవాలో వాటాలు ఉన్నాయి. అలాగే జిమ్ చెయిన్ చిజెల్, స్టార్టప్ సంస్థలు స్పోర్ట్ కన్వో, స్టెపథ్లాన్ కిడ్స్‌లోనూ ఇన్వెస్ట్ చేశాడు. అటు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఫిట్నెస్ క్లబ్ స్పోర్ట్స్‌ఫిట్, ఫిట్నెస్.. లైఫ్‌స్టైల్ బ్రాండ్ సెవెన్, ఐఎస్ఎల్ టీమ్ చెన్నయిన్ ఎఫ్‌సీలో పెట్టుబడులు పెట్టాడు. అదే బాటలో మరో క్రికెటర్ కేఎల్ రాహుల్ గతేడాది గల్లీ బ్రాండ్ పేరుతో దుస్తుల విభాగంలోకి అడుగుపెట్టాడు. ఇందుకోసం జెకో ఆన్లైన్ అనే రిటైల్ సంస్థతో జట్టు కట్టాడు. తాజా ఐపీఎల్ సీజన్లో రాజస్తాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్‌లతో చేతులు కలిపాడు. గల్లీ బ్రాండ్‌తో ఆన్లైన్ గేమింగ్ వ్యాపార విభాగంలోకి కూడా అడుగుపెట్టడంపై రాహుల్ దృష్టి పెడుతున్నాడు. ఇక, 2019 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు యజువేంద్ర చహల్ తన సొంత లైఫ్‌స్టయిల్ బ్రాండ్ చెక్‌మేట్‌ను ప్రవేశపెట్టాడు. గతంలో యువరాజ్ సింగ్ కూడా హెల్తియన్స్, వ్యోమో, కారటిసన్, జెట్‌సెట్‌గో వంటి సంస్థల్లో ఇన్వెస్ట్ చేశాడు. ఇన్వెస్ట్ చేస్తే సరిపోదు .. సాధారణంగా క్రికెటర్లు ఏదైనా వ్యాపారంలో ఇన్వెస్ట్ చేస్తే దానికి బ్రాండ్ అంబాసిడర్లుగా కూడా వ్యవహరిస్తుంటారు. ఇందుకు గాను సదరు వ్యాపారంలో ఎంతో కొంత వాటాలు తీసుకోవడం ద్వారా ఇన్వెస్టరుగా మారుతుంటారు. అంతే తప్ప ప్రత్యేకంగా డబ్బులు ఇన్వెస్ట్ చేసే క్రీడాకారులు చాలా తక్కువగా ఉంటారని పరిశ్రమవర్గాలు తెలిపాయి. అయితే, దీర్ఘకాలంలో చూస్తే కేవలం బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం వల్ల ఉపయోగం లేదని బ్రాండింగ్ ప్రొఫెషనల్స్ అభిప్రాయపడ్డారు. సదరు వ్యాపారంలో వారు కూడా చురుగ్గా పాలుపంచుకుంటేనే ఉపయోగం ఉంటుందని వారు పేర్కొన్నారు. ఉదాహరణకు కేఎల్ రాహుల్‌ను చూస్తే.. గల్లీ బ్రాండ్‌కి సంబంధించి డిజైన్ నుంచి రంగుల ఎంపిక దాకా అన్ని విషయాల్లోనూ చురుగ్గా పాలుపంచుకుంటాడు. ఇన్వెస్టర్లుగా మారిన క్రీడాకారులు ఆయా వ్యాపారాల్లో చురుగ్గా పాలుపంచుకుంటేనే ప్రయోజనాలు ఉంటాయనేది విశ్లేషకుల అంచనా. లాభదాయకమేనా.. క్రికెటర్లు పెట్టుబడులు పెట్టిన వ్యాపారాలు .. లాభాలు ఆర్జించడంలో మిశ్రమ ఫలితాలు కనపరుస్తున్నాయి. కోహ్లికి చెందిన రాంగ్ బ్రాండ్‌ను ప్రమోట్ చేసే యూనివర్సల్ స్పోర్ట్స్‌బిజ్ (యూఎస్‌పీఎల్) వేల్యుయేషన్ ప్రస్తుతం రూ. 1,200 కోట్ల పైగా ఉంటుంది. కానీ ఇది ఇంకా లాభాల్లోకి మళ్లాల్సి ఉంది. యాక్సెల్, అల్టీరియా క్యాపిటల్ వంటి ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్లు ఇందులో ఇన్వెస్ట్ చేశాయి. కోహ్లి ఇటీవలే మరో రూ. 13.2 కోట్లు ఇన్వెస్ట్ చేశాడు. యూఎస్‌పీఎల్ ఏర్పాటైన తొలినాళ్లలో సచిన్ టెండూల్కర్ కూడా ఇన్వెస్ట్ చేశాడు. అటు ధోనీకి చెందిన సెవెన్ బ్రాండ్ సైతం చెప్పుకోతగ్గ స్థాయిలో ప్రాచుర్యం పొందలేదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. 2016లో ప్రవేశపెట్టిన ఈ బ్రాండ్ దుస్తులు.. అన్ని ఈ–కామర్స్ సైట్లలోనూ కనిపిస్తున్నప్పటికీ కేవలం ధోనీ ఆకర్షణ శక్తి మీదే వీటి అమ్మకాలు ఎక్కువగా ఆధారపడి ఉంటున్నాయని వివరించాయి. -
క్వారంటైన్లో ముగ్గురు క్రికెటర్లు
కేప్‌టౌన్: స్వదేశంలో ఇంగ్లండ్‌తో వన్డే, టి20 సిరీస్‌లకు సన్నద్ధమవుతున్న సమయంలో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టును కరోనా తాకింది. జట్టులో సభ్యుడొకరు కోవిడ్–19 పాజిటివ్‌గా తేలాడు. దాంతో అతడిని బయో బబుల్‌నుంచి బయటకు పంపించివేశారు. అతనితో సన్నిహితంగా మెలిగిన మరో ఇద్దరు క్రికెటర్లకు వైరస్ లక్షణాలు లేనప్పటికీ ముందు జాగ్రత్తగా క్వారంటైన్‌కు తరలించినట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ప్రకటించింది. అయితే వారి పేర్లను మాత్రం వెల్లడించలేదు. ఆ ముగ్గురి స్థానాలను ఇతర క్రికెటర్లతో భర్తీ చేయబోమని చెప్పింది. (భారత్ కంటే ఆస్ట్రేలియా మెరుగు) మరో వైపు తాజా సిరీస్‌లో మోకాలిపై కూర్చొని నల్లజాతివారికి సంఘీభావం తెలిపే కార్యక్రమానికి తాము దూరంగా ఉంటున్నామని దక్షిణాఫ్రికా కోచ్ మార్క్ బౌచర్ వెల్లడించాడు. తమ దేశంలో ఈ మొత్తం ఉద్యమంలో కీలకంగా ఉన్న జట్టు సభ్యుడు లుంగీ ఇన్‌గిడితో తాను మాట్లాడానని... కొన్నాళ్ల క్రితం జరిగిన 3టీసీ మ్యాచ్‌లో ఇలా చేశాం కాబట్టి ఇప్పుడు అవసరం లేదని వివరించినట్లు బౌచర్ తెలిపాడు. -
కోట్లకు... ఆటకు కుదరని మైత్రి
ఐపీఎల్ అంటేనే అంకెలు... పరుగులు, వికెట్లు మాత్రమే కాదు, ఆటగాళ్లకి చెల్లించే ప్రతీ పైసా లెక్కలు కూడా కీలకం. డబ్బే ముఖ్యం కాదు అంటూ బయటకు ఎన్ని మాటలు చెప్పినా, క్రికెటర్లు సహజంగానే భారీ మొత్తాలను కోరుకుంటారు. అటు టీమ్ యాజమాన్యాలు కూడా తాము చెల్లిస్తున్న సొమ్ముకు తగి నంత ప్రతిఫలాన్ని సదరు ఆటగాడి నుంచి ఆశిస్తాయి. దాంతో క్రికెటర్లపై కచ్చితంగా రాణించాల్సిన ఒత్తిడి ఉంటుంది. చాలాసార్లు ఆ భారాన్ని మోయలేక క్రికెటర్లు విఫలమైతే, కొన్నిసార్లు మాత్రం వారు అంచనాలు అందుకుంటారు. చేసే ప్రతీ పరుగును, తీసే ప్రతీ వికెట్‌ను ఇచ్చిన మొత్తంతో గుణింతాలు, భాగహారాలతో లెక్కించి పోల్చడం సహజం. ఈ నేపథ్యంలో ఐపీఎల్–2020లో ఇప్పటివరకు ‘భారీ’ ఆటగాళ్ల ప్రదర్శనను పరిశీలిస్తే.... ప్యాట్ కమిన్స్ (కోల్‌కతా నైట్‌రైడర్స్) వేలంలో విలువ: రూ. 15 కోట్ల 50 లక్షలు ప్రదర్శన: ఐపీఎల్ చరిత్రలో రికార్డు స్థాయిలో అమ్ముడుపోయిన బౌలర్‌గా కమిన్స్ ఈసారి బరిలోకి దిగాడు. టెస్టుల్లో నంబర్‌వన్ బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్న కమిన్స్ టి20లకు వచ్చేసరికి తేలిపోయాడు. యూఏఈలోని నెమ్మదైన పిచ్‌లు కూడా అతని శైలికి ఏమాత్రం సరిపోకపోవడంతో ఇప్పటికీ లయ అందుకునేందుకు అతను తిప్పలు పడుతూనే ఉన్నాడు. 7 మ్యాచ్‌లలో ఒక్కసారీ ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పిన ప్రదర్శన లేకపోగా... 2 వికెట్లే తీసిన అతను కనీసం ఒక్క ఓవర్ కూడా మెయిడిన్‌గా వేయలేకపోయాడు. 111 సగటు అతి పేలవం కాగా... 8.53 ఎకానమీ చూస్తే భారీగా పరుగులిచ్చినట్లు అర్థమవుతోంది. ఇది కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు సమస్యగా మారింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (కింగ్స్ ఎలెవన్ పంజాబ్) వేలంలో విలువ: రూ. 10 కోట్ల 75 లక్షలు ప్రదర్శన: ఒకప్పుడు విధ్వంసానికి చిరునామాగా నిలిచిన మ్యాక్స్‌వెల్ ఇప్పుడు ఒక్కో పరుగు కోసం శ్రమిస్తున్నాడు. నిజానికి ఇంత మొత్తం చెల్లించి తీసుకున్న ఆటగాడిని ఎలా వాడుకోవాలో కూడా అర్థం కాని స్థితిలో పంజాబ్ ఉంది. 8 మ్యాచ్‌లలో కలిపి అతను ఆడింది 61 బంతులే... దాదాపు మ్యాచ్ ముగిసే సమయంలో క్రీజ్‌లోకి వస్తున్న అతను బంతులకంటే తక్కువ పరుగులు (58) చేయడం ఆశ్చర్యకరం. కోల్‌కతాతో మ్యాచ్‌లో 16 బంతుల్లో 21 పరుగులు చేయాల్సిన స్థితిలో కూడా మ్యాక్స్‌వెల్‌కంటే ముందు కనీసం ఒక ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ అనుభవం కూడా లేని ప్రభ్‌సిమ్రన్ సింగ్‌ను పంపించారంటే మ్యాక్స్‌వెల్‌పై ఎంత అపనమ్మకమో అర్థమవుతుంది. లీగ్‌లో అతను ఒక్క సిక్సర్ కూడా కొట్టలేదు. అతనికి చెల్లించిన మొత్తంతో పోలిస్తే మ్యాక్సీ ప్రదర్శన అట్టర్ ఫ్లాప్. షెల్డన్ కాట్రెల్ (పంజాబ్) వేలంలో విలువ: రూ. 8 కోట్ల 50 లక్షలు ప్రదర్శన: ప్రధాన పేసర్‌గా పంజాబ్ ఎన్నో అంచనాలు పెట్టుకున్న ‘సెల్యూట్’ కాట్రెల్ దానికి తగినట్లుగా రాణించలేకపోయాడు. 6 మ్యాచ్‌లలో 6 వికెట్లే తీయగా... 8.80 ఎకానమీ చూస్తే పరుగులు నిరోధించడంలో కూడా అతను విఫలమైనట్లు కనిపిస్తోంది. గత రెండు మ్యాచ్‌లలో తుది జట్టు నుంచి తప్పించడాన్ని చూస్తే సీజన్లో మిగిలిన మ్యాచ్‌లలో కూడా పంజాబ్ అతడికి అవకాశం ఇస్తుందా లేదా అనేది సందేహమే. జైదేవ్ ఉనాద్కట్ (రాజస్తాన్ రాయల్స్) వేలంలో విలువ: రూ. 3 కోట్లు ప్రదర్శన: గతంలో ఐపీఎల్ వేలంలో రెండుసార్లు రికార్డు స్థాయి మొత్తాలకు అమ్ముడుపోయి అంతగా రాణించలేకపోయిన ఉనాద్కట్... వాటితో పోలిస్తే ఈసారి తక్కువ మొత్తానికే రాజస్తాన్‌కు అందుబాటులోకి వచ్చాడు. లీగ్‌కు ముందు సౌరాష్ట్ర కెప్టెన్‌గా జట్టుకు తొలి రంజీ ట్రోఫీ అందించిన ఆత్మవిశ్వాసంతో కనిపించిన అతను లీగ్‌కు వచ్చేసరికి ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. 6 మ్యాచ్‌లలో కలిపి అతను తీసింది 4 వికెట్లే. చెప్పుకోదగ్గ స్పెల్ ఒక్కటి కూడా వేయని ఉనాద్కట్ 9.57 ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నాడు. ఆరోన్ ఫించ్ (బెంగళూరు) వేలంలో విలువ: రూ. 4 కోట్ల 40 లక్షలు ప్రదర్శన: ఎనిమిది మ్యాచ్‌లలో కలిపి ఓవరాల్ ప్రదర్శన పర్వాలేదన్నట్లుగా కనిపిస్తున్నా, ఆస్ట్రేలియాలాంటి మేటి జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్ నుంచి ఆశించింది మాత్రం ఇది (ఒక అర్ధసెంచరీ) కాదు. అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక స్కోరు సాధించిన ఈ ఆటగాడి స్ట్రయిక్‌రేట్ 113.69 మాత్రమే, అదీ ఓపెనర్‌గా ఉంటూ చేయడం అంటే వైఫల్యం కిందే లెక్క. ఒక్క విధ్వంసకర ఇన్నింగ్స్ కూడా అతడినుంచి రాలేదు. రాబిన్ ఉతప్ప (రాజస్తాన్ రాయల్స్) వేలంలో విలువ: రూ. 3 కోట్లు ప్రదర్శన: గతంలో కోల్‌కతా జట్టులో కీలక సభ్యుడిగా ఆ జట్టు రెండు టైటిల్స్ సాధించడంలో భాగమైన రాబిన్ ఉతప్పలో జోరు తగ్గినా... రాజస్తాన్ పెద్ద మొత్తానికి అతడిని తీసుకుంది. అయితే ఉతప్ప మరింత పేలవంగా ఆడి ఫ్రాంచైజీని నిరాశపర్చాడు. 6 మ్యాచ్‌లలో కలిపి ఉతప్ప చేసింది 83 పరుగులే (84 బంతుల్లో). తుది జట్టులో భారత ఆటగాళ్లను ఎంచుకునే క్రమంలో ఉతప్ప వైఫల్యం రాయల్స్ కూర్పును దెబ్బ తీసింది. ఇది భిన్నమైన పరిస్థితి... ఆస్ట్రేలియా లెఫ్టార్మ్ పేసర్ నాథన్ కూల్టర్‌నైల్‌ను ముంబై రూ. 8 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. అతడిని తుది జట్టులో ఆడించేందుకు వారికి అవకాశం లభించడం లేదు. బౌల్ట్ చక్కగా రాణిస్తుండగా, ముంబై తుది జట్టు చక్కగా కుదురుకోవడంతో మార్పులకు అవకాశం లేకుండా పోయింది. పూర్తి ఫిట్‌గా ఉన్నా మ్యాచ్ ఆడే అవకాశం లభించని కూల్టర్‌నైల్ పర్సులో మాత్రం భారీ మొత్తం చేరడం విశేషం. రూ. 10 కోట్లు ఇచ్చిన క్రిస్ మోరిస్ (దక్షిణాఫ్రికా)ను బెంగళూరు ఇప్పటికి మూడు మ్యాచ్‌లు ఆడించింది. ఇకపై అతడికి వరుసగా అన్ని మ్యాచ్‌లలో అవకాశం దక్కవచ్చు. -
యూఏఈ క్రికెటర్లపై నిషేధం
దుబాయ్: మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై ఇద్దరు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) క్రికెటర్లపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చర్య తీసుకుంది. యూఏఈకి చెందిన ఆమిర్ హయత్, అష్ఫాఖ్ అహ్మద్‌లపై తాత్కాలిక నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఐసీసీ అవినీతి వ్యతిరేక విభాగం నిబంధనల ప్రకారం ప్రకారం వీరిద్దరిపై ఐదు వేర్వేరు ఆరోపణలు నమోదయ్యాయి. ఈ ఇద్దరు ఆటగాళ్లు 14 రోజుల్లోగా తమపై వచ్చిన ఆరోపణలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అష్ఫాఖ్‌పై గత ఏడాది అక్టోబర్‌లోనే టి20 ప్రపంచ కప్ క్వాలిఫయింగ్ సందర్భంగా తాత్కాలిక నిషేధం విధించినా.. దర్యాప్తు కొనసాగుతుండటంతో అతనిపై ఏమేం ఆరోపణలు ఉన్నాయో ఐసీసీ స్పష్టతనివ్వలేదు. అష్ఫాఖ్ 16 వన్డేలు, 12 టి20ల్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించగా, హయత్ 8 వన్డేలు 4 టి20లు ఆడాడు. -
ఆడిస్తున్నారు కానీ.. మ్యాచ్ ఫీజు చెల్లించట్లేదు
లండన్: ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ టి20 లీగ్ జరిగినా చక్కని ఆదరణ లభిస్తోంది. నిర్వాహకులు స్టార్లతో ఆడిస్తున్నారు... కానీ సరిగ్గా చెల్లించడమే లేదని అంతర్జాతీయ క్రికెటర్ల సంఘాల సమాఖ్య (ఎఫ్ఐసీఏ) తెలిపింది. ఐపీఎల్ గురించి తెలిసినవారెవరైనా... ఆటగాళ్లకు స్టార్డమ్తో పాటు అధిక ఆదాయం లీగ్‌ల ద్వారానే లభిస్తుందనే అనుకుంటారు. కానీ అన్ని లీగ్‌లు ఐపీఎల్లా లేవు. ఇదే ఆటగాళ్లకు ఆర్థిక కష్టాలను తెచ్చిపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన టి20 లీగ్‌లు చెల్లింపుల విషయంలో ఆటగాళ్లను ఇబ్బంది పెడుతున్నాయని తాజా నివేదికలు తెలియజేస్తున్నాయి. ఎఫ్ఐసీఏ చేపట్టిన వార్షిక సర్వేలో ఇవి వెలుగులోకి వచ్చాయి. లీగ్‌ల్లో పాల్గొనే ఆటగాళ్లలో మూడోవంతు క్రికెటర్లు వేతనాలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. కొందరికి ఆలస్యంగా వేతనాలు అందగా... మరికొందరు రిక్తహస్తాలతోనే వెనుదిరిగినట్లు ఆ నివేదికల ద్వారా తెలిసింది. గ్లోబల్ టి20 కెనడా, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, అబుదాబి టి10, ఖతార్ టి10, యూరో టి20 స్లామ్, మాస్టర్స్ చాంపియన్స్ లీగ్‌ల్లో పాల్గొన్న 34 శాతం క్రికెటర్లు ‘చెల్లింపుల’ సమస్యలు ఎదుర్కొన్నట్లు ఎఫ్ఐసీఏ వెల్లడించింది. లీగ్‌ల నిర్వహణకు అనుమతులిచ్చే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఈ అంశంపై దృష్టి సారించాలని ఎఫ్ఐసీఏ సీఈఓ టామ్ మఫట్ కోరారు. మరోవైపు ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ రూపురేఖలు, తీరుతెన్నులు గజిబిజీగా ఉన్నాయన్న ఎఫ్ఐసీఏ... వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌ను సమస్యకు పాక్షిక పరిష్కారంగా అభివర్ణించింది. -
