టీమిండియా మాజీ కెప్టెన్ కూల్, మహేంద్ర సింగ్ ధోనీకి తన స్వస్థలం రాంచీ నగరం నడిబొడ్డున విలాసవంతమైన ఫామ్‌హౌస్ ఉంది. సోషల్ మీడియాలో ధోనీ పెద్దగా యాక్టివ్‌గా ఉండపోయినప్పటికీ, ఆయన భార్య భార్య సాక్షి ధోని తరచుగా చేసే సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా ఈ ఇంటికి సంబంధించిన సంగతులు వెలుగు చూస్తూనే ఉంటాయి. కైలాసపతిగా పేరు పెట్టుకున్న ఫామ్‌హౌస్ 7 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. టాప్ మోస్ట్ సౌకర్యాలతోపాటు సహజమైన ప్రకృతి దృశ్యం, చక్కటి ఇంటీరియర్స్‌తో ఇదొక ఇంద్ర భవనమని ఫ్యాన్స్ మురిసిపోతూ ఉంటారు.
యువరాజ్ సింగ్
ముంబైలోని వోర్లీలోని లావిష్ సీ ఫేస్‌డ్ అపార్ల్‌మెంట్‌కు ఓనర్ మాజీ క్రికెటర్ యువరాజ్ 16,000 చదరపు అడుగుల స్థలంలో ఓంకార్ టవర్స్‌లోని 29వ అంతస్తులో ఉన్న ఈ అపార్ట్‌మెంట్‌ను 2013లో రూ. రూ. 64 కోట్లకు కొనుగోలు చేశాడు. గ్లాస్ పేటెడ్ బాల్కని ప్రధాన హైలైట్. ఇతనికి గోవాలో హాలిడే హోమ్‌గా ఉంది.
సచిన్ టెండూల్కర్
క్రికెట్ దేవుడు, సచిన్ టెండూల్కర్ ముంబైలోని బాంద్రాలోని నాగరిక ప్రాంతంలో లగ్జరి బంగ్లా ఉంది. డోరబ్ విల్లా అని పిలిచే దీనిని 2007లో క్రికెటర్ దానిని కొనుగోలు చేశాడు. దీన్ని అత్యాధునిక సౌకర్యాలు, ఫీచర్లతో పునర్నిర్మాణం చేసి 2011లో మాత్రమే ఇందులోకి మారారు. మూడు అంతస్తుల్లో 6000 చదరపు అడుగుల స్థలంలో విస్తరించి ఉన్న ఈ ఇంటి విలువ రూ. 38 కోట్లు.
రోహిత్ శర్మ ఇల్లు, 2015లోదీని విలువ రూ. 30 కోట్లు,
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ
ముంబైలోని వర్లీలోని అహుజా టవర్స్‌లోని 29వ అంతస్తులో రోహిత్ శర్మకు సముద్రానికి ఎదురుగా భారీ అపార్ట్‌మెంట్ ఉంది. నాలుగు బెడ్‌రూమ్‌లు , ఆకట్టుకునే 13 అడుగుల ఎత్తైన సీలింగ్ ఉన్నాయి. వాక్-ఇన్ వార్డ్‌రోబ్, ఇతర అద్భుతమైన సౌకర్యాలు ఉన్నాయి. వాయిస్-కమాండ్ కంట్రోల్ ప్యానెల్‌ల ద్వారా లైటింగ్, గాడ్జెట్‌లు, ఉష్ణోగ్రత , ఎంటర్‌టైన్‌మెంట్ డివైస్‌లను రిమోట్‌గా నియంత్రించగల స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ హోమ్ ఆటోమేషన్ దీని ప్రత్యేకత.
సునీల్ గవాస్కర్
లెజెండ్, మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ గోవాలో ఖరీదైన ఇంటిని 2017లో కొనుగోలు చేశారు. ఈ విలాసవంతమైన హాలిడే విల్లా 5000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రశాంత వాతావరణంలో ఉంటుంది. పురాతన ఫర్నిచర్‌తో చుట్టూ పచ్చదనంతో ఆహ్లాదకరమైన విల్లా ఇది.
సురేష్ రైనా
సురేష్ రైనా తన స్వస్థలమైన ఘజియాబాద్‌లో అందమైన ఇంటిని నిర్మించుకోవడం విశేషం. రాజ్ నగర్‌లోని పాపులర్ ఏరియాలో అన్ని ఆధునిక హంగులతో బ్లాక్ అండ్ వైట్ గ్రానైట్ మార్బుల్‌కి తోడు, చుట్టూ విలాసవంతమైన పచ్చదనంతో ఆకర్షణీయంగాఉంటుంది. ఇంకా ఓపెన్ యార్డ్‌లో సురేశ్ కోసం విశాలమైన చక్కటి జిమ్ ఉన్నాయి. ప్రస్తుతం ఘజియాబాద్‌లోని రూ.18 కోట్ల విలువైన ఢిల్లీలోని 5 బీహెచ్‌కే అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు.
సౌరవ్ గంగూలీ
కోల్‌కతా యువరాజు సౌరవ్ గంగూలీకి కోల్‌కతా నగరం నడిబొడ్డున వంశపారంపర్యంగా వచ్చిన ఆస్థికి యజమాని దాదాపు 45 ఏళ్లుగా ఆస్తి బాగా కరిగిపోయినప్పటికీ కోల్‌కతాలోని అతిపెద్ద ప్రైవేట్ భవనాల్లో ఒదొకటి. దాదా ఎక్కువ సమయాన్ని ఇక్కడే గడుపుతారట. స్మృతి చిహ్నాలతో నిండిన దాదా రూం ప్రత్యేక ఆకర్షణలలో ఒకటి. విశాలమైన గార్డెన్, క్రికెట్ పిచ్ , పోర్చ్‌తో కూడిన ఓపెన్ ఫ్రంట్ యార్డ్ ఉన్నాయి.
రవీంద్ర జడేజా: గుజరాత్‌లోని జామ్‌నగర్‌లోని ఇంద్రభవనం లాంటి ఇల్లు రాజసంతో ఉట్టి పడుతూ ఉంటుంది. దీనివిలువ 10 కోట్లు ఉంటుందని అంచనా. పలు లగ్జరీ,రాయల్ ఫిట్టింగ్‌లతోపాటు, చెక్కతో అందంగా తీర్చిదిద్దిన జడేజా ఇంటి ప్రవేశ ద్వారం స్పెషల్ ఎట్రాక్షన్.
హార్దిక్ పాండ్యా
క్రికెటర్లు, అన్నదమ్ములైన హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా ఇద్దరి కలిపి లగ్జరీ ఇల్లు ఉంది. 6000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు అంతస్తుల్లో అత్యాధునిక హంగులతో ఉంటుంది. ఇందులో ప్రైవేట్ జిమ్, ప్రైవేట్ థియేటర్ వంటి అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి.దీని విలువ రూ. 3.6 కోట్లు.
విరాట్ కోహ్లీ స్వీట్ హోం
హర్యానాలోని గురుగ్రాంలో విరాట్ కోహ్లీ స్వీట్ హోం. 10,000 చదరపు అడుగుల స్థలంలో ఉన్న దీన్ని విలువ రూ. 80 కోట్లు .
Comments
Please login to add a commentAdd a comment