సడలిస్తే... ప్రాక్టీస్‌ను మార్చుతాం: బీసీసీఐ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఒకవేళ లాక్డౌన్ నిబంధనలు సడలిస్తే భారత క్రికెటర్లు మైదానాల్లో నాణ్యమైన శిక్షణను ప్రారంభించే అవకాశముంటుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కోశాధికారి అరుణ్ ధుమాల్ తెలిపారు. మే 18 నుంచి నాలుగోవిడత లాక్డౌన్ నిబంధనలు అమల్లోకి రానుండటంతో ఆటగాళ్లకు ప్రాక్టీస్ చేసే వెసులుబాటు దక్కవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పుడైతే ఆటగాళ్లంతా ఇంటికే పరిమితమయ్యారు. తమ సొంత ఇండోర్ ప్రాక్టీస్‌తోనే సరిపెట్టుకుంటున్నారు. ‘క్రికెటర్లు నెట్ సెషన్స్‌లో పాల్గొనేందుకు అందుబాటులో ఉండే అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నాం. లాక్డౌన్–4 మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణాలకు అనుమతిలేని పక్షంలో ఆటగాళ్ల నివాసాలకు దగ్గర్లోని మైదానాల్లో వారు ప్రాక్టీస్ చేసే అవకాశాలపై దృష్టి సారించాం. ఈ అంశంపై ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాం. ప్రయాణ ఆంక్షలు సడలించేదాకా ఎలాంటి శిబిరాలు ఏర్పాటు చేయం. ఆటగాళ్ల ఆరోగ్య భద్రతే మాకు అత్యంత ప్రధానం. లాక్డౌన్ ముగిశాక క్రికెటర్ల కార్యాచరణపై మాకు స్పష్టమైన ప్రణాళిక ఉంది’ అని ధుమాల్ పేర్కొన్నారు. -
కపిల్‌దేవ్‌కు నిజమైన అభినందన దక్కలేదు
సినిమా: సినిమా, క్రికెట్ ఈ రెండింటిలో దేనికి క్రేజ్ అని అడిగితే సమాధానం చెప్పడం కష్టమే. అంత శక్తివంతమైనవి. ప్రజలను ఎంటర్టెయిన్ చేసేవి ఈ రెండు. అలాంటి రెండు రంగాలకు చెందిన ప్రముఖులు ఒకే వేదికపైకి వస్తే ఆ వేడుకను చూడతరమా? అలాంటి వేడుకనే శనివారం సాయంత్రం చెన్నైలో అభిమానులను కనువిందు చేసింది. 1983 భారత క్రికెట్ క్రీడారంగానికి చరిత్రలో మరచిపోలేని సంవత్సరంగా లిఖించబడింది. ప్రపంచ కప్‌ను గెలుచుకున్న సువర్ణాక్షరాల సంవత్సరం అది. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ కపిల్‌దేవ్ సారథ్యంలో ఆ కప్‌ను సాధించింది. అలాంటి క్రికెట్ క్రీడాకారుడు బయోపిక్‌గా ఇప్పుడు తెరకెక్కుతున్న చిత్రం 83. హిందీ, తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో నాగార్జున వంటి సినీ స్టార్, తమిళంలో కమలహాసన్ వంటి విశ్వనటుడు విడుదల హక్కులను పొంది విడుదల చేయనుండడం మరో విశేషం. ఈ క్రేజీ చిత్ర తమిళ వెర్షన్ ఫస్ట్‌లుక్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం సాయంత్రం స్థానిక సత్యం థియేటర్లో జరిగింది. ఈ కార్యక్రమానికి క్రికెట్ క్రీడాస్టార్స్ కపిల్‌దేవ్, కృష్ణమాచార్య శ్రీకాంత్, సినీ స్టార్ కమలహాసన్, చిత్ర హీరో రణ్‌వీర్‌సింగ్, నటుడు జీవా విచ్చేశారు. ఈ సందర్భంగా 83 చిత్ర కథానాయకుడు రణ్‌వీర్‌సింగ్ మాట్లాడుతూ ఇంత ఘనస్వాగతానికి ధన్యవాదాలన్నారు. తనకిది చెన్నైలో తొలి పయనం అని పేర్కొన్నారు. ఈ వేదికపై కమలహాసన్‌తో ఉండడం ఘనంగా భావిస్తున్నానన్నారు. ఈ చిత్రమే మాయాజాలం అని అన్నారు. దర్శకుడు కబీర్‌ఖాన్ తెరపై ఎప్పుడూ మాయాజాలం సృష్టిస్తారన్నారు. ఆయన ఈ చిత్ర కథ చెప్పినప్పుడు చాలా ఆశ్యర్యపోయానన్నారు. 1983లో భారతదేశం ప్రపంచకప్‌ను గెలిచిన చారిత్రక ఘట్టం అన్నారు దాన్ని తాము ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చామని రణ్‌వీర్‌సింగ్ పేర్కొన్నారు. శ్రీకాంత్ పాత్రలో నటించిన నటుడు జీవా మాట్లాడుతూ 18 ఏళ్ల క్రితం ఇదే వేదికపై కమలహాసన్ తనను పరిచయం చేశారన్నారు. ఇప్పుడు ఇక్కడ నిలబడడం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రంలో శ్రీకాంత్ పాత్రలో తనను నటించమని దర్శకుడు చెప్పినప్పుడు తాను ఆ పాత్రను చేయగలనా అన్న భయం కలిగిందన్నారు. అయితే చిత్ర యూనిట్ అంతా అండగా నిలిచారని, ఈ పాత్ర కోసం 6 నెలలు శిక్షణ తీసుకున్నట్లు జీవా తెలిపారు. 83లో ప్రపంచకప్ సాధించిన జట్టు కెప్టెన్ కపిల్‌దేవ్ మాట్లాడుతూ తనతో ఉన్న 83 జట్టుకు మొదట ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. ఇప్పుడు దాన్ని మళ్లీ తెరపై ఆవిష్కరిస్తున్న అందరికీ కృతజ్ఞతలన్నారు. తమిళనాడుకు వచ్చినప్పుడు తాను తమిళ భాషను నేర్చుకోవాలని ఆశపడ్డానన్నారు. అంత అందమైన భాష అని, ఐలవ్యూ చెన్నై అని పేర్కొన్నారు. ఇక్కడ తమతో ఉన్న కమలహాసన్‌కు ధన్యవాదాలన్నారు. శ్రీకాంత్ అప్పుడూ చాలా సరదాగా, ఉత్సాహంగా ఉండేవారని అన్నారు. అయితే కప్‌ను గెలిచినప్పుడు అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి జట్టును పరిచయం చేసినప్పుడు చాలా గంభీరంగా మారపోయారని, ఆ తరువాత మళ్లీ తనదైన బాణీకి వచ్చేశారని చెప్పారు. ఈ చిత్రం పలు జ్ఞాపకాలను గుర్తు చేస్తుందని, అంతగా సాధ్యం చేసిన అందరికీ ధన్యవాదాలని అన్నారు. నటుడు కమలహాసన్ మాట్లాడుతూ ఇది చాలా అరుదైన తరుణం అని పేర్కొన్నారు. ఇంతమంది ప్రతిభావంతుల మధ్య నిలబడడం గర్వంగా ఉందన్నారు. 83లో ప్రపంచ కప్‌ను గెలవడం మాత్రమే మనకు తెలుసని, అయితే దర్శకుడు కబీర్‌ఖాన్ దాని వెనుకనున్న ఎవరికీ తెలియని కథలను ఈ చిత్రంలో చూపించారని చెప్పారు. అది చాలా అద్భుతంగా ఉందన్నారు. వారు ఎన్ని కష్టాలను అధిగమించి గెలిచారన్నది కథ విన్న తరువాత సూపర్ హీరోలుగా వస్తున్న అవేంజర్స్ కథ కంటే ఇదే నిజమైన సూపర్ హీరోల కథ అని అనిపించిందన్నారు. ఈ చిత్రాన్ని నిజం చేసిన అందరికీ శుభాభినందనలన్నారు. కపిల్‌దేవ్‌కు నిజమైన అభినందన ఇంకా లభించలేదన్నారు. అయితే ఆయన అందుకు బాధపడరని అన్నారు. అదే విధంగా ఆయన కీర్తీ ఎప్పటికీ సజీవం అన్నారు. ఇకపోతే క్రికెట్ క్రీడాకారుడు శ్రీకాంత్‌ను తన చిత్రంలో నటింపజేయాలని ఆశించానని, అది జరగలేదని అన్నారు. ఆయన తనకు చాలా కాలంగా మంచి మిత్రుడని తెలిపారు. ఈ చిత్రంలో నటించిన వారందరికీ అభినందనలన్నారు. ముఖ్యంగా కబీర్‌ఖాన్ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని కమలహాసన్ ప్రశంసించారు. కాగా ఈ వేదికపై నటుడు రణవీర్‌సింగ్, జీవా ఆడి పాడి సందడి చేశారు. -
ఆశలు ఉన్నవాళ్లు
కాళ్లు లేవు. కాలినడకన వస్తాం అని మొక్కుకోకూడదా? వేళ్లు లేవు. వీణపై స్వరాలను పలికించాలన్న తపన ఉండకూడదా? మాట లేదు. ప్రతిధ్వనించేలా నినదించాలని ఆవేశపడకూడదా? వినికిడి లేదు. విశ్వాంతరాళ హోరుకు విష్ణుమూర్తిలా చెవి వొగ్గకూడదా? చూపు లేదు. సిక్సర్లు కొట్టాలని, క్యాచ్‌లు పట్టేయాలని ఉత్సాహపడకూడదా? బ్రియాన్ లారా వెస్టిండీస్ క్రికెటర్. ప్రపంచ క్రికెట్ చరిత్రను తూకం వేస్తే ఆ తూగే బరువులో ఆయన కాస్త ఎక్కువగానే ఉంటారు. ఐదడుగులా ఎనిమిది అంగుళాల ఎత్తు ఉన్నందువల్ల, ర్యాంకింగ్‌లు– రికార్డులు ఏవో ఉంటాయి ఈ క్రికెట్వాళ్లకు.. అవి సమృద్ధిగా ఉన్నందువల్ల, ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వెస్టిండీస్‌లో పర్యటిస్తూ అక్కడుండే లారాను వెతుక్కుంటూ వెళ్లి కలిసినందువల్ల, తన చిట్టచివరి వన్డే ఇంటర్నేషనల్‌లో ఆట అవుతున్నంతసేపూ ‘లారా.. లారా.. లారా..’ అని పిచ్‌లో ప్రకంపనలు రేపిన ఫ్యాన్స్ వైపు ఆటంతా అయ్యాక చేతులు చాస్తూ.. ‘డిడ్ ఐ ఎంటర్టైన్?’ అని అడిగినందు వల్లా.. క్రమంగా పెరుగుతూ వచ్చిన బరువు కావచ్చది. యాభై ఏళ్ల మనిషి. ఆరేళ్ల వయసున్నప్పటి నుంచి ఆడిన మనిషి. పన్నెండేళ్ల క్రితం రిటైర్ అయిన మనిషి. రిటైర్ అయినా బరువు ఏమాత్రం తగ్గని మనిషి. బ్రియాన్ లారానే మనం ఇంకోలా చూద్దాం. ఆయనకు కళ్లు లేవు. పుట్టు గుడ్డి. అలా అని అనుకుందాం. పదకొండు మంది సంతానంలో ఒకడైన లారాను తండ్రి ఎన్ని కళ్లతోనూ ఎంతసేపో కనిపెట్టుని ఉండలేకపోయేవాడు. లారా పుట్టిన శాంటాక్రజ్‌లో లోకల్ స్కూల్ ఒకటి ఉంది. హార్వార్డ్ కోచింగ్ క్లినిక్. ఆ క్లినిక్.. ఆరేళ్ల వయసులోనే క్రికెట్ అంటే ఆసక్తి చూపినప్పటికీ కళ్లు లేని కారణంగా లారాను చేరదీసి, ముద్దు చేయలేకపోయేది. లారా తొలి బడి సెయింట్ జోసెఫ్స్ రోమన్ కేథలిక్ ప్రైమరీ ఆ పసివాడికి అడ్మిషన్ ఇవ్వలేకపోయేది. కళ్లు లేని వాళ్ల బడి కాదు అది. సెయింట్ జువాన్ సెకండరీ స్కూలు, ఫాతిమా కాలేజీ కూడా ముఖం చాటేసేవి.. ఒకవేళ లారా స్టిక్ సహాయంతో తడుముకుంటూ తడుముకుంటూనే అంతదూరం వచ్చాడని అనుకున్నా. క్రికెట్ కోచ్ హ్యారీ రామ్‌దాస్ అంటే కూడా ప్రపంచానికిప్పుడు పెద్దగా తెలియకపోయేది. అంధుడైన లారాను లెఫ్ట్‌హ్యాండెడ్ బ్యాట్స్‌మన్‌గా, రైట్ ఆర్మ్ లెగ్ బ్రేక్ బౌలర్‌గా చెక్కడానికి ఆయనకేం పట్టేది?! లారాకు కూడా కళ్లు లేకుండా పద్నాలుగేళ్ల వయసులో స్కూల్ బాయ్స్ లీగ్‌లో ఇన్నింగ్స్‌కి సగటున 126 పరుగులు చొప్పున 745 పరుగులు తియ్యడం ఒక ఊహ మాత్రమే అయ్యేది. సాకర్ అన్నా, టేబుల్ టెన్నిస్ అన్నా కూడా లారాకు ఇష్టం. చూపులేని కారణంగా ఆ ఇష్టాలనూ చంపుకుని ఎక్కడో బతుకుతూ ఉండేవాడు! ‘నాకే ఎందుకిలా చేశావ్ దుర్మార్గుడా!’ అని దేవుణ్ణి తిట్టుకుంటూ.. తలకొట్టుకుంటూ ఉండేవాడు.. ఎవర్ని తిడుతున్నదీ స్పృహ లేకుండా. ‘‘అవును నిజంగా అలానే ఉండేవాడిని’’ అన్నాడు ఇప్పుడు ఇండియాలోనే ఉన్న బ్రియాన్ లారా. ఢిల్లీలో బ్లైండ్ ఉమెన్ డొమెస్టిక్ నేషనల్ క్రికెట్ లీగ్ పోటీలకు ముందు రెండు మాటలు మాట్లాడమని ‘క్రికెట్ అసోసియేషన్’ అడిగితే వచ్చాడు. పోటీలు సోమవారం మొదలయ్యాయి. ఫస్ట్ టైమ్ మన దగ్గర అంధ మహిళా క్రీడాకారులకు జాతీయస్థాయి పోటీలు జరగడం. ఏడు టీమ్‌లు తలపడుతున్నాయి. ఢిల్లీలోని సిరి ఫోర్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఇవాళ ఫైనల్స్. మాట్లాడ్డానికి ముందు ఢిల్లీ టీమ్ కెప్టెన్ అంకితాసింగ్ని, తక్కిన టీమ్‌లను, టీమ్ మేట్స్నీ కలిసి విష్ చేశాడు లారా. ‘‘ఈరోజు మీ మధ్య నేను ఉండటం అనే ఫీలింగ్ నాకు చాలా వండర్ఫుల్ అనిపిస్తోంది’’ అన్నాడు ఆ తర్వాత స్టేజ్ మీద. కొంచెం ఎమోషనల్ కూడా అయ్యాడు. ‘‘నా కెరియర్ మొత్తంలో నేనేవైతే సాధించగలిగానో అవన్నీ కూడా నాకేవైతే ఉన్నాయో వాటి వలన సాధ్యమైనవే. నేనొకవేళ నాకేవైతే ఉన్నాయో వాటికి నోచుకోకపోయి ఉంటే కనుక, నా ఆశలన్నిటినీ చంపుకుని ఏ చీకటి మూలనో కూర్చొని ఉండేవాడిని’’ అని ఒక్క క్షణం ఆగి.. ‘‘అయితే ఇప్పుడనిపిస్తోంది. అలా కూర్చొని ఉండేవాడిని కాదని. నేనూ స్కూలుకు వెళ్లాలనే అనుకునేవాడిని. నేనూ నేర్చుకోవాలనే అనుకునేవాడిని. నేనూ మంచి ఉద్యోగం చేయాలనే అనుకునేవాడిని. నేనూ ఆటలు ఆడాలనే అనుకునేవాడిని’’ అన్నాడు లారా! ఆ వెంటనే ‘‘దీజ్ లేడీస్ అండ్ దెయిర్ టోర్నమెంట్ జస్ట్ అప్రోచింగ్’’ అన్నాడు. అప్రోచింగ్ అంటే నాట్ కంపేరబుల్ అని. ఈ మాటతో మళ్లీ కొద్దిగా బరువు పెరిగాడు బ్రియాన్ లారా. ఎలా ఆడతారు వీళ్లు క్రికెట్‌ని కళ్లు లేకుండా అనుకుంటాం? అసలు ఎలా ఆడాలనిపిస్తుంది వీళ్లకు క్రికెట్‌ని కళ్లు లేకుండా అనుకునేవాళ్లూ ఉండొచ్చు. ‘ఎలా ఆడతారు?’ అనే ప్రశ్నకు ఎక్కడైనా సమాచారం లభిస్తుంది. ‘ఎలా ఆడాలనిపిస్తుంది?’ అనే ప్రశ్నకు చూపుకు అందని సమాధానం మాత్రమే ఉంటుంది. -
కేపీఎల్ కథ...
ఐపీఎల్ తరహాలో రాష్ట్ర స్థాయిలో లీగ్ నిర్వహించుకునేందుకు బీసీసీఐ అనుమతి ఇచ్చిన తొలి టోర్నీ. 2009లో మొదలైంది. ముందుగా ఎనిమిది జట్లతో మొదలైనా ప్రస్తుతం 7 టీమ్‌లు ఉన్నాయి. భారత్‌కు ఆడిన కర్ణాటక అగ్రశ్రేణి క్రికెటర్లంతా పాల్గొంటుండటంతో లీగ్‌పై అందరి దృష్టీ పడింది. భారీ స్పాన్సర్‌షిప్‌లు, టీవీ రేటింగ్స్ కూడా బాగా వచ్చాయి. డీన్ జోన్స్, బ్రెట్‌లీలాంటి స్టార్లు కామెంటేటర్లుగా వ్యవహరించారు. ఒక దశలో ఆకర్షణ కోసమంటూ కన్నడ సినీ, టీవీ ఆర్టిస్టులతో కూడిన ‘రాక్‌స్టార్స్’ అనే టీమ్‌ను కూడా లీగ్ బరిలోకి దించారు. కేపీఎల్‌లో ప్రదర్శన ఆధారంగానే కరియప్ప, శివిల్ కౌశిక్‌లాంటి క్రికెటర్లకు ఐపీఎల్ అవకాశం దక్కింది. ఈ లీగ్‌కు వివాదాలు కొత్త కాదు. 2011లో టోర్నీ నిర్వహణా తీరును సందేహిస్తూ కుంబ్లే, శ్రీనాథ్‌లాంటి దిగ్గజాలు విమర్శించారు. వీరిద్దరు కర్ణాటక క్రికెట్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులుగా ఎన్నికైన తర్వాత మూడేళ్ల పాటు లీగ్‌ను నిర్వహించకుండా నిలిపివేశారు. అయితే కుంబ్లే, శ్రీనాథ్ పదవులనుంచి దిగిపోయిన తర్వాత మళ్లీ కేపీఎల్ ప్రాణం పోసుకుంది. -
సమ్మెకు దిగిన క్రికెటర్లు..
ఢాకా: బంగ్లాదేశ్ క్రికెటర్లు సోమవారం సమ్మెకు దిగారు. తమ డిమాండ్లు పరిష్కరించేంతవరకు క్రికెట్ ఆడమని అదేవిధంగా క్రికెట్ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ)కి తేల్చిచెప్పారు. అంతేకాకుండా బీసీబీకి గతంలోనే 11 డిమాండ్లతో కూడిన లేఖను పంపామని.. కానీ పట్టించుకోకపోవడంతోనే సమ్మెకు దిగినట్లు క్రికెటర్లు తెలిపారు. మైదాన సిబ్బంది, ఆటగాళ్ల జీతాలు పెంచడం, ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ ఫీజు పెంచడం, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో మార్పులు, ప్రయాణ ఖర్చుల పెంపు వంటి డిమాండ్లతో సమ్మెకు దిగినట్లు క్రికెటర్లు పేర్కొంటున్నారు. సుమారు 50 మంది క్రికెటర్లు ఈ సమ్మెలో పాల్గొన్నట్లు సమాచారం. సమ్మెలో పాల్గొన్న క్రికెటర్లకు షకీబుల్ హసన్, ముష్పీకర్ రహీమ్‌లు నాయకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో భారత్-బంగ్లాదేశ్ సిరీస్ జరిగేది అనుమానంగా మారింది. టీమిండియాతో బంగ్లా మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. నవంబర్ 3న తొలి టి20 జరగాల్సి ఉంది. అయితే బంగ్లా క్రికెటర్లు సమ్మెకు దిగడంతో ఈ సిరీస్ ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఇది బీసీబీకి చెందిన అంతర్గత విషయమని, దానిపై స్పందించాల్సిన అవసరం లేదని బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న సౌరవ్ గంగూలీ పేర్కొన్నారు. బంగ్లా- టీమిండియా సిరీస్ తప్పక జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా బీసీబీ నుంచి అధికారిక సమాచారం వచ్చేంత వరకు దీనిపై స్పందించకుండా ఉంటేనే ఉత్తమమని గంగూలీ పేర్కొన్నాడు. -
టీమిండియా క్రికెటర్లకు ‘డబుల్’ బొనాంజా
ముంబై: టీమిండియా క్రికెటర్లకు, సిబ్బందికి క్రికెట్ పరిపాలక కమిటీ(సీఓఏ) బంపర్ బొనాంజా ప్రకటించింది. విదేశీ పర్యటనలకు వెళ్లే ఆటగాళ్లతో పాటు సపోర్టింగ్ స్టాఫ్‌కు ఇచ్చే దినసరి భత్యాన్ని(డైలీ అలవెన్స్) రెట్టింపు చేసినట్టు ఓ జాతీయ మీడియా తన కథనంలో పేర్కొంది. ఇప్పటివరకు విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు ఒక్కొక్కరికీ డైలీ అలవెన్స్ 125 డాలర్లు(రూ. 8,899.65) ఉండేది.. కానీ ప్రస్తుతం పెంపుతో 250 డాలర్లు(రూ. 17,799.30) కానుందని సమాచారం. అంతేకాకుండా ట్రావెలింగ్ అలవెన్స్‌లను కూడా భారీగా పెంచినట్లు సమాచారం. ఆటగాళ్ల, సిబ్బంది వసతులు, ఇతరాత్ర సౌకర్యాలను బీసీసీఐ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తుంది. ఇక ఇప్పటికే సారథి విరాట్ కోహ్లి, ప్రధాన కోచ్ రవిశాస్త్రి డిమాండ్ మేరకు ఆటగాళ్ల, సిబ్బంది జీతాలను సీఓఏ భారీగా పెంచిన విషయం తెలిసిందే. వీరి డిమాండ్ మేరకు టాప్ క్లాస్ ప్లేయర్స్‌కు ఏ+ అనే కేటగిరీ ఏర్పాటు చేసి వారి వార్షిక జీతాన్ని రూ 7 కోట్లకు పెంచారు. ఇక ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్లో భాగంగా ఇప్పటికే వెస్టిండీస్‌లో పర్యటించిన టీమిండియా.. వచ్చే ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. -
సంధి దశలో సఫారీలు
ఒక్కొక్కరుగా దిగ్గజాల రిటైర్మెంట్, ఫిట్నెస్ సమస్యలు, బోర్డు పాలన వైఫల్యాలతో దక్షిణాఫ్రికా క్రికెట్ ప్రమాణాలు క్రమంగా పడిపోతున్నాయి. గతేడాది సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో సిరీస్ వరకు ఫర్వాలేదనిపించిన ఆ జట్టు అనంతరం డీలా పడిపోయింది. ఆఖరికి శ్రీలంకకు టెస్టు సిరీస్‌ను కోల్పోయింది. ఇక వన్డే ప్రపంచ కప్‌లో వారి వైఫల్యం దీనికి పరాకాష్ట. ప్రతిభావంతులను గౌరవించకపోవడం, సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోలేకపోవడం... ఇలా అనేక తప్పిదాలతో ప్రొటీస్ పరిస్థితి దిగజారింది. తక్షణమే దిద్దుబాటు చర్యలు లేకుంటే మరింతగా పతనమయ్యే ప్రమాదమూ ఉంది. సాక్షి క్రీడా విభాగం పేరుకు 12 జట్లున్నా... ప్రస్తుతం టెస్టు హోదా ఉన్న దేశాల్లో బలమైనవని చెప్పుకోదగ్గవి ఆరే! అవి... భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్. వీటిలోనూ విండీస్ ఆట మూడు దశాబ్దాలుగా అనిశ్చితం. ఇప్పుడు దక్షిణాఫ్రికా రూపంలో మరో జట్టు తీవ్ర కష్టాల్లో ఉంది. మేటి అనదగ్గ ఆటగాళ్లు ఒకరివెంట ఒకరు నిష్క్రమిస్తుండటంతో సఫారీలు నడి సంద్రంలో చుక్కాని లేని నావలా మిగిలారు. విధ్వంసక ఏబీ డివిలియర్స్‌తో మొదలైన రిటైర్మెంట్ల పరంపర... నిలకడకు మారుపేరైన హషీమ్ ఆమ్లా వరకు వచ్చింది. వీరిద్దరి మధ్యలో ప్రధాన పేసర్లు మోర్నీ మోర్కెల్, డేల్ స్టెయిన్ వీడ్కోలు పలకడం ప్రొటీస్‌ను మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. ఇప్పుడా జట్టులో మిగిలిన నాణ్యమైన ఆటగాళ్లు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ క్వింటన్ డికాక్ మాత్రమే. మిగతా వారిలో కొందరు అంతర్జాతీయ క్రికెట్లో తమ ముద్ర వేసే దిశలో ఉండగా... ఇంకొందరు ఉనికి చాటుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. పూర్తిగా సంధి కాలం అనదగ్గ ఇలాంటి దశను అధిగమించేందుకు దక్షిణాఫ్రికా బోర్డు గట్టి చర్యలు చేపట్టకుంటే... ఆ జట్టు ఓ సాధారణమైనదిగా మిగిలిపోవడం ఖాయం. రెండు, మూడేళ్లయినా ఆడగలిగినవారే! తమ దిగ్గజ ఆటగాళ్లు అర్ధంతర రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నారంటే ఏ దేశ క్రికెట్ బోర్డయినా ఏం చేస్తుంది? తక్షణమే సంప్రదింపులు జరిపి, వారి సేవలు ఎంత కీలకమో వివరించి నిర్ణయాన్ని కొన్నాళ్లు వాయిదా వేసుకునేలా చేయడమో, మూడు ఫార్మాట్లలో వారి సేవలు ఎక్కడ ఎక్కువ అవసరమో అక్కడ తగిన విధంగా వాడుకునేలా చేయడమో చేస్తుంది. కానీ, దక్షిణాఫ్రికా బోర్డు ఇలాంటి చొరవేదీ చూపుతున్నట్లు లేదు. డివిలియర్స్ ఉదంతమే దీనికి పక్కా నిదర్శనం. ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి మైదానంలోనైనా రాణించగలిగే అతడు గతేడాది ఏప్రిల్‌లో అనూహ్యంగా అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికి అందరినీ ఆశ్చర్యపర్చాడు. అప్పటికి ఏబీ వయసు 34 ఏళ్లే. తన ఫామ్‌ను అంతకుమించిన ఫిట్నెస్ను చూస్తే కనీసం రెండేళ్లయినా మైదానంలో మెరుపులు మెరిపించగల స్థితిలో ఉన్నాడు. అయితే, ఆస్ట్రేలియాతో 2018 మార్చి 30న జొహన్నెస్‌బర్గ్‌లో ప్రారంభమైన టెస్టు తర్వాత ఇక ఆడనంటూ తప్పుకొన్నాడు. ఇదే టెస్టుతో, అంతకుమందే ప్రకటించిన మేరకు పేసర్ మోర్నీ మోర్కెల్ బై బై చెప్పాడు. ఆ సమయంలో అతడికి 33 ఏళ్లే. గాయాలు వేధిస్తున్నాయని అనుకున్నా... మోర్కెల్ మరీ ఫామ్ కోల్పోయి ఏమీ లేడు. పెద్ద జట్లతో సిరీస్‌లైనా ఆడేలా అతడిని ఒప్పించలేకపోయారు. మోర్కెల్ లేని లోటు ఈ ఏడాది ఫిబ్రవరిలో స్వదేశంలో శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో తెలిసొచ్చింది. చరిత్రలో తొలిసారిగా దక్షిణాఫ్రికా... లంకకు టెస్టు సిరీస్‌ను కోల్పోయింది. ఇక 36 ఏళ్ల స్టెయిన్‌ది మరో కథ. ప్రపంచ స్థాయి బౌలర్ అయిన అతడు వరుసగా గాయాలతో సతమతం అవుతున్నాడు. ఈ క్రమంలో టెస్టులకు రాం రాం చెప్పాడు. దీంతో ఇద్దరు ఫ్రంట్‌లైన్ పేసర్ల సేవలను కోల్పోయినట్లైంది. మరో ప్రధాన పేసర్ వెర్నాన్ ఫిలాండర్ అద్భుత బౌలరే. అయితే, 34 ఏళ్లు దాటిన అతడు గాయాలతో కొంతకాలంగా ప్రధాన స్రవంతి క్రికెట్లో లేడు. తాజాగా హషీమ్ ఆమ్లా రిటైర్మెంట్తో దక్షిణాఫ్రికా మరో స్టార్ ఆటగాడిని కోల్పోయినట్లైంది. వాస్తవానికి 36 ఏళ్ల ఆమ్లా విరమణపై ఊహాగానాలు ఉన్నా... కనీసం ఇంకో ఏడాదైనా టెస్టుల వరకు ఆడతాడని భావించారు. అతడు మాత్రం మూడు ఫార్మాట్లకు అస్త్రసన్యాసం చేశాడు. టెస్టు చాంపియన్‌షిప్‌లో ఎలాగో... బ్యాటింగ్, బౌలింగ్‌లో మూలస్తంభాలైన నలుగురి రిటైర్మెంట్తో ప్రస్తుతం దక్షిణాఫ్రికా ఎదుర్కోనున్న అసలు సవాలు టెస్టు చాంపియన్‌షిప్. ఆ జట్టు చాంపియన్‌షిప్‌లో 16 టెస్టులు ఆడనుంది. వీటిలో వచ్చే జనవరి లోపు భారత్ (3), ఇంగ్లండ్ (4 సొంతగడ్డపై)లతోనే ఏడు టెస్టులున్నాయి. విండీస్, పాక్, లంకలతోనూ రెండేసి ఆడాల్సి ఉంది. చివరగా ఆస్ట్రేలియాతో 3 టెస్టుల్లో తలపడుతుంది. బౌలింగ్‌లో రబడ మినహా ఇంకెవరిపైనా ఆశలు లేని నేపథ్యంలో డు ప్లెసిస్, డికాక్‌లకు తోడు ఓపెనర్ మార్క్రమ్, ఎల్గర్ సత్తా చాటితేనే సఫారీలు కనీసం పోటీ ఇవ్వగలరు. పెద్దరికం లేని బోర్డు... దూరదృష్టి లేని క్రికెట్ సౌత్ ఆఫ్రికా (సీఎస్ఏ) తీరే ప్రస్తుత పరిస్థితికి కారణం. ఆటగాళ్లు, బోర్డు అధికారుల మధ్య సత్సంబంధాలు లేవు. వన్డే ప్రపంచ కప్ వంటి ప్రతిష్టాత్మక టోర్నీ ముందుండగా రిటైర్మెంట్ ప్రకటించిన డివిలియర్స్‌కు నచ్చజెప్పి ఆపే పెద్దరికం, కప్‌నకు తుది జట్టును ప్రకటించే సమయంలో తిరిగొస్తానన్న అతడిని తీసుకునే విశేష చొరవ ఎవరికీ లేకపోయింది. గాయాలతో ఉన్న స్టెయిన్‌ను జాగ్రత్తగా కాపాడుకునే వ్యూహం, ఆమ్లాను కొన్నాళ్లు ఆగేలా చేసే ప్రయత్నమూ వారిలో కొరవడింది. వన్డేలు, టి20ల కంటే స్టెయిన్ టెస్టుల్లోనే దక్షిణాఫ్రికాకు ఎక్కువ అవసరం. కానీ, అతడు టెస్టులకే రిటైర్మెంట్ ఇచ్చాడు. ఇక్కడా బోర్డు నిష్క్రియాపరత్వం కనిపిస్తోంది. ఇప్పుడు సీఎస్ఏ... ఫుట్‌బాల్ తరహాలో జట్టుకు మేనేజర్‌ను నియమించి అతడే కోచింగ్ సిబ్బందిని, కెప్టెన్‌ను ఎంపిక చేసేలా కొత్త విధానం తీసుకురావాలని చూస్తోంది. ప్రధాన కోచ్ గిబ్సన్, సహాయ సిబ్బంది కాంట్రాక్టు కూడా ముగియనుంది. వచ్చేవారైనా దేశంలో ప్రతిభావంతులైన క్రికెటర్లను వెలిసితీసి బాధ్యతలను సమర్థంగా నెరవేరిస్తేనే ప్రొటీస్ జట్టు పటిష్టంగా ఉంటుంది. -
'పొలార్డ్.. నీతో తలపడడమే నాకు ఆనందం'
న్యూఢిల్లీ : టీమిండియా టి20 జట్టులో కృనాల్ పాండ్యా తొందరగానే తన స్థానాన్ని సుస్థిరపరుచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. తాజాగా అమెరికా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఆకట్టుకునే ప్రదర్శన చేసి మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా 3-0 తేడాతో వైట్‌వాష్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కృనాల్ పాండ్యా స్పందిస్తూ ' బ్రదర్ పొలార్డ్ .. నీకు ప్రత్యర్థిగా మ్యాచ్‌లో తలపడడం తనకు సంతోషాన్నిచ్చింది. కానీ నువ్వు నాతో కలిసి ఆడుతున్నప్పుడు ఇంకా ఎక్కువ ఆనందం కలుగుతుందని' ట్వీట్ చేశాడు. కాగా, ఐపీఎల్ టోర్నీలో పాండ్యా బ్రదర్స్, కీరన్ పొలార్డ్ ముంబయి ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. వీరు ముగ్గురు కలిసి జట్టుకు అనేక విజయాలు సాధించి పెట్టారు. అంతేగాక ఐపీల్ చరిత్రలోనే అత్యధిక టైటిల్స్ నెగ్గిన ముంబయి ఇండియన్స్ జట్టులో వీరి పాత్ర మరువలేనిది. ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ తరపున ఇప్పటికే విజయవంతమైన ఆటగాడిగా పేరుపొందిన కృనాల్ పాండ్యా టీమిండియా తరపున 14 టి20 మ్యాచ్‌ల్లో 14 వికెట్లతో పాటు, బ్యాట్సమెన్‌గానూ రాణిస్తూ మంచి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. -
ముంబైలో 3 వికెట్లు...కాండీలో 7 వికెట్లు!
ముంబై/కాండీ: మ్యాచ్ ఆడిన తర్వాత కనీసం ఒక రోజు విశ్రాంతి ఉంటే తప్ప ప్రాక్టీస్‌కు కూడా ఆటగాళ్లు హాజరు కాకపోవడం ఐపీఎల్లో తరచుగా కనిపిస్తుంది. ఒత్తిడి, ప్రయాణాలు క్రికెటర్లపై అంతటి ప్ర భావం చూపిస్తాయి. అయితే లంక స్టార్ మలింగ మాత్రం అటు తన లీగ్ ఫ్రాంచైజీకి, బోర్డు దేశ వాళీ టోర్నీకి సమన్యాయం చేశాడు! బుధవారం వాంఖడే స్టేడియంలో ముంబై, చెన్నై మధ్య మ్యాచ్ అర్ధరాత్రి దాకా సాగింది. 4 ఓవర్లలో అతను 3 కీలక వికెట్లు తీశాడు. ఆ తర్వాత రాత్రి 1.40కి బయల్దేరిన అతను గురువారం ఉదయం 4.30కి శ్రీలంక చేరుకొని ఉదయం 7కు వన్డే సూపర్ ఫోర్ ప్రొవిన్షియల్ టోర్నీ మ్యాచ్‌కు సిద్ధమయ్యాడు. కాండీతో జరిగిన ఈ మ్యాచ్‌లో గాలే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన మలింగ... 49 పరుగులకే 7 వికెట్లు తీసి తమ జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఒక ఆటగాడు వరుసగా రెండు రోజుల్లో రెండు వేర్వేరు దేశాల్లో మ్యాచ్‌లు ఆడటం అరుదైన విషయంగానే చెప్పవచ్చు. -
ఉగ్రదాడి: ధర్మశాలలో పాక్ క్రికెటర్ల ఫోటోలు తొలగింపు
ధర్మశాల: పుల్వామా ఉగ్ర దాడికి నిరసనగా పాకిస్తాన్‌కు చెందిన 13 మంది క్రికెటర్ల ఫోటోలను హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) తొలగించింది. ధర్మశాలలోని మైదానంలో ఇమ్రాన్ ఖాన్, వసీం ఆక్రమ్, జావెద్ మియాందాద్‌తో సహా మొత్తం పాక్ ఆటగాళ్ల ఫోటోలను తొలగించాలని మేనేజింగ్ కమిటీ నిర్ణయించింది. 2005లో టీమిండియా పర్యటన నేపథ్యంలో ధర్మశాలలో బోర్డ్ ప్రెసిడెంట్ ఎలవన్‌తో పాకిస్తాన్ వార్మప్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ సందర్భంగా షోయబ్ అక్తర్, షాహిద్ ఆఫ్రిది ఆటగాళ్ల ఫోటోలను, ఆ మ్యాచ్‌కు సంబంధించి ఫోటోలను కూడా తొలగించినట్లు హెచ్‌సీఏ ప్రకటించింది. పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడికి నిరసనగా, అదే విధంగా భారతీయ ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేనేజింగ్ కమిటీ సీనియర్ ఒకరు తెలిపారు. (ఉగ్రదాడి.. పాక్ క్రికెట్‌కు గట్టిషాక్!) ఇక ఇప్పటికే క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కూడా బ్రాబోర్న్ స్టేడియంలో ఉన్న పాక్ క్రికెటర్ల ఫోటోలను తీసేసిన విషయం తెలిసిందే. పుల్వామా ఉగ్రదాడిని భారత క్రికెటర్లు ఇప్పటికే తీవ్రంగా ఖండించారు. ప్రపంచకప్‌లో రెండు పాయింట్లు కోల్పోయినా సరే... పాక్‌తో మ్యాచ్ టీమిండియా ఆడరాదంటూ సీనియర్ ఆటగాడు హర్బజన్ అభిప్రాయపడ్డాడు. ఇక అమరజవాన్ల పిల్లలను తన స్కూల్లో ఉచితంగా చదివిస్తానని వీరేంద్ర సెహ్వాగ్ ముందుకు రాగా.. మరికొంత మంది ఆటగాళ్లు ఆర్థిక సహాయం అందించారు. బీసీసీఐ కూడా భారీ మొత్తంలో ఆర్థిక సహాయాన్ని అందించింది. -
క్రికెటర్ల ‘ఫీజు’ చెల్లింపుకు ఆమోదం
న్యూఢిల్లీ: భారత క్రికెటర్ల వార్షిక కాంట్రాక్ట్ ఫీజులకు సంబంధించి ఎట్టకేలకు ఆమోద ముద్ర పడింది. ఈ మేరకు శుక్రవారం జరిగిన బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో(ఎస్‌జీఎమ్) క్రికెటర్ల కాంట్రాక్ట్ ఫీజుల చెల్లింపుపై నిర్ణయం తీసుకున్నారు. ఇదివరకే వార్షిక ఫీజుల్ని పెంచినప్పటికీ బోర్డు నుంచి తుది ఆమోదం దక్కకపోవడంతో క్రికెటర్లకు పెంచిన జీతాలను పెండింగ్‌లో పెట్టారు. కాగా, ఈరోజు అత్యవసరంగా బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి నేతృత్వంలోని సమావేశమైన ఎస్‌జీఎమ్.. క్రికెటర్ల కాంట్రాక్ట్ ఫీజులకు చెల్లించేందుకు ఆమోదం ముద్రవేసింది. మరొకవైపు ఎస్‌జీఎమ్‌లో చర్చకు వచ్చిన అన్ని ప్రతిపాదనలకు జనరల్ బాడీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. వార్షిక కాంట్రాక్ట్ ప్రకారం ఏ+ కేటగిరీ ఆటగాళ్లకు రూ. 7 కోట్లు చొప్పున దక్కనుండగా, ఏ కేటగిరీలో ఉన్న క్రికెటర్లకు రూ. 5 కోట్లు పొందనున్నారు. ఇక బీ కేటగిరీలో ఉన్న వారికి రూ. 3 కోట్లు, సీ కేటగిరీలో క్రికెటర్లకు రూ. 1 కోటి చొప్పన దక్కనున్నాయి. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో భాగంగా ఈరోజు రాత్రి భారత క్రికెటర్లు బయల్దేరుతున్న సమయంలో కాంట్రాక్ట్ వార్షిక ఫీజులపై ఆమోద ముద్ర పడటం విశేషం. -
లీడింగ్ క్రికెటర్లుగా కోహ్లి, మిథాలీ
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, మహిళల సారథి మిథాలీ రాజ్ ప్రఖ్యాత క్రికెట్ మేగజైన్ ‘విజ్డెన్’ పురస్కారాలకు ఎంపికయ్యారు. విరాట్‌ను వరుసగా రెండో ఏడాది ‘విజ్డెన్ లీడింగ్ క్రికెటర్ ఇన్ ద వరల్డ్’ అవార్డుకు ఎంపిక చేశారు. అతనికి గతేడాదీ ఈ పురస్కారం దక్కింది. ఇలా రెండేళ్లు వరుసగా పురస్కారాలు అందుకున్న రెండో భారత క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు. ఇంతకుముందు మాజీ డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ (2008, 2009) రెండుసార్లు ఈ ఘనత సాధించాడు. మహిళల క్రికెట్లో అనితర సాధ్యమైన అర్ధ సెంచరీలు, పరుగులు సాధించిన మిథాలీ ‘లీడింగ్ విమెన్ క్రికెటర్’గా నిలిచింది. గత ఏడాది మహిళల ప్రపంచకప్‌లో ఆమె సారథ్యంలోని భారత్ రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అఫ్గానిస్తాన్ టీనేజ్ సంచలనం రషీద్ ఖాన్ ‘ఫార్‌మోస్ట్ టి20 ప్లేయర్’ పురస్కారానికి ఎంపికయ్యాడు. ఐదు విజ్డెన్ రెగ్యులర్ అవార్డులకు ఇవి అదనం. ఈ ఐదు పురస్కారాలకు ఈ సారి ముగ్గురు ఇంగ్లండ్ మహిళా క్రికెటర్లు అన్య ష్రబ్సోల్, హీతెర్ నైట్, నట్ సివెర్‌లు... ఇద్దరు పురుష క్రికెటర్లు షై హోప్ (విండీస్), జెమీ పోర్టర్ (ఎస్సెక్స్ కౌంటీ జట్టు) ఎంపికయ్యారు. తొలిసారిగా ముగ్గురు మహిళా క్రికెటర్లు ‘విజ్డెన్’ జాబితాలో చోటు సంపాదించుకోవడం ఒక విశేషమైతే... ఓ మహిళ (అన్య ష్రబ్సోల్) విజ్డెన్ ముఖచిత్రంలో ఉండటం ఇదే మొదటిసారి. ఎవరూ చేయని, చేరని పరుగుల ఘనత కోహ్లిది భారత కెప్టెన్ విరాట్ కోహ్లి 2017లో మూడు ఫార్మాట్లలో చేసిన పరుగులు 2818. ఇతని సమీప క్రికెటర్ జో రూట్ (ఇంగ్లండ్) కంటే 700 పరుగులు ముందున్నాడు. టెస్టుల్లో ఒక్క ఏడాదే మూడు డబుల్ సెంచరీలు చేశాడు. ఇంకా రెండు సెంచరీలూ ఉన్నాయి. వన్డేల్లో మరో రెండు అజేయ శతకాలు బాదాడు. మరోవైపు మిథాలీ రాజ్ (6299) మహిళల వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన, అత్యధిక వన్డేలు ఆడిన క్రికెటర్‌గా నిలిచింది. వరుసగా ఏడు అర్ధసెంచరీల రికార్డునూ గతేడాదే నెలకొల్పింది. -
ఏడాది శిక్ష... చాలా ఎక్కువ!
బాల్ ట్యాంపరింగ్‌లో స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్ అడ్డంగా దొరకడంతో క్రీడాలోకం ఒక్కసారిగా భగ్గుమంది. క్షమించరాని నేరమంది. వారు చేసింది ఘోరమంది. శిక్షలు పడ్డాక... పశ్చాత్తాపంతో విలపిస్తుంటే అదే ‘లోకం’ అయ్యో పాపమంటోంది. సానుభూతి కురిపిస్తోంది. న్యూఢిల్లీ: బాల్ ట్యాంపరింగ్‌లో తీవ్రమైన శిక్ష ఎదుర్కొంటున్న స్మిత్ విలాపం బహుశా అందర్ని కదిలిస్తోంది. దీంతో అప్పుడు ఛీ అన్నోళ్లే ఇప్పుడు కనికరించాలంటున్నారు. ఐదు రోజుల క్రితం కెప్టెన్ స్మిత్‌పై ఐసీసీ కేవలం ఒక మ్యాచ్ సస్పెన్షన్ విధించడంతో భారత స్పిన్నర్ హర్భజన్ ఐసీసీది ద్వంద్వ నీతంటూ ధ్వజమెత్తాడు. అతనే ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నాడు. ఆస్ట్రేలియా క్రికెటర్లు స్మిత్, వార్నర్ చేసిన నేరానికి విధించిన ఏడాది శిక్ష చాలా ఎక్కువని... ఏదో ఒక టెస్టు సిరీస్‌కో లేదంటే రెండు సిరీస్‌లకో వేటు వేయాల్సిందని భజ్జీ అన్నాడు. మరో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఆస్ట్రేలియన్లపై సానుభూతి చూపాడు. ‘ప్రపంచం మీ కన్నీళ్లు చూడాలనుకుంది... చూసింది. ఇప్పుడు చూశాక సంతోషించినట్లుంది. కానీ సానుభూతి అనేది పదంలా మాత్రమే కాకుండా నిజంగా చూపిస్తే బాగుంటుంది. దీనినుంచి బయటపడే ధైర్యాన్ని దేవుడు వారికివ్వాలి’ అని అశ్విన్ ట్వీట్ చేశాడు. మోసగాళ్లు, దోషులు అని పతాక శీర్షికల్లో నిందించిన దిన పత్రికలు కూడా ఇవేం శిక్షలంటూ రాశాయి. ‘దిస్ ఈజ్ బాల్ ట్యాంపరింగ్. నాట్ మర్డర్’ (ఇది బాల్ ట్యాంపరింగే... హత్య కాదు), అని, ‘డియర్ ఆస్ట్రేలియా దట్స్ ఎనఫ్ నౌ’ (ఆస్ట్రేలియా... ఇక చాలు) అని పత్రికలు ఆసీస్ ఆటగాళ్లపై నిందలు చాలించాలని కోరాయి. పాక్ కోచ్‌గా వ్యవహరిస్తున్న ఆస్ట్రేలియన్ మైకీ అర్థర్ మాట్లాడుతూ స్మిత్‌కు క్రికెటే లోకమని, ఆటకోసమే పరితపిస్తాడని... అతని కెరీర్లో ఇలాంటి ఘటన దురదృష్టకరమని అన్నారు. మళ్లీ పునరాగమనంలో మరింత కష్టపడతాడని... సుదీర్ఘకాలం జట్టుకు సేవలందిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఆఫీస్ బేరర్ల ఉద్వాసనకు సీఓఏ నివేదిక
న్యూఢిల్లీ: పాలనా వ్యవహారాల్లో జస్టిస్ లోధా సంస్కరణల అమలుపై బీసీసీఐ ఆఫీస్ బేరర్లు, బోర్డు పరిపాలక కమిటీ (సీఓఏ) మధ్య అసలే అంతంతమాత్రంగా ఉన్న సంబంధాల్లో మరో కుదుపు. బీసీసీఐ నియమావళి ప్రకారం పదవీ కాలం పూర్తయినందున ప్రస్తుత ఆఫీస్ బేరర్లు తప్పుకోవాలని, కొత్త రాజ్యాంగం అమలుకు ముందే లోధా సిఫార్సుల ప్రకారం సర్వసభ్య సమావేశం నిర్వహించేలా మార్గదర్శకాలు జారీ చేయాలని అపెక్స్ కోర్టును సీవోఏ కోరింది. ఈ మేరకు సీవోఏ సభ్యులు వినోద్‌రాయ్, డయానా ఎడుల్జీ గురువారం తమ ఎనిమిదో స్థాయీ నివేదికను సుప్రీంకోర్టుకు అందజేశారు. మార్చి 1వ తేదీతోనే పదవీ కాలం పూర్తయిన తాత్కాలిక అధ్యక్ష, కార్యదర్శులు సీకే ఖన్నా, అమితాబ్ చౌదరి, కోశాధికారి అనిరుధ్ చౌదరి, ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లాలను తొలగించి, కొత్తగా ఎన్నిక నిర్వహించాలని ఇందులో కోరారు. అయితే... దీనిని వీరు ముగ్గురూ ప్రతిఘటించనున్నట్లు తెలుస్తోంది. విధాన నిర్ణయాలపై చర్చించే సర్వసభ్య సమావేశం నిర్వహణకు వినోద్ రాయ్ కమిటీ సరైన ప్రొటొకాల్ పాటించ లేదనేది ఖన్నా బృందం వాదనగా ఉంది. కాంట్రాక్టులపై అమితాబ్ అసంతృప్తి... 26 మంది క్రికెటర్లకు బుధవారం సీఓఏ ప్రకటించిన వార్షిక కాంట్రాక్టుల వ్యవహారం చిక్కుల్లో పడనుంది. ఈ విషయంలో తనతో సహా బీసీసీఐలోని ముగ్గురు ప్రధాన అధికారులను సంప్రదించకుండా సీఓఏ నిబంధనలను అతిక్రమించిందంటూ బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి కోర్టు జోక్యాన్ని కోరనున్నారు. కాంట్రాక్టు జాబితాను చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఆధ్వర్యంలోని సెలక్షన్ కమిటీ రూపొందించిందని, వాస్తవానికి వారికి ఆ అర్హత లేదని జాతీయ సెలెక్షన్ కమిటీ కన్వీనర్ అమితాబ్ అంటున్నారు. అయితే... కొత్త కాంట్రాక్టు స్వరూపంపై గతేడాది సెప్టెంబర్ లోనే బీసీసీఐ ఫైనాన్స్ అధ్యక్షుడు జ్యోతిరాదిత్య సింధియా, కోశాధికారి అనిరుధ్ చౌదరిలకు సమాచారం ఇచ్చామని వారి నుంచి ప్రతిస్పందన రాలేదని రాయ్ అంటున్నారు. కానీ దీనికి ఆధారాలు లేవని బీసీసీఐ అధికారి ఒకరు చెబుతున్నారు. -
రూ.5 కోట్లు చేయండి
నాగ్‌పూర్: భారత కెప్టెన్ విరాట్ కోహ్లి, మాజీ సారథి ధోని తమ వార్షిక కాంట్రాక్టు ఫీజులు పెంచాలని బోర్డు పరిపాలక కమిటీ (సీఓఏ) చీఫ్ వినోద్ రాయ్‌ని కోరనున్నారు. ప్రస్తుతం ‘ఎ’ గ్రేడ్ క్రికెటర్లకు ఏడాదికి రూ. 2 కోట్లు చెల్లిస్తున్నారు. గతంలో ఈ మొత్తం రూ. కోటి ఉండేది. అయితే పెంచిన మొత్తం కూడా చాలదని అప్పట్లోనే క్రికెటర్లు అసంతృప్తి వెలిబుచ్చారు. అప్పటి కోచ్ కుంబ్లే సీఓఏకు ఇచ్చిన నివేదికలో రూ. 5 కోట్లు చెల్లించాలని సూచించారు. ఐపీఎల్ కాంట్రాక్టులేని పుజారా లాంటి క్రికెటర్ల అంశాన్ని అందులో ప్రస్తావించారు. సీఓఏ కూడా ఆటగాళ్ల వార్షిక ఫీజులు పెంచేందుకు సుముఖంగానే ఉంది. కుంబ్లే నివేదిక అంశాలను పొందుపరుస్తూ వినోద్ రాయ్ సుప్రీం కోర్టుకు నివేదించారు కూడా. అయితే దీనిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)దే తుది నిర్ణయం. డిసెంబర్ 11న జరిగే బోర్డు ప్రత్యేక సర్వ సభ్య సమావేశం(ఎస్జీఎం)లో ఆమోదం లభిస్తేనే ఆటగాళ్ల జీతాలు పెరుగుతాయి. దీనిపై బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ ‘ఐపీఎల్ బ్రాడ్కాస్ట్ ఆదాయంలో ఆటగాళ్లు వాటా కోరారని మీడియాలో వచ్చిన వార్తల్లో నిజం లేదు. ఏ ఆటగాడు అలాంటి ప్రతిపాదన చేయలేదు. అయితే ఆటగాళ్లకు కాంట్రాక్టు మొత్తాలు పెంచాలని సీఓఏ కూడా భావిస్తోంది’ అని అన్నారు. ప్రస్తుతం క్రికెటర్లు బోర్డు ఆదాయంలో 8 శాతంలోపే అందుకుంటున్నారు. దీన్ని మార్చాలని వినోద్ రాయ్ అనుకుంటున్నప్పటికీ బోర్డే తుది నిర్ణయం తీసుకోవాలి. అందుకే... టి20 జట్టును ప్రకటించలేదా! వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్న కోహ్లి టి20లపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్లే జాతీయ సెలక్టర్లు భారత టి20 జట్టును ప్రకటించలేకపోయారు. కీలకమైన దక్షిణాఫ్రికా టూర్‌కు ముందు విశ్రాంతి కావాలని చెప్పడంతో కోహ్లిని లంకతో మూడు వన్డేల సిరీస్‌కు ఎంపిక చేయలేదు. తదుపరి మూడు టి20లలో ఆడేది లేనిది స్పష్టంగా చెప్పకపోవడంతో టి20 జట్టు ఎంపికను ఎమ్మెస్కే ప్రసాద్ బృందం వాయిదా వేసింది. ‘డిసెంబర్ 12 వరకు కోహ్లికి వ్యక్తిగత పనులున్నాయి. ఆ తర్వాతే అతను ఆడటంపై స్పష్టత వస్తుంది’ అని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. శ్రీలంకతో వచ్చే నెల 20, 22, 24 తేదీల్లో మూడు టి20 మ్యాచ్‌లు జరుగుతాయి. -
రోహిత్ శర్మ పాత్రలో ప్రభాస్! కోహ్లీగా రణ్వీర్?
ముంబై : విధ్వంసక ఆటగాడు రోహిత్ శర్మ నిజజీవితగాథలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరో. అదే టీమిండియా సారథి విరాట్ కోహ్లీ పాత్రలో రణ్వీర్ సింగ్ సూపర్‌గా ఫిట్ అయిపోతాడు. అతిత్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న మహిళా క్రికెటర్ జులన్ గోస్వామి బయోపిక్‌లో బిపాసా బసు లీడ్‌రోల్ ప్లేచేస్తే ఎలా ఉంటుంది? ఇవన్నీ ప్రస్తుతానికైతే ఊహలే. ఏ క్రికెటర్ పాత్రను ఎవరు పోషిస్తే బాగుంటుందోననే ఊహాగానాలు గతంలోనూ ఎన్నో వచ్చాయి. తాజాగా ఆంగ్ల వెబ్సైట్ రిపబ్లిక్ వారు కొన్ని సరదా ఫొటోలు ప్రచురించారు. విమెన్ క్రికెట్ టీం కెప్టెన్ మిథాలీ రాజ్ బయోపిక్‌లో దీపిక, శిఖర్ ధవన్గా అజయ్ దేవ్గన్, యువరాజ్‌గా హెరీ తంగ్రీ, లేడీ క్రికెటర్ హర్మన్‌ప్రీత్ కౌర్ పాత్రలో ఆలియా భట్, సౌత్ ఇండియా ప్రైడ్ రవిచంద్రన్ అశ్విన్ పాత్రలో స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాగా షాహిద్ కపూర్లు నటిస్తారో లేదో కానీ ఊహించడానికి సరదాగా లేదూ... ఫొటో స్లైడ్ చూడండి.. -
నిరుద్యోగులుగా ఆసీస్ క్రికెటర్లు!
సిడ్నీ: క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ), ఆ దేశ ఆటగాళ్లకు మధ్య కొనసాగుతున్న వేతనాల ఒప్పందం మరింత తీవ్ర రూపం దాల్చింది.నూతన ఒప్పందంపై సంతకాలు చేసేందుకు శుక్రవారం(జూన్ 30)తో గడువు ముగిసిన నేపథ్యంలో ఆ దేశ క్రికెటర్ల భవిష్యత్తు ప్రశార్ధకంగా మారింది. కొంతమంది క్రికెటర్లు మినహా ప్రధాన క్రికెటర్లూ ఎవ్వరూ శనివారం నుంచి ఆసీస్ తరపున బరిలోకి దిగే అవకాశాన్ని కోల్పోయారు. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు తరపున బరిలోకి దిగాలంటే కొత్త కాంట్రాక్ట్ పై ఆటగాళ్లు సంతకాలు చేయాల్సి ఉంది. అయితే దాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఆసీస్ క్రికెటర్లు అందుకు ఒప్పుకోలేదు. దాంతో ఆస్ట్రేలియా తరపున ఆడుతున్న పురుష, మహిళా క్రికెటర్లు నిరుద్యోగులుగా మారిపోయారు. మొత్తం ఆస్ట్రేలియాకు చెందిన 230 మంది క్రికెటర్లు భవితవ్యం ప్రశ్నార్దకంగా మారింది. మరోవైపు సీఏ అనుమతి ఇవ్వకపోతే ఆ దేశ ట్వంటీ 20 లీగ్ బిగ్ బాష్ లో కూడా ఆటగాళ్లు పాల్గొనడం కష్టమే. దాంతోపాటు ఆస్ట్రేలియా జట్ల పర్యటనపై కూడా నీలినీడలు అలుముకున్నాయి. భారత్-ఎ, దక్షిణాఫ్రికా-ఎ జట్లతో ఆస్ట్రేలియా-ఎ జట్టు జూలైలో ముక్కోణపు సిరీస్ ఆడాల్సి ఉంది. ఇందుకోసం దక్షిణాఫ్రికా పయనం కావాల్సి ఉంది. ప్రస్తుత వివాదం నేపథ్యంలో ఆ పర్యటన అనుమానాస్పదంగా మారింది. ఒకవేళ ఇదే సమస్య కొనసాగితే మాత్రం ఆగస్టులో బంగ్లాదేశ్ పర్యటన, సెప్టెంబర్ లో భారత్ లో పర్యటనల కూడా కష్టమే. మరొకవైపు ఆస్ట్రేలియా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునే యాషెస్ సిరీస్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది ఆఖర్లో యాషెస్ సిరీస్ జరగునున్న తరుణంలో క్రికెటర్లు మొండికేయడం సీఏకు సవాల్ గా మారింది. ఇప్పటివరకూ ఆసీస్ క్రికెట్ ఆదాయంలో 25 శాతాన్ని క్రికెటర్లకు పంచుతూ వచ్చింది. అయితే తాజా ఒప్పందం ప్రకారం సీఏ మిగులు ఆదాయంలోమాత్రమే క్రికెటర్లకు ఇవ్వాలనేది సీఏ యోచన. ఈ మేరకు కొత్త కాంట్రాక్ట్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందుకు క్రికెటర్లు ఒప్పుకోవాలంటూ హెచ్చరించింది కూడా. అందుకు జూన్ 30 చివరి తేదీగా నిర్ణయించింది. ప్రస్తుతం ఆసీస్ క్రికెట్ ను కుదిపేస్తున్న వివాదం ఎంతవరకూ దారి తీస్తుందో చూడాలి. -
హోటల్లో అగ్నిప్రమాదం: క్రికెటర్లకు గాయాలు!
ఇస్లామాబాద్:కరాచీలోని స్టార్ హోటల్ సోమవారం చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో పదకొండు మంది ప్రాణాలు కోల్పోగా, 75 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో నలుగురు మహిళలున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా, ప్రమాదంలో గాయపడిన వారిలో అత్యధిక శాతం మంది విదేశీయులు ఉన్నట్లు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని రీజెంట్ ప్లాజా స్టార్ హోటల్లో ఆకస్మికంగా ప్రమాదం సంభవించి భారీ ప్రాణ నష్టం జరిగింది. హోటల్ గ్రౌండ్ ఫోర్లో ఉన్న వంట గదిలో తొలుత మంటలు వ్యాపించి అవి హోటల్ కు చుట్టుముట్టాయి. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో దేశవాళీ క్రికెటర్లతో పాటు అంతర్జాతీయ క్రికెటర్ ఒకరు అక్కడ బస చేస్తున్నారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న బౌలర్ యాసిమ్ ముర్తాజా ప్రమాదం నుంచి తప్పించుకునే యత్నంలో రెండో ఫ్లోర్ నుంచి కిందికి దూకేశాడు. దాంతో అతని చీలిమండకు తీవ్రమైన గాయమైనట్లు డాక్టర్లు తెలిపారు. మరొక క్రికెటర్ కరామాత్ అలీ అగ్ని ప్రమాదంలో గాయపడినట్లు తెలిపారు. కాగా, అంతర్జాతీయ క్రికెటర్ షోయబ్ మస్జూద్ ఎటువంటి గాయాలు కాకుండా ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు యూబీఎల్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ మేనేజర్ నదీమ్ ఖాన్ తెలిపారు. ఈ తరహాలో పాక్ లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్టార్ హోటల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు పలువురు మండిపడుతున్నారు. -
క్రికెటర్లకూ తప్పని కరెన్సీ కష్టాలు
కోల్‌కతా: పెద్ద నోట్లను రద్దు చేశాక కరెన్సీ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఖాతాలో డబ్బున్నా అందుబాటులో లేక ప్రజలు అవస్థలు పడుతుంటే, విక్రయాలు తగ్గి వ్యాపారాలు విలవిలలాడుతున్నారు. కోల్‌కతాలో విదర్భ, మహారాష్ట్రల మధ్య జరుగుతున్న రంజీ మ్యాచ్‌పైనా కరెన్సీ ఎఫెక్ట్ పడింది. విదర్భ రంజీ జట్టు క్రికెటర్లు డబ్బుల్లేక ఇబ్బందిపడుతున్నారు. విదర్భ క్రికెట్ జట్టు దగ్గర నగదు లేదని, ఆ జట్టు మేనేజర్ కిశోర్ వకొడె డబ్బుల్లేకుండానే నడిపిస్తున్నాడని సమాచారం. విదర్భ జట్టు నగదు కోసం బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) సాయం కోరనుంది. సోమవారం గురునానక్ జయంతి సందర్భంగా బ్యాంకులు మూతపడ్డాయి. దీంతో క్రికెటర్లు, ఇతర సిబ్బంది కరెన్సీ లేక ఇబ్బందిపడ్డారు. సాయం చేయాల్సిందిగా విదర్భ రంజీ జట్టు మేనేజ్మెంట్ కోరలేదని, వారు సంప్రదిస్తే కచ్చితంగా సాయం చేస్తామని క్యాబ్ సంయుక్త కార్యదర్శి అభిషేక్ దాల్మియా చెప్పారు. రంజీ ఆటగాళ్లకు రోజువారి అలవెన్స్ కింద 1500 రూపాయలు ఇస్తామని, మ్యాచ్ లేని రోజుల్లో వసతి, భోజనం ఏర్పాటు చేస్తామని తెలిపారు. -
పరుగులు పారిస్తున్న జిల్లా క్రికెటర్లు
ఏలూరు రూరల్ ః అంతరజిల్లా క్రికెట్ పోటీల్లో జిల్లా క్రికెటర్లు సత్తా చాటారి. జిల్లా జుట్టు కెప్టెన్ కెఎస్ఎన్ రాజు సెంచరీతో ఆకట్టుకున్నారు. కొద్దిరోజులుగా విజయనగరంలో అండర్–14 బాలుర అంతరజిల్లా క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఈ నెల 23, 24 తేదీల్లో జిల్లాజట్టు శ్రీకాకుళం జట్టుతో తలపడింది. ఇందులో రెండో ఇన్నింగ్స్‌లో జిల్లాజట్టు కెప్టెన్ కెఎస్ఎన్ రాజు అజేయంగా 142 పరుగులు చేసి అందరి మన్ననలు అందుకున్నాడు. జాన్‌రిచార్డ్ 77 పరుగులతో అకట్టుకున్నాడు. వీరిద్దరూ మొదట ఇన్నింగ్స్‌లో సైతం 24, 35 పరుగులు చేశారు. శ్రీకాకుళం జట్టు సైతం జిల్లాజట్టుకు ధీటుగా రాణించడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. పోటీల్లో జిల్లా జట్టు బ్యాట్స్‌మెన్ రాణించడంపై అసోసియేషన్ కార్యదర్శి గోకరాజు రామరాజు, సహాయ కార్యదర్శి ఎం వగేష్‌కుమార్, బిఎస్ మంగేష్, వి విద్యాప్రసాద్, జిల్లా శిక్షకులు జి సత్యనారాయణ, షకీర్ హుస్సేన్, రామప్రసాద్, కాశీవిశ్వేశ్వరరావు ఓ ప్రకటనలో క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. -
ఇండోర్‌కు చేరుకున్న ఇరు జట్ల ఆటగాళ్లు
-
క్రికెటర్లపై సినిమాలు అవసరం లేదు!
ఎమ్మెస్ ధోని జీవిత విశేషాలతో రూపొందిన సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందు మరో క్రికెటర్ గౌతం గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రికెటర్లపై సినిమాలు తీయాల్సిన అవసరం లేదని అతను అన్నాడు. ‘క్రికెటర్ల జీవితంపై సినిమాలు తీయడం అనే అంశంపై నాకు నమ్మకం లేదు. క్రికెటర్లతో పోలిస్తే దేశానికి ఎంతో ఎక్కువ సేవలు చేసినవారిపై సినిమా అవసరం. భారత జాతి కోసం గొప్ప పనులు చేసినవారు దేశంలో ఎంతో మంది ఉన్నారు. తీస్తే అలాంటివారి జీవితంపై సినిమాలు తీయాలి’ అని గంభీర్ నిర్మొహమాటంగా తన అభిప్రాయం వెల్లడించాడు. -
భారత క్రికెటర్లకు జహీర్ సూచన!
న్యూఢిల్లీ: రాబోవు క్రికెట్ సీజన్లో భారత జట్టు పదమూడు టెస్టులు ఆడనుంది. స్వదేశంలో జరిగే సిరీస్‌ల్లో న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా దేశాలతో భారత క్రికెట్ జట్టు భారీ సంఖ్యలో మ్యాచ్‌లకు సిద్ధమవుతుంది. అయితే ఇలా భారీ ఎత్తున టెస్టు మ్యాచ్‌లు ఆడటం కచ్చితంగా సంప్రదాయ టెస్టు క్రికెట్‌కు ఒక శుభపరిణామని మాజీ పేసర్ జహీర్ ఖాన్ పేర్కొన్నాడు. కాగా, ఇంతటి భారీ స్థాయిలో క్రికెట్ ఆడాల్సి రావడం ఆటగాళ్ల కెరీర్లో అరుదుగా జరుగుతూ ఉంటుందని, దాన్ని ప్రతీ ఒక్క భారత క్రికెటర్ ఛాలెంజ్‌గా తీసుకోవాలని సూచించాడు. తమ కెరీర్లో క్రికెటర్ల ప్రతిభ మరింత మెరుగుపడాలన్నా, వారి గ్రాఫ్ పడిపోవాలన్నా ఇటువంటి సీజన్లే నిర్ణయిస్తు ఉంటాయన్నాడు. 'క్రికెటర్లకు ఇదే నా సలహా. మీరు సానుకూల ధోరణితో ఉంటే మీ రిథమ్‌ను అంది పుచ్చుకుంటారు. ఈ తరహా అవకాశం అన్నిసార్లూ రాదు. ఇది ప్రతీ ఒక్కరికి కీలక సిరీస్ అని కచ్చితంగా చెప్పగలను. గతంలో నాకు ఒకసారి ఇదే తరహా అవకాశం ఉంది. అది నా అంతర్జాతీయ కెరీర్‌కు చాలా మేలు చేసింది' అని జహీర్ తన జ్ఞాపకాల్ని నెమరువేసుకున్నాడు. -
‘క్రికెటర్లను ఈజీమనీ చెడగొడుతోంది’
చండీగఢ్: ట్వి20 వచ్చిన తర్వాత ఫాస్ట్ బౌలర్లు కష్టపడడం మానేశారని ఆస్ట్రేలియా బౌలింగ్ దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్ అన్నాడు. పొట్టి ఫార్మాట్ లో సక్సెస్ కాగానే శ్రమించడం ఆపేస్తున్నారని అభిప్రాయపడ్డాడు. క్రికెటర్లను ఈజీమనీ చెడగొడుతోందని పేర్కొన్నాడు. డబ్బు మోజులో పడి వర్ధమాన క్రికెటర్లు ఆటను నిర్లక్ష్యం చేస్తున్నారని పేర్కొన్నాడు. చండీగఢ్ లో పీఏసీ స్టేడియంలోని కోచింగ్ క్లినిక్ లో అండర్-23 పేసర్లకు మెక్‌గ్రాత్ మెళకువలు నేర్పించాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... క్రికెట్ రాణించాలంటే బాగా ప్రాక్టీస్ చేయాలని అన్నాడు. సక్సెస్ కావడానికి కష్టపడడం ఒకటే మార్గమని, షార్ట్ కట్స్ లేవని చెప్పాడు. క్రికెటర్లకు ఆటే ముఖ్యమని, తర్వాతే డబ్బు సంపాదన గురించి ఆలోచించాలన్నారు. దేశానికి ప్రాతినిథ్యం వహించడమే లక్ష్యంగా నిర్దేశించుకోవాలని యువక్రికెటర్లకు ఉద్బోధించాడు. పింక్ బంతితో డేనైట్ టెస్టు మ్యాచ్ లు నిర్వహించడం వల్ల క్రికెట్ లో కొత్త పరిణామాలు చోటు చేసుకునే అవకాశముందని మెక్‌గ్రాత్ అభిప్రాయపడ్డాడు. -
శ్రీమఠంలో మాజీ క్రికెటర్లు
మంత్రాలయం(కర్నూలు): ఆరాధనోత్సవాల సందర్భంగా శ్రీరాఘవేంద్రస్వామి దర్శనార్థం భారత మాజీ క్రికెట్ క్రీడాకారులు వెంకటేష్ ప్రసాద్, విజయ్‌భరద్వాజ్ శనివారం మంత్రాలయం వచ్చారు. ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డితో కలిసి రాఘవేంద్రస్వామి మూలబృందావనం, గ్రామ దేవత మంచాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీమఠం అసిస్టెంట్ మేనేజర్.. క్రీడాకారులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు రాఘవేంద్రుల జ్ఞాపిక, శేషవస్త్రాలు, ఫల, పూల మంత్రాక్షింతలతో ఆశీర్వదించారు. -
నలుగురు క్రికెటర్లపై నిషేధం
జోహన్నెస్‌బర్గ్: మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిన నలుగురు దక్షిణాఫ్రికా క్రికెటర్లపై ఆ దేశ క్రికెట్ బోర్డు(సీఎస్ఏ)నిషేధం విధించింది. గతేడాది దక్షిణాఫ్రికాలో జరిగిన దేశవాళీ మ్యాచ్‌ల్లో అంతర్జాతీయ మాజీ క్రికెటర్ థామి సోలెకైల్తో పాటు యువ క్రికెటర్లు సీన్ సైమ్స్, ఎథీ ఎంబలాటీ, పుమేలా మ్యాట్షైక్వేలు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారు. సదరు క్రికెటర్లపై వచ్చిన ఆరోపణలపై సుదీర్ఘ విచారణ చేపట్టిన అనంతరం వారిపై ఏడు నుంచి పన్నెండు సంవత్సరాల పాటు నిషేధం విధిస్తూ సీఎస్ఏ నిర్ణయం తీసుకుంది. 2015లో రామ్ స్లామ్ టీ 20 సిరీస్ సందర్భంగా వారంతా మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడినట్లు రుజువు కావడంతో నిషేధం విధిస్తున్నట్లు సీఎస్ఏ పేర్కొంది. ఎంబలాటీ, పుమేలా మ్యాట్షైక్వేలపై పది సంవత్సరాల పాటు నిషేధం విధించగా, సైమ్స్పై ఏడు సంవత్సరాల నిషేధం పడింది. దక్షిణాఫ్రికా మాజీ వికెట్ కీపరైన సోలైక్పై 12 సంవత్సరాల నిషేధం విధించింది. కాగా, మరో ఇద్దరు క్రికెటర్లపై విచారణ కొనసాగుతోంది. -
‘కత్తి’లాంటోడు..!
ఏడాది క్రితం అతని పేరు కూడా ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు... క్రికెట్ ప్రపంచం అంతా అతడిని కీర్తిస్తోంది. ప్రత్యర్థి క్రికెటర్లు కొన్ని వందలసార్లు అతని బౌలింగ్ వీడియోలు చూస్తున్నారు. కానీ మైదానంలోకి దిగాక ఎవరికీ కొరుకుడు పడని బంతులు వేస్తున్నాడు. ఈ సీజన్ ఐపీఎల్లో పరుగుల వరద పారిస్తున్న విరాట్ కోహ్లి కూడా అతని ధాటికి వెంటనే పెవిలియన్‌కు చేరాడు. ఆ సంచలనం పేరు ముస్తాఫిజుర్ రెహమాన్. బంగ్లాదేశ్‌కు చెందిన 20 ఏళ్ల ఈ యువ బౌలర్ ఇప్పుడు ఐపీఎల్ ద్వారా మరింత ప్రకంపనలు పుట్టిస్తున్నాడు. నిలకడగా బౌలింగ్ చేస్తూ సన్‌రైజర్స్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. సాక్షి క్రీడావిభాగం: గత జూన్‌లో భారత్‌తో వన్డే ద్వారా ముస్తాఫిజుర్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లోనే తన ఆఫ్ కట్టర్స్‌తో బెంబేలెత్తించి ఐదు వికెట్లు తీసుకున్నాడు. ఆ షాక్ నుంచి ధోనిసేన కోలుకునేలోగానే రెండో వన్డేలో ఆరు వికెట్లతో చెలరేగిపోయాడు. దీంతో తొలిసారి భారత్‌పై బంగ్లాదేశ్ వన్డే సిరీస్ గెలిచింది. దీంతో బంగ్లాదేశ్‌లో ముస్తాఫిజుర్ హీరోగా మారిపోయాడు. అయితే ఇలాంటి బౌలర్లు గతంలో చాలామంది వచ్చారని, ముస్తాఫిజుర్ కూడా ఈ సంచలనాలు ఎక్కువ కాలం కొనసాగించలేడనే వాదన కూడా వినిపించింది. అయితే ఏడాది గడిచినా ప్రపంచంలోని టాప్ క్లాస్ బ్యాట్స్‌మెన్ కూడా ఇప్పటికీ అతని ఆఫ్ కట్టర్స్‌ను అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ ఏడాది కాలంలో మొత్తం 24 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అతను 52 వికెట్లు తీసుకున్నాడు. గత ఏడాది కాలంలో బంగ్లాదేశ్ సంచలన విజయాల్లో ముస్తాఫిజుర్దీ కీలకపాత్ర. చౌకగానే సన్‌రైజర్స్‌కు... ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో ముస్తాఫిజుర్‌ను సన్‌రైజర్స్ జట్టు రూ.1.4 కోట్లు పెట్టి కొనుక్కుంది. నిజానికి అతని నైపుణ్యానికి ఇంతకంటే ఎక్కువ రేటు రావాల్సింది. కానీ ముస్తాఫిజుర్ ఇంకా ఈ స్థాయిలో రాణిస్తాడని ఏ జట్టూ ఊహించలేదు. ‘తన ఆఫ్ కట్టర్స్‌ను ఇంకా చాలామంది బ్యాట్స్‌మెన్ అర్థం చేసుకోలేదు. కాబట్టి కచ్చితంగా అతను మా బలమవుతాడు’ అని సన్‌రైజర్స్ మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ వేలం సమయంలో అభిప్రాయపడ్డారు. ఒక రకంగా తను చౌకగానే ఈ జట్టుకు దొరికాడు. అయితే బౌల్ట్ లాంటి ప్రపంచ స్థాయి బౌలర్‌తో పాటు ఆశిష్ నెహ్రా, బరీందర్ శరణ్లాంటి భారత ఎడమచేతి వాటం బౌలర్లు ఉన్నందున తుది జట్టులో ముస్తాఫిజుర్‌కు చోటు దక్కుతుందని అతను కూడా అనుకోలేదట. కానీ అనూహ్యంగా తొలి మ్యాచ్‌లోనే తుది జట్టులోకి వచ్చాడు. ఐపీఎల్లో జోరు... సీజన్ తొలి మ్యాచ్‌లో బెంగళూరుతో మ్యాచ్‌లో సన్ బౌలర్లు 227 పరుగులు ఇచ్చారు. అయితే ముస్తాఫిజుర్ మాత్రం తన నాలుగు ఓవర్లలో కేవలం 26 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. ప్రతి మ్యాచ్‌లోనూ నిలకడగా బంతులు వేస్తున్న అతను పంజాబ్‌పై నాలుగు ఓవర్లలో కేవలం 9 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. ప్రతి మ్యాచ్‌లోనూ వికెట్లు అవసరమైన సమయంలో... స్లాగ్ ఓవర్లలో కెప్టెన్ వార్నర్ బంతి ముస్తాఫిజుర్‌కు ఇస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకూ 9 మ్యాచ్‌లు ఆడిన ఫిజ్... 13 వికెట్లు తీసుకున్నాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో అందరికంటే పొదుపుగా (6.15 ఎకానమీ) బౌలింగ్ చేశాడు. సుదీర్ఘకాలం ఉంటాడా? ఏడాది అంతర్జాతీయ క్రికెట్ అనుభవంలోనే ముస్తాఫిజుర్ రెండుసార్లు గాయాల బారిన పడ్డాడు. ఏ ఫాస్ట్ బౌలర్‌కైనా గాయాలు సహజం. ముస్తాఫిజుర్‌కు కూడా ఇప్పుడు తనని తాను గాయాల నుంచి కాపాడుకోవడమే కీలకం. చాలామంది బౌలర్లు గతంలో రెండు మూడేళ్లు సంచలన బౌలర్లుగా ప్రభావం చూపినా ఆ తర్వాత కనుమరుగయ్యారు. కారణం ప్రత్యర్థులు వారి బౌలింగ్‌ను పూర్తిగా అర్థం చేసుకోవడం. ఏ బౌలర్ అయినా ఎప్పటికప్పుడు మెరుగైతేనే సుదీర్ఘకాలం మనగలుగుతాడు. ముస్తాఫిజుర్లో ఈ నైపుణ్యం ఉందని సన్‌రైజర్స్ బౌలింగ్ మెంటార్ మురళీధరన్ అభిప్రాయపడుతున్నారు. ‘సరైన గెడైన్స్‌తో ప్రణాళికతో వెళితే ముస్తాఫిజుర్ సుదీర్ఘకాలం అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతాడు’ అని ఆయన అన్నారు. భవిష్యత్ సంగతి ఎలా ఉన్నా ఈ సీజన్ ఐపీఎల్లో చివరి వరకూ ఇదే నిలకడ కనబరచి సన్‌రైజర్స్‌ను చాంపియన్‌గా నిలపాలని ఆశిద్దాం. స్ఫూర్తిదాయక నేపథ్యం బంగ్లాదేశ్‌లోని సత్కిరా అనే పట్టణానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మారుమూల పల్లెటూరు టెటూలియా ముస్తాఫిజుర్ స్వస్థలం. చిన్నప్పుడు తన ముగ్గురు అన్నలతో కలిసి సరదాగా టెన్నిస్ బాల్‌తో క్రికెట్ ఆడేవాడు. 12 ఏళ్ల వయసులో తనలో క్రికెట్ టాలెంట్‌ను గుర్తించిన అతని తండ్రి అబుల్ ఖాసీం ఘాజీ సత్కిరా పట్టణానికి శిక్షణ కోసం పంపించారు. దీనికోసం తన అన్న వెనుక బండి మీద కూర్చుని రోజూ 40 కిలోమీటర్లు వెళ్లి ప్రాక్టీస్ చేసేవాడు. దీంతో చదువు అటకెక్కింది. అయినా తనలో నైపుణ్యం ఉందని కోచ్‌లు చెప్పడంతో 2012లో ఢాకా వచ్చాడు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పేస్ బౌలింగ్ ఫౌండేషన్‌కు ఎంపికయ్యాడు. రెండేళ్లలోనే (2014) అండర్-19 ప్రపంచకప్‌కు ఎంపికయ్యాడు. 2014లో దేశవాళీ క్రికెట్లో నిలకడ, 2015 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఢాకా డైనమైట్స్ తరఫున 10 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీయడంతో జాతీయ జట్టులో అవకాశం లభించింది. సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ముస్తాఫిజుర్ అంచెలంచెలుగా ఎదిగిన వైనం బంగ్లాదేశ్‌లోని ఎందరో యువ క్రికెటర్లకు స్ఫూర్తి. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ముస్తాఫిజుర్‌కు క్రేజ్ బాగా పెరిగింది. రోజూ వందల సంఖ్యలో లవ్‌లెటర్స్ వస్తున్నాయట. డిమాండ్ పెరిగింది...ప్రస్తుతం టి20 క్రికెట్లో సునీల్ నరైన్ తర్వాత అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసిన రికార్డు ముస్తాఫిజుర్ది. ఇప్పటికే అతను అనేక ఘనతలు సొంతం చే సుకున్నాడు. షకీబ్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో సంచలనంగా మారిన ముస్తాఫిజుర్ తమ లీగ్‌లలో ఆడాలని అన్ని దేశాలూ కోరుకుంటున్నాయి. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో లాహోర్ అతణ్ని తీసుకుంది. కానీ గాయం కారణంగా ఈ లీగ్‌లో అతను ఆడలేదు. ఐపీఎల్ తర్వాత ఇంగ్లండ్ కౌంటీల్లో ససెక్స్ తరఫున ఆడబోతున్నాడు. ఆస్ట్రేలియా బిగ్‌బాష్ లీగ్ జట్లు కూడా ముస్తఫిజుర్‌తో చర్చలు జరుపుతున్నాయి. ఒకరకంగా ప్రస్తుతం అతను ప్రపంచ క్రికెట్లో హాట్ పేస్ బౌలర్. -
ఇద్దరూ ఇద్దరే...
వాళ్లిద్దరూ ఆ రెండు జట్లకు వెన్నెముకలాంటి వాళ్లు. ఇద్దరి ఆటశైలి పూర్తిగా భిన్నం. ఒకరు నెమ్మదిగా ‘క్లాసికల్’ తరహాలో తమ ఆటతీరుతో అలరిస్తే... మరొకరు ‘రాక్‌స్టార్’లా చిందేయిస్తాడు. దాదాపుగా ఒకేసారి వన్డే కెరీర్‌ను ప్రారంభించిన ఈ ఇద్దరి కెరీర్ పోటాపోటీగా సాగుతోంది. ఒకరి రికార్డును మరొకరు అధిగమిస్తూ పోటీలు పడి పరుగుల వర్షం కురిపిస్తున్నారు. అందుకే దక్షిణాఫ్రికా ఓపెనర్ హషీం ఆమ్లా, భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి ప్రస్తుత క్రికెట్లో నిలకడకు మారుపేరుగా మారారు. ఈసారి గాంధీ-మండేలా సిరీస్‌లోనూ ఈ ఇద్దరే కీలకం. * పోటాపోటీగా సాగుతున్న కోహ్లి, ఆమ్లాల కెరీర్ * గాంధీ-మండేలా సిరీస్‌లోనూ ఈ ఇద్దరే కీలకం సాక్షి క్రీడావిభాగం: ఈ దశాబ్దపు అత్యుత్తమ క్రికెటర్ల పేర్లు చెప్పమంటే ఎవరైనా ముందుగా కోహ్లి, ఆమ్లాల పేర్లు చెప్పాల్సిందే. ఈ ఇద్దరూ తమ జట్లకు ఎన్నో సంచలన విజయాలు అందించారు. 50కి పైగా సగటుతో పరుగులు చేయడం, తరచూ సెంచరీలు సాధించడం, చిరస్మరణీయ విజయాలు అందించడం ద్వారా తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అందుకే దక్షిణాఫ్రికా జట్టు ఆడుతుందంటే అటు అభిమానుల దృష్టి, ఇటు ప్రత్యర్థుల లక్ష్యం ఆమ్లానే. అలాగే భారత్ తరఫున కోహ్లిది కూడా అదే పాత్ర. అతను ఒక్కసారి కుదురుకుని ఆడాడంటే పరుగుల ప్రవాహమే. ఈసారి భారత్, దక్షిణాఫ్రికాల మధ్య సిరీస్‌కు బాగా క్రేజ్ పెరిగింది. జాతీయ నేతల పేర్లతో సిరీస్ ఏర్పాటు కావడం, ఇటీవల కాలంలో రెండు జట్లు కూడా బలమైన ప్రత్యర్థులతో ఆడకపోవడం వల్ల ఈ సిరీస్ కోసం క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సహజంగానే ఈ సిరీస్ సందర్భంగా కోహ్లి, ఆమ్లాల గురించి చర్చ మొదలైంది. ఇద్దరి ఆటశైలి భిన్నం... దక్షిణాఫ్రికా స్టార్ ఆమ్లా ఆటతీరు పూర్తిగా సంప్రదాయబద్ధంగా ఉంటుంది. క్రికెట్ పుస్తకాల్లో ఉండే షాట్లు ఆడి చూపిస్తాడు. అధికంగా ప్రయోగాలు చేయడు. స్ట్రయిక్ రొటేట్ చేస్తూ పరుగులు సాధిస్తాడు. అతను ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే ఇక అవుట్ చేయడం చాలా కష్టం. అన్ని ఫార్మాట్లలో కలిపి 13 వేలకు పైగా పరుగులు చేసినా... ఇప్పటివరకూ కెరీర్లో కొట్టిన సిక్సర్ల సంఖ్య 56 మాత్రమే. అటు కోహ్లి ఆట దీనికి భిన్నం. షాట్లలో ప్రయోగాలు చేయడానికి వెనుకాడడు. అదే విధంగా బలమైన షాట్లతో బౌండరీలు, సిక్సర్లతో పరుగులు సాధిస్తాడు. కోహ్లి అన్ని ఫార్మాట్లలో కలిపి 10 వేలకుపైగా పరుగులు చేస్తే అందులో 91 సిక్సర్లు ఉన్నాయి. ఆమ్లా కెరీర్ అంతటా టాప్ ఆర్డర్‌లోనే ఆడాడు. కోహ్లి మాత్రం ఫార్మాట్‌ను బట్టి టాప్ ఆర్డర్‌తో పాటు మిడిలార్డర్, లోయర్ మిడిలార్డర్లోనూ కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. నిలకడ విషయంలో ఇద్దరూ సమానంగా ఉన్నా... ప్రేక్షకులను అలరించడంలో మాత్రం విరాట్ కోహ్లి ముందుంటాడు. ఆమ్లానే సీనియర్... ఇద్దరిలో అంతర్జాతీయ క్రికెట్లోకి ముందుగా వచ్చింది మాత్రం ఆమ్లానే. 2004లో భారత్‌తో కోల్‌కతాలో జరిగిన టెస్టు ద్వారా ఆమ్లా అరంగేట్రం చేశాడు. టెస్టు స్పెషలిస్ట్‌గా జట్టులోకి వచ్చిన అతను... వన్డేల్లో 2008లో అరంగేట్రం చేశాడు. దీనికి భిన్నంగా కోహ్లి తొలుత 2008లో వన్డేల్లో అరంగేట్రం చేసి ... మూడేళ్ల తర్వాత 2011లో టెస్టు జట్టులో స్థానం సంపాదించగలిగాడు. ఇద్దరూ వన్డేల్లో ఒకే ఏడాది అరంగేట్రం చేసినా కోహ్లి ఎక్కువ మ్యాచ్‌లు ఆడాడు. ఈ ఏడేళ్ల కాలంలో భారత్ ఎక్కువగా వన్డేలు ఆడటం వల్ల సహజంగానే కోహ్లి ఇందులో ఎక్కువ మ్యాచ్‌లు ఆడాడు. ఈ ఇద్దరి కెరీర్ అప్పటి నుంచి కూడా పోటాపోటీగానే సాగుతోంది. కోహ్లి 22 సెంచరీలు చేస్తే... ఆమ్లా 21 శతకాలు కొట్టాడు. కోహ్లి అనేక రికార్డులు సాధించాడు. అయితే వేగంగా 20 సెంచరీలు, ఐదు వేల పరుగులులాంటి కోహ్లి ఘనతలన్నింటినీ ఆమ్లా అధిగమిస్తూ వస్తున్నాడు. అన్ని ఫార్మాట్లలోనూ... ఇటీవల అంతర్జాతీయ క్రికెట్లో అనేక మంది క్రికెటర్లు ఏదో ఒక ఫార్మాట్‌కు లేదా రెండు ఫార్మాట్లకు పరిమితమవుతున్నారు. ప్రతి జట్టులోనూ అన్ని రకాల ఫార్మాట్లలో ఆడే నైపుణ్యం ఉన్న క్రికెటర్ల సంఖ్య తక్కువగానే ఉంటోంది. ఈ ఇద్దరూ మాత్రం మూడు ఫార్మాట్లలోనూ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుండటం విశేషం. అలాగే తమ తమ టెస్టు జట్లకు ఈ ఇద్దరూ ప్రస్తుతం కెప్టెన్లు. ఆమ్లా వయసు 33 ఏళ్లు. కోహ్లి తనకంటే ఆరేళ్లు చిన్నోడు. కాబట్టి ఆమ్లాతో పోలిస్తే విరాట్ ఎక్కువ కాలం క్రికెట్లో కొనసాగుతాడు. కాబట్టి భవిష్యత్తులో ఆమ్లా కంటే కోహ్లి ఎక్కువ రికార్డులు కొల్లగొట్టే అవకాశం ఉంది. అయితే ఆమ్లా రిటైరయ్యే వరకు మాత్రం కోహ్లికి గట్టి పోటీయే ఉంటుంది. ఎందుకు కీలకమంటే... ఈ సిరీస్‌లో ఈ ఇద్దరు క్రికెటర్లు తమ జట్లకు ప్రధాన బలం. దక్షిణాఫ్రికా జట్టు ఒకప్పుడు స్పిన్ ఆడటానికి చాలా ఇబ్బంది పడేది. ముఖ్యంగా ఉపఖండం పిచ్‌లపై స్పిన్నర్లు ఆ జట్టును కకావికలు చేసేవారు. ఆమ్లా రంగప్రవేశం తర్వాత ఈ పరిస్థితి మారింది. మిగిలిన క్రికెటర్లు కూడా స్పిన్ ఆడటంలో మెరుగుపడ్డా... ఆమ్లా మాత్రం స్పిన్నర్లకు గోడలా నిలబడుతున్నాడు. అన్ని ఫార్మాట్లలోనూ ఇన్నింగ్స్‌కు యాంకర్ పాత్ర పోషించే ఆమ్లా... ప్రస్తుత సిరీస్‌లో దక్షిణాఫ్రికాకు కీలకం. ఇక కోహ్లి విషయానికొస్తే స్వదేశంలో అతను తిరుగులేని క్రికెటర్. వన్డేల్లో అతను చేసిన 22 సెంచరీల్లో 14 భారత్, బంగ్లాదేశ్‌లలో చేసినవే. మందకొడి పిచ్‌ల మీద విరాట్ జోరుకు ఈ గణాంకాలు నిదర్శనం. దక్షిణాఫ్రికా జట్టులో ఇమ్రాన్ తాహిర్ లాంటి నాణ్యమైన స్పిన్నర్ ఉన్నా... స్టెయిన్ నేతృత్వంలోని పేసర్లు కూడా చాలా కీలకం. కొత్త బంతితో బౌన్స్‌ను, పాత బంతితో రివర్స్ స్వింగ్నూ రాబడతారు. ఈ రెండింటిని ఎదుర్కొనే సత్తా కోహ్లిలో ఉంది. ఇటీవల కాలంలో ఒకట్రెండు ఇన్నింగ్స్‌ను మినహాయిస్తే ఏడాది కాలంగా కోహ్లి ఆటతీరు అతని స్థాయికి తగ్గట్లుగా లేదు. మళ్లీ దక్షిణాఫ్రికాతో సిరీస్ ద్వారా తన ముద్రను చూపించాలని విరాట్ పట్టుదలతో ఉన్నాడు. -
ఆఫ్ ద ఫీల్డ్
ఆట మారినా అదే ‘శైలి’ దక్షిణాఫ్రికాతో సిరీస్ కోసం భారత క్రికెటర్లు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో కఠోరంగా శ్రమిస్తున్నారు. ఈ శిక్షణలో భాగంగా ప్రతి రోజూ సాయంత్రం రెండు గంటల పాటు మన క్రికెటర్లు బ్యాడ్మిం టన్ ఆడుతున్నారు. అయితే ఒకరితో ఒకరు కాకుండా... చిన్నస్వామి స్టేడియంలోని బ్యాడ్మింటన్ క్లబ్ సభ్యులతో కలిసి ఆడుతున్నారు. ధోని, కోహ్లి వరుసగా మూడు రోజులపాటు సాయంత్రం బ్యాడ్మిం టన్ ఆడారు. అయితే ఆట మారినా వీళ్ల శైలి మాత్రం మారలేదు. ధోని తన ఆటతీరులో ఎక్కువగా డ్రాప్స్, ప్లేస్‌మెంట్స్‌తో పాయింట్లు సాధించాడు. క్రికెట్లో సింగిల్స్ దొంగిలించే తరహాలో ఇక్కడా పాయింట్లు రాబట్టాడు. దీనికి భిన్నంగా కోహ్లి దూకుడు ప్రదర్శిం చాడు. స్మాష్‌ల ద్వారానే పాయింట్లు సాధిం చే ప్రయత్నం చేశాడు. ప్రతి పాయిం ట్నూ వేగంగా ముగించాలనే తపనతో ఆడాడు. ఇషాంత్, భువనేశ్వర్, ధావన్, అశ్విన్, అంబటి రాయుడు, కరుణ్ నాయర్, మురళీ విజయ్ కూడా తమ కెప్టెన్లతో పాటు బ్యాడ్మిం టన్ ఆడుతూ కనిపించారు. -
వ్యాపారంలోనూ మన క్రికెటర్ల జోరు
కాదేదీ వ్యాపారానికి అనర్హం... భారత క్రికెటర్లకు ఈ విషయం బాగా తెలుసు. తమకు తెలిసిన విద్యతో పాటు తెలియని విద్యలోనూ వ్యాపారాలు చేయడంలో మనోళ్లు పండిపోయారు. క్రికెట్ అకాడమీలు, రెస్టారెంట్లు, సెలూన్లు, దుస్తులు, స్కూళ్లు... ఇలా ఒక్కటేమిటి అన్ని రకాల వ్యాపారాల్లో ఎవరో ఒకరు ఓ చేయి వేస్తున్నారు. రిటైరైన వాళ్లే కాదు. ఇంకా ఆటలో కొనసాగుతున్న వాళ్లు కూడా ఇందులో ఉన్నారు. తమకున్న క్రేజ్ ఆ వ్యాపారానికి జతకావడంతో దాదాపుగా అందరూ సక్సెస్ అయ్యారు.... అవుతున్నారు కూడా..! మన దేశంలో సినిమా స్టార్స్‌కు దీటుగా సంపాదించేది క్రికెటర్లు. ధోని, కోహ్లి లాంటి వాళ్లయితే సినిమా స్టార్స్‌ను మించి సంపాదిస్తారు. భారత జట్టు తరఫున ఒక్కసారి ఆడితే చాలు కావలసినంత డబ్బు. రంజీ క్రికెటర్లే బోలెడు సంపాదిస్తుంటే... ఏడేళ్లుగా ఐపీఎల్ నుంచి వస్తున్న డబ్బు గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. చాలామంది క్రికెటర్లు తమకు వచ్చిన డబ్బును రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెడితే, కొంతమంది షేర్ మార్కెట్‌నూ ఓ పట్టుపడుతున్నారు. వందలాది మంది భారత ప్రస్తుత, మాజీ క్రికెటర్లలో నేరుగా వ్యాపారం చేసే వాళ్లు తక్కువే. రిస్క్ తీసుకోకుండా ఎక్కడో భవనాలు, స్థలాలు కొనేవాళ్ల సంఖ్యే ఎక్కువ. మైదానంలో సక్సెస్ఫుల్ క్రికెటర్లుగా పేరు తెచ్చుకుని, ఎండార్స్‌మెంట్స్‌తో ఎడాపెడా సంపాదిస్తూ, వ్యాపారంలోనూ రాణిస్తున్న కొందరిపై ఓ లుక్కేద్దాం. -సాక్షి క్రీడావిభాగం ఎం.ఎస్.ధోని దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే కాన్సెప్ట్ తనది. క్రీడాకారుల ఎండార్స్‌మెంట్స్‌ను పర్యవేక్షించే రితీ స్పోర్ట్స్ అనే సంస్థలో ధోని భాగస్వామి. స్పోర్ట్స్‌ఫిట్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో జిమ్‌లు ఏర్పాటు చేశాడు. కేవలం భారత్‌కే పరిమితం కాకుండా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, మిడిల్ ఈస్ట్ దేశాలలో కూడా ఈ వ్యాపారాన్ని విస్తరించబోతున్నారు. ఐఎస్ఎల్ ఫుట్‌బాల్ లీగ్‌లో చెన్నయిన్ జట్టులో భాగస్వామి. ఇండియన్ హాకీ లీగ్‌లో రాంచీ రేస్ జట్టులో వాటా ఉంది. బైక్ రేసింగ్ సూపర్ స్పోర్ట్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో మహీ రేసింగ్ టీమ్‌లోనూ వాటా ఉంది. క్రికెట్ అకాడమీ త్వరలో ప్రారంభించబోతున్నాడు. కపిల్‌దేవ్ దశాబ్దన్నర క్రితమే కపిల్‌దేవ్ చండీగఢ్‌లో రెస్టారెంట్స్ ప్రారంభించారు. జికామ్ ఎలక్ట్రానిక్స్ అనే కంపెనీలో వాటా ఉంది. దేవ్ మస్కో లైటింగ్ పేరుతో స్టేడియాలలో ఏర్పాటు చేసే ఫ్లడ్‌లైట్లు తయారు చేస్తున్నారు. జహీర్ ఖాన్ రెస్టారెంట్స్, అనిల్ కుంబ్లే టెక్నాలజీ కంపెనీ, రైనాకు హాకీ జట్టులో వాటా, సెహ్వాగ్ స్కూల్స్, రెస్టారెంట్స్... ఇలా దాదాపు ప్రముఖ క్రికెటర్లంతా ఏదో ఒక చిన్నా చితకా వ్యాపారం చేస్తూనే ఉన్నారు. క్రికెటర్లగా వీళ్లకు ఉండే ఇమేజే తొలి పెట్టుబడి. చాలా వ్యాపారాల్లో క్రికెటర్లు డబ్బు పెట్టరు. వేరే ఎవరో పెట్టుబడి పెడితే, వీళ్లు ఆ వ్యాపారం అభివృద్ధి కోసం తమ బ్రాండ్ ఇమేజ్ను ఇవ్వడం ద్వారా వాటా తీసుకుంటారు. మొత్తం మీద క్రికెటర్‌గా మైదానంలో పరుగుల వరద పారిస్తే... వ్యాపారంలోనూ కాసుల వర్షమే..! విరాట్ కోహ్లి ధోని బాటలోనే జిమ్‌ల వ్యాపారంలోకి వచ్చాడు. చిసెల్ పేరుతో దేశవ్యాప్తంగా జిమ్‌ల చెయిన్ ఏర్పాటు చేశారు. ఫుట్‌బాల్‌లో ఐఎస్ఎల్ లీగ్‌లో గోవా జట్టులో వాటా ఉంది. అలాగే ఆన్లైన్ బట్టల వ్యాపారం చేస్తున్నాడు. రాగన్ పేరుతో కోహ్లి కంపెనీ దుస్తులు మార్కెట్లో ఉన్నాయి. సునీల్ గవాస్కర్ దేశంలో క్రీడలతో సంబంధం ఉన్నవాళ్లందరికీ సుపరిచితం ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ గ్రూప్ (పీఎంజీ). క్రీడాకారుల మార్కెటింగ్ వ్యవహారాలు చూడొచ్చని తొలుత నేర్పింది గవాస్కర్. 1985 నుంచి ఈ కంపెనీ ఉంది. ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)లో ముంబై జట్టులో వాటా ఉంది. సచిన్ టెండూల్కర్ రెస్టారెంట్స్, క్రీడాపరికరాలు, దుస్తులు ఇలా అనేక వ్యాపారాల్లో సచిన్‌కు వాటాలు ఉన్నాయి. ముసాఫిర్ ట్రావెల్ పోర్టల్, స్మాష్ ఎంటర్టైన్మెంట్, ఎస్డ్రైవ్ సచ్ హెల్త్‌కేర్ ఉత్పత్తులు, యూనివర్సల్ కలెక్టబిలియా పేరుతో సెలబ్రిటీస్ మర్కండైజ్ ఇలా రకరకాల వ్యాపారాల్లో తన చేయి ఉంది. ఐఎస్ఎల్లో కొచ్చి జట్టులో వాటా, అంతర్జాతీయ టెన్నిస్ ప్రీమియర్ లీగ్ జట్టులో వాటా ఉన్నాయి. యువరాజ్ సింగ్ యువీకెన్ వెంచర్స్ పేరుతో రకరకాల వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నాడు. తాజాగా వ్యోమో అనే యాప్‌లో డబ్బులు పెట్టాడు. స్మార్ట్‌ఫోన్ ద్వారా తమ వ్యాపారాన్ని ఎలా పెంచుకోవాలో బ్యూటీ ప్రొఫెషనల్స్‌కు ఈ యాప్ ద్వారా నేర్పిస్తారు. పలు నగరాల్లో క్రికెట్ అకాడమీలు కూడా ప్రారంభించాడు. రాబిన్ ఉతప్ప రెండేళ్ల క్రితమే ఐటిఫిన్ అనే సంస్థను బెంగళూరులో స్థాపించాడు. బ్రౌన్ రైస్, రోటీస్‌తో కూడిన లంచ్ బాక్స్‌ను సాఫ్ట్వేర్ నిపుణులకు ఈ సంస్థ ఇస్తుంది. నెలకు రూ. 2000 తీసుకుని లంచ్ అందిస్తారు. ఈ సంస్థకు బెంగళూరులో మంచి ఇమేజ్ వచ్చింది. సౌరవ్ గంగూలీ గంగూలీకి కుటుంబ వ్యాపారాలు ఉన్నాయి. అయినా తను సొంతంగా విద్యకు సంబంధించిన వ్యాపారం భారీ ఎత్తున చేసే ప్రణాళికలో ఉన్నాడు. ఇందుకోసం ఐఐఎమ్ గ్రాడ్యుయేట్‌ను ఇప్పటికే తీసుకుని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు. ఐఎస్ఎల్ ఫుట్‌బాల్‌లో కోల్‌కతా జట్టుకు సహ యజమాని. 3డి ప్రింటింగ్లోనూ గంగూలీ వ్యాపారం చేస్తున్నాడు. -
వీరికి ఇదే అవకాశం
యువ ఆటగాళ్లకు పరీక్షగా మారిన జింబాబ్వే టూర్ కొంత మంది సీనియర్లకు కూడా సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినివ్వడంతో జింబాబ్వే టూర్‌కు యువ జట్టును ఎంపిక చేశారు సెలక్టర్లు. పూర్తిగా యువకులతో కూడిన జట్టు కాకపోయినా కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడంతో పాటు గతంలో ఆడి తెరమరుగయిన ఆటగాళ్లకు కూడా మరోసారి ఛాన్స్ ఇచ్చారు. తొలిసారి ప్రతిభ చూపేందుకు కొత్త ఆటగాళ్లు ఆరాటపడుతుండగా, ఈ సిరీస్‌లోనైనా నిరూపించుకోవాలని గతంలో ఆడిన ఆటగాళ్లు భావిస్తున్నారు. ఈ సిరీస్‌లో అభిమానులు కాస్త ఆసక్తిగా గమనించేబోయే ఆటగాళ్లను పరిశీలిస్తే... సందీప్ శర్మ.. భారత పేసర్లు బౌలింగ్‌లో వైవిధ్యం చూపించడం లేదని బంగ్లాతో సిరీస్ అనంతరం ధోని వ్యాఖ్యానించాడు. అంటే ధోనికి ప్రస్తుత బౌలర్లపై కాస్త నమ్మకం తగ్గిందనే చెప్పాలి. ఇలాంటి దశలో జట్టులో చోటు సంపాదించాడు సందీప్ శర్మ. ఈ సీజన్ ఐపీఎల్లో ఘోరంగా విఫలమైన పంజాబ్ జట్టులో ఆడి అంద ర్నీ ఆకట్టుకున్న ఆటగాడు సందీప్ శర్మ. ఈ సీజన్లో 13 వికెట్లు, గత సీజన్లో 14 వికెట్లు తీసి సత్తా చాటాడు. రంజీ సీజన్లో 36 వికెట్లు తీసి సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. స్వింగ్ బౌలింగ్‌తో ఆకట్టుకునే సందీప్‌కు జింబాబ్వే పిచ్‌లు సహకరించకపోవచ్చు. అయినా భువనేశ్వర్‌కు జోడీగా రెండో ప్రధాన పేసర్‌గా జట్టులో చోటు దక్కే అవకాముంది. సందీప్ వయసు 22 ఏళ్లే కాబట్టి చాలాకాలం పాటు భారత జట్టుకు అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో సత్తా చాటితే ఇక జాతీయ జట్టులో చోటు సుస్థిర స్థానం సంపాదించినట్లే. హర్భజన్ సింగ్.. 35 ఏళ్ల హర్భజన్ సింగ్ గురించి కొత్త చెప్పెదేమి లేదు. భారత జట్టులో అత్యంత సీనియర్ ఆటగాళ్లలో ఒకడు. దాదాపు నాలుగేళ్ల తర్వాత వన్డే జట్టులోకి వచ్చాడు. వయసు దృష్ట్యా భజ్జీ భవిష్యత్తులో ఎక్కువ కాలం జట్టులో కొనసాగే అవకాశం లేదు. అయితే అశ్విన్ మినహా మిగిలిన స్పిన్నర్లు జడేజా, అక్షర్ విఫలమవుతున్న ప్రస్తుత సందర్భంలో హర్భజన్ అవకాశాలను కొట్టిపారేయలేం. మరికొంత కాలమైనా జట్టులో చోటు పదిలం చేసుకోవాలంటే ఈ సిరీస్‌లో రాణించడం ముఖ్యం. పైగా గత నెలలో ఆడిన ఏకైక టెస్టులో పెద్దగా రాణించింది లేదు. ఈ సిరీస్ భజ్జీకి కెరీర్‌కు కీలకం కానుంది. మనీష్ పాండే.. ప్రస్తుత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి నేతృత్వంలో అండర్-19 ప్రపంచకప్ నెగ్గిన జట్టులో సభ్యుడు. ఐపీఎల్ రెండో సీజన్లో సెంచరీ చేసి ఆ ఘనత సాధించిన తొలి భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. స్ట్రోక్ ప్లేతో పాటు వేగంగా ఆడడంలోనూ దిట్ట. టాపార్డర్, మిడిలార్డర్లో బ్యాటింగ్ చేయగలడు. ఐపీఎల్ తొలి మూడు సీజన్లు బెంగుళూరు జట్టుకు ఆడిన 25 ఏళ్ల మనీష్.. తర్వాత కోల్‌కతాకు మారాడు. ఆ జట్టు మిడిలార్డర్లో వెన్నెముకలా తయారయ్యాడు. రంజీల్లో కర్ణాటక తరఫున 50కి మించి సగటుతో 5వేలకు పైగా పరుగులు చేశాడు. ఈ ఏడాది విజయ్‌హజరే ట్రోఫీలో ఏకంగా 118 సగటుతో 652 పరుగులు చేశాడు. గత డిసెంబర్లో వెస్టిండీస్‌తో సిరీస్‌లో టీ20 మ్యాచ్‌కు ఎంపికైనా.. ఆ జట్టు పర్యటనను రద్దు చేసుకోవడంతో మళ్లీ ఇన్నాళ్లు ఆగాల్సి వచ్చింది. తుది జట్టులో కూడా మనీష్‌కు చోటు ఉండే అవకాశం ఉంది. భారత్-ఎ తరఫున కూడా సత్తా చాటిన మనీష్ భవిష్యత్తులో స్టార్ ఆటగాడిగా ఎదిగే అవకాశాలున్నాయి. ఆ క్రమంలో అందివచ్చిన ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి. మురళీ విజయ్.. ప్రస్తుతం విదేశాల్లో అద్భుతంగా రాణిస్తున్న భారత ఆటగాడు మురళీ విజయ్. దిగ్గజాలు సైతం పరుగులు చేయడానికి ఇబ్బందిపడిన ఇంగ్లండ్, ఆసీస్‌ల్లో సత్తా చాటాడు. అయితే అది టెస్టుల్లోనే. వన్డేల్లో పరిస్థితి వేరేలా ఉంది.ఇప్పటివరకు 14 వన్డేలు ఆడినా సగటు 20కి మించలేదు. పైగా శిఖర్, రోహిత్‌లు ఓపెనర్లుగా స్థానాలను పదిలం చేసుకోవడంతో జట్టులోకి రాలేకపోయాడు. ఈ సిరీస్‌లో సత్తా చాటితే మరో రిజర్వ్ ఓపెనర్ దొరుకుతాడు. ఓపెన ర్లలో ఎవరైనా గాయపడితే ప్రత్యామ్నాయం ఉండడం అవసరం. ఈ ఐపీఎల్ సీజన్లో పంజాబ్ తరఫున పెద్దగా రాణించకపోయినా.. రంజీల్లో 1,042 పరుగులు సాధించాడు. కీపింగ్ స్థానం కోసం.. దాదాపు ధోని వచ్చిన కొంతకాలానికే జట్టులో చోటు పొందిన రాబిన్ ఉతప్ప ఇప్పుడు దేశవాళీలకే పరిమితమయ్యాడు. యువ ఆటగాళ్లకు అవకాశమిస్తున్న సెలక్టర్లు చాలా రోజులుగా ఉతప్పను పట్టించుకోలేదు. ఐపీఎల్, దేశవాళీల్లో గత రెండు సీజన్లుగా టన్నుల కొద్ది పరుగులు సాధించాడు. ఈ సిరీస్‌లో కీపింగ్ చేసే అవకాశాలు ఎక్కువ. ఓపెనర్‌గానే కాకుండా లోయర్ అర్డర్‌లో కూడా ఆడే సామర్థ్యం ఉంది. ధోని కూడా మూడేళ్లకు మించి ఆడే అవకాశాలు లేనందున రిజర్వ్ కీపర్‌గా ఉపయోగపడతాడు. అయితే మరో ఆటగాడు కేదార్ జాదవ్ నుంచి ఉతప్పకు పోటీ ఉంది. వికెట్‌ను అంత సులభంగా ప్రత్యర్థి సమర్పించుకొని కేదార్ ఓంటరి పోరాటం చేయగలడు. టెయిలెండర్లతో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పుతాడు. కీపింగ్ కూడా చేయగల కేదార్ నుంచి ఉతప్పకు పోటీ ఉంది. మనోజ్ తివారీ.. ఎప్పుడో 2008లోనే ఆస్ట్రేలియాపై వారి సొంతగడ్డలోనే ఆరంగేట్రం చేశాడు మనోజ్ తివారీ. ప్రతిభ ఉన్న యువ ఆటగాడిగా పేరు తెచ్చుకున్న తివారీ వయసు ప్రస్తుతం 29 ఏళ్లు. ఇప్పటివరకు ఆడింది 9 వన్డేలే. ప్రతిసారి జట్టులోకి సెలక్ట్ అవడం, గాయంతో తప్పుకోవడం అలవాటుగా మారింది. దాంతో సెలక్టర్లు కొన్నేళ్లుగా అతణ్ని పరిగణించడమే మానేశారు. గతేడాది చివరిసారిగా బంగ్లాతో వన్డే ఆడాడు. సీనియర్లు తప్పుకోవడం మళ్లీ పిలుపు అందుకున్నాడు. లక్ష్మణ్ సలహాలతో రాటుదేలుతానని చెప్పిన తివారీ ఈసారైనా జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవాలని చూస్తున్నాడు. మిడిలార్డర్లో ఏ స్థానంలోనైనా ఆడగల సత్తా ఉన్న ఆటగాడు. ఒకవేళ ఈ సిరీస్‌లో విజయవంతమైతే మన రిజర్వ్ బెంచ్ మరింత బలపడుతుంది. -
మమ్మల్నే ఎందుకు ‘టార్గెట్’ చేస్తారు?
ఐపీఎల్లో అన్ని దేశాల క్రికెటర్లు వచ్చి ఆడుతున్నా వెస్టిండీస్ క్రికెటర్లనే టార్గెట్ చేసుకుని అనేక మంది విమర్శలు చేస్తున్నారని డ్వేన్ బ్రేవో ఆరోపించాడు. డబ్బుల కోసం జాతీయ జట్టును వదిలేస్తున్నామనే ఆరోపణ చాలా బాధ కలిగిస్తోందని చెప్పాడు. ఆటను ఆస్వాదించడమే తన విజయరహస్యమన్నాడు. ‘ఏ జట్టు కోసం ఆడినా వందశాతం కష్టపడుతూ ఆటను ఆస్వాదిస్తా. దీంతో ఫలితాలు సానుకూలంగా వస్తాయి’ అని బ్రేవో చెప్పాడు. -
క్రికెటర్లూ.. చీర్‌లీడర్స్‌కు దూరంగా ఉండండి
ఐపీఎల్లో ఆడే క్రికెటర్లెవరూ చీర్‌లీడర్స్‌ను కలవడానికి వీళ్లేదని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. క్రికెటర్లు ఉండే హోటళ్లు, ప్రయాణించే విమానాల్లో చీర్‌లీడర్స్ లేకుండా కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే ఒక జట్టుకు చెందిన మ్యాచ్‌లన్నింటికీ వేర్వేరు చీర్‌లీడర్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఐపీఎల్లో ఎలాంటి వివాదాలకు తావివ్వకూడదని బోర్డు ఈ జాగ్రత్తలు తీసుకుంది. -
టైగర్ వుడ్స్‌కు రూ. 250 కోట్లు
భారీ మొత్తానికి ‘హీరో’ ఒప్పందం ఒర్లాండో (అమెరికా): అమెరికా గోల్ఫ్ దిగ్గజం టైగర్ వుడ్స్‌తో భారత మోటార్ బైక్ సంస్థ ‘హీరో’ కళ్లు చెదిరే మొత్తానికి ఒప్పందం చేసుకుంది. నాలుగేళ్ల కాలానికి ఈ గోల్ఫ్ స్టార్‌కు రూ. 250 కోట్లు ఇవ్వనుంది. అమెరికాలోని ఒర్లాండోలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ మేరకు హీరో మోటోకార్ప్ వైస్ చైర్మన్ పవన్ ముంజల్ ప్రకటించారు. భారత అగ్రశ్రేణి క్రికెటర్లు ధోని, విరాట్ కోహ్లి తదితరులకు ఏడాదికి ఒక ఒప్పందానికి రూ. 4 నుంచి 10 కోట్లు లభిస్తాయి. క్రికెటర్లను కాదని గోల్ఫర్‌తో హీరో సంస్థ ఒప్పందం చేసుకోవడం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది. ‘టైగర్ వుడ్స్ గోల్ఫ్ చాంపియనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిలో గుర్తింపు పొందినవాడు’ అని పవన్ ముంజల్ అన్నారు. భవిష్యత్‌లో ఇతర క్రీడాంశాల్లోని మేటి ఆటగాళ్లతో కూడా తమ సంస్థ ఒప్పందం చేసుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ ఏడాది ఆరంభంలో భారత్‌కు వచ్చిన వుడ్స్... అక్కడి ఆతిథ్యాన్ని ఎప్పటికీ మరవలేనన్నాడు. -
పారితోషకాల కోసం క్రికెటర్ల సమ్మె
అంతర్జాతీయ క్రికెట్లో మరో కుదుపు. నిన్నటికి మొన్న వెస్టిండీస్ క్రికెటర్లు బోర్డుతో గొడవపడి భారత పర్యటన నుంచి అర్థంతరంగా తప్పుకోగా.. తాజాగా జింబాబ్వే క్రికెటర్లు పారితోషకాల కోసం సమ్మెకు దిగారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో తమకిచ్చే పారితోషకాలు ఏమాత్రం సరిపోవని ఆందోళన బాట పట్టారు. జీతాల్లో దాదాపు సగం పన్ను రూపంలో కోత పడుతోందని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు భారత క్రికెటర్లు వేతనాలతో పాటు ఐపీఎల్, వాణిజ్య ప్రకటనల రూపంలో కోట్లు సంపాదిస్తుంటే.. పాపం జింబాబ్వే క్రికెటర్లు దుర్భర జీవితం గడుపుతున్నారు. భారత క్రికెట్ బోర్డు ప్రపంచంలోనే సంపన్నమైనది కాగా, జింబాబ్వే, వెస్టిండీస్ వంటి బోర్డులు చాలీచాలని ఆదాయంతో నెట్టుకొస్తుండటమే దీనికి కారణం. -
క్రికెటర్లకు అవార్డులెందుకు?
క్రీడా శాఖ ఆలోచన బెంగళూరు: భారత్ తరఫున ఆడని ఆటగాళ్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలనుకుంటున్న కేంద్ర క్రీడా శాఖ దృష్టి ప్రస్తుతం క్రికెటర్లపై పడింది. సరైన కారణం చూపకుండా భారత్‌కు ఆడని ప్రముఖ క్రీడాకారులకు ఇక నుంచి అర్జున, ఖేల్త్న్ర అవార్డులు కూడా దక్కకపోవచ్చు. వచ్చే ఏడాది క్రీడా అవార్డుల నిబంధనల్లో ఇలాంటి మార్గదర్శకాలను పొందుపరిచేందుకు అవకాశం ఉన్నట్టు క్రీడా శాఖ వర్గాలు తెలిపాయి. ఇక కేంద్రం ఇచ్చే నిధులు తమకు అనవసరమన్నట్టు వ్యవహరించే బీసీసీఐ ఆసియా క్రీడలకు వరుసగా రెండోసారి క్రికెట్ జట్లను పంపలేదు. దీంతో బోర్డు వైఖరి కారణంగా క్రికెటర్లను కూడా అవార్డుల కోసం పరిగణనలోకి తీసుకోకపోవచ్చని సమాచారం. నా చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరు: పేస్ న్యూఢిల్లీ: తన పాతికేళ్ల కెరీర్లో ఎన్నడూ దేశం తరఫున ఆడేందుకు వెనుకాడలేదని టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ స్పష్టం చేశాడు. ‘క్రీడా శాఖ ఏం చెప్పిందనేది పూర్తిగా నాకు తెలీదు. కానీ దేశం తరఫున ఆడేందుకు ఎప్పుడూ గర్విస్తుంటాను. ఇప్పటికే ఆరు ఒలింపిక్స్‌లలో పాల్గొన్నాను. గ్రాండ్‌స్లామ్ ఆడుతున్నప్పుడు కూడా దేశం తరఫున ఆడుతున్నట్టే భావిస్తాను’ అని పేస్ చెప్పాడు. -
ఐపీఎల్‌కు విండీస్ క్రికెటర్లు ఓకే
హైదరాబాద్: భారత పర్యటనను అర్ధంతరంగా రద్దు చేసుకుని వెస్టిండీస్ క్రికెటర్లు స్వదేశం వెళ్లడం వివాదాస్పదమైనా.. ఐపీఎల్లో వాళ్లు ఆడనున్నారు. కరీబియన్లను అనుమతించనున్నట్టు ఐపీఎల్ చైర్మన్ రంజీబ్ బిస్వాల్ చెప్పారు. హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశానంతరం బిస్వాల్ మీడియాతో మాట్లాడారు. భారత్‌తో సిరీస్ మధ్యలో వెస్టిండీస్ క్రికెటర్లు వెనుదిరగడం వల్ల బీసీసీఐ భారీ నష్టం వాటిల్లింది. దీంతో విండీస్ ద్వైపాక్షిక టూర్లను రద్దు చేసుకుంటున్నట్టు బోర్డు ప్రకటించింది. అయితే ఐపీఎల్లో ఆడేందుకు విండీస్ ఆటగాళ్లను అనుమతిస్తున్నట్టు ఐపీఎల్ చైర్మన్ తెలిపారు. విండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ సహా డ్రావో, డ్వెన్ స్మిత్, పొలార్డ్, నరైన్ తదితర ఆటగాళ్ల ఐపీఎల్లో వివిధ ప్రాంఛైజీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
ఇక్కడా కాసుల వర్షం!
విదేశీ క్రీడాకారులకు భారీగా చెల్లిస్తున్న ఐఎస్ఎల్ ఫ్రాంఛైజీలు ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పుణ్యమాని భారత క్రికెటర్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేకమంది క్రికెటర్లు కోటీశ్వరులుగా మారారు. ఆ తర్వాత భారత్‌లో అనేక క్రీడల్లో లీగ్‌లు ప్రారంభమైనా ఏవీ ఐపీఎల్‌కు దరిదాపుల్లోకి కూడా రాలేదు. కానీ తాజాగా ప్రారంభమైన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్‌లో మాత్రం క్రీడాకారులకు చెప్పుకోదగ్గ స్థాయిలో డబ్బు లభిస్తోంది. వాస్తవానికి యూరోప్ లీగ్‌లలో క్లబ్‌లకు ఆడే ఆటగాళ్లకు కోట్లాది రూపాయలు దక్కుతాయి. భారత్‌లో ఇప్పుడే ప్రారంభమై... విజయవంతం అవుతుందో లేదో తెలియని లీగ్ కోసం ఆ స్థాయిలో డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. అయితే స్టార్ ఆటగాళ్లు లేకపోతే లీగ్ హిట్ కాదు. అందుకే ఈ లీగ్‌ను సమతూకంతో నడపాలని భావించారు. ఓనర్లుగా క్రికెట్, సినిమాల సెలబ్రిటీలను తేవడం వల్ల లీగ్‌కు ప్రచారం తెచ్చారు. మెస్సీ, రొనాల్డో లాంటి ప్రపంచస్థాయి ఆటగాళ్లు ఆడితే లీగ్ ఆటోమేటిక్‌గా హిట్ అవుతుంది. కానీ వాళ్లకు డబ్బు చెల్లించే స్థాయి మన లీగ్‌లో ఫ్రాంఛైజీలకు లేదు. అందుకే మాజీ క్రీడాకారులను తీసుకొచ్చారు. అంతర్జాతీయ కెరీర్ నుంచి తప్పుకుని, ప్రపంచంలోని చిన్న దేశాల లీగ్‌లలో ఆడే స్టార్లను ఐఎస్ఎల్ వైపు తీసుకొచ్చారు. డెల్పియరోనే ఉదాహరణగా తీసుకుంటే... 2006లో ప్రపంచకప్ గెలిచిన ఇటలీ జట్టులో తను స్టార్. గత సీజన్లో ఆస్ట్రేలియాలో లీగ్ ఆడాడు. యూరోపియన్ క్లబ్‌లలో ఆడే స్థాయిలో తను లేడు. కానీ ఆస్ట్రేలియాలో లీగ్‌లో తను పెద్ద ఆటగాడు. ఐఎస్ఎల్ నిర్వాహకులు, జట్లు ఇలాంటి ఆటగాళ్లనే టార్గెట్ చేసుకున్నాయి. డెల్ పియరోకు ఢిల్లీ జట్టు సుమారు 11 కోట్ల రూపాయలు చెల్లించి తీసుకొచ్చింది. భారత్‌లో ఫుట్‌బాల్ లీగ్ ద్వారా ఇంత డబ్బు వస్తుందనేది క్రీడాకారులు ఊహించలేదు. అలాగే అనెల్కాకు ముంబై ఫ్రాంచైజీ రూ.5.4 కోట్లు చెల్లిస్తోంది. తొలుత అనెల్కాను పుణే, చెన్నై సంప్రదించాయి. ఈ రెండు జట్లు వరుసగా రూ. 4.8 కోట్లు, రూ.4.2 కోట్లు ఆఫర్ చేశాయి. కానీ అనెల్కా రాలేదు. ముంబై దీనిని కొంత పెంచి రూ.5.4 కోట్లు ఇవ్వడంతో లీగ్‌లోకి దిగాడు. ప్రస్తుత లీగ్‌లో పియరో, అనెల్కా బాగా ఖరీదైన ఆటగాళ్లు. బ్లుమెర్, ట్రెజెగ్వెట్, పైర్స్, జుంగ్‌బర్గ్... ఇలా ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులు మరచిపోయిన పాత ఆటగాళ్ల మీద ఐఎస్ఎల్ కాసుల వర్షం కురిపించింది. స్టార్ హోటల్ కావాల్సిందే... ఈ లీగ్‌లో ఆడుతున్న విదేశీ ఆటగాళ్లు భారీ మొత్తం డబ్బును సంపాదిస్తున్నారు. అంతే కాదు... భారత్‌లో తాము ఉన్నంతకాలం తమతో పాటు కుటుంబసభ్యులకు కూడా ఫైవ్‌స్టార్ హోటల్స్‌లోనే బస కావాలని డిమాండ్ చేశారు. అలాగే విమానాల్లో బిజినెస్ క్లాస్ టిక్కెట్లు అడిగారు. వీటిని కూడా కలిపి లెక్క వేస్తే ఒక్కో విదేశీ స్టార్ ఆటగాడి మీద సగటున రూ.50 లక్షల దాకా వెచ్చించాల్సి ఉంటుంది. మనోళ్లకు తక్కువే అయితే భారత దేశవాళీ ఆటగాళ్లు ఈ లీగ్ ద్వారా భారీగా సంపాదించుకోవడం లేదు. కానీ ఇప్పటివరకూ వాళ్లకు ఎన్నడూ లభించని మొత్తం మాత్రం ఐఎస్ఎల్ రూపంలో వచ్చింది. సుబ్రతాపాల్ (ముంబై), సయ్యద్ ర హీమ్ నబీ (ముంబై), గౌరమాంగి సింగ్ (చెన్నై) అత్యధికంగా రూ.80 లక్షల చొప్పున పొందుతున్నారు. సంజు ప్రధాన్ (కోల్‌కతా), నిర్మల్ చెత్రి (కేరళ)లకు రూ.70 లక్షల చొప్పున లభిస్తున్నాయి. రోడ్రిక్స్ (పుణే), ఫ్రాన్సిస్ ఫెర్నాండెజ్ (ఢిల్లీ)లకు రూ. 55 లక్షల చొప్పున వస్తున్నాయి. ఎవరికెంత? ఆటగాడు జట్టు మొత్తం (రూ.కోట్లలో) డెల్ పియరో ఢిల్లీ 10.8 అనెల్కా ముంబై 5.4 బ్లుమెర్ చెన్నై 4.8 ట్రెజెగ్వెట్ పుణే 4.5 పైర్స్ గోవా 4.1 జుంగ్‌బర్గ్ ముంబై 4 సిల్వెస్టర్ చెన్నై 2.85 డేవిడ్ జేమ్స్ కేరళ 2.70 గార్షియా కోల్‌కతా 2.70 -
వెస్టిండీస్ క్రికెట్లో సంక్షోభం!
కొచ్చి: భారత్‌తో తొలి వన్డేకు ముందు వెస్టిండీస్ క్రికెట్ జట్టులో ఒక్కసారిగా సంక్షోభం తలెత్తింది. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యూఐసీబీ) ఆటగాళ్ల జీతభత్యాల్లో భారీగా కోత విధిస్తూ తీసుకున్న నిర్ణయం జట్టు ఆటగాళ్లకు ఆగ్రహం తెప్పించింది. ఫలితంగా ఒక దశలో భారత పర్యటనను బాయ్‌కాట్ చేయాలని క్రికెటర్లు నిర్ణయించారు. మంగళవారం ప్రాక్టీస్‌లో పాల్గొనని ఆ జట్టు బుధవారం చివరి నిమిషం వరకు మ్యాచ్ ఆడుతుందా, లేదా అనేది సందేహంగానే కనిపించింది. చివరకు ప్రాథమిక చర్చల అనంతరం వారు మ్యాచ్ అడారు. అయితే తొలి వన్డే జరిగినా సిరీస్ నిర్వహణపై ఇంకా అనుమానాలు ఉన్నాయి. ఆర్థికపరమైన ఈ వివాదం పూర్తిగా ముగియకపోవడమే ఇందుకు కారణం. భారీగా కోత జట్టు ఆటగాళ్ల జీతభత్యాలకు సంబంధించి ఇటీవల వెస్టిండీస్ బోర్డు, వెస్టిండీస్ ప్లేయర్స్ అసోసియేషన్ (డబ్ల్యూఐపీఏ) మధ్య ఒక ఒప్పందం కుదిరింది. అయితే అందులో చెప్పిన విధంగా కాకుండా తమకు ఇచ్చే మొత్తంలో భారీగా కోత విధించారని ఆటగాళ్లు అసంతృప్తితో ఉన్నారు. తాజా ఒప్పందం అమల్లోకి వస్తే వారికి రావాల్సిన మొత్తంలో దాదాపు 75 శాతం వరకు తగ్గిపోయే ప్రమాదం ఉంది. భారత్ చేరుకున్న తర్వాత వారికి ఈ కాంట్రాక్ట్‌లు అందాయి. దీనిపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆటగాళ్లందరి తరఫున వన్డే కెప్టెన్ డ్వేన్ బ్రేవో, డబ్ల్యూఐపీఏ అధ్యక్షుడు వేవెల్ హైండ్స్కు లేఖ రాశాడు. కొత్త ఒప్పందం చేసుకునే ముందు హైండ్స్ ఆటగాళ్లతో కనీసం సంప్రదించకుండా, గుడ్డిగా సంతకం చేశారని బ్రేవో ఇందులో ఆరోపించాడు. ‘ఆటగాళ్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా తీసుకునే ఏ నిర్ణయానికీ మేం కట్టుబడం. ప్రస్తుతం జట్టు సభ్యులంతా తీవ్ర ఒత్తిడిలో, నైరాశ్యంలో ఉన్నారు. కొత్త ఒప్పందంపై మళ్లీ స్పష్టత వచ్చే వరకు వెస్టిండీస్ బోర్డు పాత విధానాన్నే కొనసాగించాలి. ఆటగాళ్ల ప్రయోజనాలను ఏ మాత్రం కాపాడలేకపోయిన హైండ్స్ తదితరులు వెంటనే రాజీనామా చేయాలి’ అని బ్రేవో డిమాండ్ చేశాడు. చివరకు వెస్టిండీస్ బోర్డు కలుగజేసుకోవడంతో పాటు జట్టులో తీవ్ర చర్చల అనంతరం విండీస్ తొలి వన్డే ఆడేందుకు సిద్ధమైంది. అయితే తొలి మ్యాచ్ ఆడినంత మాత్రాన, సదరు ఒప్పందానికి, షరతులకు తాము అంగీకరించినట్లు కాదని...సమస్య పరిష్కారం కాకపోతే తదుపరి చర్య తీసుకునే హక్కు తమకుందని కూడా బ్రేవో స్పష్టం చేశాడు. -
హీరోలుగా మారిన క్రికెటర్లు!
ఆ రాష్ట్రం నుంచి క్రికెట్ ఆటగాళ్లంటే.. పెద్దగా ఎవరికీ తెలియరు. కానీ, ఒక్కసారిగా వాళ్లంతా హీరోలైపోయారు. జమ్ము కాశ్మీర్ రాష్ట్రం తరఫున ఆడే ఇయాన్ దేవ్ సింగ్ చౌహాన్, అతడి జట్టు సభ్యులు కలిసి కొంతమంది ప్రాణాలు కాపాడారు. ఈనెల ప్రారంభంలో చౌహాన్ జట్టు శ్రీనగర్‌లో జరిగే టీ20 మ్యాచ్ ఆడేందుకు వెళ్లింది. అంతా బాగానే ఉందనుకున్న సమయంలో వర్షం మొదలైంది. వాళ్లున్న హోటల్లో రెండో అంతస్థు వరకు నీళ్లు వచ్చేశాయి. మొదటి రెండు రోజుల పాటు ఏం చేయాలో కూడా అర్థం కాక అలాగే ఉండిపోయారు. మూడో రోజున కెప్టెన్ చౌహాన్, మరో ఇద్దరు కలిసి ఈదుకుంటూ 20 మీటర్ల దూరంలో ఉన్న షికారా బోటు వద్దకు వెళ్లారు. దాన్ని నడుపుకొంటూ హోటల్ వద్దకు వచ్చి, అందులోకి ఇతర జట్టు సభ్యులను, హోటల్లోనే ఉన్న మిగిలినవాళ్లను కాపాడారు. వీళ్లంతా కలిసి ఆ బోట్లో ఓ కొండగుట్ట మీదకు వెళ్లగలిగారు. అలాగే అక్కడ ఐదు రోజుల పాటు ఉండిపోయారు. తిండి, నీళ్లు కూడా లేవు. అయితే అదృష్టవశాత్తు హోటల్ నుంచి వచ్చేటప్పుడు కొన్ని దుస్తులు కూడా తెచ్చుకోవడంతో చలి నుంచి మాత్రం రక్షణ లభించింది. క్రికెట్ కిట్లను మాత్రం అక్కడే వదిలేశారు. చివరకు ఓ హెలికాప్టర్ వచ్చి వాళ్లను రక్షించింది. -
ఆ గదులను మా గర్ల్ ఫ్రెండ్స్ వద్దన్నారు!
లండన్: రాత్రి వేళ పడుకునే సమయాల్లో వసతి సౌకర్యం సరిగా లేకపోతే కంటి మీద కునుకు రావడం కష్టమే కదా! మరి అటువంటింది ఏకంగా గదుల్లో అనుమానస్పద సంఘటనలు చోటు చేసుకుంటే.. ఇక నిద్దుర మాటే ఉండదు. ఆ తరహా సంఘటనలే ఇంగ్లండ్ క్రికెటర్లకు చోటు చేసుకున్నాయట. గత నెల్లో శ్రీలంకతో లండన్ లో జరిగిన టెస్ట్ మ్యాచ్ సందర్భంగా కొన్ని ఆసక్తిపరిణామాలు సంభవించాయని ఇంగ్లిష్ క్రికెటర్లు ఏకరువు పెట్టినట్లు తాజాగా డైలీ మెయిల్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ టెస్టు మ్యాచ్ సందర్భంగా ఏడుగురు ఇంగ్లండ్ క్రికెటర్లకు ఫైవ్ స్టార్ హోదా కల్గిన లంఘమ్ హోటల్లోని గదులను కేటాయిస్తే.. అందులో ఆకస్మికంగా బాత్ రూం లో ట్యాప్ లు వాటికవే ఓపెన్ కావడంతో క్రికెటర్లు భయాందోళనకు గురైనట్లు పేర్కొంది. దీనికి సంబంధించి స్టువర్ట్ బ్రాడ్ కొన్ని నమ్మశక్యం కాని విషయాలను తెలిపినట్లు వెల్లడించింది. ' మేము రాత్రి వేళల్లో గర్ల్ ఫ్రెండ్స్ తో నిద్రిస్తున్న సమయంలో బాత్ రూంలో ట్యాప్ లు ఓపెన్ అయ్యి నీరు దానంతటే వెళ్లిపోయేదని, ఒకవేళ లైట్లు ఆన్ చేసి కట్టేసి వచ్చినా.. తిరిగి అదే పరిస్థితి ఉండేదన్నాడు. అప్పుడు వేసవి కూడా కావడంతో చాలా ఇబ్బందిగా ఉండేదని, కనీసం కంటి మీద కునుకు లేకుండా గడిపామని' బ్రాడ్ తెలిపాడు. దీంతో తమ క్రికెటర్ల భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్ ఆ హోటల్ రూమ్ ల్లో ఉండటానికి ఇష్టపడలేదన్నాడు. ఇప్పడు ఇండియాతో ఇక్కడ జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ సందర్భంగా కేటాయించిన గదుల్లో సమస్యలు ఏమీ లేవన్నాడు. ఆ తరహా భయానక ఘటనలు ప్రస్తుతం ఏమీ చోటు చేసుకోకపోవడంతో నిద్రలేమి బారిన పడలేదని బ్రాడ్ తెలిపినట్లు డైలీ మెయిల్ కథనంలో పేర్కొంది.